29, డిసెంబర్ 2023, శుక్రవారం

ధనుర్మాసము రోజు: 11

 ధనుర్మాసము   రోజు:  11 


బాపు రమణల  మేలుపలుకుల మేలుకొలుపులు    11


కొమ్ము విసిరే ఆలపొదుగుల పాలుపిదికే ఒడుపులో

బాణమేసినవాడి ప్రాణము పిండి, నెత్తురు పిదుకుచో

సాటిలేని హరివంశవీరుల శూరపుత్రివి నీవెలే

అందాల బరిణవు నీవెలే అపరంజి బొమ్మవు నీవెలే

నెమలిపింఛపు నీలకాంతుల నెరికురులసిరి నీవెలే

ఫణి ఫణాగ్రపు మణుల బోల్‌ ఘనజఘన లాస్యాల్‌ నీవెలే

ఎన్నిఉన్నా ఏమి లాభం నిద్ర ఒకటే నీదులోపం

జామునుంచీ వేచిఉన్నా చెలులపైనా జాలితలచీ

లేచి రమ్మా మొద్దుగుమ్మా లేవెలేవె బద్ధకమ్మా

కృష్ణచంద్రుని అందరం పాడుతూ కొనియాడుతూ

ఊరేగుదాం తొలి వెలుగులో ఉహూ కుహూ యంటూ

యమునచేరీ మునకలేసీ నోమునోచీ తరించుదాం-


సిరినోము - హరిపూజ - గిరిపుత్రివరము

గోకులం కన్నెలకు కల్యాణకరము

లోకులం దరికిదే సౌభాగ్యప్రదము

పల్లెపిల్లా మేలుకో

రే-పల్లె పిల్లా మేలుకో

కామెంట్‌లు లేవు: