*ఆఫీస్ కు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా, నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను. బస్టాండ్ కు చేరుకున్న నేను, అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను. పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు.*
*అప్పుడే... ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి, అతను వేరే దగ్గరకి వెళ్ళి నిలుచున్నాడు.*
*హమ్మయ్య... అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను.*
*నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. ఇంతలో వేరే అతను బస్సు ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్లీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు.*
*ఇలా అతను తరువాత నాలుగు అయిదు స్టాపులలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం చేస్తూ ఉన్నాడు.*
*ఇదంతా గమనిస్తున్న నేను, చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను.*
*‘’నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్లకు ఎందుకిస్తున్నావు?” అని అడిగాను.*
*అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘’నేను ఏమి చదువుకోలేదు, డబ్బున్నవాణ్ణి కూడ కాదు. కూలి పనులు చేసుకునే వాణ్ణి. ఏ విధంగానూ ఎవరికీ ఏమి ఇవ్వలేక పోయాను. అందువలన నేను రోజూ ఈపని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడ” అన్నాడు.*
*‘’కూలి చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు.*
*నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు థాంక్స్ చెప్తారు.*
*ఎవరికి ఏమి ఇవ్వలేని నాకు ఈ తృప్తి చాలు. ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది” అన్నాడు.*
*నాకు నోటంట మాట లేదు. ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్ తో సమానమే. ఎదుటివాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీలేకపోయిన ఇవ్వచ్చు అని అతన్ని చూచి తెలుసుకొన్నాను.*
*మనం ధనవంతులం ,స్తితిమంతులం ఐతేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవటం తప్పు. ఇచ్చే మనసున్న ఎవరైన "ధనవంతుడే" అని అతన్ని చూశాక తెలుసుకున్నాను. ఒకరికి ఇవ్వడంలో గల *సంతృప్తి* *మరెందులోనూ రాదని అర్థమైంది.*
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
*మిత్రులారా దయచేసి సంస్థ సేవాగుణాన్ని , సంతృప్తిని పిల్లలలో అలవరచండి. మనం కూడా అలవరచుకునే ప్రయత్నం చేద్దాం*
*మానవసేవే మాధవసేవ*
👌👌👌👌👌🙏🙏🙏🕉🕉🕉🌼
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి