7, సెప్టెంబర్ 2024, శనివారం

లక్ష్మీ పుత్రుడు

 


శ్రీభారత్ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🌹గణపతి పార్వతీ తనయుడే కానీ లక్ష్మీ పుత్రుడు కూడా. వినాయక వ్రతం అయిన తర్వాత మనం చదివే కథలకు భిన్నంగా ఉత్తరాదిలో మరి కొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వాటిని ఈ గణపతి నవరాత్రులలో మనకు అందిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. కొబ్బరికాయను నారికేళం అంటారు. ఆ పేరు ఎలా వచ్చిందో, కొబ్బరికాయనే పూజలో ఎందుకు కొట్టాలో, తులసి పూజ ఎందుకు చేయాలో చక్కగా ఈ ఎపిసోడ్ లో వివరించారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

తొలి పూజలు

 https://youtu.be/pKIcX7gGc80?si=-RUTAXlVIf7h9Des




శ్రీభారత్ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🌹గణపతి ఎవరు? ఆయనకు తొలి పూజలు ఎందుకు చేయాలి? ఏ కార్యక్రమం ప్రారంభించినా గణపతి పూజ తొలుత ఎందుకు చేయాలి? పసుపు గణపతి ప్రాధాన్యం ఏమిటి? అసలు గణపతి తత్వం లోని రహస్యమేమిటి? వంటి ఎన్నో సందేహాలకు సాధికారికమైన సమాధానాలిస్తూ అసలు గణపతి తత్వమేమిటో, దానిని ఎలా తెలుసుకోవాలో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అనంత కృష్ణ శర్మ గారు. పూర్తిగా శ్రద్ధతో వినండి. నవరాత్రి ప్రత్యేక ఎపిసోడ్స్ లో ఇది మొదటిది. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

గణనాథుడు

 *వక్రతుండ మహాకాయ*

*సూర్యకోటి సమప్రభ*

*నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*


గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు మొదలుపెట్టిన స్వకార్యం/సమాజ కార్యం లో ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. 


*మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితిపర్వదిన శుభాకాంక్షలు...*🌹🌹🌹🙏🙏🙏.

..మీ 

భార్గవ శర్మ


వాగీశాద్యా స్సుమనసః

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్లో. వాగీశాద్యా స్సుమనసః

                       సర్వార్ధానా ముపక్రమే

యం నత్వా కృతకృత్యాస్యుః

                       తం నమామి గజాననమ్

తే.గీ.

వాణిమగని మొదలు దేవ వరులు తొల్లి

నెవరిఁ బూజించి జయులౌదురెల్ల వేళ

నట్టి వేదండముఖు నేను అహరహమ్ము

అంజలింతు నంగదఁ బాపు మనుచు వేడి.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

The elephant faced god whom all the divine personalities worship before starting any activity to acquire success always ; i pray to him to weed out difficulties to all.


వినాయక చవితి శుభాకాంక్షలతో

                    ............ ముట్నూరి శ్రీనివాస్ 

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

శుభాకాంక్షలు

 పాఠకులకు వినాయకచవితి శుభాకాంక్షలు


సెప్టెంబర్, 07, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🍁 *శనివారం*🍁

🌹 *సెప్టెంబర్, 07, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                     


             *ఈనాటి పర్వం* 

*శ్రీ వరసిద్ధి వినాయక (వ్రతం) చతుర్థి*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం -  శుక్లపక్షం*


*తిథి : చవితి* సా 05.37 వరకు ఉపరి *పంచమి*

*వారం    : *శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : చిత్త* మ 12.34 వరకు ఉపరి *స్వాతి*


*యోగం  : బ్రహ్మ* రా 11.17 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం  : భద్ర* సా 05.37 ఉపరి *బవ* పూర్తిగా రాత్రంతా


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 10.30 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం:శేషం ఉ 07.08 వరకు

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.30*


*వర్జ్యం         : సా 06.51 - 08.39*

*దుర్ముహూర్తం:ఉ 05.55 - 07.34*

*రాహు కాలం : ఉ 09.00 - 10.33*

గుళికకాళం      : *ఉ 05.55 - 07.27*

యమగండం    : *మ 01.38 - 03.10*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.55* 

సూర్యాస్తమయం :*సా 06.16*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.55 - 08.23*

సంగవ కాలం   :      *08.23 - 10.51*

మధ్యాహ్న కాలం :*10.51 - 01.18*

అపరాహ్న కాలం: *మ 01.19 - 03.47*

*ఆబ్ధికం తిధి:భాద్రపద శుద్ధ చవితి*

సాయంకాలం  :  *సా 03.47 - 06.16*

ప్రదోష కాలం    :  *సా 06.16 - 08.35*

రాత్రి కాలం     :  *రా 08.35 - 11.42*

నిశీధి కాలం     :*రా 11.42 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.08*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం....!!*


 శిరంవజ్ర కిరీటం - 

వదనం శశివర్ణ ప్రకాశం 


ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం - 

కర్ణం వజ్ర కుండల శోభితం 


నాసికా సువాసికా పుష్పదళం - 

నయనే శశిమండల ప్రకాశం 


కంఠే సువర్ణపుష్ప మాలాలంకృతం - 

హృదయే శ్రీనివాస మందిరం 

కరం కరుణాభయసాగరం 

భుజే శంఖ చక్రగదాధరం 


స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం - 

సర్వాంగే స్వర్ణపీతాంబర ధరం 


పాదే పరమానందరూపం - 

సర్వపాపనివారకం 


సర్వం స్వర్ణమయం - 

నామం శ్రీ వేంకటేశం 


శ్రీనివాసం - శ్రీ తిరుమలేశం - 

నమామి శ్రీ వేంకటేశం !!...🚩🌞🙏🌹


🙏 *ఓం నమో వెంకటేశాయ నమః*🙏


🍁🪔 🌹🌿🌹🌿🌹 🪔🍁


ఓం నమో వాయుపుత్రాయ 

భీమరూపాయ ధీమతే ।

నమస్తే రామదూతాయ 

కామరూపాయ శ్రీమతే ॥


మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే ।

భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ ॥


తత్త్వ జ్ఞాన సుధాసిందు 

నిమగ్నాయ మహీయసే ।

ఆంజనేయాయ శూరాయ 

సుగ్రీవ సచివాయచ ॥


యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే ।

మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ద్రతే ॥


హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే ।

బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే ॥


    🙏🏻 *ఓం సర్వదుఃఖహరాయ నమః* 🙏🏻


   🍁⚛️🌹🪔🍁🪔🌹⚛️🍁


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

_*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 5

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 5 వ భాగము*_ 

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


*వేదాధ్యయనము*


ఉపనయనమయ్యాక వచ్చే శ్రావణ పౌర్ణమినాడు నూతన వటువుకు ఉపాకర్మ చేయడం సాంప్రదాయం. ఆ పిమ్మటే వానికి వేదాధ్యయన అధికారం లభిస్తుంది. యధావిధిగా శంకరునికి ఉపాకర్మ జరిపించింది ఆర్యాంబ. తరువాత గురువుల కప్పగించింది తనయుణ్ణి. గురువుల పెదవులు చూచే శంకరుడు అందుకుంటున్నాడు. వేదవిద్య అసమాన్య  మైనది. మన భారత భూమి పలు విధాల భిన్న భిన్న సంప్రదాయాలకు ఆటపట్టు. ఆహార వ్యవహారాలలో, భాషా పద్ధతులలో వైవిధ్యం ఉన్నప్పటికీ అతిప్రాచీన మైన సంస్కృతి మనది. దానికి జీవగఱ్ఱ వేదాలు. దేశ ప్రజల నందరినీ ఏకసూత్రబద్ధులను చేసేదే వైదిక ధర్మ సంస్కృతి. అపౌరుషేయాలయిన వేదాలను పరమాత్ముని ఉచ్ఛాస నిశ్శ్వాసాలుగా వర్ణిస్తారు. ఒక్కొక్క వేదం పదిరెండేడులు చొప్పున నాలుగు వేదాలు నేర్వడానికి నలుబది ఎనిమిది సంవత్సరాలు పట్టుతుంది. ఊహింపరాని అద్భుత శక్తియుక్తుడైన శంకరునికి మాత్రం అత్యల్పకాలంలోనే స్వాధీనమయ్యాయి వేదాలు సర్వస్వమూ. పరాత్పరుడే తన శిష్యు డయ్యాడని పొంగిపోతున్నాడు శంకరుని గురుడు. బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ మధూకర వృత్తితో ఆదర్శరీతిలో గురువుల కడ విద్య నభ్యసిస్తున్నాడు.


*బంగరు ఉసిరిక పండ్ల వాన:*


దండమూ, జలపాత్ర, జోలె ధరించి కౌపీనధారియై భిక్షాటనకై బయలుదేరాడు శంకరవటుడు. వామనమూర్తి వస్తున్నా డని వీధుల్లో వ్రేళ్ళాడి చూచేవారు అతణ్ణి. ఒక ఇంటి ముందు నిలబడి 'భవతీ భిక్షాం దేహి' అన్నాడు. ఆ ఇంటి ఇల్లాలు విన్నదా పిలుపు. ప్రత్యక్షంగానైనా చూడ నోచుకోని పరిస్థితి. తలుపు సందు ద్వారా చూచింది. భిక్ష పెట్టడానికి పట్టెడన్నమైనా లేదు. ఆమెకు ఏమీ తోచక కండ్లు గిర గిర తిరిగాయి. దుఃఖ మాపుకోలేక భగవంతుని తలచుకొని ఇలా పరితపించింది: 'పరాత్పరా! కట్ట బట్టా, తిన తిండీ లేని బ్రతుకిచ్చావు. ఇటువంటి పుణ్యపురుషునికి పట్టెడు పెట్టే భాగ్యం నా కెప్పుడు వస్తుందో కదా! ఈ దీనురాలి యెడ దయతో ఏదైనా దారి చూపించవా!'. బ్రహ్మచారి నుద్దేశించి 'నాయనా! నా నాధుడు గ్రామం లోనికి వెళ్ళియున్నాడు. కనికరించి కొంచెము సేపు కూర్చుండవా' అని వేడుకొన్నది. అది విన్న శంకరుడు ఆ ఇంటి వైపుచూచాడు. ఆ యిల్లు వారి కాశ్రయమిచ్చే గృహం కాదు, చంద్రార్కుల కాపురమని గ్రహించాడు. ఆ ఇల్లాలు వైపు తిరిగి 'అమ్మా! నీ బిడ్డని చేతిలో ఒక ఉసిరిక ఫలం ఉంది. అది నాకు భిక్షగా జోలెలో పడవేయుము' అని అడిగాడు. వెంటనే తన కుమారుని చేతనున్న ఉసిరిక ఫలాన్ని శుభ్రంగా కడిగి పరమ భక్తి భావంతో బ్రహ్మచారి జోలెలో వేసి నిట్టూర్చింది.


ఆ ఇల్లాలి దీనావస్థ చూచిన శంకరబాలుని హృదయం ద్రవించి పోయింది. శ్రీ మహాలక్ష్మిని తలంచి మహాదేవికి ఆయత్తం చేసి ఈ విధంగా స్తోత్రం చేసాడు.


*"అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయన్తి, భృజాఙ్గనేన ముకులాభరణం తమాలం*

*అఙ్గీకృతాఖిల విభూతి రపాఙ్గలీలా, మాఙ్గల్యదాస్తు మమ మఙ్గల దేవతాయాః ॥* 


పై విధంగా మృదువుగాను, మధురంగాను శ్రీమహాలక్ష్మీ కటాక్షం కోసం చేసిన స్తోత్రాన్ని విని ఆ శశిసోదరి సాక్షాత్కరించింది. చల్లని చూపులు ప్రసరిస్తున్న ఆ దేవి వంక తిరిగి ఇలా ప్రార్థించాడు బాల శంకరుడు. 


“అమ్మా! ఈ గృహిణి పుణ్యవతి కడుబీదరాలు. లేమి వెతతో బ్రదుకుటకుకష్టపడుతున్నది. జాలి వహించి ఈమెను అనుగ్రహించు”. దానికి శ్రీమహాలక్ష్మి ఈ విధంగా సెలవిచ్చింది: "శంకరా! వీరలు పేదలని కదా నీ పరితాపము? పూర్వజన్మ లో ఏ కొలది పుణ్యము చేసికొనరైరి. ఈ జన్మలో భాగ్యమెట్లు ప్రాప్తించును?” నిశ్శంకగా తేల్చి చెప్పిన ఆ మహాలక్ష్మి మాట విని శంకరుడు మరల ఈ విధంగా దేవిని వేడుకొన్నాడు. “సర్వమంగళదేవతవు. సర్వలోకాధీశుని సంతోషపెట్టగల నీ శక్తి అపారం. ఈ చిన్న పని నీకు లెక్క లేదు. సాగరసుతవు. సాగరాన్ని మించిన దయాంబురాశివి. కల్పవృక్షాన్ని మించిన భాగ్యదవు. ఈమె ముందు జన్మలో ఏ పుణ్యమూ చేసి ఎఱుగ దన్నావు. మరి ఈ జన్మలో ఇప్పుడే నాకు ఉసిరికఫలం ఇచ్చింది. తత్ఫలితం ఎప్పుడో కాక ఇప్పుడే ప్రసాదింపవా! నీ అనుగ్రహమున్న లోటేమి?” అని వేడిన ఆ అపురూపపు బ్రహ్మచారి కోరికను మన్నించి కరుణా తరంగిణియైంది. సిరుల రాశి చూపుల దయా ప్రవాహం కనక ధారాపాతమై ఆ పేదరాలి ఇల్లూ, వాకిలీ బంగారు ఉసిరిక పండ్లతో నిండి పోయింది. ఆ మహాదేవి కరుణతో సాధ్యము కానిదేది? నరుడామె అండతో ధీనిధి అగును. కులీనుడగును. వేయేల ఆ తల్లి కరుణించిన జీవి ధన్యాత్ముడగును. (యస్యాస్తి విత్తం సనరః కులీనః సపండితః సశ్రుతిమాన్ గుణజ్ఞః స యేన వక్తా స చ దర్శనీయః సర్వే గుణాః కాంచన మాశ్రయన్తె).


ఆ నాటి నుండి నేటికీ ఆ కనకధారాస్తవం అత్యంత ప్రస్తుతి కెక్కినది.


*శంకరుని విశాలాశయము:*


పేదవారిని చూచి జాలి పడడం ఒక వంతు. కొందరు ఓదారుస్తారు శుష్కవాక్కులతో. దానివలన కలిగే ప్రయోజనం శూన్యమే కాక మానసిక దౌర్భాగ్యానికి దారి తీయవచ్చు. ఉపకారసాహాయ్యం అందించకుండా కనబరచే సానుభూతి నిష్ఫలం. శక్తి కలిగిన మేరకు ఆదుకోవాలి తమ కన్న తక్కువ స్థితిలో నున్న తోడివారిని. బాలుడు శంకరుడు తన శక్తి చూపించాడు ఆదుకున్నా డొక పేద రాలిని. ఆ నాటి మధూకరం శంకరునికి పూర్తి కాలేదు.


ప్రక్క నున్న సంపన్నగృహాన్ని చేరడమే తరువాయి ఆ యింటి యజమాని సిద్ధంగా ఉన్నాడు భిక్ష చేత్తో పట్టుకొని. ఆ పెద్ద మనిషిని చూచి నిష్కర్షగానే ఇలా చెప్పాడు. “సంఘంలో మసలుతూ తోడి వారిని ఆదరించని వారొసంగిన భిక్షాహారం భుజిస్తే న్యాయ భావం జనిస్తుందా?” మొదట ఆ మాటలు ఆ గృహస్థునికి అర్థం కాక వివరంగా శంకరుడు చెప్పాక విని పరివర్తన రాగా బాలశంకరుని కాళ్ళపై బడి "స్వామీ! నా మాట వినండి. ఈ క్షణంనుండి నా ధనాన్ని ధర్మానికి ఉపయోగిస్తాను. మీ పాదాలే సాక్షి" అని నివేదించుకొన్న భాగ్యశాలి నిజమైన భాగ్యశాలి అయ్యాడు ఆ క్షణం నుండి.


*గురుకులవాస విశిష్టత:*


ఆనాటి విద్యావిధానం నేటివలె కాక పూర్తిగా వేరుగా ఉండేది. ఎంత తరచి చూచినా పోలిక లేమీ పొడగట్టవు. నాటి పద్ధతుల వలన బాలురలోని సుషుప్తశక్తు లను వెలికితీసి వికసింప జేయగల మెలకువ లుండేవి. నిజమయిన పౌరులను తయారుచేసే విధంగా కొనసాగేవి ఆ గురుకులవాస పద్ధతులు. కేవలం ఉపన్యాసాలు విని, గ్రంధాలు చదివితే సర్వంకషంగా సాంఘిక జీవన యానానికి ఉపయుక్తమైన జ్ఞానం అలవడదు. అది సరియైన శిక్షణతోనే లభిస్తుందన్న విశ్వాసమే ఆనాటి గురుకుల విద్యారంగానికి మూలసూత్రం. ఆ శిక్షణలో మొదటిది మధూకరవృత్తి అనబడే భిక్ష.


తేనెటీగలూ, తుమ్మెదలూ పుష్పాలలోని తేనెను సంపాదించు కొనే విధానం. ఆవ్యాసంగంలో వినయము, విధేయత బలపడి దురభిమానాన్ని దూరం చేస్తుంది. నమ్రతతోడి భక్తి, శ్రద్ధ, సహపౌరులపై ప్రేమ జనింప చేస్తాయి. భవిష్యత్తుకు మంచి బాట విద్యార్థులకు పడడమే కాక, లేత ప్రాయములో ఉన్న వారిని చూచిన పెద్దలకు వాత్సల్యం పొడచూపుతుంది. గురు కులంలో గుంట ఓనమాలు నేర్పరు. అవన్నీ ముందుగా ఇంట్లోనే నేర్చుకొని ఉండాలి. గురుకుల విద్యార్థికి విత్తంతో పని లేదు. వేదాలు వేదాంగాలు క్షుణ్ణంగా అభ్యసించేవారు. విద్యాపాటవానికి పేరెన్నిక గన్న నాటి భారతదేశం లోని విశ్వవిద్యాలయాలకు దేశదేశాల నుండి వచ్చి నేర్చుకొనేవారని చరిత్రలు చెప్పుచున్నాయి.


*భరద్వాజుడు, వేదాలు:*


పూర్వం భరద్వాజముని బ్రహ్మచర్య వ్రతము చేపట్టి వేదాలను నేర్చుకోవడం మొదలుపెట్టాడట. ఆయన కున్న మూడు బ్రహ్మ కల్పాల ఆయువు ఐపోవచ్చింది కాని వేదాధ్యయనం పూర్తి కాలేదు. అప్పుడు అధ్యయనం కట్టిపెట్టి ఆయువు కోసం ఘోర తపస్సు చేయగా మెచ్చిన బ్రహ్మగారు దేవేంద్రుణ్ణి పంపించి ఆయన కేమి కావాలో చూడమన్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై మరొక బ్రహ్మకల్పం ఆయుష్షు ప్రసాదిస్తూ భరద్వాజుని ఈ ఆయువుతో ఏమి చేద్దామనుకొంటున్నావని అడిగాడు. భరద్వాజుడు వేదాధ్యయనం పూర్తి చేద్దామని అనుకుంటు న్నానని చెప్పాడు. ఇంద్రుడు చూపించా వేదరాశిని. మహామేరు పర్వతాల్లాగ కోటి సూర్యుల కాంతికి మించిన ప్రకాశంతో వెలుగుచున్న వేదాలను కంటితో చూడలేకపోయాడా మహాముని. మూడు వేదాల పుంజాలను ఋషి మ్రోల పెట్టి వీటితో సరిపెట్టుకో. గృహస్థాశ్రమం చేకొని శిష్యులకు చెప్పుకొంటూ ఈ కల్పం గడుపుకో అని. మూడు గుప్పెళ్ళుగా ఇంద్రుడిచ్చిన వేదరాశులు కలగాపులగం గా ఉండి పోయాయి.

బ్రహ్మ అంశంతో అవతరిం చిన కృష్ణద్వైపాయనుడు వాటిని నాలుగుభాగాలుగా విభజించాడు. అలా వెలసిన ఋగ్వేదము సామవేదము, యజుర్వేదము, అధర్వవేదము దైవప్రసాదితములైన అనంత విజ్ఞానఖనులు. వేదవ్యాసుడు పైలునకు, వైశంపాయనునకు, జైమినికి, సుమంతునకు ఒక్కొక్కరికి ఒక్క వేదం చొప్పున ఉపదేశించాడు.


*కైలాస శంకర కాలడి శంకర*


*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*5 వ భాగము సమాప్తము*

🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑

గణానాం పతిః గణపతిః’

 *గణానాం పతిః గణపతిః’* 


జ్ఞానమూర్తి అయిన పరమశివుడు, ఆనంద స్వరూపిణి అయిన శక్తి కలసి ఏకర రూపమై.. వినాయకుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ‘గణానాం పతిః గణపతిః’ అన్నారు. దేవ, దానవ, మానవులందరికీ అధ్యక్షుడూ, ఆరాధ్యుడూ ఆ విఘ్నేశ్వరుడే! 


గణపతిలో సర్వదేవతలూ కొలువయ్యున్నారు. ఆయన ముఖం విష్ణువు, నేత్రాలు శివుడు, నాభి బ్రహ్మ, ఎడమభాగం శక్తి, కుడిభాగం సూర్యుడు’ అంటూ వర్ణించారు తత్త్వవేత్తలు. 


ఇలా సకల దేవతా సమష్టి స్వరూపం మహాగణపతి. అలాగే వేదాలకు ఆదిస్వరూపమైన ఓంకార రూపమే విఘ్నేశ్వరుడు. లలితా సహస్రనామం ‘కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా’ అని స్తుతించింది. 


లోకాలను పీడించే దుష్టశక్తులను రూపుమాపేందుకే పార్వతీపరమేశ్వరులు సంకల్పించి, తమ చూపులతోనే వినాయకుని రూపం దిద్దారట. విఘ్నాన్నే ఆయుధంగా ప్రయోగించి కార్యం సానుకూలం చేయగల విజ్ఞుడు వినాయకుడు. 


విద్య, వినయం, వివేకం ప్రసాదించే వేలుపే వినాయకుడు. దేవ, అసుర, నర, నాగ వర్గాలన్నిటికీ విశిష్టనాయకుడు. 


శరీరంలో మూలాధార చక్రానికి గణపతి అధిదేవత అని స్పష్టం చేసింది పతంజలి యోగశాస్త్రం. అలా భక్తులకు, జ్ఞానులకే కాదు యోగులకు కూడా ఆయన ఆరాధ్యనీయుడు!      

 *🌺వినాయక చవితి శుభాకాంక్షలు*🙏

A.purnachandrarao 

Avn.lakshmi

🙏🌺🙏🌺🙏

                   

           

 

⚜ *శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 432*






⚜ *కర్నాటక  : ముండుకూరు _ ఉడిపి* 


⚜ *శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం* 



💠 దక్షిణ కన్నడలోని శాంభవి నది వెంబడి, నమ్మశక్యం కాని సంఖ్యలో పురాతన మరియు అందమైన దేవాలయాలు ఉన్నాయి.

 వీటిలో చాలా వరకు వేల సంవత్సరాల నాటివి మరియు అద్భుతమైన చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రధానంగా శివ, దుర్గ ఆలయాలు చాలా ఉన్నాయి.


💠 శ్రీ ముండ్కూర్ దుర్గా పరమేశ్వరి ఆలయం అలాంటి మరొక అద్భుతమైన ఆలయం. 

ఇది శాంభవి నది తీరం వెంబడి ఉంది మరియు ఉడిపి నుండి బెల్మాన్-మూడబిద్రి రహదారిలో వెళితే చేరుకోవచ్చు. ఇక్కడ ఉన్న దుర్గా పరమేశ్వరి ఆలయం సుమారు 9వ శతాబ్దం లో నిర్మించబడింది.


💠 అందుబాటులో ఉన్న పురాతన రికార్డులు మరియు స్కంద పురాణం ప్రకారం సుమేధ ఋషి మరియు సురత రాజుల అభ్యర్థన మేరకు భార్గవ ఋషి మహిషమర్దిని విగ్రహాన్ని ప్రతిష్టించారు.

విగ్రహం పశ్చిమం వైపు ఉంది, వీర వర్మ అనే జైన పాలకుడు తూర్పు వైపుకు తిప్పాడు, మూల విగ్రహం దిగువ నుండి చాలా సంపదను తొలగించాడు. 


💠 ప్రధాన దేవత శ్రీ దుర్గాపరమేశ్వరి, మహిషమర్దిని రూపంలో, రాక్షసుడిని మహిషను తలక్రిందులుగా పట్టుకుని, అతని శరీరంపై త్రిశూలాన్ని గుచ్చుతుంది. 

అందువల్ల ముండక్కే ఊరి నింత ఊరు అనే పేరు ఒక సంస్కరణ ప్రకారం తరువాత దశలో ముండ్కూరుగా మారింది. 


💠 ఇక్కడ పూజించబడుతున్న ఇతర దేవతలు శ్రీ మహాగణపతి (క్షిప్రప్రసాద స్వరూపి), నవగ్రహ, నాగ, అశ్వత్థవృక్ష, ధూమావతి, రక్తేశ్వరి, వ్యాఘ్ర చాముండి (పిలిచండి), వారాహి (పంజుర్లీ).


💠 ఆలయంలోని గణపతి విగ్రహం పూర్తిగా వెండితో కప్పబడి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. 

ఈ ఆలయానికి 1200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. పూజాదికాల కోసం నీటిని తోడే బావి రింగులు ఏళ్ల తరబడి మారక పోవడంతో పాటు ఆలయ కాలానికి పురావస్తు ఆధారాలుగా నిలుస్తున్నాయి. 


💠 ఈ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా, మూడబిద్రి పాలకులచే పోషించబడుతోంది. వాస్తవానికి, మూడబిద్రి రాజు మరియు రాణి, విగ్రహం ముందు ప్రార్థన చేస్తూ ఆలయాన్ని సందర్శించినప్పుడు, రాణి చెవి రింగులు పడిపోయాయని పురాణాలు చెబుతున్నాయి.


💠 వాటిని రాణిగారు విగ్రహానికి నైవేద్యంగా ఇచ్చింది. నేటికీ దుర్గా విగ్రహాన్ని అలంకరించేందుకు చెవి రింగులను ఉపయోగిస్తారు. 


💠 ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీన జరిగే కుంభ మాసంలో వార్షిక రథ  ఉత్సవం జరుగుతుంది.   

నవరాత్రి, దీపోత్సవాలు అమ్మవారికి ఇతర ప్రత్యేక రోజులు.  

జలకా (శాంభవి నదిలో ముంచడం)  పండుగ మరుసటి రోజు జరుగుతుంది.  

 ఫిబ్రవరి 2 మరియు 5 ఫిబ్రవరి బ్రహ్మకలశాభిషేక దినం.


💠  కార్తీక మాసంలో, మాసం అంతా నగర సంకీర్తన నిర్వహిస్తారు, తర్వాత కృష్ణ త్రయోదశి, చతుర్దశి మరియు కార్తీక అమావాస్య నాడు లక్ష దీపోత్సవాలలో దీపోత్సవం నిర్వహిస్తారు.

మాధ్వ నవమి, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన, శ్రీ వాదిరాజ స్వామి పుణ్య తిథి భజనలు మరియు పూజల ద్వారా జరుపుకుంటారు.  గణేష్ చతుర్థి రోజున సార్వజనిక్ గణేశ విగ్రహాన్ని పూజించి, ఐదవ రోజు సాయంత్రం మొసరు కుడికే తర్వాత ఊరేగింపుతో ముండ్కూర్ గ్రామం మరియు ఉడిపి జిల్లా (దొడ్డమనే సమీపంలో) సంకలకరియా సరిహద్దులో శాంభవి నదిలో నిమజ్జనం చేస్తారు.  


💠 నవరాత్రులలో ప్రధాన విగ్రహానికి తొమ్మిది రకాల దుర్గా అలంకారాలు చేస్తారు, ఇది కర్ణాటకలో అరుదైనది. 

 మూలా నక్షత్రం రోజున శ్రీ శారదా విగ్రహాన్ని పూజించి, విజయదశమి నాడు శ్రీ చండికా హవన తర్వాత కుర్కిలబెట్టు బ్రహ్మస్థాన గుండిలో నిమజ్జనం చేస్తారు.  


💠 ఇక్కడ ఊరేగింపులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి మరియు రెండు సందర్భాలలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.  

యుగాది, పంచాంగ శ్రవణం, ఉపాకర్మ, దీపావళి, ధాన్య లక్మీ పూజ/నవన్న భోజనం, బలీంద్ర పూజ, పత్తేనాజ వంటి వేడుకలను ఆలయంలో జరుపుకుంటున్నారు.


💠 ముండ్కూర్ దుర్గాపరమేశ్వరి ఆలయంలో రోజువారీ పూజా సమయాలు - ఉష కళా పూజ ఉదయం 4:30 నుండి 5:30 వరకు; మధ్యాహ్నం 12 గంటలకు మహాపూజ, రాత్రి 8 గంటలకు రాత్రిపూజ

ముదాకరాత్త మోదకం

 . *ముదాకరాత్త మోదకం, సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం, విలాసిలోక రక్షకం, అనాయకైక నాయకం, వినాశితేభ దైత్యకం, నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం*. 


 మోదకమును ఆనందముగా చేతిలో పట్టుకున్న వాడు. మోక్షమును ప్రసాదించు వాడు. చంద్రుడిని తలపై కిరీటముగా ధరించిన వాడు. లోకాన్ని కాపాడేవాడు, నాయకులకే నాయకుడైన వాడు, అసురులను, అశుభాలను నశింప జేసే నాయకుడు అయిన వినాయకునికి సాష్టాంగ ప్రణామము చేస్తున్నాను. తనకు నమస్కరించిన వారి పాపాలను త్వరగా నశింప జేస్తాడో ఆలాంటి గణేషుడిని నేను పూజిస్తున్నాను. 🙏🙏🙏🌷🪷🌹🍎🍏🍊