20, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 పంచమస్కంధం యొక్క ప్రధామాశ్వాసం. -3


ఋషభుని జన్మంబు


రాజైన నాభి తన భార్య అయిన మేరుదేవి సమేతంగా సంతానం కోసం శ్రద్ధాభక్తులతో యజ్ఞపురుషుడైన వాసుదేవుణ్ణి పూజించి…ఇంకా ప్రవర్గ్యా లనబడే యజ్ఞకార్యాలను శ్రద్ధతో, పరిశుద్ధ ద్రవ్యాలతో, ఉచిత ప్రదేశంలో, కాలానుగుణంగా, విధివిహితంగా మంత్రవేత్తలైన ఋత్విక్కులతో, భూరి దక్షిణలతో ఆచరించి పరమేశ్వరుని మెప్పించాడు. ఎవరికీ సులభంగా ప్రసన్నుడు కాని విష్ణువు భక్తవాత్సల్యంతో, ప్రకాశవంతమైన అవయవ సౌష్ఠవంతో హృదయంలో తాను సదా నెలకొని ఉన్నప్పటికీ ప్రత్యక్ష రూపంలో కనులకు పండువుగా, మనసుకు నిండుగా తన స్వరూపాన్ని అతనికి చూపాలనుకొని,అప్పుడు ప్రకాశమానాలైన చతుర్భుజాలతో; పట్టు పీతాంబరంతో రమణీయాలైన శ్రీవత్సం, కౌస్తుభమణి, శ్రీదేవి విరాజిల్లే వక్షఃస్థలంతో; శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం మొదలైన దివ్యాయుధాలతో; సాటిలేని నవరత్నాల కాంతులను వెదజల్లే బంగారు కిరీటంతో; మకర కుండలాలు, మొలనూలు, మణులు చెక్కిన స్వర్ణహారాలు, బాహుపురులు, కాలి అందెలు ప్రకాశిస్తుండగా లక్ష్మీపతి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు. అప్పుడు ప్రకాశమానాలైన చతుర్భుజాలతో; పట్టు పీతాంబరంతో రమణీయాలైన శ్రీవత్సం, కౌస్తుభమణి, శ్రీదేవి విరాజిల్లే వక్షఃస్థలంతో; శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం మొదలైన దివ్యాయుధాలతో; సాటిలేని నవరత్నాల కాంతులను వెదజల్లే బంగారు కిరీటంతో; మకర కుండలాలు, మొలనూలు, మణులు చెక్కిన స్వర్ణహారాలు, బాహుపురులు, కాలి అందెలు ప్రకాశిస్తుండగా లక్ష్మీపతి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు. ఈ విధంగా ప్రత్యక్షమైన భగవంతుణ్ణి ఋత్విక్కులు చూసి పెన్నిధిని దర్శించిన పేదలవలె సంతోషంతో తలలు వంచి ఇలా స్తోత్రం చేశారు. నీవు పరిపూర్ణుడవై కూడా మమ్మల్ని మరచిపోకుండా మా పూజలను స్వీకరిస్తావు. పెద్దలు మాకు చెప్పిన విధంగా నీ పాదపద్మాలను సేవిస్తాము.

నీవు పరిపూర్ణుడవై కూడా మమ్మల్ని మరచిపోకుండా మా పూజలను స్వీకరిస్తావు. పెద్దలు మాకు చెప్పిన విధంగా నీ పాదపద్మాలను సేవిస్తాము. మహాత్మా! మే మిప్పుడు నీ మహిమలు తెలిసి సంస్తుతి చేయడం లేదు. పెద్దలు మాకు ఏ విధంగా ఉపదేశించారో ఆ విధంగా ప్రస్తుతి చేస్తున్నాము. ఇంకా సంసారంలో మునిగి తేలే వారికి నీవు పట్టుబడవు. నీవు ఈశ్వరుడవు. ప్రకృతి కంటే జీవుని కంటే భిన్నమయినవాడవు. పరమ పురుషుడవు. మేము పంచభూతాల సృష్టికి లోనైన నామరూపాలను ధరించిన వాళ్ళం. అటువంటి మాకు నీ తత్త్వాన్ని నిరూపించడం సాధ్యం కాదు. సకల జీవరాసుల పాపసమూహాలను తొలగించడం నీ స్వభావం. అటువంటి నీ ఉత్తమ గుణాలలో ఏదో ఒక అంశమే కాని సమస్త గుణాలను నిరూపించడం ఎవరికీ ఏమాత్రం సాధ్యం కాదు. నీ భక్తులు భక్తితో గద్గద స్వరంతో సంస్తుతిస్తూ, నీ కర్పించే నిర్మల జలం, చిగురుటాకులు, తులసీదళాలు, దూర్వాంకురాలు మొదలైన వాటితో నీవు సంతృప్తి పడతావు. అంతేకాని నానావిధ ద్రవ్యాలు సంతరించికొని మహా వైభవంతో చేసే అశ్వమేధాది యాగాలు కూడా నీకు సంతృప్తిని కలిగించవు. స్వాభావికంగానే నీవు సర్వకాలాలలోను సాక్షాత్కరిస్తావు. నీవు సర్వాతిశాయివి. సమస్త పురుషార్థాలు నీవే. పరమానంద స్వరూపుడవైన నీకు యజ్ఞయాగాదుల వల్ల తృప్తి లేకున్నా మా కోరికలను తీర్చుకోవడానికి మేము యజ్ఞాలను చేస్తున్నాము” అని ఇంకా ఇలా అన్నారు. మూర్ఖులమైన మాకు ఏది మంచిదో ఏది కాదో మాకే తెలియదు. అయినా ఎంతో దయతో మమ్మల్ని కాపాడి ఇహపరాలకు తగిన సకల సుఖాలను నీవు మాకు ప్రసాదిస్తున్నావు. ఇప్పుడు మేము నీకు సంతృప్తి కలిగేటట్లు ఇష్టమైన పూజలు చేయక పోయినా మా మీద కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింప జేసి ప్రసన్నుడవైనావు. కోరిన కోరికలను అనుగ్రహించేవాడా! నీలమేఘం వంటి శరీరచ్ఛాయ కలవాడా! వరమివ్వడానికి నీవు మా ముందు సాక్షాత్కరించావు. నిన్ను సందర్శించడానికి కాని సంస్తుతించడానికి కాని మాకు సాధ్యమౌతుందా?.ఇంకా మునులు కోరికలు లేనివారు. సునిశ్చితమైన జ్ఞానం కలవారు. దోషాలు లేనివారు. భగవంతుని ప్రతిరూపాలు. ఆత్మారాములు. అలాంటి మునులకు స్తోత్రార్హుడ వైనప్పటికీ అందరిపట్ల అనుగ్రహం చూపుతున్నావు. కాలు జారినప్పుడు, క్రింద పడ్డప్పుడు, తుమ్మినప్పుడు, ఆవులించినప్పుడు, జ్వరంతో పీడింపబడుతున్నపుడు, చావుకు చేరువ అయినప్పుడు, మా మీద మాకే అధికారం తప్పినప్పుడు మా పాపాలను పోగొట్టే నీ దివ్యనామాలు మా నోటివెంట వెడలే విధంగా అనుగ్రహించు. ఈ రాజర్షి అయిన నాభి నీకు సమానమైన సంతానం కావాలని నిన్ను పూజించాడు. కోరిన కోరికలను, స్వర్గాన్ని, మోక్షాన్ని సైతం ఇవ్వగల నిన్ను ఇలా అడగడం ధనం కోసం ధనవంతుని దగ్గరకు వెళ్ళి ఊక అడిగినట్టుంది. మోక్ష ప్రదాతవైన నిన్ను సంతానం కోసం ప్రార్థిస్తున్నాడు. మీ మాయ దాటరానిది. అలాంటి మాయకు లోబడి ఇంద్రియ కాంక్షలకు లోనుకాని వా డెవడు? ప్రతి పనిని ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళం మేము. గర్వాంధులము. అయినా నిన్ను ఆహ్వానించిన మా అపరాధాన్ని మన్నించు. మమ్ము అనుగ్రహించు” అని నమస్కరించారు. అప్పుడు సర్వేశ్వరుడు జంబూద్వీపంలోని ఒక వర్షానికి అధిపతి అయిన నాభి ఋత్విక్కులతో కలిసి చేసిన వందనాలు అందుకొంటూ దయతో ఇలా అన్నాడు.మునులారా! నన్ను వేదమంత్రాలతో ప్రస్తుతి చేసి సకల లక్షణాలలో నాకు సాటి అయిన కొడుకును నాభికి ప్రసాదించవలసిందిగా ఎంతో కుతూహలంతో నన్ను కోరారు. స్వర్గాది లోకాలలో నాకు సాటి రాదగ్గ కుమారుడు ఎక్కడా కనిపించడు. నాకు సాటి నేనే అని మీరు తెలుసుకొనండి.అంతేకాక బ్రాహ్మణులు నాకు ముఖం వంటివారు కనుక వారి మాట దాటడానికి వీలుకానిది. మీరు నాకు సమానుడైన కుమారుణ్ణి కోరారు. అందుచేత ఈ నాభి మహారాజు భార్య అయిన మేరుదేవికి నేనే కొడుకునై జన్మిస్తాను” అని నాభి, మేరుదేవి చూస్తుండగా యజ్ఞంలో అంతర్ధాన మయ్యాడు. ఆ తర్వాత దిగంబరులు, తాపసులు, జ్ఞానులు, ఊర్ధ్వరేతస్కులు అయిన నైష్ఠికులకు యోగధర్మాలు బోధించడానికి నాభి మీద దయతో విష్ణువు మేరుదేవి గర్భంలో ప్రవేశించాడు. అప్పుడు…

సమస్త శుభలక్షణాలు కలవాడు, శమదమాది గుణ సంపన్నుడు, మేరుధీరుడు అయిన శ్రీహరి మేరుదేవికి కుమారుడుగా అవతరించాడు. సమస్త జనులు సంతోషించారు.పుట్టిన శిశువు వెలుగులు వెదజల్లుతూ ఉండడం గమనించి, అతడు బలవంతుడని, పరాక్రమవంతుడని, శౌర్య కలవాడని అర్థం చేసికొని నాభి తన కుమారునికి “ఋషభుడు” అని పేరు పెట్టాడు

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

భజగోవిందం

 *దశిక రాము**


**మోహముద్గరః**

(భజగోవిందం)

25)

శత్రౌ మిత్రే పుత్రే బంధౌ 
మా కురు యత్నం విగ్రహసంధౌ|
సర్వస్మిన్నపి పశ్యా త్మానం
సర్వత్రో త్సృజ భేద జ్ఞానమ్||
-
శ్లోకం అర్ధం : శత్రువునైనా, మిత్రుడనైనా, పుత్రుడనైనా, బంధువునైనా కలహము చేయక, కూర్మిని చూపి శత్రు భావమును సంహరించుము. ఇతరుల పైన కోపము చేసిన నిన్ను నీవె కోపించిన తీరు నీలో, అందరిలొ శ్రీహరి నుండ ఇతరుల నేల దూషణ చేతువు? 
-
తాత్పర్యము : భగవంతుడు సర్వ వ్యాప్తి, జడ, చైతన్య, వస్తు, జంతు పదార్ధములందు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. 
చిన్న చీమ నుంచి, పెద్ద ఏనుగు వరకు సమస్త జీవులయందు స్వామి ఆత్మరూపములో వెలయుచున్నాడు. జంతువులు, పక్షులు, క్రిములు, మానవులు, వన్యమృగములు, చెట్లు, చేమలు మున్నగు భూ, జల, వాయు నిలయ సమస్త జీవులు శ్రీహరి ప్రతిరూపములే. 
భగవంతుడు సూక్ష్మముగా జీవులలోను, ఊర్జముగా పంచభూతములలోను నిక్షిప్తుడై ఉన్నాడు. అందుచే అన్ని జీవులను సమభావముతో చూడవలెను. ఎవ్వరిపై కోపతాపములు చూపరాదు, ఎవ్వరితో కలహించరాదు. 
అందరినీ ప్రేమతో, దయతో చూడవలెను. ద్వేష, విరోధ భావములను రూపు మాపి శాంతి, సహృదయము అలవరచు కోవలెను. శత్రువులైనను, పుత్రులైనను, బంధువులైనను అందరినీ ఒకే తీరు ఆదరించ వలెను. 
భేద భావము చూపుట కేవలము అజ్ఞానమే.
🙏🙏🙏

**ధర్మము-సంస్కృతి**

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఇరవైయవ శ్లోక భాష్యం - అయిదవ భాగం


కుండలినీ యోగాన్ని సాధన చేసే శాక్తయోగులు వేదాంతుల వలే ఈ దేహాన్ని మాయ అని త్రోసిపుచ్చారు. వారికి ఈ ప్రపంచం వ్యవహారమంతా అంబికలీల. ఆవిష్కరించబడిన ఆమె శక్తి విశేషం. ఈ శరీరంలో ఉండాలన్న ఇచ్ఛఉన్నంత వరకు, అంబికలీలను చూడగలిగేందుకు ఈ అమృతము అతనికి ఉపయోగిస్తుంది. కొంతకాలం గడచి అంబికలో లీనమవాలనే సంకల్పం కలిగిన తరువాత ఈ దేహాన్ని త్యజిస్తారు. సర్పాకృతిలో ఆరాధించబడే సుబ్రహ్మణ్యుడు ఇటువంటి అమృతం కురిపిస్తాడు. కుండలినీయోగం గురించి చెప్పకపోయినా యోగశాస్త్రాన్ని మనకు అందించిన పతంజలి ఆదిశేషుని అపర అవతారము. పాములకు జన్మ విరోధియైన జీవి ఇంకొకటున్నది. అది ముంగిస, ముంగిసను సంస్కృతంలో 'నకుల'మని పేరు. అంబిక యొక్క ఒక రూపము నకులేశ్వరి. మహారాజ్ఞి అయిన అంబికకు మంత్రిణి, రాజమాతంగి అని పేర్లుగల మంత్రిణి ఒకరున్నారు. ఆమెకు లలితాంబిక తన సర్వంసహా అధికారాలన్నీ ఒప్పగించి, ఆమె చేత పరిపాలన చేయిస్తోంది. సహస్రనామాలలో “మంత్రిణీ న్యస్త రాజ్యధూ” అన్న నామం ఇందువలననే వచ్చింది. 


మధుర మీనాక్షి రాజమాతంగి ఒక్కరే! ఆమెకే నకులేశ్వరి అన్న పేరున్నది. కుండలిని మూలాధారంలో సర్పాకృతిగా నిదురించేటప్పుడు ఆత్మప్రగతికి అవరోధంగా ఉంటుంది. సర్పంతో ఆజన్మ విరోధమున్న ముంగిస పేరు దాల్చిన ఈ అంబిక అటువంటి అవరోధాలను తొలగించి ఆంతరంగిక మైన సంపదలను ప్రసాదిస్తుంది.


మూలాధారమునకు 'కుల' మని పేరు. సౌందర్యలహరిలోనే “కులకుండే స్వపిషి...” అన్న పదములు చూస్తాము. ఆత్మస్పృహ లేకుండా ఆమె మూలాధారంలో నిదురిస్తూ ఉంటుంది. తద్భిన్నమైన పరిస్థితిని సృజించి ఆత్మసాక్షా త్కారానికి దోహదం చేసేది 'నకులి'. 'కుల' పదమునకు వ్యతిరేకము 'నకుల'-


పాములకు సహజ శత్రువులైన గరుత్మంతుడు, నెమలి, ముంగిసలలో గరుత్మంతునకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆయన పాములను సంహరించడమే కాదు. అమృతం తెచ్చినవాడు కూడా! సర్పజాతికి తల్లి అయిన కద్రువ గరుత్మంతునికి సవతి తల్లి. ఆమె పందెంలో కపటం చేసి తన సవతి అయిన వినతను (గరుత్మంతుని తల్లి) దాసిగా చేసుకొంది. తన తల్లి దాస్యవిముక్తికై ప్రార్థించిన గరుత్మంతునికి ఆమె దానికై ఒక షరతు విధించింది. ఆ షరుతు మేరకు సర్పములు తాగడానికి గాను దేవేంద్రునితో పోరి గరుత్మంతుడు అమృతకలశాన్ని తెచ్చి కద్రువకు సమర్పించాడు. చివరికి అది సర్పమునకు దక్కలేదు. సరికదా గరుత్మంతుడే పాములను తినడం మొదలుపెట్టాడు.


గోదాదేవి అవతరించిన శ్రీవల్లిపుత్తూరు క్షేత్రంలో గరుత్మంతునకు 'అమృతకలశం' అని పిలవబడే తిను బండారము నైవేద్యంగా సమర్పిస్తారు. లోపల ఉన్న పూర్ణము (తీపి)ను అమృతంగా, చుట్టి ఉన్న తోపుపిండి కలశంగాను భావించాలన్నమాట. శ్రీవల్లిపుత్తూరులో మిగతా క్షేత్రాలలో వలె గరుడాళ్వారు విష్ణుమూర్తికి ఎదురుగా కాక, గోదాదేవికి సమానంగా ప్రక్కనే ఉండటం విశేషం. శ్రీరంగనాయకుడు గోదాదేవిని తనలో ఐక్యం చేసుకొన్న తరువాత విష్ణుచిత్తుడు స్వామిని, “నాకు పెంపుడు కూతురిని ప్రసాదించినట్లే ప్రసాదించి, నీవే తీసుకుని మళ్లీ నన్ను ఒంటరిని చేయడం న్యాయమా' అని ప్రార్థించాడట. స్వామి గోదాదేవిని శాస్త్రోక్తంగా వివాహమాడి ఆమెతో కూడి నీ కంటికి ఎదురుగా విలిపుత్తూరులో నివాసముంటానని అనగ్రహించాడు. స్వామి నోట మాట వెలువడినదే తడవుగా గరుత్మంతుడు కనురెప్ప పాటు కాలంలో వారిని శ్రీవిల్లిపుత్తూరు చేర్చాడు. ఈ కైంకర్యానికి ఆనందించిన స్వామి గరుత్మంతుని గోదాదేవితో తన ప్రక్కనే ఉంచుకున్నాడు. పెరియాళ్వారుగా పేరుపొందిన విష్ణుచిత్తుడు గరుత్మంతుని అవతారంగా భావించబడుతున్నాడు.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

త్రిపురారహస్య జ్ఞానఖండసారము**

 **దశిక రాము**


**త్రిపురారహస్య జ్ఞానఖండసారము**


అమ్మదయ గలవారు మాత్రమే దీనిని చదవగలరు

 

PART-14


ఆయన ప్రసన్నుఁడై భార్గవుని కరుణించి నవ్వుచు ఇట్లనెను.''ఎవరు నీవు అని ప్రశ్నించితివి గదా? వినుము. ''నీవు'' అనుపదము యొక్క అర్థము నీకు తెలిసినచో నీప్రశ్న, పిండియైనదానిని మరల పిండిచేయుటవలె (పిష్టపేషణము) వ్యర్థము. ఆపదముయొక్క అర్థము నీకు తెలియనిచో నీమాట అర్థము లేనిదగును. ఈశరీరమును ఉద్దేశించి ''నీవు'' అనుపదమును ప్రయోగించితి నందు వేని. ఇందులోనున్నచైతన్యము నీకు గోచరించ లేదన్నమాట మఱి అన్నమయమైన యీశరీరము నీకు ప్రత్యక్షముగా కన్పించుచున్నది గదా! ప్రశ్నింపవలసినసంశయ మేమున్నది? కాఁబట్టి నీప్రశ్న పేరునకు మాత్రమే సంబంధించుచున్నది. కాని పేరు శరీరముతోపాటు సహజముగ సిద్ధించుట లేదు. అది అనేక విధముల కల్పింపఁబడుచున్నది. జనుల సముదాయములో ఒకపేరు ఒకశరీరమునందే నియమితమై యుండదు. కావున నీవు నన్ను చక్కఁగా ప్రశ్నించినచో సమాధానము చెప్పుదును''

ఆమాటలకు సమాధానము దొఱకక పరశురామునకు వాక్కుతో పాటు బుద్ధియొక్క పౌరుషము కూడ స్తంభించెను. అతఁడు సిగ్గువడి ఆయోగీశ్వరునకు ప్రణమిల్లి ఇట్లు ప్రార్థించెను. ''మహాపురుష! నీవు చెప్పినదానినిబట్టి ఎట్లు ప్రశ్నింపవలయునో నాకు తెలియుట లేదు. నేను అకల్మషుఁడనై నీకు శిష్యుఁడనై యున్నాను. ఆప్రశ్న యేదో నీవే తెలిసికొని నాకు బోధింపుము''. అప్పు డాయన మధురములైన మాటలతో తన వృత్తాంతమును చెప్పస నారంభించెను. ''భార్గవా, నేను ఆంగిరసుఁడను; బృహస్పతికి తమ్ముఁడను; మూఁడులోకములయందును సంవర్తుఁడని ప్రఖ్యాతుఁడనై యుంటిని నాస్థితిని చెప్పెదను శ్రద్ధతో వినుము. పూర్వము అన్నతో నాకు విద్వేషము కలిగెను. దానిచేత నాకు నిర్వేదము పుట్టి గురువైన దత్తాత్రేయునిచే చక్కఁగా బోధింపఁబడి ఈస్థితిని పొందితిని. ''ఆత్మయే అఖిలము; ఇది యంతయు దానివిలాసము'' అని తలంచి శంకారహితుఁడనై అభయమైన మార్గము నాశ్రయించి, దారముచేత కదలింపఁబడు బొమ్మవలె సంచరించుచున్నాను''.

అదివిని రాముఁడు అంజలించి, ''మహాత్మా! సంసారభయపీడితుఁడను దీనుఁడను అయిన నన్ను అనుగ్రహించి నిర్భయము శుభమునైన మార్గమునందు ప్రవేశ##పెట్టుము''. అని ప్రార్థించెను. దయార్ద్రమృదయుడైన యాముని మరల నిట్లనెను. ''వత్సా! సర్వార్థ సంగ్రహమైన సారమును చెప్పెదను వినుము. దొంగలు ప్రబలముగా నున్న మార్గమును ఒకానొకఁడు దైవమోహితుఁడై నిర్భయమైన దారి అనుకొని ముందుకు పోవుచున్నట్లు నీవు నడచుచున్న మార్గము కూడ మిగుల అనర్థదాయకము, భయంకరము. ఆజ్ఞానమువలన దొంగలున్న మార్గమున ప్రవేశించినవాఁడు అడుగడుటున భయపుడుచు కష్టపడుచు క్షేమము కలుగు ననునాశతో ముందుకు పోవుట యెట్టిదో సంసార మార్గమున వర్తించుచుండుటయు అట్టిదే. మార్గము నెఱింగిన యొకానొక మహనీయునిచే బోధింపఁబడి దొంగలున్న మార్గమున వదలి మంచి మార్గమున పయనించువాఁడు దుష్టమార్గమున పోవుచున్న వారిని జూచి నవ్వుకొనుచుండును. PART-14

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

https://chat.whatsapp.com/D9gWd7SgdmG2Rbh7b3VXl9


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/KCfWMHlFNsM1PTptFf2RwR

దైవ సాక్షాత్కారం

 🕉️అహం బ్రహ్మాస్మి🕉️


*ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.


*వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దం, స్పర్శ.


*అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.


*జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.


*భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.


ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.


*జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.. దీనిని మనం బంధించలేము.


*అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.


*వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.


*ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.


కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు?   అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. 

అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే...

‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ 

అదే దైవాన్ని దర్శించడమంటే,

అదే దైవ సాక్షాత్కారం అంటే.


🕉️🙏🙏🙏🙏🙏🙏🕉️

నిత్యాన్నదాన సత్రాల

 *బ్రాహ్మణ  నిత్యాన్నదాన సత్రాల వివరములు* 

******************************

* బీచుపల్లి.            - 08502249335


* యాదగిరి గుట్ట     - 9502802468


* వేముల వాడ.      - 9966098855


* బాసర.               - 08752 255522


* ధర్మపురి.             - 08724 274155 


* భద్రాచలం           - 8333907796


* శ్రీశైలం                 - 8333907814


* వారణాసి  ( కాశీ)  - 8333907790


* రామేశ్వరం           - 8333907793


* షిర్డి                      - 8333907800


* మహానంది           - 8333907803


* అమలాపురం       - 8333907806


* అరసవెల్లి             -  08942 228835

                                 9848179755


* విజయవాడ          - 0866 2426292


* మోపిదేవి              - 08671 257900

                                 9390142245


పై సత్రాల్లో మీ పేరు, గోత్రం మరియు మీ చిరునామా నమోదు చేసుకోవాలి భోజనం కొరక…

శివపురాణం -7 వ భాగం:

 శివపురాణం -7 వ  భాగం:

సోమనాథుడు :

ఇక్కడ ఒక చిత్రం జరిగింది. శంకరుడు చంద్రుడిని నెత్తిమీద పెట్టుకోవడం మంచిదే. అదే సోమనాథ లింగం. స+ఉమ+నాథుడు=సోమనాథుడు. అనగా పార్వతీదేవి పక్కన ఉన్న కారుణ్యమూర్తి. సశక్తిపరుడు. ఇది ఒక అర్థం. మరొక అర్థం ఉన్నది. సోముడు అనగా చంద్రుడు. సోముడు ప్రార్థన చేశాడు. ‘నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తరా ఎవరు వచ్చినా రక్షించడానికి ఇక్కడే వెలయవలసినది’ అన్నాడు. అపుడు శివుడు అక్కడ జ్యోతిర్లింగమై వెలశాడు. అందుకే అది స్వయంభూ జ్యోతిర్లింగములలో మొట్టమొదటి లింగము. మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అక్కడికి వెళ్ళి సోమనాథ జ్యోతిర్లింగమును దర్శించుకుంటే దీర్ఘకాలంగా పీడిస్తున్న వ్యాధులు నయం అవుతాయని, భవిష్య జన్మలో చేసిన పాపముల వలన భయంకరమయిన కుష్ఠు మొదలయిన వ్యాధులు రావలసిన పాపములు ఖాతాలో ఉండిపోయినా అవి భగ్నం అయిపోతాయని సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది. సోమనాథ దేవాలయం శ్రీ సర్దార్ వల్లభాయ్ సారధ్యంలో పునర్నిర్మాణం అయింది. ఈ లింగం మీద కన్నుపడే ఈ సోమనాథ దేవాలయమును పూర్వం ఎందఱో ఎన్నో మార్లు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కుమనిషి అనిపించుకున్న భారతదేశపు తోలి ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి, సోమనాథ దేవాలయమును పునర్నిర్మాణం చేసి, అత్యద్భుతంగా రూపుదిద్దారు.


శ్రీశైల క్షేత్రం:

శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంద్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలసిన స్వయం భూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని చెబుతారు. కానీ దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు.


గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుహ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం. కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. అపుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు.


సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు. వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు. అపుడు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు. అపుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది. ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉంది సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము కదా అని అక్కడ వెలశారు. మనం అలకచేతనో, అజ్ఞానం చేతనో మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం. ఆ బట్టలతో కొండమీదకి వెళతారు. మీరు శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మీరు ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.


అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామీ వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలి వెళ్లి మన గోత్రం, పేరు, చెప్పుకోవాలి. గణపతి మన గోత్ర నామమును చిట్టాలో రాసేసుకుంటారు.


శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని. అపుడు శంకరుడు “శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అపుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అపుడు ప్రతివాడూ తాను ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అపుడు పార్వతీ దేవి ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా. అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అపుడు ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే – అమ్మా నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.

కథ



ఒక అద్భుతమైన  కథ 

  


రాత్రి 11 గంటలకు.  తాళం వేసిఉన్న ఇనుప ద్వారం  బయట నుండి ఒక పిలుపు.  ఎవరా అని వచ్చి చూశాను.  గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు.  చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన  బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి  ఉన్నారు.  అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు.  "అవును నేనే ఆనంద్.  ఇదే చిరునామా.  మీరూ ..." అని అడిగాను.  అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో  తడుపుకుంటూ "బాబూ!  నేను మీ నాన్నగారి మిత్రుడిని.  మీ ఊరినుండే వస్తున్నాను.  నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు.  


అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను.  అందులో "ప్రియమైన ఆనంద్!  నీకు నా ఆశీర్వాదములు.  ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు.  పేరు రామయ్య.  చాలా కష్టజీవి.  కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్  లో చనిపోయాడు.  నష్టపరిహారం  కోసం తిరుగుతున్నాడు.  అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది.  ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి  నీకు పంపాను.  డబ్బులు Head Office  లో తీసుకోమన్నారు.  ఆయనకు హైదరాబాద్  కొత్త.  ఏమి తెలియదు.  నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను.  ఆరోగ్యం జాగ్రత్త.  కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ

మీ నాన్న" అని ఉంది.  


నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు.  ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను.  మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను.  "లేదు బాబూ.  ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని  చెప్పారు.


నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను.  "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను.  నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు.  నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు.  అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది.  కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు.  సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది.  నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.  


"ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు.  అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు.  ఇతడు మాత్రమే మాకు మిగిలాడు.  పేరు మహేష్.  కష్టపడి చదివించాను.  బాగా చదువుకుని  ఉద్యోగం సంపాదించుకున్నాడు.  మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు.  ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది.  అక్కడికక్కడే చనిపోయాడు.  నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము.  కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది.  నా భార్య ఆరోగ్యం బాగా  లేదు.  మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను.  నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన.  


"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు  


పొద్దున లేచి స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము.  దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము.  "ఆనంద్!  ఇక నేను చూసుకుంటాను.  నువ్వు ఆఫీస్ వెళ్ళు బాబు" అన్నారాయన.  "పర్లేదండి.  నేను లీవ్ పెట్టాను" అన్నాను.  దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను.  చాలా థాంక్స్ బాబూ!  నేను ఊరికి బయల్దేరుతాను.  మా ఆవిడ ఒక్కతే  ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు.  "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను.  


ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ!  నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు.  ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి.  కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు.  


అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ.  నా పేరు అరవింద్.  మీరు వెళ్లవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు.  ఆ చిరునామ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట 10 km ప్రయాణం చేయాలి.  మీరేమో  అలసిపోయి ఉన్నారు.  అందుకే నేను నిజం చెప్పలేదు.  మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను.  ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట.  ఆ మిత్రుడికి విషయం చెప్పాను.  అయన చాల బాధ పడ్డారు, నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు.  మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది.   కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది.  నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను.  బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.  "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు.  ఆ మాటే చాలనుకున్నాను నేను.  పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు.  ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు.  


ఆకాశంలోకి చూశాను.  అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న.  "నాన్నా!  నా అభివృద్ధి  చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు!  ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా?  మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా!  మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను.  


"సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు.  మిగిలినవన్నీ

 దానికి తోడుగా నిలబడతాయి"

ఈ కథ చదవగానే నాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి 


ఈ కథ మీ కూడా నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి 

అవసరం లో ఉన్నవారికి సాయ పడదాం 🙏🤝


అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏

సంతృప్తి

     

   *ఆఫీస్ కు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా, నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను. బస్టాండ్ కు చేరుకున్న నేను, అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను. పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు.*

*అప్పుడే...  ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి, అతను వేరే దగ్గరకి వెళ్ళి నిలుచున్నాడు.*
 
*హమ్మయ్య... అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను.*

      *నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. ఇంతలో వేరే అతను బస్సు ఎక్కడంతో  అతను లేచి నిలబడి మళ్లీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు.*
*ఇలా అతను తరువాత నాలుగు అయిదు స్టాపులలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం చేస్తూ ఉన్నాడు.*
     *ఇదంతా గమనిస్తున్న నేను, చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను.*

      *‘’నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్లకు ఎందుకిస్తున్నావు?” అని అడిగాను.*

     *అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘’నేను ఏమి చదువుకోలేదు, డబ్బున్నవాణ్ణి కూడ కాదు. కూలి పనులు చేసుకునే వాణ్ణి. ఏ విధంగానూ ఎవరికీ ఏమి ఇవ్వలేక పోయాను. అందువలన నేను రోజూ ఈపని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడ” అన్నాడు.*
     *‘’కూలి చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు.*
*నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు థాంక్స్  చెప్తారు.*
*ఎవరికి ఏమి ఇవ్వలేని నాకు ఈ తృప్తి చాలు. ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది” అన్నాడు.*
      *నాకు నోటంట మాట లేదు. ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్ తో సమానమే. ఎదుటివాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీలేకపోయిన ఇవ్వచ్చు అని అతన్ని చూచి తెలుసుకొన్నాను.* 
    *మనం ధనవంతులం ,స్తితిమంతులం ఐతేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవటం తప్పు. ఇచ్చే మనసున్న ఎవరైన "ధనవంతుడే" అని అతన్ని చూశాక తెలుసుకున్నాను. ఒకరికి ఇవ్వడంలో గల *సంతృప్తి* *మరెందులోనూ రాదని అర్థమైంది.*
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
*మిత్రులారా దయచేసి సంస్థ సేవాగుణాన్ని , సంతృప్తిని పిల్లలలో అలవరచండి. మనం కూడా అలవరచుకునే ప్రయత్నం చేద్దాం*
*మానవసేవే మాధవసేవ*
👌👌👌👌👌🙏🙏🙏🕉🕉🕉🌼

Solar panels


 

Tiger

 


Namaskaram


 

Siva sankari











 

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 20  / Sri Devi Mahatyam - Durga Saptasati - 20 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 5*

*🌻. దేవీ దూతసంవాదం - 5 🌻*


96. ధనేశ్వరుడైన కుబేరుని నుండి తేబడిన మహాపద్మండే అనే నిధి ఇచట ఉంది. కింజల్కినిష్ అనే ఎన్నటికీ వాడిపోని తామరపూదండను సముద్రుడు ఇచ్చాడు.


97. వరుణుని ఛత్రం, బంగారం కురిసేది, మీ ఇంట ఉంది. పూర్వం ప్రజాపతిదైన రథోత్తమం కూడా ఇచట ఉంది. 


98. ప్రభూ! యముని శక్తిరూపాయుధమైన ఉత్కాంతిదం* నీవు తెచ్చావు. సముద్రరాజు యొక్క పాశం నీ సోదరుని సొత్తులో ఒకటై ఉంది.


99. సముద్రంలో పుట్టిన సమస్తరత్నజాతులు నిశుంభుని వద్ద కలవు. అగ్నిచేత పరిశుద్ధమొనర్పబడిన రెండు వస్త్రాలను అగ్నిహోత్రుడునీకు ఇచ్చాడు.


100. అసురనాథా! ఇలా నీవు రత్నాలను అన్నిటిని తెచ్చావు. శుభమూర్తి అయిన ఈ స్త్రీ రత్నాన్ని నీవెందుకు తీసుకురాలేదు?”


101-102. ఋషి పలికెను : చండుడు, ముండుడు చెప్పిన ఈ మాటలను విని శుంభుడు సుగ్రీవ మహాసురుని దేవి వద్దకు దూతగా పంపించాడు.


103. అతడిలా చెప్పాడు: “నీవు పోయి ఆమెతో నా మాటలుగా ఇలా చెప్పు. ఆమె త్వరితంగా నా వద్దకు సంప్రీతితో వచ్చే విధంగా ఈ కార్యాన్ని నిర్వహించు.”


104. పర్వతంపై, అతిసుందర తావున ఉన్న ఆ దేవి వద్దకు అతడు పోయి ప్రియ మధుర వాక్కులతో ఆమెతో పలికాడు.


105–106. దూత పలికెను : “దేవీ! రాక్షసప్రభువైన శుంభుడు ముల్లోకాలకు సార్వభౌముడు. ఆయన దూతగా పంపబడి నీ సన్నిధికొచ్చాను.


107. సర్వదేవతలు ఎవరి ఆజ్ఞను సదా శిరసావహిస్తారో, అసుర వైరులందరినీ ఎవరు ఓడించారో, ఆయన చెప్పిన మాటలను ఆలకించు:


108. ముల్లోకాలన్నీ నావి. దేవతలు నాకు వశవర్తులు. వారి యజ్ఞభాగాలన్ని నేను వేర్వేరుగా అనుభవిస్తున్నాను.


109-110. ముల్లోకాలలో గల శ్రేష్ఠమైన రత్నాలన్ని నా అధీనంలో ఉన్నాయి. అలాగే ఇంద్రుని వాహనమైన గజరత్నం (ఐరావతం) కూడా నా చేత తేబడింది. పాలమున్నీ చిలికినప్పుడు పుట్టిన ఉచ్చైశ్రవమనే అశ్వరత్నాన్ని దేవతలు నాకు ప్రణామపూర్వకంగా సమర్పించారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹

ఏ రాశుల వారు ఏ జ్యోతిర్లింగాన్ని

 ఏ రాశుల వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి ???

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.


*ద్వాదశ రాశుల మంత్రాలు ఇవి*


1 ) మేష రాశి :- ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః

2 ) వృషభరాశి :- ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయనమః

3) మిథున రాశి :- ఓం క్లీం కృష్ణాయ నమః 

4) కర్కాటక రాశి :- ఓం క్లీం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః 

5) సింహరాశి :- ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః 

6) కన్యారాశి :- ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః 

7) తులారాశి :- ఓం తత్వ నిరంజనాయ తారకారామాయ నమః 

8) వృశ్చికరాశి :- ఓం నారాయణాయ నరసింహాయ నమః 

9) ధనూరాశి :- ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః 

10 ) మకరరాశి :- ఓం శ్రీ వత్సలాయ నమః 

11 ) కుంభరాశి :- ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః 

12 ) మీనరాశి :- ఓం క్లీం ఉధృతాయ ఉద్దారిణే నమః


రాశుల ననుసరించి పై మహామంత్రాల్ని జపిస్తే మానవుడు చాలా భాగం మాయ నుండి బయట పడతాడు. సృష్టి స్థితి లయలకు మాయ మూలస్థానం. దీనికి లోబడే జగత్తు కాలభ్రమణ మవుతోంది . మయుడు మాయకే సూత్రధారి. అదే విష్ణుమాయ. త్రిమూర్తులు కూడా మాయబద్దులే. మానవుడు జాగ్రత్తగా ఉంటూ, ధార్మిక నియమాలు పాటిస్తూ ఉంటే, సర్వశుభాలు సమకూరు- టయేగాక , మరొక జన్మలేని పరమ పదాన్ని చేరతాడు . లోకకళ్యాణం కోసం మానవుడు ఏ కార్యం ఆచరిస్తాడో అదే సత్యం. అదే ధర్మం. అదే సత్య ధర్మం . 


ద్వాదశ రాశులు-- ద్వాదశ జ్యోతిర్లింగాలు


*మేషరాశి: రామేశ్వరం 

శ్లోకం:- సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖై్య

శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి.

ఈ రాశి కుజునికి స్వగృహం, చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర,, పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామచంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము ప్రతిష్టించెనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, ఎర్ర వస్త్ర దానములు కుడా చేసిన మంచి ఫలితములు వచ్చును.


*వృషభ రాశి: సోమనాధ జ్యోతిర్లింగము*

శ్లోకం:- సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే.

ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్చ రాశి. సోమనాధ జ్యోతిర్లింగం శ్రీ క్రిష్ణుడుచే స్తాపించ బడింది. ఈ రాశికి శని నవామాదిపత్య బాధకుడు అయినందున శని దోషాలకు సోమనాధ దేవాలయ దర్శనం, పై శ్లోక ధ్యానము చేసిన సుభ ప్రదము. జన్మ నక్షత్రమందు రుదభ్రిషేకం చేయించుట వలన మంచి ఫలితములు పొందగలరు. బొబ్బర్ల దానము, బియ్యము దానము చేసిన మంచిది.


*మిధున రాశి: నాగేశ్వర జ్యోతిర్లింగం:*

శ్లోకం:-యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భొగై ,

సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీ నగనాధం శరణం ప్రపద్యే.

ఈ రాశి బుధునికి స్వగృహము. దోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, ప్రతి రోజు పై శ్లోకమును చదువుట, ఈ రాశి శని సంచరించు కాలమునందు జన్మ నక్షత్ర రోజున కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన జరిపించిన విశేషమైన ఫలితములు కలుగును.


*కర్కాటకం: ఓంకార జ్యోతిర్లింగం:*

శ్లోకం:-కావేరికా నర్మదాయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ,

సదైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే

ఈ రాశి చంద్రునకు స్వగృహం , . ఓంకార జ్యోతిర్లింగ దర్శనం, రోజు పై శ్లోకం చదువుట , జన్మ నక్షత్రం రోజున ఓంకార బీజాక్షరం ఉచ్ఛరిస్తూ ఉండటం మంచి నివారణ ఉపాయములు.

*సింహరాశి : శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం*

శ్లోకం:-ఇలాపురే రమ్య విశాల కేస్మిన్‌ సముల్ల సంతం చ జగద్వ రేణ్యం, వందే మహా దారాతర స్వభావం, ఘ్రుశ్నేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘ్రుష్నేస్వర జ్యోతిర్లింగ దర్శనం, పై శ్లోకమును రోజు చదువుట, జన్మ నక్షత్రం నాడు ఏక దశ రుదభ్రిషేకం ద్వారా దోషాల నుండి విముక్తి పొందవచ్చును.


*కన్యా రాశి: శ్రీ శైల జ్యోతిర్లింగం*

శ్లోకం:-శ్రీ శైల శ్రుంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే పి ముదావసంతం,

తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం.

ఈ రాశికి అధిపతి బుధుడు. బాధల నుండి ఉపశమనం పొందుటకు శ్రీ శైల మల్లిఖార్జున దర్శనం, భ్రమరాంబకి కుంకుమ అర్చన, జన్మ నక్షత్రం రోజున చండి హోమం చేసిన ఉపశమనం పొందగలరు. రోజు పైన చెప్పిన శ్లోకం చదువుట, జన్మ నక్షత్రం రోజున ఆవుకి ఆకు కూరలు, పచ్చ పెసలు తినిపించుట మంచిది.


*తులారాశి: మహాకాళేశ్వరం*

శ్లోకం:- అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం అకాల మౄఎత్యో : పరిరక్ష ణా ర్థం వందే మహాకాల మహాసురేశం ఈ రాశికి శుక్రుడు అధిపతి, మహాకాళేశ్వర దర్శనము ద్వారా, శుక్రవారము సూర్యోదయ సమయములో బొబ్బర్లు దానం చేయుట ద్వారా దోషములు, బాధలనుండి విముక్తి పొందవచ్చును.


*వృశ్చిక రాశి: వైద్యనాదేశ్వరుడు*

శ్లోకం:-పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే , సాదావసంతం గిరిజాసమేతం ,

నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్య నాదం తమహం నమామి.

ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్ర చికిత్సలకి కారణ భూతం. బాధలకు వైద్య నాదేశ్వరుని దర్శించి , పూజించుట ద్వారా, మంగళవారము జన్మ నక్షత్రము రోజున కందులు, ఎరన్రి వస్త్రములు దానము చేయుట మంచిది. ఋతు క్రమ దోషములున్న స్త్రీలు పెద్ద ముత్తైదువులకు యెరన్రి వస్త్రములు దానము చేయుట మంచిది.


*ధనురాశి : విశ్వేశ్వర లింగం*

శ్లోకం:- సానంద వనే వసంతం, ఆనందకందం హత పాప బృందం

వారణాసీనాధ మనాద నాదం, శ్రీ విశ్వ నాదం శరణం ప్రపద్యే.

ఈ రాశి వారికి గురుడు అధిపతి, స్వస్తానం. వేదాంత ధోరణి విపరీత ఆలోచనలు, సైంటిఫిక్‌ ఆలోచనలు, వీరి లక్షణం. అద్దిశంకరుల వారికి మోక్షం ప్రసాదించిన కాశీ క్షేత్రం, , అన్నపూర్ణ వద్ద శివుడు భిక్ష అడుగుట, అర్ధరాత్రి గంగకి ఆవలి ఒడ్డున నారాయణ మంత్రంతొ శివుడు జీవులకి మోక్షము ప్రసాదిస్తాడని పురాణాలలో చెప్పబడింది. పై శ్లోక పారాయణ, పూజ చేయుట, కాశి క్షేత్ర దర్శనము , గురువారము రోజున, జన్మ నక్షత్రము రోజున శనగల దానము ఇచ్చుట ద్వారా శని, గురు గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చును.


*మకరము: భీమ శంకరం*

శ్లోకం:- యం డాకినీ శాకినికాసమాజై : నిషేవ్యమాణం పిశితా శనైశ్చ , సదైవ భీమాది పద ప్రసిధం, తం శంకరం భూత హితం నమామి. ఈ రాశి అధిపతి శని. గురునికి నీచ, కుజునికి ఉచ్చ,గురుడు అంటే జీవుడు , అహంకారపూరితమైన గజరాజు మొసలిచే పీడించబడి గజేంద్ర మోక్షము అనే ఆర్తి పూరితమైన ఘట్టం పురాణాలలో చెప్పబడింది. దోషాలకి భీమ శంకరం దర్శనం,,పూజ చేయుట, పై శ్లోక పారాయణము నిత్య పారాయణము, శని వారము నల్ల నువ్వుల దానము, నల్లని వస్త్రాలు దానము ఇచ్చుట, అవిటివారికి, ముసలి వారికి వస్త్ర దానము చేయుట మంచిది


*కుంభం:కేదారేశ్వరుడు*

శ్లోకం:-మహాద్రి పార్శే్వ చ రమంతం, సంపూజ్య మానం సతతం మునీన్రై్ద :

సురాసురై ర్యక్ష మహోర గాదై్య : కేదారమీశం శివమేక మీడే .

ఈ రాశికి శని అధిపతి, దోషాలకి కేదాద్రేశ్వర దర్శనము, పూజించుట, నిత్యమూ పై శ్లోక పారాయణము, శని వారము నువ్వుల దానము, అభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చేసిన మంచిది.


*మీన రాశి: త్రయంబకేశ్వరుడు* 

శ్లోకం:-సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాథ్‌ పాతక మాశు నాశం, , ప్రయాతి తం త్రయంబక మీశ మీడే . ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడు నీటి మధ్యలో ఉంటాడు. అధిక ఫలితాలని ఇస్తాడని పురాణ ప్రసిద్ది. దోషాలకు త్రయంబకేశ్వర దర్శనము, చిత్రపటము పూజ మందిరమునందు ఉంచి నిత్యమూ పై శ్లోకము పారాయణము చేయుట మంచిది.

నైవేద్యం

 #నైవేద్యం


ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని  ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు...


ఆరోజు పాఠం


 “ ఓం పూర్ణమద: పూర్ణమిదం 

పూర్ణాత్ పూర్ణముదచ్యతే 

పూర్ణస్య పూర్ణమాదాయ

 పూర్ణమేవావశిష్యతే”.... అనే శ్లోకం . 


పాఠం చెప్పడం పూర్తయిన  తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్ది సేపటి తరువాత నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు... నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు.. 


శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు.. దానికి ప్రతిగా శిష్యుడు., కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు... శ్లోకం పుస్తకం లోనే ఉందిగా… నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు...


గురువు గారే మళ్ళీ అన్నారు... పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది… నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది... ఆదే స్థితి లో  నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు.


అదే విధంగా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మ స్థితి లో గ్రహించి, స్థూల రూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు.. దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం... అని వివరణ చేశారు గురువు గారు....


“పేరు దేవుడిది - పొట్ట మనది” అని హేళన చేసే వారికి ఇదే హిందూ ధర్మ సమాధానం..


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Pravachanam










 

God









 

మగవాడు

 *🧎‍♂️మగవాడు సృష్టికి అందం🧎‍♂️*

మగవాడు

వాడు మొలతాడు కట్టిన మగాడు

ఇంటికి రక్షణ వాడు.

సంసారనౌకకు కెప్టెన్ వాడు

మగవాడు, మగతోడు లేని ఇల్లు ఇల్లేకాదు.

సృష్టిలో అందమైనవన్నీ మగ జాతులే.

మగవాని నడకే అందం

పలుకే అందం

అసలు సృష్టిలో అందమంటే మగవాడే

త్యాగజీవి కనుక అందం అన్న పదాన్ని ఇతరులకు త్యాగం చేసేసాడు.

ఏ అలంకారాలు లేని అందమే అసలైన అందం అని తెలిసిన జ్ఞాని కనుక.

 ఇంటికి అందం మగాడు

ఇంట్లో వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేవాడే మగాడు.

ఇంట్లో బాధలన్నీ అవలీలగామోసే సైనికుడు వాడు ఒక తాతగా, ఒక మామగా, ఒక బాబాయిగా. ఒక తండ్రిగా,ఒక భర్తగా, ఒక అన్నగా,ఒక తమ్ముడిగా, పేరేదైతేనేం,పిలుపేదైంతేనేం వాడు మగాడ్రా బుజ్జీ.


ప్రేమకు నిలువెత్తురూపం

నాన్నా అంటే పరిగెత్తురూపం మగాడు.

అమృతం వంటి మగాళ్ళను గంజాయి మొక్కలాంటి కొందరితో సరిపోల్చి మృగాళ్ళంటున్నారు.

తన కొరకు కాకుండా తన కుటుంబం కొరకు హమేషా భారం మోసే హమాలీ మగాడు.

మగాడుకి తన గురించి

ఒక్క క్షణం కూడా ఆలోచించే సమయం లేని నిరంతర శ్రమజీవి.

చీకట్లో కూడా ఏడవలేని అదృష్టజీవి మగాడు.

అందరి హ్యాపీ గురించి ఆలోచిస్తూ తన ఉనికిని మర్చిపోయాడు మగాడు.

ఇంట్లో వాళ్ళ మన స్తత్వాలు బయట పడకూడదన్ని తానే చెడ్డోడని మాటపడతాడు.

మీసాలోచ్చిన నాటి నుండి

చదువులు, సంపాధనలు, కార్లు. మేడలు, నగలు, చీరలు ఎన్ని కొన్నావనే మాటలే గానీ నువ్వు మంచోడివి, మానవత్వం ఉన్నవాడివి మగాడివి అన్న మాట ఎవరైనా అంటే కదా!


ఆ శబ్దాలు విని విని ఓహో పైవన్నీ సంపాదిస్తేనే మగాడంటారన్న ఒక భ్రాంతిలో పడి తన ఇష్టాలను వదిలేసే కూలీ

బాధ్యతున్న మగాడు.


తన ప్రేమ కోసం ప్రాణ త్యాగానికైనా మడమతిప్పని మగధీరుడే *మగాడు.*


నిన్ను నాలుగుదిక్కులు తిప్పే డ్రైవర్

కర్తవ్యం కోసం కర్త కర్మ క్రియ ఐన *కార్యకర్త.*


*పురుషుడు లేకుండా పుడమిలేదు*


మగాడిని *మంచోడుగా* భావించే 


 "మహానుభావులందరికీ"

*మగాళ్ళ (పురుషుల) దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు.*

యజ్ఞాలు

 ఒకప్పుడు ప్రతీ ఇంట్లో యజ్ఞాలు,వ్రతాలు చేయించుకునేవారు..అందువల్ల కుటుంబాలలో సుఖ శాంతులు ఉండేవి..ముఖ్యంగా బ్రాహ్మణుల కడుపు నిండేది..ఇప్పుడు ఆ ఆచారాలు లేకపోవడం వల్ల చాలా మంది బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా ఉంది..


దేవాలయాలను పట్టించుకునే నాథుడే లేడు..ఎటు చూసినా బ్రాహ్మణులకు కష్టాలే..మనం బ్రాహ్మణులకు తిండి పెట్టాలన్నా,మన ధర్మాన్ని రక్షించుకోవాలన్నా ఒక మార్గం ఉంది..మన అందరి ఇళ్ళల్లో నెలకు ఒక్కసారైనా పూజకాని యజ్ఞం కానీ చేయించుకోవాలి.. అలా చేస్తే బ్రాహ్మణులు చల్లగా ఉంటారు..మన కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయి..మన ధర్మం నిలబడుతుంది..🙏🙏

హయగ్రీవ 

Aaradhana

 💟🕉️💟


కొన్ని ముఖ్యమైన విషయాలు. 


పూజ :- పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణఫలాన్నిచ్చేది.


అర్చన:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది. అర్చన ఆనందం ఇస్తుంది. 


జపం:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జివున్ని , దేవుణ్ణి చేస్తుంది. 


స్తోత్రం:- నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం. ఇది శాంతి నీ ఇస్తుంది.


ధ్యానం:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది. ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం. 


దీక్ష:- దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది. సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.


అభిషేకం :- అభిషేకం చేస్తే , చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి. అభిషేకం అహంకారం పోగెట్టి పరా తత్వాన్ని అందిస్తుంది. పరమ పవిత్రమైన శాంతి ని ఇస్తుంది.


మంత్రం:- తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తి నీ ఇస్తుంది. 


ఆసనం:- ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.


తర్పణం:- పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


గంధం:- గంధం లో సర్వ దేవత కొలువు అయి ఉన్నారు. దేవతలు అమ్మవారిని ఇలా అడిగారు. అమ్మ 

మేము కూడా మీ పూజ లో ఉండాలి . అని అన్నారు. అప్పుడు అమ్మవారు మీరు గంధం లో కొలువు అయి ఉండండి అని వరం ఇచ్చింది. అప్పటినుండి గంధం కి ఉత్తమంగా పూజ లో వాడుతున్నారు. గంధం మంచి కి సూచిక. 


అక్షతలు:- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ , మంచి బియ్యం కలిపి చేయాలి. 


పుష్పం:- పుణ్యాన్ని వృద్ధిచేసే. , పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది.

అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి. 

 మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభమ్ కలుగుతుంది. 


ధూపం:- చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా మంచి జరుగుతుంది. ఈ వాసనకి ప్రేత , 

పిచాచాలు పారిపోతాయి. 


దీపం:- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానం కి సూచన. 

 పూజ గదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు. అగ్ని శివ కుమారుడు అయిన కుమార స్వామి కి ప్రతీక. 


నైవేద్యం:- మధుర పదార్థాలను, దేవతకు తృప్తినిచ్చే దానిని నివేదన చేయుటయే నైవేద్యం అంటారు. భగవాన్ నివేదన అయిపోయాక దానినే ప్రసాదం అంటారు.


ప్రసాదం:- ప్రకాశానందాల నిచ్చేది. సామరస్యాన్ని కల్గించేది. పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం. ప్రసాదం భగవాన్ యొక్క 

అనుగ్రహం కి సూచిక.

 పవిత్ర మైనది. 


ఆచమనీయం:- ఇది జలం తో చేయవచ్చు. 


స్వాగతం, ఆవాహనం:- దేవతను ఆహ్వానించడం. అలాగే పూజ కొరకు దేవతను పిలుచట నీ ఆవాహన అని అంటారు. పూజలో దేవత పేరుతో మంత్రాన్ని పఠిస్తూ పూజ మొదలు పెడుతారు. మొదట మహా గణపతి, గురువు నుండి మొదలు పెట్టాలి. ముఖ్యంగా కుల దేవత ఆహ్వానం జరుగాలి. ఇది మర్చిపోవద్దు. 


పాద్యం:- చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.


మధుపర్కం:- తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది. ఇది ఆరోగ్యం కోసం మంచిది. జీర్ణ వ్యవస్థ నీ మంచిగా ఉంచుతుంది.


స్నానం:- స్నానం అనేది శరీర శుద్ది కోసం అయితే ఈ స్నానమునీ మౌనంగా భగవాన్ నామాన్ని మానసికంగా స్మరిస్తూ చేస్తే మంచిది. 


వందనం:- అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం, మరియు చేతులు జోడించి వందనం చేయండి. సాష్టాంగ ప్రణామం అనగా వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం. ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి. ఇది స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాళ్ళ పై భగవాన్ కి వందనం చేయొచ్చు. 


ఉద్వాసన:- దేవత లను, ఆవరణ దేవతలను పూజించి, పూజను ముగించడాన్ని ఉద్వాసనమని అంటారు. చివర్లో ప్రార్థన , దోష క్షమాపణ చెప్పి తీర్థ , ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయాలి. 


స్వస్తి

🙏🙏🙏🙏

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అలక..అనునయం.*


"స్వామివారి దగ్గర కొన్నాళ్ల పాటు ఉండాలని వచ్చానండీ..నేను చేయదగ్గ పనులేమైనా వుంటే..చేసి పెడతాను..ఇక నా శేష జీవితం ఈ స్వామివారి సన్నిధిలోనే గడచిపోవాలి.." అన్నారు పామూరు నుంచి వచ్చిన షేక్ బాషా గారు..


ఆయన వయసు డెబ్భై ఏళ్ళు..పైగా మధుమేహం తో బాధ పడుతున్నారు..రోజూ రెండుపూటలా ఇన్సులిన్ తీసుకోవాలి..అటువంటి మనిషికి ఏ పనులు చెప్పగలం?..ఆయనను నెత్తిన పెట్టుకొని చూసే కుమారులున్నారు..ఇద్దరు కొడుకులూ వివాహాలు చేసుకొని..హాయిగా వుంటున్నారు..మనుమలు, మనుమరాళ్లు..ఇల్లంతా సందడిగా ఉంటుంది..మరి ఈయన హఠాత్తుగా మందిరానికి వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు వుంటానంటున్నాడు..ఏం జరిగింది?..పరి పరి విధాల ఆలోచించాను నేను..


బాషా గారి కుటుంబం మొత్తం శ్రీ స్వామివారికి భక్తులు..ప్రతి రెండు మూడు నెలల కొకసారి మొగలిచెర్ల కు వచ్చి..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళుతుంటారు..ఏదైనా శుభకార్యం అనుకుంటే..ముందుగా శ్రీ స్వామివారి కి అర్చన చేయించుకొని వెళతారు..వాళ్ళు ఏరోజూ మతం గురించి పట్టించుకోలేదు..అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు..తమ కుటుంబంలోని అందరి పేర్లతో అర్చన చేయించుకుంటారు..స్వామివారికి నైవేద్యంగా పొంగలి పెట్టుకొని వస్తారు..శ్రీ స్వామివారి సమాధి వద్దకు నన్ను అనుమతి అడిగి..ఆ తరువాతే అక్కడికి వెళ్లి నమస్కారం చేసుకుంటారు..చాలా వినయంగా..అత్యంత భక్తితో ప్రవర్తిస్తారు..ఆ కుటుంబం ఎప్పుడు దర్సనానికి వచ్చినా..మా సిబ్బంది వారిని నేరుగా గర్భాలయం వద్దకు పంపిస్తారు..


బాషా గారికి కావాల్సిన ఆహారం ఏర్పాటు చేయమని మందిరానికి వంటమనిషి తో చెప్పి..ఆయనకు ఒక చిన్న గది కేటాయించాము..సాయంత్రం గా బాషా గారి వద్ద కూర్చుని.."ఇలా మీరు ఒక్కరే వచ్చారు..మీ అబ్బాయిల సహాయం తీసుకోకపోయారా?..మీరేదో మనసులో బాధ పెట్టుకుని ఇక్కడికి వచ్చినట్లుగా నాకు తోస్తున్నది..అదేదో చెప్పండి..వీలైతే పరిష్కరిస్తాను.." అని అనునయంగా అడిగాను..


"ఏమీ లేదండీ..ఇంట్లో వాళ్లు నా పట్ల సరిగా ప్రవర్తించటం లేదు..నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు..నాకు మనసుకు కష్టం వేసింది..అందుకని వాళ్లకు చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను..మీరూ వాళ్ళతో చెప్పొద్దు..నేను ఆ దత్తయ్య పాదాల దగ్గరే వుంటాను..ఇంత ఆహారం పెట్టండి చాలు!.." అన్నారు..


నాకు విషయం పూర్తిగా అర్ధమైంది..తరాల మధ్య వచ్చే అంతరాయం ఈ కుటుంబంలో కూడా వచ్చింది..పెద్దవాళ్ళ అభిప్రాయాలకు..పిల్లల ఆలోచనలకు తేడా ఉంటుంది..అటువంటి సందర్భాలలో..పెద్దల మనసు నొప్పించకుండా..తమ పనులు చక్కబెట్టుకునే నేర్పు కావాలి..కొద్దిగా తేడా వచ్చినా..ఫలితం వేరుగా ఉంటుంది..బాషా గారు బాగా మొండితనం తో వున్నారు..పిల్లల దగ్గరకు వెళ్ళను అని భీష్మించుకుని వున్నారు..ఆయన కుమారులిద్దరికీ కూడా తండ్రి అంటే అత్యంత గౌరవం తో కూడిన ప్రేమ ఉందని నాకు తెలుసు..ఎందుకనో ఈ పెద్దాయనే కొద్దిగా తొందరపడ్డాడని అనిపించింది..


"ఈ సమస్య పరిష్కరించు స్వామీ.." అని ఆ స్వామివారికి విన్నవించుకొని..ఒక నమస్కారం చేసి వచ్చేసాను..ఆరాత్రి గడిచి పోయింది..ఉదయం పది గంటల సమయం లో బాషా గారి పెద్దకుమారుడు నాయబ్ రసూల్ వచ్చారు..నేరుగా నా దగ్గరికి వచ్చి.."నిన్నటి నుండి నాన్నగారు కనబడలేదండీ..అంతా వెతికాము..తెల్లవారుఝామున కొద్దిగా నిద్ర పట్టింది..శ్రీ స్వామివారు ఇక్కడికి రమ్మని పిలిచినట్లు అనిపించింది..ఒకసారి కాదు..రెండు మూడు సార్లు అలా అనిపించింది.. తెల్లవారగానే స్నానం చేసి..ఇలా నేరుగా వచ్చాను.."అన్నారు..


వారిని కూర్చోమని చెప్పి..వాళ్ళ నాన్నగారు ఇక్కడ క్షేమంగా ఉన్నారని తెలిపాను..నాయబ్ రసూల్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది.."శ్రీ స్వామివారు మాకు అన్యాయం చేయడు!..చేయిపట్టి నడిపిస్తాడు మమ్మల్ని.."అన్నారు..బాషా గారిని పిలిపించాను..కుమారుడిని చూసిన బాషా గారు ఎటువంటి భేషజానికి పోలేదు..ఆప్యాయంగా కౌగలించుకున్నారు..నిన్నటి కోపం ఎటుపోయిందో తెలీదు..ఇద్దరూ కలిసి శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకున్నారు..


"నిన్న రాత్రి శ్రీ స్వామివారు నన్ను కోప్పడ్డట్లు గా అనిపించింది..నేను పొరపాటు చేశానని అర్ధం అయింది..అందుకే అబ్బాయి రాగానే అతనితో వెళ్లాలని నిర్ణయించుకున్నాను..ఇంతకూ మీరు అబ్బాయికి కబురు పెట్టారా?.." అన్నారు బాషా గారు..


"మీరన్నది నిజమే..శ్రీ స్వామివారే మిమ్మల్ని కోప్పడ్డారు..మీ అబ్బాయిని పిలిపించారు..మేము కేవలం ప్రేక్షకులమే.."అని చెప్పాను..బాషా గారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి..మరొక్కసారి శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకొని..తన పెద్దకుమారుడు నాయబ్ రసూల్ వెంట పామూరు వెళ్లిపోయారు..


తన భక్తుల మధ్య ఎడబాటు రాకుండా శ్రీ స్వామివారు చల్లటి చూపుతో అనుగ్రహించారు..


సర్వం..

దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699).

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏


యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయ:ప్రదో ద్యోగినో,

దృష్టాదృష్ట మతోపదేశకృతినో , బాహ్యంతరవ్యాపినః 

సర్వజ్ఞస్య , దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా,

శంభో త్వం " పరమాంతరంగ " ఇది మే చిత్తే స్మరా మ్యన్వహమ్



సీ

భక్త యోగక్షేమ భారవాహివి నీవు ,

          హెచ్చు శ్రేయస్సుల నిచ్చె దీవు ,

యిహపర సమ్మత హితగతి బోధించి 

           సుపథంబు జీవికి జూపె దీవు ,

బ్రహ్మాండ జగతిలో బాహ్యాంతరములందు

           పర్వ్యాప్త  రూపాన  వరలు దీవు ,

కరుణామయుండవు , కామిత దాతవు ,

            సర్వజ్ఞుడవు నీవు , స్వామి వీవు ,

నీశ్వరా ! సర్వ0బు నిచ్చియుండగ తృప్తి

            నింక నే గోరంగ  నేమి గలదు

భవవిదూర ! నిన్ను " పరమాంతరంగు " గా

భక్తితోడ దలచి భావమందు

పాయకుండ నేను ప్రతిదినమ్మ0దునన్

స్మరణ సేయుచుంటి సంతసమున.         35 #



భక్తోభక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః

కుంభే సాంబ ! తవాoఘ్రిపల్లవయుగం సంస్థాప్య 

సంవిత్ఫలమ్

సత్త్వం మంత్ర ముదీరయన్ నిజాశరీరాగారశుద్ధిo వహన్

పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కల్యాణ మాపాదయన్ 



తరుణేందు భూష ! నా తనువను గృహమును

            పరిశుద్ధి గావించి భవ్యముగను

సకల శుభంబులన్ సన్ముక్తి పొందంగ

            రమణీయ మొనరించి రంజితముగ

నతిపూత సద్భక్తి యను నూలుపోగుతో

           చుట్టుచున్ దృఢముగా చుట్టబడియు

సంతసంబను దివ్య సలిలంబు తోడను

             పూరింప బడియును పూతముగను

కడు నిర్మలంబైన కలశంబు లోపల

             భవదంఘ్రులను పల్లవముల పైన

 జ్ఞానంబనెడి నవ్య నారికేళంబును

              కూర్చుండ జేసియు కుదురుగాను

సత్త్వ మైనట్టి మంత్రముల్ చదువుచుండి

పూత పుణ్యాహవచనంబు బుద్ధిగాను

చదివి ప్రకటించుచుంటిని సకలవినుత !

ముక్తి దయచేయు మో స్వామి ! శక్తినాథ !    36 #



✍️గోపాలుని మధుసూదన రావు🙏

యోగ వాసిష్ఠం

 పుత్ర, భార్యా, గృహాదులందు మమత్వం లేకుండుట, ఆ పుత్రాదులకు కలిగే సుఖదుఃఖాలు తనవే అనుకునే అభిమానం వదలుట, ఇష్ట, అనిష్టములు సంభవించినపుడు సదా సమచిత్తము కలిగియుండుట, అనన్యభావనతో ఆత్మను గూర్చి చింతన చేయుట, ఏకాంతం ప్రదేశమున ఉండుట, జన సమూహము నందు అప్రీతి కలిగియుండుట, నిత్యం  ఆధ్యాత్మిక ఙ్ఞానం కలిగియుండుట, ఆత్మ స్వరూపాన్ని అవలోకించుట ఇదియే ఙ్ఞానం. దీనికి వేఱైనది అంతయు అఙ్ఞానమే.

...యోగ వాసిష్ఠం