21, నవంబర్ 2023, మంగళవారం

శివానందలహరీ – శ్లోకం – 6*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 6*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః*

*పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ |*

*వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా*

*పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః   6*


కుండగానీ , మట్టిముద్దగానీ , పరమాణువుగానీ , పొగగానీ , నిప్పుగానీ , పర్వతముగానీ , వస్త్రముగానీ , దారముగానీ  ఇవేమీ భయంకరమయిన మృత్యువు నుండీ కాపాడలేవు . అందుకే ఓ మంచిబుద్ధి కలవాడా ! పైన చెప్పిన తర్కశాస్త్రమునందలి మాటలతో వృథాగా కంఠక్షోభం కలిగించుకొనక , శంభుని యొక్క పాదపద్మములను సేవించి , శీఘ్రముగా శివసాయుజ్యమును పొందుము.

(తర్కాది శాస్త పరిజ్ఞానము చిత్తశుధ్ధికీ, ఆత్మజ్ఞానమునకూ దోహదపడాలి. అటుకాని కేవల శాస్త్రపరిజ్ఞానము వ్యర్థమని శంకరాచార్యుల ఉపదేశం)


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: