28, జనవరి 2021, గురువారం

రామాయణమ్ 195

 రామాయణమ్ 195

.........

హనుమంతుడు ఒక్కసారి ఆగి ఆలోచించాడు .

.

ఒక ప్రయోజనమాశించి ఈ మహాపురుషుడు ఇచటికి వచ్చినాడు ,ఈయన వలన సుగ్రీవుని కార్యము కూడా నెరవేరగలదు. సుగ్రీవునికి రాజ్యము కూడా లభించగలదు. ఈ విధంగా ఆలోచించి హనుమంతుడు రామునితో ఇలా అన్నాడు .

.

పంపాపరిసరములలో ఉన్న అత్యంత భయంకరము, దుర్గమము అయిన ఈ అరణ్యములోనికి మీరేల ప్రవేశించారు.

ఇక్కడఅతిభయంకరమైన  విషసర్పములు ,నానాక్రూరమృగములు 

సంచరించుచున్నవి .ఇటువంటి అడవిలోకి నీవు,నీతమ్ముడు ఎందుకు ప్రవేశించారు.

.

అప్పుడు లక్ష్మణుడు ఆయనకు తమ గురించి అంతా విశదీకరించి ,కబంధుడు తమకు సుగ్రీవుని గురించి తెలిపిన విషయము చెప్పి సుగ్రీవుని సహాయము ఆశించి వచ్చామని తెలిపాడు.

.

లక్ష్మణుడు పలికిన ఈ మాటలు విని హనుమంతుడు,.... బుద్ధిమంతులు ,క్రోధమును జయించినవారు,జితేంద్రియులైన మీ వంటి వారి దర్శనము అదృష్టవశముననే లభించును.అట్టి మిమ్ములను సుగ్రీవుడు తప్పక చూడవలెను .

.

సుగ్రీవుడు తన అన్న అయిన వాలిచేత అవమానింపబడి రాజ్యమునుండి వెడలగొట్టబడినాడు.వాలి సుగ్రీవుని భార్యను అపహరించినాడు.అతడు వాలికి భయపడి అరణ్యములో కాలము గడుపుచున్నాడు.

.

రామా ! సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి సీతాన్వేషణమున మీకు సహాయము చేయగలడు.

.

NB

సుగ్రీవుడు  వాలికి భయపడి అడవిలో దాక్కున్న వాడు .మరి కబంధుడు అలాంటి వాడిగురించి ఎందుకు చెప్పాడు ? వాలి అతనికంటే గొప్ప వాడుకదా ! 

.

మొదటి కారణము వాలి అధర్మపరుడు ధర్మాత్ముడైన రాముడు వాలి సహాయము స్వీకరించడు.

.

రెండవకారణము ..సమాన శీల వ్యసనేషు సఖ్యం ...ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఎప్పుడు చిగురిస్తుంది అంటే ఇద్దరి శీలము ఇద్దరి బాధ ఒకటే అయి ఉండాలి .

సుగ్రీవుడు శీలసంపద కలిగిన ధర్మాత్ముడు పైగా రాముని వలెనే భార్యను పోగొట్టుకొని ఆ బాధ కూడా రాముని లాగానే అనుభవిస్తున్నాడు .

Empathy  is more important for any friendship to become strong.


.

జానకిరామారావు వూటుకూరు

.

కామెంట్‌లు లేవు: