11, మే 2026, సోమవారం

మంగళవారం🍁* *🌹12, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁మంగళవారం🍁*

   *🌹12, మే, 2026🌹*

   *దృగ్గణిత పంచాంగం* 

                           

    *🌷ఈనాటి పర్వం🌷* 

 *🍁హనుమజ్జయంతి🍁* 


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : దశమి* మ 02.52 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం :మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : పూర్వాభాద్ర* రా 01.17 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*

*యోగం : వైధృతి* రా 11.20 వరకు ఉపరి *విష్కుంబ*

*కరణం  : భద్ర* మ 02.52 *బవ* రా 02.17 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 09.30-11.00 & 12.00-01.00 సా 04.30-06.00*       

 అమృత కాలం :*సా 05.21 - 06.56*

 అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : ఉ 07.49 - 09.25*

*దుర్ముహూర్తం  : ఉ 08.12 - 09.04 రా 10.57 - 11.41* 

*రాహు కాలం  :మ03.17- 04.53*

గుళికకాళం      : *మ 12.04 - 01.40*

యమగండం    : *ఉ 08.51 - 10.27*

సూర్యరాశి : *మేషం*              

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 05.48*

సూర్యాస్తమయం :*సా 06.38*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    :*ఉ 05.39 - 08.12*

సంగవ కాలం        :*08.12 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.21*

అపరాహ్న కాలం  :*మ 01.21- 03.55*

*ఆబ్ధికం తిధి        : తిధి ద్వయం బహుళ దశమి/ఏకాదశి*

సాయంకాలం    :*సా 03.55- 06.29*

ప్రదోష కాలం      :*సా 06.29- 08.43*

రాత్రి కాలం        :*రా 08.43- 11.41*

నిశీధి కాలం        :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.09 - 04.53*

●●●●●●●●●●●●●●●●●●●●●●

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐚 సంరక్షించండి_*


     *🍁హనుమకృత🍁* 

 *🍁సీతారామ స్తోత్రమ్🍁*


*వసిష్టాను మతాచారం* 

*శతానంద మతానుగం !!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 11 మే 2026*


          *శ్రీ మహావిష్ణు పురాణం*                                      

                  *85 వ భాగం*


       *శ్రీరామావతారo-6*


           *అరణ్యవాసం*```


భరత శత్రుఘ్నలు కేకయ రాజ్యం వెళ్లిన కొంతకాలానికి అయోధ్య లో దశరథుడు ఓ రాత్రి నిద్రలో దుస్స్వప్నం కన్నాడు. తన ప్రియమైన రాముడు తనను విడిచి దూరంగా వెళ్లిపోయినట్టు వచ్చిన ఆ కల నిద్ర నుంచి దశరథుని మేలుకొల్పింది.


నాడు శ్రవణ కుమారుని శబ్దవేది బాణంతో జంతువనుకుని చంపినప్పుడు, అతని అంధ తల్లితండ్రులు తనను వారిలాగే “పుత్రవియోగంతో చనిపోతావు" అని శాపం ఇచ్చి మరణించిన విషయం జ్ఞాపకం వచ్చింది. "తన కుమారుడు తన నుంచి దూరం కాకుండా ఉండాలంటే శ్రీరాముని వెంటనే అయోధ్యకు రాజును చేయాలి. అప్పుడు తనను, రాజ్యాన్ని వదలి రాముడు వెళ్లడు" అని ఆలోచన చేసి దశరథుడు వెంటనే వసిష్ట మహర్షిని రమ్మని సందేశం పంపాడు.


వసిష్ట మహర్షి రాగానే దశరథుడు “శ్రీరామునికి వెంటనే పట్టాభిషేకం చేయాలి. తగిన ముహుర్తం చూడండి” అని కోరాడు. 


దశరథుని మనస్సు లోని ఆందోళన, భయం తెలుసుకున్న వసిష్టుడు శ్రీరామ పట్టాభిషేకానికి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామునే శుభ ముహూర్తంం పెట్టాడు.


అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయించి శ్రీరాముని పిలిచి దశరథుడు పట్టాభిషేకానికి ససంసిద్థుడవి కమ్మని ఆదేశించాడు. 


తండ్రి మాట జవదాటని రాముడు వసిష్టమహర్షి చెప్పినట్లు పట్టాభిషేకానికి ముందు జరగవలసిన విధులలో పాల్గొన్నాడు.


మరుసటి రోజు ఉదయమే శ్రీరాముని పట్టాభిషేకం అని రాజ్యమంతా చాటింపు వేయించారు. అంతపురంలో దాసీజనం చర్చించుకుంటున్న ఈ సమాచారం కైకేయి దాసి మంధర విని పరుగున వెళ్లి కైకేయికి చెప్పింది. “ప్రియపత్ని కైకేయికి తెలియకుండా దశరథుడు రాముని ప్రభువుగా చేయాలని కుట్ర పన్నాడని నాడు వివాహ సమయంలో కైకేయి పుత్రునే రాజుని చేస్తానన్న వాగ్దానాన్ని మరచి పోయాడని, భరతుడికి జరిగే అన్యాయం ఆపమని" మంధర కైకేయిని రెచ్చగొట్టింది.


కైకేయి కోపగృహానికి వెళ్లి దశరథునికి రమ్మని సమాచారం పంపింది. రాముని పట్టాభిషేక వార్త చెప్పి కైకేయిని శాంతపరచాలని వచ్చిన దశరథుని కైకేయి తనకు దేవదానవ యుద్దంలో చేసిన సహాయానికి ఇచ్చిన రెండు వరాలు గుర్తు చేసింది. 

ఆ వరాలు ఇప్పుడు కోరుకుంటున్నాను అని "మొదటి వరముగా రామునికి బదులు భరతుడికి పట్టాభిషేకం చేయాలి. రెండవ వరముగా రాముని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపాలి"


కైకేయి వరాలు విన్న దశరథుడు దుఖంతో కుప్పకూలి పోయాడు. "భరతుడికి పట్టాభిషేకం చేస్తానని, రాముని మాత్రం వనవాసం పంపాలనే వరం కోరుకోవద్దని" కైకేయికి నచ్చచెప్పడానికి విఫల ప్రయత్నం చేసాడు. 


కైకేయి తను కోరిన వరాలు ఇవ్వవలిసిందే అని పట్టుబట్టేసరికి మాట తప్పలేని దశరథుడు రాముని వీడలేక దుఖంతో సృహ కోల్పోయాడు.


కైకేయి రాముని పిలిపించి దశరథుడు తనకు ఇచ్చిన వరాల గురించి చెప్పి శ్రీరాముని వనవాసానికి వెళ్లమంది. 

తండ్రి మాట శిరసావహించిన రాముడు, సృహ వచ్చిన దశరథుడు వద్దని కోరుతున్నా వినకుండా నారవస్త్రాలు ధరించి పద్నాలుగు ఏళ్ల వనవాసానికి సిద్దమైయ్యాడు. వనవాసం సంగతి తెలిసిన సీతాదేవి, లక్ష్మణుడు శ్రీరాముడు వారించినా పట్టుబట్టి రాముని వెంట వనవాసానికి పయనమయ్యారు.


అయోధ్య ప్రజానీకం కూడా సీతారామ లక్ష్మణుల వెంట అయోధ్య వీడి వనవాసానికి బయలుదేరింది. 


సరయూ నదీ తీరాన నిద్రిస్తున్న అయోధ్య ప్రజలను అర్ధరాత్రి వేళ వదిలి రాముడు సీతాలక్ష్మణులతో నది దాటి అవతల తీరం వైపు వెళ్లాడు.


అయోధ్యలో దశరథుడు రాముని వియోగం భరించలేక మరణించాడు. మంత్రి సుమంతుడు, వసిష్ట మహర్షి కేకయ రాజ్యంలో ఉన్న భరత శత్రుఘ్నలను అయోధ్యకు వెంటనే రప్పించారు. తండ్రి మరణానికి, శ్రీరాముని వనవాసానికి తన తల్లి కైకేయి కోరిన వరములే కారణమని తెలిసిన భరతుడు తల్లి కైకేయిని నిందించి పరిత్యజించాడు. 

వసిష్ట మహర్షి ఉపదేశానుసారం తండ్రి దశరథునికిఅంత్యక్రియలు నిర్వహించాడు.


"తనకు రాజ్యాధికారం పై కోరిక లేదని, అన్న శ్రీరాముడే అయోధ్యకు రాజు" అని ప్రకటించిన భరతుడు శ్రీరాముని అయోధ్యకు తీసుకురావడానికి వసిష్టుడు, తల్లులు, మంత్రులను తీసుకుని సైన్యం వెంట రాగా బయలుదేరి వెళ్లాడు. సరయూ నది అవతల తీరాన గల చిత్రకూటం చేరాడు. 

శ్రీరాముని వద్దకు వెళ్లి రామలక్ష్మణులకు తండ్రి దశరథుని మరణవార్త వినిపించి దుఃఖించాడు.


రామలక్ష్మణులు నదీతీరాన తండ్రికి తర్పణాలు వదిలారు. భరతుడు శ్రీరాముని పాదములకు నమస్కరించి "తల్లి చేసిన తప్పులకు తనకు సంబంధం లేదని, రాజ్యం అగ్రజుడైన శ్రీరామచంద్రునిదేనని, అయోధ్య వచ్చి రాజ్య పాలన చేపట్టమని" ప్రార్ధించాడు.


"తండ్రికి యిచ్చిన మాట తప్పనని, పద్నాలుగు ఏళ్ల వనవాసం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యం స్వీకరిస్తానని" శ్రీరాముడు భరతునికి నచ్చచెప్పాడు. అంతవరకు తన తరపున ప్రతినిధిగా రాజ్యపాలన నిర్వహించమని భరతునికి చెప్పగా- 


భరతుడు "రాముని పాదుకలు సింహాసనం పై ఉంచి పరిపాలన చూస్తానని, పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఒక్క నిమిషం రావడం ఆలస్యమైనా ప్రాణ త్యాగం చేస్తానని" ప్రతిజ్ఞ చేసి అయోధ్యకు వెళ్ళాడు.


అయోధ్య సమీపంలో నందిగ్రామం వద్ద పర్ణశాల నిర్మించుకుని భరతుడు రాజసింహాసనం తెప్పించి రామ పాదుకలు ఉంచి పాలన చేయసాగాడు. తానూ రాముని వలె నారవస్త్రాలు ధరించి వనవాస జీవితం గడుపుతూ ఉండసాగాడు. అయోధ్యకు, అయోధ్య ప్రజలకు దూరంగా ఉండి వనవాసం గడపాలని శ్రీరాముడు తలచాడు. చిత్రకూటం వదలి దండకారణ్యం వైపు బయలుదేరి వెళ్లారు. 


దండకారణ్యం రావణుని అధీనంలో రాక్షసుల నివాసమై ఉంది. తాటకి మారీచ సుబాహువులు తరువాత ఖర దూషణ శూర్పణఖలు దండకారణ్య మధ్యప్రాంతానికి ఆధిపత్యం వహించి మునుల ఆశ్రమాలను ధ్వంసం చేసేవారు. యజ్ఞయాగాదులు చేయకుండా అడ్డం పడేవారు. మునుల అభ్యర్ధన పై శ్రీరాముడు దండకారణ్యంలో ప్రయాణిస్తూ రాక్షసులను సంహరిస్తూ, మునులకు ప్రశాంత జీవనం కల్పిస్తూ అగస్త్యాశ్రమం చేరాడు.


అగస్త్య మహర్షి మార్గదర్శనం పై దండకారణ్యంలో గోదావరి తీరాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకుని వనవాసం గడపసాగాడు. దండకారణ్యంలో ధర్మాన్ని స్థాపించి మునులకు సహాయంగా ఉంటూ శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలసి పదమూడేళ్ళు వనవాస జీవితo గడిపాడు.


               *(సశేషం)*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

రత్నధారణ వలన కలుగు ఫలితాలు

 రత్నధారణ వలన కలుగు ఫలితాలు -


• వజ్రము -


     ఐశ్వర్యా బివ్రుద్ది , నూతన వికాసం , వియోగం అందిన దంపతులను కలుపును. వజ్రమాల ధరించిన సుఖప్రసవం అగును. కలరా, ప్లేగు వ్యాధుల నుంచి రక్షించును.


• వైడుర్యము -


    ఉత్సాహము , శత్రునాశనం , భూతపిశాచ భాద నివృత్తి , ఆపదలు, అపాయములు పోగొట్టును. గర్భిణి స్త్రీలు ధరించినచో సుఖప్రసవం అగును.


• గోమేధికము -


    నష్ట ధనలాభం , ఉద్రేక శాంతి , ఇతరులను ఆకర్షించును.


• పుష్యరాగము -


     వంశాబివ్రుద్ది , భోగబాగ్యములుని ఇచ్చును.


• మరకతము -


   బుద్ధిబలం , జ్ఞాపకశక్తి , వ్రుద్ధినిచ్చి , పిచ్చి , ఉన్మాదం , నరాల బలహీనత , విషదోష దృష్టి దోషములు పోగొట్టును .


• మాణిక్యము -


    ఆయుష్ వృద్ది , ధనం , ఉన్నతస్థితి , మనోవిచార నివారణ , అంటువ్యాధులు అంటకుండా చేయును.


• నీలం -


     అపమృత్యుదోష నివారణ , కీర్తి , ధనము , అదృష్టం కలిగించును. శనిబాధలు ఉండవు.


• పగడము -


     శత్రుజయం , ఉద్రేకశాంతి , రుణ బాధా నివారణ చేయును .


• ముత్యము - 


   కార్యవిఘ్న వినాశనం , ఉష్ణం తగ్గించుట , ఐశ్వర్యం నిచ్చుట , శీఘ్రంగా వివాహం చేయును . 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .


గమనిక -


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .

ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం . ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


. కాళహస్తి వేంకటేశ్వరరావు


. అనువంశిక ఆయుర్వేద వైద్యులు


. 9885030034

వైశాఖ పురాణం

 *🐚సోమవారం 11 మే 2026🐚*


 _*🚩వైశాఖ పురాణం🚩*_          

      *24వ అధ్యాయము*


           *వాయుశాపము*


అంబరీషునితో నారదుడీవిధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను.```


శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ ! విష్ణువునుద్దేశించి చేయుధర్మములు పూజలు , ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి ? వానిని చెప్పు ప్రమాణమేది ? వానిని తెలిసికొనుటయెట్లు ? వానికి చెందిన ధర్మములేవి ? వీనిచేనతడు సంతోషించును ? నీ సేవకుడనగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగ నడిగెను.


శంఖుడును కిరాతుడా ! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాపరహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మమొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొనజాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు , అనంతుడు , సచ్చిదానందరూపుడు. చరాచరస్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి స్థానముపోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి , సంహారము , వీని ఆవృత్తి , ప్రకాశము , బంధమోక్షములు , వీని ప్రవృత్తులన్నియు , నివృత్తులును , పరమాత్మవలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానులయభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మపదమునకు వాచ్యులెట్లగుదురు ? కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. శాస్త్రములు , వేదములు , స్మృతులు , పురాణములు , ఇతిహాసములు , పంచపాత్రాది ఆగమములు , భారతము మున్నగు వానిచేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరువిధములచే తెలిసికొనజాలము. కావున వేదాదుల నెరుగనివారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడునగు శ్రీహరిని ఇంద్రియాదులచేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొనశక్యము కాదు. ఇతని యవతారములను కర్మలను తమ బుద్దికొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీనవృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వశక్తిసంపన్నుడు. దేవతలు , ఋషులు , పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.


బలము , జ్ఞానము , సుఖము మున్నగునవి యుండుటచే , ప్రత్యక్ష , ఆగమ , అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని యెరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులుండుటవలన రాజు వందరెట్లు గొప్పవాడు. అట్టి రాజుకంటె మనుష్య గంధర్వులు నూరురెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వులకంటె నూరురెట్లు గొప్పవారిని యెరుగుము. అట్టిదేవతలకంటె సప్తర్షులు గొప్పవారు , సప్తర్షులకంటె అగ్ని , అగ్నికంటె సూర్యుడు , సూర్యునికంటె గురువు , గురువుకంటె ప్రాణము , ప్రాణము కంటె ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.


ఇంద్రునికంటె గిరిజాదేవి , ఆమెకంటె జగద్గురువగు శివుడు , శివునికంటె మహాదేవియగు బుద్ది , బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణముకంటె గొప్పదిలేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణమువలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువుకంటె గొప్పది సమానమైనది యేదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ ! ప్రాణము అన్నిటికంటె గొప్పదో , ప్రాణముకంటె విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.


అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా ! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ / రాజుగ నియమించుచున్నాను. మరిమీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. అతడు శీలము , శౌర్యము , ఔదార్యము మున్నగు గుణములను కలిగి యుండవలెను అని శ్రీహరి పలుకగ ఇంద్రాదులు నేను గొప్పయనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి , ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియుఅనక మౌనముగ నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.


అప్పుడు శ్రీహరి నవ్వుచు *"విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపముననుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరమునుండి బయటకు వచ్చిన ఈ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.


స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట , చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహినికుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవమునుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు , చూచుచు , పలుకుచు గాలిని పీల్చుచునుండెను తరువాత హస్తప్రదేశమునుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగువానిని చేయుచునే యుండును. తరువాత కన్నులనుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపులేకపోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కునుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను గాని వినుట మున్నగువానిని శరీరము చేయుచునే యుండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడిశక్తి లేకపోయెను. చెవిటి వాడనియనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటమున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాటలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానములేదుగాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము , వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము , కన్నులు , చెవులు , మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.


శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్నిప్రవేశించినను ఆ కళేబరమునుండి మాటరాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. అప్పుడు బలము , జ్ఞానము , ధైర్యము , వైరాగ్యము బ్రతికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.


ఈ ప్రాణము తన అంశలచేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమైయుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేదియని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవములకంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది యేదియును లేదు. ప్రాణముకంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు , చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు.


ప్రాణదేవత సర్వదేవాత్మకము , సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరివశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు. రుద్రుడు , ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసినజీవి పూర్వకర్మవశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.


అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ ! బ్రహ్మజ్ఞానీ ! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు ? దేవతలు , మునులు , మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ యెందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.


అప్పుడు శంఖమహాముని ఇట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్టనుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకములయందును. ప్రఖ్యాతియుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.


ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పుచేయకుండనున్న వానిని ఇట్లు శపించితివి కావున కణ్వమునీ ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా ! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. ఇంకను అడుగవలసినది యున్నచో నడుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.```


_*వైశాఖ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం*_ 


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

జబ్బును కూడా

  ఒక్క జబ్బు కెళితె నొక్కటే వందయ్యి

ఆంగ్ల మందు జనుల యంతు జూచు

కాన రారు నిజము కష్టాల పాలైన

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: ఒక చిన్న జబ్బును కూడా సక్రమంగా నయం చేయగలిగే మందులు ఇంగ్లీషు వైద్యంలో లేకపోవడం చేత తాత్కాలికంగా ఉపశమనాన్నిచ్చే పెయిన్ కిల్లర్లూ, విటమిన్లూ, ఏంటీ బయోటిక్, ఏస్ప్రిన్లూ, ఆయింట్ మెంట్లూ,నిద్ర మాత్రలూ, ఏంటీ ఎలర్జెటిక్ లూ లాంటి మందులతో కాలం గడుపుతూ క్రమంగా వ్యాధిని అంతర్గతంగా ముదరబెట్టి, నివారణ చేయలేనంత తరువాతి దశకు దానిని తీసుకు వెళ్తారు! ఈలోపు ఆ ఏంటీ బయోటిక్ లేదా పెయిన్ కిల్లర్ లోని కెమికల్ రియాక్షన్ కు లివర్, కిడ్నీ పాడయ్యి, షుగర్, బి. పి, కిడ్నీ డయాలసిస్ బాధితులు గానూ, రక్త కణాలూ, జీర్ణాశయం, రక్త నాళాలు పాడయ్యి, కేన్సర్ రోగులు గానూ మారుతారు! ఆ తర్వాత వాటికి చేసే విచ్చలవిడి పిచ్చి వైద్యంతో అవయవాలూ, ఆస్తులూ పూర్తిగా నాశనమై, అద్దాల మేడల్లోని యంత్రాల సాక్షిగా వాటి మధ్యే ఆవిరైపోతాడు! ఈ టెక్నాలజీ పిచ్చిలో చచ్చి కాటికెళ్తున్నా ఈ వాస్తవాన్ని గుర్తించడానికి ఇష్టపడరు! రసాయనాలూ, యంత్రాలూ వైద్యానికి ఉపయోగిస్తే "అమృతం పుట్టదు, హాలాహలమే పుడుతుంది"! ఇప్పటికైనా అర్థం చేసుకొని, ఈ అతితెలివి టెక్నాలజీని వదిలించుకొని, శరీరం లోని ఆటో ఇమ్యూన్ మెకానిజంను ప్రేరేపించి, వ్యాధి నివారణ సహజంగా, సంపూర్ణంగా చేయగలిగే హోమియో, యోగా, ధ్యానం, ఆయుర్వేదం, గృహవైద్యం లాంటి విధానాలకు వెళ్ళటం శ్రేయస్కరం! 

సకురు అప్పారావు చెప్పేది నిజం! 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

11-05-2026 సోమవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

11-05-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.  

---------------------------------------


వృషభం


ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------


మిధునం


ధన వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలసిరావు.

---------------------------------------


కర్కాటకం


గృహమున సంతోషంగా గడుపుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. 

---------------------------------------


సింహం


ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.

---------------------------------------


కన్య


దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు.

---------------------------------------


తుల


కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది.

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృథా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. 

---------------------------------------


ధనస్సు


ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచెయ్యక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.

---------------------------------------


మకరం


ముఖ్యమైన వ్యవహారములలో అప్రయత్న విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంభందిత వివాదాలు నుండి బయటపడతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభవార్త అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

---------------------------------------


కుంభం


వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం ఆశించినంత లభించదు. ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందిపడతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------


మీనం

 

అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన విద్యా విషయాల పట్ల శ్రద్ద వహించాలి. ఉద్యోగమున మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

---------------------------------------

మనసు మాత్రం

 చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సమయం ఉదయం మూడు గంటలు. అక్కడ ప్రయాణీకులంతా నిద్రలో ఉన్నారు. డెబ్భై ఎనిమిదేళ్ళ వృద్ధుడు. తెల్లటి ధోవతి, చొక్కాతో కూర్చున్నాడు. చేతిలో ఒక వెదురు బుట్ట. అందులో వేడి వేడి ఇడ్లీ ఉన్నాయి. ఆయన, 

"పేదరాశి పెద్దమ్మ page"

“ఇడ్లీ… వేడి ఇడ్లీ… ఒక రూపాయి… ఒక్క రూపాయి మాత్రమే…” అని పిలుస్తున్నాడు. కానీ, ఎవరూ కొనలేదు. ఇది 2026 సంవత్సరం. ఒక రూపాయికి చాక్లెట్ కూడా రాదు… ఇడ్లీలా? చాలామంది నవ్వుతూ అతన్ని పిచ్చివాడని అనుకున్నారు. నా పేరు అరవింద్. నేను ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాను. ఆకలిగా ఉంది. కానీ స్టేషన్ స్టాళ్లలో ఇడ్లీ ప్లేట్ ₹50. ఆ వృద్ధుడిని గమనించాను. బుట్టలో దాదాపు 100 ఇడ్లీలు ఉన్నాయి. ఒక్క కస్టమర్ కూడా లేడు. ఆయన కళ్లలో తేమ కనిపించింది. నేను దగ్గరకు వెళ్లి అడిగాను: “తాతయ్య… ఒక రూపాయికి ఇడ్లీ అమ్మితే నష్టమవదా?” ఆయన చిరునవ్వు నవ్వాడు. “బాబూ… ఇది నష్టం కాదు. లాభం.” “ఎలా తాతయ్య? బియ్యం ధర, గ్యాస్ ధర… ఒక్క ఇడ్లీకి కనీసం ₹5 ఖర్చవుతుంది కదా!” ఆయన బుట్ట మూసి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు… “1975 సంవత్సరం. అప్పటికి నాకు 25 ఏళ్లు. రైల్వే పోర్టర్‌గా పనిచేసేవాడిని. నెల జీతం ₹100. ఒక రోజు భారీ వర్షం. పని లేదు. డబ్బు లేదు. మూడు రోజులు ఆకలితో ఉన్నాను. స్టేషన్ బెంచ్ మీదే మూర్చపోయాను.” “అప్పుడు ఒక అమ్మ వచ్చింది. ఆమె ప్లాట్‌ఫాంపై ఇడ్లీలు అమ్మేది. ఒక్క రూపాయికి. నన్ను లేపి నీళ్లు చల్లి 4 ఇడ్లీలు పెట్టింది. డబ్బు అడగలేదు.” “నేను ఏడుస్తూ… ‘నా దగ్గర డబ్బు లేదు’ అన్నాను. అప్పుడు ఆమె చెప్పింది — ‘బాబూ… నేను కూడా ఒకప్పుడు ఆకలితో ఉన్నాను. అప్పుడు ఎవరో నాకు భోజనం పెట్టారు. అప్పుడే నేను ఒక మాట ఇచ్చుకున్నాను — నేను బ్రతికినంతకాలం ఆకలితో ఉన్నవారికి ఒక రూపాయికి ఇడ్లీ ఇస్తాను. నువ్వూ పెద్దవాడైన తర్వాత ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలి.’” వృద్ధుడి కళ్లలో నీళ్లు మెరిశాయి. “ఆమె 1995లో చనిపోయింది. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని అడిగింది — ‘నా మాట నిలబెడతావా?’ నేను ‘అవును’ అన్నాను.” “ఆ తర్వాత నేను రైల్వే కాంట్రాక్టులు తీసుకున్నాను. బాగా సంపాదించాను. మూడు ఇళ్లు. ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. కానీ 1995 నుంచి ఈరోజు వరకు… ప్రతి ఉదయం 3 గంటలకు… 100 ఇడ్లీలు… ఒక రూపాయి… ఈ స్టేషన్‌లోనే.” నా శరీరమంతా గగుర్పొడిచింది. “తాతయ్య… రోజుకి ₹400 నష్టం. నెలకి ₹12,000. సంవత్సరానికి ₹1.5 లక్షలు. 30 సంవత్సరాలకు ₹45 లక్షలు!” ఆయన చిరునవ్వుతో అన్నాడు: “డబ్బు ప్రకారం చూస్తే నష్టం. కానీ మనసు ప్రకారం చూస్తే లాభం. ఈ 30 ఏళ్లలో ఎంతమందికి తినిపించానో తెలుసా? 10 లక్షల ఇడ్లీలు… 10 లక్షల కడుపులు… 10 లక్షల ఆశీర్వాదాలు… వాటి విలువ ఎన్ని కోట్లుంటుంది బాబూ?” అంతలో ఒక చిన్న బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. చిరిగిన చొక్కా. వయస్సు 12 సంవత్సరాలు. “తాతయ్య… ఇడ్లీ… మూడు రోజులుగా తినలేదు. అమ్మ ఆసుపత్రిలో ఉంది. డబ్బు లేదు.” వృద్ధుడు ఒక ఆకు మీద 4 ఇడ్లీలు పెట్టి చట్నీ వేశాడు. “నెమ్మదిగా తిను బాబూ.” ఆ బాలుడు తింటూ ఏడ్చాడు. “రేపు డబ్బు ఇస్తాను…” “అవసరం లేదు. నువ్వు పెద్దవాడైన తర్వాత ఇంకొక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టు. అదే చెల్లింపు.” ఆ బాలుడు ఆయన కాళ్లకు పడిపోయాడు. “నేను కూడా మాట ఇస్తున్నాను తాతయ్య. నేను కూడా ఒక రూపాయికి ఇడ్లీ అమ్ముతాను.” నేను వెంటనే ₹1000 తీసి ఇచ్చాను. “తాతయ్య… దయచేసి ఈ ఇడ్లీల్లన్నీ నాకు ఇవ్వండి.” ఆయన నవ్వి అన్నాడు: “ఇవి ఒకరికే అమ్మడానికి కాదు బాబూ… ఆకలితో ఉన్నవారికోసం. నీకు ఆకలి అయితే ఒక ఇడ్లీ తీసుకో. ఒక రూపాయి వేయి. చాలు.” నేను ₹1 పెట్టి ఒక ఇడ్లీ తీసుకున్నాను. నా జీవితంలో అంత రుచిగా అనిపించిన భోజనం మరొకటి లేదు. కన్నీళ్లతో తిన్నాను. “తాతయ్య… ఒకటి అడగనా?” “అడుగు బాబూ.” “మీ పిల్లలు ఇది డబ్బు వృథా అంటారా?” ఆయన ఫోన్ తీసి వీడియో కాల్ చేశాడు. అమెరికాలో ఉన్న తన కొడుకు ఫోన్ ఎత్తాడు. “అప్పా, ఇడ్లీలు అమ్మేశారా? ఆరోగ్యం ఎలా ఉంది?” “బాగున్నాను. ఈరోజు ఒక యువకుడు నా కథ విన్నాడు.” ఆయన కొడుకు నన్ను చూసి నవ్వాడు. “సర్, మా నాన్నను చూసుకున్నందుకు ధన్యవాదాలు. ప్రతి నెలా మేము ₹50,000 పంపిస్తాం — ఇడ్లీల కోసం. అది ఆయన కోరిక. అదే మా ఆశీర్వాదం. ఆయన ఇచ్చిన మాట… ఇప్పుడు మా మాట.” వృద్ధుడు కాల్ ముగించి అన్నాడు: “చూశావా బాబూ? నా పిల్లలు కూడా ఈ వ్రతాన్ని కొనసాగిస్తున్నారు. నేను చనిపోయినా ఈ బుట్ట ఆగదు. ఒక రూపాయి ఇడ్లీ ఆగదు.” ఈరోజు 2026. ఆ వృద్ధుడు ఇక లేరు. గత సంవత్సరం 79 ఏళ్ల వయసులో చనిపోయారు. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని చెప్పారు: “బాబూ… ఈ బుట్టను చూసుకో. మాట నిలబెట్టు.” ఇప్పుడు ప్రతి ఉదయం 3 గంటలకు… అదే చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో… అదే బెంచ్ దగ్గర… నేను ఉంటాను. బుట్ట నిండా ఇడ్లీలు. ఒక్క రూపాయి. నేను నా ఐటీ ఉద్యోగం వదల్లేదు. కానీ ప్రతి ఉదయం 2 గంటలు… ఇడ్లీల కోసం కేటాయిస్తున్నాను. మా కంపెనీలో 200 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ నెలకు ₹100 ఇస్తున్నారు. “వన్ రూపీ ఇడ్లీ ట్రస్ట్.” ఆ 12 ఏళ్ల బాలుడు — గణేష్ — ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. సాయంత్రం వచ్చి సహాయం చేస్తాడు. “అన్నా… నేనూ మాట ఇచ్చాను. పెద్దవాడైన తర్వాత నేనూ ఇదే చేస్తాను.” --- స్నేహితులారా… డబ్బు సంపాదించడం గొప్ప కాదు. ఆ డబ్బుతో పుణ్యం సంపాదించడం గొప్ప. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒక చిన్న పొదుపు డబ్బా పెట్టండి. “₹1 డబ్బా.” ప్రతి రోజు ₹1 వేయమని చెప్పండి. నెలకి ₹30 అవుతుంది. ఆ డబ్బుతో ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. ఎందుకంటే… మీకు ₹30 ఒక చిన్న ఖర్చు మాత్రమే కావచ్చు… కానీ ఇంకొకరికి అది 30 రోజుల ఆశ కావచ్చు. --- ఒక మాట ఇచ్చుకుందాం: కనీసం ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి. డబ్బు పోతుంది… పుణ్యం మిగులుతుంది… బుట్ట ఖాళీ కావచ్చు… కానీ మనసు మాత్రం నిండిపోతుంది… 🙏


వాట్సప్ సేకరణ