11, జనవరి 2026, ఆదివారం

గజల్

   గజల్


రమ్మనక పొమ్మనక నీ రమ్య రూపు నే చూస్తూనే ఉన్నా

కమ్మని నీ మధురోహల నీ ఊసులు నే వింటూనే ఉన్నా


విను తీగయిమ్ములొ రాలని

వాడిని పచ్చని సంపెంగలెన్నో

నిత్యం నిత్యమల్లినై నీ కోసం నే పూస్తూనే ఉన్నా 


వేడుకనిచ్చే వేకువ వేళలొ వెచ్చదనపు ముద్దుపొద్దయ్యి

సందె గుమ్మాన దివ్వెనై నీ దారి నే కాస్తూనే ఉన్నా


నా మది కోరే తోరం దారం

 మోగే మంగళ రావమునై

నులివెచ్చని ఆశల తోరణాల నెడదకు కడుతూనే ఉన్నా


చల్ల చల్లని గాలి తరగల ఉల్లము పూచే చెలిమి చలువలో

మల్లీ! ఏరై నీకై కలల తెప్పల ను మోస్తూనే ఉన్నా


రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

మట్టి వాసన పిలుస్తోంది...*

 *ఆ మట్టి వాసన పిలుస్తోంది...* 


అమ్మలాంటి పల్లె ఆప్యాయంగా పిలుస్తోంది

అలసిన హృదయాన్ని హత్తుకునేందుకు

మసి పట్టిన శరీరాన్ని కడిగేందుకు

మురికి పట్టిన మనసును శుద్ధి చేసేందుకు..


ఆ నేల పైరగాలి పలకరిస్తోంది

చిన్ననాటి చిట్టి అడుగులను గుర్తు చేసుకుంటూ

ఊరు వదిలిన యువకుడిని తలుచుకుంటూ

ఒక్కసారి హత్తుకొని సేదతీర్చాలని చూస్తోంది..


పండగొస్తోంది.. పల్లెకు నవ్వులు వచ్చాయి

ఆత్మీయ రెక్కలు విప్పి అందరినీ పలకరిస్తూ

గతపు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ

తనపై వేసే అడుగులకు మడుగులొత్తుతోంది..


మనిషి ఖరీదైనవాడిగా మారిపోయాడు

తానిచ్చిన ఆత్మస్థైర్యాన్ని ఆసరాగా చేసుకొని

పట్నపు రంగులద్దమై నిలిచాడు

అందులో నా నీడ కనిపిస్తుందో లేదో..


నా బావి నీరు రంగు మారిపోయింది

వాడి బ్రతుకు విషపు కోరల్లో చిక్కుకుంది

ఆడంబరం చూపడానికే నా దగ్గరకు వచ్చాడా?

తన దర్జాను ప్రదర్శిస్తూ నా ఒడిలో వాలాడు..


సరేలే.. ఎంతైనా అమ్మలాంటి దాన్ని కదా

కన్నీళ్లు దిగమింగి ఆప్యాయతను పంచుతా

నా మట్టి పరిమళాన్ని ప్రసాదంగా పెడతా

నా వృద్ధికి సహకరిస్తే.. వాడికి దండం పెడతా!


కొప్పు ల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

శ్రీల ప్రభుపాద ఉవాచ!

  శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

జీవులు, వారి రాజ్యాంగం ప్రకారం, ఆధ్యాత్మికంగా భగవంతుని వలె మంచివి, మరియు వాటి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే, భగవంతుడు ఎల్లప్పుడూ ఉన్నతంగా మరియు స్వచ్ఛంగా ఉంటాడు, భౌతిక ప్రకృతి రీతుల ద్వారా కలుషితం కాకుండా, జీవులు సత్త్వ, రజస్ మరియు తమో యొక్క భౌతిక రీతులతో కలుషితం కావడానికి తగినవి. 


భౌతిక రీతుల ద్వారా ఏర్పడిన ఈ కలుషితం జ్ఞానం, వైరాగ్యం మరియు భక్తి సేవ ద్వారా పూర్తిగా తొలగించబడుతుంది. 

భగవంతుని భక్తి సేవే అంతిమ అంశం, అందువల్ల భగవంతుని భక్తి సేవలో ప్రత్యక్షంగా నిమగ్నమై ఉన్నవారు ఆధ్యాత్మిక శాస్త్రంలో అవసరమైన జ్ఞానాన్ని పొందడమే కాకుండా, భౌతిక సంబంధం నుండి నిర్లిప్తతను పొందుతారు మరియు భగవద్గీత (14.26) లో పేర్కొన్న విధంగా సంపూర్ణ విముక్తి ద్వారా భగవంతుని రాజ్యానికి పదోన్నతి పొందుతారు:


మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే ।

స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే 


విముక్తి పొందని దశలో కూడా, ఒక జీవి ప్రత్యక్షంగా భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క అతీంద్రియ ప్రేమపూర్వక సేవలో లేదా రామ మరియు నరసింహ వంటి అతని స్వాంస విస్తరణలలో నిమగ్నమై ఉండవచ్చు.


ఈ విధంగా, అటువంటి అతీంద్రియ భక్తి సేవ యొక్క దామాషా మెరుగుదలతో, భక్తుడు బ్రహ్మ-గతిం లేదా ఆత్మ-గతిం వైపు ఖచ్చితమైన పురోగతిని సాధిస్తాడు మరియు చివరికి కపిలస్య గతి లేదా భగవంతుని నివాసం, కష్టం లేకుండా పొందుతాడు. 


భగవంతుని భక్తి సేవ యొక్క క్రిమినాశక శక్తి చాలా గొప్పది, ఇది భక్తుని ప్రస్తుత జీవితంలో కూడా భౌతిక సంక్రమణను తటస్థీకరిస్తుంది. 

సంపూర్ణ విముక్తి కోసం భక్తుడు తన తదుపరి జన్మ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.


(శ్రీమద్-భాగవతం, స్కందము.2

అధ్యాయం.7, వచనం.3)


హరే కృష్ణ 

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

ప్రకృతి తో సహజీవనం

 *కనుమరుగవుతున్న పెద్ద తరం..💕*


ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది. 


1. అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం.

2. ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం. 

3. బాధ్యతల్ని ఎరిగిన తరం. 'నేను' అనకుండా 'మనం' అంటూ బతికిన తరం. 

4. డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం. 

5. గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం. 

6. ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం.

7. కాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం. 

8. మొబైల్ ఫోన్ లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం. 

9. TV లు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం. 

10. GPS లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం.

11. సాంకేతికత లేకున్నా సుఖసంతోషాలతో బతికిన తరం.

12. ACలు, కూలర్లు లేకున్నా ఆరుబయట హాయిగా నిద్రించిన తరం.

13. మినరల్ వాటర్ కు బదులు చెరువు/బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం.

14. పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం.

15. రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం.

16. ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం. 

17. ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి - అటు తెలుగు లోనూ, ఇటు ఇంగ్లీష్ లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం.

18. కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం.

19. క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్ లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే - వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం. 

20. వీధి నాటకాలను, తోలు బొమ్మలాటలను, బుర్రకధలను ఆస్వాదించిన తరం. 

21. సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు-తెలుపు సినిమాలు చూసిన తరం.

22. ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం.

23. పనిమనుషులతో, యోగాలతో, జిమ్ లతో పని లేకుండా, బండెడు చాకిరీ చేసుకుంటూ, చెమటను చిందించి వందేళ్లు బతికిన తరం. 

24. బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం.

25. ఆస్తులకన్నా, ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యత నిచ్చిన తరం.

26. ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం.

27. భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం.

28. వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం. 

29. ఇతరుల మేలు కోరుకున్న తరం. 

30. నీతి నిజాయితీలతో మోసాలు చెయ్యకుండా బతికిన తరం.

31. రాళ్లు తిన్నా అరిగించు కోగలిగిన తరం. 

32. కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం.

33. హార్ట్ ఎటాక్, క్యాన్సర్ ల గురించి తెలియని తరం.

34. బీపీలు, షుగర్ లను దరిచేరనీయని తరం.

35. లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం.

36. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం. 

37. ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం.

38. ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం. పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం.

39. త్యాగాలతో పిల్లల భవిష్యత్ కు పునాదులు వేసిన తరం. కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం.

40. కాఫీ, టిఫిన్ లు లేకుండా చద్దన్నం తిని స్కూల్ కు పరుగెత్తిన తరం.....


అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. 


వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. 


*వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే - భవిష్యత్తు అంధకారమే!*


*🌺🌺🌺 చదివితే హృదయం తడిసి ముద్దవుతోంది. 🌺🌺🌺*


ఆ తరం నిజంగా మన సంస్కృతి, మన విలువల ప్రతిరూపం. వాళ్ల లాంటి మనసులు మళ్లీ రావు... వారిని కోల్పోవడం అంటే మన మూలాలను కోల్పోవడమే....


ఆ తరం చూపిన విలువలు, ప్రేమ, నిజాయితీ ఈ తరం నేర్చుకోవాలి...


సాంకేతికతతో ముందుకెళ్తున్నాం కానీ విలువలతో వెనక్కి వెళ్తున్నాం… ఆ తరం మనకు మానవత్వం అంటే ఏమిటో నేర్పింది...


లాంతర్ల కాంతిలో వెలుగులు నింపింది ఆ తరం – కరెంట్ దీపాల వెలుగులో చీకట్లు పెంచుకుంటోంది ఈ తరం.


*"వాళ్లు మనకు నేర్పింది ప్రకృతి తో సహజీవనం. మనం నేర్చుకుంటున్నది యాంత్రిక జీవనం."* 


*ఔనా? కాదా?*

*ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న...?*


🌺🌺🌺

నీవిచ్చు శక్తిని నీకె సమర్పించు

  నీవిచ్చు శక్తిని నీకె సమర్పించు

   కథనము తెలిపెను కౌశికుండు

నిన్నుపొందుటదియె నిజమైన ముదమని 

    సీతమ్మ‌ తలచెను చిత్తమందు

నీవిడు భాగ్యము నీకె యుపకరించ

    సుగ్రీవుడందించె సూత్రమిలను

నీపైన భక్తియే నిజమగు శక్తిగా

    సాధించి చూపె కేసరిసుతుడు

 

నన్నునీకర్పించి మసలుటన్నదొకటె

తెలియవలెనను సత్యము తెలిసికొంటి 

పూర్ణ విధుభాస కోదాడు పురనివాస 

పాపనిష్కాస రఘునాథ పరమపురుష

మనలోనే ఉన్నాడు!*

 *మనలోనే ఉన్నాడు!*


పంచభూతాత్మకమైన ఈ సృష్టి చిత్రాతిచిత్రమైంది. సృష్టికర్త పరమాత్మ. ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనకు వినే ఓపికా, తీరికా ఉండవు. నాభిలో కస్తూరిని ఉంచుకుని, దానికోసం గడ్డిలో వెతికే లేడిలా ఎక్కడెక్కడో స్వామికోసం అన్వేషిస్తూంటాం. ఆయన మనలోనే ఉన్నాడు. 'బుద్ధి' అనే శక్తి ద్వారా హెచ్చరిస్తుంటాడు. అంతరాత్మ ప్రభోదం నిత్యం జరుగుతూనే ఉంటుంది. దాన్ని గ్రహించి అప్ర మత్తులం కాకపోవడం మన అవివేకం, అజ్ఞానం. లోచూపు ఉంటేనే ఆయన కనపడ తాడు. తన ఇష్టులతోనే మాట్లాడతాడు. ఇష్టులంటే ఎవరు? ప్రతిఫలాపేక్ష వీడి, కర్మచేస్తూ ఫలితం ఆయనకే వదిలేసేవారు. వారినే భక్త శిఖామణులంటాం!


భగవంతుడి కళ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. రెప్పవాల్చకుండా ఆయనలా చూస్తుంటే మనం దర్శనం కోసం వెళ్లి కళ్లు మూసుకుంటాం. ఇంకా అజ్ఞానపు చీకట్లు, ఇక్కట్ల వలలో పడి కొట్టుమిట్టాడుతుంటాం. ఒక గురువు శిష్యుడికి హితబోధ చేస్తున్నాడు దేవుడు కనిపి స్తాడు, వినిపిస్తాడు. అది గ్రహించి నిన్ను నువ్వు కాపాడుకో నాయనా!' అని. శిష్యుడొకసారి అడవిలో వెళ్తుంటే ఓ ఏనుగు ఘీంకరిస్తూ అతనికెదురైంది. బెదిరిపోయి, భయంతో పరిగెత్తి ఆశ్రమానికి చేరాడు. గురువు దగ్గరికెళ్లి దేవుడంతటా ఉన్నాడన్నారు, ఆ ఏనుగులోనూ ఉండుంటే అది నా వెంట ఎందుకు పడింది గురువుగారూ'! అని అడిగాడు. గురువు బదులిస్తూ 'నువ్వు మూర్ఖంగా ఎదురెళ్తుంటే అది ఘీంకరించింది. అది నీకు హెచ్చరికే. పైగా ఏనుగుపైన ఉన్న మావటివాడు నిన్ను 'తప్పుకో' అని చెబుతూనే ఉన్నాడు. ఆయనా దేవుడే, కానీ నువ్వే వినిపించుకోలేదు. అదే అజ్ఞానం' అన్నారు.


హరిని అరిగా అహంకారంతో దూషించి, కన్న కొడుకు ప్రహ్లాదుణ్ని చిత్రహింసలు పెట్టిన హిరణ్యకశిపుడు- ఆ బాలుడితో శ్రీహరి చెప్పించిన పలుకుల విలువను అర్థం చేసుకోలేకపోయాడు. సృష్టిలో ప్రతి అణువు నుంచీ మనకు భగవత్సందేశం వినిపిస్తూనే ఉంటుంది. నేడు దొరికిన ఆహారంతో సంతృప్తి చెందమంటాయి పశుపక్ష్యాదులు. తనలాగా పరోపకారవ్రతం ఆచరించమంటుంది వృక్షం. నిశ్చలంగా ఉండమంటుంది పర్వతం. నిర్మలంగా జీవన ప్రవాహం కొనసాగనీ అంటుంది నది. తన దగ్గరికొచ్చి నామస్మరణంతో మనశ్శాంతి పొందమంటుంది దేవస్థానం. నీలోని దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు వినమంటుంది ధ్యానం. 'నేను నీవాణ్నే' అంటాడు సాటి మనిషి. తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు ఏదో సందర్భంలో మనకు దారి చూపుతుంటారు, సలహాలిస్తారు. సూచనలిస్తారు. వీళ్లంతా దేవుళ్లు కారా? ప్రత్యక్షమై ఎదుట అలంకారమూర్తిగా నిలుచుంటేనే నమ్మాలా? అందుకు కావాల్సిన యోగ్యత, తపన, భక్తిప్రపత్తులు, ఆత్మసమర్పణ భావం, ఆర్తి, శరణాగతి అనే లక్షణాలు మనలో ఉండాలి కదా! అటువంటి పరిణతి సాధించినవారితో పూర్వ యుగాలలో ఏదో రూపంలో మాధవుడు మాట్లాడాడు. ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ పొందిన వారి సన్నిధిలో ఆ సకలగుణనిధి సందర్శనమవుతుంది. సంపూర్ణ విశ్వాసంతో సంస్మరణ చేసే సాధుగుణ సంపన్నులకి సర్వేశ్వర సాక్షాత్కారం సర్వదా సంప్రాప్త మవుతుంది. ఇది సర్వకాలీన సత్యం.

కేళి

 కేళి 


ఎన్ని పాలపుంతల ఆశీర్వాదాలమో? 

ఎన్ని కాంతిపుంజాల సంతకాలమో? 

ఎన్ని విస్ఫులింగ చూర్ణ శకలాలమో? 

ఎన్ని ప్రణవగర్జల పూర్ణ కలశాలమో? 


నీపై, నాపై, ఆరని నక్షత్రధూళి, 

నువ్వూ, నేనూ, ఆగని అంతరిక్షకేళి.. 


ఎన్ని ప్రకృతులను ఏకం చేశామో? 

ఎన్ని ఆకృతులను మాయం చేశామో? 

ఎన్ని లోకాల బిందురూపాలమో? 

ఎన్ని కాలాల ఇంద్రజాలాలమో? 


నీలో, నాలో, అనంత విశ్వకాహళి,  

నువ్వూ, నేనూ, అనాది జీవగేహళి.. 


ఎన్ని వర్ణాలను ప్రతిబింబించామో? , 

ఎన్ని శబ్దాలను ప్రతిధ్వనించామో? 

ఎన్ని యుగాలుగా పరిభ్రమించామో? 

ఎన్ని అనుభవాలను పరిగ్రహించామో? 


నీదీ, నాదీ, నిర్నిద్రహేలా వైకుంఠపాళి,  

నువ్వూ, నేనూ, నిత్యచైతన్య దీపావళి..


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్


(రెండు వత్సరాల క్రితం వ్రాసుకొన్నది)

Panchanga పంచాంగం



  

భోజన పధ్ధతి -

 వాగ్బాటాచార్యుల వారు వివరించిన భోజన పధ్ధతి -

   

  ఆయుర్వేద చరిత్రలో వాగ్బాటాచార్యుల వారికి చాలా గొప్పస్థానం ఉన్నది. ఆయన రాసినటువంటి "అష్టాంగహృదయం" అనే గ్రంథం చాలా ప్రాచుర్యం పొందింది. వారు తెలియచేసిన 

భోజనపద్ధతి గురించి మీకు వివరిస్తాను.

       

మనం తీసుకునే ఏ పదార్థం అయినా మోతాదుగా భుజించవలెను. ఈ మోతాదు జఠరాగ్నిని దీపనం చెందించును. తినగలిగినతలో గట్టిగా ఉండు పదార్దాలను సగమే తినవలెను . లఘుపదార్థాలను కడుపునిండా ఇక తినలేము అన్నంత అధికంగా తినకూడదు. అనగా మూడు వంతులు తిని కడుపులో ఒక వంతు ఖాళీగా ఉంచవలెను. మోతాదుకు తక్కువుగా భుజించకూడదు. దానివల్ల శరీరం యొక్క బలము , ఓజస్సు , పుష్టి నశించును. సకల వాతవ్యాధులు సంభవించును.

             

    మన శరీరానికి అవసరం అయిన దానికంటే అతి తక్కువ మోతాదులో ఆహారాన్ని భుజించుచున్న వాత,పిత్తాలను ప్రకోపింపచేయును . దీనివలన త్వరగా అలిసిపోయి నీరసం వచ్చుట, బలహీనత వంటి సమస్యలు వచ్చును. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కావోచ్చు . పదార్ధాలను అధికంగా భుజించటం ఒక్కటే దోషం కాదు. ఇష్టం లేని పదార్దాలు భుజించటం , కడుపుబ్బరం కలిగించునవి , సరిగ్గా పక్వము కానివి , గట్టిగా ఉండి అరుగుటకు బాగా సమయం తీసుకొనునవి, బాగా కారంగా ఉండునవి, చల్లబడిపోయినవి , అశుచిగా ఉండునవి , దాహాన్ని అధికము చేయునవి, ఆరిపోయి గట్టిగా అయినవి, నీళ్లలో ఉన్నవి , మొదలయిన పదార్దాలు కూడా జీర్ణం కావు. శోకం , కోపం , భయం చెంది ఉన్నప్పుడు తినిన ఆ పదార్దాలు కూడా జీర్ణం అవ్వవు.

              

     భోజనం తరువాత అది పూర్తిగా అరగక పూర్వం మరలా భుజించకూడదు. సమయం కాని సమయంలో కొంచం కాని ఎక్కువ కాని భుజించరాదు . మలమూత్రములు సంపూర్ణంగా బయటకి వెడలిన తరువాత హృదయం నిర్మలమైనప్పుడు , వాత,పిత్త,కఫాలు స్వస్థానం నందు ఉన్నప్పుడు , త్రేన్పులు లేనప్పుడు , బాగుగా ఆకలి అవ్వుచున్నప్పుడు , జఠరాగ్ని పదార్దాలను జీర్ణం చేయు సమర్ధం అయి ఉన్నప్పుడు , శరీరం తేలికగా ఉన్నప్పుడు మాత్రమే భుజించవలెను .

                  

     భోజనకాలమున స్నానం చేసి శుచి అయ్యి , ఏకాంతంగా కూర్చుని పితృదేవతలు , బాలురు, అతిధులు వీరిని తృప్తులు కావించి తాను పెంచుతున్న పశుపక్ష్యాదులకు ఆహారం అందించి మనఃశుద్ధి కలిగి , ఎవరిని నిందించకుండా , మాట్లాడకుండా తనకు హితమైనది , తనయందు భక్తి కలిగినవారు పెట్టినది అయిన ఆహారంను భుజించవలెను.

          

     ఉదరమును నాలుగు భాగాలుగా విభజించి రెండు భాగములను ఆహారపదార్థాల చేత , ఒక భాగం ఉదకాది ద్రవపదార్థాల చేత నిండింపవలెను . నాలుగో భాగం వాయుప్రసారానికి అనువుగా ఖాళీగా ఉంచవలెను. భోజనం అయిన వెంటనే చదువుట, నడుచుట, పడుకోవడం , ఎండలో ఉండటం, అగ్నికి సమీపాన ఉండటం , వాహనములు ఎక్కుట, ఈదుట, ఎగిరి దాటుట మున్నగునవి చేయకూడదు .

       

    పైన చెప్పిన నియమాలు ప్రతి ఒక్కరు పాటించినచో మంచి ఆరోగ్యవంతులు అవుతారు.

ఆయుర్వేదం నందు ఒక సామెత ఉంది. "ఏకకాల భోజనే మహాయోగి , ద్వికాల భోజనే మహాభోగి , త్రికాల భోజనే మహా రోగి " అని దీనినిబట్టి చూడవచ్చు ఆయుర్వేదం మనం తీసుకునే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో. ప్రతిఒక్కరు నియమిత సమయంలో నియమిత ఆహారాన్ని తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. 

  

     

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

  

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          

        కాళహస్తి వేంకటేశ్వరరావు  

      

    అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  

                  9885030034