🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*కర్మ - జన్మ*
1891లో ఓ వర్షం రాత్రి ఒంటిగంటకి అమెరికాలో ఫిలడెల్ఫియలోని బ్రాడ్ స్ట్రీట్లో ఉన్న డిలియన్ హోటల్లోకి విలియం, తన భార్యతో వెళ్ళి ఓ గది కావాలని అడిగాడు.
"సారీ! మా హోటల్లోని ఇరవై నాలుగు గదులు ఫిలప్ అయిపోయాయి. మీరు ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సింది." జవాబు చెప్పాడు హోటల్ మేనేజర్ జార్జ్ సి బోల్ట్.
ఆ దంపతులు ఇద్దరూ కాసేపు తమలో తాము ఏం చెయ్యాలని చర్చించుకుని తలుపు వైపు వెళ్తుంటే జార్జ్ వాళ్ళతో చెప్పాడు.
"వర్షంలో ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారు? మీరు నా గదిలో ఈ రాత్రికి
విశ్రమించి రేపు వేరే హోటల్ చూసుకోండి."
వారిద్దరూ కౌంటర్ వెనక ఉన్న అతని చిన్న గదిలోని మంచం మీద ఆ రాత్రి నిద్రపోతే, జార్జ్ రిసెప్షన్ హాల్లోని సోఫాలో నిద్రపోయారు. మర్నాడు ఉదయం అతనికి ఆ దంపతులు తమ కృతజ్ఞతలని తెలియచేసి వెళ్తుండగా భర్త చెప్పాడు."ఓ పెద్ద హోటల్ని నడిపే సామర్ధ్యం గల వ్యక్తివి నువ్వు, నీకోసం ఓ హోటల్ని కట్టి నిన్ను దానికి మేనేజర్ని చేస్తాను."
అది జోక్ అన్నట్లుగా ముగ్గురూ నవ్వు కున్నారు. రెండేళ్ళ తర్వాత పోస్టులో జార్జికి వచ్చిన ఓ ఉత్తరంలో, ఆ వర్షం రాత్రి అతను తమ మీద చూపించిన దయని గుర్తు చేస్తూ, తన మాట ప్రకారం ఓ హోటల్ని కట్టానని, ఓసారి. న్యూయార్కి రమ్మని ఆహ్వానిస్తూ విలియం రాసిన ఉత్తరం ఉంది. దానికి ఫిలడెల్ఫియా నించి న్యూయార్కి రిటర్న్ టిక్కెట్ కూడా జత చేసి ఉంది. జార్జ్ అది ప్రాక్టికల్ జోక్ అనుకున్నాడు కాని, టిక్కెట్ ఉండటంతో వెళ్ళిరావడంలో తప్పు లేదనుకుని వెళ్ళి విలియంని కలిసాడు. విలియం అతన్ని న్యూయార్క్ ఫిఫ్త్ అవెన్యూ, తర్టీ ఫోర్త్ స్ట్రీట్లో ఉన్న ఎర్ర రాయితో కట్టిన ఓ పెద్ద భవంతిని చూపించి చెప్పాడు.
"జార్జ్ నీ కోసం కట్టిన హోటల్ ఇదే. నిన్ను దీనికి మేనేజర్ని చేస్తున్నాను."
అది హోటల్ వాల్డ్రోఫ్ . అదే నేటి న్యూయార్క్ లోని నాలుగు వందల గదులు, వెయ్యి మంది ఉద్యోగస్థులు గల ఫైవ్ స్టార్ హోటల్ వాల్ డ్రోఫ్ ఆస్టర్ హోటల్. ఓ చిన్న హోటల్లో మేనేజర్ గా పని చేసిన జార్జ్ ఓ వర్షం రాత్రి చేసిన ఓ నిస్వార్ధ సేవ ఫలితం తర్వాతి జన్మలకి వాయిదా పడకుండా ఈ జన్మలోనే దాని ఫలితాన్ని చూపించింది. అనువైన వాతావరణం ఉంటే కర్మ ఎప్పుడూ వాయిదా పడదు.
త్వరలోనో లేదా కొద్ది కాలం తర్వాత మనం పాతిన విత్తనం నించి వచ్చిన పైరుని మనం తప్పక కోసుకుంటాం అని, ప్రేమని నాటితే ప్రేమని, మంచితనాన్ని నాటితే మంచితనాన్ని, ద్వేషాన్ని నాటితే ద్వేషాన్ని, సహాయాన్ని నాటితే సహాయాన్ని కోసుకుంటాం అని ఆనాటి ఈ రెండు సంఘటనలు ఋజువు చేస్తున్నాయి.
*సేకరణ:- హందాడి గణేశ్ వాట్సాప్ పోస్ట్.*