21, సెప్టెంబర్ 2020, సోమవారం

14-27-గీతా మకరందము


        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - తాను సాక్షాత్ పరబ్రహ్మమేయని శ్రీకృష్ణమూర్తి తెలుపుచున్నారు - 


బ్రహ్మణో హి ప్రతిష్ఠాఽహం అమృతస్యావ్యయస్య చ | 

శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ || 


తాత్పర్యము:- ఏలయనగా, నేను నాశరహితమును, నిర్వికారమును, శాశ్వత ధర్మస్వరూపమును, (దుఃఖమిశ్రితముకాని) నిరతిశయ (అచంచల) ఆనందస్వరూపమును అగుబ్రహ్మమునకు ఆశ్రయమును (అనగా బ్రహ్మముయొక్క స్వరూపమును) అయియున్నాను.


వ్యాఖ్య:- 'అచంచల భక్తితో నన్ను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మమును బొందు’నని పైశ్లోకమునందు శ్రీకృష్ణమూర్తి తెలియజేసి, తాను వాస్తవముగ నెవరో తన యథార్థస్వరూపమెట్టిదో ఈశ్లోకమున వెనువెంటనే విశదీకరించుచున్నారు. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాడు. సాక్షాత్ పరమాత్మయే, పరబ్రహ్మమే. ఆ సత్యమే యిచట తెలియజేయబడినది. ఆతడు యశోదాతనయుడు మాత్రమేకాదు; నాశరహితమై, శాశ్వతధర్మస్వరూపమై, నిరతిశయ ఆనందరూపమైనట్టి బ్రహ్మమే తానని శ్రీకృష్ణమూర్తి తెలియజేసిరి. ఇక్కారణమున వారిని అచంచలభక్తితో ధ్యానించువారు భ్రమరకీటకన్యాయము ననుసరించి వారియందే అనగా బ్రహ్మమునందే లయించి బ్రహ్మస్వరూపులే యగుదురు. ధ్యాత ధ్యేయాకారముగనే పరిణమించును. ఆ పరబ్రహ్మముయొక్క స్వరూపమెట్టిదో ఇచట విశదముగ తెలుపబడినది. అది (1) అమృతము, అవ్యయము - అనగా మరణరహితమైనది, వికారవర్జితమైనది - ఈ పదములద్వారా బ్రహ్మముయొక్క 'సత్' అంశము నిరూపితమైనది. మఱియు అది (2) శాశ్వత ధర్మస్వరూపము - ఈ పదముద్వారా బ్రహ్మముయొక్క ‘చిత్' అంశము నిరూపింపబడినది. (3) నిరతిశయానందరూపము - ఈ పదముద్వారా ‘ఆనంద’ అంశము నిరూపితమైనది. ఈ ప్రకారముగ సత్, చిత్, ఆనందమగు పరబ్రహ్మమే తానని శ్రీకృష్ణభగవానుడు తెలియజేసిరి. ఉపాసనాసౌలభ్యముకొఱకు ప్రారంభమున శ్రీకృష్ణుని యశోదాతనయుని రూపమునను, శ్రీరాముని కౌసల్యాతనయుని రూపమునను ధ్యానించినను, వాస్తవముగ వారిరువురును, నిర్గుణ, నిరాకార, సచ్చిదానంద పరబ్రహ్మరూపులేయని ఎప్పటికైనను తెలిసికొనవలసి యుండును. ఈ శ్లోకముచే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతముల మూడిటియొక్క లక్ష్యము యథార్థముగ ఒకటేయగుచున్నదని స్పష్టమగుచున్నది. ఏలయనిన ద్వైత, విశిష్టాద్వైతులు ఏ భగవద్రూపమును అర్చించుచున్నారో ఆ రూపము వాస్తవముగ సచ్చిదానందమే అయియున్నదని ఇట తేలిపోయినది. భక్తియోగము, జ్ఞానయోగము ఈ శ్లోకమున పరస్పరము కౌగిలించుకొనుచున్నవి. కావున ఇక ఆయా సంప్రదాయములవారు పరస్పరము విమర్శించుకొనక అందఱు ధ్యానించునది ఒకే పరబ్రహ్మమనియే నిశ్చయించి వారి వారి సంస్కారమున కనుగుణ్యమైన ఉపాసనాపద్ధతిని, ధ్యేయాకారమును ఏర్పాటుచేసికొని కట్టకడకు అందఱును ఆ పరబ్రహ్మమునే చేరవచ్చును.

ప్రశ్న:- శ్రీకృష్ణమూర్తి వాస్తవముగ నెట్టివారు?

ఉత్తరము:- పరబ్రహ్మస్వరూపుడు. 

ప్రశ్న:- పరబ్రహ్మమెట్టిది?

ఉత్తరము:- (1) నాశరహితమైనది, నిర్వికారమైనది (సత్) (2) శాశ్వతధర్మస్వరూపమైనది (చిత్) (3) నిరతిశయ ఆనందరూపమైనది (ఆనందము).

 

ఓమ్ 

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 

శ్రీకృష్ణార్జునసంవాదే గుణత్రయవిభాగయోగోనామ 

చతుర్దశోఽధ్యాయః

ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,

శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు గుణత్రయ విభాగయోగమను 

పదునాల్గవ అధ్యాయము 

ఓమ్ తత్ సత్

కర్ణుడి జన్మవృత్తాంతం

 ఆదిపర్వము – 26




ధృతరాష్ట్రుని తమ్ముడు పాండు రాజు కూడా సకల విద్యలలో ఆరితేరాడు. వేదాలు, శాస్త్రాలు, ఆయుధ విద్యలను నేర్చుకున్నాడు. పాండు రాజుకు వివాహం చెయ్య సంకల్పించాడు భీష్ముడు.


ఇదిలా ఉండగా – శూరుడు అనే యాదవ రాజు ఉండేవాడు. ఆయన పెద్ద కూతురు పేరు పృధ. శూరుడు తన కూతురు పృధను తన మేనత్త కుమారుడైన కుంతి భోజునకు సంతానం లేని కారణంగా, పెంచుకోవడానికి ఇచ్చాడు. పృధ కుంతి భోజుని ఇంటిలొ పెరుగుతూ ఉంది.


ఒకరోజు మహాముని దుర్వాసుడు కుంతిభోజుని భవనానికి వచ్చాడు. పృధ చేసిన సత్కారాలకు సంతుష్టుడయ్యాడు.


ఆమెను చూసి “కుమారీ, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావో, ఆ దేవతలు నీకు నీవు కోరిన కొడుకులను ప్రసాదిస్తారు” అని చెప్పాడు.


ఒకరోజు పృధ ఒంటరిగా గంగా నది ఒడ్డుకు వెళ్లి, స్నానం చేసి, సూర్యుడికి అర్ఘ్యం విడిచింది. అప్పుడు ఒక ఆలోచన వచ్హి, బాల్య చాపల్యంతో దుర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలని అనుకుంది. వెంటనే మంత్రాన్ని జపించి “దేవా, నాకు నీ వంటి కొడుకును ఇమ్ము” అని సూర్యదేవుడిని ప్రార్థించింది.


వెంటనే సూర్యుడు ప్రత్యక్షం అయ్యాడు. సూర్య భగవానుని చూసి పృధ వణికి పోయింది. సూర్యుడు ఆమెను చూసి “బాలా భయపడకు, నువ్వు కోరిన వరం ఇవ్వాడానికి వచ్చాను” అని చెప్పాడు.


“దేవా, నేను కన్యను. బాల్య చాపల్యంతో అడిగాను. నన్ను క్షమించు” అని వేడుకొంది.


“బాలా, నా దర్శనం వృధా పోదు. నీకు కొడుకు పుడతాడు” అని అన్నాడు.


“దేవా, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు నాకు గర్భం వస్తే నా తల్లి తండ్రుల మొహం ఎలా చూడను” అని అడిగింది.


“నీ కన్యత్వం చెడకుండా నీకు పుత్రుని ప్రసాదిస్తాను” అని చెప్పాడు.


వెంటనే ఆమెకు సహజ కవచ కుండలాలతో కర్ణుడు పుట్టాడు. సూర్యుడు వెళ్లి పోయాడు. చేతిలో బిడ్డతో పృధ నిలబడిపోయింది. ఏమి చెయ్యాలో తోచలేదు.


“ఆ ముని ఏల రావలె, వచ్చినా మంత్రము ఏల ఉపడేశించవలె. ఉపడేశించినా నేను ఏల వరము కోరవలె. నేను బుధ్ధిలేక కోరినా సూర్యుడు ఏల పుత్రుని ప్రసాదించవలె. అంతా విధిలీల. ఇప్పుడు ఈ లోకాపవాదము ఏల తప్పుతుంది. ఈ బాలుని ఇంటికి తీసుకొని వెళ్లితే నన్ను అందరూ తిడతారు. అలా అని ఈ బిడ్డను వదలబుధ్ధి కావడంలేదు. ఏమి చెయ్యాలో తోచడం లేదు” అని చింతిస్తూ ఉంది.


ఇంతలో అమూల్యమైన బంగారము, రత్నములు, మణులుగల ఒక పెట్టె నదిలో తేలుతూ వచ్చింది. కుంతి వెంటనే ఆ బిడ్డను ఆ పెట్టెలో పెట్టి నదిలో విదిచిపెట్టింది. ఆ పెట్టె అలా నదిలో తేలుతూ పోతూ ఉంటే, ఒకసూతుడు దానిని చూసాడు. పెట్టెను ఒడ్డుకు తీసుకొని వచ్చి తెరిచాడు. పెట్టెలో బంగారము, రత్నములు, మణులతో సహా బిడ్డ కనిపించాడు. వెంటనే ఆ బిడ్డను తీసుకొని వెళ్లి తన భార్య రాధకు ఇచ్చాడు, రాధ ఎంతో సంతోషించింది. బంగారము, మణులతో దొర్కడం వల్ల ఆ బిడ్డకు “వసుషేణుడు” అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

రామాయణ విందుభోజనం

 

...

మరల ఇదేల రామాయణమ్ ? అని జనం ప్రశ్నించారు విశ్వనాధ వారిని ! లోకంలో ఇప్పటికే వందలకొద్దీ రామాయణాలు పుట్టుకొచ్చాయి మళ్ళా నువ్వు రాయకపోతే ఏం ? అన్నట్లుగా అడిగారు ఆయన్ని ! 

.

జనం ఎప్పటినుండో అనగా కోట్ల సంవత్సరాలనుండీ అన్నమే తింటున్నారు ! మళ్ళా ఇప్పుడు కూడా అన్నమే ఎందుకు తినాలి ? అని ఎదురు ప్రశ్నించారాయన !

.

నిజమే కదా ! రోజూ తినే అన్నమే మరలమరల తింటున్నాము కదా విసుగు పుట్టడం లేదు కదా ! 

.

మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం అన్నం తింటాం 

అలాగే మన సమాజాన్ని కాపాడుకోవడం కోసం రామాయణం వింటాం !

.

అన్నం రుచిచూసేది నాలుక 

రామనామామృత రుచి తెలిసేది చెవులకు ,మనస్సుకు,మన మేధస్సుకు ! 

.

ఒక్కొక్కరి రుచి ఒక్కొక్కరిది !

.

ఒక్కొక్క వంటవాడు ఒక్కో విధంగా వంటలు చేస్తాడు . వండించుకునే వాడి స్థాయిని బట్టి విందుభోజనంలోకి పదార్ధాలు తయారు అవుతాయి ! 

.

సాహితీసంపదలో విశ్వనాధవారు అపర కుబేరుడు ! ఆయన ఇచ్చే సాహితీ విందుభోజనానికి సాటి వచ్చేది ఎక్కడా దొరకదు ! 

.

మరి నేను కూడా విందు ఇవ్వాలి అనుకుంటున్నాను ,కానీ నేను కడు పేదవాడిని నా శక్తికొలదీ విందుభోజనం పెడుతున్నాను ! 

.

అసలు అంతకు ముందు రామాయణం విందు ఇచ్చిన అందరికంటే నా శక్తి చాలా తక్కువ ! 

.

ఏదైనా లోపముంటే అది నాది ! 

.

ఎప్పుడూ విందుభోజనం మాత్రం పెట్టే శక్తిని ఇవ్వమని ఆ శ్రీరామచంద్రపరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ !


****************************************


రామాయణమ్.88

..

భరతుడిని తీసుకురావటానికి బయలుదేరిన దూతలు అతి వేగంగా ప్రయాణం చేస్తున్నారు. వారు ముందుగా అపరతాల పర్వత దక్షిణభాగం దాటారు . 

.

ఆ తరువాత అపరతాల ,ప్రలంబ పర్వతాల మధ్య ప్రవహించే మాలినీ నది వెంట ఉత్తరంగా ప్రయాణం చేసి మరల పడమరవైపు తిరిగారు. 

.

వారు అలా హస్తినాపురం చేరి అక్కడ గంగ దాటి మరల పడమరగా ప్రయాణం చేసి కురుజాంగల మధ్యదేశము మీదుగా పాంచాలము చేరి అక్కడ నుండి ప్రయాణం చేసి శరదండా నదిని దాటి ఇంకా వేగంగా ప్రయాణం చేశారు.ఆ నదీ తీరం మీదున్న సత్యొపయాచన అనే దివ్యవృక్షానికి ప్రదక్షిణము చేసి కులింగా నది దాటారు. 

.

ఎక్కడా ఆగటంలేదు ,అలసట లక్ష్యపెట్టకుండా అక్కడనుండి అభికాల అనే గ్రామం చేరి అక్కడ ఇక్షుమతీ నదిని దాటి ,అక్కడ నుండి బాహ్లికదేశం మీదుగా సుదామ పర్వతం చేరారు.అక్కడ నుండి ఇంకా వేగంగా ప్రయాణించి నాల్గవ రోజు రాత్రికి కేకెయ రాజధాని గిరివ్రజపురం చేరారు.

.

ఆ రాత్రి నిదురించిన భరతుడికి తెల్లవారుఝామున ఒక పీడకల వచ్చింది .వెంటనే లేచి కూర్చున్న ఆయన మనసులో చాలా దుఃఖించి పరితపించసాగాడు.

.

ఆయన పరితాపము గ్రహించిన స్నేహితులు ఆయనకు రకరకాల కధలు చెపుతూ మనసులో కలిగిన ఆ ఖేదాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.అయినా ఆయన మనస్సెందుకో కుదుటపడటంలేదు. అప్పుడు ఉండబట్టలేక కొందరు మిత్రులు కారణమడిగారు. అందుకు ఆయన తనకు వచ్చిన కల ఎట్లాంటిదో చెప్పాడు.

.

నా తండ్రి మట్టికొట్టుకుపోయిన శరీరంతో జుట్టు విరబోసుకుని పర్వతశిఖరము మీదనుండి ఆవుపేడ తో నిండిన గోతిలో పడిపోయినట్లు అందులోనే మునిగితేలుతూ మాటిమాటికీ పిచ్చివాని వలే నవ్వుతూ దోసిళ్ళతో నూనె తాగుతున్నట్లగా ఉండి నువ్వులు కలిపిన అన్నం తింటూ మాటిమాటికీ తల వాలుస్తూ నూనెలో మునిగిపోయినాడు.

.

నా తండ్రి ఎర్రటి మాలలు ధరించినట్లుగా ఎర్రటి గంధము వంటికి పూసుకొన్నట్లుగా గాడిద నెక్కి దక్షిణదిక్కుగా ఒక రాక్షసి లాక్కొని పోతున్నట్లగా కనపడినాడు.

.

ఇంకా సంద్రము ఎండిపోయినట్లు,చంద్రుడు ఆకాశంనుండి రాలి పడిపోయినట్లు,భద్రగజముల దంతములు విరిగిపోయినట్లు,మండే మండే అగ్ని హఠాత్తుగా ఆరిపోయినట్లు ,భూమి బ్రద్దలైనట్లు భూమి అంతా పొగ ఆవరించి చెట్లు ఎండిపోయినట్లు కనపడ్డది.

.

ఏమో మా అయిదుగురిలో ఎవరో ఒకరికి మరణము సంభవించవచ్చునేమో ! నా గొంతు ఎండిపోతున్నది ఏదో తెలియని భయం మనస్సును పట్టి పీడిస్తున్నది అని భరతుడు తన స్నేహితులతో పలుకుతూ ఉండగనే అయోధ్య నుండి వచ్చిన దూతలు సభలో ప్రవేశించారు.


రామాయణమ్..89

...

అయోధ్య నుండి వచ్చిన దూతలు కేకయ రాజు అశ్వపతికి,యువరాజు యుధాజిత్తునకు నమస్కరించి నిలుచొని ,భరతుని వంక చూసి మన రాజపురోహితులు,మంత్రులు నిన్ను శీఘ్రముగా తిరిగి రమ్మని కోరినారు .నీతో చాలా తొందరపని ఉన్నదట! అని పలికి వారు తెచ్చిన విలువైన కానుకలను భరతుడి ద్వారా కేకెయ రాజుకు అందించారు.

.

అప్పటికే తనకు వచ్చిన కలతో దిగులుగా ఉన్న భరతుడు వారి నుద్దేశించి , మా తండ్రిగారు క్షేమమేనా ? మా రాముడు ,మహాత్ముడైన లక్ష్మణుడు వీరికి కుశలమే కదా?

.

పూజ్యురాలు ధర్మమునందే ఆసక్తిగలదీ ,ధర్మము నెరిగినదీ ,ధర్మమునే చూచేటటువంటిది ధీమంతుడైన రాముని తల్లి కౌసల్యామాత క్షేమమే కదా!

.

ధర్మములు తెలిసినది,లక్ష్మణ,శత్రుఘ్నుల కన్నతల్లి,మా మధ్యమాంబ సుమిత్రామాత కుశలమే కదా!.

.

తన సుఖమునే కోరుకునేది (ఆత్మ కామా),ఎల్లప్పుడూ తీవ్రముగా ప్రవర్తించేదీ( సదా చణ్డీ), కోపస్వభావము కలదీ (క్రోధనా),తానే బుద్ధిమంతురాలు అనే గర్వము కలది(ప్రాజ్ఞమానినీ) ,అయిన నా తల్లి కైక ఏ రోగము లేకుండా ఉన్నది కదా ఆవిడకు కుశలమే కదా ! 

.

భరతుడు పలికిన మాటలు విన్న దూతలు ! ఓ నరశ్రేష్ఢా నీవు ఎవరి క్షేమము కోరుచున్నావో వారందరూ క్షేమమే నిన్ను ఐశ్వర్యము,లక్ష్మి వరించుచున్నవి శీఘ్రముగా రధముపై కూర్చొని ప్రయాణించవయ్యా! .

.

వీరి మాటలు విన్న భరతుడు తాతగారి వైపు తిరిగి నన్ను దూతలు తొందరపెడుతున్నారు మరల మీరెప్పుడు రమ్మనమనిన అప్పుడు వస్తాను అని శెలవు తీసుకొని ఆయన ఇచ్చిన కానుకలు స్వీకరించి వాటిని నెమ్మదిగా వెనుక తీసుకు రమ్మని చెప్పి తాను శత్రుఘ్నునితో కలిసి బయలుదేరి ఏడవ నాటికి అయోధ్యా నగర పొలిమేరలకు చేరుకున్నాడు.

.

ఎప్పుడూ సందడిగా కావ్యగోష్ఠులు,గీత వాయిద్యాలతో,భేరీ మృదంగ,వీణాధ్వనితో, నృత్యప్రదర్శనలతో కోలాహలంగా ఉండే అయోధ్య ఏ విధమైన జన సంచారములేని వీధులతో శ్మశాన నిశ్శబ్దంతో అడుగుపెట్టగానే వళ్ళు గగుర్పొడిచే వాతావరణంతో కనపడ్డది భరతుడికి.ఆనందశూన్య అయోధ్య ఆయనకు గోచరమయ్యింది. ఆయన మనసు ఈ వారంరోజులూ కీడు శంకిస్తూనే ఉన్నది ఈ వాతావరణం చూడగనే అది బలపడ్డది. 

‌.

తన రధ సారధితో ,సారధీ రాజు మరణించినప్పుడు ఏ వాతావరణం ఉంటుందో అది నాకు కనపడుతున్నది. అయోధ్యలోని భవనములన్నీ కళావిహీనము,శోభావిహీనమై కనపడుతున్నాయి.

.

దేవాలయాలలో నిత్యపూజలు జరుగుతున్నట్లుగా లేదు మాలికల శోభలేదు. అయోధ్య అంతా ఒక నిశ్శబ్దం ఆవరించి ఉన్నది ఇది నేనెరిగిన అయోధ్యకాదు ! అని అనుకుంటూ సంతోష హీనుడై తండ్రిగృహంలో ప్రవేశించాడు.

.

తనను చూడగనే ఎదురు వచ్చి దుమ్మకొట్టుకు పోయిఉన్నాసరే తన శరీరాన్ని ప్రేమతో నిమిరి తన శిరస్సు వాసన చూసి గాఢంగా కౌగలించుకొనే ప్రేమమూర్తి తన తండ్రి అచటలేడు!

.

తన తల్లి ఇంట్లో ఉన్నాడేమో అని కైక ఇంట అడుగు పెట్టాడు.

.

కొడుకును చూడగనే ఎగిరి గంతేసి ఆసనమునుండి లేచింది కైక.

.

NB

.

మహర్షి వాల్మీకి కైక గురించి వాడిన విశేషణాలు గమనించండి!

.

ఆత్మ కామా : తన సుఖాన్నే కోరుకునేది

.

సదా చణ్డీ : ఎల్లప్పుడూ తీవ్రంగా ప్రవర్తించేది

.

క్రోధనా : ఎప్పుడూ కోపంగా ఉండేది

.

ప్రాజ్ఞమానినీ : తానే బుద్ధిమంతురాలిని అనే గర్వము కలిగినటువంటిది.

.

మనుషుల స్వభావం గూర్చి మహర్షి వాడే విశేషణాలు రామాయణంలో కోకొల్లలు ! వాటిని విశ్లేషిస్తే చాలు ! అపారమైన మానవ మనస్తత్వ శాస్త్రం మనకు కరతలామలకమవుతుంది.

*ఇంద్రుడు - వరాహ జన్మ*

ఒకప్పుడు ఇంద్రుడు కర్మవశాత్తు పందిగా జనించ వలసి వచ్చింది. ఆయన నారదమహర్షిని దర్శించి, మహాత్మా, నేను పందిగా ఉపాధిని పొందినప్పుడు మీరు వచ్చి ప్రబోధించితే నేనా ఉపాధిని వదలి మళ్ళా ఇంద్రత్వం స్వీకరిస్తానూ అని బ్రతిమాలాడు. నారదుడు నవ్వి సరే అన్నాక ఆయన సూకరోపాధిని పొందటమూ మాట ఇచ్చినట్లే నారదమహర్షి పోయి ప్రబోధించటమూ జరిగింది. అప్పుడేం జరిగిందో చూసారా. ఆ పందిరూపంలో ఉన్న ఇంద్రుడు అన్నాడు కదా, ఈ జన్మం ఇంత హాయిగా ఉందే, దీనిని వదలిపెట్టమని చెబుతావేమి టయ్యా, ఠాట్ కుదరదంటే కుదరదూ అని. ఇదండీ జీవుణ్ణి పశువుని చేసి ఆడించే వాసనారూపకమైన పాశం అంటే. ఇటువంటి పాశం అమ్మకు ఆయుధంగా అమరి ఉంది.

{ఈ వివరణ లలితా సహస్రనామ వివరణ లోనిది}


మన పురాణాలలో ఇంద్రుడికి కలిగినన్ని శాపాలు మరెవరికీ కలగలేదు. ఒకానొక సమయంలో, ఒకానొక సందర్భంలో, ఒక ముని ఇంద్రుడు చేసిన పనివల్ల కోపించి, ‘నీవు మగ పందివై, భూమ్మీద ఒక సంవత్సరకాలం జీవింతువుగాక’ అని శపించాడు. ముని వాక్యం అమోఘం. వెంటనే ఇంద్రుడు భూమ్మీద ఒక మగ పందిగా పుట్టాడు. కొంతకాలానికి, ఆ పంది ఒక సుందరమైన ఆడ పంది ప్రేమలోపడి, మోహించి, వ్యామోహితుడై, ఆ సుందరాంగి లేకపోతే బ్రతుకే వృధాఅని, ఇక బ్రతుకలేనని అనుకోని, ఆ ఆడ పందిని సమీపించి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. వారి ప్రేమ సుఖాంతం అయింది. వారి పెళ్ళి అయింది. కొంతకాలం వారి ప్రణయ జీవితం హాయిగా జరిగింది. అప్పటికే సంసారమనే పాముతో కాటేయబడ్డ ఇంద్రుడికి (మగ పంది) విషం పైపైకి ఎక్కటం మొదలైంది. ఆ జంటకి అనేకంగా పిల్లలు పుట్టారు. ఆ పిల్లలను, తన భార్యను చూస్తూ, ఎంతో ఆనందిస్తూ, బురదగుంటల్లో పొర్లుతూ, దొర్లుతూ, వారిద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు.


చూస్తుండగానే ఒక సంవత్సరకాలం తెలియకుండానే కరిగిపోయింది. ఇంద్రుడికి స్పృహేలేదు. ఆనందంగా, విలాసంగా వున్నాడు. ఇంతలో, అక్కడ ఇంద్రలోకంలో, దేవతలందరూ ఇంద్రుడి రాకకై ఎదురుచూస్తూ, స్వాగత ఏర్పాట్లు అన్నీ చేసుకొని సిద్ధంగావున్నారు. సమయానికి, ఇంద్రుడు రాలేదు. కారణం తెలియక, వారు అగ్నిదేవుడ్ని పిలిచి, భూమ్మీదకువెళ్ళి, ఏంజరిగిందో తెలుసుకొని రమ్మన్నారు. అగ్నిదేవుడు వెళ్ళి, బురదగుంటలో భార్యా, పిల్లల సమేహితుడై ఇంద్రుడు ఆనందంగా వుండటం చూసాడు. అప్పుడు, అగ్నిదేవుడు, ఆర్యా, మీరు ఇందృడు, స్పృహలోకిరండి; మీ శాపం సమయం తీరిపోయింది. కాబట్టి, వెంటనే ఇంద్రలోకానికి విచ్చేయండి, అందరూ మీ రాకకై వేచిచూస్తున్నారు అని విన్నవించాడు. ఆ మాటలువిన్న ఇంద్రుడు, అగ్నిదేవా, నాకు ఇక్కడ చాలా బాగుంది, అంతేకాకుండా నేను నా భార్యని, ముద్దులొలికే నా పిల్లల్ని వదిలి ఇప్పుడు రాలేను. కాబట్టి నీవు వెళ్ళిపో. నేను కొంతకాలం తరువాత వస్తాను అని చెప్పాడు. అయినీ, అగ్నిదేవుడు చాలాసార్లు వచ్చేయమని బతిమాలాడు. ఇంద్రుడుకి కోపంవచ్చి, నేను ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళీపో అని అన్నాడు. చేసేదిలేక ఆయన వెళ్ళిపోయి, జరిగిందేమిటో దేవతలందరికీ చెప్పాడు. ఆతరువాత వరుణుడుకూడా వెళ్ళి ప్రయత్నంచేసి, విఫలుడై తిరిగి వచ్చాడు. ఏంచేయాలో వారికి తెలియలేదు. ఇంద్రలోకంలో ఇంద్రుడులేక పరిపాలనంతా ఆగిపోయింది. అప్పుడు మరొక దిక్పాలకుడు యముడుని పిలిచి నీవు వెళ్ళి ప్రయత్నంచేసి రమ్మన్నాడు. నేను వెళ్ళినా అదే జరుగుతుందికదా ఏమిటి ప్రయోజనం? అని అన్నాడు. అప్పుడు ఆ దిక్పాలకుడు, యమా, ఒకవేళ ఇంద్రుడు నీమాట విని రాకపోతే, వరాహరూపంలోవున్న ఆయన్ని చంపివేయి. ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది, వెళ్ళిరా అని పంపించాడు.


యమధర్మరాజు వెళ్ళి ఇంద్రుడిని స్వర్గలోకాని రమ్మని బతిమాలాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. మీరందరూ, ఒకరితరువాత మరొకరువచ్చి, నన్ను విసిగిస్తున్నారు. ఇక్కడ నేను నా భార్యా,పిల్లలతో నేను చాలా సుఖంగావున్నాను. మీరు నన్ను ఇన్నిసార్లు విసిగించారుకనుక, నా నిర్ణయం చెబుతున్నాను విను: నేను స్వర్గలోకానికి ఇక ఎప్పటికీ రాను. నాకు ఇక్కడే స్వర్గలోకంల్లాగావుంది. ఇక వెళ్ళిపో అని హూంకరించాడు. సరేనని చెప్పి, యముడు కొంచెం దూరం వెళ్ళి, వెనుకగా వచ్చి, ఆ మగపందిని తన కత్తితో చంపేసాడు. పంది శరీరం పడిపోయిందికాబట్టి, చేసేదేమీలేక, ఇంద్రుడు ఆ పంది శరీరాన్ని వదిలివేయాల్సివచ్చింది. అప్పటివరకూ ఆ వరాహ శరీరంతోవున్న బంధనం తెగిపోయింది. వాస్తవాన్ని తెలుసుకున్న ఇంద్రుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు.

*పురుష సూక్తం*



హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పురుష సూక్తం రుగ్వేదంలోనిది. పద్దెనిమిది మంత్రాల పురుష సూక్తం శుక్ల యజుర్వేద సంహితలోను, అధర్వణ వేద సంహితలోను కనిపిస్తుంది. పురుషుడంటే ఒక్క భగవంతుడే అన్నది శిష్టాచార సంప్రదాయ భావన. ఆయన మహిమను కీర్తించే వైభవోపేత మంత్రరాజం పురుష సూక్తం. అన్ని వైదిక కర్మల్లో, పుణ్య కార్యాల్లో వేదమూర్తులైన విప్రులు ఈ మహిమాన్విత మంత్రాన్ని పఠిస్తారు.


భగవంతుడి గుణరూప వైభవాలను వర్ణించే ఈ సూక్తం ఆయన లోకాలను సృజించడంలో, ప్రపంచాన్ని ఆవిష్కృతం చేయడంలో ఎలా తనను తాను త్యాగం చేసుకున్నాడో తెలియజేస్తుంది. భగవంతుడు వేలాదిగా శిరస్సులు, కన్నులు, పాదాలు గలవాడిగా సూక్తం కీర్తిస్తుంది. వేలాదిగా అనడంలోని అంతరార్థం ఈ భూమిపైన, సమస్త లోకాలలో సమస్త జీవులకు చెందిన కన్నులు, శిరస్సులు, పాదాలని వివరిస్తారు పండితులు. సమస్త ప్రాణులూ భగవదంశేనని, వాటన్నింటిలో ఆయన దాగిఉండి సాక్షీభూతుడిగా అలరారుతున్నాడంటాయి శాస్త్రాలు. ప్రతి ప్రాణీ భగవంతుడి ప్రతిరూపమే అన్నది వేదోక్త భావన. దైవం ప్రాణుల హృదయాకాశంలో పది అంగుళాల పరిమాణంలో ప్రకాశిస్తుంటాడంటుంది సూక్తం. మన కన్నులకు అగుపించే దృశ్య జగత్తులో భగవంతుడు పావు భాగమని, మిగిలిన ముప్పాతిక భాగం ఏ మార్పునకూ లోనుకానిది ఆకాశమని తెలియజేస్తుంది పురుష సూక్తం.


భగవంతుడి నుంచి మనం త్యాగ గుణం నేర్చుకుంటాం. త్యాగం, దానం నుంచి ఆవిర్భవిస్తుంది. విశ్వంలో పరివ్యాప్తమై ఉన్న గాలిని ప్రాణవాయువుగా స్వీకరించి ప్రాణులు బొగ్గుపులుసు వాయువును విసర్జిస్తాయి. ఆహారంగా అన్నాన్ని తిని మలం విసర్జిస్తాయి. నీటితో దాహం తీర్చుకొని మూత్ర రూపంలో విడిచి పెడతాయి. అలా విడిచి పెట్టడంలో దేహావసరాలు తీరి ఆనందం లభ్యమవుతుంది. త్యాగం వల్ల అమృత సమానమైన మనసు మనిషికి సిద్ధిస్తుంది.


వ్యక్త ప్రపంచంలో గాలి, నీరు, ఇతర భూతాలతోపాటు సర్వమూ భగవంతుడే! తనను తాను ప్రాణులకు ఆహారంగా మలచుకొని పెంచి, పోషించేదీ అతడే అన్నది పురుషసూక్త భాష్యం. అన్న రూపం ధరించి దైవం జీవుల ఆకలి తీరుస్తాడు గనుక అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భాసిస్తుంది. ఈ సమస్త క్రతువు యజ్ఞరూపంగా ప్రకాశిస్తుంది. సూర్య చంద్రుల ఆగమనం, నిష్క్రమణ, రుతువుల మార్పు, ప్రాణుల చావు పుట్టుకలు... ఓ చక్ర భ్రమణంలా జరుగుతాయి.


సమస్త జీవ నిర్జీవ పదార్థాలలోనూ దైవం ప్రవేశించి పరివ్యాప్తమై ఉన్నాడంటుంది పురుషసూక్త మంత్రం.


జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నాలుగు అంతఃకరణాలు వీటితోపాటు 21 తత్త్వాలు ప్రాణుల లోపలి ప్రకృతిని నిర్మిస్తాయి. బ్రహ్మాండాలకు అధినాయకుడైన పరబ్రహ్మమే జరుగుతుండే లోకయజ్ఞానికి సమిధలుగా, బలిపశువుగా, యజ్ఞాన్ని నిర్వహించే రుషులుగా, యజ్ఞ మంత్రాలుగా, సమస్తంగా అలరారుతున్నాడంటాయి పురుషసూక్త మంత్రాలు.


అన్ని విధాలుగా ప్రాణుల ఉనికికి కారకుడై, మనసున్న మనిషి మాత్రమే తెలుసుకోగల భగవంతుడికి మనిషి అర్పించగల కృతజ్ఞత- ఆయనను తెలుసుకొని ఆరాధించడమే. అలా తెలుసుకున్న నాడు మనిషి భవబంధాల చెరనుంచి విముక్తుడవుతాడు. దైవం త్యాగగుణాన్ని పట్టుకొని జీవజగత్తు అంతటికీ మానవుడు సేవాగుణంతో రక్షకుడుగా వ్యవహరించవలసి ఉంది. సమస్త ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం హృదయ పూర్వకంగా తన వంతు కృషి చేయడం మనిషి నిజమైన దైవారాధన అవుతుందంటారు పెద్దలు. అదే మానవుడు భగవంతుడికి అర్పించగల అసలైన నీరాజనం, కైమోడ్పు!

🌺🪔గోవు విశ్వరూపం🪔🌺

 


  గోవు యొక్క కంఠం మస్తకం మధ్య గంగ ఉంటుంది. గోవు యొక్క సమస్త అంగములయందు సమస్త దేవతలున్నారు. సప్తర్షులు, నదులు, తీర్థములు గోవులో ఉన్నాయి.🍁


 ఆవు యొక్క నాలుగు పాదాల్లోనూ ధర్మార్ధ కామ మోక్షములుంటాయి.🍁


 అందుకే ఆవు కాళ్ళు కడిగి ఆ నీరు తలపై చల్లుకుంటే పాపాలు నశిస్తాయి.🍁


ఆవు ముఖంలో నాలుగు వేదాలు ఉంటాయి. అందుకే ఆవును ముందు ప్రవేశపెట్టి ఆ తర్వాతనే నూతన గృహంలో యజమాని ప్రవేశిస్తాడు.🍁


గోధూళి తో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.🍁


 గోవుకు నవధాన్యాలు ఆకుకూరలు పళ్ళు మొదలైనవి ఆహారంగా ఇస్తే శుభం కలుగుతుంది.

రుణగ్రస్తులు బాధల నుండి బయటపడతారు.🍁


 అందుకే పండుగలలోను, శుభకార్యాల సందర్భంగా ను గోపూజలు, గోదానం చేయడం జరుగుతోంది.🍁


 సూర్యచంద్రులు, శివుడు, కుమారస్వామి, గణపతి, విష్ణుమూర్తి, బ్రహ్మ, సరస్వతి, హనుమంతుడు, నవగ్రహాలు, కుబేరుడు, పర్వతాలు, అగ్ని, వరుణుడు, నారదుడు, లక్ష్మి, భౌమాదేవి, భైరవుడు, వాయుదేవుడు మొదలగు ముప్పైమూడు కోట్లమంది దేవతలు గోవు శరీరంలో నివసించి ఉంటారు.🍁


 గోవుకు ఆహారం సమర్పించినట్లైతే 33 కోట్ల దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే.🍁


అందుకే గో ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షణం చేసినట్లు అన్నారు.🍁 


        🌺🌺గోమాత విశ్వమాత🌺🌺

**మహాభారతము**

 **దశిక రాము**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


89 - అరణ్యపర్వం.


భీమసేనుని రక్షించడానికి, అజగరరూపం లో వున్న నహుషుని ప్రశ్నలకు, ధర్మరాజు సమాధానం యివ్వడానికి ముందుకువచ్చాడు కదా ! నహుషుడు మొదటి ప్రశ్న సంధించాడు.

1 . ధర్మజా ! బ్రాహ్మణుడు అనగా యెవరు ? అతడు పొందవలసిన విద్య యేది ?

సర్పరాజా! సత్యము, దానగుణము, క్షమాగుణము, సచ్చీలము, సాధుస్వభావము, తపోకాంక్ష, దయ మొదలైన దైవప్రేరిత గుణాలు వున్నవాడే బ్రాహ్మణుడు.


2 . నీవు చెప్పిన గుణాలు శూద్రుని యందు కూడా వుండే అవకాశం వుంది కదా ? 

ఆ గుణాలు శూద్రుని యందు వున్నచో అతడు కూడా బ్రాహ్మణుడు అని పిలువబడతాడు. ఆగుణాలు లోపించిన బ్రాహ్మణుడు కూడా శూద్రుడే. 


3 బ్రాహ్మణత్వానికీ గుణాలకూ సంబంధం వున్నప్పుడు ప్రత్యేక బ్రాహ్మణజాతి వుండుట వ్యర్ధమేకదా ? వర్ణవ్యవస్థ యెలా నిలబడుతుంది ? 

గుణం చూసి కుల నిర్ణయం చెయ్యవలెననిన అట్టివారిని గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ వుండటం సాధ్యం కాదు. అన్నికులాలలో వర్ణసంకరము అనివార్యంగా వున్నది. అందువలన, బ్రాహ్మణకులంలో పుట్టినా గుణసంపద లేని వానిని వర్ణ సంకరునిగానే పరిగణించాలి. అన్ని సద్గుణాలు వున్న శూద్రుని, బ్రాహ్మణునిగా గుర్తించవచ్చు. 


పై సమాధానాలు ధర్మజునుండి వినగానే, ' నీలాంటి ధర్మవర్తనులు, సాధుమనస్కులు, చాలా అరుదు. నీలాంటి వాని తమ్ముని భక్షించుట సముచితం కాదు. నీ సత్యభాషణ వలన నాకు శాపవిమోచనం అయింది. నీమేలు మరువరానిది. ' అన్నాడు నహుషుడు, సర్పరూపంలో వుండి.


ధర్మరాజు సర్పరాజుని ' సర్పరాజా ! మీరు విద్యాకోవిదులు. మానవులు ఆచరించ వలసిన ఉత్తమకర్మలు మీ వాక్కు ద్వారా వినాలనివుంది. శలవివ్వండి. ' అని అడుగగా, ' ధర్మజా ! సత్యము, ఇంద్రియనిగ్రహము, తపస్సు, దానము, అహింస, ధర్మజీవనము, ఇవే మానవులకు సద్గతులు కలుగజేస్తాయి. జాతి, కుల భేదాలు సద్గతి కలుగజేయవు. ' అని సమాధానం చెప్పాడు.


మరుక్షణంలో నహుషుని అజగరరూపం కరిగిపోసాగింది. దివ్యదేహంతో నహుషుడు దర్శనమిచ్చాడు. చూస్తూ వుండగానే, దేవతలవిమానం వచ్చి నహుషుని ముందు నిలిచింది. భీముడు స్పృహలోకి వచ్చి నహుషునికి, ధర్మజునికీ, ధౌమ్యునికీ నమస్కరించాడు. నహుషుడు విమానం అధిరోహించి, స్వర్గానికి వెళ్ళిపోయాడు. 


భీమసేనుని వెంటబెట్టుకుని ధర్మరాజు ఆశ్రమానికి వచ్చాడు. భీముడు తనకే యిలా యెందుకు జరిగిందని కుమిలిపోతుండగా, ధర్మజుడు ఓదార్చాడు. అతి సాహసంతో అడవులలో తిరగడం, ప్రకృతిని కల్లోలం చెయ్యడం మంచిదికాదని , హితవు చెప్పాడు. 


పాండవులు ద్వైతవనంలో,ఆనందంగా గడుపుతుండగా, వర్షాకాలం, ఆతరువాత శరత్కాలం వచ్చింది. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ హాయిగా కాలం గడపసాగారు పాండవులు. కార్తీక మాసంలోపౌర్ణమి కూడా అయిపోయిన తరువాత, పాండవులు తిరిగి కామ్యకవనం చేరుకున్నారు. 


కామ్యకవనం లో పాండవులు సేదదీరుతుండగా, ఒకనాడు సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు కామ్యకవనం అరుదెంచాడు. కుశల ప్రశ్నలు, స్వాగత సత్కారాలు అయిన తరువాత, శ్రీకృష్ణుడు ధర్మరాజుతో యిలా అన్నాడు : ' ధర్మరాజా ! నీవు లౌకికజీవితం గడుపుతున్నజ్ఞానివి. అర్ధకామములందు నీకు కాంక్ష లేదు. ధర్మమూ, మోక్షం మీద నీకున్న అనురాగం నిన్ను ధర్మరాజుని చేశాయి.'


' నిండుసభలో ద్రౌపదిని అవమానించినా కూడా, కౌరవుల యెడ సహనం ప్రదర్శించావు. మీకష్టాలు తీరేసమయం వస్తుంది త్వరలో. ఆసమయం యెప్పుడు వస్తుందో, మేము మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తామో అని యెదురుచూస్తున్నాము. '


' ద్రౌపదీ ! నీవు పొందిన అవమానాలకు, అనుభవిస్తున్న కష్ఠాలకు తెరబడే రోజు వస్తుంది. నీ భర్త అర్జునుడు అసమానతేజంతో అమరావతి నుండి అనేక అస్త్రశస్త్రాలతో తిరిగి వచ్చాడు. నీ బిడ్డలు ప్రద్యుమ్నునివద్ద, అభిమన్యునివద్ద, చక్కని శిక్షణలో వున్నారు. సుభద్రా రుక్మిణీలు, వారిని సదాచారసంపన్నులుగా తీర్చి దిద్దుతున్నారు.'


శ్రీ కృష్ణుని అమృతవాక్కులు ధర్మరాజు హృదయాన్ని ద్రవింపజేశాయి. తాము ధర్మం తప్పకుండా ఉండేటట్లు, శ్రీకృష్ణుని కృప యెప్పుడూ యిలాగే వుండేటట్లు చెయ్యమని వినయంగా పలికాడు ధర్మరాజు.


వారు యిలాంటి ప్రియ సంభాషణలలో మునిగితేలుతుండగా, మార్కండేయమహర్షి వేంచేశారు, వీరున్న చోటికి. 


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

**శ్రీమద్భాగవతము**

 **దశిక రాము**




 తృతీయ స్కంధం -25


హిరణ్యకశిప,హిరణ్యాక్షులజన్మ 


తన కుమారులు దేవతలను బాధిస్తారని దితి తలపోయసాగింది. నూరు సంవత్సరాలు గడిచాయి. అప్పుడు దితి సకల లోకకంటకులైన కుమారులను కన్నది. ఆ సమయంలో...భూమి కంపించింది. కులపర్వతాలు వణికాయి. సముద్రాలు కలతపడ్డాయి. నక్షత్రాలు నేల రాలాయి. ఆకాశం బ్రద్దలైంది. అష్టదిగ్గజాలు ఊగిపోయాయి. దిక్కులనిండా అగ్నికణాలు ఎగిసిపడ్డాయి. భూమిమీద పిడుగులు పడ్డాయి. హోమగుండాలలోని అగ్నులకు పొగలు క్రమ్మాయి. ఎదురుగాలుగు బలంగా వీచాయి. అంతటా చెట్లు తలక్రిందులుగా విరిగి పడ్డాయి. గ్రహాలు, నక్షత్రాలు వెలవెలబోయాయి. మేఘాలు రక్తవర్షాన్ని కురిపించాయి. దిక్కులలో మెరుపులు మిరుమిట్లు గొలిపాయి. గ్రహణసమయం కాకుండానే రాహువు సూర్యుణ్ణి పట్టుకున్నాడు. చిమ్మచీకట్లు అంతటా వ్యాపించాయి. కుక్కలు మోరలెత్తి మొరిగాయి. పట్టపగలే నక్కలు కూసాయి. పక్షులు బాధతో ధ్వనులు చేశాయి. దేవతావిగ్రహాలు కన్నుల్లో బాష్పబిందువులు కమ్ముకోగా పక్కకు ఒరిగాయి.ఆవులు రక్తాన్నీ చీమును పిదికాయి. గాడిదలు భయంకరంగా ఓండ్రపెట్టాయి. ఏనుగుల గండస్థలాలమీది మదజలం ఎండిపోయింది. గుఱ్ఱాల తోకలు నిప్పులు చెరిగాయి. సహింపరాని తేజస్సుతో దితి కుమారులు పుట్టిన సమయంలో గుహలు ప్రతిధ్వనించాయి. పాపగ్రహాల మైత్రితో పుణ్యగ్రహాలు వక్రమార్గంలో వర్తించాయి. ఆ విధంగా భయంకరంగా తోచిన అపశకునాలను చూసి ప్రళయకాలం వచ్చిందని అనుకున్నారే కాని, క్రూరంగా సాధుజనులను సంహరించే రాక్షసుల పుట్టుక వల్ల సంభవించిన కల్లోలంగా తెలిసికొనక సనకాది యోగులు తప్ప సమస్త ప్రాణికోటి తల్లడిల్లింది. ఆ విధంగా దితికి కుమారులు పుట్టిన తర్వాత...ఆ రాక్షసులు కులపర్వతాలవంటి శరీరాలతో, భయంకరమైన భుజబలంతో ఒప్పుతున్నారు. వారి పాదాల తాకిడికి భూమి చలించిపోతున్నది. రత్నాలు చెక్కిన బంగారు భుజకీర్తులు, మకరకుండలాలు, మొలనూళ్ళు, కంకణాలు, ఉంగరాలు, కిరీటాలు, కాలి అందెలు స్వచ్ఛమైన కాంతులు వెదజల్లుతుండగా తమ శరీరకాంతులతో సూర్యకాంతిని సైతం హీనపరుస్తూ....

ఉన్న సమయంలో కశ్యపుడు తన కుమారులను చూడాలనుకొని దితి మందిరానికి వచ్చి పుత్రులను చూచి, వారికి నామకరణం చేయాలనుకొని....దితి గర్భంలో తాను మొదట పెట్టినట్టి తేజస్సువల్ల పుట్టి అద్భుతంగా వెలిగేవానికి ‘హిరణ్యకశిపుడు’ అనీ, కానుపు సమయంలో దితికి మొదటగా పుట్టి సూర్యతేజస్సుతో వెలిగేవానికి ‘హిరణ్యాక్షుడు’ అని మంచి మనస్సుతో పేర్లు పెట్టి కశ్యపుడు తన ప్రవిత్రమైన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.


 హిరణ్యాక్షుని దిగ్విజయము 


అప్పుడు సాటిలేని తేజస్సుతో విరాజిల్లుతున్న హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని వల్ల వరాలు పొందిన గర్వంతోను, వారింపరాని శత్రువుల ఉక్కడగించే అవక్రపరాక్రమం యొక్క అతిశయంతోను సమస్త లోకపాలకులను జయించి తనవశం చేసుకొని తన కెక్కడా మృత్యుభయం లేక నిర్భయుడై సుఖంగా ఉన్నాడు. అతని సోదరుడైన హిరణ్యాక్షుడు ప్రతిరోజూ మదపుటేనుగు తొండంవంటి తన భుజాదండం మీద గదాదండాన్ని ధరించి తనను ఎదిరించి యుద్ధం చేయగలిగిన శత్రువీరుడు ఎక్కడా కనిపించక భూలోకమంతా తిరిగి స్వర్గంపై దండెత్తి అక్కడ యుద్ధచేయడానికి ఇష్టపడని దేవతలను చూచాడు. హితులు చెలరేగగా, శత్రువులు కలతపడగా అందమైన వైజయంతీమాలను ధరించి, కాలి గండపెండేరాలు మ్రోగుతుండగా, తన దేహకాంతి నాలుగుదిక్కుల్లో పిక్కటిల్లగా వస్తున్న హిరణ్యాక్షుని చూచి దేవతలు బ్రహ్మ వరాన్ని గుర్తుకు తెచ్చుకొని భయపడి గరుత్మంతుని చూచి పారిపోయే పాములవలె తమ మందిరాలను జిల్లేళ్ళకు, ఉమ్మెత్తలకు నివాసాలుగా చేసి ఎక్కడెక్కడికో పారిపోయారు. “పౌరుషం పోగొట్టుకొని, తమ ఆయుధాలను విడిచిపెట్టి దేవతలు భయపడి కర్తవ్యాన్ని విస్మరించి పారిపోయారు కదా” అని సింహగర్జన చేసి మేరుపర్వతం వంటి స్థైర్యం కలిగిన హిరణ్యాక్షుడు గొప్ప భుజబలంతో, విజృంభించిన గర్వాతిశయంతో సముద్రంలో ప్రవేశించాడు. ఈ విధంగా ప్రవేశించగా...వరుణదేవుని సైనికులు హిరణ్యాక్షుని తేజాన్ని తేరిపార చూడలేక, పౌరుషం కోల్పోయి సముద్రం మధ్యభాగంలో ఎక్కడికో పారిపోయారు. 

హిరణ్యాక్షుడు తన నిట్టూర్పులవల్ల పుట్టిన సముద్రకల్లోలాన్ని తన గదాదండంతో దృఢమైన శక్తితో అణచివేశాడు. ఇంకా ఆ పైన ఆ రాక్షసేశ్వరుడు ఆ మహాసముద్రంలోపల శత్రురాజులను చీల్చిచెండాడి అనేక సంవత్సరాలు విహరించాడు. పరిపూర్ణ ప్రభావంతో అక్కడ ఉన్న వరుణుని పట్టణం అయిన ఆ చక్కటి విభావరి నగరానికి వెళ్ళి . . .జలచర సమూహాలకు రాజై పాతాళ లోకాన్ని పాలిస్తున్న వరుణుని చూచి హిరణ్యాక్షుడు పరిహసిస్తూ “ఈ విశ్వంలో సమస్త లోకపాలకులలో పేరెన్నిక గల మహాబలవంతుడవని లోకం నిన్ను పొగడుతున్నది కదా! ఇప్పుడు నీ పౌరుషాన్ని ప్రదర్శిస్తూ యుద్ధంలో నన్ను ఎదిరించి చూడు. నీ బాహుబలాన్ని, పేరు ప్రతిష్ఠలను అణచివేస్తాను” అని పలుకగా విని సముద్రరాజైన వరుణుడు శత్రువుయొక్క విజయాలను, అభివృద్ధిని, శక్తిని, తన బలాన్ని అంచనా వేసికొని ఆ రాక్షసునితో యుద్ధానికి....సమయం కాదనుకొని తన మనస్సులోని కోపాగ్నిని సహనం అనే నీళ్ళతో చల్లార్చుకొంటూ ఆ హిరణ్యాక్షునితో ప్రశాంతవాక్కులతో ఈ విధంగా అన్నాడు. “నేను ప్రశాంతమైన మనస్సుతో యుద్ధం చేయకూడదనే నియమంతో ఉన్నాను. ఇప్పుడు యుద్ధం చేయలేను. నీ భుజబలం యొక్క ఆటోపాన్ని జయింపగల ప్రతివీరులు ఎక్కడా లేరు, ఒక్క విష్ణువు తప్ప. ఆ మహాత్ముడు వైకుంఠంలో ఉన్నాడు. ఎన్నోసార్లు యుద్ధరంగంలో శత్రువులను ఓడించి శక్తి సామర్థ్యాలలో పేరుమోసిన వీరుడని భూజనులంతా పొగడుతారు. వెంటనే ఆ వైకుంఠానికి వెళ్ళు. అప్పుడు ఆ హరి నీతో యుద్ధం చేసి నీ కోరిక తీరుస్తాడు.నిందకు లొంగి యుద్ధరంగంలో నిల్వలేక పారిపోయే పిరికిపందలను వెంటాడడం మగతనమా? బుద్ధిహీనుడా! అందరూ శరణు కోరే గోవిందుడు నీ పని పడతాడు. పోగలిగితే అక్కడికి వెళ్ళు. ఆ హరి ఎప్పుడూ రాక్షసులతో పోరాడుతూ జయిస్తూ ఉంటాడు. అంతేకాక...పురుషోత్తముడూ, మునులు పూజించే పాదపద్మాలు గలవాడూ అయిన విష్ణువు ప్రతియుగంలోనూ పురుషరూపంతో భూమిమీద అవతరించి పరాక్రమవంతులూ దుష్టులూ ఐన రాక్షసులను సంహరిస్తాడు. కనుక ఓ రాక్షసరాజా! కయ్యమో దయ్యమో ఏదో ఆ హరికే చెప్పుకో" అని హేళనగా అంటూ "నీ భుజబలం తరిగి నేల కూలుతావు. కుక్కలు నిన్ను చుట్టుముట్టుతాయి. ఇప్పుడే అక్కడికి వెళ్ళినట్లైతే నీ బలం, సామర్థ్యాలు బయటపడతాయి. తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము” అని వరుణుడు చెప్పగా హిరణ్యాక్షుడు కోపించి, తన మనస్సులో ఏమాత్రం భయం లేనివాడై “ఈరోజే దేవతల మిత్రుడూ, రాక్షసుల శత్రువూ అయిన ఆ జనార్దనుని యుద్ధభూమిలో ఎదిరిస్తాను” అంటూ వైకుంఠ నగర మార్గం పట్టి....వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చి “ఓ రాక్షసరాజా! ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగిన నారదునితో హిరణ్యాక్షుడు ఇలా అన్నాడు. “పద్మనాభుడూ, శ్రీపతీ, అనంతుడూ అయిన హరిని ఎదుర్కొని యుద్ధంలో అతణ్ణి అంతం చేసి మొత్తం రాక్షసజాతికి సంతోషం కలిగించాలనే పట్టుదలతో వైకుంఠం దారి పట్టాను”. ఆ మాట విని నారదుడు ఇలా అన్నాడు. "గొప్ప భుజబలం కల ఆ మహాత్ముడు ఇప్పుడు వైకుంఠంలో లేడు. భూభారాన్ని వహించడానికి ఆదివరాహ రూపాన్ని ధరించి రసాతలంలో ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్ళగలిగితే వెళ్ళు. అక్కడ నీకు విష్ణువుకు యుద్ధం తప్పక జరుగుతుంది.”

🙏🙏🙏

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

**సౌందర్య లహరి**

 **దశిక రాము**




**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఆరవ శ్లోకం - మొదటి భాగం


ధనుఃపౌష్పం మౌర్వీ మధుకర మయీ పంచవిశిఖాః

వసంతస్సామంతో మలయమరుదాయోధన రథః

తథాऽప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపికృపాం

అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే!!


ఈ శ్లోకం పూర్తిగా మన్మథునికై కేటాయించబడింది. ద్వైత ప్రపంచం అద్వైత స్థితి నుండి కామం కారణంగా జనిస్తోంది. ఆ ద్వైత ప్రపంచం మళ్ళీ అంబిక దయ చేతనే అద్వైతమవుతోంది. ఈ లీలలో అంబికదే ప్రధానపాత్ర. కామం యొక్క మూర్తిత్వమయిన మన్మథునికి ఇక్కడ ప్రాముఖ్యత ఉన్నది. మన్మథునకు కాముడని పేరు. అంబికకు కూడా కామేశ్వరి, కామాక్షి అన్న పేర్లున్నాయి. 


ఏ మాత్రమూ పటుత్వంలేని ఆయుధాలతో మన్మథుడు ప్రపంచాన్నతటినీ జయిస్తాడు. ఆయనకంతటి శక్తినిచ్చేదేమిటి? అమ్మక్రీగంటిచూపు, ఇదీ ఈ శ్లోక భావం.


ఈ మన్మథుని ఆయుధాలేవి? మొదటిది “ధనుః పౌష్పం”- పూలతో చేయబడిన విల్లు. మన్మథుడసలు యుద్ధానికెందుకు వెళతాడు? ఈ ప్రపంచంలో జీవజాలాన్నతటినీ జయించి వానిని కామవశులను చెయ్యాలని రథమెక్కి విల్లు బాణాలు. చేబూని మిత్రులతోనూ, అనుచరులతోనూ బయలుదేరతాడట. ఈ రథమేమిటో తెలుసుకొంటే మనకు వింత తోస్తుంది.


సరి! మన్మథుని విల్లు చెరుకుగడ అనికదా ప్రసిద్ధి. యోద్ధలందరికి ఇనుముతో చేసిన విల్లులుంటాయి. ఈయనది చెఱుకు విల్లు. గట్టిగా వంచితే విరిగిపోతుంది. అయితే ఆచార్యులవారు అయనది ఇంకా సున్నితమైన పూలవిల్లు అంటున్నారు. ఇనుముతో ఘనంగా లేకపోయినా చెఱుకుగడతో కొడితే తలైనా పగులుతుంది. మరీ ఈ పూలవిల్లుతో ఏమి ప్రయోజనం?


ఆచార్యులవారు ఈ విధంగా మన్మథుని విల్లుని మార్చివేయడం న్యాయంగా ఉందా? ప్రతిదేవతకు ఆయుధాలు వారి అలంకరణలో భాగంగా ఉంటాయి. పూజలోనో హోమంలోనో సాంగంగా సాయుధంగా దేవతను ఆహ్వానిస్తాం కదా! మొదట్లో నెను “పౌండ్రం” అనేమాట పొరపాటున్ “పౌష్పం”గా వ్రాయబడిందా అనుకున్నాను. పుండ్రేక్షు అనేపదం పౌండ్రంగా వ్యవహరించబడి ఉండవచ్చు కదా! కానీ అమరకోశంలో మన్మథుని పేర్లలో “పుష్పధన్వా రతిపతిర్మకరధ్వజ ఆత్మభౌ” అని చెప్పబడ్డాయి. పుష్పధన్వా అన్నమాటని ఆచార్యులవారు ధనుఃపౌష్పం అని వాడారు. చెఱుకువిల్లు ఊసేలేదు.


సుబ్రహ్మణ్యునకు రెండు నెమలి వాహనాలున్నాయి. ఒకటి చిన్నతనం నుండి ఆయన ఉపయోగిస్తూ ఉన్నది. సూరపద్ముణ్ణి ఖండించి అతనినొక నెమలిగా చేసి వాహనంగా ఉపయోగిస్తున్నాడు. కొన్ని దేవాలయాలలో ఎడమవైపు తల, కుడివైపు పించ్ఛమున్న నెమలి వాహనంగా కనిపిస్తుంది. అతడు సూరపద్ముడు. చాలా గుళ్ళలో కుడివైపు తల ఎడమవైపు పుచ్ఛమున్న నెమళ్ళే ఉంటాయి. అది దేవతా నెమలి. మొదటనుండి ఉన్న వాహనం. ఆ రకంగా మన్మథునికి కూడా రెండు ధనస్సులున్నాయనుకుంటాను. 


ఆయన బాణములు కూడా పూలే! అమరకోశంలో ఆయనకు “కుసుమేషుడు” అన్న పేరు కూడా ఉంది. పూలు బాణములుగా కలవాడని అర్థం. ఈ శ్లోకంలో “పంచవిశిఖా” అని మాత్రం చెప్పబడింది. అంటే అయిదు బాణాలు అర్థం. ఈ బాణాలు ఏ పదార్థంతో చేయబడినవో చెప్పబడలేదు. యోధులు తమ అమ్ములపొదిలో అనేక బాణాలు కలిగి ఉంటారు. మన్మథునికి మాత్రం అయిదే బాణాలు. అవి కూడా కోమలమైన కుసుమాలు. ఆ అయిదు పుష్పాలు – అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం.


గట్టితనమే లేని విల్లు. అయిదే బాణాలు. మనం సామాన్యంగా ఏదైనా వస్తువు బాణంలా చొచ్చుకొనిపోతుంది అంటాం. ఈ మన్మథుని బాణాలు వ్యతిరిక్తమైన స్వభావంగలవి. అవి గుచ్చుకోవడం మాట అలా ఉంచి వాటిని చూడగానే మన శరీరంలో అతి సున్నిత భాగమైన కనులకు ఒత్తుకోవాలనిపిస్తుంది. “మౌర్వీ మధుకరమయీ” ఇక అల్లెతాడు తేనెటీగలతో చేయబడినదట. తేనెటీగలు భయంకలిగించే మాటవాస్తవమే. అవి కుడితే చాలాసేపు నొప్పి ఉంటుంది. అయితే వాటిని ఆయన బాణాలుగా ఉపయోగించలేదు. అలా చేస్తే అసలు విల్లేలా ఎక్కుపెడతాడు? మరెందుకున్నాయి ? ఆయన దగ్గరున్న పూలవిల్లుకి, పూలబాణాలకు ఆకర్షితమై వచ్చాయన్నమాట. ఆనందంతో ఝంకారం చేస్తున్నయి.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

**ఆత్మ బోధ**

 **దశిక రాము**


**ఆది శంకరాచార్యుల వారి**




63 జగద్విలక్షణం బ్రహ్మ


బ్రహ్మణో 2 న్యన్న కించన


బ్రహ్మాన్యద్భాతి చేన్మిథ్యా


యథా మరుమరీచికా || 63


ú‡Áx¤¦¦¦ø = బ్రహ్మం, జగత్‌=ప్రపంచానికి, విలక్షణం = సామాన్యలక్షణాలతో పరిశీలించటానికి వీలుకానిది, బ్రహ్మణః = బ్రహ్మానికి, అన్యత్‌=వేరుగా, కించన=కొద్దిగా కూడా ఏమీ, న=లేదు, బ్రహ్మాన్యత్‌=బ్రహ్మానికి వేరుగా, భాతి=గోచరించేది, చేత్‌=అయినట్లయితే, మరు మరీచికా=ఎండమావిలో నీరు, యథా=వలె, మిథ్యా=అసత్యమైంది.


తా|| బ్రహ్మాన్ని ప్రపంచంలో ఉన్న సామాన్య లక్షణాలతో పరిశీలించటానికి వీలుకాకుండా విలక్షణంగా ఉంది. బ్రహ్మం స్పర్శలేకుండా ఈ ప్రపంచంలో ఏదీ లేదు. బ్రహ్మాని కంటే వేరుగా ఈ ప్రపంచంలో ఏదైనా గోచరించినట్లయితే అది ఎండమావిలో నీటి వలె అసత్యమైందే!


వివరణ :- జగత్స్పర్శ తగలకుండా బ్రహ్మం తానుగా ఉందా? బ్రహ్మ స్పర్శ తగలకుండా ప్రపంచం తానుగా ఉందా? అంటే రెండూ కూడా ఒకదానితో ఒకటి కూడి ఉన్నట్లుగా ఉన్నాయి. బ్రహ్మానికి దేనితోనూ సంబంధం లేకుండా ఏదీ అంటకుండా ఉంటుంది కాని బ్రహ్మం అంటకుండా ఈ భూలోకంలో ఏ వస్తువూలేదు. నామ, రూప, వస్తు భేదాలతో రకరకాలుగా కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా స్వశక్తితో కూడి ఉంది అని భావిస్తే అది ఎండమావిలో నీరు ఎట్లా లేదో అట్లాగే ఈ లోకంలో కనిపించే వాటన్నిటిలో స్వతస్సిద్ధంగా శక్తి అనేది దేనికీ కూడా లేదు. లోకంలో చూసే వన్నీ భ్రమ చేత, దృష్టి భేదం చేత బహునామరూపాలుగా దృశ్యమానమవుతున్నాయే కాని మరొకటి కాదు. సాధకునికి భ్రమ తొలగగానే, సాధనలో విక్షేపాలు తొలగి బ్రహ్మం అనంతమైన బ్రహ్మంగా అనుభూతిని ఇస్తుంది. అందువల్లబ్రహ్మం కంటే అన్యంగా ఈ భూప్రపంచంలో ఇంకొక వస్తువేదీ లేదు. అన్నీ బ్రహ్మంతోనే కూడి ఉన్నాయి. కావున తేలిన సారాంశం ఏమిటంటే ''సర్వం ఖల్విదం బ్రహ్మ'' అంటే సర్వమూ బ్రహ్మమే. బ్రహ్మం కానిది ఏదీ లేదు. అయినా ఇంద్రియాలకు, మనస్సుకు, బ్రహ్మం గోచరంకావటం లేదు. శరీరం, మనస్సు, ఇంద్రియాలు అన్నీకూడా సాధనలో ఆత్మలో లీనమయినప్పుడే ఆత్మానుభూతి ఆత్మానందం కలుగుతున్నాయి. అందువల్లనే బ్రహ్మాన్ని ఎవరూ తెలుసుకోలేరని, ఎవరైనా నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నాను అంటే అది వట్టి అబద్ధమే అవుతుంది అని భాగవతి రామమోహనరావుగారు ఆత్మబోధలో చెప్పారు. ఈ ప్రపంచంలో చూస్తూ తెలుసుకొంటున్న వాటి తెలివి కంటే ఆ బ్రహ్మం నిశ్చయంగా విలక్షణమైంది. అంతేకాకుండా తెలియబడకుండా, అవ్యక్తంగా ఉండే దాని కంటే కూడా ఆ బ్రహ్మం అతీతమైంది అని కేనోపనిషత్తు వివరించింది. కాన బ్రహ్మం ప్రపంచంలో ఉన్న సామాన్య లక్షణాలతో పరిశీలించటానికి వీలయింది కాదు. బ్రహ్మాన్ని సామాన్య లక్షణాలతో చూశానని చెబితే ఎండమావిలో నీటిని తాగానని చెప్పినట్లే అవుతుంది. అది భ్రాంతి జనితమే కాని మరొకటి కాదు. ఈ భ్రాంతికి లోకంలో మరు మరీచికా భ్రాంతి-ఎండమావిని చూసి నీరనుకోవటం, శుక్త రజత భ్రాంతి-ముత్యపు చిప్పను చూసి వెండి అనుకోవటం, స్థాణుపురుషభ్రాంతి-చెట్టుమోడును చూసి మనిషి అనుకోవటం, సర్పరజ్జు భ్రాంతి-తాడును చూసి పామనుకోవటం వంటి వాటిని ఉదాహరిస్తుంటారు.


ఎడారిలో నీరు లభించదు కదా? ఒయాసిస్సును విని ఉండటం వల్ల ఎండలో కాంతి కిరణాలు నీటి చాలులా భ్రమకొల్పటం వల్ల దాహార్తిని పొందిన మానవుడు దానిని నీరని భ్రమపడి దానివెంటపడి పరుగుతీసి ఇంకా ఎక్కువగా అలసిపోయి, చివరికి సూర్యరశ్మిలో కనిపించిన నీటి భ్రమను గ్రహించుకొంటాడు. అదే విధంగా ఈ ప్రపంచంలో ఆనందంగా భావించే వాటి వెంట పడి అలసిపోయిన మానవుడు, ఇవి అన్నీ భ్రమలే అని తెలుసుకొని, నిజమైన ఆనందంకోసం గురువును ఆశ్రయించి బ్రహ్మానందాన్ని లోపలే అనుభవించగలుగుతాడు.


బ్రహ్మానందం బయట వెతికితే దొరకదని, బయట దొరికేది ద్వైతమేనని, లోపలికి ఇంద్రియాలను మరలించి భగవంతుని చేరినప్పుడే అద్వైతానందం లభిస్తుందని, అజ్ఞానం నుంచి జ్ఞానానికి మళ్ళిన తర్వాత మాత్రమే మానవుడు తెలుసుకోగలుగుతున్నాడు. దీనినే పరమ భక్తుడైన ఆంజనేయుడు రామునితో చక్కగా వివరించాడు అని గురుమహారాజ్‌జీ చెపుతూ ఉంటారు. ''(1) ప్రభూ నేను శరీర తాదాత్మ్యంతో ఉన్నప్పుడు నీదాసుణ్ణి (2) మనో బుద్ధులతో తాదాత్మ్యం చెంది జీవుడుగా జీవించినప్పుడు నేను నీలో ఒక భాగాన్ని (3) నా స్వరూపంలో నిలిచినప్పుడు నీవే నేను'' అని తన తాదాత్మ్యాన్ని మూడు విధాలుగా విభజించాడు ఆంజనేయుడు (1) శరీర స్థాయినుంచి చూసినప్పుడు దాసుడయ్యాడు. (2) మానసిక స్థాయినుంచి చూసినప్పుడు భగవంతునిలో ఒక భాగం అయ్యాడు (3) ఆత్మ స్థాయి నుంచి చూసినప్పుడు బ్రహ్మంగా రూపొందాడు. సాధకుడైనా కూడా (1) తాను వాతావరణాన్ని తట్టుకోలేనప్పుడు, బాధల్ని భరించలేనప్పుడు ద్వైతంగా జీవిస్తాడు. భగవంతుడికి భక్తుడిగానే భావిస్తూ, ప్రార్థిస్తూ రక్షించమని దాసుడుగానే వేడుకొంటాడు (2) సాధకుడు ఏదైనా కార్యాన్ని, కవిత్వాన్ని జ్ఞాన తత్త్వాన్ని స్వయంగా సాధించినట్లు భావించినప్పుడు తన శక్తిని, తన వివేకాన్ని తలచుకొని ఉప్పొంగిపోయి తనను భగవంతునిలో ఒక భాగంగా భావిస్తాడు. (3) సాథకుడు సాధనలో శాంతి సౌఖ్యాలను పొంది, ఆత్మానందంతో జీవిస్తూ గడుపుతున్నప్పుడు తానే పరమాత్మనని, తానే బ్రహ్మాన్నని బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. కావున సాధకుడు ద్వైత భావన నుండి విశిష్టాద్వైతానికి విశిష్టాద్వైతం నుండి అద్వైతానికి చేరుతూ అద్వైత భావంతో జీవించగలుగుతాడు. అద్వైత భావంతో లోక కార్యాల్లో జీవిస్తూ సాక్షి మాత్రంగా జీవనాన్ని కొనసాగిస్తూ, మనస్సుకూ, శరీరానికీ కలిగే కోరికలు మొదలైనవన్నీ తనవికావని, అవి వాటి వాసనా ఫలితంగా అవి అనుభవిస్తున్నాయని భావిస్తూ బ్రహ్మంగా జీవించగలుగుతాడు. అప్పుడు జీవుడే పరబ్రహ్మ స్వరూపంగా జీవించగలుగుతాడు.


(1) గురుమహారాజ్‌జీ శిష్యులైన ప్రేమీలు, మహాత్మాలు సంఘ సభ్యులందరికీ లేక జిజ్ఞాసువులకు సేవ చేస్తున్నప్పుడు ద్వైతభావంతోనే వారి సేవ కొనసాగుతుంది. అయినప్పటికీ వారందరూ భగవంతుని భక్తులే అనే భావనతో కూడి దాసులుగా సేవచేయటం వల్ల సేవాభావంలో తాదాత్మ్యం చెంది వారు ఆనందించటం జరుగుతుంది. (2) గురుకార్యాలను కాని, జిజ్ఞాసువుల కార్యాలను కాని తమ నేర్పుతో నెరవేరుస్తున్నామని వారికి భావన కలిగినప్పుడు ప్రేమీలు, మహాత్మాలు విశిష్టాద్వైతంతో భావంతో గడుపుతుండటం కనిపిస్తుంటుంది. (3) ప్రేమీలు, మహాత్మాలు సాధనలో పొందిన అద్వైత భావాన్ని బయటలోకంలో జీవిస్తున్నప్పుడు కూడా మౌనంగా అనుభవించగలిగినప్పుడు అద్వైతానుభూతితో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ బ్రహ్మంగా జీవించగలుగుతారు. కాని అది దీర్ఘకాలం వారిలో నిలవటం లేదు. దానిని శాశ్వతంగా నిలిచేటట్లు నిరంతరం సాధన చేయగలిగిన నాడు సర్వం బ్రహ్మంగా నిరంతరం దర్శనభాగ్యం పొందగలుగుతారు. జీవన విధానం మూడుగా కనిపిస్తున్నా సాధకుడు అద్వైతమే సచ్చిదానంద నిలయమని తెలిసి జీవించాలి - దాన్నే ప్రబోధించాలి.


సాధకుడు జీవన విధానంలో భగవంతుని నాటకరంగంలో తాను కూడా ఒక పాత్రనే కాని మరొకటి కాదు అని, ఫలితం కూడా నాది కాదు అని, నాకు వచ్చిన ఆలోచన - చేసిన పని - వచ్చిన ఫలితం అన్నీ ఆ భగవంతునివే అని భావన చేయగలిగిననాడు, అన్నీ ఆ పరబ్రహ్మానికి ఆత్మార్పణ చేసుకొన్ననాడు ఇక సాధకునిలో తనదీ అని చెప్పుకోదగింది ఏదీ మిగలకుండా పోతుంది. కనుక సాధకుడు బ్రహ్మంగా రూపొందగలుగుతాడు. సాధకుడు నిలబడినప్పుడు ఆతని నీడ ఆతని అంత ఎత్తు ఉంటుంది. ఆతడు వంగినప్పుడు ఆతని నీడ సగమవుతుంది. ఆతడు ఆత్మార్పణ చేసుకొని ఆ పరబ్రహ్మం ముందు మోకరిల్లినప్పుడు, సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు నీడ అనేదే లేకుండా పోతుంది. కాన సాధకుడు ఆ విధంగా ద్వైతంనుండి విశిష్టాద్వైతానికి మరలుతున్నప్పుడు గ్రహించుకొని అద్వైతానికి అనుకూలంగా జీవితాన్ని కొనసాగించటానికి అలవరచుకోవాలి. అప్పుడు సాధకుడు బ్రహ్మంగానే జీవించగలుగుతాడు. సాధకునిలో అహంకారం అనేది సర్వం కరిగిపోవటంతో సాధకుడే బ్రహ్మంగా, బ్రహ్మమే సాధకుడుగా కనిపిస్తారు. సాధకుడు ఆ విధంగా జీవించగలిగిన నాడు ఆతనిలో మానవత్వం మూర్తీభవించి, చుట్టూ ఉన్న వారికి ఆదర్శవంతంగా కనిపిస్తాడు. ఆతని చుట్టూ ఉన్న వారు తాము కూడా ఆ విధంగా మారాలని భావించటానికి వీలుకుదురుతుంది. ఇక్కడ సాధకుడు గమనించవలసిన విషయం ఒక్కటుంది. అదేమిటంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడూ .ఒకేలా ఉన్నప్పటికీ, ఆత్మమార్గం తనకు నిబ్బరాన్ని, స్థైర్యాన్ని, నిర్భయత్వాన్ని, సత్యభావాన్ని, ధర్మనిరతిని, నీతి నైర్మల్యాన్ని చేకూర్చ గలిగిందని గ్రహించాలి. అవి అన్నీ కలిసి సాధకుని లక్ష్యానికి చేరువగా ఉండేటట్లు నిరంతరం సహకరిస్తుంటాయి. అటువంటి ఆత్మజ్ఞాని ప్రాపంచిక విషయాల్లో అందరిలా ప్రతిస్పందించడు. ఆతని ఇంద్రియాలు సంయమనంతో నడుస్తాయి. వాటి ప్రతిస్పందన శరీరానందానికి, ఇంద్రియానందా లకు కాక ఆత్మానందానికి అనుకూలంగా జరుగుతుంది. కావున మానవులు బ్రహ్మజ్ఞానాన్ని గురువునుంచి పొంది, మనస్సును నిగ్రహించటం నేర్చుకొని, మనస్సుకు తగిన శిక్షణనిస్తే సుఖశాంతులతో మనగలుగుతారు. ఆ విధంగా ఉన్నవాడు భూతకాలపు భూతంతోగాని, భవిష్యత్‌ కాలపు ఆకాశహర్మ్యాలతో గాని గడపకుండా వర్తమానంతోనే జీవించగలుగుతాడు. భూత కాలంలో జరిగిన అనుభవాల జ్ఞాపకాల సమూహమే నేను అనే అహంకారంగా నిలుస్తుంది. ఆ నేనులో భవిష్యత్కాలపు ఆశలు చోటు చేసుకొని వర్తమానంలో అహంకారంతో జీవించేటట్లు చేస్తుంటాయి. గతాన్ని, భవిష్యత్తుని సమాధిచేసి వర్తమానంతో ఉత్సాహంగా జీవించగలిగితే అహంకారాన్ని తుదముట్టించటానికి వీలవుతుంది. దాని కొరకు సాధకుడు ఆ పరబ్రహ్మానికి ఆత్మార్పణ చేసుకొంటే బ్రహ్మంగా నిలుస్తాడు. అప్పుడు సాధకుడు తనలో ఉన్న మహోత్తమమైన పరమ పదార్థం తన నిజస్వరూపమేనని అపరోక్షానుభూతినొంది పరిపూర్ణుడవుతాడు.


నీ కులం ఏమిటి అంటే మానవ కులం అని, నీ మతం ఏమిటి అంటే ఆత్మ మతమని, నీ జాతి ఏమిటి అంటే అద్వైత జాతి అని సాధకుడు జీవించ గలిగిన నాడు తాను బ్రహ్మ స్వరూపంగా సర్వకాల సర్వావస్థలలోనూ నిలవగలుగుతాడు.

🙏🙏🙏

సేకరణ


*ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏

మోకరిల్లడం

 శుభోదయం.


జ్ఞానులైన వారిముందు మోకరిల్లి, ప్రశ్నలు అడగాలి. మోకరిల్లడం అంటే అహంకారం వంగిపోవడం. అహంకారం వంగినపుడు హృదయద్వారం తెరచుకుంటుంది. నేర్చుకోవాలి అనుకున్నవాడు స్వీకరించగలిగేవాడు అయివుండాలి, అర్ధం చేసుకోగలిగిన వాడు అయివుండాలి, అంగీకరించగలిగే వాడు అయివుండాలి. ఎవరికైతే నేను శిష్యుడిని అనే భావన ఉండదో, అతడు శిష్యుడు కాలేడు. శిష్యుడు బోర్లించిన పాత్రలా ఉండకూడదు.


మోహము అంటే ఎల్లకాలం జీవించాలి అనే బ్రతుకు మీద తీపి. ఇది ప్రధమ మొహం, అన్నింటికన్నా ముఖ్యమైన మోహం. మిగిలిన మోహాలు అన్నీ దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మోహం అంటే మృత్యువుతో సంఘర్షణ. మోహం ఉన్న చోట భయం ఉంటుంది. మోహం సఫలమైనా కాకపోయినా దుఃఖం గా మారుతుంది. పరమాత్మ అనుగ్రహం కలిగినప్పుడే ప్రేమ అంకురిస్తుంది. పుణ్యం చేసి పాపాన్ని పోగొట్టుకోలేము. పాపాన్ని జ్ఞానంతో మాత్రమే తొలిగించగలము.

మనిషికి చావు గుర్తురాకూడదు

 శుభోదయం.


మనిషికి చావు గుర్తురాకూడదు. చావుని మరిచిపోయిన వాడే సంసారం లో వుండగలడు. అందుకే మృత్యువుని దాచేస్తూ వుంటారు. శ్మశానాన్ని ఊరికి దూరంగా ఉంచుతారు. మృత్యువు గుర్తు వచ్చినవాడి సంసారం సన్న్యాసం అవుతుంది. అజ్ఞానంలో వరం శాపం లా అనిపిస్తే, జ్ఞానం లో శాపం కూడా వరంలా అనిపిస్తుంది.


జీవితంలో సమస్త కర్మలను కోరిక ఆధారంగా కాకుండా, నిష్కామ కర్మ ఆధారంగా చేయాలి. ఇందులో ఒక సౌలభ్యం ఉంది. కర్మ అవుతున్నంత సేపు కోరిక, ఆశ ఉండవు. కర్మ పూర్తవగానే ఆనందం తో నిండిపోతాము.


కోరికలే సంసారం. కోరికనేది వున్నంతకాలం బంధం ఉంటుంది. బంధం లేనప్పుడు ఏది ఉంటుందో అది మోక్షం. శాంతితో నిండిన మనస్సు అనేది ఉండదు. అశాంతి పేరే మనసు. వాసనాలని వదలి వేయాలి. భవిష్యత్తుని వదలి వేయాలి. కలలని వదలి వేయాలి. చివరకు నిన్ను నీవే వదలి వేయాలి. నీలో భగవంతుడు వున్నట్లుగా జీవించాలి. నీవు కర్మ చేయగానే, ఆ కర్మఫలం స్వీకరించడానికి పరమాత్మ నీ వెనకే వున్నట్లుగా కర్మలు చేస్తూవుండాలి.

శ్రీమద్భాగవతము

 *వందేమాతరం*

                                                                                                                                                      *భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1903 (౧౯౦౩)*


*10.1-884-వ.*

*10.1-885-*


*క. "కర్మమునఁ బుట్టు జంతువు*

*కర్మమునను వృద్ధి బొందుఁ గర్మమునఁ జెడుం*

*గర్మమె జనులకు దేవత*

*కర్మమె సుఖదుఃఖములకుఁ గారణ మధిపా!* 🌺



*_భావము: ఈ విధముగా నందుని యొక్క అనునయముతో కూడిన మాటలను వినిన రాక్షసాంతకుడగు శ్రీ కృష్ణుడు, ఇంద్రునికి కోపము చెలరేగేలా తండ్రి తో ఇలా అంటున్నాడు: "నంద మహారాజా! ప్రతి జీవి తాను చేసుకున్న కర్మలను బట్టియే పుట్టి, వాటిని బట్టియే వృద్ధి చెంది, చివరికి నశించిపోతుంది. చేస్తున్న కర్మలే దైవ సమానము, అవే జనుల సుఖ దుఃఖములకు కూడా కారణహేతువు."_* 🙏



*_Meaning: Sri Krishna the destroyer of rakshasas (demons) having heard the sensible words of king Nanda, responded to him with specific purpose of provoking Indra: ”O King Nanda! The way the men perform in their lives in this present life, they would get the same in return, in their next birth, continue to grow up the same way and also perish at the end. The actions/ deeds one performs are observed by the Almighty and the same actions would be the cause for happiness or misery in next life.”_* 🙏

 


*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

శ్రీగృహిణ్యష్టోత్తరశతనామావళీస్తోత్రమ్

 

*(శ్రీగృహిణీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం)*

             *కర్తా* - *ఆచార్య రాణి సదాశివ మూర్తి:*


గృహిణీ గృహవాచ్యేయం గృహరక్షైకదీక్షితా।

భర్తృసంతోషసంతుష్టా వంశోద్ధారణతత్పరా।।1।।

బంధుమిత్రహితప్రీతా సంక్షేమాలాపనందినీ।

సంతతగృహకార్యస్థా సేవికాపరివేష్టితా।।2।।

ఆలస్యదైత్యశమనీ తిమిరాసురభంజనీ।

కాఫీపానసమాయత్తశక్త్యుత్సాహసమన్వితా।।3।।

మహానసమహారాజ్ఞీ సర్వపాత్రాభివందితా।

చమసాద్యాయుధసంపన్నా దర్వీగర్వవిమర్దినీ।।4।।

గృహాగ్నికుండసంధాత్రీ  క్షుదగ్నిపరితోషిణీ।

శాకకర్తననిష్ణాతా పాకశాసనశాలినీ।।5।। (20)

సూపాపూపాన్నచిత్రాన్ననానాభక్ష్యవిధాయినీ।

సారక్వాథవినిర్మాత్రీ తంండులౌదనపండితా।।6।।

భోజ్యలేహ్యాదికర్త్రీ సా సూదవిద్యావిశారదా।

సమదర్వీకరా ధీరా వేల్లన్యాయుధధారిణీ।।7।।

దేవతార్చాసమాసక్తా వ్రతానువ్రతపాలినీ।

పర్వోపవాససంసక్తా సదోత్సవమతిశ్శుభా।।8।।

గృహాంగణవికాసజ్ఞా పుత్రపుత్రీసుఖప్రదా।

పత్యుః ప్రీతికరీ సౌమ్యా భర్త్రైవ జ్ఞాత రోషిణీ।।9।।

సదాచారా మితాలాపా యుక్తచేష్టా సుహాసినీ।

శ్లాఘనీయగుణోపేతా వంద్యేయం వంద్యచాతురీ ।।10।। (44)

లౌకికజ్ఞా కళాభిజ్ఞా విద్యావిజ్ఞానశోభితా।

కార్యక్షేత్రమహామాత్యా కృత్యదక్షా యశస్వినీ।।11।।

శ్వసురాసేవనే నమ్రా శ్వశ్రూననందృతోషిణీ।

భావదేవరసంమాన్యా యాతృమాన్యా  కుటుంబినీ।।।।

మాతాపితృహితారక్తా భగినీసంగలోలినీ।

భ్రాతృభూతికరీ భద్రా భ్రాతృజాయేష్టదా వరా ।।12।।

స్వాపత్యవిహితశ్రద్ధా విద్యారోగ్యప్రదాయినీ।

పుత్రీసంవర్థనాలంబా సా హ్యంబా లోక పూజితా।।13।। (65)

సుశీలా సరళోదారా మంజులా మంజుభాషిణీ।

కోమలా మధురాకారా శాంతా గృహధురంధరా।।14।।

ఉదారోజ్జ్వలభావజ్ఞా చంచలాऽచంచలా ఘనా।

దృఢవ్రతా దృఢాకాంక్షా దృఢచిత్తా దృఢాశయా।।15।।

గృహలక్ష్మీ శుభారంభా శుభాంగీ గృహవల్లభా।

గృహస్థహృదయజ్ఞేయం గృహాలంకారశిల్పినీ।।16।।

అలంకారప్రియా రమ్యా నానాభూషావిభూషితా।

సాడంబరా సుసంస్కారా నిరాడంబరజీవనా।।17।।

సేవికాడంబరవతీ దంభదర్పవివర్జితా। 

క్వచిద్దర్పవతీ సైవ  క్వచిద్దంభాతిశాయినీ।।18।।

సత్కాకావ్యనాయికైవైషా హేలాలీలావిలాసినీ। (100)

ఆదౌ ముగ్ధా తథా మధ్యా మధ్యేऽన్తే ప్రౌఢజీవనా।।19।।

ఆర్యా సుమంగళీ దీప్తా సుసౌభాగ్యప్రకాశినీ

భాసతే భారతే దేశే భారతాంబార్చనారతా।।20।।  (108)


*ఫలశ్రుతిః*

యత్రేదం పఠ్యతే నిత్యం నామ్నామష్టోత్తరం శతమ్।

గృహిణీ తత్ర సంతుష్టా సర్వాభీష్టాన్ ప్రయచ్ఛతి।।21।।

పతయస్సుఖినస్తత్ర సదా నందన్తి సూరయః।

సిద్ధ్యన్తి సర్వకార్యాణి రమన్తే తత్ర దేవతాః।।22।।


*ఇతి శ్రీగృహిణ్యష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణమ్*


                00000

శివకుమార స్వామి

 ఈ రోజు ఒకరు YouTube లో శ్రీ #శివకుమార స్వామి గారి వీడియో చూశాక నన్ను అడిగారు, #శివకుమార స్వామి ఎవరు అని, ఆయన మరణించినప్పుడు ఎందుకు అన్ని కోట్ల మంది ప్రజలు బాధ పడ్డారు అని. 


అప్పుడు నేను అడిగాను సరే నీకు మదర్ థెరిసా తెలుసా? అని 


అతను, అయ్యో ఎందుకు తెలియదు "ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి గ్రహీత, చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఆమె గురించి ఒక పేరా కూడా ఉంది" అని. 


నేను చెప్పాను, సరే అయితే ఆమె ఇక్కడికి వచ్చి చేసిన సేవ అనే పనులు దానితో చేసిన #మతప్రచారం, #మతమార్పిడి, మీడియా ఆమెకి ఇచ్చిన ప్రాదాన్యం గురించి వదిలేయ్యు. 

కానీ అసలు ఏమీ ఆశించకుండా

శివకుమార స్వామి వారు 132 #విద్యాసంస్థలను స్థాపించి ఏటా 50,000 మంది #గ్రాడ్యుయేట్లను, సంవత్సరానికి 10,000 మంది #గురుకుల్ విద్యార్థులకు విద్యను అందిస్తూ సాంప్రదాయ విద్యావిషయక అభ్యాసాన్ని పరిరక్షిస్తు, అలాగే అందులో ఉన్న అంతమంది విద్యార్థులందరికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తూ, ఏటా 5 లక్షల మంది రైతులకు మద్దతు ఇచ్చే వ్యవసాయ కార్యక్రమాలను చేస్తూ, ఇలాంటి ఇంక ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆ స్వామి శివకుమార స్వామి గారి గురించి భారతదేశంలో పుట్టిన మనకు ఇంక తెలియకపోవడం ఒక విధంగా సిగ్గుచేటు. అది మన దౌర్భాగ్యం. ..


ఇంత చేసిన ఆ స్వామిని మీడియా అతని ప్రయత్నాలను మరియు విజయాలను హైలైట్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు, ఎందుకంటే అతను ఎప్పుడూ #కాశాయ వస్త్రం కట్టుకొని, కుంకుమ ధరించేవారు..

Husband

 *Why Women Need a Husband?*

A Woman goes to a Psychiatrist and complains: “I don't want to marry. I am educated, independent, and self-sufficient. I don't need a husband. But my parents are asking me to marry. What do I do?”


The psychiatrist replied: “YOU, undoubtedly will achieve great things in life. But somethings inevitably will not go the way you want. Somethings will go wrong. Sometimes you will fail. Sometimes your plans won't work. Sometimes your wishes will not be fulfilled. Then who will you blame? 

Will you blame Yourself?”


Woman: “NO!!!”


Psychiatrist: “Yes... That's why you need a husband “

😝😛

రామాయణమ్.70

 

.....

నిత్యము మంగళవాయిద్య ధ్వనులతో మారుమ్రోగే రాజభవనము నేడు ఏడుపులు పెడబొబ్బలతో దద్దరిల్లిపోతున్నది.

.

రాముడు భార్యా,సోదరసమేతుడై తల్లికౌసల్యకు ప్రదక్షిణము చేసి నమస్కరించి అదేవిధముగా తక్కిన మూడువందలయాభైమంది తల్లులవద్దకూడా అనుమతి తీసుకొని తాను ఇదివరకెన్నడైనా అపరాధములు తెలియక చేసి ఉంటే మన్నించమని ప్రార్ధించి తండ్రికి కూడా ప్రదక్షిణనమస్కారములాచరించి అక్కడే ఉన్న సుమిత్రామాత వద్దకు వచ్చినారు .

.

తనకు నమస్కరిస్తున్న తనకుమారుడు లక్ష్మణుని చూసి ,నాయనా భగవంతుడు నిన్ను వనవాసము కొరకే సృష్టించినట్లున్నది ! ఏమాత్రము ఏమరుపాటులేకుండా రాముడిని రక్షిస్తూ ఉండు. నాన్నా ఈ రాముడే నీకు దిక్కు అతను కష్టాలలో ఉండనీ ఐశ్వర్యవంతుడుగా ఉండనీ గాక.

నీ పెద్దన్నను నీవు ఎల్లప్పుడూ అనుసరించి ఉండు అది ధర్మము!.

.

నీ వొదిన సీతమ్మను కన్నతల్లి అనుకో 

నీ అన్న రామయ్యను కన్నతండ్రి అనుకో 

నీ వుండే అడవి ఉన్న ఊరు అయోధ్య అనుకో!

హాయిగా సుఖంగా వెళ్ళిరా నాన్నా! అని కొడుకు తలనిమురుతూ పలికింది సుమిత్ర !

.

రామం దశరధం విద్ధి మాంవిద్ధి జనకాత్మజామ్

అయోధ్యాం అటవీం విద్ధి గచ్ఛతాత యధాసుఖమ్.

.

రాముడు దశరధుడని,సీత నేనేనని,అడవే అయోధ్య అని భావించుతూ సుఖంగా వెళ్ళిరా నాయనా! 

.

NB

.

సుమిత్రామాత నోట వాల్మీకి మహర్షి పలికించిన ఆ మాటలకు కొన్ని విశేష అర్ధములు చెప్పారు కొందరు వ్యాఖ్యాతలు.

రాముని...... దశరధమ్ అనగా పక్షి రధముగాగల విష్ణువుగాను సీతను ...మామ్ అనగా లక్ష్మీదేవిగానూ ,అడవిని ...అయోధ్యామ్ అ యోధ్యామ్ అనగా యుద్ధము చేయటానికి శక్యముగాని వైకుంఠము గా భావించుము అని వారివారి భావన! 

రాముడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు .సీత లక్ష్మి ,

రాముడు నివసించే అడవి వైకుంఠము.

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

శని

   

సూర్యునికి ఛాయ దేవికిని వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి నాడు కలిగిన సంతానమే "శని" ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను శని మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు గ్రహమండలమున స్థానం పొందెను. అధిదేవత యముడు. ప్రత్యధిదేవత ప్రజాపతి. వాహనం: కాకి, ఋతువు: శిశిరం. సజ్ఞాదేవి శపించంగా శనికి మందగమనం ప్రాప్తించింది.

విపత్తి హానిం సంపత్తి కుక్షిరోగం సుతక్షయం

లక్ష్మీకరం మహర్ధైన్యం మరణం దేహ శోషణం

బంధనం లాభ నష్టంచ క్రమేణ కురుతే శని:

తాత్పర్యము : శని పన్నెండు రాశులలో సంచారము చేయు నపుడు 1 ఆపదలను 2 హానిని 3 సంపదను 4 గర్భసంభంద రోగములను 5 సంతానమునకు కష్టములను , నాశనమును 6 మహా ఐశ్వర్యమును 7 మహా దరిద్రమును 8 మరణ సమాన ఫలితములను 9 దేహ శోషణమును 10 బంధనమును 11 లాభమును 12 అనేక విధాల నష్టములను కలిగించు చున్నాడు .శని, సూర్యుడి నుండి ఆరవ గ్రహం. సౌర వ్యవస్థలో అన్ని గ్రహాల కంటే పెద్దదైన గురు గ్రహం తరువాత, శని అతి పెద్ద గ్రహం. ఇది పూర్తిగా వాయువులతో కూడుకుని ఉంటుంది. దీని సగటు వ్యాసార్థం, భూమి వ్యాసార్థానికి ఆరు రెట్లు ఉంటుంది. సగటు సాంద్రత భూమి సాంద్రతలో ఎనిమిదవ వంతు ఉంటుంది. కానీ, శని ఘనపరిమాణం చాలా ఎక్కువ కావడాన, దాని ద్రవ్యరాశి భూమికి 95 రెట్లు ఉంటుంది. ఈ గ్రహానికి ఈ పేరు, హిందూ దేవుడు శని పేరిట వచ్చింది. దీన్ని ఇంగ్లీషులో శాటర్న్ అని అంటారు. ఇది రోమనుల వ్యవసాయ దేవత పేరిట వచ్చింది. శని గ్రహపు సంకేతం (♄) చేతిలో ఉండే కొడవలి పేరిట వచ్చింది.శనిగ్రహ ఉపరితలంపై బలమైన గాలులు వీస్తూంటాయి. ఈ గాలుల వేగం 1,800 కి.మీ./గం వరకూ ఉంటుంది. ఇది గురుగ్రహంపై గాలుల వేగం కంటే ఎక్కువ. నెప్ట్యూన్ పై గాలుల వేగంతో సమానం. శనిగ్రహంపై ఒక రోజుకు 10 గంటల, 33 నిముషాల, 38 సెకండ్ల సమయం (+1 ని.52సె. -1ని.19సె) పడుతుందని 2019 జనవరిలో ఖగోళవేత్తలు లెక్కించారు. ఈ గ్రహపు అత్యంత ప్రముఖమైన విశేషం, దాని చుట్టూ ఉండే వలయాల వ్యవస్థ. ఇది మంచు ముక్కల తోను, రాళ్ళ శిథిలాల తోనూ కూడుకుని ఉంటుంది. శని చుట్టూ 62 సహజ సిద్ధ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. భారతీయ జ్యోతిష శాస్త్రంలో శని ఒక గ్రహం. దీన్ని నపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు, శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరీవాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు. క్రూర గుణం.ప్రాణుల పాపఫలితాన్ని అందించే గ్రహంగా గుర్తించబడింది.ఇది పాపగ్రహంగా కూడా వర్ణించబడింది. దశా కాలం: 19 సంవత్సరాలు. ఏలిననాటి శని జాతక చక్రంలో 12,1,2 స్థానాలలో శని సంచరించే కాలం ఏలిననాటి శని కాలం. ఇది జాతకుని అత్యంత కష్టాలపాలు చేస్తుందని విశ్వసించబడుతుంది.ఇది దాదాపు ఏడున్నర సంవత్సరముల కాలం.ఇది జాతకునికి నాలుగు సార్లు రావచ్చని భావన. పాద శని, పొంగు శని, మంగు శని 8 మరణశని. శతృవు: రవి,చంద్రుడు,కుజుడు శతృగ్రహాలుగా భావిస్తారు ఆకారణంగా రవి కారకత్వంగా కలిగిన తండ్రి చంద్రుడు కాతకత్వంగా కలిగిన తల్లి కుజుడు కారకత్వంగా కలిగిన సోదరులతో శని ఆదిపత్యం కలిగిన మకర మరియు కుంభ రాశుల వారికి పరస్పర వైరం ఉంటుందని భావిస్తారు.ఏలిన నాటి శని కాలం ఏడున్నర సంవత్సరమముల కాలం, శని మహర్దశ కాలంలో, అర్ధాష్టమి, అష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలు సృష్టిస్తాడు. వీటికి ఆందోళన చెందవలసిన పని ఉండదు. పరిహారాలు ఉంటాయి. శని ఆధిపత్యంలో ఉన్న రాశులు అయిన కుంభ, మకర రాశుల వారికి, మిత్ర స్థానాలు అయిన మిధున, కన్యా, వృషభ, తులా రాశుల వారికి శని నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మింక్ష్చిన వారికి, కొంత వెసులుబాటు ఉంటుంది. కష్టాలు మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియ చేయడమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుంది. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారంలా మెరిసేలా చేస్తుంది. శని వైరాగ్యాన్ని, భక్తిని ప్రసాదిస్తాడు. ఆయుఃకారకుడు, ఆటంకములు, విరోధం, కష్టం, బాధలు, దుఃఖం, సేవకత్వం, దురాచారము, బంధనం, మూర్ఖత్వం, జూదము, జైలు జీవితం, మద్యపానం, అంగవైకల్యం, మూర్చ రోగం, అంగవైకల్యం, బ్లాక్ మార్కెట్, అన్యాయార్జన, జీవహింస, అవమానము, రాజదండన, బద్ధకం, క్షుద్రశక్తులు, అప్పులు, మృత్యుదేవతారాధాన, అంద విహీనత, బంధు మిత్ర తిరస్కారం సూచిస్తాడు. వంటవారు, నపుంసకులు, చండాలురు, అక్రమసంతానం, సేవకులు, నీచులను సూచిస్తాడు. పురాతన భవనాలు, పురాతన వస్తువులు, పూరావస్తు శాఖ, సొరంగాలు, గుహలు, చలివేంద్రములు, నువ్వుల నూనె, గానుగ, నూనె దుకాణములను సూచించును. నువ్వులు, ఉల్లి, వేరు శనగ, బంగాళాదుంపలు, రాగులు, జొన్నలు, మినుములు, దున్నపోతు, గాడిద, ఒంటె, కోడి, బొగ్గు, తారు, నల్లమంగోళ్ళకు సంబంధించిన సమస్యలు, అజీర్ణం, కిరోసిన్, వెండ్రుకలు, ఎముకలు, దంతములను సూచిస్తాడు. కలప, తోలు పరిశ్రమలను సూచిస్తాడు. ఆలస్యము, దురదృష్టము, సరిహద్దులు, దహనకార్యక్రమాలు, అపవాదు, పదవీ విరమణ, నిర్మాణం, శాస్త్రీయదృక్పదం, ఒంటరి తనం సూచిస్తాడు. గనులు, వంతెనలు, చర్మము, ఆనకట్టలు, పిరికి వాళ్ళు, రాళ్ళు, ఆస్తి, ఆపద, మంచు, ఆందోళన, వినయము, అనుమానము, అనుకూలత, వినయము, సెరామిక్స్, మట్టిని సూచిస్తాడు. శని వాత సంబంధ వ్యాదులను సూచిస్తాడు. కీళ్ళ వాతం, పక్షవాతం, బలహీనత, నొప్పులు, కిడ్ని లివర్ మొదలైన వాటిలో రాళ్ళు ఏర్పడుట, క్షయ, దగ్గు, ఆస్త్మా, న్యుమోనియా, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ వ్యాధులు, పని చేయలేని అశక్తి, డ్రగ్స్ అలవాటు మొదలైన వాటికి కారకుడు. చంద్రుడితో కలిసిన మతి భ్రమణం, పిచ్చి, వాతం, గుండె నొప్పి, కండరాల నొప్పి, తల నొప్పి, బద్దకం, నీరసం మొదలైనవి సూచిస్తాడు. గురువుతో చేరిన జీర్ణ వ్యస్థకు సంబంధించిన వ్యాధులు. బుధుడితో కలిసిన మాటలు సరిగా రాకుండుంట, నత్తి, నాలుక మొద్దుబారటం, మెదడు మొద్దుబారటం, చెవి సంబధిత వ్యాధులు సూచిస్తాడు. కుజుడితో కలిసిన కండరాల నొప్పి, కండరాల జబ్బులు సూచిస్తాడు. శుక్రుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, పైల్స్, విరేచనాలు మొదలైన వ్యాదులను సూచిస్తాడు. రాహువుతో కలిసిన విషప్రయోగం, వైరస్ వ్యాదులను సూచిస్తాడు.కేతువుతో కలిసిన రక్త పోటు వ్యాదులను సూచిస్తాడు. జైలర్, ప్లంబర్, వాచ్‌మన్, పాకీపని చేయు వారు, వీధులు ఊడ్చు వారు, కూలీలు, మేస్త్రీ పని వారు, తోటమాలి, రైతులను సూచిస్తాడు. లోహాలు, తోలు, కలప వ్యాపారాలు. చంద్రుడితో కలిసిన సివిల్ ఇంజనీర్లు, బిల్డర్స్, సర్వేయర్లు, ఎక్స్‌రే టెక్నీషియన్లను సూచిస్తాడు. రవితో కలిసిన ప్రభుత్వరంగ సేవలు చేసే వారు. గురువుతో కలిసిన భూముల కొనుగోలు అమ్మకాల వ్యాపారం, గనుల యజమానులు, సైంటిఫిక్ లాబ్‌లో పని చేయు వారు. బ్యాంక్ సిబ్బంది, ప్రచారం చేయు వారిని సూచిస్తాడు. బుధుడితో కలిసిన రచయితలు, శాస్త్రవేత్తలు, కలప కోయు వారు, ఉపాధ్యాయులు, సెన్సార్ బోర్డ్, సి ఐ డి డిపార్ట్ మెంటులో పని చేయు వారిని సూచిస్తాడు. శనికి ప్రీతికరమైన జ్యేష్టశుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి నాడు పూజలు జపాలు నిర్వహించడం శ్రేష్టం. దోషనివారణకు నీలమణి, ఎర్రచందన మాల, చతుర్దశ ముఖ రుద్రాక్ష ధారణ చేయాలి. హోమముకు వాడవలసిన సమిధ జమ్మి. ప్రీతికరమైన వారం శనివారం.


లగ్నంలో శని ఉన్న జాతకుడు దు॰ఖపూరితుడు, నిస్సహాయుడు, మలినాంబరధారి, నీరసి అయి ఉంటాడు. అయినా శని స్వరాశులైన మకరం, కుంభం, ఉచ్ఛ స్థానమైన తుల రాశులు లగ్నమై వాటిలో శని ల్గ్నస్థుడై ఉంటే మాత్రం రాజతుల్యుడు, ప్రధాన పదవులు వహించే వాడు, నగరపాలకుడు ఔతాడు.

ద్వితీయస్థానమున శని ఉన్న జాతకుడు జుగుస్సు కలిగించే ముఖం కలవాడు, ధనహీనుడు, అన్యాయవర్తనుడు, కాలక్రమమున దూరప్రాంతములణందు నివసించు వాడు ధనవంతుడు ఔతాడు.

తృతీయస్థానమున శని ఉన్న జాతకుడు మిక్కిలి విజ్ఞానవంతుడు, ఉదారుడు, భార్యాసమేతంగా సుఖపడువాడు, ఉత్సాహి, దుఃఖం లేని వాడు ఔతాడు.

చతుర్ధస్థానమున శని ఉన్న జాతకుడు సుఖహీనుడు, గృహము లేని వాడు, వాహనములు లేని వాడు, బలారిష్టములు అనుభవించు వాడు, తల్లిని పీడించువాడు ఔతాడు.

పంచమస్థానమున శని ఉన్న జాతకుడు, అజ్ఞాని, పుత్రులు లేని వాడు, ధనహీనుడు, సుఖహీనుడు, దురభిమాని, దురాలోచనాపరుడు ఔతాడు.

షష్టము స్థానమున శని ఉన్న జాతకుడు ధనవంతుడు, అధికంగా ఆహారం తినువాడు, దుశ్చరిత్రుడు, అభిమానవంతుడు, శత్రువుల చేత ఓడింపబడిన వాడు ఔతాడు.

సప్తమస్థానమున శని ఉన్న జాతకుడు తిరుగాడు వాడు, కళత్రం కలిగిన వాడు, భయకంపితుడు ఔతాడు.

అష్టమ స్థానమున శని ఉన్న జాతకుడు శుభ్రం లేని వాడు, ధనం లేని వాడు, మూల వ్యాధి పీడితుడు, క్రూరమనస్కుడు, సజ్జనుల చేత అవమానించబడిన వాడు ఔతాడు.అదే శని వక్ర మార్గం లో ఉంటే ఆయుష్షు నష్టం అవుతుంది. లగ్నం లో రవి 8 అష్టమం లో శని రోగపీడితులు.

నవమస్థానమున శని ఉన్న జాతకుడు అదృష్టం లేని వాడు, సంపదలేని వాడు, సంతతి లేని వాడు, పితృధర్మం లేని వాడు, మోసకారి ఔతాడు.


దశమస్థానమున శని ఉన్న జాతకుడు రాజు కాని, మంత్రి కాని ఔతాడు. ధైర్యవంతుడు, ధనవంతుడు, ఖ్యాతి కలవాడు ఔతాడు.


ఏకాదశ స్థానమున శని ఉన్న జాతకుడు చిరంజీవి, బహుసంపాదనాపరుడు, స్థిరసంపదలు కలిగిన వాడు, రోగములు లేని వాడు ఔతాడు.

ద్వాదశ స్థానమున శని ఉన్న జాతకుడు నిర్లజ్జ కలవాడు, ధనం లేని వాడు, పుత్రులు లేని వాడు, అంగవికలుడు, మూర్ఖుడు, శత్రువులచేత తరమబడిన వాడు, పుత్రులు లేని వాడు ఔతాడు. *దోషనివారణలు మరొక పోస్టులో*....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

శ్రీ భాస్కర రాయలవారు – సౌభాగ్యభాస్కరం

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 4 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu 




పూర్వకాలములో దక్షిణభారతదేశములో విశ్వామిత్ర గోత్రోద్భవుడైన గంభీర రాయలవారు ఉండేవారు. ఆయన భార్య పేరు కోనాంబ. వారు భాగ్యనగరములో ఉండేవారు. వారికి ఒక పిల్లవాడు జన్మించాడు ఆయనకు బాలభాస్కరరాయలు అని పేరు పెట్టారు. గంభీరరాయలవారు అమ్మవారి ఉపాసకులు అవడము వలన చిన్నతనములోనే వాగ్దేవతామంత్రమును ఆయనకు ఉపదేశము చేసారు. ఆ పిల్లవాడు మిక్కిలి భక్తిశ్రద్ధలతో అనుష్ఠానము చేసి అపారమైన వాగ్వైభవమును పొందాడు. వేద వేదాంగములను చదువుకుని మంచిజ్ఞాని అయ్యాడు. మంత్రశక్తి అనుభవైక్యవేద్యము తప్ప ప్రకటనలకు అందదు. గురుమండలరూపిణి అమ్మవారు నృసింహయజ్వ అన్న చక్కని గురువుని కూడా అందించింది. ఆయన దగ్గర విద్యాభ్యాసము చేసి అన్నివిద్యలు తెలుసుకున్నారు. ప్రకాశానందనాధ అన్న దీక్షా నామము కలిగిన శివదత్తశుక్ల అన్న ఒక మహాపురుషుడు దీక్షాస్వీకారము చేయించారు. 


ఉత్తర భారతములో మహారాష్ట్రలో ఆయనకు ఎందరో శిష్యులు ఉండేవారు. ఆయన ఎప్పుడూ దక్షిణ భారతదేశములో కావేరీ వరకు ప్రయాణము చేస్తుండేవారు. ఆయన కర్ణాటక దేశములో కృష్ణానది ప్రవహిస్తున్న తీరములో సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యడానికి వెళ్ళారు. అప్పుడు విశేషమైన ఎండాకాలము. నదికి దూరముగా ఒక పర్ణశాల నిర్మించుకుని ప్రతిరోజూ నియమబద్ధముగా అర్ఘ్యప్రదానము చేస్తూ సూర్యుని ఉపాసన చేసేవారు. ఒక రోజు నదికి నడచి వెళ్ళి వచ్చి పడుకుని ఉండగా, శిష్యులు కాళ్ళు ఒత్తుతూ పాదముల వంక చూస్తే బొబ్బలు ఎక్కి ఉన్నాయి. వాళ్ళు గురువుగారు! పర్ణశాల నది ఒడ్డున వేసుకుందాము అంటే, ఆయన మన పర్ణశాల అక్కడ వేసుకుందామని అన్నారు కానీ, కృష్ణానదిని పర్ణశాల వద్దకు తీసుకుని వద్దామని ఎందుకు అనలేదు? మీరు బెంగ పెట్టుకున్నారు కనక రేపటి నుంచి నదికి వెళ్ళను. నదినే ఇక్కడకు పిలుస్తాను. అంటే శిష్యులు తెల్లపోయి అదేమిటి? నది పర్ణశాల వద్దకు ఎలా వస్తుందని అనలేదు. వారికి గురువుగారి మీద ఉన్న నమ్మకము అటువంటిది. ఉదయము లేచి సంధ్యావందనము చేసి సూర్యనారాయణమూర్తిని పిలిచారు. పిలిస్తే వచ్చి ఎదురుగా నిలబడి ఏమి కావాలి? అని అడిగితే భాస్కరరాయలవారు కృష్ణానదిని దారి మళ్ళించి ఇటు పంపు అన్నారు. సూర్యనారాయణమూర్తి సృష్టి ప్రారంభములో నదీనదములు ఎలా ప్రవహించాలన్నది చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయము చేస్తారు. అవి అలాగే వెడతాయి దారి మళ్ళించడము మహాపాపము నేను ఆ పనిని చేయనని చెప్పాడు. భాస్కరరాయలవారు వెంటనే నేను ఉపాసన చేసి పిలిస్తే వచ్చి నిలబడి నా కోరిక తీర్చకపోతే, లోకములో నీకు ఆరాధన లేకుండా నిన్ను శపించి నీ ఉపాసనా శాస్త్రములన్నిటినీ కూడా నశించి పోయేట్టుగా చేస్తాను అన్నారు. ఇదీ భక్తుల గొప్పదనము. సనాతనధర్మ వైభవము. లోకములంతటికీ వెలుగు ఇచ్చే సూర్యనారాయణమూర్తికి చెమటలు పోసి భాస్కరరాయలవారి వంక చూసి తప్పకుండా కృష్ణానదిని దారి మళ్ళిస్తాను. కానీ అది శాశ్వతముగా అలా ఉండకూడదు. మీరు శరీరముతో ఉన్నంత కాలము నది మీ పర్ణశాల ముందునుంచి వెడుతుంది.లోకములో ఎవరైనా శరీరము వదిలి పెట్టవలసిందే. మీరు శరీరము వదిలిన తరవాత నది యథాప్రకారముగా ప్రవహిస్తుంది అని అనుమతి ఇచ్చాడు. 


లలితాసహస్ర నామ స్తోత్రమునకు వ్యాఖ్యానము వ్రాసే విషయములో లోకములో ఒక చిత్రమైన విషయము ప్రచారములో ఉన్నది. భాస్కరరాయలవారికి ఎవరి దగ్గరో కొంత బాకీ ఉండేదనీ అమ్మవారే ఆయన్ని స్తోత్రమునకు వ్యాఖ్యానము వ్రాయమని నిర్దేశిస్తే ‘అమ్మా ! ఋణగ్రస్తుడు అయినవాడు వ్యాఖ్యానము ఎలా చేస్తాడని నాకు ఋణము ఉన్నదని అన్నారని – మరునాడు సంధ్యావందనము చేసుకోవడానికి వారు వెళ్ళి వచ్చేప్పటికి అమ్మవారు ఋణము తీర్చేసి ఆ రాసిచ్చిన కాగితములు అక్కడ పెట్టేసిందని అప్పుడు స్తోత్ర వ్యాఖ్యానము ప్రారంభము చేసారని చెపుతారు.

https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

పోత‌న త‌ల‌పులో...59

 


ద్వారకాపుర పౌరులు కృష్ణ‌య్య‌కు స్వాగ‌తం ప‌లికి, కానుకలు సమర్పించి ఇలా అంటున్నారు....

"నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం

తాపధ్వంసినియౌఁ గదా, సకలభద్రశ్రేణులం బ్రీతితో

నాపాదింతు గదా ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని

ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్.

  ****

స్వామీ! నీ పాదపద్మాలు బ్రహ్మపూజ్యాలు; నీ చరణ సేవ, సంతాపమయ మైన సంసార సముద్రాన్ని దాటించే నావ; నీవు ఆశ్రితులకు సకలసౌభాగ్యాలను సంతోషంగా ప్రసాదించే కరుణామూర్తివి; కాలస్వరూపుడవు; కాలానికి అధీశ్వరుడవు; బ్రహ్మాది దేవతలు కూడా నీ లీల‌లు వ‌ర్ణింప‌లేరు గ‌దా స్వామీ...

       **

 ఉన్నారము సౌఖ్యంబున,

విన్నారము నీ ప్రతాప విక్రమకథలన్,

మన్నారము ధనికులమై,

కన్నారము తావకాంఘ్రికమలములు హరీ!.

      **

కృష్ణయ్యా! నీ దయవల్ల మేమంతా సుఖంగా ఉన్నాం. నీ శౌర్యప్రతాపాల గురించిన విశేషాలు వింటున్నాం, సంతోషిస్తున్నాం. మాకు ఇన్నాళ్ళకి మళ్ళా నీ పాదపద్మాల దర్శనం అయింది. భాగ్యవంతులమై విలసిల్లుతున్నాం.

 **

ఆరాటము మది నెఱుఁగము,

పోరాటము లిండ్లకడలఁ బుట్టవు, పురిలోఁ

జోరాటన మెగయదు, నీ

దూరాటన మోర్వలేము తోయజనేత్రా!

కమలాల వంటి కన్నులున్న కన్నయ్య! మా మనసులలో ఆరాటా లన్నవి లేవు. ఇళ్ళల్లో కలహా లన్నవి లేవు. నగరంలో చోర భయాలు లేనే లేవు. అయినా కూడ నీవు దూరప్రాంతాలకు వెళ్ళి నప్పుడు నీ వియోగాన్ని సహించలేమయ్యా. అని కృష్ణ‌య్య‌ను త‌నివితీరా చూస్తూ వేనోళ్ల కొనియాడుతున్నారు.


   🏵️పోత‌న ప‌ద్యం🏵️

🏵️శ్రీకృష్ణ లీలామృతం🏵️

జీవ లక్షణం

 జీవ లక్షణం ఎలా తెలియవలె.దీనికి సులువైన మార్గం కలదా. పరిశీలిద్దాం. వకే శక్తి అన్నింటిలో ఎల్లకాలము వ్యాప్తమైనగాని అంతా వకే లాగ జీవ లక్షణములు భౌతికంగా వుండ వలెను కదా. అలా వుండుట లేదు ఏదీ మరియెుక దానితో పోలిక లేదు. ప్రతీ క్షణం మార్పు చెందుతూ లక్షణము కలదు కావున ఏదీ అలా తెలియుట లేదు. ఏకం వాటి ౦ పూర్ణము రెండుగా అనగా రెండు వస్సతు తత్వము లుగా మారిన ఆ రెండును వకే లాగ లేవు. రెండు సున్నతి రెండింటిలోను శక్తి మారినది అది సమానంగా లేవు. వక వేళ సమానముగానున్ననూ వాటి లక్షణము పూర్తిగా మారి యున్నది. మారిన గాని మాయగా తెలియుట లేదు. అంతకుమునుపు ఏమీ తెలియదు. పోనీ మారిన తరవాత తెలియునా అలా తెలిసే లోగా మారి పోవుచున్నది. అది ఇమం అని యితమిధ్గంగా స్థిరంగా తెలియుట లేదు జ్యోతి ఉష గా మారిన తరువాత మాత్రమే సృష్టి అంతా శివ లక్షణమై కేశవా అనగా విషు విష్ణు మాయగా తెలియుచున్నది. శివుని గురించి అసలు తెలియదు. మారిన తరువాత మాయోను అది భ్రమ యని తెలియుచున్నది. మాయ లోంచి వుత్పత్తి మాయ లోనే లయం. దీని గురించి చాలా తాపత్రయం పడుట యిదిగో నా వల్లే జరిగినది నిజముగా మనం నిమిత్తం గా కారణము. ప్రకృతి 🌿🍃ఆగుటకై లేదు మారు చున్నది. ఏవీ వాటి గమనం నదులు లేదు మానవుడు మాత్రమే అన్నీ పట్టించుకునే నాకే కావాలి. వేరొకరికి దక్కకూడదు అనే దాని మాటలే భ్రమించుట. దీనికి యశోదా దేవకి కమ్ముచున్నది. ముందు ఆశ్చర్యం ఆ తరువాత అహంకారము. అదియే మాయ. కృష్ణుని చూసి మెూహము. అంతా దైవం లాగ కనపడుట. పరిశీలించిన మాయ. కృష్ణ మాయ. రాహు కేతు తత్వములు మాయకు మూలం. గ్రహములకును స్వంత ప్రకాశం శక్తికి గ్ర౬ణములే మూలం. బాహువుతో కూడిన శివతత్వమని కేతువు తో కూడిన విష్ణు తత్వ మని జాతక కుండల్లో మాత్రమే జీవ లక్షణము తెలియును. మామూలుగా అర్ధం కాదు. వీటికి విశ్వంద్వారా మెటీరియలైజ్ కాలేదు. మెటీరియలైజ్ అగుటకు పదార్ధ లక్షణమైన భూమిని ఆశ్రయించి ప్రకృతి ద్వారా మాత్రమే తెలియును శక్తి అగ్ని రూపంలో . మిగిలిన గ్రహములకును రంగు రూపం కాంతి లక్షణములు సూర్య చంద్రుల ద్వారా కలిగియున్నవి. తెలుకుందాం ఆచరిద్దాం.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

వేదన..స్వాంతన..


"స్వామివారి మందిరానికి రావాలని అనుకుంటున్నాము..ఎలా రావాలో తెలుపుతారా?.." అంటూ చెన్నై నుంచి మధుసూదనరావు గారు అడిగారు..ఆయన వయసు డెబ్భై ఏళ్ళు..రైల్లో ఎక్కడ దిగాలో చెప్పి..అక్కడనుంచి మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి ఆశ్రమానికి బస్ లో రావడానికి మార్గాన్ని వివరంగా తెలిపాను..ఆ తరువాత శని ఆదివారాల్లో మందిరానికి వస్తానని చెప్పారు..అనుకున్న ప్రకారమే మధుసూదనరావు గారు శనివారం ఉదయం తొమ్మిదిన్నర కల్లా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..గది కి వెళ్లి, స్నానాదికాలు ముగించుకొని, మందిరం లోకి వచ్చి..శ్రీ స్వామివారి విగ్రహానికి నమస్కారం చేసుకొని...నావద్దకు వచ్చి.."ఇక్కడికి మాలకొండ దగ్గరే కదా..అక్కడికి వెళ్ళడానికి ఆటో లు ఉన్నాయా?.." అన్నారు..ఒక గంట ఆగితే బస్ వస్తుందని..అందులో వెళ్ళమని సలహా ఇచ్చాను..సరే అన్నారు..మాలకొండకు వెళ్లి, శ్రీ లక్ష్మీ నరసింహుడి దర్శనం చేసుకొని సాయంత్రానికి తిరిగి మందిరానికి వచ్చారు..


ఆరోజు సాయంత్రం పల్లకీ సేవ వద్ద పూజ చేయించుకొని..తిరిగి నా వద్దకు వచ్చి.."ప్రతి శనివారం నాడు ఇంతమంది భక్తులు ఉంటారా?..వీళ్ళందరికీ అన్నదానం చేస్తున్నారా?.."అన్నారు..అవును అన్నాను..ఓ ఐదు నిమిషాల పాటు మౌనంగా వున్నారు..ఆ తరువాత.."శనివారం నాటి సాయంత్రం అన్నదానం చేయించడానికి సుమారుగా ఖర్చు చెప్పండి..వచ్చే వారానికి నేను భరిస్తాను.." అన్నారు..వివరంగా చెప్పాను..అంతా విని.."బాబూ..నేను రేపు సాయంత్రం తిరిగి చెన్నై వెళ్లాలని టికెట్ బుక్ చేసుకున్నాను..కానీ ఇందాకటి నుంచీ ఈ కోలాహలం చూసిన తరువాత..ఈ వారమంతా ఇక్కడే వుండి.. స్వామివారి సేవ చేసుకొని..శనివారం నాడు అన్నదానం చేసి..ఆదివారం నాటి సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను..నాకు కేటాయించిన గదిని ఈ వారమంతా నాకే ఉంచండి.."అన్నారు..సరే అన్నాను..


ఆరోజు గడిచిపోయింది..ప్రక్కరోజు ఆదివారం ఉదయం ప్రభాత పూజ, సమాధికి అభిషేకం, విశేష హారతులు అన్నీ దగ్గరుండి చూసారు..మధ్యాహ్నం అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం చేసి వచ్చారు..

"నువ్వు నాకన్నా చిన్నవాడివి..బాబూ అని ఏకవచనం తో పిలుస్తున్నాను.. ఏమీ అనుకోకు..నీతో కొంచెం సేపు మాట్లాడాలి.." అన్నారు..దగ్గరకు జరిగి కూర్చున్నాను..


"నాకు ఇద్దరు కుమారులు..ఇద్దరూ ఇంజినీర్లే.. పెద్దవాడికి వివాహం చేసాను..రెండో వాడికి సంబంధాలు చూస్తున్నాము..పోయిన సంవత్సరం చాలా గడ్డుకాలం నా జీవితం లో..నలభై ఐదు ఏళ్ల పాటు నాతో సంసారం చేసిన నా భార్యకు కాన్సర్ సోకి..మేము గ్రహించేసరికి ఆలస్యం జరిగి..ఆవిడ కాలం చేసింది..బాగా కృంగిపోయాను..ఈ వయసులో తోడు లేకుండా పోయింది..మరో మూడు నెలలు గడిచేసరికి.. రెండో వాడు ప్రమాదంలో చనిపోయాడు..దెబ్బ మీద దెబ్బ..పెద్ద కొడుకు వద్ద ఉంటున్నాను..మానసికంగా కోలుకోలేని పరిస్థితి..ఒంటరితనం పీడించసాగింది.. మా కాలనీకి దగ్గరగా ఉన్న గుడికి వెళ్ళసాగాను.. అక్కడ సత్సంగం లో ఈ స్వామివారి గురించి..ఈ మందిరం గురించి విన్నాను..ఎందుకో తెలీదు..ఒక్కసారి వెళ్లి చూసిరావాలని బలంగా అనిపించింది..ఆలస్యం చేయకుండా వచ్చాను..ఇన్ని రోజుల తరువాత ఈరోజు నాకు మనసు ప్రశాంతంగా ఉంది..ఒక వారం పాటు ఇక్కడే వుంటాను..నువ్వు కాస్త సహకరించాలి.." అన్నారు...చాలా బాధగా అనిపించింది.."సరే..వారం పాటు వుండండి..భోజనం ఏర్పాటు కూడావుంది.." అని చెప్పాను..


ఆ వారం లో సోమవారం నుండీ శుక్రవారం వరకూ శ్రీ స్వామివారి మందిర మంటపం లో ఎక్కువ సేపు ధ్యానం చేసుకుంటూ వున్నారు మధుసూదనరావు గారు..శనివారం సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొన్నారు..ఆరాత్రి అన్నదానం వద్ద తాను కూడా పాల్గొని..వడ్డన కూడా చేశారు..ఆదివారం నాడు శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, నమస్కారం చేసుకొని వచ్చారు..


"బాబూ..మళ్లీ కొన్నాళ్ళు ఆగి వస్తాను..ఇక్కడ నా మనసుకు స్వాంతన దొరికింది..నైరాశ్యం తొలిగింది..తప్పకుండా మళ్లీ వస్తాను..అక్కడికి వెళ్లిన తరువాత కూడా ఊరికే కూర్చోకుండా..నాకు చేతనైన సేవ చేస్తాను..సాటివాళ్లకు సేవ చేస్తే, నీ మనోవేదన తీరుతుంది అని శ్రీ స్వామివారు ఆదేశించినట్లు అనిపించింది.. అంతా ఈ స్వామివారి దయ!.." అన్నారు..ఈ వయసులో మధుసూదనరావు గారికి ఏది ముఖ్యమో దానినే స్వామివారు అనుగ్రహించారు..వారి సమస్యకు ఉపయుక్తమైన పరిష్కారం చూపారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

సముద్ర తీరాన

 🌊సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది.అతను వెంటనే 

" ఈ సముద్రం మహా దొంగ"అని రాశాడు.


కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు.ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో

 "ఈ సముద్రం గొప్ప దాత" అని రాశాడు. 


ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు.అతని తల్లి 

"ఈ సముద్రం నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి" అని

రాసింది. 


ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో 

"‘ఈ సముద్రం ఒకటి చాలు జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను " అని రాశాడు.


అనంతరం ఒక పెద్ద అల వచ్చింది. 

వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది. 


రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచేసుకుంది అలానే మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడరాదు...


ఇంకా,

ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటిని విని ఎవరిపైనా చెడు అభిప్రాయానికి రాకూడదు.వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి.


ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు.చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి.దాన్ని తొలగించి ముందుకు అడుగు వేయండి.


*🙂వినయం,విధేయతతో విజయం మీ సొంతం అవుతుంది...*

*😊మనస్సాక్షి ,భగవంతుడు ఒప్పుకునేలా జీవించాలి...*

తం సూర్యం ప్రణమామ్యహం



 🍁🍁🍁🍁🍁🍁🍁


బ్రహ్మస్వరూపముదయే, మధ్యానే్నతు మహేశ్వరం

సాయంధ్యాయే సదా విష్ణుం, త్రయీమూర్తిర్దివాకరః



మనకు ప్రతిరోజూ సాక్షాత్కరించే సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూపుడని పైశ్లోకానికి అర్థం.


 ముల్లోకములలోనివారికి త్రికాలలో ఆరాధనీయుడు సూర్యుడు. 


ఈ చరాచర జగత్తునుండి తిమిరాలను పోగొట్టి తన కరుణా కటాక్ష వీక్షణాలనుండి వెలుగును ప్రసాదించే అవతారమూర్తి సూర్యభగవానుని వేద స్వరూపునిగా, కర్మసాక్షిగా పేర్కొంటున్నాయి పురాణాలు.



‘సూర్య’ అను పదమునకు సకల జగత్తును చైతన్యపరిచేవాడని భావము.


 ‘సువతి ప్రేరయతి వ్యాపారేష్టితి సూర్యః’ అని ఉపనిషద్ నిర్వచనం.


 జగత్తును చైతన్యపరిచేవాడు కనుక జగదారాధ్యుడైనాడు.



సూర్యుడు అదితి కశ్యపుల తొలి సంతానం. కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడని, అదితి కుమారునిగా ఆదిత్యుడని పిలువబడుతున్నాడు.


 సూర్యునికి సంజ్ఞ, ఛాయ అని ఇద్దరు భార్యలు. యముడు, శని పుత్రులు. సూర్యరథానికి చిత్రరథమని పేరు. ఆ కారణంగా చిత్రరథుడనే పేరు వచ్చింది. సూర్యుని రథానికి ఒకే ఒక చక్రం. సూర్యరథాన్ని సప్త అనే అశ్వం లాగుతుంది. అది ‘సప్తకాంచన సన్నిభం’ అంటే ఏడు రంగుల కిరణాలను ప్రసరింపజేస్తుంది.


 ఆ ఏడు రంగులు వ్యక్తి శరీరంలో ఉండే ఏడు ధాతువులు- మజ్జ, మాంసం, మేధస్సు, ఎముక, శుక్రం, శోణితం, చర్మం అనువాటిపై ప్రభావం కలిగివుంటాయి.


 అనంత శక్తిమయమైన ఆ కిరణాలు వ్యక్తిపై ప్రసరిస్తే వాటివల్ల ఆయా ధాతువులపై ఉన్న రోగ లక్షణాలు నిర్మూలనమై ఆరోగ్యం లభిస్తుంది. 


అందుకే మనుస్మృతి ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అని కీర్తించింది.


సూర్యుని నుండి ప్రసరించే ఏడు కిరణాలు-


1. సుషుమ్నము - నాడీ మండలాన్ని ఉత్తేజపరస్తుంది.


2. హరికేశము - గుండె జబ్బులను నివారిస్తుంది.


3. విశ్వకర్మము - రక్తహీతను, తత్సంబంధమైన వ్యాధులను నిర్మూలిస్తుంది.


4. విశ్వత్వచము - శ్వాసకోస సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది.


5.సంపద్వసుము - జననేంద్రియ వ్యవస్థను దృఢపరుస్తుంది


6.అర్వాగ్యాసుము - నరాల బలహీనతను నివారిస్తుంది.


7. స్వరాడ్యసుము - స్వరపేటికకు, మూత్రపిండాలను వ్యాధులను నివారిస్తుంది.


సూర్యారాధన గురించి రామాయణము, మహాభారత గ్రంథాలలో విస్తృతంగా చెప్పడం జరిగింది. 


అగస్త్యుని ద్వారా ఆదిత్య హృదయము అను స్తోత్రాన్ని ఉపాసించి శ్రీరాముడు రావణ సంహారం చేసినట్లు, వనపర్వంలో ధర్మరాజు ఆదిత్యుని ఉపాసించి అక్షత పొందినట్లు కథలున్నాయి.


 దివోదాసుడనే రాజు సూర్యకిరణాల సాయంతో జీవితమంతా ఆహారాన్ని వండుకుని భుజించినట్లు స్కాందపురాణం వచిస్తున్నది.


 శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసనతో తనకు సంక్రమించిన కుష్ఠు రోగం నుండి విముక్తుడయ్యాడు.



జ్యోతిష శాస్త్రం ననుసరించి ప్రళయాంతరంలో సకల జగత్తు అంధకారమయం కాగా పరాశక్తి ఆదేశానుసారం పరమేశ్వరుడు తిరిగి సృష్టిని ప్రారంభిస్తూ తొల్దొల్తగా గ్రహ నక్షత్రాదులను సృష్టించి గ్రహాధిపతియైన సూర్యునిగా తానే వెలుగొందాడని పురాణ వచనం. 


అట్టి భాస్కరుని నుండి సృష్టి రచించబడిందని సూర్యోపనిషత్తు తెలియజేస్తుంది.


భగవతారాధనలో ఆదిత్యుని మించిన దైవం లేదని చెబుతూ శ్రీ శంకర భగవత్పాదులు ఏర్పాటుచేసిన పంచాయతన అర్చనావిభాగంలో ఆదిత్యునికి ప్రముఖ స్థానం కల్పించారు.


సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శరీర కాంతి, పటుత్వం, పాపక్షయంతోపాటు సకల సౌభాగ్యాలు లభిస్తాయని శాస్తవ్రచనం. 


సూర్య నమస్కారాల విశిష్టతను యోగశాస్త్రం అతిఘనంగా చెప్పింది. 


సూర్యుడు సకల విద్యలకు అధినేత. యాజ్ఞవల్కునికి, ఆంజనేయునికి సకల విద్యలు ప్రసాదించిన గురువు.


అందరూ సూర్యనారాయణుని అనుగ్రహం పొందాలని ఆకాంక్ష.🙏

*ధార్మికగీత - 27*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          

                                        *****

           *శ్లో:- ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే ౹*

                  *నారీ గృహద్వారి, జనా శ్శ్మశానే ౹*

                  *దేహా శ్చితాయాం, పరలోక మార్గే ౹*

                  *ధర్మానుగో గచ్ఛతి జీవ ఏకః ౹౹*

                                        *****

*భా:- "జాతస్య హి ధృవో మృత్యు:" అంటోంది గీత. పుట్టినవాడు గిట్టక తప్పదు. మరి పరలోకానికి మనతో పాటు వచ్చేవి ఏవి? ఒకింత పరిశీలిద్దాము. 1."ధనము":- మనం గడించిన "డబ్బు, నగలు" బ్యాంకుల్లోను , "స్థలాలు, పొలాలు" , ప్లాట్ లు, ఫ్లాట్ లు భూమిపైన ఉండిపోతాయి. 2. "పశువులు":- గేదెలు, ఆవులు పశువులపాకలోను, "పెంపుడు జంతు జాలాలు" ఇంటి ఆవరణలోను ఉండిపోతాయి. 3 "నారీ":- మూడుముళ్లు, ఏడడుగుల అనుబంధముతో ఏరి, కోరి వచ్చిన "భార్యామణి" గృహము యొక్క సింహద్వారము వద్ద ఆగి, కన్నీటి నివాళి నర్పిస్తుంది.4."బంధువులు":- "హితులు,సన్నిహితులు,ఆప్తులు,ఆత్మీయులు" శ్మశాన వాటిక వరకు వచ్చి, బాధతో కడసారి వీడ్కోలు పలుకుతారు. 5. "దేహము":- ధర్మనిర్వహణకు తొలి ఉపకరణమైన మన " కాయము " చితి మీద పేర్చబడి దహనమవుతుంది. 6."ధర్మము":- ఇక చివరగా మనం చేసుకున్న పాపపుణ్యకర్మఫలసమాహారమైన "ధర్మము" ఒక్కటే జీవాత్మను అనుసరిస్తుంది. ధర్మరాజు చివరిగా స్వర్గానికి వెళ్ళేటప్పుడు, కుక్క రూపంలో అనుసరించింది "ధర్మదేవతే" అని గుర్తించాలి. మనతో ఏవి రావో, వాటికోసం అనుక్షణం తాపత్రయం పడుతుంటాము.మనల్ని వెన్నంటి వచ్చి , రక్షించే "ధర్మం" కోసం ఏ మాత్రం ఆలోచించము. కాన ధర్మకార్యాలకోసం నిరంతరం ఆరాటపడాలి. ఆచరణ చేపట్టాలి. "ధర్మో రక్షతి రక్షితః" . ధర్మాన్ని మనం కాపాడితే, అది మనలను, మన ముందు తరాలవారిని కంటికి రెప్పలా కాపాడుతుంది*.

                                     ***** 

                       *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కండగలిగిన కవిరాయడు గురజాడ* //

 ఈరోజు (21-9-2020) *ఆంధ్రపత్రిక* సంపాదకీయం🌹 *కండగలిగిన కవిరాయడు గురజాడ* // దేశమంటే మట్టి కాదోయ్ ! మనుషులోయ్ ! అన్నాడు గురజాడ.ఈ నాలుగు పదాలు చాలు గురజాడను మహాకవి, అనడానికి.ఇలా చాలా అన్నాడు. చాలా రాశాడు. కన్యాశుల్కం అనే సంప్రదాయం ఇప్పుడు లేకపోయినా, అది పోయి చాలా ఏళ్ళైనా, గురజాడ రాసిన "కన్యాశుల్కం" నాటకం సజీవంగా ఇప్పటికీ తళుకులీనుతోంది.ఉత్తరాంధ్ర, విజయనగరం మాండలీకంలో ఈ రచన సాగినా, అన్ని మాండలీకాలవారు దీన్ని అర్ధం చేసుకున్నారు. అర్ధం చేసుకోవడమే కాదు, అక్కున చేర్చుకున్నారు, అక్కున చేర్చుకోవడమే కాదు, సాంఘిక నాటకాలలో అగ్రస్థానం ఇచ్చారు. ఇది కొత్తగా వచ్చిన సినిమా కాదు. ఎప్పుడో 65ఏళ్ళ క్రితం (1955) సినిమాగానూ వచ్చిన కథారాజం.వందలసార్లు వేదికలపై ప్రదర్శనలు జరుపుకున్న నవ్య నాటకరాజం. సమాజంలో ఇప్పటికీ గిరీశంలు అడుగడుగునా తగులుతారు. లుబ్దావధానుల వంటి లుబ్ధులు మాటిమాటికీ ఎదురుపడుతుంటారు.అంతటి మధురవాణిలు దొరకక పోయినా.. ఆ వాణి, ఆ వాణిజ్యం తెలిసిన మధురవాణిలు తారసపడుతుంటారు. ఇంతటి నాటకీయ సృష్టి గురజాడకే చెల్లు. భారతీయ సాహిత్యంలో మృచ్ఛకటికం తర్వాత, అంతటి గొప్ప నాటకం కన్యాశుల్కం, అని మరో మహాకవి శ్రీశ్రీ కితాబు ఇచ్చాడు. శ్రీశ్రీ దృష్టిలో ఆధునిక యుగంలో గురజాడ ఒక్కడే మహాకవి. బహుశా! గురజాడ సాహిత్యంలో శ్రీశ్రీ ధ్వనిదర్శనం చేసుకొని ఉంటాడు. ఎవడి పలుకులో, కవిత్వంలో ధ్వని ఉందో? వాడే మహాకవి అన్నాడు శ్రీ శ్రీ. ధ్వని సిద్ధాంతాన్ని పుష్కలంగా పండించినవాడు తిక్కన మహాకవి, అని శ్రీశ్రీ సిద్ధాంతీకరించాడు. ధ్వనితత్త్వం గురజాడలో కూడా ఆయనకు కనిపించి ఉంటుంది. అందుకే ఆయన్నూ మహాకవిగా అభివర్ణించాడు.1915 లో గురజాడ చనిపోయాడు.గురజాడ చనిపోలేదు,అప్పటి నుండే జీవించడం ప్రారంభించాడని ఇంకో మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నాడు.ప్రజల భాషలో రాయాలి, కవిత్వం చెప్పాలి, సాహిత్య సృష్టి జరగాలి, అని బలంగా నమ్మి, అంతకంటే బలంగా ఆచరణలో పెట్టినవాడు గురజాడ.గురజాడకు తోడునీడగా గిడుగు కూడా నిల్చున్నాడు.వీరిద్దరూ ఒకప్పుడు సహాధ్యాయులు, సమభావాలు ఉన్నవారు.వీరిద్దరూ కలిసి ఆధునిక భాషను అద్భుతంగా నడిపించారు.ఇప్పుడు మనం చదివే, రాసే భాషంతా వీరి చలువే. మాటను శక్తిమంతంగా, అందంగా చెప్పడం బాగా తెలిసిన ఆధునిక మహాకవులకు అడుగుజాడగా నడిచినవాడు గురజాడ. ఆయనేమీ 150ఏళ్ళు జీవించలేదు.53ఏళ్లకే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కూడా,100ఏళ్ళు దాటింది (1915), అయినా, ఆయన్ను తలచుకుంటున్నాం, కొలుచుకుంటున్నాం. గురజాడ ఎవడికీ చుట్టం కాడు. అతను చేసిన భాషాసేవ మనల్నందరినీ అతని చుట్టూ తిప్పుకుంటోంది. "ఎవడు బతికాడు నూట యాభై ఏళ్ళు" అని ఉత్తరాంధ్రలో ఒక సామెత వుంది. కానీ, గురజాడ బతికాడు, శ్రీశ్రీ బతికాడు. ఉత్తరాంధ్రలోనే కాదు, మన మాటల్లో, రాతల్లో యావత్తు తెలుగు సాహిత్యలోకంలో, భాషా సామాజిక ప్రాంతాల్లో అక్షరాలా జీవించి వున్నారు.వుంటారు. తిండి కలిగితే కండ కలదోయ్: కండకలవాడే మనిషోయ్ అనే మాటలు... మనం నిత్యం చదివే వార్తాపత్రికల్లో వస్తూనే ఉంటాయి. ఇలాంటి పదబంధాలు మనల్ని ఎన్నటికీ వీడవు. ఇవి వీడి పత్రికలు ముందుకు సాగలేవు. ఇంతలా అక్షరాల్లో చొచ్చుకుపోయినవారు ఒకరు శ్రీశ్రీ, ఇంకొకరు గురజాడ. అప్పటి సామాజిక దురాచారాలను కథావస్తువులుగా తీసుకొని, జనంభాషలో రాసి జేజేలు కొట్టించుకున్న జగజ్జట్టి గురజాడ. తను రాసిన "పుత్తడి బొమ్మా పూర్ణమ్మా" గేయంలో పండించిన కవిత్వం గుండెనిండా కన్నీళ్లు నింపుతాయి. కన్నుల కాంతులు కలువల చేరెను... మేలిమి చేరెను మేని పసల్... హంసలు చేరెను నడకల బెడుగులు..దుర్గను చేరెను పూర్ణమ్మా.. అన్నాడు. ఈ పంక్తులు చాలు ఇతనిలోని కవిత్వాన్ని కొలవడానికి. కవిత్వమొక ఆల్కెమీ అయితే, ఆ రహస్యం గురజాడకు కూడా తెలుసు. తెలియకపోతే, ఇనుము వంటి పదాలను బంగారంగా మార్చే కవిత్వ శక్తి ఎక్కడ నుండి వస్తుంది? ఆ పదాలు పట్టుకొని రాయివంటి కసాయిలతోనూ కన్నీళ్లు ఎలా పెట్టిస్తాడు? నవ్వుల పువ్వులు ఎలా పూయిస్తాడు? ఆలోచనామృతాలు ఎలా కురిపిస్తాడు? కృష్ణాతీరంలోని గురజాడ నుండి ఉత్తరాంధ్రలోని విజయనగరంకు వలస వెళ్లిన ఈ కుటుంబం గురజాడ, అనే గొప్ప కానుకను తెలుగుభాషకు ఇచ్చింది. అద్భుతమైన నాటకీయత, పరమ రామణీయమైన పదసంపద, కల్పనా శక్తి, వర్ణనా నిపుణత కలిగిన కవి విలుకాడు గురజాడ.కండపుష్టి కలిగిన కవిత్వం రాశాడు. షేక్స్పియ్సర్, మిల్టన్ కు ఏమాత్రం తక్కువకాని ఆధునిక కవిరాయడు మన అప్పరాయడు (అప్పారావు). రాజు, రాయ శబ్దాల నుండే రావు అనే శబ్దం కూడా వచ్చింది. "రావు" మన పదం కాదు, మరాఠీ నుండి మనం తెచ్చుకున్నది. అలా, అప్పరాయడు అప్పారావు అయ్యాడు. ప్రారంభంలో, గురజాడ ఇంగ్లీష్ లో కవిత్వం రాయడం మొదలు పెట్టాడు.సొంత భాషలో రాస్తే, ఇంకా శక్తిమంతంగా ఉంటుందని శంభుచంద్ర ముఖర్జీ వంటి కొందరు పెద్దలు గురజాడకు సూచించారు.అప్పటి నుండీ అప్పారావు అమ్మభాషలో, వాడుకభాషలో రాయడం మొదలు పెట్టి మనకు వేడుక చేశాడు.ఎప్పటికీ, మన గుండెల్లో గురజాడ అప్పారావు సందడి చేస్తూనే ఉంటాడు.దేశమును ప్రేమించుమన్నా... అన్నాడు.దేశంతో పాటు భాషను కూడా ప్రేమిద్దాం. సెప్టెంబర్ 21 వ తేదీ ఈ మహనీయుడి పుట్టిన పుణ్యదినం. -మాశర్మ🙏