ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
19, ఏప్రిల్ 2024, శుక్రవారం
బ్రహ్మరాక్షసత్వము
"అకృత ప్రాయశ్చితాః, అప్రతిగ్ర్రాహ్య ప్రతిగ్రాహ్యః, ఆయాజ్యయాజనాధిపాపైః, రాక్షసత్వం ప్రాప్తాః, బ్రాహ్మాణాః బ్రహ్మరాక్షసాః""
చేయకూడని పనులు చేసిన వాటికి ప్రాయశ్చితాలు చేసుకొననివారు,ఏది పడితే అది దానము పుచ్చుకొనేవారు అనగా గ్రహింపకూడనివి గ్రహించేవారు, అనర్హులచే యజ్ణకార్యములు చేయించేవారు వారు బ్రాహ్మణులైనా బ్రహ్మరాక్షసులవుతారు""(గోవింరాజీయ వ్యాఖ్యానము నుండి)
రామాయణము బాలకాండములో దశరథమహారాజు పుత్రకామేష్టికై అశ్వమేధయాగము చేయతలపెట్టి వశిష్టాది మహర్షులందరి సమక్షములో తన కోరిక తెల్పి దీవెనలు పొందుతాడు. సరయూనది తీరమున ఉత్తరదిశగా యజ్ఞభూమిని సిధ్దపరిచి మంచిఋత్విక్కులను ఆహ్వానించి ఆ సందర్భముగ ఇలా అంటాడు.
"" ఛిధ్రం హి మృగయంతే~త్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః||,
నిహతస్య చ యజ్ఞస్య సద్యః కర్తాః వినశ్యతి||,(8-17),,
నేను చేసే ఈ యజ్ఞములో ఎటువంటి దోషములు లేని విద్వాసులు ఉన్నారు.అనగా ఈ అశ్వమేధయాగము చేయగలిగిన పండితులు గలరు.అంతేగాని బ్రహ్మరాక్షసత్వము పొందు జ్ఞానహీనులు లేరు.ఇది చాలా క్లిష్టమైన యజ్ఞము.తేలికైనది అయినచో అందరు నిర్వహించెదరు కదా.జాగ్రత్తగా నిర్వహించవలెను.లేనిచో కర్త వెంటనే నశించునని శాస్ర్తోక్తముగ నిర్వహించమని అభ్యర్థిస్తాడు.
రామాయణము చేసేపనులలో అశ్రధ్ద కూడదని,కార్యము చక్కగ నిర్వహించేవారిని ముందుగ మంచి ఎంపిక చేసుకోవాలని పైన చెప్పినట్లు బ్రహ్మరాక్షసత్వాన్ని పొందగల అవకాశమున్న ఋత్విజ్ఞులను యాగాలకి దూరముగ ఉంచాలని హెచ్చరిస్తున్నది.
కాశ్మీరు ఎవరిది ?
_*కాశ్మీరు ఎవరిది ?*_
_-{ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన చరిత్ర}-_
_ఇది, కశ్యప మహర్షి పేరుతో ఏర్పడిన ప్రదేశము. "మైరా" అనే సంస్కృత పదానికి అర్థము "సరోవరము"._
_ఈ మన్వంతరములోని సప్త ఋషులలో ఒక్కరు కశ్యపుడు. ఇతడు బ్రహ్మ దేవుని మనవడు. ఇతడి తండ్రి మరీచి మహర్షి. ఈ మరీచి, బ్రహ్మ దేవుని మానస పుత్రుడు. దక్ష ప్రజాపతి తన పదముగ్గురు కుమార్తెలనూ కశ్యప మునికి ఇచ్చి వివాహము చేశాడు. కశ్యప గోత్రము ఆరంభమయ్యేదే ఇక్కడి నుండే ! వీరి సంతానములో, దేవతలు, దైత్యులు, దానవులు, నాగులు, మానవులు-మొదలుగా సర్వజీవులూ చేరి ఉన్నారు._
_నీలమత పురాణము ప్రకారము, ఇప్పటి కాశ్మీర్ ఉన్న ప్రదేశములో ’సతీసరము’ అనే అతిపెద్ద సరోవరము వుండేది. శివుడు, సతీదేవి - ఇద్దరికీ అది చాలా ఇష్టమైన సరోవరము అయినందువల్ల కశ్యపుడు ఈ సరోవరాన్ని వారికి బహుమానముగా ఇచ్చాడు. అయితే ఆ సరోవరములో ’జలోద్భవుడు’ అనే రాక్షసుడు దాగిఉండి, కశ్యపుడి సంతానాన్ని వేధించేవాడు. అప్పుడు, కశ్యపుడు, తన కొడుకైన ’అనంత నాగుడి’తో కలసి, ఒక వరాహ ముఖము [ఇప్పటి బారాముల్లా] అనబడు కాలువను తవ్వి, ఆ సరోవరపు నీటిని బయటికి ప్రవహింపజేశాడు. ఈ విధముగా ప్రవహించిన నీరు పశ్చిమములోనున్న మరొక కాలువ కు చేరుతుంది. దానిని కశ్యప సాగరము [ఈనాటి కాస్పియన్ సముద్రము] అని పిలుస్తారు._
_ఆ తరువాత సరోవరము నుండీ బయట పడిన జలోద్భవుడిని విష్ణువు సంహరించాడు. ఇలాగ నిండుకున్న సరోవరపు ప్రక్కన ’వేద వ్యాసంగముల కోసము’ విశేషముగా ఒక పవిత్ర క్షేత్రాన్ని నిర్మించారు. దానిని "కశ్యప మైరా" అని పిలిచేవారు. అదే కాలక్రమేణా *’కశ్యమైరా’* అనీ, *"కశ్మీర"* అనీ నామాంతరము చెందింది._
_ఈ సుందర కాశ్మీరమును చూచుటకు గౌరీదేవి, గణపతితో పాటు హిమాఛ్చాదితమైన ఒక పర్వత మార్గము ద్వారా తరచు వచ్చేది. దానిని "గౌరీ మార్గ" అని పిలిచేవారు. అదే నేటి *గుల్మార్గ్*._
_’నీలమతి పురాణము ’ మరియూ దాని ఆధారముగా లిఖింపబడిన " రాజతరంగిణి" --ఇవి, కాశ్మీరపు పౌరాణిక మరియూ ఐతిహాసిక దాఖలాలు._
_పన్నెండవ శతాబ్దములో "కల్హణుడు" అనే పండితుడు వ్రాసిన గ్రంధాల శృంఖల, విశ్వములోని అన్ని చోట్లా అత్యంత కుతూహలముతోను, శ్రద్ధాభక్తులతోను అభ్యసించబడుతున్నాయి. భారత్ లో దీని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకొనుట లేదు. ఎందుకంటే, మాధ్యమాలు ప్రతిబింబించే కాశ్మీరు పూర్తిగా వేరే. *కాశ్మీరు హిందువులది అంటే నమ్మే పరిస్థితి నేడు హిందువులలోనే లేదు. దురదృష్టము...!*_
_*ఇది ఎవరి కాశ్మీరము ?*_
_ఇది శారదాదేవి యొక్క కాశ్మీరము._
_|| నమస్తే శారదా దేవి కాశ్మీర పురవాసిని|_
_త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే ||_
_ఇలాగ శారదా దేవిని స్తుతి చేసేది’ కాశ్మీర పురవాసిని’ అనే !కాశ్మీరపు లిపి ఏమిటో తెలుసా ? అది ’శారదా లిపి’ > అప్పటి కాశ్మీర వేద విద్యాలయాలను ఏమని పిలిచేవారు ? ... *"శారదా పీఠము"*._
_ఇదంతా ఎందుకు ? ఆనాడు పూర్తి కాశ్మీరాన్నే "శారదా దేశము" అని పిలిచేవారు. కాకపోతే, శంకరాచార్యులు కాశ్మీరానికి ఎందుకు వెళ్ళేవారు ..? అక్కడి కృష్ణగంగా నది యొక్క తీరములోనున్న శారదాపీఠపు సొగసును చూసి, అదే పద్దతిలో దానిని ప్రతిబింబించేలాగ ఇంకొక శారదా పీఠాన్ని తుంగభద్రా తీరపు శృంగేరిలో స్థాపించుటకు ప్రేరణ దొరికినది ఆ కాశ్మీర శారదాపీఠము వల్లనే !శారదాదేవి యొక్క శ్రీగంధపు మూల విగ్రహాన్ని కాశ్మీరు నుండే శృంగేరికి తరలించినారట._
_కాశ్మీరానికి తమ కొందరు శిష్యులతోపాటు వెళ్ళిన కొత్తలో శంకరాచార్యులు, ఒక కాశ్మీరీ పండితుడి అతిథిగా ఉన్నారు. మొదటి దినమే శంకరాచార్యుల పాండిత్యానికి విస్మయము చెందిన ఆ పండిత దంపతులు, వారిని మరి కొంతకాలము తమ అతిథిగా ఉండి సత్కారాలను స్వీకరించమని మనవి చేసుకున్నారట. దానికి ఒప్పుకున్న శంకరాచార్యులు, ఒక నిబంధన పెట్టారు. ఏమనగా, ’నా వంట నేనే చేసుకుంటాను ’ అని._
_ఇది ఆ పండిత దంపతులకు కొంత అవమానకరముగా తోచిననూ, వారిష్ట ప్రకారమే, కావలసిన సంభారములనూ, వంటపాత్రలు, వంట చెరకు లను ఇచ్చి విరమిస్తారు. అయితే వంట చేయుటకు కావలసిన అగ్నిని ఇవ్వడము మరచిపోయారు. మరొకసారి ఆ దంపతులను పిలచి ఇబ్బంది పెట్టరాదని తలచి శంకరాచార్యులు, అలాగే ఆకలితో నకనకలాడుతూనే పడుకుని నిద్రించారు._
_మరునాడు ఆ పండిత దంపతులు వచ్చి నమస్కరించి మాట్లాడిస్తుండగా, వంట సామగ్రి అంతా అలాగే పడి ఉండుట గమనించి, ’ఎందుకని’ విచారించగా, వారి శిష్యులు, అగ్నిలేని కారణాన శంకరాచార్యులు వంట చేసుకోలేదు-అని సమాధానమిచ్చారు._
_తక్షణమే ఆ గృహిణి, అక్కడే ఉన్న నీటిని ఆ కట్టెలమీద చిలకరించగానే ఆ కట్టెలు అంటుకొని మండనారంభించాయి. ఈ ప్రహసనము వల్ల, శంకరాచార్యులకు, తాము ఇంకా చాలా నేర్చుకోవలసినది ఈ శారదా దేశములో ఉంది- -అనిపించి, ఇంకొన్ని దినాలు అక్కడే నివశించారు._
_వారు నిలచిన ఆ ప్రదేశము -ఒక గుట్ట -ను ఈనాటికీ శంకరాచార్య గుట్ట అనే పిలుస్తారు. ఆ పేరుతోనే అది ప్రసిద్ధమైనది. అదొక పుణ్యక్షేత్రము అనిపించుకున్నది. ఇది శ్రీనగరపు నట్ట నడుమ ప్రసిద్ధమైన *’దాల్ ’* సరోవరము ప్రక్కనే ఉంది._
_*ఆనాటి శారదాపీఠము, దురదృష్టవశాత్తూ ఇప్పటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది. అక్కడికి వెళ్ళుటకు ఎవరికీ అనుమతి లేదు.*_
_[ఈ శారదాపీఠపు శిథిల చిత్రాలు ఈ మధ్యనే ఎవరో పోస్ట్ చేశారు.. ఉన్నవారు పంచుకోగలరు]_
_ఆ శారదా పీఠము శిథిలమై, దినదినానికీ కుంగిపోవుతున్నది._
_"విశిష్టాద్వైతము" అనే సిద్ధాంతము, "నాథ ముని" ద్వారా ప్రారంభమైనది అని ఉల్లేఖనములు ఉన్నాయి. దానిని యమునాచార్యులు విస్తరించినారు. మరియూ రామానుజాచార్యులు బ్రహ్మసూత్రపు చౌకట్టులో ప్రతిపాదించి, "శ్రీ భాష్యము" అనే మేరు గ్రంధాన్ని సృష్టించారు. ఇదే, శ్రీవైష్ణవుల మూలగ్రంధము. ఇటువంటి మహద్గ్రంధాన్ని సృష్టించుటకే రామానుజులు తమ శిష్యుడైన ’కురుత్తాళ్వార్' [ఖురేషీ ] తో కలసి బ్రహ్మసూత్రాన్ని వెదకుతూ కాశ్మీరానికి వెళ్ళారు. వారికి అప్పటికే అరవై యేళ్ళు !_
_ఇది మన కాశ్మీరు చరిత్ర !_
సేకరణ!
కాశీ యాత్ర (మూడవ భాగము)
కాశీ యాత్ర (మూడవ భాగము)
5వ తారీకు సాయంత్రం 4గంటలకు సత్రం రూముకు తాళం వేసి నడుచుకుంటూ సందులన్నీ తిరిగి మేము బాపు పాండే ఘాట్ వద్దకు వెళ్ళాము. అక్కడ మెట్ల ప్రక్కన ఒక స్లోపు గోడ వున్నది నేను ఆ గోడమీదనుంచి నడవటం వలన క్రిందికి దిగటం తేలిక అయ్యింది. మేము కొంత క్రిందికి రాగానే ఒక పడవ వాడు మమ్ములను కలిసి రెండు వేలు ఇస్తే మొత్తం ఘాటులన్ని చూపించి వస్తానన్నాడు. నేను క్రింద నది దగ్గరకు తొందర తొందరగా వెళ్ళితే అక్కడ ఒక ఫెర్రీ షిప్ బయలుదేరటానికి సిద్ధంగా వున్నది నేను ఆ పడవ వానిని ఎంత తీసుకుడుంటావు అని అడిగితె మనిషికి 300 రూపాయలు అని అన్నాడు. కానీ మా కుమారుడు 15వందలకు చిన్న మోటారు బోటు మాట్లాడాడు. మా కాంట్రాక్టు ప్రకారం మమ్మలను ఆవలి వడ్డుకు తీసుకొని వెళ్లి మేము నదిలో స్నానం చేసే దాకా ఉండి తరువాత కాశీలోని గాటు లన్నీ చూపించి గంగ హారతిని చూపించి మరల మమ్మలను బాపు పాండే ఘాటులో వదలాలి. అదే ప్రకారం ముందుగా మమ్మల్ను ఆవలివడ్డుకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మేము ముగ్గురం స్నానాలు చేసాము. తరువాత నదికి ఎగువగా వెళ్లి ఒక్కొక్క గాటుని దూరం నుంచి చూపుతూ చివరి ఘాట్లు అంటే హరిచంద్ర ఘాటు మేము ఆ ఘాటుని చూసినప్పుడు ఒక నాలుగు చితులు కాలుతూ కనిపించాయి. తరువాత మణికర్ణికా ఘాటు అక్కడ కూడా నాలుగు చితులు కాలుతూ కనిపించాయి. నేను బోటులోంచే ఆ చితులకు నమస్కరించాను. ఆహ వాళ్ళ భాగ్యం ఏమిటి కాశీలో మరణించారు అని తలచాను. " కాశీని మరణాత్ ముక్తిహి" అని మనసులోనే అనుకొన్నాను. కాశీలోనే మరణించాలని చాలామంది వృద్ధాప్యంలో కాశీకి వచ్చి నివసిస్తారని నేను విన్నాను. యెంత ప్రయత్నించినా కానీ ఏ కొద్దిమందో ఆ పుణ్యస్థలంలో మరణించగలరని నానుడి. మమ్మలను అన్ని ఘాట్లు తిప్పుతూ చివరకు దశాశ్వమేధ ఘాటుకు తీసుకొని వచ్చి గంగ నదిలో నావను నిలిపాడు. అక్కడ దాదాపు రాత్రి 8 గంటలవరకు ఉండి గంగ హారతిని కన్నులపండుగగా తిలకించాము. హారతి కార్యక్రమం ముగియకముందే మమ్ములను నదిలో బాపు పాండే ఘాటు వద్దకు బోటు వాడు తీసుకొని వెళ్ళాడు. మేము అతనికి వప్పుకున్న ద్రవ్యం ఇచ్చి మేము నడుచుకుంటూ సత్రానికి చేరుకున్నాము. కరివేనసత్రంలో రాత్రి పుట భోజనం పెట్టరు . నా కుమారుడు వెళ్లి టిఫిన్ ప్యాక్ చేయించుకొని ఒక స్టీలు మగ్గునిండా మజ్జిగ తీసుకొని వచ్చాడు. మేము ఉప్మా తిని ఆ మజ్జిగ త్రాగినాము. నేను నా కుమారుడు అక్కడికి దగ్గరలోని తారక రామ ఆంధ్రశ్రమాన్ని వెళ్లి రూములగూర్చి విచారించాము. మీరు సామానుతో వస్తే కానీ మీకు రూము ఇవ్వము అని అక్కడి రిసిప్షన్లోని ఆయన అంటే తిరిగి సత్రానికి వచ్చి రూము కిరాయి రూ. 1200 కట్టి రూము కాళీ చేసి ఆంధ్రాశ్రమానికి వెళితే మాకు రెండవ అంతస్తులో 39 నంబరు గది రూ 375 కిరాయితో ఇచ్చారు. మేము ఎదురుగా వున్న లిఫ్ట్ ఎక్కి 2వ అంతస్తులోని గదికి వెళ్ళాము. అటెండరు గది తాళం తీసి మాకు గది వప్పచెప్పి తాళం చెవి తీసుకొని వెళ్ళాడు. అదేమిటని అడిగితె మీరు మీ సొంత తాళం వేసుకోవాలని అన్నాడు. నేను క్రిందికి వచ్చి అక్కడి సమీప షాపులో ఒక చిన్న తాళం రూ 50 పెట్టి కొన్నాను. ఆంధ్రశ్రమంలో బియ్యపు రవ్వ ఉప్మా పెడితే నేను గదికి తీసుకొని వచ్చి దానిని తిని మేము పడుకున్నాము.
అలోచిoచండి
*తప్పకుండా చదవండి...*
-------------------- Jai Gurudeva
🌀 జననం ధర్మమని, మరణం తప్పదని అందరికి తెలుసు 60 లేదా 70 కాకపోతే 80 సంవత్సరాలు.
🌀 ఖాళీ చేతులతో తల్లి గర్భంనుండి వచ్చాము, ఖాళీ చేతులలో భూగర్భంలోకి పోతాం, తొలిస్నానం గుర్తులేదు, చివరిస్నానంతెలియదు.
🌀 నీగురించి నీవు ఎక్కువ మాట్లాడు తున్నావ్ అంటే నీకు ౼ నేను అన్నది పోలేదన్నమాట...
🌀 జ్ఞానమున్న వారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది కాని అజ్ఞానునితో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు...
🌀 ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది, ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు....
అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది...
🌀 మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి కథలో చెడ్డ వాళ్లమే, కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది..
🌀 బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేరు..
🌀 ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు, అబద్దం అందంగా తయారై అందర్నీ తనవైపు ఆకర్షిస్తుంది..
🌀 మన దగ్గర డబ్బులేకుంటే మన రక్తసంబంధంలోనే విలువుండదు, _అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది._,
_ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు, ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు...
🌀 ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు...
🌀 నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్ధం,
_ఇతరుల నొప్పిని కుడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్ధం.._
🌀 మన వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునేవారి గురించి ఆలోచించకండి ఎందుకంటే...? వారిస్థానం ఎప్పుడు మన వెనుకే...
🌀అతివేగం ప్రమాదాలకు దారితీస్తుంది..అలాగే అన్నీ అనారోగ్యసమస్యలు వేగంగా తగ్గిపోవాలని వాడే మందుల వల్ల వచ్చే ప్రమాదాలే సైడ్ ఎఫెక్ట్స్....
అలోచిoచండి... మిత్రులారా
సర్వే జనా సుఖినోభవంతు. Jai Shri Ram
Kancherla Venkata Ramana
🙏🙏🙏🙏🙏🙏
ఐదు "వ" కారాలుండాల
*ఐదు "వ" కారలతో పూజ్యత*
~~~~~~~~~~~~~~~~
“వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ
వ కారైః పంచభిర్యుక్తః నరో భవతి పండితః ”
ఒక వ్యక్తి సమాజంలో గౌరవింపబడాలంటే ఐదు "వ" కారాలుండాలని చెప్తోంది ఈ శ్లోకం.
అవి - 1.వస్త్రధారణ 2.శరీరపోషణ (వపుషా) 3.సంభాషణ (వాచా ) 4.విద్య 5.వినయం.
*మొదటిది - వస్త్రధారణ*
ధరించిన వస్త్రాలను బట్టి వ్యక్తిని విలువ కట్టటం మంచిది కాదని తెలిసినా, మన ప్రథమవీక్షణం ఎదుటివాడు ధరించిన వస్త్రాలపైనే ప్రసరిస్తుంది. ఆ వస్త్రధారణం మనకు నచ్చితే అసంకల్పితంగా ఒక సానుకూల భావన అతనిపట్ల ఏర్పడుతుంది. నచ్చకపోతే అయిష్టభావన ఏర్పడుతుంది. కొందరు చూపరులను రెచ్చగొట్టే విధంగా వస్త్రధారణ చేస్తూ ఉండటం, దానివల్ల కొన్ని అనర్థాలు జరుగుతూ ఉండటం మనకు తెలుసు. ఎలాంటి బట్టలు కట్టుకోవాలనేది ఎవరికి వారు నిర్ణయించుకోవటం నూటికి నూరుపాళ్ళు న్యాయమే అయినా, సభ్యతను , వ్యవస్థను దృష్టిలో ఉంచుకోవాలి. “తగిన వేషము” సర్వదా శ్రేయస్కరం.
*రెండవది - శరీర పోషణ*
ఆరోగ్యం, ఆకర్షణ, సభ్యత అనేవి శరీరపోషణకు ఆంతర్యాలు. ఆరోగ్యం బాగానే ఉన్నా దర్శనీయత లోపిస్తే ఇబ్బంది. కనీసం ఎదుటివాడికి రోత పుట్టించని విధంగా శరీరాన్ని ఉంచుకోవాలి. వికారచేష్టలు , దుర్వాసనలు మొదలైనవి ఎదుటివారికి వెగటు పుట్టిస్తాయి. పదిమందిలో ఉన్నప్పుడు కొన్ని శారీరక బలహీనతలను , ఎదుటివారికి అసహనాన్ని కలిగించే వైఖరులను నియంత్రించుకోవాలి.
*మూడవది - మాటతీరు*
ఇంటా,బయటా గౌరవింపబడాలంటే ప్రతి మాటనూ ఆచి తూచి మాట్లాడాలి.
“ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః
తస్మాత్తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రతా ? ”-
ఒక మంచి మాట మాట్లాడితే సర్వులూ సంతోషిస్తారు. అందువల్ల ప్రియభాషలే మాట్లాడాలి. మాటలకు దారిద్ర్యంలేదుకదా !అని ఈ శ్లోకభావం. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందనే సామెత ఉంది కదా !
*నాల్గవది - విద్య*
“విద్వాన్ సర్వత్ర పూజ్యతే” విద్యావంతుడు ఎక్కడైనా పూజింపబడుతాడు.
విద్యావంతుడు దుర్జనుడైతే వాడిని దూరంగా ఉంచాలి. వాడు తలమీద మణి ఉన్న సర్పంలాంటివాడని పెద్దలు చెప్పారు. అందువల్ల అహంకార, కుసంస్కార దూషితం కాని విద్యాతేజస్సు మాత్రమే వందనీయం.
*ఐదవది - వినయం*
విద్యాతత్త్వం గ్రహించిన వాడే వినయసంపదను పొందగల్గుతాడు.“ఉద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత ” అన్నాడు భర్తృహరి. ఎన్ని సంపదలున్నా అహంకరించక వినయశీలాన్ని పోషించుకొనేవాడు అందరిచేతా ఆదరింపబడుతాడు.
వేంకటేశ్వర ఆలయం
🕉 మన గుడి : నెం 291
⚜ *కర్నాటక : Jp నగర్, బెంగళూరు*
⚜ *శ్రీ తిరుమలగిరి లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం*
💠 శ్రీ వేంకటేశ్వరుడు తనను కోరే భక్తులకు కొలమానమైన సంపద.. వేంకటేశ్వరుడికి అంకితం చేయబడిన అనేక ఆలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి.
బెంగళూరులోని J.P. నగర్‌లో ఉన్న
శ్రీ తిరుమలగిరి లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం అటువంటి అనేక దేవాలయాలలో ముఖ్యమైన పుణ్యక్షేత్రం.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో వేంకటేశ్వరుని ప్రతిరూపం ఇక్కడ ప్రతిష్టించిన వేంకటేశ్వరుడు అని చెబుతారు.
💠 శ్రీ రంగనాథునిగా భావించబడిన ఒక దేవాలయం తిరుపతిలోని వేంకటేశ్వరుని నివాసానికి పుణ్యక్షేత్రంగా మారింది.
ఇక్కడ దేవుడు అనేక ఇతర దేవతలను దర్శించుకునే అవకాశం ఇచ్చాడు.
ఇక్కడ వేంకటేశ్వరుడు అతని కుడి వైపున నరసింహ స్వామి మరియు ఎడమ వైపున తల్లి లక్ష్మీ దేవి ఉన్నారు.
గోవిందరాజ స్వామి, ఆంజనేయుడు (హనుమాన్), గణపతి మరియు ఆదిశేషునికి ప్రత్యేక మందిరాలు కలవు.
💠 తిరుమలగిరి ఆలయాన్ని సూర్యాస్తమయం తర్వాత పండుగ రోజులలో చూడాలి..
ఆ సమయంలో మీరు స్వర్గపు నక్షత్రాల మధ్య నిలబడి, రంగురంగుల ప్రకాశంతో మైమరచిపోయినట్లు అనిపిస్తుంది.
💠 ఏడు తలల ఆదిశేషునిపై 13.5’ ఎత్తులో ఉన్న రంగనాథ స్వామి విగ్రహం ఒకే రాతితో చెక్కబడి ప్రపంచంలోనే అత్యంత అరుదైనదిగా పేర్కొంటారు.
శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం పునాదితో సహా 13 అడుగుల ఎత్తు ఉంటుంది.
100 సంవత్సరాలకు పైగా ఆంజనేయుడు ఉనికిలో ఉన్నందున ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించక ముందే ఆంజనేయ దేవుడు అక్కడ ఉన్నాడు.
💠 అనేక పండుగలలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా జరుపుకుంటారు ఎందుకంటే ఆ రోజున ఆలయానికి 7 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారు.
💠 శ్రీ తిరుమలగిరి లక్ష్మీ వేంకటేశ్వర ఆలయాన్ని 29 డిసెంబర్ 1996న శ్రీ రంగప్రియ స్వామిగళ్ ప్రారంభించారు
💠 2011 నుండి ప్రతి శనివారం, ఆలయాన్ని సందర్శించే భక్తులందరికీ నిత్య ప్రసాదంతో పాటు, అన్నదానం ప్రారంభించబడింది.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసం నాడు ఆలయంలో తిరుపావడై సేవను పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహిస్తారు.
వైకుంఠ ఏకాదశి రోజున ఆలయంలో ప్రత్యేక లడ్డూలను తయారు చేసి భక్తులందరికీ పంచుతారు.
దేవతలకు నిత్య అలంకారానికి సంబంధించిన పూలమాలలన్నీ ఆలయంలో రోజూ తయారు చేస్తారు.
💠 రాష్ట్రంలోని అనేక దేవాలయాలకు భిన్నంగా, శ్రీ గోపాల అయ్యంగార్ తన దివ్య ప్రపంధ గోష్టి (బృందం)తో కలిసి ఆలయంలో నిత్య పారాయణం (రోజువారీ ప్రార్థనలు) నిర్వహిస్తారు.
సేమ్యా పాయసం
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
*🌷జగదీశ్ కొచ్చెర్లకోట గారి కథనం🌷*
🌷🌷🌷
సేమ్యా పాయసం చెయ్యడమెలాగో నేర్చుకుందాం బోయ్స్!
ఫేస్‌బుక్ చూసింది చాలుగానీ ముందా ఫోన్ పక్కనబడేసి లేచి ఆ లుంగీ అదీ కాకుండా ఎంచక్కా పాంటూ చొక్కా తొడుక్కోండి. ఒకవేళ ట్రాక్ వేసుకునుంటే మార్చక్కర్లా! దానిమీదకి ఆపోజిట్ కలర్ టీషర్టేదన్నా వేసుకోండి. బూడిదరంగు ట్రాక్ మీదకి నేవీ బ్లూ.. అలాగన్నమాట! మరీ ఎడ్డిమొహంలా కాకుండా కాస్త మొహం సబ్బుతో ఓ రెండుమార్లు రుద్దుకుని ఆ నాలుగు వెంట్రుకల్నీ పక్కకి దువ్వుకుని చాలా మర్యాదస్తుడైన అంకుల్లా బయల్దేరండి.
మీ వీధి చివర్లో ఉన్న మోర్‌కో, రత్నదీప్‌కో వెళ్లి ఓ రెండుమూడు వరసలు వదిలేసి బాగా లోపలికి వెళ్తే అక్కడుంటాయి సేమ్యా పేకెట్లు. సరిగ్గా చూసుకునేడవండి, నూడుల్స్ కూడా అలాగే తగలడతాయి. తెలీకపోతే ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్సేసుకున్న అమ్మాజీని పిలిచి సేమ్యా పాకెట్టివ్వమని అడగండి.
తీసుకున్నారా, ఇప్పుడు కాస్త వంగితే ఆ కిందరల్లో జీడిపప్పు, కిస్‌మిస్, యాలక్కాయలంటూ చిన్నచిన్న పొట్లాలు కట్టి పడేసివుంటాయి. అవి తలొకటీ తీసుకోండి. ఇప్పుడు బిల్ కౌంటర్ దగ్గరకి రాగానే పక్కనే బీరువా సైజులో ఫ్రిజ్ ఉంటుంది. అందులోంచి అముల్ ఎర్ర పాకెట్టొకటి తీసుకోండి. అంటే పాలు కాస్త చిక్కగా ఉంటాయని ఎర్రదన్నానన్నమాట.
అంతా అయింతరవాత వాడు మీ ఫోన్ నెంబరడుగుతాడు. చెప్పనని చెప్పండి. ఇచ్చారంటే ఆనక మధ్యాన్నాలప్పుడు అప్పులాళ్ళూ, అపార్ట్‌మెంటలోళ్ళూ పీక్కుతినేస్తారు. మహా అయితే ఏ రెండొందలేభయ్యో ఎంతో అవుతుంది. క్యాష్ ఇచ్చేస్తే బెటర్.
ఇంటికి రాగానే మళ్ళీ లుంగీలోకి మారండి. పైన బనీనొకటీ ఉంటే హోమ్లీగా ఉంటుంది. చొక్కాలవీ అవసరంలా!
ఇప్పుడు రెండు స్టవ్వులూ వెలిగించుకోవాలి. లైటర్ చాలాసేపు ఏడిపిస్తుంది కానీ స్టవ్ అంటుకోదు. సిగరెట్టలవాటుందా? ఉంటే లైటరో, అగ్గిపెట్టో ఉండేవుంటుంది జేబులో, తియ్యండి. అంటించారా? నే చెప్పేది స్టవ్వు. సిగరెట్టు కాదు. అది తరవాతంటిద్దురుగాని.
ఇప్పుడు ఒకదాని మీద పాలగిన్నె పెట్టండి. ఆవేశంగా మంట పెద్దది పెట్టెయ్యకండి, సిమ్‌లో ఉంచితే బెటర్. పక్క స్టవ్వుమీద ఓ చిన్న మూకుడొకటి పడేసి అందులో ఓ పెద్ద చెంచాడు నెయ్యి పొయ్యండి. అది మీ మేనేజర్లా కాసేపు చిటపటలాడుతూ ఉండగానే అందులో ఒక గ్లాసుడు సేమియా వేసి కాస్త రంగు మారేవరకూ వేయించుకోండి. ఆనక అదే మూకుట్లో మళ్ళీ ఓ నేచ్చుక్క వేసుకుని అరడజను జీడిపప్పులు, మరో అరడజను కిస్‌మిస్‌లు వేసి బాగా కలుపుతూ కొంచెం ఎర్ర రంగు రాగానే స్టవ్వాపెయ్యండి.
ఈలోగా పాలవైపొకసారి చూడండి. అవెలాగూ ఏ పాపమూ ఎరుగని పాపాయిలా తెల్లమొహం వేసుకు చూస్తుంటాయి. మనకి సహనం నశిస్తుంది. స్టవ్ మంట ఒక నెంబరు వరకూ పెంచండి. అప్పుడు గిన్నె అంచులమ్మట అలజజడి మొదలవుతుంది. అదుగో, అప్పట్నుంచి మీరిక అప్రమత్తంగా ఉండాలన్నమాట. ఆ రెండు నిముషాలూ ఏ ఫోనూ రాకూడదని, ఎవరూ కాలింగ్‌బెల్లదీ కొట్టకూడదని సాయిబాబాకి దణ్ణం పెట్టుకుని వేళ్ళు పిసుక్కుంటూ పాలవైపు చూస్తుండండి.
ఖాళీగా ఉండడం ఎందుకూ అనుకుంటే చిన్న పాలరాయి అమాన్‌దస్తాలో ఓ నాలుగు యాలక్కాయలు పడేసుకుని బాగా నూరుకోవచ్చు. తిరపతి లడ్డూలో పడేసినట్టు తొక్కలవీ పాయసంలో పడేసుకోకండి, తినడానికి చిరాగ్గా ఉంటుంది.
కాసేపటికి పాలగిన్నె దగ్గర చిన్న శబ్దం వినబడుతుంది. పొంగిపోతాయేమోనని మనకి భయమేస్తుంది, స్టవ్ తగ్గించేస్తాం, ఆ తరవాత రెండు నిముషాలు శంకరాభరణం మొదటి రెండువారాల కలెక్షన్స్‌లా స్తబ్దుగా పడుంటాయి పాలు. ఇక సహనం మరింత నశించి ఇంకొంచెం పెంచుతాం. వెంటనే ఆమధ్య కేదార్‌నాథ్‌లో చెప్పాపెట్టకుండా వరదలొచ్చేసినట్టు పాలు పొంగిపోయి గిన్నెదాటి స్టవ్వు మీదపడి డిజైన్లెయ్యడం మొదలెడతాయి.
అంచేత స్టవ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకండి. నామాటిని కంగారుపడకుండా స్ట్రెస్ తగ్గడానికి పదంకీలు లెక్కబెట్టుకుంటూ ఈ వేయించిపెట్టుకున్న సేమ్యానీ, జీడిపప్పుల్నీ కిందామీదా పోసుకోకుండా ఆ పాల ఎసట్లో పోస్తూ కలపండి. కాసేపటికి పాలు శాంతించి నిదానంగా మనవైపు కుతకుతలాడుతూ చూస్తుంటాయి.
అవలా ఉడుకుతుండగానే దగ్గరపడకముందే మంటాపెయ్యడం బెటర్. లేకపోతే పాయసం తాగడానికి గ్లాసు బదులు కత్తి వాడాల్సొస్తుంది.
అయిపోవచ్చింది, ఇపుడేంచేస్తారంటే ఒక చిన్నగ్లాసుడు పందార తీసుకుని ఈ తయారైన సేమియా పాయసంలో పోసుకుని బాగా కలియదిప్పండి.
ఆనక ఆ యాలకుల పొడుంది కదా, అది కూడా పైన చల్లేసి సున్నితంగా, సుకుమారంగా కలుపుతూ ఆ పరిమళాన్ని టీవీ అడ్వర్టైజ్‌మెంట్లలో స్నేహలా ఆస్వాదించండి.
ఇప్పుడు క్రోకరీ అల్మరా దగ్గరకెళ్లి ఓ నాలుగైదారేడు సంవత్సరాల నుంచీ వాడకుండా ఊరికే అలా దాచుంచుకున్న మాంఛి వెడల్పాటి బౌలొకటి తీసుకోండి. దానిమీద లేలేత పువ్వుల డిజైన్లవీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. మరీ ప్లెయిన్‌గా ఉంటే ఫీల్ రాదు. ఒకవేళ మీయింట్లో వెండిగిన్నుంటే అదే బెటరు. కాస్త ఘనంగా ఉంటుంది.
అందులోకి ఓ నాలుగైదు పెద్ద స్పూన్ల పాయసం వేసుకుని చూడండి.
నా సామిరంగా... ఎర్రెర్రటి జీడిపప్పులు అక్క పెళ్లికి ప్రత్యేకంగా మేకప్పైన చెల్లెళ్లలా ఉత్సాహంగా తిరిగేస్తుంటాయి. కిస్‌మిస్సులేమో పెళ్లిపందిట్లో పెద్దవాళ్లు పిలుస్తోంటే సిగ్గుపడుతూ తలుపెనకాల దాక్కునే పిల్లల్లా అక్కడక్కడా దాక్కుంటాయి.
చూడటానికే ఇంత వైభవంగా ఉంటే ఇక తింటే ఎలా ఉంటుందో నే చెప్పాలా?
ఇంకెందుకూ లేటు, కంటిముందున్నది పంటికిందకెళితే ‘అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా...’ పాటందుకోవడం ఖాయం!
ఇప్పుడు చెప్పండి థాంక్సు!
ఉగాది శుభాకాంక్షలర్రా! నాకీ సాయంత్రం కవి సమ్మేళనం ఉందని రాశిఫలాల్లో రాసుంది. విధినెవడు తప్పించగలడు? కాసేపలా వెళ్లొస్తా!
మీ....
కొచ్చెర్లకోట జగదీశ్