7, జులై 2021, బుధవారం

చరిత్రకి వక్ర భాష్యం..

 *చరిత్రకి వక్ర భాష్యం...* 

 *ఘనత వహించిన  మన తొలి ప్రధాని* *నిర్వాకం* ...


********************************

 *"* *జీవన శైలి విషయంలో నేను క్రైస్తవుడిని, ధరించే దుస్తుల విషయంలో నేను ముస్లింని, కానీ దురద్రుష్టావత్తు నేను పుట్టుక ప్రకారం నేను హిందువుని* "

- *జవహరలాల్ నెహ్రు*

 *భారత తొలి ప్రధాని* 

*********************************


*మనం చదువుతున్నది నేరచరిత్ర* ...



🙏🌹🕉️🌹🙏


 *మీ వైపు నుంచి ఏదైనా సూచనలూ..సలహాలు..ఆధారాలు ఉంటే ఈనెల 15 వ తారీఖు లోపు ఈ క్రింది మెయిల్ కు పంపగలరు..* 


 *rsc_hrd@sansad.nic.in* ..


 *చరిత్రకి వక్ర భాష్యం...* 

 *ఘనత వహించిన  మన తొలి ప్రధాని* *నిర్వాకం* ...



*********************************

 *మన భారతదేశ నిజ చరిత్ర విషయంలో క్షమించరాని తప్పులతో కూడిన చరిత్రను నేడు మనం చదువుకునే విద్యావిధానంలో వున్నందుకు చాలా మంది మెకాలే అనే బ్రిటీష్ తెల్లకుక్క నీచుడు చేసిన విద్యావ్యవస్థ అని నిందింస్తాంరు...,* 

 

 *కానీ 1946 లోనే మెకాలే విద్యావిధానం రద్దు అయ్యుంది* .


 *మరి ఈ చరిత్రను తప్పుగా ఆనాడు మన విద్యావ్యవస్థలో చేర్చి నేటికీ మనచేత చదివింస్తున్న వారు ఎవరు?* 


 *అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.* 


 *దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మన విద్యావిధానం ఎలా వుండాలి,* 


 *విద్యార్దులు చదివే చరిత్ర పుస్తకాలలో ఈ దేశం యెుక్క పూర్వ వైభవం ఎలా వుండేది,* 


 *ఎవరు ఈ దేశం మీద దాడులు చేసారు?*


 *ఏ యుద్ధం ఎందుకు జరిగింది?* *అందులో ఎవరు గెలిచారు?*


 *వాస్తవానికి ఎవరు గొప్ప?* 

 *ఎవరు నీచులు?*


 *అనే విషయాలను చర్చించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఓక కమిటీని ఎర్పాటు చేసాడు మన నెహ్రూ గారు.*


 *ఆ సభ్యులు వీరు :*


1) *నూరుల్లా హసన్,అనే ముస్లిం.ఇతను అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్ (మరియు బెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేసాడు)*


2) *ఇర్ఫాన్ హబీబ్,అనే ముస్లిం. ఇతను కూడా అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫ్రొఫెసర్*


3) *రోమిల్లా థాఫర్ అనే క్రైస్తవ మహిళ*


 *ఆనాడు ఈ కమిటి నిర్ణయించి రాసిన వర్గీకరణ తప్పుల చరిత్రను నేడు మనం చదువుతున్నాం. ఇదీ మన దురద్రుష్టం అంటే! ఎందుకంటే ముగ్గురిలో ఒక్కరైనా హిందువు వున్నాడా?*


 *లేరు మరి ఎందుకు లేరు అని ఆలోచించండి!*


 *విద్యావిధానం కమిటిలోనే హిందువులు లేకపోవడమే మన దురద్రుష్టం అనుకుంటే ఇక ఇప్పుడు చూడండి ఏకంగా మన దేశ మెుదటి విద్యాశాఖ మంత్రిని ఎవరిని నియమించాడో తెలుసా మన నెహ్రూ గారు, సౌదీ అరేబియా లోని మక్కా నగరంలో పుట్టిన అబ్దుల్ కలాం ఆజాద్ అనే ముస్లింను ఇదీ మన దేశ దౌర్భాగ్యం.* 


 *ఇతని పూర్తిపేరు మౌలానా సయ్యద్ అబ్దుల్ కలాం గులామ్ మోయునోద్దీన్ హైమోద్దీన్ ఖైరోద్దీన్ అల్ హుస్సేన్* 

 *ఇతను మన భారతదేశ నిజమైన చరిత్రను తప్పుగా వక్రీకరించి "ఇండియా విన్ ప్రీడమ్" అనే పుస్తకాన్ని రాసి మెుదటి ఎడిషన్ ప్రింట్ కూడా తీసాడు....*


 *కానీ అసలు చరిత్రను తెలిపే 30 పేజీల సమాచారాన్ని మాత్రం రహస్యంగా దాచిపెట్టి తను చనిపోయాక మెుదటి ఎడిషన్ కు ఈ దాచిపెట్టిన 30 పేజీలను జతచేసి ప్రింట్ చెయ్యండని తన వీలునామాలో రాసుకున్నాడు తను ఆనాడు ఇలా తప్పు చెయ్యడానికి అప్పుడున్న పరిస్థితుల కారణంగా మరియు కొందరి ఓత్తిడుల వలన అలా చరిత్రను తప్పుగా వక్రీకరించి రాయవలసి వచ్చిందని, ఓక ముస్లింగా నిజాయుతీ లేకపోకే నరకానికి పోతాడన్న మతనమ్మకంతో ఈ అసలు విషయం నా వీలునామాలో రాస్తున్నాను అని చెప్పుకున్నాడు ఇలా* *ఓత్తిడి తెచ్చి చరిత్రను తప్పుగా వ్రాయుంచడానికి ప్రయత్నించిన వారు ఎవరై వుంటారో మీరే ఆలోచించండి.*


 *ఇక ఇతను చనిపోయిన 30సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు అనుమతితో తన వీలునామా ప్రకారం ఆ 30పేజీలను రెండో ఎడిషన్ బుక్ లో2009 వ సంవత్సరంలో జతచేసి ఓరియంటెడ్ పబ్లికేషన్స్ ద్వారా ప్రింట్ చేసారు మార్కెట్ లో రెండు ఎడిషన్లూ అందుబాటులో వున్నాయు* *చదవగలరు* .


 *పై ఈ నలుగురి కారణంగానే నేడు మనం, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దోపిడీ దొంగలైన బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకూ వున్న దోపిడీదోంగలను గొప్ప మెుఘల్ చక్రవర్తులగా మనమే చదువుతున్నాం,* *కానీ ఔరంగజేబ్ తోడబుట్టిన అన్న అయిన "ధారాశిఖో" గురించి చెప్పరు, ఎందుకంటే ఇతను వేదాలను అన్ని భాషలలో అనువదించి ప్రపంచానికి అందించాడు కాబట్టి, అందుకే ఇతని ఔరంగజేబ్ చంపాడు.*


 *ఎంత సిగ్గుచేటో ఆలోచించండి. ఘజనీ మమ్మద్ గాడిని 17 సార్లు ప్రుద్వీరాజ్ ఛౌహాన్ ఓడించాడు కానీ చంపకుండా దయతలచి ప్రాణభిక్ష పెట్టి వదిలేసాడని చెప్పుతారా?*


 *చెప్పరు ప్రుద్వీరాజ్ ఛౌహాన్ ను  మమ్మద్ ఘోరీ ఓడించాడంచారు, అక్భర్ మహాన్ అంటారే కానీ రాణీదుర్గావతి అనే మహిళ చేతిలో మూడుసార్లూ ఓడిపోయాడని చెప్పుతారా? చెప్పరు* .


 *మహావీర్ రాణా ప్రతాప్ సింగ్ తో తలపడటానికే భయపడే అక్భర్ హల్దిఘాట్ యుద్ధంలో పాల్గోనలేదని చెప్పుతారా? చెప్పరు మరి అక్భర్ ఎలా మహాన్ అవుతాడు ఇలా చెప్పుకుంటూ పోతే స్వాతంత్ర్య పోరాటంలో 21 లక్షల ప్రాణత్యాగం గురించి చెప్పరు కానీ* *ప్రతీదానికీ నిరాహారదీక్ష చేసే గాంధీ గురించి చెప్పుతారు కానీ దేశంకాని దేశానికి వెళ్ళి 60వేల అజాద్ హింద్ ఫౌజ్ సైన్యంతో ఆంగ్లేయుల మీద విరోచితంగా పోరాడి తన 26వేల సైన్యం రక్తం ధారపోసి ప్రాణత్యాగం చేసి స్వాతంత్ర్యాన్ని సంపాదింస్తే ఆ మహానుభావుడు వార్ క్రిమినలా అంటే యుద్ధ ఖైదీనా అతను దోరికితే బ్రిటిష్ వారికి అప్పజెప్పుతామని ఒప్పందం చేసుకోవడమా?*


 *ఇక గాంధీ గురించి "కత్తి, ఢాలూ వాడకుండా ఓక్క చుక్క రక్తం చిందించకుండా మాకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించావు సాబర్మతీ ఆశ్రమంలో వున్న ఓ సాధువు నీవెంత గోప్పనాడివని గాంధీని పోగుడుతూ సినిమా పాటనా?మరి 26 వేల ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల ప్రాణత్యాగం,21 లక్షల ప్రజల ప్రాణ త్యాగం ఏమైనట్టు, భగత్ ,సుఖ్ దేవ్, రాజ్ గురు ,ఆజాద్, అల్లూరి లు తీవ్రవాదులని చెప్పుతారా ,ఇలా భారతదేశం అంటే కేవలం 700 సంవత్సరాలు పరిపాలన చేసిన మెుఘల్ రాజుల గురించి తప్పితే, మౌర్యుల చరిత్ర లేదు,శాతవాహనుల చరిత్ర లేదు, శివాజీ చరిత్ర లేదు,శాతకర్ణుల చరిత్ర లేదు,కాకతీయుల చరిత్ర లేదు, 2000 సంవత్సరాల క్రితమే ప్రపంచంలో వున్న అన్ని దేశాల ప్రజలకూ నలందా, తక్షశిల అనే విశ్వవిద్యాలయాల ద్వారా విద్యనందించిన గొప్ప మన భారత దేశాన్ని 1400 సంవత్సరాల కింద పుట్టిన మతాన్ని ఆచరించే వారు ఈ దేశానికి నాగరికత నేర్పారని నేడు మన చేతనే చదివింస్తున్నారంటే దానికి కారణం పైన చెప్పిన నలుగురు*


 *వీరి వెనుకాల వున్నది మన నెహ్రూ గారే అనడంలో ఏ సందేహమూ లేదు.*


 *ఎందుకంటే జీవన శైలి విషయంలో నేను క్రైస్తవుడిని, ధరించే దుస్తుల విషయంలో నేను ముస్లింని, కానీ దురద్రుష్టావత్తు నేను పుట్టుక ప్రకారం నేను హిందువుని అని తన హిందూధర్మం గురించి చులకనగా మాట్లాడే నెహ్రూ ముస్లింలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అర్థం అయ్యుందా?*


 *ఇకనైనా మన నిజ చరిత్ర మన పిల్లలకు తెలియజెప్పుద్దాం.మన దేశాన్ని,మన ధర్మాన్ని కాపాడుకుందాం.*


🙏🌹🕉️🌹🙏

ఔషధ అర్క పత్రం*

 *ఔషధ విలువల మొక్కలు*


.              *అర్క పత్రం*


హాలాహల బిందువొకటి

పాలకడలి నురుగుల బడ పాషాణమయెన్

లీలను అర్కంబుగ నా

నీలగ్రీవు తనయుండు నేలను చేర్చెన్


పాలసముద్రాన్ని మధించి నపుడు హాలాహలం ఉద్భవించడం, శివుడు ఆ గరళాన్ని గ్రోలి తన కంఠాన దాల్చడం అందరూ ఎరిగినదే... ఆ గరళం లోని ఒక చుక్క పాలసముద్రంలో పడగా, చిలుకుతున్న నురుగులో కలిసి సముద్ర జీవులన్ని మరణిస్తున్నాయట. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆ నురుగను ఒడ్డుకు మళ్లించగా ఒక మొక్కగా రూపు దాల్చింది. (ఇప్పటికీ జిల్లేడు విత్తనం నీటి బొట్టు ఆకారంలో ఉండటం మనం గమనించవచ్చు).  జీవులకు హాని చేయవద్దని దానికి చెప్పి, సూర్యకిరణాలతో ఆ విషాన్ని విరిచి, పూజార్హత కల్పించాడట గణేశుడు. అంతే కాకుండా వైద్యానికి పనికి వచ్చే విధంగానూ, ముదిరిన జిల్లేడు వేరులో తన రూపు వచ్చే విధంగానూ, తనకు నచ్చిన ఉండ్రాళ్ళను జిల్లేడు కాయల ఆకారంలో చేసి నైవేద్యం పెట్టే విధంగా అనుగ్రహించాడట. సూర్యుడు కూడా రధసప్తమి నాడు జిల్లేడు ఆకులు తలపై దాల్చి, స్నానం చేసిన వారికి ఆయురారోగ్యాలు సమకూరుతాయని వరమిచ్చాడట. ఆనాటి ఆ అర్కమే నేటి జిల్లేడు. (ఇంటి పరిసరాలలో జిల్లేడు మొక్క నలుపైనా, తెలుపైనా పెరిగితే,

అద్భుత సంస్కృత విన్యాసము

 Best Sanskrit wonder

అద్భుత సంస్కృత విన్యాసము

🙏🙏🙏

अहिः = सर्पः

अहिरिपुः = गरुडः

अहिरिपुपतिः = विष्णुः

अहिरिपुपतिकान्ता = लक्ष्मीः

अहिरिपुपतिकान्तातातः = सागरः

अहिरिपुपतिकान्तातातसम्बद्धः = रामः

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ता = सीता

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरः = रावणः

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयः = मेघनादः

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्ता = लक्ष्मणः

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदाता = हनुमान्

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजः = अर्जुनः

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखा = श्रीकृष्णः

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतः = प्रद्युम्नः

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतः = अनिरुद्धः

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतकान्ता = उषा

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतकान्तातातः = बाणासुरः

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतकान्तातातसम्पूज्यः = शिवः

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतकान्तातातसम्पूज्यकान्ता = पार्वती

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतकान्तातातसम्पूज्यकान्तापिता = हिमालयः

अहिरिपुपतिकान्तातातसम्बद्धकान्ताहरतनयनिहन्तृप्राणदातृध्वजसखिसुतसुतकान्तातातसम्पूज्यकान्तापितृशिरोवहा = गङ्गा, सा मां पुनातु इत्यन्वयः |



🙏🙏🙏

అహిః = సర్పః

అహిరిపుః = గరుడః

అహిరిపుపతిః = విష్ణుః

అహిరిపుపతికాంతా = లక్ష్మీః

అహిరిపుపతికాంతాతాతః = సాగరః

అహిరిపుపతికాంతాతాతసంబద్ధః = రామః

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతా = సీతా

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరః = రావణః

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయః = మేఘనాదః

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయనిహంతా = లక్ష్మణః

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయనిహంతృప్రాణదాతా = హనుమాన్

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయనిహంతృప్రాణదాతృధ్వజః = అర్జునః

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయనిహంతృప్రాణదాతృధ్వజసఖా = శ్రీకృష్ణః

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయనిహంతృప్రాణదాతృధ్వజసఖిసుతః = ప్రద్యుమ్నః

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయనిహంతృప్రాణదాతృధ్వజసఖిసుతసుతః = అనిరుద్ధః

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయనిహంతృప్రాణదాతృధ్వజసఖిసుతసుతకాంతా = ఉషా

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయనిహంతృప్రాణదాతృధ్వజసఖిసుతసుతకాంతాతాతః = బాణాసురః

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయనిహంతృప్రాణదాతృధ్వజసఖిసుతసుతకాంతాతాతసంపూజ్యః = శివః

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయనిహంతృప్రాణదాతృధ్వజసఖిసుతసుతకాంతాతాతసంపూజ్యకాంతా = పార్వతీ

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయనిహంతృప్రాణదాతృధ్వజసఖిసుతసుతకాంతాతాతసంపూజ్యకాంతాపితా = హిమాలయః

అహిరిపుపతికాంతాతాతసంబద్ధకాంతాహరతనయనిహంతృప్రాణదాతృధ్వజసఖిసుతసుతకాంతాతాతసంపూజ్యకాంతాపితృశిరోవహా = గంగా, సా మాం పునాతు ఇత్యన్వయః |





Adding letter gives the addflaver.... Beauty of sanskrit

నాకే ఎందుకు ఈ కష్టాలు

 *దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటే, జీవితంలో ఎవరు దుఃఖించరు*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


&ఈ ప్రశ్న లోతు అర్ధం అయితే మీరు జీవితంలో దుఃఖించరు! దుఃఖం మీ దరిదాపుల్లోకి రాదు! సమాధానం తెలిస్తే చెప్పండి!. 

కాని మీరు కూడా ఆలోచించండి!*


*పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం, అజ్ఞాత వాసాలు చేయడంలో అంతర్యం ఏంటి? ఈ ప్రశ్న ప్రతిఒక్కరు వేసుకోవలసినది..*


*1. పాండవులు మాయజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులపాలు అయ్యారని అందరికి తెలిసిందే. అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా పాండవులను కలుసుకోవడానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని ధర్మరాజు "జూదం ఆడేటప్పుడు మమ్మల్ని ఎందుకు కాపాడలేదు" అని ప్రశ్నిస్తాడు. అందుకు సమాధానంగా కృష్ణుడు "నేను ఆ రోజు అక్కడలేను, సాల్వుడు అనే రాజుతో మాయ యుద్ధం చేస్తున్నాను (6 నెలల పాటు ఆ యుద్ధం జరిగింది) నాకు కానీ ఆ విషయం తెలిసుంటే అలా జరగనిచ్చేవాడిని కాను" అన్నాడు. (ఆసర్వంతర్యామికి జూదం సంగతి తెలియదంటారా?).*


*అసలు ఈ పాండవులు, శ్రీకృష్ణుడు వచ్చిందే భూమిపై దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం. కానీ పాండవులు మానవులు కావడంచేత శక్తులుకానీ, కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడానికి సరైన ఆయుధాలుకానీ ఏమీలేవు. ఉన్నది ఒక్కటే 'ధర్మం'.. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో వీళ్ళని నిలబెట్టింది ధర్మమే. కాని అలాగే కొనసాగితే ధర్మం పేరుతో భ్రష్టులు అయిపోతారు. ధర్మాన్ని అన్ని కోణాల్లో ప్రయోగించాలి. అలాచేయాలంటే బలం, బలగం, ఆయుధ సంపత్తి, అస్త్ర, శస్త్రాలు, దైవబలం మెండుగా ఉండాలి. కాని ఆడిన మాట కోసం అడవుల పాలైన పాండవులు రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామంలో గెలవడం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అసాధ్యం. అందుకే శ్రీకృష్ణుడు తన మాయని ప్రదర్శించాడు. తాత్కాలిక కృష్ణమాయ కల్పించాడు. వస్త్రాపహరణం సమయంలో ద్రౌపతి శ్రీకృష్ణ స్మరణ చేయగానే వచ్చి వస్త్రాలు ఇచ్చాడు. మరి అక్కడే ఉన్న ధర్మరాజు అదంతా చూసికూడా శ్రీకృష్ణుడిని తలచుకోలేకపోయాడు.*


(ఇదే మాయ అంటే).


*అటుపక్క భీష్ముడు లాంటి యోధుడు (21సార్లు క్షత్రియుల మీదకి దండెత్తి క్షత్రియ వంశాన్ని నిర్మూలం చేసిన ధీరోదాత్తుడు, పరశురాముడిని ఓడించిన మహావీరుడు), పరశురాముడి వద్ద శిష్యరికం చేసి కౌరవుల, పాండవులకు శిక్షణ ఇచ్చిన వీరాధి వీరుడు. ఎలాంటి అస్త్ర శస్త్రాలనైనా అలవోకగా ఎదుర్కోగల ద్రోణుడు ఒకప్రక్క. పుట్టుకతోనే కవచంతో పుట్టిన కర్ణుడు(ఈ కవచాన్ని భేదించాలంటే మానవమాత్రుడి వల్ల కాదు! దైవబలం పుష్కలంగా ఉండాలి). కపటి శకుని, పుత్రప్రేమతో తపించిపోయే దృతరాష్ట్రుడు, అన్నకోసం దేనికైనా తెగించే దుశ్శాసనుడు వీళ్ళు ఒక పక్క*


*ఇంతటి వీరులైన వీరందరిని ఓడించాలి. వీరికి సామంతులు మహాబలవంతులు. వీరిని ఓడించి ధర్మాన్ని నిలబెట్టాలంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్న శక్తి చాలదు. కనుక వీరిని పుటం పెట్టిన బంగారంలా, సానబెట్టిన వజ్రంలా తయారుచేసి శత్రువుల మీదకి సంధించాలి. అప్పుడే విజయం వరిస్తుంది. అందుకే మనకి పైకి శ్రీకృష్ణుడు తోడు ఉన్నా పాండవులు అడవుల పాలయ్యారు. కౌరవులు సుఖపడ్డారు అనుకునేలా కనబడుతుంది. లోకరక్షణ కోసం తాత్కాలిక కష్టాలు అనుభవించినా భవిష్యత్తు బావుంటుంది కనుక, దుష్టశిక్షణ జరుగుతుంది. కనుక పాండవులు అడవులలో తిరుగాడవలసి వచ్చింది.*


2. *జూదంలో ఓడి అడవులపాలు అయ్యారు. అసలు ఇక్కడ జరిగింది వేరు. వీళ్ళని అడవులకి పంపించాము ఇక తిరుగులేదు అని దుష్టచతుష్టయం అనుకుంది. భోగాల్లో మునిగి తేలారు. ఆయుధ సంపత్తి పెంచుకోవడంకానీ, అస్త్రశస్త్రాలు సాధిచడం కానీ ఏమి చేయకపోగా ఋషులు వచ్చినప్పుడు దుర్యోధనుడు అహంకారంతో అగౌరవపరచి శాపాలు పెంచుకున్నాడు. అడవుల్లో పాండవులని శ్రీకృష్ణుడు ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. పాండవుల క్షేమం కోసం ఎప్పటికప్పుడు మునులని, ఋషులని, ఎవరిని చూస్తే జన్మ చరితార్ధం అవుతుందో అలాంటి మార్కండేయ మహర్షిని పంపించి జ్ఞానాన్ని ప్రసాదించి, ఎన్నో శక్తులని అందిపుచ్చుకునేల చేశాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి ప్రేరేపణతో శివుడి కోసం తపస్సు చేస్తున్న అర్జునుడికి సాక్షాత్తు శివుడే కిరాత రూపంలో వచ్చి అర్జునుడితో తలపడ్డాడు*


*అర్జునుడు వేస్తున్న బాణాలు వేసినట్లు వేసినట్లు మాయమవుతున్నాయి. చివరికి అమ్ములపొద కూడా మాయమయింది. అయినా కూడా వచ్చింది ఎవరో గ్రహించకుండా విల్లుతో మీదికి దూకాడు. విల్లు మాయమయింది.. శివుడు నవ్వుకొని ఒక్క పిడికిటి పోటు పొడవడంతో మూర్చిల్లి కిందపడ్డాడు. తెప్పరిల్లిన తరువాత చూస్తే ఇంకేముంది! కిరాతుల రూపంలో ఉన్న శివపార్వతులు అసలు రూపంలో దర్శనం ఇచ్చారు. పాశుపతాస్త్రం అందించారు. ఆవిధంగా అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాడు. శివా! ఎందుకు నన్ను ఇలా ఆట పట్టించావ్? అని అడిగితే! పూజలు, మంత్రాలు ప్రతినిత్యం వింటూనే ఉన్నాను. ఈ బడితెపూజ అయితే కొత్తగా ఉంటుందని అని సమాదానం ఇచ్చాడు శివుడు. అర్జునుడు శివుడుని తాకి కలబడటం వల్ల శరీరం వజ్రకవచంలా తయారయ్యింది (ఇదొక వరం). దానికితోడు పాశుపతాస్త్రం వచ్చింది.*


*తదనంతరం ఇంద్రుడు వచ్చి స్వర్గలోకానికి తీసుకెళతాడు. అక్కడ అనుకోని సంఘటన వలన ఊర్వశి చేత స్వర్గలోకంలో పేడి (నపుంసకుడు) అవుతావు అని శాపం పొందుతాడు. ఇది అంతా గమనించిన ఇంద్రుడు అర్జునుడి సత్యనిష్ఠకి సంతసించి ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇంద్రుడు వరంగా తిప్పాడు. దీనికి తోడు ఇంద్రుడు అర్జునుడికి నాట్యం శిక్షణ ఇస్తాడు. ఈశాపం అజ్ఞాత వాసంలో వరంగా మారింది. నృత్యం వలన విరాట కొలువులో విరాటుడి కుమార్తె ఉత్తరకి నాట్యశిక్షణ కోసం ఉపయోగపడింది. ధర్మరాజు జ్ఞానాన్ని, తప్పస్సుని పెంచుకుంటే, అర్జునుడు ఆయుధ సంపత్తిని పెంచుకున్నాడు. భీముడు గురించి చెప్పేపనిలేదు. భీముడు హిమగిరులలో విహరిస్తుండగా పుష్పం కోసం బయలుదేరి ఇలా అరణ్య-అజ్ఞాత వాసాలు ముగించి ఆయుధ సంపత్తిని, ఎనలేని కీర్తి గడించారు*


ఇప్పడు అసలు విషయంలోకి వద్దాం!


    *ప్రతి మనిషి జీవితంలో గడ్డుకాలం ఉంటుంది. ఏపని చేసినా కలిసిరావడంలేదు అని వాపోతారు. దేవుడుని నిందిస్తారు. నేను ఏం పాపం చేశాను! ఎందుకు నాకు ఈ శిక్ష అని లోకంలో కష్టాలన్నీ వీళ్ళకే వచ్చినట్లు బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో మునుపు పనికిమాలిన పనులు గుర్తుండవు, గుర్తురావు. పైగా కష్టాలలో ఉండడం చేత ఎక్కడ సాయం అడుగుతారో అని పలకరించడానికి కూడా ఎవరురారు. అప్పుడు మనం చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఎవరులేరు. నాబ్రతుకు ఇంతే! ఇంకేమి సాధించలేను మరణమే శరణ్యం అనే ఆలోచనల్లోకి వెళ్ళిపోతారు. ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది*


*దీన్నే మనం అరణ్యవాసం అనుకోవాలి. ఆ సమయంలో ఎవరులేరని భాధపడకూడదు. ఎందుకంటే ఎవరు లేకపోతేనే తపస్సు చేయడానికి మంచి అవకాశం. ఎందుకంటే ఇంతకుముందు అన్ని ఉన్నాయి. అందరూ ఉన్నారు. అప్పుడు ఈ ఆలోచన రాలేదు. ఇప్పుడు కష్టంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరూ రారు. రారు అని నింద వేసి ఏడుస్తూ కూర్చుంటే ఇంకా మీరు సాధించేది ఏమిటి? ఒకవేళ వస్తే సాధన చేస్తారా? చేయరు. (ఒకటి ఆలోచించండి! పాండవులు అరణ్యవాసం చేయకపోతే కురుక్షేత్రం జరిగేదికాదు. ఎల్లప్పుడూ రాజ్యం కోసం ఎత్తులు, పైఎత్తులు వేస్తూ, యజ్ఞాలు యాగాలు అంటూ వీటితోనే కాలం గడిచేది. దుష్టశిక్షణ జరిగేది కాదు. మహాభారతం మనకి దొరికేది కాదు..(వాళ్ళుకూడా చరిత్రలో కలిసిపొయేవారే).. అలాగే మనం కూడా కష్టం అనే గడ్డు కాలాన్ని గ్రంధ పఠనం అనే తపస్సు చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి. అలాగే ఏదైనా విద్యలని అభ్యసించాలి. సరైన గురువు కోసం అన్వేషించాలి. అప్పుడు తెలుస్తుంది జీవితం ఎలా సరిదిద్దుకోవాలో. కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో!*


*ఒకరకంగా చెప్పాలంటే సుఖపడుతున్నాం అంటే పుణ్యం కరిగిపోతున్నట్టు. కష్టపడుతున్నాం అంటే పాపం కరిగిపోతున్నట్టు. ఇప్పడు ఆలోచించుకోండి! సుఖాలలో ఉన్నప్పుడు కూడా కష్టపడుతూ పుణ్యాన్ని డిపాజిట్ చేసుకుంటారా! కష్టాలలో కూడా సుఖాల కోసం వెంపర్లాడుతూ కష్టాలు కొనితెచ్చుకుంటారా! సుఖపడుతున్నప్పుడు దానధర్మాలు చేయాలి. యజ్ఞయాగాదులు (రోజుకు ఒక పేజి అయినా గ్రంధ పటనం చేస్తుంటే అదే కలియుగంలో యజ్ఞం) చేయాలి. అప్పుడు కష్టాలు మీదగ్గరికి రావు సరికదా. మీకు ప్రమాదం కలిగించాలి అనుకున్నవారు మీ చుట్టూ ఉన్నా అనతికాలంలోనే వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు ఒక అడుగు వేశారు కనుక ఆదైవం ఎప్పుడు మీపక్కనే ఉంటాడు. భగవంతుడు మీప్రక్కనే ఉన్నట్లు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కష్టం వచ్చిందంటే దానికి ఎదో కారణం ఉంటుంది. శ్రీకృష్ణుడు తోడు ఉండికూడా పాండవులు అరణ్యవాసం చేసినట్లు.. కనుక ఎప్పుడూ దేనికి బెదిరిపోవద్దు, కృంగిపోవద్దు*

మణికరన్_హిమాచల్ ప్రదేశ్ -- శివ_మందిరం

 శివ_మందిరం_మణికరన్_హిమాచల్ ప్రదేశ్...ఎప్పుడూ_వేడినీరు_ప్రవచించే_నది🔱*


🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱


*ఈ మణికరన్ అనే స్థలం, కులు కు 35 కిలోమీటర్ ల దూరం లో ఉంది.ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్థలం లో పరమశివుడు ద్యానం చేసుకున్నట్టుగా చెప్తారు.అక్కడి నీటిలో అమ్మవారు స్నానం చేస్తున్నప్పుడు ఆవిడ చెవి ఆభరణం ఒకటి ఆ నీటిలో పడిపోయింది.*


*అందుకు ఆ ఈశ్వరుడు ఇక్కడే తాండవ నృత్యాన్ని చేసాడు.ఆ నాట్యం తో అక్కడ ఆ చల్లటి ప్రదేశం ఒక్కసారిగా ఆందోళనకు గురి అయింది అంటే వేడిగా మారిపోయింది.అక్కడి నీటిలోని ఒక పాము ఆ ఆభరణాన్ని తీసుకొచ్చింది.*


*అప్పటినుండి ఆ నది ని మణి(ఆభరణం) అనే పదాన్ని కర్ణం(చెవి)అనే పదాన్ని కలిపి మణికరన్ అని పేరు వచ్చింది.*


*ఆలయ అందాలు చూస్తే మరొక సంస్కరణలో పర్వత-తాళం ఉన్న ప్రాంతం, పచ్చని *తోటలు,మరియు మణి కరణ్ అడవులు శివుడు మరియు పార్వతి దేవిని ఆకర్షించాయి, అందువల్ల వారు కొంతకాలం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.*

*సుదీర్ఘ పదకొండు_వందల_సంవత్సరాలు వారు ఈ ప్రదేశంలోనే ఉన్నారు.ఒక సమయంలో, భగవంతుడు కోపాన్ని తగ్గించడానికి, శేష్ నాగ్ విజృంభించిన స్థలం కావడం వలన మరియు పర్యవసానంగా ఇక్కడ నిరంతరం వేడినీటి_ప్రవాహం ఉంది, ఇది ఆ ప్రాంతం గుండా వెళుతుంది మరియు విలువైన రాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.*

*కవులు - చలోక్తులు*

 *కవులు - చలోక్తులు* 


సుమారు 60  ఏళ్ల క్రితం. సి.నారాయణరెడ్డి గారిని తమ గ్రామంలోని పాఠశాల వార్షికోత్సవానికి ఆహ్వానించడం కోసం కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామ కరణం గారు, ఆ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు సినారె గారి ఇంటికి వెళ్ళారు. సినారె వారితో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించి వారి ఆహ్వానాన్ని మన్నించారు. వారు ఇద్దరు సెలవు తీసుకుని బయలుదేరారు.  వారికి వీడ్కోలు చెప్పడానికి సినారె ఇంటి గేటు వరకు వచ్చారు. కరణం గారు తన మోటార్ సైకిల్ ను స్టార్ట్ చేశారు.  ఉపాధ్యాయుల వారు వెనక సీట్ మీద కూర్చున్నారు. అది చూసి సినారె భలే! ముందు కరణం, వెనుక వ్యాకరణం"  అని చెణుకు విసిరారు.*వ్యాకరణం* అంటే తెలుగు పండితులు అని సినారె శ్లేష•                      

                   ********** 

1980 ప్రాంతాల్లో సినారె ఒక పాట రికార్డింగ్ కోసం ఒక స్థూడియోకు వెళ్లారు. అక్కడ ఆయనకు వేటూరి సుందర రామమూర్తి గారు కనిపించారు. 

సినారె ను చూడగానే వేటూరి ఒకింత ఆశ్చర్యంగా *అరె  ఏమిటి ఈరోజు అర్ధాంగి తో వచ్చారు?* అని ప్రశ్నించారు.  

సినారె ఉలిక్కిపడి వెనక్కు చూసారు.  అప్పుడు అర్ధం అయింది ఆయనకు వెంటనే పకపకా నవ్వారు.  విషయం ఏమిటంటే? ఆ రోజు సినారె హాఫ్ హాండ్స్ షర్టుతో వచ్చారు.  ఆ పొట్టి చేతుల చొక్కాను *అర్ధ + అంగి =  అర్ధాంగి*గా పోల్చారు అన్నమాట వేటూరి•

                  ********** 

వేటూరి మహాకవి, పండితుడు, జ్ఞాన సంపన్నుడు అని నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అంతటి విజ్ఞాన ఖని కి కూడా ఒక వ్యసనం ఉన్నది.  గుర్రపు పందాలు కాయటం ఆయనకు పెద్ద చెడ్డ అలవాటు.  అడవిరాముడు సినిమాకు పాటలు రాసే రోజుల్లో సినిమాకోసం పాటలు రాయడానికి స్థూడియో కు వెళ్లారు వేటూరి. ఆ రోజు ఉదయమే ఒక రేసులో ఆయన డబ్బు పోగుట్టుకున్నారు.  మూడ్ బాగా లేదు.  ఏంటీ యార్ జయప్రదల మధ్య యుగళగీతం. మైండ్ పనిచేయటం లేదు.  ఎంతసేపటికీ రేసులకు పోయి పారేసుకున్నాను అనే ఆలోచన తొలుస్తున్నది. ఆ ఆలోచన తోనే కసి రేగి అదే లైన్ ను పల్లవిగా రాసేశారు.  మహదేవన్ కు విపరీతంగా నచ్చేసింది.  ఫలితంగా ఈ నాటికీ కుర్ర వృద్ధ భేదం లేకుండా అందరి మనసుల్లో నిలిచిపోయింది ఆ పాట.  


ఆ *రేసు*కోబోయి పా*రేసు* కున్నాను హరి హరి!

వీధి గుమ్మము

 వీధి గుమ్మమువీడి వెడలడాయే 

సంపాదన అంత పూర్ణమాయె 

ఆలి తోటి నిత్యము జగడమాయె 

కరోనా వేళ మనిషి బ్రతుకు భార్గవ 


మోడువారిన మ్రాను చిగురింపగవచ్చు  

కరడుగట్టిన గుండె ద్రవియించగ  వచ్చు 

సాగర జలమున దాహార్తి తీర్చగ  వచ్చు 

మూర్కుని మది రంజింపలేము భార్గవ 


గడప దాటిన కరోనా భయమని ఎంచి 

ఆను లైనులో కొనుగోలు చేయ బడితిమి 

కూరలు పుచ్చులు, చచ్చులుయైయుండె 

దినుసుల ధర లేమో గగన మంటే 

తిండిలేక ఎటుల మనుట ఇలను భార్గవ 


పెట్రోలు ధరచూస్తే భగ్గుమనియె 

కూరగాయలు కూడా ఆ దారే వెడలె 

పనివారు  కూలీలు రేట్లు పెంచి వేస్తిరి 

సంపాదనేమో  సగమైయ్యే  బ్రతుక టేటుల భార్గవ 





 


ఉప్మా

 ఉప్మా

ఉప్మా కనిపెట్టిన వాడ్ని ఉరికే వదలకూడదు 😣😣...

ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి😎😎..

ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా ఒక వంద సార్లు చూపించి ఉరితీయ్యాలి😂😂...

ఎవరి ఇంటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో🐒🐒కసి తీర కడుపులో మంట చల్లార్చుకోడానికి చేస్తారో తెలీదు 😰😰..

కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు🐺🐺...

వుండండి వుండండి అంటూ😛😛 వంటింట్లో నుంచి ఏ పూరి నో పొంగలో తెస్తారనుకుంటే🙆.ఉట్టిపుణ్యం గా ఊడి పడుతుంది ప్లేట్ లో ఈ ఉప్మా🙇🙇..

ఒక రెండు స్పూన్ ల వరకు బాగానే వుంటుంది👸...

తరువాత చూడండి జ్వరమొచ్చినప్పుడు మాత్రలు మింగినట్టు🙅🙅స్పూన్ స్పూన్ కి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతున్న మన కష్టాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా👶👶..

ఇంకాస్త పెట్టమంటారా అంటే😳....

ఆ స్పూన్ తో తల మీద గట్టిగ కొట్టుకొని వెర్రి గా నవ్వాలనిపిస్తుంది💣💣💣...

ఈ దరిద్రానికి మళ్లీ రకాలు💥💥.

గోధుమ రవ్వ,,బొంబాయి రవ్వ అంటూ👂👂..బొంబాయి ముంబై అయినా..

ఈ ఉప్మా ఇంకా బొంబాయి రవ్వగానే చెలామణి అవుతాంది😛😛...

జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఉప్మా🐇🐇...

ఉల్లిపాయలేస్తే ఉల్లిపాయుప్మ🐓🐓..

టమాట వేస్తే టమేటా బాత్ 🍅🍅🍅....

ఉప్మా చేయి అంటే చాలు చిటికెలో చేతిలో ఉప్మా ప్లేట్ తో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తారు🎅🎅....

శనివారం అయిందంటే చాలు ఎదో రూపం లో తగులుకుంటుంది🙇🙇..

ఈ మంతెన గారు ఊరుకోక గోధుమ రవ ఉప్మా మంచిది అని చెప్పారు💪💪..

ఇక చూడండి👈..వారోత్సవాలు...👈బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి☝....

తప్పు మీది కాదు సర్👐👐.ధైర్యం చేసి ఉదయన్నే నాలుగు గంటలకి మీ ప్రోగ్రాం చూపించామ్ కదా✊✊...చేసిన పాపం ఉరికే పోదు👎👎..

ఇది తినడం ఒక ఎత్తు అయితే తిన్నాక లోపల కి వెళ్లి ఇది చేసే హంగామ అంతా ఇంతా కాదు🏃🏃🏃...

పడుకుంటే కడుపు లో షేర్ ఆటో లు తిరుగుతునట్టు ఒకటే గోల 🚆🚆🚆....

అర స్పూన్ తింటే ,,.అరిగించుకోటానికి ఆరు గంటలు పడుతుంది🎠🎠🎠...

ఉప్మా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే🎭🎭...మా రామ్ దేవ్ బాబా గురూ గారు మహత్తరమైన ఉపాయం చెప్పారు😜😝😜...

ఉప్మా కాశి లో వదిలేసాను అని చెప్పమన్నాడు 😛😛...

ఎప్పుడైనా ఎవరైనా పెట్టినప్పుడు ఈ మాట చెప్పి తప్పించుకుంటున్నా అని చెప్పాడు 😌😌....

నేను అదే చేస్తా లాభం లేదు😫😫...

ఇంతకీ ఎంతమంది ఇవాళ ఉప్మా తిన్నారో 😊😊...

అదే లే తినాల్సివచ్చిందో చెప్పండి😆😆...

ఎదో మనిషి కి మనిషి సహాయం😜😜...మీకోసం ప్రార్థన చేస్తా..కడుపులో పడిన ఉప్మా త్వరగా కరగాలని...


😃😃జై ఊప్మాఁ..జై జై ఊప్మాఁ..

చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ

 ఆ.వె. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ

బంగరు మొల త్రాడు పట్టుదట్టి
సందె తాయెతులును సరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు.

కం. వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీత వంటి భామామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే.

కం. అప్పిచ్చువాడు వైద్యుడు
యెప్పుడు నెడతెగక పారు యేరును ద్విజుడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి వూరు చొరకుము సుమతీ.

చం. చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక లేకయున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
పదనుగ మంచికూర నలపాకము జేసినదైన నందు నిం
పొదవెడి వుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా.

ఆ.వె. కొండనుండు నెమలి కోరినపాలిచ్చు
పశువు చదువుచుండు శిశువు తోడ
వనిత వేదములను వల్లె వేయుచునుండు
బ్రాహ్మణుండు కాకి పలలము తిను.

ఆ.వె. చెరకుతోటనుండు వరిమళ్ళలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూలనుండు తలపైనవుండును
దీనిభావమేమి తిరుమలేశ.

వంగ తోటనుండు,

సేకరణ సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఇక్కడ ఒక చమత్కార పద్యం వుంది.  నిజానికి ఇందులోని అన్ని పదాలు చిన్న పిల్లలకు సహితం అర్ధమౌతాయి. అయితే ఇందులో గొప్పతనం ఏమిటి అంటే ఏమిలేదు కానీ అర్ధం కాదు ఒకసారి క్రింది వివరణ చదవకుండా కేవలం పద్యం మాత్రమే చది అర్ధంచేసుకోవటాన్నికి ప్రయత్నించండి.  మీరు మీ ప్రయత్నంలో సఫలులు అయ్యారంటే మీకు సాహిత్యం మీద పట్టు వున్నట్లే. లేదా వివరణ చదివిన తరువాత అర్ధం చేసుకున్నారంటే మీరు ఇంకా కృషి చేయాలి అని అర్ధం.  అందుకే మిమ్మలను కొంచం విస్మయ పరచటానికి వివరణ ఈ పోస్టులో ఇవ్వటంలేదు. 

వంగ తోటనుండు, వరిమళ్లలో నుండు,

జోన్నచేలనుండు, చోద్యముగను,

తలుపు మూలనుండు,తలమీదనుండును,.

దీనిభావమేమి తెలియుడయ్య.”

ఈ పద్యం చదివిన వెంటనే సాధారణంగా  మనకు స్ఫురించే అర్ధం ఇది 

వగతోటలో ఉంటుంది, వరిమళ్ళలోవుంటుంది, జొన్నచేలలో ఉంటుంది, అదే విధంగా తలుపు ములలో ఉంటుంది, తలమీద కూడా ఉంటుంది అది ఏమిటి అంటే దాని భావము ఏమిటి అని కవి ఉవాచ. 

మన ఆలోచన వేగంగా ఈ ఆరు స్థానాలలో వుండేది  ఏమిటి అని మన బుర్ర గోక్కుంటాము.  అదేనా ఈ సమస్యకు పరిస్కారం లేక ఇంకా ఏమైనా ఉందా ఆలోచించండి. లేదా తదుపరి పోస్టు కోసం ఎదురు చూడండి. 


ఇప్పుడు పై చాటు పద్యాన్ని పరిశీలిద్దాం.

వంగతోటలో ( వంకాయ తోటలో) ఉంటుంది,వరిమళ్ళలో ఉంటుంది, జొన్నచేలో,ఆశ్చర్యం!తలుపుమూల,తలమీద ఉంటుందిట. దానిభావం ఏమిటో తెలుసుకోమంటాడు కవి. ఏది?ఉంటుంది? అనికొచెం ఆలో చిద్దాం. తెలిసిందా? లేదుకదా? ఎక్కువ ఆలోచించ కుండా పద్యంలోని పదాలని ఆపి,ఆపి చదవండి. అదేమిటో తెలిసి పోతుంది. ఎలా అంటే ---

వంగ, తోటనుండు .( వంకాయలు తోటలోనే ఉంటాయి.)

వరి, మళ్ళలోనే ఉంటుంది. (వరిమళ్లు ప్రసిద్ధం కదా!)

జొన్న, చేలోనే పండుతాయి. (జొన్న చేలు అంటాం కదా!)

తలుపుకి, మూల ఉంటుంది. (తలుపుమూల అని వాడుక)

అలాగే తల,( శిరస్సు.)శరీరంలో అన్నిటికంటే మీద పైభాగంలో ఉంటుంది. విధంగా పై పద్య భావాన్ని అంటే వాటి,వాటి స్థానాల్లో అవి ఉంటాయి అనే భావాన్ని తెలుసుకోమంటాడు కవి


అంతరించబోతున్న పాత తరం

 *త్వరలో అంతరించబోతున్న పాత తరం...*


        రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం  నుండి కనుమరుగు అవ్వబోతోంది.

   అవును ఇది ఒక చేదు నిజం !


ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.  

రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !

ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !

నడక అలవాటు ఉన్నవాళ్ళు! 

మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు

 ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !

ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు! 

మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!

 పూజకు పూలు కోసే వాళ్ళు !

పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !

మడిగా వంట వండేవాళ్ళు !

దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు! 

దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !

దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!

మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!

 అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు! 

కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !

స్నేహంగా మెలిగే వాళ్ళు!

తోచిన సాయం చేసేవాళ్ళు !

చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !

ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !

ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !

పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు! 

ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు!

పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!

కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !

సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !

పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ! 

తీర్థయాత్రలు చేసేవాళ్ళు !

ఆచారాలు పాటించే వాళ్ళు !

తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !

పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !

చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !

లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు !

చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!

అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు !  

వాళ్ళు ....

తలకు నూనె రాసుకునే వాళ్ళు !

జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !

కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !

చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !

ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో స్నేహంగా గడిపిన తరం.....

.

ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు

మీకు తెలుసా ?

వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా  మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.

మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.

మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి 

.లేదంటే .....

.లేదంటే .....  

.లేదంటే .....

ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.

.వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో,స్నేహం తో కూడి ఉండే తరం...

సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!

 స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !

కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!

 ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం

ద్వేషం, మోసం లేని స్నేహ  జీవనం గడిపిన తరం అది!

సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అదే

 

లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !

ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!

 తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం

.

వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది 

మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .

సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..


*సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని  మార్చేయ్యకండి !!!*


తప్పులను సరిదిద్దగలది  సంస్కారమే

సర్కారు చేసే  చట్టాలు కాదు....


*రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను,స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా మారుతారు*🙏🙏🙏🙏🙏

వైద్య, చికిత్సా రంగంలో జరుగుతున్న రీసెర్చ్

 1. గత 50 ఏళ్లుగా వైద్య, చికిత్సా రంగంలో జరుగుతున్న రీసెర్చ్ విజ్ఞానం చాలావరకు ఖచ్చితమైనది కాదు. వారానికి ఒకసారి ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని రీసెర్చ్ లో వెల్లడైతే, అదే టాబ్లెట్ ను రోజుకు 3 సార్లు వేసుకోవాలని రీసెర్చ్ లో చెప్పించి, లాభాలు చేసుకునేవి కంపెనీలు. డాక్టర్ల తో సెమినార్లలో అలాగే చెప్పించి, పేపర్లు పబ్లిష్ చేస్తే అదే సైన్స్ అని నమ్మితే అంత కంటే మూర్ఖత్వం లేదు.

2. గత 50 ఏళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మరి జబ్బులు, రోగులు ఎందుకు పెరుగుతున్నారు? రోగాలు వస్తున్నాయా లేక రోగులను సృష్టిస్తున్నారా ? రోగాలను నయం చేస్తున్నారా ? రోగులను దోచుకుంటున్నారా?

3. ఈ దేశంలో అయొడైజ్డ్ ఉప్పు అవసరం లేదు (ఒక్క హిమాలయ ప్రాంతాలకు తప్ప). గత పాతికేళ్లలో అయొడైజ్డ్ ఉప్పు అందరికీ రుద్ది, ప్రతి ఇంటా ఒకరు లేదా ఇద్దరు థైరాయిడ్ రోగులను సృష్టించింది ఎవరు మరి? అయొడైజ్డ్ ఉప్పు వాడితే మంచిదే ఐతే కోట్లకు కోట్ల రోగులు ఈ దేశంలో ఎందుకు థైరాయిడ్ రోగులు సృష్టించబడి, జీవితాంతం మందులు వాడేలా చేసింది ఏ రీసెర్చ్? ఏ సైన్స్? సైన్స్ పేరుతో అయొడైజ్డ్ ఉప్పును కోట్ల రూపాయల బిజినెస్ గా ఎలా మారింది? (కొందరు సినిమా ప్రచారకులు కూడా అయొడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడాలని ఊకదంపుడు ప్రచారం చేసినట్టు గుర్తు ఆ రోజుల్లో. కోట్లకు కోట్ల థైరాయిడ్ కేసులు ఇండియాలో పెరగడానికి వారు కూడా కారణమేనా?) అయోడిన్ సాల్ట్ వాడడం మొదలైనప్పటినించి బీపీ, థైరాయిడ్ జబ్బు లు ఎక్కువ కావడానికి ప్రధాన కారణం, కాబట్టి దయచేసి ఎవరూ అయోడిన్ సాల్ట్ వాడకండి, సముద్రపు ఉప్పు లేదా సైంధవలవణం వాడండి!

వేప పుల్లలతో పళ్ళు రుద్దుకొని వేప నూనె రెండు చుక్కలు ముక్కులో వేసుకుని, చిన్న కొత్తిమీర-కట్ట జ్యూస్ ఉదయం పరగడపున తాగండి, థైరాయిడ్ సమస్యమీ శరీరం నుంచి పారిపోతుంది!

నాకు థైరాయిడ్ లేదు ఆరోగ్యంగా ఉన్నానని భావన చేసుకోండి!

4. మారుమూల గిరిజన ప్రాంతాల్లో, అయొడైజ్డ్ ఉప్పు వాడనివారిలో థైరాయిడ్ కేసులు ఎందుకు తక్కువగా ఉన్నాయి ?

5. నెలకొక యాంటీ బయోటిక్ రిలీజ్ చేస్తూ, ఒకదాన్ని మించిన శక్తి ఇంకోటి, ఒక కంపెనీని మించి ఇంకో కంపెనీ, అసలు ఇప్పుడు యాంటీ బయటిక్ ఏదీ పనిచేయడం లేదు, Resistance పవర్ బాక్టీరియాకు పెరిగి. అసలు దీనితో కొత్త రోగాలు వచ్చినా ఇంకా కొత్తగా ఎలాంటి మందు వచ్చినా పనిచేయని దీన స్థితికి వచ్చి, అసలు మానవాళి భవిష్యత్తు ప్రమాదంలో పడడానికి కారణం సైన్సు వ్యాపారంగా మారడం కాదా?

6. మీకో విషయం తెల్సా… ఐసియూలో ఎంత ప్రమాదకర బాక్టీరియా ఉంటుందో…! మార్చురీల్లో ఉండే బాక్టీరియా, ఐసియూల్లో ఉండే బాక్టీరియా దాదాపుగా ఒకటే అనే ప్రమాదకర స్థాయికి ఎందుకు వచ్చింది…

7. మూఢవిశ్వాసాలు ప్రజల్లో కొంతమందిని మాత్రమే మూర్ఖులుగా తయారు చేస్తే – వ్యాపారం కోసం సృష్టించిన సైన్స్ పరిశోధనల వల్ల అసలు మానవ, జంతు, వృక్ష జాతుల ఉనికికే ముప్పు వచ్చింది.

8. కొలెస్ట్రాల్ కు గుండె జబ్బుకు సంబంధం లేదని, అమెరికాలోని ఒక సైన్స్ జర్నలిస్టు (http://garytaubes.com/) ఏళ్ళ పాటు రీసెర్చ్ చేసి రాస్తే, అది టైం మ్యాగజైన్ కవర్ పేజీగా రాలేదా? అవన్నీ బయటకు రాకుండా ఫార్మా, మెడికల్ మాఫియా ఆ స్టడీ నొక్కిపెట్టి, వేల కోట్ల కొలెస్ట్రాల్ మాత్రల బిజనెస్ చేసుకోవడం లేదా?

9. ఒకప్పుడు 150 దాకా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే, దాన్ని 90-110 కు తగ్గించి, కొత్త షుగర్ రోగులను సృష్టించింది సైన్స్ కాదా?

మధుమేహము , థైరాయిడ్  పెద్ద బోగస్ అని USA డాక్టర్లు పరిశోధనలు చేసి తేల్చిచెప్పారు, ఇన్సులిన్ అనేది పెద్ద స్కామ్. ఆహారం తినడానికి ముందు 250 ఉన్నాకూడా నార్మల్

కాని మన భారతీయ వైద్యులు చెప్పారు. కానీ 120 ఉంటే షుగర్ అని చెప్పి, మందులు అంటగడుతున్నారు . తిన్న తర్వాత 300 కూడా నార్మల్ . HBAIC

6-8వరకు ఉన్నా కూడా నార్మల్

ఒక జామాకు లేదా అల్లనేరేడు ఆకు 1 ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో సాయంత్రం నానబెట్టి

ఉదయం ఆకు పడవేసి నీళ్లు తాగాలి. రెండు వారాల్లో షుగర్ నార్మల్ గా వస్తాది. రెండో నెల నుంచి టాబ్లెట్ తినడం ఆపి వేయండి, ఈ జామాకు నీళ్ళు రోజూ తాగుతూ ఉండండి. మీయొక్క మనసులో సబ్ కాన్ షస్ మైండ్ లో నాకు షుగర్ లేదు అని భావన చేసుకోండి

10. బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే స్ట్రోక్ వస్తుందని ప్రచారం చేసి, బీపీ మాత్రలను వాడాలని చెపితే… దానితో సోడియం లెవెల్స్ పడిపోయి, ఐసీయూల్లో చేరడం..,? 60 ఏళ్ళ తర్వాత బీపీ మందుల వల్ల పార్కిన్సన్ రోగం ఎందుకు వస్తోంది? ఇండియాలో 55 ఏళ్లకే పార్కిన్సన్ రోగులను చూడాల్సిన విషాదానికి ఎవరు కారణం?

11. 20-25 ఏళ్ళ కింద ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ఓపీ -ఓటీ (అవుట్ పేషంట్ ఆపరేషన్ థియేటర్లు) ఉండేవి. చాలా మైనర్ సర్జరీలు అక్కడే చేసి ఒక పూటలోనే ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపేవారు (అసలు ఆసుపత్రిలో ఇన్ పేషంట్ అవసరం లేకుండానే). ఇప్పుడు అలాంటి మైనర్ సర్జరీలకు కూడా స్పెషల్ వార్డులు/ఐసియూ ల్లో చేరాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి?

12. పది రూపాయలు మాత్రమే ఖర్చయ్యే మాత్ర రేటును 300 రూపాయలకు అమ్మేలా సృష్టించిన సైన్స్ నిజంగా సైన్స్ అని ఎలా నమ్మాలి? అది నిజంగా ప్రజల కోసం సైన్స్ అయినప్పుడు ప్రజలు ఎందుకు దోపిడీకి గురవ్వాలి. ఆ సైన్స్ వ్యాపారం కోసం ఐతే అది శాస్త్రీయమా?

13. క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ పథ్యం చెప్పి తే అది నాన్ సెన్స్ అని కొట్టి పడేసే ఇంగ్లీష్ డాక్టర్లు, బీపీ, షుగర్ మందులు రాసి ఉప్పు, చక్కర తగ్గించాలనే పథ్యం చెప్పడం ఏంటి ? అక్కడ నాన్ సెన్స్ ఐతే ఇక్కడ నాన్ సెన్స్ కాకుండా ఉంటదా? అజీర్ణ సమస్యలకు ఆయుర్వేదంలో ఆహార నియమాలు పాటిస్తే మందులు లేకుండానే తగ్గుతుంది. ఇది శాస్త్రీయం. ఇంగ్లీష్ డాక్టర్లు మందులు వాడు – ఇష్టం వచ్చింది తిను – జీవితాంతం రోగిగా ఉండు అనేది శాస్త్రీయమా? పైన ఇంగ్లీష్ డాక్టరు స్వీట్, ఉప్పు వద్దని చెప్పి అజీర్ణ సమస్యలకు పథ్యం ఎందుకు చెప్పరు? ఇంగ్లీష్ వైద్యం – విజ్ఞానం గత 200 ఏళ్ళ నుంచి ఉంది కానీ ప్రపంచవ్యాప్తంగా స్థానికంగా ఉన్న వైద్య పద్ధతులు అనేక వేల సంవత్సరాలు ప్రజల్ని కాపాడాయి కదా. గుడ్డిగా అశాస్త్రీయం అని మీలాంటి వాళ్ళు కూడా ముందూ వెనకా చూడకుండా నాటువైద్యమని ముద్ర వేశారు కదా! ఆధునిక విజ్ఞానం అంత శాస్త్రీయమైతే రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి, రోగులు జీవితాంతం మందులు వేసుకునేలా చేసేది ఆధునిక శాస్త్రీయ వైద్యమా?

14. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర చికిత్సలకు ఇంగ్లీష్ వైద్యమే సరైన మందు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇతర జబ్బులకు ఇంగ్లీష్ వైద్యం ఏం చెపుతుంది అంటే, “మందులను ఆహారంగా వాడి ఆరోగ్యాన్ని కొనుక్కో, మాకు లాభాలు పండించు అని చెప్తుంది”. ఇతర ఆరోగ్య చికిత్సా పద్ధతులు ఏం చెప్తాయి అంటే ఆహారాన్ని మందుల మోతాదులో మాత్రమే తీసుకో – ఆరోగ్యాన్ని నీకు నువ్వే సంరక్షించుకో”…

15. ఇంగ్లీష్ మందుల్లో ఆహార పథ్యం లేదు అని చెప్పే డాక్టర్లు, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ లను కలవమని మరీ విధిగా చెప్తున్నారు కదా. ఇది శాస్త్రీయత అనాలా ఏమి అనాలి? నేడు, రేపు, ఎల్లుండి ఆపై కూడా నేను సైన్స్ నే నమ్ముతాను కానీ కోట్లకుకోట్ల రూపాయలతో వ్యాపారం కోసం లాభాల కోసం సృష్టించిన సైన్స్ ను కాదు. వ్యాపారం కోసం సృష్టించిన సైన్స్ ను గుడ్డిగా నమ్మేవాళ్ళు, అంధ విశ్వాసంలో వుండి మూఢ నమ్మకాలను నమ్మే వారి మధ్య ఎలాంటి తేడా లేదు… 

టీవీ ల్లో అల్లోపతి వైద్యులను

తీసుకు వచ్చి, చర్చలు పెడుతున్నారు, వాళ్ల కు ఆయుర్వేదం గురుంచి ఏమి తెలుసు, డాక్టర్స్ తప్పు కాదు! చానల్ వాడిది తప్పు! మందుల కంపెనీలు ఈ చర్చలు పెట్ట డానికి వీరికి డబ్బులు ఇస్తున్నారు. చర్చలు పెట్టేవారు, భారతీయులు

కాదా? సిగ్గు ఉండాలి. ఆయుర్వేదం ను, పసరు మందు, నాటు మందు

అంటున్నారు. నాటు వైద్యం అర్థం

నాటి అంటే పురాతమైనది

నిజమైన భారతీయుడు ఎవరు tv చర్చలు  చూడకండి. సమాజం నుండి వెలి వేయండి 


—– Dr. Sriram (Ph D & Postdoctoral) Expert (Public Policy & Governance)

మహానుభావుడు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు

 🙏🇮🇳 forwarded from other group


కొన ఊపిరితో చావు బతుకుల్లో ఉన్న మన సనాతన హిందూ ధర్మానికి ఊపిరి పోసి బతికించిన మహానుభావుడు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ...బ్రాహ్మణుడు.


ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించి బ్రిటీష్ వారిని గడగడలాడించి తెల్ల కుక్కలకు పగలే చుక్కలు చూపిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ....బ్రాహ్మణుడు.


హిందూ పద బాదషాహీ , హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీని నడిపించి ఆది శంకరుల తర్వాత మళ్ళీ హిందూ ధర్మానికి జవసత్వాలు తీసుకువచ్చిన ధర్మప్రభువు సమర్థ రామదాసు ...బ్రాహ్మణుడు.


హిందూ ధర్మాన్ని , మన సనాతన గురుశిష్య పరంపరను , మన జ్ఞాన కేంద్రాలైన గురుకులాలను విధర్మీయులు కుట్రపన్ని క్రమేపి నాశనం చేయప్రయత్నిస్తూన్న తరుణంలో , అతి సామాన్యుడైన చంద్రగుప్తుడిని తన రాజనీతితో రాజుగా చేసి,హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి పునఃధర్మ స్థాపన చేసిన మేధోధీరుడు చాణక్యుడు...బ్రాహ్మణుడు.


పసికందును వెనక కట్టుకుని అరివీర భయంకర రణరంగంలో బ్రిటీషులను గడగడలాడించి,భారత మాతను బానిస సంకెళ్ళ నుండి విడిపించుటకు సింహగర్జన చేసిన ఆడ సింహం రాణి ఝాన్సీ లక్ష్మీబాయి....బ్రాహ్మణురాలు.


ఐక్యతారాగాన్ని ఆలాపించి,చెల్లా చెదరుగా విడిన హిందూ సమాజాన్ని ఏకం చేసి భారత స్వాతంత్ర సమరనాదాన్ని పూరించి , వాడవాడలా వినాయకుడిని స్థాపించి..తద్వారా భారత స్వాతంత్ర్యానికి పూనాదులు వేసి,మన సనాతన ధర్మ రక్షణకు ప్రాణాలు త్యాగం చేసిన భారత మాతా భక్తుడు బాల గంగాధర తిలక్ ...బ్రాహ్మణుడు.


నలంద , తక్షశిల లాంటి మన భారత దేశ జ్ఞాన కేంద్రాలను ఆక్రమణదారులు మట్టుబెట్టి భస్మీకృతం చేస్తే...అలాంటి జ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి , భారత మాతకు పూర్వ జ్ఞాన వైభవమును తేవాలని , జోలేపట్టి ఆఖరికి శవాలపై వేసిన డబ్బును ఏరుకోవడానికి వెనకాడక , భిక్షాటన చేసి బనారస్ హిందూ విశ్వవిద్యాలయము ( BHU ) ను స్థాపించి దేశములో విద్యావెలుగులను నింపిన అసమాన కీర్తిమంతుడు మదన మోహన మాలవీయ ...బ్రాహ్మణుడు.


కశ్మీరును స్వతంత్రం చేయాలని , భారతమాత శిరస్సు ఖండించబడకూడదని ఆరాటపడి పోరాటం చేసిన త్యాగధనుడు, జనసంఘ్ ను స్థాపించి భారత భవిష్యత్తుకు పునాదివేసి , ప్రాణాలు అర్పించిన డా॥ శ్యామా ప్రసాద్ ముఖర్జీ....బ్రాహ్మణుడు.


ఈ రోజు నేను హిందువుని అని ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛా భిక్షను అనుగ్రహించిన,రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ( RSS ) ను స్థాపించిన డా॥ హెడ్గేవార్ ...బ్రాహ్మణుడు.


నేడు నరేంద్ర మోడీని చూసి యావత్ ప్రపంచం గర్విస్తూన్నది.ఆ నరేంద్ర మోదీ గారిని తీర్చిదిద్దిన భారతీయ జనతా పార్టీకి పురుడుపోసిన దీనదయాల్ ఉపాధ్యాయ...బ్రాహ్మణుడు.


 అపర మేధావి , కవి , రచయిత...భారత యశస్వీ ప్రధానిగా కీర్తి గడించిన మన భారత రత్న అటల్ బిహారీ వాజపేయ్ ...బ్రాహ్మణుడు.


ప్రపంచ క్రికెట్ లో భారత దేశానికి అగ్ర స్థానాన్ని కల్పించి క్రికెట్ దేవుడిగా కీర్తింపబడే భారత రత్న సచిన్ టెండూల్కర్ ...బ్రాహ్మణుడు.


ఇలా చెబుతూ పోతే సంవత్సరాలు గడిచినా విషయం పూర్తవ్వదు.ఇది భారత జాతి కొరకు , భారత దేశం కొరకు , సనాతన హిందూ ధర్మం కొరకు తమ సర్వస్వాన్ని ధారపోసి , సంపూర్ణ జీవితాలను త్యాగం చేసిన త్యాగధనులైన బ్రాహ్మణుల చరిత్ర....ఎంత చెప్పినా తరగదు.


భారత మాత కొరకు కేవలం బ్రాహ్మణులే త్యాగం చేశారు...మిగితా వారు చేయలేదు...మిగితా వారు పాటుపడలేదు అనేది మా ఉద్దేశ్యం కాదు.దేశ నిర్మాణంలో అందరి పాత్ర ఉందీ...అన్నీ వర్గాల సమిష్టి పోరాటమే భారత రూపం.అందులో బ్రాహ్మణులు కూడా ఉన్నారనేది సమాజం గుర్తించాలి.


ఇంతటి త్యాగాలను చేసి దేశ వైభవాన్ని నిలిపిన , నిలుపుతూన్న బ్రాహ్మణుల గురించి చలన చిత్రాలలో వ్యంగ్యంగా చిత్రీకరించడం శోచనీయం...దానిని మిగితా హిందూ  సమాజం ఖండించకపోవడం దౌర్భాగ్యం.


సినిమాలలో బ్రాహ్మణులపై వెధవ జోకులేయడం

బ్రాహ్మణులను కాలితో తన్నడం

బ్రాహ్మణులను రౌడీలకు సలహాదారుగా చూయించడం...ఇలా ఒకటా రెండా....ఏ చిన్న అవకాశాన్ని చిత్ర పరిశ్రమ వదలదు..బ్రాహ్మణులను కించపరుస్తూనే ఉంటుంది.


ఇకనైనా ఇటువంటి వెకిలి చేష్టలు మానాలి.

బ్రాహ్మణులు దేశ నిర్మాణంలో చేసిన సేవలను గుర్తించాలి.

వారికి తగిన గౌరవాన్ని కల్పించాలి.


బ్రాహ్మణత్వం నాశనమైన రోజు హిందూ ధర్మం నిలవదు.హిందూ ధర్మం నాశనమైన రోజు దేశం మిగలదు.


ఈ దేశ పునాది బ్రాహ్మణత్వంలో ఉంది అనేది యావత్ సమాజం విస్మరించకూడదు.


॥ శ్రీమాత్రే నమః ॥ 🙏🇮🇳

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి లీలలు..


*మగ పిల్లవాడు..*


దాదాపు ఐదు సంవత్సరాల క్రిందట..కందుకూరు వాస్తవ్యులు శ్రీ తుమ్మపూడి సురేష్ , అయన భార్య, కూతురుతో కలిసి, శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శనార్థం మొగలిచెర్ల లో గల స్వామివారి మందిరానికి వచ్చారు.. సురేష్ కు కందుకూరులో సిమెంట్, స్టీల్ వ్యాపారం ఉన్నది..ఆర్ధికంగా స్థితిపరులే..శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధిని దర్శించుకొని..పూజాదికాలు పూర్తైన తరువాత..శ్రీ స్వామివారి సన్నిధిలో కూర్చున్నారు..సురేష్ ముఖంలో ఒక విధమైన ఆందోళన ప్రస్ఫుటంగా గోచరిస్తోంది..


కొద్దిసేపు మౌనంగా ఉన్న తరువాత..ఆ దంపతులు తమ మనసులోని మాట చెప్పారు.. "ఒక కోరిక స్వామిని కోరుకున్నామండీ...నెరవేరితే, ఇక్కడ నలుగురికీ ఉపయోగపడే కార్యం ఏదైనా చేస్తాము.." అన్నారు...వాళ్లకు మొదటి సంతానం అమ్మాయి...ఆ పాప పుట్టి పదమూడు సంవత్సరాలయింది..ఆ తరువాత సంతానం లేదు..మళ్లీ ఇన్నేళ్లకు..సురేష్ గారి భార్య గర్భవతి.. మగపిల్లవాడు కావాలని ఆ దంపతుల ఇద్దరికీ మనసులో ప్రగాఢమైన కోరిక..ఆ దంపతుల ఆందోళనకు కారణమేమంటే..ఈసారి కూడా ఆడపిల్లే పుడుతుందని పరీక్ష చేసిన డాక్టర్ గారు తేల్చి చెప్పారట!..ఆ దంపతుల ఆందోళనకు మరో కారణం కూడా ఉంది..ఏమిటంటే..తాము గురువుగా భావించే ఒకానొక స్వామివారు కూడా ఈసారి వీళ్లకు ఆడపిల్లే పుడుతుందని ఘంటాపధంగా తేల్చి చెప్పేశారు..సురేష్, అతని భార్యా ఈ మాటలు విని హతాసులయ్యారు..


"మేము ఎన్నో చోట్ల తిరిగాము..మాకు పుట్టబోయేది ఆడపిల్లే అని అందరూ చెప్పారు..ఆఖరి ప్రయత్నంగా ఈ స్వామివారిని వేడుకుందామని వచ్చాము..మరి మా కోరిక తీరుతుందా?.." అని మమ్మల్ని అడిగారు..


"మనస్పూర్తిగా..సంపూర్ణ విశ్వాసం తో ఆ స్వామివారిని వేడుకొనండి..ఆ పై దైవ కృప.." అని చెప్పాము..


ఐదు వారాలపాటు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని క్రమం తప్పకుండా దర్శించుకున్నారు..ప్రతి వారమూ మనసారా శ్రీ స్వామివారిని తమకు మగబిడ్డను ప్రసాదించమని వేడుకున్నారు..


  ఈలోపల సురేష్ కు స్వప్నంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహం కనబడింది..ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది..ఆ మరుక్షణమే..ఒక యోగి కనబడి.."అంతా శుభమే జరుగుతుందని" చెప్పినట్లు అనిపించింది..లేచి చూస్తే..ఏమీ లేదు..తనకొచ్చిన కల గురించే ఆలోచించాడు..సరే..ఆ దైవ నిర్ణయం ఎలా వుంటే అలా జరుగుతుందనే నిర్ణయానికి వచ్చారా దంపతులు..ఆడపిల్ల పుట్టినా దైవప్రసాదంగా భావిస్తామని ఆ దంపతులు స్థిర చిత్తంతో చెప్పారు..


ఆ తరువాత మూడు నెలలకు ఆ దంపతులకు పండంటి మొగ పిల్లవాడు జన్మించాడు..ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు..తమ కోరికను స్వామివారు తీర్చారని మహదానందపడ్డారు..బిడ్డనెత్తుకుని స్వామివారి మందిరానికొచ్చి, ఆ దత్తాత్రేయుని సమాధి వద్ద మనసారా నమస్కారం చేసుకున్నారు..


           అన్నమాట ప్రకారం, కొద్దికాలం తరువాత, సురేష్ దంపతులు..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో, 20X24 అడుగుల విస్తీర్ణంతో మంటపం నిర్మించారు..సుమారు 150 మంది భక్తులు కూర్చుని ప్రతి శనివారం రోజు..శ్రీ స్వామివారి పల్లకీ సేవ చూసుకోవడానికీ..మిగిలిన రోజులలో భక్తులు భజన చేసుకోవడానికి ఆ మంటపం చక్కగా సరిపోతోంది..


భగవంతుడి మీద అచంచల విశ్వాసం వుంటే, భక్తుని కోరికలు ఆయనే తీరుస్తాడు..


మరో అనుభవం రేపటి భాగం లో...


సర్వం...

శ్రీ దత్త కృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699).