29, అక్టోబర్ 2020, గురువారం

పాపం అంటే ఏమిటి

 🌸 ఏదైనా పండగ వచ్చింది అంటే చాలు అంత పాప పుణ్యాలతో గోల మొదలౌతుంది... పాపం అంటే ఏమిటి అని కొంతమందిని ప్రశ్నిస్తే... ఎదుటివారికి వారికి హాని కలిగిస్తే పాపం అని చెప్పారు... పూజలో చెప్పింది చెయ్యకపోతే పాపం అన్నారు... కొంతమంది పుట్టుకతోనే పాపివి(ని) అన్నవారు ఉన్నారు... నాకు పాపం అంటే ఏమిటి అనే ఆలోచనతో సతమతమయ్యాను అందరిని కదిపేసాను.. కానీ సమాధానం రాలేదు... కారణం మనం ఏ పని చేసిన కార్య కారణ సంబంధం ఉంది... అనేది ఒక కారణం... అప్పుడు ఆ వైపుగా ఆలోచిస్తే సమాధానం ఎక్కడ పాపం అనేది లేదు... ఉన్నది కేవలం మనలోని ప్రశ్నలు తగ్గించుకోవడానికి, ఆవేశాన్ని అణచటానికి, కిక్కురుమనకుండ ఉండటానికి వాడే ఆయుధం... 


   🌸 ఈ ఆయుధాన్ని ఎక్కువగా వాడిది ఎవరో మనకు చెప్పనవసరంలేదు.. కానీ ఇది సమాజానికి బాగా ఉపయోగ పడింది అనేది వాస్తవం... ఎందుకంటే పాపభీతి మనిషిని గుడికెళ్లేటట్లు చేస్తుంది.. గుడికి వెళ్ళేవారికి అజమాయిషీ చేయ్యనవసరం లేదు.. పాపం అనేది భయాన్ని పుట్టిస్తుంది... ఆ భయమే మనిషి బతికి ఉన్న చనిపోయినట్లు చేస్తుంది... పాపం వెనుక ఉన్న కథ.. అంత పాపమే అయితే మళ్ళీ కద మొదటికి వస్తుంది అని దానికి వ్యత్యాసంగా పుణ్యం తీసుకొచ్చి నిలబెట్టారు... పుణ్యం అంటే ఏమిటి అడగకండి... పాపం కానిది పుణ్యం అంతే.. ఇది ప్రస్తుత ప్రాపంచకం.. మరి ఆధ్యాత్మిక0..??


   🌸 ఆధ్యాత్మిక బాటలో ఉన్నది నేర్చుకోవడం అంటే అదే మన పెద్దలు చూచించిన 64 కళలోనే ఏదైనా నేర్చుకుంటాం... ఇక్కడ వివరం తాలూకా వివరణ ఉంటుంది మినహా పాప పుణ్యాలు కాదు.. కారణం భయపెట్టి నేర్పలేదు ఏ గురువు... ఉన్న భయాన్ని తొలగించి వినయాన్ని నేర్పి జరుగుతున్న సమాజ గమననాన్ని వీక్షించమన్నారు.. 

అంటే మనకు నేర్పింది వినయం, ఒద్దిక, సహజీవనం, సాక్షితత్వం... ఇక్కడ ఎక్కడ మనం చెప్పుకున్న పాప పుణ్యాల ప్రసక్తి లేదు.. సరికాని మార్గంలో వెళ్లకుండా నిరోధించడానికి వాడిన పదాలు.. ఏది చేసినా అప్పటి కాలానికి సౌలభ్యం కొరకే అనేది వాస్తవం... దీనిని ఔపోశాన పట్టినవారు రాజగురువులు అయ్యారు... వివరం,విచక్షణ తెలుసుకున్నవారు మంత్రులు అయ్యారు... జ్ఞానం పెరిగే కొద్ది వినయం పెంచుకున్నవారు.. పండితులయ్యారు.. ఇదంతా కూడా మన వ్యక్తీకరణ అనేది వాస్తవం..


   🌸 అంటే ఇదంతా కూడా మన సృష్టే... మనల్ని మనం దర్శించుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పరచుకున్న మార్గాలు అనేది వాస్తవం.. అంటే కర్మ సిద్ధాంతం దగ్గర నుంచి అనేక అనేక సిద్దాంతాల వరకు ఉన్న సృష్టి మనదే.. ఇదికూడా ఓ చిన్న తర్కం ద్వారా చూడొచ్చు ఇది కొంత వరకే.. *ఇవాళ చేస్తున్న పని రేపటికి వాయిదా వేస్తున్నాం అంటే రేపు ఉంది అంటే ఇవాళ చేస్తున్న పని నిన్నటిది...* అంటే అన్ని అనుభవించటానికి.. తెలుసుకోవడానికి మనకు మనం తెచ్చుకున్న మార్గం పునర్జన్మ సిద్దాంతం... అన్ని అంత మన స్వయం ఎదుగుదల కోసమే అనేది వాస్తవం అనుకోవాలి... ఎందుకంటే ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి.. ఏది విడతీసి చూడలేము... వివరణ కూడా ఇవ్వలేము... కారణం అనుభూతి చెందటం మినహా దారికూడా లేదు... ఇదంతా ఎందుకు అంటే ఏదైనా ఉంటే మళ్ళీ తిరిగి అది పూర్తి చేయాల్సింది మనమే... 

ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా మనకు దారి తెలుస్తుంది... తెలియపోతే అనే ప్రశ్న ఉండదు..

చివరిగా అసలు *పాపం అంటే* మనల్ని మనం తక్కువ చేసుకోవడం..

మనల్ని మనమే మానసికంగా హింసించుకోవడం..

మనకన్నా తక్కువ జీవులను చంపటం, హింసపూరితమైన ఆలోచనలు మానుకోవడం..

ఇది ఇప్పటి వరకు మాత్రమే...


   Thank you...🌸🌸🌸

కామెంట్‌లు లేవు: