23, మే 2021, ఆదివారం

Anandayya medicine

 Soon Anandayya medicine may be exported all countries also.

Before to that We have to alert  all people  of all areas and ask them to take same medicine from near by ayurvedic doctors.The formula is open.So same ingreidients & technic can be used by our neighborly ayurvedic qualified doctors.

It is a big opportunity for our ayurveda to reach its peak all of a sudden.All ayurvedic doctors now get an opportunity to serve sincerely.In fact all elite including cine stars should endorse Anandayyad formula for carona.

I think at this pace total country will become carona free shortly.Pharma world will crumble.GOD IS THERE.

God CHAPPAD PHAAD KE DETA HAI🙏

నీతిలేని మానవులు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

Posted: 22 May 2021 10:19 PM PDT


 *ఏమిటి వేడి చేసే తినాలా* 


హాయిగా పచ్చివి తింటే పోలా?


ఏమిటి ఇలా రుద్ధంగానే వెలుగుతోంది...


హాయిగా రెండు రాళ్ళు కొడితే మంట వస్తుంటే....


ఏమిటి ఇళ్ళు కూడా కట్టుకోవాలా...


హాయిగా గుహల్లో ఉండచ్చును కదా....


ఇలానే మనం అనాగరికులు అని అనుకునే వారు ఆలోచించి ఉంటే ఇప్పటి ఆధునీకత వచ్చేదా?


"ఏదైనా మనకు తెలిస్తేనే శాస్త్రం,  అర్ధం అయితేనే సైన్సు" అని అప్పటి వారు అనుకుని ఉంటే ఇప్పుడు ఇలా ఉండేదా?

ఏదైనా కొత్తది వచ్చినప్పుడు ఎక్కువ మంది అయిష్టంగా అయినా ఆమోదించారేగానీ నిర్మొహమాటంగా తిరస్కరించలేదు.

అలా చెయ్యలేదు కాబట్టే,

"సైన్సు అనబడే మానవ జీవితం" ఆధునీకత సంతరించుకుంటూ వచ్చింది....

అంతా బానే ఉన్నది అని అనిపిస్తోంది కదా..... 

కానీ లేదు....


కర్టేసి ఫేస్ బుక్ 

వస్తువుల్లో ఆధునికత పెరిగిన కొద్ది మనిషి బుద్ధిలో మాత్రం... ఆనాటి అనాగరీకుడికి లేని నికృష్టపు ఆలోచనలు పెరిగినాయి...ఈ ఆధునికత పెరగక ముందు, ఎవరైనా ఏది అయినా కొత్తది కనిపెడితే, దానిని అందరితో పంచుకునే వారు... అందుకనే ఆనాడు ఆర్కిమిడిస్ కొత్త సిద్దాంతం తోచగానే.... వంటి మీద బట్టలు ఉన్నాయో లేవో చూసుకోకుండానే "యురేకా" అంటూ జనాల మధ్యకి పరిగెత్తుకుని వచ్చాడు....


కానీ, ఇప్పుడు... ఈ కంప్యుటర్ యుగం అనబడే దానిలో ...అదే తెలివైన మానవుడు ఏదైనా కనిపెట్టగానే [మూడు దశాబ్దాలుగా కనిపెట్టింది కూడా ఏది లేదు...ఉన్నదాన్ని అప్ డేట్ చెయ్యటం తప్ప]....కార్పోరేట్ కాళ్ళ దగ్గరకు పరిగెడుతున్నాడు, పేటెంటు, స్వంతం అనుకుంటూ సాటి మానవ సమాజానికి పనికి రాకుండా డబ్బే పరమావధిగా బ్రతుకుతున్నారు.  కేవలం డబ్బే కాదు,అధికారం, పార్టీల ఉన్మాదంతో సమాజ హితానికి దూరంగా పోతున్నారు.  విచిత్రం ఏమంటే.... ఇలా మారిన మనిషికి సపోర్టుగా  మేధావులనబడే రాజకీయ పార్టీ బానిసలు వంతపాడటం.


అది కాదని ఎవరైనా జనం దగ్గరకు వెళ్ళాడో అతని పని అయిపోయినట్లే... అతనిని మానసికంగా హింసించి... నీకు ఆ పరిజ్ఞానానికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉన్నదా...చదువుకోకుండా[?] ఎలా చేశావు?  ఇది శాస్త్రీయం కాదు అంటూ అతనికి,  ఎందుకు కనిపెట్టానురా దేవుడా అని అనిపిచేట్లు చేస్తున్నారు.  పోనీ ఈ అడిగే వారు టివీలలో చర్చలు చేసే మేధావులకి ఏమన్నా ఆ డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్నాయా అంటే... 90 శాతం మందికి  కనీస జ్ఞానం కూడా ఉండదు... 


నిజానికి సర్టిఫికెట్ల గురించే అడిగేట్లుంటే... ఈ రోజున మనవాళ్ళు  "ఎగిరిపడే ఆధునీకతకి పునాది.... కరెంటు, వెలుగు, కమ్యునికేషన్ లాంటివి కనిపెట్టిన ధామస్ ఎడిసన్ కి  గ్రాహం బెల్ కి  ఇప్పుడున్న ఏ దరిద్రపు ఇంజనీరింగ్ కాలేజీ సర్టిఫికెట్లు లేవు".  ఆయనెవరో చెప్పిట్లు, పోతన గారు తెలుగు BA చదవలేదు... BA చదవాలిసిన వారే ఆయన వ్రాసినవి చదువుతున్నారు.


అలాగే, బిల్డింగ్ ప్లాన్ వేసే పేద్ద ఇంజనీరు కాగితం మీద గీతలలో మాత్రమే బిల్డింగ్ చూపించగలడు...బయట నాలుగు ఇటికలు కూడా సమానంగా కట్టలేడు... ఆ కట్టే వారికి ఈ చదువు అనబడే చదువుండదు, కానీ వారు అన్ని కోణాలు సమంగా కట్టుకొని వస్తారు...వీరి ఉద్దేశ్యంలో వారికి చదువు లేదని, సర్టిఫికేట్ లేదని, ఇలా ఒకటేమిటి... స్కూటర్ మెకానిక్కు దగ్గర నుండి బుల్డోజర్ మెకానిక్కుల దాకా ఎవరికీ సర్టిఫికెట్లు ఉండవు... విజ్ఞానానికి సర్టిఫికెట్లకి ఏ మాత్రం సంబంధం లేదన్న కనీస  జ్ఞానం ఇప్పటి కంప్యూర్ యుగపు మేధావులకి ఎందుకు లేదో తెలియటం లేదు.  ఇంతకీ వీళ్ళ ఇంటెన్షన్ ప్రజల బాగు కోరా?

కాదని మొహమాటం లేకుండా చెప్పోచ్చును... 

ఎంతో దుర్మార్గంగా దోచుకునే వారిని వీరు అసలు ప్రశ్నించరు.  హింసించరు.  


ఇలాంటి వారిని అనాగరికులతో పోల్చటానికి లేదు.


వారికున్న అభ్యుదయ భావాలు, సమాజాన్ని రక్షించుకుందాం అనే పట్టుదల ఇవేమీ లేని వీరిని 


*"నీతిలేని మానవులు"* 

అనే చిన్న మాట మాత్రమే వాడవలసి రావటం విచారకరం.


మనిషికి సౌకర్యాలు పెరిగిన కొద్ది మంచిగా పనిచెయ్యాలి...

మంచిగా ఆలోచించాలి, కానీ, 

దానికి విరుద్ధంగా ఏదో చేద్దాం అనే తపనలో కొత్త కొత్త సౌకర్యాలని కనిపెట్టే బదులు రోగాలని కనిపెడుతూ వాటి నుండి ఎలా బయటపడాలో తెలిసి కూడా బయట పడలేక  చస్తూ  నీచంగా బ్రతుకుతూ.... 


ఇదే ఆధునీకత  అని మభ్యపెట్టుకుంటూ,  

జీవనం గడిపేస్తున్నారు...


ఏ చేద్దాం! చేసేదేమీ లేదు....

తెలియని వారికి చెప్పొచ్చు గానీ,  తెలిసి చేసే వారికి చెప్పేదేమున్నదండి.....

@@@@@@@@@@@@

          *జైహింద్* 

సేకరణ: గూగుల్.

తప్పక చదవాల్సిన కథ"#

 #"తప్పక చదవాల్సిన కథ"#


ఒక తల్లి తన నిత్యపూజ అయిన తర్వాత విదేశాల్లో

 వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తను

 ఖాళీగా ఉన్నాడా లేదా అని కనుక్కుని వీడియో 

చాట్ లో జరిగిన సంభాషణలు మన కోసం.🙏


తల్లి, నాయనా! పూజా పునస్కారాలు ఐనాయా?


కుమారుడు ఇలా చెప్పారు.

అమ్మా!నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా 

అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి  

అన్వేషణ(రీసెర్చ్) చేస్తున్నాను. మీరు డార్విన్ 

జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు. 

అలాంటి నేను పూజలు చేస్తూ కూర్చుంటే ఏం

 బాగోదు.


తల్లి మందహాసంతో కన్నా! నాకు కూడా డార్విన్

 గురించి కొద్దిగా తెలుసు కన్నా. కానీ అతను

 కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో 

ఉన్నవే కదా నాన్నా  అన్నది.


కుమారుడు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు 

తెలీదే అని అన్నాడు. అపుడు ఆ తల్లి నీకు 

అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం

 మృదువుగా తన సంభాషణ కొనసాగించింది.


నీకు మహా విష్ణువు యొక్క దశావతారాల

 గురించి తెలుసు కదా.


కుమారుడు ఆసక్తిగా అవును తెలుసు దానికి 

ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం అని 

ప్రశ్నించాడు.

 

అప్పుడు ఆ తల్లి సంబంధం ఉంది. ఇంకా

 నువ్వు,  నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా

 చెపుతాను విను.


1 మత్స్య అవతారం: అది నీటిలో ఉంటుంది. 

అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది. 

ఇది నిజమా కాదా. కొడుకు కొంచెం అలెర్ట్ గా 

వింటున్నాడు.


2 కూర్మ అవతారం: అంటే తాబేలు.దీనిని బట్టి సృష్టి

 నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా 

గమనించాలి. అంటే ఉభయచర జీవులు లాగా. 

తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం

 జరిగింది.


3 వరాహ అవతారం: అంటే పంది. ఇది అడవి

 జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే

 డైనోసార్లని గుర్తుకు తెస్తుంది.

 

4 నృసింహ అవతారం: అంటే సగం మనిషి, సగం 

జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి 

జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు 

ఏర్పడ్డాయి అని తెలుస్తుంది. 


5 వామన అవతారం: అంటే పొట్టివాడు అయినా 

ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు. నీకు తెలుసుకదా 

మానవులు మొదట హోమో erectes మరియు 

 హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో 

హోమో సేపియన్స్ మనుషులు  గా వికాసం చెందారు.  


కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.


6 పరశురామ అవతారం: ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని 

పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఏం తెలుస్తుందంటే 

ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు 

తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు, 

గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి

 ఆటవిక న్యాయం కలిగినవాడు.


7 రామావతారం: మర్యాద పురుషోత్తముడైన రాముడు

 మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి. అతను 

సమాజానికి నీతి నియమాలు . సమస్త కుటుంబ

 బంధుత్వానికి ఆది పురుషుడు.


 8 కృష్ణ పరమాత్మ అవతారము.. రాజనీతిజ్ఞుడు, పాలకుడు, ప్రేమించే స్వభావి. అతడు సమాజ  నియమాలను 

ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో

 తెలిపినవాడు. వాటితో సమాజములో వుంటూ 

సుఖ దుఃఖ లాభ నష్టాలు అన్ని నేర్పినవాడు.


కొడుకు ఆశ్చర్యం, విస్మయంతో వింటున్నాడు.

ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ


9 బుద్ధ అవతారం:  ఆయన నృసింహ అవతారం నుండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన  సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. ఇంకా అతను మనిషి తన

 జ్ఞానాన్ని వెతుక్కొంటూ చేసే ఆవిష్కరణలకు మూలం. 


10కల్కి అవతారం:  అతను నీవు  ఏ మానవునికై 

వేతుకుతున్నావో  అతనే ఇతను. అతను ఇప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన 

వ్యక్తిగా వెలుగొందుతాడు.


కుమారుడు తన తల్లివంక అవాక్కయి చూస్తున్నాడు. 

అప్పుడు ఆ కుమారుడు ఆనంద భాష్పాలతో అమ్మా! 

హిందు ధర్మం ఎంతో అర్థవంతమైన  నిజమైన ధర్మం. 

అని అన్నాడు,


ఆత్మీయులారా!

మన వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు,

ఇత్యాది అన్నీ ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం 

చూసే దృష్టి కోణం మారాలి. మీరు ఎలా అనుకొంటే 

అలా వైజ్ఞానికమైనవి కావచ్చు. లేదా ధర్మ పరమైనవి

 కావచ్చు. శాస్త్రీయతతో కూడిన ధర్మాన్ని నేడు 

మూఢాచారాలు పేరిట మన సంస్కృతిని మనమే 

అపహాస్యం చేసుకొంటున్నాం. 


ఇకనైనా మేలుకోండి. ఋషులు ఏర్పరచిన 

సనాతన ధర్మాన్ని పాటించుదాం.🙏


అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏


సేకరణ from వాట్సాప్ గ్రూప్స్ by

🙏పెనుగొండ కామాక్షమ్మ 2🙏వాట్సాప్ గ్రూప్

https://chat.whatsapp.com/J2smXvOBzztJK9Nsz8h8oi

ఆనందయ్యనూ గుళిక చేసుకుని మింగేస్తాం

 *ఆనందయ్యనూ గుళిక చేసుకుని మింగేస్తాం....!?*

                                డాక్టర్ పి భాస్కరయోగి....

ఇప్పుడు  కార్పోరేట్ ఆస్పత్రులు పిశాచులు సంచరించే స్మశానాలు గా మారినప్పుడు ఆనందయ్య మందు "ఆనందో బ్రహ్మ "కాక మరి ఏమిటి ?డాక్టర్ల దగ్గరకు వెళ్ళినప్పుడు జ్వరం, దగ్గు ,జలుబు ఉన్నాయి అని రోగి చెప్పకుండా ,

నాకు నాలుగు ఎకరాల పొలం, మూడు లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ,ఇద్దరు ఎద్దుల్లా పనిచేసే కొడుకులు ఉన్నారని చెప్పాల్సిన దుస్థితి ..!? ఖర్మ రా బాబూ....

 ప్లాస్మా వైద్యం, రెమిడి సివియర్ ...సూపర్ అన్నారు 

తర్వాత తుస్సుమన్నారు కదా ! ఇప్పుడు మనల్ని చంపేందుకు బ్లాక్ ఫంగస్ ,వైఫ్ ఫంగస్ ఎన్ని రోగాలో...

వాటిని తగ్గించేందుకు ఎన్ని మందులో... !

తెలియనంత కన్ఫ్యూజన్.... దీనమ్మ జీవితం..

ఏదో చీకట్లో దీపంలా ఆనందయ్య కనిపించాడు.

 క్యూలు కట్టారు .....అయినా  తెలుగు టీవీ లకు 

ఏం మాయ రోగం ...ఇది  కరోనా కన్నా ఘోరం...!!

అయ్యో !ఇంకా జన విజ్ఞాన వేదిక వాళ్ళు రంగంలోకి దిగలేదు. వెంటనే ఆపేందుకు..!! నెల్లూరు జనవిజ్ఞాన వేదిక వాళ్లు మాత్రం ప్రకటన చేశారు... ఈ మందు తక్షణం ఆపేయాలని...! గుడ్డిలో మెళ్లలా సీపీఐ నారాయణ  మాత్రం మద్దతు ప్రకటించాడు ..........  ఆశ్చర్యం.. హమ్మయ్య....

ఆయుర్వేదం మంచిది అని చెప్తే ఈ దేశంలో జాతీయ వాదానికి లాభం జరుగుతుందని ఇక్కడ రాజకీయమే... కొందరు గమ్మున కూర్చున్నారు... అయ్య బాబోయ్...

అల్లోపతి క్రైస్తవులదని ,యునాని ముస్లింలదనీ..ఆయుర్వేదం హిందువులదనీ  అజ్ఞానం... అసలు యునాన్ ఏ దేశంలో ఉందో కూడా తెలియదు .. యునాన్ తో ముస్లిం దేశాలకు సంబంధమే లేదు.. కానీ అరబ్బుల వాడకం వల్ల అదేదో ముస్లిం వైద్యం కూర్చుంది.. యునాన్  ఉన్నది గ్రీకులో... అలాగే యూరోప్ దేశాల తో పాటు ఎన్నో దేశాలు  ఎంతో కష్ట పడి అలోపతిని అభివృద్ధి చేసినా అది క్రైస్తవుల వైద్యం అయింది.. 

ఇన్ని శషభిషలు మధ్య ఆనందయ్య అనే అపర ధన్వంతరి... అశ్వినీ దేవతలే అవతారం ఎత్తి వచ్చినట్టుగా,

 కృష్ణపట్నం లో అమాయకంగా ఇంటి పేరుతో సహా

 పరిచయం చేసుకుంటున్నాడు.....

నవ గోప్యాలలో" ఆయుర్విత్తం గృహ చిద్రం మంత్ర ఔషధం"9 రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు అని వాటిలో ఔషధం కూడా ఒకటి పెట్టారు. అలాగే "నట విట గాయక గణికా వచ స్సీధురసం గ్రోలేడు చెవికిన్ కటువీ శాస్త్రము"అని అని ఎవరికి ఆయుర్వేదం చెప్పకూడదో బ్రహ్మ మిత్రుడు అనే గురువు మనుచరిత్రలో చెప్తాడు. కానీ పాపం ఆనందయ్య పిప్పళ్ళు తోక మిరియాలు వేపాకు మామిడాకు అల్లం పసుపు పట్టా... ఇలా దినుసులన్నీ ఓపెన్ గా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది సగం సగం వైద్యం తెలిసినవాళ్ళు ఈ దినుసులతో నకిలీ మందులు తయారు చేస్తున్నారో చెప్పలేం..

అయినా గతంలో తమిళనాడుకు చెందిన రామన్ పిళ్లై మూలికలతో పెట్రోల్ చేస్తానని అని ముందుకు వచ్చాడు. చివరకు అతనినీ నేరస్తుడిని చేశారు.. అలాగే 2014లో మణికందన్ అనే తమిళ యువకుడు రథం అనే స్కూటర్ తయారు చేసి సింగిల్ చార్జీతో నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం చేసేలా దాని రూపొందించాడు. ఆఖరికి చెన్నైలోని ఒక సంస్థ మేధో హక్కుల కింద ఫిర్యాదు చేసి అతనినీ మింగేసింది.

అదేవిధంగా బాలరాజు మహర్షి అనే గొప్ప వైద్యుడిని చచ్చేవరకు మనం ఎవరు గుర్తించలేదు. జర్మన్ వాళ్లు తీసుకెళ్లి అతనితో పుస్తకాలు రాయించి, ఆయన ఔషధాలతో డ్రగ్స్ తయారు చేసుకున్నారు. ఆయన మరణించే ముందు తిరుమల తిరుపతి దేవస్థానం కి ఎలా బుద్ధి పుట్టిందో తెలియదు కానీ" బాలరాజు మహర్షి గృహ వైద్యం "పేరుతో ఆయన పుస్తకాలు ప్రింట్ చేసింది.

పోయిన సంవత్సరం. రాందేవ్ బాబా తిప్పతీగ మొదలైన వాటితో ఒక ఔషధం తయారు చేస్తే, వెంటనే దానిపై విషం కక్కారు... పెప్సీ లాగా తమ దుకాణం బంద్ అవుతుంది అనుకున్నారు.... వెంటనే దాడి...!?

బత్తిన సోదరుల చేప మందు జన విజ్ఞాన వేదిక తమ అజ్ఞానాన్ని మొత్తం ఉపయోగించి బందు చేయించే ప్రయత్నం చేసింది... అయినా మృగశిర కార్తె నాడు లక్షల మందికి అది ప్రసాదం పేరుతో అందుతుంది...

అయినా  వీళ్ళు మాట్లాడితే "మందు రహస్యాలు" చెప్పమంటారు.. ఆయుర్వేదంలో కలిపే ప్రతి వస్తువు తో పాటు ఆ వైద్యుల హస్తవాసి ఉంటుంది.. ప్రతి మొక్కకు నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం రోజే అది సేకరించాలి. ఇంగ్లీష్ మందుల్లో ఏ ఇంగ్రిడియంట్స్ కలిపి చేస్తున్నారు.... అన్న విషయం ఎవరైనా అడిగారా.... వాటి సైడ్ ఎఫెక్ట్స్ ను ఎప్పుడైనా పరిశీలించారా..!?

శాస్త్రీయత అంటే ..  వీళ్ళు ఏదో  శాంకవకుప్పే గర్భం నుంచి పుట్టినట్టు.. మెడలో స్టెతస్కోప్ వేసుకుని అవతారమెత్తినట్లు.. మైక్రోస్కోపు నెత్తిమీద పెట్టుకుని తిరుగుతున్నట్లు ..

ఎదవ ఆర్గుమెంట్...

అసలు కరోనాకు మందు ఉందా.?. మరి లక్షలు ఖర్చు 

అయ్యేటట్లు వైద్యం ఎందుకు చేస్తున్నారు ..!?

పేదవాళ్ల కుటుంబాలు ఆరి పోతున్నాయి.. ఒక్కో ఇంట్లో మూడు నాలుగు పీనుగలు లేస్తున్నాయి.. కన్న కొడుకు చస్తే

" పుత్రశోకం నిరంతరం "అన్నట్టుగా ముసలి తల్లిదండ్రులు జీవితాంతం ఏడవాల్సిందే.. కష్టకాలంలో స్మశానానికి కూడా వెళ్లలేని దుస్థితి. అయినా నా దీనికంతా కారణమైన చైనాపై ఈగ కూడా వాల నివ్వని చెంచాలు.. ఛీ...

అయినా ...నాటు వైద్యం పూర్వం గ్రామాల్లోని

 నాయీ బ్రాహ్మణులకు ఎవరి నేర్పించారు?

 ఆదివాసీలకు పసరు పరిజ్ఞానం ఏ విజ్ఞాన శాస్త్రం లో బోధించారు.. పులిప్పాని వైద్యం.. సహదేవ పశువైద్యం...చరక సంహిత.. సుశ్రుత సంహిత.. రసరత్న సముచ్చయము... తంత్ర గ్రంధాలు... ఇవన్నీ.... క్వీన్ విక్టోరియా మహారాణి 

బాబు వచ్చి రాశాడా?

కేపాల్ కు ..చర్లపల్లి కి వెళ్లి చూడండి ..అక్కడ ఎందరు పల్లెటూరి వాళ్ళు విరిగిన ఎముకలను అతికించుకుని బ్రతికి పోతున్నారో...

సయాటికా మొదలైన కీళ్లనొప్పులకు వరంగల్ వెళ్లి ఆయుర్వేద వైద్యుడిని చూడండి....సేవ ఏంటో తెలుస్తుంది...

క్యాన్సర్ కు శివమొగ్గ లో తెచ్చిన మందు ఎందరికి జీవం పోస్తుందో.. వాడుతున్న వాళ్ళని అడిగి చూడండి...

పేనుకొరుకుడు వస్తే ఏళ్లకు పైగా వైద్యం చేసే డెర్మటాలజిస్ట్ లు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు.. కానీ ఆదివారంనాడు బెల్లంలో ఆకును దంచి నయం చేస్తున్న... ఓ అనామకుడు వికారాబాద్ జిల్లా దోమ లో ఉన్నాడు వెళ్లి తెలుసుకోండి..

ఇప్పటివరకు ఇంగ్లీష్ వైద్యంలో పచ్చకామెర్లు తో సహా ఎన్నో వ్యాధులకు మందులు లేవు కదా....

అంత మాత్రాన ఇంగ్లీషు వైద్యం పనికిరానిది కాదు. అది ఎన్నో అద్భుతాలు సాధించింది... కానీ అది మాత్రమే గొప్పది మిగతా వాటికి శాస్త్రీయత లేదు అనడం దుర్మార్గం.

రామాయణంలో మరణించిన దశరథుడి శరీరం భరతుడు కైక తల్లి గారి ఇంటి నుండి వచ్చే వరకు తైల ద్రోణి లో ఉంచారు కదా... ఇది విజ్ఞానం కాదా.. ఇలాంటివి బోలెడు చెప్పొచ్చు. విమర్శించేవాళ్ళు ఆనందయ్యను  చరకుడు ,సుశ్రుతుడు తో పోల్చకండి . . కనీసం అతని గొప్పతనం గుర్తించండి. అతడు సామాన్యుడు అయినా అతని చేతి గుణంలో ఏదో గొప్పతనం ఉంది... ఆయుర్వేదంలో నాటు మందులో చేతి గుణమే గొప్ప ప్రతిభ.

ఇప్పుడు ప్రభుత్వాన్ని, సాక్షాత్తు ప్రధానమంత్రిని ,ఆఖరుకు కార్పోరేట్ వ్యాపారాన్ని తట్టుకున్న రామ దేవ్ ను తిట్టి పోస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెనుక ఉన్న శక్తులే ఈ ఆనందయ్యను కూడా అమాంతం మింగ చూసే గ్యాంగ్.

మెడికల్ మాఫియా నుండి కార్పొరేట్ శక్తుల నుండి  ఆనందయ్య రక్షించుకుందామా..! లేదంటే ఈ ఆనందయ్యనూ మాత్రగా మార్చుకొని మింగేద్దామా...

(ఆనందయ్య పసరు వైద్యం నేపథ్యంలో ....ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి భాస్కరయోగి వ్యాసం)

తెలుగులో తప్పా మరెక్కడా

 తెలుగులో తప్పా మరెక్కడా కుదరని పదాలను చూడండి .. !! 

1. కలకల , 2. కిలకిల , 3. గలగల , 4.విలవిల , 5 . వలవల , 6. మలమల , 7. వెలవెల , 8. తళతళ , 9 . గణగణ , 10. గునగున , 11. ధనధన . 12. ఝణఝణ , 13. కణకణ , 14. గడగడ , 15. గుడగుడ , 16. దడదడ , 17. కిటకిట , 18. గటగట , 19. కటకట , 20. పటపట , 21. కితకిత , 22. గిలిగిలి , 23. కిచకిచ , 24. జిబజిబ , 25. చకచక , 26. పక పక , 27. మెకమెక , 28. బెకబెక , 29. నకనక , 30 . చురచుర , 31. చిరచిర , 32. బిరబిర , 33. బుర బుర , 34. పరపర , 35. జరజర , 36. కరకర , 37. బరబర , 38. చరచర , 39. గజగజ , 40. తపతప , 41. టపటప , 42. పదపద , 43. గబగబ , 44. గుసగుస , 45 . కువకువ , 46. రవరవ , 47. చిమచిమ , 48. గురగుర , 49. కొరకొర , 50. భుగభుగ , 51. భగభగ , 52. ఘుమఘుమ , 53. ఢమఢమ , 54 . దబదబ , 55. కుహుకుహు . 

.....ఇంక మీకు తెలిసిన పదాలు రాయండి...

అశూన్య శయనవ్రతము*

 _*వైశాఖ పురాణం - 13 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



 *అశూన్య శయనవ్రతము*



☘☘☘☘☘☘☘☘☘



నారదమహర్షి అంబరీషమహారాజుతో నిట్లనెను.  శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు *"మునివర్యా ! మన్మధుని భార్య రతిదేవి అశూన్యశయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకా వ్రతవిధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి. దయయుంచి నాకా వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమున చేయవలసిన దానము , పూజనము , ఫలము మున్నగువానిని గూడ చెప్పగోరుదునని యడిగెను.*


అప్పుడు శ్రుతదేవుడు మహారాజా వినుము. అశూన్యశయనమను వ్రతము సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతము నాచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగ ప్రసన్నుడై సర్వపాపములను పోగొట్టి సర్వశుభములనిచ్చును. ఈ వ్రతము నాచరించి గృహస్థధర్మముల పాటించిన వారు సఫలమైన గృహస్థజీవనమును గడిపి సర్వసంపదలనందుదురు. అట్లు చేయని వారికి శుభములెట్లు కలుగును ?


శ్రావణమాసమున శుద్ద విదియయందీ వ్రతము నాచరింపవలెను. ఈ వ్రతము నాచరించువారు నాలుగు మాసములును హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలయును. పారణదినమున లక్ష్మీసమేతుడగు శ్రీమహావిష్ణువు నర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమీయవలెను. బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు తులసి మాలికలు మున్నగు సుగంధ వస్తువులతో పూజింపవలెను. శయ్యాదానములు , వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగ శ్రావణమాసము మొదలు నాలుగు మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగ పూజింపవలెను.


తరువాత మార్గశీరము , పుష్యము , మాఘము , పాల్గుణము అను మాసములందును లక్ష్మీ సమెతుడగు శ్రీమన్నారాయణుని పూజింపవలెను. తరువాత చైత్రము , వైశాఖము , జ్యేష్ఠము , ఆషాడము అను మాసములందు శ్రీహరిని , రుక్మిణీ సహితముగ యెఱ్ఱని పుష్పములతో పూజింపవలయును. భూదేవసహితుడు సనందనాదిముని సంస్తుతుడు పరిసుద్దుడగు శ్రీమహావిష్ణువు నర్చింపవలెను. ఈ విధముగ చేసి ఆషాఢ శుద్ధ విదియ యందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలయును.


మార్గశిరము మున్నగు నాలుగు మాసముల పారణయందు విష్ణుగాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసములయందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను , పాయసమును , నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాదిమాస చతుష్టయమున పూజ , హోమము భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను , శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగనే దానమీయవలెను. శ్రీకృష్ణప్రతిమను మార్గశీర్షాదిమాస చతుష్టయ పూజా మధ్యమున దానమీయవలెను. చైత్రాదిమాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమీయవలెను. అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యధాశక్తిగ వస్త్రాలంకారములను దక్షిణతో నీయవలయును. నేతిలో వండిన బూరెలు ఒకొక్కనికి 12 చొప్పున దానమీయవలెను. తరువాత మంచమును , పరుపును వుంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమనుంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను.


*లక్ష్మ్యా అశూన్యశయనం యధా తవజనార్ధన*


*శయ్యామమా ప్యశూన్యా స్యాద్దావేనానేవ కేశవ*


అని దానమంత్రమును చెప్పి దానముచేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలెను. పై శ్లోకభావము స్వామీ ! జనార్దనా నీ శయ్య లక్ష్మీసహితమై యున్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై యీ శయ్యాదానముచేనుండుగాక.


ఈ వ్రతమును , భార్యలేని పురుషుడును , విధవాస్త్రీయును , దంపతులును యెవరైనను చేసికొనవచ్చును. శ్రుతదేవమహారాజా ! నేను నీకీ వ్రతమును పూర్తిగ వివరించితిని. ఈ వ్రతము నాచరించిన శ్రీమహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన యనుగ్రహమునంది జనులందరును ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై యుందురు. కావున యధాశక్తిగ భక్తి శ్రద్దలతో నీ వ్రతము నాచరించి భగవదనుగ్రహమును పొందవలెను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా ! నీవడిగిన అశూన్య శయనవ్రతమును వివరించితిని. నీకు మరేమి చెప్పవలయును ? అని శ్రుతదేవముని శ్రుతకీర్తి మహారాజుతో ననెను.


శ్రుతకీర్తి మహారాజు మహామునీ ! వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖమాస వ్రతాంగ విధానములనెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగెను.




_*వైశాఖపురాణం  పదమూడవ అధ్యాయం సంపూర్ణం*_

వేద ప్రణిహితమే ధర్మం

 వేద ప్రణిహితమే ధర్మం. ధారయితిధర్మం.ధరణి ధరించినది. మనం వునికి భూమిపై మనగడ కారణం. కారకుడు ఆత్మ. దీని వివరణ శంకరుల ఆత్మ అనాత్మ వివేకము అనే చిన్న పుస్తకంలో వివరణ. ఆటమ్ అనాటమీ. అనాటమీ లో న లేనిది ఎన్ అనే అణవు శక్తి లేనిది దేహము వునికి తెలియదు. అనాటమీ అవయముల గురించి తెలుపునది. అందులో ఆత్మ తత్వం నీరుగా మామూలు నీరు గాదు నఖ శక్తి పర్యంతం శక్తితో గూడిన విష్ణు వ్యాప్త్వం. అది లేనిది శరీరం చైతన్యం లేదు. అది పుట్టుకకు ముందు రూపం లేదు. పుట్టిన తరువాతనే దాని లక్షణము తెలియుచున్నది. అంతకుముందు సూక్మంగ రూపంలో వుండి సంకోచము చెందియున్నది. అది క్షేత్రములో వ్యాకోచం గలిగి రూపంగా వ్యాప్తంగా అనగా వియు వ్్యాప్త తత్వం విష్ణువు యని తెలియును. పుట్టిన వెంటనే తెలియదు. అసలు పూర్తిగా జీవ లక్షణము ఎవరికీ తెలియదు. ఎవరికి వారే వారి లక్షణములు తెలియాలి. ఎవరికి వారు దెలియుటకు ప్రయత్నించరు.ఎదుట వారి గురించి దెలియుటకు ప్రవర్తించుట అజ్ఞానం. యిది భాగవతం ఎన్నో పరాయములు వివిధ సందర్భాలలో స్పష్టంగా సులువుగా తెలుపుచునే యున్నది. యిప్పటికి ఎప్పటికి తెలుసుకోవడమే. మనం తెలియుట కర్తవ్యం. లేనిది అజ్ఞానం. అనంతమైన శక్తిని దెలియుట ఙ్ఞానం నాకే అంతా తెలియుట అజ్ఞానం. అజ్ఞానం అనగా చీకటి ఙ్ఞానం వెలుగు. తమ సోమా జ్యోతిః గమయ. తెలుసుకుంటూనే వుందాం.ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*ఆశ్రమ స్థలానికి తరలి వెళ్ళటం..*


*(ముప్పై ఆరవ రోజు)*


శ్రీ స్వామివారు ప్రతిరోజూ చెపుతున్న ఉపదేశాలకు.. ఆధ్యాత్మిక విషయాలకు ముగ్ధులైన శ్రీధరరావు ప్రభావతి గార్లు..ఆశ్రమ నిర్మాణం పూర్తయ్యేవరకూ శ్రీ స్వామివారు తమ ఇంట్లోనే ఉండిపోతారని భావించారు..కానీ దైవ సంకల్పం వేరొక విధంగా ఉంటుందని వారికి తెలిసిరాలేదు..


శ్రీ స్వామివారు..ఆ దంపతుల ఇంటికొచ్చిన ఇరువైఒకటో రోజు సాయంత్రం నుంచీ రాత్రి పొద్దుపోయేదాకా వివిధ అంశాలమీద ఉపదేశం చేసి, తన బసకు వెళ్లిపోయారు..ఆ సంగతులే ముచ్చటించుకుంటూ...శ్రీధరరావు దంపతులు నిద్రకుపక్రమించారు..


 అర్ధరాత్రి దాటిన తరువాత గాఢ నిద్రలో ఉన్న ప్రభావతి గారికి , "అమ్మా!..అమ్మా!.." అన్న పిలుపు వినబడింది..ముందు కలలో ఏదన్నా ఆలాపన లాగా వచ్చిందేమో అని భ్రమ పడిన ప్రభావతి గారికి..మరలా అదే పిలుపు కొంచెం గట్టిగా.."అమ్మా!..తలుపు తియ్యండి.." అంటూ వినపడింది..ఈలోపల శ్రీధరరావు గారూ ఈ అలికిడికి లేచారు..ముందుగా తేరుకున్న శ్రీధరరావు గారు ఒక్క ఉదుటున లేచి తలుపు తీసారు..అవతలి గదిలో ఉన్న సత్యనారాయణమ్మ గారు కూడా మెల్లిగా లేచి వరండాలోకి వచ్చారు..


ఎదురుగ్గా శ్రీ స్వామివారు..వరండా లో వ్రేలాడుతున్న  లాంతరు తాలూకు వెలుతురులో..తేజోపుంజం లాగా  నిలుచుని వున్నారు..స్వచ్ఛమైన నవ్వు ముఖంతో చూస్తూ వున్నారు..


"ఏం నాయనా?..ఏమైనా కావాలా?.."అన్నారు ప్రభావతిగారు..


"అమ్మా!..ఈశ్వరాజ్ఞ అయింది..ఇక ఇక్కడ వుండనమ్మా..త్వరగా బండి సిద్ధం చేయండి..నేను ఆ ఆశ్రమ స్థలానికి వెళ్లిపోవాలి..అక్కడే వుంటాను!.." అన్నారు శ్రీ స్వామివారు అదే చిరునవ్వుతో..


శ్రీధరరావు గారు ప్రభావతి గార్లు ముఖాముఖాలు చూసుకున్నారు..


"అదేమిటి స్వామీ..అక్కడ కేవలం స్థలం చదును చేసారే గానీ..కనీసం పునాదులు కూడా తీయలేదు..గోడలు కట్టి, పై కప్పు పడితే గదా మీరు ఉండడానికి అనువుగా ఉండేది..ఇప్పటికిప్పుడు ఎలా తయారవుతుంది?..ఈ చలి కాలంలో ఆ నిర్జన ప్రదేశంలో ఎలా ఉంటారు?.." అన్నారు శ్రీధరరావు గారు ఆతృతగా..


"నాయనా!..ఇప్పుడేం తొందర వచ్చిందని ఈ నిర్ణయం?..మందిర నిర్మాణం పూర్తయ్యేవరకూ ఇక్కడే ఉండొచ్చు కదా?.." అన్నారు ప్రభావతి గారు ఆందోళనగా..


"లేదమ్మా..ఇక ఆలస్యం చేయకూడదు..అది ఈశ్వరాజ్ఞ తల్లీ..నేను ఆ ఆజ్ఞ ను మీరి పోకూడదు!..ఇప్పుడే వెళ్లిపోవాలి..మీకు బండి సిద్ధం చేయడం కుదరదంటే.. నేను నడచి వెళ్లిపోతాను..నడక నాకు అలవాటే కదమ్మా.." అన్నారు శ్రీ స్వామివారు..


"కనీసం రేపు సాయంత్రం వరకూ వుండండి.. అక్కడ చిన్న పాక లాగా వేయిస్తాను..చుట్టూరా తాటాకు దడి లాగా ఏర్పాటుచేయిస్తాను..కొద్దిగా ఓపిక పట్టండి.."అన్నారు శ్రీధరరావు గారు..నిజానికి ఆయనకు లోలోపల కొద్దిగా చిరాకుగా ఉంది..అర్ధరాత్రి సమయంలో ఈ వ్యవహారమేమిటని ఆయన ఆలోచన!..


"శ్రీధరరావు గారూ..నేనిప్పుడు వెళ్లిపోవాలి..వెళతాను కూడా..మీరనుకునే ఆ పాక ఏదో రేపుదయం వేయించండి.." ఈసారి శ్రీ స్వామివారి కంఠం లో ఒక విధమైన తీవ్రత వినిపించింది..


ప్రభావతి గారు ఇక ఉండబట్టలేకపోయారు..స్ర్రీ సహజమైన ఆవేశం తన్నుకొచ్చింది ఆవిడ స్వరం లో..

"నాయనా!..మేము చేస్తున్న ఉపచారాలలో నీ కేదైనా లోటు కనిపించిందా?..అపచారం ఏదైనా జరిగిందా?..లేక అజ్ఞానం తో అడగరాని ప్రశ్నలు వేసి విసిగిస్తున్నామా?..మేము అత్యంత పవిత్రంగా భావించే ఈ ఇంట్లో..నీకేదైనా అపరిశుభ్రత గోచరించిందా?..ఒక్కపూట కూడా వుండలేనంత ఇబ్బంది ఏం జరిగింది నాయనా!..నా మనసుకు కష్టంగా ఉంది!.." అన్నారు..


"ఎంత పిచ్చి తల్లివమ్మా నువ్వు!.." అన్నారు శ్రీ స్వామివారు..ఆ క్షణంలో ఆయన ముఖంలో కరుణ జాలువారుతున్నది..  "మీ ఇంట్లో నాకు ఎటువంటి అసౌకర్యమూ లేదు..నాకు అపచారమూ జరుగలేదు..అపవిత్రత అన్న మాటే లేదు!..నేను చెపుతున్నది ఈశ్వరాజ్ఞ గురించి..నేను మాలకొండ నుంచి ఇక్కడకు బయలుదేరే సమయంలో..అక్కడే కొద్దికాలం  వుండమన్నారు..కుదరదన్నాను..ఎందుకు?.. అదికూడా ఆరోజు ఆ ఈశ్వరుడి ఆదేశానుసారమే.. ఈరోజు మీ ఇంట్లో వుండమంటున్నారు.. ఈరోజు కూడా ఉండలేను..వుండబోను..ఇది కూడా ఈశ్వరుడి ఆదేశమే!..గృహస్తుల వద్ద ఎక్కువ కాలం మా లాంటి యోగులు ఉండరాదు..ఉండము కూడా..అది నియమం!..నన్ను వెళ్లనివ్వండి.." అన్నారు..


శ్రీ స్వామివారి వివరణ..ఫకీరు మాన్యం లో బస..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

వాకింగ్ లో రకాలు !

 *వాకింగ్ లో రకాలు !*


1. డాక్టర్ నుండి వార్నింగ్ రాక ముందే ఉదయాన్నే చేసే నడకను "మార్నింగ్ వాక్" అంటారు.


2. డాక్టర్ నుండి వార్నింగ్ వచ్చిన తర్వాత ఉదయాన్నే చేసే నడకను "వార్నింగ్ వాక్" అంటారు.


౩. వేరే వాళ్ళ ఆరోగ్యం, ఫిట్నెస్ చూసి చేసే నడకను "బర్నింగ్ వాక్" అంటారు.


4. ప్రకృతి సౌందర్యం (కాలనీ లోని అందాలను) చూడటానికి చేసే నడకను "స్టేరింగ్ వాక్" అంటారు.


5. ఉదయాన్నే భార్య/భర్త తో కలిసి చేసే నడకను "డార్లింగ్ వాక్" అంటారు.


6. భార్య/భర్త పక్కనే ఉన్నా ఇంకా ఎవరైనా అందమైన వారు వచ్చారేమోనని దిక్కులు చూస్తూ చేసే నడకని "టర్నింగ్ వాక్" అంటారు.


7. రోడ్డు మీద ఏం వస్తున్నా చూసుకోకుండా నడవటాన్ని ''మర్''_నింగ్ వాక్ అంటారు.


8. ఉదయాన్నే నడకకని బయటపడి నడవకుండా ఎవరితోన్నా సోదేసుకుని తిరిగిరావటాన్ని "షో వాక్" అంటారు.


9. "డ్రీమ్ వాకర్" అంటే ఎలా ఉంటాడో తెలుసా నడవాలి అనుకుంటాడు, కానీ మంచం దిగడు.


అందరూ నవ్వుతూ, నవ్విస్తూ ఆరోగ్యం బతకాలి ! 


*మీకు మంచి ఆరోగ్యం ప్రాప్తిరస్తు !*

వెంటనే ఈ రెండు మందులు తెచ్చుకోండి

ఇప్పుడు ప్రతివారు తమ ప్రాణాలను కాపాడుకోటం ఎలా అనే విధంగా వున్నారు. రోగం కన్నా రోగానికి చెందిన భయం ప్రతి వారిలో ఏర్పడుతున్నది.  నిజానికి మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఏమి కాదు. 

మనం శారీరికంగా మానసికంగా దృఢంగా ఉండాలి అంటే శరీరం కండలు తిరిగి ఉండటం కాదు.  మన దేహం చక్కటి రోగ నిరోధక శక్తి (immunity ) ఉంటే మనలను ఏ రోగము దరిచేరదు. ఇక్కడ నేను చెప్పే రెండు మందులు తెచ్చుకొని వెంటనే వాడటం చేయండి. 

1) చావనాప్రాస్  లేదా అమృత రసాయనం. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెచ్చుకొని ఇంట్లోని వారంతా చిన్న పిల్లల దగ్గరనుండి వయోవృద్దుల దాకా రోజు క్రమం తప్పకుండా వాడండి. ఎవరు యెంత మోతాదులో వాడాలో ఆ డబ్బాల మీద వ్రాసివుంటుంది. ఒక్కవిషయం గుర్తుంచుకోండి డైయాబెటిక్ వ్యాధి గ్రస్తులు మాత్రమూ డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. ఇది మన శరీరంలో వ్యాధి నిరోధక శెక్తిని పెంచుతుంది కాబట్టి మీకు మంచి immunity లభిస్తుంది. దీని వాళ్ళ ఎటువంటి సైడ్ ఎఫక్ట్ ఉండదని ఆయుర్వేదం చెపుతున్నది. 

ఇక రెండో మందు ఇది మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అవసరం ఉంటే మాత్రమే దీనిని వాడాలి అనవసరంగా వాడ కూడదు. అది 

2)తాలిసాది చూర్ణం (TAALISAADI చూర్ణం) ఇది మనకు పొడి రూపంలో లభిస్తుంది మనకు   వచ్చే దగ్గు, జలుబు లోజ్వరము మొదలగు రుగ్మతలను నిర్ములిస్తుంది. మీకు ఏ మాత్రం గొంతులో గరగర వున్నా జలుబుగా వున్నా లేక కొంచం జ్వరం వచ్చిన దీనిని వెంటనే ఒక పావు చెంచా లేక అర చెంచా మీ రోగ తీవ్రతను బట్టి సేవించి మంచి నీరు తీసుకోండి. 

మీరు పైన చెప్పిన విధంగా చేస్తే మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీకు ఏ విధమైన బాధ కలుగదు. 

ఇక మనకు కావలసింది మనో ధైర్యం 

మన మనస్సుని ఏదో ఒక విషయం మీద పెడితే అది ప్రస్తుత కరోనా విషయాలకు దూరంగా ఉంటుంది. దానికి ఒకటే మార్గం అది దైవ చింతన మీకు వచ్చిన, తెలిసిన శ్లోకాలు, కీర్తనలు ఆలపిస్తూ దైవ చింతన చేయండి లేదా మన పురాణ ఇతిహాసాలు చదువుతూ, భక్తుల చరిత్రలు చదువుతూ సత్కాలక్షేపం చేయండి. 

మీరు రోజు కొంత సమయం ధ్యానం చేయండి. 

ధ్యానం చేయటానికి సులువైన మార్గం. 

మీరు ఒక ఆశనం మీద కూర్చుని అంటే ఏదైనా పట్టా లేదా పీట మీద కూర్చొని మీ రెండు చేతులు కలిపి ఉంచి నిటారుగా మీ దేహాన్ని వుంచు మీరు మీ జాసను మీ ముక్కు లోని శ్వాస మీద ఉంచి కూర్చోండి కేవలం మీ శ్వాస గమనాన్నే గమనిస్తూ వుండండి ఇది చాలా సులువైన ధ్యాన మార్గం. 

ఎందరో మహర్షులు, మనకు అనేక ధ్యాన మార్గాలు ఉపదేశించారు కానీ అందులో కొన్ని కొంత సాధన చేస్తే కానీ గురు ముఖతః నేర్చుకో గలము. 

శ్రీ కృష్ణ భగవానులు శ్రీమత్ భగవత్గీతలో ధ్యానాన్ని ఆచరించే విధానం తెలిపారు కానీ అది సులువైనది కాదు కేవలము గురు శిక్షణతోటె సాధ్యం. ఇప్పుడు మీరు ధ్యాన మార్గాన్ని అవలంబించి ఆధ్యాత్మికతను సాధించటం మీ దృక్పధం కాదు కాబట్టి సులువైన దానిని ఆచరించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

ఈ వ్యాసం చదివి ఫై మందులు వాడే పాఠకులు తమ అభిప్రాయాలను క్రింద కామెంట్ రూపంలో తెలుపగలరు. ఒక్క విషయం ముందుగా ఈ బ్లాగ్ follower గా అయ్యే తరువాత మీ కామెంట్ను తెలుపగలరు.  మీరు తెలుగు ఇంగ్లీష్ ఏ భాషలో అయినా తెలుప వచ్చు. మా పాఠకులు అందరు ఆరోగ్యంగా వుండాలని మా ఆకాంక్ష. 


సర్వే జన సుఖినోభవంతు. 

ఓం శాంతి శాంతి  శాంతిఁ