24, మే 2020, ఆదివారం

రేపు ఏమిచేస్తారు


 రేపు ఏమిచేస్తారు
 అటు కరోనా విషకోరలు చాపుతూ రోజు రోజుకు వేగంగా విజృంబిస్తున్నది.  ఇటు ప్రభుత్వాలు కరొనతో కలిసి జీవించాలని ప్రభోదిస్తూ రోజుకో విధంగా లాక్ డౌన్ సడలింపులు చేస్తున్నారు.  అటు బస్సులు, ఇటు రైళ్లు, విమానాలు ప్రయాణాలకు సిద్ధమితున్నాయ్.  మరి ప్రభుత్వం తీసుకునే చర్యలు.  ధర్మో టెస్టింగ్ అంటే శరీర టెంపరేచర్ చూసి ప్రయాణానికి అనుమతించాలని అంటున్నారు.  బాగానే వుంది.  కానీ మనం చూస్తున్నాం ఎన్నో కేసులు కేవలం క్యారియర్సగా వున్నవారు వున్నారు అంటే కరోనా పాజిటివ్ వున్నా కానీ వారు ఎలాంటి రోగ లక్షణాలు కనపడకుండా పూర్తి ఆరోగ్యవంతుడిలా కనపడతాడు.  కానీ అతనిద్వారా ఇతరులకు రోగాన్ని అంటించగలరు.  మరి వారిని ఎలా తెలుసుకుంటారు.  స్క్రీనింగ్ లో ఎలాంటి లక్షనాలు కనపడని వారిని ప్రయాణించటానికి వదిలితే ఆ రైలు, విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులకు రోగ సంక్రమణ చెందదని ఎలా చెప్పగలరు. అదే జరుగుతే మరి ఈ రోగాన్ని ఎలా అదుపు చేస్తారు.  మన భరత్ మరో ఇటలీ అవుతుందా అని మేధావులు అంటున్నారు.  ప్రభుత్వం ఈ విషయాలన్నీ కూలంకుషంగా పరిగణలోకి తీసుకొని రైలు, విమాన రవాణాను అనుమతించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మన దేశంలో రోగులకు సరిపడ హాస్పత్రులు లేవని ముందే చెప్పారు.  తగినన్ని PPT కిట్లు లేవు, ఇక వెంటిలేటర్ల విషయానికి వస్తే మన దేశంలో వెంటిలేటర్ల కొరత వున్న సంగతి మనకు తెలుసు.  మరి ఈ మహమ్మారి ఒకేసారి విజృంభిస్తే ఎలా అదుపుచేయాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. 
ప్రజలు ఏది ఏమైనా ఎట్టి పరిస్థితిలో ఇల్లు వదలి బైటికి రాకుండా ఉండటమే మనకు శ్రీరామ రక్ష.  కరోనా వచ్చినవారు కొంత మంది కోలుకున్నారు మనం భయపడాల్సిన ఆవాసరం లేదు అని అనుకున్నామా అంటే నీకు కరోనా వస్తే పూర్తిగా కోలుకోగలవా ఆలోచించు. కోలుకొన్నవారి లిస్టుతో పాటు మరణించిన వారి లిస్టు కూడా రోజు రోజుకు పెరుగుతున్నది.  నీ పేరు ఏ లిస్టులో ఉంటుందో నీవు వూహించగలవా.  మనం ఏ విషయంలో నైనా చాన్సు తీసుకోవచ్చు కానీ మన జీవితం విషయంలో చాన్సు తీసుకోగలమా.  ఆలోచించండి. ఒక్కసారి ఈ కరోనా రోగంగూర్చి విచారిద్దాం. ఇది కరోనా సోకినా రోగుల ద్వారా వ్యాపిస్తుంది.  ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ కరోనా వైరస్ మెటల్ బాడీస్ మీద, ప్లాస్టిక్ మీద మరియు ఇతర పదార్ధాల మీద ఎక్కువ సమయం ఉంటుంది.  ఆ పదార్ధాలను ఎవరైనా తాకి ఆ చేతితో మూతి మీద, కంటిమీద, ముక్కుమీద పెట్టుకుంటే అది ఆ మనిషి శరీరంలోకి ప్రవేశించి మొదట్లో గొంతులో తరువాత ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి శ్వాస తీసుకోటం కష్టం ఐతుంది తరువాత ఆక్సిజన్ లభించక రోగి చనిపోతాడు.  ఐతే రోగ నిరోధక ఎక్కువగా వున్న వారు ఈ వైరస్ తో పోరాడి రోగ విముక్తుల కాగలరు.  ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఎవరి రోగనిరోధకత ఎంతవరకు ఉంటుంది అనేది ఎవ్వరు తేల్చి చెప్పలేరు.  కొందరు శారీరికంగా దృఢంగా ఉండవచ్చు కానీ వారి రోగనిరోధకత తక్కువగా ఉండవచ్చు. కొందరు చూడటానికి బక్కగా వున్నా వారి రోగనిరోధకత ఎక్కువగా ఉండవచ్చు. ఒక మనిషి రోగనిరోధకత స్థాయి ఏ మేరకు ఉందొ తెలుసుకొనే సాదనం ఇంతవరకు లేదు. మన సైన్స్ ఇంకా అంతదాకా ఎదగ లేదు. ఏతా వాత తెలిసేది ఏమంటే ఇప్పుడు వున్న పరిస్థితిలో అంతా ఊహాగానాలే ఇదమిద్ధంగా ఇలా ఉంటే రోగం రాదని ఇలా ఉంటేనే రోగం వస్తుందని ఏ వైద్యుడు, శాస్త్రజ్ఞుడు చెప్పే స్థితిలో లేరు.  మరి ఇలాంటి పరిస్థితిలో ఆర్ధిక వృద్ధికోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టటం ఎంతవరకు కరక్ట్.  మన దేశంలో విద్యా వంతులు అంతంతమాత్రం.  అందులో చదువుకున్న వారికి కూడా నిజం చెప్పాలంటే కరోనా మీద సరైన అవగాహన లేదు.  ఇక చదువురాని వారి సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.  అందరికిని  తెలియ చేయునది ఏమనగా మనం ఇప్పుడు చాలా ప్రమాద స్థితిలో వున్నాం.  ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేయవచ్చు, పోలీసులు ఇదివరకులా మన వెంట పడక పోవచ్చు కానీ కరోనా ఎప్పుడైనా ఎవరినైనా సోకవచు. తస్మాత్ జాగ్రత్త. 
కరోనా రోగులు గణనీయంగా పెరిగితే మన దేశ ప్రస్తుత వనరుల అందుబాటు ప్రకారం రోగగ్రస్తులకు సరైన వైద్యం లభించక పోవచ్చు. ఈ విషయం ప్రతి వక్కరు తెలుసుకోవలసిన అవసరం వుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలోకూడా ఇంటినుండి బైటికి రాకుంటేనే మనలను మనం కాపాడుకోగలం. 
ఒక్క విషయం హాస్పటల్లో చికిత్స అంటూ ప్రత్యేకించి ఏమి చేయటంలేదు. కేవలం రోగనిరోధకత పెంపు చేసే ఆహరం, ఇతర మందులు ఇస్తున్నారు.  కోలుకోవటం అనేది వారి వారి అదృష్టం మీద ఆధారపడి వుంది. 
ఏరకంగా చూసినా ప్రభుత్వ నిర్ణయం భయానకంగా వున్నది.