21, నవంబర్ 2023, మంగళవారం

GarikapaaTi pravachan


 

⚜ శ్రీ బహుచర్ మాత మందిర్

 🕉 మన గుడి : నెం 246






⚜ గుజరాత్ : మెహసాన


⚜ శ్రీ బహుచర్ మాత మందిర్ 



💠 మెహషీనా జిల్లాలో వున్న ఈ ఆలయంలో బహుచరాజి దేవి బాలాయంత్రంపై ప్రతిష్ఠితమైనది. కోడి పుంజు వాహనము గల పిల్లల దేవత ఉన్న ఆలయం ఉంది. 

చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. చిన్న పిల్లల క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. యశోదగర్భాన జన్మించిన పుత్రిక, దేవకి అష్టమ గర్భజనితగా భావించి కంసుడు చంపడానికి పైకి ఎగురవేయగా యోగమాయా దేవిగా మారి కంసుని హెచ్చరించిన అమ్మవారు వెలసిన ఆలయం.


💠 శ్రీ బహుచార్ మాత ఆలయం ప్రత్యేకమైనది , ఆమె భారతదేశంలోని హిజ్రా కమ్యూనిటీకి పోషకురాలు.  

కాకపోతే, ఇది శక్తిపీఠం కాబట్టి లక్షలాది మంది హిందూ భక్తులు కూడ ఇక్కడ తీర్థయాత్ర చేస్తారు.


⚜ స్థలపురాణం ⚜


💠 దక్షుడు ఒకసారి ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు మరియు సతీదేవిని మరియు శివుడిని ఆహ్వానించలేదు.  

అయితే, సతీ యజ్ఞానికి వెళ్ళింది మరియు దక్షుడు ఆమెను మరియు శివుడిని అవమానించాడు.

సిగ్గుతో సతి మంటల్లోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది.  శివుడు కోపోద్రిక్తుడై, వినాశనం చేసి దక్షుని తలను నరికివేసిన వీరభద్రుడిని తన స్వరూపాలలో ఒకరిగా పంపాడు.  కోపోద్రిక్తుడైన శివుడు తాండవ నృత్యం చేస్తున్నప్పుడు దేవతలు వణికిపోయి, విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా నరికాడు.


💠 సతీదేవి శరీరాన్ని చిన్న భాగాలుగా నరికి భారతదేశంలో 55 శక్తిపీఠాలు ఏర్పడ్డాయి.  ఆమె చేతులు పడిపోయిన చోటే బహుచర్ మాత మందిర్  లేదా బేచరాజీ మందిర్


💠 బహుచార్ మా గురించి మరొక పురాణం కూడా ఉంది.  ఆమె ఒక సంచార వ్యక్తి.

బాపాల్ దాన్ దేథా కుమార్తె మరియు ఆమె సోదరీమణులతో ప్రయాణిస్తున్నప్పుడు బపియా అనే బందిపోటుచే ఆమె వెళ్లే పళ్ళకిపై దాడి చేయబడింది.  

బహుచార మరియు ఆమె సోదరీమణులు ఎదురుదాడికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు మరియు ఆ దాడిలో ఆ గజదొంగ వారి రొమ్ములను కత్తిరించారు.


💠 ఆమె బాపయ్యను నపుంసకుడు కావాలని శపించింది, దానికి అతను దయ కోసం వేడుకున్నాడు. బహుచార ఆమెకు ఒక మందిరాన్ని నిర్మించమని ఆదేశించింది మరియు "సహజంగా మలినమైన వ్యక్తి" స్త్రీల దుస్తులు ధరించి ఆమెను పూజిస్తే, వారు ఆమె అనుగ్రహాన్ని పొందుతారు అని వరం ఇచ్చింది.


💠 ఆమె మరణించిన తర్వాత ఆమె మందిరాన్ని వరాఖడ చెట్టు క్రింద స్థాపించాడు.

స్త్రీ వేషం వేసి పూజించాడు.  

భారతదేశంలోని హిజ్రాలకు బహుచార్ మా కూడా పోషకురాలు కావడానికి ఇది ఒక కారణం.  


💠 శ్రీ బహుచార్ మాత ఆలయం మరొక కోణం నుండి కూడా ముఖ్యమైనది.  

సంతానం కావాలని కోరుకునే దంపతులు తమ కోరిక నెరవేరాలనే ఆశతో ఆమెను ప్రార్థిస్తారు.


💠 బహుచార మాత విగ్రహం తన దిగువ ఎడమ వైపున కత్తిని , ఎడమవైపు పైభాగంలో గ్రంధాల వచనాన్ని, దిగువ కుడివైపున అభయముద్ర మరియు ఆమె ఎగువ కుడి వైపున త్రిశూలాన్ని కలిగి ఉన్న స్త్రీగా చూపబడింది . 

ఆమె అమాయకత్వాన్ని సూచించే కోడిపుంజు మీద కూర్చుంది .


💠 ఆలయ సముదాయంలో మూడు అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. 'ఆద్యస్థాన్' (అసలు ప్రదేశం) అని పిలవబడే పుణ్యక్షేత్రం యొక్క పురాతన భాగం, విశాలమైన, చిన్న-ఆకులతో కూడిన వరాఖాది చెట్టును చుట్టుముట్టిన ఒక చిన్న ఆలయం, ఇది దేవత మొదటిసారిగా కనిపించిన ప్రదేశంగా నమ్ముతారు. 

దీనికి ఆనుకొని ఉన్న మరొక చిన్న దేవాలయం, మధ్య స్థాన్ (రెండవ లేదా మధ్యస్థ ప్రదేశం), ఇది దేవతను సూచించే ఒక చెక్కిన ఫలకాన్ని కలిగి ఉంది మరియు దాని ప్రవేశ ద్వారం వద్ద వెండి తలుపు ఉంటుంది. ఆలయంలోని ఈ భాగాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో ఫడ్నవీస్ (లేదా ఆ బిరుదు కలిగిన అధికారి) అనే మరాఠా నిర్మించారని నమ్ముతారు. 

1779 లో, బరోడా మరాఠా పాలకుడి తమ్ముడు మానాజీరావ్ గైక్వాడ్ , దేవత కణితి నుండి నయం చేసిన తర్వాత అసలు మందిరానికి దగ్గరగా మూడవ నిర్మాణాన్ని నిర్మించాడు. మూడవది నేటి ప్రధాన ఆలయం మరియు దేవతను సూచించే బాల యంత్రాన్ని కలిగి ఉంది. 


💠 అసలు ఆలయం 1783లో నిర్మించబడింది. మరియు ఇది వాస్తు శాస్త్రం ప్రకారం స్తంభాలు, తోరణాలు మరియు గోడలతో గొప్పగా చెక్కబడింది. 

 ఆలయ నిర్మాణంలో మానాజీ రావ్ గైక్వాడ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడని నమ్ముతారు మరియు కొందరు దీనిని 1839 లో నిర్మించారు అంటారు.


💠 ఒక సమయంలో గుజరాత్‌ను పాలించిన సోలంకి రాజవంశానికి కోడిపుంజు రాజ చిహ్నం కాబట్టి కొందరు సోలంకీలను మాతాజీ మరియు ఆమె ఆలయంతో అనుబంధించారు.


💠 ఉత్తర గుజరాత్‌లో అంబాజీకి సమానమైన ప్రాముఖ్యత ఉంది.  

శ్రీ నీలకంఠ మహాదేవ్,

శ్రీ గణేష్, శ్రీ నర్సంగ్వీర్,

శ్రీ సహ్రేయా మహాదేవ్, 

శ్రీ గుటేశ్వర్ మహాదేవ్, 

శ్రీ కచ్రోలియా హనుమాన్ కి అంకితం చేయబడిన చిన్న ఆలయాలు ఉన్నాయి. 


💠 అహ్మదాబాద్ నుండి 82 కిమీ ,మహేసనకు 35 కి.మీ.

Panchaag


 

ఆద్యాత్మికం

 [13/02, 7:28 am] Cheruvela bhargava sarma: 30, జనవరి 2023, సోమవారం

ప్రతిరోజూ పరీక్షయే

 ప్రతిరోజూ పరీక్షయే 


విద్యార్థి దశలో వున్నప్పుడు ప్రతి విద్యార్థికి ప్రధాన పరీక్షలు సంవత్సరానికి ఒక సారి మాత్రమే వస్తాయి. తెలివయిన విద్యార్థులు పరీక్షలకు ముందు రెండు మూడు నెలల నుండి ఏకాగ్రతతో, కష్టపడి చదివి పరీక్షలలో ఉతీర్ణత సాధించవచ్చు. కొంతమంది చివరి నిమిషం వరకు చదవకుండా వుండి రేపు పరీక్ష అన్నప్పుడు యేవో చిన్న గైడుపుస్తకాలు కొనుక్కొని చదివి పరీక్ష వ్రాస్తారు. ఇదొక పద్దతి. విద్యార్థి చురుకైనావాడు, తెలివయిన వాడు సుక్మాగ్రహి అయితే ఆలా చేసికుడా పరీక్షలు ఉతీర్ణత సాధించవచ్చు. కానీ దీక్షగా చదివిన విద్యార్థి సాదించినన్ని గణములు పొందకపోవచ్చు. ఆలా కాకుండా రోజు పరీక్ష అయితే అప్పుడు విద్యార్థులు చక్కగా ఏ రోజు పాఠం ఆ రోజే చదివి అవగాహన పొందవచ్చు. కానీ ఎప్పటికి ఆలా ఉండదు. 


మోక్షార్ధి అయిన సాధకుని జీవితం చాలా కఠినమైనది నిజానికి సాధనకు అనేక విధాలా అవరోధాలు కలుగుతాయి. అయినా వాటినన్నిటిని తానూ ఓర్పుతో, పట్టుదలతో, నిరంతర కృషితో అధిగమించి అను క్షణం భగవంతుని ధ్యాసలో గడిపి తన సాధనను సాగిస్తాడు. సాధకునికి వచ్చే ఆవరమోదాలు ఏమిటో చూద్దాము. 


1) ఆద్యాత్మికం: అంటే సాధకుని శరీరం సాధనకు సహకరించక పోవటం అందులో మొదటిది 


తామాస ప్రవ్రుత్తి : తామాస ప్రవ్రుత్తి సాధారణంగా ప్రతి సాధకునికి ప్రారంభంలో ఎదురయ్యే ప్రధాన అవరోధం. నీవు ఉదయం బ్రహ్మి ముహూర్తంలో లేచి సాధన చేద్దామనుకుంటావు. గడియారంలో అలారం పెట్టుకొని నిద్రించావు అలారం మోగింది కానీ నీవు తెల్లవారుజామున 4గంటల సమయంలో మంచి నిద్రలో వున్నావు కాబట్టి నిద్రాభంగం అయినట్లుగా భావించి అలారం నొక్కి మరల పడుకుంటావు. తెల్లవారిన తరువాత ఏ 6 లేక్ 7 గంటలకు మెలకువ వచ్చింది కానీ ప్రయోజనం ఏముంది ఊరు మొత్తం మేలుకుంది నీకు సాధన చేయటం కుదరలేదు. అంటే ఒక రోజు నీ సాధనకు భంగం కలిగినట్లే కదా 


రాత్రి భోజనం : సాధకుడు రాత్రి భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గీతలో కృష్ణ భగవానుడు చెప్నట్లుగా రాత్రి భోజనం విషయంలో సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మితాహారం, సాత్విక ఆహరం తీసుకోవాలి. సాత్విక ఆహరం అంటే ఏమిటి శాఖాహారమా అని చాలా మంది అడుగుతారు. నిజానికి సాత్విక ఆహరం అంటే శాఖాహారం అనికాదు అది ఏమిటంటే తక్కువగా ఉప్పు, కారం వుండి ఎటువంటి మసాలాలు లేకుండా వున్నటువంటిది ఇంకొక మాట చెప్పాలంటే త్వరగా జీర్ణం అయ్యేదిగా ఉండాలి. కృష్ణ భగవానుడు ఒక్క మాటలో పూర్తి వివరణ ఇచ్చారు. అదేమిటంటే ఆహరం తీసుకున్న వెంటనే దాహం కాకూడదు. ఉదాహరణకు నీవు నూనెతో కూడిన పదార్ధం అంటే పూరీలు తిన్నావనుకో నీ దృష్టిలో పూరీలు పూర్తిగా శాకాహాహారమే కానీ అవి తిన్న వెంటనే దాహం అవుతుంది అంటే అవి శాకాహారంమే కానీ సాత్విక్ ఆహరం కాదు. నూనెతో చేసిన ఆహారం జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది. అలాగే మాసాలతో చేసిన పదార్ధాలు కూడా త్వరగా జీర్ణం కావు. సాధకుడు కొంత సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు ఏ పదార్ధం తినాలో, ఏ పదార్ధం తినకూడదో తన మనసుకు తనకే తెలుస్తుంది. అదే విధంగా ఎంతపరిమాణంలో ఆహరం తీసుకోవాలో కూడా అవగాహనకు వస్తుంది. పదార్ధం చాలా రుచికరంగా ఉన్నాకూడా మితి మీరు ఎట్టి పరిస్థితిలో సాధకుడు భుజించడు.


తొందరగా పడుకోవటం: సాధకుడు రాత్రిపూట సాధ్యమైనంత వరకు తొందరగా నిద్రకు ఉపక్రమించాలి. రాత్రి చాలా సేపు మేలుకొని ఉండటం వలన తొందరగా లేవలేడు .ప్రతి మనిషి తన వయస్సు ప్రకారం కొన్ని గంటల నిద్ర అవసరం అని శాస్త్రం చెపుతుంది. కాబట్టి తొందరగా నిద్రిస్తే సాధకుడు తొందరగా నిద్రనుంచి లేవగలుగుతాడు.


ఆరోగ్య పరిరక్షణ: సాధకుడు శరీరం మీద మమకారం వహించకూడదు కానీ శ్రర్ధ వహించాలి ఈ రెండిటికి చిన్న తేడా వున్నది శరీరపు మమకారం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శరీరం మీద మోజు అంటే ప్రతివారు వారి శరీరం సమాజంలో అందంగా కనపడాలి అని అనుకోవటం మమకారం అప్పుడు వెంట్రుకలకు రంగు వేయటం, ఖరీదైన సుగంధ ద్రవ్యాలు, లేపనాలు రాసు కోవటం విలువైన ఆభరణాలు ధరించటం లాంటి పనులు చేయటం అనేది శరీర మమకారం. అదే శరీర శ్రర్ధ అంటే ప్రాతఃకాలంలో నిద్రలేచి దంతధావన చేసి పరిశుభ్రంగా చన్నీటి స్నానం చేయటం, ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించటం. సాత్విక ఆహారం సమయానుకూలంగా భుజించటం, మిత భాషణం, ధార్మిక జీవనం చేయటం. ఇత్యాదివన్నీ శరీరపు శ్రర్ధగా పేర్కొన వచ్చు. 


తామరాకు మీద నీటి బొట్టు: తామరాకు మీద నీటి బొట్టు:లాగ కుటుంబ సంబంధాలు కలిగి ఉండటం. ఇది ఆధ్యాత్మిక జగతిలో తరచుగా వినపడే ఉపమానం. తామరాకు మీద నీటి బొట్టు ఉన్నాకూడా అది తామరాకుకు అంటుకొని ఉండదు కేవలం దాని అస్తిత్వం దానిది తామరాకు అస్తిత్వం దానిది. సాధకుడు సంసారాన్ని నిర్వహిస్తున్నా కూడా కుటుంబ బండలను కేవలం యాదృచ్చికంగా తీసుకొని బాధ్యతలను నెరవేయాలి కానీ బంధాలను మనస్సుకు తీసుకొని బాధపడటం ఆనందపడటం చేయకూడదు. నీవు నీ మిత్రుడు కలసి వీధిలో వెళుతున్నావు అక్కడ ఒక బాలుడు స్కూటరు నడపటం చాటగాక క్రిందపడి దెబ్బలు తాకించుకున్నాడు. చూసినవారు అందరు వాడి తల్లిదండ్రులని అనాలి ఇంత చిన్న పిల్లవానికి స్కూటరు ఇస్తారా వాళ్లకు బుద్ధిలేకపోతే సరి అని ఆనుతున్నారు. నీవు కూడా వాళ్లలాగే అని నీ మిత్రుని పోనీయరా నీ బండిని ఇటువంటివి రోజు అనేకం జరుగుతుంటాయి వీటిని చూస్తూ మనం కాలయాపన ఎందుకు చేయాలి అని నీ మిత్రుని మోటారు సైకిల్ నడపటానికి ప్రేరేపిస్తావు. అంతలో ఆ గుంపులోంచి నీకు తెలిసిన ఒకడు వచ్చి పరంధామయ్యగారు ఆ స్కూటరు మీదినించి పడింది మీ పిల్లవాడే అని చెపితే అప్పుడు నీ లోంచి తండ్రి ప్రేమ ఒక్కసారిగా ఉప్పొంగి వచ్చి అమాంతం మోటారుసైకిల్ దిగి వెంటనే నీ కొడుకు వద్దకు వెళతావు. అదే బంధం అంటే అదే ఆ పడినాబాలుడు పరాయి వాడు అంటే బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించావు. ఇలా ప్రతి వక్కటి మనసుకు పెనవేసుకొని ఉంటుంది. కోటిలో ఒక్కరు తప్ప మిగిలిన వారంతా ఇలానే వుంటారు. ఆ ఒక్కరు ప్రస్తుతం మనకు మన సభ్యసమాజంలో ఉండకుండా హిమాలయాలలోనో, లేక ఇతర పర్వతాలమీదో తపస్సు చేసుకున్తున్నారు. 


గృహస్ట జీవనం చేస్తున్న మనం పర్వతాలలో తపస్సు చేసుకునే యోగులంతగా మన మనస్సును నియంత్రించలేము. కానీ ప్రయత్నించటం మన ధర్మం. ఆపైన భగవదానుగ్రహం. కాబట్టి తామరాకు మీద నీటి బిందువులాగా ఉండటం అనేది చెప్పినంత సులువు కాదు అనంతమైన కృషితో మాత్రమే సాధ్యం. అయినా సాధకుడు ప్రయత్నం చేయాలి. 


వస్తు వ్యామోహం: సాధకుడు వస్తువ్యామోహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, నాకు ఫలానా వాహనం కావలి, స్నానానికి చక్కటి వేడినీళ్లు ఉండాలి, ఆహారంలో ఫలానా కూర మాత్రమే ఉండాలి. అలాగే నాకు ఖరీదైన దుస్తులు, వస్తువులు గృహాలు వుండాలనె వ్యామోహం పెంచుకోకూడదు. సాధన బలపడితే సాధకునికి ప్రకృతి పూర్తిగా సహకరిస్తుంది. ఉదాహరణకు నీకు చలి అంటే చాలా బాధాకరం. నీవు చలిని తట్టుకోవాలేవు. కానీ నీలో సాధన బలపడుతుంటే నీకు తెలియకుండానే యెంత చలి వున్నా కూడా నీవు నిర్బయంతరంగా నిర్విరామంగా సాధన చేయగలుగుతావు. 


భయం: భయం అనేది కూడా సాధకునికి కలిగే ఒక అవరోధంగా మాన్యులు చెపుతారు. నేను వంటరిగా ఉండి సాధన చేయలేను. నాకు భయం అని కొంతమంది సాధకులు ఆశ్రమాలకు, బాబాలదగ్గరకు వెళ్లి సామూహిక సాధనలో కూర్చుంటారు. నిజానికి కొన్ని రోజులు అంటే సాధనలో పట్టు లభించేవరకు అలా చేస్తే పరవాలేదు కానీ అటువంటి జీవనానికి అస్సలు అలవాటు పడకూడదు. సాధకుని సాధన కేవలం ఒంటరిగానే చేయాలి. ఇతరులతో సంబంధం పెట్టుకోకూడదు. ఇంకొక విషయం సాధనలో కొంత ముందుకు వెళ్లిన తరువాత సాధకునికి కొన్ని అతిన్ద్రియ శక్తులు వస్తాయి. వాటిని తాను గమనించి కూడా గమనించకుండా ఉండి సాధనను కొనసాగించాలి. సంపూర్ణంగా సాధనలో సమాధి స్థితి వచ్చినప్పుడు సాధకుడు అనన్య ఆనందాన్ని పొందగలడు. శరీరానికి సంబంధించి ఈ నియమాలు తీసుకుంటే సాధకుడు మొదటి అవాంతరాన్ని అధిరోహించినట్లే. కానీ మరల చెపుతున్నా ఆచరించటం చాలా కష్టం. 


ఇక రెండవది ఆధిభౌతికం: సాధకునికి బయటి ప్రపంచంనుండి ఎదురయ్యే సమస్యలు. సాధకుడు అతి కష్టంగా తెల్లవారుఝామునే లేచి సాధన మొదలు పెడితే ప్రక్కనే వున్న దేవాలయంలో పూజారిగారు ధనుర్మాస పూజ అని అదే సమయంలో చక్కగా అర్చన చేస్తున్నారు. మీకు మైకు శబ్దంతో సాదన కుదరటం లేదు. నీవు వెళ్లి దేవాలయంలోని పూజారిగారిని మైకుపెట్ట వద్దని చెప్పలేవు. ఆలా అంటే నీకు భక్తి లేదా నీవు హిందువు కాదా అని నిన్ను ప్రశ్నిస్తారు. అక్కడ దేవాలయంలో వున్న ఇతరప్రజలు కూడా నీ మీద అదోలా చూసి ఈ రోజుల్లో పూజలు చేయరు, చేస్తుంటే అడ్డగిస్తున్నారు నాస్తికత్వం బాగా పెరుగుతున్నది అని నీ మీద పరిహాసాలు చేయట తథ్యం. తెల్ల మొహం వేసుకొని వెనుతిరిగి రావటం మినహా ఏమి చేయలేవు. ఈ రోజుల్లో ఇతర మతస్తుల మైకులు కూడా ఎక్కువ అయ్యాయి. వారిని నీవు అస్సలు అడగలేవు. ఇది ఒకరకం ఐతే ఇక ఏ మైకులేదు నీవు ప్రశాంతంగా సాధన చేసుకుంటూవున్నావు ఇంతలో ఏమైందో ఏమో తెలియదు ఒక వీధి కుక్క మొరుగుతుంది అంతే కుక్కలన్ని ఒక్కసారిగా ఒకదానిమీద ఒకటి పది పెద్దగా అరుస్తుంటాయి. వాటిని నీవు ఆపలేవు. ఇక నీ సాధన ఆ రోజు సాగాదు . ఇక పొతే ఈ రోజుల్లో పెద్ద పెద్ద శబ్దాలతో వివాహాలలో ఫంక్షన్ హాలులో రికార్డులు రాత్రి అని లేక పగలు అని లేక వేస్తున్నారు. ఆ శబ్దాలు యెంతగా వుంటున్నాయంటే గుండె మీద కొట్టినట్లుగా ఉంటున్నాయి. నీవు వారితో పోరాడ లేవు. అధవా పొలిసు స్టేషనుకు వెళ్లి ఫిరియాదు చేసినా పోలీసువారు కూడా నిన్నే నిందించి పంపుతారు. ఈ రకంగా అనేక విధాలుగా అధిభౌతిక అవాంతరాలు వస్తూవుంటాయి. వాటిని సాధకుడు అత్యంత తెలివి తేటలతో దాటాలి. సాధకుడు సదా సాత్విక్ ప్రవృత్తిని కలిగి ఉండాలి, ఎట్టిపరిస్థితుల్లోనూ, రాజస, థామస్ ప్రవృత్తిని దరి చేరనీయకూడదు. ఇది చాలా కాలం అభ్యసిస్తేనే లభిస్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది రాజసప్రవృత్తిలో, థామస ప్రవృత్తిలో వుంటారు. వారి మధ్యన వుంటూ సాత్వికంగా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. కానీ సాధకుడు భగవంతుని మీద భారం వేసి ప్రయత్నించాలి.


అది దైవికం: అనగా ప్రకృతి అవాంతరాలు, వర్షాలు కురవటం, భూకంపాలు రావటం, పెనుగాలులు వీయటం ఇత్యాదివన్నీ ఈ కోవకు వస్తాయి. నీవు సాధనకు కూర్చున్నావు చక్కగా ఫాను వేసుకొని ఫాను క్రింద నీ సాధన మొదలు పెట్టావు. నీ చుట్టుప్రక్కల ఎటువంటి అవరోధాలు లేవు. కానీ నీకు ఎంతో దూరంలో పెనుగాలులు వీచాయి నీకు ఆ విషయంకూడా తెలియదు. కానీ దాని పర్యవసానంగా అక్కడ విద్యుతు స్తంబాలు పడిపోయాయి. దానితో నీకు విద్యుత్ సరఫరా నిలిచి నీ ఫాను తిరగటం లేదు. అది నీకు సాధన భంగాన్ని కలుగ చేసింది. ఇటువంటి అనేక ప్రత్యక్ష, పరోక్ష అవరోధాలు అనేకం సాధకునికి ఎదురుపడుతాయి. ఏ సమయంలో ఏరకంగా అవరోధం కలుగుతుందో సాధకుడు ఉహించలేడు. సాధకుడు ఒక దృఢ సంకల్పం చేయాలి ఎటువంటి అవరోధాలు ఏర్పడ్డాకూడా తన సాధనను మధ్యలో ముగించనని తలంచి. సాధనంకు ఉపక్రమించాలి. అప్పుడే సాధకుడు అవరోధాలను దాటి తన సాధన చేయలేడు. 


సంసార జీవనం సాధనకు ఉపయుక్తమా: చాలామంది గృహస్తులకు కలిగే సాధారణ సందేహం. నిజానికి సంసారం సాధనకు ప్రతిబంధకం కాదని మాన్యులు చెపుతారు. కానీ సంసారం మాత్రం తప్పకుండా సాధనకు ఒక ప్రతిబంధకమే అవుతుంది. దీనిని ఒక ఉపమానంతో తెలుప ప్రయత్నిస్తాను. నీవు ఒక సైకిలు పోటీలో పాలుగొన్నావనుకో మిగితా వారంతా ఒంటరిగా సైకిలు తొక్కుతూ ఉంటే నీవు ముందు గొట్టం మీద నీ భార్యను, చిన్న పిల్లవాడిని వెనుక క్యారియర్ మీద నీ ఇద్దరు కొడుకులను కూర్చోపెట్టుకొని సైకిలు తొక్కుతూ పోటీలో పాల్గొన్నావనుకో అప్పుడు నీవు విజయాన్ని యెంత సులువుగా పొందగలవో ఆలోచించు అలానే సంసారిక జీవనం చేస్తూ సాధన చేయటం కూడా. 


సన్యాసులంతా సులభంగా మోక్షం పొందగలరా: ఈ ప్రశ్నకు కూడా అవును అని చెప్పలేము. ఈ రోజుల్లో మనం అనేకమంది సన్యాసులను చూస్తున్నాము వారు దైవచింతనకన్నా రాజకీయాలు, ధనాపేక్ష, సామాజిక విషయాలమీద శ్రర్ధ చూపుతూ ఖరీదైన కాషాయవస్త్రాలు ధరిస్తూ పాదపూజలు చేయించుకుంటూ పేరు ప్రతిష్టలకోసం ప్రాకులాడుతూ అనేక సుఖాలు అనుభవిస్తున్నారు. వారు ఒకరకంగా సంసార జీవనం చేసే సాధకులకన్నా ఇంకా అధోపాతాళంలో వున్నట్లుగా అనుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందాక సైకిలు మీద సంసారి భార్య పిల్లలను ఎక్కించుకొని తొక్కుతుంటే ఇటువంటి సన్యాసులు ముందొక ఇసుక బస్తా వెనుక ఒక మట్టి బస్తా పెట్టుకొని సైకిలు తొక్కే వాడిగా అభివర్ణించవచ్చు. అంటే గృహస్తు తన బంధాలను మోస్తువుంటే ఇటువంటి సన్యాసులు తనకు ఏమాత్రం సంబంధము లేని తనకు పట్టని వాటిని అతికించుకొని లేని బంధాలను కలిగించుకొని సాధనలో చాల వెనుక పడివుంటారు. పైపెచ్చు వారు మనలాంటివారికి అనేక విధాలుగా ఉద్బోధలు చేయటం విడ్డురం. సాధకులు అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాధకునికి కలిగిన ఒక అనుభవం తెలుపుతున్నాడు. ఒకసారి ఒక మిత్రుడు నేను ఫలానా గురువుగారి వద్ద యోగ విద్య నేర్చుకున్నాను నాకు చాలా మంచిగా వున్నది అని తెలిపితే అదేమిటని దానిగూర్చిన వివరాలను సేకరిస్తే తెలిసింది ఏమిటంటే అందులో చేరటానికి తగు ద్రవ్యం ఫీజుగా చెల్లించాలట. తరువాత కొన్ని రోజులు ఆ గురువుగారొ లేక అయన శిష్యగణమో శిక్షణ ఇస్తారట అంతవరకూ బాగానే వున్నది శిక్షణ పూర్తి అయినతరువాత తానూ నేర్చుకున్న యోగం ఇతరులకు నేర్పనని ప్రమాణం చేయాలట. చూసారా ఇటువంటివి ఇప్పుడు సమాజంలో అనేక సంస్థలు పుట్టగొడుగులులాగ పుడుతూ సామాన్యులకు రోజు ప్రక్కదోవ పట్టిస్తున్నాయి. ఇటువంటివి కేవలం నీ నుంచి ద్రవ్యాన్ని పొందేవి మాత్రమే అని గమనించాలి. మనకు శ్రీ కృష్ణ పరమాత్మను మించిన గురుదేవులు లేరు. ఆది శంకరులను మించిన మార్గదర్శకులు లేరు. ఈ విషయం గమనించి వారు బోధించిన మార్గాన్ని అనుసరిస్తే సాధకుడు మోక్షం పొందటం తధ్యం.


యదార్ధంగా సన్యాసి అంటే కౌపీనం తప్పించి ఏమి లేకుండా ఉండి ఉండటానికి ఎటువంటి ఆశ్రమాలు లేకుండా చెట్ల క్రింద, గుహలలో వుంటూ అడవిలో ఆకులు అలమలు భుజిస్తూ, వాగులు వొర్రెలలో నీటిని తాగుతూ, భౌతిక ప్రపంచానికి దూరంగా వుంటూ జీవనం గడిపే సాధకులు. వారు సత్వరంగా వారి గమ్యాన్ని చేరుకోగలరు. 


నిజానికి సాధకుని జీవనం కఠినమైనది, అనేక వడిదుడుకులు కలిగి ప్రతిక్షణం ఒక పరీక్షగా ఉంటుంది. బాహ్యంగా అనైక రకాలుగా విమర్శలు, వత్తిళ్లు వస్తాయి. వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు సాగితేనే సాధనలో పురోగతి సాధించగలం. సాధకుడు అకుంఠిత దీక్ష, భగవంతునిమీద అనన్య ప్రేమ దాస్య ప్రవ్రుత్తి, కలిగి త్రికరణ శుద్ధిగా దైవచింతనలో నిరంతరం గడిపితేనే జీవన్ముక్తిని పొందలేరు. భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే సాధకుడు ఎటువంటి పరిస్థితిలోను భగవంతుని మీదినుంచి మనస్సును మళ్ళించకూడదు. ప్రతి విషయాన్నీ తేలికగా తీసుకొని నిరంతర దైవ చింతనలోనే జీవనం గడపాలి. అప్పుడే మోక్ష సాధన కలుగుతుంది. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిఁ 


మీ 


భార్గవ శర్మ

[18/02, 9:21 am] Cheruvela bhargava sarma: 28, జనవరి 2023, శనివారం

దైవ సన్నిధి

 దైవ సన్నిధి 


తిరుమల కొండమీద కాలుపెట్టినది మొదలు ఏదోతెలియని ఒక దివ్య మనోభావన నిజానికి మనం భూమిమీదనే వున్నా సాక్షాత్తు ఆ వైకుంఠానికి వచ్చినంతగా మనం ఆనందపడతాము. అందుకేనేమో కలియుగ వైకుంఠంగా తిరుమల క్షేత్రాన్ని అభివర్ణించారు. అక్కడ మన ఊరువారు ఎవరైనాకనపడితే మీకు దర్శనం అయ్యిందా, లేదండి ఇందాకనే వచ్చాము ఇంకాదర్శనం కాలేదు, మా టికెట్లు సాయంత్రం 3 గంటలకు మేము ముందే బుక్ చేసుకున్నాము. అని ఇలా అనేక విధాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గూర్చే ముచ్చటిస్తూవుంటారు. నిజం చెప్పాలంటే తిరుమల కొండమీద గడిపిన రెండు మూడు రోజులు ప్రతివారు వారి నిత్య సాధారణ జీవితాన్ని పూర్తిగా మరచి కేవలం స్వామి గూర్చి మాత్రమే ఆలోచిస్తారు. దర్శనం టికెట్ కొనలేనివారు, దొరకని వారు గంటలకొద్దీ క్యూ షెడ్లలో ఉండి మరి స్వామివారి దర్శనం చేసుకోవటం కోసం ఎదురుచూస్తారు. అయ్యో ఇంతసేపు నేను క్యూలో ఉండాలా అని ఏమాత్రం సంకోచించరు గోవిందా, గోవిందా అని గోవిందనామ స్మరణతో తిరుమల అంతా మారుమోగుతోంది. అక్కడ ఉన్నంతసేపు త్రాగమా, తిన్నామా అనే భావన కూడా కలుగదు అంటే ఆకలి దప్పులు వేయవన్నమాట. మనుషులంతా గుండు చేయించుకొని వీధులమీద దర్శనమ్ ఇస్తారు. జుట్టుతో వున్నవారు అతితక్కువ మంది కనపడాతారు. గుండు చేయించుకోలేదు అంటే వాళ్ళు అప్పుడే బస్సు దిగారని అర్ధం. ఇదంతా యెట్లా సాధ్యం అంటే అదంతా అదేవ దేవుడి లీల అని అంటారు. 


దాదాపు తిరుమల దర్శించుకున్న భక్తులు అందరు తలనీలాలు సమర్పించటం అంటే గుండు చేయించుకోవటం ఆనవాయితీ. పిల్లలు ఎవరైనా నేను గుండు చేయించుకొని అంటే తప్పు అట్లా అనకూడదు కళ్ళు పోతాయి అని తల్లిదండ్రులు పిల్లలకు బలవంతంగా మరి గుండు చేయించటం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది స్త్రీలు కూడా శిరోముండనం చేయించుకోవటం మనమెరుగుదము. ఇప్పుడు స్త్రీల నిమిత్తం నారి క్షురకులని దేవస్థానం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ముందుగా గుండు చేయించుకొని అటు పిమ్మటే స్వామి దర్శనం. కొంతమంది ఆన్లైనులో ఇంటివద్దనే పూర్తీ కార్య క్రమాన్ని (ప్రోగ్రాం) నిర్ణయించుకొని తిరుపతికి రావటం మనమెరుగుదము. మనిషికి దేహవ్యామోహాన్ని కలుగచేసేది ముఖము అందునా సుందరమైన కేశాలు దేహసౌందర్యాన్ని ఇనుమిడింప చేస్తాయి. అంటే ఒక మనిషి తాను అందంగా వున్నాను అనుకోవటానికి మూల కారణం కేశాలు. కేశాలు నిర్ములిస్తే దేహ సౌందర్యం పూర్తిగా పోతుంది. అందుకేనేమో ఈ ముండనవిధి. శరీరం అందంగా .లేదని ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు దేహవ్యామోహం వదిలి మనస్సు దైవం వైపు మళ్లుతుంది. మన ధర్మంలో సన్యాసులు ముండనం చేసుకొని ఉండటం చూస్తున్నాము. ఏతావాతా తేలేది ఏమిటంటే మనం దేహవ్యామోహం వదిలి దైవ చింతన చేయాలని.మాత్రమే  


సముద్రమట్టానికి ఎగువకు వెళుతున్నకొద్దీ అంటే సముద్రమట్టానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళితే మనకు వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వస్తాయి అవి వాతావరణ పీడనం, గురుత్వాకర్షణ శక్తిలో తేడా, అంతే కాకుండా గాలిలో ఆక్సిజన్ శాతంలో మార్పు ఇలా అనేకమైన తేడాలు కలుగుతాయి. అందుకే మనకు భూమికన్నా ఎంతో ఎత్తుమీద విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎత్తయిన ప్రదేశాలలో మనిషి మనస్సు ప్రశాంతముగా, సంతోషంగా,ఆనందంగా ఉంటుంది అన్నది నిజం. ఈ సత్యాన్ని మన మహర్షులు ఎప్పుడో తెలుసుకున్నారు. ఆ మానసిక స్థితే మనిషిలో ఆత్యాత్మికతను మేల్కొలుపుతుంది. అందుకే ఎత్తైన గుట్టలమీద, కొండలమీద దేవాలయాలు నిర్మించారు. ఎప్పుడో నిర్మించిన దేవాలయాలు ఇప్పటికి పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతూవున్నాయి. ఆయా దేవాలయాల్లో నెలకొన్న దేవుళ్ళు భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు. హిందుత్వంలో ప్రతిదీ శాస్త్రేయత కలిగి ఉంటుంది. అంతరార్ధం తెలుసుకోలేని మూర్ఖులకు అది అర్ధం కాదు. 


తిరుమల కొండమీద రోజు కొన్ని లక్షలమంది వస్తున్నారంటే దానికి కారణం కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే కానీ మరొకటి కాదు. ఏడుకొండలు వున్నాయి కానీ ఇతర కొండలమీదికి ఒక్కరు కూడా వెళ్ళరు. ప్రతి భక్తుడు తిరుమలలో వున్నన్ని రోజులు తాను పూర్తిగా దైవ సన్నిధిలో ఉన్నట్లు భావిస్తాడు. అంతే కాదు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో స్వామి అనుగ్రహించినట్లు చెప్పుకుంటారు. ఒక్కసారి తిరుమలకు వచ్చిన భక్తుడు ఇంటికి వెళ్లిన తరువాత కొన్నిరోజుల వరకు తిరుమల విశేషాలు చేర్చించుకుంటూ ఆనందిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల యాత్ర ఒక ఆనందానుభూతితో కూడిన అనుభవం. ఈ అనుభవం ఈ వ్యాసం చదువుతున్న వారందరు పొంది వుంటారు అంటే అతిశయోక్తి కాదేమో. 


తిరుమల వెళ్లకుండానే నీకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే, నీకు తిరుమల కొండమీద వున్నప్పుడు కలిగే దైవ సన్నిధి అనే ఆనందభావన నీ ఇంట్లోనే కలిగితే యెట్లా ఉంటుంది. ఆలోచించటానికి చాలా బాగుంటుంది. కానీ అది యెట్లా సాధ్యం ఎట్టి పరిస్థితిలోకూడా సాధ్యం కాదు ఆలా అని ప్రతివారు అంటారు. మన ధర్మంలో వున్న గొప్పతనం ఏమిటంటే ఒక నోము, వ్రతము, యజ్ఞ యాగాది క్రతువులు, దేవాలయాలలో దైవ దర్శనం ఇలా కొన్ని సత్ కర్మలు చేయటం వలన మానసికోల్లాసము కలిగి దివ్యమైన ఆనందానుభూతులు పొందుతాము. తత్ద్వారా ఏ లక్ష్యంతో ఆ య సత్కర్మలు ఆచరించారో ఆ యా లక్ష్య సిద్ది అంటే కోరికలు ఈడేరుతాయి ఒక్కమాటలో చెప్పాలంటే మునకు మన మీద మనకు తెలియకుండా పనిచేసే దైవ శక్తి ప్రేరితం అయ్యి ఆ ఫలితాలను ఇస్తుంది. 


తిరుమలలో ఉన్నంత కాలం ప్రతి భక్తుడు స్వామి సన్నిధిలోనే అంటే ఆయన రాజ్యంలోనే వున్నాడని తనను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామే కాపాడుతాడనే ప్రఘాఢ విస్వాసంతో ఉంటాడు. నిజానికి భక్తుని విశ్వాసమే భగవంతుడు, కాబట్టి తప్పకుండ భగవంతుడు కాపాడుతాడు. "మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" అని అన్నారు కదా కాబట్టి ఎప్పుడైతే మనిషి మనస్సు పరిశుద్ధంగా దైవస్మరణతో ఉంటుందో అప్పుడు అది తేజోమయంగా, శుద్ధంగా ఉండి ధనాత్మకపు ఆలోచనలు వస్తాయి. దాని పర్యవసానమే ఆ సత్కర్మ ఫలితాలుగా మనం పేర్కొనవచ్చు. అందుకే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయి. సాధకుడు ఒక భక్తుడు తిరుమల కొండమీద పొందిన ఆనందానుభూతి తన ఇంట్లో, లేక ఏ చెట్టుకిందనో, నది వడ్డునో, కూడా పొందగలడు అది ఎట్లాగో చూద్దాం. 


చిన్న పిల్లవానికి సైకిలు త్రొక్కటం రాదు అప్పుడు వాడి తండ్రిగారో లేక అన్నగారో సైకిలు పట్టుకొని కొంత సమయం ఊతం ఇచ్చి నేర్పితే అప్పుడు బాలుడు స్వతంత్రంగా సైకిలు త్రొక్కగలడు. అదేవిధంగా మనలో ఉన్న దైవశక్తిని తెలుసుకోలేక పోవటంచేత మనం కూడా సైకిలు నేర్చుకునే బాలుడు తన తండ్రిగారి మీద ఆధార పడినట్లు మనం భగవంతుని మీద బాహ్యంగా ఆధార పడాలి దానికోసమే తీర్ధాలు, క్షేత్రాలు. నిజానికి తీర్థక్షేత్ర దర్శనం కేవలం మనలోని దైవాన్ని తెలుసుకోవటం కోసం తీసుకునే శిక్షణ మాత్రమే. కానీ ఒక సాధకుడు భగవంతుని దర్శించటం కేవలం తనలోనే అనే విషయం తెలుసుకోవాలి. 


భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనిషి ఎప్పుడైతే అంతర్ముఖుడు అవుతాడో అప్పుడు తనకు తెలుస్తుంది భగవంతుడు బయట కాదు అంతరంగంలో వున్నాడని అప్పటినుంచి అసలైన వెతుకులాట మొదలవుతుంది అదే సాధనకు నాంది పలుకుతుంది. అప్పుడు సాధకుడు తిరుమల కొండమీద చేసినవే జీవితాంతం చేసి మోక్షాన్ని పొందుతాడు. కొండమీద ఏమిచేసాడు అని ఆలోచిస్తే ముందుగా కొండ ఎక్కగానే గుండు చేయించుకున్నాడు అలానే తాను మోక్షాన్ని పొందాలనుకునే సాధకుడు దేహవ్యామోహాన్ని తొలగించుకోవటానికి సదా ముండనం చేసుకొని ఉంటాడు. కొండమీద ఏరకంగా అయితే నిరంతర భగవత్ సంకీర్తనం చేస్తూ ఉంటాడో అలాగే సాధకుడు కూడా నిత్యం ఆ భగవంతునే స్మరిస్తూ భగవంతునిలోనే లీనమై వుంటూ నిరంతర సాధన చేస్తూ ఆత్మలోనే లయం అయి ఉంటాడు. తత్ ద్వారా జీవన్ముక్తి పొందుతాడు. సాధన ఎలా చేయాలి ఏ ఏ నియమాలు పాటించాలి అనేవి ఒక సత్ గురువు ద్వారా శిక్షణ పొంది ఆత్మా జ్ఞ్యానాన్ని పొందాలి.


ఓం తత్సత్ 


 ఓం శాంతి శాంతి శాంతిః 


మీ 


భార్గవ శర్మ

[18/02, 9:43 am] Cheruvela bhargava sarma: ఆలోచనా విధానాలు 


ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కోవిధంగా పరిష్కారం కోసం ఆలోచిస్తారు. కానీ అందరి ఆలోచనలు ఒక్కొక్క రీతిలో ఉంటాయి. కొందరి ఆలోచనలతో పరిష్కారం సులభంగా దొరుకుతుంది. ఇంకొందరి ఆలోచనలతో పరిష్కారం కష్టతరంగా ఉంటుంది. ఇంకా కొంతమంది ఆలోచనలతో పరిష్కారం దొరకకపోగా ఇంకొక కొత్త సమస్య ఉద్బవించవచ్చు కూడా. ఒకమనిషి ఆలోచనా విధానం అతని మేధస్సుమీద ఆధారపడి ఉంటుంది. సమస్యను కూలంకుషంగా సత్వరం అర్ధం చేసుకొని వెనువెంటనే సరైన పరిష్కారం చెప్పటం అనేదానినికి సూక్ష్మగ్రాహ్యత సమయస్పూర్తి కావాలని పెద్దవారు చెపుతారు. ఒకే విధమైన నెలజీతం పొందుతున్న ఇద్దరు ఉద్యోగస్తుల జీవన విధానం ఒకే విధంగా వుండాలని లేదు ఒకరు అనేక అప్పులు చేస్తూ అనవసరమైన డాంబికాలు పోయి అనేక ఇక్కట్లు పడవచ్చు ఇంకొకరు తనకు వున్న వనరులను ఒక ప్రణాళికా బద్దంగా ఉపయోగించుకొని జీవితంలో ఎలాంటి లోపం లేకుండా జీవించవచ్చు. ప్రస్తుత సమాజం బాహ్య డాంబికాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో తనకు మించిన ఖర్చులు చేస్తూ తగిన ఆదాయంలేక అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చలేక కస్టాలు పడుతూ చివరకు ఆత్మహత్యలు చేసుకున్న వారి గూర్చి నిత్యం మనం వార్తల్లో చదువుతున్నాము, చూస్తూన్నాము . వాటన్నిటికీ కారణం ఆలోచనా విధానం మాత్రమే. 


సరయిన నిర్ణయం తీసుకోవటం ఒకని మేధాశక్తికి నిదర్శనం. అంతే కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాలలో నిర్ణయం సరైనది అయినా కూడా సరైన సమయంలో తీసుకోక పోవటం అనేక కష్టాలను కొని తెస్తుంది. వ్యాపారస్తులు కొన్ని సరుకులు అనేక కారణాలవల్ల పేరుకొని ఉంటే తాను కొన్న ధరకాన్న తక్కువ ధరకు అమ్ముతారు, దానికి కారణం ఒకటి ఆ వస్తువు ఎక్కువ ధరకు అమ్మచూస్తే అది అమ్మటానికి చాలాసమయం పట్టవచ్చు, రేండు ఎక్కువ సమయం వేచి చుస్తే ఆ సరకు చెడిపోయి ఏమాత్రం ద్రవ్యం రాకపోవచ్చు. అదే ముందుగా తక్కువ ధరకు అమ్మి వచ్చిన ద్రవ్యాన్ని ఇంకొక జనప్రదాన్యత వున్న సరకు మీద వెచ్చిస్తే దానిమీద ఎక్కువ లాభం రావచ్చు. ఇటువంటి నిర్ణయాలు సత్వరం తీసుకోవాలి అప్పుడే వ్యాపారస్తుడు లాభిస్తాడు. స్వల్ప నష్టాన్ని గూర్చి ఆలోచిస్తే ముందు వచ్చే అధిక లాభాన్ని కోల్పోతాడు. 


ఒక కంపెనీలో అందుకే మేనేజర్లకు ఎక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటారు. మేనేజరులు తీసుకునే నిర్ణయం పైనే ఆ కంపెనీ లాభాలు ఆధారపడి ఉంటాయి. 


సమయస్పూర్తి: సీతాపహరణ తరువాత సుగ్రీవుని రాజ్యంలోని వానరులను సీతాదేవిని వెతకటానికి నియమించారు ఆ వరువడిలోనే హనుమంతులవారిని కూడా నియమించారు. హనుమంతులవారు లంకకు చేరారు, సీతామాతను తెలుసుకున్నారు. నిజానికి ఆయనకు కేటాయించిన పని పరిసమాప్తం అయ్యింది. వెంటనే వచ్చి సీతాదేవి జాడని శ్రీ రామచంద్రులకు తెలిపితే తన నియమిత కార్యం అయిపోయినట్లే కానీ సీతజాడతోటి హనుమంతులవారు ఊరుకోలేదు సీతాదేవిని రావణుడినుండి విడిపించుటకు శ్రీరాముడు యుద్ధం చేయవలసి ఉంటుంది. కాబాట్టి రావణాసురుని బలం అతని రాజ్య విషయాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు రావణుని దర్శనం చేసుకోవాలి అది యెట్లా సాధ్యం తాను రాజప్రాసాదానికి వెళ్ళితే అక్కడి భటులు రావణాసురుని చూడనీయరు. అందుకే ఆయన అశోకవనాన్ని ధ్వంసం చేశారు. నిరోధించటానికి వచ్చిన వీరులను ఓడించారు. అప్పుడు తప్పనిసరై హనుమంతులవారిపై బ్రహ్మస్త్రాన్ని ఇంద్రజిత్ ప్రయోగించి రావణుని సభకు తీసుకొని వెళతారు. ఇక మిగిలిన కధ మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనం గమనించాలసింది హనుమంతులవారి ఆలోచనా విధానం సమయ స్ఫూర్తి. సమయ స్ఫూర్తి ఉంటే ఎటువంటి ఆపద నయినా సులభంగా దాట వచ్చు. 


జ్యోతిష్య శాస్త్రంలో ప్రావిణ్యం వున్న ఒక జ్యోతిష్కులవారు ఒక రాజుగారి వద్దకు వెళ్లారట అయన రాజుగారి జాతకాన్ని పరిశీలించి అది చాలా బాగుందని ఇలా చెప్పారట " మీ వాళ్ళందరూ మీ ముందే చనిపోతారు" అది విన్న ఆ రాజుగారు కోపోద్రేకుడై అతనికి బహుమానాలు ఇవ్వటం అటుంచి మరణ శిక్ష విధించారట. ఒకటి రెండు రోజులలో శిక్ష అమలు అనగా ఈ విషయం తెలుసుకున్న ఇంకొక జ్యోతిష్య పండితులు రాజుగారి దర్శనం చేసుకున్నారు. రాజు జ్యోతిష్యం అంటేనే కోపంగా వున్నారు ఆ విషయం మన జ్యోతిస్యులవారికి తెలుసు ఆయన అత్యంత లౌక్యము చూపించి అనేక పొగడ్తలతో రాజుగారిని ప్రశంసించి ఆయన జాతకాన్ని చూసి "మహారాజా మీరు అత్యంత మహార్జాతకులు మీరు ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలిస్తారు. నిజానికి మీ వారి అందరికన్నా ఎక్కువ కాలం మీరు జీవిస్తారు. ఏ కొద్దీ మందికో మీలాగా జాతకం ఉండదు" అని తెలిపారు. దానికి ప్రసన్నులైన మహారాజు నీవు చాలా మంచిగా నా జాతకాన్ని తెలిపావు నీకు ఏమి కావాలో కోరుకో అని అన్నారు. మహారాజా నా శిష్యుడు తెలిసి తెలియని జ్ఞానంతో మీ వద్దకు వచ్చి మీ ఆగ్రహానికి గురి అయి మరణ శిక్ష విధింపబడ్డాడు. దయచేసి అతనిని క్షమించి విడిపించవలసిందిగా ప్రార్ధించారు. అతని మాటలకు రాజుగారు మొదటి జ్యోతిస్యుల శిక్షను రద్దుచేశారట. మన రెండవ జ్యోతిషేలవారు మొదటివారిని కలుసుకొని నీవెందుకు అలా చెప్పావు అని అడిగితె నేను చెప్పింది నిజంకాదా అని ప్రశ్నించారట. నీవు చెప్పింది నిజం నేను అదే చెప్పాను కానీ చెప్పే విధానం బట్టి మనము అనుగ్రహ, ఆగ్రహాలకు పాత్త్రులము అవుతాము అని అన్నారట. 


జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః!

జిహ్వాగ్రే మిత్రబాంధవాః!

జిహ్వాగ్రే బంధనప్రాప్తిః!

జిహ్వాగ్రే మరణం ధృవం!!


అని అన్నారు కాబాట్టి మనం నోటిని జాగ్రత్తగా అంటే మాటలను సమయానుకూలంగా వాడాలని హితవు చెప్పి పంపారట. బుద్ది కర్మానుసారినే అనే నానుడి ఊరికే రాలేదేమో అనిపిస్తుంది. 


ఒక కేసువిషయంలో చాలా తీవ్రంగా ఒక లాయరుగారు వాదిస్తున్నారట ఆయన వాదనకు జడ్జిగారు కూడా ముగ్దులు అయ్యారట. ఇక వాదనను ముగించపోవగా ప్రక్కనే వున్నా జ్యునీయరు లాయరుగారు మన లాయరుగారి చెవిలో ఏదో చెప్పారట వెంటనే మన లాయరు గారు దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని నేను చెప్పింది బహుశా డిఫెన్సు లాయరుగారు చెప్పవచ్చు కానీ అది ఎంతమాత్రమూ సబబుకాదు ఇప్పుడు నా వాదనను వినండి అని తానూ ముందు చెప్పిన వాదనకు వ్యతిరేకంగా చెప్పి జడ్జిగారిని మెప్పించి కేసు గెలిపించారట. ఇంతకూ ఆ జూనియరు లాయరు గారు చెవిలో చెప్పింది ఏమిటి అంటే అయ్యా మీరు మన క్లయెంటు గూర్చి కాకుండా అవతలి పార్టీకి సపోర్టుగా వాదిస్తున్నారు అని. ఆక్షణంలోనే సర్దుకొని తన వాదనను పూర్తిగా మార్చుకున్నారు సీనియర్ లాయరు గారు అదే సమయ స్ఫూర్తి అంటే. ఇవ్వన్నీ మనం తెలుసుకున్నవి, నిత్యం చూస్తూవున్నవి. ఇక అసలు విషయానికి వస్తే మానవుడు తన జీవిత లక్ష్యం అయిన మోక్ష సాధన చేయటానికి చక్కటి ఆలోచనా విధానం వుండాలి అంతేకాదు తనకు దైనందిక జీవితంలో ఎదురుపడే అనేక ఒడిదుడుకులను ఎదుర్కునే సమయస్ఫూర్తి కావలి. సాధకుని చూసి సామాన్యులు అనేక విధములుగా మాట్లాడవచ్చు అటువంటి మాటలకు, విమర్శలకు ఏమాత్రం చలించకుండా నిత్యం తన లక్ష సాధనవైపు ద్రుష్టి సాగించి లక్ష్యాన్ని ఈ జన్మలోనే సాదించాలి. 


నాకు ఈ జన్మలోనే మోక్షం వస్తుందా అది ఎంతో దుర్లభం ఏదో దైవ జాసలో, నామ స్మరణతో కాలం గడుపుదాం అని చెప్పే అనేకులు మనకు తారసపడతారు. అంతే కాకుండా అయన సద్గురువు, ఈయన సద్గురువు అని చెప్పి మీ వద్ద వలసినంత ద్రవ్యాన్ని వసూలు చేసేవారు కూడా వుంటారు. కాబట్టి ఎవ్వరిని అనుసరించకుండా నీ సాధన నీవు కొనసాగించు. వారి మాటలను పరిగణలోకి తీసుకొన్నామంటే మన సాధనకు పూర్తిగా అవరోధం కలుగుతుంది. కాబట్టి మిత్రమా మోక్షం అంటే సామాన్యమైన విషయం కాదు అత్యంత కృషి, సాధన, అకుంఠిత దీక్ష ఉంటేనే సాధించగలం. ఈ మానవ జన్మ ఎంతో దుర్లభమైనది దీనిని ఇక్కడే,ఇప్పుడే సార్ధకట్చేసుకోవాలి. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః  


మీ భార్గవ శర్మ

[19/02, 10:59 am] Cheruvela bhargava sarma: 18, ఫిబ్రవరి 2023, శనివారం

సాధకుడు- మనస్సు

సాధకుడు- మనస్సు  


అటుపిమ్మట సాధకుని ద్రుష్టి మనస్సు మీద పెట్టాలి. నిజానికి మనస్సు అనేది ఒక కోతి లాంటిది, ఏ రకంగా అయితే ఒక కోతి ఒక కొమ్మ మీదినుంచి ఇంకొక కొమ్మమీదికి నిర్విరామంగా ఉరుకుతూ, గెంతుతూ నిలకడ లేకుండా ఉంటుందో అదే విధంగా మనస్సు అనుక్షణం వివిధ విషయాలమీద మళ్ళుతూ ఉంటుంది. ఒక క్షణం నీవు చూసిన సినిమా గుర్తుకు వస్తే మరుక్షణం నీకు జరిగిన సంతోషకరమైన లేక దుఃఖకరమైన విషయం. ఒక నిముషం మీ ఊరులో ఉంటే మరుక్షణం ఇంకొక ఊరికి ఇలా పరి పరి విధాలుగా మనస్సు పయనిస్తుంది. అన్నిటికంటే వేగంగా పయనించేది మనస్సు అనేకదా మేధావులు చెపుతారు. యదార్ధానికి సాధకుడు తన శరీరాన్ని నియంత్రించుకోవటంలో ఆంతర్యం మనస్సుని నియంత్రించుకోవటానికి మాత్రమే కదా. 


మనస్సును నియంత్రించుకోవడం: 


ఒక గుర్రం వున్నదనుకోండి దాని రౌతు చిన్న చిన్న రేకు ఫలకాలను దానికంటికి ప్రక్కగా అమరుస్తారు దానివలన గుర్రం చూపు ప్రక్కకు మళ్లకుండా కేవలం వీడిమీదనే ఉంటుంది. కాబట్టి గుర్రం ముందుకు మాత్రమే పరిగెడుతుంది. అలా గుర్రం నడిపే రౌతు గుఱ్ఱాన్ని లొంగదీసుకుంటాడు. మన మనస్సు కూడా గుఱ్ఱం లాగా పరి పరి విషయాలమీదకు మళ్లకుండా కేవలం భగవంతుని మీదకు మళ్ళటానికి మనం ఏదో ఒక ఫలకాన్ని మనస్సుకు అడ్డంగా పెట్టుకోవాలి. అది ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సాధకుడు ఏర్పాటు రకంగా వారి ఇష్టానుసారంగా ఏర్పాటు చేసుకోవాలి. కొంతమంది నామ స్మరణను ఎంచుకొని భగవన్నామాన్ని సదా ఉచ్చరిస్తుంటారు. ఇంకొకరు భగంతుని భజిస్తూ వుంటారు, కొంతమంది సదా నామ జపం చేస్తూవుంటారు. (ఉదాహరణకు ఇస్కోన్ సమస్తలోని సాధకులు) కొందరు నామాన్ని లికిస్తూవుంటారు, రామకోటి, శివకోటి వ్రాయటం మొదలగునవి. ఇలా ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటారు. ఇందులో ఇది మంచిది ఇది కాదు అని అనటానికి లేదు. విధానం ఏదైనాకూడా మనకు కావలసింది మనస్సును నియంత్రించుకోవడం మాత్రమే. మన ప్రయాణం అనాయాసంగా జరగాలి అంటే అది బస్సు అయితే నేమి రైలు అయితేనేమి గమ్యాన్ని చేరటం ముఖ్యం కదా. 


మనం తరచుగా చూస్తూవుంటాము చాలామంది పైన పేర్కొన్నఏదో ఒక విధానాన్ని అనుసరించి అదే జీవిత లక్ష్యంగా వారి జీవనాన్ని కొనసాగిస్తారు. కానీ మిత్రమా ఆలా ఎప్పటికి అనుకోకూడదు. ఈ పద్ధతులు కేవలం మనస్సును నియంత్రించుకోవటానికి మాత్రమే ఉపకరిస్తాయి కానీ అంతకంటే వేరొకటి కాదు నీ లక్ష్యం మోక్ష సాధన మాత్రమే. మోక్షయానికి ఈ పద్ధతులు ప్రారంభ శిక్షణగా మాత్రమే ఉపకరిస్తాయి కానీ మోక్షసిద్ది మాత్రము లభించదు. 


మనం పూర్తిగా సాధకులు ఆచరించే భక్తి మార్గాలు మోక్షాన్ని చేరుకోలేవు అని కూడా అనలేము. మనం మన చరిత్రను పరిశీలిస్తే భక్తి మార్గంతో మోక్షాన్ని చేరుకున్న మహా భక్తుల ఉదంతాలు మనకు తెలుసు. ముందుగా భక్తి మార్గాలు ఏమిటో పరిశీలిద్దాం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, తన్మయాసక్తి, పరమ విరహాసక్తి అని పదకొండు భక్తి సాధనలున్నాయి.


          శ్రవణానికి పరీక్షిత్‌ మహారాజు, కీర్తనము వలన తుంబురుడు, విష్ణుస్మరణ వలన నారదుడు, పాదసేవ వలన శ్రీ మహాలక్ష్మి, అర్చన వలన పృథు చక్రవర్తి, వందనము వలన అక్రూరుడు, దాస్యము వలన హనుమంతుడు, సఖ్యము వలన అర్జునుడు, ఆత్మ నివేదన వలన బలిచక్రవర్తి ముక్తి పొందారు. ఇక పదవది తన్మయాసక్తి. భక్తితో పారవశ్యము చెంది తన్మయమైపోయాక నీవే ఆ కృష్ణ పరమాత్మగా మారి చైతన్య ప్రభువు ఎలా గంతులేస్తున్నాడో, ఎలా తనకు తెలియకుండానే గీతాలు పాడుతున్నాడో, కవిత్వము రాకుండానే కవిత్వం చెప్తున్నాడో అది తన్మయాసక్తి. పరమ విరాహసక్తి అంటే, భగవంతుని విడిచి ఒక్క క్షణము కూడా వుండలేను. ప్రియుని విడిచి వుండలేను అని ప్రియురాలు ఎలాగైతే విరహ వేదన అనుభవిస్తుందో, అలాగే. 


కాబట్టి భక్తి మార్గం కూడా ఉపయుక్తమైనదే అయితే మరి భక్తిమార్గాన్నే అనుసరించవచ్చుకదా. జ్ఞ్యాన మార్గం ఎందుకు ఆచరించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. మనం సూక్షమంగా పరిశీలిస్తే భక్తి మార్గం వేరు జ్ఞాన మార్గం వేరుగా గోచరించవు. అటువంటప్పుడు రెండు మార్గాలు ఎందుకు వున్నాయి అంటే. ముందుగా ఒక సాధకుడు భక్తి మార్గాన్ని అనుసరించి సాధన కొంత ముందుకు సాగిన తరువాత తనకు తానుగా జీవాత్మ వేరు పరమాత్మా వేరు కాదనే భావనలోకి వస్తాడు. అప్పుడు తానూ ఈ చరచరా జగత్తుకు కారణభూతుడైన సర్వేశ్వరునిలో అంతర్లీనంగా వున్నాను అంటే 


అహం బ్రహ్మాస్మి 


అనే భావనలోకి వస్తాడు. ఇలా తెలుసుకోవటమే జ్ఞ్యానం తరువాత తనకు తెలియకుండానే భ్రహ్మ జ్ఞ్యాన పిపాసకుడు అయి తానె బ్రహ్మ అవుతాడు. 


"బ్రహ్మ విత్ బ్రహ్మయేవ భవత్" 


ధ్యానం సద్గుణోపానా లేక నిర్గుణోపాసనా 


ధ్యానం సద్గుణోపానా లేక నిర్గుణోపాసనా అనే సందేహం ప్రతి సాధకుని మదిలో తొలిచే ప్రశ్నయే కొంతమంది విగ్రహారాధన సద్గుణోపాసన అని ధ్యానంలో ప్రతిమ లేదు కాబట్టి అది నిర్గుణోపాసనే అని చెపుతారు. నిజానికి సూక్ష్మంగా పరిశీలిస్తే ధ్యానం కూడా సద్గుణోపాసనే అని చెప్పవలసి వస్తుంది. అది ఎలా అంటే బాహ్యంగా, బౌతికంగా ఎలాంటి విగ్రహం లేకపోవచ్చు కానీ అంతరంగికంగా మనం మనస్సుకు ఒక స్థాన నిర్దేశనం చేసి ధ్యానం చేస్తున్నాం. ఉదాహరణకు గీతలో కృష్ణ భగవానులు భృకుటి (రెండుకనుబొమ్మల నడుమ) జాస నిలిపి అంటే మనస్సు నిలిపి ధ్యానానం చేయమన్నారు. కొందరు సాధకులు ఈ పద్దతి సులువు కాదని పేర్కొన్నారు. ఏదిఏమైయేన సాధకుని అనుభవంతో మాత్రమే తెలుసుకోగలడు. ఇటీవల చాలా సంస్థలు యోగా కేంద్రాలు వస్తున్నాయి. ఒక్కరు శ్వాస మీద జాస అని ఒకరు హృదయంలో జాస అని ఒకరు బిందువు మీద జాస అని కొందరు క్రియా యోగమని కొందరు సుదర్శన యోగమని ఇలా పరి పరి విధాలుగా ధ్యాన పద్ధతులు తెలుపుతున్నారు. అవి అన్ని తప్పు అని మనం అనలేము. పద్దతి ఏదైనా కానీ అంతిమ లక్ష్యం మనస్సును నిగ్రహించటమే. కాబట్టి ఎవరికి నచ్చిన పద్దతిని వారు అనుసరించవచ్చు. 


పైన పేర్కొనిన ప్రతి పద్ధతిలోను మనస్సు వున్నది అంటే మనోవృత్తి వున్నాడనుమాట. ఎప్పుడైతే మనస్సు లయం కాలేదో అప్పుడు అది సద్గుణమే అవుతుంది కానీ నిర్గుణం కాదు. అయితే నిర్గుణోపాసన లేదా అని అడుగవచ్చు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే నిర్గుణోపాసన వున్నది కానీ అది ఉపాసన మాత్రం కాదు ఎందుకంటె ఉపాసన అనే పదంలోనే నీవు భగవంతునికన్నా బిన్నంగా ఉన్నవని కదా అర్ధం. ఎప్పుడైతే మనస్సు పూర్తిగా లయం అవుతుందో అదే నిర్గుణోపాసన. అది కేవలం సమాధి స్థితిలోనే లభిస్తుంది. చిత్తవృత్తి నిరోధమే ధ్యానం అని మహర్షులు తెలిపారు.


సాధకుడు ఎప్పుడయితే సమాధి స్థితిని పొందుతాడో అప్పుడు అతనికి బాహ్య స్మ్రుతి పూర్తిగా పోతుంది. శరీర వ్యాపారాలు అంటే ఆకలి దప్పులు, హృదయ స్పందన, శ్వాస పీల్చుకోవటం, వదలటం. స్పార్స్య జ్ఞ్యానం, ఇవి ఏవి వుండవు. శరీరం మీద పాములు, జర్రులు ప్రాకిన శరీరం చుట్టూ పుట్టలు పెరిగిన, ఎండలు కార్చినా వర్షాలు కురిసిన ప్రకృతి బీబత్సవంగా ప్రళయాలు సంభవించినా సాధకునికి స్పృహ ఉండదు. ఆ స్థితిని చేరుకునే సాధకుడు జీవన్ముక్తుడు. అదే మోక్షముగా మనం తెలుసుకోవచ్చు. 


భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ప్రతి సార్దకుడు సమాధి స్థితిని చేరుకునేలా తన సాధనను కొంగసాగించాలని సాధకులందరు మోక్షగాములు కావాలని అభిలాష. 


ఓం తత్సత్,


 ఓం శాంతి శాంతి శాంతిః 


మీ 


భార్గవ శర్మ

[18/04, 7:02 pm] Cheruvela bhargava sarma: 26, జూన్ 2021, శనివారం

కృషితో నాస్తి దుర్భిక్షం

 కృషితో నాస్తి దుర్భిక్షం 


జపతో నాస్థి పాతకం 


మౌనేన కలహం నాస్తి 


జాగ్రతేన భయం నాస్తి 


మన మహర్షులు వారి జ్ఞానంతో మన దైనందిక జీవనానికి ఉపకరించే అనేక సూత్రాలను, నీతులను మనకు అందించారు ఆ పరంపరలో వెలసినదే ఈ శ్లోకం 


కృషితో నాస్తి దుర్భిక్షం : అంటే కృషి చేస్తే దుర్భిక్షం ఉండదు అంటే మనం శ్రమ చేస్తే దరిద్రం ఉండదు. ఎందుకంటె శ్రమకు మనము ఫలితాన్ని పొందుతాము ఆ ఫలితం వలన దరిద్రం పారదోల వచ్చు ఇక్కడ శ్రమ అంటే ఏదయినా ఉద్యోగం లేక వ్యాపారమో వృత్తి కావచ్చు తద్వారా మనకు ధనం లభిస్తుంది. ఆ ధనంతో వలసిన వాటిని కొనుక్కొని సుఖ జీవనం చేయవచ్చు. 


జపతో నాస్థి పాతకం: జపం చేయటం వలన అంటే కేవలం జపమే కాకుండా దేముడికి సంబందించిన పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేయటం వలన మనం చేసిన పాపాలు అన్ని పాటా పంచలు అయ్యి పుణ్య ఫలం లభిస్తుంది అందు వలన పాతకాలు నశిస్తాయి అని అర్ధం. మనం నిత్యం జప తపాదులను ఆచరించి మన చిన్నారులకు కూడా మార్గ దర్శకంగా ఉంటే గృహంలో ముందుగా ప్రశాంతత తరువాత అదృష్టం చేకూరుతుంది. ఏ ఇల్లు పరి శుభ్రంగా ఉండి అక్కడి గృహస్తులు దైవ చింతనలో వుంటారో ఆ ఇంటిలో నిత్యం లక్ష్మి దేవి వసిస్తుంది అన్నది సత్యం. 


మౌనేన కలహం నాస్తి: ఇది ఇప్పటి కాలంలో ప్రతివారు ఆచరించ వలసిన సూత్రము. మనం చేసిన ప్రతి పనిని ఈ సమాజం వేయి కళ్ళతో గమనిస్తూ ఉండటమే కాకుండా కొందరు వారికి తెలిసి కొంచం తెలియక కొంచం అహంతో కొంతఎదుటి వారిని విమర్శించాలనే సంకల్పంతో మనకు మనసు గాయ పడే విధంగా ప్రవర్తించినా కూడా మనం మౌనంగా ఉంటే ఎటువంటి మనః స్పర్ధలు రావు తత్ ద్వారా కలహం రాదు. కాబట్టి ఈ రకంగా కలహాన్ని ఆపగలం. మహా భారతంలో తిక్కన మహా కవి వ్రాసిన పద్యం ఈ సందర్భంలో అనుసరణగా ఉంటుంది చుడండి 


ఒరులేయవి వనరించిన 


నరవర యప్రియంబుదన మనంబునకగు 


నొరులకు నవి సేయకునికి 


పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్ 


భావము: ఇతరులు ఏవయితే అప్రియమైనవి అనగా మనకు ఇష్టము కాని పనులు మన యెడ చేస్తారో అవి వారికి చేయకుండా అంటే అదేవిధంగా వారితో ప్రవర్తించకుండాఉండటం పరమ ధర్మము అంటే ధర్మాల కన్నా ఎక్కువ అయిన ధర్మము అని అర్ధము. మనకు ఎంతో విలువైన వాగ్మయం వున్నది కానీ అది పెద్ద వారు తెలుసుకోవటం లేదు అట్టి తరి ఇక పిల్లలకు ఏమి నేర్పగలరు. ప్రతి వారు కొంత సమయాన్ని వెచ్చించి చక్కటి విషయాలు తెలుసుకొని తమ సంతతికి నేర్పిన ఈ సమాజం ఎటువంటి గొడవలు లేకుండా చల్లగా ఉంటుందనుటకు సందేహం లేదు. 


జాగ్రతేన భయం నాస్తి: ఇది ఇప్పటి ప్రపంచానికి ఎంతో ముఖ్యమైన వాక్యంగా నేను అనుకుంటాను. నాకు ఇటీవల కలిగిన ఒకపరోక్ష అనుభవాన్ని తెలియ చేస్తున్నాను. నాకు తెలిసిన ఒక వ్యక్తికీ ఒక వడ్డీ వ్యాపారం చేసే సంస్థ ఉద్యోగి బలవంతంగా వ్యక్తిగత ఋణము ఇప్పించారట. ధనాశతో అతనుకూడా అనాలోచితంగా తీసుకున్నాడు. తరువాత తెలిసింది తాను నెలసరి చెల్లించే వాయిదా సొమ్ము కలిపితే తానూ తీసుకున్న ఋణం కన్నా చాల ఎక్కువ అని. అంతే కాదు తానూ ఈ కరోనా నేపథ్యంతో నెలసరి వాయిదాలు కొన్ని కట్ట నందువల్ల ఆ సంస్థ వారి ఉద్యోగులు రాత్రియంబవళ్ళు దూర శ్రవణితో మాట్లాడుతో అనేక విధముల దుర్భాషలాడటమే కాక అతనిపై అతని ధర్మ పత్ని ఫై పోలీసు కేసులు పెట్ట గలమని భయపెట్టు చున్నట్లు నాతొ నుడివినాడు, అందు వల్ల తన కుటుంబ జీవనం దుర్భరమైనదని వాపోయినాడు. ఇది యదార్ధంగా జరిగిన సంఘటన. నిజానికి తనకు అవసరము లేకున్నను దొరికిందని ఋణము తీసుకోవటం వల్ల వచ్చినఁ ముప్పు అంటే తనంతట తానె ముప్పుని కొని తెచుకున్నట్టు. మనం రోజు అనేకమైన ఇటువంటి విషయాలను వింటున్నాము కంటున్నాము. అనేకులు ఋణములు చెల్లించ లేక ఆత్మ హత్యలకు పాలుపడుటము కూడా మన మెరుగుదుము. ముందు జాగ్రత్త లేక పోవటమే ఇటువంటి పరిస్తుతములకు దోహద పడుతాయి.  


మనుషులకు ఆశ లేశ మాత్రంగానే ఉండాలి. ప్రస్తుతము కరోనా కారణంగా ధనార్జన లేని అనేక సాఫ్ట్ వెరు జ్ఞానులు అక్రమ ధనార్జనకు పలు తెరుగుల మోసములు చేయుటకు పాల్పడుతూ అమాయకులను ప్రలోభ పెట్టి వారిని దోపిడీ చేస్తున్నారన్నది విశ్వ విదిత సత్యం. 


మనకు ఉరక ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఎందుక ఇస్తారు అని ఆలోచించే వారు ఎట్టి ప్రలోభాలకు లొంగరు. కానీ చాలా మంది అమాయకులు అందులోని నిజా నిజాలను పసి కట్టక లక్షలలో కంప్యూటరు మోసాలకు లోనవుతున్నారు. మన భారతీయుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కేనియా దేశస్తులు కూడా మోసగిస్తున్నట్లు మనం వార్తలలో చూస్తున్నాము.   


" ఆశయాబద్దతే లోకం కర్మణేన బహుచిన్తయామి" 


మరొక శ్లోక వివరంతో మరలా కలుద్దాము. 


ఇట్లు 


బుధ జన విధేయుడు 


భార్గవ శర్మ

[20/04, 8:44 pm] Cheruvela bhargava sarma: అతడు డ్రైవరు 


అతడు డ్రైవరు 


ఒక కారు నడిపే చోదకుడిని కారు డ్రైవరు అని, ఒక లారీ నడిపే చోదకుడిని లారీ డ్రైవరు అని, అదే జీపుని నడిపే డ్రైవరుని జీపు డ్రైవరు అని పిలవటం మనం సాధారణంగా చూస్తూవుంటాము. అంతేకాదు మారుతి కారు, మహేంద్ర కారు, టాటా కారు అని ఇంకా కారుకు ముందు పెట్టి డ్రైవరు అని పిలుస్తారు. మారుతి కారు డ్రైవరు, మహేంద్ర కారు డ్రైవరు ఆలా ఇంకా కొన్ని సందర్భాలలో యజమాని పేరుతో అంటే రామారావు కారు డ్రైవరు, కృష్ణారావు కారు డ్రైవరు ఇలా. అతని ఎలా పిలిచినా కాని నిజానికి అతను మాత్రం డ్రైవరు. 


ఒక డ్రైవరు చక్కగా తాను విధి నిర్వహణ చేస్తున్న కారును చక్కగా నడిపి యజమాని అవసరానుకూలంగా అతనిని సరైన సమయానికి అతను కోరుకున్న ప్రదేశాలకు చేర్చుతూ, కారును మంచిగా చూసుకుంటూ ఉంటే ఆ డ్రైవరు ఆ యజమాని మెప్పుని పొంది అతని జీతంలో వృద్ధి మరియు ఇతర ఎలవన్సులు యజమాని నుండి పొందగలడు, అదేవిధంగా కారుని సరిగా చూసుకోక కారుకు ప్రమాదాలను కలగచేస్తూ, యజమానికి కారు ఎక్కాలంటేనే భయం వేసే విధంగా కారును నడిపితే ఆ కారు డ్రైవరు యజమాని కోపానికి గురి అయి వెంటనే ఉద్యోగంనుండి తొలగించటమే కాకుండా యజమాని అతని నుండి నష్టపరిహారం కోరే విధంగాకూడా పరిస్థితులు ఏర్పడవచ్చు. వీటన్నిటికీ కారణం డ్రైవరు తన విధులను నిర్వహించే విధానం మీద ఆధార పడివున్నదని వేరే చెప్పనవసరం లేదు. మనం ఉపయోగించే ఏ వస్తువు అయినా మనం దానిని వాడే విధానం మీద ఆధార పడివుంటుందని వేరే చెప్పనవసరం లేదు. 


ఇద్దరు మిత్రులు ఒకే రోజు చెరొక కారు ఒకే మాడలుది కొన్నారనుకోండి ఆ ఇద్దరు కారులు ఒకే విధంగా పనిచేయాలని లేదు. ఒకని కారు ఎలాంటి లోపంలేకుండా చక్కగా నడవవచ్చు ఇంకొకని కారు కొన్న మరుసటి రోజే చెడిపోయి షడ్డుకు వెళ్ళవచ్చు. కాబట్టి దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే తయారుచేసే వాడు రెండు ఒకేమాదిరిగా చేసినా కూడా దేని మన్నిక దానిది. మానవుడు ఎంతో నైపుణ్యంతో తయారుచేసిన వస్తువు ఎలా పనిచేస్తుందో చెప్పలేము, కానీ సరిగా పనిచేయటానికి తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు నిపుణులు తీసుకుంటారు. 


భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మిత్రులారా మీరు మేము అని దేనిని అంటున్నామో అది మన శరీరంలో అందులో వున్న మనమే మనము. అంటే అర్ధం కాలేదు కదా, అదేమిటంటే మనము అనుకునే శరీరాన్ని నియంత్రించే దివ్య చైతన్యం మాత్రమే మనము. కానీ ఏరకంగా ఐతే ఒక కారు డ్రైవరు ఆ కారుతో కలిపి తన ఉనికిని చెపుతాడో అదేరకంగా మన శరీరంతో కలిపి మన ఉనికిని చెపుతున్నాము. అంతవరకూ అయితే పరవాలేదు. 


చాలామంది తమ ఉనికే శరీరం అని భావించి శరీరంలోని నిఘాడమైన దివ్యమైన, శుద్ద చైతన్యాన్ని మారుస్తున్నారు. దానితో వారి శరీరానికి అనేక విధాలుగా బంధాలను, సుఖాలను, పొందాలని ప్రయత్నిస్తూ ఒక అసమర్ధపు కారు డ్రైవరు తానూ కారుని సరిగా నడపలేక ప్రమాదాలకు గురుచేసినట్లుగా శరీరంతో అనేక పాపకృత్యాలను సలుపుతున్నారు. దాని ఫలితంగా బాధలను, కష్ఠాలను, ఇబ్బందులను, అనుభవిస్తున్నారు.  


అదే సత్యాన్ని తెలుసుకున్న సాధకుడు తన శరీరం కేవలం శుద్ధ చైతన్యమైన తనకు ఆశ్రయమిచ్చిన ఒక కారు లాగా భావించి ఒక సమర్థుడైన కారు డ్రైవరు లాగా శరీరాన్ని నియంత్రించి పుణ్య కార్యాలు చేసి పుణ్య ఫలితాన్ని పొంది దాని వల్ల సుఖాలను, ఆనందాలను అనుభవించి చివరకు మోక్షపదాన్ని చేరుతున్నాడు. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః  


మీ భార్గవ శర్మ

[21/04, 12:56 pm] Cheruvela bhargava sarma: 21, ఏప్రిల్ 2023, శుక్రవారం

అది నువ్వే

అది నువ్వే  


ఒకరోజు సాయంత్రం 7 గంటల సమయంలో సీతాదేవి తన ఇంట్లో ఏదో పాత బట్ట చేత్తో కుట్టుకుంటున్నది. దారాన్ని తెంపి కొత్తదారం సూదిలోకి ఎక్కిద్దామని ప్రయత్నిస్తుండగా కరంటు పోయింది చేతిలోంచి సూది జారీ పడింది. ఇల్లంతా చీకటి సూదిని ఎలా వెతకాలి అని ఒక కొవ్వొత్తి వెలిగించి కొవ్వొత్తి కాంతిలో వెతకటానికి ప్రయత్నించింది. కానీ సూది ఎక్కడ పెద్దదో ఏమో ఆమెకు ఎంతవెతికిన కనిపించటం లేదు. ఇంతలో ఆమె భర్త రామారావు ఇంట్లోకి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా వుంది తన భార్య కొవ్వొత్తి వెలుగులో ఏదో వెతుకుతుండటం చూసి ఏమి వెతుకుతున్నావు అని అడిగాడు. ఆమె జరిగినది మొత్తం చెప్పి సూదికోసం వెతుకుతున్నాను అని అన్నది. పిచ్చిదానా ఇంట గుడ్డి వెలుతురులో నీకు సూది కనపడుతుందా ఏమిటి బైట చూడు వీధి దీపం ప్రకాశమానంగా వెలుగుతున్నది రోడ్డుమీద వెతుకుదాం పద అని ఆమెను వీధిలోకి రమ్మని పిలిచాడు. ఏమండీ మీకు మాతికాని పోయిందా సూది నా చెతిలొనుంచి జారీ ఇంట్లో పెద్దది బైట వెతికితే ప్రయోజనం ఏమిటీ అని ఆమె అంటే. పిచ్చిదానా బైట వెలుతురు బాగా వుంది కాబట్టి అక్కడ మనం వెతికితే వెతకటం తెలుస్తుంది తరువాత మనం అక్కడ దొరకక పొతే ఇంట్లో వెతుక్కోవచ్చు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్ధం అయ్యింది మీ తెలివి ఎలా పనిచేస్తున్నదో అని ఆమె అని. మీకు చాతనయితే ఒక ఎక్కువ వెలుతురు ఇచ్చే దీపాన్ని తీసుకొని రండి అప్పుడు నేను సూదిని వెతుక్కోగలను. వెలుతురు బైట ఉండవచ్చు కానీ వెలుతురు కావలసింది పోయిన వస్తువు వున్నచోట మాత్రమే. ఇదికూడా మీకు తెలియకపొతే యెట్లా అని భర్తతో అన్నది. 


నిజానికి ఈ దృష్టాంతరం చదివితే హాస్యాస్పదంగా కనపడుతుంది. కానీ ఇది మాత్రం అక్షర సత్యం. మనం దాదాపు కోఠిలో ఏవక్కరో తప్ప అందరం సూది ఇంట్లో ఉంటే వీధిలో వెతికే వారమే అంతేకాదు అక్కడ వెలుతురూ ఎక్కువగా వుంది ఇక్కడ ఇంకా వెలుతురువుంది అని చెప్పే వాళ్ళ మాటలు విని అక్కడ ఇక్కడ మనం వెతుకుతూ వున్నాం కానీ సూది మాత్రం దొరకటం లేదు కేవలం కాలం గడుస్తుంది, జీవితం అయిపోతున్నది. ఇక విషయానికి వస్తే మిత్రమా 


ఈ రోజుల్లో ఆ గుడికి వెళ్ళండి, ఈ క్షేత్రానికి వెళ్ళండి అక్కడ దేవుడిని దర్శించుకోవటం ఎన్నో జన్మల పుణ్యం ఇక్కడి క్షేత్రంలో దేవుడు చాలా శక్తివంతుడు అని మనలను తప్పు త్రోవ పట్టించే వారు సమాజంలో అనేక మంది తయారుఅవుతున్నారు. దానితో సామాన్యుడు ఏది నిజమో ఏది కాదో తెలుసుకోలేక వారి మాటల గారడితో పది కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్పటానికి బాధపడుతున్నాను. నిజానికి ఏ గుడికి వెళ్లినా ఏ తీర్థానికి వెళ్లినా నీకు మోక్షం రాదు కేవలం నీ సాధనకు మనస్సు కొంత తోడ్పడుతుంది. దానివల్ల నీకు కలిగే ప్రయోజనం చాలా తక్కువ. 


ఇది ఇలా ఉండగా ఈ రోజుల్లో అనేకమంది స్వామీజీలు, బాబాలు తమకు తామే దేవుళ్లమని పేర్కొనటమే కాకుండా ఇంకా కొంతమంది ఎప్పుడో గతించిన వారికి గూళ్లుకట్టి, పూజలు చేస్తూ మనలను కూడా పూజలు చేయమని ప్రోత్సహించటమే కాక నీవు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే నీతో స్పర్ధకు దిగి వారి వాదనే సరైనదని అయన ఫలానా దేవుడి అవతారం, ఈయన ఫలానా దేవుడి అవతారం అని అయన ఆ మహిమలు చూపెట్టారు, ఈయన ఈ మహిమలు చూపెట్టారని మనలని మభ్యపెడుతూ మన జీవితాలను లక్ష్యంనుంచి విముఖులను చేస్తున్నారు. 


మన సాంప్రదాయంలో వక్తి పూజా ఆరాధనా ఎప్పుడు చెప్పలేదు. కేవలం అంటే కేవలం పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షం సిద్ధిస్తుందని మన ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. మానిషి కొంతకాలం తపస్సు చేస్తే కొన్ని దివ్య శక్తులు సంప్రాప్తం అవుతాయి. వాటిని అణువాది అష్టసిద్ధులు అంటారు అట్లా సిద్ధులను పొందినవారిని సిద్దులు అంటారు. సిద్ధులను పొందటం అంత అసాధ్యం ఏమీకాదు. కొంతకాలం తపస్సు చేస్తే చాలు వారు ఏవైతే మహిమలు అన్నారో అవి చాలామంది తాపసులు పొంది వున్నారు. మీరు కూడా పొందగలరు. అది ఏమి విశేషం కాదు.


వీళ్ళు చెప్పే బాబాలు, స్వామీజీలు మన మహర్షులముందు చాలా స్వల్పులు. వసిష్ఠ మహర్షి ఒక దర్భను జీవమున్న బాలునిగా చేసాడు, విశ్వమిత్ర మహర్షి స్వర్గాన్నే సృష్టించగలిగాడు. వీళ్ళు చెప్పే ఈ బాబాలు, స్వామీజీలు అంతకన్నా గొప్పవాళ్ళా ఆలోచించండి. 


ఇక వారు సద్గురువులని వారిని ఆరాధిస్తే మోక్షం వస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. మిత్రమా నిజానికి మోక్షాన్ని ఏ సద్గురువు కూడా యివ్వలేదు అది సాధకుడు తనకు తానుగా కఠోర దీక్షతో సిద్దించుకోవలసరైంది. గురువు పాత్ర చాలా చిన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే నీవు ఒక రోడ్డు మీద వెళుతున్నావు అడవిలో ఆ రోడ్డు రెండుగా చీలింది. ఇప్పుడు నీవు ఏ రోడ్డుమీద వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ నీకు ఒక మార్గదర్శిని (బోర్డు) కనిపించింది అది ఆ రెండు రోడ్లు ఎటువైపుకు వెళతాయో చూపిస్తుంది. దానిని అనుసరించి నీవు నీ గమ్యాన్ని చేరుకోవటానికి నీ కారును నీవే నడుపుకుంటూ వెళతావు. ఆ రోడ్డు దాటినా తరువాత అక్కడి సైను బోర్డు సంగతే మరచిపోతావు. నీ గురువు స్తానం కూడా అటువంటిదే నీకు మార్గదర్శనం చేస్తాడు. నీ మార్గంలో నీవే వెళ్ళాలి. ఆలా వెళ్లక గురువునే పూజిస్తూవుంటే కాలయాపన కాక వేరొకటి కాదు.  


కాబట్టి సాధక మిత్రమా నీవు ఎవరి మాటలు వినక నీకు నీవుగా నీ మార్గాన్ని (మోక్ష మార్గాన్ని) ఎంచుకో ఆ దిశగా నీవు ప్రయత్నం చేసి నీలో నీ హృదయాంతరాలలో నిగూఢంగా వున్న పరమాత్మను దర్శించుకో నీవు ఏ దేముడిగూర్చి గుడులకు వెళుతున్నావో ఆ దేవుడు గుడులలో కాదు నీహృదయంలోనే వున్నాడని మన వేదం మంత్రాలు గోషిస్తున్నాయి. 


పైన కధలో సీతాదేవి ఇంట్లో పారేసుకున్న సూదిని వీధిలో వెతుకుదామని రామారావు చెప్పినా నిరాకరించి ఇంట్లోనే వెతకటానికి నిర్ణయించుకుందో అదే మాదిరిగా నీవుకూడా నీలోనే దేవుడిని వెతకటానికి ప్రయత్నించు వెలుతురూ తక్కువైన వెలుతురూ ఎక్కువ చేసుకొని (ఇక్కడ వెలుతురూ అంటే జ్ఞ్యానం సరిపడిన జ్ఞ్యానం లేకపోతె జ్ఞ్యానులనుండి అంటే గురువులనుండి జ్ఞ్యానాన్ని పొంది నీవే వెతుకు )


ప్రతిరోజూ అన్ని దేవాలయాలలో పఠించే మంత్రపుష్పంలోని ఈ మంత్రాలను చుడండి 


యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా ।


అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ॥ 5 ॥


మనకు కనిపించేది వినిపించేది అది యెంత సుఖమమైన కానీ అది పూర్తిగా నారాయణుడితో వ్యాపించి వున్నది. అటువంటప్పుడు భగవంతుని ఒక దేవాలయానికి పరిమితం చేయటం ఎంతవరకు సబబు. మీరే చెప్పండి. విశ్వమంతా వ్యాపించి వున్న దేవుడు దేవాలయాలలో కూడా వున్నాడు, వుంది భక్తుల కోరికలను తీరుస్తున్నాడు. అంటే కేవలం ఐహిక వాంఛలను తీర్చుకోవటానికి మాత్రమే దేవాలయాలకు వెళ్ళాలి కానీ మోక్ష సిద్ధికి మాత్రం కాదు. ఇక బాబాలను, సాధువులను దేవుళ్లుగా కొలవటం ఔచుత్యం అనిపించుకోదు. 


అనన్తం అవ్యయం కవిం సముద్రేన్తం విశ్వశంభువమ్ ।


పద్మ కోశ ప్రతీకాశం హృదయం చ అపి అధోముఖమ్ ॥ 6 ॥


అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే నాభ్యామ్ ఉపరి తిష్ఠతి ।


జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ ॥ 7 ॥


సన్తతం శిలాభిస్తు లమ్బత్యా కోశసన్నిభమ్ ।


తస్యాన్తే సుషిరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ ॥ 8 ॥


తస్య మధ్యే మహానగ్నిః విశ్వార్చిః విశ్వతో ముఖః ।


సోఽగ్రవిభజంతిష్ఠన్ ఆహారం అజరః కవిః ॥ 9 ॥


హృదయంలో (నీ) బంగారు కాంతులు విరజిమ్ముతూ వడ్ల గింజ కొసపరిమాణంలో భగవంతుడు విసించి వున్నాడు. ఆయనే సర్వాంతర్యామి, అది తెలుసుకొని నీకు నీవే దేవుడవు కమ్ము. 


మోక్ష మార్గం యెంత కఠినమైనదో ఉపనిషత్తు తెలుపుతున్నది. 




ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా .

క్షురస్య ధార నిశితా దురత్యయా

దుర్గాం పాఠస్తత్కవయో వదంతి .. ౧౪.. 

 

14 లేవండి! మేలుకో! గొప్పవారిని సంప్రదించి నేర్చుకోండి. రేజర్ యొక్క పదునైన అంచు వంటిది ఆ మార్గం, కాబట్టి తెలివైనవారు నడవడం కష్టం మరియు దాటడం కష్టం.  

ఒక రేజర్ బ్లేడు మీద నడవటం యెంత కష్టమో అంట కష్టం మోక్షమార్గంలో పయనించటం అని ఈ మంత్రం చెపుతున్నది. కాబట్టి సాదాకా కఠినాతి కఠినమైన మోక్షమార్గాన్ని ఎంచుకొని నీ శాయశక్తుల పణంగా పెట్టి మోక్షసిద్ది పొందు మోక్షం అంటే నిన్ను నీవు నీకుగా తెలుసుకోవటమే, అది తెలుసుకో చాందోగ్యఉపనిషత్‌లోని ఆరవ అధ్యాయంలో తత్ త్వం అసి మహావాక్యాన్ని వ్యక్తం చేసింది దీని అర్ధం ఏమిటంటే నీవు దేనినిగూర్చి వెతుకుతున్నావో అది నీవే అని తెలుసుకో. 

శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన శ్రీమత్ భగవత్గీత, ఆది శంకరులు రచించిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలూ, మన మహర్షుల నుండి ఉద్బవించిన ఉపనిషత్తులను నిత్యం చదివి ఆకళింపు చేసుకొని, అనుసరించే సాధకునికి భగవంతుని గూర్చి, మోక్షాన్ని గూర్చి నిశీతా , నిశ్చిత అభిప్రాయం ఏర్పడుతుంది. తెలిసి తెలియక బోధించెడి అజ్ఞ్యానుల మాటలు తేలికగా కనిపించి నిత్యము సత్యము, అనంతము అయిన పరబ్రహ్మ గూర్చి పరుగులిడతాడు.

ఓం తత్సత్ 


ఇట్లు 


మీ భార్గవ శర్మ

[28/05, 4:52 pm] Cheruvela bhargava sarma: సాదాకా మేలుకో -2


 పడగనీడలో 


ఒక కప్పు ఎండలో అటు ఇటు తిరుగుతూ వున్నదట దానికి ఎక్కడ కూడా ఏమాత్రం నీడ దొరకటం లేదు కాళ్ళు కాలిపోతున్నాయి, శరీరం అంతా చెమటలతో మునిగిపోతుంది, నోరు ఎండిపోతున్నది, ఇంకనేను బ్రతకలేనేమో అని భావిస్తుండగా కొంత దూరంలో కొద్దిగా నీడ కనిపించింది. బతుకు జీవుడా అని ఆ కప్పు ఆ నీడలో తన శరీరాన్ని దాచుకోవటానికి వేగంగా వెళ్ళింది. అక్కడకు వెళ్ళగానే ప్రాణానికి కొంత ఊరట లభించింది. అమ్మయ్య నాకు ఈ నీడ చాలా హాయిగా వుంది అని అనుకొన్నది. కొంత ఊరట చెందినతరువాత నీళ్లు ఎక్కడైనా లభిస్తాయా అని అటు ఇటు చూడటం మొదలు పెట్టింది. ఆ వెతుకులాటలో తన మీద ఉన్న నీడ అటు ఇటు కదలటం గమనించింది. ఏమిటి ఈ నీడ ఇలా కదులుతున్నది అని ఒక్కసారి పైకి చూసింది. పైకి చూసిన తన ఫై ప్రాణాలు పీకే పోయాయి ఎందుకంటె ఆ నీడ మరెవరిదో కాదు కప్పలను విందారగించే ఒక పెద్ద పాముది నా అదృష్టం కొద్ది దాని ద్రుష్టి నా మీద పడలేదు కానీ పడితే ఆ భావనతోటె ప్రాణం పోయినంత పామునైయింది. కప్పు రక్షింపబడ్డదా లేక భక్షింపపడ్డాదా అనేది పాఠకుల విజ్ఞతకే వదిలి వేస్తున్నాను.  


ఇక విషయానికి వస్తే సాధకులారా మీ సాధన నిత్యం కొనసాగించండి. రోజు సాధనను నిర్విరామంగా చేస్తేనే కానీ మనకు ఈ జన్మలో మోక్షం లభించదు జాప్యం అస్సలు చేయవలదు. మనం ఏ పనినైనా వాయిదా వేయవచ్చు కానీ దేవదేవుడైన పరమేశ్వరుని ధ్యానాన్ని అస్సలు వాయిదా వేయకూడదు. మనకు లభించిన ఈ జన్మ కేవలం పడగనీడలో వున్న కప్ప జీవిత కాలమంతే మన వెనుక పెద్ద పడగ వున్నది దానిపేరు కాలుడు. అందుకే మన ఆదిశంకరులు చెప్పారు "నిత్యం సన్నిహితే మృత్యువు" మానవ జీవనం కూడా పాము పడగక్రింద వున్న కప్పలాంటిదే ఆ పాము (మృత్యువు) ఏ క్షణంలో నయినా కాటు వేసీ ప్రాణాన్ని అపహరించగలదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ జాగరూకులం అయి ఉండాలి.


కాబట్టి సాధక నీ జీవితంలో ప్రతి నిముషం విలువైనదని తెలుసుకో నీ జీవితాన్ని పూర్తిగా జన్మ రావాహిత్యానికై అంటే మోక్షానికి మాత్రమే ఉపయోగించు. మనం నిత్యం అనుభవించే సుఖాలు, భోగాలు నిత్యమైనవి కావు కేవలము తాత్కాలికమైనవి ఈ సంగతి ప్రతి సాధకుడు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. 


ఈ రోజుల్లో మనకు అనేకమంది తమ వాక్చాతుర్యంతో భక్తి మార్గాన్ని ప్రభోదిస్తున్నామని చెపుతున్నారు. నిజానికి వారు వారి జీవితాలను యెంత మోతాదులో ఉద్దరించుకుంటున్నారు అన్నది ఒక ప్రశ్నర్ధకమే. ఎంతమంది దేహ వ్యామోహం లేకుండా వున్నారు. చాలా వరకు దేహవ్యామోహం ఉన్నట్లు ప్రస్ఫుటంగా బాహ్యంగా కనిపిస్తూ ఆధ్యాత్మికతను బోధిస్తున్నారు. మరి తమను తామే ఉద్దరించుకోలేని స్థితిలో ఉంటే వారు మనలను ఎలా ఉద్ధరిస్తారు ఆలోచించండి. 


నిజమైన సాధకుడు దేహవ్యామోహాన్ని వదిలి ఉండి ఈ దేహం కేవలం మోక్షాన్ని పొందటానికి ఉపయోగ పడే ఒక సాధనగా మాత్రమే తలుస్తాడు. ఏ మాత్రము దూషణ, భూషణాదులకు లొంగడు, అరిషడ్వార్గాన్ని నియంత్రించుకొని ఉంటాడు, ఎప్పుడు మృదు భాషణలు చేస్తాడు, రాజసం అస్సలు ఉండదు, ధనాపేక్ష, కీర్తి కాండూతి ఉండదు. తన జీవితాన్ని ఎలా తరించుకోవాలని మాత్రమే ఆలోచిస్తాడు. అటువంటి సాధకుడు మాత్రమే సద్గురువుగా పేర్కొన వచ్చు. అటువంటి సద్గురువులు తారసపడితే వారి సాన్నిధ్యంలో మన సందేహ నివృత్తి చేసుకొని నిత్యం సాధన చేస్తే తప్పకుండ మోక్షం సిద్ధిస్తుంది. 


ఓం తత్సత్


ఓం శాంతి శాంతి శాంతిః


ఇట్లు 


భార్గవ శర్మ

[18/06, 7:47 am] Cheruvela bhargava sarma: ఓ హిందూ మేలుకో-1

ఓ హిందూ మేలుకో-1


ఈ రోజుల్లో మన సమాజంలో రోజు రోజుకు మన సాంప్రదాయాలమీద, మన ఆచారాల మీద ఆదరణ తక్కువ అవుతున్నది. దానికి దారుణం ఏదయినా కావచ్చు. ముఖ్యంగా ప్రతి హిందువు తన ధర్మం ఏమిటి తన కర్తవ్యం ఏమిటి తన్ను తాను ఎలా ఉద్దరించుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించి తన దైనందిక జీవితాన్ని కొనసాగిస్తే ప్రతిహిందువు ఒక చక్కని వ్యక్తిత్వం వున్న ఆదర్శమూర్తిగా నిలుస్తాడు మన హిందూ ధర్మాన్ని కలకాలం నిలపటానికి తోడ్పడుతాడు.  


ప్రతి హిందువు తానూ ఏకులానికి చెందినవాడైన కానీ తాను ముందుగా హిందువునని కాబాట్టి తన ధర్మాన్ని నిలపెట్టాలని అనుకోవాలి. పూర్వం ఎప్పుడో మనం చూడని సమాజం ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరు చక్కగా చదువుకుంటున్నారు అనేక విషయాలను తెలుసుకొని విద్యావంతులుగా రాణిస్తున్నారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి "విద్య దదాతు వినయం " అని ఆర్యోక్తి అంటే విద్యవలన వినయము కలగాలి వినయం అంటే దేని పట్ల వినయం అంటే అది శాస్త్రం పట్ల శాస్త్రం అంటే మనకు జ్ఞనాన్ని ప్రసాదించేది శాస్త్రం. 


హిందువులు విగ్రహారాధకులు అని కొందరు ఏదారి మతస్తులు అభిప్రాయపడుతుంట్టారు. నిజా నిజాలు తెలియని అమాయక హిందువులు అది నిజమని అనుకుంటారు. మిత్రమా ప్రపంచంలో ఏ మతం కూడా హిందూ ధర్మాన్ని మించినది లేదు. అందుకే అనేక తప్పుడు ప్రచారాలను చేసి ఇతరులు హిందువులను చులకన చేసే ప్రయత్నాలను చేస్తున్నారు అందులో భాగమే ఈ తప్పుడు ప్రచారం ఒకటి. 


ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యంనుండే చక్కగా నీతి శతకాలను నేర్పాలి, మన మాతృ భాషయిన తెలుగు పట్ల చక్కని అవగాహన కల్పించాలి. శ్రీకృష్ణ భగవానులు ఉపదేశించిన శ్రీమత్ భగవత్గీతను ప్రతి వారు పఠించి , అందులోని విషయాలను పాటించి తమ జీవితాలను ఆదర్శవంతంగా చేసుకోవాలి. 


హిందూ ధర్మంలో శవాల బొమ్మలు, సమాధులను పుజెంచమని ఎక్కడా చెప్పదు. పొరపాటునకూడా అటువంటి తప్పుడు పనులు చేయకూడదు. 


అవతారపురుషులు మనకు శ్రీ రాముడు, శ్రీ కృష్ణ భగవానులే ప్రధానంగా గోచరిస్తారు. ఒక అవతార పురుషుడు మరల ఇంకొక అవతారపురుషుడుగా ఎప్పుడు మరల మరల జన్మలు తీసుకోరు. ఈ విషయం ప్రతి హిందువు తెలుసుకోవాలి. మన ధర్మాన్ని ఆచరించే వారిని, మన దేముళ్ళను ఆరాధించే వారిని మాత్రమే మనం గురువులుగా భావించాలి. ఎట్టి పరిస్థితిలోను తత్ బిన్నంగా నడవకూడదు. 


మన ఆచారాలను పాటిద్దాము, మన ధర్మాన్ని కాపాడుదాము. 


జై హిందూ జై జై హిందూ 


ఆచంద్ర తారార్కం మన ధర్మం వెలసిల్లేలా మనమంతా కృషి చేద్దాం.  


మార్పు నానుండే మొదలు అని ప్రతివారం ఉద్యమిద్దాం. 


జై శ్రీరామ్,జై శ్రీ కృష్ణ 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః 


ఇట్లు 


మీ 


భార్గవ శర్మ

[21/06, 1:31 pm] Cheruvela bhargava sarma: , జూన్ 2023, బుధవారం

కాకస్య దంతః

 


 కాకస్య దంతః 


పూర్వం ఒక గ్రామంలో వీధి అరుగుమీద ఇద్దరు పండితులు కూర్చొని ఒక విషయాన్ని గురినిచి తర్కించుకుంటున్నారట అదేమిటంటే " కాకస్య దాంతః" అంటే కాకికి దంతాలు వుంటాయని రామశర్మ అనే పండితుడు కాకికి దంతాలు ఉండవని కృష్ణ శర్మ అనే పండితుడు చాలా ఆవేశంతో తర్కిస్తున్నారు. నారాయణ శర్మ అనే ఒక బ్రాహ్మడు అటువైపునుండి నడుచుకుంటూ వెళుతున్నాడట. అది వారి కంట పడింది. అప్పుడు ఆ పండితులు ఇద్దరు నారాయణ శర్మను ఆపి తమ తర్కమును విని సమాధానం చెప్పమన్నారు. నారాయణ శర్మకు కంఠంలో వెలగకాయ పడ్డట్లు అయ్యింది. ఎందుకంటె గ్రామంలో రామ శర్మ, కృష్ణ శర్మ ఇద్దరు కూడా ఉద్దండ పండితులని వేద, మీమాంస, తర్క, న్యాయ, జ్యోతిషాది శాస్త్రాలు కూలంకుషంగా చదివిన దిట్టలని ప్రతితీ కాబట్టి సామాన్యుడైన నారాయణ శర్మ వారి తర్కం విని వారి తగువు తీర్చటం అంటే మాటలా. అతని పని అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారయ్యింది.. 


కాకి కూడా ఘనాహారం అంటే పప్పులు, గింజలు మనుషులు తిన్నట్లే తింటుంది కాబట్టి కాకులకు తప్పకుండా దంతాలు ఉండి తీరాలిసిందే అని రామ శర్మ తన తర్కాన్ని చెపితే దానికి కృష్ణ శర్మ కాకికి వుండే ముక్కే చాలా చిన్నగా ఉంటుంది అందులో చిన్న నాలుక ఉంటుండి ఇక దంతాలు పెట్టె అంత నోరే లేనప్పుడు ఇక దంతాలు ఉండటానికి అవకాశం ఎక్కడ వున్నది. నిజానికి కాకికి వున్న ముక్కుతోటె అంటే ఫై ముక్కు మరియు క్రింది ముక్కు మధ్యలో ఆహారాన్ని నమిలి తింటుంది అని కృష్ణ శర్మ వాదించాడు. ఇద్దరి వాదనలు విన్నతరువాట్ ఏమి మాట్లాడాలో తెలియక తెల్లమొహం వేయవలసివచ్చింది నారాయణ శర్మ. నిజానికి నారాయణ శర్మ వారిద్దరిలాగా పెద్దగా చదువుకొనక పోయినా కానీ చక్కటి యుక్తిపరుడు, ఎటువంటి సమస్యనయినా సాధించగల సాధకుడు. కొంచం ముందు బెరుకుగా ఉన్నకాని వారిద్దరికీ తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. 


పండితులారా పితృకార్యాలలో కాకులకు అదే వికిర పిండం ఎందుకు పెడతారో ముందు చెప్పండి అప్పుడు మీ సందేహాన్ని నివృత్తి చేయగలను అని వారి మనస్సును ప్రక్కత్రోవ పట్టించే ప్రయత్నం చేసాడు. అతని ప్రయత్నం కొంత ఫలిచిందనే చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో బాగా చదువుకున్నాం అనుకునే మేధావులు కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసుకొని వుండరు. ఇప్పుడు ఆ పండితుల ఇద్దరి పరిస్థితి అట్లానే అయ్యింది. పేలబోయిన వారి ముఖములను కనిపించకుండా తెలివిగా ఇద్దరు మేము అడిగినదానికి నీవు అడిగిన దానికి సంబంధం ఏమిలేదు ముందుగా మా సందేహం తీర్చమని నారాయణ శర్మ ను వత్తిడి చేశారు. 


నారాయణ శర్మ కూడా ఏమి తక్కువ తినలేదు పండితులారా వికిర పిండం తినాలంటే కాకి ఎలా తినాలి. అందుకే నేను ఆ ప్రశ్నను వేసాను అని అన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు పండితులు కొంత వెనుకకు తగ్గవలసి వచ్చింది.. మాట మారుస్తూ వాళ్ళు ఇంతకూ నారాయణ శర్మ ఎందుకు ఇటువైపు వచ్చావు అని అన్నారు. అంటే మా గొడవ ఏదో మేము పడేవారం కదా మధ్యలో నీ వల్ల మేమిద్దరం తెలివిలేని వారిగా బయటపడవలసి వస్తున్నదే అన్నట్లుగా వున్నది వారి మాట. 


నారాయణ శర్మ వారిద్దరిని ఉద్దేశించి పండితులారా మనం ఎన్నో లక్షల జన్మలనుంచి తపిస్తూవుంటే ఆ ఈశ్వరుడు మనకు ఈ జన్మను ప్రసాదించారు. ఎంతో జ్ఞ్యానం కలిగి వున్నాము ఇప్పుడైనా మనం కళ్ళు తెరువక ఇంకా శుష్క వాదనలతోటి కాలయాపన చేస్తే మన జన్మకు అర్ధం ఏముంది మనకు శంకర భగవతపాదులవారు చక్కగా భజగోవిందాన్ని బోధించారు. కాబట్టి కాలాన్ని వృధాచేయకుండా చక్కగా పరమేశ్వరుని చేరే మార్గం ఎంచుకోవాలి అని అంటే వారిద్దరికీ కనువిప్పు అయ్యింది. 


నాటి నుండి రామ శర్మ కృష్ణ శర్మ శుష్క సంభాషణలు చేయకుండా చక్కగా సాధన చేతుష్టయాన్ని అవలంబీనించి ముముక్షుకత్వం వైపు పయనించారు. 


కాబట్టి భార్గవశర్మ చెప్పేది ఏమిటంటే ఓ సాధక మిత్రమా మనకు సమయం తక్కువగా వున్నది మోక్షపదం చాలా దూరంగా వున్నది ఈ క్షణం నుంచే మనం సాధన మొదలుపెడితే కానీ మోక్షాన్ని పొందలేము. తస్మాత్ జాగ్రత్త 


 ఓం తత్సత్


ఓం శాంతి శాంతి శాంతిః


ఇట్లు 


మీ భార్గవశర్మ

[26/06, 6:29 pm] Cheruvela bhargava sarma: సీజను మొదలైంది

సీజను మొదలైంది 


మొన్నటిదాకా విపరీతమైన ఎండలు, రోజు కూలర్లు, ఏసీలు వెరాసి కరంటు బిల్లు వేలకు వేలు. గత మూడు రోజులనుంచి భగవంతుని దయవలన వాతావరణం చల్లబడ్డది. ప్రాణం కొంత ఊరట చెందింది. అది సంతోషకరమైన విషయమే కానీ ఇప్పుడే రోగాల సీజను మొదలౌతుంది. కాబట్టి అందరు ముందుజాగ్రత్తగా ఉండటం అవసరము. 


 ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన మందు 


మందు పేరు: కుటజారిష్ట 


కంపని : పతంజలి 


ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా వున్నా కూడా మనం తినే ఆహారం కలుషితం అవ్వటానికి ఆస్కారం వున్నది. బయటి తిండి తినకుంటే చాల మంచిది కానీ మనం టిఫిన్లు తినకుండా ఉంటామా చెప్పండి. వుండంకదా . ఏమాత్రం నీరు కలుషితమైనా వెంటనే మనకు వచ్చే అనారోగ్య సమశ్య విరోచనాలు, కడుపులో నొప్పి. విరోచనాలు నీళ్ల విరోచనాలే కావచ్చు లేక అజీర్తి విరోచనాలే కావచ్చు. కడుపులోనొప్పి మాత్రం తప్పకుండ ఉంటుంది. దీనినే మనం మెలిపెట్టినట్లు వున్నది అని అంటాము. ఆ బాధ అనుభవిస్తే కానీ తెలియదు. ప్రతి ఇంట్లో ఈ వర్షాకాలంలో అందరు కానీ కొంతమంది కానీ తప్పకుండ ఈ సమస్యతో బాధపడే వారే. 


మనం డాక్టరు దగ్గరికి వెళితే డాక్టారు ఫీజు 100 నుండి 200 తరువాత అయన వ్రాసే మందులు 400-500 వెరసి మనకు 5 నుండి 6 వందల వరకు ఖర్చు వస్తుంది. అవునా కాదా? మరి అతి తక్కువ ఖర్చుతో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనం ఇంట్లోనే చికిత్స చేసుకుంటే ఎట్లావుంటుంది. 


ఒక వేపు విరోచనాలు, పైన వాన డాక్టరు వద్దకు వెళ్లాలంటే స్కూటర్ మీద తడుసుకుంటూ వెళ్ళాలి. డాక్టరు అప్పోయింట్మెంట్ ఏ గంట కుర్చుంటేనో దొరుకుతుంది. ఈ మధ్యలో రెండు మూడు సార్లు వెళ్లాల్సి వస్తుంది, ఆ కష్టం యెట్లా ఉంటుందో మనకు తెలియంది కాదు. కాబాట్టి నేను చెప్పే ఈ మందు ఈ రోజే కొనుక్కొని తెచ్చుకుంటే ఇంట్లో ఎవ్వరికీ విరోచనాలు అయినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వాడి ఒక గంట రెండు గంటలలో ఉపశమనం పొందవచ్చు. ఏమంటారు. 


ఈ కుటజారిష్ట గూర్చి తెలుసుకుందాము. ఇది పూర్తిగా ఆయుర్వేదానికి సంబందించిన మందు వనమూలికలతో తయారుచేసింది. నూటికి తొంబైతొమ్మిది పళ్ళు సురక్షితమైనది. చిన్న పిల్లల దగ్గరనుండి వృద్ధుల వరకు ఇంట్లోని అందరు వాడదగిన మంచి మందు. మనం మాత్తర్లు కొనుక్కొంటే అవి కొన్ని వాడి మరల మిగిలినవి ఉపయోగించకుండా పారేసుకుంటాము. మళ్ళి డాక్టరు దగ్గరికి వెళతాము. వెరసి మళ్ళి 5 వందల ఖర్చు తప్పదు. 


ఈ మందు ద్రవరూపంలో 450 మిల్లి లీటర్ల పరిమాణంలో దొరుకుతుంది ధర కేవలము Rs 95 అంటే 100 రూపాయల కన్నా తక్కువ. ఇంకొక విషయం మీరు ఒక్కసారి ఈ మందు కొని తెచ్చుకుంటే 10 సంవత్సరాలలోపు దీనిని వాడ వచ్చు. అంటే మీ అమ్మాయి డిగ్రీ చదువుతుంటే కొన్న సీసా మీ అమ్మాయి పెండ్లి అయ్యి మనమరాలు/ మనమడు పుట్టిన దాకా ఈ మందు క్షేమంగా మీ ఇంట్లో వుంచుకోవచ్చు. ఒకటి రెండు డోసులు తీసుకుంటే మీ విరోచనాలు వెంటనే కడతాయి చక్కటి స్వస్థత చేకూర్చుతుంది. కాక పొతే ఈ మందు చేదుగా ఉంటుంది. మందు ఒకటి రెండు చెంచాలు ఒక చిన్న గ్లాసులో పోసుకొని తగినంత నీటిని కలిపి సేవించండి. 


అందరు తక్కువ ఖర్చుతో మన స్వదేశీ విద్య విధానంలో, స్వదేశీ కంపెనీ ప్రొడక్టులతో ఆరోగ్యాన్ని చేకూర్చుకోవాలనే నా ఉద్యమాన్ని మీరు బలపరుస్తారనుకుంటా.  






కంపెనీ వారు ఇచ్చిన సమాచారం 


Kutajarishta brings relief to you from chronic indigestion problems, upset stomach, diarrhoea, fever, etc. Contaminated food and drinks constantly harm and weaken your digestive system. It is a time-tested formulation that soothes your stomach, heals the damages from contaminations and boosts your digestion. It has been clinically proven to have no side effects.


మందు వాడిన వారు వారి అనుభవాలను కింద కామెంటులో తెలుపగలరు.

[06/07, 8:44 pm] Cheruvela bhargava sarma: పండ్ల బండి 


ఒక గ్రామంలో ఒక పండ్ల వర్తకుడు ఒక తోపుడు బండినిండా అరటి పండ్లు యాపిల్ పండ్లు, బత్తాయిలు ఇలా రకరకాల పండ్లను పెట్టుకొని వీధిలో విక్రయిస్తున్నాడట. ఉదయం నుంచి మధ్యాన్నం వరకు విరామం లేకుండా పండ్లు అమ్మి గల్లా నిండా డబ్బులు సంపాయించాడు. ఎండలో ఒకింత విశ్రాన్తి తీసుకుందామని దగ్గరలోని ఒక చెట్టుక్రింద పడుకున్నాడు. ఈ ఎండలో ఎవరు గ్రాహకులు రారనే భావనతో. అతనికి తన బండిమీద పండ్లు, డబ్బులు ఎవ్వరు తీసుకొని పొరనే నమ్మకం. ఎందుకంటె అతడు రోజు అలానే చేసినా కూడా ఒక పండు పోలేదు ఒక రూపాయి పోలేదు. 


కానీ ఈ విషయాన్ని రోజు గమనించిన ఒక దొంగ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ రోజు అతనికి ఆ బండివాని డబ్బులు కాజేయటానికి సరైన సమయం దొరికింది. చిన్నగా అతను దూరంగా బండివాని కదలికలను గమనిస్తూ చిన్నగా అతను నిద్రలోకి జారుకోగానే పిల్లిలా నడుచుకుంటూ ఆ బండి వైపుకు బయలుదేరాడు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో కానీ ఒక పెద్ద కోతి ఆ బండిమీదకు దూకి కొన్ని పండ్లను తింటూ, కొన్ని పండ్లను చేతులతో పట్టుకొని ఆ పండ్లను దొంగిలిస్తున్నది. అది గమనించిన మన దొంగగారు వేగంగా ఆ కోతిని అదిలిస్తూ ఆ బండి వద్దకు వెళ్ళాడు. అతని భయం ఏమిటంటే ఆ కోతి అక్కడి డబ్బులపెట్టే మీద పడితే ఆ డబ్బులని తీసుకొని పొతే ఇన్నాళ్ల తన నీరిక్షణ అంతా వృధా అవుతుందని, అతని ఆందోళన. నిజానికి ఆ కోతికి అక్కడ డబ్బుల పెట్టె వున్నదని అందులో పండ్లకన్నా ఎంతో విలువైన ద్రవ్యం వున్నదని దానికి తెలియనే తెలియదు. దానికి తెలిసినదల్లా తన ఎదురుగా వున్న పండ్లు మాత్రమే. కోతి డబ్బుల పెట్టె జోలికి వెళ్లనందుకు ఎంతో సంతోషించిన మన దొంగగారు ఆ కోతిని అదిలించి చిన్నగా డబ్బుపెట్టెను తెరచి అందులోని ద్రవ్యాన్ని చేచిక్కించుకున్నాడు. అతను ఒక్క పండుకూడా ముట్టుకోలేదు. ఇలాంటి సంఘటనను మనం ఊహించుకోవచ్చు. కొన్నిసందర్భాలలో జరిగి కూడా ఉండ వచ్చు.


 ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా ఈ ప్రపంచంలోని సాధారణ ప్రజలు పైన చెప్పిన కోతిలాగా పండ్ల వెంట అంటే ఐహిక భోగాలకు, విలాసాలకు, సుఖాలకు ఆశ పడి వాటిని పొందుతూ అవే వారి జీవిత లక్ష్యగా భావించి వాటితోటె సంతృప్త పడుతుంటారు. కానీ నిజమైన జ్ఞ్యాని ఈ ఐహిక భోగాలు కేవలం కొంత సమయం వరకు తృప్తిని ఇచ్చేవిగా తెలుసుకొని అనంతమైన బ్రహ్మ జ్ఞ్యానం శాశ్వితము నిత్యము అని తెలుసుకొని ఏరకంగా అయితే దొంగగారు డబ్బుల పెట్టె వెంట పడ్డారో అలానే జిజ్ఞాసువులు జ్ఞ్యాన బాండాగారమైన శాస్త్రాలను అంటే వేదాంత జ్ఞ్యానానికి సంబందించిన ఉపనిషత్తులు మొదలైనవి సత్ గురువుల ద్వారా తెలుసుకొని నిత్యము, సత్యము శాశ్వితము అయిన బ్రహ్మ జ్ఞనాన్ని పొందుతారు. ఎన్నో జన్మలనుంచి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తూ ఉంటే ఆ దేవదేవుడు దయతో మనకు ఈ రోజు ఈ మానవ జన్మను ప్రసాదించాడు. కాబట్టి ఒక్క క్షణం కూడా వృధా కాకుండా నిరంతరం పరమేశ్వరుని సేవలో జీవితాన్ని గడుపుతేనే కానీ మనకు మోక్షము లభించదు. ఈ విషయం ప్రతి సాధకుడు గమనించి ఆ అనంతుని వెంట వెంటనే పడి జన్మరాహిత్యానికై కృషి చేస్తే తప్పకుండా మోక్ష సిద్ది లభిస్తుంది.


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః 


ఇట్లు 


మీ భార్గవ శర్మ

[11/07, 8:31 pm] Cheruvela bhargava sarma: 11, జులై 2023, మంగళవారం

ప్రతి ఫలం

 


 ప్రతి ఫలం 


కొన్ని సందర్భాలలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఇటువంటి దానికి నిదర్శనంగా ఆది శంకరుల ఒక వృత్తాంతం తెలుపుతారు. 


బాల శంకరులు బిక్షాటన కొరకు ఒకసారి ఒక గుడిశముందు నిలబడి " భవతి బిక్షం దేహి" అని యాచించాడట కానీ ఆ గృహంలోనుంచి ఎంతసేపటికి ఎవ్వరు రాలేదట. అయినా కానీ మన శంకరులవారు ఇంకా నిరీక్షిస్తూ ఉన్నారట. కొంతసేపటికి ఒక పేదరాలు వణుకుతున్న చేతులతో స్వామికి లేదు అని చెప్పటానికి మనస్కరించక ఒక ఉసిరిక పండును మాత్రం ఆయన జోలెలో వేసిందట. ఆమె దైన్యతను గమనించిన శంకరాచార్యులవారు ఒకసారి ఆమె గుడిసెను పరికించారట అంతా కాళిగా ఉండటం చూసి ఆమె కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నదని తెలుసుకున్నారట. 


శంకరులవారి మనస్సు ఆర్ద్రతమైనదట. వెంటనే శంకరాచార్యులవారు మహాలక్షిని స్తుతిస్తూ స్తోత్రము చేశారట. ఆయన స్తోత్రానికి ప్రసన్నమైన అమ్మవారు ఆయనకు ప్రత్యక్షం అయి నాయనా ఎందుకు నన్ను పిలిచావు అని అడిగింది. దానికి శంకరులవారు అమ్మా ఇది నీకేమైనా న్యాయంగా ఉన్నదా ఈ స్వాద్విమణి దీనత్వం చూసి నీకు దయరాలేదా తల్లి అని వేడుకొన్నాడు. అప్పుడు అమ్మవారు నాయనా నేను ఏమి చేతును ఆమె గతజన్మలో పూర్తిగా పిసినారిగా వుంటూ ఎవరికి కూడా ఎటువంటి దానధర్మాలు చేయకుండా ఉండి పూర్తిగా పుణ్యరహితంగా ఉండటం వలన ఆమెకు ఈ జన్మలో ఈ దారిద్యం దాపురించింది. అమ్మా ఆమె ఏ పుణ్యము చేయలేదు సరే మరి ఆమె భర్త పుణ్యము వలన అయినా ఈమెకు కొంత ఊరట కలగాలి కదా తల్లి అని అన్నాడు. దానికి తల్లి నాయనా ఆమె భర్త ఈమెకన్నా ఎక్కువ పాపాత్ముడు . అందుకే వారిద్దరిని కలిపాడు పరమేశ్వరుడు. ఇద్దరు ఒకరిని మించిన వారు ఇంకొకరు. కాబట్టి వారు ఈ దారిద్యాన్ని అనుభవిస్తున్నారు అని అన్నారు అమ్మవారు. 


నాయనా ప్రస్తుత పరిస్థితుల్లో వారి దారిద్యాన్ని బాపటం ఆ పరమేశ్వరుని వశం కూడా కాదు వారు అంత పాపాత్ములు అని తల్లి ఉన్నసంగతి తెలిపింది. అప్పుడు ఆలోచించటం శంకరులవారి వంతయినది శంకరులు అంటే సాక్షాత్తు శంకరులేకదా మరి శంకరాచారులవారు ఊరుకుంటారా. తల్లి నీవు చెప్పింది నిజమే ఆ సాద్విమణి ఏ పుణ్యము గత జన్మలో చేసి ఉండకపోవచ్చు. మరి ఈ జన్మలో విషయం ఏమిటి తల్లీ అని అమ్మవారిని మరల వినమ్రుడై అడిగాడు. ఈ జన్మలోకూడా ఆమె ఏ రకమైన దానం చేయలేదు అని తల్లి బదులిచ్చింది. అప్పుడు శంకరులవారు ఒక్కసారి ఆమె గుడిశ మొత్తం పరికించి చూడు తల్లీ అని వేడుకున్నాడు. మొత్తం చూసిన మహాలక్షి ఏమున్నది నాయనా అని అన్నది. తల్లీ నేను చెప్పేది కూడా అదే ఆ సాద్వీమణికి ఇవ్వటానికి ఏమిలేకపోయినా నాకు ఒక ఉసిరిక పండును దానం చేసింది తల్లీ మరి ఆ దానఫలితాన్ని ఇవ్వవా అని మరల వేడుకొన్నాడు. అప్పుడు శంకరుని తెలివికి మెచ్చుకొనిన లక్ష్మీ దేవి ఆ ఇంట బంగారపు ఉసిరికాయలను వర్షించిందట దానితో ఆ పేదరాలి పేదరికం అంతా మటుమాయం అయిందట. 


ఆది శంకరులు లక్షి అమ్మవారిని ప్రసన్నురాలిగా చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రముగా చాల ప్రసిద్ధి చెందింది. ఈ స్తోత్రాన్ని భక్తితో రోజు పారాయణ చేసే భక్తులకు సిరి సంపదలు సమకూరుతాయని ప్రతీతి. త్రికరణ శుద్ధిగా అకుంఠిత దీక్షతో ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా ఆ మహాలక్షి ప్రత్యక్షం అవుతుంది.  


చూసారా సత్పురుషునికి చేసిన ఒక చిన్న దాన ఫలితంగా యెంత ఫలితం లభించిందో కదా. కాబట్టి మనం ఎప్పుడూ సపాత్ర దానాన్ని చేయాలి. అంటే పాత్రనెఱిగి దానం చేయాలి. దానం చేసేటప్పుడు దాన గ్రహీత మీరు చేసే దానానికి యోగ్యుడా కాదా అని నిర్ధారణ చేసుకొని మరి దానం చేయాలి. మీరు చేసిన దాన ద్రవ్యముతో దాన గ్రహీత ఏదైనా పాపపు కృత్యాలు చేస్తే మీకు దానఫలితంగా పుణ్య ఫలం రాకపోగా ఆ పాపంలో భాగం వస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి మరి పాపాలను కొనుక్కోవటం అన్నమాట. 


మన పూర్వికులు అందుకేనేమో అన్నిదానాలలోకి అన్నదానం గొప్పది అని అన్నారు. అన్నదానం చేయటం వలన రెండు విషయాలు అవగతం అవుతాయి. ఒకటి అన్నం తిన్న దాన గ్రహీత ఇక నాకు చాలు అంటాడు అంటే అతను మీ దానంతో తృప్తి చెందుతాడు. కాబట్టి అతని తృప్తివలన మీకు దాని ఫలితంగా పుణ్యఫలం వస్తుంది. ఇంకొక విషయం. మీరు పెట్టిన అన్నాన్ని మీ సమక్షంలోనే ఆరగిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో అన్న దానం వలన పాపం రాదు. ఏదానానికైనా పాత్రను యెరిగి దానం చేయాలి కానీ అన్నదానానికి మాత్రం ఆకలితోవున్న ఎవ్వరికైనా చేయవచ్చు. పుణ్య ఫలితం ఒకేవిధంగా ఉంటుంది. అన్నదానం కేవలం మనుస్యులకు మాత్రమే చేయాలనీ నియమం లేదు. పశుపక్షాదులకు కూడా చేయవచ్చు. నిత్యం పక్షులకు అన్నం పెట్టె వారికి ఈ జన్మలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి జీవితం కలుగుతుంది. వారి పితృదేవతలు కూడా సంతోషిస్తారు.


కాబట్టి మిత్రమా ఇతర దానాలకన్నా అన్నదానమే శ్రేష్ఠము కావున అన్నదానాన్ని చేయండి. అన్నదానాన్ని ప్రోత్సహించండి. ఆలా అని రోజు ఒక్కరికే అన్నాన్ని పెట్టి మనుషులను ఏ పని పాట చేసుకొని సోమరులుగా తయారు చేయకూడదు.  


అన్నదానం తరువాత చెప్పుకోదగిన దానం విద్య దానం. ప్రతి విద్వంసుడు తాను సముపార్జించిన విద్యను పలువురికి దానం చేసి విద్యావంతులను చేయాలి. విద్యావంతుడైన వాడు తన విద్యతో చక్కగా జీవితాంతం సంపాదించుకొని తానూ సుఖపడి పలువురిని సుఖపెట్టగలడు. కాబట్టి విద్యాదానం చేయటం కూడా చాలా మంచి విషయం. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః 


మీ 


భార్గవ శర్మ

[12/07, 9:08 pm] Cheruvela bhargava sarma: వివేకము  


వివేకము అంటే మరేదో కాదు విచేక్షణా జ్ఞ్యానం కలిగి ఉండటమే. దేని గురించిన విచేక్షణ అనే ప్రశ్న ఉదయిస్తుంది. సామాజికపరంగా చుసినట్లయితే నీ ముందు వున్న రెండు విషయాలలో ఏది మేలైయనదో ఏది కాదో తెలుసుకొను జ్ఞానంగా మనం అభివర్ణించవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి మేనేజరులను నియమించుకుంటారు దానికి కారణం వారు వారి విచేక్షణతో ఆ యా కంపెనీల అభివృద్ధికి సంబందించిన నిర్ణయాలు తీసుకుంటారని. మేనేజిమెంట్ కోర్సులో ఒకటి చెపుతారు అదేమిటంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని. కొన్ని సందర్భాలలో నిర్ణయాలు సరైనవే అయినా అవి సరైన సమయంలో తీసుకోక పొతే ప్రయోజనం ఉండదు. నీ ముందు వున్న రైలు ఎక్కాల వద్దా అనే నిర్ణయం ఆ రైలు కదలి వెళ్ళక ముందే తీసుకోవాలి. అదే ఆ రైలు ఎక్కాలనే నిర్ణయం ఆ రైలు వెళ్ళిన తరువాత తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. 


బట్టల దుకాణాదారుడు బట్టలు పాతవి అయి చినుగు పట్టకముందే అమ్మివేయాలి. ఎక్కువ డబ్బులు వస్తాయని ఎక్కువ రోజులు అమ్మకుండా ఉంచితే చివరకు నష్టానికి కూడా ఎవరు కొనకవచ్చు. సరైన నిర్ణయం తీసుకోవటం, అలానే సరైన సమయంలో నిర్ణయం తీసుకోవటం రెండు ముఖ్యం. 


మన ధర్మంలో పురుషార్ధాలు చెప్పారు అంటే పురుషార్ధాలు అయిన "ధర్మార్ధ కామ మోక్షాలను" ప్రతి పురుషుడు ఆచరించాలని నిర్ణయం. అంటే ప్రతివారు వారి జీవితానిని పురుషార్ధాలు సాదించటానికి మాత్రమే జీవించాలి. అయితే మనకు నాలుగు ఆశ్రమ ధర్మాలు కూడా చెప్పారు. అవి బ్రహ్మచర్యం, గృహస్తు, వానప్రస్తం, సన్యాసం. ఆయా వయస్సు ప్రకారం ఆయా ఆశ్రమ ధర్మాలను ఆచరించాలని మనకు తెలిపారు. ఈ రోజుల్లో ఎంతమంది ఆశ్రమధర్మాలను పాటిస్తున్నారన్నది మనందరికీ విదితమే. 


మన హిందూధర్మంలో చిన్నప్పటినుండి భగవతుడి భక్తి గురించి మన తల్లిదండ్రులు నేర్పటం నిజంగా మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఎప్పుడైతే ఒక మానవుడు తనను రక్షించువాడు భగవంతుడు అని విశ్వసిస్తాడో అప్పుడు భగవంతుడి మీద అనన్యమైన భక్తి కలుగుతుంది. 


ముందుగా ప్రతి సాధకుడు భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతునిమీద భక్తి కలిగి తరువాత భక్తి మారంలో కొంతదూరం పయనించిన తరువాత భక్తుడు భగవంతుడు వేరు ఈ జగత్తు వేరు కాదనే సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు భక్తిమార్గం నుండి జ్ఞ్యానమార్గానికి చేరుకుంటాడు. 


జ్ఞ్యానమార్గంలో ముందుగా తెలుసుకోవలసిన విషయం వివేకం అంటే దేనిగురుంచి వేవేకం అంటే ఏది నిత్యం ఏది అనిత్యం అనే వివేకం. ఈ వివేకం కలిగిన తరువాత వైరాగ్యం మీదకు మనసు మళ్లుతుంది. కాబట్టి ముందుగా వివేక జ్ఞ్యానం కలగాలి. 


"ఎత్ దృశ్యం తత్ నస్యం" అనే వేదాన్త సూత్రాన్ని అనుసరించి మన కంటికి గోచరించేది ప్రతిదికూడా నశించి పోయేది అని అర్ధం. అప్పుడు కొంతమంది సూర్య చంద్ర నక్షత్రాలు అనాదిగా వున్నాయి కదా అవి మన కంటికి కనపడుతూ వున్నాయి మరి వాటి సంగతి ఏమిటని ప్రశ్నిస్తారు. నిజానికి అవి అన్నీకూడా కాలంలో నశించేవే కాకపొతే కొన్ని వేల ,లక్షల సంవత్సరాల తరువాతో లేక అంతకన్నా ఎక్కువ సమయం తరువాతో కావచ్చు. కానీ నశించటం మాత్రం తథ్యం. 


ఆది శంకరాచార్యులవారు వివేక్ చూడామణి ఒక శ్లోకంలో ఇలా అన్నారు. 


తద్వైరాగ్యం జుగుప్సా యా దర్శనశ్రవణాదిభిః


 దేహాదిబ్రహ్మ పర్యంతే హ్యనిత్యే భోగవస్తుని - 21


దర్శనము, శ్రవణము మున్నగు విధుల మూలమున దేహమ మొదలు బ్రహ్మపర్యంతముగా ఉన్న అశాశ్వతములైన భోగ్య పదార్థముల యెడల ఏవగింపు, రోత జనించుటయే వైరాగ్యము అనబడును.


సాధకుడు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే తాను చూడటము వలన మరియు వినటం వలన తెలుసుకోవలసినది ఏమిటంటే దేహము మొదలు అంటే సాధకుని శరీరము మొదలుకొని బ్రహ్మ దాకా వున్నవి అన్ని అశాశ్వితమని తెలుసుకొని వాటిమీద విరక్తి కలిగి వైరాగ్యభావన కలిగి ఉండవలెను. 


దేహము అనిత్యమని మనందఱకు తెలుసు ఎందుకు అంటే పైన తెలిపిన నియమము ప్రకారము దేహము కంటికి కనపడేది కాబట్టి. మరి బ్రహ్మ గురించి ఏమిటి అనే సందేహం వస్తుంది. నిజానికి బ్రహ్ (బ్రహ్మ దేవుడు) మన కంటికి కనిపించడు కాబట్టి మనకు బ్రహ్మ గురించిన వివరములు తెలియవు. ఇక బ్రహ్మలోకం కూడా మనకు తెలియదు. కానీ ఆది శంకర భగవత్పాదులవారు బ్రహ్మ కూడా అనిత్యమని తెలుపుతున్నారు. అంటే నేను పుణ్య కార్యాలు చేస్తాను పుణ్యలోకం అయిన బ్రహ్మ లోకం చేరుకుంటాను అని అనుకునే వారు తెలుసుకోవలసినది. బ్రహ్మలోకం కూడా శాశ్వితం కాదు అని మాత్రం. 


సాధకుడు ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో అప్పుడు వేదాంతంలోని ద్వితీయ చరణం అంటే వైరాగ్య స్థితిని పొందుతాడు. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః 


మీ 


భార్గవ శర్మ

[16/07, 4:28 pm] Cheruvela bhargava sarma: 16, జులై 2023, ఆదివారం

ముందు జాగ్రత్త


ముందు జాగ్రత్త


సమజంలో మనం రోజు ముందు జాగ్రత్త పరులను అనేకులను చూస్తూ ఉంటాం. నిజానికి నీవు నేను కూడా ముందు జాగ్రత్త పరులమే అవునా కాదా. ఒక విద్యార్థి సెలవుల తర్వాత పాఠశాల/కళాశాల తెరవగానే పరీక్షలకు చదవడం మొదలు పెడతారు ఎందుకు అంటే ఇప్పటినుంచి చదివితే కానీ నేను పూర్తి సిలబస్ సంపూర్ణంగా చదివి అర్ధం చేసుకోగలను. మొత్తం పాఠాలు నాకు క్షుణ్ణంగా వచ్చి ఉంటే ఏ ప్రశ్న పరీక్ష లో అడిగిన నేను సమాధానం చేయగలను అంటారు. 


ఒక గృహస్తు పంట రాగానే కొత్త బియ్యాన్ని ఒక యేటికి సరిపడా ఎక్కువ మొత్తంలో అంటే రెండు లేక మూడు క్వింటాళ్ల బియ్యం, ఒక 50 కిలోల కందిపప్పు కొనుక్కొని ఉంటారు ఎందుకయ్యా ఇలా కొన్నావు అంటే ఏం చేద్దాం ఏ సమయం ఎలావుంటుందో ఇంట్లో బియ్యం పప్పు ఉంటే చాలు ఏమున్నా లేకున్నా రోజులు గడిపేయవచ్చు అంటాడు. నీకు తెలుసా మొన్న కరోనా సమయంలో నా ఈ అలవాటే నన్ను కాపాడింది ఇంట్లో నుంచి కాలు బైట పెట్టకుండా మొత్తం కరోనా కష్టకాలాన్ని అవలీలగా ఎదుర్కున్నాను అని అంటాడు. ఆ మాట అన్నప్పుడు అతని ముఖంలో ఆత్మవిస్వాసం స్పష్టంగా గోచరిస్తుంది. 


ఒక వ్యవసాయదారుడు ఇంకా వర్షాకాలం రాకముందే భూమి దున్నుకొని పంట గింజలు నాటడానికి సిద్ధం చేసుకుంటారు. ఎందుకయ్యా ఇలా చేసావు అంటే వర్షం పడినప్పుడు దున్నడం అంటే కుదరని పని అదే ముందు భూమి దున్నుకొని ఉంచుకుంటే వర్షం పడగానే గింజలు చల్లవచ్చు అని అంటారు.


వేసవిలో కరెంట్ కోత ప్రతి వారు అనుభవించేదే అదే ముందు జాగ్రత్త పరుడు ఒక ఇన్వర్టర్ కొనుక్కొని వుంచుకుంటారు ఎందుకు అయ్యా ఇప్పుడు కరెంటు పోవడం లేదు అని అంటే ఎవరికి తెలుసు రేపు వేసవిలో కరెంట్ పోదని ముందుగా ఇన్వర్టర్ కొనుక్కొని ఉంటే రేపు కరెంటు పోతే అప్పుడు బాధపడే బదులు ఇప్పుడు తెచ్చుకుంటే మంచిది కదా అని అంటారు. 


తన కూతురు ఎదుగుతుంటే ఒక తల్లిదండ్రులు ముందు పెండ్లికి కావలసిన ద్రవ్యన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒక మంచి వరుడి కోసం అందరికీ చెప్పి ప్రయత్నం మొదలుపెడతారు. ఎందుకు అంటే ముందు ఒక మంచి సంబంధం చూసుకొని ఉంటే తమ కుమార్తె జీవితం సుఖమయంగా సాగుతుందని చెపుతారు. 


 


రేపు ఏదైనా ఉరుకు ప్రయాణం అయి పోవాలంటే ముందుగా రైలు లేక బస్సు టికెట్ రిజర్వ్ చేసుకొని ఒక రోజు ముందు తను తీసుకుని పోవలసిన సామాన్లన్నీ ఒక బ్యాగ్ లో, సూట్కేసులో సర్దుకొని సిద్ధంగా ఉంటారు. రైలు తెల్లవారుజామున 6 గంటలకు అయితే 4 గంటలకు అలారం పెట్టుకొని లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఒక అరగంట ముందు రైల్వే స్టేషన్ కి వెళ్లి ఉంటారు. ఇదంతా ముందు జాగ్రత్త కదా.  


 ఇలా వ్రాసుకుంటూ పోతే అనేకానేక విషయాలు మనకు నిత్యజీవితంలో బోధపడుతూవుంటాయి. నిజానికి ముందు జాగ్రత్త అనేది ఒక సమర్థవంతమైన మనిషి చేయాల్సిన పనే అదే ముందు జాగ్రత్త లేకపోతే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఒక విజయవంతమైన జీవితం గడుపుతున్న వాడు తన జీవితాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నడుపుతూ ముందు జాగ్రత్తలతో వుండి అనేక విజయాలను పొందగలుగుతారు. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ప్రతి మనిషి ముందు జాగ్రత్త కలిగి ఉండాలి అని. ఏ పరిస్థితి ఏ రకంగా వస్తుందో ముందుగా ఊహించి తదనుగుణంగా ముందు జాగ్రత్త పడటం అవసరం.


అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే మానవుడు ఒక్క విషయం తెలిసి కూడా జాగ్రత్త పడడు ఎందుకోగానీ ఈ విషయం మీద ఎంతో అజాగ్రత్తగా ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఏమిటి విషయం, ఏమిటి అజాగ్రత్త అంటే ఇంకా ఏమిటండి ప్రతి మనిషి ఆఖరు గమ్యం అంటే అర్థం కాలేదా అదే మరణం. ప్రతి మనిషి తన జీవిత అంతిమ ప్రయాణం మరణం అని తెలుసు అయినా దానికి సంబంధించిన ముందు జాగ్రత్త మాత్రం పడడు . తాత్కాలికంగా ఒకరోజు లేక్ ఒక వారమో వెళ్లే ప్రయాణికులు వారం రోజులనుండి సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు కానీ శాశ్వితమైన ప్రయాణానికి మాత్రం ఏమాత్రం ముందు జాగ్రత్త పడకుండా పూర్తిగా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ వుంటారు.


 


సాధక మిత్రమా భగవంతుడు మనకు ఇచ్చిన అపూర్వ అవకాశమే ఈ రోజు మనం పొందిన ఈ మానవ జన్మ ఈ జన్మను మనం సార్ధకం చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయకపోతే మరల మనకు మానవ జన్మ వస్తుందనే గ్యారెంటీ లేదు. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో ఏదైనా ఒక జీవిగా మళ్ళీ పుట్ట వచ్చు ఆ జన్మలన్ని అజ్ఞాన జీవనాన్ని గడిపేవి మాత్రమే. బుద్ధి జీవి గా వున్న మానవ జన్మ ఒక్కటే నీకు మోక్షసాధనకు పనికి వచ్చే జన్మ. ఈ జన్మను మనం వృధా చేసుకుంటే మోక్ష సిద్ది పొందటం దుర్లభం.


తెలివయిన వారు ఎప్పుడు దీపం ఉండగానే ఇల్లు సర్దుకుంటాడు. నీవు కూడా తెలివైన వాడిగా ప్రవర్తించు ఈ మానవ జన్మ ఉండగా ఈ జన్మ లక్ష్యం అయిన మోక్షాన్ని పొందు. ఇప్పటినుండి ప్రారంభిస్తే తప్పకుండా మనకు మోక్ష సిద్ధి కలుగుతుంది. అధవా కలగక పోయిన దైవానుగ్రహం వలన మరల మానవుడిగా నయినా జన్మించవచ్చు. కృష్ణ భగవానులు గీతలో స్పష్టంగా చెప్పారు యోగ భ్రష్టుడు తిరిగి తర్వాత జన్మలో తానూ ఈ జన్మలో ఎక్కడ సాధన నిలిపివేసారో అక్కడినుంచి మొదలుపెట్టి తన గమ్యాన్ని చేరుకుంటారని. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే నీ సాధనను ప్రారంభించు. మోక్షాన్ని సిద్దించుకో.


ఓం తత్ సత్


ఓం శాంతి శాంతి శాంతిః


ఇల్టు


మీ భార్గవ శర్మ

[17/07, 9:11 pm] Cheruvela bhargava sarma: ఓ హిందూ మేలుకో-2


ఈ రోజుల్లో మన సమాజంలో రోజు రోజుకు మన సాంప్రదాయాలమీద, మన ఆచారాల మీద ఆదరణ తక్కువ అవుతున్నది. దానికి కారణం ఏదయినా కావచ్చు. ముఖ్యంగా ప్రతి హిందువు తన ధర్మం ఏమిటి తన కర్తవ్యం ఏమిటి తన్ను తాను ఎలా ఉద్దరించుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించి తన దైనందిక జీవితాన్ని కొనసాగిస్తే ప్రతిహిందువు ఒక చక్కని వ్యక్తిత్వం వున్న ఆదర్శమూర్తిగా నిలుస్తాడు మన హిందూ ధర్మాన్ని కలకాలం నిలపటానికి తోడ్పడుతాడు.  



ప్రతి హిందువు తాను తన ధర్మాన్ని ఆచరించి తన పిల్లలకు ధర్మం పట్ల అవగాహన కలిగే విధంగా పిల్లలను పెంచవలసిన అవసరం ఉన్నది. పిల్లలకు మాటలు వచ్చే వయసునుండి దైవభక్తిని ప్రేరేపించాలి. చిన్న వయసు పిల్లలను కూడా దేవాలయాలకు తీసుకొనిపోయి దైవదర్శనం చేయించాలి. గుడిలో తీర్థప్రసాదాలను తీసుకోవడం, శఠగోపురం పెట్టించుకోవటం, మొదలైనవి అలవాటు చేయాలి.దేవుడిని అనగా గుడిలో విగ్రహం చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించడం అలాగే గుడిలో గంటను మ్రోగించటం పిల్లలతో చేయిస్తూ ఉంటే వారికి అది ఒక వేడుక లాగా అనిపించి తర్వాత కాలక్రమేణ ఒక చక్కటి అలవాటుగా మారుతుంది.

పెద్దలు కనిపించగానే తల్లిదండ్రులు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ పిల్లలు కూడా అలానే నమస్కరించటం నేర్పించాలి. నమస్కరించేటప్పుడు జై శ్రీరామ్ అనో లేక ఓం నమస్సివాయ అని సంబోధించడం ఒక మంచి సాంప్రదాయంగా చేసుకుంటే మంచిది.

ఎల్లప్పుడు మన హిందూ దేవీ దేవతల ఔన్నత్యాన్ని తెలిపే పురాణాలూ, రామాయణ, భారతాది ఇతిహాసాలు, భాగవతాది పురాణాలు వాటికి సంబందించిన గాధలు చదువుతూ పిల్లలకు చెబుతూ ఉండాలి. దానివలన పిల్లలకు బాల్యం నుండి మన హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు తెలుస్తాయి. మన ధర్మం యొక్క గొప్పతనాన్ని సదా పిల్లలకు తెలియజేయాలి

వేమన, సుమతి, కుమార, కాళహస్తీశ్వర, దాశరథి శతకం వంటివి సదా పిల్లలకు కంఠతా వచ్చే విధంగా నేర్పాలి. నీతి శతకాలు నేర్చిన బాలలు ఏది నీతి ఏది అవినీతి అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. తత్ ద్వారా చక్కటి క్రమశిక్షణ పరులుగా అవుతారు. అవినీతిని ఎదుర్కొనే ధైర్యాన్ని చిన్నప్పటినుండి అలవరచాలి.

తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శవంతులు గా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు తల్లిదండ్రులు లోను కాకూడదు. పిల్లలకు తల్లి మరియు తండ్రి ప్రేమలో లోపం లేకుండా పెంచాలి. పిల్లలు మా తల్లిదండ్రులు నాకు దొరకటం నా అదృష్టం అనే విధంగా మెలగాలి. చిన్నప్పటి నుండి వారి వారి వయస్సుకు తగినట్లుగా కుటుంబ బాధ్యతలు వారికి వప్ప చెప్పాలి. అది ప్రేమతో చేయాలి. చిన్ననాటి నుండి కుటుంబ బాధ్యతలు తీసుకున్న పిల్లలు రేపు పెద్ద అయిన తరువాత చక్కటి పౌరులుగా ఎదుగుతారు. దేశ అభివృద్ధికి దోహద పాడుతారు.

 

మన ఆచారాలను పాటిద్దాము, మన ధర్మాన్ని కాపాడుదాము. 


జై హిందూ జై జై హిందూ 


ఆచంద్ర తారార్కం మన ధర్మం వెలసిల్లేలా మనమంతా కృషి చేద్దాం.  


మార్పు నానుండే మొదలు అని ప్రతివారం ఉద్యమిద్దాం. 


జై శ్రీరామ్,జై శ్రీ కృష్ణ 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః 


ఇట్లు 


మీ 


భార్గవ శర్మ

[27/08, 1:56 pm] Cheruvela bhargava sarma: జంతూనాం నరజన్మ దుర్లభం అని వివేకచూడామణి లో శ్రీ ఆదిశంకరాచారులవారు వచించారు. అంటే జంతుకోటిలో అనగా 84 లక్షల జీవరాసులలో మనిషిగా పుట్టటం చాలా దుర్లభమైనది. అంతే కాకుండా ఇంకా ఆచారులవారు ఏమన్నారంటే 




జన్తూనాం నరజన్మ దుర్లభమ్ అతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్


వైదిక-ధర్మమార్గపరత విద్వత్త్వం అస్మాత్ పరమ


ఆత్మనాత్మవివేకనమ్ స్వనుభవో బ్రహ్మాత్మనా సస్స్థితిః


ముకీత్ర్ణో శతకోటిజన్మసు కృతైః పునైర్వినా లభ్యతే ॥




అంటే మనిషిగా పుట్టటం కన్నా పురుషునిగా పుట్టటం అందులోను బ్రాహ్మణుడుగా జన్మించి వైదిక్ ధర్మాన్ని ఆచరిస్తూ విద్యావంతుడు అయి ఆత్మాఅనాత్మ అనే వివేకముకలిగి స్వంతంగా బ్రహ్మజ్ఞ్యానం సముపార్జించటం అనేది తత్ద్వారా ముక్తిని పొందటం అనేది శతకోటి జన్మల సుకృతం కలిగి ఉంటే కానీ లభ్యం కాదు అని పేర్కొన్నారు. 




ఈ రోజుల్లో మనం చాలామందిమి దైవానుగ్రహం వలన బ్రాహ్మణులుగా అందునా పురుషులుగా జన్మించినాము. నిజానికి ఇలాంటి జన్మను పొందటం మన పూర్వజన్మ సుకృతం కాక మరొకటి కాదు. ప్రతి బ్రాహ్మడు తెలుసుకోవలసినది ఏమిటంటే మనకు ఈ జన్మే ఆఖరు జన్మ కావలి అని. అది ఎట్లాగ అంటే ఈ జన్మను మనం సార్ధకత చేసుకొని బ్రహ్మజ్ఞ్యాన సముపార్జన చేస్తే కచ్చితంగా అవుతుంది. ఈ సత్యం తెలుసుకోనుక అనేకమంది విప్రవర్యులు ఇతరులవాలె ఐహిక వ్యామోహాలకు సాంఘిక విషయ మొహాలకు బానిసలుగా మారి తమ విద్యుత్వ కర్తవ్యాన్ని మరచిపోతున్నారు. అలాంటి మన బ్రాహ్మణ సోదరులను తట్టి లేపి వారి ఘాఢనిద్రను వదిలించి కర్తవ్యోన్ముఖులను చేయవలసిన ధర్మం, ధర్మాచరణను ఆచరిస్తున్న ప్రతి శ్రోస్త్రియ బ్రాహ్మణుడి మీద వున్నది. కాబట్టి మనమంతా ఒక సంఘటితముగా మారి ప్రతి బ్రాహ్మణుడిని బ్రహ్మజ్ఞ్యాన సముపార్జనవైపు దృష్టిసారించే విధంగా పురిగొల్పి బ్రాహ్మణులను సత్బ్రహ్మణులుగా మార్చ ప్రయత్నం చేద్దాం. మరి అది ఎలా సాధ్యం అంటే ముందుగా ప్రతి బ్రాహ్మణుడు విధిగా " పంచ కట్టుడు పిలక పెట్టుడు చేయాలని" ఒక ఉద్యమంగా తీసుకొని అందరు బ్రాహ్మణులు పంచ కట్టటం నేర్చుకొని రోజు ఉదయం బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేచి కాని పరిస్థితుల్లో సూర్యోదయ కాలంలో నయినా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గాయత్రి మంత్ర జపం చేసే విధంగా ప్రాత్సహిద్దాం. 




ఇక రెండవ విషయం అందరము చక్కగా ముండనం చేసుకొని శిఖ ధారణ చేసే విధంగా ప్రాత్సహిద్దాం. ఈ రోజుల్లో చాలామంది బ్రాహ్మణులు శిఖాదారణ అటుంచి చక్కగా కేశాలకు, మీసాలకు రంగులు వేసుకొని నవ యవ్వనులుగా కనపడుటకు అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు. మిత్రమా ఇప్పుడు నీవు చేయవలసినది నీ వయస్సును కనిపించకుండా లోకానికి కనిపించటం కాదు నీవు పరిశుద్ధుడవు అయి లోకమాతకు (భవానీమాతకు) కనిపించే ప్రయత్నం చేయి. అప్పుడే ఆ తల్లి నిన్ను తన దారికి చేర్చుకొని ముక్తిని ప్రసాదిస్తుంది. దానికోసం విధిగా శిఖాదారణ చేసి నిత్యకర్మలను ఆచరించి బ్రహ్మజ్ఞ్యాన సముపార్జన చేసి ముక్తికోసం ప్రయత్నం చేయాలి.

[31/08, 9:12 pm] Cheruvela bhargava sarma: కర దండం 


గ్రామాలల్లో సాదారణ ప్రజలు ప్రతివారు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎక్కడికి వెళ్లినా చేతిలో కర్ర పట్టుకొని వెళ్లేవారు. వారు ఆ కర్రను అనేకవిధాలుగా వాడేవారు. ఏమైనా విషపురుగులు అంటే పాములు తేళ్లు మొదలైనవి వారి దారిలో కనపడితే వెంటనే ఏది వెతకాల్సిన పనిలేకుండా వాటిని హతమార్చేవారు. ఇక కుక్కలు లాంటి జంతువులు వారి చేతిలోని కర్రను చూసి వారి జోలికి వచ్చేవే కావు. మీరు గమనించి ఉండొచ్చు కుక్కలు ఒంటరిగా ఒకమనిషి కనపడితే గుంపులుగా వచ్చి దాడిచేస్తాయి. ఈ విషయం మనలో కొందరికి అనుభవం కలిగి కూడా ఉండొచ్చు. ముందుగా ఒక కుక్క వచ్చి అరుస్తుంది తరువాత మిగిలిన కుక్కలు ఎక్కడినుండి వస్తాయో తెలియకుండా వచ్చి దాడి చేస్తాయి. అదే నీ చేతిలో కర్ర ఉంటే మాత్రం అవి నీ జోలికి రావటానికి వెనకాడతాయి. అథవా నిన్ను చుట్టుముట్టిన వెంటనే నీవు నీ చేతికఱ్ఱతో నిన్ను నీవు కాపాడుకోగలవు. కాబట్టి చేతిలో కర్ర ఉండటం సదా క్షేమకరం. ఇక విషయానికి వస్తే....


సాధకా! రోజు నీ వెంట ఒక గుంపుగా కుక్కలు దాడి చేస్తున్నాయి. కానీ నీకు ఆ విషయం తెలిసినా కూడా నీవు వాటిని పరిగణలోకి తీసుకోక నీవు నేను రోజు ఆ కుక్కల దాడికి బలవుతున్నావు. సాధకుడు తన సాధనను ముందుకు సాగాలంటే తప్పకుండా ఈ కుక్కలగూర్చి తెలుసుకోవటమే కాక వాటినుండి ఎట్లా రక్షణ పొందాలో తెలుసుకోవాలి. ఇప్పడికే మీకు నేను దేనినిగూర్చి చెపుతున్నానో తెలిసే ఉంటుంది అదేనండి ఆ కుక్కలు యేవో కావు అవే అరిషడ్వర్గంగా పేరుపొందిన ఆరుగురు శత్రువులు. అరిషడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అని అర్థం. మన శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శత్రవులను జయించాలి. అవి యేమియనగా కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ప్రతి మనిషి మనస్సును ఈ ఆరు కలిసికాని లేక ఏ ఒక్కటో లేక ఒక్కటి కంటే ఎక్కువో చేరి కలుషితం చేస్తాయి. వీటిలో ఏ ఒక్కదానికి చిక్కినా సాధకునికి సాధన అస్సలు కుదరదు. సాధారణంగా మనం ఎవరైనా ఒక ముఖ్యమైన విషయం చెబుతుంటే కొన్ని సందర్భాలలో వాటి మీద నీవు శ్రద్ధచూపవు ఎందుకురా నేను ఇంతముఖ్యమైన దానిని చెపుతుంటే ఏమి ఆలోచిస్తున్నావు అని నీ మిత్రుడు అడిగితే ఏమిలేదురా ఈవేళ నా మనసెందుకో బాగా లేదని సమాధానం ఇస్తావు. నిజానికి నీ మనస్సు బాగా లేకపోవటానికి కారణం పైన తెలిపిన ఏదో ఒక శత్రువు దాడి కానీ నీవు ఆ విషయాన్ని గమనించవు. అదే నీవు గమనిస్తే వాటిని అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేస్తావు. మన పురాణాలలో, ఇతిహాసాలలో ఈ ఆరుగురు శత్రువుల వలన ఎవరు యెట్లా నష్టపోయారో చెప్పారు. కాబట్టి సాధక మేలుకో ఈ ఆరు కుక్కలను నీ మీద దాడి చేయకుండా నిరోధించే ప్రయత్నం చేయి. అకుంఠిత దీక్షతో తపస్సు సాగిస్తున్న విశ్వామిత్ర మహర్షికి మేనక సాంగత్యంతో తపోభంగం కలిగిన విషయం మనకు విదితమే. ఇప్పుడు సాధకుల సాధనను భంగపరచటానికి దేవలోకం నుంచి మేనక దిగి రానవసరం లేదు ఏ సాధారణ స్త్రీ అయినా చాలు. ఇలా వ్రాస్తున్నందుకు ఏమి అనుకోవలదు. ఎందుకంటె మనం చేసే సాధన అంతబలహీనంగా వున్నదని నా భావన. 


మరి ఈ ఆరుగురు శత్రువులను పారదోలే దండం ఎక్కడ వున్నది అది నాకు దొరుకుతుందా అని అడగవచ్చు. అది నీ దగ్గరే వున్నది కానీ నీవు దానిని ఉపయోగించటం లేదు ఏమిటి అది అంటే అది మరేమో కాదు నిత్యం దైవ చింతనం. ఎప్పుడైతే సాధకుడు దైవచింతనంలో నిమగ్నుడై ఉంటాడో వాని చెంతకు ఈ ఆరుగురు శత్రువులల్లో ఏ ఒక్కరు కూడా దాడి చేయటానికి సాహసించరు. ఎందుకంటె అన్నిరకాల శత్రువులను ఎదుర్కునే కరదండం దైవచింతన మాత్రమే ఇది సత్యం. అందుకే ప్రతి క్షణం దైవచింతన చేయాలని పెద్దలు వక్కాణిస్తున్నారు. 


సాధకుడు సదా ఈశ్వర జ్యానంలో ఉంటే ఎట్టి పరిస్థితిలోను మనస్సు అరిషడ్వర్గం మీదికి పోదు. అథవా పోయిన వెంటనే తన తప్పు తాను తెలుసుకొని దైవత్వం వైపు నడుస్తుంది. కాబట్టి మిత్రమా ఎల్లప్పుడూ నీ మనస్సును ఆ దేవదేవుని మీదనే వుంచు. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించు. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః

[06/11, 10:10 am] Cheruvela bhargava sarma: ప్రత్యక్ష ప్రమాణం: 


ప్రత్యక్షం అనే పదానికి అర్ధం మనం ఇంద్రియాలద్వారా ఒకదాని ఉనికిని తెలుసుకోవటం అంటే నీ ముందు రామారావు నిలుచున్నడనుకోండి మీరు రామమారావుని ప్రత్యక్షముగా చూస్తున్నారు, అతని మాటలు మీ చెవులతో వింటున్నారు, అతను రాసుకున్న సెంటు వాసన మీ ముక్కుతో గ్రహిస్తున్నారు, అతని చేతిని మీ చేతితో కరచాలనం చేసి స్పృశిస్తున్నారు ఇలా మీరు మీ ఇంద్రియ జ్ఞానం తో రామారావుని తెలుసుకోవటాన్ని ప్రత్యక్ష జ్ఞ్యానం అంటారు వీటివలన మీకు నీ ఎదురుగా రామారావు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది ఆలా నిర్ధారణ కావటమే ప్రత్యక్ష ప్రమాణం 


అనుమాన ప్రమాణం 

ఇది ప్రత్యక్ష ప్రమాణానికి దోహదం చేసే ప్రమాణం. మీరు అడివిలో వెళుతున్నారనుకోండి దూరంగా మీకు ఆకాశంలో పొగ కనబడిందనుకోండి అప్పుడు మీరు ఆ పొగ వలన అక్కడ నిప్పు వుండివుండొచ్చని తలుస్తారు. ఎందుకంటె మీకు పొగ కేవలం నిప్పుద్వారానే వస్తుందనే జ్ఞ్యానం వుంది. కాబట్టి అక్కడ నిప్పు వున్నదనుకోవటం అనుమానప్రమాణం . అడివిలో నిప్పు ఉండటానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ ఎవరో మనుషులు నిప్పు రాజేసి ఉండొచ్చు అంటే అక్కడ మనుషులు వుండివుండొచ్చు అనేది కూడా అనుమానప్రమాణమే. 

కార్య కారణ సంబంధము: 

మన ముందున్న ప్రతి కార్యానికి (పనికి) కారణం (పనిచేసిన వాడు) ఉండొచ్చు అనేది ఒక అనుమాన ప్రమాణం. మీ ముందు ఒక ఇల్లు ఉందనుకోండి అంటే ఆ ఇల్లు కట్టిన కూలివాళ్ళు, మేస్త్రీలు, ఇంజనీరులు వుండివుంటారు అనేది అనుమాన ప్రమాణం. అంటే ప్రతి కార్యానికి ఒక కారణం లేక కారకుడు వుంటారు. మీరు ఒక హోటలులో రుచికరమైన ఫలహారం తిన్నారనుకోండి ఆ ఫలహారం మీకు రామారావు వడ్డించాడనుకోండి అప్పుడు మీరు దాని రుచిని ఆస్వాదిస్తే దానిని తయారుచేసిన వంటివారు ఎవరు అని విచారిస్తారు. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ఫలహారం ఎవరో తయారు చేస్తే కానీ నీ వద్దకు రాలేదు. అది తయారుచేసిన వాడు నీకు తెలిసిన లేక తెలిసిరాకపోయిన అతను మాత్రం వున్నాడు అతను లేకుండా మాత్రం నీ వద్దకు అది రాలేదన్నది నిజం. 

భగవంతుడు ఎలా వున్నాడు: 

మనం మన ఇంద్రియాలతో ప్రత్యక్షంగా ఈ జగత్తుని (ప్రపంచం, విశ్వము) చూస్తున్నాము అంటే ఇది ఒక కార్యం అంటే ఈ కార్యాన్ని చేసిన కారణం అంటే కారకుడు వుండివుండాలి ఆ కారకుడు నీకు గోచరించవచ్చు లేక గోచరించక పోవచ్చు కానీ అతను వున్నాడన్నది మాత్రం నిజం (ఇక్కడ అతను అంటే పురుషుడు అని అర్ధం కాదు కేవలం కారణమైనది అన్న భావం తీసుకోవాలి) 


ఇంకా మనం ఈ ప్రపంచంలో ఒక నియమాన్ని చూస్తున్నాము అది నిన్న మనం విత్తనంగా ఉన్నదానిని భూమిలో నాటంగానే రేపు మొక్కగా తరువాత చెట్టుగా, చెట్లకు పువ్వులు, కాయలుగా మనం చూస్తున్నాం. ఈ మొత్తం క్రమ పద్దతిలో వృద్ధి కావటానికి కారణం అంటే ఈ మొత్తం ప్రోగ్రాం తయారు చేసింది ఎవరు, అని ఆలోచిస్తే ఎవరో ఒకరు తప్పకుండ వుండివుండాలని తెలుస్తుంది. ఆలా ఉండివున్న వానినే మన మహర్షులు వారి దివ్య జ్ఞాణంతో "భగవంతుడు" అని తెలుసుకొని మనకు తెలిపారు.

Linken


 

Jewelry


 

Tricycle


 

 *దేశం గెలవాల్సింది...*

 *స్టేడియాల్లో కాదు...* 

*పచ్చని పొలాల్లో...*


🌱🍅🌰🍠🥔🌶🌽🍆


వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందేమోనని భయపడే 

దేశ భక్తులారా.... 

ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా.... 

ఒక్కసారి ఆలోచించండి...


దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ 

పట్టించుకుంటున్నావా.......


🍅🍅🍅


ఇష్టమయిన క్రికేటరెవరో 

వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు,  

నీకు తెలిసిన రైతు ఎవరైనా 

వంద బస్తాలు పండించాలని 

ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా.....


🍏🍏🍏


రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే 

నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?....


🌽🌽🌽


దేశాన్ని గెలిపించడానికి 

కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే ,

టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.

దేశాన్ని బతికించే 

నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్ 

అనే ఆందోళన నీకుందా ?...


🌶🌶🌶


నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను 

నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్

నిన్ను బతికించే రైతులకెవరూ 

ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా....


🥕🥕🥕


నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ

నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో 

ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా......


🍆🍆🍆


అన్నం తింటూ కూడా ..

పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని 

నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .

అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో 

విదేశి దిగుమతి బియ్యమో తెలుసా.....


🍋🍋🍋


ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో 

చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్

వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో 

ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని

అసలెప్పుడయినా పట్టించుకున్నావా.....


🍠🍠🍠


ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన 

నీకు 

రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా ....


🥒🥒🥒


🍍🍍🍍


ఎప్పుడయినా ,

గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తూ

లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా.....


🍇🍇🍇


ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు 

రాజ్యం , దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా.


🍈🍈🍈


కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కు పోయినట్లు 

రైతుల గురించి చర్చా కార్యక్రమాలు  ఏనాడైనాచూసావా... ?


🥜🥜

🍊🍊🍊


పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం 

కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం....


🌿🌿

🐓🐓🐓


ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు 

పచ్చని పోలాల్లో ....

అందుకు 

రైతులు నాటౌట్ గా నిలవాలి...🙏💐🌾🎋

ళుభోదయం🙏🏼