16, నవంబర్ 2024, శనివారం

Panchaag


 

*ఓం నమః శివాయ

 *ఓం నమః శివాయ* 


శివలింగంలో తూర్పుకు చూస్తున్న దానిని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకు అధిష్టానంగా ఉంటుంది. దీనివలన అజ్ఞానం తొలుగుతుంది.  దక్షిణమునకు చూసే ముఖమును అఘోర ముఖము అంటారు. ఇది అగ్నిహోత్రమును శాసిస్తుంది. లయం చేస్తుంది. ఇది అజ్ఞానమును దహించేస్తూ జ్ఞానమును కూడా ఇస్తుంది. పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని సద్యోజాత ముఖం అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్ళు విభూతి, పళ్ళరసములు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా పరమేశ్వరుని అనుగ్రహం కలిగిస్తూ ఉంటుంది. అది భూసంబంధంగా ఉంటుంది. అది సృష్టికి కారణం అవుతుంది. ఉత్తరానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని వామదేవ ముఖం అంటారు. వర్షములు పడకపోతే శివలింగమునకు అభిషేకం చెయ్యండని చెప్తారు. అభిషేకం చేస్తే వామదేవ ముఖం తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షములు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది, దానిని ఈశానముఖం అంటారు. దీనిని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపియై ఉంటుంది. ఇదే "శ్రీ మోక్షమును కటాక్షిస్తుంది. ఈ అయిదు ముఖములతో శివలింగం పంచభూతములను శాసిస్తోంది. సృష్టి, స్థితి, లయ, అజ్ఞాన, మోక్షములకు కారకం అవుతుంది. సమస్త ఫలితములను ఇస్తుంది.


శివలింగం చల్లబడడం ఊరంతా చల్లగా ఉండడమే.

కార్తీక పురాణం -* *16

 *కార్తీక పురాణం -*16వ అధ్యాయము*


🕉🌺🕉🌺🕉🌺🕉🌺🕉


*స్తంభ దీప ప్రశంస*


వశిష్టుడు చెబుతున్నాడు.


"ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత  ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తనకు శక్తి వున్నా దానము చేయరో, అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజూ  విడువకుండ, తులసి కోటవద్దగాని - భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసిన యెడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీకశుద్ద పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి, భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫలదానము జేసిన యెడల - చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.


సంతానము వున్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు  ఆకాశ దీపముగాని, స్తంభ దీపాము గాని వుంచి నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశర్యములు కలిగి, వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టు వారు  శాలిధాన్యంగాని, నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీప ముంచవలమును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును, లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మ మెత్తుదురు ఇందులకొక కథ కలదు. చెప్పెదను వినుము.


*దీప స్తంభము విప్రుడగుట*


ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒక చోట అశ్రమాన్ని ఏర్పరచుకొని, దానికి దగ్గరలో నొక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ యాశ్రమము చుట్టు ప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము అలయద్వారాల పై దీపములు వెలిగించి, కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను జూచి "ఓ సిద్దులారా! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీకశుద్ధ  పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్తంభముపాతి, దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తీసుకునివద్దాము, రండి" అని పలుకగా అందరు పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి. దానిపై శాలి ధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెళ ఫెళమను శబ్దము వినిపించి, అటుచూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి  వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి "ఓయీ నీ వేవడవు? నీవీ స్తంభమునుండి యేలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి" అని ప్రశ్నించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి "పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను. ఒక జమిందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా యైశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్భుద్దులలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే విప్రుడయినా వచ్చినన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుచుండెవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడెను. అందరును నా చేష్టలకు భయపడువారే కాని, నన్నెవరును మందలింపలేక పోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేక పోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గడనై, పాపినై అవసానదశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి, లక్ష జన్మలముందు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదు వేల జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్ష  జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని, నన్ను మన్నింపు" డని వేడుకొనెను.


ఆ మాటలాలకించిన, మునులందరు నమితాశ్చర్యమొంది "ఆహా! కార్తీకమాసమహిమ మెంత గొప్పది అదియునుగాక, కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కఱ్ఱలు, రాళ్లు, స్తంభములు కూడా మన కండ్ల యెదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటి కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే యీ స్తంభమునకు ముక్తికలిగిన" దని మునులు అనుకోనుచుండగా, ఆ పురుషుడా మాటలాలకించి "మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మ బంధము కలుగును? అది నశించుటెట్లు? నాయీ సంశయము బాపు"డని ప్రార్ధించెను. అక్కడ వున్న మునిశ్వరులందరును తమలో నొకడగు అంగీరసమునితో "స్వామి! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు గాన, వివరించు"డని కోరిరి. ఆంగీరసుడిట్లు చెప్పుచున్నాడు.


స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందు షోడశ అధ్యాయము సమాప్తం.


#

77. " మహాదర్శనము

 77. " మహాదర్శనము " --డెబ్భై యేడవ భాగము --దర్శనము


77 . డెబ్భై యేడవ భాగము-- దర్శనము


          భగవతికి ఎదురు కొండపై గోవులు మేస్తున్నది చూచుటకే ఒక సంతోషము. వర్ణ వర్ణముల పశువులు పచ్చటి అడవిలో పచ్చటి చెట్ల మధ్య తిరుగుతున్నది చూస్తే ఆమెకు కలుగు సంతోషము ఇంతింత అని చెప్పుటకు సాధ్యము కాదు. ఆ సంతోషమును ఇంకొకరితో పంచుకోవలెను. అదే మనుష్య స్వభావము. తీపి చేసిన దినము ఒకడే భోజనము చేయకూడదు అన్నారు పెద్దలు. ఒక్కరే రమించుటెలా ? అన్నది శాస్త్రము. శాస్త్రపు మాట , పెద్దల మాట అటుంచితే , స్వభావము అడిగినదానిని లేదనుట ఉందా ? అయితే ఒక విశేషము. సుఖ దుఃఖములు రెండింటినీ పంచుకుంటే , సుఖము రెట్టింపు అవుతుంది, దుఃఖము సగమవుతుంది. బహుశః వాటికి కూడా గుణాకార , భాగహారములు వస్తాయేమో ? ఒకటి గుణాకారమవుతుంది. ఇంకొకటి భాగహారమవుతుంది. దానివలననే నేమో మనుష్యుడు సంఘజీవి ? 


          భగవతి ఒకదినము తమ సంతోషము పట్టలేక వెళ్ళి మైత్రేయిని పిలుచుకు వచ్చింది. ఆమె అంతవరకూ పశువులను ఆ విధముగా చూచి యుండలేదు. కాత్యాయని యొక్క కన్నులతో ఆ గోధనమును చూచినపుడు , అదికూడా ఆ కొండ నేపథ్యములో , చెట్లమధ్య , పచ్చికబయళ్ళలో అవి తిరుగుతుండగా చూచితే , ఏదో అనిర్వచనీయమైన తృప్తి అయినది. అలాగే ఇంకో ఘడియ చూస్తూ నిలబడింది, " గోవు అంటే సమృద్ధికి సంకేతము. ఆ గోవులు పచ్చచీర కట్టిన వనస్థలిలో తిరుగుచుండుటను చూస్తే మనసుకు ఎంతో హృద్యముగా ఉంది. చూచితివా , ఆ దృశ్యములోని సౌందర్యము ? కనులు మెచ్చుకున్నాయి, మనసు నిండింది , ఏదో శాంతి కలిగింది! చెల్లీ , నీ కోరిక నిజంగా ఎంత అందమైనదో ! " అన్నది. 


         దాన్నలా పరిభావిస్తుండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. " మేము ఇంతగా సంతోషించునది ఇదంతా మాది అనియేనా ? లేక , అదంతా సమృద్ధి ప్రతీకలైన సౌందర్యపు ముద్దలనియా ? " ఆమె విచారపరురాలైనది. ఔను ! ఒక చిగురుటాకు చేతికి చిక్కితే , దానిని తన మనోభావనతో మరలా పచ్చటి చెట్టులో పెట్టి చూచు జాతి. అయినా ఆ దినము ఆమె ఎందుకో ఆ విషయమును ముందుకు తీసుకుపోలేదు.  


         కాత్యాయనికి భగవానులను కూడా పిలుచుకు వచ్చి ఆ దృశ్యమును చూపించవలెనని మురిపెము. కానీ , భగవానులు తనమాట పాలించరు అన్న అపనమ్మకము లేకున్ననూ ఎదో సంకోచము. అత్తను పిలుచుకు వచ్చి చూపించినది. ఆమె కూడా మిక్కిలి సంతోషించినది. " మీ ఆశ్రమమునకు వచ్చిన దినము నుండీ ఒక్కొక్క దినము ఒక్కొక్క విచిత్రమును చూపిస్తున్నావు. రెండు దినములలోనే ఆ కొత్త కాలువకు పిలుచుకొని వెళ్ళినావు. కాలువ నీరు వచ్చి పడుతున్న చెరువైతే నిజంగా మనోహరముగా ఉంది. అన్నిటికన్నా , నువ్వు వెళ్ళి నిలుచుంటే ఆ లేగదూడలు నీ చుట్టూ చేరి తోకలనెత్తి దుముకుతూ ఎగురుతూ ఆడే దృశ్యము మాత్రము నిజంగా మనసులను గెలిచేది. కాదే , అదెంత వేగిరముగా నువ్వు వాటిని మచ్చిక చేసుకున్నావు ? అక్కడ కూడా మన ఇంట్లో ఆవులూ దూడలూ ఉన్నాయి , అయితే అవి ఇంతగా మాలిమి కాలేదు. పాలు తాగుతున్ననూ నువ్వు పిలిస్తే పరుగెత్తి వస్తాయో ఏమో ? " అన్నది.


        కాత్యాయనికి ఆ స్తుతి విని చాలా సంతోషమైనది. ’ అమ్మా , ఏదైనా చేసి , భగవానులను ఒక దినము పిలుచుకొని వచ్చి ఈ దృశ్యమును చూపించవలెను కదా ? " అన్నది. ఆ మాటలో . ’ ఇది నావల్ల సాధ్యము కాదు , మీరే పూనుకోవలెను’ అన్న భావము నిండి ఉంది. ’ ఏదో ఒకటి చేసి పిలుచుకొని రండి , ’ ఊ ’ అనండి ’ అన్న ప్రార్థన నిండి ఉంది. 


         ఆలంబిని నవ్వింది. " అది కాదే , నువ్వు చెబితే మీ భగవానులు వినరా ? నేనే చెప్పాల్నా ? అవసరము లేదు , నువ్వు రా అంటే వాడు వస్తాడు. " అంది. కాత్యాయని వినలేదు, " అట్లు కాదమ్మా! వారు కళ్ళు మూసుకుని కూర్చొని అన్నీ చూచినానని సంతోష పడువారు. మనము కళ్ళు తెరచి చూచి సంతోషపడు వారము. అదేమో కళ్ళు మూసి చూచుటకన్నా, కళ్ళు తెరచి చూచుట తక్కువ అని మన భావన. కాబట్టి వారిని పిలిస్తే ఎక్కడ అపరాధమగునో అని దిగులు. మీరైతే అది వేరు. ఎంతైనా మీరు వారి తల్లి. మీ మాట మీరుట ఉండదు. నా కష్టము చూడండి. నేను మెచ్చినదానిని వారు మెచ్చ వలెను. వారు మెచ్చకుంటే నాకు తృప్తి లేదు. అలాగని వారిని నేరుగా పిలుచుటకూ లేదు. అందుకే మిమ్ములను అడుగుతున్నాను. " 


         ఆలంబిని కొడుకును పిలుచుకు వచ్చుటకు ఒప్పుకున్నది. కాత్యాయని అంది : " అది గనక అయితే ఇంకో రెండు మూడు దినములలో కావలెను. చూడండి , మహారాజుల నెల బ్రహ్మచర్యము ఇంకో రెండు మూడు దినములకు తీరును. ఆ తరువాత ఆ పుణ్యాత్ముడు భగవానులకు విడుపు ఇస్తారో లేదో ? " 


         " అది కుడా నిజమే! మహారాజులు పయోవ్రతమును పట్టి నెల కావస్తున్నది కదా ? అదేమి కాత్యాయనీ , ఇతరుల విషయములో ఒక సంవత్సరము బ్రహ్మ చర్యము అన్నవారు మహారాజుల విషయములో ఒక నెల అన్నారు ? "


         " ఏమిటమ్మా తెలియనట్లే అడుగుతున్నారే ? ఇతరులు అంటే మామగారే కదా ! మామ గారిని అదిమివేసే పనులేమున్నాయి ? పైగా బ్రాహ్మణులు కదా. మహారాజైతే క్షత్రియులు. బ్రాహ్మణుల వలె అన్నీ వదలి కూర్చొనుటకు అవుతుందా ? రాచకార్యముల భారము ఎక్కువ. అందుకే అవధి తగ్గించినారు. దానితో పాటు పయోవ్రతము , ఏకాంతవాసము అదనముగా ఉన్నాయి కదా ? మామగారైతే కుటుంబములో ఒకరై ఉన్నారు. "


" అదీ నిజమే. సరే , మీ భగవానులను ఏ దినము పిలవాలి ?"


" మీకు ఎప్పుడు తోచితే అప్పుడు. " 


" ఈ దినము ఇంకా మాధ్యాహ్న స్నానానికే చాలా సమయముంది. ఈ దినమే ఎందుకు కాకూడదు ? "


         ఆలంబిని నేరుగా కొడుకును వెతుక్కుంటూ వెళ్ళింది. కాత్యాయని కూడా వెనకే వెళ్ళింది. భగవానులు సుఖాసనములో నడిమింట్లో కూర్చున్నారు. కనులు విశాలముగా తెరచియున్ననూ వాటికి ఏమీ కనపడుట లేదు అని నేరుగా ఉన్న ఆ చూపు తెలుపుతూ వచ్చినవారిని హెచ్చరిస్తున్నట్టుంది. 


        అత్తాకోడళ్ళు వెళ్ళి ఎదురుగా నిలుచున్నారు. కొంతసేపటికి భగవానులు వారిని చూచి, " పిలవకూడదా అమ్మా ? " అని లేచి నిలుచున్నారు. తల్లి నవ్వుతూ , " నువ్వు యే లోకమునకు వెళ్ళినావో ఏమో అని పిలవలేదు. కాత్యాయని ఏమో చెప్పవలెనని వచ్చినది. " అన్నారు. 


భగవానులు నవ్వుతూ , " నేనేమి పులినా , ఎలుగుబంటునా ? తానే వచ్చి చెప్పకూడదేమి ? " అన్నారు. 


" ఇంకేమీ లేదు , ఎదురుగా కొండపైన పశువులు మేస్తున్నాయి. నువ్వు వచ్చి చూడవలెనంట! " 


       " ఇంతేనా ? పద , ఇప్పుడే వెళ్ళి చూచి వద్దాము" అని భగవానులు కదిలినారు. " దేవుడి దయ ! వంటకూడా ముగిసింది " అని కాత్యాయని కూడా వెంట నడచింది. 


         భగవానులు కొండ పైన మేస్తున్న గోవులను చూచినారు. కొండ పక్కగా పారి వస్తున్న కాలువను చూచినారు. కొండకు ఈ వైపున చేరుకున్న విశాలమైన చెరువును చూచినారు. అన్నీ చూచి , " చూడమ్మా , ఇదంతా ఈమె వలన అయినవి. ఈమె వేయి ఆవులు కావలెనన్నది. అంతేకాక, దానికోసము మనకు కొంచము కూడా శ్రమ కలగరాదు అన్నది. దేవతలు సరేనన్నారు. చూడు. పశువులు వచ్చినాయి , వాటికి కొట్టములయినాయి. తాగుటకు నీరని , కాలువ వచ్చినది. కాలువ నీరు నిలుచుటకు చెరువయినది. ఇది సంసారము. ఊరికే పెరుగుతూ పోవడమే దీని స్వభావము. " అని, " భగవతి వచ్చి ఏమేమి చూడవలెనో చెప్పవలెను. మాకు కన్నులున్ననూ అన్నిటినీ చూడవు. " అన్నారు. 


         కాత్యాయని భగవానులు గోవులను చూచుటకు వచ్చినారు అన్న సంతోషములో అన్నీ మరచింది. సహజముగానే సరళమైనది. మాటకు మాట జోడించునది కాదు. అందులోనూ సంతోషములో మైమరచిపోయినపుడు ఇక చెప్పవలెనా ?   


         ఆమె ముందుకు వచ్చి గోవులను చూపించి, చెట్లనూ , పచ్చిక బయళ్ళనూ చూపించి , పచ్చిక దిన్నెలతో నిండిన ఆ వాలు మైదానములో అవన్నీ ఎంత సొగసుగా కనిపిస్తున్నాయో వర్ణించినది. భగవానులు అంతా విని తల ఊపి, " కాత్యాయనీ , ఇవి ఇంత సుందరముగా ఉండుటకు కారణమేమో తెలుసా ? " అని అడిగినారు. 


" లేదు "


       " నీ అభిమానము. ఆ అభిమానముతో ఇదంతా నాది అని చూస్తున్నావు. ఆ నాది అన్నదానివలన నీ సంతోషము ఇబ్బడిముబ్బడి యగుచున్నది. నాది అనుట వలన సంతోషము రెట్టింపైతే, " నేను " అన్నట్లయితే , గోవులన్నీ , గోవులే కాదు ఈ కొండ అంతా , ఈ నీరంతా , ఈ ఆకాశమంతా , అంతేనేమి , అంతా నేనే అన్నపుడు ఆ సంతోషము ఎంత కావలెను ? "


     కాత్యాయని దాని భావమును అనుభవించి ఒక ఘడియ తన్మయురాలైనది. ఆలంబిని కూడా తన్మయురాలైనది. అయితే భావమును అనుభవించి కాదు. 


       భగవానులు మరలా అడిగినారు." ఆ దినము నువ్వు , జ్ఞాన నగరపు కాలువను ఇక్కడికి తెచ్చినారు , దాని చివర చెరువుంది అన్నది ఇదేనా ? పోనివ్వు , ఈనాడైనా వచ్చి చూచినాను కదా ? "


" అదేమిటి , ఈనాడైనా అంటున్నారు ? మీరు చూచిననూ నెమ్మదే ! చూడకున్ననూ నెమ్మదే ! "


         " ఔను , ఔను. చూచిననూ మీరు బ్రహ్మమే ! చూడకున్ననూ మీరు బ్రహ్మమే ! కానీ చూచితే మీరు ముక్తులు. చూడకపోతే మీరు బద్ధులు. అంతే వ్యత్యాసము. ! అది సరే , నువ్వు ’ ఈనాడైనా అంటున్నారు ’ అని అడిగినావు కదా ? మరి , మహారాజు జ్ఞాన నగరమునుండీ తెచ్చిన కాలువ. దాని నీరు నిలుచుటకు కట్టిన చెరువు చూచితిరా అంటే లేదు అనకుండా , ’ ఊ చూచినాను ’ అనవచ్చా ? అందుకే అన్నాను "


         భగవానులు దీర్ఘ కాలము ఆ గోసంపత్తును చూస్తూ నిలుచున్నారు. తల్లి , దూడలను కాత్యాయని మాలిమి చేసుకున్నది చెప్పినది. భగవానులు నవ్వి అన్నారు, " అమ్మా! నీ కోడలంటే ఏమనుకున్నావు ? ఆ ఏనుగుల వంటి ఆబోతులునాయే , వాటిని చూచినా లక్షము లేదంట ! వెళ్ళి , వాటి పక్కన నిలబడి, ఒళ్ళు నిమురుతుందంట ! ఈమె పిలిస్తే అవి లేగదూడల కన్నా ఎక్కువగా పరుగెత్తి వస్తాయంట ! "


" అవన్నీ నీకు ఎవరు చెప్పినారు ? "


" ఆ గోపాలకుల ముఖ్యుడున్నాడు కదా , అతడు వచ్చి చెప్పినాడు. "


అలాగే కొంతసేపు ఆ గోవుల సంగతి మాట్లాడుతూ వారంతా వెనుదిరిగినారు. 


        రాజు బ్రహ్మచర్యము ముగిసింది. దేహము తేలికగా ఉంది. ఏకాంత వాసము వలన ముఖమునకు వర్ఛస్సు వచ్చింది. మనసు చూచిన వైపుకు పరుగెత్తుట తప్పింది. రాజిప్పుడు రాజ భవనములో ఉన్నప్పటికన్నా శాంతుడూ, దాంతుడూ అయినాడు. 


         భగవానులు రాజును పిలిపించినారు. ఆ దినము ఉపదేశమని అతడికి తెలుసు. రాజును పూర్వాభిముఖముగా కూర్చోబెట్టి , తాము ఉత్తరాభిముఖులై కూర్చొని, భగవానులు తమ కమండలము నుండీ మంత్రజలమును రాజుమీద చల్లినారు. రాజుకు తాను అనునది ఏమున్నదో అదంతా మూటగట్టుకొని మూలాధారమునకు దిగింది. దృష్టి రెప్ప కొట్టుటను మాని భగవానులనే చూస్తున్నది. చేతులు , అరచేతులు వెల్లకిలగా తొడలపైనున్నవి. తలా వీపూ , అంగాంగములు నేరుగా గూటము కొట్టినట్టు కూర్చున్నవి. 


        భగవానులు ’ ప్రజ్ఞాన ఘనః ప్రత్యగర్థో బ్రహ్మేవాహమస్మి ’ అను మంత్రోపదేశము చేసినారు. మంత్రపు అక్షరములు ఒక్కొక్కటీ ఒక్కొక్క అఖాతమంతటి గంభీరములై చెవులనుండీ దేహము లోపలికి దిగి వాసమేర్పరచు కొన్నట్టాయెను. 


     భగవానులు, " ఈ మంత్రమును కనులు మూసి నూటెనిమిది సార్లు జపము చేసి ఏమవుతుందో చెప్పండి " అని తమ పాటికి తాము కూర్చున్నారు. 


       రాజు మంత్రమును జపించుట ఆరంభించినారు. మేరు ప్రదక్షిణ ( మధ్యమానామికాంగుళుల మధ్య కణుపులకు మేరువని పేరు ) చేసి లెక్కవేస్తున్నది తప్పిపోయింది. నోటితో మంత్రాక్షరములను చెప్పుచున్నది తప్పిపోయింది. లోపలంతా మంత్ర జపము నడుస్తున్నది.


         అంగాంగములలోనూ ఏదో తేజస్సు పరచుకున్నట్టు భాసమగుచున్నది. ఆ పరచుకున్నదానిని తేజస్సు అనుటకన్నా ఇంకేదో అనుట సరియైనది. తేజస్సంటే చక్షుగోచరమైన రూపమున్నది అన్నట్లగును. అది రూపము కాదు, నాలుకతో రుచి చూచు రసము కాదు. శ్రోత్ర గ్రాహ్యమైన శబ్దము కాదు. ఘ్రాణము నుండీ గ్రహించు గంధము కాదు , త్వక్కునుండీ తెలియు స్పర్శ కాదు. అయినా బాగా తెలుస్తున్నది. అదేదో ప్రత్యేకమైనది. అయితే , వేడి కాదు , చలువ కాదు , అంతటిది. దానిని రాజు అంతవరకూ చూడలేదు. చూడలేదని , తాను దానిని గుర్తించలేను అని లేదనునట్లు కూడా లేదు. 


         అంతటి దొకటి ఆతని అంగాంగములను వ్యాపించినది, మెల్లగా వెనుతిరిగి వచ్చినట్టుంది. అంగాంగము లొకటొకటీ అది లేనిదే నిలువలేక తత్తర పడుతున్నవి. అలాగని పడిపోవునట్లు లేదు. చెదలు తిని మట్టిగా చేసిననూ నిలిచున్న వెదురు తడక వలె తన భావమును తాను మోసుకొని నిలచినట్లున్నది. ఆ ’ ఏదో ’ ఒక చైతన్యమందామా అంటే అది ఎద గూడు పక్క ఒకటై కలసినట్లుంది. ఘనమగుచున్నది. దాని కవచము జారి పడుతున్నది. కవచము జారగా అది సజాతీయమైన ఇంకొక పిండముతో చేరినట్లయినది. స్త్రీ పురుషులు ఒకరినొకరు దృఢముగా ఆలింగనము చేసుకొన్నట్లయింది. ఇంకేమీ స్మరణకు లేదు. విస్మరణమా ? అదీ కాదు. అహంభావపు కొన ఒకటి , అస్మితా భావపు కొన యొకటి. ఆ రెండూ సూక్ష్మములు. సూక్ష్మాత్ సూక్ష్మములు. అవి రెండూ కలసి పోయినాయి. 


         మంత్రము ఇంకా పలుకుతున్నది. ఉత్తర క్షణములోనే చిన్న పిండము మరలా విడివడి ప్రత్యేకమైనది. కవచము ఎక్కడినుండో వచ్చి మరలా దానిని కప్పినది. ఇప్పుడు కవచము ముందటి వలె తమోమయమై లేదు. తేజోమయమైనట్టుంది. అదంతా మరలా హృదయము దగ్గరకు వచ్చి చేరుతున్నది. అక్కడ తేజో మండలమయినది. దానిలో ఏమేమో చేరినట్లుంది. రాను రానూ చిన్నదవుతున్నది. అది నేరుగా మధ్యలోనున్న దారిలో వెళ్ళ వలెను అంటుంది. ఎవరో , ’ అక్కడికి పోవచ్చులే , ఇంకా కాలముంది ’ అంటున్నారు. 


" నేను అక్కడికే పోవలెను "



 " లేదు , నువ్వు మమ్మల్ని మించుటకు లేదు. మేము లాగిన వైపుకు నువ్వు తిరగవలెను. "


" అయితే నువ్వెవరు ? "


         " మేము నీ విద్యా కర్మ వాసనలము. నువ్వు యెత్తినది ఇదొకటే జన్మము కాదు. నీకెన్నో జన్మలయినాయి. ఆయా జన్మలలో నువ్వు సంపాదించిన విద్యా, నువ్వు ఆచరించిన కర్మ, నువ్వు సంగ్రహించిన వాసనలు-ఇవే మేము. "


" అయితే నేనెవరు ? "


         " అది మేము చూడలేము. పితృ లోకములో అది తెలియును. అప్పుడు నీకు నామ రూపాత్మకమైన దేహము వచ్చును. ఋషులు నువ్వు చేయు కర్మకు కావలసిన జ్ఞానమును ఇస్తారు. నీ భోగమునకు అవసరమగు ఐశ్వర్యమును దేవతలు ఇస్తారు. నువ్వూ ఒక ప్రాణివై జన్మిస్తావు. " 


" అలాగయితే నాదంటూ ఏమీ లేదా ? "


" ఉపచరితముగా ( ఉపాసించబడినది ) కావలసినంత ఉన్నది. వాస్తవముగా ఏమీ లేదు. " 


" మీరు, అంటే విద్యా కర్మ వాసనలు నావి కావా ? "


" మేము కాలము వచ్చినపుడు వదలి వెళ్ళెదము. "


"వదలి వెళ్ళుట అంటేనేమి ?" 


" మేము జ్ఞానములో పరిసమాప్త మయ్యెదము."


" అది ఎప్పుడు ? "


" భగవానులంతటి వారి దయ కలిగినపుడు"


        అంతవరకూ ఆ చైతన్య కణము ఏదో వాయు సాగరములో తేలుతున్నది, అప్పుడు హఠాత్తుగా కిందకు పట్టి లాగినట్లాయెను. కణము పెద్దదయింది. దానికి అంగాంగములు పుట్టినవి. మొదటి వలె జనక మహారాజు అయినది. రథములో కూర్చున్నాడు. తన విద్యా కర్మ వాసనలు ఒక్కటి కూడా వెంట లేవు. 


         రాజా జనకుడు రథములో వీధిలో వెళుచున్నాడు. రథాశ్వములు వేగముగా ముందుకు దూకుతున్నవి. తానూ , తన రథమూ నీటి లోపల, నీటి మధ్యలో వెళుతున్ననూ , తనకు ఊపిరాడుటకు ఆ నీరు అడ్డంకి కాలేదు. రథము నీటిని దాటి వస్తున్నది. ఇంకెక్కడికి లాగుకొని వెళ్ళెడిదో ? జనకుడు ఎగురుతాడు. మెలకువ అవుతుంది , మంత్రము పలుకుతున్నది. 


" సరే , మంత్రము నూటెనిమిది సార్లు అయినది, రాజా వారు లేవవచ్చును. "


         రాజు కనులు తెరచినాడు. తాను కళ్ళు మూసుకున్నపుడు చుట్టూ ఏమేమి ఉండినదో , అదంతా అక్కడక్కడే ఉంది. భగవానులు తన పక్కన అదే దర్భాసనము పైన అక్కడే అదే దృఢాసనములో కూర్చున్నారు. తానూ పద్మాసనములో తొడల పైన చేతులుంచుకొని కూర్చున్నాడు. అయితే ఒక వ్యత్యాసమైనది. 


     నీరు ఇంకిపోయి , బలిసిన టెంకాయలో కొబ్బెర గిటక గా మారి , పైనున్న పెంకు అనెడి కవచమును వదలినది అన్నది తెలియునట్లే , తాను ఈ దేహము కాదు , వేరే అన్న అవగాహన వచ్చినది. 


         భగవానులు ఏమీ తెలియనట్లు , ’ ఏమైనది ? ’ అంటారు. రాజు జరిగినదంతా చెపుతాడు. అలాగ చెప్పునపుడూ , తాను వేరే , చెపుతున్నవారు ఇంకెవరో అనిపించుతున్నది. భగవానులు అంతా విని, ’ ఇదంతా ఏమో అర్థమయినదా ? ’ అంత్టారు. 


        రాజు నమ్రుడై చిన్న గొంతుతో , ’ లేదు ’ అంటాడు. " ఒక జన్మాంతరమగుట . ఈ జీవుడు ఈ దేహమును వదలి వెళ్ళునపుడు, కరణాదులలో నున్న చైతన్యమునంతా ప్రాణ దేవుడు లాగేసుకుంటాడు. ఆ ప్రాణుడు మనసుతో కలిసిపోతాడు. విద్యా కర్మ వాసనలు వెంట వచ్చి హృదయము నుండీ నేరుగా బ్రహ్మ రంధ్రమునకు వెళ్ళు మార్గమును వదలి ఇంకెక్కడి నుండో జీవమును మోసుకొని పోతాడు. అది ఈ దేహమును వదలుట. దానిని చూడండి అలాగే జీవుడు సుషుప్తావస్థకు వస్తాడు. అప్పుడు తనకు కావలసినాదంతా సృష్ఠించుకొని విహారము చేసి జాగృత్తుకు వస్తాడు. ఇదంతా మీరు చూచినారు. చూచిన తరువాత అడుగ వలెను. విన్న దానిని నెమరువేసుకుంటూ ఉండవలెను. చివరికి అదే తాను కావలెను. మంచిది , ఈనాటికి ఇంత చాలు. ఇంకా రెండు నెలలు ఉంటారు కదా , అప్పుడు అడుగుట మొదలైనవన్నీ కానివ్వండి, ఇక లేద్దాము" అని మొదటివలె మంత్ర జలమును ప్రోక్షించినారు. చెరువు కట్ట తెగినపుడు నీరు బయటికి దూకునట్లు , మొదటి స్థితిగతులన్నీ వచ్చి నిండి , జరిగినదంతా విస్మృతి అయినట్లాయెను.   


Janardhana Sharma

కార్తికేయ దర్శనం

 కార్తికేయ దర్శనం


కార్తిక్యామిందువారస్య మాహాత్మ్యం శృణు భూపతే! తస్మాచ్ఛతగుణం తస్మి వ్రతం సౌరిత్రయోదశీ.! సహస్రగుణితం తస్త్రాత్కార్తికే మాసి పౌర్ణిమాతయా లక్షగుణం ప్రోక్తం మాసస్య ప్రతిపద్దినమ్||


విశాఖాసు యదాభానుః కృత్తికాసుచ చంద్రమాః|సయోగః పద్మకోనామ పుష్కరేష్వతి దుర్లభః||కార్తిక్యాం కృత్తికాయోగే యః కుర్యాత్ స్వామి దర్శనం! సప్తజన్మ భవేద్విప్రోధనాడ్యో వేదపారగః ||


కార్తిక సోమవార మహిమ విశేషమైనది. కార్తీకమాసమున ఒకవేళ శనిత్రయోదశి వస్తే అది సోమవారమున కంటె నూఱింతలెక్కువ. కార్తికపూర్ణిమ దానికంటే నూఱింతలు హెచ్చు. దానికంటె కార్తిక పాడ్యమి నూఱింతలు హెచ్చు ఫలం.


అంటే ఈ రోజులలో చేసే స్నాన, దాన, జప, పూజాదులకు అన్ని రెట్ల విశేష ఫలితం ఉంటుందని.


సూర్యుడు విశాఖ నక్షత్రంలో,చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండగా ఏర్పడిన యోగానికి "పద్మక యోగం" అని పేరు. ఇది అతి దుర్లభమైనది.


కార్తీక మాసములో కృత్తిక నక్షత్రం రోజున కార్తీకేయ దర్శనం చేసుకున్నవారు..ఈ జన్మతో సహా ఏడు జన్మల వరకు సంస్కారవంతులు.., ధనవంతులు.., జ్ఞానవంతులు అవుతారట.


16-11-2024,.. కృత్తికా నక్షత్రం,మాస సంక్రాంతి పర్వదినం..పద్మక యోగంతో పాటు ఇన్ని విశేషాలు ఉన్నాయి.


ఈ రోజున సుబ్రమణ్య స్వామి దర్శనం విశేష ఫలితం ఇస్తుందట.

ఉసిరి నిషేధం

 *ఉసిరి నిషేధం ఎందుకు* ?


ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!


పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరియాక పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు.... 

ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు...

ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు...

వారికి కూడా వివరం తెలియక పోయిన సరే తమ తల్లి తండ్రుల నుంచీ వస్తున్న నియమాలని పాటించేవారు...

కానీ ప్రస్తుతం కొందమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు.... 

అయితే *ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదో అనే సందేహం మాత్రం చాలామంది మెదడుని తొలిచే ప్రశ్న....* 


అందుకే ఆ నియమం లో దాగివున్న అర్ధాన్ని మీ ముందు ఉంచుతున్నాం....

ఆదివారం రోజు, రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తాకకూడదు అంటే.... ఉసిరికాయలో *పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది.... ఇది ప్రేగులలోఉండేఆమ్లాన్నిపెంచుతుంది.... దాంతో రాత్రిసమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు....అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది.... అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది....అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది*


అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు....

ఉసిరి కాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది...

 *సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది ... అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు....* 

(ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.....) 

ఇది సైన్స్ తో కూడిన దివ్య రహస్యం.

ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండి


శ్లో. *భానువారేదివారాత్రం సప్తమ్యాంచతథాదివా , ధాత్రీఫలంనరస్స్యా ద్యహ్యలక్ష్మీకోభవేత్సదా. వీర్యహానిర్యశోహానిః ప్రజ్ఞాహానిస్తథైవచ. భవేద్యస్మాత్తతోరాత్రౌ ధాత్రీంయత్నేనవర్జయేత్*


ఆదివారంనాడు రాత్రింబగళ్ళు సప్తమినాడుపగటిపూట ఉసిరికపచ్చడి ని తిన్నచో అలక్ష్మీకు డగును కనుక నిషేధము.


పైశ్లోకం ప్రకారం

వీర్యహాని

యశోహాని

ప్రజ్ఞాహాని కూడా పొందుతారు నిషిద్ధ దినాలలో ఉసిరిక తింటే.


🙏🙏🙏

22 - భజగోవిందం

 *22 - భజగోవిందం / మోహముద్గర*

💙💙💙💙💙💙💙💙💙💙💙💙


*భజగోవిందం శ్లోకం:-20*


*భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికా పీతా|*

*సకృదపి యేన మురారి సమర్చాక్రియతే తస్యయమేన నచర్చాభజ ॥ 20.*


*ప్రతి॥* యేన = ఎవనిచేత; భగవద్గీతా = భగవద్గీత; కించిత్ = కొంచెమైనను; అధీతా = అధ్యయనము చేయబడినదో; గంగాజల లవ కణికా = గంగా జలములో  లేశమాత్రము; పీతా = త్రాగబడినదో; సకృదపి = కొంచె మైనను; మురారి = ముర అనే రాక్షసునికి శత్రువయిన శ్రీకృష్ణుడు; సమర్చా = అర్పించబడినాడో; తస్య = అతడికి; యమేనా = యమునితో; చర్చ = వివాదము; న క్రియతే = ఉండదు.


*వివరణ:-*


ఎవరయితే భగవద్గీతను కొంచె మయినా మనసులో ఇముడ్చుకొ న్నారో, గంగా జలములో కొంచె మయినా సేవించి పవిత్రత నొందినారో; శ్రీకృష్ణుని కొంచెమే అయినా పూజ చేశారో వారికి యమునితో వివాదం వుండదు.


*వివరణ:-* 


ఆధ్యాత్మిక వికాసానికి మూడు దివ్యమైన సాధనలు యిక్కడ సూచింప బడ్డాయి. 1) గీతాధ్యయనం. 2) గంగా స్నానము. 3) మురారి అర్చనం. భగవద్గీత ఉపనిషత్సారము. అందులోని పదునెనిమిది అధ్యాయాలు మనసు కెక్కించు కొంచే అది వివేకపూర్ణమైన క్రమ శిక్షణం అనవచ్చు. తద్వారా తెలుస్తుంది. ఈ జీవితంలోని సార మేమిటి, దాని రహస్యమేమిటి, జీవిత గమ్యస్థాన మేమిటి అని. ఆ గమ్యస్థానాన్ని చేరే ఉపాయ మేమిటి అని కూడ.


సురగంగ ఎక్కడో స్వర్గంలో ప్రవహిస్తూ వుంటూ వుండేది. మనిషి తెలివి తేటలకు అందనంత ఎత్తులో వుంటుంది.రాజు భగీరథుని అసంఖ్యాకమైన ప్రయ త్నాల ద్వారా ఆ యాకాశగంగ మనుష్యుని అనుభవానికి వీలుగా యిక్కడకు తేబడింది. శివుడొక్కడే ఆ గంగాదేవి వేగాన్ని భరించాడు. ఆయన ద్వారానే గంగ తిరిగి మనకి ప్రాప్తిస్తున్నది. గంగ జ్ఞానానికి ప్రతీక. దివంలో వున్న గంగ దివ్యజ్ఞానానికి గుర్తు. ఆ జ్ఞానాన్ని శివుడు ముందర ఆస్వాదించాడు; భగీరథుని ప్రార్థనమీద ఆ జ్ఞానం మనకు ప్రసాదించబడింది. ఇలా ఆ గంగ యొక్క అవతరణం అంచలలో జరిగింది. కాబట్టే ఈ భూమి పగలగొట్టుకొని గంగ వెళ్ళిపోవటమనేది జరుగలేదు.


ఆత్మని గురించిన జ్ఞానమనేది నిరంతరం ప్రవహించే గంగతో పోల్చారు. ఈ జ్ఞాన గంగ పరంపరాగతంగా వచ్చే మత గురువుల ద్వారా యిప్పటి కీ యింకా ప్రవహిస్తూ వుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన గంగలోని జలాన్ని ఆస్వాదించటం అంటే అర్థం అంతర్గత మైన జ్ఞానము యొక్క శాంతిని పూర్ణతను అనుభవించటమే.


ప్రస్తుతపు భారత పుత్రులు "గంగ" అనంగానే హిమాలయాల్లో పుట్టి పారుతున్న గంగా అనుకుంటారు. ఎందుకంటే ఆ గంగ కూడ పవిత్రమైనదని దాని భౌతిక జలాల్లో ప్రత్యేకమైన శక్తివున్నదనీ ఆచారము ననుసరించి, నమ్మిక ననుసరించి అనుకొనబడుతూ వుంది. గనుక వీరు సైన్సు చదివిన వారయితే అది వట్టి మూఢనమ్మక మంటారు. తిరిగి వాళ్ళ హృదయాంతరాలో మాత్రం పై చెప్పిన నమ్మికయితే వుండనే వుంటుంది.


కొందరు నది పవిత్రమైనది అనే వుద్దేశ్యాన్నే తెగడుతారు. నదికి పవిత్రతేమిటి? ఎంత హాస్యా స్పదం? సాంకేతిక జ్ఞానంలేక వీళ్ళెంత అడుగున వున్నారో చూడవచ్చు. జాతీయ జండా ఎందుకు పవిత్రమైంది? మూడు రంగుల గుడ్డ ముక్కలు బండి చక్రమేగదా అనవచ్చునా? దాని పవిత్రత మనమిచ్చే గౌరవములో - భావంలో వున్నది. అలాగే గంగామతల్లి పవిత్రమైంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానమునకయిన ప్రతీక కనుక, గురు పరంపరద్వారా ఆ జ్ఞానం నిరంతరం యిలా ప్రవహిస్తూనే వుంటుంది, కనుక.


సామాన్య మానవుడికి యీ హిమాలయ గంగ, దాని పూజ, దానికయి యాత్ర, మొదలయి నవన్నీ గొప్ప ఊరడింపులాంటివి. విచిత్రమైన కృతకృత్యము వంటిది. మనస్సు పవిత్రం చేసే యాత్రవంటిది. ఉన్నత విజ్ఞానాన్ని ఆరాధించే సాధన విషయంలో సాధకునకు విగ్రహం మీది ఆశకంటే విగ్రహానికి మౌళికమైన ఆశయం యేవిధంగా గొప్పదో అలాగే గంగ మనకు పవిత్రమైంది. అందుకనే లవలేశమైన గంగా జలమంటే అనంతమైన జ్ఞానంలో కొంచమైన జ్ఞానమని యర్థము. ఆ జ్ఞానం ద్వారా దివ్యజీవితాన్ని గడిపే మార్గం తెలుస్తూంది గదా! అదే ఉన్నతికి చేర్చుతుందని ఊహ. 


గీతాధ్యయనం ధీ సంబంధమైన ఉత్తేజమిచ్చి జీవిత గమ్యాన్ని అధ్యయనం చేసే సాధకునికి జ్ఞాపకం చేస్తుంటే, గంగలోని కొద్ది బిందువుల నాచమించటం అనేది భక్తి మార్గ సాధకునికి దూరాన వున్న గమ్యాన్ని సంతోష పూర్ణంగా గోచరింపచేస్తుంది. అతడికి యింకరేవు దూరంగా లేదు. లైటు హవుసు యొక్క కాంతి పుంజం కనబడింది ఇంకా సముద్రాంతరం లోనే వున్నాడు గాక తుఫాను వాగులూ వంటి దుఃఖాలుంటాయి గాక అయినా అతడికి నమ్మకం చిక్కుతున్నది రేవు దూరంలేదని ఆ వైపు తను వెళ్ళవచ్చు అని..


ఒక ఓడ రేవునకు చేరటంతోనే, రేవునుంచి మరొక దోవచూపే పడవ ఆ ఓడ దగ్గరకు వెళ్ళి దోవ చూపుతూ రేవులోకి తీసికొని వస్తుంది. అలాగే ఈ భగవద్గీత చదవటంచేతగాని, గంగా జలం త్రాగటంచేతగాని పరమార్థము అనే ఓడ రేవు యొక్క ఆనవాలు కనబడినవాడు తనకోసం ఒకానొక పడవరేవునుంచి వచ్చే దాకా ఆగుతాడు. అలాగే ఆ పడవ ఎవరంటే గురువని చెప్పవచ్చు. గురువు నడిచిన దోవలోనేతనూ నడిచి పరమాం చేరుతాడు అందాకా లంగరు వేసి వుండటం అంటే ధ్యానంలో వుంటాడని అర్థం. ఆ తరువాత మురారిని అర్పిచుతాడంటే గురువుతో రేవు చేరుతాడని అర్థం.


"ముర" అనేది "క 'నకు సరియైనది. ఇది వున్నంతకాలం రేవు చేరట మనేది లేదు. దేహమే నేను అనే బుద్ధి కలిగిన వారు కాని "అహంకారమే’’ తాను అనుకొనే వాడుగాని ఆ రెంటినీ తుడిచి వేసేవరకూ సముద్రంలోనే వుండాలి. అయితే అహంకారం మరెలా పోయేదీ అంటే భగవత్రార్ధనవల్ల మాత్రమే. అహంకారాన్ని నాశనం చేయ గలిగిన "మురారి' ని భజించటం వల్లనే.


అహంకార సంబంధమైన పరిమితులను సమ్మెట కొట్టుట మెలాగంటే మనసు ను ఇతర విషయాలనుంచి నిగ్రహించి సత్యపదార్థము యొక్క జ్ఞాపక మున్నూ, “నేను” అనే వాన్ని స్వభావమున్నూ నిరంతరం మనసులో అనుసంధానం చేయాలి. అప్పుడు లోనున్న జీవానికి బయటనున్న ప్రాణానికి ఏమీ తేడా లేదని తెలుస్తుంది. నిజానికి భగవద్గీతలో చెప్పిన అత్యుత్తమమైన సందేశ ఫలితమిదే గదా!.'


గీతాధ్యయనం, గంగె-జలపానం, మురారి అర్చనం ఈ మూడు చేసిన సాధకు నకుమృత్యుభయం లేదు. మృత్యువు యితడిని ప్రశ్నించేదిలేదు. ఇతడున్నూ మృత్యు వును ప్రశ్నించాల్సిందేమీ వుండదు. అనగా మృత్యువు విషయం అంతా ఇతడికి తెలిసి పోయే వుంటుందని అర్థం. మృత్యువును హిందువులు యముడంటారు. “యమ’’ నియమమే,నియమం: యముడంటే నియంత అని అర్థం అతడు అలా నియమం తప్పక జీవాన్ని చంపి తీసుకపోతాడు. కనుకనే సృష్టి యిలా జరుగుతూ వుంది. సృష్టి అంటే ఒకానొక సత్యపదార్థ భాగాన్ని చంపి అంటే స్థితిని మార్చి మరొకటి చెయ్యడం అన్నమాట, ఇలా ఆలోచిస్తే సృష్టి అంటే అది నిరంతర నాశనం (మార్పు ద్వారా) అని అర్థం.


ఈ మార్పు అనేది మృత్యువు రాజ్యంలోనే కలుగుతోంది. దీనిని అధిష్ఠానం ద్వారా తెలిసి కొంటాము. అనగా-శరీరం మనసు బుద్ధి ద్వారా యోగమార్గాన యీ మూడింటిని దాటిన స్థితికి పోయినప్పుడు యీ మార్పు కనబడదు. మృత్యువు దాటిన వాడవుతాడు. యముడైన వచ్చి పృచ్చించని స్థితికి వెళ్ళుతాడు. సందేహం లేదు.


ఈ శ్లోకం శ్రీ ఆనందగిరి రచియించినట్లు ప్రసిద్ధము.


*సశేషం*

🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...* 


*మోక్ష సాధన లో మొదటి మెట్టు..*


*(ఏడవ రోజు)*


శ్రీ స్వామి వారికి పదమూడు యేండ్లు వచ్చేసరికి కుటుంబసభ్యులకు ఆయన తత్వం అర్ధం కాసాగింది..ఈ బాలుడికి భక్తి మీద అనురక్తి వుందికానీ చదువు మీద ధ్యాస లేదని..ఆ వయసులోనే మాంసాహారం విడిచిపెట్టేసారు..కేవలం సాత్వికాహారం భుజించడం అలవాటు చేసుకున్నారు..కానీ..కాషాయం కట్టిన ప్రతి వారి దగ్గరా ఆధ్యాత్మిక బోధ చేయమని  అడగటం ప్రారంభించారు..అప్పుడు శ్రీ స్వామివారి పెద్దన్నయ్య గారు, దగ్గరకు పిలచి..కనపడ్డ ప్రతి వాడూ గురువు కాదనీ..ముందుగా దైవాన్ని ప్రార్ధించడం అలవాటు చేసుకోమని..మృదువుగా చెప్పారు..ఈ మాటలు శ్రీ స్వామివారి కి సూటిగా తగిలాయి..


ఎర్రబల్లె గ్రామం లోనే బాల్య వితంతువైన "యల్లకర లక్షమ్మ" అనే వృద్ధురాలు నిరంతర దైవ నామ స్మరణలో కాలం గడుపుతూ ఉండేది..ప్రతి నిత్యం నిష్ఠతో పూజ చేసేది..ఆధ్యాత్మిక గ్రంథాలలోని సారాన్ని గ్రహించిన లక్షమ్మ అహంకార రహితంగా  నిరాడంబరంగా జీవనం సాగించేది..ఆమె దృష్టిలో శ్రీ స్వామివారు పడ్డారు..మొదట కొంతకాలం పాటు శ్రద్ధగా ఈ బాలుడి గురించి పరిశీలించింది..ఆవిడకు ఈ బాలుడు సామాన్యుడు కాదనీ..సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడి అంశ ఇమిడినట్లుగా వున్న ఒకానొక దైవకళ ఇతనిలో ఉట్టిపడుతోందనీ గమనించింది..శ్రీ స్వామివారిని చేరదేసింది..శ్రీ స్వామివారికీ..తాను తల్లి ఒడిలోకి చేరినట్లు భావించారు..


మోక్ష సాధనకు ఆచరించవలసిన మార్గాలను లక్షమ్మ గారు శ్రద్ధతో శ్రీ స్వామివారికి బోధించింది..శ్రీ స్వామివారు తాను చెప్పిన విషయాలను ఆకళింపుచేసుకోవడమూ..ఒక్కమారు వినగానే హృదయస్తం చేసుకోవడమూ..తనకున్న అనుమానాలను వినయపూర్వకంగా అడిగి జవాబు తెలుసుకోవడమూ..చూసిన లక్షమ్మ గారికి..తన ఊహ సరైనదేనని..ఇక ఎక్కువ కాలం ఉపేక్షించుకుండా ఈ బాలుడిని సరైన ఆశ్రమం లో చేర్పించి..మరింతగా సాధన చేయిస్తే..అతను గురు స్థానం పొందుతాడనీ...అని నిర్ణయానికి వచ్చి..శ్రీ స్వామివారి కుటుంబ సభ్యులతో ఆమాటే చెప్పింది..


ఈ లోపల శ్రీ స్వామివారు రోజూ ధ్యానం చేయడం ప్రారంభించారు..తనకనువైన ప్రదేశం కనబడగానే..ధ్యానం లోకి వెళ్లిపోవడం మొదలెట్టారు..అది నిముషాలు కావొచ్చు..గంటలు కావొచ్చు..అలా నిశ్చలంగా కూర్చుండిపోయేవారు..ఎర్రబల్లె గ్రామస్థులలో కొందరు హేళన కూడా చేయసాగారు..శ్రీ స్వామివారు అవేమీ తనకు పట్టనట్టు వున్నా..కుటుంబసభ్యులకు మనస్తాపం కలుగుతుంది కదా..అప్పుడే లక్షమ్మ గారు, తన సలహాను శ్రీ స్వామివారి అన్నయ్యకు చెప్పారు..


చక్కటి రూపం తో ఉన్న తమ పిల్లవాడిని..సన్యాసిగా మార్చడం ఎవరికి ఇష్టం ఉంటుంది?..కానీ..ఈ బాలుడేమో అటు వ్యవసాయానికి..ఇటు చదువుకూ..రెండింటికీ పనికిరాకుండా పోతున్నాడు..సరే ఆఖరి ప్రయత్నంగా మెట్రీక్ పరీక్షకు కూర్చోబెడదామని..అది పాస్ అయితే..పై చదువులు చదివించి..తమ దారిలోకి తెచ్చుకుందామని అనుకుని..శ్రీ స్వామివారితో ఆమాటే చెప్పారు..తనకు ఈ లౌకిక చదువులమీద ఆసక్తి లేదనీ..తన మార్గం వేరనీ..తెగేసి చెప్పేసారు..లక్షమ్మ గారి సలహా ప్రకారం తానొక ఆశ్రమం లో చేరి..తన ఆధ్యాత్మిక సాధన ను మెరుగుపరచుకొని..మోక్ష మార్గాన్ని చూసుకుంటానని ఖరాఖండిగా తేల్చేసారు!..


ఇప్పటికిప్పుడు ఈ బాలుడిని అక్కున చేర్చుకునే ఆశ్రమం ఎక్కడ ఉంది?..ఈ ప్రశ్నకు కూడా లక్షమ్మ గారే జవాబు చూపించారు..శ్రీ కాళహస్తి సమీపంలోని "ఏర్పేడు" లోగల "వ్యాసాశ్రమం" లో చేర్చమని చెప్పారు..సరే నన్నారు..


వ్యాసాశ్రమంలో అడుగు పెట్టారు శ్రీ స్వామివారు..ఇంతకాలం ధ్యానం కోసం అటూ ఇటూ తిరిగిన శ్రీ స్వామివారికి..ఆ వ్యాసాశ్రమం తనకోసమే నిరీక్షిస్తున్నట్లు తోచింది..మనసులో తాను చేరవలసిన చోటుకే చేరాననే సంతోషం కలిగింది..ఇది తన ఆధ్యాత్మిక జీవన యానం లో మొదటి మజిలీ అని నిశ్చయనికొచ్చారు..తనకు ఈ మార్గం చూపిన లక్షమ్మ గారికి మనసారా నమస్కారం చేసుకున్నారు...


ఆశ్రమవాసం..ఆధ్యాత్మిక శిక్షణ!...రేపు...



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380. & 99089 73699).

సంపూర్ణ ఆరోగ్యం

 సంపూర్ణ ఆరోగ్యం సిద్దించుట కొరకు ఆయుర్వేద సూత్రాలు  - 


 *  ప్రాతఃకాలం నందే నిద్ర నుండి మేల్కొనవలెను . బ్రహ్మ ముహూర్తం సరైన సమయం . 


 *  ప్రాతఃకాలం నందు నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిని తాగవలెను దీనివలన మలమూత్రాలు సాఫీగా సాగును. 


 *  నిద్ర లేచిన వెంటనే మలమూత్ర విసర్జన చేయవలెను . మలమూత్రాలను బలంగా ఆపుట వలన రోగాలు సంప్రాప్తిస్తాయి .


 *  దంతధావనం నందు నాలుకను , దంతములను శుభ్రపరచుకోవలెను . నల్లతుమ్మ చెట్టు బెరడు కషాయం నోటి యందు క్రిములను తొలగించు గుణము కలదు 


 *  దంతముల పాచిని తొలగించుట కొరకు వనమూలికలతో చేసినటువంటి దంత చూర్ణంని వాడవలెను . చిగుళ్ల యందు వ్యాధులు ఏమైనా ఉన్నచో చిగుళ్లకు నువ్వులనూనె రాయవలెను . 


 *  స్నానానికి ముందు నువ్వులనూనెతో మర్ధించుకొని కొంతసేపు నీరెండలో ఉండవలెను . నువ్వులనూనె బదులు కొబ్బరినూనె లేదా ఆవాలనూనె వాడుకోవచ్చు . ఆవాల నూనె చాలా శ్రేష్టం . ఔషధ తైలాలు కూడా వాడవచ్చు . 


 *  శరీరంకి నూనె మర్దించుకొనుట వలన చర్మం మృదువుగా , కోమలంగా తయారగును. 


 *  కీళ్లు , కండరాలు కదలికలు మంచిగా జరుగును. 


 *  రక్తప్రసరణ మంచిగా జరుగును. చర్మం ద్వారా , మలపదార్థాలు త్వరగా తొలగించబడును. 


 *  వ్యాయమం చేయవలెను . 


 *  స్నానం గొరువెచ్చటి నీటితో చేయవలెను .


 *  గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వలన జఠరాగ్ని పెరుగును . రోమకూపములు , స్వేదరంధ్రములు , చర్మము శుభ్రపరచబడి శరీరం నిర్మలంగా ఉండును. 


 *  నివశించే ప్రదేశముని బట్టి, కాలం మరియు అలవాట్లని అనుసరించి ఆహారం నిర్ణయించవలెను . తీపి , పులుపు , ఉప్పు, కారం , చేదు , వగరు అను ఆరు రుచులు కలిగి ఉండు ఆహారముని తీసుకొనవలెను . 


 *  జీర్ణశక్తికి అనుకూలంగా ఉండు ఆహారముని నిర్ణయించుకొని తీసికొనవలెను . 


 *  భోజనం చేయుటకు 10 - 15 నిమిషములు ముందు పచ్చి అల్లం ముక్కలను కొద్దిగా ఉప్పుతో కలిపి తినవలెను . 


 *  గట్టిగా ఉండు పదార్థాలను బాగుగా నమిలి తినవలెను . 


 *  సాధ్యం అయినంత వరకు ఆహారసేవన తరువాత పెరుగు లేదా మజ్జిగ సేవించవలెను .


 * బాగుగా చల్లగా , వేడిగా ఉన్నటువంటి ఆహారపదార్థాలు తీసుకోరాదు . 


 *  ఆహారం తినుటకు 15 నిమిషాల లోపు నీరు తీసుకోరాదు . తిన్నవెంటనే అధిక మోతాదులో నీటిని తీసుకోరాదు . మధ్యమధ్యలో కొంచం కొంచం నీటిని తీసుకోవచ్చు . 


 *  ఆలస్యముగా జీర్ణం అయ్యేటువంటి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోరాదు 


 *  భోజనం చేసిన వెంటనే అధిక శ్రమ చెయ్యరాదు . భోజనం చేసిన వెంటనే కొంత సమయం విశ్రాంతి తీసికొనవలెను . 


 *  తూర్పు , దక్షిణం వైపు తల యుంచి నిద్రించవలెను .


 *  నిదురించే గది అత్యంత స్వచ్ఛముగా గాలి వీచే విదముగా ఉండవలెను . 


 *  నిద్రించే మంచం ఎత్తు , వంపులు లేకుండా స్థిరంగా ఉండవలెను . 


 *  గది వాతావరణం దుష్ప్రభావం లేకుండా ఉండవలెను . 


 *  మెదడుని ఉత్తేజిత పరుచు పనులు అనగా గట్టిగా చదువుట , ఆలోచించుట , మద్యపానం , కాఫీ, టీలు సేవించుట మొదలగు వాని తరువాత వెంటనే పడుకోరాదు . 


 *  రోజుకి కనీసం 7 గంటలు నిద్రించవలెను . 


 *  పగటినిద్ర మంచిది కాదు కేవలం ఎండాకాలం నందు మాత్రమే పగటి సమయం నందు నిద్రించవలెను . 


 *  నింద్రించుటకు ముందు అరికాళ్లకు , అరచేతులకు తైలం మర్దించుట వలన కలలు నియంత్రించబడును . అనగా పీడకలలు నియంత్రించబడును. 


 *  అధికంగా మైథునం చేయుట వలన శరీరముకు హాని కలుగును. దీనివలన క్షయ మొదలగు వ్యాధులు కలుగును .


 *  మైథునం రాత్రి మొదటి భాగం నందు చేయుట ఉత్తమం . తగినంత విశ్రాంతి లభించును. 


 *  అసహజ మైధున కర్మలు రోగాలకు మూలకారణం . 


 *  వ్యాధులకు చికిత్స తీసుకునే సమయంలో మైధున ప్రక్రియ నిలిపివేయవలెను . లేనిచొ శరీర రోగ నిరోధక శక్తి సన్నగిల్లును. 


 *  మూత్రము ఆపుట వలన మూత్రము పోయుటలో బాధ కలుగును. మూత్రములో రాళ్లు ఏర్పడును . మూత్రాశయం యొక్క కండరాలు పటుత్వము కోల్పోవును. మూత్రమార్గంలో వాపు , మంట కలుగును.  అందువలన బలవంతంగా మూత్రాన్ని ఆపరాదు . 


 *  మలవిసర్జన ఆపుట వలన కడుపులో నొప్పి , కడుపుబ్బరం , అజీర్ణం , అపానవాయువులు , తలనొప్పి , కడుపులో పుండ్లు  వంటి సమస్యలు మొదలగును . కావున మలవిసర్జన ఆపకూడదు.


 *  శుక్రం బయల్పడే సమయంలో నిరోదించినచో శుక్రం గడ్డలు గడ్డలుగా రావటం వృషణాలలో నొప్పి , సంభోగం చేయు సమయంలో నొప్పి కలుగును. కావున శుక్ర వేగాన్ని నిరోధించరాదు . 


 *  వాంతిని ఆపుట వలన దద్దుర్లు , తలతిరగడం , రక్తహీనత , కడుపులో మంట , చర్మరోగాలు మరియు జ్వరం కలుగును . కావున వాంతులను బలవంతంగా అపరాదు. 


 *  తుమ్ములను ఆపుట వలన జలుబు , ముక్కునుండి అదేపనిగా నీరు కారే పీనస రోగం , తలనొప్పి , పార్శ్వపు నొప్పి మొదలగు సమస్యలు కలుగును. ముక్కులో ఉండు మలినాలు , అనవసర పదార్థాలను తొలగించుటకు సహాయపడతాయి. తుమ్ములను బలవంతంగా ఆపరాదు . 


 *  త్రేపులను ఆపడం వలన ఎక్కిళ్లు , ఛాతిలో నొప్పి , దగ్గు , ఆకలి మందగించడం , రుచి లేకపోవుట మొదలగు సమస్యలు సంభంవించును. 


 *  ఆవలింతలు ఆపుట వలన కండ్లు , గొంతు , చెవి , ముక్కు సంబంధ వ్యాధులు ఉత్పన్నం అగును . 


 *  ఆకలి , దప్పిక శరీరంకు కావలసిన పోషకాంశాలు మరియు నీటి ఆవశ్యకత ని తెలియచేస్తాయి . వీటిని అతిగా ఆపుట వలన శరీరంకు అందవలసిన పోషకాలు అందక శరీరం క్షీణించిపోతుంది. శరీరం కావాల్సిన రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల సాంక్రమిక వ్యాధులు సంభవిస్తాయి . శరీరం పొడిగా మారును . 


 *  కన్నీటిని ఆపుట వలన  మనసిక వ్యాధులు , ఛాతిలో నొప్పి , తలతిరుగుట మరియు జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి . 


 *  శ్వాసప్రక్రియని ఆపుట వలన శ్వాసకోశ వ్యాధులు , గుండెజబ్బులు కలిగి మనిషి ని ఉక్కిరిబిక్కిరి చేయును . ఒక్కోసారి మరణం కూడా కలుగును. 


 *  నిద్రని ఆపుట వలన నిద్రలేమి , మానసిక వ్యాధులు , జీర్ణకోశ వ్యాధులు , మరియు జ్ఞానేంద్రియ వ్యాధులు సంభంవించును. 


          పైన చెప్పిన వాటిని అధారణీయ వేగాలు అని ఆయుర్వేదంలో పిలుస్తారు . ఇవి మొత్తం 13 రకాలు గా విభజించారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా ఆపరాదు . 


  ఈ నియమాలు నిబద్ధతతో పాటించటం వలన అనారోగ్యాలు కలగకుండా చూసుకోవచ్చు. 


మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

శనివారం*🍁 🌹 *16, నవంబరు, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 

         🍁 *శనివారం*🍁

🌹 *16, నవంబరు, 2024*🌹

       *దృగ్గణిత పంచాంగం*


*స్వస్తి శ్రీ క్రో ధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః* 

*కార్తీకమాసం - కృష్ణపక్షం*


*తిథి     : పాడ్యమి* రా 11.50 వరకు ఉపరి *విదియ*   

*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )

*నక్షత్రం  : కృత్తిక* రా 07.28 వరకు ఉపరి *రోహిణి*


*యోగం  : పరిఘ* రా 11.48 వరకు ఉపరి *శివ*

*కరణం  : బాలువ* ప 01.21 *కౌలువ* రా 11.50 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 10.30 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *సా 05.19 - 06.45*

అభిజిత్ కాలం  : *ప 11.29 - 12.15*


*వర్జ్యం         : ఉ 08.41 - 10.08*

*దుర్ముహూర్తం  : ఉ 06.12 - 07.42*

*రాహు కాలం  : ఉ 09.02 - 10.27*

గుళికకాళం      : *ఉ 06.12 - 07.37*

యమగండం    : *మ 01.17 - 02.42*

సూర్యరాశి : *తుల/వృశ్చికం* 

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 06.12*

సూర్యాస్తమయం :*సా 05.33*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.12 - 08.28*

సంగవ కాలం    :*08.28 - 10.44*

మధ్యాహ్న కాలం  :*10.44 - 01.00*

అపరాహ్న కాలం : *మ 01.00 - 03.16*

*ఆబ్ధికం తిధి : కార్తీక బహుళ పాడ్యమి*

సాయంకాలం :  *సా 03.16 - 05.33*

ప్రదోష కాలం  :  *సా 05.33 - 08.05*

రాత్రి కాలం      :  *రా 08.05 - 11.27*

నిశీధి కాలం       :*రా 11.27 - 12.18*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.31 - 05.22*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం.....!!*


దివ్యాంగరాగపరిచర్చిత-కోమలాంగ

పీతాంబరావృతతనో తరుణార్క-దీప్తే

సత్కాంచనాభ-పరిధాన-సుపట్టబంధ

శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్


      🙏 *ఓం నమో వెంకటేశాయ*🙏

********************************

       🍁 *జై హనుమాన్*🍁


ధర్మోద్ధారక హనుమంత

రామకార్యదక్ష హనుమంత

జయ బజరంగబలి 

జయజయ జయ బజరంగబలి


           🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

పంచాంగం 16.11.2024

 ఈ రోజు పంచాంగం 16.11.2024

Saturday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు కార్తీక మాస కృష్ణ పక్ష ప్రతిపత్తి తిథి స్థిర వాసర: కృత్తిక నక్షత్రం సరిఘ యోగః: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00  వరకు.



శుభోదయ:, నమస్కార:

సన్నిహితమ్ముగా మెలగి

 ఉ.సన్నిహితమ్ముగా మెలగి సంపద నంతయు కొల్లగొట్ట నా

పన్నుల వోలె చేరుదురు స్వార్థ విశేష కుయుక్తి, దుర్జనుల్

పన్ను వినాశ కృత్యము లపార విచక్షణతో నెఱుంగ లే

కున్నను జీవనమ్మది మహోగ్రతరమ్ము నరిష్ట హేతువౌ !౹౹ 21


శా.నిన్నే నమ్మితి నీవె సర్వము సుమా!నీకండగా నుండెదన్

నిన్నే నా యిలవేల్పుగాఁ దలచెదన్ నేస్తమ్ము నీవంచు నె

న్నెన్నో నీతులు వల్లె వేసి తమదౌ 'యీప్సల్' ఫలింపన్ సదా 

ఎన్నో ద్రోహము లెంచి చేయుదురిలన్ హీనాత్ములై దుర్జనుల్! ౹౹22

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  - ప్రతిపత్ - కృత్తిక -‌‌ స్థిర వాసరే* (16.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*