శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
హరిశ్చంద్రుడి మాటలకు వృద్ధ బ్రాహ్మణుడు పెద్దపెట్టున నవ్వేడు. మహారాజా ! ఈ తీర్థం చాలా
పుణ్యప్రదం. పాపనాశకం. ఇందులో సాన్నం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టు. ఇది
శుభముహూర్తం. అటుతరవాత నీ శక్తి కొద్దీ తృణమో పణమో దానం చేద్దువుగాని. ఈ పుణ్యతీర్థంలో చేసిన
స్నానాలూ దానాలూ రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. ఇలాంటి ప్రదేశాలకు వచ్చి సాన్నం చేయకుండా
వెళ్ళడం మహాపాపం. అది ఆత్మహత్యా సదృశమని స్వయంభువు చెప్పాడు. కనక ముందుగా స్నాన
తర్పణాలు కానియ్యి. అటుతరువాత నీకు దారి చూపిస్తాను. రాజధానికి వెడుదువుగాని. నువ్విచ్చే
దానానికి సంతోషించి నీతోకూడా అందాకా నేనూ వస్తాను.
హరిశ్చంద్రుడు రాజవేషం తొలగించుకుని స్నానోచితంగా నదిలోకి దిగాడు. మూడు మునకలూ
వేశాడు. నదిలోనే నిలబడి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాడు. బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి స్వామి!
దానం చెయ్యాలనుకుంటున్నాను. నీకు ఏది కావాలో కోరుకో. ఆవులా, నేలా, బంగారమా, ఏనుగులా,
రథాలా, అశ్వాలా ? ఏదైనా సరే కోరుకో. కోరుకున్నంతా ఇస్తాను. నా దృష్టిలో- ఇవ్వకూడనిదంటూ
ఏదీలేదు. ఇది నా వ్రతం. రాజసూయంలో మునీశ్వరుల సమక్షంలో చేపట్టాను. ఈ పుణ్యతీర్థమూ,
నువ్వూ అదృష్టవశాత్తూ ఇక్కడ లభించారు. మొగమోటపడక కావలసింది ఏదో కోరి నన్ను చరితార్ధుణ్ణి
చెయ్యి- అని అభ్యర్థించాడు.
నాదేయం మే కిమప్యప్తి కృతమేతద్ర్వతం పురా |
రాజసూయే మఖశ్రేష్టే. మునీనాం సన్నిధావపి
తస్మాత్ త్వమిహ సంప్రాప్తః తీర్థేఽస్మిన్ ప్రవరే మునే |
యత్తేఽస్తి వాంఛితం బ్రూహి దదామి తవ వాంఛితమ్ ॥ (19-12)
రాజన్ ! నీ కీర్తినిగురించి చాలాకాలం క్రితమే విన్నాను. నిన్ను మించిన దాత లేడని వసిష్ఠులవారు
చెప్పారు.
హరిశ్చంద్రో నృపశ్రేష్ఠః సూర్యవంశే మహీపతిః, తాదృశో నృపతిర్దాతానభూతో న భవిష్యతి.
అన్నారాయన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి