28, ఆగస్టు 2022, ఆదివారం

నల్లటి మచ్చలు ,మంగు నివారణ -

 స్త్రీల సౌందర్యానికి చిట్కాలు - 


 నల్లటి మచ్చలు ,మంగు నివారణ -


 *  జాపత్రిని మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపర్చుకొనుచున్న అతిత్వరలోనే ముఖము పైన కల మంగు ,నల్లమచ్చలు మాయం అగును . 


 *  మిరియాలు గోరోజనముతో కలిపి నూరి పైకి లేపనం చేయుచున్న మొటిమలు తగ్గును . మచ్చలు పోవును . 


 *  బాదం పప్పును నీటితో నూరి వడకట్టగా వచ్చిన పాలను ముఖంపై మర్దన చేయుచున్న క్రమంగా నల్లమచ్చలు , మంగు , మొటిమలు త్వరలోనే హరించును . 


 *  ధనియాలు , వస , సుగంధపాల ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణముగా చేసి ఈ చూర్ణమును ఒంటికి నలుగు పిండిలా పట్టించుచున్న నల్లటి మచ్చలు , మొటిమలు తగ్గును . 


 *  నిమ్మరసమును పాలతో కలిపి రాత్రిపూట ముఖానికి మర్దన చేసుకుని తెల్లవారిన తరువాత లేవగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకొనవలెను . సబ్బు వాడరాదు . ఇలా క్రమం తప్పకుండా చేయుచున్న మచ్చలు , మంగు పోయి ముఖం కాంతివంతం అగును . 


 *  తులసి ఆకుల రసములో కొద్దిగా టంకణం ( Borax ) కలిపి పైకి లేపనం చేయుచున్న ముఖం పైన మచ్చలు , మంగు హరించును . 


 *  మంజిష్ట చూర్ణమును ఆవుపాలతో కలిపి అరగదీసి అందులో కొంచం తేనె కలిపి ముఖమునకు లేపనం చేయుచున్న నల్లమచ్చలు , మంగు హరించును . 


         

నమ్మి చెడినట్టివారు లేరు

 🌴దైవమును నమ్మక చెడినవారలున్నారు కానీ నమ్మి చెడినట్టివారు ఎవరూ లేరు, లేరు, లేరు. ఈ జగత్తంతా నమ్మకంపై ఆధారపడి నడుస్తోంది.  డ్రైవరు ఎవరో తెలియకపోయినా అతను మనల్ని సురక్షితంగా గమ్యం చేరుస్తాడని విశ్వసించి మనం బస్సుకానీ, ట్రైను కానీ ఎక్కి ప్రయాణం సల్పుతున్నాము. ఎవరో తెలియని వంటవాడిని నమ్మి, భోజనశాలకు వెళ్ళి అతను వండిన పదార్థాలను తృప్తిగా భుజిస్తున్నాము. ఈరీతిగా నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనీ నమ్మకంతోనే ముడిపడి ఉంది. అది లేకపోతే ఈ లోకంలో మనుగడ సాగించలేము. మనుషుల్ని ఇంతగా నమ్మే మనము భగవంతుని మాత్రం ఎందుకు నమ్మకూడదు?! ఎందుకు నమ్మడం లేదు?!! నిజంగా పరిపూర్ణమైన ప్రేమతో భగవంతుణ్ణి విశ్వసిస్తే, ఆ భగవంతుడే మన జీవనయానాన్ని సజావుగా సాగేలా చేయడా! మానవునిపై పెట్టుకున్న విశ్వాసము మాధవునిపై పెట్టుకుంటే మన జీవితాలను సుఖసంతోషాలతో నింపి, మనల్ని గమ్యం చేరుస్తాడు కదా!. కానీ మనం ఇలా చేస్తున్నామా? ఆయనపైనే శతకోటి సందేహాలు పెంచుకుంటున్నాం. దేవునిపై పెంచుకోవలసింది సందేహాలను కాదు, విశ్వాసమొక్కటే! ఆయనపై ప్రగాఢమైన విశ్వాసాన్ని మన గుండెల్లో  నింపుకున్నపుడు మనభారం అంతా ఆయనే చూసుకుంటాడు. చెడడం అనే మాటే ఉండదు.. జీవితం అంతా ఆనందమయమే అవుతుంది.🌴

గౌరవము

 *వస్త్రేణ వపుషావాచా విద్యయా వినయేచ*

*వకారైః పంచభిర్లుప్తోనరో నాప్నోతి గౌరవమ్*


మనుష్యులకు లభించే గౌరవము ఐదు స్థాయిలలో ఉంటుంది......


ఆ గౌరవాన్ని ఇచ్చే మనుష్యులను కూడా ఐదు వర్గాలుగా విభజించవచ్చును.....


1. అతిసాధారణస్థాయి మనుష్యులు (వస్త్రసౌందర్యం): 


ఈ స్థాయివారు మనుష్యులను వారు ధరించిన వస్త్రములను చూచి గౌరవిస్తారు....  ఇటువంటి ప్రేక్షకులే ఫ్యాషన్ షోలకు, వస్త్రవ్యాపారుల ధనార్జనకు ఆధారం...


2. సాధారణస్థాయి మనుష్యులు (శరీరసౌందర్యం):


ఈ స్థాయివారు మనుష్యులను వారివారి శరీరసౌందర్యం చూసి గౌరవిస్తారు.... వీరు నోరువిప్పి మాట్లాడితే వినబడే భాష చాలాసార్లు అనాగరికంగా డండడంవలన దానిని  మనము వినలేము. ...


ఈ విగ్రహపుష్టిని, దానిని గౌరవించే వీరాభిమానులను మనము సినిమా పరిశ్రమలోను, ఫ్యాషన్ పరిశ్రమలోనూకూడా చూడగలము....


ఈ మొదటి రెండు స్థాయిలూ బాహ్యసౌందర్యానికి సంబంధించినవి...


3. మధ్యమస్థాయి (వాక్సౌందర్యం)


ఈ వాక్చతురతకలవారి మాట ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది... నేడు వివిధరంగాలలో ప్రజ్ఞాపాటవాలు కలవారికన్న వాక్చాతుర్యం కలవారు ఎక్కువగా రాణిస్తున్నారన్నది సర్వవిదితమే...


ఈ  స్థాయి మనుష్యులను గౌరవించేవారు మధ్యమస్థాయికి చెందిన శ్రోతలు...


4. ఉత్తమస్థాయి (విద్యాపాండిత్యం):


కేవలం వాక్చాతుర్యం కలవారికన్న వివిధరంగాలలోని పండితులు ఇంకా గొప్పవారు.... 


"స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అన్న సూక్తిననుసరించి వీరు విద్యవిలువ తెలిసినవారందరిచేతా గౌరవింపబడతారు...


5. అత్యుత్తమస్థాయి (వినయసౌందర్యం):


కేవలం విద్యాపాండిత్యం సర్వోత్తమస్థాయి కాదు... ఎందుకంటే సద్గురుకృపలేని విద్యాపాండిత్యం జ్ఞానాన్నికాక గర్వాన్ని కలుగజేస్తుంది...


కావున సద్గురుకృపాప్రసాదంచే విద్యాసంపన్నులైనవారు వినయభూషణులై ఉత్తమస్థాయి పెద్దలచే గౌరవింపబడుతారు...


తక్కిన సాధారణస్థాయివారు వీరి విలువను సాధారణంగా అర్థంచేసుకోలేరు..


కాని నిజముగా తెలుకుంటే ఇదియే సర్వోత్కృష్టమైన గౌరవము....


- సేకరణ

మంచి స్వభావం

 🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం 🕉️🙏.                     🌹 మంచి స్వభావం మరియు మంచి ప్రవర్తన శారీరక అందం కంటే గొప్పవి.. జీవితంలో ఎప్పుడు రిలేషన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించకూడదు🌹మన రిలేషన్ లో జీవితాన్ని నింపటానికి ప్రయత్నించాలి.. అది జీవితాన్ని అందంగా మారుస్తుంది🌹 ఆనందం అనేది పోర్టబుల్ లాంటిది మనం ఎక్కడికి వెళ్లి తీసుకు వెళ్ళాలి🌹 ఆందోళన మన మనసులను అందుడిని చేస్తుంది... సత్యాన్ని మరియు వాస్తవాన్ని చూడకుండా నిరోధిస్తుంది🌹 మంచి పోటీదారుడు నిరాశలో ఉన్న వారి కంటే తక్కువ ప్రమాదము.. గెలిచి ఓడడం కంటే ఓడి గెలవడం మంచిది🌹 లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు.. నీ లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు🌹 సాధించే వాడికి కోరిక మాత్రమే ఉంటుంది విమర్శించే వాడికి తీరిక ఎక్కువ ఉంటుంది🌹🌹🌹మీ అల్లంరాజుభాస్కర రావు 

శ్రీ విజయ ఆయుర్వేదిక్

గోకవరం 🚍స్టాండ్

Rajhamundry

9440893593🙏 🙏🏻🙏🙏🏻

సహధర్మచరీ

 శ్లోకం:☝️

*ఇయం సీతా మమ సుతా*

    *సహధర్మచరీ తవ |*

*ప్రతీచ్ఛచైనాం భద్రం తే*

   *పాణిం గృహ్ణీష్వ పాణినా ||*

*పతివ్రతా మహాభాగా*

    *చాయేవానుగతా సదా ||*


భావం: "ఈమె నా బిడ్డ సీత ఈమెను సహధర్మచారిణిగా నీకు సమర్పిస్తున్నాను. ఎటువంటి కష్టనష్టాలలో అయినా నీకు నీడలా వెన్నంటి ఉండే పతివ్రతను నీ చేతిలో పెడుతున్నాను. నేటి నుండి మీరు ఇద్దరూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒకే మాటగా నిలవాలి." అని జనక మహరాజు గారు సీతమ్మ కి రామయ్య తో పాణిగ్రహణం జరిపించారు. కన్యాదాన సమయంలో జనకుడు చెప్పిన ఈ శ్లోకాన్ని, కళ్యాణం కన్యాదాన సమయంలో భక్తులందరిచేతా ఆచార్యులు చెప్పిస్తారు.🙏