శ్రీనివాస సిద్ధాంతి.9494550355.
*గురుచండాల యోగం*
గురుగ్రహానికి రాహువు చేరువై చండాల యోగాన్ని ఇస్తాడు. దీనినే గురు చండాల యోగం అంటారు.
కలియుగంలో ధర్మం ఒక పాదంపైన, అధర్మం మూడు పాదాలపైనా నడుస్తున్నదని పురాణాలు చెప్తాయి. ఈ మూడు పాదాల అధర్మ నడకకు పెద్దపీట వేసే గ్రహమే రాహువు. చంద్రునికి ఉత్తర ధృవ బిందువుగా రాహువుంటే, దక్షిణ ధృవ బిందువుగా కేతువుంటాడు. నవగ్రహాలలో రాహు కేతువులు మినహా మిగిలిన ఏడూ గ్రహాలూ గడియారంలో ముళ్ళువలె సవ్య దిశలో సంచారంలో ఉంటాయి. కాని రాహు కేతువులు అపసవ్య సంచారంలో ఉంటాయి. రాహువు ఉన్న రాశికి, ఏడవరాశిలో కేతువు ఉంటాడు.
ప్రపంచ రాజకీయ రంగాన్ని పరోక్షంగా శాసించే వాడే రాహువు. దీనికి తోడు నూతన అంశాలపై దృష్టి ఉంచి విశేష విజ్ఞానానికి బాటలను వేసేవాడు కూడా రాహువే. ప్రపంచంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతున్నదంటే, కేవలం రాహు అనుగ్రహమని చెప్పటంలో అతిశయోక్తి లేదు. లోక కల్యాణానికి పునాదులు వేసే విజ్ఞాన శాస్త్రానికి సారధిగా రాహువు ఉండటం నాణేనికి ఒకవైపు అంశం. అదేవిధంగా నాణేనికి రెండవ వైపున విజ్ఞాన శాస్త్రంలోనుంచే విశ్వ వినాశనానికి ప్రేరణ కారకత్వాన్ని ఇచ్చేవాడు కూడా ఛాయా గ్రహమైన రాహువే.
మానసిక, శారీరక, ఆర్ధిక, కుటుంబ, నేత్ర, దంత, సోదర, సోదరీ, వృత్తి, వ్యాపార, ఆరోగ్య, వాహన, గృహ, మాతృ, సంతాన, దాంపత్య, పితృ, ఆయు స్థాన అంశాలన్నిటి లోను అనుకూలంగా, ప్రతికూలంగా ఫలితాలను తనికిష్టమైన రీతిలో ఇచ్చే ఏకైక గ్రహమే రాహువు. ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు, ఆకాశ మార్గంలో విమాన ప్రమాదాలు, దానితో పాటు రిమోట్ తో పేల్చే ప్రమాదాలు, ఎత్తైన ప్రాంతం నుంచి దిగువకు పడిపోయే ఘోర ప్రమాదాలు, నూతన వైరస్ క్రిముల ఉత్పత్తితో పాటు అనేకానేక అంశాలన్నీ రాహు ప్రాబల్యం వలెనే జరుగుతుంటాయి. ఇతర గ్రహాలు రాజయోగం ఇచ్చినా, ఇవ్వకపోయినా రాహువు తన ఇష్టానుసారంగా ఫలితాలను తారుమారు చేయగలడు. అందలం ఎక్కించగలడు. భూస్థాపితం చేయగలడు.
గ్రహస్థితి బలహీనమైనప్పుడు మానవుడు ఎంత ప్రతిభాశాలి అయిననూ విధి వంచితుడు కాక తప్పదు. రాజకీయ రంగంలోనే ఇలాంటివి తరచుగా కనపడుతుంటాయి. వ్యక్తికి అంగబలం, అర్ధబలంతో పాటు ప్రజలందరూ కూడా జేజేలు పలికిననూ రాహు, కేతువుల అనుగ్రహం లేని కారణంగానే నామినేషన్ల తదుపరి చేసే స్క్రూట్నీతో పేరు గల్లంతవుతుంది. స్వల్ప అవయోగాలవ లెనే విశేష రాజయోగాలు ఉన్ననూ దెబ్బతినేవారు అనేకమంది ఉన్నారు. ముక్కు మొహం తెలియని వారు ఒక్కోసారి అనుకోకుండా ఎన్నికలలో గెలవటము, ఉన్నత పదవులు అలంకరించటము జరుగుతుంది. ఇలాంటి యోగాలని అనుకోకుండా అందించేవాడే రాహువు.
ముఖ్యంగా రాజకీయ రంగము, విజ్ఞాన శాస్త్ర రంగములపై అనుకూల స్థితి ఏ స్థాయిలో ఉంటుందో, దానికంటే రెట్టింపుగా ప్రతికూల పంజాలు ఇవ్వటంలో రాహువుకి సాటి ఎవ్వరూ రారు. ఇంకా ఈ రెండు రంగాలను గురించి కొంత లోతుగా చర్చించుకుందాం.
సప్త గ్రహాలూ అనుకూలించక పోయినప్పటికీ రాహు, కేతువుల యోగాల వలన అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. రాహు, కేతువులు ఇచ్చే యోగాలు శాశ్వతం కావు. అశాశ్వతాలే. కనుక ఈ అశాశ్వత రాజ యోగాలను పట్టుకొని, మన వ్యక్తిత్వాన్ని సరియైన స్థితిలో నియంత్రించుకుంటూ ఉంటుంటే రాహు, కేతువులిచ్చే అశాశ్వత యోగాన్ని శాశ్వతం చేసుకోవచ్చు. లేకుంటే మహారాజ సమానుడై భోగ భాగ్యాలతో జీవితం గడుపుతూ చివరకు ఆకాశ వీధులలో మరణం జరిగి అన్నీ అవయవాలు లేకుండా అంత్య క్రియలు జరగటం కూడా ఈ ఛాయా గ్రహాల ప్రభావమేనని గుర్తించాలి.
రాజకీయ అధికారానికి రాహువు కారకుడు. అంతేకాక అనువంశిక రాజకీయ వారసత్వానికి కూడా రాహువే కారకుడు. పొడవైన, అందమైన శిరోజాలు కావాలంటే రాహు ప్రీతి అవసరం. బంధన కారకత్వం కూడా రాహువు వలెనే జరుగును. బాంబు ప్రేలుడు, ఇతర విస్ఫోటనాలచే మరణానికి రాహువు కారకుడవుతాడు. కఠిన కారాగార యోగము, దీర్ఘకాల కారాగార వాసము, న్యాయ స్థానాలచే సమస్యలు, ఉగ్రవాదుల, తీవ్రవాదుల వలన వాటిల్లే సమస్యలు రాహువు యొక్క దుర్యోగములే.
పదవులు, అత్యున్నత రాజకీయ జీవితం, రాజ్యాధికారము మొదలగు యోగములు పొందాలంటే జాతకునికి రాహు స్థితి ప్రధానంగా అనుకూలమై ఉండాలి. ఇట్టి రాహు అనుగ్రహానికి పరోక్షంగా గోధుమపిండి దీపారాధన ఎంతో తోడ్పడుతుంది. రాహుకాల దీపములు నిమ్మ డొప్పలలో పెట్టవలెను. గురు రాహు లకు జప దాన హోమ శాంతులు చేయించుకొనవలెను
జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*
*జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి*
*లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.
*9494550355* plz forward the message 🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి