28, జనవరి 2021, గురువారం

సొంత ఇల్లు కొనుక్కోవటం ఎలా

సొంత ఇల్లు కొనుక్కోవటం ఎలా  

పూర్వం మన పూర్వికులు ఒక గ్రామమంలో ఒక పెద్ద ఇల్లు కలిగి  ఉమ్మడికుటుంబముగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు అందరు ఒకరు లేక ఇద్దరు పిల్లలు కలిగి వాళ్ళని చదివిస్తే వాళ్ళు పల్లెలు వదిలి పట్టణాలకు చేరారు. ఇక్కడ వాళ్ళు సొంతః ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. 

ఇప్పటి పరిస్థితిలో హైద్రాబాదు శివార్లలో ఇల్లు కొనాలంటే కనీసం 50 లక్షలపైనే. కొంతమంది జీతాలల్లో పొదుపు చేసిన డబ్బు కొంత పెట్టి మిగిలిన దానిని అప్పు తీసుకొని కొనుక్కుంటున్నారు. ఐతే కొంతమంది వారి జీతాలు వలసినంత లేకపోవటంతో వారిదగ్గర వున్న డబ్బుతో ఇల్లు కొనలేకపోతున్నారు. ఇక ఉన్న ఆ 4,5 లక్షలు బ్యాంకులో దాచుకున్న దానికి వచ్చే వడ్డీకి డబ్బు ఎక్కువగా పెరగదు. ఇక ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ వడ్డీ కి ఇస్తే వాళ్ళు అసలుకూడా కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు చాలామంది వున్నారు. అంతే కాదు వాళ్ళదగ్గరినుండి డబ్బు రాబట్టుకోటానికి కోర్టులచుట్టూ తిరిగిన అవి ఎప్పటికి వస్తాయో రావో కూడా తెలియదు.  కాబట్టి ఇల్లు కొనాలనే కోరిక తీరటం చాలా తక్కువ అవుతుంది. మరి ఏమి చేయాలి?

ఇప్పుడు డబ్బులు వృద్ధి చెందాలంటే ఒక మంచి ఆలోచన చేయాలి. అది స్థలాలమీద పెట్టుబడి పెట్టటం. మన హైద్రాబాదు చుట్టూ ప్లోట్ల రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అవి ఎంతగా పెరుగుతున్నాయంటే మీరు ఏ బ్యాంక్ లో ఫిక్సడ్ డిపాసిట్ చేసినా రానంతగా వృద్ధి చెందుతుంది అంటే అతిశయోక్తి కాదు. 

నాకు తెలిసిన ఒక మిత్రుడు హైద్రాబాదు శివారులో కడ్తాలు దగ్గర రెండు సంవత్సరాల క్రితం రూపాయలు 2 వేలు గజం చప్పున కొన్న ప్లాట్ రేటు ఇప్పుడు 8 వేలు గజంగా పలుకుతుంది. అంటే రెండు సంవత్సరాలలో 4 రేట్లు ధర పెరిగిందని మనకు తెలుస్తున్నది. అంతే కాదు ఇంకా రేటు పెరిగే అవకాశం కూడా వుంది. దీనిని విశ్లేషిస్తే 

రెండు సంవత్సరాలు అంటే 24 నెలలు లేక ఉజ్జాయింపుగా 30 నెలలు అనుకుందాము. అంటే అప్పుడు పెట్టిన పెట్టుబడి ఒక 100 గజాలకు 2 లక్షలు అనుకోండి ఆ 2 లక్షలు ఇప్పుడు 8 లక్షలు అయ్యిన్ది అంటే 8-2=6  అంటే 2 లక్షలమీద పెరుగుదల 30 నెలలలకు 6 లక్షలు అంటే ఒక లక్షకి అంటే 6/2=3 అంటే 1లక్షకు 3 లక్షల లాభాము 30 నెలలకు అంటే నెలకు 200,000/30=  6666 అంటే 66% అన్న మాట ఇప్పుడు చెప్పండి మనం ఏ బ్యాంకులో దాచుకుంటే మనకు నెలకు 66% వడ్డీ వస్తుంది. మనం అధిక వడ్డీకి మనకు తెలిసిన వారికి ఇచ్చినా కూడా ఎక్కువాలో ఎక్కువ 10% వడ్డీ ఇస్తారు. అదికూడా నమ్మకం తక్కువ. మనం బంగారం మీద పెట్టుబడి పెట్టిన కూడా వృద్ధి ఇంత ఉండదు. కాబట్టి మనకు అన్నివిధాల ప్లాట్ మీద పెట్టుబడి ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ప్లాట్ కొనుక్కోటం ఒక్కటే ఎక్కువ వృద్ధిని చేకూరుస్తుంది. 

ప్లాట్ ఎక్కడ కొనాలి. 

హైద్రాబాదుకు ఆనుకొని 10,20 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ప్లాట్లు గజం 30 వేలు పైన వున్నాయి ఆ 30 లక్షలు ఉంటే సొంత ఇల్లు కాకపోయినా ఏదైనా అపార్టుమెంట్లో flat  కొనుక్కోవచ్చు. కాబట్టి ఈ పెట్టుబడి అంత లాభదాయకం కాదు. కాబట్టి పట్టణ శివారు గ్రామాలల్లో చేసే వెంచరులో గజం 5 నుండి 8 వేలు వున్నా ప్లాట్ కొంటె ఒకటి రెండు సంవత్సరాలలో నేను పైన చెప్పిన విధంగా మీకు వృద్ధి లభించ గలదు. ఉదా: మీరు ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి అది మీకు ఒక రెండు సంవత్సరాలలో 40,60 లక్షలు అయితే మీరు ఆ డబ్బుతో ఇంకా తక్కువ పడితే కొంత లోను తీసుకొని సొంత ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కొనగలరు. ఈ విధంగా చేసినట్లయితే సులువుగా సొంత ఇల్లు కొనుక్కోవచ్చు. 

మీరు నమ్మకమైన రియల్ ఎస్టేటు కంపినేని ఎంచుకోండి.  మీరు కోన దలుచుకున్న ప్లాటుని బౌతికంగా చూసి దానికి సంబందించిన E .సి ని 30 సంవత్సరాలది చుడండి.  సదరు ప్లాట్ వున్న వెంచరుపై కోర్టు కేసులు లేవని నిర్ధారణ చేసుకొని ఆ వెంచరుకు మెయిన్ రోడ్డుకు సరైన రోడ్డు ఉన్నదా చుడండి. అది అప్రూవ్డ్ వెంచరా కాదా అని చుడండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు కొనే ప్లాట్ నమ్మకమైనదిగా భావించ వచ్చు అప్పుడు మీరు పెట్టె పెట్టుబడికి రక్షణ కలిగి వున్నట్లే. 

ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే సరైన సలహా కోసం సంప్రదించగలరు. 





అభావః

 శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


అభావః ప్రాగ్రూపః ప్రతియుగపి తస్యోభయగతిం

విధిత్సు ర్బన్ధోఽ సౌ భవతి పరమాత్మా ;జగదపి౹

భవేద్యావద్బన్ధ స్తదవధి న మిథ్యాఽవిదితం నః

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


ప్రాగభావం, దాని ప్రతియోగి(కార్యం)..ఈ ఉభయగతుల 

స్థితిని కలిగించడం కోసం రెండింటికి మధ్య బంధం 

ఏర్పడుతుంది. ఆ బంధమే పరమాత్మ.ఆ బంధమెంత 

కాలం ఉంటుందో అంత కాలం జగత్తు కూడా ఉంటుంది. 

అప్పుడది మిథ్య ఎలా అవుతుంది? కానీ ఆ విషయం 

మాకు తెలియట్లేదు. విధాతా ! సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ

నువ్వెందుకు విఫలుడవవుతున్నావు

ఎవరు భరిస్తున్నారో

 ఎవరు భరిస్తున్నారో ఆలోచించండి.


(1) లక్ష ట్రాక్టర్ల ఊరేగింపు.

400 కి.మీ.దూరం.

(2) ప్రతి 10 కి.మీలకు ఒక లీటరు డీజల్ వినియోగం.

(3) ఒక లీటరు డీజల్ ధర 84 రుపాయలు.

(4) ఒక్కోక్క ట్రాక్టరుకు 40 లీటర్ల వినియోగం. లక్షట్రాక్టర్లకు 40లక్షల లీటర్ల డీజల్ అవసరం.

(5) డీజల్ పై ఖర్చు 84x4,000,000 =   33,60,00,000 = ముప్పై మూడు కోట్ల అరవై లక్షలు.

(6) ఒక్కోట్రాక్టరుకు రోజుకు బాడుగ Rs 1500/-

(7) లక్ష ట్రాక్టర్లలో రైతుల స్వంతంగా కలవి = 50 వేలు.

(8) 50 వేల ట్రాక్టర్లకు బాడుగ

50000 x 1500 = 7,50,00,000 = 7 కోట్ల 50 లక్షలు

(9) ఒక్కో ట్రాక్టర్ డ్రైవరు బత్తారోజుకు 800.

(10) 50 వేలమంది డ్రైవర్లకు బత్తా 50,000 x 800 = 40,00,000 =  40 లక్షలు

(11) ఒక్కో ట్రాక్టరులో 5మంది వస్తే, మొత్తం లక్ష ట్రాక్టర్లుకు కలిపి = 5,00,000 = ఐదు లక్ష మంది.

(12) ఒక్కొక్కరికి ఉదయం టిఫిన్ ఖర్చు = 50 రూపాయలు

(13) ఐదు లక్షలమందికి 5,00,000 x 50 = 2,50,00,000 = రెండు కోట్లా యాభైలక్షలు.

(14) మధ్యాహ్న భొజనం ఒక్కొక్కరికి Rs 75.

(15) 5 లక్షల మందికి 5,00,000 x 75 = 3,750,0,000 = మూడుకోట్ల డెబ్బై ఐదు లక్షలు.

(16) బ్యానర్లు, మైకులు ఒక్కో ట్రాక్టరుకు Rs 500.

(17) 50 వేల ట్రాక్టర్లకు

50,000 x 500 =  2,50,00,000 = రెండుకోట్ల యాభైలక్షలు.

(18) కాఫీ, టీలు, స్నాక్స్ వగైరాలు, 2,50,000 మందికి ( వచ్చేవారి సంఖ్య మొత్తం = 5 లక్షలు)

(19) ఒక్కొక్కరికి 25 రుపాయలు = 2,50,000 = 25 =62,50,000 = అరవై రెండు లక్షలా యాభైవేలు

(20) సభాసమావేశము కొరకు = రెండుకోట్లు

(21) హజరయ్యే రాజకీయనాయకులు చిన్నా పెద్దాకలిసి = 5 వేలు.

(22) వారి వాహనాలు, గన్ మెన్లు, డ్రైవర్లు, అటెండరులు,  డీజల్, భోజనాలు వగైరాలు కలిపి ఒక్కోనాయకుడి ఖర్చు Rs 5,000. 5 వేల మందికి 5,000 x 5000 = 2,50,00,000 = రెండుకోట్ల యాభైలక్షలు.

ఒకరోజు ర్యాలి మొత్తం వ్యయం = 46 కోట్లా,82 లక్షల, 75 వేల రుపాయలు


ఈ ఖర్చంతా ఎవరు భరిస్తున్నారు.స్వదేశీ రైతులా?

విదేశీశక్తులా ?

దేశాన్ని అస్తిరపరిచేటందుకు పూనుకొన్న చైనా, పాక్, దేశాలే కదా!


ఇవికాక ప్రభుత్వం ఏర్పాటు చేసే బందోబస్తు వ్యయం ఉండనేవుంది. ప్రజలు ఈ  ఖర్చును పన్నుల రూపంలో చెల్లించాలి కదా!

ఆలోచించండి.

మాఫియా

 ఈ రోజు రైతుల పేరుతో చేసిన విధ్వంసానికి వాడిన ఒక్కో ట్రాక్టర్ ఖరీదు అక్షరాల 35 లక్షలు . మానస్టర్ ట్రక్కులకి వాడే పెద్ద పెద్ద టైర్లు ట్రాక్టర్లకి వాడారు ఎత్తైన బారికేడ్ల మీద నుండి వెళ్ళడానికి . వీలుగా ఈ టైర్లను వాడారు..!! 


35 లక్షల రూపాయలు విలువ చేసే ట్రాక్టర్ ఓ రైతు నష్టపోతే  ఆ రైతు బతుకుతాడా..?? 


ప్రభుత్వం తీసుకు వచ్చే  రైతు చట్టం ఒక పంజాబ్ రైతులకు మాత్రమే నష్టం జరుగుతుందా మరి మిగత రైతులుకు జరగడం లేద..?? దేశంలో రైతుల అంటే పంజాబీలేనా ..?? 


రైతులు మారణాయుధాలు చేతబూని ధర్నా చేస్తారా..?? ఇదో పెద్ద మాఫియా..! 


రెండు నెలలుగా రోజూ 1000 మందిని AC బస్సుల్లో తీసుకురావడం తీసుకువెళ్లడం లాంటి ఖరీదయిన పనులు డ్రగ్ మాఫియానే చేయగలదు అంతే కానీ నిజమయిన రైతు ఆ పని చేయలేడు .!


వీరంతా రైతుల ముసుగులో ఉన్న ఖలిస్తాన్ తీవ్రవాదులు ఇదో పెద్ద కుట్ర.!! 


మేలుకో భారతీయుడా మేలుకో .!! జైహింద్

: 1 lakh tractor Rally

 Claim: 1 lakh tractor Rally 

Length: 400 km

Average: 10km per liter

Diesel price: Rs 84 per liter

Average diesel: 40 liters per tractor


 *Total Diesel: 40 Lakh Liters*

 *Total Price: Rs.33,60,00,000*(Thirty three crores sixty lakhs)

 *Total liter diesel required = 4 Million liter*

 *Cost 330 Million Ind Rupees ..*


If Poor farmer can afford 33.6 crores of rupees on one event, how much spent on agitation ?


Probably this much diesel and one lakh tractors work would have produced one year's food to all 11lakh farmer families in Panjab ! 


That means Agricultural market brokers are still have lot of money to disturb farmers & farm produce !


4 million liters diesel burnt on a day might create huge pollution to smash delhi !


*Is China filling pockets of brokers ?*


 *Any layman understand the sponsored program !*

రామాయణం 199

 రామాయణం 199

.................

రామా ఏల నీవు ఇలా బేలవైతే ,నీవంటి ధీరునికి దుఃఖము శోభనివ్వదు .

ఇదుగో చూడునాభార్యను వాలి అపహరించలేదా ? 

వానరుడ నైన నేను శోకిస్తున్నానా చూడు ,

.

ఆ రావణుడు ఎవ్వడో ఎక్కడ ఉంటాడో వాని సామర్ధ్యమేమో, వానిపరాక్రమమేమో  ,నాకు తెలవదు కానీ ,ముల్లోకాలలో ఎచ్చట ఉన్నా వాని ఆచూకి కనుగొని నీ సీత నీకు దక్కునట్లు చేసెదను .ఇది నా ప్రతిజ్ఞ .

.

ఆపత్సమయమందు, కానీ ధననాశము కలిగి నప్పుడు కానీ ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు కానీ ధైర్య వంతుడు తన బుద్ధితో బాగుగా ఆలోచించుకొనును కానీ కృంగిపోడు.

.

ఎవడు మూఢుడై తన వశములో తానుండక నిత్యమూ దైన్యములో కొట్టుమిట్టాడుకొనునో వాడు ఎక్కువ బరువు వేసిన ఓడ నీటిలో మునుగునట్లు మునిగి పోవును .

.

అని సుగ్రీవుడు అంజలి ఘటించి శోకములో మునిగిపోయి దీనుడై రోదిస్తున్న శ్రీరాముని ఓదార్చెను .

.

సుగ్రీవుని మాటలకు తన సహజ స్థితి ని పొందినవాడై రాముడు సుగ్రీవుని గాఢముగా ఆలింగనము చేసుకొనెను .

.

సుగ్రీవా !ప్రేమతో హితము గోరు స్నేహితుడు ఏమి పలుకవలెనో అవి నీవు పలికినావు .నీ వంటి బంధువు ఇటువంటి సమయములో ఎవరికీ లభించడు కదా!

.

సుగ్రీవా నీవు రాక్షసుని జాడ కనుగొనుటకు ప్రయత్నించుము ,

నేనేమి చేయవలెనో నాకు నీవు చెప్పుము ,

మంచి సుక్షేత్రమైన పొలములో వేసిన పంట చేతికొచ్చినట్లు నీ కార్యము సఫలము కాగలదు .

.

సత్యముపై ఒట్టు పెట్టి పలుకుచున్నాను నీ కార్యము నెరవేరినట్లే అనుకొనుము .అని పలికిన రాముని పలుకులకు సంతసించినవాడై సుగ్రీవుడు  మనస్సులో తనపని నెరవేరినట్లే అని అనుకొనెను .

.

అంత ఇరువురు మిత్రులూ ఏకాంతములో కూర్చొని   తమ సుఖదుఖములను గూర్చి ముచ్చటించుకొనసాగిరి.

.

జానకిరామారావు వూటుకూరు

రామాయణమ్ 198

 రామాయణమ్ 198

............................................................................................

రామా మేమందరమూ ఒకరోజు పర్వతముపై కూర్చొని ఉండగా ఒక స్త్రీ తన ఉత్తరీయమును ,శ్రేష్టమైన అలంకారములను జారవిడిచినది . ఆ స్త్రీ ఆ రాక్షసుని ఒడిలో ఆడుపాము వలే దోర్లుచూ మిక్కిలి బాధతో రోదించుచూ మాకు కనపడినది .

.

ఆమె జారవిడిచిన నగలన్నిటినీ మేము భద్రపరచితిమి  ,నేను వాటిని తీసుకొని వచ్చెదను నీవు గుర్తింపుము . 

.

మిత్రమా ఆలస్యమెందులకు త్వరగా తీసుకొని రమ్ము  అని రాముడు పలుకగా సుగ్రీవుడు వాటిని తానె స్వయముగా గుహలోనికి వెళ్లి తీసుకొని వచ్చి ఆయన ముందుంచాడు .

.

ఆ అలంకారములు ,ఉత్తరీయము చూసిన వెంటనే రాముని కన్నులు పొగమంచు కప్పిన చంద్రుడి వలె బాష్పముచేత ఆవరింపబడినవి .

.

ఒక్కసారిగా హా !సీతా  అంటూ ఏడుస్తూ నేలపై బడి మూర్చిల్లి నాడు .

.

మరల కొంతసేపటికి తేరుకొని మాటిమాటికీ తన గుండెలకు ఆ నగలను దగ్గరకు చేర్చుకొని కలుగులో కోపముతో బుసలుకొట్టే పాములాగా నిట్టూర్పులు విడుస్తూ కన్నులనుండి ఎడతెరిపిలేకుండా కన్నీరు కారుస్తూ ప్రక్కనే ఉన్న లక్ష్మణుని వైపు చూస్తూ కడు దీనంగా విలపించసాగాడు .

.

లక్ష్మణా ఇదుగో ఈ అలంకారాలు చూడు పచ్చిక మీద పడటము వలన విరిగిపోకుండా పూర్వమువలెనే ఉన్నవి .

.

అప్పుడు లక్ష్మణుడు,

 అన్నా ! నాకు కేయూరాలు కానీ ,కుండలాలు కానీ తెలువవు ,

కానీ ఆవిడ కాలి నూపురాలను మాత్రము నేను గుర్తించగలను.

.

నిత్యమూ ఆవిడ పాదాలకు వందనము చేయుదును కావున అవి నేను గుర్తుపట్టగలను.

.

నిస్సందేహముగా అవి ఆవిడవే ! 

.

సుగ్రీవుడా ,నా ప్రాణాధిక అయిన సీతను రావణుడు ఎటువైపుగా తీసుకొని వేళ్ళినాడో నీవు చెప్పగలవా!

 వానిని ఇప్పుడే యమ సదనమునకు పంపగలను అని రాముడు  కోపముతో సుగ్రీవుని వైపు తిరిగి పలికినాడు .

.

NB

( లక్ష్మణుడన్న ఈ మాటలు ప్రాచ్య పాఠమునందు లేవని పెద్దల అభిప్రాయము ).

.

వూటుకూరు జానకిరామారావు

రామాయణమ్ 197

 రామాయణమ్ 197

......

శ్రీరామ సుగ్రీవ ఆలింగనమయినపిదప హనుమంతుడు రెండుకర్రలనుండి అగ్నిని పుట్టించి ,ఆ అగ్నిని పుష్పములతో పూజించి అలంకరించి శ్రద్ధతో ఆ అగ్నిని రామసుగ్రీవుల మధ్య ఉంచగా వారిరువురూ ప్రదక్షిణము చేసి అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు.

.

"త్వం వయస్యోసి హృద్యో మే ఏకం దుఃఖం సుఖం చ నౌ"..

.

రామా ! ఇప్పుడు నీవు నాకు ప్రేమ పాత్రుడవైన మిత్రుడవు ఇకపై మన సుఖదుఃఖములు ఇరువురికీ సమానములు.

.

అంత సుగ్రీవుడు చక్కగాపుష్పించి మెత్తటి ఆకులు పువ్వులు గల ఒక మద్దిచెట్టు కొమ్మ విరిచి దానిపై రామునికి సుఖాసనమేర్పరచి తానుకూడా ఆయన పక్కనే కూర్చున్నాడు.

.

అప్పుడు హనుమంతుడు ,నిలబడియున్న లక్ష్మణునకు ఒక చక్కని గంధపు చెట్టు కొమ్మ విరిచి దానిమీద ఆసనము ఏర్పాటు చేసెను.

.

అందరూ కూర్చొన్న తరువాత సుగ్రీవుడు రామునితో రామా ! నా అన్న వాలి నా భార్యను అపహరించి నన్ను అవమానించి రాజ్యమునుండి వెళ్ళగొట్టినాడు.

.

అతనికి భయపడి ఇతరులెవ్వరూ ప్రవేశించలేని ఈ భయంకరారణ్యములో ప్రవేశించి నివాసమేర్పరచుకొన్నాను.

.

రామా ! వాలివలన నాలో ఏర్పడిన భయాన్ని తొలగించుము .అని వేడుకొన్న సుగ్రీవుని చూసి చిరు నవ్వుతో మిత్రమా ! స్నేహానికి ఉపకారమే ప్రయోజనము అను విషయము నేనెరుగుదును. నీ భార్యను అపహరించిన వాలిని నేను చంపివేయగలను.

.

రామా ! నీ పలుకులు నా హృదయములో మరల సంతోషాన్ని నింపినవయ్యా నా అన్న మరల ఇంకెప్పుడూ నన్ను బాధించకుండాయుండునట్లుచేయుమయ్యా అని సుగ్రీవుడుమరల పలికినాడు.

.

NB

.

Fair weather friendship కాదు రామసుగ్రీవులది ,ఒకరి అవసరాలను మరొకరు గుర్తించి పరస్పర ఉపకారము చేసుకొనుట అనేటటువంటిది స్నేహముయొక్క లక్ష్యము..

.

 అన్నీబాగున్నపుడు స్నేహము మనిషి కష్టాలలో ఉన్నపుడు ముఖము చాటెయ్యడం ఇది స్నేహము అనిపించుకోదు.

.

తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుకదరా సుమతీ! ....ఇలాంటి స్నేహాలు ఇప్పుడు కోకొల్లలు

.

జానకిరామారావు వూటుకూరు

రామాయణమ్ 196

 రామాయణమ్ 196

......

రామా !సుగ్రీవుని వద్దకు వెళ్ళెదము అని హనుమంతుడు పలుకగా , లక్ష్మణుడాయనను గౌరవించి రామునితో ఇలా అన్నాడు.

.

అన్నా ! ఈయన మాటలాడిన తీరు చూసినట్లయిన వీరికి కూడా మనవలన ఏదో ఒక పని జరుగవలసి యున్నట్లుగా తోచుచున్నది .

ఇక మన కార్యము సిద్ధించినట్లే !.ఈయన పలుకులలో విశ్వసనీయత కనపడుచున్నది . 

.

లక్ష్మణుడు అన్నతో ఆ విధముగా పలికిన తరువాత హనుమ తన సన్యాసి రూపము విడిచి అన్నదమ్ములిరువురినీ తన మూపుపై కూర్చుండబెట్టుకొని సుగ్రీవుని వద్దకు తీసుకొని పోయెను.

.

సుగ్తీవునకు రామలక్ష్మణుల గురించి చెప్పి ఆయన వద్దకు వారిని తీసుకొనిపోయాడు.

.

సుగ్రీవా, ఈయన రాముడు! సత్యపరాక్రముడు ,ఇక్ష్వాకు వంశమందు జన్మించిన వాడు .

దశరధకుమారుడు ,ధర్మాత్ముడు,

తండ్రి ఆజ్ఞపాటించి భార్యా సోదర సమేతముగా అడవులకు వచ్చినాడు .

.

ఇదుగో !ఈయన లక్ష్మణుడు ,అన్నను అనుసరించి వచ్చినవాడు .

అన్నకు తగ్గ తమ్ముడు.

.

రాముని భార్యను రావణుడపహరించగా ఆమెను తిరిగి పొందుటలో నీ సహాయము అర్ధించి వచ్చినాడు.

.

వీరు నీ స్నేహము కోరుచున్నారు.

వీరిని స్వీకరించుము .

.

అనిపలికిన హనుమంతుని మాటలు విని వారిరువురినీ ఆనందముగా చూస్తూ ,రామా ! నీ గురించి హనుమ అంతా చెప్పినాడు.నీవు ధర్మాత్ముడవనీ సత్యపరాక్రమము కలవాడవనీ గొప్పతపఃసంపన్నుడవనీ తెలిపినాడు.

.

ఓ ప్రభూ వానరుడనైన నాతో స్నేహము కోరుచున్నా వనగా అది నాకు గొప్ప సత్కారము .

.

రామా ఇదుగో నా చేయి చాపుచున్నాను స్వీకరించవయ్యా! .

.

సుగ్రీవుని ఈ మాటలు విన్న రాముడు మిక్కిలి ఆనందముతో ఆయన చేయి తన చేతితో దృఢముగా పట్టుకొని ఆయనను దగ్గరకు తీసుకొని తన బాహువులతో గాఢముగా కౌగిట బంధించినాడు.

.

వూటుకూరు జానకిరామారావు

రామాయణమ్ 195

 రామాయణమ్ 195

.........

హనుమంతుడు ఒక్కసారి ఆగి ఆలోచించాడు .

.

ఒక ప్రయోజనమాశించి ఈ మహాపురుషుడు ఇచటికి వచ్చినాడు ,ఈయన వలన సుగ్రీవుని కార్యము కూడా నెరవేరగలదు. సుగ్రీవునికి రాజ్యము కూడా లభించగలదు. ఈ విధంగా ఆలోచించి హనుమంతుడు రామునితో ఇలా అన్నాడు .

.

పంపాపరిసరములలో ఉన్న అత్యంత భయంకరము, దుర్గమము అయిన ఈ అరణ్యములోనికి మీరేల ప్రవేశించారు.

ఇక్కడఅతిభయంకరమైన  విషసర్పములు ,నానాక్రూరమృగములు 

సంచరించుచున్నవి .ఇటువంటి అడవిలోకి నీవు,నీతమ్ముడు ఎందుకు ప్రవేశించారు.

.

అప్పుడు లక్ష్మణుడు ఆయనకు తమ గురించి అంతా విశదీకరించి ,కబంధుడు తమకు సుగ్రీవుని గురించి తెలిపిన విషయము చెప్పి సుగ్రీవుని సహాయము ఆశించి వచ్చామని తెలిపాడు.

.

లక్ష్మణుడు పలికిన ఈ మాటలు విని హనుమంతుడు,.... బుద్ధిమంతులు ,క్రోధమును జయించినవారు,జితేంద్రియులైన మీ వంటి వారి దర్శనము అదృష్టవశముననే లభించును.అట్టి మిమ్ములను సుగ్రీవుడు తప్పక చూడవలెను .

.

సుగ్రీవుడు తన అన్న అయిన వాలిచేత అవమానింపబడి రాజ్యమునుండి వెడలగొట్టబడినాడు.వాలి సుగ్రీవుని భార్యను అపహరించినాడు.అతడు వాలికి భయపడి అరణ్యములో కాలము గడుపుచున్నాడు.

.

రామా ! సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి సీతాన్వేషణమున మీకు సహాయము చేయగలడు.

.

NB

సుగ్రీవుడు  వాలికి భయపడి అడవిలో దాక్కున్న వాడు .మరి కబంధుడు అలాంటి వాడిగురించి ఎందుకు చెప్పాడు ? వాలి అతనికంటే గొప్ప వాడుకదా ! 

.

మొదటి కారణము వాలి అధర్మపరుడు ధర్మాత్ముడైన రాముడు వాలి సహాయము స్వీకరించడు.

.

రెండవకారణము ..సమాన శీల వ్యసనేషు సఖ్యం ...ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఎప్పుడు చిగురిస్తుంది అంటే ఇద్దరి శీలము ఇద్దరి బాధ ఒకటే అయి ఉండాలి .

సుగ్రీవుడు శీలసంపద కలిగిన ధర్మాత్ముడు పైగా రాముని వలెనే భార్యను పోగొట్టుకొని ఆ బాధ కూడా రాముని లాగానే అనుభవిస్తున్నాడు .

Empathy  is more important for any friendship to become strong.


.

జానకిరామారావు వూటుకూరు

.

రామాయణమ్ 194

 రామాయణమ్ 194

....................

ఇంకా రాముడు చెపుతూనే ఉన్నాడు హనుమయొక్క వాగ్వైఖరి గురించి ....

.

సంస్కార క్రమ సంపన్నాం అద్భతామవిలమ్బితామ్

ఉచ్ఛారయతి కల్యాణీమ్ వాచం హృదయ హారిణమ్

.

ఇతడు ఉచ్చరించిన మంగళకరమైన వాక్కు వ్యాకరణసంస్కారసంపన్నమై ఒక క్రమపద్ధతిలోయుండి ఆశ్చర్యకరముగా నున్నది. ఉచ్ఛారణలో తొందరలేదు మనోహరముగా ఉన్నది.

ఇంత అందముగా మాట్లాడితే ఎవని మనస్సు సంతోషముపొందదు? కత్తి ఎత్తిన శత్రువు మనస్సుకూడా మారిపోతుంది.

.

ఇట్టి దూత ఏరాజు వద్ద యుండునో ఆరాజు కార్యములన్నీ సిద్ధించును.

.

హనుమమాటలు విన్న పిదపలక్ష్మణుడు ఆయనతో ఇలా అన్నాడు....ఓ బుద్ధిమంతుడా వానరరాజైన సుగ్రీవుని వెదుకుచూ మేము ఇటకేతెంచినాము . సుగ్రీవుని మాటలకు అనుగుణముగానే నీవుచెప్పినట్లుగానే చేయుదము.

.

NB

.

Some thing extra ఇది స్వామి policy. లాగా ఉన్నది మన యజమాని చెప్పిన దానికంటే అదనంగా  లాభం చేకూర్చే పని ఇంకొకటి చేశామనుకోండి మన Boss ఖచ్చితంగా సంతోషిస్తాడు ..అది మనము స్వామిని చూసినేర్చుకోవాలి మన working style, work culture కూడా స్వామినుండి నేర్చుకోవలసింది చాలా ఉన్నది.

సుగ్రీవుడు వారెవరో కనుక్కుని రమ్మని మాత్రమే పంపాడు కానీ ఈయనో!  సుగ్రీవుడు మీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు అని చెప్పాడు.అనగా రామలక్ష్మణులను చూడగానే వారి సామర్ధ్యాన్ని  అంచనా వేసి తన రాజుయొక్క కార్యాన్ని సాధించగలవారు వీరే అని నిశ్చయించుకొని ఒక అడుగు తానేముందు వేశాడు.

.

ఇప్పటిదాకా జరిగిన రామప్రయాణంలో ఎవరిని చూశైనా శ్రీరాముడు ఇంత అంచనా చేశాడా? లేనే లేదు

.

హనుమ స్థాయి అంచనా వేశాడు అంటే రాముడి స్థాయి ఎంతటిదో?  మన ఊహకందదు.

అలాగే అంతటి బుద్ధిమంతుడైన హనుమంతుడు సుగ్రీవుడు వద్ద మంత్రిగా ఉన్నాడంటే సుగ్రీవుడు స్థాయి ఎంతటిదో.

.

ఇదీ assessment అంటే!

.

జానకిరామారావు  వూటుకూరు

రామాయణమ్ 192/193

 రామాయణమ్ 192/193

..

రామచంద్రుడు ఇంకా హనుమయొక్క సంభాషణా చాతుర్యము గురించి లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు.

.

నూనం వ్యాకరణకృత్స్నమనేన బహుధా శ్రుతమ్

బహు వ్యాహరతానేన న కించిత్ అపశబ్దితమ్....అనగా

.

నిశ్చయముగా ఈతడు వ్యాకరణమును అనేక పర్యాయములు విని ఉన్నాడు . అందుచేత ఇన్ని సార్లు మాట్లాడినా ఒక్క అపశబ్దముకూడా ఇతనిచేత ఉచ్చరించబడలేదు .

.

ఇక్కడ బహుధా అనగా...... అనేక పర్యాయములు అనే పదం మహర్షి వాడారు.

.

న ముఖే నేత్రయోశ్చాపి లలాటే చ భ్రువోస్తథా

అన్వేష్వపి చ సర్వేషు దోషః సంవిదితః క్వచిత్.

.

ముఖమునందుగానీ 

నేత్రములయందు 

కానీ లలాటమునందు కనుబొమ్మలయందుగానీ ,

మరి ఏ ఇతర అవయవములయందుగానీ 

ఏ మాత్రము దోషము కనపడలేదు.

.

అవిస్తరమసందిగ్ధమవిలమ్బితమవ్యథమ్

ఉరఃస్థం కణ్ఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరమ్.

.

ఉచ్ఛారణలో సాగతీతలేదు ,

సందేహమునకు తావు లేదు,

ఆగి ఆగి మాట్లాడడము లేదు ,

వినేవారికి వ్యథలేదు

 బిగ్గరగా గానీ మందముగా గానీ లేక మధ్యమస్వరములో వినటానికి ఇంపుగా హాయిగా ఉన్నది.

.

NB


అదీ మాట్లాడడము అంటే .

"సాగతీత "అంటే ఏమిటో నిత్యంFM రేడియో వినే వారికి తెలుస్తుంది .

ఇక "అపశబ్దాలు" 24 గంటల News Channels వినేవారికి సుపరిచితమే.

ఆగి ఆగి మాట్లాడటము బిగ్గరగా మాట్లాడటము మన TV ఇంటర్వ్యూలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి....ఇవ్వన్నీ అవలక్షణాలు ..

.

మాట ఎలా ఉండాలి ? అదుగో పైన స్వామి మాట్లాడిన విధంగా ఉండాలి .

ఇంకా ;...

.

అవయవాలలో ఏ విధమైన వికారాలూ మాట్లాడేటప్పుడు ఉండరాదు.

.

గీతీ దీర్ఘ

శిరఃకంపీ

తధాలిఖితపాఠకః

అనర్ధజ్ఞోల్ప కంఠశ్చ

షడేతే పాఠకాధమాః

.

సాగతీస్తున్నట్గుగా ఉండరాదు ,

తల మెడ భుజాలు విసురుతూ మాట్లాడరాదు. 

ఇక వ్రాసుకొచ్చిన కాగితాలు చూస్తూ మాట్లాడరాదు 

,అర్ధము మారిపోయే విధముగా ఉండరాదు ,

కీచుకంఠము పనికి రాదు 

ఈ ఆరూ దోషాలు అని మన పెద్దలుచెప్పారు.

.

ప్రకృతి,ప్రత్యయ,సమాస,సంధి....వీటన్నింటిగురించి బాగా చదివి ఉన్నాడు ఆయన.

.

ఒక్కసారి ముక్కున పట్టుకొని పరీక్ష పేపర్లో వ్రాసి మార్కులు తెచ్చుకొని ,ఆ తరువాత పెళ్ళి శుభలేఖలలో ,visiting cards లో పెట్టుకోవడానికి తప్ప చదివినది ఏ మాత్రమూ గుర్తుండని చదువు మనది .

.

ఈ విశేషాలు ఇంకా వున్నాయి.

.

జానకిరామారావు వూటుకూరు

దర్శనంలో

 _*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న  సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_


_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._


_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._


_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._


_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._


_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._


_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._


_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._


_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._


_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_


🙏🇮🇳😷🌳🏵️🌐🤺🥀

అష్టాక్షరీ మంత్రం

 అష్టాక్షరీ మంత్రం అనగా ఏమిటి మంత్రం యొక్క విశిష్టత ఏమిటి?*

🍁🍁🍁🍁

*“ఓం నమో నారాయణాయ”* అనే అష్టాక్షరీ “ఓమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.

అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.

జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,

“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే

“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.

ధ్యాయేన్నారాయణందేవం
స్నానాదిఘ చ కర్మసు,
ప్రాయశ్చిత్తం హి సర్వస్వ
దుష్కృత స్వేతివైశ్రుతిః!

స్నానపానాదిగల సమస్తకర్మలలో “నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.

ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః
ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!

సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర ‘నారాయణ’ ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది.

ఆమ్నా యాభ్య  సనాన్యారణ్య రుదితం వేదవ్రతా న్యవ్వహాం
మేద శ్ఛేద ఫలాని పూర్తవిధయస్సర్వే హుతం భస్మని
తీర్థా నామవగాహనాని చ గజస్నానం వినా యతృద
ద్వంద్వామ్భోరుహ సంస్మృతీర్విజయతేదేవస్స నారాయణః

‘శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది. ఎన్ని ధర్మ కార్యాలను చేసినా బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా గజస్నానమే అవుతుంది (వ్యర్ధమే).

శ్రీమన్నామ ప్రోచ్చ్యనారాయణాఖ్యం
కేన ప్రాపుర్వాం ఛితం పాపినోపి,
హనః పూర్వం వాక్రు వృత్తాన తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్

‘శ్రీమన్నారాయణ’ నామాన్ని ఉచ్చరించువాడు ఎంతటి పాపి అయినా, దైవకృపతో మోక్షాన్ని పొందుతాడు. 


*🌸జై శ్రీమన్నారాయణ🌸*

🍁🍁🍁🍁 

కోరికలు

 *మన కోరికలు ఎలా ఉండాలి*?


హరిద్వార్లో కొండగుహలో ఉండే స్వామీజీ వద్దకు ఇద్దరు స్త్రీలు వచ్చారు

స్వామిజికి నమస్కరించి ఇలా ప్రశ్నించారు

"స్వామిజీ! మామనసులో ఉంది ఎప్పుడూ నెరవేరదు! ఎప్పుడూ అశాంతితోనే ఉంటాము!! మా మనసులోని కోరిక నెరవేరి శాంతి కలిగే ఉపాయం చెప్పండి స్వామీ!!" అంటూ అడిగారు

"ఏమిటమ్మా! మీ మనసులో ఉన్న కోరిక?"ప్రశ్నించాడు స్వామిజీ

"నాకు ఎవరితో మాటపడవద్దని ఉంటుంది స్వామి! నన్నెవరూ తిట్టవద్దు!! అని కోరుకుంటాను. కానీ, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళలా విమర్శిస్తూ వుంటే నా మనసంతా అశాంతిగా ఉంటుంది." చెప్పింది ఒక స్త్రీ

"నాకు దుఃఖాలు రావద్దని కోరుకుంటాను. కానీ ఎప్పుడూ ఏదో ఒక దుఖం వస్తూనే ఉంటుంది.. లేదా.. ఎవరో ఒకరు మాటలంటూ ఏడిపిస్తూనే ఉంటారు".. చెప్పింది రెండవ ఆమె కూడా!!

వాళ్ళ సమస్యలు విన్న స్వామీజీ ఒక పదినిమిషాలు ధ్యానముద్రలోకి వెళ్లి తర్వాత ప్రశాంతంగా ఇలా చెప్పసాగాడు.

"చూడండీ! మనం ఏది మననం చేస్తుంటామో అదే మంత్రంగా మారి ఫలితం ఇస్తుంది.. అంటే మన భావాలే మంత్రాలౌతాయి!!"

మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే....

"కావాలా? వద్దా??...జరగాలా? వద్దా?? అన్న దానితో సంబంధం లేకుండా ఈ భావంలో ఉన్న విషయమే సంఘటనలుగా ముందరికి వస్తుంది."

"భావాన్ని బట్టే అలవాట్లు కూడా ఏర్పడుతుంటాయి"

"స్వామీజీ! భావాన్ని బట్టి అలవాట్లు అంటే?" ప్రశ్నించారు ఒకరు.

స్వామీజీ సమాధానమిస్తూ..

మనకోరికలు ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలి! నెగిటివ్ గా ఉండవద్దు!!

"శతమానం భవతి"..అంటూ వంద సంవత్సరాలు జీవించు!!..అంటూ దీవిస్తామే తప్ప.."నువ్వు నూరు సంవత్సరాల వరకు చచ్చిపోకు!!"..అంటూ దీవించము!!..అంటూ చెబుతూ

"అమ్మా! నువ్వు ఇతరుల్లో తప్పులు కనిపిస్తే వెంటనే చెప్పేస్తావా? "ప్రశ్నించాడు స్వామి ఒకరిని

"అవును స్వామీ! నేను తప్పును ఓర్వనూ!! ఏదున్నా ముక్కుసూటిగా చెప్పేస్తాను!" అంది ఆమె

"నీ కష్టాలు దుఃఖం ఇతరులతో పంచుకుంటూ ఉంటావా? నువ్వు!! "అంటూ రెండవ ఆమెను ప్రశ్నించాడు స్వామిజీ

"అవును స్వామీ! కష్టాలు దుఃఖం చెప్పుకుంటేనే కదా మనసంతా తేలికపడుతుంది సమాధానమిచ్చింది!" రెండో ఆమె

"అలవాట్లంటే ఇవేనమ్మా! 

మన భావాలను బట్టే మన అలవాట్లు ఉంటాయి.

ఆ అలవాట్లను బట్టే సమాజానికి మనమిచ్చే దానాలుంటాయి!"

ఆ దానాలే తిరిగి మనకు ఎటువంటి ఫలితాలు రావాలో నిర్ణయిస్తాయి!

"మీరొకరికి జ్ఞానదానం చేశారు! అప్పుడు మీ జ్ఞానం పెరుగుతుందా?తగ్గుతుందా??" అడిగాడు స్వామిజీ

"పెరుగుతుంది స్వామి" చెప్పారిద్దరొకేసారి

"సరే! మరొకరికి ధైర్యం చెప్పారు! అప్పుడు ధైర్యం పెరుగుతుందా?తగ్గుతుందా??"

"పెరుగుతుంది స్వామి" చెప్పారు మళ్ళీ..

మీరు జ్ఞానాన్ని..ధైర్యాన్ని.. సంతోషాన్ని.. ఇలా ఏ భావాన్ని దానం చేస్తున్నారో ఆ భావం మీలో పెరిగినపుడు..

మీరు విమర్శలనూ..దుఃఖాన్ని దానం చేస్తూనే ఉండడం అలవాటుగా చేసుకున్నారు కాబట్టి, అవి కూడా పెరుగుతూ పోతాయి కదా!!

"స్వామిజీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? " అంటూ ప్రశ్నించారు

స్వామిజీ సమాధానమిస్తూ...

"అందుకే మనసులో ఎప్పుడూ నెగిటివ్ భావంతో కూడిన కోరికలు ఉంచుకోవద్దు!"

"నేను మాటలు పడవద్దు!

నన్నెవరూ తిట్టవద్దు!!

నాకు దుఃఖాలు రావద్దు!!!

నేను బిచ్చమెత్తుకోవద్దు!!!!"

......ఇలా!!

వద్దు!..కావాలా?..అనేది ముఖ్యం కాదు ..ఆ కోరికలో భావం ఎలా వ్యక్తమైందో అదే రకరకాల సంఘటనలుగా మారి మీ జీవితంలోకి వస్తుంది.. ఆ భావమే ఒక మంత్రంలా పనిచేస్తుంది!

కాబట్టి వాటినే ఇలా అనుకోవాలి!

నేను పొగడబడాలి!

నేను బాగా కీర్తించబడాలి!!

నేను ఆనందంగా ఉండాలి!!!

నేను ధనవంతురాలను కావాలి!!!!

...ఇలా పాజిటివ్ గా ఉండాలి!అప్పుడు మీ భావమే మంత్రమై వాస్తవంగా మారుతుంది.

మీ కోరికలు తీరాలంటే వాటినే పాజిటివ్ గా అనుకోండీ!

"అమ్మా! నీ అదే కోరికను "నన్ను అందరూ పొగడాలి!" గా మార్చుకుని దాన్నే మననం చెయ్యు!!" అంటూ మొదట ప్రశ్నించిన స్త్రీతో చెప్పి...

రెండవ ఆమె వైపు తిరిగి..

"నువ్వేమో 'నేనెప్పుడూ ఆనందంగా ఉండాలి' అనుకో! దాన్నే మననం చెయ్యు!" అంటూ చెప్పాడు. "సరే !స్వామి!! ఈ క్షణంనుండే మీరు చెప్పినట్లు ప్రయత్నం చేస్తాము! 

ఇది తొందరగా నెరవేరేలా ఇంకేదైనా రెమిడి చెప్పండీ!" అంటూ అడిగారు.

"సరే అమ్మా ! అలవాట్లను బట్టే ఫలితాలు ఉంటాయన్నాను కదా!! ఇక నుంచి మీ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి!...ఇంతకు ముందు మాదిరిగా నువ్వు ఇతరులను విమర్శించడం మానేసి రోజుకు కనీసం 5 గురినైనా పొగుడు! తర్వాత క్రమంగా ఆ సంఖ్యను పెంచుతూ వెళ్లు!!"

ఇక నువ్వేమో కష్టాలు,దుఃఖాలు,బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోరుకోవడం మానేసి ఆనందాలను..సంతోషాలను చెబుతూ నీ హ్యాపీ నెస్ ను పంచుతూ వెళ్లు! అలా చెప్పే వ్యక్తుల సంఖ్యను క్రమంగా పెంచుకో!!

అంటూ రెమిడి సూచించాడు స్వామిజీ!

"అద్భుతం స్వామి!! చాలా బాగా చెప్పారు!" అంది మొదటి స్త్రీ.

"కదా!! స్వామిజీ చెబుతుంటే మనసంతా ఎంత సంతోషమనిపించిందో!!!" అంది రెండవ ఆమె.

....ఆ క్షణమే రెమిడి ప్రారంభించిన ఆ ఇద్దరినీ చూసి స్వామిజీ తృప్తిగా నవ్వుతూ దీవించి పంపాడు!

ఎండుగడ్డి వంటి కోరికలను కాల్చేది ఆత్మజ్ఞానం. అది జ్ఞానాగ్ని. కాలిపోగా మిగిలే బూడిదే సమాధి. వాచామౌనం మౌనమూ కాదు, సమాధీ కాదు. దృశ్యమాన ప్రపంచాన్ని చైతన్యమయంగా చూడగలగటమే బ్రహ్మానందస్థితి. అన్నివేళలా ప్రశాంత, ప్రసన్న స్థితిలో నిలకడ చెందినవాడే యోగి. అతడికి కూడటం, వీడటం అంటూ ఉండదు. అతడిది ఏమీ అంటని ఆకాశం వంటి స్థితి!

ఉపనిషత్‌ భావనలో.. అంటే బ్రహ్మ భావనలో నిలకడ చెంది, నిధి ధ్యాసనంలో హృదయాన్ని బ్రహ్మమయం చేసుకున్న జీవన్ముక్తుడికి, సంసార దుఃఖం అంటదు. నిరంతర చింతన అహవినాశానికి దారితీసి శుద్ధాత్మను స్థిరం చేస్తుంది. అది అభినయం నుండి అనుభవం వైపు నడిపిస్తుంది.

వజ్రం లోపలి కాంతి లాగా జ్ఞాని హృదయం కూడా కాంతిమయంగానే ఉంటుంది. అది నిశ్చల దీపకళిక. నిద్రలో అణగిన మనసువలె, జ్ఞాని కార్యకలాపాలు ఆత్మనిష్ఠలోనే కుదురుకొని ఉంటాయి. యోగులు లోకసంబంధ కార్యాలను అద్వయ స్థితిలో ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిర్వర్తిస్తుంటారు.

కోరికలు లేనివాడు మేరు గంభీరుడు, ముల్లోకాలను గడ్డిపోచలో నిలుపుకోగల ధీమంతుడు. ఖాళీకుండ లోపల, వెలుపల ఎట్లా శూన్యమో, నీటమునిగిన కుండ వెలుపలా లోపలా ఎట్లా పూర్ణమో, జీవన్ముక్తుడూ అంతే. ఇష్టాయిష్టాలు ఎరుగని జ్ఞాని, ప్రపంచ వ్యవహారాలను సాక్షిగా నిర్వహిస్తాడు. ప్రపంచంలోనూ, దేహంలోనూ ఉన్నా జ్ఞాని జీవన్ముక్తుడే!

అహం వీడిన ధ్యానాతీతమైన స్థితే జీవన్ముక్తుడిది. ఆప్తమిత్ర బేధం లేక, దృష్టి బేధం లేక అంతటా అన్నిటా సమ్యక్‌ దృష్టితో ఆనందధామంగా ఎవరు జీవిస్తుంటారో వారే జీవన్ముక్తులు. బంధన కానీ ముక్తిగానీ ఎరుగనిది జీవన్ముక్త స్థితి.

ముక్తి లోకాతీతమూ, దేహాతీతమూ కాదు. అది (ముక్తి) ఇక్కడే ఉన్నది అనుకోవటంలోనే అంతా ఇమిడి ఉన్నది. కోరికలే బంధన. వాటిని వదులుకోవటమే ముక్తి. జీవాత్మ పరమాత్మకంటె భిన్నం కాదు. ఆ ఎరుకే జీవన్ముక్త స్థితి. తన కంటే వేరుగా మరొక వస్తువేదీ లేదనే నిశ్చలస్థితే, జీవన్ముక్తుడిది. మనసు తనను తానే బంధించుకుంటుంది. తనను తానే విడిపించుకున్నప్పుడు ముక్తిని అనుభవిస్తున్నది. అదే ఆనందతారక స్థితి.

అష్టాక్షరీ

 అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత


🍁🍁🍁🍁


*“ఓం నమో నారాయణాయ”* అనే అష్టాక్షరీ “ఓమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.


అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.


జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,


“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే

“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే

“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే

“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే


“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.


ధ్యాయేన్నారాయణందేవం

స్నానాదిఘ చ కర్మసు,

ప్రాయశ్చిత్తం హి సర్వస్వ

దుష్కృత స్వేతివైశ్రుతిః!


స్నానపానాదిగల సమస్తకర్మలలో “నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.


ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః

ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!


సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర ‘నారాయణ’ ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది.

 

ఆమ్నా యాభ్య  సనాన్యారణ్య రుదితం వేదవ్రతా న్యవ్వహాం

మేద శ్ఛేద ఫలాని పూర్తవిధయస్సర్వే హుతం భస్మని

తీర్థా నామవగాహనాని చ గజస్నానం వినా యతృద

ద్వంద్వామ్భోరుహ సంస్మృతీర్విజయతేదేవస్స నారాయణః


‘శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది. ఎన్ని ధర్మ కార్యాలను చేసినా బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా గజస్నానమే అవుతుంది (వ్యర్ధమే).


శ్రీమన్నామ ప్రోచ్చ్యనారాయణాఖ్యం

కేన ప్రాపుర్వాం ఛితం పాపినోపి,

హనః పూర్వం వాక్రు వృత్తాన తస్మిన్

తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్


‘శ్రీమన్నారాయణ’ నామాన్ని ఉచ్చరించువాడు ఎంతటి పాపి అయినా, దైవకృపతో మోక్షాన్ని పొందుతాడు. 

 

🍁🍁🍁🍁

తులసిదళాలు

 *తులసిదళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు.*

🌺🌻🍀🌺🌻🍀🌺🌻🍀🌺



*యాన్ములే సర్వతీర్దాని యన్మధ్యే సర్వదేవతాః యాదాగ్రే సర్వవేదాశ్చ! తులసిం త్వాం నమమ్యహమ్*

ఐశ్వర్య ప్రదాయిని అయిన తులసిని పై శ్లోకం చదువుతూ ప్రదక్షిణం చేసినచో సర్వదేవతా ప్రదిక్షణం చేసిన ఫలితం దక్కుతుంది. 

తులసి శ్రీ మహాలక్ష్మిః, విద్యా విద్యా యశస్విని!

ధర్మా ధర్మనా దేవీ దేవ దేవ మనః ప్రియా!

లక్ష్మి! ప్రియ సఖీ దేవీ ద్యౌర్బమి రచలాచలా!


లక్ష్మీ నారాయణ స్వరూపిణి యైన తులసిని నమస్కరిస్తూ పైన 16నామాలను పఠించిన వారికి గృహంలో లక్ష్మి సుస్థిరంగా నిలిచి సుఖ, సౌభాగ్యాలు వృద్ధి పొందుతాయి. తులసి చెట్టుతోనూ దేవికి బాంధవ్యముంది. తులసిదళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు. విష్ణుమూర్తితో కలిసి లక్ష్మి ఇంటి లోపల నివసిస్తే, తులసి ఇంటి ఆవరణలో కొలువై ఉంటుంది. 


తులసిదళంతో పూజలు చేయడం అంటే విష్ణువుకు పరమ ప్రీతికరమైనది. ఈ దళాలతో పూజలు చేసిన వ్యక్తికి సకల హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం దక్కుతుంది. తులసి స్తోత్రం చేయడం అంటే అనంత గుణ ఫలాలను పొందడమే. తులసి ఉన్న ఇంటికి ప్రేత, పిశాచ, భూతాలవంటివి దూరమవుతాయి. ప్రతిరోజు ఇంటిముందు లేదా తులసికోట వద్ద దీపం పెట్టడం వల్ల దారిద్య్రం తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఆలయాల్లో, ఇళ్లల్లో, తులసి, మారెడు వంటి దేవతా వృక్షాల వద్ద దీపాలను వెలిగించడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ తులసి లక్ష్మీదేవి స్వరూపిణి. లేవగానే తులసిని చూస్తే పాపాలు పోతాయి. 

తులసి మొక్క ముందు భాగంలో సకల తీర్థ్దాలు, మధ్యభాగంలో దేవతలు, చివరి భాగంలో వేదాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. 


తులసి పత్రం అగ్రభాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, కాండమందు శివుడు, శాఖల్లో అష్టదిక్పాలకులు విడిది చేసి ఉంటారని పండితులు చెబుతారు. ప్రాతఃకాలంలోను, సంధ్యాసమయంలోనూ తులసి కోట ముందు దీపాన్ని వెలిగించి, ప్రదక్షిణలు చేస్తే శుభప్రదం.

 శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀*


చమత్కార పద్యాలు

 చమత్కార పద్యాలు


బాలకృష్ణుడు ఒకరోజు రాత్రిపూట ఒక గోపిక యింట  దూరి  ఏమేమో చేస్తున్నాడు. అది 

గమనించిన గోపిక కృష్ణుణ్ణి ఎలా నిలదీస్తోందో చూడండి..


             కస్త్వం బాల? బలానుజః తదిహ కిమ్? మనమందిరా శంకయా.

             బుద్ధం, తన్నవనీత కుంభవివరే, హస్తం కథం న్యస్యసి?

             కర్తు౦ తత్ర పిపీలికాప నయనం, సుప్తా కిముద్బోధితాః?

             బాలావత్సగతి౦, వివేక్తుమితి సంజల్పన్  హరి: పాతువః


---చమత్కారశతం నుండి...


ఓ బాలుడా ఎవరు నువ్వు?  అందిగట్టిగా. 


దొంగతనానికి వచ్చిన కృష్ణుడు ఆమె కోపంగా ఉందని గ్రహించాడు.  ఆమెనుండి తప్పించుకోవాలి ఎలా?    అని ఆలోచించాడు. 



ఒక మంచి ఉపాయం తట్టింది.బలరాముడు తమ్ముడిని అన్నాడు.


 ఆమాట వినగానే 

గోపిక కోప౦  తగ్గింది.ధైర్యం కూడా సన్నగిల్లింది.ఆమెకంఠం లోని తీవ్రత కూడా తగ్గింది.



కృష్ణుడు ఆశించిందీ  అదే, బలరాముడంటే అందరికీ భయం , అతను కోపిష్టి ,చేతిలో ఎప్పుడూ నాగలో రోకలో వుంటుంది.ఆదిశేషుని అవతారం కదా!బుసకొడ్తూ వుంటాడు.



అందుకే అందరికీ అతడంటే భయం.కనుక నువ్వేమైనా అంటే మా అన్నకి చెప్తాను అన్న భావం శ్రీకృష్ణునిది


. మనం సామాన్యంగా ఏదైనా ఇబ్బంది లో వున్నప్పుడు మన పెద్దవారి పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తాము కదా.

అలాగే కృష్ణుడు అన్న పేరు 

చెప్పాడు. అతని పాచిక పారింది.కోపం తగ్గింది. 


సరే  యిక్కడి కెందుకొచ్చావయ్యా?

అన్నది. 


ఏం లేదు చీకటి కదా మా యిల్లనుకొని వచ్చాను. అన్నాడు కృష్ణుడు. 



అలాగైతే వెన్నకుండలో చేయెందుకు పెడుతున్నావని  తిరిగి ప్రశ్నించింది.



 ఇందులో చీమలున్నాయి అవి యేరిపడేద్దామని వెన్నకుండలో చెయ్యి పెడుతున్నాన్నాడు. (తినటానికి కాదట పాపం)



అయ్యా! యిది బాగుందయ్యా నీవేమో బలరాముని తమ్ముడివి, రాత్రివేళ మీయిల్లనుకొని మా యింటికి వచ్చావు. పాపం చీమలున్నాయని వాటిని ఏరిపారేద్దామని మంచి బుద్ధితో 

వెన్న కుండలో చెయ్యి పెట్టావు. అంతవరకూ బాగానే వున్నది.ఆ నిద్రపోతున్న పిల్లల నేందుకు లేపుతున్నావు? అంది గోపిక. 


ఒకదానితో ఒకటి పొంతన లేని  సమాధానాలు 

చెప్తున్నా గట్టిగా ఏమీ అనలేకపోతూంది.బలరాముని తమ్ముడు గదా.ఆ ఒక్క మాటే కాపాడుతోంది.


 ఇక తెలిసిపోయింది కృష్ణుడికి ఆమె తననేమీ చేయలేదని. ఆమె మాటల్లో 

కరుకుదనం,అధికారదర్పం తగ్గిపోయాయి. అందుకని వెంటనే తడుముకోకుండా 

మా లేగదూడలు కొన్ని తప్పిపోయాయి. వాటి వివరాలు తెలుసుకుందామని ఈ పిల్లల్ని లేపుతున్నాను.అన్నాడు కృష్ణుడు.


వెనకటికెవడో తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అంటే దూడగడ్డికోసమని అన్నాడట. అలా వుంది కృష్ణుడి వ్యవహారం. 


ఈవిధంగా గోపిక మాటలకు జవాబు చెప్తున్న బాలకృష్ణుడు మిమ్ము కాపాడుగాక. అని చమత్కారమైన ఆశీస్సు. ...

రహస్యం

 *చిలుక చెప్పిన రహస్యం*


అనగనగా ఒక చెట్టు మీద రెండు చిలుకలు కాపురం ఉంటున్నాయి. వాటికి ఓ బుజ్జి చిలుక పుట్టింది. నాన్న చిలుక ఆ వనంలోని చిలుకలకు రాజు. అక్కడి చిలుకలు తమ కష్ట సుఖాలను జ్ఞానియైన ఆ చిలుకరాజుతో పంచుకొనేవి. బుజ్జి చిలుక ను ఆ రెండు  చిలుకలు ఎంతో ప్రేమగా పెంచుతూ రోజూ ఆహారం తెచ్చి పెట్టేవి.  మెలమెల్లగా బుజ్జి చిలుకకు రెక్కలు రావడం మొదలయ్యే సరికి, అమ్మ చిలుక, దానికి ఎగరడం నేర్పింది. ఎగరడం నేర్చుకున్న బుజ్జి చిలుక తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఎగిరిపోయింది.

వేరే చిలుకతో జతకట్టి గూడు ఏర్పరుచుకుంది. అదే సమయంలో బుజ్జి చిలుక తల్లి కి జబ్బు చేసి చనిపోతుంది. దానికి ఎంతో బాధ కలుగుతుంది. నాన్న చిలుక మౌనంగా ఉండడంతో దగ్గరకు వెళ్లి "నాన్నా, అమ్మ వెళ్లి పోయి ఒంటరై పోయానని బాధపడుతున్నావా. వద్దు నాన్నా. నేనున్నాను మీకు." అంటుంది ఊరడిస్తున్నట్లుగా.

"పిచ్చి వాడా, ఈ ప్రపంచంలో అందరూ ఒంటరి వారే. ఒక్కరే వస్తారు. ఒక్కరే వెళ్తారు. ప్రతి ప్రాణి పుట్టిన తర్వాత బాల్యం, యవ్వనం, ముసలితనం అనే దశలను అనుభవిస్తుంది. ఈశరీరం ఎప్పుడైతే జర్జరమై పనికిరానిదౌతుందో, అప్పుడు ఈ శరీరాన్ని వదిలి పెడుతుంది. దానినే మరణం అంటారు. ఆ శరీరం నుండి వేరైన ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశించి మరల జన్మిస్తుంది. అదే జననం అంటే." అని వివరించింది చిలుకరాజు.

"అయితే ఇది ఎవరికైనా తప్పదనమాట. మరైతే అమ్మ మళ్ళీ పుడుతుందా నాన్నా." ఆశగా అడిగింది బుజ్జి చిలుక.

"పుట్టవచ్చు. కోడలు కడుపుతో ఉన్నట్లుంది కదా. మళ్ళీ నీ మీద ప్రేమతో నీ బిడ్డగా పుట్టవచ్చు." అంది చిలుకరాజు నవ్వుతూ.

"నాన్నా, ఈ రోజు నాకెంతో ఉపయోగకరమైన విషయాలు తెలుసుకున్నాను నాన్నా." అంటూ తన గూటివైపు ఎగిరి పోయింది బుజ్జి చిలుక.


దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ।

తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ।। 13 ।।


నీతి : దీనిని బట్టి తెలిసేదేమంటే ఏ జీవి అయినా పుట్టి, పెరిగి తన జీవితంలో అన్ని దశలూ అనుభవించి, చివరికి చనిపోక తప్పదు. చనిపోయింది శరీరం మాత్రమేనని, ప్రాణం మరో శరీరంలో ప్రవేశించి తిరిగి పుడుతుందని తెలుసుకున్నవారు, చావు గురించి బాధ పడరు.

✍🏻రామశేషు

ఆచార్య సద్భోదన

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀158.

నేటి...

              *ఆచార్య సద్భోదన*

                 ➖➖➖✍️


*భగవంతుని స్థానమైన సత్యమనే ధామం యొక్క గడప వద్దకు చేరుకున్నప్పుడే అసలైన ఆనందం అంటే ఏమిటో బోధపడగలదు.*


*ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నా మానవుడు తృప్తినొందడు. అతడు మరింకేదో కావాలని ఆశిస్తూ ఉంటాడు.    కానీ ఈ బాహ్య ప్రపంచంలో అది లభ్యం కాదు.*


*అయితే అది ఎక్కడో లేదు. మనలోనే దాగి ఉంది. మన అంతరంగ మూలాల్లోనే ఈ ఆనందం దాగి ఉంది. అక్కడే భగవంతుడు వసిస్తున్నాడు. మనలోని దివ్యత్వం అక్కడే దాగి ఉంది. *


*సిరిసంపదలు, స్నేహితులు, బంధువులు ఏదో.   ఒక సమయంలో మన అంచనాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ మన నమ్మకాన్ని వమ్ము చేయవచ్చునేమో కానీ మన అంతరంగంలో ఉండి మనలను నడిపించే              ఆ శ్రీమన్నారాయణుడు మాత్రం ఎన్నటికీ మనలను వదలడు. మనలను మోసం చేయడు.*


*నిజమైన ఆనందం భౌతికత్వంలో ఉండదు, అనంతత్వంలోనే ఉంది, అది అంతరంగంలోనే దాగి ఉంది.*✍️

        *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మాండూక్యోపనిషత్

 *15)- మాండూక్యోపనిషత్*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*హరిॐఓంॐ*


*కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.*



*పదవ కారిక :- నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన : ప్రభురవ్యయ : |అద్వైత: స్సర్వభావానాం దేవస్తుర్యో విభు : స్మృత :||*


*పదకొండవ కారిక :- కార్యకారణ బద్దౌ తౌ యిష్యేతే విశ్వతైజసౌ |ప్రాజ్ఞ : కారణం బధ్ధస్తు ద్వవ్ తౌ చర్యే నసిద్ధ్యత : ||*


*యదార్ధమును తెలియకపోవడమూ, భిన్నంగాతెలుసుకోవడమూ, అనే రెండు విషయముల వలన బీజ -ఫలముల రెంటి చేత విశ్వ తైజసులు బద్దులై వున్నారు. నేను-నాది అనేవి జాగ్రద్ స్వప్నాలు. కుండ + మన్ను. ఇక మట్టి ముద్ద సుషుప్తి. తుర్యావస్థలో ఈ రెండూ లేవు.*



*ప్రాజ్ఞుడు బీజ భావమొక్కదాని చేతనే బద్ధుడు.  ఇక్కడ యదార్ధము తెలియక పోవడాన్నే బీజము అని చెప్పుకోవాలి.  అదే  ప్రాజ్ఞ స్థితికి ముఖ్య హేతువు.   యదార్ధము తెలియని తనము, వేరొక విధంగా భిన్నంగా అనుకోవడమూ,  తురీయునియందు  పొసగవు.   తురీయములో తత్వము యొక్క ఎరుక పూర్తిగా ఉంటుంది.   దేనిని తెలుసుకోవాలో దానినే తెలుసుకుని వుంటాడు.   అదే ఆత్మజ్ఞానం.* 



*వేదాంత జ్ఞానము లేకపోవడం వలన జరిగే తెలివితక్కువ తనం యిలా వుంటుంది.   ఉదాహరణకు:- ' నీవెవరు ? '  అని అడిగితే, నేనెవరో చెప్పలేనుగానీ, నేను మనిషిని, నాపేరు ఫలానా అని,  నేను గృహస్తును అనీ, సుఖిని అనీ  , బాధపడుతున్నాను అనీ, ఈ విధంగా తనని తాను వ్యక్తి వర్ణించుకునే విధానము వున్నది.  ఈ భావనలే వాసనల ద్వారా నిలువ వుండి, జాగ్రదవస్థలోనే గాక, స్వప్నంలో కూడా వ్యవహారం జరుపు తున్నవి.  ఇది అంతా  అవిద్యా ప్రభావం.* 



*ఇక జ్ఞానుల విషయానికి వస్తే, ' నీవెవరవు ? ' అని అడిగితే,  ' నేను శివమును, నేను సచ్చిదానంద స్వరూపుడను. నేను దేహాన్ని కాను, ఇంద్రియములను కాను. '  అని చెప్పడం జరుగుతుంది.  అనగా తురీయము నందు కారణ కార్య వ్యవహారములు లేకపోగా,  తత్వబోధ అయిన తురీయమే వుంటుంది.*



*పన్నెండవ కారిక :-   నాత్మానం న పరాంశ్చైవ న సత్యం నాపి చానృతం |*

                                *ప్రాజ్ఞ : కించన  సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా ||*


*ప్రాజ్ఞుడు కారణ బద్ధత్వము యెలా సాధిస్తాడో తెలుపుతున్నారు.*



*తననుగానీ, తనకంటే అన్యునిగానీ,  సత్యమును గానీ, అబద్ధమును గానీ,  ప్రాజ్ఞుడు గుర్తెరుగడు.  గాఢనిద్రే ధ్యేయంగా వుంటాడు.   అయితే, తురీయుడు సర్వదృక్ అవుతున్నాడు.   అనగా తురీయమునకు, తన యదార్ధత,  విశ్వ తైజస ప్రాజ్ఞుల  అనిత్యత కూడా  గోచరము.*



*ఇక్కడ ప్రాజ్ఞునకు ఒక్క కారణం బద్ధత్వమే  ఎలా కలుగుతున్నది ?  తురీయునకు ఈ లక్షణములైన బంధములు యెలా లేకుండా పోయినాయి అన్న రెండు ప్రశ్నలు ఉత్పన్నమైతే, వాటికి శంకరులు తమ భాష్యంలో తెలియజేస్తున్నారు.*   



*విశ్వ తైజసులవలె, బాహ్య గ్రహణము ప్రాజ్ఞునకు వుండదు.  అందువలన, అవిద్యా బీజము వలన పుట్టిన బాహ్య ద్వైతము కొంచమైనా ప్రాజ్ఞుడు ఎరుగని కారణంగా,  బాహ్యద్వైతమునందు ప్రాజ్ఞుడు బద్ధుడు కాదు.   కాబట్టి ప్రాజ్ఞుని యందు కారణ   బద్ధత్వమొకటే వున్నది.* 



*ఇక రెండవ ప్రశ్నకు సమాధానం.  తురీయనకు కారణ కార్య బద్ధత్వములు ఎందుకు లేవు ?   తురీయము సర్వదృక్  అగుట వలన.  అది ఎలాగంటే,  తురీయమొకటే అక్కడ వుండేదీ, వేరెవరూ అక్కడ లేరు కాబట్టి,  అదే సర్వదృక్.   తురీయము దృక్ దృశ్యములందు సదా వుంటుంది.  మూడు అవస్థల యందు, తనదైన తురీయావస్థ యందు, వుంటుంది.    ఉదాహరణకు, బాగా అలలు వున్నప్పుడూ, నురుగులతో  వున్నప్పుడు, నిశ్చలముగా వున్నప్పుడూ, సముద్రం ఎలా వుంటుందో,  అలా అన్నమాట. కాబట్టి, తత్వ ఆగ్రహణ స్వభావమైన బీజము,  దాని వలన పుట్టిన ఫలము, రెండునూ తురీయము నందు లేవు.* 



*సూర్యుడు ప్రకాశ మానుడై వుండగా, చీకటి, మసక చీకటి  అక్కడ వుండే అవకాశం లేదు కదా !   అనగా చూసే వాడి తెలివికి ఎప్పుడూ లోపము వుండదు.  ఇంకొక రీతిగా సర్వదృక్ కు ప్రమాణం  సమష్టి తత్వంలో,  జాగ్రద్ స్వప్నముల యొక్క సర్వ భూతములందు వున్నవాడు, సర్వ వస్తువులను దృక్ రూపంగా ప్రకాశింప చేసేవాడు, తురీయుడే  !   అతని కన్నా అన్యుడైన ద్రష్ట లేడనేది శృతి  ప్రమాణం.*


🕉🌞🌎🌙🌟🚩

అద్వైతచైతన్యజాగృతి

 *106 - శ్రీ విద్యా - శాశ్వతమైన శక్తి / Sri Vidya – The Eternal Energy*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


అమృతంతో సంబంధమున్న గరుత్మంతుడు ప్రజలను విషము నుండి రక్షిస్తాడు. చంద్రకాంత శిలామూర్తిగా అంబికను ధ్యానం చేసినవారు గరుడుని వలే పాముల విషాన్ని శమింప చేయగలడని ఆచార్యులవారంటున్నారు. “ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ”. 'శకుంతము' అంటే పక్షి. మేనకా విశ్వామిత్రుల సంతానము పక్షుల చేత పెంచబడి శకుంతల అయింది కదా! గరుత్మంతుడు శకుంతాధిపుడు పక్షిరాజు. 



ఈ శ్లోకం జపం చేయడం వలన పాముకా టు వల్ల ఎక్కినా విషము హరించడమేకాక, దోమవంటి కీటకముల వలన కలిగిన చలిజ్వరములు, వైరల్ జ్వరములు కూడా శమిస్తాయి. అంబికను అమృత కిరణమూర్తిగా ధ్యానించిన వారికి అమృతనాడి సిద్ధిస్తుంది. లేక సహస్రారంలో కురిసిన అమృతపు జల్లులకు అతడి నాడీమండలమంతా అమృత మయమవుతుంది. అమృత నాడులున్న అతడి దృష్టి జ్వరగ్రస్తుని పై పడితే చాలు, జ్వరం మటుమాయమయిపోయి అతడు సుఖిస్తాడు. 



“జ్వరపుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా”


అంబిక అరుణారుణమైన తనుచ్ఛాయతో

నభోంతరాళములు ప్రకాశిస్తున్నట్లు ఆ కాంతితో భూమ్యాకాశములు నిండిపోయినట్లు భావించిన సాధకునికి వశీకరణశక్తి లభిస్తుందని పద్దెనిమిదవ శ్లోకంలో చెప్పబడి ఉంది.



 సాధారణంగా అంబిక తనుచ్ఛాయ శుద్ధస్ఫటికం వలె ప్రకాశించేదే అయినప్పటికీ, శ్రీవిద్యాధిదేవతగా అంబిక అరుణవర్ణంతో ప్రకాశిస్తుందని చెప్పబడింది. అది శ్రీ విద్యాధిదేవత యొక్క ప్రత్యేకత. సూర్యోదయ కాలంలో ఆకాశమంతా అరుణిమతో ప్రకాశిస్తుంది కదా! అదే విధంగా భూమ్యాకాశములు, సమస్త బ్రహ్మాండము ఆమె తనుచ్ఛాయవలన అరుణారుణంగా ప్రకాశిస్తోందనే భావన చేయాలన్నమాట.

అయితే అంబిక యొక్క ప్రత్యేకత అయిన ఈ అరుణ వర్ణం గురించి చెప్పుకోకుండా ఉండేదెలా? అదీకాక వశీకరణం యొక్క అంతరార్థం గురించి మనం చెప్పుకోవద్దా?



సొందర్యలహరిలోనూ మరి అటువంటి ఇతర శాక్త గ్రంథములలోనూ వశీకరణ, స్త్రీవశ్యము, మన్మథుని బోలిన గురించి బహుధా చెప్పబడి ఉంటుంది. ఆ మాటల అర్థాన్ని కేవలం వాచ్యార్థంగా తీసుకొంటే ప్రమాదమున్నది. ఒక వ్యక్తీ ఇంకొకరిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడంటే అర్థమేమిటి? అతడు వారిచే ఆకర్షించ బడినాడన్న మాట. అందువల్లనే వశీకరణ మంత్రాలను ఉపయోగించి వారిని స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఒకరు ధన కనక వస్తువాహనాది సంపదను సంపాదించి, వాటిని తాను స్వంతం చేసుకొన్నానని భావిస్తారు.



నిజంగా జరిగేది ఏమంటే అతడు వాటిచేత స్వంతం చేసుకోబడ్డాడు. వాటికి బానిస అయినాడు. దీనికి తార్కాణమేమిటి? ఒకవేళ ఆ సంపద పోయినట్లయితే ఈతడి మతి చలించిపోతోంది కదా! ఏదో ఒక వస్తువునో, వ్యక్తినో వశీకరించు కోవాలని మంత్రజపం చేసే వ్యక్తి, తన వశ్య మంత్రానికి గమ్యమైన వస్తువు లేక కోరికకు బానిస అయిపోయాడు. అటువంటి వానికి అంబికను సదా తన హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తూ క్రమశః ఆత్మసాక్షాత్కారం పొందే దారి మూసి వేయబడుతుంది.



మంత్రశాస్త్రాన్ని ఆవిష్కరించిన ఆచార్యుల వారి వంటి మహాపురుషులు ఒక మనిషి తన పరమగమ్యము చేరుకోవడానికి పయనించవలసిన దారిని మూసివేసే పద్ధతి ఉపదేశిస్తారని మీరనుకొంటున్నారా? అంబిక భక్తులు మనఃస్థితిని ఆచార్యులవారు “మృదితమల మాయేన మనసా” అని అభివర్ణిస్తారు. భక్తుని మనసు చెడ్డ ఆలోచనలకు, కోరికలకు దూరంగా మాయను అణచి ఉండే విధంగా ఉంటుందట. అంబిక భక్తుడు తుచ్ఛమైన వశీకరణాది విషయాల్లో మనస్సు పెట్టేవాడుకాదు. మాయ అనే మహా సర్పాన్ని కాళీయ మర్దనం చేసిన కృష్ణుని వలె మర్దించేవాడు. కాబట్టి 'వశ్యము' అనేదానికి అంబికను ధ్యానించే సాధకుడు ఎటువంటి ఆకర్షణలకు బానిస కాడనీ, అతడి మనస్సు ఎప్పుడూ అతడి అధీనంలోనే ఉంటుందనీ అర్థం చెప్పుకోవాలి.



అతడు వశీకరించు కొన్నాడన్న మాటకు ఆ వస్తువు అతనిలో ఐక్యమయిందనే అర్థం చెప్పుకోవాలి. గీతలో భగవానులు “సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయాం ప్రవిశంతి సర్వే” అంటారు. సముద్రం నదులన్నిటినీ తన వైపుకు లాగి తన అధీనంలోనికి తెచ్చుకొన్నట్లు - వశ్యమంటే తన వైపుకు లాగుకొనడమేకదా! నదులుగానీ, సముద్రం గానీ ఒకదాని కొకటి భిన్నంగా గుర్తించుకోలేవు కదా! సముద్రము నదులూ కూడా అద్వైత భావాన్ని పొది “శాంతిం ఆప్నోతి” శాంత స్థితిని పొందుతాయి.



జ్ఞాని విషయమూ అంతే. కోరికలు అతనిలోనికి  ప్రవహిస్తాయి. అతడు కోరికలన్నీ లయమైపోయే స్థితిని చేరుకొంటాడు.

ఒక వస్తువును నీదిగా చేసుకొనేకంటే ఆ వస్తువునే నిన్నుగా చూడగలిగితే ఇక ఆ వస్తువు పై నీకు కోరిక అనే అవకాశమే ఉండదు కదా!



ద్వైత ప్రపంచంలో ఒక వస్తువుని విడిగా చూసి దానిపై వ్యామోహం పెంచుకోవడాన్ని ఆంతరంగికంగా మలుచుకొని ఆ వస్తువు తన కంటే భిన్నం కాదని తనలోనికి తెచ్చుకోవడం వశీకరణం. ఒక స్త్రీనే కాదు ఈ విధంగా త్రిభువనములను తనలోనికి తెచ్చుకోవడం,  ఈ బ్రహ్మాండమంతా తనకు భిన్నం కాదు, తనలోని భాగమే అని తెలుసుకోవడం వశీకరణలోని అంతరార్థం. తానే మన్మథుడైపోతే మన్మథుడు కలిగించే కామ వికారాదులు మనకు ఉండవు. అదే కామ జయము.


🕉🌞🌏🌙🌟🚩

అపరోక్షానుభూతి

 *42- శ్రీ ఆదిశంకరాచార్య విరచితము  అపరోక్షానుభూతి*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*శ్లో|| స్నాతం తీర్థే జహ్నుజాదౌతతఃకిం| దానందత్తం ద్వ్యష్ట సంఖ్యం తతఃకిం| జప్తామంత్రాః కోటిశోవాతతఃకిం| యేనస్వాత్మానైవ సాక్షాత్కృతో7భూత్‌||*


*అపరోక్షనుభూతి మహిమ ఈ శ్లోకమును చదివి విచారించండి, సాక్షాత్తు విష్ణుపాదము నుండి పుట్టి జహ్ను మహఋషిచే సంపాదించబడి ఆకాశమండలములో నుండి బయలుదేరి సమస్త లోకముల యందు ప్రవహించుచు ఆయా లోకముల యందు ఆయా వర్ణములతో గోచరించుచు ఆయా లోకములయందున్న వారు ఆ గంగానదిని చూచినను, స్మరించినను, స్నానం చేసినను,పానము చేసినను అందరినీ పవిత్రము చేయుచూ భగీరథుడను మహానుభావునిచేత భూలోకమునకు తీసుకురాబడిన గంగానదియొక్క మహాత్మ్యము కాశీఖండం, దేవీభాగవతం యొదలగు గ్రంథముల యందు చాలా గొప్పగా చెప్పబడి యున్నది.*



*ఆ గంగానది హిమాలయ పర్వతములలోనుండి భూమండలమునకు దిగి గంగోత్తరి మొదలగు క్షేత్రములలోనుండి ప్రవహించుచు కాశీ మహాపట్టణము వద్దకు వచ్చి అటనుండి ప్రవహించుచూ వెళ్ళి సముద్రములో కలసినది.*



*ఆ గంగానది ప్రవహించిన ప్రదేశములన్నియు మహాక్షేత్రములైనవని స్పష్టమే కదా.*



*శ్రీ లలితాత్రిపుర సుoదరియే దేవతలు ప్రార్థించగా గంగానదిగా అవతరించి ప్రవహించు చున్నదని కూడా కథలున్నవి. అట్టి గంగానదిని స్మరించినను, దర్శించినను స్నానపానములు చేసినను సర్వపాప రహితులై ఉత్తమ లోకములను పొందుదురని కూడా మహాత్మ్యము కలదు. ఇట్టి అతీతమగు మహాత్మ్యముగల గంగానది యందుగాని మూడుకోట్ల యేబది లక్షల తీర్థములను దర్శించి సేవించి ఆ తీర్థములయందుగాని స్నానంచేసినను ఆత్మసాక్షాత్కారములేనిది యేమి ప్రయోజనమని శంకరాచార్యులవారు "స్నాతంతీర్థే జహ్నుజాదౌతతః కిం" అని చెప్పిరి.*



*"భగవద్గీతా కించిదధీతా గంగాజల లవకణికాపీతా, సకృదపియేనమురారి సమర్చాకురుతేతస్య యమో7పినచర్చాం"*


*ఈశ్లోకమును భజగోవింద శ్లోకములలో శ్రీ శంకరాచార్యులవారు చెప్పిరి. భగవద్గీతను కొంచెం చదివిన వారిని గంగోదకమును కొద్దిగానైనా త్రాగిన వారిని, ఒకప్పుడైనను శ్రీమహావిష్ణువును పూజించిన వారిని, యమధర్మరాజు కూడా విచారించడని యర్థము. యమధర్మరాజు విచారించడంటే యమలోకమునకు పోరని పుణ్య లోకములను పొందుదురని చెప్పవచ్చును. గాని మోక్షము లభించునని చెప్పలేదు. గనుక అపరోక్షానుభూతియే మోక్షప్రదమని గమనించవలయును.*



*"దానం దత్తం ద్వ్యష్టసంఖ్యం తతఃకిం " కొందరు ధనవంతులు షోడశమహాదానములను శాస్త్రము చెప్పినట్లుగా చాలా గొప్పగా చేయుదురు. దాని వలననే ముక్తి లభించునని భ్రమపడకూడదు. అందుచేతనే యేమి దానివలననని చెప్పిరి. '' జప్తామంత్రాః కోటిశోవాతతఃకిం" సప్తకోటి (యోడుకోట్లు) మహామంత్రములను జపించినను ఆ మంత్రముల అర్థమును విచారించినను, ఆ మంత్రముల సిద్ధిని పొందినను యేమి ప్రయోజనం.*



*" యేనస్వత్మానైవ సాక్షాత్కృతో7భూత్‌" అని చెప్పిరి. అనగా ఎవరి చేత తన ఆత్మ సాక్షాత్కరింపబడదో అని యర్థము. అనగా యెవరు నేననే ఆత్మ యొక్క పరమార్థ స్వరూపమును సాక్షాత్కరించుకొనరో వారు పైచెప్పిన మహాపుణ్యము లెన్ని చేసినను ప్రయోజనం లేదు. మోక్షము కలుగదని యర్థము.*



*ఆత్మసాక్షాత్కరమన్నను, అపరోక్షానుభూతియన్నను, బ్రహ్మ సాక్షాత్కరమన్నను, ఒకటేగాని వేరే అర్థము కాదు.*



*అపరోక్షానుభూతి యెంతమహోన్నతమైనదో గ్రహించవలసిన విషయం.*


🕉🌞🌏🌙🌟🚩

వేదములు

 *69-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*23. ఉపాంగములు :- న్యాయము*


*తర్కము - ఔచిత్యమును తెలిపే శాస్త్రం :-*


((((((((((🕉))))))))))


*జగత్సృష్టికి కారణం :-*



*సృష్టికి కారణాలు రెండు : నిమిత్తం, ఉపాదానం. మట్టికుండ ఉంటే, దానిని చేయటానికి మన్ను ఉండాలి. కుండ ఉండటానికి కారణం మట్టి. దానిని ఉపాదానమంటారు. కాని మన్ను కుండగా ఎట్లా మారుతుంది? తనంతట తాను కాలేదు కదా. కుమ్మరి మట్టిని కుండగా చేయగలడు. అంటే కుండ ఉండాలంటే కుమ్మరి ఉండాలి. అతడు కారకుడు లేక నిమిత్తం. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన నిమిత్తం లేక శకునం వేరు.*



*న్యాయవైశేషిక సిద్ధాంతాననుసరించి, అణువులను ఉపాదానంగా తీసుకొని, ఈశ్వరుడు నిమిత్త కారణమై జగత్తుని సృష్టించాడు. మట్టిని కుండగా చేయటానికి, కుమ్మరి ఉండి తీరాలి. అతడే లేకపోతే కుండ అసంభవం. దీనినే ఆరంభవాదమని గాని, అసత్‌కార్యవాదమని గాని అంటారు. ''సత్‌'' అంటే ఉన్నది; ''అసత్‌'' అంటే లేనిది. మట్టిలో కుండ లేదు. లేనికుండ మట్టి నుండి సంస్థిత మవుతుంది. ఆ విధంగానే, అణువులలో లేని జగత్తును ఈశ్వరుడు అణువుల సహాయంతో సృష్టించాడు. న్యాయశాస్త్రపు సిద్ధాంతమిది.*



*సాంఖ్యవాదుల ప్రకారం దేవుడు లేడు. వారి సిద్ధాంతానుసారం ప్రకృతి తన నుండి తానే జగత్తుని కల్పించింది. ఆధునిక నాస్తికుల వాదానికీ దీనికీ తేడా ఉంది. దీనికి కారణమిది : సాంఖ్యులు నిర్గుణ బ్రహ్మను (లేక, పురుషుణ్ణి) జ్ఞానస్వరూపునిగా గుర్తిస్తారు. జడమైన ప్రకృతి యొక్క సక్రమ వ్యాపకాలకి కారణం, పురుషుని సాన్నిధ్య ప్రభావం వల్లనే అంటారు. ఆ సామీప్యమే సృష్టికీ, అందులోని నియమబద్ధతకీ కారణమంటారు. పురుషునకు ఏ వ్యాపకమూ లేదు. సూర్యకిరణాల వల్ల నీరు ఆవిరి అవుతుంది. మొక్కలు పెరుగుతాయి. తడిబట్టలు ఆరుతాయి. ఇవన్నీ సూర్యుని ప్రభావం వల్లనే జరుగుతాయి. సూర్యునికి మాత్రం కొలనుని ఎండిపోయేట్టు చేద్దామని గాని, మొక్కని ఎదిగేట్టు చేద్దామని గాని ఉద్దేశముండదు. మంచునీళ్లల్లో చేతులు పెట్టితే వేళ్లను బండబారుద్దామన్న ఉద్దేశ్యం మంచునీటికి కలదని అనలేము కదా. ఆ విధంగానే పురుషుడు సృష్టికార్యం సల్పాలని సంకల్పింపక పోయినా, పురుషుని ప్రభావం వల్ల ప్రకృతే తన నుండి సృష్టి కార్యాన్ని సల్పుతుంది. ఇది సాంఖ్య సిద్ధాంతం. దీనినే పరిణామ వాదమని కూడ అంటారు.*



*నైయాయికుల అసత్‌ కార్యవాదానికి ప్రతిగా సాంఖ్యులు సత్‌ కార్య వాదాన్ని ప్రతిపాదిస్తారు. వీరిట్లా అంటారు.*



*కుండ కూడ మట్టిలో అంతర్భాగమే. మొదట్లో నూనె గింజలను గానుగవాడు ఆడిస్తే ఆ గింజలలోనే ఉన్న నూనె వస్తోంది. మట్టిలోనే ఇమిడి ఉన్న కుండకి ప్రయత్నం వల్ల ఆ రూపం వస్తుంది. మట్టిని ఉపయోగించటం వల్లనే కుండ వస్తుంది. నూనె గింజల నుండి కుండ తయారు కాదు కదా! అట్లాగే, నూనెని మట్టి నుండి పొందలేము. కుండలో మట్టి కణాలు తప్ప ఏవీ లేవు. ఆ అణువుల అమరికని కాస్త మారిస్తే కుండ తయారవుతుంది.*



*శ్రీ శంకర భగవత్పాదుల వారిట్లా అన్నారు. ''ఆరంభవాదంగాని పరిణామ వాదం గాని సప్రమాణం కాదు. మాయసహాయంతో బ్రహ్మమే సృష్టి రూపం దాల్చాడు. ఆ విశ్వకర్త అయిన కుమ్మరిని విడిచి మట్టిలేదు. అందువల్ల ఆరంభవాదానికి అర్థం లేదు. పరిణామము వలన - అంటే మార్పు వలన - పరమాత్ముడు జగత్తుని పాల నుండి పెరుగువలె సృష్టించాడనటమూ సబబు కాదు. ఎందు వల్లనంటే - అటువంటి పరిణామము సంభవించిన తరువాత పెరుగు మాత్రమే ఉంటుంది కాని పాలుండవు. జగత్సృష్టి తరువాత పరమాత్మ అస్థిత్వం కోల్పోయాడనటం అసందర్భం. పరమాత్ముడు శుద్ధ జ్ఞానం వలె ఒకవైపూ, జీవినిగా - జగత్తుగా మరొకవైపూ ఉంటాడు. ఇదంతా ఆ ''సత్‌'' పదార్థం యొక్క లీల. నాటకంలో పాత్రధరించినంత మాత్రాన ఆ మనిషి నిజస్వరూపాన్ని కోల్పోతాడా? సృష్టి కూడా అంతే. జగత్తులో అనేక రూపాలను ధరించినా ఆ సత్‌ పదార్థానికి మార్పులేదు''. దీని పేరు వివర్తవాదం - శంకరుని సాహసోపేతమైన సిద్ధాంతం.*



*పాముగా భ్రమింపచేసే త్రాడు - వివర్తం. అది పాముగా మారలేదు. అందువల్ల అది ఆరంభవాదం కాదు. త్రాడు త్రాడుగానే ఉంటుంది, పాము కాలేదు. కాని మన అజ్ఞానం వల్ల అది పామువలె కనబడుతుంది. ఇట్లాగే అవిద్యవల్ల బ్రహ్మమే మనకు జగత్తువలె, సృష్టివలె, అందులోని జీవరాశుల వలె కనబడుతుంది.*



*ఆచార్యులవారు ప్రతిపాదించిన సత్యాన్ని గ్రహించటానికి అనేకమైన యుక్తులను న్యాయశాస్త్రం చెప్తుంది. పదార్థం యొక్క నిజ స్వరూపాన్ని తెలిసికోవటానికి ఈ యుక్తులు ఉపయోగ పడుతాయి. వీటివల్ల వైరాగ్యం సిద్ధిస్తుంది. ఈ స్థితి నుంచి సంతోష దుం:ఖాలు లేని స్థితికి వెళ్లవచ్చు. ఆ స్థితిని అపవర్గమంటారు. న్యాయవైశేషిక సిద్ధాంతాలు అక్కడితో నిలచిపోతాయి.*



*ద్వైత సిద్ధాంతం ప్రకారం కూడ అంత కంటె ముందుకు వెళ్లలేము. అద్వైతం ఒకే ఒక సత్‌ ఉన్నదనీ మనము 'సత్‌' అవటమే మోక్షమనీ, జన్మరాహిత్యసిద్ధి అనీ ప్రతిపాదిస్తుంది.*



*న్యాయం మాత్రం మనం అపవర్గమనే ఉత్కృష్టస్థాయికి చేరుకోగలమనీ, ఈ ప్రపంచపు అసంతృప్తి కరమైన జీవనాన్ని అధిగమించగలమనీ చెప్తుంది.*



*ఈ శాస్త్రానికి ఇంకొక విశిష్టత కూడ ఉంది. బౌద్ధులు, సాంఖ్యులు, చార్వాకులు ప్రతిపాదించే సిద్ధాంతాలను ఖండించగల యుక్తులనేకం తెల్పుతుంది. ఈశ్వరుడున్నాడనీ. సృష్టికర్త అనీ కూడ నిరూపిస్తుంది.*


🕉🌞🌏🌙🌟🚩

ఆత్మ జ్ఞానం

 *3)🧘‍♂️ఆత్మ జ్ఞానం🧘‍♀️ మోక్ష మార్గం🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹*



ఇంకా ఇక్కడి విశేషాలను మరికొంత పరిశీలించి చూద్దాం! 



 ఇక్కడ ప్రతిరోజూ తెల్లవారుతోంది. పగలు వెళ్ళిపోతోంది. రాత్రి మొదలవుతోంది. రాత్రి తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడుతోంది. పగలు తిరగడం, రాత్రుళ్ళు పొడుకోవడం. ఎన్నాళ్ళిలా? 



ప్రతిరోజూ తిన్నదే తింటున్నాం. 


తాగిందే తాగుతున్నాం. 


తిరిగిన వీధుల్లోనే తిరుగుతున్నాం. 


అదే మంచం ఎక్కి దుప్పటి కప్పుకుని పొడుకుంటున్నాం. రోజూ అదే తిండి. అదే నీరు. అదే మంచం. అదే నిద్ర. అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు. 


దుఃఖం తొలగడమూ లేదు. 



ఏమాత్రం అర్దంకాని ఈ పగలు, రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి? 



ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు చావడం దగ్గరకు తప్ప మరొక చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తోంది.



 ఇందులో అంత ఆశ్చర్యపడాల్సింది మాత్రం ఏముంది. 



ఇక్కడ పుట్టే ప్రతిదీ ఒకనాటికి తప్పక నశిస్తుంది. 



నిత్యం కొందరు జన్మించడం మరికొందరు మరణించడం అనేది లోకంలో కనిపిస్తున్నదే..! 



మరి ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి? 



ఈ ఆరాటం దేనికి? 



నాలో ఏర్పడి ఉన్న ఈ “నాది - నావి - నావాళ్ళు” అనే భ్రమంతా నాకు ఎక్కడినుంచి వచ్చింది? 



ఈ జీవితమే మూన్నాళ్ళ ముచ్చటని ఒక ప్రక్క తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను. 



చాలా డబ్బు సంపాదించాలి.. దాన్ని భద్రంగా దాచుకోవాలి.. అందరికంటే పెద్దవాణ్ణి అయిపోవాలి అని. ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేంటి.! 



నా దుష్ట తెలివితేటలతో జీవితమంతా శ్రమించి ఎంత సంపాదించినా మరణంతో అదంతా ఇక్కడ వదిలెయ్యాల్సిందే గదా.! 



ఇక్కడ వదిలెయ్యాల్సిన దానికోసం నేనెందుకు ఇంత ఆరాటపడుతూ, ఆయాసపడుతూ సంపాదిస్తున్నాను? 



అలా అని ఎందుకనుకోవాలి ఇదంతా నా వారి కోసం గదా అనుకుందామనుకుంటే! 



నా వారు అనేదానికి ముందే నేను ఉండి ఉండాలి కదా! 



నేను లేకుండా నా వారు అనేవారు ఎక్కడనుంచి వస్తారు.



 ఆ “నేను” అంటే ఎవరు? 



అసలు “నేను” అనేది నాలో దేనిని?



 ఇలా నేనెవరో నాకే అర్ధం కానప్పుడు ఇక నావారు అనేదంతా ఏంటి? 



పిచ్చి మోహం కాకపోతే! నావారు సంగతి సరే! అసలు నేనెవరివాడిని? 



నన్ను మా వాడు అనుకున్నవాళ్ళు ఇప్పుడెక్కడ ఉన్నారు? 



వారు లేరు. 


కొన్నాళ్ళ తర్వాత నేను ఉండను. 


ఇక నా వాళ్ళు అనుకునేవాళ్ళు మాత్రం ఇక్కడెన్నాళ్ళు ఉంటారు. 


ఈ నేను నాది అనుకునేదంతా ఒక నాటికి కాలం చేతిలో మింగబడబోయేదే గదా.! 



నిన్నటి వరకు పెద్ద వీరుడు, శూరుడు, ధనవంతుడు అనిపించుకున్నవాడు నేడు విగత జీవుడై పాడెమీద నిస్తేజంగా వెల్లికిలా పొడుకుని మౌనంగా స్మశానానికి పయనమయిపోతున్నాడు. 



అక్కడ గుప్పెడు బూడిదగా మారి మట్టిలో కలిసిపోవుచున్నాడు. 



ఈ శరీరాల యొక్క అంతిమ సత్యం గుప్పెడు బూడిదే కదా! 



ఈ మాత్రం దానికి ఇక్కడ ఇంతటి మోహం, ఇంతటి స్వార్ధం, ఇంతటి దుఃఖమా? 



ఇదంతా ఎంతటి బాధాకరం. 


ఇది బహు విచిత్రంగానూ, అయోమయంగానూ ఉంది. కాసేపు ఇదంతా ప్రక్కన పెడితే! 



మరి ఇక్కడ జీవించి ఉన్న కాలంలో దేన్ని పొందితే ఈ జీవితం ముగిశాక కూడా అది నాతోపాటే వస్తుంది? 



అలాంటిదేదయినా అసలు ఇక్కడ ఉందా? 



అలాంటిది ఏదో ఒకటి ఇక్కడ తప్పక ఉండే ఉండవచ్చు. 



అలా కాకపోతేగనక ఈ జన్మించడం అనే శ్రమ నాకు ఎందుకు ఉంటుంది. 



ఏదో ఒక ప్రయోజనం ఇక్కడ ఉండి ఉన్నందునే బహుశ నేను ఇక్కడ జన్మించి ఉంటాను. 



అయితే అది ఏదో సంపాదన పిచ్చిలో పడి పొర్లాడుతున్న ఇప్పటి నా దుష్ట బుద్ధికి తెలియడంలేదు. 



కానీ అది నేను తప్పక తెలుసుకోవాలి. 



ఎలా తెలుసుకోవాలి? 



బహుశ అది తెలిసిన మహాత్ములను నేను తెలుసుకోగలిగితే అప్పుడు ఆ సత్యాన్ని వారిద్వారా నేను తెలుసుకోవచ్చు. 



సర్వం ఎరిగినవారు ఈ లోకాలలో ఎక్కడో ఒకచోట తప్పక ఉండే ఉంటారు. 



ఎలాగయినా సరే అది ఎంతటి శ్రమ అయినా సరే నా ఈ జీవితం మొత్తం కరిగిపోయినా సరే ఈ శరీరం కూలిపోయేలోపల ఆ మహాత్ములను నేను తప్పక చేరుకుంటాను. 



కాబట్టి ఇప్పటినుంచి ఇక నా పని వారిని గుర్తించడమే.



 వారిని గుర్తించి వారిని ప్రార్ధించి వారినుంచి తెలుసుకోవాల్సిన ఆ సత్యాన్ని తెలుసుకుంటాను. 



ఆ తర్వాత మిగిలిన జీవితమంతా అది పొందే ప్రయత్నం చేస్తాను. 



ఒకవేళ ఈ జన్మలోనే గనక ఇది జరక్కపోతే నేను మళ్ళీ మళ్ళీ ఈ లోకాలలోకి శరీరాలతో రావలసి ఉంటుంది. 



అయితే ఇప్పటిలా ఈ మానవదేహాన్ని తర్వాత రాబోవు జన్మలలో కూడా నేను పొందగలను అనే నమ్మకం ఏముంది? 



ఏ పశు, పక్షి, కీటకం లాంటి దేహాలు గనక నేను పొందితే ఇక అప్పుడు నా పరిస్థితి ఏంటి? 



ఆ దేహాలు లోకంలో అందరికీ తిరస్కారమైనవే కదా!



 ఆ దేహాలతో నన్నెవరు దగ్గరకు రానిస్తారు? 



అప్పుడు ఇక ఆ దేహాలతో నాకు ముక్తి ఎలా లభిస్తుంది. 



కాబట్టి ఇప్పటివరకూ వృధా అయిన కాలం ఏదో వృధా అయింది. 



ఇక ఇప్పటినుంచి ఒక్క క్షణం కూడా ఆలస్యంగాని, వృధాగాని కానివ్వకుండా జ్ఞానులకొరకు తీవ్ర ప్రయత్నం చేస్తాను అనుకుంటూ తనలో ఒక దృడ సంకల్పాన్ని ఏర్పరచుకుని మహాత్ముల కొరకు లోకాన్ని జల్లెడ పడుతున్నాడు. 



శాశ్వతమయిన ఆత్మ శాంతి కొరకు లోకం అంతా అలా మాసిన బట్టలతోనే మహాత్ముల కొరకు గాలిస్తూ తిరుగుతూనే ఉన్నాడు. 



ఎక్కడయినా ఎవరయినా పెడితే అంత తింటున్నాడు. 



లేకుంటే మార్గమధ్యంలోని పంట కాలువలలోకి దిగి గుక్కెడు నీళ్ళు గొంతులో పోసుకుని శక్తిని కూడదీసుకుంటూ మళ్ళీ మహాత్ముల కొరకు అన్వేషిస్తూ తిరుగుతున్నాడు. 



మానవుడు దేనికొరకు తీవ్రమయిన ప్రయత్నం చేస్తే అతడు దాన్ని తప్పక పొందుతాడు అనేది సృష్టి ప్రారంభంలో సృష్టికర్త ఏర్పరచిన ఒక నియతి. 



అందువల్ల అతడి మహాప్రయత్నం అనే తీవ్ర అన్వేషణ ఫలించి అతడి ప్రశ్నలకు సమాదానం చెప్పగలిగే గురువు ఒకనాటికి అతడికి లభిస్తున్నాడు. 



అలా అతడికి లభించిన గురువు అతడి దుఃఖం మొత్తం తొలగించడానికి చెప్పే జ్ఞానమే ఆత్మ జ్ఞానం. 



అంతటి మహత్తరమయిన విలువగలిగిన ఆత్మజ్ఞానాన్ని ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం. 



ఆత్మ స్వరూపులయిన తామందరూ ఈ చెప్పబోవు ఆత్మ జ్ఞానం మీదే మనస్సు పూర్తిగా పెట్టి రెండు చెవులతో వినే ప్రయత్నం చెయ్యమని ప్రార్దన.


🕉🌞🌏🌙🌟🚩

గీతోపనిషత్తు -134

 *🌹. గీతోపనిషత్తు  -134 🌹*

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము  📚*

శ్లోకము 19


*🍀. 17. సమభావము -  సమభావము, స్థిరత్వము ఎవరి మనసునకు కలదో వారి కిచ్చటనే సర్గము జయింపబడి, దోషరహితము సమము అయిన బ్రహ్మమునందు స్థితిగొన్న వారగుదురు. సర్గమును మనసుచే జయించుటవలన బ్రహ్మమునందు స్థిరపడుట తెలుపబడినది. సర్గమనగా సృష్టిసర్గము. అది భూర్భువసువరాది ఏడులోకములుగ ఏర్పడి యున్నది.  ఇవన్నియు చైతన్యస్థితులు. భౌతిక స్థితి, ప్రాణమయ స్థితి, మనోమయ స్థితి, బుద్ధి స్థితి, ఆకాశ స్థితి (మహత్), తపో స్థితి, సత్య స్థితి యిట్లేడు లోకములు వర్ణింపబడినవి. ఇందు ప్రాథమిక స్థితులలో పదార్థ మెక్కువగను, ప్రజ్ఞ తక్కువగ నుండును. అట్లే ఉన్నత స్థితులలో ప్రజ్ఞ ఎక్కువగను, పదార్థము తక్కువగ నుండును. ప్రజ్ఞ ఎక్కువగ నున్న లోకములను వెలుగు లోకము లందురు.  మానవుడు తన యందలి చైతన్యము యొక్క విలాసము వలన వెలుగు లోకము లందు, పదార్థమయ లోకములందు చరించుచు నుండును. హెచ్చు తగ్గులన్నియు చైతన్యము యొక్క క్రీడయని భావించి, దానికి మూలమైన సత్యమున ప్రవేశించుటకు మనసునకు సామ్యము, స్థిరము అవసరము. 🍀*


ఇహైవ ఆర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |

నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మా ధృహ్మణి తే స్థితా|| 19


సమభావము, స్థిరత్వము ఎవరి మనసునకు కలదో వారి కిచ్చటనే సర్గము జయింపబడి, దోషరహితము సమము అయిన బ్రహ్మమునందు స్థితిగొన్న వారగుదురు. సర్గమును మనసుచే జయించుటవలన బ్రహ్మమునందు స్థిరపడుట తెలుపబడినది. సర్గమనగా సృష్టిసర్గము. అది భూర్భువసువరాది ఏడులోకములుగ ఏర్పడి యున్నది. 


ఇవన్నియు చైతన్యస్థితులు. భౌతిక స్థితి, ప్రాణమయ స్థితి, మనోమయ స్థితి, బుద్ధి స్థితి, ఆకాశ స్థితి (మహత్), తపో స్థితి, సత్య స్థితి యిట్లేడు లోకములు వర్ణింపబడినవి. ఇందు ప్రాథమిక స్థితులలో పదార్థ మెక్కువగను, ప్రజ్ఞ తక్కువగ నుండును. అట్లే ఉన్నత స్థితులలో ప్రజ్ఞ ఎక్కువగను, పదార్థము తక్కువగ నుండును. ప్రజ్ఞ ఎక్కువగ నున్న లోకములను వెలుగు లోకము లందురు. 


మానవుడు తన యందలి చైతన్యము యొక్క విలాసము వలన వెలుగు లోకము లందు, పదార్థమయ లోకములందు చరించుచు నుండును. హెచ్చు తగ్గులన్నియు చైతన్యము యొక్క క్రీడయని భావించి, దానికి మూలమైన సత్యమున ప్రవేశించుటకు మనసునకు సామ్యము, స్థిరము అవసరము. వెండితెరపై రంగులు, శబ్దములతో కూడిన సినిమా కథ నడచుచుండగ రసవత్తరముగ నుండును.


కాని దాని కాధారమైన తెరకు సినిమా సన్నివేశము లన్నియు పట్టవు. తెరమీద కథను గమనించువారు కథలో లీనమగుదురు. తెరను కూడ గమనించు వారు సమస్తమగు సన్నివేశములు వచ్చిపోవునవిగ గమనింతురు. జీవితమందలి సంఘటనలు అనేకానేకములు వచ్చిపోవుచున్నను, తాను తెరవలె యున్నాడు అని తెలిసినవాడు, వచ్చిపోవు సన్నివేశములకు ప్రభావితుడు కాడు. 


అట్లు ప్రకృతి విలాసములను గమనించుచు వాని కాధారమైన బ్రహ్మమునందు స్థితి గొన్నచో ఈ శరీరమునందే బ్రహ్మత్వము పొందవచ్చునని భగవంతుడు తెలుపుచున్నాడు.


మనసున బ్రహ్మమును గూర్చిన భావనము స్థిరపడుచున్న కొలది మనసునకు స్థిరత్వము, సామ్యము కుదురును. అట్టి మనసుతో సర్గమును (చైతన్య విలాసమును) జయించ వచ్చును. అపుడిచ్చటే బ్రహ్మమునందు స్థితిగొని యుండ వచ్చును. అదియే సామ్యము. సర్గమున కతీతమగు స్థితి. సర్గము ప్రకృతి యధీనము.


సామ్యమున ప్రకృతికూడ యధీనమై యుండును. అదియే బ్రహ్మము నందు స్థితిగొనుట యందురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

వివేక చూడామణి

 *🌹. వివేక చూడామణి - 3 🌹*

✍️ రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు

📚. ప్రసాద్ భరద్వాజ 


*🍃 3. సాధకుడు - 1  🍃* 


15. సాధకుడు ఆత్మ జ్ఞానము పొంది, వివేకముతో దయాసముద్రుడు, బ్రహ్మజ్ఞానమును పొందిన సద్గురువును ఆశ్రయించవలెను.


16. ఆత్మ జ్ఞానము పొందాలంటే సాధకుడు 14వ శ్లోకములో చెప్పినట్లు శాస్త్ర పరిజ్ఞానము పొంది, శాస్త్ర చర్చలలో విస్తారముగా పాల్గొనగల్గి ఉండవలెను.


17. ఏ వ్యక్తి సత్యాసత్య జ్ఞానమును పొంది అనిత్య స్థితులకు అతీతముగా మనస్సును మళ్ళించి ప్రశాంతతను పొంది, సత్వగుణ ప్రధానుడై జన్మ రాహిత్య స్థితికై ఆపేక్ష గల్గినవాడే బ్రహ్మన్ని గూర్చి తెలుసుకొనగలడు.


18. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుటకు యోగులు నాల్గు విధములైన మార్గములను ప్రతిపాదించిరి. అలా కానిచో విజయమును సాధించలేరు.


19. మొదటిది సత్యాసత్యాలకు మధ్య తేడాను తెలుసుకొనుట. రెండవది తన కర్మల ద్వారా తాను పొందు ప్రతి ఫలముల ఎడ తిరస్కార భావము. మూడవది ప్రశాంతత, విశ్రాంతి. నాల్గవది విముక్తి ఎడల తీవ్ర ఆకాంక్ష.


20. మానసికంగా దృఢ నిశ్చయంతో బ్రహ్మము యొక్క సత్యాన్ని, ప్రపంచము యొక్క అసత్యాన్ని గూర్చిన నిర్ణయము. అందుకు సత్యాసత్యములను గ్రహించుటలో విచక్షణా శక్తి కల్గి యుండవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

ఏది నాది?

 *ఏది నాది?*...

      🌸🌸🌸

                                                

           నాది నాదనియేవు అని ఏదో పాట ఉంది కదా అట్లే మనమందరం నాది నాదని మురిసిపోతుంటాము కదా! కానీ నిజానికి చూస్తే ఏదీ నాది కాదు. ఏదీ మనది కాదు.

              ఉల్లిపొర ఒక్కొక్కటీ విడిపోయినాక కొనాకు ఏమీ మిగలనట్లే మన జీవితంలో కూడా ఒక్కొక్కటీ విడిపోతూ ఉండగా మనదంటూ ఏమీ లేదని తెలిసిపోతుంది. కానీ ఈ తెలియడం ఒక్కొక్కరికీ ఒక్కొక్క దశలో మాత్రమే అర్థమైతుంది.


*కొందరికి ఎప్పటికీ జీవితమంతా అర్థం కాకపోవచ్చును*


కాకపోవచ్చనేముంది ముక్కాల్ భాగం మందికి అర్థమే కాదు. మాట ఒప్పుకున్నా మనసు ఒప్పుకోవడం కష్టం. మనసు ఒప్పుకున్నా ఆచరణలో పెట్టడం కష్టం.


               చిన్నప్పట్నించీ వాడినబట్టలు, పెరిగిన ఇల్లు, చదివిన బళ్ళు, కలిసిన స్నేహితులు అందర్నీ, అన్నిటినీ ఒక్కొక్కదాన్నీ నాది అనుకునీ, నాది కాదు అనుకునీ సులభంగా విడిచేస్తాం. సులభంగా ఎందుకంటే అంతకన్నా మంచిదో పెద్దదో మనకు తగినదో మనకు దొరుకుతుంటే విడిచిపెడుతుంటాం.దొరుకుతుందనే ఆశవంటిదున్నా కూడా  విడిచిపెడుతుంటాం.


        కానీ ఎప్పుడైతే ఇది పోతే మళ్ళీ రాదనీ దీన్ని విడిచిపెట్టలేననీ ఎప్పుడనుకుంటామో అప్పుడే కమ్మేస్తుంది దుఃఖం. ప్రాణం అల్లాడిపోయేంతగా. నాకు కావాలనీ , నేను విడిచిపెట్టననీ పోరాటాలు/హింసలు ఎన్నో.

అయినా జరిగేది జరక్కమానదు.


        పెళ్ళయితే ఆడపిల్లలు, ఎంతలేదన్నా కాదన్నా కొన్నాళ్ళ తరువాత అయినా మగవాళ్ళు కూడాముక్కాల్ భాగం మంది పుట్టినయింటినీ తోడబుట్టినవారినీ విడిచిపెడుతుంటారు. మగపిల్లలలో ఇంకొంచెం ఆలస్యంగా విడిచి పెడతారు. అందర్నీ, అన్నిటినీ కలుపుకుపోయే సామర్థ్యం అందరికీ ఉండడం కుదరదు. ఎవ్వరూ విలన్లు కాకపోయినా, అందరూ ఒకరి గురించి ఒకరు ఆలోచించే వాళ్ళయినా అంతా కలిపి మోసే భారం ఎక్కువై భారం తగ్గించుకోవాల్సి వస్తుంది . ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తమ సంపాదన, తమ పిల్లలు, తమ లక్ష్యాలు, లేదా మనశ్శాంతీ ఇదే కష్టమైతే ఏం చేస్తారు పాపం. విడిచిపెడుతుంటారు.


         తర్వాత పిల్లలు పెద్దయితే వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ప్రపంచం వేరైనపుడు వాళ్ళనూ విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎవరూ ఎవరికీ దూరం కాకపోవచ్చు. అయినా ఎక్కడో ఏదో బాధ ఉంటుందేమో కదా!

       తర్వాత తమ పనులు, లక్ష్యములు తమ ఇష్టాలు విడిచి పెట్టాల్సి వస్తుంది. అంతవరకూ ఆయా పనులు చేయటానికి ఉపకరించిన శరీరాంగాలు(దేహాంగాలు) సహకరించవు. అందువల్ల తమ పనుల్లో సహకరించే వ్యక్తులే వెళ్ళి విశ్రాంతి తీసుకోమంటారు. ఇక నీవు పనికి రావని అన్యాపదేశంగా చెపుతుంటారు.(నెగెటివ్ సెన్స్ లో చెప్పట్లేదు. ఫాక్ట్స్ !!) ఉద్యోగాలు, వ్యాపారాలు, వంటిళ్ళూ తమతర్వాతి తరాలకు విడిచిపెట్టాల్సి వస్తుంది. పని సామర్థ్యాలూ, పాలసీ విధానాలు, ఇంటి సామాన్లూ మనవని అనుకోకుండా విడిచిపెట్టాల్సి వస్తుంది.


           తర్వాత పూర్తిగా దేహం మొండికేయడం మొదలు పెడుతుంది.కళ్ళు, చెవులూ పని చేయరు. మాట స్పష్టత ఉండదు. కాళ్ళూ చేతులూ వణుకు రావడం లేదా చచ్చుపడడం జరగవచ్చు. దాంతో అంతవరకూ దేహయాత్రలో నిర్విరామంగా పని చేసిన దేహాంగాలు కళ్ళు, కాళ్ళు అయినా సరే  వాటిపై అభిమానం విడిచి పెట్టాల్సి వస్తుంది. అన్నిటికీ పక్కవాళ్ళ కాళ్ళ చేతులపై ఆధారపడాల్సి వస్తుంది.


       అట్లా ఉండే స్థితిలో ఏమనిపిస్తుంది? ఈ ఇల్లు నాదేనా వీళ్ళు నావాళ్ళేనా అనిపించే రోజూ రావచ్చు. (రావచ్చనే అన్నా.... అపార్థం చేసుకోవద్దు.)అంతకన్నా బెటర్ ఏదీ దొరకకపోయినా విడిచిపెడుతూ ఉండేటపుడు మనుష్యులు ఒకరినొకరు విడిచి పెట్టుకోకపోవచ్చు. కానీ మోహం విడిచేయాల్సిందే.


                      ఈలోకం మీద, తన గడ్డమీద, తన భూమి మీద , తన వాళ్ళమీద ఆఖరికి తన వంటిమీద కూడా......మోహం విడిచిపెట్టుకోవాల్సిందే.


*విడువనివాళ్ళకూ కాలం విడిపిస్తుంది. విడువకపోతే దేహమూ విడువలేక బ్రతుకూ చావుకూ మధ్య ఊగిసలాడాల్సిందే*


       కానీ చాలా చాలా కష్టం పుట్టినప్పటినుంచీ ఏళ్ళ తరబడి దశాబ్దాలతరబడి పెంచుకుంటూ వచ్చిన మోహాన్ని ఒక్కసారిగా విడిచిపెట్టడం. చాలానే కష్టం. కానీ తప్పదు. ప్రతిదశలోనూ విడిచిపెడుతూ ఉండాల. మనం వయస్సు పెరిగే కొద్దీ మోహం తగ్గించుకోవాల.

         నాది అనేది ఏదీ లేదీ ప్రపంచంలో. అన్నీ మనం కొంతకాలం వాడుకుంటామంతే. క్లాస్ రూమ్ లో బెంచీ మాదిరి, ట్రైన్ లో బెర్త్ మాదిరి, సినిమాహాల్లో ఫ్లైట్లో సీట్ల మాదిరి కొంతసేపు వాడుకున్నట్టే అచ్చంగా అదేవిధంగా ఈ లోకంలోని మనుష్యుల్నీ, బంధాల్నీ , వస్తువుల్నీ కొంతకాలం వాడుకుంటాము. అంతే కానీ ఏదీ మనది కాదు. ఏదీ నాదు కాదు.


            చివరగా ఒక చిన్న మాట హాయిగా నవ్వేసుకోండి. కానీ ఇదే పెద్ద జీవనసత్యం అనీ మరిచిపోవద్దు.

ఈ సమయంలో భగవంతుడు ఏం చేస్తుంటాడో అని ఒకరు అడిగితే ఇంకొకరు చెప్పారంట..... ఇప్పుడే కాదు ఎప్పుడూ ఆయన పకపకా నవ్వుతూనే ఉంటాడు. అని....


*ఎందుకు అంటే ఈ భూమి నాదని ఈ భూమి నీదని వాళ్ళ పేర వీళ్ళపేర రాస్తూనే ఉంటారు* *రాయించుకుంటానే ఉంటారు. కానీ ఏ ఒక్కరూ శాశ్వతంగా వాళ్ళ పేరుమీద ఉంచుకోలేకపోయినారు* అని

*అదే భూమికి హక్కు దారులుగా వేలమంది వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు అయినా నాదనుకొనే మనుష్యుల వెఱ్ఱి చూసి భూదేవితో పాటు యముడూ నవ్వుతుంటాడట...

గురు మహిమ

 🌹గురు మహిమ !🌹


        పూర్వం ఒక ఊళ్ళో ఒక బోయవాడు ఉ౦డేవాడు. అతడికి ఏ పనీ రాదు... వచ్చినా చెయ్యడు. వట్టి సోమరి పోతు. మరి తినడానికి ధనం కావాలి కదా !.... దాని కోస౦ దారిన పోయే వాళ్ళని బెదిరి౦చి వాళ్ళదగ్గర దొరికిన వాటితో పొట్టపోసుకునేవాడు.


       ఇలా ఒక రోజు బోయవాడు అడవిలో తిరుగుతున్నాడు. ఎ౦త తిరిగినా ఆ రోజు బాటసారులెవరూ దొరకలేదు. తినడానికి తిండి లేక ఆకలి బాధ ఎక్కువవుతుంటే, అక్కడ తపస్సు చేసుకు౦టున్న ఒక ముని కనిపి౦చాడు. ఆకలి కోపంతో మహర్షిని కొట్టబోయాడు. ఆ శబ్దానికి ఒకసారి కళ్ళు విప్పి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడాయన.


         బోయవాడు ఆశ్చర్యంతో ‘ఇదేమిటి? నేను కొట్టబోతే భయపడలేదు. పైగా మళ్ళీ కళ్ళు మూసుకుని జప౦లో పడ్డాడు. అ౦టే కొడితే కొట్టుకో అనుకు౦టున్నాడా !?’ అనుకుని ఆ మహర్షి కళ్లు తెరిచాక అదే విషయం తేల్చుకుందామని, అక్కడే ఆ ముని ఎదురుగా కూర్చు౦డి పోయాడు.

   

        కొ౦త సేపటికి ఆయన జప౦ చాలి౦చి లేచాడు. అంత వరకూ ఆయన సంగతేదో చూడాలనుకున్న వాడు మంత్రం వేసినట్లుగా సాధు స్వభావిలా...


        “స్వామీ ! ఇ౦కెప్పుడూ మిమ్మల్ని కొట్టను! మిమ్మల్నే కాదు అసలు ఎవర్నీ కొట్టను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరి౦చ౦డి” అన్నాడు.

   

        మహర్షి ఏమీ మాట్లాడకు౦డా నడిచి వెళ్ళిపోతున్నాడు. బోయవాడు కూడా ఆయన్ని వదలకు౦డా వె౦ట పడ్డాడు. మహర్షి ఎక్కడికి వెడితే అక్కడికి వెళుతున్నాడు. 


        హఠాత్తుగా ఒక చోట పులి ఒకటి మహర్షి మీదకు దూకింది. వె౦టనే బోయవాడు ఆ పులిని చ౦పేశాడు. ముని కరుణించి తనను కాపాడిన బోయవాడికి భగవంతుడి యొక్క గొప్పతనం, తపస్సు చేసుకునే విధాన౦ ఉపదేశిస్తూ...


        “నాయనా ! దారిన వెళ్ళే వాళ్ళని కొట్టడ౦ మానెయ్యి. ఎప్పుడూ సత్యాన్నే పలుకు ! నేను చెప్పిన పద్ధతిలో  తపస్సు చేసుకో” అని చెప్పి వెళ్ళి పోయాడు. 


        బోయవాడు మహర్షి చెప్పినట్టే చేయడం మొదలు పెట్టాడు.  తిండి కూడా మరచిపోయి తపస్సు చేస్తున్నాడు. ఒక రోజు అటు వైపుగా  దుర్వాస మహర్షి వచ్చాడు. ఆయనను చూసి సమస్కార౦ చేసి...


        “స్వామీ ! నా దగ్గర ఆతిథ్య౦ తీసుకుని వెళ్ళ౦డి !” అని ప్రార్థి౦చాడు.


        “ఇతని దగ్గర ఏము౦దని నాకు ఆతిథ్యమిస్తాడు? అదీ చూద్దా౦!” అనుకుని 


        “నీ ఇష్టప్రకార౦ నీ ఆతిథ్య౦ తీసుకునే వెడతాను !” అన్నాడు మహర్షి.  


        బోయవాడు స౦తోష౦గా  శివుణ్ణి ప్రార్థి౦చాడు. శివుడు అతనికి ఒక బ౦గారు పాత్ర ఇచ్చాడు. దాని సహయ౦తో దుర్వాసుడికి కావలసిన ఆతిథ్యమిచ్చి గౌరవి౦చాడు.


        అది ఛూసి దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు. అతడికి సత్యతపుడు అని పేరు పెట్టి, 


        “నాయనా ! నువ్వు నిజ౦గా సత్యతపుడివే!” అన్నాడు. 


        ఆ రోజును౦చి బోయవాడు సత్యతపుడి గా పిలవబడ్డాడు.


        ఒక రోజు అతడు అడవిలో సమిథలు కోసుకు౦టూ ఉ౦డగా కత్తి తగిలి వేలు తెగి కి౦ద పడిపోయి౦ది. కాని, వె౦టనే ఆ వేలు  పైకి వచ్చి దాని చోటులో అది అతుక్కు పోయి౦ది. అక్కడే వున్న కొ౦తమ౦ది కెన్నెర కింపురుషులు ఆ దృశ్యాన్ని చూసి  ఆశ్చర్య౦తో  దేవేంద్రుడికి చెప్పారు. 


        ఇ౦ద్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇటువ౦టి విశేష౦ ఎప్పుడూ వినలేదే ! అనుకున్నాడు.  సత్యతపుడి తపశ్శక్తిని పరీక్షి౦చాలనుకున్నాడు. వె౦టనే ఇద్దరు అనుచరులతో  బయల్దేరాడు. ఒకరు ఎరుకలవాని వేష౦లోను, ఒకరు ప౦ది వేష౦లోను సత్యతపుడి దగ్గరకు వచ్చారు.


        మాయ ప౦ది పరుగెత్తుతూ...


        “రక్షి౦చ౦డి  !  రక్షి౦చ౦డి  ! చ౦పేస్తున్నాడు !” అని అరుస్తూ సత్యతపుడి ఆశ్రమ౦లో దాక్కు౦ది. 


        ఎరుకలవాడు దాన్ని తరుముతూ వచ్చి సత్యతపుడి ఆశ్రమ౦ చేరాడు. 


        “అయ్యా! నేను కొట్టిన ప౦ది మీ ఆశ్రమ౦లోకి వచ్చి౦ది. ఎటు వెళ్ళి౦దో చెప్ప౦డి!” అని అడిగాడు.

   

        సత్యతపుడికి ధర్మసంకటం ఏర్పడింది. ఏ౦ చెయ్యాలో తోచలేదు. తనకు తెలిసిన దాన్ని తెలిసి కూడా చెప్పకపోతే అబద్ధ౦ అవుతు౦ది. తెలుసు!  అని చెప్తే జరగబోయేది జీవహి౦స కనుక అది పాపం అవుతుంది. ఆ పాప౦ తనకు చుట్టుకు౦టు౦ది. కొ౦చె౦సేపు ఆలోచి౦చి ఒక నిర్ణయానికి వచ్చాడు.


        “నాయనా! ప౦దిని చూడగలిగి౦ది కన్ను. దానికి నోరు లేదు .. మాట్లాడడ౦ రాదు. చెప్పగలిగి౦ది నోరు.. దానికి చూడడ౦ రాదు. చూశానని ఎలా చెప్తు౦ది?” అని ఎదురు ప్రశ్నించాడు.

   

        అతని సత్య దీక్షకి మెచ్చుకుని ఇ౦ద్రుడు, మిగతా దేవతలు తమ నిజ రూపాల్తో కనిపి౦చి...


        “సత్యతపా! నీ పేరు నీకు సరిగ్గా సరిపోయి౦ది !“ అని మెచ్చుకుని అతడికి కావలసిన వరాలిచ్చి అ౦తర్థానం అయ్యారు.

   

        ఏమీ తెలియని ఒక సోమరిపోతు అయిన బోయవాడు గురువుగారి మీద భక్తితో, ఎప్పుడూ సత్యాన్నే పలకాలి! అని చెప్పిన గురువుగారి మాటకు కట్టుబడి, ఆచరించి ఆయన చెప్పినట్టు సాధన చేసి సత్యతపుడిగా పేరు సార్ధక౦ చేసుకుని చరితార్థుడయ్యాడు !!


                                   🌺🌼🌺

_హిందూ_ధర్మము

 *"#అర్థవంతమైన_హిందూ_ధర్మము"* 


1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం -  #హిందూ_ధర్మం.


2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం - #హిందూ_ధర్మం.


3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పనిసరిగా ఒక్క సారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం - #హిందూ_ధర్మం.


4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం -  #హిందూ_ధర్మం.  


5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు. 


6.  సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా నిలదీసి ప్రశ్నించే ధర్మం - #హిందూ_ధర్మం.


7.  హిందువులు ఈ క్రింది వాటిని కూడా భగవత్సరూపాలు గానే ఆరాధిస్తారు.


👉 వృక్షాలు దైవ స్వరూపాలే.

👉 రాళ్ళూ - రప్పలూ కూడా దైవ స్వరూపాలే.

👉 నీరు (గంగ) కూడా దైవ స్వరూపమే.

👉 గాలి కూడా దైవ స్వరూపమే.

👉 వానరాలు (కోతులు) కూడా దైవ స్వరూపాలే.

👉 కుక్కలు (భైరవుడు) కూడా దైవ స్వరూపాలే.

👉 పందులు (వరాహం) కూడా దైవ స్వరూపాలే.


8. నువ్వూ దైవ స్వరూపమే.. నేనూ దైవ స్వరూపమే... చక్షు గోచరమైనవన్నీ (కంటికి కనిపించేవన్నీ) దైవ స్వరూపాలే.    


9.  చతుర్వేదాలు,  నాలుగు ఉప వేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉప పురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 లకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం - #హిందూ_ధర్మం. 


10. మన ధార్మిక గ్రంథాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు..


కర్మల గురించి తెలియాలంటే ......

👉 వేదాలు చదవాలి.


సమస్త జ్ఞానం పొందాలంటే ......

👉 ఉపనిషత్తులు చదవాలి.


పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ......

👉 రామాయణం చదవాలి.


రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ...

👉 మహాభారతం చదవాలి.


భగవంతుని తత్త్వం తెలియాలంటే ......

👉 భాగవతం చదవాలి.


చక్కటి పరిపాలన అందించాలంటే ......

👉 కౌటిల్యుని "అర్థశాస్త్రం" చదవాలి.


అన్యోన్య దాంపత్యానికి ......

👉 వాత్స్యాయన కామశాస్త్రం చదవాలి.


చక్కటి ఆరోగ్యానికి ......

👉 ఆయుర్వేదం చదవాలి.


మేథస్సుకు ......

👉 వేద గణితం చదవాలి.


శారీరక ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి ....

👉 పతంజలి యోగశాస్త్రం చదవాలి.


భవన నిర్మాణాలకు ......

👉 వాస్తుశాస్త్రం చదవాలి.


గ్రహ, నక్షత్రాలను గురించి తెలుసుకోవడానికి ......

👉 ఖగోళ శాస్త్రాన్ని చదవాలి.


11. ఎవ్వరినీ బలవంతంగా మతం మార్పించే ప్రయత్నం చేయని ధర్మం - #హిందూ_ధర్మం.


12. ఆహార అలవాట్లలో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉండవచ్చు. (ప్రపంచంలో శాకాహారం, మాంసాహారం..  ఈ రెంటిలో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు.)


13. #హిందూ_ధర్మం అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానం గానే పరిగణిస్తుంది.


14. మోక్షానికి దారి చూపించే ధర్మమే - #హిందూ_ధర్మం.


15. అన్ని మతాలను గౌరవించే ధర్మం -  #హిందూ_ధర్మం.


16. పరమత దూషణ చెయ్యని ధర్మం -  #హిందూ_ధర్మం.


హిందువుగా జన్మించాం..

హిందువుగా జీవిద్దాం..

హిందువుగా మరణిద్దాం..


జై శ్రీరామ్.... 


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

NAD







 

Sastry











 

Human







 

హిందూ మతము





 

ఆసనాలు