19, ఏప్రిల్ 2024, శుక్రవారం

కాశీ యాత్ర (మూడవ భాగము)

 

కాశీ యాత్ర (మూడవ భాగము)

 5 తారీకు సాయంత్రం 4గంటలకు సత్రం రూముకు తాళం వేసి నడుచుకుంటూ సందులన్నీ తిరిగి మేము బాపు పాండే ఘాట్ వద్దకు వెళ్ళాము. అక్కడ మెట్ల ప్రక్కన ఒక స్లోపు గోడ వున్నది నేను గోడమీదనుంచి నడవటం వలన క్రిందికి దిగటం తేలిక అయ్యింది. మేము కొంత క్రిందికి రాగానే ఒక పడవ వాడు మమ్ములను కలిసి రెండు వేలు ఇస్తే మొత్తం ఘాటులన్ని చూపించి వస్తానన్నాడు. నేను క్రింద నది దగ్గరకు తొందర తొందరగా వెళ్ళితే అక్కడ ఒక ఫెర్రీ షిప్  బయలుదేరటానికి సిద్ధంగా వున్నది నేను పడవ వానిని ఎంత తీసుకుడుంటావు  అని అడిగితె మనిషికి 300 రూపాయలు అని అన్నాడు. కానీ మా కుమారుడు 15వందలకు చిన్న మోటారు బోటు మాట్లాడాడు. మా కాంట్రాక్టు ప్రకారం మమ్మలను ఆవలి వడ్డుకు తీసుకొని వెళ్లి మేము నదిలో స్నానం చేసే దాకా ఉండి తరువాత కాశీలోని గాటు  లన్నీ చూపించి గంగ హారతిని చూపించి మరల మమ్మలను బాపు పాండే ఘాటులో వదలాలి. అదే ప్రకారం ముందుగా మమ్మల్ను ఆవలివడ్డుకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మేము ముగ్గురం స్నానాలు చేసాము. తరువాత నదికి ఎగువగా వెళ్లి ఒక్కొక్క గాటుని దూరం నుంచి చూపుతూ చివరి ఘాట్లు అంటే హరిచంద్ర ఘాటు మేము ఘాటుని చూసినప్పుడు ఒక నాలుగు చితులు కాలుతూ కనిపించాయితరువాత మణికర్ణికా ఘాటు అక్కడ కూడా నాలుగు చితులు కాలుతూ కనిపించాయి. నేను బోటులోంచే చితులకు నమస్కరించానుఆహ వాళ్ళ భాగ్యం ఏమిటి కాశీలో మరణించారు అని తలచాను. " కాశీని మరణాత్ ముక్తిహి" అని మనసులోనే అనుకొన్నాను. కాశీలోనే మరణించాలని చాలామంది వృద్ధాప్యంలో కాశీకి వచ్చి నివసిస్తారని నేను విన్నాను. యెంత ప్రయత్నించినా కానీ కొద్దిమందో పుణ్యస్థలంలో మరణించగలరని నానుడి. మమ్మలను అన్ని ఘాట్లు తిప్పుతూ చివరకు దశాశ్వమేధ ఘాటుకు తీసుకొని వచ్చి గంగ నదిలో నావను నిలిపాడు. అక్కడ దాదాపు రాత్రి 8 గంటలవరకు ఉండి గంగ హారతిని కన్నులపండుగగా తిలకించాము. హారతి కార్యక్రమం ముగియకముందే మమ్ములను నదిలో బాపు పాండే ఘాటు వద్దకు బోటు వాడు తీసుకొని వెళ్ళాడు. మేము అతనికి వప్పుకున్న ద్రవ్యం ఇచ్చి మేము నడుచుకుంటూ సత్రానికి చేరుకున్నాము. కరివేనసత్రంలో రాత్రి పుట భోజనం పెట్టరు . నా కుమారుడు వెళ్లి టిఫిన్ ప్యాక్ చేయించుకొని ఒక స్టీలు మగ్గునిండా మజ్జిగ తీసుకొని వచ్చాడు. మేము ఉప్మా తిని మజ్జిగ త్రాగినాము. నేను నా కుమారుడు అక్కడికి దగ్గరలోని తారక రామ ఆంధ్రశ్రమాన్ని వెళ్లి రూములగూర్చి విచారించాము. మీరు సామానుతో వస్తే కానీ మీకు రూము ఇవ్వము అని అక్కడి రిసిప్షన్లోని ఆయన అంటే తిరిగి సత్రానికి వచ్చి రూము కిరాయి రూ. 1200 కట్టి రూము  కాళీ చేసి ఆంధ్రాశ్రమానికి వెళితే  మాకు రెండవ అంతస్తులో 39 నంబరు గది రూ 375 కిరాయితో ఇచ్చారు. మేము ఎదురుగా వున్న లిఫ్ట్ ఎక్కి 2 అంతస్తులోని గదికి వెళ్ళాము. అటెండరు గది తాళం తీసి మాకు గది  వప్పచెప్పి  తాళం చెవి తీసుకొని వెళ్ళాడు. అదేమిటని అడిగితె మీరు మీ సొంత తాళం వేసుకోవాలని అన్నాడు. నేను క్రిందికి వచ్చి అక్కడి సమీప షాపులో ఒక చిన్న తాళం రూ 50 పెట్టి కొన్నాను. ఆంధ్రశ్రమంలో బియ్యపు రవ్వ ఉప్మా పెడితే నేను గదికి తీసుకొని వచ్చి దానిని తిని మేము పడుకున్నాము.


కామెంట్‌లు లేవు: