9, జులై 2020, గురువారం

మీ అభిప్రాయాలూ తెలుపండి

ఈ బ్లాగుని దేశ విదేశాలనుండి చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం.  మీరు ఈ బ్లాగును విశేషంగా పరిశీలించటం చాలా ఆనందంగా వుంది.  దయచేసి ఈ బ్లాగులోని విషయాలు మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి, ఈ బ్లాగుని ఇంకా ఎలా మార్పు చేస్తే బాగుంటుంది లాంటి విషయాలు మీరు చెప్పదలుచుకున్న ఇతర విషయాలు కూడా ఇక్కడ కామెంట్లో తెలిపి ఈ బ్లాగుని ఇంకా మంచిగా నడపటానికి దోహద పాడగలరూ. 
చివరగా ఒక్క విషయం.  ఈ బ్లాగుని చాలా దేశాలవారు చూస్తున్నట్లు నాకు ట్రాఫిక్ నుండి తెలుస్తున్నది.  మీరు మీరు వున్నా దేశంలోని ప్రజల జీవన విధానం, అక్కడి సామాజిక రాజకీయ పరిస్థితులు గూర్చిన విషయాలు, వీడీయోస్ ఇక్క షేర్ చేస్తే మన బ్లాగు చేసే ఇతరులకు ప్రపంచంలోని ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. 
మీరు పంపే పోస్టులు ఈ బ్లాగు చూసే వారికి ఉపయోగకరంగా ఉండవచ్చు.  

పి.వి. నరసింహారావు గారి గురించి వచ్చిన ఓ సందేశం.

 నా ఇల్లమ్మి పెడతావా ప్రసాద్‍!

‘‘ప్రసాద్‍. నాకోచిన్న సహాయం చేయాలయ్యా!’’ అంటూ హైదరాబాద్ రాజ్‌భవన్‌లో పివి నన్ను అడిగారు.

‘జార్ఖండ్‍ ముక్తి మోర్చ పార్టీ ఎం.పీలకు ముడుపులు’ కేసు వాదోపవాదాలు ముగిసి, ఆ కేసులో కూడా పి.వి.నరసింహారావుని నిర్దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఈ తీర్పు వచ్చిన కొన్ని రోజులకే పి.వి.గారు హైదరాబాద్‍ వచ్చారు. అప్పుడు నాతో అన్నమాటలివి.
‘‘ఇక్కడ జూబ్లీహిల్స్‌లో నాకో ఇల్లుంది. తెలుసుగదా! ఆ ఇల్లు అమ్మిపెట్టాలయ్యా’’
‘‘అంత అవసరం ఏమొచ్చింది సర్‍! మాజీ ప్రధానమంత్రిగా మీకు నివాస గృహాన్నీ, నౌకర్లనీ ప్రభుత్వమే ఇస్తుంది. వైద్యసదుపాయం ఉంటుందీ. నెలనెలా పెన్షన్‍ వస్తుంది....’’ అంటూ నసిగాను.

ఆయనకేమీ పెళ్ళికావలసిన కూతుళ్ళూ లేరు. నాకు తెలిసి ఆయన ఎవరిదగ్గరా భారీగా అప్పుచేసిన దాఖలాలు లేవు. ఏదన్నా ఇబ్బంది పడివుంటే ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పడ్డారు.
కొడుకుని చదివించటానికి అల్లుడు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. కూతుర్ని మెడిసన్‍ చదివించడంకోసం ఫీజుకట్టడానికి ఇబ్బంది పడాల్సివచ్చింది. కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయటానికి కూడా చాలా అవస్థలు పడాల్సివచ్చింది. ... పోనీ, ముఖ్యమంత్రిగా చేసిన నాటికి అంత రాజకీయపరిణతి లేదు అనుకున్నా, ఆ తరువాత కేంద్రంలో చాలా పదవుల్లో వున్నారు కదా! అవి కూడా ఏదో పనికిమాలిన పదవులూ కాదు, సహాయమంత్రి, ఉపమంత్రి పదవులూ కాదు. క్యాబినెట్‍ హోదావున్న మంత్రి పదవులే. దేశీయాంగశాఖ, విదేశాంగ శాఖ, మానవవనరులశాఖ. ఇంకా కాంగ్రెసు పార్టీలో కార్యదర్శి, ప్రధానకార్యదర్శి పదవులు కూడా చేశారు. 1991 నుండి అయిదేళ్ళపాటు ప్రధానమంత్రి పదవి కూడా చేశారు. ఇన్ని పదవులు అనుభవించిన వ్యక్తికి తనకున్న ఒకేఒక్క ఇల్లు అమ్ముకోవాల్సిన అగత్యం ఏమిటి?

‘‘... అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయటపడ్డానంటే నాకోసం ఎవరెవరో వకీళ్ళు నా తరఫున కోర్టుల్లో వాదిస్తేనే గదా! వాళ్ళెవరూ నా దగ్గర ఫీజు అడ్వాన్సు అడగలేదు. నేనెప్పుడు ఏమిస్తే అదే పుచ్చుకున్నారు. అదైనా ఎలా ఇచ్చాను. పదవిపోయాక ‘ఇన్‍సైడర్‍’ పుస్తకం రాస్తే, దానిమీద వచ్చిన రాయల్టీని వాళ్ళకిచ్చేస్తూ వచ్చాను. ఇంకా ఇవ్వాల్సింది - నా అంచనాల ప్రకారం లక్షల్లో ఉంది. వాళ్ళకి ఫీజు ఇవ్వకుండా, బాకీ తీర్చకుండా చనిపోతానేమోనని భయంగా ఉందయ్యా...’’
నిర్ఘాంతపోయాను. ఎలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు?

ఆయన అయిదేళ్ళలో ఆర్థిక దుస్థితి నుంచి ఈ దేశాన్ని గట్టెక్కించి, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలతో ప్రపంచం అంతా అబ్బురపడేలా వినూత్న ప్రగతిమార్గంలో నడిపించాడు. భారతదేశాన్ని ఈ 60కోట్ల జనాభా గర్వపడే ఒక వైభవదశలోకి మలుపుతిప్పాడు. అలాంటి మేధావి, రాజనీతివేత్త నన్ను అభ్యర్థిస్తున్నారు - ప్లీడర్లకి ఫీజులు చెల్లించటం కోసం తనకున్న ఒకే ఒక ఇల్లు అమ్మిపెట్టాలని!!
ఆయన సొంత విషయాలు ముఖ్యంగా కుటుంబసభ్యుల విషయాలు, రాబడీఖర్చులూ వగైరా విషయాలన్నీ ఆయన దగ్గర ఆఫీసర్‍ ఆన్‍ స్పెషల్‍ డ్యూటీ (••ణ) గా వున్న ఎ.వి.ఆర్‍.కృష్ణమూర్తి చూసుకుంటూండేవాడు. నేనెప్పుడూ ఈ ఇంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.

‘‘వున్న ఒక్క ఇల్లూ అమ్మేస్తే శేష జీవితం గురించి కూడా ఆలోచించాలి గదా...’’
‘‘ఏముంది ఆలోచించటానికి! పిల్లలందరికీ వాళ్ళ వ్యాపకాలు వాళ్ళకున్నాయి. వాళ్ళెవరూ నాతో వుండనఖ్కర్లేదు. నేనొక్కణ్ణీ ఉండటానికి ఎన్ని గదులు కావాలి? తినాలన్నా ఎన్ని తినగలను? పప్పు, అన్నం చాలు... మాజీప్రధానమంత్రి హ•దాలో అవెలాగూ లభిస్తాయి కదా! అయినా ఒంటరిగా ఉండటం అలవాటై పోయింది. నా అనుభవాలన్నీ పుస్తకాల రూపంలో రాయాలను కుంటున్నానయ్యా. ఒకవేళ ఏదన్నా జబ్బు చేసినా మాజీ ప్రధాని అనే ముద్ర ఒకటి ఉంది కాబట్టి, నడిచి పోతుందిలే...’’
ఎంత సులువుగా చెబుతున్నాడీయన.... నేనిలా ఆలోచిస్తుంటే మళ్ళీ ఆయనే అందుకున్నారు.
‘‘అమ్మేస్తే మంచి రేటు వస్తుందంటావా? ... రాకపోయినా ఫరవాలేదయ్యా. ఏదో ఒకరేటుకి అమ్మేసి ప్లీడర్లందరి బాకీలు తీర్చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ప్రస్తుతం మన కృష్ణమూర్తి కొడుకు ప్రసాదే ఆ ఇంటి విషయం చూస్తున్నాడు. నువ్వుకూడా పూనుకుంటేనే త్వరగా అవుతుందనిపిస్తోంది. ...ఇప్పుడు నేను రాసిన రెండు పుస్తకాలు రెడీగా ఉన్నాయి. అవి ఎప్పటికి అచ్చయి మార్కెట్లోకి వెళ్ళి, మనకి రాయల్టీ వస్తుందో తెలీదుకదా! అప్పటిదాకా వాళ్ళ ఋణం తీర్చకుండా వుంటామా? ఈలోపలే నాకేమైనా అయితే...?’’

పి.వి.నరసింహారావుగారి మాట నిజాయితీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. కాని ఎందుకో ఆయన చెబుతున్న బీదకబుర్లు నమ్మలేకపోతున్నాను. ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఎన్నెన్ని అనధికార కార్యక్రమాలకి లక్షలకి లక్షలు ఎలా ఖర్చయ్యేవి? అవన్నీ ప్రభుత్వనిధులు కావు. పార్టీ నిధుల రూపంలో వచ్చేవి, ఖర్చయ్యేవి. పార్టీ నిధుల సేకరణ, వ్యయం, జమాఖర్చుల నిర్వహణ వగైరా ‘నిధి నిర్వహణ’ పనులన్నీ పార్టీ కోశాధికారి సీతారాంకేసరి చూసుకునేవారు. కాకపోతే ఆయన ఏం చేసినా పి.వి.గారికి చెప్పకుండా చేసేవారు కాదు.
నేను అయోధ్య రామాలయంకోసం ట్రస్టు ఏర్పాటుచేసే పనిమీద దేశంలో ఎక్కడెక్కడికో వెళ్ళాల్సివచ్చేది. అనేక సందర్భాలలో నా విమానం టిక్కెట్లు నాపేరుమీద ఉండేవికావు. కొన్నిసార్లు ప్రత్యేక విమానాలు కూడా నాకోసం ఏర్పాటయ్యాయి.

ఇవి ఇలా ఉంచి, ప్రధానికి మీడియా సలహాదారు అంటే పత్రికల వాళ్ళతో సత్సంబంధాలు వుండేలా, నేను కూడా వాళ్ళ ‘బాగోగులు’ కొంత పట్టించుకోవాలి కదా? ఇక, పార్టీ పరంగా అనేక వీడియో ప్రకటనలకి, పత్రికాప్రకటనలకీ అయ్యే ఖర్చు అంతా కోట్లల్లోనే ఉండేది. పార్టీకి కోశాధికారి సీతారాంకేసరే అయినా పార్టీ అధ్యక్షుడి ఆమోదం లేకుండా కోట్లరూపాయలు ఖర్చు ఎలా జరుగుతుంది?
కొంతమంది పారిశ్రామిక వేత్తలకి పార్టీ విరాళాల్ని అధ్యక్షునిద్వారా అందజేస్తేనే సంతృప్తి ఉంటుంది.
మరి అలా వచ్చిన విరాళాలన్నీ కోట్లల్లోనే ఉంటాయే! ఇవన్నీ నా కళ్ళముందు మెదిలాయి. ఉండబట్టలేక అడిగేశాను.

‘‘సర్‍, మీ చేతుల మీదుగా కోట్లాదిరూపాయల నిధులు ఖర్చయ్యేవికదా! మీరు మరీ అడ్వకేట్లకివ్వాల్సిన ఫీజులు కూడా ఇవ్వకుండా...’’ అని తటపటాయిస్తూనే అడిగాను.
పి.వి గారు నావంక విచిత్రంగా చూశారు.
‘‘అదేంటి ప్రసాద్‍, అదంతా పార్టీ ఫండయ్యా. పార్టీకోసమని ఇచ్చిన డబ్బుని మన సొంతానికి ఎలా వాడుకుంటామయ్యా? ఎవరు తెచ్చి ఏమిచ్చినా దాన్ని నేరుగా సీతారాంకేసరికే పంపించేస్తూ వచ్చాను... (కొంచెం ఆగి) ఇవ్వాళ ఇలాంటి సొంత అవసరం వస్తుందనీ, అందుకోసం అప్పుడా డబ్బు దాచుకోవాలనీ అనిపించలేదయ్యా...’’
నాకు మనస్సు చివుక్కుమంది. ఎందుకు అడిగానా అనుకున్నాను.

సుప్రీంకోర్టు దాకా ‘ఎక్కేకోర్టు, దిగేకోర్టు’ అయిపోయింది ఆయన పదవీ విరమణానంతర జీవితం. అదే ఆయనలో ఆందోళన పెంచేసింది. వయసు పెరుగుతోంది. ఆరోగ్యం క్షీణిస్తోంది. ఉత్సాహం తగ్గిపోతోంది. తనకంటూ ఏమీ చేసుకోలేదు. తనవాళ్ళకీ ఏమీ చేసిపెట్టలేదు. (ఈ మాటని ఆయన కొడుకు ఒకరు బాహాటంగానే పత్రికల ముందు వెళ్ళగ్రక్కాడు). కనీసం తన అధికార బలంతో ఆశ్రిత పక్షపాతం చూపించి అయినా తన వర్గం అంటూ ఎవర్నీ కూడగట్టుకునే ప్రయత్నం చేయలేదు.
ఆయనవల్ల లాభం పొందిన కొందరు ముఖ్యమంత్రులుగానీ, ఇతర నాయకులు గానీ పదవీవిరమణ తరువాత ఆయన్ని పట్టించుకొనే ప్రయత్నం చేయలేదు. పట్టించుకోకపోయినా ఈయన ఏమీ అనుకోడు అన్న భరోసాతో కొంతమంది, ఈయన్ని పట్టించుకుంటే ఈయన తరువాత వచ్చిన పార్టీ నాయకత్వం దృష్టిలో నేరం చేసినవాళ్ళమవుతామన్న భయంతో కొంతమంది ... మొత్తంమీద ఆయన ఏకాకి అయిపోయాడు

చివరిరోజుల్లో ఆయనకి ఆప్తులుగా ఆయన పరిగణించిన వాళ్ళంటూ ఎవరన్నా మిగిలివుంటే - బహుశా - ఆయన వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తూ వచ్చిన ఎ.వి.ఆర్‍. కృష్ణమూర్తి, రామూ దామోదరన్‍, ఖండేకర్‍, ఐఏయస్‍ అధికారి రతన్‍ వట్టల్‍, నేనూ మాత్రమే. ఆయనకి పరిచయంలేని అనేకమంది దేశభక్తులు మాత్రం ఆయనకి సానుభూతిపరులుగా మిగిలిపోయారు.
నేను అతిగా మాట్లాడాననిపించిన వెంటనే ఆ మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాను.
‘‘సర్‍, సర్‍... అంటే నా ఉద్దేశ్యం, మీ వల్ల ఉపకారం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, మీకీ అవసరం వచ్చిందంటే ఎవరుమాత్రం సహాయం చేయరు!’’ అన్నాను.
‘‘కాని నేనెప్పుడూ వాళ్ళకి సహాయం చేయటం వెనకాల వాళ్ళు నాకు రుణపడి ఉండాలని భావించ లేదే! కనీసం ఆ భావాన్ని వాళ్ళకి కలిగించే ప్రయత్నం కూడా చేయలేదే! ఇవ్వాళ ఏమని అడుగుతానయ్యా? ఏనాడైనా నేను అధికారాన్ని ఒక బాధ్యతగా భావించానే తప్ప భవిష్యత్‍ కోసం ఉపయోగించుకునే అవకాశంగా కాదు. దుర్వినియోగం చేయగలిగిన వాళ్ళకి అధికారం ఒక వరం. నాలాంటి వాళ్ళకి అదొక శాపం. ఆ శాపం వల్లనే ఇప్పుడు ఆర్థికంగా నేనూ బాగుపడలేకపోయాను, నన్ను నమ్ముకున్నవాళ్ళకీ ఏమీ చేయలేకపోయాను... ఎవరైనా ఇప్పుడు ఎందుకు వచ్చి, నా అవసరాలు కనిపెట్టి పలకరిస్తారయ్యా! నా ప్రారబ్ధం నేనే అనుభవించాలి గదా...’’
నా కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి. అప్పటికింకేమీ మాట్లాడలేకపోయాను. ఆయన తన ఇంటి పత్రాల గురించి ఏదో చెప్పారు, వెళ్ళిపోయారు.
నేను ఆ ఇల్లు అమ్మకం గురించి తీవ్రంగా ప్రయత్నం చేసే లోపల - ఇది జరిగిన కొన్ని మాసాలకే - 2004 డిసెంబరు 23 న ఆయన ఢిల్లీలో కన్నుమూశారు.
ఆయన తన వకీళ్ళకి ఫీజుల బకాయిలు చెల్లించారో లేదో నాకు తెలీదు!
•••
పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారి "అసలేం జరిగిందంటే " నుంచి వల్లీశ్వర్ గారి సేకరణ

సకల దైవ గ్రంధాలు


🔘సకల దైవ గ్రంధాలు 👏 మరియు జాతక పుస్తకాలు సుమారు 300 పైగా ఈ పిడిఎఫ్ ఫార్మాట్లో దొరకును. తెలుగు భాషలో మాత్రమే అద్భుతమైన గొలుసు.‼

          ‼Link : గొలుసు‼

https://drive.google.com/folderview?id=0B5QpP6sGhAQLU2hrOGg0YWRIQW8

ప్Gostu Venkatasrinivasarao:
🔘 హిందు భక్త్తులు కోసం👏 అపురూపమైన "300 పుస్తకాలు" కానుక.దయచేసి జాగ్రత్త పరుచుకోండి. ఇవి కొందమ్మానా ఎక్కడా ఎన్ని కలెక్షన్స్ ఉండవు గమనించగలరు.

➖క్రింద ఉన్న లింక్ నందు చాలా ఆధ్యాత్మికతకు సంబందించిన పుస్తకాలు ఉన్నాయి. నచ్చిన పుస్తకం డౌన్లోడ్ చేసుకోవచ్చు.

           ‼లింక్‼

https://drive.google.com/folderview?id=0B5QpP6sGhAQLU2hrOGg0YWRIQW8

story

A 65 year Old Lady  had a Heart Attack and was taken to the Hospital. 
 While on the Operation Table, she had a Near Death Experience.. 

 Seeing God she asked : "Is my time up ?" 

 God said : 
 "No, you have another 33 years, 2 months and 8 days to live." 

 Upon Recovery, the Lady decided to stay in the Hospital and have a Face-lift, Liposuction, Breast Implants and a Tummy Tuck. 
 She even had someone come in and change her Hair Colour and brighten her Teeth ! 

 Since she had much more time to live, she figured she might as well make the most out of it. 

 After her last Operation, she was released from the Hospital. While crossing the Street on her way home, she was killed by an Ambulance. 

 Arriving in front of God, she demanded : 
 "God, you said I had another 33 years to live? Why didn't you pull me out from the Path of the Ambulance ?" 

 (You'll love this) 

 God replied : 

 "Sorry, I didn't recognize you.......... !!!!!"

తెలుగు అనువాదం;

క ధ 

65 ఏళ్ల ఓ మహిళకు గుండెపోటు వచ్చి ఆసుపత్రికి తరలించారు. 
 ఆపరేషన్ టేబుల్‌లో ఉన్నప్పుడు, ఆమెకు డెత్ ఎక్స్‌పీరియన్స్ ఉంది .. 

 దేవుణ్ణి చూసి ఆమె ఇలాఅడిగింది : "నా సమయం అయిందా?" 

 దేవుడు ఇలా అన్నాడు: 
 "లేదు, మీకు జీవించడానికి మరో 33 సంవత్సరాలు, 2 నెలలు మరియు 8 రోజులు ఉన్నాయి." 

 రికవరీ తరువాత, లేడీ ఆసుపత్రిలో ఉండాలని నిర్ణయించుకుంది మరియు ఫేస్-లిఫ్ట్, లిపోసక్షన్, బ్రెస్ట్ ఇంప్లాంట్లు మరియు టమ్మీ టక్ కలిగి ఉండాలని నిర్ణయించుకుంది. 
 ఆమె ఎవరో లోపలికి వచ్చి ఆమె హెయిర్ కలర్ మార్చి ఆమె పళ్ళను ప్రకాశవంతం చేసింది! 

 ఆమె జీవించడానికి ఎక్కువ సమయం ఉన్నందున, ఆమె కూడా దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని ఆమె గుర్తించింది. 

 ఆమె చివరి ఆపరేషన్ తరువాత, ఆమె ఆసుపత్రి నుండి విడుదల చేయబడింది. ఇంటికి వెళ్ళేటప్పుడు వీధి దాటుతుండగా, ఆమె అంబులెన్స్ చేత చంపబడింది. 

 దేవుని ముందు వచ్చి, ఆమె డిమాండ్ చేసింది: 
 "దేవా, నాకు జీవించడానికి ఇంకా 33 సంవత్సరాలు ఉందని మీరు చెప్పారు? అంబులెన్స్ మార్గం నుండి నన్ను ఎందుకు బయటకు తీయలేదు?" 

 (మీరు దీన్ని ఇష్టపడతారు) 

 దేవుడు ఇలా జవాబిచ్చాడు: 

 "క్షమించండి, నేను నిన్ను గుర్తించలేదు .......... !!!!!" 

హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము.

1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. 
ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, 
రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. 
దైవమే కాంతి. 
ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది.  స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. 
కాంతివి నీవే. 
నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, 
మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.

3. ధూపం:
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. 
వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. 
వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. 
విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన 
అందరిలో కలుగుతుంది. 
ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ 
జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి:
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. 
ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని 
భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ:
ఈ సేవలో చాలా అర్థం ఉంది. 
భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. 
అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. 
ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. 
ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం. 

6. పూజ:
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. 
కాని భగవంతునికి వీటితో పనిలేదు. 
నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. 
కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7 పత్రం(శరీరము):
ఇది త్రిగుణాలతో కూడుకున్నది. 
పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8 పుష్పం (హృదయము):
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు 
అని అర్థం కాదు. 
సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం 
అని అర్థం. 
ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9 ఫలం (మనస్సు):
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.
దాన్నే త్యాగం అంటారు.

10. తోయం(నీరు):
భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన 
దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు 
దైవానికే అర్పితం కావాలి.

11 కొబ్బరికాయలు:
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. 
దానిలో ఉండే నీరు సంస్కారము. 
కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. 
అదే నిజమైన నివేదన. 
లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, 
హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. 
హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. 
మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.
మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము:
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. 
ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. 
ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము:
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. 
ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. 
అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.
(సేకరణ)

బొట్టు మేధావి తనానికి చిహ్నమా?

ఎంత పెద్ద బొట్టు పెట్టుకుంటే అంత మేధావులవుతారా?
 బొట్టు అనేది స్త్రీకి ఎంత అందమో మనకందరికీ తెలిసింది. కానీ, ఈ మధ్యలో బొట్టు స్థానంలో రకరకాల స్టిక్కర్లు వచ్చాయి.
అలాగే బొట్టు పరిమాణం కూడా రోజు రోజుకూ తగ్గిపోతోంది. దీనివలన కలిగే నష్టాలేంటి కష్టాలేంటి? అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? దాని వలన ప్రయోజనాలేంటి?
బొట్టు పెట్టుకుంటే మేధావులు అయిపోతారా? అంటే అందుకు గల కారణాలను మన శాస్త్రాలు తెలుపుతున్నాయి. బొట్టు వెనుక ఆరోగ్యం, మేధావితనం రెండూ లభిస్తాయా? పరిశీలిద్దాం.
భృగిటిన బొట్టు పెట్టుకోవడం వెనుక ప్రధాన కారణం శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ చేసుకోవడానికి మాత్రమే. మన సాంప్రదాయాలలో ఇది భాగం అయ్యింది.
బొట్టు శరీరంలో ఉష్ణాన్ని పీల్చీవేస్తుంది. ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్దీకరించబడతాయో అప్పుడు మనసు, ఆరోగ్యం పదిలంగా ఉంటాయి.
సాయంత్రం రాత్రి సమయాల్లో కుంకుమకు బదులుగా విభూతిని ధరిస్తే చల్లగా ఉంటుంది. విభూతి వల్ల రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించ బడుతుంది.
ఓజస్సు వృద్ధి చెంది, చర్మరోగాలు రాకుండా రక్షణ కలుగుతుంది. జఠరశ్వాసకోశాలకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది.
గంధం బొట్టు శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది
మనం సూర్యుని నేరుగా చూడలేము. అందుకే అద్దాలను వినియోగిస్తాం. సూర్యునిలో ఉష్ణోగ్రత కారణంగా ఏర్పడే రంగులను మన కళ్ళు గ్రహించలేవు.
అదే సమయంలో జ్ఞాననాడి ఉంటుంది. భృకుటి వద్ద బొట్టు పెట్టుకోవడం వలన సూర్య కిరణాల నుంచి జ్ఞాననాడికి హానికలుగకుండా ఉంటుంది.
బొట్టు పెట్టుకోకుండానే మేధావులు అయినవారు లేరా? అంటే ఉన్నారు. కాని వారు బొట్టుపెట్టుకుని ఉంటే మరింత మేధావులుగా మారేవారు అనే వాదన ఉంది.
మహిళలు వైదూహ్యం పొందిన తరువాత కూడా వీబూదీ పెట్టుకోవడం వెనుక కారణం. శరీర ఉష్ణోగ్రతలను అదుపులో పెట్టుకోవడానికే.
మగవారు కూడా కొందరు బొట్టు పెట్టుకుంటారు, అలాగే కొందరు వీబూది పెట్టుకుంటారు. అబ్బా… ! అందమైన మహిళలను చూసినప్పుడు కనీసం మనస్సులోనైనా ఎంతందంగా ఉన్నారు అనుకుంటాం.
ఇది ఒక రకంగా అసూయకు దారితీస్తుంది. ఎవరు ఎవరితో మాట్లాడాలాన్నా ముఖంచూసే మాట్లాడ
గలుగుతారు.
నేరుగా ముఖం చూసే మాట్లాడుతారు కాబట్టి అక్కడ బొట్టు పెట్టుకోవడం వలన ఆ అందంపై కాకుండా నేరుగా దృష్టి బొట్టుపైకి వెళ్ళుతుంది.
బొట్టు ఎర్రగా నిండుగా కళకళలాడుతూ ప్రకాశిస్తూ వుండటం వల్ల ఇతరులు ముఖంలోకి చూడగానే వారిదృష్టిని ముందుగా ఈ బొట్టే ఆకర్షిస్తుంది.

వారెంత ప్రయత్నించినా ముఖంలోని అందమైన ఇతరభాగాల వైపు చూడలేరు. ఇలా దృష్టి దోషం తగ్గుతుంది. బాధ ఏమిటంటే ఆధునీకరణ పెరిగే కొద్ది బొట్టులో మార్పులు వస్తున్నాయి.

రకరకాల స్టిక్కర్లను పెట్టుకొంటూ చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. అందుకే నిర్ధిష్ట పద్దతిలో తయారు చేసిన బొట్టును మాత్రమే వినియోగించాలి.

#సర్వంశివసంకల్పం

DON'T PANIC

The number of deaths in the world in the last 3 months of 2020

      3,14,687 : Corona virus

      3,69,602 : Common cold

      3,40,584 : Malaria

     3,53,696 : suicide

     3,93,479 : road accidents

     2,40,950 : HIV 

     5,58,471 : alcohol

     8,16,498 : smoking

  11,67,714: Cancer

 Then do you think Corona is dangerous? 

 Or

is the purpose of the media campaign to settle the trade war between China and America 

or

to reduce financial markets to prepare the stage of financial markets for mergers and acquisitions 

or 

to sell US Treasury bonds to cover the fiscal deficit in them

Or

Is it a Panic created by Pharma companies to sell their products like sanitizer, masks, medicine etc.

Do not Panic & don't kill yourself with unecessary fear. This posting is to balance your newsfeed from posts that caused fear and panic. 

 33,38,724 People are sick with Coronavirus at the moment, of which 32,00,000 are abroad. This means that if you are not in or haven't recently visited any foreign country, this should eliminate 95% of your concern.

If you do contact Coronavirus, this still is not a cause for panic because:

81% of the Cases are MILD

14% of the Cases are MODERATE

Only 5% of the Cases are CRITICAL

Which means that even if you do get the virus, you are most likely to recover from it.

Some have said, “but this is worse than SARS and SWINEFLU!”  SARS had a fatality rate of 10%, Swine flu 28% while COVID-19 has a fatality rate of 2%

Moreover, looking at the ages of those who are dying of this virus, the death rate for the people UNDER 55 years of age is only 0.4%

This means that: if you are under 55 years of age and don't live out of India - you are more likely to win the lottery (which has a 1 in 45,000,000 chance)
Let's take one day ie 1 May as an example when Covid 19 took lives of 6406 in the world.
On the same day:

26,283 people died of Cancer

24,641 people died of Heart Disease

4,300 people died of Diabetes

Suicide took 28 times more lives than the virus did.

Mosquitoes kill 2,740 people every day, HUMANS kill 1,300 fellow humans every day, and Snakes kill 137 people every day. (Sharks kill 2 people a year)

SO DO THE DAILY THINGS TO SUPPORT YOUR IMMUNE SYSTEM , PROPER HYGIENE AND DO NOT LIVE  IN FEAR.

Join to Spread *Hope* NJinstead of Fear. 

The Biggest Virus is not Corona Virus but Fear!

SHARE TO 

STOP PANIC

(COURTESY:
DR.SARAVANAN)

*PROF.L.MOORTHI*

తెలుగు అనువాదం:

ఆందోళన చెందవద్దు 

2020 చివరి 3 నెలల్లో ప్రపంచంలో మరణించిన వారి సంఖ్య

      3,14,687: కరోనా వైరస్

      3,69,602: జలుబు

      3,40,584: మలేరియా

     3,53,696: ఆత్మహత్య

     3,93,479: రోడ్డు ప్రమాదాలు

     2,40,950: హెచ్‌ఐవి 

     5,58,471: మద్యం

     8,16,498: ధూమపానం

  11,67,714: క్యాన్సర్

 అప్పుడు కరోనా ప్రమాదకరమని మీరు అనుకుంటున్నారా? 

 లేదా

చైనా మరియు అమెరికా మధ్య వాణిజ్య యుద్ధాన్ని పరిష్కరించడానికి మీడియా ప్రచారం యొక్క ఉద్దేశ్యం 

లేదా

విలీనాలు మరియు సముపార్జనల కోసం ఆర్థిక మార్కెట్ల దశను సిద్ధం చేయడానికి ఆర్థిక మార్కెట్లను తగ్గించడం 

లేదా 

వాటిలో ఉన్న ద్రవ్య లోటును పూడ్చడానికి యుఎస్ ట్రెజరీ బాండ్లను అమ్మడం

లేదా

ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను శానిటైజర్, మాస్క్‌లు, మెడిసిన్ మొదలైనవి విక్రయించడానికి సృష్టించినఆందోళన ఇదేనా?

భయపడవద్దు & అనవసరమైన భయంతో మిమ్మల్ని మీరు చంపవద్దు. భయం మరియు భయాందోళనలకు కారణమైన పోస్ట్‌ల నుండి మీ న్యూస్‌ఫీడ్‌ను సమతుల్యం చేయడం ఈ పోస్టింగ్. 

 ప్రస్తుతం 33,38,724 మంది ప్రజలు కరోనావైరస్ తో అనారోగ్యంతో ఉన్నారు, వారిలో 32,00,000 మంది విదేశాలలో ఉన్నారు. దీని అర్థం మీరు లేకపోతే లేదా ఇటీవల ఏ విదేశీ దేశాన్ని సందర్శించకపోతే, ఇది మీ ఆందోళనలో 95% ని తొలగించాలి.

మీరు కరోనావైరస్ను సంప్రదించినట్లయితే, ఇది ఇప్పటికీ భయాందోళనలకు కారణం కాదు:

81% కేసులు MILD

14% కేసులు మోడరేట్

5% కేసులు మాత్రమే క్రిటికల్

అంటే మీకు వైరస్ వచ్చినా, మీరు దాని నుండి కోలుకునే అవకాశం ఉంది.

కొందరు, "అయితే ఇది SARS మరియు SWINEFLU కన్నా ఘోరంగా ఉంది!" SARS లో మరణాల రేటు 10%, స్వైన్ ఫ్లూ 28%, COVID-19 మరణాల రేటు 2%

అంతేకాకుండా, ఈ వైరస్ కారణంగా మరణిస్తున్న వారి వయస్సును చూస్తే, 55 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారి మరణాల రేటు 0.4% మాత్రమే

దీని అర్థం: మీరు 55 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మరియు భారతదేశం నుండి బయటపడకపోతే - మీరు లాటరీని గెలుచుకునే అవకాశం ఉంది (దీనికి 45,000,000 లో 1 అవకాశం ఉంది)
కోవిడ్ 19 ప్రపంచంలో 6406 మంది ప్రాణాలు తీసినప్పుడు ఒక రోజు అంటే మే 1 ని ఉదాహరణగా తీసుకుందాం.
అదే రోజు:

క్యాన్సర్‌తో 26,283 మంది మరణించారు

గుండె జబ్బుతో 24,641 మంది మరణించారు

డయాబెటిస్‌తో 4,300 మంది మరణించారు

వైరస్ కంటే ఆత్మహత్య 28 రెట్లు ఎక్కువ ప్రాణాలను తీసుకుంది.

దోమలు ప్రతిరోజూ 2,740 మందిని, మానవులు ప్రతిరోజూ 1,300 మంది తోటి మానవులను, పాములు 137 మందిని చంపేస్తున్నాయి. (సొరచేపలు సంవత్సరానికి 2 మందిని చంపుతాయి)

మీ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి రోజువారీ పనులను చేయండి, పరిశుభ్రతను మెరుగుపరచండి మరియు భయంతో జీవించవద్దు.

స్ప్రెడ్‌లో చేరండి * హోప్ * ఎన్‌జిన్‌స్టెడ్ ఆఫ్ ఫియర్. 

అతిపెద్ద వైరస్ కరోనా వైరస్ కాదు, భయం!

భాగస్వామ్యం చేయండి 

పానిక్ ఆపు

(Courtesy:
DR.SARAVANAN)

స్వర్గానికి రోడ్డు మార్గం

(Road route to SWARGA LOKA)
పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి.
భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు.... అనడానికి, భూమి మీద ఉన్న ఏకైక మార్గం ఇదే....

   బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం.....

..భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. 

ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది.

ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక, అలకనంద నదితో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కూడా ఉంటుంది.

ఈ సరస్వతి నది పక్కన  భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది.

పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు.
ఈ రాతిమీద భీమసేనుని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి.

ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది.

ఇక్కడ  నుండి చట్మోలి 8km......

మార్గ మధ్యమం లో భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది.

తరవాత "మాతమూర్తి ఆలయం" కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కూడా చెప్తారు.
ఈ ప్రాంతం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

తర్వాత "కుబేర్ మకుట్ "అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతం గా తీసుకున్నట్లు చెప్తారు.

ఇక్కడినుండి 5km ప్రయాణం చేసాక "వసుధార జలపాతం" వస్తుంది.

ఇక్కడే అష్ట వసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు.
ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తునుండి పడుతుంది.

ఇక్కడ గాలులు బలంగా వీస్తుండడం చేత ధార చాల పలుచగా నీటి తుంపర లవలె పడుతుంది.
అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు.

చట్మోలి:-

తర్వాత చట్మోలి ( 12000 అ ఎత్తులో ) అనే అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతానికి చేరుకుంటాం.

పర్వతారోహకులకు ఇది ఒక విడిది ప్రదేశం.

ఇక్కడే "సతోపంత్"  మరియు "భగీరధ్ కర్క్" అనే రెండు నదులు   ( హిమానీనదాలు ) కలిసి "అలకనంద" గా ఏర్పడతాయి.

అక్కడి నుండి ముందుకు వెళితే "ధనో హిమానీనదం" కు చేరుకుంటాం. 

చట్మోలి నుండి లక్ష్మివన్ 1km ( 12600 అ ఎత్తు లో ).........

తర్వాత లక్ష్మి వన్ ప్రాంతం కు చేరుకుంటారు. ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. 

ఇక్కడే లక్ష్మి మాత మరియూ విష్ణు భగవానుడు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు.

ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించింది అని  చెప్తారు.   

ఇక్కడి నుండి 2km ప్రయాణించాక  బంధర్ అనే ప్రాంతం కు చేరుకుంటాం. 

ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసాడని చెప్తారు.

బంధర్ నుండి సహస్రధార 4km ( 14000 అఎత్తులో).........

సహస్ర ధార నుండి చక్ర తీర్ధం 5km (15000 అ ఎత్తులో)........

చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సు గా చెప్తారు.

ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు.

చక్రతీర్ధం నుండి సతోపంత్ 5km........

ఈ సతోపంత్ అనేది త్రిభుజా కృతి లో వుండే సరస్సు.
ఇది 5 పర్వతాల మధ్య వుండే సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే  సరస్సు.

ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపం లో వారిని సేవిస్తారని చెప్తారు.

ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహం ను చూడవచ్చట.
ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు.

సతోపంత్  నుండి స్వర్గారోహిణి 8 km......

ఈ మార్గం బహు కష్టం గాను ప్రయాణానికి దుస్సహం గాను చెప్తారు.

మార్గ మధ్యం లో చంద్రకుండ్ మరియూ సూర్యకుండ్ అనే సరస్సులు...భట్టాచార్య... ఉంటాయి.

ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే, కుక్క తోడు రాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు. 

నిజానికి స్వర్గారోహిణి అనేది  6 పర్వతాల సమూహం గా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది.
ఇది ఉత్తరాఖండ్ రాష్టం లోని ఉత్తరకాశి జిల్లా లో కల ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి  చెందినది. 
దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది. 

ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం ( 20512 అ ఎత్తు లో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే  మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి  పైకివెళితే స్వర్గ ముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.

    "స్వర్గారోహిణి పర్వత సమూహాలు" అన్నవి అతి పురాతనమైన పర్వత సమూహాలు. ఇవి గర్వాల్ హిమాలయాల లోని సరస్వతి హిమ శ్రేణులలో కలవు. నేటి "ఉత్తరాఖండ్" రాష్ట్రం లో గల "ఉత్తర కాశీ" జిల్లాలో కలవు. ఇవన్నీ మరల గంగోత్రి హిమ శిఖరాలు. ఇవి మరల నాలుగు శిఖరాలు. 1. స్వర్గారోహిణి - 1 అన్నది ప్రధాన శిఖరం.

    ఈ పర్వతం సముద్ర మట్టానికి 6,247 మీటర్ల ఎత్తులో కలదు.

     "స్వర్గారోహణ"....అన్న పదం, మన ఇతిహాసమైన "మహాభారతం" నుండి వచ్చింది. "స్వర్గారోహణ పర్వం"....మహాభారతమందలి పర్వాలలో ఒకటి కదా! మహాభారతంలో....చివరి అంకంలో ధర్మరాజాదులు, తమ రాజ్యాన్ని వదలి స్వర్గం వైపు ప్రయాణం కడతారు. ఈ "స్వర్గారోహిణి" పర్వతాలు, స్వర్గానికి నిచ్చెనలాంటివి అని పురాణ కథనం. కానీ పాండవాగ్రజుడైన, ధర్మ రాజు మాత్రమే స్వర్గాన్ని చేరుకుంటాడు. హిందూ ఐతిహ్యాల ప్రకారం........ఈ స్వర్గారోహిణి పర్వతాలే, స్వర్గానికి సశరీరంగా వెళ్ళడానికి మార్గంగా ఉన్నాయని, ఐతిహ్యాలు చెబుతున్నాయి. ఇందులోని మార్మికత ఏమిటో?

భట్టాచార్య

*షోడశోపచార పూజ*

హిందువులు షోడశోపచార పూజా విధానంలో దేవుణ్ణి  పూజిస్తారు. షోడశ అనగా పదహారు.   ఉపచారాలు అనగా సేవలు. *పూజా వస్తువులు* 
 *అవి వరుసగా* 
 *1.ఆవాహనం* = మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించాలి. 
 *2.ఆసనం* = వచ్చిన వారిని కూర్చోబెట్టాలి.  
 *3పాద్యం* = పాద పూజ చేయాలి.  
 *4.ఆర్ఘ్యం* = చేతులు శుభ్రపరచాలి. 
 *5.ఆచమనీయం* = దాహమునకు మంచి నీళ్ళివ్వడము. 
 *6.స్నానం* = శుభ్రమైన నీటితో అభిషేకము చేయాలి. 
 *7.వస్త్రం* = పొడి బట్టలు కట్టాలి. 
 *8.యజ్ఞోపవీతం* = యజ్ఞోపవీతమును మార్చాలి. 
 *9..గంధం* = శ్రీ గంధము చెట్టు చెక్కను సానపై సాదగా వచ్చిన సుగంధమును అలంకరించాలి. 
 *10.పుష్పం* = పువ్వులతో అలంకరించాలి. 
 *11.ధూపం* = అగరు బత్తీలు వెలిగించి ఉంచాలి. 
 *12.దీపం* = ఆవు నెయ్యి లేదా మంచి నూనెతో దీపము వెలిగించాలి. 
 *13.నైవేద్యం* = మడితో వండిన ఆహారమును లేదా ఫలములు, బెల్లము, మొదలగునవి సమర్పించాలి. 
 *14.తాంబూలం* = తమలపాకులు వక్కలు తాంబూలముగా ఉంచాలి. 
 *15.నమస్కారం* = మనస్పూర్తిగా నమస్కరించాలి. 
 *16.ప్రదక్షిణం* = మన కుడి భుజము వైపున దేవుడు ఉండేలా చూచుకొని దేవుని చుట్టూ తిరగటము.

 *నైవేద్యం:---*

భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి.

1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .

 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిoచరాదు . చల్లారాక పెట్టాలి.

 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.

 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.
 *ఫలాలు:--*  
వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు
 *కొబ్బరి కాయ* ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి. 
 *అరటి పండు -* భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. 

 *చిన్న అరటిపళ్లు నైవేద్యం* గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. 
 *నేరెడు పండు.* - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు. 
 *ద్రాక్ష పండు.* - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది. 
 *మామిడి పండు.* - మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు. 
 *అంజూర పండు.* - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అo జూరాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.
 *సపోట పండు.* - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి. 
 *యాపిల్ పండు* - భగవంతుడికి యాపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. *కమలా పండు. -* భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి. 
 *పనసపండు* - పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు. 
 *దీపం*
 దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేకపోతే, కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి.
 ప్రతిసారీ తలస్నానం  చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.
ఇక దీపం వెలిగించేది ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టీ ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమా చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి.
 (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వ దినాలలో, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.) 
దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి. రెండు జ్యోతులు వెలిగించాలి.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి.
ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

జీవితాశయం (చిన్న కధ)

రాత్రి భోజనాల తర్వాత ఒకటీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది. 
ఆమె పిల్లలు పడుకున్నారు!
భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.
చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది.
ఆ  ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!
"ఏమైంది? ఎందుకు  ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.
 నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.
"అయితే...?"
"ఇదిగో! ఈ చివరి  పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"
భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"
హెడ్డింగ్ ఇలా పెట్టాడు
నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.
అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రేమిస్తారు!
వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!!
నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!
అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్  చేతిలోకి తీసుకుని  జవాబిస్తారు!
కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...
నేను  ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!
వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!
వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు! 
అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!
అదే ఒకవేళ నాతో  మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే  ఫోన్ కి జవాబిస్తారు!
అమ్మానాన్నలు
స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!
ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!
దాన్ని చాలా ఇష్టపడుతారు!!
దానితో రిలాక్స్ అవుతుంటారు!!
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!
రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!
ఉదయం లేవగానే దాన్నే  చేతిలోకి తీసుకుంటారు!!
కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న  చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!! 
భార్య చదువుతుంటే... విన్న  భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...
"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.
"మన కొడుకు" అంది భార్య కన్నీరు కారుతుండగా!
వస్తువులను ఉపయోగించుకోవాలి!
బంధాలను ప్రేమించాలి!!
అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!......ఇది నిజంగా జరిగిన కథ.. కాబట్టి ఇలాంటి కథలో తల్లిదండ్రులు మీరు కాకండి..

*అన్నం పరబ్రహ్మ స్వరూపం*

1. అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది.

2. వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని
అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,

3. అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు.

4. తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది.

5. బాదం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.

6. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.

7. అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి, ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు అలా చేస్తే  దరిద్రం అంటే అవకాశం ఎక్కువ.

8. ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే
● తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం వలన దీర్గాయుష్షు వస్తుంది
●● పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది
●●● ఉత్తర ముఖంగా కూర్చుంటే  సంపద వస్తుంది
●●● దక్షిణ ముఖంగా కూర్చుంటే  కీర్తి వస్తుంది

9. అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టుట,దుర్భాష లాడుట చేయరాదు.

10. ఏడుస్తూ తింటూ ,దెప్పి పొడువరాదు.

11. ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును.

12.భోజనసమయంలో ,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం

*బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్ బ్రహ్మైవ తేన గన్తవ్యం  బ్రహ్మకర్మ సమాధిన*

*అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత:   ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్*

ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది

కరోనా నివారణకు వాడవలసిన మందులు


*సర్కారు ఓరకం, కార్పొరేట్ మరోరకం... రోజులు భయానకంగా ఉన్నయ్... ఎందుకైనా మంచిది,...సేవ్ చేసి పెట్టుకొండి ఈ పోస్టు...*మన చేతుల్లో ఉన్నది మనం చేసుకోవాలి. ధైర్యంగా ఉండాలి. హాస్పిటల్ మాటే వద్దు..వేడినీళ్లు, ఆవిరి పట్టుకోవడం, ఇంట్లో సాంబ్రాణి... వెల్లుల్లి, పసుపు ధూపం వేసుకోవడం.. హాయిగా ప్రశాంతంగా ఉండడం.. వేడిగా తినడం.. మంచిగా నిద్రపోవడం గొడవలన్నీ పెట్టెలో పెట్టి తాళం వేయండి.. ఈ పరిస్థితి ఎవరికి వద్దు. ముందుగా...

1.Dolo 650 (paracetamol tab )
2.Levo citrizen(sneezing n cold)
3.Benedryl plain(Caugh)
4.Nasoclear(nasal drops)
5.vicks vaporub (జలుబు పడిశంకు వాడే రబ్) 
6.Zincovit ( జింకు మరియి విటమిన్లు 
7.Evion (విటమిన్ E ) (oil soluble) 
8.D-rise 2000iu (vitamin D3 supplement డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి) (oil soluble) 
9.VitC (రోజుకు 500mg రెండు వేసుకోవచ్చు)
10.Amoxicillin500mg(anti biotic)
11.Pantop(for acidity)
12.Norflox400యంగ్(motions)
13.vomitin(వొమిట్స్)
14.ORS packets (glucose with salts )
ఇంట్లో మెంబెర్స్ ను బట్టి కొంత stock ఉంచుకోండి. ఇవన్నీ ఇన్ఫెక్షన్ కొద్దిగా సోకినట్టు అనుమానం వచ్చిన 2 రోజులు ఆపకుండా వేసుకోండి (1.2.6.7.8.9,10and11) మోషన్స్ వొమిట్స్ అవుతుంటే అవి ఆపి (12,13,14) తీసుకోండి ...
గమనిక: 
ఒక వాట్సాప్ గ్రూపులో వచ్చిన సమాచారాన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.  దీని గూర్చి నాకు పూర్తిగా అవగాహన లేదు.  దయచేసి మీరు ఎవరైనా ఫై మండలను వాడ దలుచుకున్న అది మీ మీ వ్యక్తిగత భాద్యత మీద ఆధారపడి ఉంటుంది.  మీకు కలిగే కష్ట నష్టాలకు ఈ బ్లాగ్ కానీ బ్లాగర్ కానీ ఏవిధమైన భాద్యత వహించదు గమనించగలరు. అన్ని మందులు దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా వాడాలి. మందులు రోజు మనం టీ టిఫిన్లుతింటున్నట్లు వాడకూడదు. విటమిన్ మాత్రలు రోజు తగుమోతాదులో వాడ వచ్చు.  కానీ అవికూడా అతిగా వాడకూడదు. ఇప్పుడు ఏదో భయంతో వున్నాము మనం. అందుకు కొన్నిసారులు విచక్షణ మరచి అతిగా వాడితే అనవసర ప్రమాదం కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.  
నోట్: ఇక్కడ (oil soluble) అని వ్రాసిన విటమినులు అనవసరంగా వాడకూడదు. అవి ఎక్కువగా వాడితే కిడ్నీలమీద ప్రభావితం చేస్తాయ్. 
క్రిందివి  ఆంటిబయోటిక్స్ వీటిని డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. 
10.Amoxicillin500mg(anti iotic) 12.Norflox400యంగ్(motions)


*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-5* 

 *వైకుంఠమున భృగువు శ్రీహరి వక్షస్థలమును తన్నుట* 

కైలాసమును వీడి ఆ భృగువు ఉత్కంఠతతో వైకుంఠమునకు వెడలినాడు. బ్రహ్మను పరీక్షించుట జరుగనే జరిగినది. శంకరుని పరీక్షించుట జరిగినది.

శ్రీ మహావిష్ణువును పరీక్షించవలసియున్నది, అందువలననే భృగువు శోభాయమానమగు వైకుంఠమునకు ప్రయాణమై వైకుంఠమును చేరినాడు.

అచ్చట శ్రీమహావిష్ణువుండెడి సొగసు వెలార్చు సుందర మందిరమును ప్రవేశించినాడు.

 ఆహా! ఆ లక్ష్మీనారాయణుల దివ్యస్వరూపములు,

 శ్రీమహావిష్ణువు శేషపాన్పు పై ఠీవిగ పవ్వళించుటలో గల ఆ వంపుసొంపు యెంత చక్కగానున్నది! పవ్వళించియున్న శ్రీమన్నారాయణుని పాదకమలములను లక్ష్మీదేవి తన కర కమలములతో మెల్లమెల్లగ ఒత్తుచున్నది. 

హృదయమున భృగుమహర్షి నారాయణ స్మరణ మొన్నర్చినాడు. తదుపరి ఒక్కసారిగ శ్రీమన్నారాయణుని చెంతకేగి అదరూ బెదురూ లేకుండగ ఆయన పవిత్ర వక్షస్థలమును తన్నినాడు.

శ్రీ మహావిష్ణువు యొక్కవక్షస్థలమును తన్నుట ఎవ్వరునూ, ఎప్పుడునూ చేయ సాహసించని పని దానిని భృగువు చేసినాడు. 

లక్ష్మీదేవి పొందిన ఆశ్చర్యమునకు అంతులేకపోయెను. తనను తన్నినందులకు వైకుంఠవాసుడావంతయు చలించలేదు. 

వీసమెత్తయిన కోపమును పొందలేదు. పైగా తన పాన్పు నుండి దిగి వెడలి భృగుమహాముని పాదములను పట్టుకొని

 ‘మహర్షీ! నేడు నేనెంత ధన్యుడనైతిని, మహాతపశ్శక్తి సంపన్నులగు మీ పవిత్ర పాదధూళి వలన నా శరీరమెంతగానో పవిత్రమైనది. 

అయ్యో! మరచితిని. కుసుమ సమాన కోమలములైన మీ పాదములు నా శరీరమును స్పృశించు ఎంతగా నొచ్చికొనినవో కదా! స్వామీ! ఏదీ మీ పాదములిటు చూపుడు’’ అనిచూచి కొంత ఒత్తెను, 

భృగువునకు పాదమున ఒక కన్ను గలదు. ఆ కంటిని శ్రీమన్నారాయణుడు ఆయన పాదముల నొత్తుచు చిదిపివేసెను.

 పిదప భృగుమునితో ఈ విధముగాననెను. 

‘‘భృగుమహర్షీ! మీ హృదయమున గల అభిప్రాయమును, మీరు వచ్చిన పనిని నేను గ్రహించనే గ్రహించితిని. మీరు ఏ పని నిమిత్తము నా కడకు వచ్చిరో ఆ పని అయినందులకు నేను మిక్కిలిగ ఆనందించుచున్నాను.’’

 ప్రశాంతమయిన, గంభీరమయిన శ్రీమహా విష్ణువు యొక్క పలుకులు భృగుముని పై అమృతపు చినుకులుగనుండెను. 

పాదమున గల కన్నుపోయిన పిదప భృగువున కేదియో నూతనానుభూతి కలిగెను. 

శ్రీమహావిష్ణువు యొక్క పరమశాంత స్వభావమునకు భృగువు లోలోపల మహానందమును పొందెను.

 ఆహా ఎంతటి సాత్త్వికమూర్తి విష్ణుమూర్తి! అనేక విధములైన శక్తి సంపదలున్నప్పటికినీ, తాను వక్షస్థలమున తన్నినప్పటికినీ కించిత్తూ మాట్లాడకదూషించలేకపోయెను.

 పైగా నా యొక్క పాదమున కేమయినా నొచ్చినదేమోనని నొచ్చుకొనుచున్నాడు. కావున శ్రీ మహావిష్ణువు మించిన సత్త్వగుణ ప్రధానుడు మరియొకడు లేడని గుర్తించాడు భృగువు.

 శ్రీమహావిష్ణువుతో అతడు, ‘సకలలోకపితా!నీవంటి మహాత్ముని పరీక్షించుటకు అరుదెంచుటయే పాపమునకు కారణమగును. నా పాపము బహుజన్మలెత్తిననూ పోవునా? తీరునా? నా తప్పును క్షమించవలసినదిగానూ, నన్ను రక్షించవలసినదిగానూ కోరుచున్నాను’’ అనెను.

 శ్రీమన్నారాయణుడు ముఖము నుండి చిరునవ్వు వెన్నెల కురిపిస్తూ కన్నుల నుండి దయను మెరిపిస్తూ భృగుమహర్షీ! నీ హృదయము నేనెరుంగనిదా! 

మీ పరీక్ష వలన మా గొప్పతనము మరియొక మారు ఋజువైనది అంతియే కదా! అందువలన నీకిది పాపదాయకము కాదు, నీకు శుభము కలుగును గాక! 

నీకు లోకకళ్యాణ కారకత్వము కలుగునుగాక! వెడలిరమ్ము అని కటాక్షించుచూ పలికినాడు.

 నారాయణుడు కరుణించగనే భృగువు ‘అమ్మయ్య’ అనుకొని భూలోకమునకు హుటాహుటిగా ప్రయాణమయ్యాడు.

 *వజ్రమకుటధర గోవిందా, వరాహమూర్తి గోవిందా,* *గోపీజనప్రియ గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా; |* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా* *హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. |* |||

శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం




*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-6* 

 *శ్రీ* *మహావిష్ణువు పై కోపగించి లక్ష్మీదేవి భూలోకమునకు పోవుట* 

భృగుమహాముని భూలోకమున గంగానదీ తీరమున చేరి యచ్చట మహర్షులు యజ్ఞము చేయుచోటికి వెళ్ళెను.

 వారికి తన పరీక్షానుభవములు తెలిపెను. త్రిమూర్తులలో సాత్త్వికగుణ ప్రధానుడు శ్రీమహావిష్ణువు మాత్రమేనని వారికి చెప్పి యజ్ఞఫలమున శ్రీమన్నారాయణునికి ధారపోయవలెనని సలహా యిచ్చెను. 

మునులందరు సంతసించిరి.
అక్కడ వైకుంఠములో విషయాలెలా వున్నాయంటే శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలము పై భృగువు తన్నాడు గదా! 
అందువల్ల శ్రీమన్నారాయణుని హృదయమే నివాసంగా గల లక్ష్మీదేవికి ఎక్కడలేని కోపమూ వచ్చినది. వచ్చుటయేమి హెచ్చినది. హెచ్చిన కోపముతో నిట్లనినది. 

ఎన్నడునూ కోపించని లక్ష్మీదేవి కోపించి శ్రీమన్నారాయణునితో అన్నది గదా-
నాథా! నా హృదయబంధూ! ఏమిటి భృగువునకింత పొగరు? సర్వలోకములకు కర్తలు, శాసనాధికారులు అయిన మిమ్ములను తన్నినందులకు నాకు చాలా విచారముగా నున్నది. 
అందుననూ మీ హృదయము పై తన్నుట వలన నేను చెప్పరాని బాధ పొందవలసివచ్చినది. 
నాథా! ఆ భృగువు గర్వాంధుడయి మీ హృదయము పై తన్నగా, ఆ దుష్టుని మీరు దండించవలసినది కదా! దండించలేదు సరికదా పైగా అతనిపాదములను ఒత్తిరి. అది ఉత్తమకార్యమా?

 నాకది యెంతటి యవమానమును కలిగించినది. ఆ యధముడైన మునిని నేను సర్వనాశన మొనర్చ గోరుచున్నాను అనెను.

శ్రీమహావిష్ణువు ‘‘నా హృదయేశ్వరీ! లక్ష్మీ! నీవు భక్తులకు నాకు మధ్య గల సంబంధము లెరుంగక ఇట్లు కోపము తెచ్చుకొంటివి. 

నా యొక్క భక్తుల మనోభావము లను అర్ధము చేసికొనుట యితరులకు శక్యముకానిది. అది నాకు మాత్రమే అర్దమగును. 

భృగువనిన ఎవరన్నుకొన్నావు, అతడు మహాజ్ఞాని, జ్ఞానియగు భక్తుడు నన్నవమానించునా? 

అతడీనాడు మహోత్కృష్ట కార్యాన్ని నిర్వర్తించుటకు మాత్రమే వచ్చాడు. ఆ కార్యము నెరవేరుటకు నన్ను తన్నినాడు. 

కాని, మరొకటి మరొకటి కాదు. అతని భావమన్న కపిల గోవు వెన్న, అదియుగాక భక్తులు మనకు బిడ్డలవంటివారు. 

బిడ్డలు చేయు పనులకు తల్లిదండ్రులు కోపము తెచ్చుకొని వారిని తెలిసికొనక దండించుట తగునా? కనుక ఓ ప్రాణేశ్వరీ! లక్ష్మీ నీవు శాంతమును పొందవలసియున్నది అని అన్నాడు.

మెల్లమెల్లగా చల్లచల్లగా నీతులు గరపాడు లక్ష్మికి. కాని లక్ష్మీదేవి కోపమును ఆయన ఉపశమింపచేయలేకపోయాడు.

రమాదేవి ఒడలు మండిపోయినది, ఆవేశమే తానయి యిట్లన్నది, 

‘‘ప్రాణప్రియా! నాథా! భృగువు చేసినది మీకిష్టము కావచ్చును. నాకు కాదు. నా నివాసమగు మీ హృదయమును తన్ని నన్ను బాధ పొందించిన ఉసురు ఊరకనే పోదు. అతడనుభవించియే తీరవలెను.

 దుర్మార్గుని శిక్షించియే తీరవలెను, లేనిచో మఱింత విజృంభించును. పగ తీర్చుకొనక నేనొక క్షణమేని విశ్రమించలేను.
 ఆ భృగువును సమర్ధించిన కారణముగా నేటితో మీకును, నాకు గల సాన్నిహిత్యము బెడిసికొట్టినది. 

ఆ బ్రాహ్మణాధముడు మన ఇద్దరును యీ విధముగ వేరుచేసినవాడయ్యెను’’ అని అణుచుకొనలేని కోపముతో బ్రాహ్మణులు భూలోకమున దరిద్రావస్థల ననుభవించెదరు గాక! దారిద్ర్యమును అనుభవించుచు తమకు గల ఉన్నత విద్యలను అమ్ముకొనుచు దుర్భర జీవితములను గడుపుదురుగాక’’ అని శపించివైచెను.

లక్ష్మీదేవి తన భవిష్యత్తును గూర్చి ఆలోచింపసాగినది.

 కట్టుకొన్న భర్తయే కాక తనను హృదయములో భద్రముగా దాచుకున్న భర్త అగు శ్రీ మహావిష్ణువుతో స్పర్థ ఏర్పడింది కదా! అయినప్పుడింక తానేమి చేయవలసివున్నది?
అవమాన దగ్ధ హృదయముతో భర్త వద్ద నుండుట కన్న ఎక్కడో ముక్కు మూసుకొని ఒకచోట తపస్సు చేసుకొనడం మంచిదని రమాదేవి యెంచినది.

‘‘నేను మఱి వైంకుఠమును వదలి వెడలిపోతున్నాను.’’ అన్నది లక్ష్మి. 

‘‘మనసు మార్చుకొను’’మని నారాయణుడు బ్రతిమాలాడు. ఎంత బ్రతిమాలినా లాభం శూన్యం అయినది.

 పట్టుదల వీడలేక లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి బయలుదేరింది భూలోకానికి! పర్వతములు, కొండలు, కోనలూ, గట్లూ, పుట్టలూ, మొక్కలూ, నదులు, నదాలు, సముద్రాలు, జలపాతాలు దాటుకుంటూ ప్రయాణం సాగించినది. 

ఎంత అందమయినదీ ప్రకృతి! పచ్చదనాల శోభలు, ప్రకృతి రమణీయ సంపద మున్నగు వానితో తులతూగుచున్నది. హరిత నీలభరిత ధూమ్రవర్ణ కాంతివంతమై వున్నది. రమాదేవి భూలోకమున తన ప్రయాణం సాగించి, సాగించి, గంగతో సమానమైన పుణ్యనదీ అయిన గోదావరి నదీతీరము చేరింది.

గోదావరి అందము గోదావరిదే! దాని గమనములోని సొగసుదనము దానిదే! పురాణ ప్రసిద్ధ గోదావరీ నదిని లక్ష్మీదేవి చేరినది. 

గోదావరీ తీర స్థలమున  కొల్లాపురము వద్ద ఒక చక్కని పర్ణశాలను చేసికొని అచ్చట లక్ష్మీదేవి తపస్సు ప్రారంభించినది.

 *దశరధనందన గోవిందా,* *దశముఖ మర్దన గోవిందా,* *గోపీజనప్రియ గోవిందా,* *గోవర్ధనోద్ధార గోవిందా; |* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా. |* |6||

శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం
 *జై శ్రీమన్నారాయణ*