13, జూన్ 2024, గురువారం

బ్రాహ్మణుడు ఎవరు?

 *బ్రాహ్మణుడు ఎవరు?*


నన్ను చెప్పనివ్వండి...


బ్రాహ్మణులు (జనరల్ కేటగిరీ) ఎవరు?


విచారణ లేకుండా అట్రాసిటీ_చట్టం 89 కింద కేసు పెట్టగల వ్యక్తి బ్రాహ్మణుడు‼️


కులాన్ని సూచించే పదాలను ఉపయోగించి అవమానించబడే వ్యక్తి బ్రాహ్మణుడు‼️


దేశంలో రిజర్వు చేయబడిన 131 లోక్‌సభ స్థానాలు మరియు 1225 విధానసభ స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేయలేరు, కానీ ఓటు వేయగలరు, అతను బ్రాహ్మణుడు‼️


ఎవరి ప్రయోజనం కోసం ఈ రోజు వరకు కమిషన్ వేయలేదు, అతను బ్రాహ్మణుడు‼️


దీనికి ప్రభుత్వ పథకం లేదు.

అతడు బ్రాహ్మణుడు


దేశ రాజ్యాంగం ఎవరితో వివక్ష చూపుతుందో, అతను బ్రాహ్మణుడు‼️


కానీ శిక్షించడానికి NCSC మరియు NCST ఏర్పడిన వ్యక్తి బ్రాహ్మణ‼️


కానీ వారిని శిక్షించేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక SCST కోర్టులు తెరిచిన వారు అభాగ్యులు బ్రాహ్మణులు‼️


బడిలో ఇతర తరగతులతో పోలిస్తే నాలుగు రెట్లు ఫీజులు చెల్లించి తన పిల్లలను చదివించేవాడు నిరుపేద బ్రాహ్మణుడు‼️


ఉద్యోగం, పదోన్నతి, ఇల్లు కేటాయింపు మొదలైన వాటితో చట్టపరమైన వివక్ష చెల్లుబాటు అవుతుంది, పేద బ్రాహ్మణుడు ‼️


ప్రభుత్వాలు, చట్టాల వల్ల అత్యధికంగా హింసించబడుతున్నది బ్రాహ్మణులు


ఎక్కువ ఓట్లు వేసినా మోసగాడిలా భావించే బ్రాహ్మణుడు


మంచి ప్రభుత్వం రావాలనే కోరికతో బ్రాహ్మణుడే నీకు అధికారం అప్పగిస్తాడు


దేశ ప్రయోజనాల దృష్ట్యా, మీ శరీరం, మనస్సు మరియు డబ్బును ఆ బ్రాహ్మణుడు ఆదరించాడు


ఈ వివక్ష ఉన్నప్పటికీ,

బ్రాహ్మణుడు మతం యొక్క విజయం, అధర్మం నాశనం, జంతువుల సంక్షేమం మరియు లోక శ్రేయస్సును విశ్వసించేవాడు.


సబ్కా సాథ్ సబ్కా వికాస్ మే హమారీ స్టేటస్ క్యా హై ? దయచేసి పరిగణించండి


అన్ని బ్రాహ్మణ కుటుంబాల తరపున భారత ప్రభుత్వానికి అంకితం...


మీరు పైవాటితో ఏకీభవిస్తే, కనీసం 5 మంది బ్రాహ్మణులతో దీన్ని షేర్ చేయండి. ఈ విషయం గౌరవనీయులైన ప్రధాని లేదా ముఖ్యమంత్రికి చేరాలి...


ఈ పోస్ట్ రాయడానికి మరియు చేయడానికి చాలా శ్రమ పట్టింది, దయచేసి దీన్ని షేర్ చేయండి


*జై శ్రీ రామ్*

సంస్కృత భాషను

 *సంస్కృత భాషను భారత జాతీయ మాతృభాష(national mother tongue) గా గుర్తించాలి. ప్రతీచోట జాతీయ భాషగా హిందీలో చెప్పే విషయాన్ని జాతీయ మాతృభాష అయిన సంస్కృతంలో కూడా చెప్పాలి. ఈ ఆకాంక్ష ను వైరల్ చేద్దాం, మన్ కీ బాత్ ద్వారా ప్రధాన మంత్రి మోదీజీ కి విస్తృతంగా తెలియజేద్దాం. మన జాతీయ మాతృభాషామాధుర్యాన్ని ఆస్వాదిద్దాం.*

*ఇలా చేయడం ద్వారా కొంత మంది అయినా సంస్కృత వాఙ్నిపుణులకు ఉపాధి లభించగలదు,మన జాతి మాతృకత జనబాహుళ్యంలో జీవించగలదు.*

*ప్రధాన మంత్రి మన్ కీ బాత్ టోల్ ఫ్రీ నంబర్ 1800117800.*

*జయోస్తు తే సంస్కృత భారతే*

ఆవాహన



ఆవాహన


 ఇది విశ్వనాథ వారి కేదార గౌళ ఖండ కావ్య సంపుటిలోనిది.

హైందవ జాతికి వెలుగులను పూయించిన గతవైభవమును మరల రమ్మని గోరుచు ఆహ్వానించుట.విశ్వనాధకు భారతీయ సంస్కృతిపై గల

అభిమానమునకు ఆవాహన యొకప్రతీక!!!


తక్షశిల నలందా విశ్వవిద్యాల

    యాధి దేవతలార ! యరుగు దెండు

ఘంటశాలా ధాన్యకటక బౌద్ధారామ

     గత సభ్యతా దేవి కదలి రావె !

యవ సుమిత్రాదిక ద్వీప వేలాచలో

     చలిత నాగరికతా ! సాగుదేవె !

అమెరికా ముఖ్య ఖండాంతరజ్వలిత పు

      రాణ భారతశక్తి ! రమ్ము రమ్ము?


అరుగుదెండమ్మ మాతృక లాదుకొనుడు

అల తెలుగునాటి తొలిపచ్చి యారకుండ

అంతరముల భక్తి జ్యోతులన్ని దెసల

వెలుగు బిళ్ళలు పది పది వెలయునట్లు.


మెరుముల వల్లకీ యురుముల వాద్యముల్

       చదలవేల్పుల పెండ్లి జరిగినట్లు

ప్రసవాలి వాలకీ భవలాలి వేణువుల్

              వని మాధవు శుభంబు వరలినట్లు

కరడు మద్దెల నుర్వు గజ్జీయల్ నదినీట 

           వాగుకన్నెల గొండ్లీ నడిచినయట్లు

పొన్ను చిన్కుల ఢిల్లి భోగాలు సంజ రో

              దసి బలాకల విందు లేసగినట్లు


తరగని మనోజ్ఞ సౌందర్య ధామమైన

తెలుగునేల కు దిగిరండు దిగియ రండు

ఓసి భారత పూర్వ విద్యా సముజ్జ్వ

లాధిదేవతా దివ్యకలాంశలార !


శ్రమచేత నుపనిషత్ చ్ఛ్వాసముల్ పార్ధు ద

వ్వెసగ నాగి సుగంధి కసవు కొరికే

కృష్ణమ్మ యెంత పొంగిన దుర్గ గొంతంటి

           ముట్టుకోనేరదు ముక్కుసత్తు

మాధవ వర్మ ధర్మము గ్రామదేవతం

                జేసి వర్షము వార వోసె బసిడి

జాత్యశ్వబద్ధ రథాత్యుగ్రులై యసి

              వాళ్ళు తోలిరి కొండపల్లి రెడ్లు

ఎన్ని కాదన్న బెజవాడకున్న గొప్ప

యుండనే యున్న యదియ లేకుండ బోదు

ఓసి భాసి విద్యాదేవతా సమాజ

మా! కదలి రమ్ము భావనా మధుర మూర్తి !


తొల్లి తెల్గురెడ్డి వెల్గుల విశ్రమాస్థాని

             వెలుచుచున్నాడు రావే లతాంగి !

కొత్త ఏటికి నీర మొత్తు కృష్ణానది

               పిలుచు చున్నది, తూగవే లతాంగి !

అభ్యర్ధనాంజలులైన విద్యార్ధులు

పిలుచుచున్నారు, రావే లతాంగి !

శారదా! శారదామృతసారస్య !

సారాస్వతాంబికా ! సాగు దేవె !

చెమ్మచే నక్షరంబులు చెక్కుకొంచు 

క్రొత్త బోదెలకును నీరు గ్రుమ్మినట్లు.


ఇటగుల ద్వేషంబులింకి చిన్ని ఎడారి

       నదులు వెల్మదొరతనంబు కల్మి

ఇట వెన్నతోడ దాతృత పెట్టినది సంప్ర

        దాయాత్తమగు ప్రభుత్వంబు పటిమ

ఇట గుమార ధరా తలేశ్వరు తత్కాల

            విద్యా శిఖర నీతి విదిత భాతి

ఇట గళా సంస్థార్ధకృత పోషణము చేతి

           యందు గట్టిన తోర మాత్త దీక్ష


సర్వథా యోగ్య విశ్రమాస్థాన భూమి

అలా పురాతన దివ్య విద్యాంశలార !

కదలి చనుదెండహో ! వాన కాళ్ళు దిగిన

శ్రావణాంబుద నిమ్న సంచారమట్లు.

సేకరణ!

🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కనకధారా స్తవం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *సంపత్కరాణి సకలేంద్రియ నందనాని*

        *సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి*

        *త్వద్వందనాని దురితాహరణోద్యతాని*

       *మామేవ మాత రనిశం కలయంతు మాన్యే*.(16)


          { _/  *కనకధారా స్తవం* _/ } 


తాత్పర్యం: పద్మపత్రాలవంటి కన్నులు గల తల్లీ! నీకు సమర్పించుకునే నమస్కారాలు సమస్త సంపదలను సమకూరుస్తాయి. అన్ని యింద్రియాలకు ఆనందం కల్గిస్తాయి. సామ్రాజ్య వైభవాలను అనుగ్రహిస్తాయి. పాపాలను నిశ్శేషంగా రూపుమాపుతాయి. *పూజ్యురాలవైన ఓ మాతా! నీ చరణాలకు వందనాలు సమర్పిస్తున్నాను. నన్ను కృతార్థుణ్ణి కావించు*.

ఆత్మ బుద్ధిః సుఖంచైవ

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*




ప్రతి వారి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో సరైన మార్గం చూపించేది మనసే! ఎడారిలోనో, సముద్రంలోనో ప్రయాణం చేసేవారు దిక్కులు తెలియక దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి కలగకుండా దిక్సూచి అనే చిన్న యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఏ వైపున ఏముందో సూచించడం దాని పని. మనస్సాక్షి సైతం అలాంటిదే. మనస్సాక్షి మూడు రకాలు. నిర్ధారిత మనస్సాక్షి అనుమానకర మనస్సాక్షి, సున్నిత మనస్సాక్షి అనేవి ఆ మూడూ. తాను తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అనే సందేహ నివృత్తి చేసేది మొదటిది. మంచి చెడుల మధ్య భేదాన్ని తెలిపేది రెండోది. తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా సూక్ష్మాంశాలను జాగ్రత్తగా గమనించి ఎరుక పరచేది మూడోది. మనస్సాక్షి చెప్పేదాన్ని విని సరైన నిర్ణయాలు తీసుకునేవారు జీవితంలో నిబద్ధత కలవారవుతారు.


మన గురించి మనకు తెలియజేయడం, మన లోపలి ఆలోచనల్ని, భావాల్ని నిజాయతీగా ఉండేటట్లు నియంత్రించడం మనస్సాక్షి చేసే పని. అందుకే నీ ఆత్మ చెప్పినట్లు చేయడమే శ్రేయస్కరం (ఆత్మ బుద్ధిః సుఖంచైవ) అని సూక్తి.

గురువారం,జూన్13,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*


గురువారం,జూన్13,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం

తిథి:సప్తమి రా8.56 వరకు

వారం:గురువారం(బృహస్పతివాసరే)

నక్షత్రం:పుబ్బ తె4.57 వరకు

యోగం:వజ్రం సా6.36 వరకు

కరణం:గరజి ఉ8.05 వరకు తదుపరి వణిజ రా8.56 వరకు

వర్జ్యం:ఉ11.21 - 1.07

దుర్ముహూర్తము:ఉ9.49 - 10.41

మరల మ3.02 - 3.54

అమృతకాలం:రా9.55 - 11.40

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి: వృషభం 

చంద్రరాశి: సింహం 

సూర్యోదయం:5.28

సూర్యాస్తమయం:6.31


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

సంకల్పము

 *శుభోదయం*

*********

 సంధ్యావందనం 

మరియు ఇతర

 పూజాకార్యక్రమాల

 సంకల్పము.

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ 13.06.2024

బృహస్పతివాసరే( గురువారము) 

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠ మాసే శుక్ల పక్షే సప్తమ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

గ్రీష్మ ఋతౌ 

జ్యేష్ఠ మాసే  శుక్ల పక్షే సప్తమ్యాం. 

బృహస్పతివాసరే (గురు వాసరే) అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.28

సూ.అ.6.31

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం 

శుక్ల పక్షం

సప్తమి రా.8.54 వరకు. 

బృహస్పతివాసరే

నక్షత్రం పుబ్బ రా.తె.4.55 వరకు.

అమృతం రా.9.51 ల  11.37 వరకు. 

దుర్ముహూర్తం  ప.9.50 ల 10.42 వరకు.

దుర్ముహూర్తం మ. 3.02 ల 3.54 వరకు. 

వర్జ్యం ప. 11.15 ల 1.01 వరకు.

యోగం వజ్రం రా. 6.37  వరకు. 

కరణం గరజి ఉ. 8.00 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ప. 1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ.9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ.

6.00  ల 7.30 ల వరకు.  

***********   

పుణ్యతిధి జ్యేష్ఠ శుద్ధ సప్తమి. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

సత్యంతో ఓడించాలి

 శ్లోకం:☝️

*అక్రోధేన జయేత్ క్రుద్ధమ్-*

*అసాధుం సాధునా జయేత్ ।*

*జయేత్ కదర్యం దానేన*

*జయేత్ సత్యేన చానృతమ్ ॥*

 - మహాభారతం 5.39.73


అన్వయం: _శాంతిభావేన క్రోధం దుష్టం సజ్జనతయా దానవిరుద్ధబుద్ధిం దానకరణేన మిథ్యాం చ యాథార్థతత్వేన నియతితవ్యమ్ |_


భావం: కోపాన్ని శాంతితో, దుష్టుడిని మంచితనంతో, పిసినారిని దానంతో, అసత్యాన్ని సత్యంతో ఓడించాలి.

పంచాంగం 13.06.2024

 ఈ రోజు పంచాంగం 13.06.2024  Thursday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష: సప్తమి తిధి బృహస్పతి వాసర: పూర్వఫల్గుని నక్షత్రం వజ్ర యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


సప్తమి రాత్రి 09:34 వరకు.

పూర్వఫల్గుని  రా.తె 05:08 వరకు.


సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:47


వర్జ్యం : పగలు 11:11 నుండి మధ్యాహ్నం 12:58 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:06 నుండి 10:58 వరకు తిరిగి మధ్యాహ్నం 03:18 నుండి 04:11 వరకు.


అమృతఘడియలు : రాత్రి 09:57 నుండి 11:44 వరకు..


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - జే‌ష్ట మాసం - శుక్ల పక్షం  -‌ సప్తమి  - పూర్గాఫల్గణి -‌‌  గురు వాసరే* (13.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మీరు భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 

ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు.  మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ +91 9848647145 కు వాట్సాప్ చేయండి.  దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 

ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు+91 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   

ఇట్లు 

మీ బ్లాగరు