ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
29, డిసెంబర్ 2023, శుక్రవారం
రామకృష్ణుని పాండిత్యం"
"తెనాలి రామకృష్ణుని పాండిత్యం"
01-09-2020
విజయనగర సామ్రాజ్యాన్ని సాహితీ
సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు
పాలించే రోజులవి.ఆయన ఆస్థానంలో అష్ట
దిగ్గజ కవులుండేవారనే సంగతి అందరికీ
తెలిసిందే.అష్టదిగ్గజ కవుల్లో ఒకడైన తెనాలి
రామకృష్ణుని ప్రతిభా,పాండిత్యాలు కూడా
అందరికీ తెలిసిందే.
అయితే రామకృష్ణుడంటే పడని ప్రత్యర్ధులైన
కవులు ఎలాగైనా రామకృష్ణుని పాండిత్యాన్ని
దెబ్బతీయడానికి పథకాన్ని రచించారు.ఒకసారి
రాయలు సభకు రావడానికి ముందు ఒక
సేవకుని ద్వారా "కుంజర యూధంబు దోమ
కుత్తుక జొచ్చెన్"అనే సమస్యనిచ్చి పూరించమని
పంపారు. ఇది తెలిసిన రామకృష్ణుడు ప్రత్యర్ధులకు
ఆ సమస్యను ఈ విధంగా పూరించి పంపాడు.
కంద పద్యం:-
"గంజాయి తాగి తురకుల
సంజాతము తోడ కల్లు చవిగొన్నావా?
కొడకా ఎక్కడ
కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్?"
బహమనీ సుల్తానుల హయాంలో తురుష్కు
లో సేవకులు గంజాయితో పాటు కల్లును కూడా
సేవించేవారు.వారితో కూడి తాగున్నావా?అని
తిడుతూ ఎక్కడరా!ఏనుగులు సమూహమెక్కడైనా
దోమ కుత్తుక లో చొరబడగలదా?చెప్పు అని
మందలిస్తూ ఆ సమస్యను పూరణచేసి. పంపాడు.
దానర్థం తెలియని సేవకుడు ఆ ప్రత్యర్ధులకు
దాన్ని ఇచ్చాడు.
కాని ఇదేదీ జరుగనట్లు మౌనంగా ఉండి తరువాత
రోజు నిండుసభలో రాయల వారి ముందు ఈ సమస్య
ను రామకృష్ణుని కిస్తే రామకృష్ణుడు అవమానం
పడడం ఖాయమని సంబర పడ్డారు. మరుసటిరోజు
రాయలు ఎదుట పై సమస్య నుంచారు.
నిన్నటి సంఘటనను గుర్తుంచుకుని రామ
కృష్ణుడు ఆ సమస్యను రాయల వారి సభలో
ఈ విధంగా పూరించాడు.
కంద పద్యం:-
"రంజనజెడి పాండవులరి
భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా!
సంజయ!యేమని చెప్పుదు
కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్!"
భావం:-
మహాపరాక్రమవంతులైన పాండవులు తలరాత
బాగోలేక విరాటరాజును కొలిచే స్థితికి వచ్చారు.
విధి ఎంత బలీయమైనది.ఏనుగుల గుంపు
దోమగొంతుకలో ప్రవేశించింది కదా!
రామకృష్ణుని సమస్యా పూరణానికి
ఆశ్చర్యపడిన రాయలు అభినందించాడు.
ప్రశంశలు రామకృష్ణునికి,భంగపాటు ప్రత్యర్ధి
కవులకు దక్కింది.
ద్రోణంరాజు శ్రీనివాసరావు ఎస్:ఎ.తెలుగు.
మునిపల్లి.
ధనుర్మాసము రోజు: 11
ధనుర్మాసము రోజు: 11
బాపు రమణల మేలుపలుకుల మేలుకొలుపులు 11
కొమ్ము విసిరే ఆలపొదుగుల పాలుపిదికే ఒడుపులో
బాణమేసినవాడి ప్రాణము పిండి, నెత్తురు పిదుకుచో
సాటిలేని హరివంశవీరుల శూరపుత్రివి నీవెలే
అందాల బరిణవు నీవెలే అపరంజి బొమ్మవు నీవెలే
నెమలిపింఛపు నీలకాంతుల నెరికురులసిరి నీవెలే
ఫణి ఫణాగ్రపు మణుల బోల్ ఘనజఘన లాస్యాల్ నీవెలే
ఎన్నిఉన్నా ఏమి లాభం నిద్ర ఒకటే నీదులోపం
జామునుంచీ వేచిఉన్నా చెలులపైనా జాలితలచీ
లేచి రమ్మా మొద్దుగుమ్మా లేవెలేవె బద్ధకమ్మా
కృష్ణచంద్రుని అందరం పాడుతూ కొనియాడుతూ
ఊరేగుదాం తొలి వెలుగులో ఉహూ కుహూ యంటూ
యమునచేరీ మునకలేసీ నోమునోచీ తరించుదాం-
సిరినోము - హరిపూజ - గిరిపుత్రివరము
గోకులం కన్నెలకు కల్యాణకరము
లోకులం దరికిదే సౌభాగ్యప్రదము
పల్లెపిల్లా మేలుకో
రే-పల్లె పిల్లా మేలుకో
యజమాని శ్రేయస్సు కోరుకోవాలి
*సేవకుడు... యజమాని.....*
*ధర్మరాజు భీష్ముడిని... "పితామహా... నాకు ఒక సందేహము... తమ యజమానుల ఎడల అతడి దయా దాక్షిణ్యాల మీద బ్రతికే సేవకుడు... ఎలా నడచుకోవాలి వివరించండి" అని అడిగాడు. దానికి... భీష్ముడు "ధర్మనందనా... ఒక వూరిలో ఒక బోయవాడు ఉండే వాడు. అతడు ఒక రోజు వేట కొరకు అడవికి వెళ్ళి ఒక లేడి మీద విషము పూసిన బాణమును వేశాడు. కాని ఆ బాణము గురి తప్పి ఒక చెట్టును తాకింది. ఆ చెట్టు పూలు,పండ్లతో నిండి ఉండేది.*
*కానీ... ఆ విష పూరిత బాణము ఆ చెట్టును నిలువునా పూలు విరుగ కాసిన పండ్లలతో సహా దహించివేసింది. ఆ చెట్టు మీద నివసిస్తున్న ఒక చిలుక మాత్రం ఆ చెట్టు దహించ బడినా ఇన్ని రోజుల నుండి కాపాడిందన్న విశ్వాసంతో దానిని విడువక అక్కడే నివసించసాగింది. ఎండ వచ్చినా, గాలి వచ్చినా, వర్షము వచ్చినా అది ఆ చెట్టును విడువ లేదు.*
*ఆ నోట ఈ నోట... ఆ చిలుక గురించి విన్న ఇంద్రుడు సాధారణ మనిషి రూపంలో దాని వద్దకు వచ్చి..."ఓ చిలుకా... ఈ చెట్టు మాడిపోయింది కదా... ఈ అడవిలో ఫల పుష్పాలతో నిండిన ఇన్ని వృక్షాలు ఉండగా ఈ చెట్టును పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు" అని అడిగాడు. దానికి ఆ చిలుక "మహేంద్రా... ఈ చెట్టు ఫల పుష్పాలతో నిండుగా ఉన్నప్పుడు ఈ చెట్టును అంటిపెట్టుకుని ఉండి ఈ చెట్టు ఎండి పోయినప్పుడు వదిలి వెళ్ళడము కృతఘ్నత కాదా..." అని అడిగింది.*
*మారువేషములో వచ్చిన తనను మహేంద్రా... అని సంభోదించడం చూసి ఇంద్రుడు ఖంగుతిన్నాడు. ఈ చిలుక పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యఫలము వలన తనను గుర్తించిందని తెలుసుకుని.. "చిలుకా.. నా దర్శనం వ్యర్ధము కాదు కనుక ఏదైనా వరము కోరుకో" అన్నాడు. ఆ చిలుక.. "ఈ చెట్టును పూర్వము ఉన్నట్లు ఫలపుష్పాలతో అలరారే విధముగా చెయ్యి" అని కోరుకుంది.*
*ఇంద్రుడు వెంటనే ఆ చెట్టు మీద అమృతమును చల్లాడు. ఆ చెట్టు పూర్వములా ఫలపుష్పాలతో శోభిల్లింది. ధర్మనందనా.. చూశావా ఇంద్రుడు వరమిచ్చినా తన కొరకు ఏ వరము కోరుకోకుండా తనకు ఆశ్రయమిచ్చిన చెట్టు శ్రేయస్సును కోరుకున్న చిలుకలా భృత్యులు సదా యజమాని శ్రేయస్సు కోరుకోవాలి" అని చెప్పాడు...*
*సమస్త లోకా సుఖినోభవంతు
🍁🍁🍁 🌳🕉️🌳 🍁🍁🍁
" వేద వ్యాసుని ముఖ్య శిష్యులు
*" వేద వ్యాసుని ముఖ్య శిష్యులు, వాళ్ళ వివరాలు "*
వేదవ్యాస మహర్షి ముఖ్య శిష్యులు: జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు, దాల్భభ్యుడు మొదలైనవారు.
ఇపుడు మనం చదివేది వైశంపాయనుడు లోక వ్యాప్తి చేసిన భారతం. ^జయము^ అని దీనికి మరో పేరు. హరి వంశం సంస్కృత భారతంలో చివరి పర్వం. వేరే గ్రంథం కాదు. దీన్ని ఎఱ్ఱన విడిగా వ్రాసి ప్రోలయ వేమారెడ్డికి అంకితం చేశాడు.
జైమిని చెప్పిన భారతం లో అశ్వమేధ పర్వం మాత్రమే లభిస్తున్నది. వేదవ్యాసుని తండ్రి పరాశరుడు వ్రాసిన ^పరాశర సంహిత^ జ్యోతిషంలో ప్రముఖ గ్రంథం కాగా *జైమిని సూత్రాలు* ఫలాంశ గణనలో విశిష్టమైన కొత్త మార్గాలు సూచిస్తాయి.
దాల్భ్య మహర్షి ప్రతిష్ఠ అయిన *ప్రసన్న వేంకటేశ్వరాలయం* "గుణ శీలం" అనే ఒక గ్రామం (కొంచెం పెద్ద దే) లో చూచాను. ఆలయం చిన్నదే. శ్రీరంగం సమీపంలో ఉంది. మతిస్థిమితం లేని వాళ్ళు ఆ స్వామిని ఆరాధించి స్వస్థులవుతారని ప్రసిద్ధి.
మహర్షి శిష్యులందరూ వివిధ శాస్త్రాలను లోక వ్యాప్తి చేశారు. వేదాలను యజ్ఞార్థం నాలుగు భాగాలుగా వేదవ్యాసుడు విభాగం చేశాడు. శిష్యులకు అన్నీ వేదాలు బోధించాడు.
1. ఋగ్వేదం —- పైలుడు,
2. యజుర్వేదం — వైశంపాయనుడు,
3. సామవేదం — జైమిని,
4. అధర్వణ వేదం — సుమంతుడు
ఈ నలుగురికీ బోధించి లోకంలో వ్యాప్తి చేయాలని ఆదేశించాడు.
కుమారుడైన శుక మహర్షికి భాగవతాన్ని ఉపదేశించి పరీక్షిన్మహారాజుకు ఉపదేశించమన్నాడు. ఒక్క వారం రోజులు భాగవతం ఏక దీక్షగా విని ఆ రాజు సద్గతి పొందాడు.
పాండవులకు, ధృతరాష్ట్రుడికి వ్యాసుడు ఎన్నో విషయాలు బోధించాడు.
అరణ్య వాస కాలం లో ధర్మరాజుకు "ప్రతిస్మృతి" అనే మంత్రాన్ని ఉపదేశించి అర్జునుడికి ఉపదేశించ మని చెప్పాడు. ఆ మంత్రం వల్ల పాశుపతాస్త్రం అర్జునుడికి లభించింది.
వ్యాసుడు నారాయణ తేజోంశ - *మునీనామపి అహం వ్యాసః* అని భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ.
******************
అమృతా గార్డెన్ పంక్షన్ హాల్
*అమృతా గార్డెన్ పంక్షన్ హాల్ అద్దెలో బ్రాహ్మణులకు సగం రాయితీ!*🍇🍇🍇🌾🌾🌾🌾🌹🌹 హైదరాబాద్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు శామీర్ పేట ఎగ్జిట్ నెంబర్ 7 నుండి కేవలం 32 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారి స్టేట్ హైవే వన్ (జెబీస్ - రామగుండం) కు సమీపాన ఉన్న *అమృతా గార్డెన్* లో పెళ్ళిళ్ళు, గేట్ టు గెదర్ లు, సారీ పంక్షన్, దోతీ పంక్షన్ లు, బర్త్ డే పంక్షన్లు...షష్టి పూర్తి పంక్షన్ లు, ఉపనయనాలు ఇలా ఒక్కటేమిటి ప్రతి శుభ కార్యానికి మా *అమృతా గార్డెన్* సిద్దంగా ఉంది...ఈ హాల్ లో శుభ కార్యాలకు హైదరాబాద్ పరిసర జిల్లా ల వారు ఉపయోగించు కోవచ్చు! విశాల మైన రెండు బెడ్ రూం లు విత్ వాష్ రూమ్స్, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కు ప్రత్యేక గదులు, విశాల మైన కారు పార్కింగ్, కాకుండా కేటరింగ్ సౌకర్యం ఉంది...అమృతా గార్డెన్ 48 గంటల అద్దె లక్షా 50 వేలు, 24 గంటల అద్దె 75,000 గా ఉంది...బ్రాహ్మణులకు అయితే అందులో సగం అంటే 75,000 48 గంటలు, 24 గంటలకు 37,500 కు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం...కేటరింగ్ విషయానికి వస్తే 200 రూపాయలకు ప్లేట్ భోజనం నుండి 1500 రూపాయలకు ప్లేట్ భోజనం తయారు చేసే బ్రాహ్మణ కేటరర్స్ అందు బాటులో ఉన్నారు...సర్వ్ చేసే అమ్మాయిలు అబ్బాయిలు ఒక్కరికీ 1000 రూపాయలు ఉంటాయి...ఇక సినిమా లేదా టెలివిజన్ ఆర్టిస్ట్ లకు వారి పేరును బట్టి 5000 నుండి 50,000 వరకు, అలాగే కేరళ లేదా ఆంధ్ర సన్నాయి మేళం వారికి 25,000 నుండి 50,000, లేదా లోకల్ సన్నాయి మేళం వారికి 11,000 కి వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు...ఇక బర్త్ డే పార్టీ మిమిక్రీ ఆర్టిస్ట్ లు లోకల్ 11,000 లేదా ఎంటర్ టైన్ మెంట్ మిమిక్రీ ఆర్టిస్ట్ 25,000 లకు వారి ఫోన్ నెంబర్ ల ద్వారా బుక్ చేసుకోవచ్చు...ఇక హైదరాబాద్ నుండి 21 సీటర్ లేదా ఫిఫ్టీ సీటర్ బస్ లు కూడా అందు బాటులో ఉన్నాయి! మీకు కావలిస్తే వారి బస్ నెంబర్ల జాబితా ఇస్తాం.. మీరు ఆ బస్ ఆపరేటర్ల తో మాట్లాడు కోవచ్చు! డెకరేషన్ వాళ్ళు కూడా లోకల్, హైదరాబాద్ వాళ్ళు ఉంటారు...వాళ్ళ ఆల్బమ్ డెకరేషన్ ఫొటోస్ ప్రకారం మీరు డెకరేషన్ గురించి వాట్సప్ ద్వారా ఫొటోస్ చూసి మాట్లాడుకోవచ్చు...ఇవే కాకుండా సైట్ సీయింగ్, వర్గల్ సరస్వతి దేవాలయం, కొండ పోచమ్మ ప్రాజెక్ట్, నాచారం లక్ష్మి నరసింహస్వామీ టెంపుల్, కొమురవెల్లి మల్లికార్జున టెంపుల్, అమృతా గార్డెన్ నుండి 15 నుండి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి...యాదగిరి గుట్ట టెంపుల్ 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గేట్ టు గేదర్ పార్టీల వాళ్లకు సైట్ సీయింగ్ కు 21 సీటర్, 12 సీటర్ బస్సులు రోజు వారి అద్దెబస్సులు విత్ ఏసి 15000 నుండి 20,000 అందుబాటులో ఉన్నాయి...అయితే వారం ముందు సమాచారం ఇచ్చి అడ్వాన్స్ ఇస్తే ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి...బ్రాహ్మణ కుటుంబాలకు ఈ బస్సుల్లో పది శాతం రాయితీ ఉంటుంది! *మరిన్ని వివరాలకి +91 88857 30986* ఫోన్ చేసి తెలుసుకోవచ్చు!
నిశ్శబ్ద సందేశం
🙏🌹🙏🌹🙏🌹🙏🌹
న్యూస్ పేపర్ డెలివరీ బాయ్ చెప్పిన కధ హృదయాల్ని హత్తుకునేల మనస్సులను కదలిస్తుంది
*"సౌండ్ ఆఫ్ నాకింగ్"*
*పేపర్ బాయ్* :
నేను వార్తాపత్రికను డెలివరీ చేస్తున్న ఇళ్లలో ఒక ఇంటి మెయిల్‌బాక్స్ తాళం వేసి ఉంది, అందువలన నేను వారి తలుపు తట్టాను. ఇంట్లోని ప్రసాద్ రావు గారు అస్థిరమైన అడుగులతో నడుస్తున్న వృద్ధుడు, నెమ్మదిగా తలుపు తెరిచాడు. పేపర్ బాయ్ అడిగాడు, "సార్, మీ మెయిల్ బాక్స్ ఎందుకు లాక్ చేయబడింది?"
ఉద్దేశపూర్వకంగానే లాక్ చేశాను అని బదులిచ్చారు ప్రసాదరావు చిరునవ్వుతో. ఇంకా ఇలా చెప్పారు , "నువ్వు రోజూ వార్తాపత్రికను నాకు చేతికి అందించాలని కోరుకుంటున్నాను, దయచేసి తలుపు కొట్టు లేదా కాలింగ్ బెల్ నొక్కి నాకు స్వయంగా ఇవ్వు."
పేపర్ బాయ్ అయోమయంలో పడ్డాడు, అలాగే అన్నాడు, కానీ అది ఇద్దరికి అసౌకర్యంగా, సమయం వృధా అవుతుంది" అని జవాబిచ్చాడు.
"ఏమి ఫర్వాలేదు... ప్రతి నెలా నీకు రూ. 500/- అదనంగా ఇస్తాను" అన్నాడు ప్రసాద్ రావు
"నువ్వు తలుపు తడితే నేను తీయలేని పరిస్థితి ఉండే రోజు ఎప్పుడైనా వస్తే, దయచేసి పక్కవాళ్ళని పిలవగలవు!"
పేపర్ బాయ్ షాక్ అయ్యి "ఎందుకు సార్?" అని అడిగాడు.
"నా భార్య చనిపోయింది, కొడుకు విదేశాల్లో భార్య పిల్లలతో స్థిరపడ్డాడు.మా కన్నా మా పిల్లలు పైకి ఎదగాలని కష్టపడి పై చదువులు విదేశాల్లో చదివవించాము. ప్రస్తుతం నేను ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నాను, నాకు సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు?"
ఆలా చెబుతున్నపుడు పేపర్ బాయ్ తేమతో చమర్చిన వృద్దుడి కళ్ళని చూశాడు. ఆయన ఇంకా ఇలా అన్నారు , *"నేను పేపర్ చదవలేను......నాకు చూపు మందగించింది ....తలుపు చప్పుడు లేదా డోర్‌బెల్ మోగిన శబ్దం వినడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను . తెలిసిన వ్యక్తిని చూడటానికి మరియు కొన్ని మాటలు వారి నోటి వెంట విని ఆ రోజు గడపడాని ప్రయత్నం చేస్తూ ఉంటాను !"*
అతను చేతులు జోడించి పేపర్ బాయిని, "చిన్నా , దయచేసి నాకు ఒక చిన్న సహాయం చేయి !
ఇదిగో నా కొడుకు ఓవర్సీస్ ఫోన్ నంబర్. ఏదో ఒకరోజు నువ్వు తలుపు తట్టినపుడు నా నుండి సమాధానం రాకపోతే, దయచేసి నా కొడుకుకు ఫోన్ చేసి అతనికి తెలియజేయ..." అన్నాడు.
తరువాత పేపర్ బోయికి కర్తవ్యం అర్ధం అయ్యింది , తన స్నేహితుల సర్కిల్‌లో కూడా చాలా మంది ఇళ్లలో ఒంటరిగా ఉన్న వృద్ధులు ఉన్నారు.
వృద్ధాప్యంలో ఉన్న వారు ప్రతి రోజు గుడ్ మార్నింగ్ మెసేజెస్ , వాట్సాప్‌లో ఎందుకు పంపుతారని మీరు ఆశ్చర్యపోవచ్చు/విసుగు చెందవచ్చు.
ఈ ముసోలోళ్ళకి పని పాట ఏమి లేదు ఉదయం 4గంటల నుండే గుడ్ మార్నింగ్ మెస్సేజ్ పెడతారు అనుకుంటూ ఉంటాము.
వాస్తవానికి, ఈ ఉదయం మరియు సాయంత్రం శుభాకాంక్షల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ..........
*భూమ్మిద తమ ఉనికిని తెలియజేసే నిశ్శబ్ద సందేశం*
ఈ రోజుకి మేము ఉన్నాము అని తెలియజేసే చేదు నిజం.
దయచేసి పెద్ద వాళ్ల గుడ్ మార్నింగ్ మెస్సేజ్లను ఇబ్బందిగా తీసుకోవద్దు. మనం కూడా అదే స్థితికి ఏదో ఒక రోజు వస్తాము.
ఈ రోజుల్లో వాట్సాప్ చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇకపై వార్తాపత్రికల సభ్యత్వాన్ని పొందవలసిన అవసరం కూడా లేదు.
*మీకు సమయం ఉంటే, మీ పెద్దవాళ్లకి వాట్సాప్ ఎలా ఉపయోగించాలో నేర్పించండి! వారికి కొంత సమయం కేటాయించండి*
ఏదో ఒకరోజు, మీరు వారి మార్నింగ్ గ్రీటింగ్‌లు లేదా షేర్ చేసిన కథనాలను అందుకోకపోతే, వారు అనారోగ్యంతో ఉండవచ్చు లేదా వారికి ఏదైనా జరిగి ఉండవచ్చు అని గ్రహించండి.
దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహించండి.
ఇది చదివితే ఎవరికైనా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. మనస్సు బరువెక్కుతుంది !!!
మనం ఒకరికొకరం పంపే వాట్సాప్ సందేశాల ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకుని వాటికి సమాధానం లేదా కార్యాచరణ పాటించాలి!!!
🌹🙏అందరూ ఆరోగ్యంగా ఉండాలి వారి జీవితం సాఫీగా సాగాలి. అందులో నేను కూడా ఒకడినై ఉండాలి🌹🙏
🙏సర్వే జన సుఖినోభావంతు🙏
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
హరిశ్చంద్రుడి మాటలకు వృద్ధ బ్రాహ్మణుడు పెద్దపెట్టున నవ్వేడు. మహారాజా ! ఈ తీర్థం చాలా
పుణ్యప్రదం. పాపనాశకం. ఇందులో సాన్నం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టు. ఇది
శుభముహూర్తం. అటుతరవాత నీ శక్తి కొద్దీ తృణమో పణమో దానం చేద్దువుగాని. ఈ పుణ్యతీర్థంలో చేసిన
స్నానాలూ దానాలూ రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. ఇలాంటి ప్రదేశాలకు వచ్చి సాన్నం చేయకుండా
వెళ్ళడం మహాపాపం. అది ఆత్మహత్యా సదృశమని స్వయంభువు చెప్పాడు. కనక ముందుగా స్నాన
తర్పణాలు కానియ్యి. అటుతరువాత నీకు దారి చూపిస్తాను. రాజధానికి వెడుదువుగాని. నువ్విచ్చే
దానానికి సంతోషించి నీతోకూడా అందాకా నేనూ వస్తాను.
హరిశ్చంద్రుడు రాజవేషం తొలగించుకుని స్నానోచితంగా నదిలోకి దిగాడు. మూడు మునకలూ
వేశాడు. నదిలోనే నిలబడి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాడు. బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి స్వామి!
దానం చెయ్యాలనుకుంటున్నాను. నీకు ఏది కావాలో కోరుకో. ఆవులా, నేలా, బంగారమా, ఏనుగులా,
రథాలా, అశ్వాలా ? ఏదైనా సరే కోరుకో. కోరుకున్నంతా ఇస్తాను. నా దృష్టిలో- ఇవ్వకూడనిదంటూ
ఏదీలేదు. ఇది నా వ్రతం. రాజసూయంలో మునీశ్వరుల సమక్షంలో చేపట్టాను. ఈ పుణ్యతీర్థమూ,
నువ్వూ అదృష్టవశాత్తూ ఇక్కడ లభించారు. మొగమోటపడక కావలసింది ఏదో కోరి నన్ను చరితార్ధుణ్ణి
చెయ్యి- అని అభ్యర్థించాడు.
నాదేయం మే కిమప్యప్తి కృతమేతద్ర్వతం పురా |
రాజసూయే మఖశ్రేష్టే. మునీనాం సన్నిధావపి
తస్మాత్ త్వమిహ సంప్రాప్తః తీర్థేఽస్మిన్ ప్రవరే మునే |
యత్తేఽస్తి వాంఛితం బ్రూహి దదామి తవ వాంఛితమ్ ॥ (19-12)
రాజన్ ! నీ కీర్తినిగురించి చాలాకాలం క్రితమే విన్నాను. నిన్ను మించిన దాత లేడని వసిష్ఠులవారు
చెప్పారు.
హరిశ్చంద్రో నృపశ్రేష్ఠః సూర్యవంశే మహీపతిః, తాదృశో నృపతిర్దాతానభూతో న భవిష్యతి.
అన్నారాయన
🔥శ్రీ మదగ్ని మహాపురాణము
*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*
. *భాగం - 37*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 14*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
*పాండవ చరిత వర్ణనము - 2*
తద్థనుస్తాని చాస్త్రాణి స రథస్తే చ వాఇనః. 10
వినా కృష్ణేన తన్నషటం దానం చాశ్రోత్రియే యథా |
కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళిపోయిన తోడనే అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్నియు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చిన దానము వలె నష్టమైపోయెను.
తచ్ర్ఛుత్వా ధర్మరాజస్తు రాజ్యే స్థాప్య పరీక్షితమ్.
ప్రస్థానం ప్రస్థితో ధీమాన్ ద్రౌపద్యా భ్రాతృభిః సహ | సంసారానిత్యతాం జ్ఞాత్వా జపన్నష్టశతం హరేః. 12
ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసార మనిత్య మను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తరశతనాముములు జపించుచు మహా ప్రస్థానమున బయలుదేరెను.
మహాపథే తు పతితా ద్రౌపదీ సహదేవకః | నకులః ఫల్గునో భీమో రాజా వోకపరాయణః. 13
ఇన్ద్రానీతరథారూఢః సానుజః స్వర్గమా స్తవాన్ | దృష్ట్వా దుర్యోధనాదీంశ్చ వాసుదేవం చ హర్షితః. 14
ఏత త్తే భారతం ప్రోక్తం యః పఠేత్స దివం వ్రజేత్.
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ పఞ్చదశోధ్యాయః.
ఆ మహాప్రస్థానమునందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును పడిపోయిరి. రాజు శోకాతురుడయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, సోదరనహితుడై స్వర్గము చేరెను. ఆచట దుర్యోధనాదులను, వాసుదేవుని చూచి సంతసించెను. నీ కీ భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు.
అగ్ని మహాపురాణములో మహాబారతాఖ్యాన మను పంచదశాధ్యాయము సమాప్తము.
సశేషం....
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
నవగ్రహా పురాణం🪐*
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *120వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*నవగ్రహాల పట్టాభిషేకం - 1*
దేవ మహాసభలో వైభవం తాండవిస్తోంది.
క్షీరసాగర తీరం - మహాసభకు విచ్చేసిన దేవతలతో , వాళ్ళ పత్నులతో కళకళలాడుతోంది. ఒక్కొక్కదేవ పురుషుడు , ఒక్కొక్కదేవ పురంధ్రీ ఒక్కొక్కదీపకళికలా వెలిగిపోతున్నారు ! క్షీరసాగర మధుర తరంగాల మీద నుంచి సాగి వస్తున్న శీతలపవనాలు అందర్నీ పారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి !
శ్రీమహావిష్ణువు లక్ష్మీ ఉన్నతాసనాల మీద ఆసీనులై ఉన్నారు. ఆ దంపతులకు ఇరువైపులా బ్రహ్మా , సరస్వతీ , పరమేశ్వరుడూ , పార్వతీ కూర్చున్నారు. ఇంద్రాదిదేవతలూ పత్నీ సమేతంగా ఒక వైపున కూర్చున్నారు. బ్రహ్మ మానస పుత్రులూ , వాళ్ళ ధర్మపత్నులూ ఒకవైపునా , మహర్షులందరూ ఒకవైపునా ఉన్నారు.
ఆనాటి మహత్కార్యక్రమానికి నాయకులైన సూర్యుడూ , చంద్రుడూ , కుజుడూ , బుధుడూ , బృహస్పతీ , శుక్రుడూ , శనీ , రాహువు , కేతువూ ప్రత్యేమైన ఆసనాల మీద ఒక బృందంగా కొలువుదీరి ఉన్నారు. ఆ 'నవ నాయకుల' పత్నులు - సంజ్ఞ , అశ్విని మొదలు ఇరవై ఏడుగురు చంద్ర పత్నులూ , శక్తి దేవీ , ఇలా , తారా , ఊర్జస్వతీ , జ్యేష్ఠాదేవీ , సింహిదేవీ , చిత్రలేఖా - ఒక బృందంగా కూర్చుని తమ భర్తలను ఆనందంగా చూస్తున్నారు. త్రిమూర్తులకు దగ్గరగా తొమ్మిది నవరత్న స్వర్ణ సింహాసనాలున్నాయి... ఎవరి కోసమో ఎదురుచూస్తూ !
క్షణం సేపు ధ్యాన ముద్రలో మునిగి , బ్రహ్మ కళ్ళు తెరిచి తన ప్రక్కనే ఉన్న శ్రీమహావిష్ణువు ముఖంలోకి వినయంతో చూశాడు.
*"జనకా ! సుముహూర్తం ఆగమించింది ! ప్రారంభించండి !”*
శ్రీమహావిష్ణువు మహాసభను తన సుందర మందహాస కిరణాలతో స్పృశించాడు. పాలకడలి కెరటాల హోరును అణచి వేస్తూ , ఆయన గంభీర కంఠధ్వని సభాసదుల కర్ణపుటాలను కమనీయంగా తాకింది.
*"కల్పకల్పానికీ ఇతోధికంగా అభివృద్ధి చెందుతున్న మహాసృష్టి విన్యాసంలో 'నవగ్రహాల' సశరీర ఆవిర్భావం ఒక ప్రముఖ ఘట్టం ! లోకాలలోని ప్రాణులు ఆరాధించి , అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలిగిస్తూ - సూక్ష్మ రూపాలతో ఉన్న గ్రహ దేవతలు స్థూల తేజో రూపాలతో సశరీరంగా అవతరించడం అవసరమని సృష్టి ప్రారంభంలో నేను సంకల్పించాను ! ఆ సంకల్పం సాకారమై , నవ్యమైన నవ రూపాలతో మన ముందు సాక్షాత్కరించి ఉంది !"* అంటూ శ్రీమహావిష్ణువు తన దక్షిణ హస్తంతో సూర్యాదులను నిర్దేశించాడు. దేవతల మానస పుత్రుల , మహర్షుల శిరస్సులు ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరిగాయి. ఆ దేవతల , దేవతా పురంధ్రుల దృష్టి కిరణాలు వాళ్ళను మౌనంగా అభినందిస్తున్నాయి. సూర్యుడు , చంద్రుడూ మొదలైన తొమ్మండుగురూ చేతులు జోడించి సభకు నమస్కరించారు.
శ్రీమహావిష్ణువు కంఠం మళ్ళీ క్షీరసాగర తరంగ నినదాన్ని అవలీలగా అణచి వేసింది.
*“పరమేష్ఠీ , పరమేశ్వరుల సూచనలను అనుసరించి , నవగ్రహదేవతల వరుస క్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ గ్రహాల ప్రాధాన్యతా నిర్ణయం వాళ్ళ శక్తి సామర్థ్యాల ప్రాతిపదికగా జరిగింది. ఆయా గ్రహాల శక్తి సామర్ధ్యాలను దృష్టిలో ఉంచుకుని - ఆధిపత్యాలనూ , కారకత్వాలనూ మేము ముగ్గురమూ నిర్ణయించాం ! నవగ్రహ బృందంలో వాళ్ళ స్థానమానాలను నిర్దేశించే వరుస క్రమంలో ఆహ్వానం పలుకుతాను ! ఆహ్వానాన్ని అనుసరిస్తూ గ్రహ దేవతలు వరుసగా ఆగమించి , స్వర్ణాసనాలను అలంకరిస్తారు !"*
ఆసక్తిగా చూస్తున్న సభాసదులను ఒకసారి కలయజూసి , విష్ణువు నవగ్రహాలను ఆహ్వానించడం ప్రారంభించాడు.
*“నవగ్రహాలలో ప్రథమ గ్రహదేవత సూర్యుడు !"*
మహాసభ సమధికోత్సాహంతో చేస్తున్న హర్షధ్వానాల నేపథ్య సంగీతంతో సూర్యుడు లేచి చేతులు జోడించి నడిచాడు. ప్రథమ సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు.
*"ద్వితీయ గ్రహం చంద్రుడు !"* శ్రీమహావిష్ణువు కంఠధ్వని సాగర తీరంలో ప్రతిధ్వనించింది.
*"తృతీయ గ్రహం కుజుడు !”*
*"చతుర్థ గ్రహం బుధుడు !"*
*"పంచమ గ్రహం బృహస్పతి !”*
*"షష్ట గ్రహం శుక్రుడు !"*
*"సప్తమ గ్రహం శనైశ్చరుడు !"*
*"అష్టమ గ్రహం రాహువు !”*
*"నవమ గ్రహం కేతువు !"*
విష్ణువు పిలిచిన క్రమంలో చంద్రుడి నుండి , కేతువు దాకా అందరూ ప్రత్యేక సింహాసనాల మీద ఆసీనులయ్యారు. నవరత్న సింహాసనాల మీద కూర్చున్న నవగ్రహాల మీదనే అందరి దృష్టులూ కేంద్రీకరించబడ్డాయి.
*"నవగ్రహాలలో ఒక్కడైన బృహస్పతి దేవతలకు గురువైన కారణం చేతా , మహాజ్ఞాని అయిన కారణం చేతా - తన నిజ నామధేయంతో కాకుండా 'గురువు' అనే సార్థకనామధేయంతో సుప్రసిద్ధుడవుతాడు !"* శ్రీమహావిష్ణువు హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు.
*"సృష్టిలో నవధాన్యాలకూ , నవరత్నాలకూ అధిక ప్రాధాన్యం ఉంది. నవగ్రహ దేవతలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ధాన్యం మీదా , ఒక్కొక్క రత్నం మీదా ఆధిపత్యం ఉండేలా నిర్దేశించబడుతుంది. నవగ్రహాల ధాన్యాధిపత్యాన్ని సృష్టికర్త బ్రహ్మ , రత్నాధిపత్యాన్ని పరమేశ్వరుడూ వెల్లడిస్తారు !"* పరమేష్టి , పరమేశ్వరులను సాభిప్రాయంగా చూస్తూ అన్నాడు శ్రీమహావిష్ణువు.
బ్రహ్మ ఆయనకు నమస్కరించి , ప్రారంభించాడు.
*"సూర్యుడికి గోధుమలూ , చంద్రుడికి వడ్లూ , కుజుడుకి కందులూ , బుధుడికి పెసలూ , గురువుకు శనగలూ , శుక్రుడికి అలసందలూ , శనైశ్చరుడికి నువ్వులూ , రాహుకేతువులకు మినుములూ , ఉలవలూ ఇష్టధాన్యాలుగా ఉంటాయి. ఇష్ట ధాన్యాల మీద వాళ్ళ ఆధిపత్యాలుంటాయి. ఇది త్రిమూర్తుల అనుశాసనం !"*
నవగ్రహ దేవతలు వినయంతో , కృతజ్ఞతతో నమస్కరించారు.
*"నవగ్రహాల ఆధిపత్యాలుండే నవరత్నాలను పేర్కొంటున్నాను..."* అంటూ పరమశివుడు ప్రారంభించాడు.
*"సూర్యుడు - మాణిక్యం , చంద్రుడు - ముత్యం , కుజుడు - పగడం , బుధుడు - మరకతం , గురువు - పుష్యరాగం , శుక్రుడు - వజ్రం , శనైశ్చరుడు - నీలం , రాహువు - గోమేధికం , కేతువు - వైడూర్యం !"* నవగ్రహాలు అభిమానించే నవరత్నాలను పేర్కొన్న పరమశివుడు చెయ్యెత్తి దీవించాడు.
పరమేశ్వరుడి అనుశాసనం వెలువడిన మరుక్షణం జరిగిన దృశ్యం దేవతలను ఆశ్చర్యంలో ముంచివేసింది.
సూర్యుడి మీద మాణిక్యాలు వర్షిస్తున్నాయి ! చంద్రుడి మీద ముత్యాలూ , కుజుడి మీద పగడాలూ , బుధుడి మీద మరకతాలూ , గురువు మీద పుష్యరాగాలూ , శుక్రుడి మీద వజ్రాలూ , శనైశ్చరుడి మీద నీలాలూ , రాహువు మీద గోమేధికాలూ , కేతువు మీద వైడూర్యాలూ వర్షిస్తూ , అందరికీ కనువిందు చేస్తున్నాయి. హర్షధ్వానాలు అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్నాయి.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
శ్రీ మదగ్ని మహాపురాణము
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*
. *భాగం - 36*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 14*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
*పాండవ చరిత వర్ణనము - 1*
అథ పాణ్డవ చరిత వర్ణనమ్.
అగ్నిరువాచ :
యుధిష్ఠరే తు రాజ్యస్థే ఆశ్రమాదాశ్రమాన్తరమ్ | ధృతరాష్ట్రో వనమగాద్గాన్ధారీ చ పృథా ద్విజత 1
అగ్ని పలికెను: ఓ ద్విజుడా! యుద్ధిష్ఠురుడు రాజ్యము చేయుచుంéడగా ధృతరాష్ట్రడును, గాందారియు, కుంతియు, అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమమునుండి మరి యొక ఆశ్రమమునకు సంచరించుచుండిరి.
విదురస్త్వగ్ని నా దగ్ధో వనజేన దివం గతః | ఏవం విష్ణుర్భువో భారమహరద్ధానవాదికమ్. 2
ధర్మాయాధర్మానాశాయ నిమిత్తీకృత్య పాణ్డవాన్ | స విప్రశాపవ్యాజేన ముసలేనాహనత్కులమ్. 3
యాదవానాం భారకరమ్-
విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమిత్తముగ చేసి కొని, ధర్మరక్షణముకొరకును, అధర్మవినాశమునకు, పూనుకొని దానవాదిక మగు భూభారమును హరించెను. విప్రశాప మను వంకచే, ముసలముచే, భూభారకర మగు యాదవకులమును నశింపచేసెను.
వజ్రం రాజ్యే7భిషేచయత్ | దేవాదేశాత్ర్పభాసే స దేహం త్యక్త్వా స్వయం హరిః 4
ఇన్ద్రలోకే బ్రహ్మలోకే పూజ్యతే స్వర్గవాసిభిః | బలభద్రో7నన్తమూర్తిః పాతాల స్వర్గమీయివాన్. 5
శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశమునే ప్రభాసక్షేత్రమునందు తన దేహమును పరిత్యజించి, ఇంద్రలోక బ్రహ్మలోకములందు స్వర్గవాసులచే పూజింపబడెను. బలరాముడు ఆదిశేషరూపధారి యై పాతాళ స్వర్గము చేరెను.
అవినాశీ హరిర్దేవో ధ్యానిభిర్ధ్యేయ ఏవ సః | వినా తం ద్వారకాస్థానం ప్లావయామాస సాగరః. 6
వినాశరహితు డగు ఆ శ్రీ హరి యోగులచే ధ్యానింపబడు వాడు. అట్టి శ్రీ కృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివేసెను.
సంస్కృత్య యాదవాన్ పార్థో దత్తోదకధనాదికః | స్త్రియో7ష్టావక్రశాపేన భార్యా విష్ణోశ్చ యాః స్థితాః. 7
పునస్తచ్ఛాపతో నీతా గోపాలైర్లగుడాయుధై ః | అర్జునం హి తిరస్కృత్య పార్థః శోకం చకార హ. 8
వ్యాసేనాశ్వాసితో మేనే బలిం మే కృష్ణసన్నిధౌ య | హస్తినాపురమాగత్య పార్థః సర్వం న్యవేదయత్. 9
యుధిష్టిరాయ స భ్రాత్రే పాలకాయ నృణాం తదా |
అర్జునుడు యాదవులకు ప్రేత సంస్కారాదులు చేసి ఉదకధనాదిదానములు చేసెను.
అష్టావక్రుని శాపముచే విష్ణుభార్యలుగా అయిన స్త్రీలను, మరల అతని శాపము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగా గల రోపాలకులు అర్జునుని ఓడించి తీసికొని పోయిరి. అర్జునుడు చాల శోకించెను.
వ్యాసు డాతనిని ఊరడించెను. కృష్ణుడున్నప్పుడే నా బలము అని అతడు గ్రహించెను. అతడు హస్తినాపురమునకు వచ్చి, రాజ్యపాలకు డైన యుధిష్ఠిరునకు ఇది యంతయు చెప్పెను.
సశేషం....
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
*🪷శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం🪷*
. *భాగం - 4*
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
*ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ*
. *శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః*
--/--
వ్యాఘ్రేశ్వరశర్మ భక్తికి సంతసించి ఆ తపస్వి
ఓంకారము నేర్పి",శ్రీపాదరాజం శరణం ప్రపద్యే"అని వల్లెవేయమనిరి.అలా వల్లేవేయుచూ వ్యాఘ్ర రూపంలోనే కురుపురం సమీపమునకు చేరుకొనెను.
కురుపురం చేరుకోవలనంటే జలమార్గములో పోవలెను. అప్పుడు శ్రీపాదుల వారు తన భక్తజన సందోహం లోవున్నారు.
వ్రాఘ్రేశ్వరశర్మ పిలుపు విని ఆనీటిమీద నడుచుకుంటూ ఆవలి ఒడ్డున వున్న తన పరమ భక్తుడైన వ్యాఘ్రేశ్వరశర్మ వద్దకు వెళ్ళి ఆయన పూజలు అందుకొని ఆ పులిని అధిరోహించి ఆ నీటిపై వచ్చినదారంటే తేలియాడుతూ కురుపురం చేరారు.అటు ఒడ్డుకు చేరి ఆపులి ని స్వామివారు కృపా దృష్టి తో చూడగా ఆ పులి అసువులు బాసి మహా పురుషునిగా బాసిల్లగా అచ్చటి స్వామి వారి భక్తులు ఆశ్చర్యానాందాలకు అంతులేకుండెను.
వ్యాఘ్రేశ్వరశర్మ పలువిధాల స్వామివారిని ప్రార్ధించగా స్వామివారు కరుణించి వ్యాఘ్రేశ్వరశర్మ ఎప్పుడుకావాలంటే అప్పుడు పులి రూపంలో సంచరించగలడని,తాను ఎల్లప్పుడూ ఆ భక్తుని గుర్తుగా పులిచర్మం ధరించి బాసిల్లుతానని వరమిచ్చి యోగమార్గములో ప్రకాశించమని అన్నారు. అప్పటినుండి వ్యాఘ్రేశ్వరశర్మ తపస్వు చేసుకుంటున్న మహాయోగులకు సామాన్య జనులవలన ఆటంకం కలగకుండా శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకుంటూ ఆమహాత్ముల గృహాలకు కాపలా వుంటున్నాడని ఆ వృద్ద తపస్వి శంకరభట్టుకు తెలియజేసెను. ఈవిధంగా తన ప్రయాణంలో జరిగిన విషయాలు,తాను తెలుసుకున్న అనుభవాలు మననంచేసుకుంటూ శ్రీపాదుల వారి నామస్మరణం చేసుకుంటూ ప్రయాణం సాగిస్తూ మార్గమధ్యంలో పుణ్య తీర్ధములు దర్శించుకుంటూ యాచించకుండా దొరికిన భోజనము స్వీకరిస్తూ పాండ్యదేశంలో కదంబవనం అనే 2వ మజిలీకి చేరుకున్నాడు.
రేపు శంకరభట్టు రెండవ మజిలీలో కలిగిన అనుభవాలు చెప్పుకుందాం.
*🙏దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా.🙏*
*సర్వం శ్రీ పాద వల్లభ చరణారవిందమస్తు🙏*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷
శ్రీమద్భగవద్గీత
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *ప్రధమ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *అర్జున విషాద యోగము*
. *శ్లోకము 4.5.6*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*అత్ర శూరా మహేష్వాసా*
*భీమార్జునసమా యుధి ।*
*యుయుధానో విరాటశ్చ*
*ద్రుపదశ్చ మహారథః ।। 4 ।।*
*ధృష్టకేతుశ్చేకితానః*
*కాశీరాజశ్చ వీర్యవాన్ ।*
*పురుజిత్ కుంతిభోజశ్చ*
*శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।।*
*యుధామన్యుశ్చ విక్రాంత*
*ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।*
*సౌభద్రో ద్రౌపదేయాశ్చ*
*సర్వ ఏవ మహారథాః ।। 6 ।।*
అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు; భీమ-అర్జున-సమాః — భీముడు అర్జునుడులతో సమానమైన; యుధి — యుద్ధములో; యుయుధానః — యుయుధానుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు; చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలము కల యోధులు ధృష్టకేతు — ధృష్టకేతుడు; చెకితానః — చేకితానుడు; కాశీరాజః — కాశీరాజు; చ — మరియు; వీర్య-వాన్ — వీరోచిత; పురుజిత్ — పురుజితుడు; కుంతిభోజః — కుంతిభోజుడు; చ — మరియు; శైబ్యః — శైబ్యుడు; చ — మరియు; నర-పుంగవః — ఉత్తమ పురుషులు; యుధామన్యుః — యుధామన్యుడు; చ — మరియు; విక్రాంత — ధైర్యవంతుడైన; ఉత్తమౌజాః — ఉత్తమౌజుడు; చ — మరియు; వీర్య-వాన్ — వీరుడైన; సౌభద్రః — సుభద్ర కుమారుడు; ద్రౌపదేయాః — ద్రౌపది పుత్రులు; చ — మరియు; సర్వే — అందరును; ఏవ — నిజంగా; మహా-రథాః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలము కల యోధులు.
భావము: వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి - యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చెకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు - వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఉన్నటువంటి - ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, ద్రౌపది పుత్రులు - వీరందరూ యుద్ధ వీరులే.
(రాబోయే పెను విపత్తు భయానికి, పాండవులు సమీకరించిన సైన్యం, ఉన్న దాని కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది, దుర్యోధనుడికి. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ, పాండవుల పక్షంలోనున్న మహారథుల (పదివేల సాధారణ యోధుల బలంతో సమానమైన యోధులు) ను చూపాడు. పాండవ పక్షం లో వున్న గొప్ప నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
భాగవతము
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*ప్రథమ స్కంధము*
*అన్నా! ఫల్గున! భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా*
*పన్నానీక శరణ్యు డీశుడు జగద్భద్రానుసంధాయి శ్రీ*
*మన్నవ్యాంబుజపత్రనేత్రుడు సుధర్మామధ్య పీఠంబునం*
*దున్నాడా? బలభద్రు గూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్.*
నాన్నా! అర్జునా! మన సారథి మన సచివుడు ఇంకా ఎన్నెన్నో అయిన కృష్ణయ్య, భక్తులయందు పరమవాత్సల్యం కలవాడు. బ్రహ్మజ్ఞానమే ఆకారం అయినవాడు, గోవులకు ఆనందం కలిగించేవాడు, ఆపదలలో వేదనలు పొందే భక్తుల సముదాయాలకు సంరక్షణ కూర్చేవాడు, ప్రభువు, జగత్తులకు శుభాలను అమర్చిపెట్టేవాడు, చక్కని కాంతులతో అప్పుడప్పుడే వికసించిన తామరరేకులవంటి కన్నులున్న మహాత్ముడు, దేవలోకంలో సుధర్మ అనే దేవసభలో కొలువుతీరి ఉన్న దేవేంద్రునిలాగా ద్వారకలో తన కొలువులో సింహాసనం మీద అన్న బలరామునితో కూడి సుఖంగా, ఉత్సాహంగా ఉన్నాడా?
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
పెరియ పురాణం
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *⚜️పెరియ పురాణం⚜️*
. *నాయనార్ల చరిత్ర - 42*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*కలిక్కంబ నాయనారు*
తిరు పెణ్ణాగడం అనే నగరంలో ఒక వైశ్య కుటుంబంలో జన్మించిన
శివభక్తుడు కలిక్కంబ నాయనారు. శివభక్తులను శివుని సాక్షాద్రూపంగా
భావించి గౌరవ మర్యాదలతో వారికి సేవలు చేస్తూ వచ్చాడు. రోజూ
షడ్రసోపేతమైన వంటకాలను సిద్ధం చేయించి వచ్చిన శివభక్తులకు
లేదనకుండా సంతృప్తిగా వడ్డించేవాడు.
ఒక రోజు యథా ప్రకారం శివభక్తులు కలిక్కంబ నాయనారు ఇంటికి
వెళ్లారు. అతని భార్య నీళ్లు పోస్తుండగా నాయనారు శివభక్తుల పాదాలను
ప్రక్షాళనం చేస్తూ వచ్చాడు. నాయనారు ఈ విధంగా చేస్తూ ఒక శివభక్తుని
పాదాలు పట్టుకొని కడగడం ప్రారంభించాడు. కాని అతని భార్య నీళ్లు
పోయలేదు.
భార్య నీళ్లు పోయకుండ ఉన్నందులకు కారణమేమిటని అతడు ఆలోచించాడు. వెంటనే నాయనారు భార్య ఆ శివభక్తుని చూపించి "ఇతడు
మన ఇంట్లో పరిచారకుడుగా ఉండేవాడు" అని చెప్పింది. నాయనారు
తీవ్రమైన కోపంతో కరవాలాన్ని దూసి భార్యచేతిని ఖండించాడు. తరువాత
వారే నీటి పాత్రను తీసుకొని నీళ్ళుపోసి ఆ శివభక్తుని పాదాలకు అభిషేకం
గావించాడు. పరమేశ్వరుడు అతని శివభక్తికి ప్రసన్నుడై అతనికి శివలోక
పదవిని అనుగ్రహించాడు.
*నలభైరెండవ చరిత్ర సంపూర్ణం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
శ్రీ వివేకానందస్వామి
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 130*
*అమృతం కన్నా రుచికరం*
ఖేత్రీలో ప్రజలు తండోపతండాలుగా స్వామీజీ వద్దకు వచ్చారు. స్వామీజీ వారితో ఎడతెగకుండా మాట్లాడుతూనే ఉన్నారు. స్వామీజీ మాటల్లోనే ఆ సంఘటన గురించి విందాం:
"నమ్మశక్యం కాదు, కాని ఎడతెగకుండా మూడు రాత్రుళ్లు పగళ్లు నాకు క్షణం కూడా విశ్రాంతి లేదు, నిద్రాహారాలు లేవు. ఎవరూ ఈ విషయం పట్టించుకొన్నదీ లేదు. వారు వస్తూనే ఉన్నారు, నేను మాట్లాడుతూనే ఉన్నాను. మూడవ రోజు రాత్రి అయింది. అప్పటికి అందరూ వెళ్లి పోయినట్లున్నారు. అప్పుడు నిమ్నకులానికి చెందిన ఒక వ్యక్తి నా వద్దకు వచ్చాడు.
'స్వామీజీ! మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా మీరు మాట్లాడుతూనే ఉండడం నేను గమనిస్తూనేవున్నాను. నా మనస్సు ఆవేదనతోతల్లడిల్లిపోతున్నది. ఆకలీ, అలుపూ మీకు కూడా ఉంటాయి కదా! ఒక గ్లాసు నీరు కూడా మీరు త్రాగలేదు!' అన్నాడు ఆప్యాయతానురాగాలు ఉట్టిపడే స్వరంలో, అతడి ప్రేమాభిమానాలు నన్ను కదలించివేశాయి.
'తినడానికి నువ్వు ఏమైనా ఇస్తావా?' అని అడిగాను. 'ఇవ్వాలనే నా మనస్సు తహతహ చెందుతున్నది. కాని ఏం చేయగలను? నేను నిమ్న కులస్థుణ్ణి, చెప్పులు కుట్టేవాణ్ణి. నేను చపాతీలు తయారుచేసి మీకు ఇవ్వలేను. పిండి తదితర పదార్థాలు తీసుకొచ్చి ఇస్తాను. మీరే చేసుకొని తినండి' అన్నాడతడు.
అందుకు నేను. 'ఫరవాలేదు. నువ్వే తయారుచేసి పట్రా! నేను తింటాను' అన్నాను. అతడు హడలిపోయాడు. చెప్పులు కుట్టే వాడయిన అతడు ఒక సన్న్యాసికి ఆహారం ఇచ్చాడని తెలిస్తే శిక్షింపబడతాడు; అంతేకాదు దేశబహిష్కరణ చేస్తారు కూడా. కాని నేను అతణ్ణి సాంత్వన పరిచాను; 'నీకు శిక్ష పడకుండా నేను చూసుకొంటాను' అని వాగ్దానం చేశాను.
అతడు నా మాటలను అంతగా నమ్మినట్లులేదు. కాని నా పట్లగల అభిమానంకొద్దీ చపాతీలు తీసుకొచ్చాడు. నేను వాటిని తిన్నాను. దేవేంద్రుడు ఒక బంగారు కలశంలో అమృతాన్ని తెచ్చి ఇచ్చినా, అది కూడా ఇంత రుచిగా ఉండదని నాకు అనిపించింది. నా హృదయం ప్రేమతోను, కృతజ్ఞతతోను పొంగిపొరలింది.కళ్లు చెమ్మగిల్లాయి.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
శివానందలహరీ – శ్లోకం – 43*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *శివానందలహరీ – శ్లోకం – 43*
. శ్రీ ఆదిశంకరాచార్య విరచితం
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు*
*స్వామిన్నాదికిరాత మామకమనఃకాన్తారసీమాన్తరే ।*
*వర్తన్తే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ-*
*స్తాన్ హత్వా మృగయావినోదరుచితాలాభం చ సమ్ప్రాప్స్యసి ॥*
ఓ కైలాసవాసా! నీవు అటు ఇటు పోకుము నాయందే నివసించుము. ఆదికిరాతమూర్తీ! దేవా! నా మనస్సనే మహారణ్య ప్రాంతంలో మాత్సర్యము, మోహము మొదలైన అనేక మదించిన మృగములున్నవి. వాటిని చంపి వేటయందలి నీ ఆనందమును తీర్చుకొందువు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
మిఠాయి సత్యం:
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
మిఠాయి సత్యం:
మా ఊర్లో సత్యంగారనే వారు
ఉండేవారు.ఉదయం పదిగంటల నుంచి
జంతికలు,చెగోడీలు,బజ్జీలు,బెల్లం మిఠాయి
ఉండలు చేసి అమ్మేవాడు.
ఎవరింట్లోఏ శుభకార్యాలయినా బూంది లడ్డు, మైసూరు పాక్, ఇలాంటివి చేయించుకొనే
వారు.దానాదీనా ఆయనకి మిఠాయి సత్యం గారు అనేపేరు స్థిరపడిపోయింది.
ఎందుకు ఆయన గురించి చెపుతున్నా నంటే
ఆయన చదువుకోకపోయినా మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు.తరచుగా ఆథ్యాత్మిక ఉపన్యాసాలు,హరికథలు వినేవాడు.
ఓ రోజు ఓ స్వాములవారు భగవతత్వం గురించి చెబుతూ,అనేక రూపాల్లో ఉన్నా
భగవంతుడు ఒక్కడే అని చెప్పి ఏమోయ్ సత్యం అర్థమైందా అని అడిగారు.
ఈ సత్యం గారు హరికథ కులకు, స్వామీజీ లకు, పౌరాణికులకు సపర్యలు చేస్తూ ఉండేవాడు.
అయ్! అర్థమయింది. ఎలాగంటే నా బాషలో నే సెబుతా యినండి ఎలా అంటే:
సెనగపిండి (మూలమనుకోండి)
1.సన్న గొట్టంలో సుడితే కారప్పూసండి.
2.లావుగొట్టంలో సుడితే జంతికలు
3.అదేసెనగపిండిని సట్రంలో కొట్టి,యేరు సెనగ,పుట్నాలు,అటుకులు ,కర్వేపాకు యేపి
కలిపితే కారంబూంది అవుద్ది.
4.అదే సెనగపిండి సట్రంలో బూంది కొట్టి
పంచదార పాకంలో వేసి ఉండకడితే లడ్డు
ఔతుంది.
5.అదే సెనగపిండి వేయించి, పంచదార, నెయ్యి వేసి ఓ పాత్రలో పాకం పడితే
మైసూరు పాక్ అవుతుంది.
6.అదే సెనగపిండి పల్చగా కలిపి, మిరపకాయ ముంచివేయిస్తే మిరపకాయ బజ్జీలు, అరటికాయ ముక్కలు ముంచివేస్తే అరటికాయ బజ్జీలు.
7.అదే సెనగపిండి లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,అల్లం,కలిపివేయిస్తే
పకోడీయండి.
ఒకే సెనగపిండికే ఇన్ని రూపాలున్నట్టే, మూలం శక్తి అయిన భగవంతుడు,మనకి శివుడుగా
యిష్ణువుగా,ఆంజనేయుడుగా,గణపతిగా
ఎన్నో రూపాలు గా కనపడతాడండి ఆయ్.
మనం ఎలా కొలిచినా,పిలిచినా పలికేశక్తి ఒహటేనండి.ఆయ్! నాకరదమయినకాడికి
సెప్పేనండి అన్నాడు సత్యంగారు.
ఆనాటి స్వామీజీ లు కనుక ఆయన తనకు అంతకు ముందే సభానిర్వాహకులు కప్పిన శాలువసత్యంగారికి కప్పి నిగర్వంగా ఓ మాటన్నారు.
ఇన్ని శాస్త్రాలుచదివిన నేను కూడా భగవత్ తత్వాన్ని నువు చెప్పినంత సులువు గా చెప్పలేను.
నీకు పరమేశ్వర కటాక్షం దొరికింది అన్నారు.
సభంతా చప్పట్లు మోత.
***
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - ద్వితీయ - పుష్యమి - భృగు వాసరే* *(29-12-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/zF8tFh5Mw6A?si=7QZTssHwid1gfmL_
🙏🙏
శుక్రవారం (భృగు వాసరః ) రాశి ఫలితాలు
శుభోదయం
16.2291923113
*****
29-12-2023
శుక్రవారం (భృగు వాసరః )
రాశి ఫలితాలు
********
మేషం
దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు అదుపు చెయ్యడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది
--------------------------------------
వృషభం
సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
--------------------------------------
మిధునం
ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధన పరమైన సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి.
--------------------------------------
కర్కాటకం
ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.
---------------------------------------
సింహం
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
---------------------------------------
కన్య
ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహనిస్తుంది.
---------------------------------------
తుల
విద్యార్థులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.
---------------------------------------
వృశ్చికం
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. .ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.
---------------------------------------
ధనస్సు
సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు.
---------------------------------------
మకరం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.
---------------------------------------
కుంభం
కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
---------------------------------------
మీనం
ఉద్యోగాలలో అధికారులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి.
---------------------------------------
పూజాకార్యక్రమాల సంకల్పము.
**********
*శుభోదయం*
***********
సంధ్యా వందన
మరియు ఇతర
పూజాకార్యక్రమాల సంకల్పము.
పూర్వ పద్ధతి పంచాంగం.
తేదీ.29.12.2023 శుక్ర వారం (భృగు వాసరే)
*********
గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
__________________
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
హేమంతృతౌ
మార్గశీర్ష మాసే కృష్ణ పక్షే ద్వితీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)
భృగు వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్_______గోత్రః_____నామధేయః
శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
*ఇతర పూజలకు*
శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే
హేమంతృతౌ మార్గశీర్ష మాసే కృష్ణ ద్వితీయౌపరి తృతీయాయాం
భృగు వాసరే అని చెప్పుకోవాలి.
*ఇతర ఉపయుక్త విషయాలు*
సూ.ఉ.6.33
సూ.అ.5.29
శాలివాహనశకం 1945 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం.
కల్యబ్దాః 5124 వ సంవత్సరం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు
మార్గశిర మాసం
కృష్ణ పక్షం విదియ ఉ. 6.47 వరకు.
శుక్ర వారం.
నక్షత్రం పుష్యమి రా. 2.25 వరకు.
అమృతం రా.7.32 ల 9.15 వరకు.
దుర్ముహూర్తం ఉ.8.44 ల 9.28 వరకు.
దుర్ముహూర్తం మ.12.23 ల 1.07 వరకు.
వర్జ్యం ఉ.9.12 ల 10.55 వరకు.
యోగం వైధృతి
తె.2.21 వరకు.
కరణం గరజి ఉ. 6.47 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.
రాహు కాలం ఉ.10.30 ల 12.00 వరకు.
గుళిక కాలం ఉ.7.30 ల 9.00 వరకు.
యమగండ కాలం సా. 3.00 ల 4.30 వరకు.
**********
పుణ్యతిధి మార్గశిర బహుళ తదియ.
********
శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,
(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)
S2,/C92, 6 -3 -1599/92,C
Vanasthalipuram, Hyderabad
500 070.
.**********
*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*
వారి
*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*
*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును*
*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*
*సంప్రదించండి*
ఫోన్(చరవాణి) నెం లను
*9030293127/9959599505
*.**************
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
**************
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
🙏🙏🙏
పంచాంగం 29.12.2023
ఈ రోజు పంచాంగం 29.12.2023 Friday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతు మార్గశిర మాస కృష్ణ పక్ష: ద్వితీయా తిధి భృగు వాసర: పుష్యమి నక్షత్రం వైధృతి యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
విదియ పగలు 08:00 వరకు.
పుష్యమి రాత్రి 03:10 వరకు.
సూర్యోదయం : 06:49
సూర్యాస్తమయం : 05:47
వర్జ్యం : పగలు 09:47 నుండి 11:31 వరకు.
దుర్ముహూర్తం : పగలు 09:01 నుండి 09:44 వరకు తిరిగి మధ్యాహ్నం 12:40 నుండి 01:24 వరకు.
రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.
యమగండం : మద్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
పిరమిడ్లు గురించి
పిరమిడ్లు గురించి సంపూర్ణ వివరణ - 1 .
కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద కొన్ని వందలాది సంస్కృతులు , నాగరికతలు ఈ భూమి మీద జనించాయి అలానే అదృశ్యం అయ్యాయి .ఇవి ప్రకృతి సిద్ధ అనర్ధాల వలన మరికొన్ని స్వయంకృతాపరాధాల వలన కాలగర్భములో కలిసిపోయాయి . ఇటువంటి మహాన్నత సంస్కృతులలో " ఈజిప్టు నాగరికత " చాలా ముఖ్యమైనది . ఈ ఈజిప్టు సంస్కృతి ఎన్నో రహస్యాలతో ముడిపడి ఉంటుంది . ఈ రహస్యాలలో ముఖ్యమైనది "పిరమిడ్లు " వీటి గురించి ఇప్పటికి పరిశోధకులు ఎంతలా పరిశోధించినా ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది .
ఈ పిరమిడ్ల చరిత్ర గురించి నేను అనేక రకాల పుస్తకాలు చదవడం జరిగింది . నేను తెలుసుకున్న ఎన్నో అమూల్యమయిన విషయాలలో అత్యంత ముఖ్యమైనవి మీకు తెలియచేయడం కోసమే ఈ ఆర్టికల్ రాస్తున్నాను .
ఈజిప్టు లోని కైరో నగరానికి 16 కిలోమీటర్ల దూరములో 13.1 ఎకరాల విస్తీర్ణములో భూమ్యాకాశాలను కలుపుతున్నట్లు " గ్రేట్ పిరమిడ్ " సాక్షాత్కరిస్తుంది . ప్రపంచములోని ఏడు వింతలలో ఇది ఒకటిగా ఖ్యాతిగడించింది . సుమారు 4000 సంవత్సరాల క్రితం ఈజిప్టు దేశములో నిర్మాణం అయిన గ్రేట్ పిరమిడ్ తో పాటు చిన్నవి , పెద్దవిగా కనిపిస్తున్న మరో ముప్పై పిరమిడ్లు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి . ఇందులో కొన్ని గ్రేట్ పిరమిడ్ కి ముందు నిర్మాణం అయినవి కూడా ఉన్నాయి . మొదటి పిరమిడ్ క్రీస్తు పూర్వం 2650 వ సంవత్సరం నాటిది అని చరిత్రకారుల అంచనా ! అసలు మొత్తం ఈజిప్టులో 70 పిరమిడ్లు ఉండేవని కాలగమనములో ప్రకృతి వైపరిత్యాలు , దుండగుల దాడుల్లో కొన్ని నశించి చివరికి 30 మాత్రం మిగిలాయి .
ప్రపంచములో పలుప్రాంతాలలో ఈ పిరమిడ్ల నిర్మాణం జరిగింది . చైనా , అమెరికా , ఫ్రాన్స్ , దక్షిణ ఆఫ్రికా , ఆస్ట్రేలియా , మెక్సికో , సైబీరియా , పెరూ దేశాల్లో కూడా పిరమిడ్లు ఉన్నాయి . మన భారత దేశములో హిమాలయ పర్వతాల్ని కూడా తెల్ల పిరమిడ్లు గా భావించే పరిశోధకులు ఉన్నారు . ముఖ్యముగా కైలాస పర్వతాన్ని గ్రేట్ పిరమిడ్ గా వ్యవహరిస్తారు . ప్రపంచములో విశాల ప్రదేశాన్ని ఆక్రమించుకొని ఉన్న పిరమిడ్ పేరు " క్విట్జల్ కోయాటి " ఇది మెక్సికోలో ఉంది . 117 అడుగుల ఎత్తులో 45 ఎకరాల విస్తీర్ణములో నిర్మింపబడిన పిరమిడ్ ఇది . ఇది క్రీస్తు శకం 100 వ సంవత్సరం నాటిది . ఈజిప్టు గ్రేట్ పిరమిడ్ కంటే పది లక్షల క్యూబిక్ గజాలు ఎక్కువ పరిమాణం కలిగి ఉంటుంది . ఇతర దేశాలలో పిరమిడ్ల కంటే ఈజిప్టు దేశములోని పిరమిడ్లు ఏంతో విలక్షణం అయినవి మరియు రహస్యాలతో కూడుకొని ఉన్నవి .
పిరమిడ్లలోని మిస్టరీస్ మరియు వాటి గురించి మరింత విలువైన సమాచారం తరవాతి పోస్టు నందు సంపూర్ణముగా వివరిస్తాను .
నేను రాసిన గ్రంధాల యందు మరెన్నో అమూల్యమైన విషయాలు మరింత వివరణాత్మకంగా వివరించాను . విజ్ఞానం పెంపొందించు కోవాలి అనుకునే వారికి ఈ గ్రంథాలు అద్భుతముగా ఉపయోగపడును .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ క్రింద ఇచ్చిన నెంబర్ నందు సంప్రదించగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034