15, డిసెంబర్ 2023, శుక్రవారం

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 5*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 2*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

*మత్స్యవతార వర్ణనము*


*వసిష్ఠ ఉవాచ :*


మత్స్యాదిరూపిణం విష్ణుం బ్రూహి సర్గాదికారణమ్‌ | పురాణం బ్రహ్మ చాగ్నేయం తథా విష్ణోః పురా శ్రుతమ్‌. 1


మత్స్యవతార వర్ణనము


విశిష్ఠుడు పలికెను: మత్స్యాదిరూపములను ధరించినవాడును, సృష్ట్యాదులకు కారణమైనవాడును అగు విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువునుండి వినిన విధమున అగ్నేయపురాణమును గూర్చియు, బ్రహ్మను గూర్చియు (లేతా అగ్నేయ పురాణరూప మగు వేదమును) చెప్పుము.


అగ్నిరూవాచ ః


మత్స్యావతారం వక్ష్యేఅహం వసిష్ఠ శృణు వై హరేః | అవతార క్రియా దుష్టనష్ట్యై .సత్పాలనాయ హి 2


అగ్ని పలికెను ః వసిష్ఠా! విష్ణువు ధరించిన మత్స్యావతారమును గూర్చి చెప్పదను; వినుము, అవతారములు ధరించుట దుష్టనాశము కొరకును, శిష్టపాలనముకొరకును జరుగుచుండను కదా?


ఆసీదతీతకల్పానై బ్రహ్మోనైమిత్తికో లయః | సముద్రోపప్లుతా స్తత్ర లోకా భూరాదికా మునే. 3


ఓ మునీ! గడచిన కల్పము చివర బ్రహ్మ నిద్రించుట అను నిమిత్తముచే ప్రలయ మేర్పడెను. అపుడు భూలోకాదు లన్నియు సముద్రములో మునిగిపోయినవి.


మనుర్వైవస్వతస్తేపే తపో వై భుక్తిముక్తేయే | ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణమ్‌.

తస్యాఞ్జల్యుదకే త్యల్పో మత్స్య ఏకోఅభ్యపద్యత|


వైవన్వతమనుపు భక్తిముక్తుల నపేక్షించి తపస్సుచేసెను. ఒకనా డాతడు కృపతమాలా నదిలో జలతర్పణము చేయుచుండగా అతని దోసిలిలోని జలములో ఒక చిన్న చేపపిల్ల కనబడెను.


క్షేప్తుకామం జలే ప్రాహ న మాం క్షిప నరోత్తమ.

గ్రాహాదిభ్యో భక్షయం మేఅత్ర తచ్ఛ్రుత్వా కలశేఅక్షిపత్‌ |


ఆ రాజు దానిని నీటిలో పడవేయ దలచుచుండగా అది అతనితో - ''మహారాజా! నా కీ జలములో మొసళ్ళు మొదలగువాటినుండి భయ మున్నది. అందుచే దీనిలో పడవేయకుము" అని పలికెను. అది విని అతడు దానిని కలశములో ఉంచెను.


స తు వృద్ధః పునర్మత్స్యః ప్రాహ తం దేహి మే బృహత్‌ . 6


స్థానమేతద్వచః శ్రుత్వా రాజాథోదఞ్చనేఅక్షిపత్‌ |


ఆ మత్యృము పెద్దదిగా అయి రాజుతో "నాకొక పెద్ద స్థానము నిమ్ము'' అని పలికెను. రా జా మాట విని దానిని చేదలో ఉంచెను.


తత్రవృతద్దో7బ్రవీద్భూపం పృథుం దేహి పదం మనో. 7


సరోవరే పునఃక్షిప్తో వవృధే తత్ప్రమాణవాన్‌ |

ఊచే దేహి బృహత్‌ స్థానం ప్రాక్షిపచ్చామ్బుధౌ తతః 8


అచట పెద్దదై ఆ రాజుతో ఇట్లనెను. " ఓ! మనుచక్రవర్తీ! నాకు విశాలమైన స్థానము నిమ్ము." పిమ్మట దానిని సరస్సులో విడువగా అది ఆ సరస్సు ప్రమాణము వంటి ప్రమాణము గలదిగ పెరిగెను. "నా కింకను పెద్ద దైన స్థానము నిమ్ము" అని పలుకగా దాని నాతడు సముద్రములోనికి విడిచెను.


లక్షయోజనవిస్తీర్ణః | క్షణమాత్రేణ సో అభవత్‌ |

మత్స్యం తమద్భుతం దృష్ట్యా విస్మితః ప్రాభ్రవీన్మనుః. 9


అది క్షణమాత్రమున లక్షయోజనముల ప్రమాణము గలదిగా పెరిగెను. అద్భతమైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్యము చెంది ఇట్లు పలికెను.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: