22, డిసెంబర్ 2020, మంగళవారం

వేదములు

 *34-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*14.(A) వేదశాఖలు*

((((((((((🕉))))))))))


*వేదాలు అనంతములు (అనంతా వై వేదాః). వేదాంతమంటే వేదాలయొక్క అంతం. ''అనంతమైన వేదాలకి అంతమేమిటి''?వేదాల ముఖ్యోద్దేశం ఆత్మసాక్షాత్కారం. ఇదే ఆధ్యాత్మిక సత్యాలకు చివరిమెట్టు. దీని గురించి చెప్పటం వల్ల వేదాంత మయింది. మరో విధంగా చెప్పాలంటే, వేదాల అన్వేషణకు అంతమన్నమాట. వేదాల చివరిలో ఉంటుంది వేదాంతం. ఏ కారణాలనీ అడుగకుండా, విధిగా తమ వేదశాఖని అధ్యయనం చెయ్యాలి. అభ్యసించాలి.*



 *వేదశాఖకి సంహిత, బ్రాహ్మణము, ఆర్యణకము, చిట్టచివర ఉపనిషత్తు ఉంటాయి. వేదశాఖకి చివరిది ఉపనిషత్తు. అనంతమైన వేదాలను శాఖలుగా విభజించటంలో అంతరార్థమేమిటి? ఆధ్యాత్మిక ప్రగతి సుసాధ్యం కావటానికి మనిషికి అన్ని విషయాలూ బోధించాలి. మొదటిది, వేదాధ్యయనం, వేదాలని వల్లె వేయటం. ఆ తరువాత యజ్ఞాలూ ఇతర కర్మలూ అభ్యసించాలి, ఆచరించాలి.*



*వీటికి సంబంధించిన మంత్రాలను నేర్చుకోవాలి. ఆ తరువాత యజ్ఞాల ప్రయోజనం గురించి తెలుసుకోవాలి. చిట్టచివరికి పరమాత్మ తత్త్వాన్ని పఠించి, అనుభవసిద్ధం చేసుకోగలగాలి. వేదాన్ని పఠించే విద్యార్థికి ఇవన్నీ నేర్పాలి. ఆత్మసాక్షాత్కారానికి సరిపడినంత నేర్పాలి. అన్ని వేదశాఖలనూ క్షుణ్ణంగా తెలుసుకోవటం అసాధ్యం. కొన్ని వేల సంవత్సరాలు పఠించిన తరువాత కూడ భరద్వాజ ముని వంటి వారికి వేదమనే పర్వతం నుండి గుప్పెడు మట్టి మాత్రమే లభించిందట.*



*కాబట్టి, మనిషికి మనస్సు క్షాళనమై, పరమాత్మలో లీనమవటానికి సరిపడినంతమేరకు అనంతమైన వేదాలని కూర్చి వర్గీకరించారు. ఇవే వేదశాఖలు. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ బ్రాహ్మణుడు నిర్వహించ వలసిన విధులను వేదశాఖ వివరిస్తుంది. ఆరంభంలో శాఖను అధ్యయనం చెయ్యాలి. అంటే, సంహితలోని మంత్రాలను కంఠస్థం చెయ్యాలి. ఆ తరువాత బ్రాహ్మణాలలోని మంత్రాల సహాయంతో యజ్ఞాలను చెయ్యాలి.*



 *ఆ పిదప వెలుపలి కర్మకూ లోపలి అనుభవానికీ గల అంతరాన్ని కలిపే ఆరణ్యకాలను మననం చెయ్యాలి. ఆ తరువాత ఆంతరసత్యం గురించి తెలిపే ఉపనిషత్తులని జీర్ణం చేసుకోవాలి. అంతరము, బాహ్యము అన్న భేదభావం సమసిపోయే మోక్ష స్థితిని అందుకోవాలి. ప్రతి శాఖకీ ఇదే ప్రణాళిక, ఇదే ఉద్దేశం.పరిణితాత్మునికి ఒక్క మంత్రమే చాలు సత్యాన్ని గ్రహించటానికి. కాని సామాన్యుడు ఎన్నో కర్మలను ఆచరించాలి, ప్రతి దశలోనూ అధ్యయనం, మననం చేస్తూనే ఉండాలి. అందువల్లనే ప్రతిశాఖలోనూ సామాన్యుడు ముక్తినొందటానికి కావలసిన మంత్రాలు, కర్మలు, ఆధ్యాత్మిక ఆదేశాలు ఉన్నాయి.*



 *వైదిక కర్మలు, అనుష్ఠానాలు చేయలేని వారికి తమ విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చటం, మానసికోన్నతికి, ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తాయి. ఏ వర్గానికి చెందినా, విధ్యుక్త ధర్మాన్ని నిజాయితీతో నెరవేర్చి, ఫలితాన్ని భగవంతునికి వదిలితే గమ్యం చేరవచ్చు. కృష్ణ భగవానుడు గీతలో ఇలా అన్నాడు.*



*''స్వ కర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దన్తిమానవాః''       (18 : 46) యుద్ధాన్ని చేసి దేశాన్ని రక్షించటం కొందరి ధర్మం. మరొకడు వ్యాపారి. ఇంకొకడు పశులకాపరి, గోవులను పరిరక్షిస్తాడు. మరొకడు కాయకష్టం చేస్తాడు, కూలి వాళ్లని సమకూరుస్తాడు. తన రంగంలో పనిచేసుకొంటూ భగవత్సాక్షాత్కారాన్ని పొందవచ్చు.*



*లోకంలో అందరూ సుఖప్రదంగా ఉండటానికి అనువైన వృత్తులనూ ధర్మాలనూ కొందరు ఆచరిస్తూంటే బ్రాహ్మణుని విధి ఏమిటి? జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది సమాజశ్రేయస్సు కోసం దైవానుగ్రహం సంపాదించటం. అటువంటి అనుగ్రహాన్ని సంపాదించటం బ్రాహ్మణుని విధి. భగవంతునికి సామంతులనదగ్గ దేవతల అనుగ్రహాన్ని కూడ బ్రాహ్మణులు అందరికీ లభించేట్టు పాటుపడాలి. అతడు పఠించే వేదమంత్రాలూ, చేసే వైదిక కర్మలూ సమాజంలోని అందరి శ్రేయస్సుకీను - తన ఉన్నతికోసమే కాదు. అలౌకిక శక్తులతో వ్యవహారం కాబట్టి అతను మంత్రాలను నేర్చుకోవాలి. ఆ మంత్రాలిచ్చే శక్తి సంపాదించాలి. దానికై మిగిలిన వారి కంటె ఎక్కువ నియమమూనిష్ఠా అనుసరించాలి.*



 *బ్రాహ్మణునికి వలె అంతటి దీక్ష యితరులకి అవసరం లేదు. బ్రాహ్మణుని విధ్యుక్త ధర్మం లోక శ్రేయస్సు కోసమే ప్రార్థన చేయటం, కృషి చేయటం అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే కొన్ని విద్యలకు బ్రాహ్మణుల కొరకే నియుక్తమై నాయన్న తప్పుడు అభిప్రాయం పోతుంది. అంతేకాక, ఇతర కళలను శాస్త్రాలను పనులను చేయటాన్నీ కూడ బ్రాహ్మణుడు అభ్యసించాలి. అట్లా చేస్తేనే ఇతరులకు తమ విధులను గురించి బోధించ గలుగుతాడు. బోధనే అతని వృత్తి. మిగిలిన వృత్తుల గురించి ఎరుక కలిగి యుండాలి వాటిని నేర్పటానికి మాత్రమే. తనకి విధింపబడని వృత్తులను చేపట్టరాదు.*



*దేశ రక్షణ, వ్యాపారము, వ్యవసాయము ఇతర వృత్తులను అతడు చేపట్టక ఆయా వృత్తులను ఆశ్రయించిన వారికి తగిన శిక్షణ ఇవ్వకలిగి, తద్వారా వారి శీలాన్నీ, మనస్సునీ, బుద్ధినీ రూపొందించ గలగాలి. అందుచేత, బ్రాహ్మణునిది గురుతరమైన భాద్యత. ఈ భాద్యతని నిర్వహించే వానికి చిత్తశుద్ధీ, పరిణిత బుద్ధీ లేకపోతే సత్ఫలితముండదు. అతని మనస్సూ, బుద్దీ బాగా వికసించి యుండకపోతే ఇతరులకు ఉన్నతి నెట్లా కలిగించ గలుగుతాడు? కాని అతనికి ఒక పెద్ద ఆటంకముంది. తాను ఎప్పుడూ బుద్ధితోనే పనిచేస్తాను కదాని తాను ఇతరుల కంటే అధికుడనన్న భావం కలిగితే అది పెద్ద ఆటంకమవుతుంది.*



 *ఈ కారణాల వల్ల బ్రాహ్మణుడు ఎంతోపరిశుద్ధతతో ఉండాలి. అతని అహంకార మధికమవటానికి ఎన్ని కారణాలున్నా, అతను ఎంతో వినమ్రుడై, స్వార్థరహితుడై యుండాలి. అందువల్లనే అతని అహంకారమూ, ఇతర వికారాలు సమసిపోయి, సాధువవటానికి - అతనికి నలభై సంస్కారాలు విధించారు.*


🕉🌞🌏🌙🌟🚩

ఋషులు జాబితా*

 *హిందూ ఋషులు జాబితా*

అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు*

అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న

ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష


దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.

బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.

మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.

రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.

అగ్ని మహర్షి

అగస్త్య మహర్షి

అంగీరస మహర్షి

అంగిరో మహర్షి

అత్రి మహర్షి

అర్వరీవత మహర్షి

అభినామన మహర్షి

అగ్నివేశ మహర్షి

అరుణి మహర్షి

అష్టావక్ర మహర్షి

అష్టిక మహర్షి

అథర్వణ మహర్షి

ఆత్రేయ మహర్షి

అథర్వాకృతి‎

అమహీయుడు

అజామిళ్హుడు‎

అప్రతిరథుడు‎

అయాస్యుడు‎

అవస్యుడు

అంబరీషుడు

ఇరింబిఠి‎


ఉపమన్యు మహర్షి

ఉత్తమ మహర్షి

ఉన్మోచన

ఉపరిబభ్రవుడు

ఉద్దాలకుడు‎

ఉశనసుడు

ఉత్కీలుడు

ఊర్ఝ మహర్షి

ఊర్ద్వబాహు మహర్షి

ఋచీక మహర్షి

ఋషభ మహర్షి

ఋష్యశృంగ మహర్షి

ఋషి


ఔపమన్యవ మహర్షి

ఔరవ మహర్షి

కపిల మహర్షి

కశ్యప మహర్షి

క్రతు మహర్షి

కౌకుండి మహర్షి

కురుండి మహర్షి

కావ్య మహర్షి

కాంభోజ మహర్షి

కంబ స్వాయంభువ మహర్షి

కాండ్వ మహర్షి

కణ్వ మహర్షి

కాణ్వ మహర్షి

కిందమ మహర్షి

కుత్స మహర్షి

కౌరుపథి‎

కౌశికుడు‎

కురువు

కాణుడు‎

కలి

కాంకాయనుడు

కపింజలుడు‎

కుసీదుడు

గౌతమ మహర్షి

గర్గ మహర్షి

గృత్సమద మహర్షి

గృత్సదుడు‎

గోపథుడు‎

గోతముడు

గౌరీవీతి

గోపవనుడు

గయుడు

చ్యవన మహర్షి

చైత్ర మహర్షి

చాతనుడు‎

జమదగ్ని మహర్షి

జైమిని మహర్షి

జ్యోతిర్ధామ మహర్షి

జాహ్న మహర్షి

జగద్బీజ

జాటికాయనుడు‎

తండి మహర్షి

తిత్తిరి మహర్షి

త్రితుడు

తృణపాణి

దధీచి మహర్షి

దుర్వాస మహర్షి

దేవల మహర్షి

దత్తోలి మహర్షి

దాలయ మహర్షి

దీర్ఘతమ మహర్షి

ద్రవిణోదస్సు‎

నచికేత మహర్షి

నారద మహర్షి

నిశ్ఛర మహర్షి

సుమేధా మహర్షి

నోధా

నృమేధుడు

పరశురాముడు

పరాశర మహర్షి

పరిజన్య మహర్షి

పులస్త్య మహర్షి

ప్రాచేతస మహర్షి

పులహ మహర్షి

ప్రాణ మహర్షి

ప్రవహిత మహర్షి

పృథు మహర్షి

పివర మహర్షి

పిప్పలాద మహర్షి

ప్రత్య్సంగిరసుడు

పతివేదనుడు

ప్రమోచన‎

ప్రశోచనుడు‎

ప్రియమేథుడు

పార్వతుడు

పురుహన్మ‎

ప్రస్కణ్వుడు

ప్రాగాథుడు

ప్రాచీనబర్హి

ప్రయోగుడు

పూరుడు

పాయు

భరద్వాజ మహర్షి

భృగు మహర్షి

భృంగి మహర్షి

బ్రహ్మర్షి మహర్షి

బభ్రుపింగళుడు

భార్గవవైదర్భి‎

భాగలి

భృగ్వంగిరాబ్రహ్మ

బ్రహ్మస్కందుడు‎

భగుడు‎

బ్రహ్మర్షి

బృహత్కీర్తి‎

బృహజ్జ్యోతి‎

భర్గుడు

మరీచి మహర్షి

మార్కండేయ మహర్షి

మిత మహర్షి

మృకండు మహర్షి

మహాముని మహర్షి

మధు మహర్షి

మాండవ్య మహర్షి

మాయు

మృగారుడు‎

మాతృనామ‎

మయోభువు‎

మేధాతిథి

మధుచ్ఛందుడు

మనువు

మారీచుడు

యాజ్ఞవల్క మహర్షి

యయాతి‎

రురు మహర్షి

రాజర్షి మహర్షి

రేభుడు

వశిష్ట మహర్షి

వాలఖిల్యులు

వాల్మీకి మహర్షి

విశ్వామిత్ర మహర్షి

వ్యాస మహర్షి

విభాండక ఋషి

వాదుల మహర్షి

వాణక మహర్షి

వేదశ్రీ మహర్షి

వేదబాహు మహర్షి

విరాజా మహర్షి

వైశేషిక మహర్షి

వైశంపాయన మహర్షి

వర్తంతు మహర్షి

వృషాకపి

విరూపుడు‎

వత్సుడు‎

వేనుడు

వామదేవుడు‎

వత్సప్రి

విందుడు

శంఖ మహర్షి

శంకృతి మహర్షి

శతానంద మహర్షి

శుక మహర్షి

శుక్ర మహర్షి

శృంగి ఋషి

శశికర్ణుడు

శంభు‎

శౌనకుడు

శంయువు‎

శ్రుతకక్షుడు

సమ్మిత మహర్షి

సనత్కుమారులు

సప్తర్షులు

స్థంభ మహర్షి

సుధామ మహర్షి

సహిష్ణు మహర్షి

సాంఖ్య మహర్షి

సాందీపణి మహర్షి

సావిత్రీసూర్య

సుశబ్దుడు‎

సుతకక్షుడు‎

సుకక్షుడు‎

సౌభరి

సుకీర్తి‎

సవితామహర్షి సామావేదానికి మూలము.

సింధుద్వీపుడు

శునఃశేపుడు

సుదీతి

హవిష్మంత మహర్షి

హిరణ్యరోమ మహర్షి

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*రెండో పురుషార్థం

 *రెండో పురుషార్థం*

🕉️🌞🌎🏵️🌼🚩


 *‘ధనం కలిగినవాడే బలవంతుడు. ధనం గలవాడే పండితుడు. ధనం* *సర్వశ్రేయాలకు నిదానం. ధనం లేనివాడి జీవనమేల? అర్థ* *పరిహీనుడికి  నిరంతరం ఖేదం సంభవిస్తుంది’ అంటాడు నీతిచంద్రికకారుడు. ‘అర్థ’* *శబ్దానికి అర్థాలు చాలా ఉన్నా- ధనవాచకంగా లోకంలో రూఢికెక్కింది. పురుషార్థాలు *నాలుగింటిలో రెండోది ‘అర్థం’.* 

 *మానవులు కోరే సమస్త వస్తు సమూహాన్ని ‘అర్థ’ శబ్దం సూచిస్తుంది. విద్య, భూమి, సువర్ణం, పశువులు, ధన ధాన్యాలు మొదలైనవన్నీ ‘అర్థం’లో భాగమేనన్నాడు* *వాత్సాయనుడు. ఆర్జనం, వర్ధనం, రక్షణం అనే మూడూ అర్థమనే పురుషార్థ* *స్వరూపమంటాడు దండి దశకుమార చరిత్రలో. ధర్మాచరణకు, కామ* *పురుషార్థానుభవానికి అర్థమే కారణమవుతుంది.* *ధర్మకామాలు రెండూ అర్థానికి రెండు అవయవాలని, అర్థసిద్ధి చేతనే రెండింటి అనుభవం కలుగుతుందని మహాభారతం శాంతిపర్వం చెబుతోంది.* 

 *అర్థ ప్రాధాన్యాన్ని గురించి* *శాస్త్రాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఎంతగానో చెప్పాయి. ధనాన్ని* *న్యాయబద్ధంగా సంపాదించు కోవాలి. ధర్మ పద్ధతిలో అనుభవించాలి. త్యాగబుద్ధితో దానం చేయాలి. మనిషికి వస్తు సంపదల మీద, సుఖభోగాల మీద కోరిక కలుగు తుంది. ఆ కోరిక తీర్చుకునేందుకు తనకు చేతనైన మార్గంలో ప్రయత్నించి వాటిని సాధిస్తాడు. తానను కున్నవి కొన్ని లభించినా, మరికొన్ని సాధించవలసిన కొత్తవి చేరుతూ ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి మనిషి లోకాన్ని సేవిస్తూ, శ్రమిస్తూ ఉంటాడు. తాననుకున్నది సాధించుకోవడం ముఖ్యం* *కనుక నీతి తప్పి ప్రవర్తించడానికి వెనకాడడు. క్రమంగా అన్ని విధాలా పతనమైపోయే ప్రమాదమూ ఉంది. మన సనాతన* *సంప్రదాయంలో అర్ధకామాలకు ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. మనిషి తాను చేయదలచిన ప్రయాణానికి తన పాదాల సాయం స్వీకరించినట్లు అర్థ కామాలనే తన పాదాల సాయంతో ధర్మం ముందుకు సాగుతుంది.* 

 *ధృతరాష్ట్రుడు, అతడి పుత్రులు, పుత్రుల మిత్రులు జీవితానికి అర్థమే* *పరమార్థమనుకున్నారు. అర్ధాన్ని(రాజ్యాన్ని) తమదిగా నిలబెట్టుకోవాలన్న* *తాపత్రయంతో పాండవుల్ని ఎన్నో ఇడుములపాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు తామనుకున్నదాన్ని దక్కించుకోకుండానే పరలోకాన్ని చేరారు.* *ధర్మరాజుది ధర్మోత్తరమైన జీవితం. పెదతండ్రి రాజ్యం మొత్తానికి తనను* *యువరాజును చేసినప్పుడు రాజ్యం దక్కిందని అతడు పొంగిపోలేదు. కొంతకాలం* *తరవాత కుటిలబుద్ధితో ధృతరాష్ట్రుడు అర్ధరాజ్యమే ఇచ్చినప్పుడు* *కుంగిపోనూలేదు. ధర్మానికి విరుద్ధం కాని అర్థ కాంక్ష అతణ్ని అర్ధరాజ్యస్థితి నుంచి సార్వభౌమ స్థితికి పెంచింది.* 

 *ధనానికి దానం, భోగం, నాశం* *అనే మూడు గతులున్నాయి.* *ఒకరికి పెట్టక, తాను తినక,* *దాచి పెట్టిన సంపదకు ఏదో ఒక మార్గంలో నాశనం తప్పదు. ‘సంపాదించిన విత్తానికి* *త్యాగమే రక్షణ. చెరువులో నిండుగా ఉన్న నీటికి పారుదల ఒక్కటే రక్షణ’ అంటోంది విక్రమార్క చరితం. పాత్రుడికి దానం చేయ మన్నారు. అది ఉత్తమం. తాను ఆర్జించింది అనుభవించడం తప్పు కాదు. కానీ అది మధ్యమమే. ఈ రెండూ జరగకపోతే దొంగలు అపహరించుకుపోతారు. ఇది అధమం. ధనానికి ధర్మం, అగ్ని, రాజు, దొంగలు అనే నలుగురు* *దాయాదులు. వీరిలో జ్యేష్ఠమైన ధర్మానికి అవమానం కలిగితే తక్కిన ముగ్గురికీ కోపం వస్తుందంటాడొక కవి.* *దానశీలురు ధనాన్నంతా దానం చేసి సర్వమూ కోల్పోయినా అది అతడికి శోభనే కలిగిస్తుంది. అర్ధ స్వభావాన్ని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే ఒక పురుషార్థాన్ని సాధించగలుగుతాం.* 


డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


🕉️🌞🌎🏵️🌼🚩

*సత్యం, ధర్మం....

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


              *సత్యం, ధర్మం....*

                 ➖➖➖✍️


*సత్యం మాతా పితా జ్ఞానం*

*ధర్మో భ్రాతా దయా సఖా।*

*శాంతిః పత్నీ క్షమా పుత్రః*

*షడేతే మమ బాంధవాః।।*

  

సత్యం-సత్యసంధతయే,

మాతా-(నాకు)తల్లి,

జ్ఞానం-జ్ఞానమే,

పితా-తండ్రి,

ధర్మః-ధర్మమే,

భ్రాతా-సోదరుడు,

దయా-దయాగుణమే,

సఖా-నా మిత్రుడు,

శాంతిః-శాంతగుణమే,

పత్నీ-భార్య,

క్షమా-ఓర్పే,

పుత్రః-కుమారుడు,

ఏతే షట్-ఈ ఆఱుగురే,

మమ-నాకు,

బాంధవాః-బంధువులు।।


*సత్యగుణము నా తల్లి,*

*జ్ఞానం నా తండ్రి,*

*ధర్మం నా సోదరుడు,*

*దయాగుణమే నా మిత్రుడు,*

*శాంతగుణమే నా భార్య,*

*సహనగుణమే నా పుత్రుడు.*

*ఈ ఆఱుగురే నా బంధువులు*



*మాతులో యస్య గోవిందః*

*పితా యస్య ధనంజయః।*

*సోsపి కాలవశం ప్రాప్తః*

*కాలో హి దురతిక్రమః।।*


గోవిందః-శ్రీ కృష్ణ భగవానుడు,

యస్య-ఎవ్వని యొక్క,

మాతులః-మామయో,

ధనంజయః-అర్జునుడు,

యస్య-ఎవ్వనికి,

పితా-తండ్రి యో,

సః అపి-అలాంటి అభిమన్యుడు కూడా,

కాలవశం ప్రాప్తః-కాలధర్మం చెందాడు,

కాలః-కాలము(యముడు),

దురతిక్రమః-తప్పించుకోలేనిది(తప్పించుకోలేనివాడు),

హి-కదా।।


*అభిమన్యుడు మహాభారతయుద్ధంలో బాలవీరునిగా విజృంభించినా వీరమరణం పొందాడు,*

*వాని మామ సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్మ తండ్రి యైతే మహావీరుడు అర్జునుడు దీనినిబట్టి తెలిసేది ఏమంటే"ఎంతటివారైనా కాలధర్మంనుంచి తప్పించుకోలేరు గదా।"అని.*✍️


                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మంత్ర పుష్పం

 🌹మంత్ర పుష్పం🌹 వేదాంతర్గతమైనది. తైత్తిరీయోపనిషత్తు లో మంత్ర పుష్పం, తైత్తిరీయారణ్యకంలో మహా మంత్రపుష్పం ఉన్నాయి. సహస్రశీర్షం దేవం' ఇత్యాది మంత్రాలు మంత్రపుష్పంగానూ, 'యోపాం పుష్పం వేద' ఇత్యాది మంత్రాలు మహా మంత్రపుష్పంగానూ ప్రసిద్ధిచెందాయి.


మననం చేసేవాణ్ణి రక్షించేది మంత్రం. మామూలుగా అయితే పుష్పాలతో దేవున్ని పూజిస్తాము. మంత్రం పఠిస్తూ పుష్పాన్ని సమర్పించడమనీ లేక మంత్రమనే పుష్పాన్ని సమర్పించడమనీ రెండు విధాల అర్ధాన్ని మంత్రపుష్పం అనే మాటకు చెప్పవచ్చును.


ధ్యానం, ఆవాహనం, మొదలైన షోడశోపచారాల పూజలో మంత్రపుష్పం కూడా ఒక అంగము. భగవత్పూజావసానం వంటి మంగళకర సందర్భాలలో మంత్రపుష్పం పఠించాలి.


సారాంశం సవరించు

పరమ పురుషుడే మంత్రపుష్పాన్ని తొలుత ఉచ్చరించాడంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశాడని చెబుతారు. మోక్ష మార్గానికి మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోంది. అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది. చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే. అందుకే "దైవం పరంజ్యోతి" అంటారు. అతనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.🙏🙏🙏🙏

ప్రణవం

 ప్రణవం


 వేదాలకు పునాది అనాది ప్రణవనాదం. లోకాలన్నీ ప్రణవంనుంచే ప్రభవించాయంటారు. పరమేశ్వరుడు ప్రణవ మంత్రాసీనుడై భాసిస్తుంటాడని, సంసార సముద్రాన్ని దాటించగల ఏకైకనాదం ప్రణవమని చెబుతారు.


'ఓంకారం ఎప్పటికీ నశించని నాదం. ఓంకారమే ఈ సకల విశ్వం. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఓంకారమే. కాల తీరాలకు ఆవల కూడా నిత్యమై ధ్వనించేది ఓంకారమే. ఈ విశ్వమంతా పరబ్రహ్మ స్వరూపమే. మనలోని పరమాత్మ ప్రణవనాదమే' అని మాండూక్యోపనిషత్తు విస్పష్టంగా ప్రవచించింది.

ఆద్య మంత్రం ఓంకారం బ్రహ్మానికి ప్రతీక. ఓంకారంపై ధ్యానం చేస్తే అంతిమ సత్య సాక్షాత్కారం సాధ్యమవుతుందని పెద్దల మాట. ప్రణవ ధ్యానం ఒక అవిచ్ఛిన్న కాంతిధారగా పరాత్పరుడివైపు ప్రసరిస్తుంది. ఓంకారాన్ని జపించడంవల్ల మృణ్మయ శరీర భూమిక నుంచి ఆత్మ పరమోన్నత లక్ష్యంవైపు ప్రయాణిస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు.

ఒకసారి 'ప్రణవ మంత్రానికి అర్థం నాకు తెలియదు' అని బ్రహ్మ అన్నప్పుడు అక్కడే ఉన్న షణ్ముఖుడు ఆయన్ని కటకటాల వెనక బంధించాడు. తనకు వేదాల్లోని జ్ఞానమంతా తెలుసు, కాని ప్రణవ మంత్రానికి పరిపూర్ణ అర్థం తెలియదని బ్రహ్మ అన్నాడు సవినయంగా. మహోన్నత జ్ఞానసిద్ధిని పొందినవారు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు కొంతవరకు.


బ్రహ్మను కారాగారంలో బంధించి షణ్ముఖుడు సృష్టి చేయడానికి ఉపక్రమిస్తాడు. శివుడు షణ్ముఖుణ్ని వారించి, ఎక్కువ కాలం బ్రహ్మను కారాగారంలో ఉంచరాదని, విడుదల చేయాలని నచ్చజెప్పాడు. 'కారాగారం గోడల మధ్య ఎలాంటి భావాలు నీకు కలిగాయి' అని శివుడు బ్రహ్మను అడుగుతాడు. కారాగారం తపస్సు చేయడానికి అనువైన చోటుగా భావించానని బ్రహ్మ సమాధానం ఇస్తాడు. శివుడు షణ్ముఖుణ్ని తన ఒడిలో కూర్చోబెట్టుకొని 'ప్రణవమంటే అర్థం ఏమిటో నువ్వు చెప్పు' అని అడుగుతాడు. 'నీకు రహస్యంగా చెవిలో చెబుతాను' అని షణ్ముఖుడు అంటాడు.

'ప్రణవం మహిమ వర్ణనాతీతం. కర్మబంధాల నుంచి విముక్తం పొందడానికే ఆత్మలు భూమిపై జన్మలు ఎత్తుతున్నాయి. ఈ జీవన చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. చివరికి భగవంతుణ్ని తెలుసుకుని ముక్తి పొందేవారు జీవులు. దైవం ప్రణయానంతరం సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు, ఓంకారం వినిపిస్తుందంటారు. సమస్త దేవతలకు, లోకాలకు, ఆత్మలకు మూలం ప్రణవమే!'

ప్రణవనాద సుధారసమే భువనమోహనమైన రామావతారమై దిగివచ్చిందని త్యాగయ్య గానం చేశాడు. 'నాదాల్లో ప్రణవనాదాన్ని నేను' అని శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు. గణపతి ఓంకార రూపంతో ప్రకాశిస్తాడు. 'ప్రణవమే ధనుస్సు. ఆత్మే బాణం. బ్రహ్మమే లక్ష్యం. గురి తప్పకుండా ఆత్మ లక్ష్యాన్ని చేరాలి. బాణం లక్ష్యాన్ని ఛేదించినట్లు ఆత్మ బ్రహ్మంలో లీనం కావాలి' అని ఒక ఉపనిషత్తు గానం చేసింది.


భూమాత గర్భంనుంచి, తల్లి గర్భం నుంచి జన్మించానని భావిస్తున్న జీవాత్మ మొదట పరమాత్మనుంచే ప్రభవించింది. ఆత్మ ఆది ప్రణవమే. అది నిత్య కాంతి ధామం. యుగాల పరిణామం అనంతరం అటువైపే ఆత్మ మహాప్రస్థానం

Good morning to all the members 

🙏🙏

*సప్త మాతృకలు

 *సప్త మాతృకలు*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*విశ్వ నిర్వహణ శక్తిని జగన్మాతగా దర్శించి, వేద పురాణాగమాలు ఆ శక్తి తాలూకు వివిధ కోణాలను వివిధ రూపాలుగా ఆవిష్కరించాయి. వాటి ఉపాసనా విధులను ఏర్పరచాయి. ఆ పద్ధతిలో 'సప్త మాతృకా' తత్వం ఒకటి.*



*శుంభునిశుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయంలో, భయంకరమైన అసుర సేనల్ని నిర్మూలించడానికే బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా 'దేవీ మహాత్మ్యం' వర్ణించింది.*



*1. బ్రహ్మలోని శక్తి 'బ్రాహ్మి',*


*2. విష్ణుశక్తి 'వైష్ణవి',*


 *3. మహేశ్వరుని శక్తి 'మహేశ్వరి',*


 *4. స్కందుని శక్తి 'కౌమారి',*


 *5. యజ్ఞ వరాహస్వామి శక్తి 'వారాహి',*


 *6. ఇంద్రుని శక్తి (ఐంద్రి),*


 *7. అమ్మవారి భ్రూమధ్యం (కనుబొమల ముడి) నుంచి ఆవిర్భవించిన కాలశక్తి 'కాళి' (చాముణ్డా).*


 *-వీరిని 'సప్త మాతృకలు' అంటారు.*


 *ఈ శక్తులు విశ్వాన్ని నిర్వహించే ఏడు రకాల మహా శక్తులు.*



*ఆధ్యాత్మిక సాధనలోని పురోగతి క్రమంలో మనలో జాగృతమయ్యే శివ శక్తులు, నిజానికి ఒకే శక్తి తాలూకు వివిధ వ్యక్తీకరణలు.*



*1. బ్రాహ్మి:- అనంతాకాశంలో, హృదయాకాశంలో అవ్యక్తనాదంగా ఉన్న శక్తి బ్రాహ్మి. కంఠాది ఉపాధులతో ఈ నాదమే స్వర, అక్షరాలుగా శబ్దరూపంగా వ్యక్తమవుతుంది. సర్వ శాస్త్ర జ్ఞానాలకు మూలమైన ఈ శబ్ద స్వరూపిణిని ఉపాసించడం జ్ఞానదాయకం.*



*2. వైష్ణవి:- విశ్వమందంతటా తేజస్తరంగాలుగా వ్యాపించి అన్ని వస్తువులను ప్రకాశింపజేసే అద్భుత శక్తి, స్థితికారక శక్తి ఈ తల్లి.*



*3. మహేశ్వరి:- ప్రతివారి హృదయంలో 'అహం' (నేను) అనే స్ఫురణ వ్యక్తమయ్యే అంతర్యామి చైతన్యమే మహేశ్వరి. 'సర్వ భూత హృదయాల్లో ఈశ్వరుడే, శరీరాది ఉపాధులను కదిలిస్తున్నాడు' అని భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం ఈ భావాన్నే చెబుతున్నది.*



*4. కౌమారి:- సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణంలో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానశక్తి కౌమారి.*



*5. వారాహి:- ఈ యజ్ఞ వరాహశక్తి అన్న ప్రదాయిని. చేతిలో ధరించిన నాగలి, రోకలి ఆయుధాలు అన్నోత్పత్తినీ, అన్నపరిణామాన్నీ (మార్పునీ) తెలియజేసే సంకేతాలు. దేవతలకు హవ్యాన్నీ, మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే ఆహార శక్తి.*



*6. ఐంద్రి:- జగద్రక్షణకు కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ప్రతాపం ఈ శక్తి. బలానికి సంకేతంగా వజ్రాయుధాన్ని ధరించే శక్తి.*



*7. చాముణ్డా:- కథ ప్రకారం- రక్తబీజుడనే రాక్షసుని దేవి సంహరించే టప్పుడు, స్రవించే ప్రతి రక్తకణం నుంచి ఎందరో రాక్షసులు ఉత్పన్నమవుతుంటే, 'చాముణ్డా' దేవి తన నాలికతో ఈ రక్తాన్ని పానం చేసింది. అప్పుడు ఆ అసురుడు హతమారి పోయాడు.*



*విషయ లంపటానికి సంకేతం రక్తబీజుడు. రకరకాల కామసంకల్పాలే రక్తకణాలు. వీటి నుంచి ఉత్పన్నమయ్యే బాధాకర, అజ్ఞానశక్తులే అసురులు. వాటిని నిర్మూలించే సమాధిస్థితిలోని దివ్య చైతన్యం 'చాముణ్డా'.*



*ఏకం పరబ్రహ్మ తత్వం. అనేకం ప్రపంచ స్వరూపం. ఈ అనేకమే 'చమూ' (సేనలు). ఈ అనేకత్వం నుంచి ఏకత్వ స్థితిని చేరుకోవడమే సమాధి. దీనినే 'చాముణ్డా' అని సంకేతించారు.*



*చండ, ముండ- అనే దనుజుల్ని సంహరించినందుకు 'చాముణ్డా'- అన్నారని మరో కథనం. యోగపరంగా చూస్తే- మూలాధారం నుంచి గ్రంథిని భేదించడం చండాసుర సంహారం. సహస్రార కమలంలో ప్రవేశించేటప్పుడు జరిగే భేదనం ముండాసుర సంహారం.*



*- ఈ విధమైన తాత్విక, యోగదర్శనాన్ని కావ్యకంఠ గణపతి ముని సంభావించారు (ఉమా సహస్రం).*



*మొత్తంగా పరిశీలిస్తే- 1.విశ్వాన్ని నడిపే శక్తులు, 2.యోగసాధనవల్ల మనలో మేల్కొనే దివ్యశక్తులు- వీటినే విభిన్న శక్తిరూపాలుగా పురాణాదులు ఆవిష్కరించాయని స్పష్టమవుతోంది. ఈ సర్వశక్తుల సమన్వయరూపిణి... సప్తమాతృకలు.*


🕉🌞🌏🌙🌟🚩

ధర్మాచరణ

 *ధర్మాచరణ* 


🍁🍁🍁🍁🍁


ధార్మికులు జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంటే అధర్మాన్ని అనుసరించేవారు సుఖంగా జీవిస్తుండటం మనం చూస్తుంటాం. అందుకని ధర్మాచరణ వలన ప్రయోజనమేమిటని కొందరు ప్రశ్నిస్తుంటారు.


అయితే ఒక విషయాన్ని గుర్తించాలి. ధర్మాన్ని అనుసరించే వారికి చివరికి కష్టాలు తొలగిపోయి విజయం లభిస్తుంది. ఆనందం కలుగుతుంది. మరో విధంగా చెప్పాలంటే వారి బాధలు ముగిసి సంతోషం లభిస్తుంది. అలాగే అధర్మంగా ప్రవర్తించే వారి సంతోషం తాత్కాలికమే. చివరికి వారికి దుఃఖం కలిగి తీరుతుంది.


శ్రీరామచంద్రునికి అరణ్యవాస సమయంలో కష్టాలు తప్పలేదు. కాని చివరికి శత్రువును వధించి, చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై చాలా సంవత్సరాలు పేరు ప్రఖ్యాతులతో జీవించాడు. అందుకు విరుద్ధంగా రావణాసురుడు మొదట్లో సుఖాన్ని అనుభవించినా చివరికి నాశనమయ్యాడు. అంతేకాదు, శాశ్వతంగా అపఖ్యాతి పాలయ్యాడు. అందువలన ధర్మం మాత్రమే విజయాన్ని పొందుతుంది. అధర్మం అపజయం పాలవుతుంది.


మంచివాని కష్టం, దుర్గార్గుని సుఖం రెండూ కూడా తాత్కాలికమే. అందువలన ఒక సందర్భంలోని పరిస్థితులను ఆధారంగా తీసుకుని ధర్మాధర్మ ప్రవర్తనల ప్రభావాలపై తీర్పు చెప్పకూడదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అధర్మమార్గాన్ని వీడి ధర్మమార్గాన్నే అందరూ అనుసరించెదరుగాక.


దురాత్ముని సంతోషం దుఃఖంగానే ముగుస్తుంది. అయితే మహాత్ముడు మొదట్లో అనుభవించే దుఃఖం చివరికి సంతోషంగానే ముగిసి తీరుతుంది.


- -----జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు.

యజ్ఞం వలన ప్రయోజనము

 *యజ్ఞం వలన ప్రయోజనము*


లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాల వలన తాము కోరిన ఫలితాలను పొందుతారు. యజమాని నిష్ఠాగరిష్ఠతతో యజ్ఞం నిర్వహిస్తే పరమేష్ఠి ప్రసన్నుడై కామ్యసిద్ధి చేస్తాడు. 


విష్ణు సహస్ర నామ స్తోత్రంలో.


*యజ్ఞో యజ్ఞపతి ర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః*

*యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః*

*యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం అన్న మన్నాద ఏవ చః*


మహావిష్ణువే యజ్ఞ పురుషుడు, యజ్ఞపతి, యజ్ఞంలోని అంగాలు తానైనవాడు, లోకకళ్యాణాన్ని చేయించువాడు, భరించువాడు, హవిస్సులను ఆరగించువాడు, సాధింపబడువాడు, యజ్ఞ ఫలితాన్ని ఇచ్చేవాడు, యజ్ఞ రహస్యాలు తెలిసినవాడు అని దాని భావం. 


కాబట్టి లోక కల్యాణమే యజ్ఞ ప్రయోజనము.


*శుభంభూయాత్*

పరమ సత్యాలు

 సృష్టిలో రెండు పరమ సత్యాలు కనబడుతాయి


 "ఇతరులు తప్ప, తాను మాత్రం తప్పు చేయను" అనుకోవడం..

ఎందరో తన కళ్ళముందు మరణించడం చూస్తున్నా 

"తాను మాత్రం దీనికి అతీతుడను" అకోవడం!


ఇది అజ్ఞానం - భ్రమ - పరమాత్ముని లీలలను అర్థం చేసుకోక పోవడం.. కృతజ్ఞతా భావం లేక పోవడం.

"తానే జ్ఞాని "అనే అహంకారం! తుచ్చమైన సంపదలు -శరేరం పై మమకారం! 


మనిషి వినాశనానికి కారణం అవుతున్నాయి 

దేవాలయదర్శనం, సద్గురువుల సేవ  రామాయణం మొదలైన భాగవత గ్రంథాలు శ్రవణం చేయడం చదవడం ,నిరంతర ఆధ్యాత్మిక చింతనం - సాత్విక ఆహారం మొదలైన ఉత్తమ సాధన ప్రక్రియలద్వారా మాత్రమే - ఉత్కృష్టమైన ఈమానవజన్మను సార్థకం చేసుకొనగలుగుతాం.

సుబ్రహ్మణ్య తత్వం

 *సుబ్రహ్మణ్య తత్వం*


🍁🍁🍁🍁



            “ *శరవణభవ*”…

శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు 

ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని 

వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు 

ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు 

భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి 

వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు


షదాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే. 


శ – శమింపజేయువాడు 

ర – రతిపుష్టిని ఇచ్చువాడు 

వ – వంధ్యత్వం రూపుమాపువాడు 

ణ – రణమున జయాన్నిచ్చేవాడు 

భ – భవసాగరాన్ని దాటించేవాడు 

వ – వందనీయుడు అని ‘శరవణభవ’కు గూఢార్థం.

కౌమారము అనే శాఖ ‘కుమార’ అన్న శబ్దము నుండే వచ్చింది.


 మనకు ‘షణ్మతము’లను ఆరు మతములు ఉన్నవి. 

అందులో ఆరు దేవతా స్వరూపాలను పరబ్రహ్మ స్వరూపాలుగా పూజిస్తాము. 


అవి, 

గాణాపత్యము - గణపతి; సౌరము - సూర్యుడు;

 శాక్తము - పార్వతి(శక్తి); 

శైవము - శివుడు; 

వైష్ణవము - విష్ణువు; 

కౌమారము - సుబ్రహ్మణ్యుడు.

 వీరిని పూజించే పద్ధతినే పంచాయతన పూజ అంటారు.

 

ఇచ్ఛా జ్ఞాన క్రియా రూప మహాశక్త్ధిరం భజే! శివశక్తి జ్ఞానయోగం జ్ఞానశక్తి స్వరూపకం!!‘‘ అని శివపురాణ వచనం.


వైదిక మతంలో శివ శక్త్యాత్మకుడైన సుబ్రహ్మణ్యోపాసన గురించి చెప్పబడింది. 


షణ్మతాలలో- సౌర, శాక్త, గాణాపత్య, వైష్ణవ, శివమతాలతోపాటు కుమారోపాసన గురించి చెప్పినప్పటికీ, పంచదేవతారాధనలో స్థానం కల్పించలేదు.


 సుబ్రహ్మణ్యునికి ‘‘అగ్నిగర్భుడ’’ని నామం ఉంది. 

అయితే, సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే ప్రారంభం అవుతుందని తత్త్వజ్ఞుల అభిప్రాయం. 

ఏ పూజ మొదలెట్టినా దీపారాధనతోనే ప్రారంభం కావడం తెలియంది కాదు. 


‘దీపారాధన’ అంటే అగ్నిగర్భుని ఉపాసించడమే! అలా సుబ్రహ్మణ్యారాధన ప్రారంభంలో లేని ఏ పూజయైనా నిష్ఫలమే!


పార్వతీ పరమేశ్వరుల తనయులు గణపతి, సుబ్రహ్మణ్యులు కుమారతత్త్వానికి ప్రతీకలు.


పంచభూతాత్మకమైన ఈ విశ్వానికి నాలుగు తత్త్వాలున్నాయని విజ్ఞులు చెబుతారు.


 అవి- అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం. అవ్యక్తం, వ్యక్తం శివ పార్వతుల పరంగాను, 

మహత్ తత్త్వానికి గణపతిని, అహంకారం అనుదానికి సుబ్రహ్మణ్యుని లేదా కుమారస్వామిని ప్రతీకలుగా చెబుతారు.

 ఈ నాలుగూ ఒకే పరతత్త్వానికి భిన్న రూపాలుగా ఉంటున్నాయి.

 

అహంకారమంటే ‘గర్వం’ అనే అర్థంలోకాక ‘నేను’ అనే స్పృహని కలిగి ఉండడం అని అర్థం చేసుకోవాలి. 


ఇది చైతన్యం యొక్క స్వరూపం. పరమాత్ముని పరంగానూ ఈ భావం ఉంటుంది. సృష్టిక్రమానికి నాంది ఇదే.


 ఈ చైతన్య స్వరూపం వ్యష్ఠిగాను, సమిష్ఠిగాను ప్రకటితవౌతుంది. ఈ చైతన్య స్వరూపానికి సుబ్రహ్మణ్యుడు ప్రతీక.

 

 చైతన్యం ప్రతి హృదయ కుహరంలోను ఉంటుంది. కాని బాహ్యంగా కనుపించదు. హృదయ గుహలో ప్రకాశించే ఈ పరమాత్మ చైతన్యాన్ని ‘‘గుహః’అని చెప్పారు. 

 

చైతన్యం జ్ఞాన లక్షణం గల తత్త్వం. అంటే గురు తత్త్వం. అందుకే సుబ్రహ్మణ్యుని ‘గురుగుహ’ అని కీర్తించారువాగ్గేయకారులు. 

 

ముఖ్యంగా శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని సాక్షాత్కారం పొంది, ఆతని అనుగ్రహంతో సంగీత, సాహిత్య, మంత్రశాస్త్ర, నాద రహస్యాలను తెలుసుకున్నారు. 

తాను రచించిన సంకీర్తనలన్నీ ‘గురుగుహ’’ నామంతో ముద్రాంకితం చేశారు. కర్ణాటక సంగీతంలో ముత్తుస్వామి దీక్షితుల కృతులకు ప్రత్యేకమైన స్థానం ఉంది.


పరమాత్మ చైతన్య రూపుడైన సుబ్రహ్మణ్యుని అర్చిస్తే వ్యక్తావ్యక్త స్వరూపులైన      శివశక్తులను   కూడ ఆరాధించినట్లేనని స్కంద పురాణం చెబుతున్నది.అనన్య శక్తిసంపన్నుడైన సుబ్రహ్మణ్యుడు శివశక్తిని తనదిగా చేసుకున్నాడు. 

ఆ శక్తే శక్త్యాయుధంగా చేత బుచ్చుకుని ‘శక్తి ధరుడు’గా ఉపాసింపబడుతున్నాడు. లోక రక్షణకు కంకణం కట్టుకున్నాడు.


పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I

అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా II

తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I


పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి.

 వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతోంది.

 

అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ, లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే...



🍁🍁🍁🍁

గురుచండాల యోగం*

 శ్రీనివాస సిద్ధాంతి.9494550355.


*గురుచండాల యోగం*


గురుగ్రహానికి రాహువు చేరువై చండాల యోగాన్ని ఇస్తాడు. దీనినే గురు చండాల యోగం అంటారు. 

కలియుగంలో ధర్మం ఒక పాదంపైన, అధర్మం మూడు పాదాలపైనా నడుస్తున్నదని పురాణాలు చెప్తాయి. ఈ మూడు పాదాల అధర్మ నడకకు పెద్దపీట వేసే గ్రహమే రాహువు. చంద్రునికి ఉత్తర ధృవ బిందువుగా రాహువుంటే, దక్షిణ ధృవ బిందువుగా కేతువుంటాడు. నవగ్రహాలలో రాహు కేతువులు మినహా మిగిలిన ఏడూ గ్రహాలూ గడియారంలో ముళ్ళువలె సవ్య దిశలో సంచారంలో ఉంటాయి. కాని రాహు కేతువులు అపసవ్య సంచారంలో ఉంటాయి. రాహువు ఉన్న రాశికి, ఏడవరాశిలో కేతువు ఉంటాడు.


ప్రపంచ రాజకీయ రంగాన్ని పరోక్షంగా శాసించే వాడే రాహువు. దీనికి తోడు నూతన అంశాలపై దృష్టి ఉంచి విశేష విజ్ఞానానికి బాటలను వేసేవాడు కూడా రాహువే. ప్రపంచంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతున్నదంటే, కేవలం రాహు అనుగ్రహమని చెప్పటంలో అతిశయోక్తి లేదు. లోక కల్యాణానికి పునాదులు వేసే విజ్ఞాన శాస్త్రానికి సారధిగా రాహువు ఉండటం నాణేనికి ఒకవైపు అంశం. అదేవిధంగా నాణేనికి రెండవ వైపున విజ్ఞాన శాస్త్రంలోనుంచే విశ్వ వినాశనానికి ప్రేరణ కారకత్వాన్ని ఇచ్చేవాడు కూడా ఛాయా గ్రహమైన రాహువే.


మానసిక, శారీరక, ఆర్ధిక, కుటుంబ, నేత్ర, దంత, సోదర, సోదరీ, వృత్తి, వ్యాపార, ఆరోగ్య, వాహన, గృహ, మాతృ, సంతాన, దాంపత్య, పితృ, ఆయు స్థాన అంశాలన్నిటి లోను అనుకూలంగా, ప్రతికూలంగా ఫలితాలను తనికిష్టమైన రీతిలో ఇచ్చే ఏకైక గ్రహమే రాహువు. ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు, ఆకాశ మార్గంలో విమాన ప్రమాదాలు, దానితో పాటు రిమోట్ తో పేల్చే ప్రమాదాలు, ఎత్తైన ప్రాంతం నుంచి దిగువకు పడిపోయే ఘోర ప్రమాదాలు, నూతన వైరస్ క్రిముల ఉత్పత్తితో పాటు అనేకానేక అంశాలన్నీ రాహు ప్రాబల్యం వలెనే జరుగుతుంటాయి. ఇతర గ్రహాలు రాజయోగం ఇచ్చినా, ఇవ్వకపోయినా రాహువు తన ఇష్టానుసారంగా ఫలితాలను తారుమారు చేయగలడు. అందలం ఎక్కించగలడు. భూస్థాపితం చేయగలడు.

గ్రహస్థితి బలహీనమైనప్పుడు మానవుడు ఎంత ప్రతిభాశాలి అయిననూ విధి వంచితుడు కాక తప్పదు. రాజకీయ రంగంలోనే ఇలాంటివి తరచుగా కనపడుతుంటాయి. వ్యక్తికి అంగబలం, అర్ధబలంతో పాటు ప్రజలందరూ కూడా జేజేలు పలికిననూ రాహు, కేతువుల అనుగ్రహం లేని కారణంగానే నామినేషన్ల తదుపరి చేసే స్క్రూట్నీతో పేరు గల్లంతవుతుంది. స్వల్ప అవయోగాలవ లెనే విశేష రాజయోగాలు ఉన్ననూ దెబ్బతినేవారు అనేకమంది ఉన్నారు. ముక్కు మొహం తెలియని వారు ఒక్కోసారి అనుకోకుండా ఎన్నికలలో గెలవటము, ఉన్నత పదవులు అలంకరించటము జరుగుతుంది. ఇలాంటి యోగాలని అనుకోకుండా అందించేవాడే రాహువు.


ముఖ్యంగా రాజకీయ రంగము, విజ్ఞాన శాస్త్ర రంగములపై అనుకూల స్థితి ఏ స్థాయిలో ఉంటుందో, దానికంటే రెట్టింపుగా ప్రతికూల పంజాలు ఇవ్వటంలో రాహువుకి సాటి ఎవ్వరూ రారు. ఇంకా ఈ రెండు రంగాలను గురించి కొంత లోతుగా చర్చించుకుందాం.


సప్త గ్రహాలూ అనుకూలించక పోయినప్పటికీ రాహు, కేతువుల యోగాల వలన అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. రాహు, కేతువులు ఇచ్చే యోగాలు శాశ్వతం కావు. అశాశ్వతాలే. కనుక ఈ అశాశ్వత రాజ యోగాలను పట్టుకొని, మన వ్యక్తిత్వాన్ని సరియైన స్థితిలో నియంత్రించుకుంటూ ఉంటుంటే రాహు, కేతువులిచ్చే అశాశ్వత యోగాన్ని శాశ్వతం చేసుకోవచ్చు. లేకుంటే మహారాజ సమానుడై భోగ భాగ్యాలతో జీవితం గడుపుతూ చివరకు ఆకాశ వీధులలో మరణం జరిగి అన్నీ అవయవాలు లేకుండా అంత్య క్రియలు జరగటం కూడా ఈ ఛాయా గ్రహాల ప్రభావమేనని గుర్తించాలి. 

రాజకీయ అధికారానికి రాహువు కారకుడు. అంతేకాక అనువంశిక రాజకీయ వారసత్వానికి కూడా రాహువే కారకుడు. పొడవైన, అందమైన శిరోజాలు కావాలంటే రాహు ప్రీతి అవసరం. బంధన కారకత్వం కూడా రాహువు వలెనే జరుగును. బాంబు ప్రేలుడు, ఇతర విస్ఫోటనాలచే మరణానికి రాహువు కారకుడవుతాడు. కఠిన కారాగార యోగము, దీర్ఘకాల కారాగార వాసము, న్యాయ స్థానాలచే సమస్యలు, ఉగ్రవాదుల, తీవ్రవాదుల వలన వాటిల్లే సమస్యలు రాహువు యొక్క దుర్యోగములే.


పదవులు, అత్యున్నత రాజకీయ జీవితం, రాజ్యాధికారము మొదలగు యోగములు పొందాలంటే జాతకునికి రాహు స్థితి ప్రధానంగా అనుకూలమై ఉండాలి. ఇట్టి రాహు అనుగ్రహానికి పరోక్షంగా గోధుమపిండి దీపారాధన ఎంతో తోడ్పడుతుంది. రాహుకాల దీపములు నిమ్మ డొప్పలలో పెట్టవలెను. గురు రాహు లకు జప దాన హోమ శాంతులు చేయించుకొనవలెను


జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి*

*లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.

*9494550355*    plz forward the message 🌹

బ్రహ్మ_సత్యం_జగత్_మిథ్య

 #బ్రహ్మ_సత్యం_జగత్_మిథ్య


మానవుడు ఒక ముత్యపు చిప్పను చూసి దానిలోని నైగనిద్యాదుల వలన రజతం అనుకొంటాడు. తరువాత దగ్గరకు సమీపించి చూడగా ఆ భ్రాంతి అతనికి తొలగిపోతుంది. అలాగే స్వప్నంలో అనేక యాత్రాదులు చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శించినట్లు అనిపిస్తుంది. మెలకువ రాగానే ఆ భ్రాంతి తొలగిపోతుంది. ఇలా ద్వైత భ్రాంతి అంత తొందరగా తొలగిపోదు. అది చాలా దీర్ఘమైనది.


మనం రాత్రి ఒక గదిలో పడుకుంటే ఆ రాత్రి కలలో విమానం ఎక్కి కాశీ వెళ్ళి, గంగాస్నానం, విశ్వేశ్వర దర్శనం ఆ తర్వాత రామేశ్వర యాత్ర, సముద్రస్నానం, రామనాథ దర్శనం వంటివన్నీ జరిగాయి. మెలకువ రానంతవరకు అది నిజంగా జరిగినట్లే 'సరే' అనిపిస్తూ ఉంటుంది. మెలకువ వచ్చాక అబ్బే అదేం జరగలేదు, 4,5 గంటల్లో ఇంత యాత్ర జరపడం సాధ్యమా? కాదు. ఇది అసత్యమే అని ఆ యాత్రా భ్రాంతి తొలగిపోతుంది. కలగంటున్నంత సేపూ నిజంగా కాశీలో ఉన్నట్లే, యాత్రా జరిగిపోయినట్లే అనిపించినా, మెలకువ వచ్చాక అదంతా మిధ్యయే అనే నిర్ణయం కలుగుతుంది.


అలాగే వ్యవహారంలో జగత్తులో సర్వమూ సత్యమే అనిపిస్తుంది. ఎందుకు? ద్వైత భ్రాంతి ఉండేవరకు. ఎపడైతే ద్వైత భ్రాంతి తొలగిపోతుందో అద్వైత సాక్షాత్కారం వెలువడుతుంది. “यत्रत्वस्य सर्वमात्मैवाभूत् तत् केन कं पश्येत् केन कं जिघ्रेत्, केन कं पश्येत् केन कं विजानीयात्" అని శ్రుతి వచనం. అద్వైత సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుందో అపుడు ఇంకేమీ లేదు, అరే అపుడు చూడవలసిందేముంది? వినవలసిందేముంది? అనిపిస్తుంది.


आत्मानं चे द्विजानीया दहमस्मीति पूरुषः |

कि मिच्छन् कस्य कामाय शरीरमनुसंज्वरेत् ||


దీనికి మనం ఆశ్చర్యపడనవసరం లేదు. వ్యవహారంలో అలాగే అనుకోవడం భ్రాంతి పడడం జరుగుతుంది "यधास्वप्ने" అని. స్వప్నంలో ఆ భ్రాంతి ఉన్నంతసేపూ తదనుగుణమైన వ్యవహారమున్నట్లే, ఈ ద్వైతభ్రాంతి ఉన్నంత వరకూ "अनपेक्षया" జగత్ సత్యమనే వ్యవహారముండనే ఉంటుంది. అవిద్య, అజ్ఞానం నాశనమయేవరకు అలానే అనిపిస్తుంది. సూర్యోదయ అనంతరం అంధకారం నశించినట్లే ద్వైతభ్రాంతి తొలగి జ్ఞానోదయమవుతుంది. అయితే స్వాప్నిక భ్రాంతి మెలకువ వచ్చే వరకూ మాత్రమే. ఇది సుదీర్ఘం. అదే వ్యత్యాసం. కనుక ఆలోచించి, నిత్యానిత్య వివేకంతో "ब्रह्म सत्यं जगत् मिथ्या जीवः ब्रह्मैक ना परः" అని గ్రహించాలి.


--- జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు.


|| ॐ नमः पार्वती पतये हरहरमहदेव ||


#జగద్గురు_శ్రీశ్రీ_భారతీతీర్థ_మహస్వామివారి_అనుగ్రహ_భాషణములు


-----------------------------------------

మంత్రాన్ని

 ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, 

చంధస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం,అంగన్యాస, కరన్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది.


1. ఋషి:.

మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి. ఏ మంత్రం ఎవరిచేత ఆవిష్కరింపబడిందో, ఎవరిచేత సిద్ధి పొందిందో, అతనినే ఆ మంత్రానికి కర్తగా (ఋషిగా) భావించాలి.


2. ఛందస్సు:.

శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పు తున్న దానికి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సులు మంత్రాలను రక్షించగలవు. దేవతలు తమను తాము కాపాడు కొనేందుకు గాయత్రీ వంటి మంత్రాలను ఆచ్ఛాదనలుగా చేసుకొన్నారు.


3. దేవత:.

ప్రతి మంత్రానికి ఒక అధిష్టాత దేవత ఉంటుంది. ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్ఠాన దేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి.


4. బీజం:.

మంత్రానికి ప్రత్యేకశక్తిని కలుగజేసే మంత్రసారమే బీజం అని పేరు. ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి.


5. శక్తి:.

మనం మంత్రశక్తిని వహించినప్పుడే, అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది. మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి.


6. కీలకం:.


మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం. మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి. అప్పుడు సాధకుడు ఉపాసనామూర్తిని దర్శించి,  సర్వసిద్ధులను పొందుతాడు.


7. అంగన్యాసం:.

అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ర్పయోజనమవుతాయి. శరీరశుద్ధికోసం న్యాసాలు తప్పనిసరిగి చేయాలి. సాధకులు న్యాసాలు చేసుకొని మంత్రజపాన్ని చేయాలి. న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు.


వినియోగం:

చతుర్దిధ పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగం అని అంటారు.


ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం.


పండుగ సమయాలలో గ్రహణ సమయాలలో అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.


మంత్రాలు కర్మార్థమై జనించాయి. ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమ రీతిలో జపించడం వలన ఆమంత్రానికి సంబంధించిన దెైవరూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది.


మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఉదాహరణకు..హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్ని హింసలకు గురిచేసినప్పటికీ, నారాయణ’ అనే మంత్ర జపం ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి.


భక్తహనుమ ‘రామ’ నామజపంతో ఉత్తేజితుడెై సముద్రాన్ని దాటి లంకను చేరాడు.

గాయత్రీ మంత్ర జపం వలన విశ్వామిత్రుడు రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మార్షిత్వాన్ని పొందాడు.


మహాత్ములు కొన్ని ప్రాధమిక మంత్రాలను సూచించారు. అవి:..

ఓం’..

సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ‘ఓం’ కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది.


అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం 'ఓం’కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజ సత్త్వ, తమో గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలెైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు.


వేదం ఓంకారరూపం, వేదరాశి..

ఋగ్వేదం నుండి ‘అ’ కారం,

యజుర్వేదం నుండి ‘ఉ’ కారం,

సామవేదం నుండి ‘మ’ కారం

పుట్టి, వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓం కారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.


శ్రీం:. అమ్మ వారికి చెందిన మంత్రం. ఐశ్వర్యాన్ని, సకల అభీష్టసిద్ధిని కలిగిస్తుంది.


హూం:. సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దెైవిక క్రోధం యొక్క శబ్దం ‘హూం’.


ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే, హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది.


రం: ఇది దివ్య తేజోబీజం. శాంతిని కలిగిస్తుంది.


ఐం: జ్ఞాన బీజం. ఏకాగ్రత, శక్తులను ప్రసాదిస్తుంది.


మాం:మాతృబీజం. అగ్నిబీజాలకు ఆద్యం.


సోహం: ఊపిరి యొక్క స్వాభావిక బీజం.

‘సో’ ఉచ్ఛ్యాసం, ‘హం’ నిశ్శ్వాసం. సోహం నుండి హల్మ శబ్దాలను వేరు చేస్తే ఓంకారం. ‘సో’ శక్తి ‘హం’ శివుడు.


గాయత్రీ మంత్రం:.

ఓం కారం నుండి జనించింది. మన వేదాలలో, ఉపనిషత్తులలో, బ్రహ్మ సూత

్రాలలో, పురాణాలలో గాయత్రీ దేవత సగుణ, నిర్గుణ, స్వరూప స్వభావములు సవిస్తరంగా వివరించబడ్డాయి. గాయత్రీ దేవని గాయత్రీ మంత్రాలతో ధ్యానించే వారికి ముక్తి లభిస్తుంది. ఎవరు గాయత్రీని జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుండి విముక్తులవుతారు.


ఏకాక్షర మంత్రం – ‘ఓం’.

అన్ని మంత్రాలలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం’. దీనినే ‘ప్రణవం’అని కూడా అంటారు. మంత్రోచ్ఛారణ జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధన.


ఉదా..బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరిగెత్తుకొని వచ్చి, ఆ బిడ్డను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవతా మూర్తులు, మంత్రోచ్ఛారణతో మనం మననం చేయగానే మనపట్ల ప్రసన్నలవుతున్నారు.


మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.‘ఐం,శ్రీం,హ్రీం,క్లీం’ అనే ఏకాక్షర బీజమంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి.


ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం. సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది.


సాధారణంగా మంత్రాలు మూడు విధాలు..


1. తామస మంత్రం: క్షుద్రంతో ఉచ్ఛారణ చేసేవి.

2. రాజస మంత్రం: యుద్ధంలో గెలుపు కోసం చేసేవి.

3. సాత్విక మంత్రం: ఆధ్యాత్మిక సాధనకై చేసేవి.


చంధోబద్ధంగా ఉన్న మంత్రాలు ‘ఋక్కులు’ అని గద్యాత్మకంగా ఉన్న మంత్రాలను ‘యజస్సులు’ అని అంటారు. ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు.

అలాంటి మంత్రం ప్రాణవాయువు లేని నిర్జీవ శరీరం వంటిది.


ఓంకారం ఆ సర్వేశ్వరుని నుంచి ఒక జ్యోతిగా ప్రారంభమై, దాన్నుంచి ఒక నాదం ధ్వనిస్తుంది. ఋగ్వేదం – ‘అ’ కారం, యజుర్వేదం నుండి ‘ఉ’ కారం, సామవేదం

నుండి ‘మ’ కారం కలసి ‘ఓం’ కారం ఏర్పడింది.

ఆధ్యాత్మిక సాధన..

 *ఆధ్యాత్మిక సాధన.....*


ఆద్యాత్మిక సాధన అంటే మనని మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే అంతరంగ సాధన.


దీనికి మన బాహ్య పరిస్థితులతో, మన భౌతిక స్థితితో సంబందం లేదు. మన మతము, కులం, లింగం (ఆడా, మగ), వయస్సు వీటితో సంబంధం లేదు. కేవలం అంతరంగ మార్పు కావాలి అన్న పట్టుదల ఒకటి ఉంటే చాలు వారు ఈ సాధనకు అర్హులు. 


దీనికి బాహ్య గురువు ఉండడు. బయట నుంచి ఎవ్వరు మనని నియంత్రిచరు. అస్సలు ఈ సాధన చేస్తున్నామని ఎవ్వరికి తెలియదు. కానీ సాధనా పరిమళాలు అందరిని ఆకర్షింపచేసి, వారిని కూడా ఈ సాధనకు ప్రేరణ చేస్తాయి. కాబట్టి ఈ సాధనకు ఏటువంటి ప్రచారా ఆర్భాటాలు లేవు.


ఆధ్యాత్మిక సాధనకు కావాల్సిన కొన్ని లక్షణాలు...


1) స్వప్రయత్నం


2) స్వయం క్రమశిక్షణ


3) స్వ అధ్యయనం


4) స్వ పరీశీలన


5) స్వ లక్ష్య నిర్ణయం


6) సమయ పాలన


7) పోల్చుకోక పోవడం


8) అనాసక్తి


9) మౌనం


10) ఎల్లలు లేని ప్రేమ


11) ఎవరినైనా మనస్ఫూర్తిగా క్షమించడం


12) అన్ని వాస్తవాలని యధాతధంగా స్వీకరీంచడం


13) కర్మని బట్టి సర్వం జరుగుతాయి కాబట్టి "చేసుకున్నవాడికి చేసుకున్నంత" అని గ్రహించడం


14) మన వాస్తవానికి మనమే సృష్టి కర్త అని గ్రహించి కావాల్సిన వాస్తవాలను సృష్టించుకోవడం


15) నిత్యము, సత్యము, శాశ్వతం వీటిని గురించి విచారణ, విశ్లేషణ చేయడం


16) మార్పు సహజం అని గుర్తించి దానిని ఆహ్వానించడం


17) అహంకారము ను పూర్తిగా తొలగించడం


18) మమకారం ని ఆదిలోనే తుంచడం


19) తాను అందరికంటే అధికుడను అన్న భావం రానివ్వకుండా జగ్రత్తగా ఉండడం


20) సదా ఎరుకలో ఉండడం


21) భౌతిక, ఆద్యాత్మిక, మతముల పై పూర్తి అవహాగన కలిగి ఒక దానితో ఇంకొకటి కలిపి కలగాపులగం చేయకపోవడం


22) అలవాట్లు, వ్యాసనాలు, సంప్రదాయాలు, సంస్కారాలు, వాసనలు వీటి గురించి పూర్తి అవహాగన కలిగి సరియైనవి ఎన్నిక చేసుకోవడం


23) అంతరంగ శుద్ధి కలిగి ఉండడం, దాని కోసం సాధన చేయడం


24) అహం నాస్తి, ఇదం నమమ అన్న భావాలని అవహాగన చేసుకొని జీవించడం


25) మనచే ఆచరింప బడ్డ సర్వ కర్మ పలితాలు పరమాత్మకు ప్రతి నిత్యం ప్రయత్నపూర్వకంగా సమర్పణ చేయడం


26) దేని చేత బందింపబడక నిత్య ముక్త స్థితిలో ఉండడం..



🍁🍁🍁🍁🍁

ఖర్జూరాలను తేనెలో

 ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే.... ప్రయోజనాలు ఇవీ...

తేనె, ఖర్జూరాలు మనకు ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఇవి తరిమికొడుతున్నాయి. వీటి కాంబినేషన్‌తో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఓసారి తెలుసుకుందాం.

తేనెలో ఎండు ఖర్జూరాల్ని నానబెడితే : ఎండు ఖర్జూరాలు, పటికబెల్లాన్ని నీటిలో నానబెట్టి తింటే... చలవ చేసి... శరీరంలో వేడిని తగ్గిస్తాయని మనకు తెలుసు. అదే ఎండు ఖర్జూరాల్ని తేనెలో నానబెట్టి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందుకు కొన్ని పద్ధతులు పాటించాలి. ఓ చిన్న గిన్నెలో సగానికి పైగా తేనె పోసి... సీడ్ లెస్ ఎండు ఖర్జూరాల్ని వెయ్యాలి. వాటిని బాగా కలియబెట్టాలి. తర్వాత ఓ గాజు సీసా లేదా కంటైనర్ తీసుకొని... అందులో ఆ మిశ్రమాన్ని వెయ్యాలి. ఇంట్లో ఏదైనా ఎండ తగలని ప్రదేశంలో ఓ వారం పాటూ కదపకుండా ఉంచాలి. ఫ్రిడ్జ్‌లో ఉంచాల్సిన పనిలేదు. బయటే ఉంచొచ్చు.

వారం పాటూ తేనెలో నానడం వల్ల ఖర్జూరాలు చాలా మెత్తగా, మృదువుగా తయారవుతాయి. వారం తర్వాత రోజుకు ఒకటి, రెండు ఖర్జూరాలని తినొచ్చు. ఆల్రెడీ అవి తేనెను పీల్చేసుకుంటాయి కాబట్టి... అందులో తేనే పెద్దగా మిగలదు. తేనెను ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పనిలేదు. ఖర్చూరాన్ని తింటే, దానిలోనే కావాల్సినంత తేనె కూడా ఉంటుంది.

ప్రయోజనాలు :

ఖర్జూరాలకు మన శరీరంలో వేడిని తగ్గించే అద్భుత గుణాలున్నాయి. వీటికి తేనె కూడా తోడవడం వల్ల దగ్గు, జలుబు, పడిశం వంటివి త్వరగా నయం అవుతాయి. వీటికి రోగాల్ని తగ్గించే గుణం ఉండటం వల్ల... చాలా రకాల రోగాలు రాకుండా ఆగిపోతాయి. నిద్ర పట్టని వాళ్లు రాత్రివేళ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే చాలు... చక్కటి నిద్ర పడుతుంది. ఈ మిశ్రమం ఎంత మంచిదంటే... దీన్లో చాలా యాంటీ బయోటిక్ గుణాలున్నాయి. ఇవి గాయాలు, వాపులు ఇతరత్రా అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తాయి.

మలబద్ధకంతో బాధపడే వారు వారంలో కనీసం మూడు రోజులైనా తేనె ఖర్జూరాల్ని తింటే సమస్య తొలగిపోతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి... అది ఆహారం చక్కగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. గ్యాస్, ఏసీడీటీ సమస్యలు పరారవుతాయి. కడుపులో ఉండే చెడు క్రిములు చనిపోతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

ఎండు ఖర్జూరాల జ్యూస్ తీసుకుంటే...

బ్రెయిన్ చురుగ్గా తయారై.. మెమొరీ పవర్ పెరుగుతుంది. ఎగ్జామ్స్ టైమ్‌లో ఈ తేనె, ఎండు ఖర్జూరాల జ్యూస్ తీసుకుంటే... ఏది చదివితే అది బుర్రకు ఎక్కేస్తుంది. ఎందుకంటే ఈ రెండింటిలో కాల్షియం, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బ్రెయిన్‌కి చాలా అవసరం. ఇవి ఉంటే చాలు... బ్రెయిన్ సూపర్ పవర్ అయిపోతుంది. అంతేకాదు... మన దేశంలో చాలా మందికి బాడీలో సరపడా బ్లడ్ ఉండదు. వాళ్లు ఇలాంటి మిశ్రమాన్ని తీసుకుంటే... రక్త హీనత తగ్గుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. అంతే కాదు... షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ జ్యూస్ కొద్ది మొత్తాల్లో తీసుకోవాల్సిందే.

దేవుడి నైవేద్యం

 *దేవుడి నైవేద్యం.. ప్రతిఫలం*




దేవాలయాలకు ఖాళీ చేతులతో వెళ్తే మన పనులు అసంపూర్తిగానే ఉంటాయంటారు. అందుకే పండు, కొబ్బరికాయ, పూలు, పూజా సామగ్రిని తీసుకెళ్లి పూజ చేస్తే మన మనసుకు కూడా సంతోషం కలుగుతుంది. ఏ పండు తీసుకుని వెళ్లి నైవేద్యం చేయిస్తే ఏ ఫలితం ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం.


 *చిన్న అరటి (యాలకి అరటి)* :


నిలిచిన పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి.


 *అరటిగుజ్జు* :


రుణ విముక్తి, రావాల్సిన సొమ్ము, నష్టపోయిన డబ్బు తిరిగి వస్తాయి. ప్రభుత్వానికి అధికంగా కట్టిన పన్ను, డబ్బు సైతం తిరిగి వస్తుంది. పెండ్లి తదితర శుభ కార్యాలయాల కు సకాలంలో నగదు అందుతున్నది. హఠాత్తుగా నగదు మంజూరవుతున్నది.


 *పూర్ణఫలం/కొబ్బరికాయ* :


పనులు సులభ సాధ్యం. అనుకున్న రీతిలోనే పనులు నెరవేరుతాయి. పైఅధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. స్నేహపూర్వకంగా పనులు జరుగుతాయి.


 *సపోటా పండు* :


వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. సంబంధాలు ఖాయమవుతాయి.


 *కమలా ఫలం* :


చిరకాలంగా నిలిచిన పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడుతారు.


 *మామిడి పండు* :


ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి సమస్య లేకుండా వస్తుంది. గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి.బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. గణపతిహోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి.

ఇైష్టదైవానికి తేనే, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచిమీరు కూడా సేయిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతున్నది. ఇష్టదైనానికి మామిడి పండు అంజూరపండ్లను నైవేద్యంగా సమర్పించి దాన్ని రజస్వల కాని ఆడపిల్లలకు తినిపిస్తే త్వరగా రజస్వల అవుతారని నమ్మకం. ఎటువంటి సమస్యలు రావంటారు.


 *అంజూర పండు* :


అనారోగ్య సమస్యలు తీరతాయి.స్వల్పరక్తపోటు (లోబీపీ) ఉన్న వారికి మంచిది.కాళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నివారణ సంకల్పాన్ని చెప్పుకుని సుమంగళీలకు తాంబూలంలో సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సంకల్పం ఎవరి పేరున చెబుతారో వారు తినకూడదు. గణపతికి నైవేద్యంగా పెడితే మరింత ఆరోగ్య ఫలాలు పొందుతారు.


 *నేరేడుపండు* :


నేరేడు పండును నైవేద్యంగా ఇస్తే నీరసం, నిస్సత్తువ తగ్గుముఖం పడతాయి. శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను, నడుం, మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి. బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం దరిచేరదు. పనులు నిరాటంకంగా సాగుతాయి. భోజనంతోపాటు నేరేడు పండును వడ్డిస్తే అన్నపానీయాలకు లోటు ఉండదు. రోజూ నేరేడుపండును తింటే ఆరోగ్య సమస్యలు ఉండవు.


 *పనస పండు* :


శతృజయం కలుగుతుంది. శత్రవులు, మిత్రులుగా మారుతారు. రోగ నివారణతో పాటు కష్టాలు తొలగుతాయి.


 *యాపిల్ పండు* :


సకల రోగాలు, సర్వ కష్టాలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. దరిద్ర బాధ ఉండదు.


 *ద్రాక్షపండ్లు* :


దానం చేస్తే పక్షపాత రోగాలు త్వరగా నయమవుతాయి. దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి.


 *జామపండు* :


సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దేవీ నైవేద్యంగా ఉంచితే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం. సంతాన ప్రాప్తి, దాంపత్య కలహాలు తొలగుతాయి. పెడ్ల్లికాని యువతులతో ముత్తయిదువులకు పెడితే పెండ్లి ఆటంకాలు సమసిసోతాయి. జామ, కమలాపండ్లు రసాలతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుగ్గా సాగుతాయి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది.


సేకరణ ÷

మౌనం


 *మౌనం ..ముక్తికి సోపానం* 


🍁🍁🍁🍁


సరిగ్గా మాట్లాడటం ఎంత కష్టమో, మౌనంగా ఉండటమూ అంతే కష్టం. అది మనసుకు సంబంధించిన భాష. వాక్కు అసలు పలకకపోవడం మౌనం కాదు. వాక్కును నియంత్రించడం మౌనం. అది ఒక యోగం, ఒక యాగం, సకలభాషలూ సమ్మిళితమైన విశ్వభాష.


అన్నివైపుల నుంచీ సమున్నతమైన భావాలను, ఆలోచనలను ఆత్మీయంగా ఆహ్వానించమంటుంది రుగ్వేదం. 


అలా చేయాలంటే మౌనారాధనం అవశ్యం అనుసరణీయం. 


‘మౌనంగా ఉన్నవాడే ఎల్లెడలా ప్రశాంతతను పంచగలడు’ అంటాడు చాణక్యుడు.


మౌనంలో మహత్తరశక్తి దాగి ఉంది. ‘మాట్లాడటం వెండి అయితే మౌనం బంగారం’ అంటారు. మితంగా మాట్లాడటమూ మౌనమే అని చెబుతోంది మహాభారతం.


 హితంగా, మితంగా మాట్లాడలేకపోతే మౌనమే మేలని విదురనీతి. మౌనం మాట్లాడినంత తీయగా మరే భాషా మాట్లాడలేదు. మాటలకు అందని కమ్మని భావాలు మౌనభాషకు ఉంటాయి. మౌనం పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నవాడికే మౌనం విలువ తెలుస్తుంది.


 ఆదిశంకరులు, విద్యారణ్యస్వామి, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి, శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మొదలైన మహనీయుల సందేశాలు, ఉపదేశాలు సాధకులకు మౌనగ్రాహ్యాలయ్యాయి. 


మన సనాతన సంప్రదాయంలో జిజ్ఞాసువులంతా ప్రబోధాలను, ప్రవచనాలను మౌనంగానే ఆలకించి, అవగాహన చేసుకుని హృదయాల్లో నిక్షిప్తం చేసుకున్నారు. పారమార్థికులకందరికీ మౌనసాధనే ప్రధాన సాధనమైంది.


పాపపరిహారార్థం నిర్దేశితమైన అయిదు శాంతుల్లో మౌనం ఒకటని విజ్ఞులు చెప్పారు. అవి- 1.జపం 2.మౌనం 3.పశ్చాత్తాపం 4.శాంతి 5.దానం


పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, చాడీలు చెప్పడం, అసంబద్ధంగా ప్రేలాపనలు చేయడం- ఈ నాలుగూ వాగ్దోషాలుగా చెబుతారు.


 వీటన్నింటికీ పరిహారం మౌనం. మౌనవ్రతం వల్ల ఈ నాలుగు దోషాలూ అంటవు. 


మౌనంగా ఉన్నప్పుడు మనసును ధ్యానానికి, వైరాగ్యానికి అంకితం చేసినట్లయితే అటువంటి మౌనానికో చరితార్థత ఏర్పడుతుంది. భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన భాష మౌనమే. మనిషి మనుగడకు జీవనయాత్రకు శబ్దం ఎలా చోదక శక్తి అయిందో మౌనమూ అంతే! వినయం, శ్రవణం మౌనానికి అనుసంధానమైనప్పుడు శ్రోతకు గ్రాహ్యశక్తి పెరుగుతుంది. 


ధౌమ్య పురోహితుడు ఉపదేశించిన సేవాధర్మనీతిని పాండవులు మౌనంగా, శ్రద్ధగా ఆలకించి ఆకళింపు చేసుకున్నారు. విదురనీతి అంతా ధృతరాష్ట్రుడు విన్నదే.


 విశ్వామిత్రుడి యాగసంరక్షణార్థం వెళ్లినప్పుడు రామలక్ష్మణులు మహర్షి ఉపదేశమంతా మౌనంగా వింటూ ఆయన్ని అనుసరించారు. శిష్యుడి అభ్యుదయానికి మౌనమే ఎంతో దోహదం చేస్తుంది.


వానాకాలంలో కప్పలు బెకబెకమని అరుస్తాయి. పంచమ స్వరంలో మధురంగా పలికే కోయిల తనకిది సమయం కాదని మౌనంగా ఉండిపోతుంది.


 అలాగే మూర్ఖుల సభలో పండితుడైనవాడు మౌనంగానే ఉండిపోతాడు. అక్కడ మౌనమే పరమభూషణం. పరిశీలనలో, పరిశోధనలో ప్రవచన శ్రవణ సందర్భంలో విజ్ఞత గలవాడు మౌనంగానే ఉంటాడు. ‘అలజడితో అలజడి చల్లారదు, మౌనమొక్కటే దాన్ని అణిచేది’ అంటారు బాపూజీ. 


మౌనంగా చేసే ప్రార్థన మహిమాన్వితమైనది. 


మౌనం శ్వాసను తగ్గించి ఆయుష్షును పెంచుతుంది. మనిషికి మానసిక ఆరోగ్యం ప్రసాదిస్తుంది. ఆంతరిక శక్తిని వృద్ధిచేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.


పతంజలి యోగసూత్రాల్లో మౌనానికి ఇచ్చిన ప్రాధాన్యం ప్రశంసనీయమైనది.


 రజస్తమోగుణాలను తగ్గించి మౌనం సత్వగుణాన్ని పెంపొందింపజేస్తుంది. 


ముక్తికి ప్రధాన సోపానం మౌనమే.

[28/11, 10:16] Chandra Sekhar: *🌸భగవత్తత్వం*🌸


భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. 


ఒక ఊళ్ళో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. జీవనోపాధి కోసం అతను మేకల్ని చంపి, వాటి మాంసాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతని మనసు కరడుగట్టింది. ముఖంలో క్రూరత్వం, మాటల్లో కాఠిన్యం ఉండేవి. అవి జనాన్ని అతనికి దూరంగా ఉంచేవి. చివరకు అతను అద్దంలో తన ముఖం చూసి తానే భయపడే స్థితికి చేరుకొనేవాడు. ఇంట్లో వాళ్ళు కూడా అతణ్ణి చూసి భయపడేవారు. ఈ స్థితి నుంచి బయటపడడం ఎలాగో అతనికి అర్థం కాలేదు. 


ఆ ఊరికి ఒక జ్ఞాని వచ్చాడు. పాపయ్య ఆయనను కలిసి, తన బాధంతా చెప్పుకొన్నాడు. తనకు ఓ దారి చూపించమని ఆయనను వేడుకున్నాడు.


‘‘నాయనా! నువ్వు భగవంతుణ్ణి ధ్యానించు. నీకు తప్పకుండా మేలు జరుగుతుంది’’ అన్నాడు జ్ఞాని.


‘‘అయ్యా! భగవంతుడు ఎవరు? అలా ఉంటాడు? నాకు తెలియజెయ్యండి’’ అని అడిగాడు పాపయ్య.


‘‘భగవంతుడు అంటే దయాసాగరుడు. ప్రేమ, కరుణ, శాంతి కలగలిసిన సముద్రం లాంటి రూపం ఆయనది. ఈ క్షణం నుంచీ ఆయన స్మరణలో ఉండడానికి ప్రయత్నించు. భగవంతుణ్ణి ధ్యానిస్తే  పాపకర్మలు నశిస్తాయి. అప్పుడే నువ్వు ఆ పరమాత్ముణ్ణి చూడగలవు’’ అని చెప్పాడు జ్ఞాని.


ఆయన ఆదేశం ప్రకారం పాపయ్య తన వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించాడు. భగవంతుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు. ఊర్లూ, వాడలూ తిరిగాడు. అడవులన్నీ వెతికాడు. గుడులూ, గోపురాలూ సందర్శించాడు. ప్రతి మనిషినీ నిశితంగా పరిశీలించాడు. జ్ఞాని చెప్పిన భగవంతుడి రూపం జాడలు ఎక్కడా కనిపించలేదు. విసిగి వేసారిన అతను ఒక ప్రశాంతమైన స్థలంలో చెట్టు కింద కూర్చొని, భగవంతుణ్ణి తలచుకుంటూ మధనపడసాగాడు. మనసులో ఏదో ఆరాటం... ఏదో తెలియని బాధ... అతనికి తెలియకుండానే కనురెప్పలు బరువెక్కి మూతపడ్డాయి. శరీరం తేలికయింది. క్షణాలు నిమిషాలయ్యాయి. అలా ఎన్ని గంటలు గడిచాయో తెలీదు. శరీరం ఉన్నదో లేదో తెలియని స్థితికి లోనయ్యాడు. ఏదో తెలియని ఆనందం... ఒకదాని వెనుక ఒకటిగా అనుభూతుల పరంపర... అతని చుట్టూ అపరిమితమైన వెలుగు. 


ఎప్పటికో మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. అంతా కొత్తగా ఉంది. తిరిగి జ్ఞాని దగ్గరకు వచ్చి, ఆ అనుభవం గురించి చెప్పాడు.


అప్పుడు జ్ఞాని ‘‘నీలోని తపనే నీకు మార్గదర్శకం అయింది. ఇంతకాలం నువ్వు ప్రాపంచిక విషయాలతో కలిసి బతికావు. ఇప్పుడు నీకు బాహ్య విషయాల మీద వైరాగ్యం కలిగింది. అదే నిన్ను అంతర్ముఖుణ్ణి చేసింది. ఇప్పుడు నీ మనసు దానంతట అదే లోలోపల నెమ్మదిస్తుంది. ఆ నిర్మలమైన మనసు నిన్ను ప్రేమమయుణ్ణి చేస్తుంది. నీ మాట, చూపు, ప్రవర్తన అన్నీ శాంతిమయం అవుతాయి. పరమాత్మ గుణాలనూ, శక్తులనూ నీలోలోపల ధారణ చేయడమే మహోన్నతమైన తపస్సు. దాన్ని సాధన ద్వారా మాత్రమే పొందగలవు’’ అని చెప్పాడు.


భగవంతుడు ఆకాశంలోనో, గుడిలోనో... ఏదో లోకంలో సింహాసనం మీద కూర్చొనో మనల్ని పరిపాలిస్తున్నాడనుకుంటాం. అయితే భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. భగవంతుడివైపు దారి కనిపిస్తుంది. మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. ఈ కథలోని పాపయ్యలాగే ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత క్రూరత్వం, కాఠిన్యం ఉంటాయి. ఆయుధాలతో బాధించేవాడే కాదు, ఎదుటి మనిషిని మాటలతో బాధపెట్టేవాడు కూడా క్రూరుడే! అందుకే ప్రతి మనిషీ తన అంతరంగంలోకి తొంగి చూసుకోవాలి. తనను తాను తెలుసుకోవాలి. అప్పుడే అతడిలో చైతన్య శక్తి ప్రజ్వరిల్లుతుంది. 

🌹🌹🌹🌹🌹🌹🌹

[28/11, 10:16] Chandra Sekhar: *కార్యశుద్ధితోనే ఫలసిద్ధి*

మంచి వాళ్లకే కష్టాలు వస్తాయి’ అని లోకులు వాపోతారు. అంటే, ‘చెడ్డ వారికి ఆపదలు రావనా, బాధలు లేవనా’ అర్థం? కాదు. ఒక దినాన్ని రాత్రింబవళ్లు పంచుకుంటాయి. పుట్టిన ప్రతి మనిషికీ సుఖదుఃఖాలు కలుగుతాయి. అవి అనివార్యం. మంచివాళ్లు ధర్మానుసారం జీవిస్తారు. మానవ జీవన పురోభివృద్ధిలో సాధికారికంగా భాగస్వాములవుతారు. సచ్ఛీలురు సమాజహితం కోరేవారే తప్ప కీడు తలపెట్టరు. అందుకు భిన్నంగా కొందరు అధర్మంతో బతుకీడుస్తూ చరిత్ర హీనులవుతారు. అలాంటి వారితో వ్యక్తిగత జీవితానికి, సమాజానికి చేటు తప్ప మేలు జరగదు.

దీపాలు వెలగని ఇంట్లో చోరులు దూరుతారు. చీకటి గదుల్లోకి పాములు, తేళ్లు చేరుతాయి. అదే గృహంలో జీవనం సాగిస్తున్న మనిషి మాత్రం తనకు ఎలాంటి భయాలు లేవు, ఆపదలు రావు అనే భ్రమల్లో ఉంటాడు.  చీకట్లో ఏమీ కనబడవు కానీ, ప్రమాదాలు పక్కనే పొంచి ఉంటాయి.

జ్ఞానం అంటే, వెలుగు. ముంచుకొచ్చే ప్రమాదాల్ని అది కళ్లముందు ఉంచుతుంది. దీపం- కాంతితో చీకట్లను తరిమికొడుతుంది. జ్ఞానం-జ్యోతిలా ప్రకాశిస్తూ అజ్ఞానాన్ని పారదోలుతుంది. చీకట్లోంచి వెలుగులోకి వచ్చిన వ్యక్తి ప్రమాదాలు చూసి ఇన్ని రోజులు లేని కష్టాలు ఇప్పుడే వచ్చాయని గొణుక్కుంటాడు. అతడిలో ఇంకా నమూనాగా (శాంపిల్‌గా) మిగిలిపోయిన అజ్ఞానపు వాసనలు అలా తప్పుగా ఆలోచింపజేస్తాయి.

పుట్టు గుడ్డివారికి చీకటంటే ఏమిటో తెలియదు. జీవిత పర్యంతమూ అజ్ఞానాంధ కారంలో జీవిస్తున్న మనిషికీ అలాగే ఉంటుంది. అతడు అజ్ఞానాన్ని జ్ఞానమనుకుని తప్పుదారిన నడుస్తాడు. ఆ మనిషి మనసులోకి అరిష డ్వర్గాలు దొంగల్లాగా మెల్లగా చొరబడతాయి. అవి చేపట్టే దుందుడుకు చర్యలవల్ల యాదృచ్ఛిక గెలుపులు, తాత్కాలిక విజయాలు చూసి పొంగిపోతాడు. అంతటితో తనకిక తిరుగే లేదన్న అనాలోచిత భావనతో అహంకారం పునాదులు వేసుకుంటుంది.

అడవిలో దారి కాచి బాటసారుల ప్రాణాలు తీసి వాళ్ల దగ్గరున్న ధనధాన్యాలు దోచి పొట్టపోసుకునే ఒక బోయవాడు ఒకనాడు అదే దారిన వస్తున్న రుషిని చూశాడు. ఆ సాధువు ముఖంలో గొప్ప వెలుగు చూశాడు. చెక్కు చెదరని ప్రశాంత వదనం మునిలో గమనించాడు. తనకూ దాన్ని ప్రసాదించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ జ్ఞాని ‘రామా’ అని పలకమన్నాడు. ఆ అడవి మనిషికి చేతకాలేదు. బాగా యోచించిన ఆ జ్ఞాన సంపన్నుడు అతణ్ని రెండు మర్రి వృక్షాల మధ్య కూర్చోబెట్టాడు. ఆ రెండు చెట్లను చూపిస్తూ ‘ఆ మర్రి ఈ మర్రి’ అని ఆగకుండా పలకమన్నాడు. మహర్షి చెప్పిన మాటలు విన్న బోయవాడు తు.చ. తప్పకుండా ‘ఆ మర్రి ఈ మర్రి...’ ‘ఆమి మ మర్రిమ మరీ...’ అంటూ కొన్ని రోజుల తరవాత ‘రామ, రామ, రామ...’ అంటూ రామనామాన్ని జపించసాగాడు. అతడే ఆచంద్రతారార్కం ఉండిపోయే ‘రామాయణ’ మహాకావ్యాన్ని సృజించి ఆది కవి(వాల్మీకి)గా వినుతికెక్కాడు. నువ్వు ఎవరు, ఏ ప్రాంతం నీది అన్నవి ముఖ్యం కాదు. (నీకు, పరులకు ప్రయోజనం చేకూర్చే) పనిపట్ల కనబరచే భక్తి శ్రద్ధలే ప్రధానం. అందుచేత కార్యశుద్ధితోనే ఫలసిద్ధి నీ దరి చేరుతుంది!

ఈనాడు అంతర్యామి

- మునిమడుగుల రాజారావు

[28/11, 10:16] Chandra Sekhar: *భగవంతుని కృపను పొందటానికి సాధారణ జీవితం గడుపుతున్న మనుషులకు ఒక గొప్ప సాధనామార్గం*ఇది*సమర్పణ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ABAP తెలంగాణ రాష్ట్రం* దీక్షాధారణ. మండలం పాటు సాగే ఈదీక్షల పద్దతి పూర్వం వున్నప్పటికీ ,అయ్యప్ప స్వామి  దీక్షలరూపములో ఈశతాబ్దములో బాగాప్రాచుర్యానికొచ్చాయి. .తరువాత భవాని,శివ,,గోవింద మాల తదితర దేవతాఉపాసనలు దీక్షారూపములో జనబాహుళ్యంచేత విస్తృతంగా జరుగుతున్నాయి. ఈదీక్షలవలన మనిషియొక్క శారీరిక మానసిక ఆరోగ్యాలు చక్కబడి మనసు భగవంతుని పట్ల నిలకడకలిగి వారి సాధనద్వారా వారికి శ్రేయస్సు కలుగుతున్నది. వేలాది మంది భక్తులు ప్రతిసంవత్సరం కొత్తగా దీక్షలు స్వీకరిస్తున్నారంటే వారికి ఆదీక్షలద్వారా జరుగుతున్న మేలు ప్రత్యక్షముగా అనుభవము లోనికి రావటమే. కోట్ల రూపాయలు పెట్టినా కొనలేని మానసిక శాంతిని ,మనోనైర్మల్యాన్ని,ఈతిబాధలను నివారించే శక్తిని మానవులకు దీక్షలు ప్రసాదిస్తున్నాయి. నియమాలను నిష్ఠగా ఆచరించినవారికి ప్రయోగాత్మకంగా వారి సమస్యలు నివారణవుతుండగా,మరికొందరికి శీఘ్రఫలితము రాకపోవటానికి,వారి సాధనలో జరుగుతున్నలోపాలే కారణమనిచెప్పవచ్చు.


గురుముఖతా చేసే సాధనలో శిష్యుని సాధనలోని లోపాలను ఎప్పటికప్పుడు ఆయనే సరిచేస్తాడు. కానీ కలియుగములో గురుభక్తి లోపించటము,అంతటి సమర్ధులయిన గురువుల అనుగ్రహం అందరికీ లభించకపోవటం వలన కొందరి సాధనలో సరయిన ఫలితాలు రాకపోవ్టానికి కారణంవుతున్నది. కొండొకచోటవారి సంచిత ఆగామి,ప్రారబ్ధకర్మాదుల వలనను ఆలస్యం అవుతుంది. దీక్షాధారుల కు సరయిన మార్గదర్శనం చేసే గురుస్వాములు సహకారం అందరూ తీసుకోకపోవటం ,కలిమాయా ప్ర్భావానికి లోనయి కొన్ని కానిపనులు చేసి కష్ఠాలు తెచ్చుకునేస్వాములను మనం చూస్తుంటాము. వాటికి వెనకున్న కారణము తెలియదు గనుక ఆదీక్షపట్ల ,దైవం పట్ల విశ్వాసాన్ని సడలించుకుంటారు తెలియనివారు. నిష్టానియమాలతో ఆచరించినప్పుడు ఎంతశుభకరపరిణామాలను ప్రసాదిస్తాయో కానిపనులు చేసినప్పుడు తీవ్రమయిన కష్ఠాలు వస్థాయి. అవి మనంచేసుకున్న కర్మలఫలితాలుగా గుర్తించాలి. సహజంగా కామక్రోధాది అరిషడ్వర్గాలు , దుష్టశక్తుల సమూహాలు మానవులను భ్గవ్న్మారగం నుంచి మల్లించి పతనమొనర్చే పనిని నిరంతరం చేస్తూనేవుంటాయి. జాగురూకతతఒ వుండకపోతే సాధకునికి పతనం తప్పదు.

అటువంటి ఒక సన్నివేశం మీకు తెలియజేస్తాను. మాఊరిలో పది సంవత్సరాలక్రితం జరిగిన సన్నివేశమిది. ఆసంవత్సరము మాలధరణ చేసిన స్వాములంతా దీక్షపూర్తిచేసి శబరిమల యాత్రకు వెళ్ళారు. అందరూ కొండఎక్కేటప్పుడు జనం ఎక్కువగావున్నందువలన చిన్నగా వారి సహనానికి పరీక్షలా సాగుతున్నదట యాత్ర. మాఊరి స్వాములలో ఒకరు[పేరుచెప్పటం భావ్యంకాదు] అప్పటికప్పుడు ఆవేశం వచ్చినవానిలా నేనీ యాత్రకురాను అని విసుక్కుంటూ స్వామీ ...స్వామీ అని వెంటనున్నవారు వారిస్తున్నా వినకుండా మెడలో మాలను పీకి విసిరివేసి తిరుగు ముఖం పట్టాడు. వచ్చిన పదిరోజులకు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ముందు జ్వరం,తరువాత కీళ్ళనొప్పులు రకరకాల కారణాలతో చికిత్సపొందుతూ హాస్పటల్స్కు తిరుగుతున్నాడు. నెలరోజులలో వెన్నుముకలో చీముపట్టీఅనదని గుంటూర్ జనరల్ హాస్పటల్ కు చేర్చారు. తల్లిదండ్రి కుటుంబం బావురు మంటున్నారు. ఆర్ధికంగా పెద్దగా లేని వారు బ్రాహకుటుంబముకనుక ఊర్లోవాల్లు కూడా తలాఒకచెయ్యిఅందించారు. వ్యాధి తీవ్రత ఎక్కువైనది. శబరిమలపోయి వచ్చిన కాడనుండి మావానికి ఇలా అయినదన్న అపోహలో కొందరు కుటుంబసభ్యులున్నారు. చివరకు అతను మరణించాడు. మరణించటానికి ఒకరోజు ముందు తనకు సన్నిహితుడయిన ఒకరిక అసలు విషయం చెప్పాడు. అన్నాఇది నేను చేసుకున్న పాపమే , మాలలో వున్నరోజులలో నేను ఒకసారి పొలానికి వెళ్ళినప్పుడు నాకు సంబంధమున్న స్త్రీ కూడా గడ్డికి వచ్చినది. అక్కడ ఎవరూ లేకపోవటము వలన నన్ను బలవంతపెట్టటముతో మాల తీసి చెట్టుకు తగిలించి ఆమెతో కలిశాను.తరువాత కాలువలో స్నానం చేసి మరలా మాలధరించాను. నేను చేసుకున్న పాపానికి నాకీశిక్షపడినది మీరెన్ని వైద్యాలు చేసినా నాపరిస్థితి నాకు తెలుస్తున్నది కనుక నేను సజీవముగా ఇంటికిరావటము కల్ల. అని చెప్పి కన్నీరు పెట్టుకున్నారట. ఈవిషయాన్ని బయటపెట్టడం బాగుండదని చాలారోజులు ఆయన దాచివుంచాడు.

కనుక మాలాధారణ జేసిన భక్తులు వళ్ళు జాగ్రత్తగావుంచుకుని నడవాల్సివుంది. ఎందుకంటే మన కర్మలకు కర్తలము మనమేకనుక . *ABAP*

[28/11, 10:17] Chandra Sekhar: మనసు విచిత్రమైంది. ఒకే ఆలోచన మీద నిలకడగా ఉండదు. మంచి మాటల దారాలతో కట్టినప్పటికీ గాలిపటంలా గిరికీలు కొడుతుంది. కష్టసుఖాలను పక్కపక్కనే ఉంచి ఒకదాన్ని ఎంచుకొమ్మంటే సుఖం వైపే మొగ్గు చూపుతుంది. దుఃఖానికి వెనకడుగు వెయ్యడం, సుఖం కోసం ఆరాటపడటం- రెండూ మనసుకున్న బలహీనతలే. సుఖాస్వాదనకు అలవాటుపడిన మనసు అది తన నుంచి దూరం కావడం ఏ మాత్రం సహించలేదు. కోరికలు నిండిన మనసుతో భగవంతుణ్ని సేవిస్తే అది బానిసత్వం. వాంఛారహిత స్థితితో దైవం ముందు సాష్టాంగపడటం నిజమైన భక్తుడి తత్వం. సర్వేశ్వరుడికి ఇష్టమైంది నిష్కామసేవ.

సుఖం అనే గాలాన్ని చూపించి మనసును మోహింపజేయడం లోక స్వభావం. అస్థిరతకు చిరునామా వంటి మనసును కారణజన్ములు గాటన కట్టేయగలుగుతారు. కోరికలకు తలలూపే నైజాన్ని మాన్పించి కష్టసుఖాలు రెండూ జీవుడి ప్రస్థానంలోని భాగాలే అని దాని చేత ఒప్పిస్తారు. అన్నమాచార్యులు, పోతన వంటి మహాపురుషులు నాటి పాలకులు తమపై విసిరిన ఆశల వలల్ని ఛేదించగలిగారు. తాత్కాలిక కష్టాలను అనుభవించారు. ఆ ఇక్కట్లు వారి చరితను శోభింపజేసి, శాశ్వత మోక్షప్రాప్తికి కారణమయ్యాయి.

అన్ని సమయాల్లోనూ సుఖంగా జీవించగలగడం ఒక నేర్పు. పాంచభౌతికమైన దేహాన్ని ఆకలి దప్పులు బాధిస్తుంటాయి. అవి తీరినప్పటికీ కొంతమంది అసం తృప్తులు నిరాశతో జీవిస్తుంటారు. సిద్ధార్థుడు సతీ సుతులను వదిలి పెట్టాడు. నిరాహారుడై తపస్సు చేశాడు. అతడు పొందిన జ్ఞానోదయ సారాంశం- అన్ని దుఃఖాలకు కారణం కోరికలు అన్న సత్యం.ఈ వాస్తవం కొన్ని శతాబ్దాల పాటు దేశ దేశాల్లోనూ ప్రభావం చూపించింది. పాలకుల నుంచి ప్రజానీకం వరకు ఆశారహిత జీవనంలోని మాధుర్యాన్ని చవి చూశారు.రాజ్య విస్తరణ కాంక్షను విడిచిపెట్టి అశోకుడు అన్ని శోకాల్నీ అధిగమించాడు. నిష్కామంగా ప్రజల్ని సేవించి ప్రజారంజక పాలకుడు అనిపించుకున్నాడు.

ప్రతి ఏడాది కాలం గీసే ప్రకృతి చిత్రం నిష్కామ సేవకు ప్రతీకగా నిలబడుతుంది. సూర్యభగవానుడి ఎండ ధాటికి భూమి బీటలు వారుతుంది. వరుణదేవుడి కరుణా దృష్టికై ఆకాశాన్ని అర్థిస్తుంది. సామాన్యుల శ్రవణేంద్రియాలకు వినిపించని నిశ్శబ్ద సందేశాన్ని ప్రకృతి పరమాత్మకు చేరవేస్తుంది. ఈ నేలతో సంబంధంలేని రుతుపవనాలు ఏ మూల నుంచో వేగంగా వీస్తాయి. ఆకాశం ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకుంటుంది. ఉరుములు ఉరుముతాయి. నీటికై ఎదురు చూసీ చూసీ భూమి అడుగు పొరల్లో ఎండిపోతున్న విత్తనాన్ని నీటి చెమ్మ పలకరిస్తుంది. చల్లని తన స్పర్శతో ఆ గింజకు ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. ఎంతో ఉత్సాహంతో భూమి పైపొర దాకా ఎదిగొచ్చిన విత్తనం రెండుగా చీలిన తన భాగాలను ఒక్కటిగా చేసి నమస్కార ముద్రతో ఆకాశానికి ప్రణామం చేస్తుంది. ఏరులుగా నదులుగా పారిన నీరు దాహార్తితో అలమటిస్తున్నవారి గొంతు తడుపుతుంది. నిశ్శబ్దంగా పైకెదిగిన మొక్క ధాన్య సిరుల్ని రైతుకు అందిస్తుంది.ప్రపంచ చిత్రపటం మీద కాలం గీసిన ఈ చిత్రం  ప్రతి ప్రాణికీ సుపరిచితమైందే. భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే వర్ణాల కలయికతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

పంచభూతాత్మకమైన శరీరంలో  కొలువైన మనసు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటుంది- ఏదీ నీది కాదు, నీతో ఏదీ రాదన్న వాస్తవానికి మనసు తలొగ్గక తప్పదు. ప్రలోభపెట్టే కోరికలకు ప్రభావితం కావడాన్ని మనసు తగ్గించుకోవాలి. జీవుడినైనా దేవుడినైనా నిష్కామంగానే సేవించడం అలవరచుకోవాలి.

ప్రాయశ్చిత్తము

 *ప్రాయశ్చిత్తము:-*


దుష్కర్మ ఫలం నుంచి విముక్తి పొందడానికి మార్గం ప్రాయశ్చిత్తం అని అన్నారు. ప్రాయశ్చిత్తము ద్వారా కర్మ ఫలం మార్చవచ్చు అని కూడా విశ్వసించబడింది . ప్రాయశ్చిత్తము అనేది వేదసంహితలలో కనబడుతుంది. కానీ కాలక్రమంలో ఆ శబ్దానికి అర్థం కొన్ని మార్పులు చెందినట్లు కనబడుతోంది. ప్రారంభం లో ఆకస్మికంగా జరిగే దోష నివారణకు చేసే పనిని ప్రాయశ్చిత్తం అని అన్నారు. హారతి ఇచ్చెటప్పుడు జ్వాల ఆరిపోవడం, ఇటువంటి వాటిలో ఒకటి! కానీ ప్రప్రధమంగా కర్మకాండలలో జరిగే ఆకస్మిక దోషముల నివారణకే ప్రాయశ్చిత్తం ఉద్దేశించబడింది. ప్రాయశ్చిత్తములు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి @ కర్మకాండలలో అశ్రద్ధ వలన జరిగే లోపాలను సరిదిద్దటం కోసం! రెండు @ కర్మకాండలు శాస్త్రం నిర్థేశించినట్లు నిర్వర్తింపబడనప్పుడు కలిగే దోషాలను నివారించడానికి. దోష పరిహారం, దెవతల ఆగ్రహమును శాంతింపజేయుట ప్రాయశ్చిత్త కర్మల ముఖ్య ఉద్దేశం. జంతుబలులు, నదీస్నానం, వేదమంత్రాల జపాలు, ఉచ్చాటన ప్రాయశ్చిత్త ప్రక్రియలు. కానీ ఈ ప్రాయశ్చిత్తం కర్మసిధ్ధాంతమును అనుసరించింది కావు. అంటే దుష్కర్మ నివారణకు కాదు. దుష్కర్మకు ప్రాయశ్చిత్తం లేదు. చేసిన పాపం చెబితే పోతుంది అనే సామెత అర్థం పశ్చాత్తాపం ద్వారా కర్మఫలమును తగ్గించవచ్చుననే విశ్వాసం. ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపం కాదు. 


ప్రాయశ్చిత్తము అనే శబ్దానికి అర్థం వ్యవాహారికంగా చెప్పడం సులభం కాదు. ప్రాయశ్చిత్తానికి సామాన్య అర్థం పాపపరిహారార్థం చేయు కర్మ. కానీ దాని ఉప్పత్తి అర్థం అందుకు భిన్నంగా ఉంది. అనేక విధాలుగా వ్యుత్పత్తి అర్థం చెప్పారు. తపోనిష్ట ద్వారా మనసు శుద్దం చేయడం, పాపమును శమింపజేయటం , కోల్పోయిన దానిని తిరిగి పొందడం కోసం చేసే ప్రయత్నం , ఇవి కొన్ని అర్థాలు. ఆ తర్వాత కాలంలో మహాపాతక దోషపరిహారం కోసం ప్రాయశ్చిత్తం చెప్పారు. స్మృతుల యందు, దర్మసూత్రములలో ప్రాయశ్చిత్తం యొక్క ఉద్దేశ్యమును ఇంకా కాస్త విస్తరింప జేయడం జరిగింది. హత్యాదోషం, మధ్యపాన దోషం, అసత్యదోషం , దోంగతనం, సంతానం లేక బంధువుల జననకాల దోషం వీటి నివారణకు తపస్సు ప్రాయశ్చిత్తం గా చెప్పారు.


ప్రాయశ్చిత్తానికి చాలా రకాల మార్గాలు చెప్పారు. ఉపవాసాలు ఉండటం, ఆహర నియమాలు, పంచగవ్యములను ఉపయోగించడం, ఒక రోజు లో రాత్రి వేళల్లో గానీ పగలు గానీ ఉపవాసం తో నీటిలో మునిగి ఉండటం , మొదలైనవి ప్రాయశ్చిత్తాలు , కానీ ఏ స్మృతి గానీ ధర్మశాస్త్రం గానీ మరొక స్మృతి లేక ధర్మశాస్త్రం చెప్పింది అంగీకరించలేదు. కొన్ని ప్రాయశ్చిత్తమును గురించి సంధేహించాయి కూడా. కర్మ ఫలం అనుభవించక తప్పదు కాబట్టి ప్రాయశ్చిత్తం నిష్ప్రయోజనం అని కొందరు ధర్మశాస్త్రాకారులు భావిస్తారు. కానీ తపస్సు ప్రాధాన్యం దాదాపు అందరూ అంగీకరించారు.


మనుస్మృతి జరిగిన కర్మ ఉద్దేశాన్ని అనుసరించి పాపపరిహరం యొక్క ఉపయోగం ఉంటుంది అని అంది . పాపకర్మ ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అన్నది ప్రదానం అంది. మనుస్మృతి శిక్షలను కూడా కులమును బట్టి నిర్ణయించింది. యాజ్ఞవల్క్య స్మృతి కూడా సామాన్యముగా స్మృతులు అన్ని దాదాపుగా కర్మ ఫలం అనివార్యం అనే ఉద్ఘాటించి చెప్పాయి. వేదాంత మార్గము లోనే పురుష ప్రయత్నం ద్వారా సంచిత కర్మను నివారించడానికి అవకాశం ఉంది అని గానీ ప్రారబ్ధ కర్మ ఫలం తప్పదు అనే స్మృతులు చెబుతున్నాయి. మొత్తం మీద పాపకర్మ నివారణకు ప్రాయశ్చిత్తం యొక్క సామర్థ్యాన్ని గురించి స్మృతులలో స్థిరమైన అభిప్రాయాలు కనబడదు. ఆఖరికి మనుస్మృతే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. హిందూ న్యాయ చట్టములు మనుస్మృతినే ఎక్కువ అధికారికంగా గ్రహించాయి. లోతుగా పరిశీలిస్తే ప్రాయశ్చిత్తమును అంగీకరించిన కర్మసిద్దాంతం నిరర్థకమైనది అవుతుంది. మహాభారతం కూడా పురుష ప్రయత్నాన్నే చెప్పింది. పురుష ప్రయత్నం ప్రాయశ్చిత్తం కాదు. చిత్త శుద్ధి తో పురుషార్ధాలను నిర్వర్తించుటే పురుష ప్రయత్నం. ఈ ప్రాయశ్చిత్త ప్రక్రియలు హేతుబద్ధమైన సమాధానాలుగా కనబడవు. ఎక్కడ నుంచో తీసుకుని వచ్చినట్లు కనబడుతుంది. ఆ తర్వాత కాలంలో ఇవి స్మృతులలో ఇమిడి పోయి ఉండవచ్చు.


బౌద్ధం లో కూడా ప్రాయశ్చిత్తమును అంగీకరించినట్లు లేదు. ప్రాయశ్చిత్త సిద్దాంతం జైనంలో ఒక రూపం పొంది ఉన్నట్లు కనబడుతోంది. కర్మ ద్రవ్యరూపం అని జైన సిద్దాంతం. కర్మ పదార్థం సూక్ష్మ అణురూపంలో నుంచి జీవులను ఆకర్షిస్తుంది. సాహచర్యం చేత జీవి, కర్మ పదార్థం అణువులు కలుస్తుంది. ఒకే ప్రదేశంలో ఏర్పడు ఈ సాహచర్యమే కర్మ పదార్థం జీవుని యందు ప్రవేశించడానికి కారణం. కావున ఇక్కడ కర్మకు ఉద్దేశం ప్రదానం కాదు. అయినా కూడా దురుద్దేశం ఎక్కువ కర్మ పదార్థ అణువులను చేర్చుతుంది. ఈ కర్మ పదార్థమే కర్మబంధం అవుతుంది. కర్మబంధ విముక్తికి ప్రాయశ్చిత్తం చెప్పారు. అది ``సంవరం`` `` నిర్జవం`` అని రెండు విధములు. సంవరం అంటే ధర్మనియతి !! తీర్థంకరుల భోధనల ప్రకారం సంవరంని సాధించవచ్చు అని అన్నారు. నిర్జరముని పూర్వపాపములను కఠిన నిష్ఠతో కర్మ అంటే వర్తమాన కర్మ చేత సంచిత కర్మను నిరోధించడానికి అవుతుంది. కఠిన నిష్ఠతో శరీరాన్ని శిథిలం చేయడమే ఈ నిర్జర అనే ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇది కర్మఫలంని శరీరం శిథిలం చేసుకోవడం ద్వారా అనుభవించమే అవుతుంది కదా! అంటే కర్మానుభవమే ప్రాయశ్చిత్తం!!! కాలక్రమంలో చేసిన తప్పుని ఒప్పుకోవడం, పశ్చాత్తాపం చెందడం, ఆపై నిరాహార దీక్షతో కూడిన ఉగ్ర తపస్సు ప్రాయశ్చిత్తం లో చోటు చేసుకున్నాయి. మధ్వాచార్యులు తన సర్వదర్శనం సంగ్రహంలో నిర్జరని రెండు విధాలుగా చెప్పారు. ఒకటి యధాకాల నిర్జర , రెండోది జౌపక్రమిక నిర్జర !! కర్మ పరిపక్వం చెంది పూర్తి అవడం వల్ల ఏర్పడే నిర్జర యదాకాల నిర్జర అని అన్నారు. రెండోది సంకల్పబలం తో తపస్సు చేసి దాని ద్వారా కర్మను పరిపక్వం చేయడం . జైనమతం లో తపశ్చర్య ద్వారా కర్మ నాశనం జైన కర్మ సిద్ధాంతానికి అనుగుణంగానే ఉంది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే కర్మను ఒక పదార్థం గా నిర్వహించారు కాబట్టి. శృతుల కాలం నుంచి స్మృతుల కాలం వరకూ వచ్చినప్పటికీ ప్రాయశ్చిత్త సిద్దాంతం జైన కర్మ సిద్ధాంత ప్రభావానికి లోనై ఉండవచ్చు అని కనిపిస్తుంది. కర్మ సిద్ధాంత పరిధిలోనే స్మృతులు , ధర్మసూత్రముల యందు ప్రాయశ్చిత్త ప్రక్రియలు కూడా ఇమడ్చబడినదిగా కనిపిస్తుంది. మొత్తం మీద ప్రాయశ్చిత్తం గురించి ఒక నిశ్చితాభిప్రాయం , సిద్దాంత రూపం ఉన్నట్లు కనబడదు. ఒకరు చెప్పింది మరొకరు వ్యతిరేకించడమే జరిగింది కానీ ప్రాయశ్చిత్తం ద్వారా నిజంగా దుష్కర్మ నాశనం సాధ్యం అని పరిపూర్ణ విశ్వాసం తో ఏ ఒక్క వ్యక్తి చెప్పినట్లు కనబడదు. వశిష్టుడు, విశ్వామిత్రుడు లాంటి యోగనిష్ఠాగరిష్టులు , శక్తివంతులు ఇప్పుడు లేరు . ఈ రోజుల్లో ప్రాయశ్చిత్త కర్మలు కూడా చిత్తశుద్ధితో కాకుండా వ్యాపారాత్మకంగా పైపై ఆడంబరంగా జరుగుతోంది. పూజలు , హోమాలు , వ్రతాలు , యజ్ఞ యాగాలు చేయించే వారికి చేసే వారికి చిత్తశుద్ధి శూన్యం గా కనబడుతోంది ఈరోజుల్లో. ప్రాయశ్చిత్తము చేశాం అని సంతృప్తి తప్ప ప్రాయశ్చిత్తం వలన ఉద్దేశించిన ఫలం దక్కుతుంది అని చెప్పడం నిజంగా సాహసమే ఈ రోజుల్లో. నేతి బీరకాయ వంటివే ఈనాటి ప్రాయశ్చిత్తాలు .


🙏🙏🙏🙏🧚🏻‍♂️🧚🏻‍♂️🧚‍♀️


సశేషం.

ఋణం

 *ఋణం:-*


తన ధర్మాన్ని తాను సరిగా నిర్వర్తిస్తూ ఉన్నా చాలా మంది కష్టనష్టాలు పడుతూ ఉంటారు. ఒక్కో సారి జాతక రీత్యా దశ, అంతర్థశలను అనుసరించి జపం, దానాలు వంటివి ఎన్నో పరిహారాలు అనుసరించి చేయించినా పెద్దగా ఫలితం కనిపించక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అందుకు కారణం *ఋణాలు* అంటే అప్పులు కాదు .



ఆ ఋణాలు :- 


పితృఋణం. మాతృఋణం , పుత్రికా ఋణం , స్త్రీ ఋణం, సోదర ఋణం , దైవ ఋణం , ఋషి ఋణం , దాన ఋణం, గురు ఋణం , 


ఈ తొమ్మిది ఋణాలు మనిషి జీవితంలో ఎప్పుడూ ప్రభావితం చూపిస్తూ ఉంటాయి . ఈ ఋణాలను తీర్చుకొనకపోతే ఆ వ్యక్తి మీద ఆ ఋణ బాధల ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎన్ని పూజలు, హోమాలు చేయించినా సరైన ఫలితాలు ఉండదు. ఎంత కష్టపడినా జీవితం లో ఉన్నత శిఖరాలకు ఎదగలేక నిరాశ నిస్పృహలకు లోనౌవుతారు .


ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఋణబాధలతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తి యొక్క జాతక పరిశీలన చేసి ఏ ఋణ బాధ అతనికి కష్టాలు కలుగచేస్తోందో గ్రహించాలి. దానితో పాటుగా గ్రహసంబంధ విషయాలను గుర్తించాలి . గ్రహాలకు సంబంధించిన పరిహరాలను చేయటానికి ముందుగా ఈ తొమ్మిది ఋణాలు నుంచి అతడిని విముక్తుడిని చేసే మార్గాలు సూచించి అతను పాటించే నియమాలు, విధి విధానాలు తెలుసుకుని ఆ తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన పరిహరాలను చేయించడం ద్వారా తగిన విధంగా ఫలితం ఉంటుంది.


*పితృఋణం :-* మరణించిన తండ్రి , తల్లి లేక అందుకు సమానమైన రక్త సంబంధీకులు మరణించిన తరువాత ఏ వ్యక్తి అయినా వారికి తాను చేయాల్సిన కర్మలను చేయకపోవడం ఆబ్దికం, సంవత్సరీక , తర్పణాలు విడవడం వంటివి శాస్త్రోక్తంగా కర్మలను నిర్వహించకపోవడం వల్ల ఆ వ్యక్తి వారికి ఋణపడి ఉంటాడు . ఇందువల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం లో ఆటంకాలు, తీవ్ర నష్టాలు చూడటం జరుగుతున్నది. అకారణ శత్రువులు, అవమానాలు, నిందలు, కోర్టు వ్యవహారాలు, చెరసాల వంటి కష్టనష్టాలు పితృఋణం వల్ల కలుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు ముందుగా పితృఋణం క్షయం చేయించుకోవాలి ‌ . ఆ తర్వాత మిగిలిన పరిహారం త్వరగా ఫలిస్తాయి.


*మాతృఋణం :-*


ఏ వ్యక్తి అయినా తెలిసీ , తెలియక తన తల్లికి కోపాన్ని, వేదనను కలిగించడం , ఆమేను తిట్టడం, కొట్టటం, ఆమెపట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం , ఒక బిడ్డకు తల్లిని దూరం చేయడం లేక కుటుంబానికి యజమానురాలిని దూరం చేయడం మాతృశాపం గురిచేస్తుంది.దీని వలన విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ధనం తీవ్రంగా నష్టపోతారు , గృహం లో మనఃశాంతి లోపిస్తుంది. భూ, పశు సంపద వివాదాలు మొదలైన నష్టాలు చవిచూస్తారు . ఇటువంటి సమస్యలు ఉన్న వారు ముందుగా మాతృఋణ శుద్ధి చేయించుకుని మిగిలిన పరిహారాలు ఆచరించాలి. 


*పుత్రికా ఋణం:-* 


స్త్రీ సంతానం పట్ల దురుసుగా ప్రవర్తించడం , వారిని అకారణంగా బాధించడం వలన వారికి వేడుకలు చేయకపోవడం వల్ల వారి నుంచి ధనం , వస్తువులను తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం వల్ల పుత్రికా ఋణం ఏర్పడుతుంది. కొంత మంది వారి పుత్రికలకు వారికి ఇవ్వవలసిన ఆస్థిని ఇవ్వకుండా మగ పిల్లలకి మాత్రమే ఇచ్చి పుత్రికలకు ఇవ్వకపోవడం వల్ల కూడా కలుగుతుంది. ఈ విధమైన ఋణం వలన ఆ వ్యక్తికి భార్యతో విభేదాలు, సంతానంతో విభేదాలు కలగటం తో పాటు ధనం నష్టం, అవమానాలు, ఒక్కో సారి ఒంటరిగా జీవించడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు ముందుగా పుత్రికా ఋణం తప్పకుండా తీర్చుకోవడం తప్పనిసరి. 


*స్త్రీ ఋణం :-* 


భార్య , పర స్త్రీ వీరిద్దరి విషయం లో ప్రియురాలు. ఉంపుడు గత్తె విషయంలో కూడా చేసే దుర్మార్గం స్త్రీ ఋణంగా పీడిస్తుంది.


భార్యను కొట్టడం , తిట్టడం, ఆమే స్వర్జితం దొంగిలించడం , భయపెట్టి లాక్కోవడం, ఆమెను పస్తులుంచడం, మానరక్షణకు వస్త్రాలు సమకూర్చక పోవడం , కుటుంబ అవసరాలకు తగిన ధనం ఆమెకు ఇవ్వకపోవడం, ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం లేక వెళ్లి పోయేలా చేయడం , భార్యాభర్తలను లేని పోని అనుమానం తో , లేనిపోనివి సృష్టించి వారిని విడదీయడం , పరస్ర్తీని కామించడం , ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, ఆమె మీద నిందలు ప్రచారం చేయడం, ఆమెను బలాత్కారం చేయడానికి సన్నాహాలు చేయడం , భయపెట్టడం , ఉంపుడుగత్తెగా ఉన్న స్త్రీ పట్ల నిర్దయగా ప్రవర్తించడం , అనుమానం తో వేధింపులు పెట్టడం , మానసికంగా శారీరకంగా హింసించడం ఇటువంటివి అన్ని స్త్రీ ఋణంగా పరిగణనలోకి వస్తాయి. ఈ ఋణం వలన ఆ వ్యక్తికి భార్యతో సఖ్యత ఉండదు. గృహ శాంతి ఉండదు. ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు దీనికి తొడు వ్యసనాలకు బానిస అవుతాడు. దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. మానసిక అశాంతిని పొందుతారు. దారిద్ర్యం తో పాటు శరీరం రోజురోజుకూ శుష్కించి పోవడం జరుగుతుంది. అశ్లీలం పట్ల అమితమైన ఆసక్తి పెరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉన్న వారు జీవితం లో ఒక్క పని కూడా ముందుకు రావడం జరుగదు. ఈ స్త్రీ ఋణం తీర్చుకుంటే తప్ప వేరే మార్గం లేదు.


*సోదర ఋణం:-*


తన రక్త సంబంధీకులతో అంటే తన సోదరులతో వివాదాలు పెట్టుకోవడం వారి స్వార్జితమైన ధనం తన అవసరాలకు వాడుకోవడం లేక వారికి చెందవలసిన ధన, కనక, వస్తు, వాహన, భూ, గృహ, లాంటి వాటిని తీసేసుకోవఠం వల్ల సోదర ఋణం ఏర్పడుతుంది. ఈ ఋణం కలిగిన వ్యక్తి దారిద్ర్యం పొందుతారు. తన జీవిత కాలం అంతా కష్టపడినా కూడా మనశాంతి పొందడు. అతని కుటుంబంలో భార్య లేక భార్య వైపు బంధువుల యొక్క ఆధిపత్యము అధికంగా ఉంటుంది. జీవితం చివరి దశకు వచ్చే సరికి హీనమైన, దీనస్థితి పొందుతారు.


*దైవ ఋణం :-*


తెలిసి తెలియని దైవం పట్ల చేసే తప్పిదాలు ఈ దైవ ఋణానికి కారణం అవుతాయి. ఈ ఋణం పొందిన వ్యక్తులకు దైవం పట్ల నమ్మకం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం తానూ దైవాన్ని ఆశ్రయిస్తాడు కానీ దైవాన్ని మనసా వాచా కర్మణా ఆరాదించడు, అవకాశం కుదిరినప్పుడు వితండవాదం చేస్తారు ..వీరు ఎటువంటి పూజలు చేయించరు ఒక వేళ చేయించినా ఫలితం ఉండకపోగా వీరికి చేయించిన పౌరోహితుడు వీరితో అనేక ఇబ్బందులు పడతాడు... 


ఇక భ్రుణ హత్య, పుత్రుడిని చంపడం, పెంపుడు జంతువులను చంపడం , గోహత్య వంటి పంచమహపాతకాలతో పాటు ఒక మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైతే దైవ ఋణం పాలవుతారు..వీరు సొంత మనుషులను కూడా హింసించడానికి వెనుకాడరు.


ఈ ఋణం వలన ప్రప్రథమంగా సంతాన హీనత కలుగుతుంది.. లేక అంగవైకల్యం తో సంతానం కలుగుతుంది. ఆ సంతానం పై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ ఋణం కలిగిన వ్యక్తికి అధికమైన కుటుంబ సమస్యలు ఉంటాయి. మానసిక అశాంతిని కలిగి ఉంటారు..వీరితో పాటు వీరి సన్నిహితులకు కూడా చెడు ఆలోచనలను చేసి ప్రభావితం చేస్తారు . 


*ఋషి ఋణం:*


తమ వంశానికి మూలపురుషుడు ఋషిని సేవించలేకపోవడం , సాదు సన్యాసుల పట్ల తెలిసో తెలియకో అమర్యాదగా ప్రవర్తించడం, ఋషిప్రోక్తమైన ఉపదేశాలను హేళన చేయడం వల్ల, తీసుకున్న మంత్రాన్ని సరిగా జపం చేయలేక అది ఇచ్చిన వారిని తక్కువ చూడటం , ఋషి ఋణం కిందకు వస్తాయి.ఋషి ఋణం ఉన్న వారిలో మూర్ఖత్వం పెరిగిపోతుంది. ఆవేశం వల్ల అనేక కష్టనష్టాలను పాలవుతుంటారు. ఏం చేసినా కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక విధంగా పరుల నోట్లో నానుతూ ఉంటాడు . ఇటువంటి వారు ఋషి ఋణం తీర్చుకోవాలి.


*దాన ఋణం :-* 


ఒకరికి దానం చేస్తానని చెప్పి మాట ఇచ్చి చేయకపోవడం లేదా దానం చేసి ప్రతి ఫలం కోరటం, పనికి రాని దానం చేయడం, దానం చేసిన వానిని తిరిగి బలవంతంగా సొంతం చేసుకోవడం ఇవన్నీ దాన ఋణం కలిగిస్తాయి.


ఈ ఋణం పొందిన వారు తరచుగా వివాదాలు పాలవుతారు. ధనం , కుటుంబ జీవనం నష్టపోయినపుడు, వ్యసనాల పాలు అవుతారు. దారిద్ర్యం , ఋణ బాధలు, బంధు , మిత్రుల నిరాదరణకు పొందటం తో పాటు అవమానాలు అపకీర్తిని భరించవలసి వస్తుంది.


*గురు ఋణం:-* 


గురువు లేదా అంతకు సమానమైన హితుల పట్ల చేసే అపచారం గురు ఋణం గా బాధిస్తాయి.తరచు తగవులు, మిత్రులతో విభేదాలు, ఉపాధిని కోల్పోవడం  , వివేకాన్ని కోల్పోయి సమాజం లో అపకీర్తిని భరించవలసి వస్తుంది. 


ఈ 9 రకాల ఋణాలు ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం లోతుగా పరిశీలిస్తే అర్దం అవుతుంది. 


సశేషం


9542552784

గురువులు

 గురువులు ఎన్ని రకాలు ఉంటారు ? గురువుల వలన నీకు ఏమిటి ఉపయోగం ?

ఏ గురువిని నువ్వు ఆశ్రయించాలి .

01. *సూచక గురువు* : బాల్యం నుండి నీకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు నీకు బ్రతుకు తెరువు కోసం భోదన చేసే గురువులు ఎందరో . నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు . వీరిని సూచక గురువు అంటారు . వీరి ద్వారా భుక్తి మార్గం తెలుసుకుంటావు .

02. *వాచక గురువు *:ధర్మా ధర్మ విచక్షణ , మంచి చెడు విశ్లేషణ , చతురాశ్రామాలు వాటి ధర్మాలు గురించి చెపుతారు ( భ్రహ్మ చర్యము , గృహస్త్దము , వానప్రస్దానం , సన్యాసం ) . వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహనతో వసిస్తావు .

03. *భోధక గురువు* : మహా మంత్రాలను ఉపదేశిస్తారు .లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని , అలౌకిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని . వీరిని భోధక గురువు అంటారు . లోకికం నుండి అలోకికం వరకు మెల్లగా అడుగులు వేస్తావు .

04 *నిషిద్ద గురువులు* : మారణ ప్రయోగాలు , వశికరణాలు , వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువు అంటారు . ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళక పోవడం చాలా మంచిది . చిత్తాన్ని శుద్ధి చేయరు. విత్తాన్ని హరిస్తారు . ( పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి )

05 *విహిత గురువు* : మన హితము గోరి సూచనలు సలహాలు ఇస్తారు , నశించి పోయే విషయ భోగాలు

పై ఆశక్తి తగ్గించి , సత్యమైన శాస్వితమైన విషయాల పై అంతర్ముఖం చేస్తాడు . ( ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణ తో జివిస్తావు )

06 *కారణ గురువు* : ఇతను మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు .ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు ,( నిత్య ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోతూ ఉంటావు )

07 *పరమ గురువు *: ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు .

శిష్యునికి సన్మార్గం భోధించి ‘’ ఈ చరా చర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని ‘’ అహం బ్రహ్మస్మి అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు ఆవాహన చేసి నీవు అనుభూతి చెంద గలిగే స్దితికి తీసుకు వెళ్ళే వారు ఈ పరమ గురువులు . వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు . నీ నిజ జీవితంలో ఇలాంటి గురువు తారస పడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే . ( నువ్వు వచ్చిన పని నీకు తెలియచేసి నీ విడుదల కు మార్గం చూపేవారు పరమ గురువు (గురు చరణం గ్రూప్ నుండి సేకరణ)

కర్మఫల త్యాగం

 కర్మఫల త్యాగం


🍁🍁🍁🍁🍁



చేసే పనిని కర్మగా వర్ణించింది భగవద్గీత. ఇంద్రియాలతో ఆచరించే ప్రతి పనీ కర్మయోగమే. 


చూడటం, వినడం, తాగడం, తినడం... ప్రతిదీ కర్మలోని భాగమే. కర్మల ఫలితమే మనిషి జీవన విధానమని భగవద్గీత అయిదో అధ్యాయం చెబుతోంది.


పూర్వం చేసిన పనులు సంచితమని, వర్తమానంలో ఆచరించేవి ప్రారబ్ధమని, రాబోయే కాలంలో చేయబోయే పనులు ఆగామిగా విభజించారు. కర్మను అనుసరించి ఫలం అందుతుంది.


ధ్వనికి ప్రతిధ్వని, స్పందనకు ప్రతిస్పందన ఎలా సాధారణమో కర్మకు ఫలితం అలాంటిదే. 


రెండు చేతులు చరిస్తే వచ్చే చప్పట్ల శబ్దాన్ని చెవులు అనుభవిస్తాయి. మనసు, శరీరం కలిసి చేసే కర్మల ఫలాన్ని మనిషి పొందుతాడు. 

నవ్వుతూ తప్పుచేస్తే ఏడుస్తూ అనుభవిస్తారు.



కర్మకు పాపపుణ్యాలు లేవు, మంచిచెడులు లేవు. ఫలితానికే సుఖదుఃఖాలు  పరిమితం. మానవ జీవితమే కర్మఫలంగా చెబుతారు.


కార్యాచరణ నిమిత్తమాత్రంగా జరగాలని, అప్పుడే ఫలితం మనల్ని బంధించదని శ్రీకృష్ణుడు బోధించాడు. 


దానినే తామరాకుపైన నీటిబొట్టుగా వర్ణించాడు.


యజమాని దగ్గర పనిచేసే సేవకుడు నిమిత్తమాత్రుడు. తాను చేసే పనుల లాభనష్టాలు, మంచిచెడులకు తాను బాధ్యత వహించడు.


 వాటివల్ల తాను ఏ ప్రయోజనం పొందడు. మనిషి సేవకుడిలా పనిచేస్తూ యజమాని అయిన భగవంతుడికి కర్మఫలాన్ని వదలాలి. అదే కర్మసన్యాస యోగమని గీత బోధ.


కర్మచేయడంపట్ల మనిషికి అధికారం ఉంది. ఫలంలో లేదు. కర్మత్యాగం కన్నా కర్మఫలత్యాగం మనిషిని జ్ఞానమార్గం వైపు మళ్ళిస్తుంది.


రామాయణంలో భరతుడు ‘తండ్రి ఆదేశానుసారం రాజ్యభారం’ వహించాడా? తనకు కాక శ్రీరామపాదుకలకు పట్టాభిషేకం గావించాడు.


 తాను రాజుగా మారక రాజ్యప్రతినిధిగా పాలించాడు. రాజ్యం పరిపాలించే కర్మను ఆచరించింది భరతుడే అయినా, శుభాశుభాల ఫలితాలు శ్రీరాముడికి సమర్పించడం కర్మఫలత్యాగం.


మనిషి బతికినంతకాలం కర్మను ఆచరించక తప్పదు. కర్మనుకాక దాని ఫలాన్ని త్యాగం చేయాలి. మనం ఒకరితో పంచుకునే విధానాన్ని దానం, త్యాగం అంటారు.


దానం కన్నా త్యాగం ఉన్నతమైంది. మనకు అవసరం కానిది, అధికంగా ఉన్నది దానం చేస్తాం. త్యాగంలో నాకేమిటి అనే స్థితి రాదు. 


పావురం ప్రాణాన్ని రక్షించే నిమిత్తం తన శరీరం నుంచి మాంసాన్ని కోసి ఇచ్చాడు శిబి చక్రవర్తి. త్యాగానికి అది పరాకాష్ఠ!


కర్మఫలాన్ని త్యాగంచేయడం అసాధారణ విషయం. 


మనిషి తాను చేసే పనిలో ఎంతో కొంత లాభాన్ని ఆశిస్తాడు. స్వార్థంతో చేసే పనిలో తన శక్తియుక్తులను ధారపోస్తాడు. కర్మపరిపక్వత చేరినప్పుడు ఫలితాన్ని త్యాగంచేయడం యోగులకే సాధ్యం.


త్యాగఫలం ఒక యోగం. ఫలత్యాగం మోక్షసాధనం. మోహాన్ని క్షయింపజేయడమే మోక్షం!


🍁🍁🍁🍁

దండె వుండేది,

 మడిబట్ట ఆరేసుకోవటానికి దండె వుండేది, 


మడి నీళ్లు, వంటిల్లు, చల్లగదిలో ఊరగాయ జాడీలు, అందులో చింతకాయి, నిమ్మకాయి,దబ్బకాయి, ఆవకాయ, మాగాయి, మెంతి కాయి, తొక్కుడు పచ్చడి, వడియాలు, అప్పడాలు, ఊరచల్ల మిరపకాయలు, వుండేవి. 


బాదం చెట్టు, కరివేపాకు, అరటి, మందార పుావుల, పారిజాతం, తులసి మొదలైనవి. 


రెండు పెద్ద అరుగులు, ఎడమవైపు పోస్టాఫీసు గది, కుడి వైపు కరణీకం దస్త్రాలు గది, మధ్యలో మండువా, అటుా, ఇటుా గదులు, పెద్ద వసారా, అందులో ఆడపిల్లలు కుార్చునేవారు.


బయట తిరిగి వస్తే, కాళ్లు చేతులు కడుగుకొని, బట్టలు మార్చుకున్నాకే భోజనం. 

ఉదయం 10.30, సాయంత్రం 6 కల్లా భోజనం. మజ్జిగ అన్నంలో వేసవి కాలంలో మామిడి పళ్ళు.


ఉదయం చద్దెన్నం, చిన్న పిల్లలకు కాఫీ లేదు, మధ్యాహ్నం , జంతికలు, మిఠాయి కొమ్ములు, చేగోడీలు, పుాతరేకులు.


శీతాకాలంలో, సీతాపలాలు, జామకాయ, సపోటా, తేగలు, బుర్ర గుంజు ,  తాటి ముంజెలు, 

వేసవికాలంలో, ఈత కాయలు, చీమచింతకాయలు.


భోజనములో కంది పచ్చడి, పెసరపప్పు పచ్చడి, మినపప్పు పచ్చడి, గోంగూర పచ్చడి, కొబ్బరి కాయ పచ్చడి, వంకాయ పచ్చడి, పచ్చి పులుసు, మెంతి మజ్జిగ, చల్లపులుసు, కందిపొడి, నువ్వులపొడి, పొట్లకాయపెరుగు పచ్చడి, పాలుపోసి ఆనపకాయకుార, ఆవ పెట్టి, పనస, అరటి, కందబచ్చలి, కుమారులు, తెలగపిండితో కుారలు, గుత్తి వంకాయ, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు (టమోటా తక్కువ), తోటకూర, బచ్చలికూర, గోంగూర శనగ పప్పు పులుసు, పెండలం కుార, వేపుళ్ళు, బంగాళదుంప ఉప్మా కుార.

 

ఇంక తద్దినం భోజనము సరేసరి,   ఆలస్యం అయినా అమోఘం, మధ్యాహ్నం 2 దాక వేచి చూసే  వాళ్ళం, మధ్యలో అడిగితే, బ్రాహ్మలు భోజనాలు  అవుతున్నాయి, అరగంట ఆగండి అనేవారు.


గారెలు, అప్పాలు, పరవాన్నం, 

నుావుపచ్చడి, అల్లపచ్చడి, పులుసు వుండదు, చారు, పెసరపప్పు (ఉట్టిదే తినాలని పించేది) తీపి కుార, 

ఆవపెట్టిన కుార, ఇంకో కుార, 

అనకుాడదుకానీ, తద్దినం భోజనం తలుచుకుంటే ఎటువంటివారికైనా నోట్లోనుంచి చొంగ కారాల్సిందే ... 


శుభకార్యాలలో, బుారెలు, బొబ్బట్లు, మైసుారు పాక్(ఆరోజుల్లో) పుాతరేకులు, బుాంది లడ్డు, గుమ్మడి కాయ దప్పళం, పనస పొట్టు కుార స్పెషల్.


అత్తరు సాహెబ్ సెంటు, అత్తరు, 

వచ్చినప్పుడు కంటికి సుర్మ పెట్టే వాడు, 


తలకు రాసుకోవటానికిి టాటా, స్వస్తిక్ సువాసనగల నుానె, ఆడవాళ్ళు జుట్టు ఊడకుండ 'రీట' రాసుకునేవారు. 

అప్పట్లో తిలకం పెట్టుకునే వారు, స్టిక్కర్లు లేవు. 


మగవాళ్ళుకుాడ తిలకం పెట్టుకుని బడికి వెళ్ళేవాళ్ళం, 


పెద్దలు విభూది పెట్టు కొనేవారు. 

రాత్రి పడుకునేటప్పుడు కథలు చెప్పుకునేవారం, 


కరోన వచ్చింది.

మా చిన్నతనం గుర్తొచ్చింది,

స్వేచ్ఛకు సంకేతం పక్షి*

 *స్వేచ్ఛకు సంకేతం పక్షి*


రాత్రి పొదిగిన గుడ్డు తెల్లవారు సూర్యుడు పుడమిని ప్రభవించేసరికి పిట్టై పరివర్తన.


గుడ్డు పిట్టకావడం పక్షి జాతికి ఎంతో సంబరం. కాలం లెక్క తెలియని పక్షులు, తమ రెక్కల మీదుగా ఉదయాస్తమయాల మధ్య వాటి పయనం.


పొద్దు పొడవడం వాటికి మహదానందం, మరోసారి  కొత్త ఆకాశం దొరికినందుకు సంబరం.


దాచుకోవడం దాచిపెట్టి కూడబెట్టడం తెలియని పక్షి జాతికి కొమ్మను నమ్మి కాదు తమ రెక్కల కష్టం పైనే నమ్మకం. 


అందుకే వాటికి అంతరాలు వివక్ష వర్ణ భేదాలు లేవు, తెలియవు. ఇదిగో ఇక్కడిదాకా అన్న పరిమితులు లేవు వాటికి.  అనంతాకాశమే అవకాశం. 


మానవ తప్పిదాల వల్లే వాటికి వాటిల్లే ముప్పు, నీటికి గూటికి తిప్పలు. 


స్వేచ్ఛ అంటే ఏమిటో పక్షివైతే తప్ప, మనకు ఎప్పటికీ తెలియదు. 


మల్లేశ్వరరావు ఆకుల

శ్రీమద్భగవద్గీత

 🙏శ్రీమద్భగవద్గీత🙏

6వ అధ్యాయము 

ధ్యాన యోగము


బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః ।

అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ।। 6 ।।


బంధుః — మిత్రుడు; ఆత్మా — మనస్సు; ఆత్మనః — వ్యక్తికి; తస్య — అతని; యేన — ఎవరి చేత నైతే; ఆత్మా — మనస్సు; ఏవ — ఖచ్చితంగా; ఆత్మనా — ఆ వ్యక్తికి; జితః — జయించి; అనాత్మనః — నిగ్రహింపబడని మనస్సు కల వారికి; తు — కానీ; శత్రుత్వే — శత్రువుకి; వర్తేత — ఉండును; ఆత్మా, ఏవ —మనస్సే ; శత్రు-వత్ — శత్రువు లాగ.


భావము 6.6: మనస్సుని జయించినవారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వాడికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది.


వివరణ: మనకు శత్రువులుగా అనిపించి, మనకు హాని చేయగలరేమో అన్న వారిని ఎదుర్కోవటానికి, మన ఆలోచనా శక్తి లో చాలా భాగాన్ని వెచ్చిస్తాము. వైదిక శాస్త్రాలు, అతి పెద్ద శత్రువులైన - కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, భ్రాంతి మొదలైనవి - మనలోనే ఉంటాయి, అని చెప్తున్నాయి. ఈ అంతర్గత శత్రువులు బాహ్యమైన వాటి కన్నా ఏంతో హానికరమైనవి. బాహ్య పిశాచాలు మనను కొంత సమయం వరకు బాధించవచ్చు, కానీ, మన మనస్సు లోనే ఉన్న పిశాచాలు మనం నిరంతరం దౌర్భాగ్యస్థితిలోనే ఉండేటట్టు చేయగలవు. సర్వమూ అనుకూలంగా ఉండి కూడా, తమ స్వంత మనస్సు వలన మానసిక కుంగు, ద్వేషము, ఆందోళన, బెంగ మరియు ఒత్తిడి వంటి వాటితో దౌర్భాగ్యమైన జీవితం గడిపిన ఎందరో మనకు తెలుసు.


వైదిక తత్వ శాస్త్రం, మన తలంపుల/ఆలోచనల యొక్క పరిణామాల మీద చాల ముఖ్యంగా నొక్కిచెప్పింది. వ్యాధులు అనేవి వైరస్, బ్యాక్టీరియ వలన మాత్రమే రావు, మన మనస్సులో ఉన్న చెడు ఆలోచనలు (negativities) వలన కూడా వస్తాయి. ఎవరైనా పొరపాటుగా మీ మీద రాయి విసిరితే, అది కొద్ది సేపు మనలను బాధించవచ్చు, కానీ తరువాతి రోజు దాని గురించి నీవు మర్చి పోవచ్చు. కానీ, ఎవరైనా అప్రియమైన మాట అంటే, అది మిమ్ములను ఎన్నో సంవత్సరాల వరకు బాధించవచ్చు. ఇదే ఆలోచనల యొక్క గొప్ప శక్తి. బౌద్ధ శాస్త్రంలో, ధర్మపాద (1.3) బుద్ధుడు కూడా ఈ నిజాన్ని స్పష్టంగా తెలియపరిచాడు.


"నేను అవమానించబడ్డాను! నేను నిందింపబడ్డాను ! నేను దండింపబడ్డాను! నేను దోచుకోబడ్డాను! ఈ ఆలోచనల తో నే ఉన్నవారికి దుఃఖం అంతము కాదు."


"నేను అవమానించబడ్డాను! నేను నిందింపబడ్డాను ! నేను దండింపబడ్డాను! నేను దోచుకోబడ్డాను! ఈ ఆలోచనల తో లేని వానికి కోపం తగ్గిపోతుంది."


మనలో ద్వేషమే పెంపొందించుకుంటే, మన విపరీత (negative) ఆలోచనలు, మనం ద్వేషించే వస్తువుకి కాకుండా, మనకే ఎక్కువ నష్టం కలుగ చేస్తాయి. చాలా తెలివిగా ఇలా చెప్పబడింది : "ద్వేషం/ఆగ్రహం అనేది మనం విషం తాగి ఎదుటి వాడు చనిపోవాలని కోరుకోవటం లాంటిది". సమస్య ఏమిటంటే చాలా మంది జనులు తమ యొక్క సంస్కరింపబడని మనస్సే తమకు ఎంతో హాని కలుగ చేస్తోందని తెలుసుకోరు. కాబట్టి, జగద్గురు శ్రీ కృపాలు మహారాజ్ గారు ఇలా ఉపదేశిస్తారు.


మన కో మానో శత్రు ఉసకీ సునహు జని కఛు ప్యారే (సాధన భక్తి తత్త్వం)


"ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు."


కానీ, ఆధ్యాత్మిక సాధన ద్వారా, మనస్సుని బుద్ధి యొక్క నియంత్రణ లోనికి తెచ్చినప్పుడు, దానికి మన ఉత్తమ స్నేహితుడుగా అయ్యే సామర్ధ్యం ఉంది. ఏదేని వస్తువు శక్తి ఎక్కువున్న కొద్దీ దాని దురుపయోగ ప్రమాదం కూడా ఎక్కువుంటుంది. మనస్సు అనేది మన శరీరంలో అమర్చబడిన ఉన్న ఒక అత్యంత శక్తి వంతమైన ఉపకరణం కాబట్టి అది రెండు పక్కల పదునుగా ఉన్న కత్తి లాంటిది. ఈ విధంగా, రాక్షసత్వ స్థాయికి దిగజారిన వారు కూడా తమ మనస్సు వలననే అలా అవుతారు; అదే సమయంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారు కూడా తమ పవిత్రమైన మనస్సు వలననే అలా అవుతారు. అదే ప్రకారంగా, విన్స్టన్ చర్చిల్ , రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఉన్న విజయుడైన బ్రిటిష్ ప్రధాని, ఇలా అన్నాడు: “The price of greatness is the responsibility over your every thought.” ఈ శ్లోకం లో, శ్రీ కృష్ణుడు అర్జునుడుకి, మనస్సు యొక్క హాని కలిగించే మరియు శ్రేయస్సు కలిగించే శక్తి గురించి, జ్ఞానోపదేశం చేస్తున్నాడు. తదుపరి మూడు శ్లోకాలలో, యోగారూఢుని (యోగములో పురోగతి సాధించిన వాని) యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో శ్రీ కృష్ణుడు వివరిస్తాడు.

ఢిల్లీలో "తీస్ హజారీ" చరిత్ర

 #FarmersProtestDelhi


 ఢిల్లీలో "తీస్ హజారీ" చరిత్ర మీకు తెలుసా?


 మొఘల్ రాజు జహంగీర్ కుమార్తెకు పువ్వులంటే చాలా ఇష్టం, ఆమె అక్కడ 30 వేల పుల మొక్కలు నాటారు కాబట్టి దీనికి తీస్ హజారీ అని పేరు పెట్టార అని లౌకికవాదులు చెబుతారు.


 అది పూర్తిగా చెత్త.


 తీస్ హజారీ నిజం ఇలా ఉంది:


 గొప్ప సిక్కు యోధుడు జస్సా సింగ్ అహ్లువాలియా. 


సిక్కులపై ఔరంగజీబ్, ఇతరులు సిక్కులపై చేసిన అరాచకాల గురించి తెలుసుకుని ఆగ్రహించాడు.


 ఢిల్లీని షా ఆలం II పాలించేటప్పుడు, జస్సా సింగ్ ఢిల్లీ కోటపై దాడి చేసి అన్ని వైపుల నుండి అతనిని చుట్టుముట్టారు.


 జస్సా సింగ్ వద్ద 30 వేల మంది సైనికులు ఉన్నారు. వీరిని ఇప్పుడు తీస్ హజారీ అని పిలుస్తారు.


జస్సా సింగ్ గురించి తెలిసిన షా ఆలం దిగివచ్చాడు. ప్రాణాలభిక్ష పెట్టాలని వేడుకున్నాడు. సిక్కులపై చేసిన దారుణానికి క్షమాపణలు చెప్పాడు.


 జస్సా సింగ్ దయగల వ్యక్తి, అతను ఎర్ర కోటలో సింహాసనాన్ని తీసుకొని షా ఆలం కు ఎటువంటి హానీ చేయకుండా వదిలిపెట్టాడు.


 అప్పటి నుండి, 30 వేల సైన్యం  అక్కడ చాలాసేపు వేచి ఉన్న  ఆ ప్రదేశం తీస్ (30) హజారీ (వేలు)గా ప్రసిద్ది చెందింది.


 గమనిక: తీస్ హజారీ కోర్టు ఇప్పుడు రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తోంది. ఆ స్థలం యొక్క నిజమైన చరిత్ర రైతులకు తెలియదేమో.


 ఆధారం: జస్సా సింగ్ అహ్లువాలియా

స్టెయిన్ గా మారిన "కరోనా"...!!!

 *లాక్ డౌన్ తప్పదా❓* 

*స్టెయిన్ గా మారిన "కరోనా"...!!!❗*

🔥🔥🔥🔥🔥

న్యూఢిల్లీ: 

నూతన సంవత్సరంలో కరోనా కలవరానికి టీకాతో చెక్ పెడదామన్న ఆశలను యూకేలోని కొత్త స్ట్రెయిన్ ఒక్కసారిగా చెదరగొట్టింది. కరోనా కొత్త రూపాంతరం వీయూఐ-202012/01 స్ట్రెయిన్ 70 శాతం వేగంతో పయనిస్తోందని, దేశంలో పరిస్థితులు చేజారిపోతున్నాయని బ్రిటన్ మంత్రి మ్యాట్ హాంకాక్ వెల్లడించడం యావత్ ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేసింది. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వం క్రిస్మస్ సంబరాలపై ఆంక్షలు విధించింది. లండన్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో కఠిన లాక్‌డౌన్ ప్రకటించింది. వైరస్ కొత్త మార్గాలలో దాడి చేస్తే, అందుకు అనుగుణంగా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారులను ఆదేశించారు. కొత్త రకం వైరస్ తొలిసారిగా ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో సెప్టెంబర్‌లోనే రిపోర్ట్ అయినట్టు తెలిసింది. అక్కడ స్ట్రెయిన్ కేసులే అధికంగా కనిపించాయి. డిసెంబర్ 18న తొలిసారిగా స్ట్రెయిన్‌ను గుర్తించిన అధికారులు దాని తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేశారు. అదే రోజున ఇంగ్లాండ్ దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించింది. ఈ కొత్త రకం వైరస్‌ తమ వరకు రాకుండా భారత్ సహా అనేక దేశాలు బ్రిటన్ నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి.


దక్షిణాఫ్రికాలోనూ ఇదే?

యూకేలో వెలుగుచూసిన కొత్త వైరస్ వేరియంట్‌ను పోలి ఉన్న స్ట్రెయిన్ దక్షిణాఫ్రికాలోనూ కనిపించిందని సైంటిస్టులు తెలిపారు. రూపాంతరం చెందిన వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం దేశంలో సెకండ్ వేవ్‌కు కారణమైందని తెలిపారు. ప్రతిపది కేసులలో తొమ్మిది కొత్త స్ట్రెయిన్‌ కేసులే ఉంటున్నాయని దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి వేలీ కీజ్ తెలిపారు.


మ్యూటేషన్ సర్వసాధారణం

యూకేలో కొత్త స్ట్రెయిన్‌పై కలవరం మొదలైన తరుణంలో శాస్త్రజ్ఞులు మ్యూటేషన్‌పై భయాందోళనలు తొలగించే పనిలో పడ్డారు. వైరస్ అన్నాక కచ్చితంగా రూపాంతరం చెందుతుందని, మ్యూటేషన్ చెందడం దాని లక్షణమని వివరించారు. ఫ్లూ కూడా అనేకసార్లు మ్యుటేషన్ చెందిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ కూడా చాలాసార్లు మ్యూటేషన్ చెందిందని, ఇకపైనా చెందుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ రవిగుప్తా వివరించారు. వుహాన్‌లో వ్యాప్తి చెందిన వైరస్‌ను ఇప్పటి వైరస్‌తో పోలిస్తే అది 25 సార్లు రూపాంతరం చెందినట్టు మరో శాస్త్రజ్ఞుడు బీబీసీకి తెలిపారు. అంటే నెలకు రెండుసార్లు రూపాంతరం చెందినట్టు తెలుస్తుందని పేర్కొన్నారు. దాని రూపాంతరాలు చాలాసార్లు కనీసం వెలుగులోకి కూడా రాలేదని అన్నారు.


*వ్యాప్తికి అనుగుణంగా మార్పు*

తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌లోని రెండు స్ట్రెయిన్‌లపై శాస్త్రజ్ఞులు ప్రధానంగా మాట్లాడుతున్నారు. హెచ్69/వీ70 రహిత, డీ614జీ రహిత స్పైక్ ప్రోటీన్ (వైరస్ కణాలు వేగంగా వ్యాపించడానికి దోహదపడే భాగం) వైరస్‌లు చర్చనీయాంశమయ్యాయి. వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్‌లు మానవ కణాలపై దాడి చేస్తాయి. తద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. వైరస్ దాడులను మనిషిలోని ఇమ్యూన్ సిస్టమ్ తిప్పికొడతాయి. హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్‌పై సరికొత్త రూపంలో దాడి చేయడానికి, లేదా సులువుగా దాడి చేయడానికి అనుగుణంగా వైరస్ తనను తాను మార్చుకుంటుంది. ఇందులో భాగంగానే కరోనా వైరస్‌‌లోని స్పైక్ ప్రోటీన్ మార్పు చెందుతూ వస్తున్నది.


తూర్పు చైనాలో జనవరిలో కరోనా వైరస్ డీ614జీని కోల్పోయి రూపాంతరం చెందింది. అదే స్ట్రెయిన్ న్యూయార్క్, యూరప్‌లకు విస్తరించింది. అనంతరం కొన్ని నెలల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఇదే స్ట్రెయిన్ కనిపించింది. వుహాన్‌లో వ్యాప్తి చెందిన వైరస్‌ స్థానంలో ఈ కొత్త స్ట్రెయిన్ వచ్చి చేరింది. హెచ్69/వీ70 రహిత వైరస్ మనిషి నుంచి జంతువుకు, జంతువు నుంచి మనిషికి మారేలా మార్చుకుంది. వైరస్ రూపాంతరం చెందినంత మాత్రాన దాని తీవ్రత పెరగాలని లేదు. వాస్తవానికి కేసులు పెరిగినా మరణాలు తగ్గుతుండటం గమనార్హం. యూకేలోని కొత్త స్ట్రెయిన్‌తో కేసులు పెరుగుతున్నాయి. కానీ, మరణాలు స్వల్పంగానే ఉన్నాయి. డీ614జీ రహిత వైరస్‌తోనూ ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కానీ, దాని తీవ్రత పెరగలేదు.


టీకాల ప్రభావం తగ్గదు

రూపాంతరం చెందిన వైరస్‌లు టీకా ప్రభావం నుంచి తప్పించుకున్న దాఖలాలు దాదాపు శూన్యం. ఇన్‌ఫ్లూయేంజా వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్ చాలా నెమ్మదిగా మ్యూటేషన్ చెందుతుందని, కాబట్టి కరోనా టీకా ప్రభావంపై అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. రూపాంతరం చెందిన కరోనా వైరస్‌నూ టీకాలు నిలువరించగలవని యూఎస్‌కు చెందిన చీఫ్ సైన్స్ అడ్వైజర్ డాక్టర్ మాన్సెఫ్ స్లోయ్ తెలిపారు. ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన టీకాలు రూపాంతరం చెందిన వైరస్‌ను నిలువరించవని భావించడం సరికాదని అమెరికా మాజీ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి వివరించారు.


 *కొత్త కొవిడ్ స్ట్రైన్‌ను స్పుత్నిక్-వి ఎదుర్కోగలదు: రష్యా*


*మాస్కో:* యూరప్ దేశాలను వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ను తాము అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఎదురొడ్డగలదని రష్యా డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) సీఈవో కిరిల్ డిమిట్రీవ్ ధీమా వ్యక్తం చేశారు. తమకున్న సమాచారం ప్రకారం యూరప్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా స్ట్రైన్‌పై స్పుత్నిక్‌-వి ప్రభావంతంగా పనిచేస్తుందని చెప్పారు. ఎస్-ప్రొటీన్ గత పరివర్తనలపైనా స్పుత్నిక్-వి ఎంతో ప్రభావవంతంగా పనిచేసిందన్నారు.

కొవిడ్-19 కొత్త మ్యుటేషన్ స్ట్రైన్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రాజెనెకాతోపాటు మరో వ్యాక్సిన్ తయారీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నట్టు డిమిట్రీవ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ పరివర్తన చెందిన ప్రస్తుత సమయంలో అలాంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కలిసి పనిచేయడం ఎంతో అవసరమన్నారు. స్పుత్నిక్ టీకా వినియోగం కోసం బెలారస్‌లో రిజిస్టర్ చేసుకున్నట్టు చెప్పారు.  

స్పుత్నిక్-వి టీకా 95 శాతానికి పైగా ప్రభావంతంగా పనిచేస్తున్నట్టు గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఈ టీకా 96-97 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఆరోగ్య నిపుణులను ఉటంకిస్తూ రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది. ఆగస్టు 11న స్పుత్నిక్-వి టీకాను రష్యా రిజిస్టర్ చేసింది. ఫలితంగా కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా రష్యా రికార్డులకెక్కింది. 


*బ్రాహ్మణ చైతన్య వేదిక*

$!$₹!

వైకుంఠ ఏకాదశి

 వైకుంఠ ఏకాదశి:


ఒక సంవత్సరంలో ఇరవైనాలుగు తిథులలో వచ్చే ఏకాదశులతో ధనుర్మాసంలో మార్గశీర్ష శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు. సౌరమానములో ధనుర్మాసము వచ్చినా, చాంద్రమాన పంచాంగము ప్రకారమే వైకుంఠ ఏకాదశిని అవలంబించుతారు. పరమాత్మా శ్రీ హరి దివ్య తేజస్సు ఈ పండుగ ద్వారానే వ్యక్తమౌతోంది. ఈ రోజునే రావణ సంహారము గావిస్తానని, మహావిష్ణువు బ్రహ్మకు వరమిచ్చినట్లు ప్రతీతి. అసురులైన మధుకైటభులు మరణానంతరము దివ్య రూపములు పొంది ఈ రోజు పూజ చేసిన భక్తులకు ఉత్తర ద్వారా దర్శనము చేసికొని వైకుంఠ ప్రాప్తి కలుగునట్లుగా వరమడిగితే శ్రీహరి తథాస్తు అని అనుగ్రహించాడట. ఈ రోజున నియమనిష్టలతో పూజించిన భక్తులు మోక్షమును పొందుదురు కావున ఈ రోజును మోక్షోత్సవ దినము అని కూడా అంటారు. దీనినే మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన అంశతో ఒక యువతి ఉద్భవించి మురుడు అను రాక్షసుణ్ణి సంహరించిందిట. ఆమె పేరు ఏకాదశి అని అంటారు.ఈమె పేరున ఏకాదశి వ్రతమును చేసి సుకేతుడు అను రాజు పుత్రవంతుడయ్యాడు. రాజైన రుక్మాంగదుడు, మహాభక్తుడైన కుచేలుడు, ఈ ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధించి సఫల మనోరధుడయ్యారు. అదే విధముగా ధర్మరాజు వైఖానసుడను రాజు, విష్ణువు నారాధించి కృతార్ధులయ్యారు. చాక్షుష మన్వంతరములో వికుంఠ అనే  స్త్రీకి జన్మించుటచే హరి వైకుంఠుడయ్యాడు. ఈ రోజు నియమ నిష్ఠలతో, ఉపవాస దీక్షతో, సేవించిన భక్తులు వైకుంఠ ప్రాప్తిని జన్మరాహిత్యాన్ని పొంది పరమాత్మ స్వరూపులుగా మారిపోతారు. అందువలన ఈ మహాపర్వదినాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించి తరిద్దాం.     


వి. రామలింగేశ్వర రావు:9490195303

శక్తి దాని పరిశీలన

 శక్తి దాని పరిశీలన. అనంతమైన బలం కలవాడు రావణుడు. వక బాణమునకు నేలకొరుగుటయా? ఆహా ఏమి ఆశ్చర్యం. శక్తిని లోపరుచుకొని ప్రయత్నంలో ఆసక్తి వలననే నాశనం. రామ బాణం లో అనంత శక్తి యిమిడి యున్నదా? లేక ధర్మమును శక్తి యైన సీతను లోపరుచుకొనే ప్రయత్నంలో అనంతమైన తన తపశ్శక్తిని అధర్మ కార్యములకు సృష్టి విరుద్దమైన కార్యములకు వుపయెూగించుటయా. అనంతబలశాలి వాలి వక బాణమునకు జీవమును కోల్పోవుటయా? శ్రీ కృష్ణుడు అంతటివాడు ధర్మ స్వరూపం బాణమునకు జీవము కోల్పోవుటయా? ఏమి ఆశ్చర్యం. యిదే మాయ. మాయయే అహంకారం. అహంకారము పతనం. వక బాణమునకు యింత శక్తి షా? బాణం త్రికోణకారమని దీని గుర్తు^ తమకు అనగా శక్తి గమనముకు మూలం. బందువుయెుక్క శక్తి వ్యాప్తి గమన మని అది గుర్తు శక్తి సాధ్యమని తెలియును. దీనిని చూపుట గురుత్వ లక్షణము. గురి చూచుట లక్షమును చేధించుట.

దుర్గా సప్తశతి - 45

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 45  / Sri Devi Mahatyam - Durga Saptasati - 45 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 12*

*🌻. ఫలశ్రుతి - 3 🌻*


20–25. ఈ నా మాహాత్మ్య మంతా (భక్తునికి) నా సాన్నిధ్యాన్ని కలిగిస్తుంది. రేయింబవళ్లు సంవత్సరము పొడుగునా ఉత్తమ పశువులను, పుష్పాలను, అర్ఘ్యాలను, ధూపాలను, సుగంధ ద్రవ్యాలను, దీపాలను అర్పించడం వల్ల, బ్రాహ్మణ సంతర్పణల వల్ల, హోమాల వల్ల, మంత్రోదక ప్రోక్షణ వల్ల, ఇతరమైన వివిధ నివేదనల వల్ల, దానాల వల్ల, నాకు కలిగే ప్రీతి; ఈ నా సచ్చరిత్రాన్ని ఒక్కసారి విన్నంత మాత్రాన్నే కలుగుతుంది. 


నా ఉద్భవం గురించిన  పఠన శ్రవణాలు పాపాలను హరిస్తాయి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి, భూతాల నుండి రక్షిస్తాయి. యుద్ధంలో దుష్టరాక్షసులను పరిమార్చిన నా చరిత్రమును వింటే, నరులకు వైరుల వల్ల భయం ఉండదు. మీరు (దేవతలు), బ్రహ్మర్షులు, బ్రహ్మ చేసిన స్తోత్రాలు శుభమైగు బుద్ధిని కలిగిస్తాయి.


25-30. అరణ్యమధ్యంలో గాని కార్చిచ్చు నడుమగాని నిర్మానుష్య స్థలంలో చోరులనడుమగాని చిక్కుకున్నప్పుడు, శత్రువులకు దొరకినప్పుడు, అడవిలో సింహం చేతో పెద్దపులి చేతో, అడవి ఏనుగుల చేతో తరుమబడుతున్నప్పుడు, కినుక బూనిన రాజుచేత మరణశిక్ష గాని చెఱసాల శిక్షగాని విధింపబడినప్పుడు, 


మహాసముద్రంలో పడవ యందుండి ప్రచండ వాయువుచే ఉట్రూతలూగింప బడుతున్నప్పుడు, మహాభయంకర యుద్ధంలో తనపై ఆయుధాలు కురుస్తున్నప్పుడు, ఘోరమైన సకల విపత్తులచేత, వేదన చేత పీడింప బడుతున్నప్పుడు : 


ఇటువంటి ఏ స్థితిలోనైనా ఉన్నవాడు ఈ నా చరిత్రను స్మరిస్తే వాని సంకటం తీరిపోతుంది. ఈ నా చరిత్రను స్మరించిన వాని వద్దనుండి సింహాదులు, చోరులు, వైరులు నా ప్రభావంచేత దూరంగా పారిపోతారు.”


సశేషం....

🌹 🌹 🌹 🌹

ధార్మికగీత - 117*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత - 117*

                                       *****

            *శ్లో:- దరిద్రాయ కృతం దానం ౹*

                   *శూన్యలింగస్య పూజనం ౹*

                   *అనాథ ప్రేత  సంస్కారం ౹*

                   *అశ్వమే థాధికం  విదుః  ౹౹*

                                      *****

*భా:-1. లోకంలో విధి వంచితులు, దైవో పహతులు, అన్నార్తులు, దీనార్తుల కేమీ కొదువ లేదు. అలాంటి కూడు, గూడు, గుడ్డ లేని  దరిద్ర నారాయణులకు  దానము చేయుట; 2. కనీస ధూప దీప నైవేద్య పూజాది సంస్కారాలు లేకుండా శిథిలమైన గుడిలో పడియున్న శివలింగానికి శ్రద్ధాసక్తులతో  అర్చనము చేయుట; 3. నా అనే దిక్కు, మొక్కు లేక దైన్యంగా, నిర్లక్ష్య భావంతో బహి: ప్రదేశాన వదిలివేయబడిన అనాథ ప్రేతకు దైవీభావంతో అంతిమ సంస్కారము చేయడము - 4.అనబడే యీ మంచి మనసుతో చేసే క్రియా కాలాపాలు అశ్వమేథ యాగము చేయడం కంటే  మిక్కిలి మిన్నగా దైవప్రీతికి పాత్ర మౌతాయి. మనం యజ్ఞ యాగాలు, క్రతువులే చేయనవసరం లేదు. పైన తెలిపిన విధంగా ఆయా సందర్భాలలో భగవ దర్పణముగా చేసే చిన్న దానమైనా,ధర్మమైనా,సాయమైనా ఫలప్రదము, శుభప్రదము, శ్రేయస్కరమై మనలోని దివ్యత్వానికి, ఉత్తమ గతికి సోపానమౌతుంది. మానవాళి మానవీయత, మాననీయత సుగంధభరితమై దశదిశలా గుబాళిస్తుందని సారాంశము.*

                                  *****

                   *సమర్పణ  :   పీసపాటి* 

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲