దండం దశ గుణం భవేత్.....*
| దణ్డాత్ప్రతిభయం భూయః శాన్తిరుత్పద్యతే తదా |
||నోద్విగ్నశ్చరతే ధర్మం నోద్విగ్నశ్చరతే క్రియామ్ ||
భావము...
చేసిన తప్పుకి దండించబడితే, మళ్ళీ తప్పు చేయడానికి భయపడతారు, అలా తప్పును అరికట్టినట్లవుతుంది. తద్వార ప్రశాంతత నెలకొంటుంది. ప్రశాంతత లేకపోతే, ఉద్వేగములో ధర్మాన్ని ఆచరించలేరు, అలాగే క్రియలు చేయలేరు. కాబట్టి "దండం దశగుణం భవేత్". శాంతి నెలకొనాలంటే దుష్టులు దండించ బడాలి.
మహాభారతం, ఆదిపర్వం, అధ్యాయం 41 - శ్లో. 28 - శమీక ఉవాచ..
"దండం దశ గుణం భవేత్" అంటారు కదా.. ఆ దశ గుణాలు ఏవో తెలియని వారి కోసం పంపుతున్నాను.. తెలుసుకొని పలువురికీ తెలియ జేయండి..
శ్లో||
| విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషుచ |
|| అంధే తమసి వార్థక్యే దండం దశగుణం భవేత్ ||
అర్థం...
1. వి = పక్షి
2. శ్వా = కుక్క
3. అమిత్ర = శత్రువు
4. అహి = పాము
5. పశుషు = పశువులు
6. కర్ద మేన = బురద
7. జలేనచ = నీటి యందు
8. అంధః = గుడ్డితనమందు
9. తమసి = చీకటిలో
10. వార్థక్యము = ముసలితనము నందు.. దండము = కర్ర ఉపయోగపడును
భావము...
పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు, వీటిని పారద్రోలుటకునూ, బురదలో, నీళ్ళలో, చీకటిలో, గ్రుడ్డి తనంలో, ముసలి తనంలో అవలంబనంగాను చేతి కర్ర పనికి వస్తుంది. అందు చేతనే "దండం దశ గుణం భవేత్" అంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి