29, అక్టోబర్ 2020, గురువారం

తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు

 💐 *తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు* 💐


●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు

●మహాప్రస్థానం - శ్రీశ్రీ

●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం

●మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ

●చివరకు మిగిలేది - బుచ్చిబాబు

●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్

●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్

●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి

●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ

●కళాపూర్ణోదయం - పింగళి సూరన

●సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ

●గబ్బిలం - గుఱ్ఱం జాషువా

●వసు చరిత్ర - భట్టుమూర్తి

●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు

●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి

●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు

●చదువు - కొడవగంటి కుటుంబరావు

●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు

●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి

●వేమన పద్యాలు – వేమన

●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి

●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి

●అల్పజీవి – రావిశాస్త్రి

●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి

●ఆంధ్ర మహాభాగవతం – పోతన

●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి

●మొల్ల రామాయణం – మొల్ల

●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య

●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర

●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య

●మైదానం – చలం

●వైతాళికులు – ముద్దుకృష్ణ

●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి

●సౌందర నందము - పింగళి, కాటూరి

●విజయవిలాసం - చేమకూర వేంకటకవి

●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు

●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు

●మ్యూజింగ్స్ – చలం

●మనుచరిత్ర- అల్లసాని పెద్దన

●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ

●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి

●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు

●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర

●దిగంబర కవిత - దిగంబర కవులు

●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ

●పానశాల - దువ్వూరి రామిరెడ్డి

●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు

●అంపశయ్య – నవీన్

●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య

●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం

●జానకి విముక్తి – రంగనాయకమ్మ

●స్వీయ చరిత్ర – కందుకూరి

● మహోదయం - కెవి రమణారెడ్డి

●నారాయణరావు - అడవి బాపిరాజు

●విశ్వంభర – సినారె

●దాశరథి కవిత – దాశరథి

●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య

●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య

●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం

●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి

●పారిజాతాపహరణం - నంది తిమ్మన

●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు

●రాజశేఖర చరిత్ర – కందుకూరి

●రాధికా సాంత్వనము - ముద్దు పళని

● స్వప్న లిపి – అజంతా

●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి

●శృంగార నైషధం – శ్రీనాథుడు

●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు

●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు

●అను క్షణికం - వడ్డెర చండీదాస్

●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ

●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి

●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి

●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్

●గద్దర్ పాటలు – గద్దర్

●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి

●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్

●కుమార సంభవం - నన్నే చోడుడు

●మైనా - శీలా వీర్రాజు

●మాభూమి - సుంకర, వాసిరెడ్డి

●మోహన వంశీ – లత

●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి

●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి

●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు

●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి

●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం

●స్వేచ్ఛ – ఓల్గా

●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి

●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

●తృణకంకణం – రాయప్రోలు

●హృదయనేత్రి - మాలతీ చందూర్

●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్

●నీతి చంద్రిక - చిన్నయ సూరి

●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు


●నీలిమేఘాలు – ఓల్గా

●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల

●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్

●కొయ్య గుర్రం – నగ్నముని

●నగరంలో వాన – కుందుర్తి

●శివారెడ్డి కవిత – శివారెడ్డి


( సేకరణ :--@రామకృష్ణ యల్లంకి) భద్రాచలం

-________గురు శిష్యులు_________

 మా నాన్న చిన్నప్పుడు నాకు చిన్నప్పుడు చెప్పిన కథ..

 ఈ కథ ఎక్కడిదో నాకు తెలీదు..


-________గురు శిష్యులు_________

పూర్వ కాలంలో గురు శిష్యులు ఉండేవారు. కొన్ని సంవత్సరాల పాటు గురువు దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకొని శిష్యుడు జ్ఞానం సంపాదించాడు. తన దగ్గరి నుండి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి సమయం ఆసన్నమైంది అని  గురువు శిష్యుడిని పిలిచి ఆశ్రమం నుండి వెళ్లడానికి అనుమతి ఇస్తాడు. 

                     శిష్యుడు గురువు పై ఉన్న గౌరవంతో "గురువుగారూ..! ఇన్నాళ్ళుగా మీ బోధనల వలన నేను అపారమైన జ్ఞానం సంపాదించాను. మీరు నాకందిచిన ఈ జ్ఞానానికి గురు దక్షిణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కానీ స్థాయికి సరిపడేంత విలువైనది ఏదీ నాకు కనిపించడం లేదు.. కనుక మీరు ఏం కావాలో కోరుకోండి.. దాన్ని మీ గురు దక్షిణ గా సమర్పించుకుంటాను." అని గురువుతో పలికాడు. 

               ఆ మాటలు విన్న గురువు చిన్నగా నవ్వుతూ "నాపై నీకున్న గౌరవానికి సంతోషిస్తున్నాను. నాకు ఏమీ అవసరం లేదు. నువ్వు బాధ్యతగా, ధర్మ బద్ధంగా జీవితం కొనసాగించు.. అదే గురుదక్షిణ" అని హితవు పలికాడు.


         శిష్యుడు గురువు మాట వినకుండా " మీరు నన్ను అడిగి తీరాల్సిందే.. మీరు అడిగింది ఎంత కష్టమైనా, ప్రపంచం అంతా గాలించి అయినా సరే తెచ్చి ఇస్తాను. దయచేసి మీకు ఏం కావాలో విన్నవించండి" అని వేడుకున్నాడు.  


            గురువు ఎంత చెప్పినా అతడు వినాకపోయే సరికి గురువు గారు ఇలా అడిగారు. "చూడు నాయనా..! ఈ సృష్టిలో ఎవరికీ, దేనికీ పనికిరానిది ఏదైనా ఉంటే అది నాకోసం తీసుకురా.. నీకు ఎంత సమయం కావాలన్నా తీసుకో.. ఎప్పుడు నీకు నేను అడిగింది దొరుకుతుందో అప్పుడు దాన్ని నాకు గురు దక్షిణగా  సమర్పించు. " అని చెప్పాడు గురువు. 


           గురువు మాటలు విన్న శిష్యుడు "ఏమిటి గురువు గారూ... ! పనికిరాని వస్తువా .. !  నేను ఎంతో కష్టతరమైన కోరిక కోరుతారు అనుకుంటే ఇంత సులభంగా అడిగారేమిటి..? క్షణాల్లో తీసుకొస్తాను" అని శిష్యుడు అక్కడి నుండి సెలవు తీసుకుని వెళ్ళాడు..


   శిష్యుడు వెళ్తూ వెళ్తూ దారిలో ఎండిపోయి రాలిన ఆకుల్ని చూసాడు. ఇవి పనికి రానివే కదా అని గురువుకు ఇద్దాం అని తీసి సంచిలో వేశాడు. కాస్త దూరం నడిచి ఆలోచించాడు.. ఎండిపోయిన ఆకుల వలన లాభం లేకపోలేదు.. వీటిని కాల్చి ఆ మంటతో చలి కాచుకోవచ్చు. లేదా వంట కోసం పొయ్యిలో వేసి మంట వెలిగించ వచ్చు. కనుక ఇవి గురువు గారికి ఇవ్వడం కుదరదు అని సంచిలో నుండి తీసి పారేశాడు. మళ్లీ ఆలోచించి వీటిని కాల్చడం వలన బూడిద వస్తుంది. ఆ బూడిద గురువు గారికి ఇస్తాను అనుకుని వాటిని తగళబెడతాడు. బూడిదను తీసుకెళుతు, దీనితో పాత్రలు శుభ్రం చేయవచ్చు. కనుక ఇది కూడా గురువు గారికి ఇవ్వలేను అని బూడిద విడిచి పెట్టి ముందుకు సాగుతాడు. 

      

     ఈసారి అతడికి ఒక బావి కనపడుతుంది. ఆ బావి దగ్గర పాడుబడిన ఒక చేంతాడు కనపడుతుంది. ఈ తాడు తెగిపోయి ఉంది. కనుక నీళ్ళు తెండడానికి ఇది పనికి రాదు. కనుక అది ఇవ్వాలి అనుకుంటాడు. కానీ ఆలోచించి కనీసం కట్టెలు కట్టడానికైన తెగిన తాడు ఉపయోగపడుతుందని దాన్ని విడిచి పెడతాడు. 


  ఇంకాస్త ముందుకు పోతాడు. చిన్న రాళ్ళ గుట్ట కనపడుతుంది. రాయిని తీసికెళ్ళి ఇద్దాం అని తీసుకుంటాడు. ఇంతలో oka పిల్లవాడు వచ్చి అక్కడ ఉన్న రాయిని తీసుకుని ఆ రాళ్ళ గుట్టకు ఎదురుగా ఉన్న చింత చెట్టు చూసి చింత కాయల్ని కొడతాడు. అది పనికి వచ్చేదే అని విడిచి పెడతాడు.. 

  కొంత దూరం పోయాక విరిగా కుండని దారిలో చూస్తాడు.. పగిలిన కుండ అసలు దేనికీ పనికిరాదు అని సంతోషంగా ఆ పెంకులు గురువుగారికి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఇంతలో ఇద్దరు ఆడపిల్లలు వచ్చి ఆ పెంకు ముక్కల్ని తీసుకుని వెళ్తుంటే వాళ్ళని పిలిచి అవెందుకు మీకు అని అడుగుతాడు. మేము ఈ పెంకుముక్కళ్తో తొక్కుడు బిళ్ళ ఆట ఆదుకుంటాం అని జవాబు చెప్తారు. దానితో అది కూడా పనికి వచ్చేదే అని నిరాశగా విడిచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు అంతా వెతికి ఎక్కడా ఏమీ దొరకక నిరాశగా గురువు దగ్గరకు వెళ్లి క్షమించమని అడుగుతాడు.

 "గురువుగారూ మీ బోధనల ద్వారా నేను పూర్తి జ్ఞానం సంపాదించా అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది.. ఈ సృష్టిలో పనికిరాని వస్తువు ఏదీ ఉండదు.  ప్రతి ఒక్కటీ ఏదో ఒక విధంగా ప్రతి జీవికీ అవసరమైనది. ఒకరికి అనవసరమైన వస్తువు మరొకరికి అవసరమైన వస్తువు అవుతుంది. ఈ విషయాన్ని నేను గ్రహించలేక అంతా తెల్సు అని గార్వపడ్డాను. నన్ను క్షమించండి అని గురువు పాదాలపై పడ్డాడు. 


  బదులుగా గురువుగారు " చూడు నాయనా ఇప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడివి అయావు. నేను జ్ఞాన బోధన మాత్రమే చేశాను. దాని ద్వారా మీరు జీవితాన్ని తీర్చి దిద్దుకోవాలి.. ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగపడేలా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి. సమాజంలో నీకంటూ ప్రత్యేక స్థానం నువ్వు కలిగి ఉంటే అదే నాకు గురుదక్షిణ అని చెప్పి శిష్యుడిని పంపిస్తాడు. 


గురువు మన నుండి ఏమీ ఆశించడు. మన విజయాన్ని తన విజయంలా భావించి మనకంటే ఎక్కువ సంతోష పడతాడు. అటువంటి గురువులకు మనం ఇవ్వగలిగే నినమైనట్ గురు దక్షిణ వాళ్ళు మనకు నేర్పిన విలువల్ని పాటించి సమాజంలో నిలబడటమే.  అటువంటి గురువు మనం ఏం ఇవ్వాలని అనుకున్నా అది తక్కువే.. కనుక మనకు విద్య నేర్పిన గురు వులు ఎప్పుడు ఎక్కడ  కనపడినా రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం.

సుభాషితం

 🙏🌹🌹*నేటి సుభాషితం* 🌹🌹🙏


*శ్లోకం: సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం ।*

*చక్రవత్పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ ।।*


సుఖం తర్వాత దుఃఖమూ, దుఃఖం తర్వాత సుఖమూ వస్తూ ఉంటాయి. సుఖం గానీ, దుఃఖం గానీ శాశ్వతంగా ఉండిపోవు. ఇవి రెండూ ఒకదాని తర్వాత ఒకటి ఒక చక్ర పరిభ్రమణంలోవలె వస్తూ పోతూ ఉంటాయి.


ఇది సృష్టి ధర్మంలో సహజం. కాబట్టి, సుఖం వచ్చినప్పుడు, అదియే శాశ్వతం అనుకొని పొంగిపోవడమూ, దుఃఖం వచ్చినప్పుడు అదియే శాశ్వతమనుకొని క్రుంగిపోవడమూ కూడదు.


సుఖం వచ్చినప్పుడు లేదా కలిగినప్పుడు, ఏ రకమైన అవాంతరాన్నైన  ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని, అలాగే దుఃఖం కలిగినప్పుడు లేదా వచ్చినప్పుడు నిరాశావాదంతో కృంగిపోకుండా ఆశతో మంచి భవిష్యత్తుకై ఎదురు చూసే మనోధైర్యాన్ని అలవరచుకోవాలి.


దుర్లభం హి సదా సుఖం అని నానుడి. అంటే ఎల్లప్పుడూ సుఖమే కలిగి ఉండడము అనేది అసాధ్యము అని ప్రతీతి. మానవ జీవితంలో ఎన్నో విధాలైన ఆటుపోట్లు, సుఖ దుఃఖాలు, ఆర్థికపరమైన ఒడిదుడుకులూ అనేవి సహజం. సంసార సాగరంలో అనేకమైన ఒడిదుడుకులూ, కష్టాలూ అందరి జీవితాలలోను సహజం. వాటిని అన్నిటినీ అధిగమించి జీవన యానం చేయడం, జీవిత గమ్యాలని చేరడము అనేవి మానవ జన్మకి సార్థకతని ఇస్తాయి. తాత్కాలిక ఆటుపోట్లకి జంకి అర్థాంతర నిర్ణయాలని తీసుకోవడం అనేది బుద్ధిమంతుల లక్షణం కాదు. ఎంతటి కష్టమొచ్చినా మనో నిబ్బరాన్ని కోల్పోకుండా ఉండడం అనేది అలవరచుకోవాలి.


ఈ సత్యాన్ని గ్రహించి కష్టాలు వచ్చినప్పుడు వెనువెంటనే సుఖము కూడా తప్పకుండా వస్తుంది అనే ఆశావాదముతో స్థిరచిత్తాన్ని కలిగి ఉండి వాటిని అధిగమించగలిగే సామర్థ్యతని పెంపొందించుకోవాలనేది ఈ సుభాషితము యొక్క అంతరార్థము.


🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏

వాగ్భూషణం

 🌺మంచి మాట🌺


🌹వాగ్భూషణం🌹


ఎదుటివాడి మనసును గాయపరచేలా మాట్లాడటం, హింస కిందకే వస్తుందని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. మనం ఎదుటివారిని పలుకరిస్తే పండు వెనె్నల కురిసినట్లుండాలి. ఎపుడు ఎక్కడ మాట్లాడినా అది ప్రియంగా మాట్లాడాలని భారతం కూడా చెబుతుంది. మాట మనిషి విలువను పెంచుతుంది. మంచిమనిషిగా కీర్తి తెచ్చుకోవాలంటే మంచి మాటే దానికి మార్గగామి.

‘‘మంచి మాట చాలు మనసు గాయంబు మాన్పజాల గొప్ప మంచువోలె’’ అన్నాడొక మహాకవి. ‘‘మాటల్లో ఓర్పు - మనసులో నేర్పు’’ ఉండాలి.ఈ మాటలు కూడా మితంగా ఉండాలి. అతిగా మాట్లాడడం వల్ల ఆ మాటలు పేలవంగా తయారవుతాయ. వినేవారికి విసుగును కలిగిస్తాయ. ఒక్క మాట మాట్లాడగానే వారు ఎలాంటివారో నిశితంగా చెప్పవచ్చు అని రామాయణం చెబుతుంది. హనుమంతుడు మారు వేషంలో వచ్చి రామలక్ష్మణులతో మాట్లాడితే హనుమంతుని మాట్లాడే పద్ధతిచూసి మంచివాడు హితం ఒనగూర్చువాడై ఉంటాడని రాముడు అంటాడు. సుగ్రీవుడు ఇచ్చిన మాటను మరిచాడని అట్లా మరిస్తే వాలి వెళ్లిన దోవనే సుగ్రీవుడు వెళ్తాడని చెప్పడానికి మహారౌద్రాకారుడై లక్ష్మణుడు వస్తే తార, హనుమంతులు ఎదురుగా వచ్చి తార సుగ్రీవుని దయనీయమైన స్థితి చెప్పి రుద్రావతారుడైన లక్ష్మణుని మిత్రావతారానికి తీసుకొని వస్తారు. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తున్నట్టు ఉండ కూడదు. వినయంగా, విన్రమంగా పెద్దలు గౌరవించేట్టుగాను, పిన్నలకు బోధ చేసేసట్టుగా పలుకులుండాలని విజ్ఞులు అంటారు.

ప్రాణం పోయినా ఫరవాలేదు కానీ ఇచ్చిన మాటను తప్పదని ఆవు పులి కథ మనకు చెబుతుంది. భర్తృహరి అన్నట్టు తారాహారాలు, సుగంధ జలాభిషేకాలు, ఇతర భూషణాలన్నీ నశించవచ్చు కానీ వాక్కు నశించదు. వ్యక్తిని ఎల్లప్పుడు అలంకరించి ఉండే భూషణం వాక్కు మాత్రమే. అందుకే ‘వాగ్భూణం భూషణం’ అన్నారు. మాటమంచిదైతే వూరు మంచిదనడంలోను ఇదే అంతరార్థాన్ని కలిగి ఉంటాయ.

నాలుకపైనే నిలచిన మాట వల్లనే మిత్ర బాంధవ్యాలు లభిస్తాయి.పరుషాలకు పోతే లేనిపోని వైషమ్యాలకు తావు ఏర్పడుతుంది. అందుకే మాట్లాడేటపుడే సంయమనం పాటించాలి. విషయ సారంతో మాట్లాడేవాడు వాగ్మి, విషయం అల్పమైతే వాడిని వదరుబోతు అంటారు. వాక్చాతుర్యం కూడా గొప్ప కళ. ప్రపంచాన్ని అది పాలించినట్లుగా మరేది పాలించలేదు. మనిషిని పడగొట్టేది కూడా మాటే. మాట తీరును బట్టి మనిషిని అంచనా వేయొచ్చు. మాట విలువ తెల్సిన వారికి మాటలోని మర్మం తెలుస్తుంది. చేతులున్నందుకు దానం చేయాలి. చెవులున్నందుకు మంచిమాటలు వినాలి. నోరున్నందుకు మంచి మాట మాట్లాడాలి.

ఎవరికైనా మాట ఇచ్చే ధైర్యం, ఓదార్పు, స్ఫూర్తి, బలీయమైంది. మనసులు కలవడానికి, మనసులో ఉన్నది తెల్పడానికి, పని సాధించడానికి మాటే సాధనం. మనోవాక్కాయాలనే త్రికరణాలలో వాక్కుకున్న స్థానం విశిష్టమైంది. పరమేశ్వరుని వాక్కును ‘రుక్కు’ అంటారు.

పిండిని జల్లెడ పట్టి శుద్ధి చేసినట్లే, వాక్కును మనస్సుతో పరిశుద్ధం చేయాలి. సదాలోచనతో చేసే సంభాషణలోనే లక్ష్మీ నివశిస్తుందని రుగ్వేదం చెబుతుంది. తీయని మాట నలువైపులా ఆనందాన్ని, సుఖాన్ని పరివ్యాప్తం చేస్తుంది. ఇది వశీకరణ మంత్రం కనుక పరుష వచనాలు వదిలిపెట్టాలి. పరుషమైన మాట విషం కంటే, అగ్నికంటే ప్రమాదకరమైనది అని తులసీదాసు అంటారు. భగవంతుని ప్రస్తుతించని వాక్కులు వ్యర్థమనీ ప్రహ్లదుని చేత పోతనామాత్యుడు చెప్పించాడు.

దయ, స్నేహం, దానం, మధుర వాక్కులు మనిషికి అత్యంత ఆవశ్యకమైనవి. మూడు లోకాలలో వీటికి మించిన ఆదర్శనీయ సద్గుణాలు మరేమీ లేవు. వినయంతో కూడిన మాటలో విశ్వానే్న జయించవచ్చు కనుక నీవు సదా మంచి మాటలే మాట్లాఢుతుండమని *యయాతి తన కుమారునికి నీతిబోధ చేశాడని యయాతి వృత్తాంతం చెబుతుంది.

వీటి అన్నింటి వల్ల మనమూ మంచి చేకూర్చే మాటలే మాట్లాడుదాం. చెడుకు దూరంగా ఉందాం. *సాయబాబా కూడా పరులను ద్వేషించడం అంటే అది మహాపాపమని చెప్పేవారు . వేదవ్యాసుడు కూడా* *పరపీడనమే పరమ పాపమని చెప్పాడు. కనుక పరులకు కలలో కూడా కీడు చేయకుండా ఉందాం* 


 🎊🦚🌹🦜🌻🎊

మాహేశ్వర సూత్రాలు*

 🚩🚩 *హిందూ ఆధ్యాత్మిక వేదిక*🚩

===================

*మాహేశ్వర  సూత్రాలు*


*పూర్వం పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు* *పర్యాయాలు మ్రోగించగా, ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను ‘పాణిని’ అనే ఋషి గ్రహించి,*

*పదునాలుగు వ్యాకరణ సూత్రాలుగ రచించాడు. ఈ* *సూత్రాలే "మాహేశ్వర" సూత్రాలుగ పిలువబడు తున్నాయి*


*ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు*.


 *ఈ శ్లోకం చూడండి*.


 *నృత్తావసానే నాటరాజ రాజో / ననాద ఢక్కాం నవ పంచవారం"*


*(నవ=తొమ్మిది. పంచ=ఐదు కలిపితే =14)*

*ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ /ఎతద్విమర్శే శివ సూత్రజాలం//*


*అక్షరాలని సృష్టించి సూత్రీకరించింది పాణిని ఐతే, వాటికి వార్తీకం వ్రాసినది ‘వరరుచి’. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది ‘పతంజలి మహర్షి.’ అందుకనే:*


*"వాక్యకారం వరరుచిం/ భాష్యకారం పతంజలిం/పాణినిం సూత్రకారంచ/ ప్రణతోస్మి మునిత్రయం//"*


*అని ముందుగా పై ముగ్గురు మునులకి నమస్కరించి, పూర్వం  వ్యాకరణాన్ని, తద్వారా భాషని అభ్యసించేవారు.*


 *ముందుగా ఈ పదునాలుగు సూత్రాలని తెలుసుకొందాం*.  


*ఇవి పరమేశ్వరుడు చేసిన ఢమరుక శబ్దం నుండి గ్రహింపబడినవి.*


1 *‘అ ఇ ఉ ణ్’ (అకార, ఇకార, ఉకారాలు)*

2 *‘ఋ లు క్’ (ఋకార అలుకారాలు)*

3 *‘ఏ ఓం గ్’ ( ఏకార, ఓకారాలు)*

4 *ఐ ఔ చ్’ (ఐ కారము, ఔ కారము)*

5 *‘హ య వ ర ట్’ (హకార, యకార, వకార, రకారాలు.)*

6 *‘ల ణ్’ (లకారం)*

7 *‘ఙ, మ, ఞ, ణ నం’ ( వర్గల యొక్క చివరి ఐదు అక్షరాలు )* 

8 *‘ఝ, భ య్’ ( ఝాకార, భకారాలు)* 

9: *‘ఘ,ఢ,ధ ష్’ ( ఘకారం, ఢ కారం, ధకారం)* 

10 *‘జ, బ, గ, డ ద శ్’ ( ఐదు అక్షరాలు )*

11 *‘ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్’ ( ఎనిమిది అక్షరాలు)*

12 *‘క ప య్’ (క & ప )*

13 *‘శ ష స ర్’( శకార, షకార,సకారాలు )*

14 *‘హల్’ ( హకారం)* 


*ఇవే ఈ పదునాలుగు మహేశ్వరుని సూత్రాలు.* 


*ప్రతి సూత్రం చివర ఉన్న పొల్లు హల్లులు సులభంగా పలకడానికి నిర్దేశించ బడినవి. అట్లే అచ్చులు, హల్లులు కూడ ప్రత్యాహార సంజ్ఞతో సులభంగ అర్థమయే రీతిలో నిర్దేశించబడినవి*.


*అవి తొలి సూత్రములోని మొదటి అక్షరం ‘అ’ నాల్గవ సూత్రములోని చివరి హల్లు ‘చ్’ కలిపితే ‘అచ్’ సంజ్ఞ ఏర్పడి, వాటిమధ్య ఉండే అక్షరాలని ‘అచ్చులు’ అని వ్యవహరిస్తారని, ఐదవ సూత్రములోని మొదటి అక్షరం ‘హ’ని గ్రహించి పదునాల్గవ సూత్రములోని చివర ఉన్న ‘ల్’ అనే పొల్లుతో కలిపితే ‘హల్’అనే సంజ్ఞ ఏర్పడి వాటి మధ్య ఉండే అక్షరాలని ‘హల్’ అనే పేరుతో పిలుతురని పాణిని స్పష్టంగా సూచించాడు.*


 *ఇట్టి సూత్రములతో ఎనిమిది అధ్యాయాలలో పాణిని  మహర్షిచే రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథానికి “అష్టాధ్యాయి” అని పేరు.*


*ఈ సూత్రాలకే ‘వరరుచి’ వార్తికాలని, “పతంజలి” భాష్యాన్ని రచించి లోకానికి ప్రసాదించారు.  ఇప్పటికీ ఇదే గొప్ప ప్రామాణిక గ్రంథము.*


🙏🔯⚛️🔯⚛️🔯⚛️✡️🙏

జపనీస్ దంపతుల

 *జపనీస్ దంపతుల ఫస్ట్ నైట్*. ❤😜

                                                                          

ఓ జపాన్ దేశపు అబ్బాయి అమ్మాయి పెళ్ళి నిశ్చయమైన రోజు నుంచి వేచి ఉండే మొదటి రాత్రి వచ్చింది. మన మెట్రో లాగే....


అమ్మాయి ఒక చేతిలో వైన్ గ్లాస్  పట్టుకొని బెడ్ రూమ్ కి వచ్చింది.


భర్త చిరునవ్వుతో అడిగాడు.  సుతాకి?


ఆమె *wine* ఇస్తూ సిగ్గుతో  చెప్పింది *"కొద్వానిని"?*


భర్త ప్రేమతో చిరు కోపం వచ్చేలా అన్నాడు...

*డోకో అన్వి తోడి రూమి హొవాయాకి?*


దానికి ఆమె మెల్లగా మృదువుగా చెప్పింది...

*"మిమియో మాకోడిండ"*


భర్త మళ్లీ నవ్వుతూ అన్నాడు *"నా మియ్జ కినాటిన్ కౌఝి"*


అందుకు ఆమె నవ్వుతూ వయ్యారంగా చెప్పింది...    

 *"సు కి కినా మాటొ"*


అప్పుడు ఆమె భర్త ఆమె చెవులో మెల్లగా ఇలా చెప్పాడు... *"సాకోటిటి యేమి చీ"*


అందుకు ఆమె నవ్వుతూ , *జయో జిబయో* అన్నది

..........

..........


నిజంగా మీ అందరిని మెచ్చుకోవాలి.


 ఒక్క ముక్క అర్థం కాక పోయినా *‘ఫస్ట్ నైట్*’ అనే సరికి  ఎంత ఓపిగ్గా

 చదివారో......                                                                                  😜😜😜🤣🤣🤣

బిచ్చగాళ్లకు

 నేటి నుండి బిచ్చగాళ్లకు ఆహారం మరియు నీరు మాత్రమే ఇద్దాము, ధన రూపంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు.


ఒక నిర్దిష్టమైన సామాజిక పునరుజ్జీవనం కోసం ముంబైలో ప్రచారం ప్రారంభమైంది. ఈ సామాజిక పునరుజ్జీవన ప్రచారంలో భాగంగా, అక్కడి ప్రతి ఒక్కరూ 

"ఇప్పటి నుండి, మేము అన్ని రకాల బిచ్చగాళ్లకు (మహిళలు / పురుషులు / వృద్ధులు / వికలాంగులు / పిల్లలు) ఆహారం మరియు నీరు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వము" అని ప్రమాణం చేశారు.


దీని ప్రయోజనం ఏమిటంటే బెగ్గింగ్ మాఫియా యొక్క ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల పిల్లల అపహరణ కూడా తగ్గుతుంది. 


బెగ్గింగ్ మాఫియా దాతలలో దాతృత్వాన్ని ప్రలోభపెట్టడానికి, అపహరణకు గురైన పిల్లల అవయవాలు కత్తిరించడం లేదా యాసిడ్‌తో వికృతీకరించడం చేస్తున్నారు. కొందరికి శరీర భాగాలకు రక్త సరఫరాను నిలిపివేయడానికి రక్త నాళాలు కుట్టబడి ఉంటున్నాయి.


అందువల్ల నేటి నుంచి మీరు కూడా ఈ సామాజిక మార్పుకోసం భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. 


మీరు ఈ ప్రచారాన్ని ఆమోదించినట్లయితే, ఈ పోస్ట్‌ను ఫార్వార్డ్ చేయండి. మరియు మీరు ఇకపై బిచ్చగాళ్లకు ఆహారం మరియు నీరు తప్ప నగదును అందించబోమని ప్రమాణం చెయ్యండి.


ఒక క్రొత్త సామాజిక మార్పునకు నాంది పలకండి.


 _*అన్ని గ్రూప్ లకు ఈ మెసేజ్ ఫార్వార్డ్ చెయ్యండి*_

కూలీ

 "కూలీ"

ఒకానొక ఊర్లో బీద కూలివాడు ఉండేవాడు..

ఒకరోజు ఒక చెక్కల వ్యాపారి దగ్గరకు వెళ్లి ..

ఏదైనా పని చెప్పండి అని బ్రతిమలాడేడు ...

చెక్కల వ్యాపారి సరే అని చెప్పి.

జీతం మాత్రం నువ్వు ఎంత చేస్తే అంత అని చెప్పేడు..

.

కూలివాడు నాకు నా,పిల్లలకు రోజుకు

బ్రతకడానికి 100 రూపాయలు అవసరము అవతాయి. 

కాబట్టి నాకు 100 రూపాయలు ఇస్తే చాలు అన్నాడు.

అప్పుడు కలప వ్యాపారం చేసే యజమాని ...

అలా కుదరదు ... 

నీ పనికి తగ్గట్టుగా నీ జీతం ఉంటుంది..

పని  ఎంత ఎక్కువగా చేస్తే  అంత డబ్బు వస్తుంది..

అని బదులిచ్చాడు.. 

కూలివాడు తప్పక సరే అన్నాడు..

 .

కూలివాడు యజమాని చెప్పిన ఒప్పందంకి 

సరే అని చెప్పేడు.

అప్పుడు ఆ యజమాని  ...

ఆ కూలివాడుకి ఒక మంచి బలమైన  కత్తి ఒకటిచ్చి 

అడవిలో పెద్ద పెద్ద చెట్ల మ్రానులను నరికి తెమ్మన్నాడు...

.

కూలివాడు సరే అని వెళ్లి ...

అడవిలో చెట్లను నరకడం మొదలుపెట్టేడు..

ఎలాగయితేనేం పొద్దు కునికే సరికి ...

15 చెట్లను నరికి వాటిని తెచ్చి యజమానుడుకి అప్పజేప్పేడు.

యజమానుడు భళా  దాసుడా..

ఎవరైనా ఒక్కరోజులో 7 చెట్లకంటే ఎక్కువగా నరకలేరు...

నువ్వు ఏకంగా 15 చెట్లు నరికావు ... భళా అని పొగిడి..

నువ్వు మొదటి రోజే చాల ఎక్కువ కష్టపడ్డావ్ అని మెచ్చుకుని. 

చెట్టుకు 10 రూపాయలు చప్పున 

ఆ కూలివాడుకి 150రూపాయలు

ఇచ్చాడు..

.

ఆ  కూలివాడు మరుసటి రోజు 

అడవికి వెళ్లి ఇంకా ఎక్కువ కష్టపడితే 

ఇంకా డబ్బులువస్తాయి కదా అని 

మొదటి రోజు కంటే ఎక్కువ సేపు

కష్టపడి పోద్దు కునికేసరికి 10 చెట్లను

నరికి తెచ్చి యజమానికిచ్చి ...

చెట్టుకు 10 రూపాయలు చప్పున 10 చెట్లు అప్పజెప్పి 

100 రూపాయలు కూలి  తీసుకున్నాడు..

.

మూడవరోజు కూలివాడు  ఇంకా కష్టపడి 

పనిచేసి పోద్దు కునికేసరికి 5 చెట్లు

నరికి  యజమానుడుకి అప్పజెప్పి

చెట్టుకు 10 రూపాయలు చప్పున 

50 రూపాయలు తీసుకుని

వెళ్ళిపోయాడు...

మరుసటి రోజు ఎలా అయిన 

ఎక్కువ చెట్లు నరకాలని వేకువ

జామున చీకటితో బయలుదేరివెల్లి 

ఆ అడవిలో  ఎన్నడులేనంత గా

కష్టపడి వేకువజామున నుండి చీకటి

 పడేవరకు  కష్టపడి

ఒకే ఒక చెట్టు నరికి యజమానుడుకి 

అప్పజేప్పేడు .

.

అప్పుడు ఆ యజమానుడు చెట్టుకు 

10 రూపాయలు చప్పున పది 

రూపాయలు తీసి ఆ పనివాడి చేతిలో

పెట్టేడు.

పనివాడు పది రూపాయల నోటు

 వైపు దీనముగా చూస్తూ శాయశక్తులా కష్టం

పెంచినా ఫలితం పది రూపాయలేే 

అని తలంచి...

ఎంత చేస్తే అంత అన్నయజమానుడితో 

ఉన్న ఒప్పందం గుర్తెరిగి 

చేసేది ఏమీ లేక...

వెళ్ళిపోతూ  వెళ్లిపోతూ

.

అయ్యగారు నా కష్టం లో ఎటువంటి

లోపం లేదు.. 

చీకటి పడేవరకు చెమట ఓర్చి 

శ్రమించాను కాని ఒకటి కంటే 

ఎక్కువ నరకలేకపోయాను...

అని దీనముగా అన్నాడు..

.

అపుడు యజమానుడు నేను నీకు 

ఇచ్చిన కత్తికి పదును పెట్టి ఎన్నాళ్ళు

అవుతుంది ??అని అడగగానే.

కూలివాడు నేను రోజు నా  పనిలో

మునిగిపోవడంవలన కత్తికి పదును

పెట్టె సమయం నాకు లేదు...

అందుకే కత్తికి ఒక్కసారికూడా 

పదును పెట్టలేదు అని అన్నాడు...

అపుడు యజమానుడు  

అర్ధం లేని నీ శ్రమకు , 

ఆర్ధిక పతనానికి  

శరీర శ్రమలకి  

కారణం కత్తికి పదును లేకపోవడమే.


.

పదును పలితం...

ఎటువంటి సమస్యనైనా సులువుగా  

కోసిపారేయడమే


మార్పు  లేని జీవితం , పదును లేని 

మొద్దుబారిన కత్తిలాంటిది..

ఏవేవో శ్రమలు పడతాం కాని

ఫలితం ఆవిరి.....

కష్టపడుతున్న..

కష్టపెట్టే పరిస్థితులు మాత్రం 

మారనే మారవు 

పదునైన ఆలోచనలతో మాత్రమెఠ 

గోప్పవిజయాలు సాధించగలము..


👍👍ఫేసుబుక్ నుండి సేకరణ.

ముగ్గు - రెమెడీస్

 ముగ్గు - రెమెడీస్

🕸🏵🕸🏵🕸🏵


ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.


ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు.

పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. 


ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది.


 అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా.


 యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు.


 అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.


తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి.


 యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి.


 దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.


నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.


దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. 

ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.


ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.


పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.


అంతేకాదండోయ్! మనం ముగ్గులు రోజు వేయలేక పైంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. 


ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.


నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. 


ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.


ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి.


 పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. 


ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. 


ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు.


 అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. 


శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.


ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.


 మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

ఆత్మ గోష🌷

 🌷ఆత్మ గోష🌷


శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బతికినా శవం అనే అంటారు, సమయం మించకుండా తీసేయండి అని పెద్దలు అంటున్నారు, భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్లిపోయారు.. అప్పుడు మొదలు అవుతుంది ఆత్మ గోష నా భార్య నా పిల్లలు నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు అతను ఎవరికీ కనిపించడు వినిపించడు ఇది నా ఇల్లు నా వస్తువులు నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్న ఏది నాతో తీసుకుని వెళ్లలేకపోయానే.. వీటి కోసమా జీవితం అంతా కష్టపడ్డాను.. అని ఏడుపు మొదలు అవుతుంది.. 


గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఎదో సాకుతో సాదించాను కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది ఇప్పుడు ఓడార్చే శక్తి కూడా లేదు..అని అప్పుడు అనిపిస్తుంది   కుటుంబ సభ్యులను చూసుకుని చేసిన పోరాబాట్లు గుర్తు చేసుకొని ఒక్కసారి భగవంతుడు బతికిస్తే అందరికి క్షమాపణ చెప్పుకుని మళ్ళీ నిదగ్గరకు వస్తాను తండ్రి అని ఆత్మ గోషిస్తుంది, చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషం గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 


ఎక్కడైతే వదిలేసారో అదే స్మశానానికి తిరిగి వెళ్లి అక్కడ ఒంటరిగా రోదిస్తూ భగవంతుడా అని పిలవ గానే ఓ స్వరం వినిపిస్తుంది నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను బయపడకు అని ,ఎవ్వరూ రాని చోటికి ఏ దిక్కు లేని చోట కూడా నీ కోసం శివుడు ఉన్నాడు  అప్పుడు కనిపిస్తాడు దేవుడు.  


అప్పటివరకు ఆత్మ గోషతో రోదిస్తున్న ఆత్మ ఏమైయ్యా బతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను..ఎంత మొక్కి ఉంటాను ఏనాడైన ఇలా వెంటనే పలికావా ఇప్పుడు మటుకు ప్రత్యక్షం ఐయ్యావు అని అడుగుతాది ఆత్మ , శివయ్య అంటాడు నేను నువ్వు పిలిచిన ప్రతి సారి పలుకుతూనే ఉన్నాను కానీ నువ్వు వినలేక పోయావు నువ్వు ఒకసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను అది నీకు వినపడాలి అని కానీ నువ్వు బతికి ఉన్నంత కాలం నేను నాది అనే మాయలోనే ఉన్నావు.. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు కనుకే నా మాట వినగలిగావు.. స్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను నీ ప్రతి కష్టంలోనూ తొడుగానే ఉన్నాను దాటిస్తూనే ఉన్నాను కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నావు కనుక నన్ను గుర్తించలేక పోయావు.. నువ్వు వచ్చే టప్పుడు నువ్వు పోయే టప్పుడు నీ తో వస్తున్నది నీ కర్మ మటుకే ఇంక ఏదీ నీతో రాదు అని శివయ్య చెప్పాక.. ఏది శాశ్వతం కాదు అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది. రుణ బంధం ఉన్నంత వరకే ఈ జీవితం.. దేహం తట్టుకునే వరకే ప్రాణం తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే పోతుంది ప్రాణం ఇంకో కొత్త దేహాన్ని వెతుకుంటుంది ప్రాణమే అలా ఉన్నప్పుడు ఇంక ఋణ బంధాలు ఎలా ఉంటుంది ఆలోచించండి.


🌷హర హర మహాదేవ🌷

మహాభారతము ' ...63 .

 మహాభారతము ' ...63 . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


ద్రౌపది ధర్మరాజుతో ధర్మాధర్మాల గురించి చర్చిస్తూ యిలా అన్నది :  

'  మహారాజా ! మీరూ, మీ సోదరులూ సదా ధర్మాన్నే ఆచరిస్తూ, ధర్మ ప్రచార నిర్వహణలోనే వున్నారు.   తమరైతే, ధర్మమార్గ నిమిత్తము, నన్ను, మీ ప్రియమైన సోదరులనూ కూడా వదులుకోవడానికి సిద్ధంగా వుంటారు.  ధర్మో రక్షతి: రక్షిత: అని రాజు ధర్మబుద్ధితో వుంటే, ధర్మమూ రాజును రక్షిస్తుందని ఆప్తవాక్యం.  కానీ మీ విషయంలో  యీసూక్తి పనిజేస్తున్నట్లు లేదు. మీరు ధర్మాన్ని పట్టుకుని ప్రాకులాడుతున్నా, ధర్మం మిమ్ములను క్రీగంటకూడా చూడడం లేదు.'


' ధర్మనందనా !  మీరు ధర్మాన్ని నీడలాగా వెన్నంటి వున్నారు. అహంకారాన్ని దరి జేరనీయలేదు.   బుధజనులను పూజించారు, చేతికి యెముకలేకుండా  దానధర్మాలు చేశారు.  ఇంత మానసికవ్యధ  అనుభవిస్తూ కూడా,  అరణ్యాలలో తిరుగుతున్నా, ధర్మోపన్యాసాలు చేస్తున్నారు.   ఇన్ని మంచిగుణాలు వుండీ, జూదం అనే వ్యసనం యెలా పట్టి కుదిపేసింది తమరిని ?  '


'  స్వామీ !  ఇదంతా దైవాధీనమైన ప్రక్రియ.  మనమందరమూ,  ఆ పరమేశ్వరుని చేత ఆడింపబడుతున్న, కీలు బొమ్మలమేమో అనిపిస్తున్నది.  పిల్లలు ఆటబొమ్మలతో ఆడుకుంటే, పరమాత్మ జీవులతో ఆడుకుంటున్నాడేమో !  తానే కర్మలు చేయిస్తాడు.  కర్మఫలాలు యిస్తాడు.  తాను మాత్రం దేనినీ అంటిపెట్టుకుని వుండడు. '


ధర్మపరంగా జీవిస్తూ కష్టాలు పడుతున్న మీకు, వక్రమార్గాన జీవిస్తున్నా రాచరికం అనుభవిస్తున్న దుర్యోధనునికి, ఈశ్వరదృష్టే కారణం కదా ! ఇదేకదా ఈశ్వర నిర్ణయం. '  అన్నది ద్రౌపది.


ద్రౌపది మాటలకు అమితాశ్చర్యాన్ని వ్యక్తం చేసిన ధర్మరాజు,  ' ద్రౌపదీ ! నీవు చాలా

అద్భుతంగా నేర్పుగా మాట్లాడతావు.   నా దుర్దశను అడ్డంపెట్టుకుని నీవు నాస్తికవాదాన్ని ప్రతిపాదిస్తున్నావు.  కష్టాలు పడుతున్నప్పుడు, దేవుని నిందించడం, సాధారణంగా అందరూ చేసేపని !  ఏ విధమైన సందేహాలు లేకుండా సంపూర్ణ శరణాగతితో, భగవంతుని ఆశ్రయించేవాడు, ఇహంలో, పరంలో సుఖశాంతులు పొందుతారు. '


' ద్రౌపదీ !  మానవులు ధర్మమనే నావను ఆశ్రయించి, సంసార సాగరాన్ని దాటాలనే తాపత్రయంతో వుండాలి.  అంతెందుకు, నాముందు కూర్చున్న యీ అయోనిజ,  ద్రుపదరాజ పుత్రి,  యజ్ఞఫలం కాదా !  ద్రుపదునికి ఆ పుణ్యఫలం యెలాదక్కింది ?.'


'ఫలం అందలేదని దేవతలని నిందించతగునా !  నేను యేనాడు కర్మలు చేసి ఫలాన్ని ఆశించలేదు.  యజ్ఞాలు, దానములు, ధర్మములు వూపిరిగానే  జీవించినవాడిని.   ద్రుపదరాజ పుత్రీ !  ధర్మము అతిసూక్ష్మమైనది. ధర్మము సంశయాలకు అతీతమైనది.   నీ సంశయాలు ముందుముందు  సూర్యరశ్మి తగిలి  పొగమంచు కరిగిపోయినట్లుగా, పటాపంచలు అగుగాక !  నాస్తికభావం విడిచిపెట్టు. పరమేశ్వరుని లీలలను ఆక్షేపించవద్దు. '   అని హితోపదేశం చేశాడు ధర్మరాజు.


' స్వామీ !  నేను దైవనింద చేయలేదు. ఇలా ఎందుకు జరిగిందని ఆర్తితో విచారిస్తున్నాను. విలపిస్తున్నాను.  దిక్కుతెలియక అలమటిస్తున్నాను..  ధర్మజా ! కర్మలు అనివార్యములు.  ఫలం భగవంతుడిచ్చేది అయినా, మన ప్రయత్నం చేయవలెను కదా !  అదే మానవప్రయత్నం. నువ్వులలో నూనె, ఆవులో పాలు, కొయ్యలో అగ్ని  వాటి అంతట అవి బహిర్గతంకావు కదా !  పురుష ప్రయత్నమే, ధీర పురుషుల లక్షణం.  కర్మచేసినా ఫలం లభించలేదంటే, పురుష ప్రయత్నలోపమే !  '


' మన రాజ్యాన్ని అపహరించిన దుర్యోధనుని పై,  చెయ్యవలసిన ప్రయత్నంచేస్తే, మన రాజ్యం మనకూ దక్కవచ్చుకదా !  కర్మాచరణ చేస్తే కదా భగవంతుడు యిచ్చేఫలం గురించి ఆలోచించేది.  నేను చిన్నప్పుడు తండ్రి వొడిలో కూర్చుని జ్ఞానధనులు చెప్పిన విషయాలే, మీతో చర్చించాను. '  అని వినయంగా ద్రౌపది తన మనసులోని ధర్మ సందేహాన్ని, కర్మాచరణలోని విశిష్టితను చెప్పకనే చెప్పింది,   


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.


తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం. హిందూపురం.

9989692844

కోతుల సహజ మరణాన్ని

 కోతుల సహజ మరణాన్ని మీరు ఎప్పుడైనా చూశారా?🙏


అవి మరణిస్తాయని వాటికి వారం ముందే తెలిసిపోతుంది అంట


అలా తెలుసుకున్నాక ఎవరి కంట పడకుండా, సంచారం లేనిచోట ఏ ఆహారం తీసుకోకుండా,తనకు కావలసిన గంతను తవ్వి అందులో పడుకుండి పోతాయట. అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుంది.


*ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తాయి.*


ఎవరైనా గెంతుతుంటే లేక అల్లరి చేస్తుంటే కోతులతో పోలుస్తాము.ఒక్క నిమిషం ఒకచోట కూర్చోడు కోతిలాగా గెంతుతూనే ఉంటాడు అని.


అలాంటిది ఒక వారం ఒకే చోట కదలకుండా ఉండిపోతాయంటే ఆశ్చర్యం వేసింది.


ఇది నిజమా కాదా అని ఆలోచిస్తే.....!!!


ఆంజనేయుడు శ్రీ రాముడు వద్ద అడిగి పొందిన వరం అని!!


మరణం ముందుగా గ్రహించి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా...పుటలోని జీవాలకు ఆహారంగా మారాలి.

నా దేహం ఎవరి కంట పడనీక అని వరం అడిగాడు ఆ హనుమయ్య.


అందుకే ఒక్క కోతి ప్రమాదంలో చనిపోయినా మిగతా కోతలు కలిసి పుట్టమన్ను ఉన్న చోటుకు తీసుకుని వెళ్లి దేహం పూర్తిగా కప్పబడేవరకు కదలిరావట.


అందులకే కోతులకు ఇష్టమైన అరటిపండ్లు అందివ్వాలని అంటారు.


అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడ కోతి ప్రతిపక్షమౌతుందని విన్నాను.


*అందుకేనేమో హనుమను మించిన భక్తుడు లేడు అంటారు.*


తండ్రి హనుమాన్ అందరిని చల్లగా చుడయ్యా 🙏

మీడియాలో పోస్టులు పెడితే నోటీసులు పంపలా..*

 *సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నోటీసులు పంపలా..*


*ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం*


 *ఇటువంటి చర్యలు తీసుకోవడం సరికాదు* 


 *ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పిలిచి విచారించలేం* 


 *ఇది ప్రజల స్వేచ్ఛా హక్కును హరిస్తోంది* 


 *ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంటుంది* 


రాజకీయ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా పోస్టులు చేశారంటూ దేశంలోని అనేక రాష్ట్రాల్లో పౌరులకు సమన్లు పంపి, విచారిస్తోన్న ఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో దీనిపై పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు తలంటింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు చేస్తోన్న వారిపై ఇటువంటి చర్యలు తీసుకోవడం సరికాదని చెప్పింది.


పౌరులపై ఇటువంటి కేసులు పెట్టి దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పిలిచి విచారించలేమని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేయట్లేదంటూ ఢిల్లీకి చెందిన రోషిణి బిస్వాస్ (29) అనే మహిళ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టుతో, బెంగాల్ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు.


దీనిపై సంబంధిత వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ విషయంపై స్పందిస్తూ ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ రోషినిని కేవలం ప్రశ్నించామని, అరెస్ట్ చేయలేదని చెప్పారు.


దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఇది స్వేచ్ఛా హక్కును హరిస్తోందని వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని సరిగ్గా అడ్డుకోలేదంటూ విమర్శించినందుకు ఒకరిని విచారించలేమని తెలిపింది. అయితే, స్థానిక కోర్టు ఆదేశాలతోనే ఆమె తప్పనిసరిగా హాజరుకావాలని పోలీసులు నోటీసు పంపారని ప్రభుత్వ తరఫున లాయర్ వాదించారు. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఆమెను విచారిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ఆమెను పిలవడం పూర్తిగా వేధించడమే అవుతుందని చెప్పింది.


కోల్‌కతా, ముంబై, మణిపూర్, చెన్నై పోలీసులు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను విచారణ పేరుతో పిలిపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. 'వాక్ స్వాతంత్య్రం కావాలని కోరుకునేవారికి ఒక పాఠం నేర్పుతామన్నట్లుంటుంది..' అంటూ కోర్టు కామెంట్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (ఎ) ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం గుర్తు చేసింది.


ఈ పరిధిదాటి ఎవరూ ప్రవర్తించకూడదని, భారత్‌ను స్వేచ్ఛాయుత దేశంగా ఉండనివ్వాలని చెప్పింది. దానిని రక్షించడానికే సుప్రీంకోర్టు ఉందని పేర్కొంది. అసలు రాజ్యాంగాన్ని రూపొందించడానికి కారణం సాధారణ పౌరులను ప్రభుత్వాల వేధింపులకు గురికాకుండా చూసుకోవడానికేనని తేల్చిచెప్పింది..

పాపం అంటే ఏమిటి

 🌸 ఏదైనా పండగ వచ్చింది అంటే చాలు అంత పాప పుణ్యాలతో గోల మొదలౌతుంది... పాపం అంటే ఏమిటి అని కొంతమందిని ప్రశ్నిస్తే... ఎదుటివారికి వారికి హాని కలిగిస్తే పాపం అని చెప్పారు... పూజలో చెప్పింది చెయ్యకపోతే పాపం అన్నారు... కొంతమంది పుట్టుకతోనే పాపివి(ని) అన్నవారు ఉన్నారు... నాకు పాపం అంటే ఏమిటి అనే ఆలోచనతో సతమతమయ్యాను అందరిని కదిపేసాను.. కానీ సమాధానం రాలేదు... కారణం మనం ఏ పని చేసిన కార్య కారణ సంబంధం ఉంది... అనేది ఒక కారణం... అప్పుడు ఆ వైపుగా ఆలోచిస్తే సమాధానం ఎక్కడ పాపం అనేది లేదు... ఉన్నది కేవలం మనలోని ప్రశ్నలు తగ్గించుకోవడానికి, ఆవేశాన్ని అణచటానికి, కిక్కురుమనకుండ ఉండటానికి వాడే ఆయుధం... 


   🌸 ఈ ఆయుధాన్ని ఎక్కువగా వాడిది ఎవరో మనకు చెప్పనవసరంలేదు.. కానీ ఇది సమాజానికి బాగా ఉపయోగ పడింది అనేది వాస్తవం... ఎందుకంటే పాపభీతి మనిషిని గుడికెళ్లేటట్లు చేస్తుంది.. గుడికి వెళ్ళేవారికి అజమాయిషీ చేయ్యనవసరం లేదు.. పాపం అనేది భయాన్ని పుట్టిస్తుంది... ఆ భయమే మనిషి బతికి ఉన్న చనిపోయినట్లు చేస్తుంది... పాపం వెనుక ఉన్న కథ.. అంత పాపమే అయితే మళ్ళీ కద మొదటికి వస్తుంది అని దానికి వ్యత్యాసంగా పుణ్యం తీసుకొచ్చి నిలబెట్టారు... పుణ్యం అంటే ఏమిటి అడగకండి... పాపం కానిది పుణ్యం అంతే.. ఇది ప్రస్తుత ప్రాపంచకం.. మరి ఆధ్యాత్మిక0..??


   🌸 ఆధ్యాత్మిక బాటలో ఉన్నది నేర్చుకోవడం అంటే అదే మన పెద్దలు చూచించిన 64 కళలోనే ఏదైనా నేర్చుకుంటాం... ఇక్కడ వివరం తాలూకా వివరణ ఉంటుంది మినహా పాప పుణ్యాలు కాదు.. కారణం భయపెట్టి నేర్పలేదు ఏ గురువు... ఉన్న భయాన్ని తొలగించి వినయాన్ని నేర్పి జరుగుతున్న సమాజ గమననాన్ని వీక్షించమన్నారు.. 

అంటే మనకు నేర్పింది వినయం, ఒద్దిక, సహజీవనం, సాక్షితత్వం... ఇక్కడ ఎక్కడ మనం చెప్పుకున్న పాప పుణ్యాల ప్రసక్తి లేదు.. సరికాని మార్గంలో వెళ్లకుండా నిరోధించడానికి వాడిన పదాలు.. ఏది చేసినా అప్పటి కాలానికి సౌలభ్యం కొరకే అనేది వాస్తవం... దీనిని ఔపోశాన పట్టినవారు రాజగురువులు అయ్యారు... వివరం,విచక్షణ తెలుసుకున్నవారు మంత్రులు అయ్యారు... జ్ఞానం పెరిగే కొద్ది వినయం పెంచుకున్నవారు.. పండితులయ్యారు.. ఇదంతా కూడా మన వ్యక్తీకరణ అనేది వాస్తవం..


   🌸 అంటే ఇదంతా కూడా మన సృష్టే... మనల్ని మనం దర్శించుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పరచుకున్న మార్గాలు అనేది వాస్తవం.. అంటే కర్మ సిద్ధాంతం దగ్గర నుంచి అనేక అనేక సిద్దాంతాల వరకు ఉన్న సృష్టి మనదే.. ఇదికూడా ఓ చిన్న తర్కం ద్వారా చూడొచ్చు ఇది కొంత వరకే.. *ఇవాళ చేస్తున్న పని రేపటికి వాయిదా వేస్తున్నాం అంటే రేపు ఉంది అంటే ఇవాళ చేస్తున్న పని నిన్నటిది...* అంటే అన్ని అనుభవించటానికి.. తెలుసుకోవడానికి మనకు మనం తెచ్చుకున్న మార్గం పునర్జన్మ సిద్దాంతం... అన్ని అంత మన స్వయం ఎదుగుదల కోసమే అనేది వాస్తవం అనుకోవాలి... ఎందుకంటే ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి.. ఏది విడతీసి చూడలేము... వివరణ కూడా ఇవ్వలేము... కారణం అనుభూతి చెందటం మినహా దారికూడా లేదు... ఇదంతా ఎందుకు అంటే ఏదైనా ఉంటే మళ్ళీ తిరిగి అది పూర్తి చేయాల్సింది మనమే... 

ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా మనకు దారి తెలుస్తుంది... తెలియపోతే అనే ప్రశ్న ఉండదు..

చివరిగా అసలు *పాపం అంటే* మనల్ని మనం తక్కువ చేసుకోవడం..

మనల్ని మనమే మానసికంగా హింసించుకోవడం..

మనకన్నా తక్కువ జీవులను చంపటం, హింసపూరితమైన ఆలోచనలు మానుకోవడం..

ఇది ఇప్పటి వరకు మాత్రమే...


   Thank you...🌸🌸🌸

కాణిపాక

 కాణిపాక వరసిద్ధి వినాయకుడి గురించి 

10 ఆసక్తికర విషయాలు ఇవే.! ఉ కథ ఇదే.👍💐

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#శ్రీభక్తిలోకం


అడ్డంకులను, ఆదలను తొలగిస్తూ ఆయురారోగ్యాలు బాగుండాలని దీవించే దేవుడు విఘ్నేశ్వరుడు.హిందూ దేవుళ్ళలో ఎందరు దేవుళ్ళు ఉన్నా సరే మొదటి పూజలు మాత్రం ఆ గననాధుడికే.


పూర్వీకుల కాలం నుండి నేటివరకూ ప్రపంచదేశాలలో భక్తులచే విశేష పూజలందుకుంటూ కోరిన వరాలు తీర్చే బొజ్జ గణపయ్యగా ఆయన చాలా ఫేమస్.అయితే చిత్తూరు జిల్లాలోని స్వయంభు గణపతిగా వెలసిన కాణిపాక వరసిద్ధి వినాయకుడి క్షేత్రానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది….


ఇప్పుడు ఈ క్షేత్ర మహత్మ్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.( పురాణాలలోని కథలు ప్రకారం).


1.ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కాణిపాకంగా పిలవబడుతున్న ఆ గ్రామాన్ని ఒకప్పుడు ‘విహారపురి’గా పిలిచేవారు.


పచ్చని పొలాలతో ఆ ఊరు కళకళలాడుతూ ఉండేది.ఆ గ్రామంలో పుట్టుకతోనే మూగ,చెవిటి, అంధకారంతో ముగ్గురు సోదరులు జన్మించారు.


వీరికున్న ఆస్తి 25 ఎకరాల పొలం మరియు ఒక పెద్ద బావి.వ్యవసాయం చేసుకుంటూ ఆ ముగ్గురు సోదరులు తమ జీవనం సాగించేవారు.


పచ్చని పొలాలతో సస్యశామలంగా ఉన్న ఆ గ్రామం కరువు, కాటకాలతో ఆకలి బాధలు ఎదుర్కుంది.ఆ సోదరుల బావిలో నీళ్ళు తగ్గిపోవడంతో బావిని తవ్వడం ప్రారంభించారు.


అలా లోతుకు తవ్వుతుండగా ఒక బండరాయి గునపానికి గట్టిగా తగిలింది.ఆ రాయిని పక్కకు పార,గునపం తీసుకొని మట్టిని పక్కకు తీస్తూ, ఆ రాయి మీద గునపంతో ఓకే పోటు వేయగా,ఆ బండరాయి నుండి రక్తం బయటకు వచ్చి ఆ ముగ్గురు సోదరులపై పడింది.


2.రక్తం వారి శరీరంపై పడగానే మూగావాడికి మాటలు, చెవిటతనికి వినికిడి, అంధుడికి చూపు వచ్చాయి.వెంటనే ఆ ముగ్గురు సోదరులు జరిగిన విషయాన్ని గ్రామ ప్రజలకు,రాజుకు తెలుపగా వారు వచ్చి ఆ బావిని మరింత లోతుకు తవ్వగా వినాయకుడి ప్రతిమ బయటపడింది.ఆ ముగ్గురు సోదరులు తెలియక చేసిన తప్పును క్షమించమని ఆ గ్రామ ప్రజలు కోరుతూ భక్తి శ్రద్ధలతో టెంకాయలను కొడుతూ వినాయకుడ్ని పూజిస్తుండగా, టెంకాయ నీళ్ళు ఆ అక్కడి కాణి భాగం అంతా ప్రవహించాయట.


ఇలా వినాయకుడు స్వయంభుగా ఆవిర్భించడంతో ‘విహారపురి’ని కాస్తా ‘కాణిపాకం’గా మార్చారట.


3.11వ శతాబ్దంలో చోళరాజైన కుళోత్తుంగ రాజు ఈ ఆలయ నిర్మాణం చేసినట్లు ఆధారాలున్నాయి.ఆ తర్వాత 1336లో విజయనగర సామ్రాజ్య రాజులు ఆ క్షేత్రాన్ని ఇంకా పెద్దదిగా ఉండేలా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చేశారాట.


అలాగే ఇక్కడ వినాయకుడి చుట్టూ నీరు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుందంట.ఆ ముగ్గురు సోదరులు బావిని తవ్వుతున్నప్పుడు గడ్డపార వేసిన పోటు స్వామివారి వెనుక భాగంలో ఉందట.


4.మాములుగా అన్ని పుణ్యక్షేత్రాలలోనూ శిల్పులచే చెక్కిన విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి.అయితే కాణిపాకంలో ఉన్న వరసిద్ధి వినాయకుడు స్వయంభుగా భూమి నుండి ఉద్భవించాడని పెద్దలు చెబుతున్నారు.అలాగే ఈ విగ్రహం రోజురోజుకు క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు.


5.పెద్దలు చెబుతున్న ప్రకారం కాణిపాక వినాయకుడు మొదటి ఉదరభాగం,మోకాళ్ళు,బొజ్జ వరకే కనిపించేదట.అయితే స్వామి పెరుగుదలకు నిదర్శనగా లక్షమ్మ అనే భక్తురాలు వెండి కవచం చేయించగా ప్రస్తుతం ఆ వెండి కవచం సరిపోవడం లేదట.


6.కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఆలయం పక్కనే బహుదానది ఉంది.ఈ నదికి ఒక ఇతిహాసం ఉంది.


పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు తమ గ్రామం నుండి స్వామివారిని దర్శించుకోడానికి బయలుదేరారట.ఆ ప్రయాణంలో వారికి అవసరమైన భోజనం,ఫలహారాలను ఇంటి నుండే తీసుకువెళ్లారట.


అయితే మార్గమధ్యంలో వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయట.నడిచి నడిచి అలసట రావడంతో లిఖితుడు ఆకలి వేయడంతో పక్కనే ఉన్న మామిడిచెట్టు నుండి ఒక మామిడిపండును కోసుకుంటానని తన అన్న శంఖుడితో చెప్పాడట.


అలా దొంగతనంగా కోసుకోవడం ధర్మ విరుద్ధమని శంఖువు చెప్పాడు.ఆకలి బాధలో ఉన్న లిఖితుడు అన్న మాటలు పట్టించుకోకుండా మామిడిపండు కోసుకొని తిన్నాడట.


ఇలా ధర్మ విరుద్ధంగా చేసిన తన తమ్ముడిని ఆ ప్రాంత రాజు వద్దకు తీసుకెళ్లి జరిగిన విషయాన్ని చేసిన తప్పును తెలిపాడట శంఖుడు.


7.ఆ రాజు లిఖితుడు రెండు చేతులను నరికివేయమని తీర్పునిచ్చాడట.అలా లిఖితుడు రెండు చేతులను క్రూరంగా నరికివేశారు.


అయితే ఆ క్రూరమైన రాజు ఇంత పని చేస్తాడని ఊహించని శంఖుడు, లిఖితుడుని తీసుకొని కాణిపాకం బయలుదేరాడట.గుడి పక్కనే ఉన్న నదిలో స్నానం చేయడానికి ఇద్దరు దిగారు.


నీటిలో మునిగి పైకి తేలగానే లిఖితుడు రెండు చేతులు యధాస్థితికి వచ్చాయి.ఇలా బాహువులు (చేతులు) ఇచ్చిన నది కావడంతో బాహుదానది, బహుదా నది అని ఆ నదికి పేరు వచ్చిందట.


8.భక్తులకు మొర ఆలకించే కాణిపాక వినాయకుడికి మరో ప్రత్యేకత ఉంది.సత్య ప్రమాణాలకు నెలవుగా చెబుతారు.ఎటువంటి తప్పులు ఉన్నా స్వామివారి ముందు బయటపడతాయి.


9.స్వామి వారి ముందు ప్రమాణాలు చేయాగానే ఎటువంటి సమస్యలైనా సరే ఇట్టే తీరిపోతాయట.ఇక్కడి నదిలో స్నానం ఆచరించి ప్రమాణాలు చేస్తే ఎవరు తప్పు చేశారా? ఎవరు నిజం చెబుతున్నారనేది బయటపడుతుందట.


10.అలాగే చెడు అలవాట్లను మానుకోలేని వారు,సమస్యలతో బాధపడేవాళ్ళు ఆ సమస్యల నుండి బయటపడతారట. ఒకసారి తప్పు జరిగిన తర్వాత వినాయకుడి ముందు మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటారని విశ్వాసం.


స్వామి ముందు ప్రమాణం చేసి తప్పు మాట్లాడితే కీడు జరుగుతుందని చెబుతారు.


ఓం గం గణపతయే నమః

ఉత్తరాబాద్ర నక్షత్రము

 ఉత్తరాబాద్ర నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు


నక్షత్రములలో ఉత్తరాబాద్ర 26వ నక్షత్రము. ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యాధిపతి గురువు, మానవగణం, జంతువు ఆవు. 


ఉత్తరాబాద్ర నక్షత్రము మొదటి పాదము  

  వీరికి తండ్రితో వ్యతిరేకత ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. శ్రమించి పనిచేయగలరు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. పరిశ్రమలు, కర్మాగారాలు ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పు ఉంటుంది. ఇక ఈ జాతకులకు సాంకేతిక విద్యలు, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి. 


ఈ జాతకులకు 17 సంవత్సరాల పాటు శని దశ ఉంటుంది. శని దశ కాలంలోవిద్య కాస్త మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో అనుకూలత ఏర్పడి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది. 34 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, విదేశీ ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 41 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్య దశ కూడా సాఫీగానే సాగుతుంది. 


ఉత్తరాబాద్ర నక్షత్రము రెండవ పాదము   

ఈ జాతకుల మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ నక్షత్రము. ఈ జాతకులకు సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఆసక్తి. వ్యాపారం అనుకులిస్తుంది కూడా. వీరికి విద్యా సంబంధిత, పరిశ్రమల సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి. వీరు బుద్ధి కుశలత కలిగి ఉంటారు.  


ఈ జాతకులకు 13 సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సక్రమంగా సాగుతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 30 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 37 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో మంచి ఫలితాలు కలుగుతాయి. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్య దశ కూడా సాఫీగా గడిచిపోతుంది. 


ఉత్తరాబాద్ర నక్షత్రము మూడవ పాదము

వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం ఉంటుంది. వీరు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు. వీరికి నౌకలలో ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక విద్యలు, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి. 


ఈ జాతకులకు తొమ్మిది సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. ఈ జాతకులు సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 26 సంవత్సరాల తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, అక్కడిఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 33 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది. 


ఉత్తరాబాద్ర నక్షత్రము నాలుగవ పాదము  

వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం ఉంటుంది. వీరికి ధైర్యం, ఆవేశం ఉంటాయి. భావోధ్వేగాల విషయంలో తమ మీద తమకు నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం వృత్తులు వ్యాపారం ఉద్యోగం అనుకూలిస్తాయి. సాంకేతిక విద్యలు, వృత్తి విద్యలు కూడా అనుకూలిస్తాయి.  


ఈ జాతకులకు ఐదు సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, అక్కడి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 29 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. 72 సంవత్సరాల వచ్చే18 సంవత్సరాల రాహు దశ కాలంలో కాస్త ఒడిదుడికులు ఎదుర్కొంటారు.  


ఉత్తరాబాద్ర నక్షత్రము ఫలితాలు


    ఈ నక్షత్ర జాతకులకు అన్ని విషయాల మీద కనీస అవగాహన ఉంటుంది. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. వీరు చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. 


కుటుంబ చరిత్ర, తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. వీరి జీవితం సాఫీగా జరిగి పోతుంది. 30 నుండి 40 సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులు అందరికీ సామాన్య ఫలితాలు. 

*చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కృష్ణ తత్వం

 కృష్ణ తత్వం



ఇప్పటిదాకా బంగారాన్ని ఆస్తుల్నీ హోదాల్నీ ఎలక్ట్రానిక్ ఉపకరణాల్ని ....ఇంకా వేటి వేటినో చాలా చాలా ప్రేమించి ఉంటారు....ఆ ప్రేమతోనే ఒక్కసారి కన్నయ్యను ప్రేమించి చూడండి..ఇంకా దేన్ని ప్రేమించాల్సిన అవసరం బహుశా మీకు రాదేమో, ఆ సుందర మోహనకారుడి అద్వీతీయ మనోహర అనుపమాన రూపలవణ్యాలను మనోనేత్రాలతో మీ హృదయ వాకిట ప్రతిష్ట చేసుకోండి,ఇంకా దేనిని ద్వేషించాల్సిన అవసరం మునుముందెన్నడూ మీకు కలగకపోవచ్చు..ఉట్టిమీద పాలమీగడలు దొంగిలించిన  ఆ అమాయక మానస చోరుడిని మీ మనసులోకి ఆవాహన చేసుకొండొక్కసారీ...అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతం ఎత్తి పట్టుకున్న ఆ పరందాముడి లీలా వినోదాలను గుర్తుకు తెచ్చుకొని చేతులు జోడించి కృష్ణా... కృష్ణా....అని ప్రేమతో మీ కంటిలో నిలుపుకోండి, ఆ కంటిలో ఆనంద భాష్పాలే తప్ప విచారాలు నేలరాలవు...   

ఆ కృష్ణ ప్రేమప్రవాహంలో గోపికలై తరించండీ, మన కర్మఫలం కాళిందిలా కదిలినప్పుడు దానినుండి తప్పించేందుకు తకదిమి తకదిమి అంటూ దాని తలపై నాట్యం చేయడానికి,ఆ విచార విషపునాగులను పారద్రోలాడానికి మీ చెంత వేణుగానాన్ని అలపిస్తూ ఉంటాడు,కానీ నువ్వే గుర్తించట్లేదు....పసిబాలుడు,అందునా ముద్దుగారే యశోదాతనయడు,దేవకినందనుడు...కోటి సూర్యకాంతి ప్రభలతో వెలిగే ఆ ముద్దుమోమును తుదముట్టించడానికి ఎన్ని పన్నగాలు పన్నారు,బకాసురుడు తృణావర్తుడు శకాటసురుడు కంసచాణురాది రక్కసులు...అయినా ఆ తుంటరి కిట్టడు ఆసురులను పావులుగా చేసుకుని హాయిగా చందరంగం ఆడేసుకున్నాడు...ఆ ధైర్యాన్ని ఆ 

గుండెబలాన్ని కన్నయ్య రూపాన ఆవాహన చేసుకుని సమస్యలకై మనం పోరాటం చేద్దాం..కన్నయ్య మన జీవితాల్లోకొస్తే ద్వేషం అనే పదం మనం ఉపయోగించాల్సిన అవసరం ఉండదేమో...అంతా కృష్ణమయమే అవుతుంది, ప్రేమమయమే అవుతుంది.... ఆ కన్నయ్యే మన సమస్యలకు గీతాచార్యుడు, ఆ కన్నయ్యే మన నుదుటి గీతలు మార్చే గీతాగోవిందుడు.....ఆ కన్నయ్య పాదాలు పట్టుకుందాము, ఇంకా దేనిని పట్టుకోవాల్సిన అవసరం మనకు ఈ జన్మలో రాదు...కృష్ణా నీ ప్రేమ మాపై బృందావన ధూళిగానైనా మామీద కురిపించు...ఆ మంగళకరమైన ధూళిలో నిర్జరులమై నీ చెంత సేదతీరుతాము కన్నయ్య....

అవకాశమివ్వు...

Bharati Tirtha Mahaswamiji

 



Biography of Sri Bharati Tirtha Mahaswamiji

Inspiring Saint


Inspiring Life


Sri Bharati Tirtha, the present Jagadguru of the Sringeri Sharada Peetham, a sanyasin of the highest paramahamsa order, is arguably the foremost scholar today of Vedanta and sastras.

In 1966, he approached the then Sringeri Jagadguru Sri Abhinava Vidyatirtha Mahaswamiji as a bachelor at the age of 15 seeking his blessings and instruction in the sastras. The Sringeri Acharya was then observing chaturmasya at Ujjain. Sitarama Anjaneyulu (that was the Acharya’s name in his poorvashrama) had come with great vairagya growing in him.

As the great Acharya was returning after bath in the river Sipra, Sitarama Anjaneyulu prostrated before him and sought his tutelage, which was granted. The very next day the Acharya started teaching him. He soon became a gem of a scholar and a dear disciple.

What prompted the boy who had just finished high school studies, and who was advised by his father to go for higher education, to leave his home? Why did he go all the way to Ujjain from his home in Narasaraopet in Guntur District of Andhra Pradesh? It must have been predetermined so by Goddess Sharadamba, the presiding deity of Sringeri Mutt.

When the same question was put to brahmachari Sitarama Anjaneyulu, he replied: “I had the good fortune of having the darshan of the Jagadguru quite early in life. Once I was asked to talk in Sanskrit by my teacher before His Holiness in Vijayawada. I got a special prize from him. At that time, it struck me that His Holiness was my teacher and my saviour. His beaming smile was giving me a message. I thought I got what I wanted.

“His Holiness has since been in my mind always. I used to feel that I was guided by His Holiness whenever there was a problem. This feeling grew in me to such an extent that I could not stay in my place.”

Since then Sitarama Anjaneyulu did not leave the lotus feet of the Acharya. He accompanied the Acharya during all his tours.

Within eight years he finished the study of Krishna Yajur Veda, Purva and Uttara Mimamsa, Nyaya Sastra and many other treatises and commentaries. He also became a poet in Sanskrit.


Childhood Days


Sitarama Anjaneyulu’s childhood is worth recalling in the context of his spiritual background. He was born into a Smartha family bearing the name “Tangirala”, of Apasthamba sutra, Krishna Yajur sakha, Kutsasa gotra, living in Alugumallepadu village in Palnadu area of Guntur, on the banks of river Naguleru. He was born on April 11, 1951 as a result of long prayer and vrata (fast) by his father Venkateshwara Avadhani and mother Ananthalakshmamma. Venkateshwara Avadhani had studied the Vedas , though learning English was the current fashion.

The pious couple desired very much to have a son after begetting four daughters. Avadhani used to wake up early in the morning, bathe in the river and worship Lord Bhavani Shankara, the local deity, with Rudrabhishekha. This he did for a year.

He also used to perform Sri Rama Navaratrotsava. He took a vow to name his child after Sita and Rama if his wish was fulfilled. The Lords Shankara and Rama were kind to him. He was blessed with a son. For her part Smt.Anantalakshmamma had sought Lord Anjaneya’s favour and promised to name the male child born to her ‘Anjaneyulu’. Hence the infant was named Sitarama Anjaneyulu.

Sitarama Anjaneyulu even at the age of three evinced signs of great devotion towards the Gods. The name of Lord Shiva was on his lips constantly. During his boyhood days he used to forget himself worshipping the Lord.

Acharyal_after Upanayanam

Outside school hours, he always devoted time to Sanskrit studies. By the time he was nine, he had considerable command over the language. He was aware of its subtleties. Scholars and poets, including the Kavi Samrat Sri Viswanatha Satyanarayana, praised him for his eloquence. He won a number of prizes and was invited by All India Radio Vijayawada to participate in Sanskrit programmes.

At night, he learnt the Vedas from his father. He studied Samhita, Brahmana and Aranyaka so well that he could take part in the Guntur District Vedapravardhaka Vidwat Pariksha. He passed the examination with honours.

Command over Languages

Sri Bharati Tirtha was seen more often talking in Sanskrit than in Telugu, his mother tongue. Quite early in life, he completed his study of grammar, literature, logic and philosophy. With an inborn love of Sanskrit, he composed poetry at a very early age. Even at games he would talk in verse. Rules of prosody were never violated. Rhyme, rhythm, irony, suggestion: every poetic beauty came naturally to him. Even ordinary things of life found expression in his poetry.

The mastery of His Holiness in Indian languages is well known to devotees. The Sringeri Mutt has under its preview Andhra, Tamilnadu, Karnataka and Kerala. People of these states visit him to pay their respects and are naturally drawn by his amazing versatility in the languages together with a command over the local idiom.

In 1974 on the day in which he was initiated into Sanyasa, His Holiness spoke in Kannada for the first time at the felicitation meeting with such a telling eloquence that all those present, including ministers, High Court judges, members of the Legislature and University professors, could not control their admiration while listening to him. A few months after Sishya Sweekaram both the Holinesses started on a Vijayayatra to Rameshwaram. Enroute at Gobichettipalayam, the Acharya delivered a speech in chaste Tamil, electrifying the devotees as they had never expected such a clear language flow from someone whose language was not Tamil and who had not been taught Tamil by anyone. The eloquence with which he delivers speeches in Telugu, his mother tongue, is indeed a matter of rare experience.

Sri Bharati Tirtha accompanied his Guru in his tour of the northern parts of India, and lectured in Hindi. His benedictory speeches were highly appreciated. Even scholars in Hindi language and literature were fascinated with his melodious Sanskritised Hindi.

All his speeches have one thing in common. They are built brick by brick on a sound proposition. They are forceful, thought-provoking and inspiring. The language is always within the reach of the listeners. He reminds us of the ancient sages who taught in the gurukulams.


Devotion to Guru


The Guru Gita instructs : “One should meditate on one’s Guru through out one’s life. Even though one enjoys independence, one should not show even a fraction of indifference in one’s attitudes towards one’s Guru.” For Sri Bharati Tirtha (also Sri Sannidhanam), His Guru Sri Abhinava Vidyatirtha Mahaswamigal (also Sri Mahasannidhanam) was everything. He never let the fact that He had been given a separate identity as the Peetadhipati, distract Him at any time. Sri Sannidhanam’s mind was ever engrossed on his guru.

Those who have had the great fortune of seeing both the Acharyas together, could have noticed the great reverence with which Sri Sannidhanam conducted himself in the presence of his Guru. Sri Sannidhanam used to visit Sri Mahasannidhanam every morning, offer His prostrations at the most sacred lotus feet of His beloved Guru and only then commence the day’s work. Whenever Sri Mahasannidhanam spoke to Sri Sannidhanam, the latter would reverentially bend forward and listen. Whenever They walked together, Sri Sannidhanam would never over-step his Guru. Whenever both of Them were to occupy Their seats, Sri Sannidhanam would wait for Sri Mahasannidhanam to be seated first. Sometimes when Sri Sannidhanam arrived a little later than Sri Mahasannidhanam to attend a function, He would pay his respects to His Guru first and only then take his seat. Sri Sannidhanam would listen to Sri Mahasannidhanam’s discourses intently. While conducting the Vidwat Sadas (an assembly of scholars), Sri Sannidhanam would ensure that whatever He talked met with Sri Mahasannidhanam’s approval.

Admiring the divine relationship between Sri Mahasannidhanam and Sri Sannidhanam, Dr. Mandana Mishra, a reputed educationalist and Sanskrit scholar, once said to Mahasannidhanam : “We have read that Shankara’s disciple’s went with him. How was He? How were his disciples? I was only conjecturing. Now I have come to the conclusion that they must have been like this. It is so satisfying.”


Ideal Pontif


For the convenience of the increasingly large number of devotees and pilgrims coming to Sringeri, the most compassionate Guru, Sri Mahasannidhanam, had decided in the mid 1980s to construct a bridge across the river Tunga to link the Mutt complex on the northern bank with Narasimhavanam on the southern bank. He had entrusted the design and construction of the bridge to a reputed concern with the requisite expertise. The top management of the company held His Holiness in great regard and undertook the task with dedication. Sri Mahasannidhanam lucidly explained the requirements and His conception of the bridge. He unfailingly kept Himself fully posted with the developments. Unmindful of the strain, He regularly visited the construction site, keenly observed the work and, whenever appropriate, proffered encouragement and sagacious counsel. By His grace considerable progress was made by the time He attained Maha Samadhi in September 1989. Actively interested in the quick completion of the noble task commenced by His Guru, His Holiness finally inaugurated the bridge on 21st May 1990. On the day, Sri Sannidhanam named the bridge ‘Vidyatirtha Sethu’.

The Sharada Dhanvantari Charitable hospital run by the Math at Sringeri is the brainchild of Sri Mahasannidhanam who strongly felt that the residents of Sringeri and of the neighboring areas should be given proper medical facilities. The 100-bed hospital received constant attention from Sri Mahasannidhanam who took all steps to modernize it in all respects. Now Sri Sannidhanam, whose very life-breath is the fulfillment of His beloved Guru’s wishes, is taking fruitful steps to add more facilities so that the hospital becomes an ultra-modern health center. The hospital now has separate units for ‘Ayurveda’ and ‘Homeopathy’ too. A ‘Photo Gama Isotope Scanner’ was installed in the hospital in November 1992.


Vedic Scholars 


Sri Mahasannidhanam always gave priority to the needs of Vedic Scholars. He was very firm in His view that in order to protect the Vedas, we must protect Vedic Scholars. Sri Sannidhanam is fully aware of His beloved Guru’s praiseworthy intentions. Following Sri Mahasannidhanam’s magnanimous attitudes, Sri Sannidhanam has compassionately announced a lifetime allowance of Rs.1000/- per month to deserving Sastra Pundits. Paying a fitting tribute to Sri Mahasannidhanam, Sri Sannidhanam had a beautiful and majestic granite Adhistanam (Samadhi temple) built at Narasimhavanam. Sri Sannidhanam performed the Kumbabhisheka of the Adhistanam on the 12th of May 1993.

At Sringeri, under Sri Bharati Tirtha, the Mutt has undergone many changes. Now one can write to the office in any of the Indian languages, or in English.

Under the directions of His Holiness, a lot of improvement has been made in the Veda Patashalas. Most competent and well-learned Scholars have been appointed to teach the students. Free food, textbooks and comfortable accommodation have been provided to the students. Sri Sannidhanam not merely supervises the schools, but also teaches the senior students. He personally conducts tests, encourages deserving students, tries to help the slow learners and encourages even the teachers through some programmes. The Veda Patashala has been producing competent Scholars who settle down in various parts of the country and serve as Pundits or Purohits. As for performances of Homas and Yagnas Sri Sannidhanam personally supervises them so that the scriptural injunctions are implemented to the last letter. The Mutt conducts Sata Chandi Homas, Sahasra Chandi Homas, Atirudra Homas and the like for the welfare of the world and Sri Sannidhanam, an authority on the scriptures, sees to it that they serve their purpose.

Sri Sannidhanam, being aware of the increasing inflow of pilgrims and devotees, has had new guest houses built and named them ‘Sri Sharada Krupa’ and ‘Yatri Nivas’.

Sri Sannidhanam is accessible to the devotees twice a day, in the morning during the Theertha Prasadam distribution and in the evening. His Holiness receives everyone cheerfully, with a smile. He poses tender questions, listens to what they have to say and offers valuable suggestions. He accepts Bhiksha and witnesses the Pada Puja, which the devotees perform to His Guru’s and to Goddess Sharada’s Padukas.

Even though His daily schedules are very tight, His Holiness attends to all His pontifical duties with admirable enthusiasm and sincerity keeping in mind not only the rich traditional values of the Sringeri Guru Parampara but also the great responsibility entrusted to Him by none other than His peerless Preceptor, Sri Mahasannidhanam.


Scholar Par Excellence


Once, a scholar approached Him and sought clarifications regarding a particular portion in Ghana (a mode of Vedic chanting). Though not having practiced Ghana chanting, Sri Sannidhanam at once recited the same beautifully and the scholar was stunned.

On another occasion, a group of Ghanapatis came for the Darshan of Sri Sannidhanam. His Holiness was pleased to see such learned ones. When He enquired about their studies, the senior-most Ghanapatigal, informed with pride that they all had completed the entire study of Ghana and that they could recite any portion that His Holiness would require them to recite. Sri Sannidhanam was immensely happy at their confidence and asked them to recite a portion of their choice from Vedas. The scholars however insisted that Sri Sannidhanam choose the portion for their recital. With a bewitching smile, Sri Sannidhanam suggested a particular portion. To their own surprise none of those Ghanapatis could recollect and recite that particular portion. Finally, it was Sri Sannidhanam who recited the initial lines of that portion with the appropriate intonation. It was only then that the wonder-struck Ghanapatis could recollect that portion and recite it.

Sri Sannidhanam’s unquestionable scriptural knowledge would be evident to anyone who has watched His Holiness during the Vidwat Sadas dedicated to Lord Ganapati, conducted every year for 10 days commencing on the fourth day of the bright fortnight of the lunar month of Bhadrapada. The Sadas is held every evening in the august presence of His Holiness. Learned scholars and philosophers, invited from all over India and Nepal, assemble in the Sadas. It is customary for each Vidwan to choose some text and analyze it in the mornings with other Vidwans and discuss it in detail in the evenings in the august presence of His Holiness. His Holiness encourages candid communication among the scholars, and intervenes when any issue remains undecided and settles the same in His characteristic style. The most impressive aspect in the Sadas is Sri Sannidhanam’s off-hand quoting of Sastraic passages and His encouragement to young scholars and debutants.

For the past many years, during the Chaturmasya period, His Holiness has been conducting classes in the Brahma Sutras to a select band of sincere devotees. The students invariably assert that they are delighted by the lucid way in which His Holiness makes them understand the text.

Sri Shankara Bhagavatpada in his Mathamnaya Sashana said that any sage occupying the position of the Jagadguru of Sri Sringeri Sharada Peetham in the unbroken apostolic succession is an incarnation of himself. Sri Bharati Tirtha is a worthy example.

 

Copyright ©️ 2004 – 2016 by Dakshinâmnâya Sri Sharada Peetham, Sringeri, India