వెన్నెల అనే అందమైన అమ్మాయికి పెళ్ళి కుదిరింది..
చదువు, అందం , ఆస్తి, సాంప్రదాయం అన్ని ఉన్న అమ్మాయి కనుక మగపెళ్ళివారు చూడగానే ఒప్పుకున్నారు.
ఆ అమ్మాయి పెళ్ళి కొడుకుతో మాట్లాడాలి అన్నది...సరే ఇద్దరూ కూర్చున్నారు...
వెన్నెల అన్నది " పెళ్ళికి నాది ఒకే ఒక షరతు "
అతను కుతూహలంగా చూసాడు. "అది ఏమిటంటే మీరు ఏమాట మాట్లాడాలనుకున్నా సరే,
అంటే విపరీతమైన కోపం వచ్చినా, టెన్షన్ వచ్చినా,విసుగ్గా వున్నా,ఏదైనా అసలు నచ్చకపోయినా సరే కానీ గొంతు పెంచి మాట్లాడకూడదు. మీరు ఏం మాట్లాడాలనుకున్నా సరే మెల్లగా అనాలి అంతే ! అలా కాకుండా గొంతు పెంచి అరిస్తే నేను పుట్టింటికి వచ్చేస్తాను ఆ పై నన్ను ఏమీ అనకూడదు" అన్నది.
అతనికి కొంచెం వింతగా అనిపించినా తిట్టవద్దు అనలేదు కదా కొంచెం గొంతు తగ్గించమంటున్నది ఫర్వాలేదు అనుకున్నాడు.
పెళ్ళి అయిపోయింది, వెన్నెల పెట్టిన షరతు అత్తగారింట్లో తెలిసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
పొద్దున్నే ఇద్దరికీ ఆఫిస్ హడావిడి " వెన్నెలా కాఫీ అడిగి ఎంతసేపయింది ???" హాలులో కూర్చుని అరిచాడు" దానికి ఆమె మెల్లగా మిమ్మల్ని కలుపుకోమన్నాను కదా" అన్నది వెన్నెల.
" నేనా ? కాఫీ కలుపుకోవాలా??ఇంక పెళ్ళి చేసుకున్నది దేనికి ??? అని "మెల్లగా అన్నాడు
వెన్నెల నవ్వేసింది "
మీరు పెళ్ళికి ముందు షరతు పెట్టాల్సింది నా కాఫీ ఎప్పుడూ నువ్వే పెట్టాలని" అతను కూడా నవ్వేసాడు.
రెండు నెలల తరువాత వెన్నెల, తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళికి బంగారు నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వాలని తెచ్చింది. అంత ఖరీదైన బహుమతి తనకి చెప్పకుండా తేవడంతో అతని కోపం తారాస్థాయికి చేరుకుంది.
"సంపాదిస్తున్నానని అంత పొగరా? కనీసం నాకు చెప్పకుండా" అని
ఎంత పెద్దగా అన్నాడో అతనికే తెలియలేదు.
ఒక్కక్షణం మౌనంగా వుండి, వెన్నెల అన్నది "ఇదే మాటని మళ్ళీ చెప్పండి,మెల్లగా"
ఒక్క నిమిషం ఆగి అతను అన్నాడు, నిజమే ! నీ ఫ్రెండ్
పెళ్ళి కాదనను కానీ నాకు ఒక్క మాట చెప్పిఉండాల్సింది సరేలే అన్నాడు. అప్పుడు
వెన్నెల, తను నా పెళ్ళిలో డైమండ్ రింగ్ ఇచ్చింది తెలుసా అన్నది శాంతంగా.
ఓ..కే.. ఇకనుంచి మీ ఫ్రెండ్స్ విషయంలో నేను జోక్యం చేసుకోను అన్నాడు అతను.
వారి వివాహం అయి ఒక సంవత్సరం అయింది,గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. బంధువులు, మిత్రులు వచ్చారు. అందులో ఎవరో ఒకరు అతనిని ప్రశ్నించారు.
"మీ వైవాహిక జీవితం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి అయింది కదా ! మీ ఆనంద రహస్యం ఏమిటి ?? అని"
దానికి అతడు "ఏమీ లేదు, నా భార్య నా గొంతు నొక్కేసింది అంతే !" అన్నాడు.
అందరూ నవ్వారు.
అంటే ఏమిటి ? ఎవరో కుతూహలంతో అడిగారు..
అతను వివరించాడు ఈవిధంగా
అందరికీ ఉపయోగపడే సూత్రం చెబుతాను వినండి...
ఏ భావావేశమైనా గొంతు పెంచి మాట్లాడవద్దు. గొడవలు వాటంతట అవే సమసి పోతాయి ఇక వాదన పెరగదు. కోపం తారాస్థాయికి చేరుకోదు. నా భార్య నా గొంతులో సైలెన్సర్ బిగించిందిఅంతే జీవితం సాఫీగా సాగిపోతున్నది అన్నాడు.
అందరూ ఆమెను అభినందించారు. అతను ఆమెను గర్వంగా చూసాడు.
ఇప్పుడు నీతి ఏమంటే.,
చాలా వరకూ సమస్యలు పరుష పదజాలంతో రావు, వాటిని పలికే స్థాయితో వస్తాయి.
"ఈ కూర ఇట్లా తగలడిందేమిటి ?" అనే మాటని పెద్దగా అనండి... అలాగే చిన్నగా అని చూడండి 😂
తేడా మీకే అర్థం అవుతుంది.
పెద్దగా అరవటంవలన మన బి.పి.పెరుగుతుంది మనసులో అశాంతి, ఎదుటివారితో దూరం పెరుగుతుంది వారి మనసుని గాయపరుస్తాము, అది వారు ఏనాడూ మర్చిపోరు.
అదే గొంతు మార్చి కలిగే లాభాలు చూడండి, మీకే అర్థం అవుతుంది .👍🏼
👉🏼ధర్మస్య విజయోస్తు🙌🏼
👉🏼అధర్మస్య నాశోస్తు🙌🏼
👉🏼ప్రాణిషు సద్భావనాస్తు🙌🏼
👉🏼విశ్వస్య కళ్యాణమస్తు🙌🏼
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి