15, డిసెంబర్ 2023, శుక్రవారం

Jokes









 

Panchaag


 

⚜ శ్రీ భూతేశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 270


⚜ హర్యానా : జింద్


⚜ శ్రీ భూతేశ్వర ఆలయం



💠 హర్యానా గొప్ప మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం, ఎందుకంటే ఇది కొన్ని పురాతన తీర్థయాత్ర స్థలాలను కలిగి ఉంది.  అసంఖ్యాకమైన శివుని ఆలయాలను దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు మరియు భక్తులు భారీ సంఖ్యలో ఈ రాష్ట్రానికి తరలివస్తారు. 


💠 హర్యానాలోని జింద్‌లో ఉన్న భూతేశ్వర్ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి.  

భూతేశ్వర మందిర్ జింద్ చరిత్ర మహాభారత కాలం నాటిదని చెబుతారు.

హర్యానా రాష్ట్రంలో 'జింద్' జిల్లాలో వుందీ ప్రాచీన మందిరం. ఈ జిల్లా కేంద్రం పానిపటికి దగ్గరలో ఉంటుంది. 


💠 రాజా రఘువీర సింహుడు ఈ మందిరాన్ని కట్టించాడని చెబుతారు. 

ఈ రాజు ఏ కాలానికి చెందినవాడో తెలుపుటకు చారిత్రక ఆధారాలు లేవు. 

ఆలయానికి ఆనుకున్నట్లుగా 'రాణితాలాబ్' అనే ఓ సరస్సు ఉంది. 


💠 ఈ ఆలయాన్ని సెలవు దినాల్లో భక్తుల రద్దీ ముంచేస్తుంది. ఇవి కాకుండా హరి కైలాస మందిరం, జ్వాలా మాలేశ్వర తీర్థం, సూర్య కుండం అనే ఈ సరస్సులిక్కడి ఇతర దర్శనీయ ప్రాంతాలు.



💠 ఈ ఆలయం  చుట్టూ పెద్ద నీటి కొలను ఉంది మరియు భూతేశ్వర ఆలయం రాణి తలాబ్‌గా కూడా గుర్తించబడటానికి కారణం.  'త-ల్యాబ్' అనే పదం హిందీ పదం, 

దీని అర్థం చెరువు.



💠 భూతేశ్వర్ ఆలయం చుట్టూ చెరువులు నిర్మించబడ్డాయి, ఈ చెరువులను 'రాణి తలాబ్' అని కూడా పిలుస్తారు. రాణి తలాబ్ వెనుక ఉన్న పురాణం ఏమిటంటే,..


 💠రాజు ఇక్కడ చెరువుతో పాటు  ఆ చెరువును ప్యాలెస్‌కి కలిపే సొరంగాన్ని కూడా నిర్మించాడు. 

ఈ సొరంగం చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే, రాణి స్నానం చేసిన తర్వాత ప్రజల దృష్టికి రాకూడదు మరియు నేరుగా రాజభవనంలోకి ప్రవేశించవచ్చు.


💠 రాజు రణబీర్ సింగ్ రాణి ప్రతిరోజూ రాత్రి స్నానం చేయడానికి చెరువును సందర్శించేదని చెబుతారు.  ఈ కారణంగా, ఈ తేదీ వరకు, ఈ ప్రదేశం రాణి తలాబ్‌గా ప్రసిద్ధి చెందింది.


💠 మరొక ప్రసిద్ధ జానపద కథనం ప్రకారం..

ఈ ఆలయ చెరువు  నిర్మాణం యొక్క ప్రధాన లక్ష్యం రాజు యొక్క వివిధ రాణులకు తగిన స్నాన ప్రదేశాన్ని అందించడం.  

ఈ ప్రదేశానికి రాణి తలాబ్ అని పేరు పెట్టడానికి ఈ ప్రత్యేక కారణం కూడా ఒకటిగా పరిగణించబడుతుంది.  

తలాబ్ అనే హిందీ పదం చెరువును సూచిస్తుంది.  

అందువల్ల, ఈ ప్రదేశం రాణి తలాబ్‌గా ప్రసిద్ధి చెందింది.


💠 ఈ చెరువులో నేటికి యాత్రికులు మరియు భక్తులు పవిత్రమైన స్నానం చేయడానికి పవిత్ర జలం ఉంది.

 

💠 పురాతన కాలం నాటి నిర్మాణ నైపుణ్యానికి ఈ ఆలయం నిదర్శనం.  ఆలయ నిర్మాణ రూపకల్పన అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను పోలి ఉంటుంది.


💠 భూతేశ్వర్ యొక్క ప్రధాన విగ్రహం, లార్డ్ మహాదేవ్ యొక్క అభివ్యక్తి ప్రత్యేకమైనది మరియు అసాధారణమైనది.  

తెల్లని రాళ్లతో నిర్మితమైన ఈ దేవతా విగ్రహం మానవ ముఖంతో ఉంటుంది.  

అంతే కాకుండా భగవంతుని ప్రధాన ఆయుధమైన త్రిశూలం దేవత పక్కనే బలంగా నిలుస్తుంది.  ఇది బంగారు రంగులో ఉంటుంది.


💠 ఇక్కడ మహా శివరాత్రి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.  ఈ ఆలయంలో భక్తులు మరియు యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తారు.

ఇది కాకుండా కార్తీక పూర్ణిమ, నవరాత్రి మరియు దీపావళి పండుగలు కూడా ఈ ఆలయంలో చాలా ఘనంగా జరుపుకుంటారు.

శ్రావణ మాసంలో శివరాత్రి మరియు ఫాల్గుణ మాసంలో మహాశివరాత్రి నాడు ఇక్కడ జాతర నిర్వహిస్తారు.


💠 భూతేశ్వర్ మందిర్ నుండి సమీప రైల్వే స్టేషన్ జింద్ రైల్వే స్టేషన్, ఇది ఈ ఆలయానికి 4.3 కి.మీ దూరంలో ఉంది.

హిందూ ధర్మం"

 నమస్తే

"హిందూ ధర్మం" ఆధ్యాత్మిక టీవీ చానెల్ లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా హైదరాబాద్ ఆఫీస్ లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న యువతీయువకులు సంప్రదించండి

........

వేద ఆశీర్వచనం.

:

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శరీర త్యాగానికి సన్నద్ధం..*


*(యాభై ఎనిమదవ రోజు)*


శ్రీ స్వామివారి ధ్యాసంతా సజీవ సమాధి చెందడం మీదే ఉన్నది..పదే పదే శ్రీధరరావు దంపతులతో ఆ మాటే చెప్పడం..వాళ్ళు నిరాకరించడం జరుగుతోంది..కానీ శ్రీ స్వామివారు మాత్రం ఒకమాట స్పష్టం చేయసాగారు..సజీవ సమాధి జరిగినా జరుగకపోయినా.. తన అంత్యకాలం సమీపించిందనీ..తాను ఈ శరీరం విడిచిపెట్టక తప్పదని..


శ్రీధరరావు గారు శ్రీ చెక్కా కేశవులు గారికి, మీరాశెట్టి గారికి కబురు పెట్టి పిలిపించారు.. వారు మొగలిచెర్ల కు  చేరుకున్న తరువాత..శ్రీధరరావు దంపతులు..తమతో శ్రీ స్వామివారు వెలిబుచ్చిన కోరికను గూర్చి తెలియచేసి..ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని అడిగారు..వాళ్లిద్దరూ కూడా తాము ఒకసారి శ్రీ స్వామివారితో మాట్లాడతామని..తాము శ్రీ స్వామివారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తామని తెలిపారు..శ్రీధరరావు గారు అప్పటికప్పుడే గూడు బండి సిద్ధం చేయించి..కేశవులు గారిని, మీరాశెట్టి గారినీ శ్రీ స్వామివారి వద్దకు పంపారు..


శ్రీ స్వామివారు తన మనోభీష్టాన్ని వారికి తెలియచేసి..తనను సజీవ సమాధి చేయడానికి సహకరించమని కోరారు..కేశవులు గారు కొద్దిగా అసహనంతో.."స్వామీ!..మీరు ఇలా మంకు పట్టు పడితే ఎలా?..మీలాటి వారు ఉండబట్టే మాలాటి వాళ్లకు ఆధ్యాత్మిక భావనలు కలుగుతున్నాయి..మీ తపస్సుకు ఇబ్బంది లేకుండా ఇక్కడికి మల్లె..మా ఇంటివద్ద  అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను..విజయవాడ వచ్చి కొద్దిరోజుల పాటు వుండండి.. మాలాంటి వారికి బోధ చేయండి..మీకూ మార్పు ఉంటుంది.." అని ఎంతో దూరం చెప్పారు..మీరాశెట్టి గారు కూడా సౌమ్యంగా నచ్చచెప్పబోయారు..


శ్రీ స్వామివారు ఇద్దరి మాటలూ శ్రద్ధగా విన్నారు..వింటున్నంత సేపూ ప్రశాంతంగా వున్నారు..వాళ్ళు చెప్పడం ఆపైన తరువాత..ఆశ్రమ వరండా లో పద్మాసనం వేసుక్కూర్చుని..


"ఇద్దరూ వినండి..నేను ఏదో తమాషా చేద్దామని సజీవ సమాధి ప్రస్తావన తీసుకురాలేదు..మీరందరూ నా తపోసాధనకు ఎంతో భక్తి తో సహకరించారు..నానుంచి మీరు ఆశించింది కూడా ఏమీ లేదు..నిజానికి ఈ మీరాశెట్టి కి సంతాన యోగం లేదని ముందుగానే నేను చెప్పినా..తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధి గా చేసాడు..కేశవులు గారూ మీరూ అంతే!..ఇక ఆ దంపతుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు..మీకూ తెలుసు..కానీ మీరందరూ ఒక్క విషయాన్ని దాట వేస్తున్నారు..అది నా ఆయుర్దాయం గురించి..నాకు ఆయుష్షు కొద్దికాలమే ఉన్నది..అది పూర్తయితే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి..అది విధి నిర్ణయం..మీరు ఊహిస్తున్నది నేనేదో బలవంతంగా సజీవ సమాధి పేరుతో ఆత్మత్యాగం చేయబోతున్నానని..అది నిజం కాదు..దైవం నాకు నిర్దేశించిన గడువులోపల నా తపస్సు పూర్తి చేసుకోవాలి..ఆ తరువాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు.."


"ఇక బోధల గురించి...శరీరం తోనే బోధ చేయాలనే నియమేమీ లేదు..అలా అనుకుంటే..కాలగర్భంలో కలిసిపోయిన మహనీయులందరూ నేటికీ శరీరధారులై ఉండాలి..నేను సమాధి చెందిన తరువాత నా సమాధి నుండే మీకు సమాధానం వస్తుంది..ఈ ఆశ్రమం క్షేత్రంగా మారుతుంది..ఎందరికో వారి వారి బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఇక్కడ..సంతానహీనులు సంతానాన్ని పొందుతారు..మానసిక రుగ్మతలు తొలగిపోతాయి..దుష్టగ్రహపీడలు నశిస్తాయి.."


"మీరు మనస్ఫూర్తిగా నా సజీవ సమాధి కి ఇష్టపడకపోతే..నేను ప్రత్యామ్నాయం చూసుకుంటాను..దైవ ధిక్కారం చేయను..చేయలేను.." అన్నారు నిర్వికారంగా చూస్తూ..


శ్రీ స్వామివారి మాటలు విన్న కేశవులు, మీరాశెట్టి గార్లు..ఇక చేసేదేమీ లేక..సెలవు తీసుకొని తిరిగి శ్రీధరరావు గారింటికి చేరారు..శ్రీధరరావు ప్రభావతి గార్లతో తమ సంభాషణ అంతా చెప్పారు..తాము ఎట్టి పరిస్థితుల్లో శ్రీ స్వామివారిని సజీవంగా సమాధి చేయరాదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు..


కానీ అక్కడ శ్రీ స్వామివారు తన ఏర్పాట్లలో తాను ఉన్నారనే విషయం వీళ్లకు తెలియదు..తాము ఒప్పుకోలేదు కనుక, శ్రీ స్వామివారు సజీవ సమాధి  ఆలోచనను మానుకొని..తపస్సు చేసుకుంటూ వుంటారులే !..అనే భ్రమలో వున్నారు..


సోదరుడు పద్మయ్య నాయుడు కి సూచనలు..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)

[


*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం  -‌ తృతీయ -  పూర్వాషాఢ  & ఉత్తరాషాఢ -‌ భృగు వాసరే* (15.12.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/CXVoFOgq1xw?si=DqmOWjy6llJOGWCr


.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

*శ్రీ స్వామివారి సమాధానం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శ్రీ స్వామివారి సమాధానం..అహం నిర్మూలనం..*


*(యాభై ఏడవ రోజు)*


ప్రభావతి గారికి తేలుకుట్టి ఆవిడ బాధపడుతున్న విషయాన్ని విన్న స్వామివారు కొంత సేపు మౌనంగా వున్నారు..శ్రీ స్వామివారు ఏదైనా మంత్రం వేస్తారేమోనని ఎదురుచూస్తున్న వ్యక్తికి ఏమీ పాలుపోక.."స్వామీ..అక్కడ అమ్మగారు బాధపడుతున్నారు..మీరేదైనా మంత్రం వేస్తారేమోనని నేను ఇటు వచ్చాను.." అన్నాడు..


శ్రీ స్వామివారు అత్యంత చిరాగ్గా ముఖం పెట్టి.."నేను మంత్రాలు తంత్రాలు వేసేవాడిలాగా కనబడుతున్నానా?..ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి..నేను గారడీలు చేయను!..వెంటనే నువ్వెళ్ళి అమ్మను భగవన్నామాన్ని విడవకుండా చేసుకోమని చెప్పు.." అన్నారు..


ఆ వచ్చిన మనిషికి ఈ జవాబు రుచించలేదు..పైగా తానింతదూరం వస్తే..ఈరకంగా విసుక్కుంటాడా ఈయన..అని కోపం వచ్చి..వెనక్కు తిరిగి మొగలిచెర్ల వచ్చి శ్రీధరరావు గారితో శ్రీ స్వామివారు అన్న మాటలు పూసగుచ్చినట్టు చెప్పేసాడు.."వెళ్లొద్దంటే విన్నావు కాదు నాయనా!.." అన్నారు శ్రీధరరావు గారు..


ఆ రాత్రంతా ప్రభావతి గారు బాధపడ్డారు..మరుసటి రోజు సాయంత్రానికి పూర్తిగా నొప్పి తగ్గి..మామూలుగా మారారు..ఆ ప్రక్కరోజు శ్రీ స్వామివారి దగ్గరకు గూడు బండిలో వెళ్లారు..శ్రీ స్వామివారు ఉల్లాసంగా వున్నారు..వీళ్ళను చూడగానే..

"అమ్మా!..నొప్పి తగ్గిందా?.." అన్నారు..


"తగ్గింది నాయనా!..కానీ ..పాపం మీ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి ని నిరాశ పరచకుండా ఏదో ఒక మంత్రం చెప్పి పంపకపోయారా?..నా బాధ నేను ఓర్చుకుంటాను..కానీ..ఈలోకం ఏమనుకుంటుంది?..స్వామివారికి ఏ మహిమలూ లేవని అనుకుంటుంది.." అన్నారు ప్రభావతి గారు..


శ్రీ స్వామివారు పక పక మని నవ్వి.."అమ్మా..అంతమంది చేత పొగిడించుకునేసరికి నీకు అహం తన్నువచ్చిందమ్మా..అది తగ్గడానికి భగవంతుడు ఈ ఏర్పాటు చేశాడు..నువ్వు ఒకరోజంతా కుయ్యో మొర్రో అని బాధపడ్డావు..అప్పటికి నీ అహం తాలూకు పాప ప్రక్షాళన జరిగింది..నేను భగవన్నామాన్ని చేసుకోమని చెప్పి పంపింది ఎందుకనుకున్నావు?..అదొక్కటే సర్వబాధలను నివారించేది!.. అని నీకు తెలియడం కోసం..ఇక ఆ వచ్చిన వాడు నిరాశపడ్డాడని అనుకున్నావా?..నిజమే..నిరాశపడ్డాడు.. కానీ ఒక్కటి గమనించు..ఈరోజు నీకు తేలు కుట్టింది..నేను నా మహిమతో దానిని తగ్గించాను..రేపు మరొకరికి..ఆప్రక్కరోజు..ఇంకొందరు..ఇలా వరుసపెడతారు.. నేను గారడీలు చేసుకుంటూ..మంత్రాలు వేసుకుంటూ దుకాణం పెట్టుకోవాలి..ఇక నాకు తపస్సు సాగినట్లే!..అమ్మా..ఈ చమక్కుల కోసం నేను ఇక్కడికి రాలేదు..నేను ఏ మహిమలూ చూపను..నన్ను విమర్శించినా..నా లక్ష్యం మాత్రం మోక్ష సాధనే!..మీకు పదే పదే చెపుతున్నాను..నేను వచ్చిన కార్యం పూర్తవబోతోంది..ఇంక ఎక్కువ సమయం లేదు..నన్ను సజీవ సమాధి చేయడానికి ఏర్పాట్లు చేయండి..ఈ శరీరం ఎక్కువకాలం ఉండదు.." అన్నారు..


ప్రభావతి శ్రీధరరావు గార్లు..మళ్లీ సజీవ సమాధి అని చెపుతున్నారు శ్రీ స్వామివారు అని మథన పడి.."నాయనా!..మేమూ చెపుతున్నాము..వినండి!..మా చేతులతో ఆ పని చేయలేము..పోనీ మీకు ఉపదేశం చేసిన మీ గురువుగారు "బాలబ్రహ్మం " గారిని ఇక్కడకు పిలుచుకుని వస్తాము..వారి ద్వారా మీకు చెప్పించే ఏర్పాటు చేస్తాము.." అన్నారు..


"వద్దు!..వద్దు!..గురువుగారిని పిలుచుకురావొద్దు..కానీ నా కాలపరిమితి పూర్తవుతున్నది.. ఎవరొచ్చినా సమయం పూర్తయ్యే నాటికి నేను వెళ్లిపోవాల్సిందే..ఆయనను ఇబ్బంది పెట్టడం మినహా మరో ప్రయోజనం లేదు!.."అన్నారు..


"మరొక్కసారి ఆలోచించండి!..మీలాటి వారి అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది.." అని చెప్పి ఆ దంపతులు శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చేసారు..


శరీర త్యాగానికి సన్నద్ధం..రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 9908973699).

పరమోపకారక మిదం

 31

నాలం వా ? పరమోపకారక మిదం త్వేకం పశూనాంపతే 

పశ్యన్  కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్

సర్వామర్త్య పలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం

నిక్షిప్తం గరళం గళేన గళితం నోద్గీర్ణమేవ త్వయా  



సీ. అమర దానవ మానవాది గణమ్ములు

               భయమంది నలుదిశల్ పాఱిపోవ

     నావిర్భవించిన హాలాహలంబును

               గ్రహియించినాడవు కరుణతోడ

     బాహ్యలోకంబులన్ పరిరక్షణము సేయ

               నుంచితే గరళమ్ము నోటియెందె

     యుదరకుహరమందు నుండెడి లోకముల్

              కాలకూటమ్ముచే కాలుననుచు

     గళమందె నునిచియు కడునేర్పుతోడను

              సర్వలోకములను సాకితీవు

తే. ముజ్జగంబుల పాలించి మోదమిచ్చు

     భవ్య పరమోపకారక భావమునకు

     నింతకంటెను ఋజువింక , నెఱుగ గలదె !

     భక్త రక్షక శంకరా ! పార్వ తీశ !             31

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 6*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 2*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*మత్స్యవతార వర్ణనము - 2*


కో భవాన్ననువై విష్ణుర్నారయణ నమోస్తుతే | మాయయా మోహయసి మాం కిమర్థం త్వ జనార్దన. 10


"నీ వెవరవు? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా! నీకు నమస్కారము. జనార్థనా! మాయచేత నీవు నన్నీవిధముగ ఏల మోహపెట్టుచున్నావు?"


మనునోక్తో7బ్రవీన్మత్స్యో మనుం వై పాలనే రతమ్‌ | అవతీర్ణో భవాయాస్య జగతో దుష్టనష్టియే. 11


మన వీ విధముగా పలుకగా ఆ మత్స్యము ప్రజలకు పాలించుట యందు ( లేదా తనను రక్షించుటయందు) ఆసక్తి గల ఆతనితో ఇట్లనెను- "ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింపచేయటకును అవతరించినాను".


సప్తమే దివసే త్వబ్ధిః ప్లావయిష్యతి వై జగత్‌ | ఉపస్థితాయాం నావి త్వం బీజాదీని విధాయ చ. 12


సప్తర్షిభిః పరివృతో నిశాం బ్రాహ్మీం చరిష్యసి | ఉపస్థితస్య మే శృఙ్గే నిబధ్నీహి మహాహినా. 13


"(నేటినుండి) ఏడవ దివసమున సముద్రము ఈ జగత్తును ముంచివేయును. అపుడు నీదగ్గరకు వ్చచిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షిసమేతుడవై బ్రహ్మనిద్రించు రాత్రి అంతయు సంచరింపగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టి వేయుము".


ఇత్యుక్త్వాన్తర్దధే మత్స్యోమనుః కాలప్రతీక్షకః | స్థితః సముద్ర ఉద్వేలే నావమారురుహే తదా. 14


ఇట్లు పలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా అపుడు నావను ఎక్కెను.


ఏకశృఙ్గధరో మత్స్యో హైమో నియుతమోజనః | నావం బబన్ధ తచ్ఛఙ్గే మత్స్యాఖ్యం చ పురాణకమ్‌ . 15


శుశ్రావ మత్స్యాత్పపఘ్నం సంస్తువన్‌ స్తుతిభిశ్చ తమ్‌ |


ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములు గల బంగారు మత్స్యము (వచ్చెను). దాని కొమ్మునకు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మాత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను.


బ్రహ్మవేద ప్రహర్తారం హయగ్రీవం చ దానవమ్‌. 16


అవధీద్వేదమన్త్రాద్యాన్పాలయామాస కేశవః | ప్రాప్తే కల్పేఅథ వారాహే కూర్మరూపోఅ భవద్దరిః. 17


ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే మత్స్యావతారో నామ ద్వితీయోధ్యాయః.


కేశవుడు బ్రహ్మనుండి వేదములను అపహరించిన హయగ్రీవు డను దానవుని సంహరించి వేదమంత్రాదులను రక్షించెను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారం ధరించెను.


*అగ్ని మహాపురాణములో మత్స్యావతారమను ద్వితీయాధ్యాయము సమాప్తము.*

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 5*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 2*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

*మత్స్యవతార వర్ణనము*


*వసిష్ఠ ఉవాచ :*


మత్స్యాదిరూపిణం విష్ణుం బ్రూహి సర్గాదికారణమ్‌ | పురాణం బ్రహ్మ చాగ్నేయం తథా విష్ణోః పురా శ్రుతమ్‌. 1


మత్స్యవతార వర్ణనము


విశిష్ఠుడు పలికెను: మత్స్యాదిరూపములను ధరించినవాడును, సృష్ట్యాదులకు కారణమైనవాడును అగు విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువునుండి వినిన విధమున అగ్నేయపురాణమును గూర్చియు, బ్రహ్మను గూర్చియు (లేతా అగ్నేయ పురాణరూప మగు వేదమును) చెప్పుము.


అగ్నిరూవాచ ః


మత్స్యావతారం వక్ష్యేఅహం వసిష్ఠ శృణు వై హరేః | అవతార క్రియా దుష్టనష్ట్యై .సత్పాలనాయ హి 2


అగ్ని పలికెను ః వసిష్ఠా! విష్ణువు ధరించిన మత్స్యావతారమును గూర్చి చెప్పదను; వినుము, అవతారములు ధరించుట దుష్టనాశము కొరకును, శిష్టపాలనముకొరకును జరుగుచుండను కదా?


ఆసీదతీతకల్పానై బ్రహ్మోనైమిత్తికో లయః | సముద్రోపప్లుతా స్తత్ర లోకా భూరాదికా మునే. 3


ఓ మునీ! గడచిన కల్పము చివర బ్రహ్మ నిద్రించుట అను నిమిత్తముచే ప్రలయ మేర్పడెను. అపుడు భూలోకాదు లన్నియు సముద్రములో మునిగిపోయినవి.


మనుర్వైవస్వతస్తేపే తపో వై భుక్తిముక్తేయే | ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణమ్‌.

తస్యాఞ్జల్యుదకే త్యల్పో మత్స్య ఏకోఅభ్యపద్యత|


వైవన్వతమనుపు భక్తిముక్తుల నపేక్షించి తపస్సుచేసెను. ఒకనా డాతడు కృపతమాలా నదిలో జలతర్పణము చేయుచుండగా అతని దోసిలిలోని జలములో ఒక చిన్న చేపపిల్ల కనబడెను.


క్షేప్తుకామం జలే ప్రాహ న మాం క్షిప నరోత్తమ.

గ్రాహాదిభ్యో భక్షయం మేఅత్ర తచ్ఛ్రుత్వా కలశేఅక్షిపత్‌ |


ఆ రాజు దానిని నీటిలో పడవేయ దలచుచుండగా అది అతనితో - ''మహారాజా! నా కీ జలములో మొసళ్ళు మొదలగువాటినుండి భయ మున్నది. అందుచే దీనిలో పడవేయకుము" అని పలికెను. అది విని అతడు దానిని కలశములో ఉంచెను.


స తు వృద్ధః పునర్మత్స్యః ప్రాహ తం దేహి మే బృహత్‌ . 6


స్థానమేతద్వచః శ్రుత్వా రాజాథోదఞ్చనేఅక్షిపత్‌ |


ఆ మత్యృము పెద్దదిగా అయి రాజుతో "నాకొక పెద్ద స్థానము నిమ్ము'' అని పలికెను. రా జా మాట విని దానిని చేదలో ఉంచెను.


తత్రవృతద్దో7బ్రవీద్భూపం పృథుం దేహి పదం మనో. 7


సరోవరే పునఃక్షిప్తో వవృధే తత్ప్రమాణవాన్‌ |

ఊచే దేహి బృహత్‌ స్థానం ప్రాక్షిపచ్చామ్బుధౌ తతః 8


అచట పెద్దదై ఆ రాజుతో ఇట్లనెను. " ఓ! మనుచక్రవర్తీ! నాకు విశాలమైన స్థానము నిమ్ము." పిమ్మట దానిని సరస్సులో విడువగా అది ఆ సరస్సు ప్రమాణము వంటి ప్రమాణము గలదిగ పెరిగెను. "నా కింకను పెద్ద దైన స్థానము నిమ్ము" అని పలుకగా దాని నాతడు సముద్రములోనికి విడిచెను.


లక్షయోజనవిస్తీర్ణః | క్షణమాత్రేణ సో అభవత్‌ |

మత్స్యం తమద్భుతం దృష్ట్యా విస్మితః ప్రాభ్రవీన్మనుః. 9


అది క్షణమాత్రమున లక్షయోజనముల ప్రమాణము గలదిగా పెరిగెను. అద్భతమైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్యము చెంది ఇట్లు పలికెను.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

పెరియ పురాణం⚜️

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 29*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*తిరుమూల నాయనారు*


కైలాసంలో నందీశ్వరుని వద్ద ఉపదేశం పొందిన సుందరుడనే

మహాభక్తుడు ఉండేవాడు. నంది దేవునిచే 'నాధర్' అని పిలువబడిన

వాడితడు. తిరుమూలర్ అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి చెందిన శివ భక్తుడితడు. అణిమాది అష్టసిద్ధులను కైవశం చేసుకొన్న యోగి పుంగవుడు

తిరుమూలర్.


పొదిగై పర్వతంలో నివసిస్తున్న అగస్త్య మహర్షితో కలసి ఉందామనే

కోరికతో తిరుమూలర్ పొదిగైమలైకు బయలుదేరాడు. చిదంబరం మొదలైన

శివాలయాలను దర్శించుకుంటూ కావేరీ నదీ తీరం చేరుకున్నాడు. అక్కడ

ఒకచోట పశువులన్నీ మేత మేయక గుమికూడి కన్నీరు విడుస్తూ దుః

ఖిస్తుండడం చూశాడు. దీనికి కారణమేమిటని ఆలోచించాడు.

సానూరు అనే గ్రామంలో ఒక గొల్లవాడుండేవాడు. అతని పేరు మూలన్. 


అతడు పశువులను మేపుతుండేవాడు. అతడు పశువులను తన

ప్రాణంకంటె మిన్నగ భావించి ప్రేమతో రక్షిస్తూ వచ్చాడు. ఒకరోజు అతడు

పాముకాటుచే మరణించాడు. అందువలన పశువులన్నీ అతని కళేబరం

చుట్టూ నిలబడి కన్నీటి వర్షాన్ని కురిపించాయి. 


ఈ దృశ్యాన్ని చూసిన

తిరుమూలర్ హృదయం కరిగిపోయింది. వెంటనే అతడు పరమేశ్వరాను

గ్రహంచే పశువుల దుఃఖాన్ని నేను నివృత్తి చేస్తాను. ఇతడు పునర్జీవితాన్ని

పొందితేగాని పశువుల దుఃఖము తొలగిపోదు అని భావించాడు.

తిరుమూలర్ తన శరీరం నుండి ప్రాణాలను వేరు చేశాడు. 


శరీరాన్ని ఒకచోట భద్రపరచి తాను నేర్చుకొన్న యోగ విద్యాబలంచే తన ప్రాణాలను

చనిపోయిన గొల్లవాడి శరీరంలో ప్రవేశపెట్టాడు. చనిపోయిన గొల్లవాడి

శరీరాకృతిలో తిరుమూలర్ పైకి లేచాడు. గొల్లవాడు ప్రాణాలతో పైకి లేవడాన్ని చూసి పశువులన్నీ చాలా సంతోషించాయి. వాటిని మంచి పచ్చిక

బయళ్లలో మేయడానికి విడిచాడు. మధురమైన కావేరీ జలాలను తాగించాడు.


సాయంత్రం కాగానే పశువులు తమ దూడలను తలచుకుని

ఇంటిముఖం పట్టాయి. తిరుమూలర్ కూడ వాటిని వెన్నంటి వెళ్లాడు.

మూలని భార్య తన భర్త ఇంకా ఇంటికి రాలేదని అతన్ని వెతుక్కుంటూ

వెళ్లి పశువుల వెంట వస్తున్న తన భర్తను చూసింది. అతడున్న ధోరణి

గమనించి అతనికి ఏదైనా కీడు జరిగిందేమోనని భయపడింది. 


అతన్ని పట్టుకొని తన ఇంటికి బలవంతంగా తీసుకు వచ్చింది. అతడు

యోగాసనంలో కూర్చుండి పోయాడు. తన భర్త పరిస్థితిని గురించి ఊళ్లో

వాళ్లకు తెలియజేసింది. తిరుమూలర్ విచిత్ర ధోరణిని గమనించిన

ఊరిపెద్దలు “ఇది పిచ్చిగాని మైకంగాని కాదు. ఇతనికి ప్రపంచ వ్యామోహం

ఏమీ లేదు. ఇతడు శివయోగంలో లీనమై ఉన్నాడు. 


ఇతడు సంసార

బంధాలన్నింటినీ వదలుకొన్న జ్ఞాని" అని చెప్పారు. మూలని భార్య వెక్కి

వెక్కి ఏడ్చింది. అక్కడున్న వారు ఆమెను ఓదార్చి వెళ్లిపోయారు.

తిరుమూలర్ భగవద్ధ్యానం చేస్తూ తిరువావడుతురై పవిత్రక్షేత్రం

చేరుకుని స్వామిని దర్శించు కొన్నాడు. దేవాలయం పక్కనే ఉన్న అశ్వత్థ

వృక్షం కింద ఆసీనులై యోగనిష్ఠలో కాలం గడిపాడు. 


సంవత్సరానికొక

పద్యం వంతున మూడువేల సంవత్సరాలకు మూడువేల పద్యాలను

రచించాడు. ఇది 'తిరు మంత్రము' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. తన

మనసులో సదా పరమేశ్వరుని ధ్యానిస్తూ వచ్చిన తిరుమూలర్ చివరగా

శివునిలో ఐక్యమయ్యాడు.


*ఇరవై తొమ్మిదవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

🚩శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 116*


*మృత్యువు ఒడిలో*


స్వామీజీ విపరీతమైన జ్వరంతో బాధపడుతూ కనిపించారు. జ్వరంతోపాటు గొంతువాపు నొప్పి (diphtheria)  కూడా ఆయనకు సోకింది. అక్కడ వైద్య సౌకర్యాలు మృగ్యం. ఆదరణ కరవయిన పరిస్థితిలో భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప మరోమార్గం ఏదీ వారికి కనిపించ లేదు. స్వామీజీ నాడి బలహీనంగా కొట్టుకొంటూ క్రమక్రమంగా ఆగిపోయే స్థితికి దిగజారింది; శరీరం చల్లబడసాగింది. అందరికీ నమ్మకం పోయింది; వారు విలపించనారంభించారు. 


హఠాత్తుగా అప్పుడు ఎక్కడ నుండో ఒక సాధువు అక్కడకు వచ్చాడు. తన సంచీ నుండి కాస్త తేనె, కొన్ని భస్మాలు తీసి, వాటిని తేనెలో రంగ రించి స్వామీజీ నోట్లో పోశాడు. సంజీవనిలా పనిచేసింది ఆ ఔషధం. కాసేపటి కల్లా స్వామీజీ శరీరం వేడెక్కింది, స్పృహ కూడా వచ్చింది.


మరికొంతసేపటికి స్వామీజీ కళ్ళు తెరిచి మెల్లగా మాట్లాడారు. కాని. మాటలు స్పష్టంగా లేకపోవడంతో ఒక సోదర సన్న్యాసి ఆయన నోటి వద్ద తన చెవిని ఆనించి మాటలు జాగ్రత్తగా విన్నాడు. 'సోదరులారా చింతించకండి. నేను చావును" అన్నారు స్వామీజీ.


బయటికి స్వామీజీకి వచ్చిన జ్వరం మృత్యుముఖం దాకా తీసుకువెళ్లినప్పటికీ, అంతరికంగా అది ఆయనకు ఒక అద్భుత సందేశాన్ని అందజేసింది. ఆ అర్ధబాహ్య చైతన్య స్థితిలో ఆయన కొక మహాసత్యం ఆవిష్కృతమయింది. తాను ఈ లోకంలో నిర్వర్తించవలసిన మహత్కార్యం ఒకటి ఉంది. ఆ కార్యం పూర్తయ్యే దాకా విశ్రాంతి అన్నదే లేదని ఆ సమయంలో తనకు తెలిసినట్లు స్వామీజీ తదనంతరం చెప్పారు. 


ఆయనలో అపరిమితమైన ఆధ్యాత్మిక శక్తి ఉప్పొంగడం సోదర సన్న్యాసులు గమనించకపోలేదు. ఆ శక్తి కార్యోన్ముఖమవడానికి తగిన సమయం కోసమూ, చోటు కోసమూ వేచివున్నట్లుగా తోచింది.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

తినవలె తృప్తిగ

 తినవలె తృప్తిగ నెప్పుడు

తినినంతట నూరుకొనక తిరుగాడ వలెన్

తిని తిరుగుట మానినచో

పనిగట్టుగ వచ్చి పడును పలురోగమ్ముల్

దేవుడు vs మనిషి*

 *దేవుడు vs మనిషి*


ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 


దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను


దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?


దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి


మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?


దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?


దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.


మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.


మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?


దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.

 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.

అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 

పశ్చాతాపులను క్షమించాలి. 

 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.


*బ్రాహ్మణ చైతన్య వేదిక*

Sewing machine

 https://youtube.com/shorts/d4qLZSV6M8U?si=2SzyqvPJn4d5LYDb


Screw making

 https://youtube.com/shorts/Q59MRgdlW3E?si=yGwi1h6LAM8aTJz_


రాశిఫలాలు

 🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏🕉️ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*15-12-2023 / శుక్రవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున అధికారులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది.  చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. బంధువర్గం నుండి ఆర్థిక సహాయం అందుతుంది. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి.

---------------------------------------

వృషభం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు తప్పవు. ఆస్తి వివాదాలు మానసిక చికాకును కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. పనులలో జాప్యం కలుగుతుంది.

---------------------------------------

మిధునం


వ్యాపార  విషయంలో  ఆకస్మిక నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు  సందర్శించుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. ముఖ్యమైన పనులు శ్రమతో గాని పూర్తి కావు.  కొన్ని వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

---------------------------------------

కర్కాటకం


స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

సింహం


వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.  ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కన్య


విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువర్గంతో వివాదాలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

---------------------------------------

తుల


వ్యాపార వ్యవహారాలలో  ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

---------------------------------------

వృశ్చికం


పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత పెరుగుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు.

---------------------------------------

ధనస్సు


వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సోదరులతో ఒప్పందాలు వాయిదా వేస్తారు.  ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయటం మంచిది. దైవచింతన పెరుగుతుంది.

---------------------------------------

మకరం


చిన్ననాటి మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

---------------------------------------

కుంభం


చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణ మాటపట్టింపులు కలుగుతాయి.

---------------------------------------

మీనం


వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగినప్పటికి నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀