7, జులై 2021, బుధవారం

వంగ తోటనుండు,

సేకరణ సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఇక్కడ ఒక చమత్కార పద్యం వుంది.  నిజానికి ఇందులోని అన్ని పదాలు చిన్న పిల్లలకు సహితం అర్ధమౌతాయి. అయితే ఇందులో గొప్పతనం ఏమిటి అంటే ఏమిలేదు కానీ అర్ధం కాదు ఒకసారి క్రింది వివరణ చదవకుండా కేవలం పద్యం మాత్రమే చది అర్ధంచేసుకోవటాన్నికి ప్రయత్నించండి.  మీరు మీ ప్రయత్నంలో సఫలులు అయ్యారంటే మీకు సాహిత్యం మీద పట్టు వున్నట్లే. లేదా వివరణ చదివిన తరువాత అర్ధం చేసుకున్నారంటే మీరు ఇంకా కృషి చేయాలి అని అర్ధం.  అందుకే మిమ్మలను కొంచం విస్మయ పరచటానికి వివరణ ఈ పోస్టులో ఇవ్వటంలేదు. 

వంగ తోటనుండు, వరిమళ్లలో నుండు,

జోన్నచేలనుండు, చోద్యముగను,

తలుపు మూలనుండు,తలమీదనుండును,.

దీనిభావమేమి తెలియుడయ్య.”

ఈ పద్యం చదివిన వెంటనే సాధారణంగా  మనకు స్ఫురించే అర్ధం ఇది 

వగతోటలో ఉంటుంది, వరిమళ్ళలోవుంటుంది, జొన్నచేలలో ఉంటుంది, అదే విధంగా తలుపు ములలో ఉంటుంది, తలమీద కూడా ఉంటుంది అది ఏమిటి అంటే దాని భావము ఏమిటి అని కవి ఉవాచ. 

మన ఆలోచన వేగంగా ఈ ఆరు స్థానాలలో వుండేది  ఏమిటి అని మన బుర్ర గోక్కుంటాము.  అదేనా ఈ సమస్యకు పరిస్కారం లేక ఇంకా ఏమైనా ఉందా ఆలోచించండి. లేదా తదుపరి పోస్టు కోసం ఎదురు చూడండి. 


ఇప్పుడు పై చాటు పద్యాన్ని పరిశీలిద్దాం.

వంగతోటలో ( వంకాయ తోటలో) ఉంటుంది,వరిమళ్ళలో ఉంటుంది, జొన్నచేలో,ఆశ్చర్యం!తలుపుమూల,తలమీద ఉంటుందిట. దానిభావం ఏమిటో తెలుసుకోమంటాడు కవి. ఏది?ఉంటుంది? అనికొచెం ఆలో చిద్దాం. తెలిసిందా? లేదుకదా? ఎక్కువ ఆలోచించ కుండా పద్యంలోని పదాలని ఆపి,ఆపి చదవండి. అదేమిటో తెలిసి పోతుంది. ఎలా అంటే ---

వంగ, తోటనుండు .( వంకాయలు తోటలోనే ఉంటాయి.)

వరి, మళ్ళలోనే ఉంటుంది. (వరిమళ్లు ప్రసిద్ధం కదా!)

జొన్న, చేలోనే పండుతాయి. (జొన్న చేలు అంటాం కదా!)

తలుపుకి, మూల ఉంటుంది. (తలుపుమూల అని వాడుక)

అలాగే తల,( శిరస్సు.)శరీరంలో అన్నిటికంటే మీద పైభాగంలో ఉంటుంది. విధంగా పై పద్య భావాన్ని అంటే వాటి,వాటి స్థానాల్లో అవి ఉంటాయి అనే భావాన్ని తెలుసుకోమంటాడు కవి


కామెంట్‌లు లేవు: