2, నవంబర్ 2021, మంగళవారం

శ్రీమద్భాగవతము

 *02.11.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2310(౨౩౧౦)*


*10.1-1450-*


*సీ. అట్టి నారాయణుం డఖిలాత్మభూతుండు*

  *కారణమానవాకారుఁడైనఁ*

*జిత్తంబు లతనిపైఁ జేర్చి సేవించితి*

  *రతికృతార్థులరైతి; రనవరతము*

*శోభిల్లు నింధనజ్యోతి చందంబున*

  *నఖిల భూతములందు నతఁ; డతనికి*

*జననీ జనక దార సఖి పుత్ర బాంధవ*

  *శత్రు ప్రియాప్రియ జనులు లేరు*


*ఆ. జన్మకర్మములును జన్మంబులును లేవు*

*శిష్టరక్షణంబు సేయుకొఱకు*

*గుణవిరహితుఁ డయ్యు గుణి యగు సర్వ ర*

*క్షణ వినాశకేళి సలుపుచుండు."* 🌺



*_భావము: "సకల జీవుల యందు ఆత్మగా ఉన్నవాడు, కారణ వశమున మానవ స్వరూపము గ్రహించిన వాడగు శ్రీమన్నారాయణునిపై మనసులు లగ్నం చేసి సేవించి మీరు ధన్యులయ్యారు._*   

*_కట్టెలో నిగూఢంగా అగ్ని దాగి ఉన్నట్లు, పరమాత్మ సమస్త జీవుల యందు నిరంతరము ప్రకాశిస్తూ ఉంటాడు; ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, విరోధి, ప్రియులు, అప్రియులు అంటూ ఎవ్వరూ లేరు; జన్మము, కర్మలు, పునర్జన్మ లేనే లేవు; త్రిగుణాతీతుడైనను సాధు జీవులను సంరక్షించుట కొరకు గుణములతో కూడిన శరీరము ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలలు కొనసాగిస్తూ ఉంటారు.”_* 🙏



*_Meaning: “You had focussed your minds on SrimanNarayana, who took incarnation as a human being and fulfilled the purpose of your lives, by serving Him with great reverence and regard. Like the hidden fire in the wood, He resides and shines in every being; He has no birth, death, rebirth or any other predefined duties; Though He is beyond Trigunas (Sattva, Rajas, Tamas), He adorns a physical form consisting of these gunas and performs the acts of creation, preservation and dissolution._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

అహం నాశనమే★

 ★"నేను అన్నిటికన్నా శుభప్రదం. మంగళానికి నేనే చిహ్నం. మిగతా ఆకులన్నీ అమంగళం" అంది మామిడాకు. అప్పట్నుంచీ మామిడాకులు తలకిందులుగా వేలాడుతున్నాయి. 🍀


★"నేను సువాసనలకు, పరిమళాలకూ మారుపేరు. మీకు వాసనలేదు. మీరెందుకూ పనికిరారు" అంది కరివేపాకు. కరివేపాకులు కూరలో తప్పనిసరి. కానీ వంట పూర్తయ్యాక పక్కన తీసి పారేస్తారు. అప్పట్నుంచీ అవి కూరలో కరివేపాకులయ్యాయి.☘


★"అన్నం తినేందుకు నేనే పనికొస్తాను. మీరంతా వేస్టు" అంటూ నీలిగింది అరిటాకు. అప్పట్నుంచీ అరటాకు అన్నం తినేశాక చెత్త కుండీలోకి చేరింది. చెత్తకుండీలో దుర్భరమైన కంపు మధ్య బతకాల్సి వచ్చింది.. 🍀


★"అసలు గొప్పంతా నాదే. అన్నం తిన్నాక ముఖశుద్ధికోసం అంతా నన్నే తింటారు" అని హొయలు పోయింది తమలపాకు. అప్పట్నుంచీ మొత్తం నమిలేశాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయడం మొదలుపెట్టాడు.🍀


★పాపం... తులసి ఆకు🍃 ఏమీ అనలేదు. తన గొప్ప చెప్పుకోలేదు. అందుకే దాన్ని 🌳👏పూజిస్తారు. తులసమ్మ అని పిలుస్తారు.🍀

★గోవర్ధనమంత పర్వతాన్ని ఎత్తిన వాడిని ⚖తులాభారంలో తేలిపోయేలా చేసేందుకు ఒక్క తులసిదళం చాలు.🍀


★అంతెందుకు...? -అంత్య ఘడియల్లో తులసి తీర్థం నోట్లో పోస్తే వైకుంఠమే సంప్రాప్తిస్తుంది. అంతేకాదు తులసి లక్ష్మీ స్వరూపం....తులసికోటలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే నివాసముంటాడన్నది పురాణ సమ్మతం. తులసి ఆరాధన జరిగే గృహములో మనశ్శాంతికి లోటుండదంటారు. 🍀☘🌿🌱🍃

                          

★ కాబట్టి ఎప్పటికైనా అహం నాశనమే★

😊💐

Brihadeeswara Temple

 The Brihadeeswara Temple in Thanjavur is one of the greatest structures ever built. Do you know why?


The architecture used is the interlock method where no cement, plaster or adhesive was used between the stones. It has survived 1000 years and 6 earthquakes. 


The Mandir tower at 216 feet was likely the tallest in the world at the time.


The other structures built using this method Big Ben and Leaning Tower of Pisa are tilting with time. The Mandir which is way older has zero degree inclination. 

1.3 lakh ton of granite was used to build the Mandir which was transported by 3000 elephants from 60 kms away.


The Mandir was constructed without digging the earth. 

The Kumbham at the top of the Mandir tower weighs 81 tons and is carved from a single piece of granite. 


Nothing ever comes close to the level of engineering used to construct the Brihadeeswara Mandir. There is nothing quite like it and there will never be something quite like it. Raja Raja Chola was a visionary. We must treasure this timeless marvel. 


📸 Artistic imagination : Sunil Pookode. 


#SanatanaDharma

#ancient

#hindutemple

#IncredibleIndia🇮🇳 #TeamLostTemples

గోవిందరాజు సుబ్బారావు

 గోవిందరాజు సుబ్బారావు 1895 సంవత్సరంలో జన్మించాడు. ఇతను మొదట్లో చరిత్ర విద్యార్థిగా తన చదువు ప్రారంభించాడు. తర్వాత వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. డాక్టరుగా తెనాలిలో స్థిరపడి పేరుప్రతిష్ఠలు సంపాదించాడు. తరువాతి కాలంలో హోమియోపతి వైద్యంపై తన దృష్టి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించాడు. అణు విజ్ఞానాన్ని చదివి ఐన్‌స్టీన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపాడు. ఇతను విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవాడు. ఆంగ్లంలో ఇనార్గానిక్ ఎవల్యూషన్ అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించాడు. అయితే గోవిందరాజు సుబ్బారావు నటునిగానే సుప్రసిద్ధుడయ్యాడు.

పాఠశాలలో చదివేటప్పుడు వార్షికోత్సవ సందర్భంలో మర్చంట్ ఆఫ్ వెనిస్ అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో సుబ్బారావు నట జీవితం ప్రారంభమైంది. సంగీతాన్ని నేర్చుకున్న సుబ్బారావు 20 రాగాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో గయోపాఖ్యానం నాటకంలో సాత్యకిగా, భీముడుగా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టాడు. తెనాలిలో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని బొబ్బిలి యుద్ధంలో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లు, ప్రతాపరుద్రీయంలో పిచ్చివాడి పాత్రల్లో ఇతని నటన తెలుగు నాట పేరు ప్రఖ్యాతులు తెచ్చింది.

అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న తెలుగు సినిమా రంగంలోనూ క్యారెక్టర్ నటునిగా, ప్రతినాయకుడిగా పలు పాత్రలు పోషించి మెప్పించాడు. మాలపిల్లలో సుందర రామశాస్త్రిగా, షావుకారులో చెంగయ్య, బాలనాగమ్మలో మాయల మరాఠీగా ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందాడు.

ఈయన చెన్నైలోని స్వగృహంలో అక్టోబరు 28, 1959 సంవత్సరంలో మరణించారు.

ఆయన నటించిన సినిమాలు:

సామ్రాట్ విక్రమార్క (1958) .... ప్రచండుడు

భాగ్యరేఖ (1957)

పాండురంగ మహత్యం (1957)

చరణదాసి (1956) .... బసవయ్య

కన్యాశుల్కం (1955) .... లుబ్ధావధానులు

షావుకారు (1950) .... షావుకారు చంగయ్య

ధర్మాంగద (1949)

గుణసుందరి కథ (1949)

పల్నాటి యుద్ధం (1947) .... బ్రహ్మనాయుడు

రత్నమాల (1947)

బాలనాగమ్మ (1942) .... మాయల మరాఠి

గృహలక్ష్మి (1938)

మాలపిల్ల (1938) .... సుందర రామశాస్త్రి

 ప్రముఖ నటుడు గోవిందరాజుల సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ...💐💐💐🙏🙏🙏