🌹మంత్ర పుష్పం🌹 వేదాంతర్గతమైనది. తైత్తిరీయోపనిషత్తు లో మంత్ర పుష్పం, తైత్తిరీయారణ్యకంలో మహా మంత్రపుష్పం ఉన్నాయి. సహస్రశీర్షం దేవం' ఇత్యాది మంత్రాలు మంత్రపుష్పంగానూ, 'యోపాం పుష్పం వేద' ఇత్యాది మంత్రాలు మహా మంత్రపుష్పంగానూ ప్రసిద్ధిచెందాయి.
మననం చేసేవాణ్ణి రక్షించేది మంత్రం. మామూలుగా అయితే పుష్పాలతో దేవున్ని పూజిస్తాము. మంత్రం పఠిస్తూ పుష్పాన్ని సమర్పించడమనీ లేక మంత్రమనే పుష్పాన్ని సమర్పించడమనీ రెండు విధాల అర్ధాన్ని మంత్రపుష్పం అనే మాటకు చెప్పవచ్చును.
ధ్యానం, ఆవాహనం, మొదలైన షోడశోపచారాల పూజలో మంత్రపుష్పం కూడా ఒక అంగము. భగవత్పూజావసానం వంటి మంగళకర సందర్భాలలో మంత్రపుష్పం పఠించాలి.
సారాంశం సవరించు
పరమ పురుషుడే మంత్రపుష్పాన్ని తొలుత ఉచ్చరించాడంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశాడని చెబుతారు. మోక్ష మార్గానికి మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోంది. అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది. చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే. అందుకే "దైవం పరంజ్యోతి" అంటారు. అతనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి