శరీరము నందు ఏర్పడు కొవ్వు గురించి విశేషాలు -
* శరీరములో అంతర్గత రసాయన చర్యల వలన ఉత్పత్తికాని Linoleic Acid కొవ్వులో ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం .
* నరాలవ్యవస్థ సజావుగా పనిచేయుటకు కొవ్వు చాలా అవసరం .
* కొవ్వు శరీరంలో కొన్ని ప్రత్యేక కణాలలో నిలువ ఉంటుంది. ఈ ప్రత్యేక కణాలు చర్మం అడుగున మెత్తలు ( Pads of tissue ) గా ఏర్పడటమే కాక కీళ్లు మరికొన్ని అవయవాలని కుదుపుల నుంచి కాపాడుతూ వాటికి ఇన్సులేషన్ గా ఉపయోగపడును.
* కొవ్వు వేడి నుంచి మరియు చలి నుంచి మనల్ని కాపాడును. శరీరంలో నిలువ అయ్యి ఉన్న కొవ్వు కేంద్రీకృత శక్తి కింద ఏర్పడి అవసరమైన సందర్భాలలో శరీరానికి ఇంధనంగా ఉపయోగపడును .
* శరీరపు కొవ్వు కండరాల సంకోచ వ్యాకోచాలకు సహాయపడును.
* ఆరోగ్యవంతుడు అయిన పురుషుడిలో సుమారు 15 కిలోల కొవ్వు నిలువ ఉండును. ఈ కొవ్వు సుమారు రెండు నెలలపాటు అతడి ప్రాణాన్ని నిలబెట్టును . బాగా భారీకాయులు అయిన మనుషులలో 100 కిలోల దాకా నిలువ కొవ్వు ఉండును. ఇది ఒక సంవత్సరం పాటు అతని ప్రాణాన్ని నిలబెట్టును .
* స్త్రీ లలో కొవ్వు పిరుదుల వద్ద , తొడల వద్ద ఎక్కువ నిలువ ఉండును. అది వాళ్లకు గర్భధారణ కోసము , స్తన్యమును ఇవ్వటం కొరకు ఇంధనముగా ఉపయోగపడును.
పురుషులలో కొవ్వు పొట్ట భాగాన ఎక్కువ నిలువ ఉండును. అది పురుషులకు అతి త్వరగా శక్తిని ఇచ్చుటకు ఇంధనంగా ఉపయోగపడును.
* కొవ్వులోని యాసిడ్ శరీరకణాల గోడల తయారీకి సహకరించును.ఆంగ్లము నందు Cell walls అంటారు.
* శరీరం ఎదుగుదలకు సహకరించును.
* చర్మపోషణం కొరకు మరియు సెక్స్ పరమైన పునరుత్పత్తికి ఉపకరించును.
* కొవ్వులో మిళితమయ్యే A , D , E , K విటమిన్లు జీర్ణకోశము నుంచి రక్తములో ప్రవేశించడానికి కొవ్వు ఉపకరిస్తుంది.
* ఒక గ్రాము కొవ్వు ద్వారా 9 కేలరీల శక్తి లభ్యం అగును. ఇది కార్బోహైడ్రేట్స్ అందించే శక్తికి రెట్టింపు
మరింత విలువైన సమాచారం తరవాతి పోస్టు నందు వివరిస్తాను. పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు .
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి