*ఔషధ విలువల మొక్కలు*
. *అర్క పత్రం*
హాలాహల బిందువొకటి
పాలకడలి నురుగుల బడ పాషాణమయెన్
లీలను అర్కంబుగ నా
నీలగ్రీవు తనయుండు నేలను చేర్చెన్
పాలసముద్రాన్ని మధించి నపుడు హాలాహలం ఉద్భవించడం, శివుడు ఆ గరళాన్ని గ్రోలి తన కంఠాన దాల్చడం అందరూ ఎరిగినదే... ఆ గరళం లోని ఒక చుక్క పాలసముద్రంలో పడగా, చిలుకుతున్న నురుగులో కలిసి సముద్ర జీవులన్ని మరణిస్తున్నాయట. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆ నురుగను ఒడ్డుకు మళ్లించగా ఒక మొక్కగా రూపు దాల్చింది. (ఇప్పటికీ జిల్లేడు విత్తనం నీటి బొట్టు ఆకారంలో ఉండటం మనం గమనించవచ్చు). జీవులకు హాని చేయవద్దని దానికి చెప్పి, సూర్యకిరణాలతో ఆ విషాన్ని విరిచి, పూజార్హత కల్పించాడట గణేశుడు. అంతే కాకుండా వైద్యానికి పనికి వచ్చే విధంగానూ, ముదిరిన జిల్లేడు వేరులో తన రూపు వచ్చే విధంగానూ, తనకు నచ్చిన ఉండ్రాళ్ళను జిల్లేడు కాయల ఆకారంలో చేసి నైవేద్యం పెట్టే విధంగా అనుగ్రహించాడట. సూర్యుడు కూడా రధసప్తమి నాడు జిల్లేడు ఆకులు తలపై దాల్చి, స్నానం చేసిన వారికి ఆయురారోగ్యాలు సమకూరుతాయని వరమిచ్చాడట. ఆనాటి ఆ అర్కమే నేటి జిల్లేడు. (ఇంటి పరిసరాలలో జిల్లేడు మొక్క నలుపైనా, తెలుపైనా పెరిగితే,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి