11, జులై 2020, శనివారం

శ్రీ కాశీ గాయత్రీ ఆశ్రమ సేవా సొసైటీ

ఉత్తర భారత దేశంలో భువిపై వెలసిన కైలాసమే కాశీ క్షేత్రం. అంతటి మహిమాన్వితమైన కాశీ యాత్రకు విచ్చేసే భక్తజనుల సౌకర్యం కోసం మన తెలుగు ్యక్తి, శ్రీ గాయత్రీ మాత ఉపాసకులు అయిన శ్రీ అబ్బూరు హరి హర శాస్త్రి గారు, శ్రీ శ్రీ శ్రీ మహాదేవి మాతాజీ గారు కలిసి మన తెలుగు వారికి కొన్ని అరుదైన సేవలను అందిస్తున్నారు.

దక్షిణ భారత దేశం నుండి వచ్చే యాత్రికులకు అందుబాటు ధరలలో వసతి కల్పించాలని, నిత్యాన్నదానం నిర్వహించాలనే గొప్ప ఉద్దేశ్యంతో నెల్లూరుకు చెందిన *శ్రీ శ్రీ శ్రీ అబ్బూరు హరిహర శాస్త్రి గారు తమ మాతాపితరులైన శ్రీ అబ్బూరి రామమూర్తి, శ్రీమతి సరోజమ్మ దంపతుల పేరున ఈ ఆశ్రమాన్ని నెలకొల్పి నిర్వహిస్తున్నారు.                             
  మన తెలుగు వారికి వసతి కల్పించే ఆశ్రమాలు కాశీలో బహు తక్కువ, దానితో మన తెలుగు యాత్రికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శ్రీ కాశి గాయత్రీ ఆశ్రమ సేవా ట్రస్టు ద్వారా ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.శ్రీ కాశీ విశ్వేశ్వరుని మందిరానికి కేవలం 1 కిలోమీటర్ల దూరంలోనే శ్రీ కాశీ గాయత్రీ ఆశ్రమ సేవా సొసైటీ నిర్మించారు. కాశీ యాత్రకు వచ్చిన భక్తులు తమ కాశీ యాత్రను సంపూర్ణంగా ఫలప్రదం చేసుకొనేలా చేయడమే మా ముఖ్య ఉద్దేశ్యం.

మా ఆశ్రమంలో సదుపాయాలు....

⏩ కాశీ యాత్రకు వచ్చే భక్తులకు అందుబాటు ధరలలో వసతి ఏర్పాటు. ఏ.సి, నాన్ ఏ.సి రూములు, అతి తక్కువ ధరలకే సింగిల్ బెడ్ లు,గదులు కేటాయింపు.

⏩ 2, 3, 5 పడకలు గల రూములు కలవు. (600/-,800/-, 1200/-,లకే వసతి కల్పించబడును)

⏩ AC రూములు కేవలం 1400, 1600/- లకే కేటాయించబడును.

వాహన సదుపాయం :

⏩ కాశీ, కాశీ లోకల్, అలహాబాద్, గయ, బుద్ధ గయ, అయోధ్య, నైమిశారణ్యం... మొదలైన పుణ్య క్షేత్రాలకు మీ కోరిక పైన వాహన సదుపాయం ఏర్పాటు చేస్తాము.

అబ్బూరు హరి హర శాస్త్రి గారి ఆధ్వర్యంలో :

⏩ కాశీ విశ్వేశ్వరుని అభిషేకము / మాతా అన్నపూర్ణ కుంకుమార్చన / అన్ని రకముల పితృ పూజలు జరిపించబడును.

⏩ మీ పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజులలో మీ కోరికపై శ్రీ కాశీ విశ్వనాధునికి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చనలు జరిపించి ప్రసాదం పోస్టు ద్వారా పంపిస్తాము. దీనికై ముందుగా మమ్ములని సంప్రదించగలరు.

నారాయణ సేవ (అన్నదానం)

⏩ దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ మహాదేవి మాతాజీ గారి ఆధ్వర్యంలో మా ఆశ్రమంలో ప్రతీరోజూ నారాయణ సేవ (అన్నదానం) జరుగుతున్నది.

⏩ ఎవరైనా పుట్టిన రోజు / వివాహ రోజు / పితృదేవతల రోజున వారి గోత్రనామాలచే అన్నదానం జరిపించాలని అనుకునేవారు మమ్మల్ని సంప్రదించగలరు.

శ్రీ కాశీ గాయత్రీ బ్రాహ్మణ సేవా ఆశ్రమం & నిత్యాన్న క్షేత్రం..

బ్రాహ్మల కొరకు కాశీలో శ్రీ కాశీ గాయత్రీ ఆశ్రమ సేవ సొసైటీ తరపున ప్రత్యేక ఆశ్రమం ఏర్పాటు చేసాము.

⏩ ఈ ఆశ్రమంలో బ్రాహ్మణుల కొరకు ప్రత్యేక నారాయణ సేవ (అన్నదానం) జరుగుతుంది. ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 నుండి 02:30 వరకూ మరియు రాత్రి 07:30 నుండి 09:30 వరకూ నారాయణ సేవ జరుగుతుంది..

⏩ బ్రాహ్మణులు అనుష్ఠానం చేసుకొనుటకు ప్రత్యేక సదుపాయాలు కలవు.

మా భవిష్యత్తు కార్యాచరణలు :

⏩ ఉచిత వేద విద్య

⏩ ఉచిత భాషా తరగతుల నిర్వహణ

☎ ఈ విషయాలలో మీకు ఎలాంటి వివరాలు కావలసినా సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్లు:
+91 8919123647
+91 9936764525
+91 9918774933
web: http://kasiyatramokshayatra.com

Email: sethu2kasi@gmail.com


సంప్రదించవలసిన అడ్రస్:
శ్రీ కాశీ గాయత్రీ సేవ సొసైటీ,
శ్రీ కాశీ గాయత్రి ఆశ్రమం,
అబ్బూరు హరి హర శాస్త్రి,
D 47 /2B 2G,
PDR మాల్ దగ్గర,
రామాపుర, వారణాసి.
PIN 221001

NOTE: ఇది నాకు ఒక వాట్సాప్ గ్రూపులో వచ్చిన సమాచారం.  దీనిలోని నిజా నిజాలు నాకు తెలియవు.  ఎవరైనా మీరు తెలుసుకొని మీకు ఉపయుక్తంగా ఉంటే లబ్ది పొందగలరు.
ఈ సొసయిటీకి ఈ బ్లాగుకు ఎలాంటి సంబంధం లేదు 

నిత్యా ఈశ్వర దర్శనం

ఈశ్వరుడు, మనిషికి ఎనిమిది ప్రత్యక్ష రూపాలలో నిత్యమూ దర్శనమిస్తూనే ఉన్నాడంటాడు కాళిదాస మహాకవి. ‘అభిజ్ఞాన శాకుంతలమ్’ నాటకం నాంది శ్లోకంలో.
యా సృష్టి – స్రష్టురాద్యా, వహతి విధిహుతం
యా హవిః – యా ఛ హో త్రీ,
యే ద్వే కాలం విధత్తిః, – శ్రుతి విషయ గుణా  
యా స్థితా వ్యాప్య విశ్వం,
యాం-ఆహుః సర్వ బీజ ప్రకృతిః – ఇతి,
యయా ప్రాణినః – ప్రాణవంతాః,
ప్రత్యక్షాభిః – ప్రపన్నః – అనుభిః – అవతు – వః
తాభి రష్టాభి రీశః!
ఈశ్వరుడికి ఎనిమిది ప్రత్యక్ష స్వరూపాలు. మొదటిది సృష్టికర్త సృష్టించిన మొదటిసృష్టి. అంటే జలం. నీరు. రెండవది, యథావిధిగా హోమం చేయబడ్డ హవిస్సును దేవతల కందజేసే అగ్ని. ‘అగ్నిముఖావై దేవాః’ అని శ్రుతి.
మూడోది, యా చ హోత్రీ. యజ్ఞం చేసె యజమాని రూపం. యజ్ఞంలోక క్షేమం కోసం మాత్రమే చేసె పుణ్య కార్యం కనుక ఆ యజ్ఞం జరిగేంతసేపూ, యజ్ఞకర్త అయిన యజమానిని శివుడి ప్రత్యక్ష రూపంగా భావిస్తారు. యాజమాన-ఆహ్వాయా మూర్తిః విశ్వస్య శుభాదాయినీ. యజమాని అనే పేరుగల మూర్తి జగత్ సంక్షేమం చేకూర్చగలదు.
నాలుగూ, అయిదూ రూపాలు కాలాన్ని నియంత్రించే సూర్య చంద్రులు. ఆరో ప్రత్యక్షరూపం, శబ్ద విషయం గుణంగా కలిగి విశ్వమంతా వ్యాపించి నిలిచినా ఆకాశం. ఏడోది, ఈ పృథ్వి. ఇది సర్వబీజాలకూ వృద్ధికి మూలం కదా, ఈశ్వరుడి ఎనిమిదో ప్రత్యక్షరూపం వాయువు. యయా ప్రాణినః ప్రాణవంతః. దేనివల్ల నయితే ప్రాణులకు ప్రానమనేది కలుగుతుందో, ఆ ప్రాణవాయువు ఈశ్వర స్వరూపమే గదా!
ఈ ఎనిమిది ప్రత్యక్ష రూపాలుగల ఆ ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక, అని మహాకవి కాళిదాసు ప్రార్థన.
ఆ స్వామి మనల్ని తప్పకుండా కాపాడుతాడు.

జీవిత వ్యాపారం

అరటిపండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి , రాత్రికి ఇంటికి వెళ్లే ముందు మిగిలిన సరుకులలో నుండి పాడైనవి...  కుళ్ళిపోయినవి తీసేస్తాడు.నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు.

మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు.వాటినీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు.

'అయ్యో! పడేస్తున్నాననే బాధ ఉండదు.వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది...'

జీవితానుభవాలు అంతే...

బాధ కలిగించే ఆలోచనలను,  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మనసులోంచి తీసేయాలి...

ఏరోజు చిట్టాపద్దులు ఆరోజే పూర్తి చేయాలి...క్షమించాల్సిన వాటిని క్షమించాలి...సానుభూత చూపాల్సిన వారిపై సానుభూతి చూపాలి... విస్మరించిన వాళ్లను విస్మరించాలి... ప్రశంసించిన వాళ్లను ప్రశంసించాలి...

మంచి అనుభూతులను చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి...

చెత్త వెళ్లిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది...

✍చిరునవ్వు ,ఆనందం కవల పిల్లలు...ఒకటి లేకుండా మరొకటి లేదు..

చిన్న కథ

వెన్నెల అనే అందమైన అమ్మాయికి పెళ్ళి కుదిరింది..
చదువు, అందం , ఆస్తి, సాంప్రదాయం అన్ని ఉన్న అమ్మాయి కనుక మగపెళ్ళివారు చూడగానే ఒప్పుకున్నారు.

ఆ అమ్మాయి పెళ్ళి కొడుకుతో మాట్లాడాలి అన్నది...సరే ఇద్దరూ కూర్చున్నారు...
వెన్నెల అన్నది " పెళ్ళికి నాది ఒకే ఒక షరతు " 
అతను కుతూహలంగా  చూసాడు. "అది ఏమిటంటే  మీరు ఏమాట మాట్లాడాలనుకున్నా  సరే,
 అంటే విపరీతమైన కోపం వచ్చినా, టెన్షన్ వచ్చినా,విసుగ్గా వున్నా,ఏదైనా అసలు నచ్చకపోయినా సరే కానీ గొంతు పెంచి మాట్లాడకూడదు. మీరు ఏం మాట్లాడాలనుకున్నా సరే మెల్లగా అనాలి అంతే ! అలా కాకుండా గొంతు పెంచి అరిస్తే నేను పుట్టింటికి వచ్చేస్తాను ఆ పై నన్ను ఏమీ అనకూడదు" అన్నది.

అతనికి కొంచెం వింతగా అనిపించినా తిట్టవద్దు అనలేదు కదా కొంచెం గొంతు తగ్గించమంటున్నది ఫర్వాలేదు అనుకున్నాడు.
పెళ్ళి అయిపోయింది, వెన్నెల పెట్టిన షరతు అత్తగారింట్లో తెలిసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
పొద్దున్నే ఇద్దరికీ ఆఫిస్ హడావిడి " వెన్నెలా కాఫీ అడిగి ఎంతసేపయింది ???" హాలులో కూర్చుని అరిచాడు"  దానికి ఆమె మెల్లగా మిమ్మల్ని కలుపుకోమన్నాను కదా" అన్నది వెన్నెల.
" నేనా ?  కాఫీ కలుపుకోవాలా??ఇంక పెళ్ళి చేసుకున్నది దేనికి  ??? అని "మెల్లగా అన్నాడు 
వెన్నెల నవ్వేసింది " 

మీరు పెళ్ళికి ముందు షరతు పెట్టాల్సింది నా కాఫీ ఎప్పుడూ నువ్వే పెట్టాలని" అతను కూడా నవ్వేసాడు.

రెండు నెలల తరువాత వెన్నెల, తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళికి బంగారు నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వాలని తెచ్చింది. అంత ఖరీదైన బహుమతి తనకి చెప్పకుండా తేవడంతో అతని కోపం తారాస్థాయికి చేరుకుంది.
"సంపాదిస్తున్నానని  అంత పొగరా? కనీసం నాకు చెప్పకుండా" అని
ఎంత పెద్దగా అన్నాడో అతనికే తెలియలేదు. 

ఒక్కక్షణం మౌనంగా వుండి, వెన్నెల అన్నది "ఇదే మాటని మళ్ళీ చెప్పండి,మెల్లగా" 
 ఒక్క నిమిషం ఆగి అతను అన్నాడు, నిజమే ! నీ ఫ్రెండ్ 
పెళ్ళి  కాదనను కానీ నాకు ఒక్క మాట చెప్పిఉండాల్సింది సరేలే అన్నాడు. అప్పుడు
వెన్నెల, తను నా పెళ్ళిలో డైమండ్ రింగ్ ఇచ్చింది తెలుసా  అన్నది శాంతంగా.

ఓ..కే.. ఇకనుంచి మీ ఫ్రెండ్స్ విషయంలో నేను జోక్యం చేసుకోను అన్నాడు అతను.

వారి వివాహం అయి ఒక సంవత్సరం అయింది,గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. బంధువులు, మిత్రులు వచ్చారు. అందులో ఎవరో ఒకరు అతనిని ప్రశ్నించారు.
"మీ వైవాహిక జీవితం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి అయింది కదా ! మీ ఆనంద రహస్యం ఏమిటి ?? అని"

దానికి అతడు "ఏమీ లేదు, నా భార్య నా గొంతు నొక్కేసింది అంతే !" అన్నాడు. 

అందరూ నవ్వారు.
అంటే ఏమిటి ? ఎవరో కుతూహలంతో అడిగారు..
అతను వివరించాడు ఈవిధంగా   
అందరికీ ఉపయోగపడే సూత్రం చెబుతాను వినండి...

ఏ భావావేశమైనా గొంతు పెంచి మాట్లాడవద్దు. గొడవలు వాటంతట అవే సమసి పోతాయి ఇక వాదన పెరగదు. కోపం తారాస్థాయికి చేరుకోదు. నా భార్య నా గొంతులో సైలెన్సర్ బిగించిందిఅంతే జీవితం సాఫీగా సాగిపోతున్నది అన్నాడు.

అందరూ ఆమెను అభినందించారు. అతను ఆమెను గర్వంగా చూసాడు.

ఇప్పుడు నీతి ఏమంటే.,

చాలా వరకూ సమస్యలు పరుష పదజాలంతో రావు, వాటిని పలికే స్థాయితో వస్తాయి.
"ఈ కూర ఇట్లా తగలడిందేమిటి ?" అనే మాటని పెద్దగా అనండి... అలాగే చిన్నగా అని చూడండి 😂
తేడా మీకే అర్థం అవుతుంది.

పెద్దగా అరవటంవలన మన బి.పి.పెరుగుతుంది మనసులో అశాంతి, ఎదుటివారితో దూరం పెరుగుతుంది వారి మనసుని గాయపరుస్తాము, అది వారు ఏనాడూ మర్చిపోరు.
అదే గొంతు మార్చి కలిగే  లాభాలు చూడండి, మీకే అర్థం అవుతుంది .👍🏼

👉🏼ధర్మస్య విజయోస్తు🙌🏼
👉🏼అధర్మస్య నాశోస్తు🙌🏼
👉🏼ప్రాణిషు సద్భావనాస్తు🙌🏼
👉🏼విశ్వస్య కళ్యాణమస్తు🙌🏼

మద్రాసులో ఎర్ర కట్టడాలు


మదరాసు ప్రశస్తి నమ్మలేని కథలతో ఏర్పడినది కాదు. నిజమైన ఆసక్తికరమైన సంఘటనలతో ఏర్పడిన నగరం.

మదరాసు నగర కథలకు చరిత్ర పుస్తకంలో ప్రత్యేక పుటలు ఉన్నాయన్నది అతిశయోక్తికాదు. 

ఆంగ్లేయులు మదరాసుకు వచ్చిన తర్వాత indo saracenic కట్టడ కళ ప్రవేశపెట్టడం జరిగింది.

ప్రభుత్వ కట్టడాలు, ఉన్నత పదవులలో ఉన్న ప్రభుత్వ అధికారుల భవంతులూ ఈ ఇండో సారసెనిక్ పద్ధతిలో నిర్మించేవారు.

మొగఘలాయ భవన నిర్మాణ తీరుతెన్నులతో పాటు భారతీయుల దేవాలయాల కట్టడాలను కలిపి ఈ ప్రత్యేకమయిన కట్టడ కళను ఆంగ్లేయులు రూపొందించారు.

అప్పట్లో ఐరోపియన్లు భారత దేశ చిత్రకళా సంపదను చూసి ఆశ్చర్యపోయేవారు.
ప్రత్యేకించి ఇక్కడ బ్రహ్మాండమైన కోటలను, భవనాలను, ఆలయ కట్టడాలను ఆశ్చర్యంగా చూసేవారు. అలాగే ఆలయ కట్టడాలపై చెక్కిన శిల్పాలు వారిని అమితంగా ఆకట్టుకునేవి. ఈ కట్టడాలన్నింటిని మేళవించి వారు సృష్టించిన ఆర్కిటెక్ కి పెట్టిన పేరే indo saracenic కళ.

ఈ పద్ధతిలో నిర్మించిన భవనాలలో నూటికి తొంభై శాతం వరకూ ఎర్ర రంగులో ఉండేవి.
అందుకే వీటిని ఎర్ర కట్టడాలు రెడ్ బిల్డింగ్స్ అనేవారు.

అయినా కొన్ని భవనాలు శ్వేత వర్ణంలో ఉండేవి.

మొఘలాయుల కాలంలోనే ఇలాంటి కట్టడాలు లేకపోలేదు. అనేక కోటలు ఎర్ర రంగులో ఉండేవి. తాజ్ మహల్ వంటి కట్టడాలు శ్వేత రంగులో ఉండేవి.

కానీ ఆంగ్లేయుల పాలనలో నిర్మించిన ప్రభుత్వ కట్టడాలు చాలా వరకు ఎర్ర రంగులో దర్శనమిచ్చేవి. దేవాలయాలు శ్వేత వర్ణంలో కనిపించేవి.

భగవంతుడు ఉండే చోటు పవిత్రమైనదని చెప్పడానికి శ్వేత వర్ణ భవనాలు, ప్రభుత్వాధికారాన్ని ఎర్ర (రక్తవర్ణం) రంగు కట్టడాలుగా చిత్రకారులు బొమ్మలు గీయడం గమనార్హం.

వందల సంవత్సరాలైనా ఇప్పటికీ మద్రాసు మహా నగరంలో ఈ కట్టడాలు చెక్కుచెదరక కనిపించడంలో బ్రిటీష్ వారి ప్రజ్ఞను ప్రశంసింంచక తప్పదు. వారి పర్యవేక్షణలో కట్టడ పనుల బాధ్యతలను భారతీయులకే ఇచ్చేసేవారు.

చాలా ధరకు ఈ కట్టడాలలో స్తంభాలను చూడవచ్చు.

వాటికోసం లెక్కలేనన్ని చెట్లు ఖావలసి వచ్చేవి.  ఆ రోజుల్లో చాలా వరకు నాట్టుకోట్టయ్ చెట్టియారులు సముద్ర ప్రయాణం చేసి బర్మా, సింగపూర్, మలేసియా తదితర ప్రాంతాలలో వ్యాపారాలు చేస్తుండేవారు.

కట్టడాలకు కావలసిన నాణ్యమైన శ్రేష్టమైన బర్మా టేకును ఎంపిక చేసి ఆ దేశం నుంచి తీసుకురావడానికి ఈ చెట్టియార్లు సాయపడేవారు.

అలాగే భారత కాంట్రాక్టర్లు తక్కువ కూలీకి ఎక్కువ ననులు చేసే వారిని గుర్తించి వారితో కట్టడాల పని కానిచ్చేసేవారు.

ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో అధిక శాతం కట్టడాలు ఉన్న ప్రాంతంగా మద్రాసు చరిత్రపుటలకెక్కింది.

వీరి హయాంలో దాదాపు రెండు వేలకు పైగా కట్టడాలుండేవి. వాటిలో కొన్నింటిని ఆధునీకరించారు.

విలియం హోడ్జస్, డేనెల్ అనే ఇద్దరి చిత్రాలను ఆధారంగా చేసుకుని కట్టిన మొదటి indo saracenic భవనం మద్రాసులోని చేపాక్ భవనం. ఇది ఆర్కాట్ నవాబుల అధికారిక నివాసం.

అనంతరం మన దేశమంతటా ఇటువంటి ఎర్ర రంగు కట్టడాలు నిర్మితమయ్యాయి..

దక్షిణ భారత దేశంలోని మొట్టమొదటి రైల్వే నిలయమైన రాయపురం స్టేషన్ ని ఈ indo saracenic పద్ధతిలోనే నిర్మించారు..

మద్రాసులోని సెంట్రల్ రైల్వే స్టేషన్, జనరల్ పోస్టాఫీసు కార్యాలయ భవనం, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయ భవనం,
మద్రాసు హైకోర్టు భవనం, సెయింట్ హౌస్, మద్రాసు విశ్వవిద్యాలయం, గిండీ ఇంజినీరింగ్ కాలేజీ, ఎగ్మూరులోని ప్రభుత్వ.మ్యూజియం, రిప్పన్ బిల్డింగ్ ( సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలో), మౌంట్ రోడ్డులోని హిగ్గిన్ బాతమథమ్స్ (శ్వేతవర్ణం) , సెయింట్ జార్జ్ కోట, అమీర్ మహల్, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ మొదలైన కట్టడాలన్నీ ఇప్పటికీ అలానే చూడవచ్చు.

అలాగే విక్టోరియా భవనానికో ప్రత్యేకత ఉంది. మద్రాసులో మొట్టమొదట సినిమాలను ప్రదర్శించింది విక్టోరియా ఆడిటోరియంలోనే. మద్రాస్ ఫోటోగ్రాఫిక్ స్టోర్ యజమాని డి. స్టీవెన్సన్ పది లఘు చిత్రాలను ఇక్కడ ప్రదర్శించారు.

1892 లో మద్రాసు విక్టోరియా ఆడిటోరియంలో జరిగిన మహా జన సభకు చరిత్ర పుటలలో ప్రత్యేక స్థానముంది. ఈ సభకు నీలగిరి ప్రతినిధిగా పాల్గొన్న అయోధిదాస పండితుడు అంటరానివారికి కూడా ఆలయప్రవేశం కల్పించాలని తన వాణి వినిపించారు.

ఇదే విక్టోరియా ఆడిటోరియంలో మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, గోపొల కృష్ణ గోఖలే, తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతియార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులు ప్రసంగించారు. అలాగే తమిళులు శంకరదాస్ స్వామి, పమ్మల్ సంపత్ ముదలియార్ వంటివారు తమ నాటకాలను ప్రజర్శించారిక్కడ.

ఇక రాయపేటలో indo saracenic పద్ధతిలో నిర్మితమైన అమీర్ మహల్ భవనం ఆర్కాట్ నవాబు వంశీయులకు చెందినది. ఈ భవనం నుంచే ఆంగ్లేయులు తమ కార్యక్రమాలను కొనసాగించారు. ఈ భవనంలో మొత్తం డెబ్బయ్ గదులున్నాయి.

మద్రాసులోని రిప్పన్ బిల్డింగుని శ్వేత భవనం అని కూడా అంటారు. దీని రూపకర్త
హారిస్. నిర్మించింది లోకనాథ్ ముదలియార్. ఇది నిర్మించడానికి నాలుగేళ్ళు పట్టింది.
ఈ భవనంపైన కనిపించే గడియారాన్ని 1913 లో వోక్స్ అండ్ కో తయారు చేసింది.
నగర పాలన నిర్వహణకు మూలకర్త అయిన రిప్పన్ పేరుని ఈ భవనానికి పెట్టారు.

 - యామిజాల జగదీశ్

హయగ్రీవుడు

విద్యకు అధిపతి హయగ్రీవుడు
సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు, ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి అని అంటూ వుంటారు. అలా తన భక్తులను చల్లగా చూడటం కోసమే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. అలాంటి అవతా రాల్లో 'హయగ్రీవావతారం' ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు ... బ్రహ్మదేవుడి గురిం చి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారాన్ని పోలి నవారి చేతిలో మాత్రమే తన కి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు.

వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను నానార కాలుగా హింసించ సాగాడు. దాంతో దేవత లంతా ఆది దంపతులను శరణువేడారు. యోగ నిద్రలో వున్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డంకింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపాడు.వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల ... శరీరం నుంచి వేరై పోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. అమ్మవారితో సహా దేవాధి దేవతలు తమ జ్ఞానాన్ని ... శక్తి సామర్ధా్యలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు.

 ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా ... జ్ఞానప్రదాతగా పూజలు అందు కుంటున్నాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతా రాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య - విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

* విద్యార్థులకు జ్ఞానప్రదాత*
-----------------------------
గుర్రం శిరస్సును పొందిన నారాయణుడుకి సమస్త దేవతలు తమ జ్ఞాన శక్తిని ధారపోస్తారు. దాంతో హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడతాడు. అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది. నారాయణుడు ... హయగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధి స్తారో, వాళ్లకి జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారనీ ... విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి పలుకుతుంది. ఆ రోజు నుంచి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా పూజాభిషేకాలను అందుకుంటున్నాడు. అందువలన విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవస్వామిని ఆరాధిస్తూ వుండాలి. ఆయన అనుగ్రహంతో అభివృద్ధిని సాధిస్తూ వుండాలి.

" జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్‌
   ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే "

జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము. ఈ హయగ్రీవావతారం కూడా మహావిష్ణువుదే. ఒకసారి ఓ రాక్షసుడు తన లాంటి వాడితోనే తనకు మరణం సంభవించాలని కోరుకుంటే ఆ దానవుడి కోరిక తీర్చటానికి మహావిష్ణువు హయగ్రీవావతారు డయ్యాడని ఓ కథనం. ఓ సారి మహా విష్ణువు దానవులతో పోరు సల్పి చాలా అలసిపోయ తన చేతిలోని ధనస్సునే ఆధారం చేసుకొని నిద్రపోయాడు. నిద్రాదేవి ఒడిలో సేదతీరుతున్న మహావిష్ణువును మేల్కొపడానికి ఏ హేతువు కన్పించక ఇంద్రాది దేవతలు చెదపురుగును ధనస్సుకున్న అల్లెత్రాడును కొరకమన్నారట. ఆ శబ్దం వల్ల మహావిష్ణువు మేల్కొంటాడన్న ఆశతో. కానిచెదపురుగు కొరు కుడు వల్ల మహావిష్ణువుకు నిద్రాభంగమేకాక కంఠం కూడా తెగిపోయంది.
ఇక అపుడు ఏమి చేయాలో తోచక పరాశక్తిని వేడుకొంటే ఆ తల్లి అశ్వముఖాన్ని మహావిష్ణువుకు అతికించమని చెప్పిందట. ఆ అమ్మచెప్పినట్టుగా దేవతలు చేయగా హయగ్రీవవతారుడయనాడు మహావిష్ణువు. ఆ పైన ఆ వేదాలను అపహరించిన హయగ్రీవుడను రాక్షసునితో పోరాడి మహావిష్ణువు విజయం సాధించాడు. రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది.అశ్వ ముఖంతో, మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భు జాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్త్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి హయగ్రీవావతారాన్ని చూచిన దేవ తలందరూ చేతులెత్తి మొక్కారు. ఈ అవతారాన్ని కొలిచినవారికి జ్ఞానం అపారంగా కలుగుతుందని పురాణ వచనం. ఈ తండ్రిని కొలవడం వల్ల విద్యార్థులకు విద్యనే కాదు అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుంది. భూవివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించ బడుతాయి. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హయగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు.
* హయగ్రీవ ప్రస్థావన*
------------------------
దేవీ పురాణం, స్కాంధ పురాణం, శ్రీమద్భాగవతంతోపాటు ఆగమ శాసా్తల్ల్రో హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతినాడే ప్రారంభిస్తారు. విద్యార్థులందరూ ఈ రోజున హయగ్రీవుని అర్చించాలి. లౌకిక, పారలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన శీఘ్ఫ్రలకరం.
హాయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి.
హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. యాలకుల మాలను ధరింపజేసి శనగలు, గుగ్గుళ్ళను తయారుచేసి నివేదించాలి. మరియు తెల్లపూవులతో పూజించాలి. మరీ ఎక్కువ వాసన కలిగించే పుష్పాలతో పూజించకూడదు. ఇలా శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది. సకలైశ్వర్యాలను కలిగించే హయగ్రీవ పూజ చేయడానికి స్త్రీపురుష తారతమ్యం లేదు.కానీ ఈ రోజు ఉప్పులేని ఆహారాన్ని మాత్రం స్వీకరించాలి.

* సరస్వతికి గురువు*
-----------------------
సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. అందుకే శుద్ధ పూర్ణిమనాడు హయగ్రీవారాధన విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. హయగ్రీవోపాసన చేసిన వారికి సకలవిద్యలూ కరతలామలకం అవుతాయ. విశ్వశ్రేయోదాకమైన వేదాలను రాక్షసుల చేతిలో పడనీయక హరియే హయగ్రీవునిగా అవతరించిన ఈ రోజు మనం కూడా హయగ్రీవుని పూజించి ధర్మ సంస్థాపనకు మనవంతు చేయూతనిద్దాం.తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య - విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

*కుబేర పచ్చ కుంకుమ*

భారతదేశంలో పసుపు కుంకుమలను మంగళకరమైనవిగా సౌభాగ్యచిహ్నాలుగా భావించి పవిత్రంగా చూసుకుంటారు.

ఏ శుభకార్యానికైనా , పూజలకైనా  ముందుగా సిధ్ధం చేసుకునేవి  పసుపు కుంకుమలే.   పసుపులో - 
పచ్చి పసుపు , కస్తూరి పసుపు,  ఛాయ పసుపు కొమ్ములు, దుంప పసుపు  అని పలు రకాలు. 

అలాగే కుంకుమలలో పలు రకాలు వున్నాయి.   ఎరుపు , ముదురు ఎరుపు ,  సింధూరపు
రంగు,  మీనాక్షీ  కుంకుమ( ఈ కుంకుమ మొగలిపూవుల సువాసనతో వుంటుంది) మొ.  ఎక్కువగా వాడుకలో వున్నవి.

కానీ , కుంకుమలో ఆకుపచ్చ రంగు కుంకుమ గురించి ఎప్పుడైనా విన్నారా ?
 దీనినే కుబేరపచ్చ కుంకుమ అంటారు.  

కుబేర పచ్చ కుంకుమ ప్రత్యేకత  కలది.  ఆ కుంకుమని ఎలా  పూజించాలో కూడా తెలుసుకుందాము. 
పురాణాలలో వర్ణించబడిన ఈ కుంకుమ 
కుబేరునికి ప్రీతికరమైనది . అలాగే ప్రీతికరమైన రంగు
కూడా యీ పచ్చ రంగే.

దీనిగురించి శివపురాణం
యిలా వివరించింది. 

పరమశివుని
 భక్తుడైన కుబేరుడు
ఒకసారి కైలాసానికి వెళ్ళాడు. ఏకాంతంగావున్న శివపార్వతులను చూశాడు.
నిత్యం దేవిని  పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆనాడు
అంబికను దర్శించగానే
కామవికారానికి  
లోనయ్యాడు. ఒక్క క్షణం ఆవిడను తన
భార్యగా వూహించుకున్నాడు.

సర్వం తెలిసిన సర్వేశ్వరునికి 
కోపం వచ్చింది, శివుని
అర్ధభాగమైన సతీదేవి ఉగ్రురాలైనది.
ఇద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు. 
ఆ చూపుల తీక్షణతకు
కుబేరుని దేహంకాలి కమిలిపోయింది. 
కుబేరుడు గడగడా వణికి పోయాడు .
పరమశివుని కాళ్ళపైబడి మన్నించమని
వేడుకున్నాడు. 

" మా ఇద్దరి కోపం వలన  ఏర్పడిన యీ ఉగ్రత  , మాఇరువురి శాంత స్వరూపాలు ఒకటైనప్పుడు
చల్లదనంగా మారుతుంది.
ఆ చల్లదనమే  నీ దేహాన్ని తాకి
 నీ చర్మం
 కమిలిపోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది"  అని  పరమేశ్వరుడు  దీవించాడు.

పరమేశ్వరుడే గతి అని
స్తోత్రాలతో స్తుతించ సాగాడు.
శీఘ్రంగా నే పార్వతీ పరమేశ్వరులు కుబేరుని కరుణించారు.  వారి అనుగ్రహంతో శరీరానికి స్వస్ధత చేకూరింది. 
అయినా శరీరం కాలిన ప్రదేశాలలో  తప్పుకి శిక్ష గా మచ్చలు శాశ్వతంగా వుండిపోయాయి.

పరమేశ్వరుని కంఠం చుట్టూగల  నీలం వర్ణం, పార్వతీ దేవి పసిమి ఛాయ (అంబిక మంగళరూపిణిగా దర్శన మిచ్చినప్పుడు, పసుపు వర్ణంగానే  దర్శనమిస్తుంది.  ఆ పసుపు వర్ణాన్ని  ..తన దేహానికి పసుపు నలుగుపెట్టి తీసిన
పసుపుతో  వినాయకమూర్తిని  చేయడం మనకు  తెలుసు. )
ఈ నీల వర్ణం , ఆ పసుపు వర్ణం రెండూ కలసినప్పుడు అక్కడ
ఒక అద్భుతం  జరిగింది. 
ఆ  రెండింటి కరుణా కిరణాలు పడిన 
ప్రదేశంలోని మట్టి అంతా ఆకుపచ్చగా మారి పోయింది. 
( నీలం..పసుపు  రంగులను మిశ్రం చేస్తే
ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది) .
 కుబేరుడు ఆ ఆకుపచ్చ మట్టిని తన శరీరానికి పూసుకోగానే మాడి కమిలిన దేహమంతా మామూలు స్థితిని పొంది శివపార్వతుల ఆగ్రహంనుండి
విముక్తి పొందాడు .
అంతే కాకుండా పచ్చమట్టిని
తన పట్టణానికి తీసుకొని వెళ్ళి , నిత్యం శరీరానికి
ధరించేవాడు.  ఆనాటి
నుండి పచ్చ వర్ణం కుబేరునికి ప్రీతిపాత్రమయింది. పచ్చని రంగు కుంకుమ
కుబేర చిహ్నంగా  మారింది. 

మహావిష్ణువు వర్ణం కూడా పచ్చనిదేనని పురాణాలు తెలుపుతున్నాయి. 
పరమ భక్తులైన ఆళ్వార్లు
" పచ్చమామలై పోల్  మేని" ( పచ్చని పర్వతం వంటి గంభీరాకృతి కలవాడు) గలవాడు విష్ణువు
అని కీర్తించారు.

శ్రీమన్నారాయణునికి పచ్చని వర్ణం
ఎలా వచ్చిందంటే .. పాలకడలిలో  శయనించే శ్రీమహావిష్ణువు,
ఆకాశం నుండి ప్రసరించబడే
నీలవర్ణాన్ని తాను ధరించి నీలవర్ణ మేఘశ్యాముడిగా దర్శనమిచ్చేవాడు.  ఆయన అర్ధాంగి అయిన శ్రీ మహాలక్ష్మి
మహావిష్ణువు వక్షస్ధలమున నివాసమేర్పర్చుకున్నది.
అందువలన ఆమె మేనికాంతి  మహా విష్ణువుపైబడి ఆయన దేహం పచ్చని వర్ణంగా మారింది.  మహా లక్ష్మీ యొక్క మేలిమి బంగారు ఛాయ, 
నీలమేఘ శ్యాముని వర్ణంతో కలసి  పచ్చని వర్ణమై మెరసింది పరంధాముని
మేని అని  ఆళ్వార్లందరూ
మహావిష్ణువు ని స్తుతించారు.

పుణ్యనగరాలలో ప్రముఖ క్షేత్రంగా  విశిష్టత కలిగిన కాంచీమామనగరం లో
శ్రీమహావిష్ణువు పచ్చవర్ణ పెరుమాళ్ గా దర్శనమిస్తున్నాడు. 

పరంధాముడు భార్గవీ సమేతంగా  అనుగ్రహించడాన్ని తీసుకున్నా, పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహించినట్లు తీసుకున్నా
పచ్చని రంగు మంగళకరము , శుభప్రదము అయింది.

పచ్చ వర్ణ సాలగ్రామమును
సాక్షాత్తూ నారాయణ స్వరూపంగా పూజిస్తారు.
పచ్చవర్ణ మరకత లింగాన్ని
ఆరాధించడం వలన కలిగే శుభాలు మనకి తెలుసు. 

పచ్చ వర్ణం ఐశ్వర్యానికి
చిహ్నమైనందున, సిరిసంపదలకోసం ప్రార్ధించే ఆలయాలలో, కుబేరుని
ఆలయాలలోను  ఆకు పచ్చరంగు కుంకుమనే  ప్రసాదంగా వినియోగిస్తారు.

మంగళకరమైన పచ్చవర్ణ కుంకుమ  వుండే స్ధలంలో
మహావిష్ణువు ,
మహాలక్ష్మి
కలసి నివసిస్తారు.   పార్వతీ పరమేశ్వరులు కూడా కరుణతో
ఆశీర్వదిస్తారు.

కుబేరుని అనుగ్రహం కలుగుతుంది.  ఇందరి దేవతల అనుగ్రహాం లభించే చోట ఎల్లప్పుడూ
సుభిక్షంగానే వుంటుంది. 
సర్వ శుభాలు కలుగుతాయి.  తలచిన కార్యాలు సఫలీకృతమౌతాయి.
జీవితం సుఖ సంతోషాలతో
నిండి వుంటుంది.
మధుర మీనాక్షి లీల 

*ఇది కధ కాదు. వాస్తవంగా జరిగిన యదార్థం*

🏵️ బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు. ఆయన ఆఫీస్ కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్. 

🏵️ పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందరనుండి తన గుర్రంమీద వెళ్లేవారు. అలా వెడుతున్న సమయంలో పీటర్ తన కాళ్లకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడచి వెళ్లేవారు భక్తిగా. 

🏵️ ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తోంది. పీటర్ తన ఇంట్లో పడుకుని ఉండగా పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేవగానే, ఎదురుగా ఒక స్త్రీ వంటినిండా బంగారు ఆభరణాలతో నిలుచుని ఉంది. 

🏵️ పీటర్, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుండగానే ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ, రా రా అని పీటర్ ను బయటకు పిలిచి, కనీసం కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలోనే వడి వడిగా నడుస్తూ కొంతదూరంలో అదృశ్యమవడం, ఇంటి నుంచి బయటకు వచ్చిన పీటర్ గమనించి వెనుతిరిగిన మరుక్షణంలోనే, అతని నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

🏵️ నిర్ఘాంత పోయిన పీటర్ కొద్దిసేపటికి తేరుకుని, ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటకు పిలిచి ఈ ఘోరాపద నుండి కాపాడినది, సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారే అని గ్రహించి చేతులెత్తి నమస్కరించాడు కలెక్టర్ పీటర్. 

🏵️ ఆ మరునాడు భక్తితో ఆలయానికి వెళ్లి అర్చకులను సంప్రదించి, రాత్రి జరిగిన ఆ ఉదంతాన్ని వారికి తెలియ చేస్తూ, అయ్యా రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షి అమ్మవారి కాళ్లకు పాదరక్షలు లేవని గమనించాను. నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు బహుమతిగా ఇవ్వదలిచాను. మీరు అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వగలరు అని సవినయంగా అడిగాడు. 

🏵️ వారి అంగీకారంతో 412 రూబీస్, 72 ఎమిరాల్డ్స్, 80 డైమండ్స్ తోవజ్ర వైడూర్య సహితమైన అత్యంత విలువైన స్వర్ణ పాదుకలను ఆ మధుర మీనాక్షి తల్లికి సమర్పించారు కలెక్టర్ పీటర్. "పీటర్ పాదుకలుగా" పిలువబడే ఆ పాదుకలను ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే "చిత్ర ఫెస్టివల్" సందర్భాన అమ్మవలారి ఉత్సవ మూర్తి పాదాలకు అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. 

*🏵️ ఆనాడు సత్య తార్కాణంగా జరిగిన ఈ సన్నివేశం, అన్య మతస్థుడైనా, భగవంతునిపై ఆయనకున్న భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిపోయింది.(forwarded as received)*
ఓంకారము యొక్క చతుష్పాదములు - వివరణ 
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
 *చలాచల బోధ* 
 ప్రసాద్ భరద్వాజ 

‘ఓం’ అనే అక్షరము సర్వము అయివున్నది. భూత భవిష్య వర్తమానములలో ఓం అనునదే వున్నది. త్రికాలాతీతమైనది ఏదైతే వున్నదో అది కూడా ఓంకారమే అవుతున్నది. ఇదంతయూ బ్రహ్మమే. ఈ ప్రత్యగాత్మ కూడా బ్రహ్మమే. అట్టి ఈ ఆత్మ చతుష్పాదములు కలది. 

ప్రథమ పాదము వైశ్వానరుడు. అతని కర్మక్షేత్రము జాగ్రదావస్థ. అతడు బహిః ప్రజ్ఞ కలవాడు. అతనికి సప్త అంగములు, 19 ముఖములు కలవు. అతడు స్థూల విషయములనే అనుభవించును.

ద్వితీయ పాదము తైజసుడు. అతని కర్మక్షేత్రము స్వప్నావస్థ. అంతః ప్రజ్ఞ కలిగివున్నాడు. సప్త అంగములు మరియు 19 అంగములు కలిగివున్నాడు. అతడు మానసిక ప్రపంచము నందలి, సూక్ష్మ విషయములను అనుభవించుచున్నాడు. 

తృతీయ పాదము ప్రాజ్ఞుడు. నిద్రపోవువాడు. ఎచట ఎట్టి కోరికలను కోరడో, స్వప్నమును కూడా చూడడో అదే సుషుప్తి అవస్థ. అతని యందు అన్ని అనుభవములు భేదరహితమై ఏకీభవించుచున్నవి. అతను సంపూర్ణ చైతన్యము యొక్క ప్రజ్ఞానఘనరూపమై వున్నాడు. ఈ సుషుప్త్యావస్థ జాగ్రత స్వప్నములయందు ఆ చైతన్యమును ప్రసరింపచేయుటకు ముఖద్వారమై వున్నది. 

నాల్గవ పాదము తురీయము. ప్రత్యగాత్మ. అది అంతః ప్రజ్ఞకాదు. బహిః ప్రజ్ఞ కాదు. ఉభయతా ప్రజ్ఞ కలది కాదు. ప్రజ్ఞాన ఘనమూ కాదు. ప్రజ్ఞయూ, అప్రజ్ఞయూ కాదు. అది అదృష్టము. అవ్యవహారము, అగ్రాహ్యము, అలక్షణము, అచింత్యము, అన్యాపదేశము, ఏకాత్మ, ప్రపంచోపశమము, శాంతము, శివము, అద్వైతము అదియే చతుర్థపాదము. అదియే ఆత్మ.
🌹 🌹 🌹 🌹 🌹

గణపతి తాళం మహిమ


- ఇంట్లో ఎప్పుడు గొడవలు, నాకూ నా భర్తకు. 
- మా అత్తగారికి, నాకూ అస్సలు పడట్లేదు.
- ఇంట్లో మనశ్శాంతి లోపించిందని భర్త ఆవేదన.
- అమ్మ నాన్న గొడవలు చూస్తే పిల్లలకి గుండెల్లో బాధ.
ప్రతి ఇంట్లో వుండే సహజమైన సమస్యలు.  వీటన్నిటికీ ఒకే ఒక్క పరిస్కారం. 

మీ ఇంట్లో నెలకొన్న సకల సమస్యలకు గణపతి తాళం అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కసారిగా గొడవతో ఇల్లంతా మారుమ్రోగి పోతే ఈ గణపతి తాళం ను పఠించి చూడండి. 10 నిముషాలలో ఇంట్లో నెలకొన్న చెడు ప్రకంపనలు ( negetive energy ) మొత్తం పోయి ఇల్లంతా ప్రశాంతంగా మారిపోతుంది. 

వేదాల్లో దీని గురించి చెప్పడం జరిగింది. గణపతి తాళం చదివినంతనే లేదా వాయిస్ ప్లే చేసినంతనే దుష్ట చెడు ప్రకంపనలు కొద్దీ నిమిషాల్లోనే మాయం అవుతా యి

!!!! గణపతి తాళం !!!!!

అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై |
రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో
గణపతి రభ మత మీహ దిశ తనుః
లంభోధర వర కుంజా వస్తిత కుంకుమ వర్ణ ధరం
శ్వేత శృంగం బీనసుహస్తం ప్రీతిత సఫల ఫలం
నాగత్రయ యుత నాగ విభూషణ నా నా గణపతి తం
త తం నా నా గణపతి తం
త తం నా నా గణపతి తం

తత్ పురుషాయ విద్మహే వక్రాతుండాయ ధీమహి తనో దంతి ప్రచొదయాథ్

వికటోత్కట సుందర దంతి ముఖం | భుజగేంద్రసుసర్ప గదాభరణం ||
గజ నీల గజేంద్ర గణాధిపతిమ్ | ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం ||
సుర సుర గణపతి సుందర కేశమ్ | ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానమ్ ||
భవ భవ గణపతి పద్మ శరీరమ్ | జయ జయ గణపతి దివ్య నమస్తే ||
గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రమ్ | గణ గుణ మిత్రం గణపతిమీశప్రియమ్ ||

కరద్రుత పరశుమ్ కంకణ పాణిం కబలిత పద్మ రుచిం | సురపతి వంద్యం సుందర వక్త్రం సుందరచిత మణి మకుటమ్ ||
ప్రణమత దేహం ప్రకటిత కాలం షడ్గిరి తాళమిదం, తత్ తత్ షడ్గిరి తాళమిదం తత్ తత్ షడ్గిరి తాళమిదమ్ |
లంబోదర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరమ్ | శ్వేతసశృంగం మోదక హస్తం ప్రీతి సపనసఫలమ్||
నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతిదం, తత్తం నయన త్రయ వర నాగ విభూషిత నానా గణపతితం తత్తం నా నా గణపతిదం, తత్తం నా నా గణపతిదం, తత్తం నా నా గణపతిదమ్ ||

ధవలిత జల ధర ధవలిత చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం, ధవలిత జల ధర ధవలిత చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయమ్||

కట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదమ్ | కట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదం తత్ తత్ గణపతి వాద్యమ్ ఇదమ్, తత్ తత్ గణపతి వాద్యమిదమ్||

తక తకిట తక తకిట తక తకిట తతోం, శశి కలిత శశి కలిత మౌళినం శూలినమ్ |
తక తకిట తక తకిట తక తకిట తత్తోం, విమల శుభ కమల జల పాదుకం పాణినమ్ |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తత్తోం, ప్రమథ గణ గుణ ఖచిత శోభనం శోభితమ్|
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం, మృదుల భుజ సరసి జభి షానకం పోషణం |
థక తకిట థక తకిట థక తకిట తతోం, పనస ఫల కదలి ఫల మోదనం మోదకం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తతోం, ప్రమథగురు శివ తనయ గణపతి తాళనం |
గణపతి తాళనం ! గణపతి తాళనం !!