17, డిసెంబర్ 2024, మంగళవారం

జగన్నాధ పండితరాయల గురించి

 ఇది సేకరించి పంపబడినది 👇


*జగన్నాధ పండితరాయల గురించి తెలుసుకుందాము*


ఆయన యింటి పేరును గురిచి పండితులు వేరు వేరు గా చెప్పారు.ఒకరు ముక్కామల అనీ,యింకొకరు నడిమింటి వారనీ,తరువాత ఆయన యింటి పేరు 'ఉపద్రష్ట' అని అందరు పండితులు ఏకాభిప్రాయానికి వచ్చారు.


ఆయన ఆంధ్రుడు అనేది నిర్వివాదాంశం వేగినాటి బ్రాహ్మణుడు, ముంగండ ' గ్రామ వాసి.ఆయన తండ్రి పేరు పేరు లక్ష్మీకాంత భట్టు ,తల్లి పేరు మహాలక్ష్మి,భార్య పేరు కామేశ్వరి.ఆయన గురువు పేరు పేరిభట్టు(తండ్రే).


ఆయనదగ్గర వేదాంతము,మహేంద్రుడు అనే ఆయన దగ్గర న్యాయ,వైశేషికాలు,ఖండదేవుని వద్ద జైమినీయం 

శేష శ్రీకృష్ణ పండితుని దగ్గర వ్యాకరణము నేర్చుకున్నాడు.పేరిభట్టు కేవలం పండితుడే కాక మహా కవి కూడా 

ఆయన రాళ్ళనుంచి అమృతం చిందేట్టు కవిత్వము చెప్పగల సమర్థుడట.అంటే ఆయన కవిత్వం అంత మధురంగా వుటుందన్న మాట.ఈ విషయాన్ని జగన్నాధ పండిత రాయలు తన 'రసగంగాధరము'లో ఈ శ్లోకం ద్వారా తెలియ జేస్తున్నారు.


శ్రీమత్ జ్ఞానేంద్ర భిక్షో రథిగత సకల బ్రహ్మ విద్యా ప్రపంచః

కాణాదీ రాక్ష పాదీ రపి గహన గిరోయో మహేంద్రా ద వేదిత్ 

దేవాదే వాద్య గ్రీష్మ స్మరహర నగరే శాసనం జైమినీయం 

శేషాంక ప్రాప్త శేషామల భణితి రభూ త్సర్వ విద్యా ధరోయః 

పాషాణాదపి పీయూషం స్యందతేయస్య లీలయా 

తం వందే పేరు భట్టాఖ్యం లక్ష్మీకాంతం మహాగురుం


తన తండ్రిని 'మహాగురువు ' అంటాడు పండితరాయలు జగన్నాథ పండిత రాయలు హయగ్రీవోపాసకుడు. దానికి ఆయన 'రసగంగాధారం'లో వ్రాసిన శ్లోకం.


శ్లోకం:-అపివక్తి గిరాంపతి: స్వయం యది తాసా మధిదేవతా పినా 

అ యమస్మి పురోహ యావన స్మరణో ల్లంఘిత వాగ్మయాం బుధి:


మహాపండితుడు ఎలా వుంటా డంటే, ఆ బృహస్పతే వచ్చి మాట్లాడుతాడో.ఆ సరస్వతీదేవి స్వయంగా వచ్చి మాట్లాడుతుందో రమ్మనండి.యిదిగో 'హయగ్రీవ మంత్ర స్మరణం చేత వాగ్మయాంబుధి దాటి నేను వచ్చి ఎదురుగా నుంచున్నాను రమ్మనండి అన్నట్టు ఉంటాడట.


బ్రాహ్మణుల యింట్లో పిల్లల్ని ఆ కాలంలో ఎంతో కట్టుదిట్టంగా పెంచే వారు.అటువంటి కట్టుదిట్టాల్లో 

పెరిగారు.పండితరాయలు.అన్ని శాస్త్రాలు,సంగీతము కూడా నేర్చుకున్నారు.

ఆయన వివాహము అప్పటి ఆచారాల ప్రకారం చిన్నతనం లోనే ముంగండ లోని కామేశ్వరి అనే అమ్మాయితో జరిగింది.


పండితరాయలు క్రీ.శ 1600 ప్రాంతం లో పుట్టాడు.1628లో షాజహాను కొలువులో చేరాడు.అంతకు ముందే కాశీలో విద్యాభ్యాసం చేశాడు.అప్పుడే అరబ్బీ,పార్సీ భాషలు నేర్చుకున్నాడు.హిందూస్తానీ సంగీతం కూడా నేర్చుకున్నాడు.తన సంగీతం,తో షాజహానును మెప్పించాడట.అరబ్బీలో.పార్సీ లో అద్భుతమైన కవిత్వం చెప్పి షాజహాన్ ను మెప్పించాడని చెప్తారు.షాజహాను ఆయనకు 'పండిత' అనే బిరుదు యిచ్చి గౌరవిం చాడట.ఆయన ఆగ్రాలోనూ,ఉదయపూరు లోనూ.మథురలొను నివాసమున్నాడట.షాజహాను కొలువు లోని విద్వాంసులను,అరబ్బీ,పార్సీ భాషలలో వాదించి గెలిచాడట. 


అప్పటి ఉత్తర భారత దేశీయులు మన ఆంధ్రులను మీరు ఆంధ్రులా అని అడిగేవారు కాదట. మీరు జగన్నాథ పండితులవారి దేశము వారా?అని అడిగే వారట.మనవాళ్ళను వీళ్ళు పండితరాయల దేశం వారట అని 

గొప్పగా పరిచయం చేసేవారట ' ఏ పండిత్ రాజ్ కే దేశ్ వాసీ హై'అనే వారట .అంత గొప్పకీర్తి సంపాదించారు జగన్నాధ పండితులు.తెలుగు వారికి అంతటి గౌరవం తెచ్చిన ఘనత ఆయనదే.


కాశీలోనూ,హరిద్వార్ లోను జగన్నాధ పండిత రాయలు వ్రాసిన 'గంగాలహరి'శ్లోకాలను 

 ఈనాటికీ గంగకు సాయింత్రం నీరాజనం యిస్తూ పాడే హారతి పాట అదే.


ఆయన పై మెట్టుమీద నిల్చుకొని ఆ పాట 

పాడుతూ వుంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కోమెట్టు చొప్పున గంగ పైకి వచ్చేదట. 

చివరికి మథురలో ఆయన యిలా చెప్పుకున్నాడు.


"శాస్త్రాలు చదివాను,నిత్య విధులన్నీ యథా తథంగా నిర్వర్తించాను.డిల్లీ వల్లభుని పాణి పల్లవాలతో యవ్వనమంతా గడిపినాను,హరిని సేవిస్తూ ఈ మథురా నగరిలో చివరి దశ వెళ్ళదీసు కుంటున్నాను.


నాకేమి కావలెను నేను అన్నింటినీ లోకాధికంగానే సాధించాను"

అనుకోని ఆత్మతృప్తి పొందిన వాడు.పుట్టినందుకు అన్ని విద్యలను నేర్చి,అన్ని వున్నతులను,సాధించి,

అమృతం చిందే కవిత్వం చెప్పాడు.గొప్పగానంవినిపించాడు,శ్రుతి ప్రమాణార్థం విడమరిచి కవులకు,అలంకారికులకు 

సాహిత్యవేత్తలకు చెప్పాడు.యిక చేయ వలిసినదేమీ లేదని అరిపండిత భయంకరుడుగాబ్రతికినన్నాళ్ళూ 

బ్రతికి చివరికి మహా యోగిగా మథుర లో ఆయన 74 వ ఏట కన్నుమూశారు. 

ఆయన మహా జ్ఞాని ఆయనకు 35,40 ఏళ్ళ మధ్యలోనే భార్యా వియోగము సంభవించింది.


మలయానిల కాలకూటమో రమణీ కుంతల భోగి భోగ్యయో:

శ్వపచాత్మ భువో నిరంతరా మమ భూయాత్పర మాటమర స్థితి:


అర్థము:మలయా నిలయమునందు,కాలకూట విషము నందు,ఆడవారి వెంట్రుకల యందు,భోగియోక్క భోగములయందు,చండాలురయందు,మన్మథ భావముల యందు,నిరంతరము నాకొక్కటే పరమాత్మ 

బుద్ధి అమరుగాక!అందరిలో పరమాత్ముని దర్శించాలని కోరుకుంటున్నానుఈ శ్లోకమే .ఆయన గొప్ప జ్ఞాని అనడానికి నిదర్శనము.


అంత కీర్తి సంపాదించిన వారంటే మిగతా పండితులకందరికీ అసూయ సహజంగా వుంటుంది. ఆయన మీద బురద చల్లే ప్రయత్నమూ చేశారు. షాజహానుబిడ్డ అయిన లవంగి తో ఆయనకు సంబంధం అంటగట్టారు. (దాదాపు 20 సంవత్సరాలు చిన్నది లవంగి ఆయనకంటే)ఆయనకు చిన్నతనము లోనే కామేశ్వరి అను కన్యతో వివాహమైంది.


వాళ్లిద్దరూ చాలా అన్యోన్యంగా వుండేవాళ్ళని ఆయన వ్రాసుకున్న శ్లోకాలద్వారా తెలుస్తున్నది. తనభార్యను గూర్చి చాలా గొప్పగా వ్రాసుకున్నారు ఆయన.

వాటిని తర్వాతి భాగములో వివరిస్తాను.


ఆయన మహాజ్ఞాని.ఆయన వ్రాసిన కావ్యాలు కూడా అటువంటివే.ఆయన వ్రాసిన మొదటి కావ్యాలు ఐదు. అమృతలహరి, యిది యమునా స్తుతి, రెండవది కరుణాలహరి, యిది విష్ణు స్తుతి, మూడవది లక్ష్మీలహరి.లక్ష్మీ స్తుతి. ఇది బీజాక్షర సహితంగా కూర్చబడింది.

భారతీయులీనాటికీ దీనినెంతో పవిత్రంగా భావిస్తారు.లక్ష్మీ మంత్రం జపించిన,పారాయణం చేసినవారికి ఫలితం వుంటుందని పండితులు సైతం అంటూ వుంటారు. నాలుగవది సుధాలహరి, ఇది సూర్యస్థుతి. అయిదవది గంగాలహరి. గంగ ఒడ్డున పై మెట్టు మీద నిలబడి యేబదియేడు శ్లోకాలతో గంగను స్థుతించ్చాడనీ ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిందనీ చెప్తారు.


జగన్నాధ పండితరాయలను షాజహాన్ పిలిపించాడో మరి ఈయనే వెళ్ళాడో తెలియదు.

షాజహాన్ కొలువులో చేరి అధికారిగా, షాహజాహాన్ చక్రవర్తికి ఆంతరంగిక సలహాదారుగా 

యిష్ట సఖుడుగా వుండేవాడు. రాజ్య విషయాలలో కానీ మతవిషయాలలో కానీ చక్రవర్తి 

ఆయన సలహాలనే తీసుకునే వారని ప్రతీతి. చక్రవర్తిని నొప్పించకుండా ఆయనకు విజ్ఞానాన్ని అందిస్తూ వుండేవాడు. చక్రవర్తిని కల్పవృక్షముతో పోలుస్తూ 


 ఔదార్యం భువనత్రయేపి విదితం సంభూతిరంభోనిధే 

వాసోనందన కాననే పరిమళో గీర్వాణ చేతో హరః 

ఏవం దాతృ గురోద్గుణా: సురతరో: సర్వేపిలోకోత్తరా:

స్యాదర్థి ప్రకారార్తి తర్పణ విధావేకో యది 


దేవలోకములోని నందనవనంలో కల్పవృక్షము అడిగినవారి కోరికలన్నీ తీరుస్తుంది. దాని పరిమళము దేవతలమనస్సును హరిస్తుంది. దానిదాతృ గుణము లోకోత్తరమైనది. 

కానీ చక్రవర్తికి అర్థులకోరికలు తీర్చడం లో వివేకం అవసరము. అంటే పాత్రాపాత్ర 

వివేకము అవసరమని హెచ్చరిక. చక్రవర్తి చేసే పనులలో లోపం కనిపించినప్పుడు ఆ లోపం సరిదిద్దడానికి ఏదో విధంగా ఆయన నొచ్చుకోకుండా యిలా సలహా చెప్పేవాడు

అనుకోవచ్చు.


చక్రవర్తిని ఆశ్రయించి కొందరు దుర్మార్గులున్నారు, వారికి భయపడి మంచివారు ఆయన దరి చేరడానికి భయపడుతున్నారు. ఆ విషయము చక్రవర్తికి ముక్కుకు సూటిగా చెప్పాడు.


   యైస్త్వం గుణగణ వాన పి

   సతాం ద్విజి హ్వాయి ర సేవ్యతాం నీతః 

   తానపి వాహసి పటీరజ 

  కిం కథ యామస్త్వదీయ మౌన్నత్యం 


అది ఒక చందనపు చెట్టట ఓసీ! చందనమా! నీ గొప్పతనం యేమని చెప్పను? నీకు అపకీర్తి తెచ్చే నాగు పాములను కూడా భరిస్తూనే వున్నావు. అని చెప్పాడు.  


కానీ చక్రవర్తికి అర్థులకోరికలు తీర్చడం లో వివేకం అవసరము. అంటే పాత్రాపాత్ర 

వివేకము అవసరమని హెచ్చరిక. చక్రవర్తి చేసే పనులలో లోపం కనిపించినప్పుడు ఆ లోపం సరిదిద్దడానికి ఏదో విధంగా ఆయన నొచ్చుకోకుండా యిలా సలహా చెప్పేవాడు

అనుకోవచ్చు.


పండితరాయలు అంతటి సమర్థుడు,చతురత గలవాడు కాబట్టే షాజహాను అయన యోగ్యతకు తల వంచాడు.ఆయన విలువ గ్రహించి తన అరచేతులతో పెట్టుకొని కాపాడుకున్నాడు.భారతదేశ చరిత్రలో విశేషమైన గౌరవాలను పొందిన కవిపండితులు ముగ్గురే కనబడతారు ప్రాచీనులలో.వారిలో మొదటివాడు కాళిదాసు, భోజుడతణ్ణి ప్రాణాధికంగా కాపాడుకున్నాడంటారు.


 రెండవవాడు అల్లసాని పెద్దన్న,'ఎదురేగినంతనే తన మదకరీంద్రము" దిగివచ్చి ఆయనను ఆహ్వానించేవాడట,రాయలవారు.మూడవ వాడు జగన్నాధ పండితరాయలు.ఒక విధంగా చూస్తే వారందరికన్నా ఈయనే మిన్న.


భోజుడు,రాయలు హిందూ రాజులు.ఇక్కడ షాజహాన్ ముస్లిం .అన్యమత ప్రభువు.

ఆ చక్రవర్తి ఆయనను అంత ఆదరించబట్టి ఒకసారి యిలా అంటాడు.


ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా 

మనోరథాన్ పరిపూరయితం సమర్థ:

అన్యై: నృపాలై: పరదీయమానం 

శాకాయ వాస్యా ల్లవణాయ వాస్యాత్


నాకోరికలు తీర్చాలంటే ఢిల్లేశ్వరుడైనా తీర్చాలి జగదీశ్వరుడైనా తీర్చాలి.వారిద్దరే అందుకు సమర్థులు. ఇతర రాజులు నాకు ఉప్పుకు, కూరకు మాత్రమే యివ్వగలరు.

అంటే అంత తక్కువ ఇస్తారని. 


జగన్నాథ పండితరాయలు మహా కవి,పండితుడు,అలంకారికుడు,బహుగ్రంథ కర్త,మన ఆంధ్రుడు.తన కవిత్వం తో 


గంగామాతను తన వద్దకు రప్పించుకొని ఆమెలో ఐక్యమై తన 

పవిత్రతను నిరూపించుకొని,ఈర్షాళువు లైన పండితమ్మన్యులకు బుద్ధి చెప్పాడు.


ఆయన వద్దకు ఎంతోమంది కవి పండితులు వచ్చి,తమ కవిత్వాన్ని వినిపిస్తూ వుంటారు.

కొందరి కవిత్వం లో కావ్యత్వం వుండదు.పదాల పొందిక మాత్రం వుంటుంది,గణముల 

కూర్పు మాత్రం వుంటుంది,అలాంటి వారి తో విసిగి పోయి యిలా అంటున్నారు.


శ్లోకం:- నిర్మాణే యది మార్మికోసి,నితరాం అత్యంత పాకద్రవన్ 

మృద్వీ కామధుమాధురీ మదపరీహారో ద్దురాణాం గిరాం 

కావ్యం తర్హి సఖేసుఖేన కథయ,త్వాం సమ్ముఖే మాదృశామ్ 

నోచేత్ దుష్కృత మాత్మనా కృతమివ స్వామ్ తాత్ బహిర్మా కృథా!


ఓ మిత్రమా!నీవు కావ్య నిర్మాణం లో సిద్ధహ స్తుడవైతే అత్యంత రసవంతమైన స్వారస్యం 

జాలువారే విధంగా ద్రాక్ష,తేనెల యొక్క మాధుర్యాన్ని,మదాన్ని హరింపజేసే మాటలతో 

హాయిగా కష్టం లేకుండా ఏదైనా కావ్యం వ్రాసి మా వంటి వారికి వినిపించవయ్యా!లేదా 

నా చేత పాపం చేయబడింది,చేయరాని పని చేయబడింది అనుకుంటూ నీ మనస్సు లోనుంచి ఆ పదాలను బయటకి రానీయకు.అని హెచ్చరిస్తున్నాడు.


కవిత్వం అంటే రసం జాలువారాలి,మనసు కరగాలి.రమణీయార్థ ప్రతిపాదన మవ్వాలి.

చమత్కారం వుండాలి .అలాంటి ఒక శబ్దం వున్న అది కవిత్వమనిపించుకుంటుంది.

అది లేని కవిత్వాలు గుట్టలు గుట్టలు గా వ్రాసినా ఎందుకూ ఉపయోగ పడవు.

అని జగన్నాథుని భావన. ఇది మనకందరకూ ప్రామాణికం,.

చెప్ప తరమ్ము గాని పలు సేవలతో

 ఉ.చెప్ప తరమ్ము గాని పలు సేవలతో తమ ప్రాణశక్తి కే

ముప్పు ఘటించినన్ గనెడు ముందుకు సాగెడు వైద్య రత్నమా!

ఒప్పుదు నీవె దైవమని ఉత్తమ ప్రజ్ఞకు మారురూపమై

ఎప్పుడు జీవ రక్షకయి యీ భువిలోన ప్రశస్తి గాంచుమా!౹౹ 79


ఉ.చెప్పిన తక్షణమ్మె తమ చెంతకు చేరి పరీక్ష సేసి యే 

ముప్పు ఘటిల్లనీయక విమోచనకై విచికిత్స చేసి తా

మప్పటి కప్పుడే జనుల నాదుకొనన్ సమకట్టి యుక్తితో

నొప్పెడు వైద్య సోదరుల ఓర్మికి వందన మాచరించెదన్౹౹ 80

Panchaag


 

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - హెమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం  - ద్వితీయ - పునర్వసు -‌‌ భౌమ వాసరే* (17.12.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శ్రీ మన్నరసాల నాగరాజ ఆలయం

 🕉 మన గుడి : నెం 962


⚜ కేరళ : హరిపాడు : అలెప్పి


⚜ శ్రీ మన్నరసాల నాగరాజ ఆలయం


 

💠 కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయం నాగరాజుకు అంకితం చేయబడింది.  

ఈ ఆలయ సముదాయంలో సుమారు 30,000 రాతి పాము బొమ్మలు మరియు చిత్రాలను చూడవచ్చు.  ఇది చాలా పురాతనమైన దేవాలయం మరియు దాదాపు 3000 సంవత్సరాల నాటిది.


💠 మన్నరసాల శ్రీ నాగరాజ ఆలయంలో మొదటి పూజారి ఐదు తలల పాముకు జన్మనిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.  నాగరాజు, ప్రధాన దేవతగా, హరి మరియు శివుని ఆత్మతో కూడి ఉంటాడని నమ్ముతారు.


💠 పురాణాల ప్రకారం, పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పరశురాముడు తపస్సు చేసాడు.

నాగుపాము మట్టిలోకి విషం వేసి భూమిని సారవంతం చేస్తుంది.  పరశురాముడు మన్నరసాలలో నాగరాజ విగ్రహాన్ని ప్రతిష్టించాడు.


💠 సంతానోత్పత్తిని కోరుకునే జంటలు ఇక్కడకు పూజలు చేయడానికి వస్తారు, మరియు వారి బిడ్డ పుట్టినప్పుడు కృతజ్ఞతా పూర్వక వేడుకలను నిర్వహించడానికి వస్తారు, తరచుగా కొత్త పాము చిత్రాలను నైవేద్యంగా తీసుకువస్తారు. 

ఆలయంలో లభించే ప్రత్యేక పసుపు రోగ నివారణ శక్తులను కలిగి ఉంటుంది.


🔆 చరిత్ర


💠 సర్ప దేవతలకు అత్యున్నతమైన ఆరాధనా స్థలంగా మన్నరసాల ఆలయ పరిణామం జమదగ్ని కుమారుడు మరియు భృగు వంశస్థుడైన పరశురాముడితో ముడిపడి ఉంది. 


💠 పరశురాముడు క్షత్రియులను చంపిన పాపం నుండి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, అతను  ఋషులను సంప్రదించాడు. 

బ్రాహ్మణులకు తన స్వంత భూమిని కానుకగా ఇవ్వాలని వారు సూచించారు. 

పరశురాముడు వరుణదేవుని తనకు కొంత భూమిని ఇవ్వాలని కోరాడు. వరుణుడు ప్రత్యక్షమై భూమిని తిరిగి పొందేందుకు శివుడు తనకు ఇచ్చిన గొడ్డలిని సముద్రంలోకి విసిరేయమని సలహా ఇచ్చాడు. 

అతను దానిని విసిరి సముద్రం నుండి భూమిని పైకి లేపి బ్రాహ్మణులకు బహుమతిగా ఇస్తాడు. ఈ భూమి ప్రస్తుత కేరళ అని నమ్ముతారు.


💠 లవణీయత కారణంగా మొదట్లో కేరళ నివాసయోగ్యం కాదు. అక్కడ కూరగాయలు కూడా పండలేదు. ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు.

దీంతో పరశురాముడు బాధపడ్డాడు. 

అతను శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసాడు,


💠 అతను సర్పాల యొక్క జ్వాల విషం ప్రతిచోటా వ్యాపిస్తేనే లక్ష్యం నెరవేరుతుందని మరియు దానికి ఏకైక మార్గం నాగరాజు ఆరాధన మాత్రమే అని సలహా ఇచ్చాడు. 


💠 పరశురాముడు యోగి.

కేరళను చెట్లు మరియు మొక్కలతో సతత హరిత అందాలతో, అన్ని విధాలుగా సుసంపన్నంగా కనిపించే వరకు తాను విశ్రాంతి తీసుకోనని నిర్ణయించుకున్నాడు. 

అతను కేరళలోని దక్షిణ భాగంలో సముద్ర తీరానికి సమీపంలో తగిన స్థలాన్ని కనుగొన్నాడు. 

తన ప్రతిష్టాత్మకమైన స్వప్నం సాకారం చేసుకోవడానికి సరైన స్థలం దొరికినందుకు తృప్తి చెంది, తపస్సు కోసం తీర్థస్థలాన్ని నిర్మించాడు.

తపస్సుకు సంతోషించిన నాగరాజు తన కోరికను తీర్చడానికి సిద్ధపడి పరశురాముని ముందు ప్రత్యక్షమయ్యాడు. 


💠 పరశురాముడు నాగరాజు పాద పద్మములకు సాష్టాంగ నమస్కారము చేసి తన లక్ష్యమును సాకారం చేయమని ప్రార్థించాడు. నాగరాజు చాలా సంతోషంతో అతని అభ్యర్థనను మన్నించాడు. 

మంటలు చెలరేగుతున్న కాలకూట విషాన్ని వ్యాపింపజేయడానికి క్రూరమైన సర్పాలు ఒక్కసారిగా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 


💠 విషం చిమ్మిన కారణంగా, కేరళ భూమి పచ్చదనంతో నివాసయోగ్యంగా మారడానికి అనుకూలంగా  చేయబడింది. 

పరశురాముడు తన శాశ్వతమైన ఉనికితో భూమిని శాశ్వతంగా అనుగ్రహించమని భగవంతుడిని అభ్యర్థించాడు మరియు దయగల నాగరాజు కూడా దానిని అంగీకరించాడు.


💠 పరశురాముడు, వేద ఆచారాల ప్రకారం, మందర వృక్షాలతో చుట్టుముట్టబడిన 'తీర్థస్థలం' లో బ్రహ్మ, విష్ణు మరియు శివుడు అయిన నాగరాజును ప్రతిష్టించాడు.

ఆ ప్రదేశాన్ని అప్పుడు మందరసాల అని పిలుస్తారు. 

ఇక్కడ స్థాపించబడిన దేవత అనంత (విష్ణుస్వరూప) మరియు వాసుకి  శివుడు) సూచిస్తుంది. 

సర్పయాక్షి, నాగయక్షి మరియు నాగచాముండి, నాగదేవతలతో పాటు వారి సహచరుల ప్రతిష్ఠాపనలు సరైన ఆచారాలతో సరైన ప్రదేశాలలో నిర్వహించబడ్డాయి. 

వేదపఠనం, సామ, అభిషేకం, అలంకారం, నైవేద్య సమర్పణం, నీరాజనం, సర్పబలి తదితర వ్రతాలను చేస్తూ పరశురాముడు సర్పంచులకు ప్రీతిపాత్రంగా నిర్వహించి, సర్వసర్పాలకు ఆనందాన్ని కలిగించాడు.


💠 పరశురాముడు ఇతర ప్రాంతాల నుండి విద్యావంతులను తీసుకువచ్చాడు; 

వివిధ ప్రదేశాలలో దుర్గ మరియు ఇతర దేవతలను స్థాపించారు; 

పూజలు నిర్వహించడానికి తాంత్రిక నిపుణులైన బ్రాహ్మణులను నియమించారు; 

వైద్యుల్లో అగ్రగామిగా ఉన్న క్షత్రియులు, రైతులు మరియు అష్టవైద్యులను నియమించాడు. 


💠 ఈ ప్రదేశం యొక్క పవిత్రతను కాపాడటానికి అనుసరించాల్సిన ముఖ్యమైన సూచనలను ఇచ్చిన తరువాత, పరశురాముడు మహేంద్ర పర్వతాలపై తపస్సు చేయడానికి బయలుదేరాడు.


💠 ఈ ఆలయం కేరళలోని అలప్పుజా జిల్లాలో హరిపాడ్ వద్ద NH66 వెంట బస్ స్టేషన్‌కు ఈశాన్య దిశలో 3 కిలోమీటర్ల దూరంలో ఉంది . 


రచన

©️ Santosh Kumar