27, డిసెంబర్ 2022, మంగళవారం

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 100 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


ఏకాదశ స్కంధము – బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువవచ్చుట


కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ మందిరమునకు విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు ‘ఈవేళ ఇంతమంది దేవతలు వచ్చారు. ఏమిటి విశేషం' అని అడిగితే వాళ్ళు 'ఈశ్వరా! రాక్షస సంహారం చెయ్యడం కోసమని మీరు వైకుంఠంనుండి బయలుదేరి ఇక్కడకు వచ్చి కృష్ణుడు అనబడే పేరుతో కొంతకాలం అవతారం స్వీకరించి అందరికీ గొప్ప సులభుడవు అయ్యావు. గోపకులంలో పుట్టి గోవులు, గోపాల బాలురు, గోపకాంతలు అందరూ నీ ప్రేమ అనుభవించేటట్లుగా ప్రవర్తించావు. నీవు వచ్చి నూట ఇరువది అయిదు సంవత్సరములు పూర్తి అయింది. ఇంక నీవు ఈ అవతారమును విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామమును చేరి నీ మూల స్థానమునందు ప్రవేశించవలసినది’ అని అడిగారు. భగవానుడు ‘ఓహో! నేను ఈ అవతారమును చాలించవలసిన సమయం ఆసన్నమయినది. అవతార పరిసమాప్తి చేస్తాను. తొందరలోనే బయలుదేరి మీ దగ్గరకు వచ్చేస్తాను’ అని చెప్పి ఒకసారి మనసులో సంకల్పం చేశారు. ‘తాను వెళ్ళిపోయిన తరువాత యాదవులకు నాయకత్వం ఉండదు. ఈ యాదవుల కులం అంతా కూడా తనతోపాటే నశించిపోవాలి. మొత్తం కులనాశనం జరగాలి’ అని తలంచారు. తాను నాయకత్వమునందు ఉండగా దేవతలే వచ్చి నిలబడినా యాదవులను ఎవరూ చెణకలేరు. మనకి కృష్ణ పరమాత్మ తన అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యమును ఆవిష్కరిస్తారు. భగవంతుణ్ణి నమ్ముకున్న పరమ భాగవతోత్తములతోటి పరిహాసం ఎంత ప్రమాదమును తీసుకువస్తుందో చూపిస్తారు. ప్రమాదంతో కూడిన పనిని యాదవులచేత చేయించారు.


విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణుని సందర్శనమునకు వచ్చుట


ఒకరోజున అసితుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడు, భ్రుగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యుడు, అత్రి, వశిష్ఠుడు వంటి మహర్షులు అందరూ కృష్ణ పరమాత్మ దర్శనమునకు వచ్చారు. ఒక్కొక్కరు మహాపురుషులు. వారి పేరు విన్నంత మాత్రం చేత పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది. వారందరూ కృష్ణ భగవానుడిని చూసి ఒకమాట. 'నిన్ను సేవించని రోజు జీవితంలో ఏది ఉన్నదో అది నిరర్ధక మయిన రోజు. కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన అన్నిటివైపు తిరుగుతారు. అలా తిరగడం వలన మనుష్య జన్మ నిరర్థకం అవుతుంది. ఆ తరువాత మరల ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. వీళ్ళు పొందిన మనుష్య జన్మ గొప్పతనం వీళ్ళకి తెలియక ఈ శరీరమును నిలబెట్టుకోవడమే గొప్ప అనుకుని, కేవలం దీనిని పోషించుకొని దీనితో అనుభవించిన సుఖమును సుఖమనుకొని గడిపివేస్తున్నారు. ఈ శరీరమును అరణ్యంలోకి వెళ్లి దాచుకున్నా ఇది ఉండదు వెళ్ళిపోతుంది. అలాంటి శరీరమునందు మగ్నులై వెళ్ళిపోతున్నారు. ఈ కాలమునందు ఇలాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దులు లేని గోపాలబాలురతో కలిసి నువ్వు తిరిగి, కౌగలించుకొని, ఆడి పాడి ఇంతమందిని తరింపజేశావు. కృష్ణా! నీ లీలలు రాబోవుతరంలో విన్న వారిని, చదివిన వారిని, చెప్పిన వారిని, గోవిందనామమును పలికిన వారిని గట్టెక్కిస్తాయి. తండ్రీ! నీవు అంత గొప్ప అవతారమును స్వీకరించావు. ఇలాంటి మూర్తి మరల దొరకదు. ఒక్కసారి నిన్ను కనులార దర్శిద్దామని వచ్చాము’. వాళ్ళకి అవతార పరిసమాప్తి అయిపోతున్నదని తెలుసు. ఈశ్వరా! నీలాంటి అవతారం మళ్ళీ వస్తుందా? అని మహర్షులు ఆపాదమస్తకం ఆ కృష్ణుడి వంక చూసి పొంగిపోయారు.


ఈ సంసారమును దాటడానికి నీ పాదములు ఆధారము. వచ్చే కష్టములు తొలగిపోవడానికి నీ పాదములు ఆధారము. వేదములను నీ పాదములు ఆభరణములు. నీ చరణారవిందములను ఈ మాంసనేత్రముతో చూడాలని వచ్చాము. మరల ఇటువంటి పాదములు మాకు దొరుకుతాయా? ఇవి ‘అంగనామంగనామంతరే మాధవం’ అని కొన్నివేలమంది గోపకాంతల మధ్యలో ఏమీ తెలియని వాడిలా గోపకాంతల చేతులు పట్టుకుని నర్తించిన పాదములు ఈ శ్రీపాదములు. నీ పాదములను గోపాల బాలురు ‘మా కృష్ణుడు’ అని అనుకున్నారు తప్ప శ్రీమన్నారాయణుడని తెలియక ఆడుకున్న పాదములు. ఈ పాదములు వాళ్ళతో ఆడుకున్నపుడు వాళ్ళని తన్నిన పాదములు. లక్ష్మీదేవి అంతటిది వాటికి నమస్కరించడానికి ఉవ్విళ్ళూరుతుందని తెలియక హేలగా ఆ పాదములను ఒళ్ళో పెట్టుకుంటే గోపాలబాలుర చేత ఒత్తబడిన పాదములు. ‘బ్రహ్మ కడిగిన పాదము’ అని బ్రహ్మగారి చేత కడిగించు కొనిన పాదములు. ఇంతమందిని తరింప జేసినా ఆ పాదములను ఒక్కసారి చూసి తరించి పోదామని వచ్చాము కృష్ణా’ అని ఆ పాదముల వంక చూసి స్తోత్రం చేశారు.


కృష్ణా! నీనామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని ముప్పయిమూడుకోట్ల మంది దేవతలు కూడా కూర్చుని వింటారు. కలియుగమునకు నీ నామమే రక్ష. నీది చాలా తేలికయిన నామము. గోవింద నామము నీ అంతట నీవు కష్టపడి సంపాదించుకున్న నామము. ఏడేండ్ల బాలుడవై ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండను ఎత్తి నిలబెట్టి గోపకులను రక్షించి నీవు సంపాదించుకున్న నామము. స్వామీ నిన్ను మరల ఎప్పుడు చూస్తాము? ఒక్కసారి నిన్ను ఆపాదమస్తకం చూసి తరించిపోదామని వచ్చాము’ అని స్తోత్రం చేశారు. కృష్ణపరమాత్మ నవ్వి ‘నేను కూడా మిమ్మల్ని రప్పించడానికి కారణం ఉన్నది. మీరు నన్ను చూసి తరించారు కదా! చెప్పవలసిన మాట చెప్పారు. ఇదే లోకం కూడా తెలుసుకోవాలి. నేను నా మనస్సులో చేసిన సంకల్పం తీరడానికి మీరు ఒకసారి నది ఒడ్డుకు వెళ్ళండి. నదీ స్నానం చేయండి. అవతార పరిసమాప్తికి యాదవకుల నాశనం జరగాలి’ అని చెప్పాడు. ఈ మహర్షులందరూ వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని భగవంతుని కథలు తలుచుకుని పొంగిపోతున్నారు.


ఋషుల శాపము


వారికి కొద్ది దూరంలో ఉన్న కొందరు యాదవులు నవ్వుతూ తుళ్ళుతూ దూరంనుండి ఆ మహర్షులను చూసారు. కృష్ణుని ప్రచోదనం చేత వాళ్ళలో ఒక చిత్రమయిన బుద్ధి పుట్టింది. సాంబుడికి చీరకట్టి ఆడదానిలా అలంకరించి కడుపు ఎత్తుగా కనపడేటట్లు చేసి వీళ్ళు ఏపాటి పరిజ్ఞానంతో చెపుతారో చూద్దామని అతడిని మహర్షుల దగ్గరికి తీసుకువచ్చారు. వారు సాంబుడిని మహర్షుల ముందు నిలబెట్టి ‘మీరు మహాత్ములు కదా! మీకు తెలియని విషయములు ఉండవు. మీరు త్రికాలవేదులు. ఈ ఆడపిల్ల కడుపులో మగవాడు ఉన్నాడా? ఆడపిల్ల ఉన్నదా? కవలలు ఉన్నారా? ఏ విషయం మాకు చెప్పండి’ అన్నారు. అనేసరికి వాళ్ళు ఆ స్త్రీవంక చూశారు. వాళ్లకి మహా ఆగ్రహం వచ్చింది. ‘మీకు భగవద్భక్తులతో పరాచికమా? కృష్ణుడు ఉన్న గడ్డమీద ఉన్న మీరు ఇటువంటి పరిహాసం చేయడానికి సిగ్గుపడడం లేదా? ఏ కృష్ణ భగవానుడు బ్రాహ్మణులను చూడగానే భక్తితో సేవిస్తారో, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు తలమీద చల్లుకుంటాడో అటువంటి కృష్ణుడితో కలిసివున్న మీకు ఇంతటి దుస్సాహసమా? మాతో పరిహాసమా? అని వాళ్ళు

'కొడుకూ కాదు, కూతురూ కాదు. క్షణం ఆలస్యం లేకుండా ఆమె కడుపునుంచి ముసలం ఒకటి పుడుతుంది. ఆరోకలి మీ అందరి తీట తీరుస్తుంది. దానితో మీ యదుకులం నాశనం అవుతుంది. పరిహాసం చేస్తున్న వారికి భయం వేసింది. ఇలా అన్నారేమిటని సాంబుడికి చీర విప్పారు. ఆ చీరలోంచి కడుపు దగ్గర నుంచి ఒక పెద్ద ఇనుప రోకలి కిందపడింది. వాళ్లకి భయంవేసి ఆ రోకలి తీసుకుని పరుగుపరుగున కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి 'మేము తెలియక మహర్షులతో పరిహాసం ఆడాము. వారు శపించారు. ఈ రోకలి పుట్టింది. ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటావు? అని అడిగారు. కృష్ణపరమాత్మ – ఈమధ్య దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఇవి యదుకుల నాశనమును సూచిస్తున్నాయి. మీ అందరు ఆ ఇనప ముసలము చేత మరణిస్తారు. దీనిని తీసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్ళండి. అక్కడ పెద్ద శిఖరం ఒకటి ఉన్నది. ఆ శిఖరం మీద ఈ ఇనుప ముసలమును అరగదీసి దీనిని సముద్రంలో కలిపివెయ్యండి’ అని చెప్పాడు. వారు ఆ ముసలమును పట్టుకుని ఆ శిఖరం మీదికి వెళ్ళి ఆ ముసలమును అరగదీయడం మొదలు పెట్టారు. అది కరిగి కరిగి నల్లని తెట్టు కారుతోంది. ఆ తెట్టు తీసుకువెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నారు. అరగదియ్యగా అరగదియ్యగా చివరకు చిన్న ఇనప ములుకు ఒకటి మిగిలింది. ఆ ములుకు వల్ల ప్రమాదం ఏమీ లేదని భావించి ఆ ములుకును సముద్రంలోకి విసిరేశారు.


ఆ ములుకును ఒక చేప మింగింది. ఒక బోయవాడు పక్షులు దొరక్క చేపలు పట్టుకుందుకు సముద్రం దగ్గరకు వచ్చాడు. వాడి వలలో ఈ చేప పడింది. వాడు యింటికి వెళ్ళి ఈ చేపను కోసాడు. దాని కడుపులోంచి ఆ ఇనుప ముల్లు బయట పడింది. ఆ ఇనపముల్లును తన బాణమునకు పెట్టుకుని ఆ బాణంతో దేనిని కొట్టాలా అని అడవిలో తిరుగుతున్నాడు.


కృష్ణుడు – ఉద్ధవుడు


ఈలోగా ‘అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి’ అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి ‘కృష్ణా! మేము నీతోకలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం అయిపోతోందంటే నేను తట్టుకోలేక పోతున్నాను. నేను ఉండలేను. నా మనసు శాంతించేటట్లు నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి’ అన్నాడు. కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు. ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత ఇంక వారు మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు.


‘ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం. ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. ప్రతివాడికీ కోపమే. ప్రతివాడికీ కోర్కెలే. కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించేసుకుంటారు. కోపముచేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయమును వీళ్ళు తగ్గించేసుకుంటారు. కలియుగంలో ఉండే మనుష్యులకు రానురాను ‘వేదము ప్రమాణము కాదు – యజ్ఞయాగాదులు చేయకండి – వేదము చేత ప్రోక్తమయిన భగవన్మూర్తులను పోషించకండి’ అని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. తక్కువ పదార్ధమును తిని శరీరమును నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమనే ఆచారం వచ్చింది. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టేసి ఆచారం లేని పూజ చేయడానికి ఇష్ట పడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటివలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారమును, సంప్రదాయమును విడిచిపెట్టిన పూజలయందు ఎక్కువ మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేమని తెలుసుకోలేక పోతారు. ఇంద్రియములకు వశులయిపోతారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

[26/12, 6:02 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 101 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించారన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించారన్నది ప్రధానం అవుతుంది. ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వారే పండితులు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములకు వెళ్లి కాళ్ళు పెట్టాలి. మహా పురుషుల మూర్తులను సేవించాలి. అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకోవాలి. దీనినుంచి దాటాలని అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళాలి. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి. ఈశ్వర నామమును విడిచిపెట్టకూడదు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, ఇంద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను. ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమయి ఉన్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన ఇంద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా ఇంద్రియ సుఖమనుభవించవచ్చు.

సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొన్ననాడు ఇంద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యథార్థ ధర్మములను పాటిస్తూ ఇంద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి ఇంట పెట్టుకో. సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి పెట్టి పువ్వులు వేయడం మొదలుపెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని, నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.

ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు వాడు నాయందే చేరిపోతున్నాడు. ఉద్ధవా! నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో’ అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.

ముందు బలరాముడు వెనుక పరమాత్మ నడిచి వెడుతున్నారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచి పెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు. బలరాముడి శరీరం నేలమీద పడిపోయింది. కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్లి నేలమీద పడుకొని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నారు. దూరంనుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు. ఒక పొదలో జింక చెవి కదులుతున్నట్లుగా కనపడింది. ఆ జింక చెవిమీదికి బాణం వేస్తే తలలోకి గుచ్చుకుంటుందనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలిమీద ప్రయోగించాడు. ఈ ముసలపు ముక్క ఏ శ్రీపాదములు ఈ గోపాల బాలురను అలరించాయో, లోకమునంతటినీ పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈనేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో, ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయ్యాడో, ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్లమంది మోక్షమును పొందారో, ఆర్తితో పిలిచినా వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చి ఏ శ్రీపాదములు దర్శనము ఇచ్చాయో అటువంటి పాదముల బొటనవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ ‘హా’ అని అరిచారు. బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరుగెత్తాడు. కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతోంది. అయ్యో! ఎంత పొరపాటు చేశాను స్వామీ నా జన్మకు నిష్కృతి లేదు అని నేలమీద పడి ఏడ్చాడు. కృష్ణ పరమాత్మ ‘నాయనా నీవు నిమిత్తమాత్రుడవు. నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంతటివాడయినా కూడా ఒకసారి ఈ శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలి పెట్టవలసిందే. నేను కూడా పెద్దల వాక్కును పాటించాను. అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచి పెడుతున్నాను’ అన్నారు.

దారుకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు. ఏమిటి స్వామీ ఈ పరిస్థితి? మీరిలా పడిపోవడమా? కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా! అని విలపించాడు. కృష్ణుడు ‘నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది. ఈ గుర్రములు, రథములు అన్నీ అదృశ్యం అయిపోతాయి. ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణములలో మరణించబోతున్నారు’ అని చెప్పారు.

యాదవుల అంతమొందుట

ఆడుకుంటున్న యాదవులు అకారణంగా రెండు పక్షములుగా విడిపోయి ‘యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టి చిట్టచివర మిగిలిన వారు వాళ్ళు అరగదీసిన ఇనప రోకలి లోంచి పుట్టిన తెట్టు కలిపినపుడు పుట్టిన రెళ్ళు దుబ్బులు కోసి తెచ్చి వాటితో కొట్టుకుని ప్రాణములు వదిలేశారు. యాదవ కులం నాశనం అయిపోయింది. బలరాముని భార్యలు, కృష్ణుని భార్యలు చితులలోనికి ప్రవేశించారు. మిగిలినవారు ఎవరో కొద్దిమంది ఉంటే వారిని ఇంద్రప్రస్థం తీసుకు వెడదామని అర్జునుడు గాండీవము పట్టుకుని వారిని తీసుకువెడుతున్నాడు. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే పదిమంది గోపబాలుర చేతిలో గాండీవము ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఆ విషయమును వచ్చి ధర్మరాజుకి చెప్తాడు. ‘గాండీవం ఉన్నది, పాశుపతాస్త్రం ఉన్నది గెలిచాననుకున్నాను. ఆ కృష్ణ పరమాత్మ సారధ్యం వలన గెలిచానని అనుకోలేదు. ఆ మహానుభావుడు నా సఖుడు వెళ్ళిపోయాడు అన్నాడు. ధర్మరాజు గారు ‘అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తరువాత మనం ఈ భూమండలం మీద ఉండవద్దు. రండి వెళ్ళిపోదాం అని పిచ్చివానిలా జుట్టు విరబోసుకుని ఆభరణములు అన్నీ తీసి పక్కన పెట్టేసి ఉత్తరాభిముఖుడై వెళ్ళిపోయాడు. మిగిలిన పాండవులు ద్రౌపది, కుంతి అంతా శరీరములు విడిచిపెట్టారు. కలియుగం ప్రవేశించింది.

ఫలశ్రుతి

కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒకమాట చెప్పారు. ‘ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరూ కూడా చెవుల ద్వారా అమృతమును పానము చేసినట్లే. వాళ్ళందరూ నన్నే చేరుతారు. నేను అభయం ఇస్తున్నాను’ అన్నారు.

అటువంటి వారు కన్ను మూసినపుడు కన్ను తెరిచినపుడు కృష్ణ దర్శనమే అగుట కొరకు పోతనగారు మనకొక భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో చెప్పిన శ్లోకమును యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది భాగవతమునకు జీవనాడి. భాగవత పఠన ఫలితమును కోరుకున్న వారందరూ ఈ పద్యములను తప్పనిసరిగా పఠించాలి. మనుష్య జన్మకు ఇంతకన్నా ప్రయోజనం వేరొకటి ఉండదు. ఎవరు ఈ పద్యమును పఠిస్తారో వారు మాత్రమే భాగవతమును వినడం వలన కాని, చదవడం వలన కాని కలిగే శుభఫలితములు పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది.

నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాట ప

ట్టగు నురమున్ మహాభుజము లంచితకుండలకర్ణముల్ మదే

భ గతియు నీల వేణియు గృపారసదృష్టియు గల్గు వెన్ను డి

మ్ముగ బొడసూపు గాత గనుమూసిన యప్పుడు విచ్చినప్పుడున్.

‘ఈశ్వరా! నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా! నవ్వు ముఖముతో, సన్నని నడుముతో, నల్లని శరీరంతో, లక్ష్మీదేవికి స్థానమయిన వక్షస్థలముతో, మమ్మల్ని రక్షించగలిగిన భుజ స్కంధములతో, కుండలములు దాల్చిన కర్ణ యుగళితో ఏనుగు నడకవంటి నడకతో, నల్లని వెంట్రుకలతో, కృప వర్షించే కన్నులతో, నాయందు అనుగ్రహించి నా కోరిక తీర్చుగాక! నిద్రపోయినప్పుడు నీ అనుగ్రహమునే సమాధిలో నేను అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గరనుంచి నీవే నాకు సారధియై నడిపించాలి. చిట్టచివర నా కన్నులు మూతపడిపోయినప్పుడు నీవే అనుగ్రహించి నాకు మోక్షమును ఇవ్వాలి. వేరొకసారి నాకు జన్మవద్దు. స్వామీ నన్ను యిలా అనుగ్రహించు’ అని గొప్ప పద్యమును మనకు పోతనగారు భిక్షపెట్టి పూర్తిచేస్తూ అంటారు

ఈ కథ విన్నను వ్రాసిన, బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం

జేకొని యాయువు ఘనుడై, లోకములోనుండునరుడు లోకులు వొగడన్.

‘ఎవరయితే భాగవతంలోని ఈ ఆఖ్యానమును వింటున్నారో ఇది విన్న వాళ్ళకు, ఇది వ్రాసిన వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సిరిసంపదలు కలుగుతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. ఏమయినా ప్రమాదములు ఉంటే తప్పిపోతాయి. వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఎలా ఉంటుందంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయనతో కలిసి ఉండాలని, ఆయనను చూడాలని, ఆయన వద్ద వినాలని కోరుకునేటట్లుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు’ అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.


భాగవత ప్రవచన పాఠం నేటితో సమాప్తం


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

[27/12, 6:37 am] K Sudhakar Adv Br: 🙏🏻 *|| శ్రీః ||* *|| శ్రీమతే రామానుజాయ నమః ||*


*తిరుప్పావై – 11వ పాశురము*

*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*


*11వ పాశురము :-*


*కత్తు క్కఱవై క్కణంగళ్ పల కఱన్దు*

*శెతార్ తిఱ లళియ చ్చెన్రు శెరుచ్చెయ్యుమ్*

*కుత్త మొన్రిల్లాద కోవలర్దమ్ పొర్కొడియే*

*పుత్తర వల్గుల్ పునమయిలే పోదరాయ్*

*శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వన్దు నిన్*

*ముత్తమ్ పుగున్దు ముగిల్ వణ్ణన్ పేర్పాడ*

*శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ*

*ఎత్తు క్కురంగుమ్ పొరుళే లోరెమ్బావాయ్.*


*తాత్పర్యము:-*


లేగదూడలు గలవియు, దూడల వలె నున్నవియు, నగు ఆవుల మందల నెన్నింటినో పాలు పితుకగలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారుతీగా ! పుట్టలోని పాము పడగవలె నన్ను నితంబప్రదేశము గలదానా ! అడవిలోని నెమలివలె అందమైన కేశపాశముతో ఒప్పుచున్నదానా ! రమ్ము. చుట్టములును, చెలికత్తెలను మొదలుగ అందరును వచ్చిరి. నీముంగిట చేరిరి. నీలమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామము కీర్తించుచుండిరి. కీర్తించుచున్నను నీవు ఉలుకక పలుకక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా ! నీ నిద్రకు అర్థమేమో తెలుపుము.


🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

*ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్* 👣🪷🙏🏻🙇🏻‍♂️

[27/12, 7:39 pm] K Sudhakar Adv Br: 🙏🏻 *|| శ్రీః ||* *|| శ్రీమతే రామానుజాయ నమః ||*


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*తిరుప్పావై – 12వ పాశురము*

*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*


*12వ పాశురము :-*


*కనైత్తిళం కత్తెరుమై కన్రుక్కిరంగి*

*నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,*

*ననైత్తిల్లమ్ శేరాక్కుమ్ నర్చెల్వన్తంగాయ్*

*పనిత్తెలైవీళ నిన్వాశల్ కడైపత్తి*

*చ్చినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానై చెత్త*

*మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీ వాయ్ తిఱవాయ్*

*ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్*

*అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్*


*తాత్పర్యము:-*


’లేగదూడలు గల గేదెలు పాలుపితుకువారు లేక తమ దూడలను తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తోచి పాలు పొదుగునుండి కారిపోవుటచే యిల్లంతయు బురద యగుచున్న యొకానొక మహైశ్వర్యసంపన్నుని చెల్లెలా ! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలిచి యుంటిమి. మీ యింటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచియుంటిమి. కోపముతో దక్షిణదిక్కున నున్న లంకకు అధిపతియైన రావణుని చంపిన మనోభిరాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా ! ఇంక మమ్మేలుకొనవా ! ఏమి యీ గాఢనిద్ర ! ఊరివారి కందరకును నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము’ అని కృష్ణుని విడువక సర్వకాలములనుండుటచే స్వధర్మమునుకూడ చేయలేని దశయందున్న ఐశ్వర్యసంపన్నుడగు ఒక గోపాలుని చెల్లెలిని మేల్కొలిపినారు


🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

*ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్* 👣🪷🙏🏻🙇🏻‍♂️

మదన్ మోహన్ మాలవ్యా

 🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳 *నేడు బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపకుడు స్వాతంత్ర సమరయోధులు పండిత మదనమోహన జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ*🙏🏻🙏🏻🙏🏻


మదన్ మోహన్ మాలవ్యా

భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త.

మదన్ మోహన్ మాలవ్యాా (డిసెంబర్ 25, 1861 - నవంబరు 12, 1946) భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు.ఆయన "మహాత్మా"గా కూడా గౌవరింపబడ్డాడు.మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం , ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం.ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ , టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.


పండిట్ మదన్ మోహన్ మాలవ్యా


వ్యక్తిగత వివరాలు

జననం

1861 డిసెంబరు 25

అలహాబాదు, భారతదేశం

మరణం

1946 నవంబరు 12 (వయసు 84)

బనారస్

జాతీయత

భారతీయుడు

రాజకీయ పార్టీ

భారత జాతీయ కాంగ్రెస్

వృత్తి స్వాతంత్ర్య సమరయోధుడు,విద్యావేత్త, రాజకీయ నాయకుడు

అవార్డులు: భారతరత్న 2015

మతం హిందూ

మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ , గైడ్సు"కు ఒక వ్యవస్థాపకుడు.ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక లీడర్ పత్రికను స్థాపించారు. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.


మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన భారతరత్నకు డిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు.


ప్రారంభ జీవితం , విద్య 


మాలవ్య 1861, డిసెంబర్ 25న అలహాబాదులో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మూనాదేవి , బ్రిజ్ నాథ్ లు. వారి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని మాల్వా నుండి వచ్చారు. అందువలన వారు "మాలవీయ"గా పిలువబడతారు. అందువల్ల వారి యింటిపేరు "వ్యాస్"గా అయింది. మాలవ్యాలు బెనార్స్ లోని అగర్వాల్ వర్తకులకు ఇంటిపురోహితులుగా యున్నారు. ఆయన తండ్రి సంస్కృత గ్రంథములను అభ్యసించేవాడు. ఆయన శ్రీమద్బాగవతమును చెప్పి ధనం సంపాదించేవాడు. మాలవ్యా సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు.ఆ తరువాత ఆయన ఆంగ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు.మాలవ్యా తన విద్యాభ్యాసాన్ని హరదేవా ధర్మ జ్ఞానోపదేశ పాఠశాలలో కొనసాగించాడు. అచట ఆయన ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు.ఆ తరువాత ఆయన వైద వర్థిని సభ నదుపుతున్న పాఠశాలలో చేరాడు. ఆ తరువాత అలహాబాదు జిల్లా పాఠశాలలో చేరారు. అచట ఆయన "మకరంద్" అనే కలం పేరుతో కవిత్వం వ్రాయడం ప్రారంభించాడు. ఆ కవితలు వివిధ జర్నల్స్, మ్యాగజెన్లలో ప్రచురితమైనాయి.


మాలవ్యా 1879 లో ముయిర్ సెంట్రల్ కాలేజీ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ కళాశాల ప్రస్తుతం అలహాబాదు విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందినది.హారిసన్ కాలేజి ప్రిన్సిపాల్ మాలవ్యాకు నెలసరి ఉపకార వేతనాన్ని అందించేవారు. మాలవ్యా కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ.లో పట్టభద్రులైనారు. ఆయన సంస్కృతంలో ఎం.ఎ చేయాలనుకున్నప్పటికీ ఆయన కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. ఆయన తండ్రి ఆయనను కూడా తన వృత్తిలోనికి సహాయకునిగా తీసుకుని వెళ్ళేవాడు. జూలై 1884 లో మదన్ మోహన్ మాలవ్యా తన ఉద్యోగ జీవితాన్ని అలహాబాదు ఉన్నత పాఠశలలో ఉపాధ్యాయునిగా చేరి ప్రారంభించారు.


బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన సైమన్ కమీషన్ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర్య సమరయోధులతో కలిశాడు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు. 1922-23 లో హిందు మహాసభ అధ్యక్షుడుగా చేశారు


"సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం మదన్ మోహన్ మాలవ్యాకు 2014లో ప్రకటించింది. ఈయనతోపాటు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వాజ్‌పేయీకి భారతరత్న ప్రకటించింది.

అడ్డ నామాలను, నిలువు నామాలను

🎻🌹🙏శివుడు అడ్డ నామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారు..? దీని వెనుక కారణమేంటి?...!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

పరమేశ్వరుడు అడ్డనామాల వాడని మనందరికీ తెలుసు.. శివుడు అడ్డ నామాలు పెట్టుకుంటాడు. 

అలాగే.. విష్ణువు నిలువు నామాలు పెట్టుకుంటారు. శివ కేశవుల్లో బేధం లేనపుడు..

 ఈ నామాల్లో మాత్రం భేదం ఎందుకు? ఇంతకీ శివుడు అడ్డ నామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

మానవ శరీర నిర్మాణం ప్రకారం.. కనుబొమ్మల మధ్యన షట్చక్రాలలో ఒకటైన ఆజ్ఞా చక్రము ఉంటుంది. దీన్నే మూడవ కన్ను అని భావిస్తారు.

 ఇది బయటకు కనపడకపోయినా.. దీని ప్రభావం చాలానే ఉంటుంది. అందుకే ఇది ఉండే స్థానం లో బొట్టు పెట్టుకోవాలి అని హిందూ సాంప్రదాయం చెబుతుంది. 

ఈ స్థానాన్ని పదిలం గా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికతను పెంచుకోవచ్చని హిందువులు నమ్ముతారు.

ఈ ఆజ్ఞాచక్రాన్ని సక్రమం గా ఉంచడం కోసం, ఇక్కడ ఉండే ఇడ, పింగళ, సుషుమ్న నాడులను చల్లబరచడంకోసం కోసం తద్వారా రక్త ప్రసరణ నిరాటంకంగా జరగటం కోసం తిలకం లేదా విబూది లేదా కుంకుమ ధరిస్తారు. 

ఐతే హిందూ మతం లోని వారు రకరకాలుగా ఈ అలంకరణ చేసుకుంటారు. శివుడు కూడా విభూధిని మూడు అడ్డ నామాలు గా పెట్టుకుంటాడు. ఈ మూడు అడ్డ గీతాలు పెట్టుకోవడానికి కారణం ఉంది. సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక గా శివుడు అలా ధరిస్తాడట. 

అలాగే శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి కాబట్టి వాటికి గుర్తు గా మూడు అడ్డనామాలు ధరిస్తాడు. పరమ శివుడిని మనం కాలుడు అని పిలుస్తాం. అంటే.. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు ఆయన అధీనం లో ఉంటాయి కనుక వాటికి సింబాలిక్ గా ఆయన మూడు అడ్డనామాలను ధరిస్తాడు. అలానే శివ భక్తులు కూడా విబూది ని ధరిస్తూ ఉంటారు.

అలాగే వైష్ణవులు ధరించే బొట్టు వేరు గా ఉంటుంది. రెండు తెల్లని గీతలు నిలువు గా ధరించి మధ్యలో ఒక ఎర్రటి గీతని ధరిస్తారు. 

ఈ రెండు తెల్ల గీతలు శ్రీ మహా విష్ణువు పాద పద్మాలుగా వైష్ణవులు భావిస్తారు. మధ్య లో ఉండే ఎర్రని గీతను శ్రీ మహాలక్ష్మి రూపం గా భావిస్తారు. అలా వారిద్దరిని తమ బొట్టులోనే ఉన్నట్లు భావించి ధరిస్తారు...స్వస్తి...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿