9, జులై 2023, ఆదివారం

వ్యవసాయాన్ని బతికించండి

 ఈ రోజు ఒక్క టమోటా, పచ్చిమిర్చి కే మీరు ఇంతలా ఇబ్బంది పడుతున్నారు.. అదే రేపటి రోజు రైతు వ్యవసాయం ను వదిలేసి అందరిలా సాప్ట్ వేర్  అంటూ బెంగళూరు, హైదరాబాద్, మద్రాసు, ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, వంటి రాష్ట్రాలకు, దేశాలకు వలస పొతే మరి వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, సొరకాయలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీగడ్డ, ఉల్లిగడ్డ, ఎర్రగడ్డ, బీయము, బ్యాల్లు, కంది పప్పు, మినప్పప్పు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, మెంతాకు, పలకలాకు, గోంగూర ..... ఇంకా చాలా రకాల పంటలను రైతులు పండించపొతే ఏమీ తింటారు..??? రెడ్ మి తింటార?? వోపో తింటారా?? వివో తింటారా?? ఆపిల్ i ఫోన్ తింటారా?? కూరలోకి 4G వాడు తారా.. సాయంత్రం స్నాక్ లోకి 5G తింటారా?? అందుకే రైతులను ఆదుకోండి... 👍👍👍👍 వ్యవసాయాన్ని బతికించండి 🙏🙏      లక్ష కంప్యూటర్లు కలిసినా ఒక్క బియ్యం గింజ తయారు చేయలేవు... ఎంత మంది శాస్ర వేత్తలు వచ్చినా తిండి లేకుండా... గాలి లేకుండా బ్రతికే జీవిని తయారు చేయలేరు... జీవితంలో నేలను మించిన స్వర్గం... రైతు ని మించిన నిజాయితీ పరుడు ఇంకొకడు లేడు. కేవలం భూమిని, ప్రకృతిని మాత్రమే నమ్మి జీవిస్తాడు... ఒకరిని మోసం చేసి జీవించడు. కాని మోసపోయి జీవిస్తాడు. సమస్త ప్రానులకు అన్నం పెట్టేది కేవలం రైతు మాత్రమే. రెస్పెక్ట్ farmers, రైతులను గౌరవించండి... అన్న దాత సుఖీభవ.🙏🙏🙏🙏🙏

పబ్లిక్ పరీక్షలు

 *బ్రేకింగ్ న్యూస్*

10 వ తరగతి కు పబ్లిక్ పరీక్షలు

 ఉండవు*

ఇకపై కొత్త విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.*

36 ఏళ్ల తర్వాత కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తోంది.*

కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కొత్త విధానం ప్రకారం-*

కొత్త విద్యా విధానం 2023కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త విద్యా విధానంలోని అతి ముఖ్యమైన ప్రతిపాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:*

>ఐదు సంవత్సరాల ప్రాథమిక విద్య* 

1. నర్సరీ @ 4 సంవత్సరాలు*

2. Jr KG @ 5 సంవత్సరాలు*

3. Sr KG @ 6 సంవత్సరాలు*

4. స్టడీ 1వ @ 7 సంవత్సరాలు*

5. Std 2nd @ 8 సంవత్సరాలు*

మూడు సంవత్సరాల ప్రిపరేటరీ*

6. 3వ తరగతి @ 9 సంవత్సరాలు*

 7. 4వ తరగతి @10 సంవత్సరాలు*

 8. 5వ తరగతి @11 సంవత్సరాలు*

మూడు సంవత్సరాలు మిడిల్*

9. 6వ తరగతి @ 12 సంవత్సరాలు*

10. 7వ తరగతి @ 13 సంవత్సరాలు*

11. 8వ తరగతి @ 14 సంవ త్సరాలు*

నాలుగేళ్ల సెకండరీ*

12. 9వ తరగతి @ 15 సంవత్సరాలు*

 *13.Std SSC @ 16 సంవత్సరాలు*

*14.Std FYJC @17ఇయర్స్*

*15.Std SYJC @18ఇయర్స్*

ప్రత్యేక లక్షణాలు:

 @బోర్డు పరీక్ష 12వ తరగతిలో మాత్రమే జరుగుతుంది*

ఎంఫిల్ డిగ్రీ రద్దు చేయబడు తుంది 4 సంవత్సరాలు*

■ 10వ బోర్డు పరీక్షలు లేవు*

◆5వ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాష, స్థానిక భాష మరియు జాతీయ భాషలలో మాత్రమే బోధించబడుతుంది.* *మిగిలిన సబ్జెక్టు ఇంగ్లిష్ అయినా సబ్జెక్టుగా బోధిస్తారు.*

●ఇంతకుముందు 10వ బోర్డ్ పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి, అది ఇప్పుడు రద్దు చేయబడుతుంది.*

★9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సెమిస్టర్ వారీగా పరీక్ష జరుగుతుంది. పాఠశాల విద్య 5+3+3+4 ఫార్ములా కింద బోధించబడుతుంది.*

*కళాశాల డిగ్రీ 3 మరియు 4 సంవత్సరాలు ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో సర్టిఫికేట్, రెండవ సంవ త్సరంలో డిప్లొమా, మూడవ సంవత్స రంలో డిగ్రీ.

◆ ఉన్నత విద్యను అభ్యసించకూడదనుకునే విద్యార్థులకు 3 సంవత్సరాల డిగ్రీ. మరోవైపు, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు 4 సంవత్సరాల డిగ్రీ కోర్సును అభ్యసించవలసి ఉంటుంది. 4 సంవత్సరాల డిగ్రీ చదివిన విద్యార్థులు ఒక సంవత్సరంలో MA చేయగలుగుతారు.*

●MA విద్యార్థులు ఇప్పుడు నేరుగా PhD చేయగలుగుతారు.*

★విద్యార్థులు మధ్యలో ఇతర కోర్సులు చేయగలుగు తారు. ఉన్నత విద్యలో స్థూల నమో దు నిష్పత్తి 2035 నాటికి 50 శాతం ఉంటుంది. మరోవైపు, కొత్త విద్యా విధానం ప్రకారం, ఒక విద్యార్థి ఒక కోర్సు మధ్యలో మరో కోర్సు చేయాలను కుంటే, అతను ఒక కోర్సు తీసుకున్న తర్వాత రెండో కోర్సు చేయవచ్చు. పరిమిత సమయం వరకు మొదటి కోర్సు నుండి విరామం.*

ఉన్నత విద్యలో అనేక ఇతర సంస్కరణలు కూడా ప్రతిపాదించబడ్డాయి. సంస్కరణల్లో గ్రేడెడ్ అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్షియల్ అటానమీ మొదలైనవి ఉన్నాయి.ఇది కాకుండా, ప్రాంతీయ భాషలలో ఇ-కోర్సులు ప్రారంభించబడ తా యి. వర్చువల్ ల్యాబ్‌ల ను అభివృద్ధి చేస్తారు.*

నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ ఫోరమ్ (NETF) ప్రారంభించబడుతుంది. దేశంలో ఇప్పటి వరకు 45 వేల కాలేజీలు ఉన్నాయి.*

●అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ సంస్థలకు ఏకరూప నియమా లు ఉంటాయి.

భారత ప్రభుత్వం*

శ్రీ హయగ్రీవ మాధవస్వామి ఆలయం

 🕉 మన గుడి : 





⚜ అస్సాం : హజో


⚜ శ్రీ 🕉 మన గుడి : 


⚜ అస్సాం : హజో


⚜ శ్రీ హయగ్రీవ మాధవస్వామి ఆలయం



💠 అస్సాంలో హోజోలో మణికూట పర్వతముపై హయగ్రీవ స్వామి దేవాలయము కలదు. ఇక్కడ స్వామివారి ప్రక్కనే కేదారేశ్వరస్వామి వారి విగ్రహము కూడా ఉన్నది.


💠 ఇక్కడ ఉన్న స్వామివారిని హయగ్రీవ మాధవస్వామి  అని అంటారు. ఈ హయగ్రీవ అవతారము మత్స్యావతారమునకు ముందు అవతారము. 

మధు, కైటభులు అనే రాక్షసులు వేదములను దొంగిలించుకుని వెళ్ళేటప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారమున ఆ రాక్షసులను వధించి వేదములను తిరిగి తీసుకువచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చాడు.


⚜ స్థలపురాణం ⚜


💠 హయగ్రీవుడు (గుర్రపు తలతో విష్ణువు) విష్ణువు యొక్క అవతారాలలో ఒకటి. పురాణాల ప్రకారం, ఒకప్పుడు, మధు మరియు కైటభ అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ దేవుడు నుండి వేదాలను తీసుకువెళ్లారు.

దీనితో మనస్తాపం చెందిన బ్రహ్మ, విష్ణువు నిద్రిస్తున్నప్పుడు లేచి, వేదాలను బాగు చేయమని అభ్యర్థించాడు. 

ఆ సమయంలోనే భగవంతుడు హయగ్రీవుని రూపాన్ని ధరించి, రసాతలానికి (రాక్షసులు వేదాలను ఉంచిన) వెళ్లి, వాటిని తిరిగి పొంది, బ్రహ్మకు తిరిగి ఇచ్చాడు.


💠 వేదాలను తిరిగి పొందిన తరువాత, విష్ణువు మహాసముద్రం యొక్క ఈశాన్య మూలకు వెళ్లి తన హయగ్రీవ రూపంలో అతను నిద్రిస్తున్నప్పుడు, రాక్షసులు తిరిగి వచ్చి స్వామిని యుద్ధం చేయమని సవాలు చేశారు. ఒక పెద్ద యుద్ధం ప్రారంభమైంది మరియు చివరికి రాక్షసులను భగవంతుడు చంపాడు.


💠 ఈ ప్రసిద్ధమైన ఆలయంలో, ప్రధాన దైవం విష్ణువు, గర్భగుడిలో నల్లరాతితో చెక్కబడిన విగ్రహంగా పూజించబడతాడు. మరో నాలుగు రాతి విగ్రహాలు కూడా ఉప దేవతలుగా గుడిలో ఉన్నాయి.


💠 ఈ ఆలయంలో పూరి (ఒరిస్సా)లోని జగన్నాథుని ప్రతిమను పోలి ఉండే విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 

బౌద్ధమతాన్ని అనుసరించే బౌద్ధ లామాలు కూడా ఈ ఆలయాన్ని ప్రధాన యాత్రా స్థలంగా పరిగణిస్తారు. 

ఈ ప్రదేశంలో బుద్ధుడు మోక్షం  పొందాడని మరియు ఆలయం లోపల ఉన్న చిత్రం బుద్ధ భగవంతునిదని వారు నమ్ముతారు.


💠 హజోలో ముఖ్యమైన హిందూమత౦, బౌద్ధమతం, ఇస్లాం మతం అనే మూడు మతాల ఏకైక సంగమం కనిపిస్తుంది, ఇది కూడా హజో పర్యటనలో ఒక ముఖ్యమైన అంశం. 

ఇక్కడ హిందూ దేవుళ్ళు, దేవతలు, బుద్ధుడు, ప్రధాన ముస్లిం సన్యాసులకు చెందిన అనేక ఆలయాలు ఉన్నాయి. 

ఇది అస్సాం రాజధానికి దగ్గరగా ఉండడం వల్ల అందుబాటులో ఉంది, బాగా ప్రసిద్ది చెందింది. 


💠 ఈ చిన్న పట్టణం అస్సాం కామరూప్ జిల్లాలోని శక్తివంతమైన బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. 

హజో చరిత్ర గురించి అనేక అభిప్రాయ బేధాలు ఉన్నాయి. 


💠 ఈ చిన్న పట్టణం మొఘలుల పరిపాలన తరువాత వచ్చిన కోచ్ వంశీయుల రాజధాని అని నమ్మకం. కొన్ని శతాబ్దాలుగా, హజోని వేరువేరు పేర్లతో పిలవడం జరిగింది. 

11 వ శతాబ్దంలో ఇది అపుర్నభవ, మణికూట అని, 18 వ శతాబ్దంలో మనికుత్గ్రం అని పిలవబడింది.


💠 హయగ్రీవ మహాదేవ ఆలయాన్ని పూర్వం 'కాలాపహార్' అనే మహారాజు ధ్వంసం చేసినట్టు చరిత్ర కథనం.

అయితే, ఈ ఆలయం ఏ సంవత్సరంలో నిర్మించారనేది సరిగా చెప్పలేము.

లభిస్తున్న ఆధారాల ప్రకారం 1543వ సంవత్సరంలో పాత నిర్మాణాన్ని ముస్లింలు నాశనం చేసిన తరువాత 1543 ప్రాంతంలో కోచ్ మహారాజు రఘుదేవ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. 


💠 ప్రతి ఏటా బౌద్ధమతానికి సంబంధించిన ఉత్సవాలతోపాటు ప్రధాన హిందూ పండుగలూ జరుగుతాయి. ఆ వాతావరణం ఒక్కసారి చూసి తీరాల్సిందే. ఎందుకంటే- బౌద్ధ సన్యాసులతో.. హిందూత్వ ప్రముఖులతో కిక్కిరిసి ఉండటం. సామాన్య ప్రజానీకానికి అదొక వేడుక.

 

🔅 భీమర్ చారియా 🔅


💠 హయగ్రీవ మహాదేవ ఆలయానికి కొద్ది దూరంలో ఉందీ ప్రాంతం. 

పురాణేతిహాసాల ప్రకారం - 

పూర్వం పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని ఇక్కడ గడిపారనటానికి దాఖలాలు కనిపిస్తాయి. 

ఇప్పటికీ అక్కడ పెద్ద రాతి పాత్రని చూడొచ్చు. ఆ పాత్రలో దిగటానికి మెట్లు కూడా ఉంటాయి. భీమసేనుడు ఈ పాత్రలో భుజించేవాడని కొందరు.. స్నానం చేసేవాడని కొందరు.. ఇలా వారివారి ఊహలకు తగ్గట్టు కథలు అల్లినప్పటికీ - పాండవులు ఇక్కడ నివసించారనేది మాత్రం స్పష్టం.


💠 విమాన మార్గం న్యూఢిల్లీ , కోల్‌కతా, ముంబై, చెన్నై నుండి గౌహతికి ఫ్లైట్ సర్వీస్ ఉంది.


👉 రైలు సదుపాయం హజోకి 23 కిమీ. దూరంలో గౌహతి జంక్షన్ రైల్వే స్టేషన్ కలదు. 

గౌహతికి పశ్చిమాన 30 కి.మీ దూరంలో హజో పట్టణంలో ఈ ఆలయం కలదు. మాధవస్వామి ఆలయం



💠 అస్సాంలో హోజోలో మణికూట పర్వతముపై హయగ్రీవ స్వామి దేవాలయము కలదు. ఇక్కడ స్వామివారి ప్రక్కనే కేదారేశ్వరస్వామి వారి విగ్రహము కూడా ఉన్నది.


💠 ఇక్కడ ఉన్న స్వామివారిని హయగ్రీవ మాధవస్వామి  అని అంటారు. ఈ హయగ్రీవ అవతారము మత్స్యావతారమునకు ముందు అవతారము. 

మధు, కైటభులు అనే రాక్షసులు వేదములను దొంగిలించుకుని వెళ్ళేటప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారమున ఆ రాక్షసులను వధించి వేదములను తిరిగి తీసుకువచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చాడు.


⚜ స్థలపురాణం ⚜


💠 హయగ్రీవుడు (గుర్రపు తలతో విష్ణువు) విష్ణువు యొక్క అవతారాలలో ఒకటి. పురాణాల ప్రకారం, ఒకప్పుడు, మధు మరియు కైటభ అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ దేవుడు నుండి వేదాలను తీసుకువెళ్లారు.

దీనితో మనస్తాపం చెందిన బ్రహ్మ, విష్ణువు నిద్రిస్తున్నప్పుడు లేచి, వేదాలను బాగు చేయమని అభ్యర్థించాడు. 

ఆ సమయంలోనే భగవంతుడు హయగ్రీవుని రూపాన్ని ధరించి, రసాతలానికి (రాక్షసులు వేదాలను ఉంచిన) వెళ్లి, వాటిని తిరిగి పొంది, బ్రహ్మకు తిరిగి ఇచ్చాడు.


💠 వేదాలను తిరిగి పొందిన తరువాత, విష్ణువు మహాసముద్రం యొక్క ఈశాన్య మూలకు వెళ్లి తన హయగ్రీవ రూపంలో అతను నిద్రిస్తున్నప్పుడు, రాక్షసులు తిరిగి వచ్చి స్వామిని యుద్ధం చేయమని సవాలు చేశారు. ఒక పెద్ద యుద్ధం ప్రారంభమైంది మరియు చివరికి రాక్షసులను భగవంతుడు చంపాడు.


💠 ఈ ప్రసిద్ధమైన ఆలయంలో, ప్రధాన దైవం విష్ణువు, గర్భగుడిలో నల్లరాతితో చెక్కబడిన విగ్రహంగా పూజించబడతాడు. మరో నాలుగు రాతి విగ్రహాలు కూడా ఉప దేవతలుగా గుడిలో ఉన్నాయి.


💠 ఈ ఆలయంలో పూరి (ఒరిస్సా)లోని జగన్నాథుని ప్రతిమను పోలి ఉండే విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 

బౌద్ధమతాన్ని అనుసరించే బౌద్ధ లామాలు కూడా ఈ ఆలయాన్ని ప్రధాన యాత్రా స్థలంగా పరిగణిస్తారు. 

ఈ ప్రదేశంలో బుద్ధుడు మోక్షం  పొందాడని మరియు ఆలయం లోపల ఉన్న చిత్రం బుద్ధ భగవంతునిదని వారు నమ్ముతారు.


💠 హజోలో ముఖ్యమైన హిందూమత౦, బౌద్ధమతం, ఇస్లాం మతం అనే మూడు మతాల ఏకైక సంగమం కనిపిస్తుంది, ఇది కూడా హజో పర్యటనలో ఒక ముఖ్యమైన అంశం. 

ఇక్కడ హిందూ దేవుళ్ళు, దేవతలు, బుద్ధుడు, ప్రధాన ముస్లిం సన్యాసులకు చెందిన అనేక ఆలయాలు ఉన్నాయి. 

ఇది అస్సాం రాజధానికి దగ్గరగా ఉండడం వల్ల అందుబాటులో ఉంది, బాగా ప్రసిద్ది చెందింది. 


💠 ఈ చిన్న పట్టణం అస్సాం కామరూప్ జిల్లాలోని శక్తివంతమైన బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. 

హజో చరిత్ర గురించి అనేక అభిప్రాయ బేధాలు ఉన్నాయి. 


💠 ఈ చిన్న పట్టణం మొఘలుల పరిపాలన తరువాత వచ్చిన కోచ్ వంశీయుల రాజధాని అని నమ్మకం. కొన్ని శతాబ్దాలుగా, హజోని వేరువేరు పేర్లతో పిలవడం జరిగింది. 

11 వ శతాబ్దంలో ఇది అపుర్నభవ, మణికూట అని, 18 వ శతాబ్దంలో మనికుత్గ్రం అని పిలవబడింది.


💠 హయగ్రీవ మహాదేవ ఆలయాన్ని పూర్వం 'కాలాపహార్' అనే మహారాజు ధ్వంసం చేసినట్టు చరిత్ర కథనం.

అయితే, ఈ ఆలయం ఏ సంవత్సరంలో నిర్మించారనేది సరిగా చెప్పలేము.

లభిస్తున్న ఆధారాల ప్రకారం 1543వ సంవత్సరంలో పాత నిర్మాణాన్ని ముస్లింలు నాశనం చేసిన తరువాత 1543 ప్రాంతంలో కోచ్ మహారాజు రఘుదేవ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. 


💠 ప్రతి ఏటా బౌద్ధమతానికి సంబంధించిన ఉత్సవాలతోపాటు ప్రధాన హిందూ పండుగలూ జరుగుతాయి. ఆ వాతావరణం ఒక్కసారి చూసి తీరాల్సిందే. ఎందుకంటే- బౌద్ధ సన్యాసులతో.. హిందూత్వ ప్రముఖులతో కిక్కిరిసి ఉండటం. సామాన్య ప్రజానీకానికి అదొక వేడుక.

 

🔅 భీమర్ చారియా 🔅


💠 హయగ్రీవ మహాదేవ ఆలయానికి కొద్ది దూరంలో ఉందీ ప్రాంతం. 

పురాణేతిహాసాల ప్రకారం - 

పూర్వం పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని ఇక్కడ గడిపారనటానికి దాఖలాలు కనిపిస్తాయి. 

ఇప్పటికీ అక్కడ పెద్ద రాతి పాత్రని చూడొచ్చు. ఆ పాత్రలో దిగటానికి మెట్లు కూడా ఉంటాయి. భీమసేనుడు ఈ పాత్రలో భుజించేవాడని కొందరు.. స్నానం చేసేవాడని కొందరు.. ఇలా వారివారి ఊహలకు తగ్గట్టు కథలు అల్లినప్పటికీ - పాండవులు ఇక్కడ నివసించారనేది మాత్రం స్పష్టం.


💠 విమాన మార్గం న్యూఢిల్లీ , కోల్‌కతా, ముంబై, చెన్నై నుండి గౌహతికి ఫ్లైట్ సర్వీస్ ఉంది.


👉 రైలు సదుపాయం హజోకి 23 కిమీ. దూరంలో గౌహతి జంక్షన్ రైల్వే స్టేషన్ కలదు. 

గౌహతికి పశ్చిమాన 30 కి.మీ దూరంలో హజో పట్టణంలో ఈ ఆలయం కలదు.

కటపయాది


 కటపయాది పట్టిక (మిగిలిన వివరాలు కింది సందేశంలో)


పంచాంగంలో తారాబలం చూసుకునేందుకు ఒక పట్టిక ఉంటుంది కదా, జన్మతార నుండి పరమమిత్ర తార వరకూ, నక్షత్రాన్ని బట్టి. అలాగే  అక్షరాలకు కొన్ని సంఖ్యలను కేటాయించి పెట్టారు మన పూర్వీకులు, భారతీయ శాస్త్రజ్ఞులు. దాన్ని *కటపయాది*  పద్ధతి అన్నారు.


మనం చిన్నప్పుడు రాహుకాలం ఏ రోజు ఏ సమయానికి వస్తుందో తెలుసుకొనేందుకు ఇంగ్లీష్ లో *Mother saw father.....* అని నేర్చుకొన్నట్టు సంఖ్యలను, పదాలద్వారానూ, శ్లోకాల ద్వారానూ సులువుగా గుర్తుపెట్టుకోవడానికి వాడిన ఒక ప్రాచీన భారతీయ విధానం, కటపయాది పద్ధతి. కొన్ని అక్షరాలకు ఒకే లేదా వేర్వేరు అంకెలను కేటాయించి, మరికొన్నిటి విలువని సున్నాగా నిర్ణయించి, అర్థవంతమైన పదాలను సృష్టించి, తద్వారా సంక్లిష్టమైన సంఖ్యలను గుర్తుపెట్టుకోగలగడం, ఈ కటపయాది యొక్క ప్రత్యేకత.

శంకరవర్మ వ్రాసిన సద్రత్నమాల లోని ఈ క్రింది శ్లోకం, ఈ పద్ధతిని వివరిస్తుంది.


నజ్ఞావచశ్చ శూన్యాని సంఖ్యా: కటపయాదయ:|

మిశ్రే తూపాన్త్యహల్ సంఖ్యా న చ చిన్త్యో హలస్వర:||


అనగా, 'న', 'ఞ', , అచ్చులకు "సున్న" విలువ ఇవ్వబడుతుంది. కటపయతో మొదలు అన్ని హల్లులకు 1-9 వరకూ విలువలివ్వబడ్డాయి. సంయుక్త అక్షరాలు (వత్తులతో సహా) వచ్చినపుడు, వెనుక వచ్చిన హల్లుని మాత్రమే లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పొల్లు అక్షరాలను విడిచిపెట్టాలి.


ఈ విధంగా కటపయాది పద్ధతిలో చూచినపుడు షకటప కు కుడినుంచి ఎడమకు 1116 వస్తుంది. అంటే 1116 అని అర్థం. పూర్వం శ్రీ వేదం వెంకట్రాయ శాస్త్రి గారు అను ప్రసిద్ధ సాహిత్యవేత్తకు *షకటప* అంటే 1116.00 ఒసంగడం ఓ గర్వకారణమైన సంఘటన.

ఆర్య చాణక్య*♦️ *అధ్యాయము - 17 : పార్ట్ - 111*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*అధ్యాయము - 17 : పార్ట్ - 111*


చాణక్యుని భేదోపాయము ఫలించింది. మలయకేతు కారాగారమున బంధితుడుకాగా అతని సేనలు విధిలేక మగధసేనలకు తలవోగ్గాయి. చంద్రగుప్తుని పేర జయజయధ్వనులతో పాటలీపుత్రము హోరెత్తి పోయింది.


రాక్షసామాత్యుడు రహస్యదారుల వెంట నడిచి పాటలీపుత్రపు పొలిమేరలకి చేరుకునేసరికి బాటసారుల ముచ్చట్లు ద్వారా ఆ విశేషాలన్నీ అతని చెవిన పడ్డాయి. నిస్సహాయ, నిరాధారా, నిర్భాగ్యస్థితిలో వ్యధాభరిత హృదయంతో కుసుమపుర వనసీమల ప్రాంతానికి చేరుకున్న అతడు ఆ రాత్రి నగర ప్రవేశం చెయ్యలేక ఒక వనమందు ఒంటరిగా విశ్రమించాడు. 


రాక్షసుని రహస్యంగా అనుసరించి వచ్చిన సిద్ధార్థకుడు నగరప్రవేశం చేసి చాణక్యునికి ఆ విశేషాలన్నీ వివరించాడు. 


"శభాష్ సిద్ధార్థకా.... ! చాణక్య శిష్యుడివంటే నీవే.... " అని అభినందించాడు. 


అక్కడే ఉన్న శార్జరవుడు మొహం మాడ్చుకుని "అలాంటి అవకాశాలు మాకూ ఇస్తే ఆ ఏడుపులేవో మేమూ ఏడుస్తాం గదా...." అన్నాడు బుంగమూతి పెట్టి. 


చాణక్యుడు అతడివైపు అదోలా చూసి "నిజమే... ఏడుపులకు నువ్వే తగినవాడివి... ప్రాతఃకాలంలో నీ ఏడుపు మరింత మధురంగా ఉంటుంది. నీ ఏడుపుకి కరిగిపోయి, రాక్షసామాత్యుడు తన మిత్రుడు చందనదాసుని రక్షించుకోవడానికి వధ్యస్థానానికి పరిగెత్తుకురావాలి. అర్థమైందా ?" అన్నాడు. 


శార్జరవుడు నవ్వి "రేప్పొద్దున చూస్తారుగదా, నా ఏడుపు మహత్యం..." అన్నాడు. 


చాణక్యుడు మందహాసం చేస్తూ సిద్దార్థకుని వైపు తలతిప్పి "రేపు ప్రాతఃకాలంలో నువ్వూ, ఆగమసిద్ధీ చండాలుర అవతారాలెత్తుతారు" అన్నాడు. 


సిద్ధార్థకూడు నవ్వుతూ "ఆచార్యా ! సద్భ్రాహ్మణ పుట్టక పుట్టి చండాలుర వేషాలా....?" అన్నాడు.  


చాణక్యుడూ నవ్వి "అవును. చాణక్యుని ఆదేశానుసారం చందనదాస శ్రేష్టిని శూలారోహణం ఎక్కించి మరణశిక్ష అమలు పరచవలసిన వారు మీరే...." అన్నాడు నర్మగర్భంగా. 


ఆ మరునాడు - ప్రాతఃకాల సమయంలో ఉద్యానవనంలోని ఓ వృక్షాన్ని ఆనుకొని తనలో తానే పరితాపం చెందుతున్నాడు రాక్షసామాత్యుడు. 


"ఆహాహ ...! ఏమి నా దౌర్భాగ్యం .... శ్రోత్రియబ్రాహ్మణ వంశంలో పుట్టి, వేదశాస్త్రాలను అభ్యసించి, రాజనీతి శాస్త్రమునందు పరిణితి చెంది, మగధ మహాసామ్రాజ్యమునకు మహామంత్రినైన నేను.... నేను నిస్సహాయుడినై, నిరాధారుడినై, నిలువనీడలేక ఈ ఉద్యానవనమున తలదాచుకోవలసి వచ్చింది గదా... ఏమైనది... నా అఖండ ప్రజ్ఞా దురంధరత్వం... ? రాజకీయ చదరంగపు ఎత్తుగడలతో నన్ను మించిన వారు లేరని గర్వించాను గదా.... ఆ చాణక్యుని ఎత్తుల ముందు.... ఏమైనది నా మేధా సంపత్తి....? భార్యాబిడ్డలకు దూరమై... మిత్రులచే అవమానముల పాలై .... నేటికీ దొంగవలె చాటుమాటున దాక్కోవలసిన దుర్గతి పట్టింది కదా.... చీఛీ.... ఎందులకీ పాడు బ్రతుకు.... ?" 


రాక్షసామాత్యుడు ఆవేదనా భరిత హృదయంతో వ్యధ చెందుతూ "ఇంతకీ కారణము ఆ చాణక్య హతకుడా .... ? కాదు. కాదు. నా దురదృష్టమునకు పరులను నిందించి ఏమి ప్రయోజనం ? ధర్మమును నిలబెట్టవలసిన  బ్రాహ్మణుడై ఉండీ, అధర్మంగా మగధసింహాసన మెక్కిన నవనందులకు వూడిగం చేసిన పాప ఫలితమే ఇది... సుక్షత్రియుడూ, నందవంశ నిజవారసుడైన చంద్రగుప్తుని నాశనమొనర్చడానికి కుట్రలు పన్నినందుకే ఈ పరిహారం ... నాకన్న చాణక్యుడే మిన్న... ధర్మస్థాపన కొరకు చంద్రగుప్తుని సింహాసనం మెక్కించాడు. మగధ సింహాసనం పరరాజన్యుల పాలుగాకుండా అడ్డుకున్నాడు... నేనెంతగా పగసాధించాలని వురకలెత్తినా... అతడంతకంత సంయమనం పాటించి నన్ను ఉపేక్షించాడు. లేకున్న, ఆనాడు యుద్దరంగంలో చంద్రగుప్తుడు నన్ను చంపేవాడే గదా.... అహంకారంతో, అహంభావంతో నా అంతటివాడు లేడన్న మదంతో విర్రవీగనే గానీ... నిజానికి ఆ చాణక్య చంద్రగుప్తుల ఔదార్యం ముందు నేనెంత ? జరిగిన దానికంతటికీ... కారకుడను నేనే ... నేనే...." అని వాపోయాడు బాధతో. సరిగ్గా ఆ సమయంలో ...


"ఓరి రాక్షసా ! మిత్రద్రోహీ ! ఎక్కడున్నావురా ...?" అన్నకేక బిగ్గరగా వినపడింది. రాక్షసుడు వులిక్కిపడి లేచి నిలుచున్నాడు. 


"ఈ ప్రాతఃకాలం సమయంలో, ఈ నిర్జనవనంలో తనని పేరుపెట్టి దూషిస్తున్న వారెవరు ...?" 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఓ హస్యప్రియుని వేదన🤭

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

#ఫ్లాష్.. #ఫ్లాష్... #ఫ్లాష్...(Breaking news) గుంటూరులో ఫేస్‌బుక్‌ స్నేహం పేరుతో మరో భారీ దారుణ మోసం


తానో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ను అని నమ్మించింది. మొదట స్నేహం అన్నది. తర్వాత ప్రేమ అన్నది. నెమ్మదిగా పరిచయం పెంచుకున్నది


అబ్బాయి వివరాలు, కుటుంబ నేపథ్యం తెలుసుకున్నది

తేనే పూసిన కత్తిలా తీయని మాయ మాటలు చెప్పి అతని చిరునామా తెలుసుకున్నది.

బయట కలవటం నాకిష్టం ఉండదు..కాబట్టి

ఇంటికి వచ్చి కలుస్తాను అని మర్యాదస్తురాలిగా మాట్లాడింది.


ఒకరోజు మిట్ట మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని ఇంటికి వచ్చింది

ఎవరూ లేరని రారని నిర్థారించుకుంది

నెమ్మదిగా తీయని మాటల్లో దించింది.


అప్పటికే హ్యాండ్ బ్యాగ్లో సిద్ధం చేసుకున్న మత్తుమందు కలిపిన చాక్లెట్‌ తీసి తనకు ఇచ్చింది అది తిన్న ఆ యువకుడు నెమ్మదిగా సోఫాలో మాట్లాడుతూ మగతగా తలవాల్చేసాడు..!


వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వంట గదివైపు వెళ్ళి ఫ్రిజ్ డోర్ తీసి తనతో తెచ్చుకున్న కవరు నిండా టమాటాలు నింపుకుని 

వడివడిగా ఇంటి వరండా లోకి వెళ్ళి పారిపోయింది..!


😁😁😁😁😁 క్షమించండి బాస్, పెరిగిన రేట్లు తో కొనలేక, ఏమిచేయాలో తెలియక పాపం ఓ హస్యప్రియుని వేదన🤭🤭😁

సేకరణ:- వాట్సాప్ పోస్ట్

యోగవాసిష్ఠ రత్నాకరము*

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము

మూడవ అధ్యాయము 

మోక్షసాధనము

 

3-73

అతో మనోజయశ్చిన్త్యః శమసంతోషసాధనః అనన్తసమసంయోగ స్తస్మాదానన్ద ఆప్యతే. 


అందుచే అనంతపరమాత్మతో ఐక్యము నందుటకొఱకై శమ, సంతోషాది సాధనములతో గూడి మనోజయమును గూర్చి చింతింపవలెను. ఏలయనగా ఆ పరమాత్మ సాక్షాత్కారము చేతనే ఆనందము లభించును.


3-74

తిష్ఠతా గచ్ఛతా చైవ పతతా భ్రమతా తథా 

రక్షసా దానవేనాపి దేవేన పురుషేణ వా. 

3-75

మనః ప్రశమనోద్భూతం తత్ర్పాప్యం పరమం సుఖమ్‌ వికాసిశమ వుష్పస్య వివేకోచ్చతరోః ఫలమ్‌. 


కూర్చొనుచున్నను, నడచుచున్నను, పడుచున్నను, తిరుగుచున్నను, లేక రాక్షసుడై యున్నను, దేవతయై యున్నను, మనుజుడై యున్నను, కేవలము మనశ్శాన్తి చేతనే జీవునకు వికాసవంతమగు శమము (మనోజయము) అను పుష్పముచే శోభితమగు వివేకమను గొప్ప వృక్షము యొక్క ఫలమగు పరమాత్మ సుఖము సంప్రాప్తించుచున్నది. 


శ్రీ వాల్మీకీచే రచింపబడిన మోక్షోపాయమగు యోగవాసిష్ఠ రత్నాకరమున ముముక్షు ప్రకరణమందు మోక్షసాధనమను మూడవ అధ్యాయము సమాప్తము.

**

ముముక్షు ప్రకరణము 

*నాల్గవ అధ్యాయము*

*శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము*

 

శ్రీ వసిష్ఠ ఉవాచ:-

4-1‌‌

మోక్షద్వారే ద్వారపాలానిమాన్‌ శృణు యథాక్రమమ్‌ యేషామేకతమాసక్త్యా మోక్షద్వారం ప్రవిశ్యతే.


శ్రీ వసిష్ఠుడు :- ఓ రామచంద్రా! మోక్షద్వారపాలకులను గుఱించి క్రమముగ చెప్పుచున్నాను, వినుము. వీనిలో ఏయొక్కదాని నాశ్రయించినను మోక్షద్వారమున ప్రవేశింపవచ్చును.


4-2

త్రైలోక్యోదరవర్తిన్యో నానన్దాయ తథా శ్రియః సామ్రాజ్యసంపత్ప్రతిమా యథా శమవిభూతయః.


ముల్లోకములందున్న సంపదలలో నేదియుగూడ సామ్రాజ్య సంపత్తిని బోలు శమమను ఐశ్వర్యముతో సమానముగ ఆనందము నీయజాలవు.


4-3

యాని దుఃఖాని తృష్ణా దుఃసహా యే దురాధయః తత్సర్వం శాన్తచేతఃసు తమోఽ ర్కేష్కివ నశ్యతి.


ఈ ప్రపంచమున ఏయే దుఃఖములు, తృష్ట, సహించుటకు కష్ట సాధ్యములగు మానసికపీడలు కలవో; అవి యన్నియు శాంతచిత్తులకు సూర్యప్రకాశమునందు అంధకారమువలె నశించిపోవును.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము 

నాల్గవ అధ్యాయము 

శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము

 


4-4

శ్రుత్వా స్పృష్ట్వా చ దృష్ట్వా చ భుక్త్వా ఘ్రాత్వా శుభాశుభమ్‌ 

న హృష్యతి గ్లాయతి యః స శాన్త ఇతి కథ్యతే.


శుభమైనట్టిగాని, అశుభమైనట్టిగాని పదార్థములను వినినపుడు గాని, తాకినపుడుగాని, చూచినపుడుగాని, తినినపుడుగాని, వాసన చూచినపుడుగాని, ఎవడు సంతోషమునుగాని, దుఃఖమునుగాని బొందకుండునో ఆతడే శాంతుడని (శమయుక్తుడని) చెప్పబడును. 


4-5

యః సమః సర్వభూతేషు భావి కాంక్షతి నోజ్ఝతి జిత్వేన్ద్రియాణి యత్నేన 

స శాన్త ఇతి కథ్యతే. 


ఎవడు సమస్త ప్రాణులందును సమబుద్ధి కలిగియుండునో భావికాల సుఖాదులను కోరకయు, యథాప్రాప్తములగు వర్తమాన క్రియలను త్యజింపకయు నుండునో; ప్రయత్నముచే ఇంద్రియములను జయించునో, ఆతడే శాంతుడని (శమయుక్తుడని) చెప్పబడును. 


4-6

స్థితోఽ పి న స్థిత ఇవ న హృష్యతి న కుప్యతి 

యః సుషుప్తసమః స్వస్థః స శాన్త ఇతి కథ్యతే. 


హర్ష, కోపములను బొందనివాడును, సుషుప్తియందున్నవానివలె స్వస్థచిత్తుడై యుండువాడును శాంతుడని (శమయుక్తుడని) చెప్పబడును.


4-7

అప్యాపత్సు దురన్తాసు కల్పాన్తేషు మహత్స్వపి తుచ్ఛేఽ హం న మనో యస్య స శాన్త ఇతి కథ్యతే.  


భయంకరములును, దీర్హకాలికములును, కల్పాంత విపత్తుల్యములు నగు గొప్ప గొప్ప ఆపదలందును, మిథ్యాభూతములై, నశ్వరము లైనట్టి దేహాదులందెవనికి 'నేను' అను బుద్ధియుండదో; ఆతడు శాంతుడు (శమవంతుడని)అని చెప్పబడును. 


4-8

శమమమృత మహార్యమార్యగుప్తం 

పరమవలంబ్య పరం పదం ప్రయాతాః

4-9

రఘుతనయ యథా మహానుభావాః 

క్రమమనుపాలయ సిద్ధయే తమేవ.


ఓ రామచంద్రా! 'శమము' అను అమృతము ఇతరులచే అపహరింపబడుటకు శక్యము కానిది; ఉత్తములగు మనుజులు దీనిని బహుజాగ్రత్తగా రక్షించుకొనిరి; మహానుభావు లగువారు ఇట్టి శమమను ఉత్కృష్టసాధనమునే ఆశ్రయించి పరమాత్మ పదమును బొందిరి. మోక్షసిద్ధికొఱకై నీవున్ను అదియే శమమును అవలంబింపుము. 


4-10

శాస్త్రావబోధామలయా ధియా పరమపూతయా 

కర్తవ్యః కారణజ్ఞేవ విచారోఽ నిశమాత్మనః.


(విషయ; సంశయ, పూర్వపక్ష, సిద్ధాంత ప్రయోజనములను విభాగముల నెఱిఁగిన) వివేకశీలుఁడగు మనుజుడు శాస్త్రబోధ సహితమై, నిర్మలమై, పరమ పవిత్రమైనట్టి బుద్ధిచే నిరంతరము ఆత్మను గూర్చిన విచారణ సలుపవలయును.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము 

నాల్గవ అధ్యాయము 

శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము


4-11

విచారాత్తీక్షతామేత్య ధీః పశ్యతి పరం పదమ్‌ 

దీర్ఘసంసారరోగస్య విచారో హి మహౌషధమ్‌.


విచారణచే బుద్ధి తీక్షణత్వము జెంది పరమాత్మ పదమును వీక్షించును. సంసారమను దీర్ఘరోగమునకు తత్త్వవిచారణయే గొప్ప ఔషధము. 


4-12

మోహేన బన్ధునాశేషు సంకటేషు శమేషు చ 

సర్వం వ్యాప్తం మహాప్రాజ్ఞ విచారో హి సతాం గతిః. 


మహాప్రాజ్ఞుఁడవగు రామచంద్రా! బంధువినాశములందును, సంకట భయస్థానములందును, తదితర ఆపదలందును జనులకు కర్తవ్యము, దుఃఖ నివారణోపాయము ఏమియు తెలియుట లేదు. సమస్తము అజ్ఞానముచే వ్యాప్తమై యున్నది, కాబట్టి అట సత్పురుషులకు విచారణయే శరణ్యమై యున్నది. 


4-13

బలం బుద్ధిశ్చ తేజశ్చ ప్రతిపత్తిః క్రియాఫలమ్‌ ఫలంత్యేతాని సర్వాణి విచారేణైవ ధీమతామ్‌. 


విచారణవలననే బుద్ధిమంతులకు బలము, బుద్ధి, తేజస్సు, సమయోచితమగు స్పురణ, క్రియానుష్ఠానము, తత్ఫలమున్ను లభించుచుండును.


4-14

యుక్తాయుక్తమవాదీపమభివాంఛితసాధకమ్‌ 

స్ఫారం విచారమాశ్రిత్య సంసారజలధిం తరేత్‌, 


ఏది యుక్తమైనది, ఏది అయుక్తమైనది అని తెలుపుటలో గొప్ప దీపము వంటిదియు, వాంఛితార్థమును (మోక్షమును) సాధించు నదియుగు మహత్తర (తత్త్వ) విచారణ నాశ్రయించి సంసార సాగరమును దాటివేయవలెను. 


4-15

యా వివేకవికాసిన్యో మతయో మహతామివా 

న తా విపది మజ్జన్తి తుమ్బకానీవ వారిణి. 


నీటియందు ఎండుసొరకాయబుఱ్ఱ మునుగనట్లు ఈ ప్రపంచమున వివేకముచే వికసితములగు మహాత్ముల బుద్ధులు విపత్తునం దెన్నటికిని మునుంగ నేరవు (దుఃఖింపవు) 


4-16

విచారచారవో జీవా భాసయన్తో దిశో దశ 

భాన్తి భస్కరవన్నూనం భూయో భవభయాపహాః.  


తత్త్వవిచారణచే శోభించునట్టి జీనన్ముక్తులగు జీవులు తమ జ్ఞానప్రకాశముచే దశదిశలను ప్రకాశింపజేయుచు, అనేక జీవులయొక్క సంసారభయమును అంధకారమును రూపుమాపుచు నిక్కముగ సూర్యునివలెనే ప్రకాశించుచున్నారు.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము 

నాల్గవ అధ్యాయము 

శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము

 

4-17

బాలస్య స్వమనోమోహకల్పితః ప్రాణహారకః

రాత్రౌ నభసీ వేతాలో విచారేణ విలీయతే.


రాత్రియందు ఆకాశమున బాలుని స్వకీయ అజ్ఞానముచే కల్పిత మైనట్టియు, భీతిద్యారా ఆ బాలుని ప్రాణమునుగూడ హరించునదియునైన బేతాళము విచారణచే విలీనమై పోవుచున్నది. (అట్లే ఈ జగత్తున్ను)


4-18

సర్వ ఏవ జగద్భావా అవిచారేణ చారవః అవిద్యమానసద్భావా విచారవిశరారవః


జగత్తునందలి పదార్థము లన్నియును విచారింపని కారణముచేతనే సత్యములుగను, రమణీయములుగను గన్పట్టుచున్నవి. విచారణ చేసిన తోడనే అవి సన్నగిల్లి మిథ్యాభూతములై యొప్పును. 


4-19

న దదాతి న చాదత్తే న చోన్నమతి శామ్యతి 

కేవలం సాక్షివత్పశ్యన్ జగదాభోగి తిష్ఠతి. 


అప్పుడు విచారణా శీలుడగు మనుజుడు ఈ విశాలజగత్తును కేవలము సాక్షివలే గనుచుండును; మనస్సును దానియందు వ్యాపింపజేయడు; దేనినీ గ్రహింపడు; భోగింపడు; శాంతుడైయుండును.


4-20

కోఽ హం కస్య చ సంసార ఇత్యాపద్యపి ధీమతా చిన్తనీయం ప్రయత్నేన సప్రతీకారమాత్మనా.


'నేనెవడను? ఈ ప్రపంచ మెచటనుండి యేతెంచినది?' ఈ ప్రకారముగ ఆపదయందును ధీమంతుడగువాడు సంసార ప్రతీకారమగు శ్రవణాద్యనుష్ఠానముతో గూడ ప్రయత్నపూర్వకముగ స్వయముగ చింతన చేయవలెను. 


4-21

పరమాత్మమయీ మాన్యా మహానన్దైకసాధినీ 

క్షణమేకం పరిత్యాజ్యా న విచారచమత్కృతిః.


పరమాత్మమయ మైనదియు, తక్కిన అన్ని విచారణలకంటెను అధికమగు ప్రతిష్ఠతో గూడినదియు, మహానందమునే సాధించునదియుగు ఆత్మతత్త్వ విచారణను ఒక్క క్షణమైనను విడువరాదు. 


4-22

విచారకాన్తమతయో వానేకేషు పునః పునః 

లుఠన్తి దుఃఖశ్వభ్రేషు జ్ఞాతాధ్యగతయో నరాః.


విచారణచే సుందరమైనట్టి బుద్ధిగలవారును, మోక్షమార్గముల నెఱింగిన వారునగు మనుజులు అనేక దుఃఖములను గోతులందు మరల మరల దొఱలకుందురు

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


ముముక్షు ప్రకరణము 

నాల్గవ అధ్యాయము 

శమ విచార సంతోష సత్సాంగత్యం నిరూపణము


4-23

వరం కర్దమభేకత్వం మలకీటకతా వరమ్‌ వరమన్ధగుహాహిత్వం న నరస్యావిచారితా.


బురదయందు కప్ప అయియుండుట మేలు; మలమందు కీటకమై (పురుగై) యుండుట మేలు; అంధకారబంధురమగు గుహయందు పామై యుండుట మేలు కాని మనుజునకు తత్త్వవిచారణ లేక యుండుట మాత్రము ఉత్తమము కాదు. 


4-24

కోఽ హం కథమయం దోషః సంసారాఖ్య ఉపాగతః న్యాయేనేతి పరామర్శో విచార ఇతి కథ్యతే. 


నేనెవడను? (ఈ శరీరాదులు నేనా? లేక తద్విలక్షణుడనా?) ఈ జగత్తున దోష మెట్లేతించినది? (అధిష్టానమగు ఆత్మ యందెట్లేర్పడినది?) ఈ ప్రకారముగ శ్రుతి, గుర్వాదులు తెలిపిన రీతి పరామర్శచేయుట విచారణయని చెప్పబడుచున్నది.


4-25

విచారాజ్జాయతే తత్త్వం తత్త్వాద్విశ్రాన్తిరాత్మని 

అతో మనసి శాన్తత్వం సర్వదుఃఖపరిక్షయః. 


విచారణచే తత్త్వ మెఱుఁగబడుచున్నది. తత్త్వజ్ఞానముచే ఆత్మయందు స్థితి (విశ్రాంతి) సంభవించుచున్నది. అట్టి ఆత్మస్థితిచే మనస్సునందు శాంతియు, సర్వదుఃఖ వినాశమున్ను కలుగుచున్నవి.


4-26

సంతో షైశ్వర్యసుఖినాం చిరవిశ్రాన్తచేతనామ్‌ సామ్రాజ్యమపి శాన్తానాం జరత్తృణలవాయతే. 


సంతోషము (సంతుష్టి )అను ఐశ్వర్యముచే సుఖవంతులును, అట్టి సంతోషముచే చిరకాలము విశ్రాంతి నొందిన చిత్తము గలవారునగు శాంతపురుషులకు విశాల సామ్రాజ్యమున్ను శిథిల తృణలేశమువలె తోచును. 


4-27

సంతోషశాలినీ బుద్ధి రామ సంసారవృత్తిషు నిషమాస్వప్యనుద్విగ్నా న కదాచన హీయతే.


ఓ రామచంద్రా! సంతుష్టిచే శోభాయమానమగు బుద్ధి దారిద్ర్యవియోగాది భయంకర సంసార దశలందును సుఖము నెన్నటికిని గోల్పోదు. 


4-28

అప్రాప్తవాంఛాముత్సృజ్య సంప్రాప్తే సమతాం గతః అదృష్టఖేదాఖేదో యః స సంతుష్ట ఇహోచ్యతే.


ప్రాప్తింపని వస్తువును గూర్చిన కోరిక లేనివాడును, ప్రాప్తించిన వస్తువునందు మిథ్యాత్వమును గాంచుటచే దానియందు హర్షశోకములు లేనివాడై, ఆ వస్తువు ప్రాప్తింపనట్లే యుండువాడును, సుఖదుఃఖాది ద్వంద్వములు లేనివాడు నగు మనుజుడు సంతుష్టుఁడని చెప్పబడును.

యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి*

 *యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి* ? 


దేశంలో అన్ని మతాల వారికి ఒకటే చట్టం, ఒకే న్యాయం అని అర్థం.


మనదేశంలో హిందువులకు ఒక చట్టం ఉంది. ముస్లింలకు క్రిస్టియన్లకు వేరే చట్టాలు ఉన్నాయి.


ఉదాహరణకు హిందువులలో మగవాడు  ఒక భార్య ఉండగా రెండో భార్యను కలిగి ఉండరాదు. కానీ మన దేశంలో ముస్లింలు ఒకేసారి నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. వారి కోసం ప్రత్యేక వివాహ చట్టం, ఆస్తి హక్కు చట్టం కూడా ఉన్నాయి. 


హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంటే, ఆ హిందూ అమ్మాయికి ఆ ముస్లిం కుటుంబం నుంచి వచ్చే ఆస్తి లో ఎటువంటి  హక్కు ఉండదు. 


ఆ ముస్లిం అబ్బాయి చనిపోతే అతని తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఎటువంటి ఆస్తి ఇవ్వకుండా బయటికి గెంటి వేయవచ్చు . 


కానీ మతం మారి బయటకు వెళ్లిపోయిన హిందువు అమ్మాయికి  తన తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మాయి చనిపోతే ఆ ముస్లిం అబ్బాయి హిందువుల కుటుంబం నుంచి ఆస్తిని హక్కుగా పొందవచ్చు.


అంతేగాక ముస్లింలు మగవాళ్ళు ఒక్కొక్కళ్ళు నలుగురు భార్యలతో వారి జనాభాను విపరీతంగా పెంచుకుని ఈ దేశం మొత్తాన్ని ఆక్రమించడానికి చాలా పెద్ద ప్రణాళిక నడుస్తోంది.


కానీ విచిత్రం ఏమిటంటే, వివాహ చట్టాలు,  ఆస్తి హక్కు చట్టాలు తమ మతం ప్రకారం పెట్టుకున్న ముస్లింలు,  నేరాలకు శిక్షలకు సంబంధించి  వారి షరియా చట్టం ప్రకారం కాకుండా  భారతదేశ చట్టాలు స్వీకరిస్తున్నారు. ఎందుకంటే వారి షరియా చట్టాలు శిక్షలు  అత్యంత క్రూరమైనవి, కఠినమైనవి.


ఇలాంటి విపరీతాలు మన దేశంలో చాలా ఉన్నాయి. 


*యూనిఫామ్ సివిల్ కోడ్ అనగా ఉమ్మడి పౌరస్మృతి* కనుక వస్తే ఇలాంటి అన్యాయాలు ఉండవు.


 *హిందువుల మీద ఎంతో ప్రేమతో కాంగ్రెస్ పార్టీకి చెందిన జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి చట్టాలన్నీ  తీసుకువచ్చాడు.* 


ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం  యూనిఫామ్ సివిల్ కోడ్ మీద  అన్ని మత సంస్థలను, ప్రజలను వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరింది.


మీరు తప్పకుండా *యూనిఫామ్ సివిల్ కోడ్ మన దేశానికి అవసరం అంటూ  కేంద్ర ప్రభుత్వానికి మీ మొబైల్ నుంచి  e-మెయిల్ పంపించండి*.  


మీకు తెలిసిన వారందరికీ కూడా  ఈ పోస్టును షేర్ చేసి  వాళ్ల చేత కూడా  యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి అంటూ e మెయిల్ పంపమని చెప్పండి. ఈ దేశాన్ని రక్షించుకుందాం ..


https://youtu.be/wZcXltHvMVE

Hindu

 *India's richest man* Mukesh Ambani says that if you put bananas and lots of money in front of a monkey, the monkey will pick up bananas and not money. Because he doesn't know that money can buy a lot of bananas.


*In the same way today, if in reality the people of India are asked to choose between personal interest and National security, they will choose only personal interest. Because they are not able to understand that if the Nation is not safe, then where will they tie the bundles of personal interests and take them?*


There are three contradictory trends going on these days------


*First:-* India is a poor country, so there is no need for a bullet train but, India is so rich that it can support millions of Rohingyas!


*Second:-* Fifty six expensive lawyers of the country from the side of the mosque. but, Subramaniam Swamy alone from the temple side!!


*Third:-* There is opposition to GST in the country, but, have you ever seen any opposition to population growth?


*Fourth:-* The joke is that those with two children pay tax, but, those with ten children take subsidy!!!!


*You may dislike the above mentioned things, but it is definitely worth considering!!!*


*Another fact* India was great... it was a mine of heroes, but, still, we were slaves of the Mughals.


Why??....


*Because, one Hindu king kept away from another Hindu king due to personal opposition and they were adamant on supporting the Mughals"*


The situation is the same even today.


_*Modi is standing for Hindutva and confused Hindus are adamant on erasing it.....!!!!*_

 

Have seen lakhs of Hindus opposing Modi, but, tell me any one Muslim who opposes Owaisi vocally.


*A Hindu himself is the cause of his downfall.....*


*Think a little and connect yourself.*


 *Jai Hind Jai Bharat 🇮🇳*

 

There is a difference between thinking and thinking, see yourself..


If a Hindu is more religious then he becomes a monk.!!


If a Muslim is more religious then he becomes a Jihadi or a terrorist..!!👌

 

If you are a Hindu, you will definitely forward it.


🙏🏻 Jai Shri Ram 🙏🏻

బాధ్యత - బరువు

 బాధ్యత - బరువు


శ్రీవారికి 1938 ప్రాంతాలలో కాశీయాత్ర ముగించి వచ్చినప్పటి నుండి పీఠబాధ్యతల నుండి వైదొలగి ఏ చెట్టునీడలోనో, గోపురపు ఛాయలలోనో జీవిస్తూ పరివారపు కట్టడిలేని స్వేచ్ఛా జీవనాన్ని గడపాలని ఉండేది. శిష్యస్వామికై ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆదిశంకరుల అభిప్రాయం వీరు బహుకాలం పీఠంలో ఉండి ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలన్నది కావచ్చు. 1954 దాకా శిష్యస్వామివారు దొరకలేదు. యాభైయేళ్ళ పీఠాధిపత్య నిర్వహణానంతరం 1957లో మఠ బాధ్యతలన్నీ చట్టపూర్వకంగా శిష్యస్వామివారికి ఈయబడినాయి. అయితే అత్యంత గురుభక్తితో శ్రీజయేంద్ర సరస్వతీ స్వామివారు మహాస్వామివారి మార్గదర్శకత్వం కావాలని ప్రార్థించి పీఠం నుండి వెలికిపోనీయలేదు. శిష్యస్వామి వారితో కూడా విజయయాత్ర చేస్తూ 1969లో కంచికి తిరిగి వచ్చారు. నిదానంగా పూజ, ఇతర వ్యవహారములు జయేంద్రుల వారికి అప్పగించారు.


ఒకరోజు స్వామివారు హఠాత్తుగా కంచిమఠం ప్రాంగణం సింహద్వారం బయటకు వచ్చి నిలచి తనవెంట వస్తున్న పరివారమునుద్దేశించి పీఠములో జీతం తీసుకొంటున్న వారెవరూ తనతో రావడానికి వీలులేదని కట్టడి చేశారు. అతొ కొద్దిమంది అశుల్కదాసులు వెంటరాగా కాంచీపురం పొలిమేరలో ఉన్న సర్వతీర్థం చేరారు. అక్కడ కాశీవిశ్వనాథుని దేవాలయం ఒకటి పురాతనమైనది ఉన్నది. దాని ముఖమంటపంలో స్వామివారు మకాం చేశారు. 


అప్పటినుండి 1983లో శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారు పీఠానికి రాగా - శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి ప్రార్థనను అంగీకరించి ప్రవేశించేంతవరకూ మఠం లోనికి అడుగు పెట్టలేదు. పీఠబాధ్యతలు లేవు. ఆదిశంకరులనుండి అనూచానంగా అర్చించబడుతున్న చంద్రమౌళీశ్వరుడు క్రియాశీలక పీఠాధిపత్యం నెరుపుతున్న శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారిచేత మహాస్వామివారేర్పరచిన సంప్రదాయాల అనుసారం పూజ అందుకొంటున్నారు. అయినప్పటికి శ్రీవారు తాము సన్యాసాశ్రమ స్వీకరం నుండి కొనసాగిస్తూ వచ్చిన ఒక గంట జపము తప్పక చేసేవారు.


 --- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శరీరము నందు ఏర్పడు కొవ్వు

 శరీరము నందు ఏర్పడు కొవ్వు గురించి విశేషాలు - 


  *  శరీరములో అంతర్గత రసాయన చర్యల వలన ఉత్పత్తికాని Linoleic Acid కొవ్వులో ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం . 


 *  నరాలవ్యవస్థ సజావుగా పనిచేయుటకు కొవ్వు చాలా అవసరం . 


 *  కొవ్వు శరీరంలో కొన్ని ప్రత్యేక కణాలలో నిలువ ఉంటుంది. ఈ ప్రత్యేక కణాలు చర్మం అడుగున మెత్తలు ( Pads of tissue ) గా ఏర్పడటమే కాక కీళ్లు మరికొన్ని అవయవాలని కుదుపుల నుంచి కాపాడుతూ వాటికి ఇన్సులేషన్ గా ఉపయోగపడును. 


 *  కొవ్వు వేడి నుంచి మరియు చలి నుంచి మనల్ని కాపాడును. శరీరంలో నిలువ అయ్యి ఉన్న కొవ్వు కేంద్రీకృత శక్తి కింద ఏర్పడి అవసరమైన సందర్భాలలో శరీరానికి ఇంధనంగా ఉపయోగపడును . 


 * శరీరపు కొవ్వు కండరాల సంకోచ వ్యాకోచాలకు సహాయపడును. 


 *  ఆరోగ్యవంతుడు అయిన పురుషుడిలో సుమారు 15 కిలోల కొవ్వు నిలువ ఉండును. ఈ కొవ్వు సుమారు రెండు నెలలపాటు అతడి ప్రాణాన్ని నిలబెట్టును . బాగా భారీకాయులు అయిన మనుషులలో 100 కిలోల దాకా నిలువ కొవ్వు ఉండును. ఇది ఒక సంవత్సరం పాటు అతని ప్రాణాన్ని నిలబెట్టును . 


 *  స్త్రీ లలో కొవ్వు పిరుదుల వద్ద , తొడల వద్ద ఎక్కువ నిలువ ఉండును. అది వాళ్లకు గర్భధారణ కోసము , స్తన్యమును ఇవ్వటం కొరకు ఇంధనముగా ఉపయోగపడును. 


              పురుషులలో కొవ్వు పొట్ట భాగాన ఎక్కువ నిలువ ఉండును. అది పురుషులకు అతి త్వరగా శక్తిని ఇచ్చుటకు ఇంధనంగా ఉపయోగపడును. 


 *  కొవ్వులోని యాసిడ్  శరీరకణాల గోడల తయారీకి సహకరించును.ఆంగ్లము నందు Cell walls అంటారు. 


 *  శరీరం ఎదుగుదలకు సహకరించును. 


 *  చర్మపోషణం కొరకు మరియు సెక్స్ పరమైన పునరుత్పత్తికి ఉపకరించును. 


 *  కొవ్వులో మిళితమయ్యే A , D , E ,  K  విటమిన్లు జీర్ణకోశము నుంచి రక్తములో ప్రవేశించడానికి కొవ్వు ఉపకరిస్తుంది. 


 *  ఒక గ్రాము కొవ్వు ద్వారా 9 కేలరీల  శక్తి లభ్యం అగును. ఇది కార్బోహైడ్రేట్స్  అందించే శక్తికి రెట్టింపు .


 *  కొవ్వు శరీరం యొక్క ఉష్ణోగ్రత క్రమబద్ధీకరిస్తుంది  

 

 *  కొవ్వులో రెండు రకాలు ఉన్నాయి. 


       *  శాచురేటేడ్ ఫాట్ 

       

       *  అన్ శాచురేటెడ్ ఫాట్ . 


 *  శాచురేటెడ్ ఫాట్ సాధారణముగా రూము ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టిపోతుంది  . ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ జంతుసంబంధ ఆహారంలో ఉంటాయి. మాంసం , చికెన్ , పాలు , వెన్న , గుడ్లు మొదలైన వాటిలో కొబ్బరినూనె , పామాయిల్ వంటి వృక్ష సంబంధ ఆహారంలో కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. 


 * అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టకుండా ద్రవస్థితిలోనే ఉంటుంది. ఇది ఎక్కువుగా వృక్షసంబంధ ఆహారంలో లభించును. వేరుశెనగ నూనె , నువ్వులనూనె , ఆలివ్ ఆయిల్ , సన్ ఫ్లవర్ ఆయిల్ , సోయాబిన్ ఆయిల్ మొదలయిన వాటిలో ఉండును. 


 *  మనం తిన్న ఆహారంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటే వాటిని కాలేయం కొలెస్ట్రాల్ కింద మార్చును . 


 *  ఆహారంలో మీరెంత శాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటే అంత ఎక్కువుగా మీ రక్తములో కొలెస్ట్రాల్ శాతం పెరిగి గుండెకి రక్తాన్ని తీసుకొనివెళ్లే కరొనరీ ధమనుల లోపలి గోడల మీద నిలువ అవుతాయి. అప్పుడు ధమని ఇరుకుగా అయ్యి గుండెజబ్బులకు , గుండెపోటుకు దారి తీయును . 


 *  కొలెస్ట్రాల్ అనేది మన శరీరపు టిష్యూస్ మధ్య ఏర్పడే మైనంలా తెల్లగా ఉండే కొవ్వులాంటి పదార్థం . 


 *  శరీరంలో కొలెస్ట్రాల్ అవసరం ఎంతో ఉంటుంది . కొలెస్ట్రాల్ అడ్రెనాల్ గ్రంధులలోను , పురుషుల వృషణాలలోను , స్త్రీల అండాశయాలలోను నిలువ అయ్యి "steroid harmons " కింద మార్పు చెందటానికి ఉపకరించును. 


 *  కొలెస్ట్రాల్ పిత్తరసం ( bile ) తయారీకి ఉపయోగపడును. ఆహారం జీర్ణం అవ్వడానికి ముఖ్యముగా ఆహారంలో కొవ్వు పదార్ధాలు జీర్ణం అవ్వడానికి పిత్తరసం ( Bile ) అవసరం ఉండును. 


 *  కొవ్వు నరాల చుట్టూ ఇన్సులేషన్ లా ఉపయోగపడటమే కాకుండా శరీరపు మిగతా అవసరాలకు ఉపయోగపడును. 


 *  30 సంవత్సరాల లోపు మనిషిలో కోలెస్ట్రాల్ 

150 m/g  dl లోపల ఉండాలి . 


 *  30 సంవత్సరాల పైన ఉన్న మనిషిలో కొలెస్ట్రాల్ 

 180 m/g dl లోపల ఉండవలెను . 


 *  ఏ వ్యక్తిలో నైనా కోలెస్ట్రాల్ 200 m/g dl మించి ఉండరాదు. 


              సమాప్తం 


   

      మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    

క్రోధమును అణచుకొనే ఆ మహానుభావులు ధన్యులు.🙏

 శ్లోకం:☝️

*ధన్యాః ఖలు మహాత్మానో*

 *యే బుద్ధ్యా కోపముత్థితమ్ |*

*నిరున్ధన్తి మహాత్మానో*

 *దీప్తమగ్నిమివామ్భసా ||*

(సుందరకాండ: 55.3)


అన్వయం: _తే జనాః ధన్యాః యే మనసి ఉత్థితం కోపం స్వబుద్ధయా తథైవ శామయన్తి యథా జలేనః అగ్నిశిఖా |_


భావం: ప్రజ్వరిల్లుతున్న అగ్నిని నీటిచేత అణచినట్లు, తమ బుద్ధిచేత క్రోధమును అణచుకొనే ఆ మహానుభావులు ధన్యులు.🙏