29, డిసెంబర్ 2023, శుక్రవారం

పెరియ పురాణం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 42*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*కలిక్కంబ నాయనారు*


తిరు పెణ్ణాగడం అనే నగరంలో ఒక వైశ్య కుటుంబంలో జన్మించిన

శివభక్తుడు కలిక్కంబ నాయనారు. శివభక్తులను శివుని సాక్షాద్రూపంగా

భావించి గౌరవ మర్యాదలతో వారికి సేవలు చేస్తూ వచ్చాడు. రోజూ

షడ్రసోపేతమైన వంటకాలను సిద్ధం చేయించి వచ్చిన శివభక్తులకు

లేదనకుండా సంతృప్తిగా వడ్డించేవాడు.


ఒక రోజు యథా ప్రకారం శివభక్తులు కలిక్కంబ నాయనారు ఇంటికి

వెళ్లారు. అతని భార్య నీళ్లు పోస్తుండగా నాయనారు శివభక్తుల పాదాలను

ప్రక్షాళనం చేస్తూ వచ్చాడు. నాయనారు ఈ విధంగా చేస్తూ ఒక శివభక్తుని

పాదాలు పట్టుకొని కడగడం ప్రారంభించాడు. కాని అతని భార్య నీళ్లు

పోయలేదు. 


భార్య నీళ్లు పోయకుండ ఉన్నందులకు కారణమేమిటని అతడు ఆలోచించాడు. వెంటనే నాయనారు భార్య ఆ శివభక్తుని చూపించి "ఇతడు

మన ఇంట్లో పరిచారకుడుగా ఉండేవాడు" అని చెప్పింది. నాయనారు

తీవ్రమైన కోపంతో కరవాలాన్ని దూసి భార్యచేతిని ఖండించాడు. తరువాత

వారే నీటి పాత్రను తీసుకొని నీళ్ళుపోసి ఆ శివభక్తుని పాదాలకు అభిషేకం

గావించాడు. పరమేశ్వరుడు అతని శివభక్తికి ప్రసన్నుడై అతనికి శివలోక

పదవిని అనుగ్రహించాడు.


*నలభైరెండవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: