25, జూన్ 2022, శనివారం

చేతి కర్ర

 దండం దశ గుణం భవేత్.....*


| దణ్డాత్ప్రతిభయం భూయః శాన్తిరుత్పద్యతే తదా |

||నోద్విగ్నశ్చరతే ధర్మం నోద్విగ్నశ్చరతే క్రియామ్ ||


భావము...


చేసిన తప్పుకి దండించబడితే, మళ్ళీ తప్పు చేయడానికి భయపడతారు, అలా తప్పును అరికట్టినట్లవుతుంది. తద్వార ప్రశాంతత నెలకొంటుంది. ప్రశాంతత లేకపోతే, ఉద్వేగములో ధర్మాన్ని ఆచరించలేరు, అలాగే క్రియలు చేయలేరు. కాబట్టి "దండం దశగుణం భవేత్". శాంతి నెలకొనాలంటే దుష్టులు దండించ బడాలి.


మహాభారతం, ఆదిపర్వం, అధ్యాయం 41 - శ్లో. 28 - శమీక ఉవాచ..


"దండం దశ గుణం భవేత్" అంటారు కదా.. ఆ దశ గుణాలు ఏవో తెలియని వారి కోసం పంపుతున్నాను.. తెలుసుకొని  పలువురికీ తెలియ జేయండి..

శ్లో||


| విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషుచ |

|| అంధే తమసి వార్థక్యే దండం దశగుణం భవేత్ ||


అర్థం...


1. వి = పక్షి

2. శ్వా = కుక్క

3. అమిత్ర = శత్రువు

4. అహి = పాము

5. పశుషు = పశువులు

6. కర్ద మేన = బురద

7. జలేనచ = నీటి యందు

8. అంధః = గుడ్డితనమందు

9. తమసి = చీకటిలో 

10. వార్థక్యము = ముసలితనము నందు.. దండము = కర్ర ఉపయోగపడును


భావము...


పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు, వీటిని పారద్రోలుటకునూ, బురదలో, నీళ్ళలో, చీకటిలో, గ్రుడ్డి తనంలో, ముసలి తనంలో అవలంబనంగాను చేతి కర్ర పనికి వస్తుంది. అందు చేతనే "దండం దశ గుణం భవేత్" అంటారు.

common citizen

 When I was Subcollector, Bbsr,one  evening I came back to the Office after my field tour n found that one lady was sitting in front of my office chamber.I requested her to come to my office room n enquired about the purpose of visiting the office. She said ,one application is pending in your Office for extension of permission to sell her land in Bbsr.I immediately called for the case record n found that she had taken extension thrice n this was her 4th application for extension. I wanted to know the reason of obtaining the permission thrice n not selling the land but I was shocked when she gave the reason of taking multiple permissions.After obtaining the first permission to sell the land,her son expired n in subsequent extensions she faced two more mishaps of death of her husband n another son.She wanted to sell the land to settle some loan. I told Mam,pl furnish the affidavit on next day regarding non transaction of the land & she submitted too

n permission was also given on the same day. The lady was no other than Mrs Droupadi Murmu. She is that noble & humble lady,being a former Minister then came to the office like a common citizen for her work. We are proud of her as she is going to be the Head of the Nation.


Sisirkanta Panda 

MIG Colony 

Kalinga Vihar .

పని కోసం సాధారణ పౌరుడిలా

 తప్పక చదవాల్సింది


నేను  భువనేశ్వర్ లో సబ్‌కలెక్టర్‌గా ఉన్నప్పుడు, ఒక సాయంత్రం నా ఫీల్డ్ టూర్ తర్వాత నేను ఆఫీసుకు తిరిగి వచ్చాను, నా ఆఫీసు ఛాంబర్ ముందు ఒక మహిళ ఒంటరిగా కూర్చుని ఉన్నట్లు గుర్తించాను. నేను ఆమెను నా ఆఫీసు గదికి రమ్మని అభ్యర్థించాను.ఇంకా వచ్చిన పని  గురించి అడిగాను.   భువనేశ్వర్ లో తన భూమిని విక్రయించడానికి అనుమతిని పొడిగించడం కోసం మీ కార్యాలయంలో ఒక దరఖాస్తు పెండింగ్‌లో ఉందని ఆమె చెప్పింది. నేను వెంటనే కేసు రికార్డు కోసం కాల్ చేసాను, ఆమె మూడుసార్లు పొడిగింపు తీసుకున్నట్లు గుర్తించాను.  పొడిగింపు కోసం ఇది ఆమె 4వ దరఖాస్తు.  నేను భూమిని అమ్మకుండా మూడుసార్లు అనుమతి పొందటానికి గల కారణాన్ని తెలుసుకోవాలనుకున్నాను, కానీ ఆమె అనేక అనుమతులు తీసుకోవడానికి గల కారణాన్ని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. భూమిని విక్రయించడానికి మొదటి అనుమతి పొందిన తర్వాత, ఆమె కొడుకు మరణించాడు. గడువు ముగిసింది. ఇంకా తదుపరి పొడిగింపులలో ఆమె రెండు కష్టాలను ఎదుర్కొంది.  ఆమె భర్త మరియు మరొక కొడుకు మరణించారు.  ఆమె కొంత అప్పు  ఇంకా  వైద్య ఖర్చులను తీర్చడానికి భూమిని విక్రయించాల నుకుంది.  నేను ఆమెకు చెప్పాను, దయచేసి భూమికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి మరుసటి రోజు అఫిడవిట్  అందించండి అని.  ఆమె అలాగే  సమర్పించింది

 అదే రోజు  అనుమతి కూడా ఇచ్చారు.  ఆ మహిళ మరెవరో కాదు శ్రీమతి ద్రౌపది ముర్ము.  ఆమె ఒక గొప్ప  వినయ శీలి అయిన మహిళ, మాజీ మంత్రి. అయినా  ఆమె తన 

 పని కోసం సాధారణ పౌరుడిలా కార్యాలయానికి వచ్చింది.  ఆమె దేశాధిపతి కాబోతున్నందుకు మేము గర్విస్తున్నాము.


 సిసిర్కాంత పాండా (IAS)

 MIG కాలనీ

 కళింగ విహార్.

 భువనేశ్వర్


సేకరణ: శ్రీ దుర్గా ప్రసాద్ గారు

వైద్యరాజ నమస్తుభ్యం

 శ్లోకం:☝️

*వైద్యరాజ నమస్తుభ్యం*

   *యమరాజ సహోదర I*

*యమస్తు హరతి ప్రాణాన్*

   *వైద్యః ప్రాణాన్ ధనానిచ II*

  - కలివిడంబన శతకం


భావం: యమధర్మరాజు సహోదరుడవైన ఓ వైద్యరాజా! నీకు నమస్కారము. యముడు ప్రాణాలనే తీసుకుపోతాడు, వైద్యుడు ప్రాణాన్నీ, ధనాన్నీ కూడా హరిస్తాడు; కావున నా జోలికి రాకుండా ఉండుటకే నీకు నమస్కారము.🙏

వైద్యవృత్తిని ప్రాణాలను కాపాడేదిగా కాక కేవలం 'ధనసంపాదన' దృష్టితో ఉంటున్న వైద్యల గురించైతే ఇది పూర్తిగా నిజమనిపిస్తుంది.

నాకు ఇంకో జన్మ వద్దు

 *కృష్ణుడు ఓ వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టాడంటే ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి !?*


*అవును! కృష్ణయ్య కర్ణుడి కోసం కన్నీళ్లు పెట్టాడు*

*యుద్ధం లో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు కిట్టయ్య .*


*కర్ణుడు చేసిన దానధర్మాలు అతడిని మృత్యువు ధరి చేరకుండా ఉండడంతో* *కృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్ళి ఒక కోరిక అడిగాడు*


*కర్ణా నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా అని కృష్ణుడు అడిగాడు* 

*కర్ణుడు దానం చేసేసాడు.*


*అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టుకుని నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు అన్నాడు.*


*అందుకు కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు .ఒకవేళ జన్మ ఉంది అంటే అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు.*


**ఆ మాట  వినగానే కృష్ణయ్య కళ్ళు కన్నీటి ధారలై పొంగాయి*. 

*" ఇంత మంచివాడి వేంటయ్యా కర్ణా నువ్వు " అని గట్టిగ కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడు*.


*మనం మంచి మనసున్న వారమైతే చాలు ! ...ఆ భగవంతుడే దిగి వచ్చి తన గుండెలకు మనల్ని హత్తుకుంటాడు*💐🙏🏻🌹

🙏🙏🙏

సర్వేజనాః సుఖినోభవంతు

🙏🙏🙏🙏

లోకాసమస్త సుఖినోభవంతు

🙏🙏🙏🙏🙏

శివలింగ వృక్షం

 శివలింగ వృక్షం


శివలింగ వృక్షం శాస్త్రీయ నామం కౌరౌపిటా గియానెన్సిస్. ఆంగ్ల పరిభాషలో కేనన్ బాల్ ట్రీ అంటారు. ఇది దక్షిణ అమెరికాలోను, దక్షిణ భారతదేశంలోను కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని నాగలింగ వృక్షమని కూడా అంటారు. వీటి పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పం వలె ఉంటుంది.


శివలింగ వృక్షం శివుడి జఠాఝూఠ ఆకృతిలో, వెండ్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి. పుష్పాలు కొమ్మలకు పూయకుండా వెంట్రుకల లాంటి జడలకు పూస్తాయి. పైభాగాన నాగ పడగ కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. శివలింగపుష్పాల్ని నాగమల్లి పుష్పాలుగా, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు. ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయి.


హిందువులు శివలింగపుష్ప రూపంలో, వృక్షరూపంలో శివుడు కొలువై ఉన్నాడని బావిస్తారు. శివలింగపుష్పాలు సర్వదేవతలకు ముఖ్యంగా శివునికి ప్రీతికరం. ఈ పుష్పాలతో శివపూజ చేయడం ప్రతి శివభక్తునికి నిజంగా ఒక వరం. శివలింగపుష్పాలతో శివపూజ చేసిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది, అంత్యమున కైవల్యం పొందునని శివపురాణంలో ఉంది. ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు, తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సుపై లేదా భుజస్కందాలలో మాత్రమే అలంకరించాలి. పాదాలదగ్గర వేయరాదు. పార్వతికి మాంగల్యంలో అలంకరించాలి.

అంత్యక్రియలు

 08)*🏺అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?*


    🙏….. *ప్రతి ఒక్కరు తెలుసుకోండి*..….🤝




*వాస్తవానికి శరీరము ఆత్మ రెండు వేరు వేరు*.


 *కలియుగ ధర్మము ప్రకారము.. మనిషి జీవితకాలము 120 సంవత్సరాలు*.


 *కానీ*......🤷‍♂️


 *ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది*.


*ఆత్మ చెప్పినట్టు శరీరము వినాలంటే... శరీరము ఆరోగ్యము గా ఉండాలి*. 


*శరీరము లో ప్రాణము ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరము చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు.......... ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరము వినే స్థితిలో లేదు*.


*బతికి ఉన్నంత కాలము భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది*. 


*ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరము నుండి ఆత్మ వేరైపోతుంది*.


 *శరీరాన్ని దహనము చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరము లోకి వచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది*.


*పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరము లో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని విప్పి కింద పోస్తారు*.


*ఎందుకంటే........ శరీరాన్ని (పూడ్చిన) కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద..... తన వాళ్ళ మీద....... ఇష్టము తో ఆత్మ ఇంటికి రావాలని తపన పడుతూ ఉంటుంది*.


 *కానీ శరీరము మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే......... ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా 'సూర్యోదయము' లోపు మాత్రమే*..


 *అంతలోపు లెక్కించక పోతే, మళ్ళీ... తిరిగి మొదటి నుండి లెక్కించాలి*.


*శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు*.


 *ఎందుకంటే*......... 


*కుండ నీ శరీరము లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రము నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరము నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాము అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. (పూడ్చేస్తాము)  ఇంకా నీకు ఈ శరీరము ఉండదు, నువ్వు వెల్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతము*.


*హిందూ సాంప్రదాయము లో చేసే ప్రతి పనికి ఓ అర్థము దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ*...


*ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే... ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను. కానీ.. ఎందుకు చేస్తున్నానో తెలియదు*........


*దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థము దాగి ఉంటుంది*.


🙏🔱 *శివోహం* 🔱 🙏