21, నవంబర్ 2023, మంగళవారం

పెరియ పురాణం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 05*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *5. విరన్మిండ నాయనారు*


తిరుచెంగున్రూరు అనే గ్రామం ఒకటి ఉంది. వేలాళర్ కులాన్ని

ప్రకాశింపజేయడానికో అన్నట్లు విరన్మిండ నాయనారు ఆ గ్రామంలో

అవతరించాడు. బాల్యం మొదలుకొని అతడు శివ భక్తులపై అంతులేని

ప్రేమాభిమానాలను కలిగి ఉండేవాడు. ఆయా పుణ్యక్షేత్రాలలోని

శివాలయాలను దర్శించి నాయనారు శివుని భక్తితో సమర్చిస్తూ వచ్చాడు.


ఒక పర్యాయం తిరువారూరికి వెళ్లి వన్మీకనాథునికి విరన్మిండ

నాయనారు ప్రణమిల్లాడు. ఆ సమయంలో సుందరమూర్తి నాయనారు

తిరువారూరు దేవాలయంలో అడుగుపెట్టారు. అక్కడి దేవాసిరియ

మండపంలో శివభక్తులు గుమికూడి ఉన్నారు. వారికి మొదట నమస్కరించక

ఒక పక్కగా వైదొలగి పోతున్న సుందరులనుచూచి విరన్మిండ నాయనారు

ఇతడు మాకు జన్మ విరోధి" అని ప్రకటించాడు. 


“ఈ విధంగా శివ భక్తులను

అవమానించడం వలన ఇతడు శివునికి కూడ విరోధిగా

పరిగణింపబడుతాడు" అని ఎలుగెత్తి పలికాడు. ఈ మాటలను సుందరులు

విన్నారు. వెంటనే తన తప్పును తెలుసుకొన్నారు. శివభక్తుల మాహాత్మ్యాన్ని

'తిరు తొండ తొగై’ అనే గ్రంథంగా రచించాడు. అప్పుడు పరమేశ్వరుడు

సంతోషించి “మేము ఎల్లప్పుడూ భక్తుల హృదయాలను ఆవాసంగా చేసుకొని

ఉంటాము" అని అందరూ వినేలా ఎలుగెత్తి ప్రకటించాడు. 


ఈ విధంగా పవిత్రమైన తిరు తొండ తొగై అనే గ్రంథాన్ని సుందరులచే రచింపజేయడానికి

కారణమైన విరన్మిండ నాయనారు శివభక్తులకు సదా సేవచేస్తూ శివగణాలకు

నాయకుడై పరమేశ్వరుని తిరు చరణాల సన్నిధిని సేవచేసే భాగ్యాన్ని పొందిన

వాడయ్యాడు.


    *ఐదవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: