2, జనవరి 2025, గురువారం

Panchang

 


శుభ సంకల్పం

 *🌸శుభ సంకల్పం:*


సమయాన్ని లెక్కించాల్సింది గడియారంతో కాదు, అనుభూతితో, ఒక బ్యాంకులో ఏరోజుకారోజు ఉదయమే మన ఖాతాలో 86,400 రూపాయలు జమ అవుతాయనుకుందాం. మొత్తం ఆరోజే ఖర్చు పెట్టాలి. మిగిలింది ఆ రాత్రికల్లా రద్దయిపోతుంది. అప్పుడేం చేస్తాం. డబ్బు విలువ తెలుసు కనుక పైసా మిగల్చకుండా వాడేసుకుంటాం. అలాంటి బ్యాంకే అందరికీ ఉంది. దాని పేరు *'కాలం'*. ప్రతి రోజూ 86,400 సెకండ్లు జమ అవుతాయి. వాడుకున్నది వాడుకోగా మిగిలింది రాత్రికల్లా చేజారిపోయినట్లే. ఆ ఖాతాని ఎవరికి వారే నిర్వహించుకోవాలి. కాలం అందరికీ సమంగానే ఉంటుంది. టైమ్ లేదు- అని చెప్పారంటే నిజంగా సమయం లేదని కాదు, ఆ పని చేయాలనే ఉద్దేశం ఉందా.. లేదా అన్నది ముఖ్యం.


కదిలిపోయే ప్రతి క్షణం కొన్ని జ్ఞాపకాలను, విలువలను, శక్తులను మన పేరున కూడబెడుతూంటుంది. ఆ నిధి చివర్లో మన కళ్లముందు కదలాడుతుంది. జీవితాన్ని ఎలా జీవించామో చెబుతుంది. అప్పుడు అయ్యో అనుకోకుండా తృప్తిగా ఉండాలంటే మన ఖాతాని మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఒక రచయితో, చిత్రకారుడో తాను చేసిన పనిని తరచి చూసుకుంటూ, చేయబోయేదాన్ని సరిచేసుకుంటూ ఎలా ముందుకెళ్తాడో అలా వెళ్లాలి. అప్పుడే నిరుటి కన్నా ఈ ఏడాది మరింత మెరుగవుతుంది. *'కాలం ఎగిరిపోతుందన్నది చెడ్డవార్త. దానిని నడిపే సారథివి నువ్వే అన్నది శుభవార్త'* అంటారు ఒక అమెరికన్ రచయిత. 


అశుభం శుభం ఎప్పుడవుతుందంటే- కొత్త సంవత్సరాన్ని వేడుకగా మాత్రమే కాక ఒక గొప్ప అవకాశంగా చూసినప్పు ఈరోజు ఒక మంచి పనికి శ్రీకారం చుడితే, 365 రోజుల తరవాత ఒక మంచి ముగింపునూ సృష్టించగలం. ఒక కొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, కెరీర్లో ఒక లక్ష్యాన్ని చేరుకోవచ్చు, అర్థవంతమైన బంధాలను కలుపుకోవచ్చు. *కాలాన్ని కొలవడానికే గడియారం కానీ జీవితం సాగేది హృదయాన్ని అనుసరించే, ఏం సాధించాలని నిర్ణయించుకుంటారో దానికి తగ్గట్టుగా కాలాన్ని ఉపయోగించుకుంటారు జ్ఞానులు.*


కాలం కష్టసుఖాలను మోసుకొస్తుందనుకుంటాం. వాస్తవానికి సమస్య కాలంతో ముడిపడిలేదు.

ద్వంద్వాలకు నిలయమైన ఈ ప్రపంచంలో ఉంది. ఉష్ణం శీతలం, సుఖం దుఃఖం, జయం అపజయం.. ఇలాంటివన్నీ ఉన్న ప్రపంచమిది. కాబట్టి *ఆనందాన్ని అన్వేషించడం ఆపి, ఆధ్యాత్మిక సంతృప్తిని వెతుక్కోమని, అదే శాశ్వతమని, దానికి భక్తియోగం మార్గమని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. మనిషిని ఆలోచన నిలబెట్టగలదు, పడేయనూగలదు. భవిష్యత్తు దాని శక్తి మీదే ఆధారపడి ఉంది.*


*విలువైన కాలాన్ని సద్వినియోగపరిచేది ఆ ఆలోచనే. సహనం, సమయాలను మించిన యోధుల్లేరు అంటారు టాల్స్టాయ్. ఆ యోధుల్ని మన సొంతం చేసుకుంటే చాలదూ!*


         (✍️-మంత్రవాది మహేశ్వర)


      *🪷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🪷*

*విద్య*

 📖📖📖  *విద్య*   📖📖📖

ఉ॥

విద్యకు లేదదెన్నడును పేదతనమ్ము వరించి పెంపునన్ 

సాధ్యముఁ జేసిజూపును నసాధ్యము లెన్నియు నైనఁ గ్రక్కునన్ 

చోద్యముగాదు నిత్యమిది చోదనశక్తిగ శ్రీల మెండుగా 

సేద్యఫలమ్మునిచ్చు ఘనశేముషితోడుత నెట్టివానికిన్ 

*~శ్రీశర్మద*

ఎవ్వనిచేజనించు

శు భో ద యం 🙏


ఈశ్వరునే శరణంబు వేడెదన్!


ఎవ్వనిచేజనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై

ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడుమూలకారణం

బెవ్వ డనాదిమధ్యలయుడెవ్వడు సర్వముతానయైనవా

డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్;

- గజేం-మో-బమ్మెఱపోతన. 🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

హేమంతర్తువు

 🫧🫧 *హేమంతర్తువు* 🫧🫧


ఉ॥

సృష్టి రహస్యమౌటఁ దన సృష్టినిఁ గోప్యత నుంచఁగోరి యా 

యిష్టికి నిల్ప నొక్కతెర నీశుఁడుఁ దల్వగఁ జిత్తమందునన్ 

పుష్టి వహించి హేమము నభోముఖమందున నిల్వ ధాత్రిపై 

సుష్టుగ హేమమాయె రవిఁ జూడగలేనటు నొక్కపెట్టునన్ 

*~శ్రీశర్మద*

బ్రహ్మరాత

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                 *బ్రహ్మరాత*

               ➖➖➖✍️


బ్రహ్మరాతను సైతం

బ్రహ్మాండమైన రాతగా మార్చి

చూపిన వసంతుడు …



బోధ చేస్తూ ఒక మునిదంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు. సకలశాస్త్రాలు, విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది.


అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు ‘వసంతుడు’ అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు.


ఇదిలావుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు.

కాసేపట్లో లోపలి నుండి చంటిబిడ్డల ఏడుపులు వినవచ్చాయి. గురుపత్ని కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల.


ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. 


బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు. 


బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. 


అప్పుడు ఇలా చెప్పాడు.. “నాయనా! ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే” అన్నాడు. “ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది” అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. 


అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువుగారిని “బ్రహ్మ రాత మార్చగలమా” అని అడిగాడు వసంతుడు. 


దానికి, ఆయన “అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు” అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది.


ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా? అనే దిగులుతో, వసంతుడికి దేనిమీదా ఏకాగ్రత కుదరడంలేదు. దానికితోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడి వెంటపడి ‘అన్నయ్య, అన్నయ్య’ అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. 


ఒకరోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. 


ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు.

వారందరిని వసంతుడు ప్రశ్నించాడు… “బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా?”


దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం ‘బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు’ అని. 


అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది.


ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు ‘వసంతసేన’ అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు.


వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా! అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. “తమ్ముడూ, నువ్వు బాధపడకు. ఇప్పటినుండి నేను చెప్పినట్లు చెయ్యు” అన్నాడు వసంతుడు. 


దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా! ఇకనుండి నువ్వు ఎలా చెపితే అలానే చేస్తాను'' అన్నాడు శంకరుడు.


“ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద” అన్నాడు వసంతుడు. 


ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. 


ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి “ఈ ఆవుని ఎంతకు కొంటావు” అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. 


శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు.


తర్వాత వసంతుడు శంకరుడితో “తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు” అని చెప్పాడు. 


శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, “అన్నయ్యా! ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది” అని అన్నాడు. 


దానికి వసంతుడు “తమ్ముడూ, నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. ప్రొద్దునకంతా సర్దుకుంటాయి” అని ధైర్యం చెప్పాడు.


ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేవాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. “తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు” అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. 


అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.


వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. “అన్నయ్యా! నేను మహాపాపిని. ఈ పాప పంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు” అని బావురు మంది. 


“ఊరుకో చెల్లీ! ఊరుకోమ్మా! ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి” అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. 


దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన.


ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. 


ఆమె ఆశ్చర్యపడుతూ “అయ్యా! ఇది జరిగే వ్యవహారం కాదు” అని ఏదో చెప్పబోయింది. 


వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి “నేను చెప్పినట్లు చెయ్యి” అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. 


ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. 


అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి.

ఆమె జన్మ చరితార్థమైంది. 


అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల ఋణం తీర్చుకున్నాడు.

**********************


ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు...


ప్రాతః జూద ప్రసంగేణ!

మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః

రాత్రౌచొర ప్రసంగేణ!

కాలౌ గచ్చతి ధీమతాం!


ఇందులో మనకి పైకి కనిపించేది…

ప్రాతః కాలంలో జూదం గురించి మాట్లాడుకోవాలి. 


మధ్యాహ్నం స్త్రీ కి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి. 


రాత్రికి దొంగతనముల గురించి మాట్లాడుకోవాలి.


ఇలా ఎవరైతే మాట్లాడుకుంటారో వారే బుద్ధిమంతులు. ఇదే పైకి కనిపిస్తుంది.


ఇందులో అంతరార్ధం చూద్దాం…


ప్రాతఃకాలం అంటే బాల్యం.

బాల్యంలో మహాభారతం చదువుకోవాలి. వ్యసనాల వలన కలిగే అనర్ధాలు, ఎలా బ్రతకాలో తెలియజేసే ధర్మాలు తెలుస్తాయి. 


మధ్యాహ్నం స్త్రీ! అంటే! యుక్తవయస్సులో రామాయణం చదువుకోవాలి. పరస్త్రీ ని చెరబట్టడం వలన కలిగే అనర్ధాలు, స్త్రీ ఔన్నత్యం, భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది.


సాయంత్రం దొంగతనాలు అంటే… వృద్దాప్యంలో భాగవతం చదువుకోవాలి. వృద్దాప్యంలో కావలసింది మోక్షం మాత్రమే! 

ఇంకా ఏ కోరిక కోరినా తప్పే. శ్రీకృష్ణుడు దొంగతనం పేరుతో చేసిన లీలలు తెలుసుకోవడం, ఇంకా అయన లీలలు తెలుసుకుని ఆయన నామం జపించడం వలన మోక్షం సులభంగా లభిస్తుంది. 


ఇది పైన సంస్కృత శ్లోకంలో ఉన్న అర్ధం, అంతరార్ధం.

పైన చెప్పిన మూడు గ్రంధాలూ దొరికాయి కదా అని చదివేయకూడదు. అర్ధం తెలియక అపార్ధం చేసుకునే ప్రమాదం ఉంది. 


ఎన్ని చదివినా 

ఇంకా ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటాయి...✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🙏

గణపతి ఉపనిషత్తు

 🙏గణపతి ఉపనిషత్తు 🙏

                 

ముందు గణపతి ఉపనిషత్తు వ్రాసి తరువాత అర్ధం ఇచ్చాను గమనించగలరు.

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః! భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః!

స్థిరైరంగైస్తుష్ఠువాగ్ం సస్తనూభిః! వ్యశేమ దేవహితం యదాయుః! 

స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః! స్వస్తి నః పూషా విశ్వవేదాః !

స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః! స్వస్తి నో బృహస్పతిర్దధాతు !


               ఓం శాంతిః శాంతిః శాంతిః

అర్థం:

1: ఓం , ఓ దేవా నీ దయవల్ల , శుభకరమైనవి మన చెవులతో విందుము గాక , 2: మనం 

 ఏది శుభప్రదమైనదో మరియు ఆరాధనీయమైనదో అది మన కళ్లతో చూద్దాం ,

3: మన మనస్సుశరీరాలతో స్థిరత్వంతో మనం ప్రార్థిద్దాం , 4: దేవతలు (దేవుని సేవ కోసం) మనకిచ్చిన మన ఆయుష్షును అందిస్తాము . ఇన్ద్రో వృద్ధశ్రవాః । స్వస్తి నః పూషా విశ్వవేదః । స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః । స్వస్తి నో బృహస్పతిర్దధాతు

మహిమ గల ఇంద్రుడుమనకు క్షేమమును ప్రసాదించుగాక, సర్వజ్ఞుడైనపూషణుడుమనకు క్షేమమును ప్రసాదించుగాక, : రక్షణ వలయుడైన తార్క్షయుడు క్షేమమును ప్రసాదించు గాక .​​​​​ మాపై బృహస్పతి మాకు క్షేమాన్ని ప్రసాదించుగాక , : ఓం , శాంతి , శాంతి , శాంతి 


ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి! త్వమేవ కేవలం కర్తాఽసి ! త్వమేవ కేవలం ధర్తాఽసి! త్వమేవ కేవలం హర్తాఽసి! త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి! త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్!1

ఋతం వచ్మి సత్యం వచ్మి 2 


అవ త్వం మామ్, అవ వక్తారమ్, అవ శ్రోతారమ్, అవ దాతారమ్, అవ ధాతారమ్, 

అవానూచానమవ శిష్యమ్, అవ పశ్చాత్తాత్, అవ పురస్తాత్, అవోత్తరాత్తాత్, అవ దక్షిణాత్తాత్, 

అవ చోర్ధ్వాత్తాత్, అవాధరాత్తాత్, సర్వతో మాం పాహి పాహి సమంతాత్! 3


త్వం వాఙ్మయస్త్వం చిన్మయః! త్వమానందమయస్త్వం బ్రహ్మమయః!

త్వం సచ్చిదానందాఽద్వితీయోఽసి! త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి! త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి! 4


సర్వం జగదిదం త్వత్తో జాయతే! సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! సర్వం జగదిదం త్వయి లయమేష్యతి! సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి! త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః త్వం చత్వారి వాక్పదాని! 5


త్వం గుణత్రయాతీతః! త్వం దేహత్రయాతీతః! త్వం కాలత్రయాతీతః! త్వం అవస్థాత్రయాతీతః!

త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్! త్వం శక్తిత్రయాత్మకః! త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్!

త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్! 6


గణాదిం పూర్వముచ్చార్య! వర్ణాదీం స్తదనంతరమ్! అనుస్వారః పరతరః! అర్ధేందులసితమ్!

తారేణ ఋద్ధమ్! ఏతత్తవ మనుస్వరూపమ్! గకారః పూర్వరూపమ్ అకారో మధ్యమరూపమ్ అనుస్వారశ్చాంత్యరూపమ్! బిందురుత్తరరూపమ్! నాదః సంధానమ్! సంహితా సంధిః!

సైషా గణేశవిద్యా! గణక ఋషిః! నిచృద్గాయత్రీచ్ఛందః! శ్రీ మహాగణపతిర్దేవతా ఓం గం గణపతయే నమః!7


ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి

తన్నో దంతిః ప్రచోదయాత్ 8


ఏకదంతం చతుర్ హస్తం పాశమంకుశధారిణమ్

రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్!

రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ 

రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్!

భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ 

ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్!

ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః 9


నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేఽస్తు

లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః 10


ఏతదథర్వశీర్షం యోఽధీతే స బ్రహ్మభూయాయ కల్పతే

స సర్వవిఘ్నైర్న బాధ్యతే స సర్వతః సుఖమేధతే

స పంచమహాపాపాత్ ప్రముచ్యతే !


సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి

ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి 

సాయం ప్రాతః ప్రయుంజానోఽపాపో భవతి 

సర్వత్రాధీయానోపవిఘ్నో భవతి! ధర్మార్థకామమోక్షం చ విందతి


ఇదమథర్వశీర్షమశిష్యాయ న దేయమ్ 

యో యది మోహాద్ దాస్యతి స పాపీయాన్ భవతి 

సహస్రావర్తనాద్యం యం కామమధీతే తం తమనేన సాధయేత్ 11


అనేన గణపతిమభిషించతి స వాగ్మీ భవతి చతుర్థ్యామనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి ఇత్యథర్వణవాక్యమ్ బ్రహ్మాద్యాచరణం విద్యాన్నబిభేతి కదాచనేతి 12


యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి 

యో లాజైర్యజతి స యశోవాన్ భవతి స మేధావాన్ భవతి 

యో మోదకసహస్రేణ యజతి స వాంఛితఫలమవాప్నోతి

యః సాజ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వం లభతే 13


అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి 

సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసన్నిధౌ వా జప్త్వా స సిద్ధమంత్రో భవతి 

మహావిఘ్నాత్ ప్రముచ్యతే మహాదోషాత్ ప్రముచ్యతే మహాపాపాత్ ప్రముచ్యతే 

మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి 


య ఏవం వేద ఇత్యుపనిషత్ 14


ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్ఠువాగ్ం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు!


ఓం శాంతిః శాంతిః శాంతిః

ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి! త్వమేవ కేవలం కర్తాఽసి ! త్వమేవ కేవలం ధర్తాఽసి! త్వమేవ కేవలం హర్తాఽసి! త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి! త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్!1

ఋతం వచ్మి సత్యం వచ్మి 2 


హరిః ఓం! గం ! గణపతి బీజం.గణపతి రూపం కూడా ఎల్లాగంటే సంస్కృతంలోని "గ " చూడండి పరిశీలించండి రెండు నిలువు గీతలు ఉంటాయి. ఒక గీత క్రింద వంపు తిరుగుతుంది j ఇల్లాగ అది తొండము. l ప్రక్కగీత దంతం ఇప్పుడు రెండు గీతలు గణపతి యొక్క తొండము,దంతం కాబట్టి గకారమే గణపతి.

నమస్తే గణపతయే... ఓ గణములకు పతియైన వాడా! - నమః తే...నీకు నమస్కారం. (నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను.)

త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి

త్వమేవ - నీవు మాత్రమే ప్రత్యక్షంగా, "తత్" .. అది ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది అంత్యములు లేనిదో, అనిర్వచనీయమో, భావానికీ శబ్దానికీ అతీతమైనదో "అది (అట్టి పరమాత్మ )" నీవు (త్వం) అయి ఉన్నావు (అసి).

త్వమేవ కేవలం కర్తాసి... అన్నింటికీ నీవే కర్తవు,

త్వమేవ కేవలం ధర్తాఽసి! 

 నీవే ధరించే వానివి (ధర్త)

త్వమేవ కేవలం హర్తాఽసి! నీవే లయం చేసుకునే వానివి (హర్త).

త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి

నీవు మాత్రమే సర్వమూ, బ్రహ్మమూ అయి ఉన్నావు కదా (ఖల్విదం)

ఋతం వచ్మి సత్యం వచ్మి

ఋతం-- ఇతః పూర్వం ఋజువు చేయబడిన వాడివి నీవే, సత్యానివీ నీవే. అవ అంటే రక్షించు, కాపాడు ఋతం - సత్యం రెండింటికి తేడా ఏమిటంటే మన అనుభవంతో చెప్పేది సత్యం.మన అనుభవంతో కాకుండా పెద్దలు చెప్పిన విషయం ఋతం. మామ్ -- నన్ను, వక్తారం ... ప్రవచించే వక్తను గురువును , శ్రోతారమ్... జాగ్రత్తగా వినే శ్రోతలను శిష్యులను , దాతారమ్ ... దానం చేసే దాతలను, ధాతారమ్.... బ్రహ్మాదులను, అనూచానంగా(తరతరాలు వస్తున్న ఆచారం) దానిని కాపాడు. అవ శిష్యమ్... శిష్యులను కాపాడు. అర్హత ప్రాతిపదికగా విజ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. ఆ గురువును భక్తి పూర్వకంగా భావిస్తూ, అతనిచ్చిన అభిగమ్యమైన (పొందదగిన) విజ్ఞానాన్ని పవిత్రంగా, జిజ్ఞాసతో, అభిలాషతో అధ్యయనం చేసే వాడు శిష్యుడు. ఇరువురికీ సామాన్యంగా ఉండవలసిన లక్షణం "అర్హత".

అవ త్వం మామ్, అవ వక్తారమ్, అవ శ్రోతారమ్, అవ దాతారమ్, అవ ధాతారమ్, 

అవానూచానమవ శిష్యమ్, అవ పశ్చాత్తాత్, అవ పురస్తాత్, అవోత్తరాత్తాత్, అవ దక్షిణాత్తాత్, 

అవ చోర్ధ్వాత్తాత్, అవాధరాత్తాత్, సర్వతో మాం పాహి పాహి సమంతాత్! 3


జగత్తును ఆవరించిన ఈ ఆరు దిక్కులను (పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ, అధో దిశలు) కాపాడు. సర్వతో మాం పాహి.... ఈ ఆరు దిక్కులచే చక్కగా చుట్టబడిన (సమంతాత్) సర్వమును కాపాడు.

త్వం వాఙ్మయస్త్వం చిన్మయః! త్వమానందమయస్త్వం బ్రహ్మమయః!

త్వం సచ్చిదానందాఽద్వితీయోఽసి! త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి! త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి! 4

త్వం వాజ్ఞ్మయః .. నీవే సకల వాక్సంబంధిత శక్తివి, నీవే (చిత్ మయః) జ్ఞాన మూర్తివి, నీవే ఆనంద మయునివి, నీవే పరబ్రహ్మము. నీవే సత్ చిత్ ఆనందమవు. శాశ్వతమైన వానివి నీవే, నీకన్న రెండవది లేదు. ప్రత్యక్షంగా పర బ్రహ్మమవు నీవే. నీవే జ్ఞానానివి, నీవే విజ్ఞానానివి. (పంచేంద్రియాలచే తెలుసుకునేది లేదా గ్రహించేది జ్ఞానం కాగా వీటికి అతీతంగా పొదగలిగినది విజ్ఞానం. భౌతికంగా విజ్ఞానం అంటే... ఆచరించి దాని మంచి చెడ్డలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది విజ్ఞానం.)

                    సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ 


               🙏 గణపతి ఉపనిషత్తు 🙏

                     రెండవ భాగం 

సర్వం జగదిదం త్వత్తో జాయతే! సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! సర్వం జగదిదం త్వయి లయమేష్యతి! సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి! త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః త్వం చత్వారి వాక్పదాని! 5

సర్వం జగదిదం త్వత్తో జాయతే! 

ఈ సకల చరాచర జగత్తు నీనుండే ఉద్భవించినది.

సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! 

 ఈ జగత్తంతా నీలోనే ఉంటుంది. 

సర్వం జగదిదం త్వయి లయమేష్యతి

ఈ జగత్తు మొత్తంగా లయమయ్యేదీ నీలోనే. 

సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి

ఈ జగత్తంతా నీవైపే ప్రవహిస్తుంది (త్వయి ప్రత్యేతి) నిన్నే పొందుతుంది. 

త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః

నీవే భూమివి, నీరు, వాయువు, అగ్నివి, ఆకాశానివి.

త్వం చత్వారి వాక్పదాని

 పరా పశ్యంతి మధ్యమా వైఖరి గా పేర్కొనబడే వాక్కు యొక్క నాలుగు పదాలు నీవే.

త్వం గుణత్రయాతీతః! త్వం దేహత్రయాతీతః! త్వం కాలత్రయాతీతః! త్వం అవస్థాత్రయాతీతః!

త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్! త్వం శక్తిత్రయాత్మకః! త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్!

త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్! 6


త్రిగుణాలకు (సత్వ రజస్ తమో) నీవు అతీతునివి, నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా పేర్కొనబడే దేహత్రయానికీ అతీతునివి. నీవు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతునివి. నీవే కుండలినీ శక్తిగా నిత్యమూ మూలాధార చక్రంలో స్థితమైన (ఉండే) శక్తివి. నీవే మూడు శక్తులకు (ఇఛ్ఛా జ్ఞాన క్రియా శక్తులు) అతీతమైన వానివి.

నిత్యం యోగులచే ధ్యానం చేయబడే వానివి నీవే. త్రిమూర్తులు, ఇంద్రాగ్ని వాయు సూర్య చంద్రాదుల రూపంలో భాసిల్లే వానివి నీవే. ముల్లోకములలో (భూః, భువః సువః) నీవే, ముల్లోకములూ నీవే అయిన వాడివి.


గణాదిం పూర్వముచ్చార్య! వర్ణాదీం స్తదనంతరమ్! అనుస్వారః పరతరః! అర్ధేందులసితమ్!

తారేణ ఋద్ధమ్! ఏతత్తవ మనుస్వరూపమ్! గకారః పూర్వరూపమ్ అకారో మధ్యమరూపమ్ అనుస్వారశ్చాంత్యరూపమ్! బిందురుత్తరరూపమ్! నాదః సంధానమ్! సంహితా సంధిః!

సైషా గణేశవిద్యా! గణక ఋషిః! నిచృద్గాయత్రీచ్ఛందః! శ్రీ మహాగణపతిర్దేవతా ఓం గం గణపతయే నమః!7

"గం" అనేది గణపతి బీజం. దానిని ఉఛ్చరించే పద్దతి చెపుతున్నారిక్కడ. "గ్" ను ముందుగా ఉఛ్చరించాలి అటు పిమ్మట వర్ణములకు ఆది అయిన "అ"కారాన్ని ఉఛ్చరించాలి. తదుపరి అనుస్వరాన్ని ఉఛ్చరించాలి. ఇది "గం" అవుతుంది. అదే గణపతి బీజం. (దీని సాధనచేత ఆ స్వామి గోచరమౌతాడు).

అర్ధేందులసితం... అక్షరములు ధ్వనులకు సంకేతాలు. ధ్వని నాద భరితము. బిందువు తదుపరి వచ్చే నాదాన్ని "అర్ధేందు" అనే సంకేతంతో సూచించారు. ఆ నాదంతో ప్రకాశించే వాడు.

తారేణ రుద్ధం... తార అనగా తరింప చేసే మంత్రము దానినే ఓంకారము లేదా ప్రణవము అంటున్నాము. రుద్ధము పరివేష్టితుడు. ప్రణవము చేత పరివేష్టితుడు లేదా ప్రణవ స్వరూపుడు.

ఇది అతని యొక్క మంత్ర రూపము.

(ఇక పోతే సామాన్యార్థంలో చెప్పుకుంటే....శివ సంబంధమైన వాడు గణపతి కాబట్టి అతడు అర్ధేందుచే (అష్టమినాటి చంద్రుని) ప్రకాశించే వాడు. తారకలచే (నక్షత్రములు) పరివేష్ఠితుడు, అని చెప్పు కోవచ్చు... కాని ఇది సంప్రదాయము కాదు.)

“గం” బీజం సాధన చేసే సమయంలో... "గ్" కారం పూర్వ రూపం, "అ" కారం మధ్యమ రూపం, అనుస్వరం అంత్య రూపం అవుతుంది కాగా బిందువు (౦) ఉత్తర రూపంగా ఉంటుంది. దీనిని పలికి నప్పుడు వచ్చే నాదమే సంధానము. దీనితో అత్యంత సాన్నిహిత్యం కలిగినది సంధి.

ఇది మొత్తంగా (సైషా.. స ఏషా...) గణేశుని విద్య. దీనికి ఋషి గణక ఋషి. అనగా దీనిని దర్శించి ప్రవచించిన వాడు, గణకుడు అనే ఋషి. దీని ఛందస్సు నిచృద్ ఛందం. అధిష్టాన దేవత గణపతి.

“ఓం గణపతయే నమః ఏక దంతాయ విద్మహే, వక్ర తుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్”!

ఏకదంతం చతుర్ హస్తం పాశమంకుశధారిణమ్

రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్!

రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ 

రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్!

భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ 

ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్!

ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః 9

ఏకదంతుడు, నాలుగు చేతులలో.... పాశము, అంకుశము, దంతము, (ఇది ఏనుగు దంతం, త్యాగానికి సంబంధించినది. మహాభారత రచనా కాలంలో తన దంతాన్ని విరిచి వ్రాసాడు) అభయ ముద్రను ధరించినవాడు, ఎలుక వాహనమును ధ్వజముగా కలిగిన వాడు, పెద్దదైన పొట్టను కలిగిన వాడు, చాటల లాంటి చెవులను కలిగిన వాడు, రక్త వర్ణ వస్త్రములను ధరించిన వాడు, ఎర్రనైన సుగంధములను పులుముకున్న శరీరము కలిగిన వాడు, ఎర్రనైన పుష్పములచే చక్కగా పూజిlతుడు, భక్త కోటిపై అమితమైన అనుకంప (దయ) కలిగిన వాడు, భగవంతుడైన వాడు, ఈ జగత్తుకు కారణమైన వాడు, అచ్యుతుడు (జారిపోని వాడు), సృష్టి ఆదిలోనే ఆవిర్భూతుడు, ప్రకృతి పురుషులకు కూడా పరమమైన వాడు, ఎవరైతే ఉన్నాడో (గణపతి) వానిని నిత్యం ఎవరైతే ధ్యానిస్తారో వారు యోగులలో శ్రేష్టునిగా చెప్పబడతారు.

హే వ్రాత పతి (సమూహమునకు భర్త) నీకు నమస్సులు. గణములకు పతియైన నీకు నమస్సులు, ప్రమథ గణములకు పతివైన నీకు నమస్సులు, లంబోదరుని వైన నీకు నమస్సులు, ఏకదంతుని వైన నీకు నమస్సులు (ఏక దంతము త్యాగానికి చిహ్నము) విఘ్నములను నశింప చేసే నీకు నమస్సులు, శివ సుత నీకు నమస్సులు (శివము అంటే మహదానందము.. దానికి పుత్రుడు అంటే ఆనంద మూర్తియే... పోతన గారు కూడా మహానందాంగనా డింభకుడు అని అంటారు. మహా ఆనందము అనే అంగనకు డింభకుడు) వరద మూర్తయే... అపరిమితమైన దయా కారుణ్యాలకు ఆకృతి వస్తే ఎలా ఉంటుంది అంటే అది గణపతి వలె ఉంటుంది అనేందుకు వరద మూర్తయే అన్నారిక్కడ. ఆ వరద మూర్తికి నమస్సులు.

ఇక చివరగా ఫల శ్రుతి....

ఈ అథర్వ శీర్షంను ఎవరైతే శ్రద్ధతో, చక్కగా అధ్యయనం చేస్తారో, వారు (స) బ్రహ్మ స్థానాన్ని పొందుతారు. వారు సర్వ విఘ్నములనుండి విముక్తుడవుతాడు, వారు సర్వత్రా సుఖములను పొందుతారు, వానికి పంచ మహా పాతకముల నుండి విముక్తి కలుగుతుంది.

సాయం సమయంలో దీనిని అనుష్ఠించడం వల్ల పగలు చేసిన పాపములు తొలగిపోతాయి. ప్రాతఃకాలంలో అనుష్ఠించినట్లయితే రాత్రి చేసిన పాపములు తొలిగిపోతాయి. సాయం ప్రాతస్సులలో అనుష్ఠించిన వానికి పాపములు అంటుకొనవు. సర్వత్రా ఏ కార్యములలో నైనా ఏ విధమైన విఘ్నములు కూడా అతనికి కలగవు. అతడు ధర్మార్ధ కామ మోక్షములను పొందగలడు. ఇది అధర్వ శీర్షం.

దీనిని శిష్యులు కాని వారికి ఇవ్వకూడదు. ఇక్కడ శిష్యుడు అంటే నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును సభక్తికంగా చేరిన వాడు. అశ్రద్ధ లేనివాడు, ఉపాసన యందు అనురక్తి కలిగిన వాడు. విషయంపైన భక్తిభావన కలిగిన వాడు. అలాంటి లక్షణాలు లేని వానికి ఈ విద్యను ఇవ్వగూడదని చెపుతుంది, ఈ సూక్తం. ఏ ప్రలోభాలకైనా లోనై అలా అనర్హులకు ఈ సూక్తాన్ని ఇచ్చినట్లయితే అతడు పాప కూపంలొ పడిపోతాడని హెచ్చరిస్తుంది.

ఏ ఏ కోరికలతో నైనా సహస్రావర్తనంగా దీనిని అనుష్ఠించినట్లయితే దీని చేత (అనేన) ఆ కోరికలు సాధింపబడతాయి. ఈ ఉపనిషత్ చేత గణపతిని అభిషేకించినట్లయితే అతడు చక్కని వాక్పటుత్వం కలిగిన వాడవుతాడు.

భాద్రపద శుద్ధ చవితినాడు భోజనం చేయకుండా (చతుర్థ్యామనశ్నన్… అన అశనము) ఎవరైతే జపిస్తారో, అతడు విద్వాంసుడౌతాడు. ఇది అథర్వణ వాక్యము.

దీనిని బ్రహ్మ విద్యగా ఆచరించడం వల్ల కొద్దిగా కూడా భయం అనేది ఉండదు (నభిభేతి)

గణపతిని ... ఎవరైతే దూర్వారములచే అర్చిస్తారో అతడు అపర కుబేరుడౌతాడు. పేలాలతో ఎవరైతే అర్చిస్తారో అతడు యశస్కుడు అవుతాడు. మేధోవంతుడౌతాడు. మోదక సహస్రముచే ఎవరైతే అర్చిస్తారో వారికి వాంఛించిన ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఆజ్యము (నేయి) సమిధలతో హవనం చేస్తారో వారికి ముమ్మాటికీ సర్వమూ లభిస్తుంది.

ఎనిమిది మంది వేద విదులైన బ్రాహ్మణులను చక్కగా సమకూర్చుకొని గణపతి నెవరైతే అర్చిస్తారో వారు సూర్య వర్చస్సును పొందుతారు.

సూర్య గ్రహణ కాలంలో, మహానది (జీవనది) వద్ద ప్రతిమ సాన్నిధ్యంలో జపించిన వారికి మంత్ర సిద్ధి కలుగుతుంది. వారికి మహా విఘ్నములు, మహా దోషములు, మహా పాపములు తొలగిపోతాయి. అతడు అన్నీ తెలిసిన వాడవుతాడు... ఇది తెలుసుకోండి అంటుంది.. ఈ గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు.

ఓం శాంతిః శాంతిః శాంతిః

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*


*శ్రీ స్వామివారి బోధ..ఊరట చెందిన దంపతులు..*


*(యాభై ఐదవ రోజు)*


సత్యనారాయణమ్మ గారిని కనిగిరి లో వదిలిపెట్టి వచ్చిన తరువాత శ్రీ స్వామివారిని శ్రీధరరావు దంపతులు కలిసారనీ..మాట్లాడదాము రమ్మని ఆ దంపతులను ఆశ్రమం లోకి తీసుకువెళ్లారు శ్రీ స్వామివారు..శ్రీ స్వామివారి కెదురుగా కూర్చున్నారు ప్రభావతి శ్రీధరరావు గార్లు..


"అమ్మా..ఏదో దుష్ట శక్తి మీ బంధువు రూపంలో వచ్చి మీ అత్తగారి మనసంతా విరిచేసి..ఆవిడను మీకు కాకుండా చేసిందని మీరు భావిస్తున్నారు కదా..ఎంత వెఱ్ఱి తల్లివమ్మా!..ఆ వచ్చినావిడ మీ పాలిట దుష్ట శక్తి కాదు..మీకు అయాచితంగా.. పరోక్షంగా మేలు చేయడానికి వచ్చిన దేవత అని భావించండి..శ్రీధరరావు గారూ నేను మొదటిసారి మొగలిచెర్ల లోని మీ ఇంటికి వచ్చిన రోజే మీతో ఒక మాట చెప్పాను గుర్తుందా..మీ అమ్మగారికి మృత్యువు పొంచివుంది..ఆమెను రామనామం విడవకుండా చేసుకోమని చెప్పండి అన్నాను..నేను కూడా ఆమెతో మీ ఇంటిలో ఉన్న కాలంలో చెప్పి వున్నాను..ఆమె బాధ్యతను మీనుంచి తొలగించడానికే దైవం ఆ "బంధువు" ను ఇక్కడికి పంపాడు..ఈ అవసాన కాలంలో మీ తల్లిగారు పడే బాధను మీరు చూడలేరు..పడలేరు..ఎక్కువ సమయం లేదామెకు..కొద్దిరోజుల్లోనే వైద్యులు కూడా ఇదే నిర్ధారిస్తారు..


"ఇక మీరిద్దరూ ఆమెకు చేసిన సేవ ఫలితం ఎక్కడికీ పోదు..మిమ్మల్ని ఇప్పుడు విమర్శించిన వ్యక్తులందరూ..మళ్లీ మిమ్మల్ని కీర్తించే రోజు వస్తుంది..ఇక్కడి నుంచి మీ బంధాలన్నీ ఒకటొకటిగా విడిపోతూ ఉంటాయి..ఇది మీకు మరో జన్మ గా అనుకోండి!..మీకు దైవం కొన్ని బృహత్తర బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడు..అవి మీరు నెరవేర్చాలి..అందుకు ముందుగా ఈ ప్రతిబంధకాలు తొలగి పోవాలి..ఆ ఏర్పాట్లలో భాగమే ఆ బంధువు మీ వద్దకు రావడం..ఒక కష్టం..ఒక సుఖం..ఒక దుఃఖం..ఒక సంతోషం..వీటన్నింటినీ తట్టుకొని ఒక స్థిరచిత్తం మీకు కలగాలి..వీటన్నిటి కి ప్రేరణే ఈనాడు ఆ భగవంతుడు చేసిన ఏర్పాటు.."


"మరో ముఖ్య విషయం..త్వరలో నా పరంగా మీమీద పెద్ద భారం పడబోతోంది..అందుకూ మీరు సన్నద్ధులు కావాల్సిన అవసరం ఉంది..ఇక మనసు గట్టి చేసుకోండి..నిశ్చింతగా వుండండి.. ఏ బాధా.. ఏ సంతోషం..మీ మార్గం నుంచి వేరు చేయలేవు..ఈ ఆశ్రమం కూడా క్షేత్రంగా మారుతుంది..అప్పుడు అందరూ మీ గురించి ముచ్చటించుకుంటారు.." 


"అమ్మా..నువ్వు రచయిత్రివి..నా చరిత్ర వ్రాసే రోజులు వస్తాయి..ఇక ఎక్కువ ఆలోచించకండి..శుభం జరుగుతుంది.." అన్నారు..


శ్రీ స్వామివారి బోధ ఆ దంపతులకు ఎనలేని మానసిక స్తైర్యాన్ని ఇచ్చింది..మన వంతు కర్తవ్యం మనం చక్కగా నెరవేర్చాలి..ఫలితాన్ని ఆ దైవానికి వదిలేద్దాము..అనే భావనలోకి వచ్చేసారు..ఆరోజు నుంచి వారి జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది..పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం వైపు వారి జీవనయానం సాగడానికి తోడ్పడింది..శ్రీ స్వామివారి సేవ అనేది తమ జీవితంలో ముఖ్యమైన విషయంగా మారిపోయింది..


ఎందరో సాధకులు..ముముక్షువులు..పండితులు..శ్రీ స్వామివారిని దర్శించడానికి మొగలిచెర్ల రా సాగారు..వారిని ఆదరించడం..సత్సంగ గోష్ఠులు..ఇలా నిత్యం ఒక దైవిక వాతావరణం ఆ దంపతుల చుట్టూ ఏర్పడిపోయింది..వారూ అందులో ఇమిడిపోయారు.


ప్రభావతి గారిని తేలు కుట్టటం..అహంకార నిర్మూలనం..రేపు.. 

*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*


*తేలు కుట్టటం..అహంకార నిర్మూలనం..*


*(యాభై ఆరవ రోజు)*


శ్రీ స్వామివారి పేరు, ప్రఖ్యాతులు చుట్టుప్రక్కల గ్రామాల్లో వ్యాపించసాగాయి..శ్రీధరరావు గారింటికి అనేకమంది పండితులూ..ముముక్షువులూ.. సాధకులు రావడం..శ్రీ స్వామివారిని కలవాలని కోరడం..శ్రీ స్వామివారి అవకాశాన్ని బట్టి వారితో మాట్లాడటం..జరుగుతోంది..


దాదాపుగా అందరి నోటా ఒకటే మాట.."ఈయన సాధారణ మానవుడు కాదు..సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడి ప్రతి రూపమే ఈ మొగలిచెర్ల గ్రామ సరిహద్దుల్లో ఆశ్రమం కట్టుకొని సాధకుడి గా మారి నడయాడుతున్నాడు..మీ దంపతులు చేసుకున్న పుణ్యమే ఇది!.." అని..


శ్రీ విక్రాల శేషాచార్యులు గారు, వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ గారు (వీరిద్దరూ సంస్కృతాంధ్రములలో మహా పండితులు..శతావధానం చేసిన వారు..శ్రీ వైష్ణవులు..ఆదిదంపతులే కలసి వచ్చినట్లుగా భావిస్తారు వారిని చూసిన వారు..వీరి గురించి ఈ చరిత్ర మొదట్లో ప్రస్తావించడం జరిగింది..) శ్రీ స్వామివారిని చూడటానికి మొగలిచెర్ల వచ్చారు..ఆరోజు శ్రీ స్వామివారు కూడా ఈ దంపతుల కోసమే తీరుబడిగా ఉన్నట్లు..వారితో ఎంతో సేపు చర్చ చేశారు..దాదాపు రెండు గంటలపాటు ఆ దంపతుల తో శ్రీ స్వామివారు ఓపికగా మాట్లాడారు..


తిరిగి వచ్చేటప్పుడు గూడు బండిలో ఆ దంపతులిద్దరూ.."నాయనా శ్రీధరరావు, అమ్మా ప్రభావతీ..మీ పూర్వపుణ్యం వలన ఆ మహనీయుడు మీ బిడ్డగా సేవలందుకొంటున్నాడు.. ఆయనది "పరా" విద్య!..మాది కేవలం పాండిత్యం..జన్మజన్మల సంస్కారం, తపస్సు, సాధన..ఈ మూడింటిముందు మా పాండిత్యం కేవలం గడ్డిపోచ వంటిది..ఆ మహానుభావుడి ని పరీక్షించడానికి మాబోటి వాళ్ళము వెయ్యిమందిమి వచ్చినా చాలము..అది ఆ తల్లి లలితా దేవి కరుణ తప్ప మరోటి కాదు..ఆ జ్యోతి ముందు మా విద్య సూర్యుడి ముందు చిన్న ప్రమిద లో వెలిగే దీపం లాంటిది..మీరు అదృష్టవంతులు!.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు వాళ్ళను మర్యాదచేసి..వారి పాదాలకు నమస్కరించి వాళ్ళను సాగనంపారు..ఆ ప్రక్కరోజే..ప్రభావతి గారి నాన్న గారు కూడా కావలి నుంచి కొంతమంది పండితులను వెంటబెట్టుకొని మొగలిచెర్ల వచ్చి, శ్రీ స్వామివారిని చూసి తిరిగి వెళుతూ..ఆ పండితులందరూ ఈ దంపతుల సేవను పొగిడి వెళ్లారు..


ఈ వరుస ఘటనలతో..ప్రభావతి గారిలో ఒక మూల చిన్న అహంకారం మొలకెత్తింది..తాము ఒక మహనీయుడికి సేవ చేసినందునే ఈ పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి..తామిద్దరం కూడా దైవాంశ సంభూతులమేమో?.. తాము అందరికన్నా అధికులము అనే భావన మెల్లిగా ఏర్పడసాగింది.. మరీ ముఖ్యంగా..పండితులందరూ ఏక కంఠంతో మెచ్చుకోవడం ఆవిడకు ఆనందాన్ని..అహాన్నీ పెంచాయి..


ఆరోజు మధ్యాహ్నం శ్రీధరరావు గారి స్నానానికి నీళ్లు పెట్టి..టవల్ తీసుకొని స్నానాలగదిలో పెట్టబోతున్నారు..అంతలో ఆ టవల్ లో దాక్కొని ఉన్న ఒక తేలు.. అందులోంచి జారి ప్రభావతి గారి కాలిమీద పడి.. ఒక్కసారిగా కుట్టింది..వెఱ్ఱి కేక పెట్టారు ప్రభావతి గారు..ఆ తేలు కూడా ఒక పట్టాన వదిలిపెట్టలేదు..ఈలోపల శ్రీధరరావు గారు వచ్చి తేలును చెప్పుతో కొట్టి చంపేశారు..కానీ అప్పటికే ప్రభావతి గారికి తేలు విషం మోకాలు పై భాగం దాకా ప్రాకిపోయింది..ఆవిడ విపరీతంగా బాధ పడుతున్నారు..సాయంత్రానికి కూడా బాధ తగ్గలేదు..


శ్రీ స్వామివారికి చెపితే ఏదైనా మంత్రం వేస్తారని.. అక్కడికి తీసుకుపొమ్మని గ్రామస్థులు శ్రీధరరావు గారికి చెప్పారు..వద్దని..ఓర్చుకుంటే తెల్లవారేలోపల తగ్గుతుందని శ్రీధరరావు గారు నచ్చచెప్పి వాళ్ళను పంపించివేశారు..


కానీ..శ్రీధరరావు దంపతులను తన తల్లిదండ్రుల వలె భావించే ఒక మనిషి మాత్రం వుండబట్టలేక..సైకిల్ వేసుకొని శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళిపోయాడు..


అక్కడ శ్రీ స్వామివారు ఆశ్రమం బైట తిరుగుతూ వున్నారు..ఈ మనిషి సైకిల్ దిగి, శ్రీ స్వామివారికి నమస్కరించి..ప్రభావతి గారికి తేలు కుట్టిన విషయమూ..ఆవిడ పడుతున్న బాధనూ వివరించాడు..


శ్రీ స్వామివారి సమాధానం..అహం తొలగడం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)

సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

మహా కుంభమేళా 2025*_

 _*మహా కుంభమేళా 2025*_ 

🙏🥀🌹🌻🪷🪷🥀🌻🪷🌹🙏


🥀 హిందూ సనాతన ధర్మంలో మహా కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీని కంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభ మేళా మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో నిర్వహిస్తారు. 


🥀 ఇంతకుముందు 2013 సంవత్సరంలో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు 13 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు మహా కుంభమేళా నిర్వహించనున్నారు. 


🥀 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. 


👉 ఈ సందర్భంగా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు!?.. దీని ప్రాముఖ్యతలేంటి.. కుంభమేళా చరిత్ర, రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...


🥀 కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది♪. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది♪. పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు♪. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు♪. అందుకు చక్రవర్తి హర్షవర్థన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు♪. వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు♪. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు♪. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు♪.


🥀 హిందూ పురాణాల ప్రకారం, దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు♪. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం, అమృతం వంటివి బయటికొచ్చాయి♪. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది♪. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి•. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు♪. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది♪.


✳️ *అమృతం కోసం జరిగిన పోరాటం* 


🥀 చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్య దేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు♪. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు♪. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది♪. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది♪. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు•. 


🥀 మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు•. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం♪. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు♪. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది•. ఇక్కడ యమునా, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి♪.


🥀 వేద జ్యోతిష్యం ప్రకారం, బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు•. పన్నెండు రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పపడుతుంది♪. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది♪. అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు♪. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్‌లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి•. 


🥀 ఇదిలా ఉండగా.. హిందూ గ్రంథాల ప్రకారం, భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒకరోజుతో సమానం♪. దీని ప్రకారం, దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది♪. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది♪. దేవతలకు 12 సంవత్సరాలు అయితే.. భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం♪. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

❀┉┅━❀🕉️❀┉┅━❀

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 

🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*

🚩 *హిందువునని గర్వించు*

🚩 *హిందువుగా జీవించు*


*సేకరణ:* ఆధ్యాత్మిక భక్తిప్రపంచం - ఈ సమూహంలో చేరడానికి *జైశ్రీరామ్* అని 7013672193 కి WhatsApp చేయండి.

🙏🥀🌹🌻🪷🪷🥀🌻🪷🌹🙏

నష్టమే కానీ లాభం లేదు

 తా.సంతృప్తి లేని బ్రాహ్మణుడు సంతృప్తి కలిగిన రాజు సిగ్గుపడే మంత్రి సిగ్గు లేనట్టి ఇల్లాలు వీరి ద్వారా నష్టమే కానీ లాభం లేదు

శ్రీ అట్టుకల్ భగవతి ఆలయం

 🕉 మన గుడి : నెం 977


⚜ కేరళ  : త్రివేండ్రం


⚜ శ్రీ అట్టుకల్ భగవతి ఆలయం



💠 కేరళలోని పురాతన దేవాలయాలలో అట్టుకల్ భగవతి ఆలయం ఒకటి. 

ఇది త్రివేండ్రంలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి చాలా సమీపంలో ఉంది. 


💠 రాక్షస రాజు దారుకుడిని చంపిన మహాకాళి రూపమైన భద్రకాళి, శివుని మూడవ కన్ను నుండి జన్మించినట్లు నమ్ముతారు. 

అందుకే అమ్మవారికి కన్నకి అని కూడా పిలుస్తారు.


💠 దేవి భక్తులలో ఎక్కువ భాగం మహిళలే కాబట్టి దీనిని మహిళల శబరిమల అని పిలుస్తారు. 


💠 శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించే యాత్రికులందరూ అట్టుకాలమ్మగా పిలవబడే పరమ తల్లి ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీ. 


💠 కలియుగంలో చెడును నిర్మూలించడానికి మరియు ప్రపంచంలోని మంచిని రక్షించడానికి దేవి అవతారం ఎత్తింది.


🔆 స్థలపురాణం


💠 ఆలయం  ప్రాంతీయ పురాణం సిలప్పటికారంలోని కన్నగి పురాణం ఆధారంగా రూపొందించబడింది .

ఇతిహాసం ప్రకారం, కన్నగి అనే స్త్రీ ఒక సంపన్న వ్యాపారి కుమారుడైన కోవలన్‌ను వివాహం చేసుకుంది. వారి వివాహానంతరం, కోవలన్ మాధవి అనే నర్తకిని కలుసుకున్నాడు మరియు తన భార్యను నిర్లక్ష్యం చేస్తూ తన సంపదనంతా ఆమె కోసం ఖర్చు చేశాడు. 

అతను డబ్బులేనివాడు అయినప్పుడు, అతను కన్నగి దగ్గరికి తిరిగి వచ్చాడు. అమ్మకానికి మిగిలి ఉన్న ఏకైక విలువైన వస్తువు కన్నగి జత చీలమండలు. దానిని అమ్మేందుకు ఆ దంపతులు మదురై రాజు వద్దకు వెళ్లారు .


💠 యాదృచ్ఛికంగా, కన్నగిని పోలిన మదురై రాణి నుండి ఒక చీలమండ దొంగిలించబడింది. కోవలన్ కన్నగి చీలమండలలో ఒకదానిని రాజుకు విక్రయించడానికి ప్రయత్నించినప్పుడు, అతను దొంగ అని పొరబడ్డాడు మరియు విచారణ లేకుండా రాజు యొక్క సైనికులు అతని తల నరికి చంపారు.


💠 కన్నగి ఆ వార్త విని కోపోద్రిక్తురాలై  రాజు వద్దకు పరుగెత్తింది. ఆమె చీలమండలలో ఒకదానిని విరిచింది, అందులో కెంపులు ఉన్నాయి, రాణికి ముత్యాలు ఉన్నాయి. 

ఆమె మదురై నగరాన్ని కాల్చివేయమని శపించింది మరియు ఆమె పవిత్రత కారణంగా శాపం నెరవేరిందని చెబుతారు. 

కన్నగికి నగర దేవతగా ప్రత్యక్షమై తర్వాత మోక్షం పొందిందని చెబుతారు.


💠 కొడంగల్లూర్ (కేరళలోని మరొక ప్రసిద్ధ దేవి పుణ్యక్షేత్రం)కి వెళ్లే మార్గంలో ఆమె ముందుగా కన్యాకుమారి వెళ్లి ఆటుకల్ వద్ద ఆగిందని చెబుతారు. 

ఆమె చిన్న ఆడపిల్ల రూపం ధరించింది. 


💠 ఒక వృద్ధుడు ఒక ప్రవాహం ఒడ్డున కూర్చున్నాడు, ఆ అమ్మాయి అతని వద్దకు వెళ్లి  నదిని దాటి తనకు సహాయం చేయమని అభ్యర్థించింది అతను ఆమె ముందు విస్మయంతో,భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి, నదిని దాటడానికి సహాయం చేసాడు మరియు ఆమెను సమీపంలోని తన ఇంటికి ఆహ్వానించాడు.


💠 కొంత సమయం తరువాత, ఆమె అదృశ్యమైంది. ఆమె అతని కలలో కనిపించింది మరియు అతని తోటలో మూడు బంగారు గీతలు కనిపించిన ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించమని కోరింది. 

వృద్ధుడు అలా చేసాడు, ఇది ప్రస్తుత అట్టుకల్ ఆలయం ఉన్న ప్రదేశంగా పరిగణించబడుతుంది.


💠 ఈటె, కత్తి, పుర్రె, డాలు మొదలైన ఆయుధాలను కలిగి ఉన్న నాలుగు చేతులతో దేవి గంభీరమైన చిహ్నాన్ని కూడా స్థాపించారు. 


💠 ఆలయ చుట్టుపక్కల మహిషాసురమర్దిని, కాళీ దేవి, రాజరాజేశ్వరి, శివునితో ఉన్న పార్వతి మరియు దేవత యొక్క వివిధ రూపాల్లో కొన్ని అందంగా చెక్కబడిన బొమ్మలు ఉన్నాయి. 

ఆలయం చుట్టూ  అనేక ఇతర దేవతలు , విష్ణువు పది అవతారాల పురాణ కథలు చిత్రీకరించబడ్డాయి.


🔆 పొంగళ మహోత్సవం


💠 అట్టుకల్ పొంగలా పండుగ అనేది భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయంలో జరుపుకునే 10 రోజుల మతపరమైన పండుగ.  


💠 ఇందులో 3 లక్షలకు పైగా మహిళలు పాల్గొంటారు.  ఒక మతపరమైన కార్యకలాపం కోసం మహిళలు అత్యధికంగా గుమిగూడే పండుగగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన పండుగ


💠 అట్టుకల్ భగవతి ఆలయంలో పొంగళ మహోత్సవం అత్యంత ముఖ్యమైన పండుగ.  ఇది వాస్తవానికి ఆలయానికి ఆనుకుని ఉన్న మైదానంలో మహిళలు వండిన అమ్మవారికి అన్నం పెట్టే నైవేద్యం.  

ఈ ఆచారం దక్షిణ కేరళ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ప్రబలంగా ఉన్నప్పటికీ, అట్టుకల్‌లో ఉన్నంత ప్రజాదరణ ఎక్కడా పొందలేదు. 


💠 స్త్రీలు బియ్యం మరియు పాలు, పంచదార, బియ్యాన్ని అలాగే నిప్పు కట్టెలను తెచ్చి, ఆలయ ఆవరణలో చిన్న పొయ్యిలను తయారు చేసి, అన్నం వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.  

తమ కోరిక తీరితే అమ్మవారికి పొంగళ నైవేద్యంగా పెట్టుకుంటామని శపథం చేస్తారు


💠 ఇది (ఫిబ్రవరి-మార్చి) కార్తీక నక్షత్రంలో ప్రారంభమయ్యే 10 రోజుల కార్యక్రమం.

 ఈ ఉత్సవాల్లో 9 రోజు ప్రపంచ ప్రసిద్ధి చెందిన అట్టుకల్ పొంగళ మహోత్సవం జరుగుతుంది. 


💠 అన్ని కులాలు, మతాల ప్రజల ఇళ్ల మైదానాలు, బహిరంగ మైదానాలు, రోడ్లు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల  సహా ఆలయం చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల వ్యాసార్థం మొత్తం ప్రాంతాన్ని నిర్వహించడం కోసం పవిత్ర స్థలంగా ఉపయోగిస్తారు. 


💠 తిరువనంతపురంలోని  శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరం


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -106*

 *తిరుమల సర్వస్వం -106*

ఇవే కాకుండా, విజయనగర సామ్రాజ్య చిహ్నమైన *"యాలి"* అనబడే కాల్పనిక జంతువు, కామధేనువు, పుష్పాకృతులు, హనుమంతుడు, జాంబవంతుడు, రామాయణ ఘట్టాలు మొదలైనవెన్నో చెక్కబడి ఉన్నాయి. ఇదివరకు నాణేలపరకామణి (నాణాల లెక్కింపు కేంద్రం) ఈ మంటపంలోనే ఉండేది. శ్రీవారికి చెందిన ప్రాచీన, నూతన ఉత్సవ వాహనాలను కూడా ఈ మంటపం లోనే భద్రపరిచేవారు. తరువాతి కాలంలో, కల్యాణోత్సవ వేడుకలు సంపంగి ప్రాకారంలోని *"శ్రీవేంకటరమణస్వామి కళ్యాణమంటపం"* లోనికి మార్చబడ్డాయి. అలాగే, వాహనాలను బయట నుండే వాహనమండపం లోనికి; నాణేలపరకామణిని తిరుపతి లోని తి.తి.దే. పరిపాలనాకార్యాలయ భవనానికి తరలించారు. తెలుగు పదకవితా పితామహుడు అన్నమాచార్యులచే శ్రీనివాసునికి కళ్యాణోత్సవం చేయబడ్డ ఈ పవిత్ర కళ్యాణమంటపం ప్రస్తుతం చాలా వరకు ఖాళీగానే ఉంటుంది. కొన్ని ఉత్సవ సందర్భాల్లో మాత్రం అర్చకులు, ఆలయ అధికారులు పూజాద్రవ్యాలను శిరస్సులపై నుంచుకొని, స్వామివారిసన్నిధి లోనికి ఈ కళ్యాణ మండపం నుండి బయలుదేరుతారు. శ్రీవారి దర్శనానంతరం ఈ మంటపంలో కూర్చుని కొద్దిగా విశ్రాంతి తీసుకుంటూ, ఉత్తరం వైపున ఉన్న ఆనందనిలయ గోపురాన్ని తనివితీరా దర్శించుకోవచ్చు. 

*నోట్లపరకామణి (నోట్ల లెక్కింపుకేంద్రం)* 

కళ్యాణమంటపానికి ఆనుకొని, ఆలయానికి పడమరదిక్కున ఉన్న విశాలమైన, పొడవాటి మంటపాన్ని ప్రస్తుతం *"నోట్లపరకామణి"* గా వ్యవహరిస్తారు. పూర్వం ఈ మంటపంలో కూడా కొన్ని వాహనాలను భద్రపరిచేవారు. మూలమూర్తికి పూతగా పూసే పునుగుతైలం కూడా ఇక్కడే తయారు చేయబడేది. ప్రసాదవితరణ సైతం ఇక్కడే జరిగేది. కాలాంతరంలో ఇవన్ని వేర్వేరు ప్రదేశాలకు తరలించబడ్డాయి. ప్రస్తుతం శ్రీవారికి హుండీలో రొక్ఖరూపంలో, వస్తురూపంలో సమర్పింపబడే కానుకలను వేరు చేసి, దేశవిదేశాలకు చెందిన కరెన్సీనోట్లను లెక్కించే *"నోట్లపరకామణి"* గా ఈ మంటపాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ మంటపం పగటిపూట నడుము పైభాగంలో ఏ ఆచ్చాదన లేకుండా నోట్లను వేరుచేస్తున్న శ్రీవారి సేవకులతోనూ, నోట్ల లెక్కింపు యంత్రాలతోనూ, నోట్ల కట్టలను బయటకు చేరవేస్తున్న బ్యాంకు సిబ్బంది తోనూ సందడిగా ఉంటుంది. నిబంధనల ప్రకారం నోట్ల లెక్కింపు విధుల్లో ఉన్న శ్రీవారిసేవకులు, బ్యాంకు సిబ్బంది, ఏ విధమైన ఆభరణాలను కానీ, చేతి గడియారాలను కానీ ధరించరాదు. 

‌ ప్రతినిత్యం 3–4 కోట్ల రూపాయలు, బ్రహ్మోత్సవాల్లో దానికి రెండింతల నగదు ఇక్కడ లెక్కించబడుతుంది. ఈ లెక్కింపు కార్యక్రమాన్ని చూస్తుంటే శ్రీమహాలక్ష్మి "ధనలక్ష్మి రూపం" లో శ్రీవారి చెంతనే కొలువుతీరి ఉన్నట్లుగా, ముల్లోకాల యందలి సమస్త సంపదలు ఇక్కడే ప్రోగుపడ్డట్లుగా అనిపిస్తుంది. నోట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది 2-3 షిప్టుల్లో పని చేస్తారు. పరకామణిలో జరిగే కార్యక్రమాలన్నింటినీ సీసీటీవీల ద్వారా విజిలెన్స్ శాఖ వారు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు.

స్వామివారి దర్శనానంతరం, విమాన ప్రదక్షిణ మార్గంలో వెళుతున్న భక్తులు ఒకరిద్దరిని పిలిచి, ఈ లెక్కింపు కార్యక్రమానికి సాక్షి సంతకాలు తీసుకునే సాంప్రదాయం ఉంది. 

‌ శ్రీవారి కృప ఉంటే, ఈసారి మనమే సాక్షులుగా ఎన్నుకోబడి ఆ వైభవాన్ని కన్నులారా తిలకించి, పునర్దర్శన భాగ్యాన్ని, శ్రీవారి ప్రసాదాన్ని పొందే అవకాశం ప్రాప్తిస్తుంది. 

*చందనపు అర*

 నోట్లపరకామణికి ఉత్తరం దిక్కున, సంపంగి ప్రదక్షిణమార్గంలో వాయువ్యమూలకు, ఇనుపకడ్డీల వాకిళ్ళతో కనిపిస్తున్న చిన్నగదిని *"చందనపు అర"* గా పిలుస్తారు. ప్రతినిత్యం స్వామివారికి అవసరమయ్యే చందనం ఈ గదిలోనే తయారు చేయబడుతుంది. గంధం తీయడానికి అనువుగా వుండే ఎత్తైన సానరాళ్ళు ఏర్పాటు చేయబడి ఉంటాయి. పెద్ద తిరుగలిరాళ్ల లాగా ఉండే వీటిపై గంధం చెక్కలను వడివడిగా అరగదీస్తూ, చందన ద్రవ్యాన్ని తయారుచేసే దేవాలయ పరిచారకులను *"చందనపాణి"* గా వ్యవహరిస్తారు. చందనంతో పాటుగా, నీళ్ళతో తడిచిన మెత్తని పసుపు ముద్దలు కూడా ఇక్కడే తయారు చేయబడతాయి. ఈ గదిలో తయారైన చందనాన్ని, పసుపును శ్రీవారికి జరిగే అన్ని ఉత్సవాల్లో వినియోగిస్తారు. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

11-40-గీతా మకరందము

 11-40-గీతా మకరందము

          విశ్వరూపసందర్శనయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


నమః పురస్తాదథ పృష్ఠతస్తే 

నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ | 

అనన్తవీర్యామితవిక్రమస్త్వం 

సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః | 

  

తా:- సర్వరూపులగు ఓ కృష్ణా! ఎదుటను, వెనుకను మీకు నమస్కారము మఱియు అన్నివైపులను మీకు నమస్కారమగుగాక! అపరిమితసామర్థ్యము, పరాక్రమము గలవారగు మీరు సమస్తమును లెస్సగ వ్యాపించియున్నారు. కనుకనే సర్వస్వరూపులై యున్నారు. 

 

వ్యాఖ్య:- అర్జునుడు తన హృదయమున పొంగిపొరలుచున్న భక్తిభావాతిశయమును వ్యక్తముచేయుచున్నాడు. 

   ‘అనన్తవీర్యామితవిక్రమః’ - భగవానుడు అపరిమిత శక్తిసామర్థ్యములు కలవాడు. ఒక చిన్న విసనకఱ్ఱతో వీచుకొనిన, కొద్దిగాలి వచ్చును. ఒక్కసారి ఝంఝామారుతము వీచినచో అపరితమగుగాలి ఉద్భవించును. మొదటిది మనుష్యశక్తి. రెండవది దైవశక్తి. బిందెలతో గాని, ఏతాముతోగాని, మిషన్లతోగాని నీరు పారగట్టినచో ఒకింత నీరు ప్రవహించును. కుంభవర్షము కురిసినచో వెల్లువలు పారును. వేలకొలది ఎకరములు నేల తడియును. మొదటిది మనుష్యశక్తి, రెండవది దైవశక్తి. మనుజుని శక్తికిని భగవంతుని శక్తికినిగల తేడా ఇదియే.  కనుకనే అర్జునుడు భగవానుని ‘అనంతవీర్యామితవిక్రముడ’ని సంబోధించెను. కావున మనుజుడు తన అల్పశక్తినిజూచి గర్వించక, సర్వశక్తిమంతుడగు పరమాత్మయెడల అకుంఠిత భక్తిభావము గలిగియుండవలెను. 

   

ప్ర:- పరమాత్మ ఇంకను ఎట్టివాడు? 

ఉ:- (1) అనంతశక్తిగలవాడు  (2) అపరిమిత పరాక్రమశీలుడు (3) సర్వత్రవ్యాపించి యున్నవాడు (4) సర్వరూపుడు.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*


*244 వ రోజు*

*అభిమన్యుని యుద్ధము*


కళింగరాజు పరాజయమును చూసిన కృపాచార్యుడు, శల్యుడు, అశ్వధ్ధామ అక్కడకు వచ్చారు. వారిని చూసిన ధృష్టద్యుమ్నుడు భీముని కిందకు దింపి " భీమసేనా నీవు నా వెనుక ఉండి నన్ను రక్షించు " అని వారి వైపు రథం నడిపి అశ్వథ్థామ రథానికి కట్టిన హయములను తొమ్మిది బాణాలు వేసి చంపాడు. అశ్వథామ శల్యుని రథం ఎక్కి ధృష్టద్యుమ్నుని మీద అస్త్ర ప్రయోగం చేసాడు. ధృష్టద్యుమ్నుడు ఒంటరిగా అశ్వథ్థామ, శల్య, కృపాచార్యులను ఎదుర్కోవడం చూసిన అభిమన్యుడు తన రథం వారి వైపు నడిపి అశ్వథ్థామ, కృపులపై తొమ్మిది బాణాలు వేసాడు. శల్యునిపై బాణపరంపర కురిపించాడు. వారుకూడా అభిమన్యునిపై ఒక్కొక్కరు పన్నెండు బాణాలు సంధించారు. ఆ సమయంలో సుయోధనుని కుమారుడైన లక్ష్మణకుమారుడు అభిమన్యునితో తలపడ్డాడు. మర్మభేదులైన బాణములతో అభిమన్యుని నొప్పించాడు. అభిమన్యుడు ఏభై బాణాలతో లక్ష్మణుని తిప్పి కొట్టాడు. లక్ష్మణుడు అభిమన్యుని విల్లు విరిచాడు. కౌరవ సేన హర్షధ్వానాలు చేసాయి. అభిమన్యుడు వేరొక విల్లు తీసుకుని లక్ష్మణునిపై బాణవృష్టి కురిపించి అతని కవచాన్ని భేదించాడు. ఇది చూసిన సుయోధనుడు తన రథాన్ని అభిమన్యుని వైపు మరలించాడు. సుయోధనునికి సాయంగా భీష్మ, ద్రోణ ఇతర ప్రముఖులు వచ్చారు. అభిమన్యుడు బెదరక నవ్వుతూ వారితో యుద్ధం చేయసాగాడు. అర్జునుడు ఇది చూసి దేవదత్తం పూరిస్తూ అభిమన్యునికి సాయం వచ్చి భీష్మ, ద్రోణులపై శరవర్షం కురిపించాడు. ఇది చూసిన ధర్మరాజు తన సేనలకు సైగ చేసి అందరినీ అక్కడకు తీసుకు వచ్చాడు. అర్జునుడు వివిధ బాణములు వేసి కౌరవసేనను తుత్తునియలు చేస్తున్నాడు. అర్జునిని బాణాలు ఆకాశాన్ని కప్పాయి. విరిగిన కరవాలములు, శరములు, గదలు, తలలు, మొడెములు మొదలైన వాటితో యుద్ధభూమి భాయానకంగా ఉంది. గజారోహకులు అడ్డు వచ్చిన వారిని తొక్కుతూ వీరవిహారం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు శంఖాలను పూరించాడు. భీష్ముడు ద్రోణాచార్యులను చూసి " ఆచార్యా ! అర్జునుడు శ్రీకృష్ణుని సారధ్యంలో చెలరేగి పోయాడు. నన్ను కూడా లక్ష్యపెట్ట లేదు. అతడిని ఎదుర్కొనే వీరుడు లేడు. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకున్నాడు. మన సేనలు అలసి పోయాయి. కనుక ఈ రోజుకు యుద్ధం చాలిస్తాము " అన్నాడు ద్రోణాచార్యుడు అందుకు అంగీకరించాడు. యుద్ధం ఆపమని సైన్యాలకు సూచించి అందరూ తమ నివాసాలకు చేరారు.


*మూడవ రోజు యుద్ధం గరుడవ్యూహం అర్ధ చంద్ర వ్యూహం*


మూడవరోజు యుద్ధానికి భీష్ముడు తన సేనలను గరుడవ్యూహంలో నిలిపాడు. ఆవ్యూహానికి తాను ముక్కు భాగంలో నిలిచాడు. ద్రోణుడు, కృతవర్మలను కళ్ళు ఉండే స్థానంలోను, కృతవర్మ, అశ్వథ్థామలు తలభాగంలోను నిలిచారు. త్రిగర్తలతో చేరి భూరిశ్రవసుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీరుడు, జయద్రధుడు కంఠ భాగాన నిలిచారు. సుయోధనుడు, సుయోధనుని తమ్ములు వెన్ను భాగమున నిలిచారు. విందాను విందులు, కాంభోజరాజు, శూరసేనుడు తోక భాగమున నిలిచారు. మగధ, కళింగ రాజులు కుడి రెక్కగా నిలిచారు, కర్ణాటక కోసల రాజులు ఎడమ రెక్కగా నిలిచారు. ధృష్టద్యుమ్నుడు పాండవ సేనలను అర్జునుని కోరికపై అర్ధచంద్ర ఆకారంలో నిలిపాడు. పాండ్య, మగధ రాజులతో భీమసేనుడు చంద్రుని కుడి కొమ్ము భాగాన నిలిచారు. భీమసేనునికి ఎడమ పక్కన విరాటుడు, ద్రుపదుడు, నీలుడు తమ తమ సైన్యంతో నిలిచారు. శిఖండి సహితంగా ధృష్టద్యుమ్నుడు ముందు నిలువగా ధర్మరాజు మధ్య భాగాన నిలిచాడు. వారి పక్కన సాత్యకి, నకులసహదేవులు, ఉపపాండవులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కేకయ రాజులు తమ సైన్యాలతో నిలిచారు. అర్జునుడు సైన్యాలకు ఎడమ కొమ్ము దగ్గర నిలిచాడు. భేరి తూర్య నాదాలు మిన్నంటాయి. మూడవ రోజు యుద్ధం ఆరంభం అయింది. ఇరు పక్షములు ఒకరితో ఒకరు తలపడ్డాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

ఉపశమనము కలుగునని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో॥  *మిత్రే నివేదితే దుఃఖే*

        *దుఃఖినో జాయతే లఘు*

        *భారం భారవహస్యేన*

        *స్కంధయో: పరివర్తతే*


తా:- భుజము మీద బరువుమోసేవాడు ఆ బరువునును రెండుభుజాల మధ్యకు మార్చుకుంటే  భారము తగ్గినట్లుగా,  మంచిమిత్రునికి బాధ చెప్పుకుంటే బాధపడేవాని దుఃఖము తగ్గి మనసు తేలికపడుతుంది. అంటే *మన దుఃఖము మన ఆత్మీయయులతో పంచుకుంటే కొంత ఉపశమనము కలుగునని భావము*.


✍️🌷🌺🌹🙏

లలిత సహస్రనామ స్తోత్రం --

 ------------    లలిత సహస్రనామ స్తోత్రం ----------

                    ప్రతిపదార్ధ వివరణ



ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ ।

సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ॥39॥


ఆజ్ఞాచక్రాంతరాళస్థా - ఆజ్ఞాచక్రము యొక్క మధ్యలో ఉండునది.

రుద్రగ్రంథి విభేదినీ - రుద్రగ్రంథిని విడగొట్టునది.

సహస్త్రారాంబుజారూఢా - వెయ్యి దళములు గల పద్మమును అధిష్టించి యున్నది.

సుధాసారాభివర్షిణీ - అమృతము యొక్క ధారాపాత వర్షమును కురిపించునది.

పంచాంగం 02.01.2025 Thursday,

 ఈ రోజు పంచాంగం 02.01.2025 Thursday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు పుష్య మాస శుక్ల పక్ష తృతీయ తిథి బృహస్పతి వాసర శ్రవణం నక్షత్రం హర్షణ యోగః: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30  వరకు.




శుభోదయ:, నమస్కార: