23, ఏప్రిల్ 2021, శుక్రవారం

శ్రీరమణీయం* *-(149)*_

 _*శ్రీరమణీయం* *-(149)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"మనసును నిశ్చలంగా ఎవరు ఉంచుకోగలుగుతారు ?"*_


_*అద్దంలో మంట కనిపించినా అది అద్దానికి గాని దాన్ని చూసే వారికిగానీ ఏ హాని చేయదు. జ్ఞానుల మనసు అలాగే ఉంటుంది. పరిపూర్ణ శాంతిని, భగవంతుని సాన్నిధ్యాన్ని , ఆత్మానుభవాన్ని పొందిన సద్గురువులు, యోగులు, జ్ఞానులు మనసును నిశ్చలంగా ఉంచుకుంటారు. కప్ప సహజంగానే తన నాలుకను పైకి మడిచి 'ఖేచరీ విద్య'తో ఆకలిదప్పులులేని స్థితిలో ఉంటుంది. యోగి కూడా ఈ లోకంలో అలా జీవిస్తాడు. అలాగే శ్రీరమణభగవాన్ వంటి జ్ఞానులు ఈ ప్రపంచంలో మనతోపాటు జీవిస్తున్నా ఏ విషయాలు వారి మనసును చలింపజేయలేవు. మనకి వారికి తేడా అంతా విషయాన్ని స్వీకరించే తీరులోనే ఉంటుంది. వాస్తవానికి ప్రాపంచిక విషయాలేవి మన మనసుకు కూడా అంటేవి కావు. కానీ మనకి ఆ విషయంలో అనుభవం లేదు. ఆ వివేకం కలిగిన రోజు మనం కూడా సాక్షిత్యంతో సాధనలో ముందుకు సాగుతాం !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'మనస్సు స్వస్వరూపమే దైవం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

కరోనాకు

 ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోడా కరోనాకు షాక్ 

     Rs.50,000/-రివార్డ్                      

      ----------------

👉 ఒక్క రూపాయితో కరోనాకు మందు కనుగొన్న లయన్ రంగా వెంకటేశ్వరరావు "అల్లాఉద్దీన్ అద్భుత దీపం "చిట్కా 

--------------------------

నాసికా రంధ్రాల్లో (ముక్కులో )ఒకచుక్క నిమ్మరసం వేసుకొంటే ముక్కులో, గొంతులో,శ్వాస కోశాల్లో దాగి ఉన్న కరోనా వైరస్ అంతా శ్లేష్మ రూపంలో నోటిలోనికి వచ్చేస్తుంది .దాన్ని కాండ్రించి ఉమ్మివేయాలి. తదుపరి గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి పుక్కిలించి ఉమ్మాలి. వెంటనే మనకు రిలీఫ్ గా ఉంటుంది. తర్వాత శుభ్రమైన కొబ్బరి నూనె లో వేలు ముంచి నాసికా రంధ్రాల్లో రాయాలి.


 ఈ విధంగా చేసిన తర్వాత మాకు రిలీఫ్ రాలేదని ఎవరైనా రుజువు చెసినచో వారికి రంగా వెంకటేశ్వరరావు గారిచే రూ. 50,000/-బహుమానం ఇవ్వబడుతుంది. అని ఛాలంజ్ చెయ్యడం జరిగింది.


👉 కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న విలన్ ఐతే,తేలికగా  నివారణ మందు కనుగొన్న ప్రపంచ హీరో మన సోదరుడు"రంగా వెంకటేశ్వరరావు  "నిమ్మరసం శానిటైజర్ కన్నా గొప్పగా పనిచేస్తుంది. నిమ్మరసం చేతులకు, శరీరానికి, తలకు,  గదుల్లోను,  వస్త్రములపై  ఉపయోగిస్తే కరోనా మన దరి చేరదని అమ్మ లాంటి నిమ్మ వల్ల అనేక లాభాలున్నాయని  చెబుతున్నారు మన రంగా వేంకటేశ్వరరావు గారు. భయం తో వణికిపోతున్న ప్రపంచ ప్రజలకు ఈ గొప్ప ఉపాయం కనుగొన్న వ్యక్తి నిడదవోలు పట్టణ" రంగా "వారి ముద్దుబిడ్డ శ్రీ రంగా సుబ్బారావు సత్యవతి పుణ్య దంపతుల కుమారుడు MJF Ln. రంగావెంకటేశ్వరరావు గారు పచ్ఛిమ గోదావరి జిల్లా, నిడదవోలు లయన్స్ క్లబ్ అధ్య్యక్షులుగా, జిల్లాసేవా కో-ఆర్డినేటర్ గా పనిజేసి, తను అధ్యక్షుడుగా ఉన్న  క్లబ్ నకే కాకుండా ఇతర క్లబ్ లకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి  జిల్లాలోనే ఉత్తమ అధ్యక్షులుగా ప్రధమ బహుమతి పొంది, ప్రస్తుతం కూడా జిల్లా సేవా కోఆర్డినేటర్ గా ఉండిరి. పైన చెప్పిన విధంగా వెంకటేశ్వరరావు గారు స్వయంగా ప్రయోగం చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత,  పలువురు కరోనా బాధితులైన రాజకీయ నాయకులకు, ఇతరులకు  సూచించి వారు కూడా  ఫలితం పొందిన తర్వాత వారినుండి  అభినందనలు పొందడం కూడాజరిగిందని మీకు తెలియజేయుచున్నాము. 

   ఒక సైనికులు సైనైడ్ చుక్క ప్రాణం తీస్తుంది.

 అమ్మ లాంటి ఒక నిమ్మరసం చుక్క ప్రాణాన్ని కాపాడుతుంది. సర్వేజనా సుఖినో భవంతు. 😷🙏😱

నోటంట మాట రాలేదు ....

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*నాకు నచ్చిన శివరాం మోహన్ గారి మరో కథనం.*

              🌷🌷🌷

ప్రక్కన కూర్చున్నాయన్ని చూసి పలకరింపుగా నవ్వాను .... ఆయన కూడ ముందు కొంచెం ఆశ్చర్యపోయినా మొహమాటంగా నవ్వారు .... కాకినాడేనా సార్ ... అన్నాను మాట కలుపుతూ... నాన్ స్టాప్ దొరకలేదు ... ఈ వెధవ ఎర్ర బస్సు దొరికింది .... ఎప్పటికి తీసుకెళ్తాడో ఏంటో ... ఆయన విసుగ్గా అంటుంటే ... నేను నవ్వుతూ.... ఏదైనా అర్జన్టు పనుందా సార్ కాకినాడలో ... అన్నాను... అదేం లేదండి ....పాసింజర్ బస్సు అన్ని స్టాపుల్లో ఆగి వెళ్తుంటే చిరాకు ...అంటుంటే ...  ఎంత సార్ .... యానాం దాటితే తాళ్లరేవు తర్వాత రెండు దెబ్బల్లో జగన్నాధపురం ... ఇంక కాకినాడ ఊళ్ళో కెళ్లిన తర్వాత ఎర్రబస్ అయినా ఎక్సప్రెస్ అయినా ఒక్కటే... రాత్రయ్యేకొద్దీ బస్టాండ్ లో ఒంటరిగా కూర్చొని ఎక్సప్రెస్ గురించి ఎదురు చూట్టం కన్నా దొరికిన ఎర్ర బస్సు ఎక్కేస్తే .... జనాలు ఉంటారు ..జర్నీ తెమిలిపోద్ది .అన్నాను.. 

          ఆ పెద్దాయన ఈ సారి నా వంక తేరిపార చూశారు ... ఏం చేస్తుంటారు మీరు .... అన్నారు... కొంచెం ఆసక్తిగా .... నేను చెప్పాను .... అదేంటండి... మీకు వెహికల్ ఇస్తారేమో .. అన్నారు... అది ఇక్కడ ఉండిపోద్దండి... నన్ను కాకినాడ బస్సు ఎక్కించి... అన్నాను నవ్వుతూ ... ఆయన కూడా నవ్వుతూ మీరు భలే మాటాడుతున్నారే అంటుంటే .... 

                చెప్పానా ... అప్పుడే యానాం బ్రిడ్జి వచ్చేసింది చూశారా ....వృద్ధ గౌతమికి ఆఖరి మజిలీ ఇదే... సముద్రుడు ఎదురొచ్చి మరీ తీసుకుపోతాడు గోదారమ్మని ..... తాపం తట్టుకోలేక .... అంటుంటే...ఆ పెద్దాయన నవ్వుతూ .... నా భుజంమీద చరిచాడు...పావుగంట లోనే ఆయనకు చనువు పెరిగిందని నవ్వుకుంటూ .. ... ఈ బ్రిడ్జి కట్టాక సుఖంగా ఉంది గానీ ... రేవులు దాటి కాకినాడ వెళ్లాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది ... రాత్రి పూటయితే ఇంక చెప్పక్కర్లేదు .. 

                     .అన్నంపల్లి దాకా బస్సు ....అక్కడ గోదారి పాయ దాటి మురమళ్ళ .... అక్కడ్నుంచి అద్దె సైకిల్ తీసుకుని ఎదుర్లంక రేవుకొచ్చి .... అద్దె సైకిల్ అక్కడ అప్పజెప్పేసి .... నావెక్కి యానాం చేరుకొని అక్కడ్నుంచి వీరభద్ర ట్రావెల్సోడి  కిక్కిరిసిపోయిన బస్సెక్కి పడతా లేస్తా కాకినాడ చేరేసరికి భోజనం టైం కూడా మించిపోయేది ... మనల్ని చూసి .... అదేంరా బాబు ఉత్తరం ముక్కయినా రాసావుకాదు ... అని ముక్కు చీదుకుంటూ పొయ్యేలిగించేవాళ్ళు అక్కలో మేనత్తలొ .... 

                 మనకు తెలీకుండానే చాపకింద నీరులా అభివృద్ధి కూడా జరిగింది ఈ అరవై డెబ్బై ఏళ్లలో .... దీనికి మన వయసు వాళ్లే ప్రత్యక్ష సాక్షులు ... ప్రతి దానికి బ్రిటీషోళ్ళని మెచ్చుకుంటారు మనోళ్లు కొందరు మన ప్రభుత్వాన్ని ఈసడిస్తూ ...అంకినకాడికి దోచుకుని పీల్చి పిప్పి జేసి అప్పగించి వెళ్లారని ఇంకా బతికున్న అప్పటి వాళ్ళని అడిగితే చెబుతారు...   . అభివృద్ధి చెందిన యూరప్ అమెరికాలతో పోల్చి ఎద్దేవా చేస్తుంటారు నవతరం .... ఆ దేశాలకు స్వతంత్రం వచ్చి వందల ఏళ్ళు గడిచాయని మాత్రం మర్చిపోతారు ....వాళ్ళు ఇతర దేశాల్ని దోపిడీ చేసి పెంచుకున్న సంగతి కూడా మర్చిపోయారు ... 1947 లో మన జనాభా 39 కోట్లు ... మరిప్పుడు 130 కోట్లు ...ఇది అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం .... మన పల్లెటూర్లలో ఇప్పటికి కనిపించే ఉమ్మడి కుటుంభాల్లాంటిది ... ఎవర్నీ నొప్పించకుండా చక్కపెడుతూ వెళ్ళాలి ..... నియంతృత్వ దేశాల్లో ప్రజల భావోద్వేగాలను పట్టించుకోరు కాబట్టి అభివృద్ధి పెరుగుదల స్పీడ్ గా  ఉంటుంది .... మానవ సంబంధాలు మాత్రం మరోలా ఉంటాయి ... మనం అమెరికానో బ్రిటనో మన పిల్లల దగ్గరకెళ్ళి ఒక్క రెండు నెలలు ఉంటే .. కొత్తలో భలేగా ఉంది అనిపిస్తాది ....వారం రోజులకే  మాట్లాడేవాడు కనిపించక మన దేశమ్మీద బెంగొస్తాది ... అభివృద్ధి మెల్లగా జరిగినా పర్లేదు ... అభిమానాలు తగ్గకుండా ఉంటె అదే పదివేలు .... అనిపిస్తది .....

                       మాటల్లో పడి కాకినాడ కల్పనా సెంటర్ ఒచ్చేసింది ..... అదేంటి సార్ మీరెక్కడ దిగాలి .... అంటుంటే.... నేను జిల్లా పరిషద్ దగ్గిరే దిగాలి ... కానీ దిగబుద్ధి కాలేదు ... మీతో మాట్లాడుతుంటే ... మీరెక్కడ ... కాంప్లెక్స్ లో దిగాలా ... నేనూ అక్కడే దిగుతాను .... అక్కడ్నుంచి ఆటో ఎదో పట్టుకుని వెనక్కు వెళ్తాను ... ఆయన మనస్ఫూర్తిగా అలా అంటుంటే నాకు నోటంట మాట రాలేదు ....

                                                                                                                                                               *"సం"మోహనం*

వెలుగు వైపుగా

 

      *వెలుగు వైపుగా* 

                🌷🌷

నేను నా తల్లితండ్రులకు ఒక్కడే‌ కొడుకుని…. నాకు పన్నెండేళ్లు వయసులో, మా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతే, మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకోకుండా, చాలా కష్టపడి నన్ను పెంచాడు. మిగిలిన రైతులు పొలంలో వరి, జొన్న, మొక్కజొన్న లాంటి ఆహారధాన్యాలు పండిస్తే, మా నాన్న కూరగాయలు పండించేవాడు. ధాన్యం పండించటం కన్నా కూరగాయల పంటకు‌‌ ఎక్కువ శ్రమించవలసి ఉంటుంది కానీ వాటి మీద‌ ఆదాయం వెంట వెంటనే లభిస్తుంది, కనుక కూరగాయలే నయమనుకునేవాడు. ఇవే కాక మా పొలంలో కొన్ని కరివేపాకు, నిమ్మ వంటి ఆదాయాన్నిచ్చే‌ చెట్లు కూడా ఉండేవి. 


అలా పండించిన కూరలను నెత్తి మీద ‌బుట్ట పెట్టుకుని వారాంతపు సంతలలో తనే స్వయంగా అమ్మేవాడు. అవికాక వంటపనీ, మిగిలిన పనులూ కూడా ఆయనే చేసేవాడు. అంత కష్టపడి నా స్కూల్ ఫీజులకీ, యూనిఫార్మ్ లకూ, పుస్తకాలకూ‌ డబ్బులు ఖర్చుపెడుతుంటే, నేను బాధతో ఏడ్చేవాడిని. "చదువు వద్దూ, ఏం వద్దూ… నన్నూ నీతో పొలానికి తీసుకుపొమ్మని" గొడవ చేసేవాడిని.


ఆయన నా మాటలు పట్టించుకునేవాడు కాదు, పైగా "నువ్వు చదువుకోకపోతే ఇప్పుడు నేను పడే కష్టం అంతా వృధా అవుతుంది నాయనా! ఒక తరం బాగుపడాలంటే, ఒక తరం కొన్ని త్యాగాలు చేయక తప్పదయ్యా!" అనేవాడు. నాకు నాన్న మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా, ఆయన కోరిక మేరకు ‌చదువు కొనసాగించాను.


ఎస్ ఎస్ సి అయిన తరువాత ఇంటర్లో చేరాను. చాలామంది పాలిటెక్నిక్ డిప్లొమా చేయించమని మా నాన్నకు సలహా ఇచ్చారు, కానీ ఆయన వినలేదు. నేను ఇంటర్లో బయాలజీ తీసుకున్నాను. ఇక ఆ రెండేళ్లు స్నేహితులూ, సరదాలంటూ సమయం వృధా చేయకుండా, బాగా కష్టపడి మెడిసిన్ లో సీటు సంపాదించాను. సీటైతే వచ్చింది కానీ, మా కులానికి స్కాలర్షిప్ వచ్చే అవకాశం లేదు. సామాజిక అసమానతల పట్ల అవగాహన ఉన్నవాడిని కనుక నేను ప్రభుత్వ విధానాలని ఎన్నడూ తప్పు పట్టలేదు. మొత్తానికి మెడిసిన్ లో చేరాను కానీ డబ్బుకు ఇబ్బంది ఉండేది… అప్పట్లో మెడికల్ కాలేజ్ కి, అతి సామాన్యమైన బాటా చెప్పులతో వెళ్లింది బహుశా నేనొక్కడినే. నాకు అదేమీ అవమానంగా అనిపించేది కూడా‌ కాదు, ఎందుకంటే మా నాన్న అసలు చెప్పులే లేకుండా‌ తిరిగేవాడు, ఒకవేళ ఎప్పుడైనా వేసుకున్నా ఊర్లో చెప్పులు కుట్టే అతని దగ్గర కుట్టించిన గట్టి తోలుచెప్పులే.


నా మెడిసిన్ పూర్తి కావచ్చింది… హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు, ఒక‌ ఫ్రొఫెసర్ కి నా కష్టపడే తత్వం, చదువు పట్ల ఉన్న శ్రద్ధ నచ్చాయి, ఆయనదీ, మాదీ ఒకే కులం. ఒకరోజు ఆయన వాళ్ల ఇంటికి ఆహ్వానించాడు. ఆ పిలవటం వెనకాల, వాళ్ళ కుటుంబ సభ్యులకు నన్ను పరిచయం చేయాలనే ఉద్దేశ్యం ఉందని నాకు తెలియదు. అతని భార్యకూ, కూతురికీ నన్ను పరిచయం చేసాడు. వారిని చూస్తే ఎంతో ఆధునికంగా, మాకన్నా ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని తెలుస్తోంది… జీవితం అంటే, విలువైన వస్తువులూ, నగలూ, సౌకర్యాలూ అమర్చుకోవటం, తరచూ రెస్టారెంట్లకూ, వెకేషన్స్ కోసం మంచి ప్రదేశాలకు వెళ్లడం, వెరసి విలాసవంతమైన జీవితం అనుభవించటంలోనే సంతోషం ఉంటుందనుకునే మనస్తత్వం వారిది. ఆ తరువాత కొన్నాళ్లకి ఆయన, మా ఊరికి వెళ్లి నాన్నను కలిసి, నాకు తన కూతురినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానని, ఆ పెళ్లి వలన నాకు మంచి జీవితం లభిస్తుందని చెప్పాడు… నాన్నకూ, మా పొరుగువారికీ‌ కూడా ఆ మాట నిజమనిపించింది, నా అదృష్టానికి మురిసిపోయారు.

మా నాన్న నన్ను ఇంటికి రమ్మని కబురు చేసాడు. అక్కడికి వెళ్లాక, మా బంధువులూ, పొరుగిళ్ల వాళ్లూ, "నేను మా ప్రొఫెసర్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని" చెప్పారు. మా నాన్న మాత్రం కాసేపు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు… చివరికి "మా అబ్బాయికి ఏది సరైనదో అదే చేయవచ్చు, నేను చెప్పేదేమీ లేదు" అన్నాడు. నేను 'నిజంగా ఆమెను పెళ్లి చేసుకుంటే నాకు మంచి జరుగుతుందా? అసలు నేను ఆమెకు నచ్చిన జీవితం ఇవ్వగలనా?' అనే సందిగ్ధంలో ఉండిపోయాను. 


నా డాక్టర్ డిగ్రీ చూసి చాలామంది గొప్పగా అనుకుంటున్నారు కానీ నా బతుకేమిటో నాకు తెలుసు. నాకొచ్చే స్టైఫండ్ నా కనీస అవసరాలకు మాత్రమే సరిపోతుంది, అలాంటప్పుడు పెళ్లి చేసుకుని భార్యను పోషించాలంటే, అదీ ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పోషించటం నాకు సాధ్యమేనా? మావాళ్లందరి మాటల్లో "ఒక అమ్మాయి తన భాగ్యాన్ని తనే వెంటపెట్టుకుని వస్తుంది… జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లుగా ఉండవు, కొన్ని కొన్ని విధి నిర్ణయాన్ననుసరించి జరుగుతాయి, అంతే" అన్నారు.


మొత్తానికి నా చేత "సరే" అనిపించారు. నా నిశ్చితార్థానికి మా నాన్న ఒక ముతక ధోవతి, తెల్ల‌చొక్కా, పై తుండు వేసుకుని వచ్చాడు.. అవే తోలు చెప్పులు. నా కాబోయే మామగారి స్నేహితులంతా డాక్టర్లు, పెద్ద ఉద్యోగస్తులు, వారందరినీ‌ చూసాక నాన్నకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది… చిరునవ్వు మినహా మాటలే లేవు. ఫంక్షన్ పూర్తవగానే నాన్న నన్ను ఆశీర్వదించి ఊరికి వెళ్ళిపోయాడు.


నిశ్చితార్థమయితే జరిగింది కానీ రేపు పెళ్లయ్యాక, నా భార్యను ఎక్కడికి తీసుకువెళ్లాలనే ప్రశ్న నా మనసులో తలెత్తింది.. నాకు ఉద్యోగం దొరికిన తరువాత,  అక్కడ ఇల్లు తీసుకొని ఉండచ్చు, కానీ అప్పటివరకూ ఎలా? ఊర్లో ఉన్న మా స్వంత ఇల్లు చాలావరకూ పాడయిపోయింది. అసలా ఇల్లెంతని? ఒక చిన్న హాలు, వంటగది, మరో రెండు గదులూ… వాటిలో ఒక గది నిండా వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగుమందులూ, విత్తనాల వంటివి ఉంటాయి. మరొక గదిలో రెండు కాటన్ పరుపులూ, కొంత వంటింటి సామాను ఉంటాయి. బాత్రూమ్ ఉంది కానీ పేరుకే, దానిలో పట్నాల్లో ఉండే సౌకర్యాలేవీ ఉండవు. నాన్న కాలకృత్యాల కోసం ఉదయాన్నే దూరంగా పొలాల్లోకి వెళ్లిపోతాడు, వస్తూ వస్తూ పంట బోర్ల దగ్గరే స్నానం చేసి వస్తాడు. మా ఇద్దరికీ అన్నం, ఏదో ఒక పప్పు చేసేవాడు… తాజా కూరగాయలు కనుక‌ మామూలుగా వండినా, చాలా  రుచిగా అనిపించేవి. ఇంట్లో ఒక గేదె ఉంది... పాలు, పెరుగూ, నెయ్యి మా అవసరాలకు సరిపడా వచ్చేవి. అవే‌ కాక‌ కోళ్లు కూడా ఉండేవి, ఎప్పుడైనా‌ చికెన్, గుడ్లు వండుకునే వాళ్లం… కానీ అవి ఏవి పడితే అవి తింటాయని గమనించిన నాన్నకు, చికెన్ తినడం నచ్చేది కాదు. ఎప్పుడైనా మటన్ మాత్రం తినేవాడు. అది  ఇంట్లో వండాలంటే పనీ, ఖర్చూ కూడా ఎక్కువే కనుక ఎప్పుడైనా పార్టీల్లోనే తినేవాళ్లం.


ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాతో, ఒక పట్నంలో పెరిగిన అమ్మాయి, కనీసం డైనింగ్ టేబుల్ కూడా లేని ఇంట్లో ఎలా సర్దుకోగలదు అని నా భయం. 


పెళ్లి మరో రెండువారాలుందనగా, మా కాబోయే అత్తగారు ఫోన్ చేసి "బాబూ! మా అమ్మాయి పూజ పెరిగిన జీవన విధానం వేరు, మీ ఇంట్లో తను సర్దుకోలేదేమో అనిపిస్తోంది. ఎటూ మీరు ఏదైనా ఉద్యోగంలో చేరాలంటే ఇక్కడే సిటీలో ఉండాలి కదా! పూజ చిన్నప్పుడు తన పేరు మీద ఒక ఫ్లాట్ కొన్నాం, అదిప్పుడు ఖాళీ అయింది.. ఇప్పుడు ఆ ఇల్లు బాగు చేయించి, కలర్స్ వేయించి, కొత్త ఫర్నిచర్ అమర్చి మీకు ఇవ్వాలనుకుంటున్నాం" అని చెప్పేసరికి నాకూ అదే మంచిదనిపించింది.


ఊరికి వెళ్లినప్పుడు ఈ సంగతి మా నాన్నతో చెప్తే ఆయన ఎప్పట్లానే "నీకు మంచిగనిపిస్తే చాలు" అన్నాడు.


ఆ రోజు రాత్రి ఎందుకో? అమ్మను‌ తలుచుకుని బాగా ఏడ్చాను. నాన్న నన్ను కాలేజికి పంపించకుండా ఉంటే బాగుండేదనిపించింది. ఆయనలాగా నేనూ వ్యవసాయం చేసుకుంటే, నా భార్య‌ కూడా మాతోపాటు ఇక్కడ ఉండి, మాకు వండిపెడుతూ, నాన్నను ఈ వయసులో జాగ్రత్తగా‌ చూసుకునేదేమో! ఇప్పుడు నాన్న ఆరోగ్యం బాలేదు, ఎప్పుడైనా తన గురించి శ్రద్ధ తీసుకుంటేగా? ఒక కంటి సమస్యకు కాని, ఫిజీషియన్ కానీ, సుగర్ కి కానీ ఏ డాక్టర్నీ కలవలేదు. తన విషయాలన్నీ కర్మ కొదిలేసి, నన్ను మాత్రం డాక్టర్ని చేసాడు. నేను ఆయన కోసం కొడుకుగా ఏం చేస్తున్నాను? 'భౌతికమైన వస్తువులూ, సుఖాలే జీవితమా? అసలు నా చదువే ఓ కొలిక్కి రాలేదు. ఈ రోజుల్లో ఉట్టి ఎమ్ బి బి ఎస్ సరిపోదు, రేపు నా భార్య, మామగారు నన్ను ఎవరికైనా పరిచయం చేయాలన్నా‌ చాలా చిన్నతనంగా భావిస్తారు. సమాజంలో సరైన గౌరవమూ, మంచి ప్రాక్టీస్ కావాలంటే నేను ఎమ్ డీ లేదా ఎమ్ ఎస్ చేయాలి. మా మామగారి సహకారం లేనిదే నేను ఇవేవీ సాధించలేను. 


నా ఆప్తమిత్రుడొకడు ఇంటర్, బిఏ అతి మామూలుగా చదివి పాసయి, తరువాత‌ ఎడ్వొకేట్ అయ్యాడు. ఇప్పుడు ఊళ్లోనే తల్లితండ్రులతో కలిసి ఉంటూ, తాలూకా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న  కోర్టుకు వెళ్లి వస్తూ ఉంటాడు. పొలాలు కూడా చూసుకోగలుగుతున్నాడు. మరొక స్నేహితుడు కూడా, స్కూల్ అసిస్టెంట్ గా చేస్తూ, తల్లితండ్రులతో కలిసి హాయిగా ఊళ్లోనే ఉంటున్నాడు. వాళ్ల జీవన విధానాన్ని కానీ, తల్లితండ్రులను కానీ వదులుకునే అవసరం లేకుండా, సంతోషంగా ఉంటున్నారు… మరి నేనేంటి, ఎమ్ బి బి ఎస్ లాంటి గొప్ప చదువు చదివీ, ఇంత బాధ పడుతున్నాను?


నా ప్రశ్నలకు జవాబులు దొరికేవరకూ కాలమాగదు కదా! అనుకున్న సమయానికి నా పెళ్లి పూజాతో జరిగిపోయింది… మా మామగారు వాళ్లు ఇచ్చిన ఫ్లాట్ లో ఉంటూ, వాళ్ల సపోర్ట్ తో నా చదువు కొనసాగించాను.

మా నాన్న ఊళ్లోనే ఉన్నాడు. నా పెళ్లయిన తరువాత మరీ ఒంటరి వాడయిపోయాడు. ఒకసారి నేనొక్కడినే ఆయన్ను చూడటానికి వెళ్లినప్పుడు నా దగ్గరకు రమ్మని అడిగాను… రెండు మోకాలి చిప్పలూ అరిగిపోయాయి, కర్ర సహాయంతో నడుస్తున్నాడు..షుగర్, బీపీ కూడా బాగా పెరిగాయి. వైద్యం చేయిస్తాను నాతో రమ్మని పిలిస్తే, ఆయన ఒప్పుకోలేదు. చేసేది లేక మందులు కొనిచ్చి, "ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొమ్మని‌‌ చెప్తే" ఎప్పట్లాగే ఓ నవ్వు నవ్వాడంతే. డబ్బులు తీసి ఇవ్వబోతే, వద్దన్నాడు. పొలానికి వెళ్లటం మానేసి ఒక చెట్టు కింద, కూరగాయలు పెట్టుకుని అమ్ముతున్నాడు… ఇతర కూరగాయల వ్యాపారస్తులు కూడా వాళ్ల కూరగాయలు నాన్ననే అమ్మి పెట్టమనేవారు. సాయంకాలం వచ్చి ఎవరి వాటా డబ్బులు వారు తీసుకునే వారు. నాన్నకూ తిండికీ, బట్టకూ లోటు లేకుండా జరిగిపోతోంది కనుక సంతోషంగానే ఉన్నాడు. ఆయనకొచ్చే వృద్ధాప్య పింఛన్ తో అవసరమైన సరుకులూ, వంట గాస్ లాంటి అవసరాలు తీరుతున్నాయి.


నా మనసులో మాత్రం మా నాన్నను దగ్గరుండి చూసుకోలేక పోతున్నాననే బాధ తొలిచేస్తోంది. తన జీవితం అంతా నాకోసమే కష్టపడ్డాడు, ఎన్నో సుఖాలు వదులుకున్నాడు… ఇప్పటికీ, ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో, తన వంట తనే చేసుకోవలసి వస్తోంది. నేనూ, నా భార్యా ఆయన కోసం ఏమీ చేయలేకపోతున్నాం. నా భార్యకైతే అసలా ఊరూ, మా ఇల్లూ ఏవీ నచ్చవు. నేను మాత్రం ఆయన్నలా వదిలేయలేకపోతున్నాను.


క్రిందటి రోజు సాయంత్రం, నాన్నకు బాగాలేదని కబురు తెలిసి మా ఊరికి వెళ్లాను. రాత్రికి మా పొరుగింటి వాళ్లు అన్నమూ, కూరలూ తెచ్చి ఇచ్చారు. నాన్న మొహంలో నేను వచ్చానన్న సంతోషం కనపడింది. ఇద్దరమూ కలిసి భోజనం చేసాము. కొంతసేపటి తరువాత నా ఎడ్వొకేట్ మిత్రుడు వచ్చి, "మేజిస్ట్రేట్ అయ్యానని" శుభవార్త చెప్పాడు. చాలా సంతోషం వేసింది. ఊరివారందరూ కూడా అతడిని గౌరవంగా చూస్తున్నారు.. అతని తల్లితండ్రులు కొడుకు ఎదుగుదల చూసి  గర్వపడుతున్నారు. వాడు ఒకప్పుడు చదువు మీద‌ శ్రద్ధ లేకుండా ఆకతాయిగా తిరిగేవాడు, ఎలానో ఎల్ ఎల్ బీ పూర్తి చేసాడు… ఇప్పుడు మేజిస్ట్రేట్ అయినా, రేప్పొద్దున్న సెషన్స్ కోర్టుకీ, ఆ పైన హైకోర్టుకీ, చివరికి సుప్రీంకోర్టు జడ్డ్ కావాలన్నా అతని ఎల్ ఎల్ బీ అర్హత సరిపోతుంది. కానీ ఎమ్ బి బి ఎస్ అలా కాదు… నేను ఈ ఊరిలో చిన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నడపాలన్నా, ఏదో ఒక స్పెషలైజేషన్ ఉండాలి... అంతేకాదు ఎన్నో వస్తువులు సమకూర్చుకోవాలి. ఈ విద్యా విధానంలోనే ఏదో తేడా ఉంది. ఒక ఎమ్ బి బి ఎస్ డాక్టర్ పూర్తి స్థాయి సర్జరీలు చేసే వీలు లేనప్పుడు,  ఆ కోర్సులో ముందస్తుగా సర్జరీలు ఎందుకు నేర్పుతారు? రేపు నేను స్వంత ప్రాక్టీస్ పెట్టాలంటే, సిటీల్లో ఉండే పెద్ద ఆస్పత్రుల మీద ఆధారపడి, వాళ్ల కింద కమీషన్ ఏజంట్ లా పనిచేయాలి. నాకు చాలా దుఃఖంగా అనిపించింది. రాత్రి నాన్న పక్కన పడుకున్నప్పుడు, నాకు పన్నెండేళ్ల వయసులో, నాన్నను హత్తుకుని పడుకున్నట్లుగా అనిపించింది. నాన్న ఏడుస్తున్నాడని తెలుస్తోంది. ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, నాన్నతోనే ఇక్కడే, ఉండిపోవాలని… బహుశా నేను పేరాసెటమాల్, యాంటిబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసుకుంటూ, సాధారణ డాక్టర్ గా ఉండిపోతాను, అయినా పరవాలేదు... మేము కలిసి ఉన్నప్పుడు కూడా నా భార్య‌ సంతోషంగా ఏమీ లేదు… ఆమె దృష్టిలో నేను ఒక పల్లెటూరి బైతుని, నాగరికత, ఆధునికత తెలియని వాడిని.


ఇక ఈ మానసిక‌ సంఘర్షణ నుంచీ బయట పడటానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నా భార్యతో విడిపోయి ఈ పల్లెలోనే ఉండిపోతాను 'కలిసొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నాను' అనుకున్నా సరే. 

ఈ భౌతిక సుఖాలు శాశ్వతమని భావించి ఉంటే సిద్ధార్థుడు ఏనాటికీ బుద్ధుడిగా మారేవాడే కాదు. నా కనుల ముందు నిజమైన వెలుగు ఇప్పుడు కనిపిస్తోంది.


🌷🌷🌷🌷🌷🌷🌷


ఆంగ్ల రచన by Sri Prabhakar Dhoopati

FICTION

12 April 2021


స్వేచ్ఛానువాదం: రత్నశ్రీ వఠెం

శ్రీనాథుడు

 ‘కవి సార్వభౌముడు’ గా ప్రసిద్ధి గాంచిన శ్రీనాథుడు తన కాలం నాటి సాహిత్య ప్రపంచానికి హిమాలయ పర్వత సదృశమైన సారస్వత మూర్తి. దేశదేశాలు తిరిగి, అనేక ఆస్థానాలలో సత్కారాలు పొందినవాడు. 


విజయ నగరంలో విద్యాస్పర్థలో గౌడ డిండిమ భట్టును ఓడించి, అతని కంచు ఢక్కను పగుల గొట్టించాడు. అక్కడే, ప్రౌఢ దేవ రాయల ఆస్థానంలో రాజు చేత కనకాభిషేకం చేయించుకున్న వాడు. కొండవీటి రెడ్డిరాజుల రాజ్యంలో విద్యాధికారి పదవిని నిర్వహించాడు. అవచి తిప్పయ, మామిడి సింగయ మంత్రి లాంటి సమకాలీన రాజకీయ వేత్తలతో భుజం భుజం కలిపి తిరిగాడు. 


హర విలాసము, కాశీ ఖండము, భీమేశ్వర పురాణము, శివరాత్రి మహాత్మ్యము, మరుత్తరాట్చరిత్ర లాంటి కావ్యాలు వెలయించాడు. శ్రీహర్షుని సంస్కృత నైషధాన్ని ‘శృంగార నైషధం’ గా మహా ప్రౌఢంగా ఆంధ్రీకరించాడు. జానపదుల వీరగాధ అయిన పల్నాటి వీర చరిత్రను ద్విపదలో అందంగా సంతరించాడు.


ఎంతో వైభవంగా బ్రతికిన శ్రీనాథుడి చివరి దినాలు మాత్రం చాలా బాధాకరంగా గడిచాయి. సానుభూతి లేని పాలకుల చేతుల్లో బాధలు పడ్డాడు. సొంత వ్యవసాయం లో పక్షుల వల్లా, వరదల వల్లా పంటలు పాడై పోయాయి. పన్నులు కట్టలేక శిక్షలు అనుభవించాడు. చివరికి ఆ దిగులుతోనే మరణించాడు. అయినా, ఆ మహాకవి ఆత్మ విశ్వాసం చూడండి. చనిపొయే టప్పుడు ‘దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాథు డమర పురికి’ అంటూ స్వర్గారోహణం గావించాడు.


ఆయన కాలంలోనే ఏమి, ఈనాటికి కూడా శ్రీనాథుడు ఒక మేరు శిఖరమే!