7, సెప్టెంబర్ 2024, శనివారం

గణానాం పతిః గణపతిః’

 *గణానాం పతిః గణపతిః’* 


జ్ఞానమూర్తి అయిన పరమశివుడు, ఆనంద స్వరూపిణి అయిన శక్తి కలసి ఏకర రూపమై.. వినాయకుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ‘గణానాం పతిః గణపతిః’ అన్నారు. దేవ, దానవ, మానవులందరికీ అధ్యక్షుడూ, ఆరాధ్యుడూ ఆ విఘ్నేశ్వరుడే! 


గణపతిలో సర్వదేవతలూ కొలువయ్యున్నారు. ఆయన ముఖం విష్ణువు, నేత్రాలు శివుడు, నాభి బ్రహ్మ, ఎడమభాగం శక్తి, కుడిభాగం సూర్యుడు’ అంటూ వర్ణించారు తత్త్వవేత్తలు. 


ఇలా సకల దేవతా సమష్టి స్వరూపం మహాగణపతి. అలాగే వేదాలకు ఆదిస్వరూపమైన ఓంకార రూపమే విఘ్నేశ్వరుడు. లలితా సహస్రనామం ‘కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా’ అని స్తుతించింది. 


లోకాలను పీడించే దుష్టశక్తులను రూపుమాపేందుకే పార్వతీపరమేశ్వరులు సంకల్పించి, తమ చూపులతోనే వినాయకుని రూపం దిద్దారట. విఘ్నాన్నే ఆయుధంగా ప్రయోగించి కార్యం సానుకూలం చేయగల విజ్ఞుడు వినాయకుడు. 


విద్య, వినయం, వివేకం ప్రసాదించే వేలుపే వినాయకుడు. దేవ, అసుర, నర, నాగ వర్గాలన్నిటికీ విశిష్టనాయకుడు. 


శరీరంలో మూలాధార చక్రానికి గణపతి అధిదేవత అని స్పష్టం చేసింది పతంజలి యోగశాస్త్రం. అలా భక్తులకు, జ్ఞానులకే కాదు యోగులకు కూడా ఆయన ఆరాధ్యనీయుడు!      

 *🌺వినాయక చవితి శుభాకాంక్షలు*🙏

A.purnachandrarao 

Avn.lakshmi

🙏🌺🙏🌺🙏

                   

           

 

కామెంట్‌లు లేవు: