ఉ.చెప్ప తరమ్ము గాని పలు సేవలతో తమ ప్రాణశక్తి కే
ముప్పు ఘటించినన్ గనెడు ముందుకు సాగెడు వైద్య రత్నమా!
ఒప్పుదు నీవె దైవమని ఉత్తమ ప్రజ్ఞకు మారురూపమై
ఎప్పుడు జీవ రక్షకయి యీ భువిలోన ప్రశస్తి గాంచుమా!౹౹ 79
ఉ.చెప్పిన తక్షణమ్మె తమ చెంతకు చేరి పరీక్ష సేసి యే
ముప్పు ఘటిల్లనీయక విమోచనకై విచికిత్స చేసి తా
మప్పటి కప్పుడే జనుల నాదుకొనన్ సమకట్టి యుక్తితో
నొప్పెడు వైద్య సోదరుల ఓర్మికి వందన మాచరించెదన్౹౹ 80
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి