🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*
. *భాగం - 6*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 2*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
*మత్స్యవతార వర్ణనము - 2*
కో భవాన్ననువై విష్ణుర్నారయణ నమోస్తుతే | మాయయా మోహయసి మాం కిమర్థం త్వ జనార్దన. 10
"నీ వెవరవు? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా! నీకు నమస్కారము. జనార్థనా! మాయచేత నీవు నన్నీవిధముగ ఏల మోహపెట్టుచున్నావు?"
మనునోక్తో7బ్రవీన్మత్స్యో మనుం వై పాలనే రతమ్ | అవతీర్ణో భవాయాస్య జగతో దుష్టనష్టియే. 11
మన వీ విధముగా పలుకగా ఆ మత్స్యము ప్రజలకు పాలించుట యందు ( లేదా తనను రక్షించుటయందు) ఆసక్తి గల ఆతనితో ఇట్లనెను- "ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింపచేయటకును అవతరించినాను".
సప్తమే దివసే త్వబ్ధిః ప్లావయిష్యతి వై జగత్ | ఉపస్థితాయాం నావి త్వం బీజాదీని విధాయ చ. 12
సప్తర్షిభిః పరివృతో నిశాం బ్రాహ్మీం చరిష్యసి | ఉపస్థితస్య మే శృఙ్గే నిబధ్నీహి మహాహినా. 13
"(నేటినుండి) ఏడవ దివసమున సముద్రము ఈ జగత్తును ముంచివేయును. అపుడు నీదగ్గరకు వ్చచిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షిసమేతుడవై బ్రహ్మనిద్రించు రాత్రి అంతయు సంచరింపగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టి వేయుము".
ఇత్యుక్త్వాన్తర్దధే మత్స్యోమనుః కాలప్రతీక్షకః | స్థితః సముద్ర ఉద్వేలే నావమారురుహే తదా. 14
ఇట్లు పలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా అపుడు నావను ఎక్కెను.
ఏకశృఙ్గధరో మత్స్యో హైమో నియుతమోజనః | నావం బబన్ధ తచ్ఛఙ్గే మత్స్యాఖ్యం చ పురాణకమ్ . 15
శుశ్రావ మత్స్యాత్పపఘ్నం సంస్తువన్ స్తుతిభిశ్చ తమ్ |
ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములు గల బంగారు మత్స్యము (వచ్చెను). దాని కొమ్మునకు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మాత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను.
బ్రహ్మవేద ప్రహర్తారం హయగ్రీవం చ దానవమ్. 16
అవధీద్వేదమన్త్రాద్యాన్పాలయామాస కేశవః | ప్రాప్తే కల్పేఅథ వారాహే కూర్మరూపోఅ భవద్దరిః. 17
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే మత్స్యావతారో నామ ద్వితీయోధ్యాయః.
కేశవుడు బ్రహ్మనుండి వేదములను అపహరించిన హయగ్రీవు డను దానవుని సంహరించి వేదమంత్రాదులను రక్షించెను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారం ధరించెను.
*అగ్ని మహాపురాణములో మత్స్యావతారమను ద్వితీయాధ్యాయము సమాప్తము.*
సశేషం....
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి