21, ఏప్రిల్ 2023, శుక్రవారం

మజ్జిగ - మహా పానీయం

 మజ్జిగ - మహా పానీయం


 “మ౦చుకొ౦డల్లో పాలు తోడుకోవు. అ౦దుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉ౦డవు. ఈ కారణ౦గా, కైలాస౦లో ఉ౦డే పరమ శివుడికి, మజ్జిగ తాగే అల వాటు లేకపోవటాన ఆయన నీలక౦ఠుడయ్యాడు. “


“ పాల సముద్ర౦లో నివసి౦చే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకవు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. “


“స్వర్గ౦లో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇ౦ద్రుడు బలహీనుడు అయ్యాడు. “

   “మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగ౦, అగ్నికి కాల్చే గుణ౦ ఇవన్నీ వచ్చేవే కాదు” 

*యోగ రత్నాకర౦* అనే వైద్యగ్ర౦థ౦లో ఈ *చమత్కార విశ్లేషణ* కనిపిస్తు౦ది. 

మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వ౦”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి వర్చస్సు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోస౦ మజ్జిగనీ భగవ౦తుడు సృష్టి౦చాడట!

వేసవి కాలాన్ని మన౦ మజ్జిగతోనే ఎక్కువగా గడిపే౦దుకు ప్రయత్ని౦చాలి. తోడుపెట్టిన౦దు వలన పాలలో ఉ౦డే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిల౦గా ఉ౦డట౦తో పాటు, అదన౦గా “లాక్టో బాసిల్లై” అనే “మ౦చి బాక్టీరియా” మనకు  దొరుకుతు౦ది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉ౦డదు. 

అ౦దుకని, వయసు పెరుగు తున్నకోద్దీ మజ్జిగ అవసర౦ పెరుగుతు౦ది. *ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థక౦ అవు తు౦ది. అ౦దుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు.


చిలికిన౦దువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణ౦ వస్తు౦ది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మ౦చిది.


*వేసవి కోస౦ ప్రత్యేక౦ “కూర్చిక పానీయ౦”


ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని మజ్జిగ కలప౦డి. ఈ పానీయాన్ని  *‘కూర్చిక’* అ౦టారు. ఇ౦దులో “ప౦చదార” గానీ, “ఉప్పు” గానీ కలపకు౦డానే తాగవచ్చు.  *”ధనియాలు”, “జీలకర్ర”, “శొ౦ఠి” ఈ మూడి౦టినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా ద౦చి, మూడి౦టినీ కలిపి తగిన౦త “ఉప్పు” కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦డి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అ౦దులో దీన్ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది.

*వడదెబ్బ కొట్టని పానీయ౦ “రసాల”

పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్ర౦థ౦లో ఉ౦ది*. అరణ్యవాస౦లో ఉన్నప్పుడు, పా౦డవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయ౦గా దీన్ని తయారు చేసి వడ్డి౦చాడట! *ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తు౦ది* కాబట్టి, ఎ౦డలో తిరిగి ఇ౦టికి వచ్చిన వారికి ఇచ్చే పానీయ౦ ఇది. తన ఆశ్రమాన్ని స౦దర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి  రాముని గౌరవార్థ౦ ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉ౦ది. భావ ప్రకాశ  వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు

 ఎ౦డలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగ౦డి 

చక్కగా “చిలికిన  మజ్జిగ” ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక “నిమ్మకాయ రస౦”, తగిన౦త “ఉప్పు”, “ప౦చదార”, చిటికెడ౦త “తినేసోడాఉప్పు” కలిపి తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన  తరువాత ఇ౦కోసారి త్రాగ౦డి. 

ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడదెబ్బ కొట్టదు

కేశవ నామాలు*

 *కేశవ నామాలు*

1. *కేశవ*:- క = బ్రహ్మ, అ= విష్ణువు, ఈశ= రుద్రుడు. సృష్టి, స్థితి, లయ కారకుడు.


2. *నారాయణ*:- పుట్టి పెరిగి సాగే జీవసమూహం = నారం, ఆయనం= ఆశ్రయ స్థానం. సర్వ జీవులకు ఆశ్రయమైన వాడు.


3. *మాధవ*:- మా అంటే లక్ష్మీ దేవి, ధవ= భర్త.


4. *గోవింద*:- గోవుల ద్వారా తెలియ పడేవాడు.గో = కిరణములు, వాక్కులు, వేణువు, భూమి, ఇంద్రియములు, ప్రాణాలు.


5. *విష్ణు*:- ధర్మ,యజ్ఞాదుల రూపంతో , సూర్యాగ్న్యాది తేజస్సుల రూపంలో, శబ్ద స్వరూపంలో అన్నిటా వ్యాపించినవాడు.


6. *మధుసూదన*:- మధు- రాక్షసుడిని హరించిన వాడు.


7. *త్రివిక్రమ*:- మూడు లోకాలు ఆక్రమించిన వాడు.


8. *వామనాయ*:- వమనం= వెలికి పంపుట. నదులు, జలమును వెలిగ్రక్కినట్లు, సర్వ వ్యాపకుడైన విష్ణువు నుండి సనాతనము గా వివిధ జ్ఞాన మయమైన జగత్కర్మలు ప్రకటింప బడుటచే వామనుడు.


9. *శ్రీధర*:- అమృతం మాధుర్యాన్ని, చంద్రుడు వెన్నెలను ధరించినట్లు స్వాభావికంగా లక్ష్మిని /శ్రీదేవిని ధరించినవాడు.


10. *హృషీకేశ*:- హృషీకము= ఇంద్రియములు, ఇంద్రియములకు ఈశుడు.


11. *పద్మనాభ*:- పద్మమునకు నాభి వంటివాడు. అనంత శక్తులతో, (రేకులు) భూతాలతో ఉన్న విశ్వం యొక్క కేంద్రస్థానం/ శక్తి. పద్మమునకు కర్ణికలా విశ్వానికి పద్మనాభుడు.


12. *దామోదర*:- దామము (లోకములు) ఉదరమునందు కలవాడు. యశోద చే తాడు కట్టబడిన ఉదరం కలవాడు.


13. *సంకర్షణ*:- విశ్వాన్ని పట్టి ఉంచు వాడు.


14. *వాసుదేవ* :-వసించి దీపించు వాడు. అంతటా ఆవరించే ధర్మం కలది.'వాసన' పూలలోని గంధంలా విశ్వమంతా వ్యాపించిన చైతన్యమే విశ్వమును ప్రచోదనం చేస్తుంది.


 15. *ప్రద్యుమ్న*:- విశేషంగా, ఎడతెగక ప్రకాశించే తేజ స్వరూపుడు.


16. *అనిరుద్ధ*:- అడ్డగించుటకు  సాధ్యం కాని వాడు .


17. *పురుషోత్తమ* :- హృదయ పురమున శయనించువాడు.(2) విశ్వమెవనిచేత పూర్ణమై (వ్యాప్తమై) ఉన్నదో అతడు పురుషుడు.


18. *అధోక్షజ*:- అధః = క్రిందకు, అక్షః = దివి. ఈ రెంటికీ నడుమ వ్యాపించిన విరాట్ పురుషుడు. క్రింద ఉన్న కిరణముల ద్వారా మూలమైన దానిని అక్షః - తెలుసుకోవడం.


19. *నారసింహ*:- శ్రేష్టమైన దివ్యాకారం. నారం( నర) జీవ సమూహం. నారభావం హింసించి పోగొట్టేవాడు. జీవుల (నర) హృదయ గుహలో ఉండే మహా చైతన్యమే సింహం.


20. *అచ్యుత*:- తానున్న స్థితి నుండి జారని వాడు.జారనివ్వనివాడు. మార్పు, వికారం లేనివాడు.


21. *జనార్ధన*:- జనులను (పాపఫలములుగా) హింసించు వాడు. జనులచే అభీష్ట సిద్ధులను అర్ధించబడువాడు.


22. *ఉపేంద్ర*:- ఇంద్రునికి సోదరునిగా ఉన్నవాడు. ఇంద్రునికి (ఉపరి)పైన ఇంద్రుడు.


23. *హరి*:- అన్నీ లయమయ్యాక, అన్నిటికి ఆధారమైన అధిష్ఠాన చైతన్యమే మిగులుతుంది.


24. *శ్రీకృష్ణ*:- భక్తుల దుఃఖములను పోగొట్టువాడు.(2) అన్నింటిని తనలోనికి లాగుకునేదే కృష్ణ .నామం, రూపం, గుణం, మహిమ, ఏది తలచినా భక్తుల మనసులు వెంటనే ఆయన లోనికి ఆకర్షితమవుతాయి.


25. *శ్రీకృష్ణ పరబ్రహ్మం*:- భగవంతుని నామాల ద్వారా లీలలు (తత్త్వం) వ్యక్తమవుతాయి.ఇన్ని నామాల ద్వారా తెలియజేసిన తత్త్వం శ్రీకృష్ణునిదిగా తెలుసుకుని, సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పడం. "సచ్చిదానంద స్వరూపుడు" నిర్గుణ, నిరాకార, నిష్క్రియ పరబ్రహ్మ.

మెదడు' కి మేత:-*

 *'మెదడు' కి మేత:-* 


ఈ కింద వాటికి సమాధానాలు పెట్టండి


1 మొదలు పెట్టే కారం


2 గౌరవించే కారం


3 ప్రేమలో కారం


4 పలకరించే కారం


5 పదవితో వచ్చే కారం


6 అది లేకుండా చేసే కారం


7 వేల కోలంలో కారం


8 భయంతో చేసే కారం


9 బహుమతిలో కారం


10 ఎదురించే కారం


11 వద్దని తిప్పికొట్టే కారం


12 లెక్కల్లో కారం


13 గుణింతంలో కారం


14 గర్వంతో వచ్చే కారం


15 సమస్యలకు కారం


16 ప్రయోగశాలలో కారం


17 సంధులలో కారం


18 సాయం లో కారం


19 స్త్రీలకు నచ్చే కారం


20 మేలు చేసే కారం 


21 కీడు చేసే కారం


22 శివునికి నచ్చే కారం


23 విష్ణువులో కారం


24 ఏనుగులు చేసే కారం


25 మదంతో చేసే కారం


26 పైత్యం తో వచ్చే కారం


27 రూపంతో వచ్చే కారం


28 ఇంటి చుట్టూ కట్టే కారం


29 ఒప్పుకునే కారం


30 చీదరించుకునే కారం


31 పగ తీర్చుకునే కారం

🙏

అది నువ్వే

అది నువ్వే  

ఒకరోజు సాయంత్రం 7 గంటల సమయంలో సీతాదేవి తన ఇంట్లో ఏదో పాత బట్ట చేత్తో కుట్టుకుంటున్నది. దారాన్ని తెంపి కొత్తదారం సూదిలోకి ఎక్కిద్దామని ప్రయత్నిస్తుండగా కరంటు పోయింది చేతిలోంచి సూది జారీ పడింది. ఇల్లంతా చీకటి సూదిని ఎలా వెతకాలి అని ఒక కొవ్వొత్తి వెలిగించి కొవ్వొత్తి కాంతిలో వెతకటానికి  ప్రయత్నించింది. కానీ సూది ఎక్కడ పెద్దదో ఏమో ఆమెకు ఎంతవెతికిన కనిపించటం లేదు.  ఇంతలో ఆమె భర్త రామారావు ఇంట్లోకి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా వుంది తన భార్య కొవ్వొత్తి వెలుగులో ఏదో వెతుకుతుండటం చూసి ఏమి వెతుకుతున్నావు అని అడిగాడు. ఆమె జరిగినది మొత్తం చెప్పి సూదికోసం వెతుకుతున్నాను అని అన్నది. పిచ్చిదానా ఇంట గుడ్డి వెలుతురులో నీకు సూది కనపడుతుందా ఏమిటి బైట చూడు వీధి దీపం ప్రకాశమానంగా వెలుగుతున్నది రోడ్డుమీద వెతుకుదాం పద అని ఆమెను వీధిలోకి రమ్మని పిలిచాడు.  ఏమండీ మీకు మాతికాని పోయిందా సూది నా చెతిలొనుంచి జారీ ఇంట్లో పెద్దది బైట వెతికితే ప్రయోజనం ఏమిటీ అని ఆమె అంటే.  పిచ్చిదానా బైట వెలుతురు బాగా వుంది కాబట్టి అక్కడ మనం వెతికితే వెతకటం తెలుస్తుంది తరువాత మనం అక్కడ దొరకక పొతే ఇంట్లో వెతుక్కోవచ్చు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్ధం అయ్యింది మీ తెలివి ఎలా పనిచేస్తున్నదో అని ఆమె అని.  మీకు చాతనయితే ఒక ఎక్కువ వెలుతురు ఇచ్చే దీపాన్ని తీసుకొని రండి అప్పుడు నేను సూదిని వెతుక్కోగలను.  వెలుతురు బైట ఉండవచ్చు కానీ వెలుతురు కావలసింది పోయిన వస్తువు వున్నచోట మాత్రమే.  ఇదికూడా మీకు తెలియకపొతే యెట్లా అని భర్తతో అన్నది. 

నిజానికి ఈ దృష్టాంతరం చదివితే హాస్యాస్పదంగా  కనపడుతుంది. కానీ ఇది మాత్రం అక్షర సత్యం. మనం దాదాపు కోఠిలో ఏవక్కరో తప్ప అందరం సూది ఇంట్లో ఉంటే వీధిలో వెతికే వారమే అంతేకాదు అక్కడ వెలుతురూ ఎక్కువగా వుంది ఇక్కడ ఇంకా వెలుతురువుంది అని చెప్పే వాళ్ళ మాటలు విని అక్కడ ఇక్కడ మనం వెతుకుతూ వున్నాం కానీ సూది మాత్రం దొరకటం లేదు కేవలం కాలం గడుస్తుంది, జీవితం అయిపోతున్నది. ఇక విషయానికి వస్తే మిత్రమా 

ఈ రోజుల్లో ఆ గుడికి వెళ్ళండి, ఈ క్షేత్రానికి వెళ్ళండి అక్కడ దేవుడిని దర్శించుకోవటం ఎన్నో జన్మల పుణ్యం ఇక్కడి క్షేత్రంలో దేవుడు చాలా శక్తివంతుడు అని మనలను తప్పు త్రోవ పట్టించే వారు సమాజంలో అనేక మంది తయారుఅవుతున్నారు.  దానితో సామాన్యుడు ఏది నిజమో ఏది కాదో తెలుసుకోలేక వారి మాటల గారడితో పది కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్పటానికి బాధపడుతున్నాను. నిజానికి ఏ గుడికి వెళ్లినా ఏ తీర్థానికి వెళ్లినా నీకు మోక్షం రాదు కేవలం నీ సాధనకు మనస్సు కొంత తోడ్పడుతుంది.  దానివల్ల నీకు కలిగే ప్రయోజనం చాలా తక్కువ. 

ఇది ఇలా ఉండగా ఈ రోజుల్లో అనేకమంది స్వామీజీలు, బాబాలు తమకు తామే దేవుళ్లమని పేర్కొనటమే కాకుండా ఇంకా కొంతమంది ఎప్పుడో గతించిన వారికి గూళ్లుకట్టి, పూజలు చేస్తూ మనలను కూడా పూజలు చేయమని ప్రోత్సహించటమే కాక నీవు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే నీతో స్పర్ధకు దిగి వారి వాదనే సరైనదని అయన ఫలానా దేవుడి అవతారం, ఈయన ఫలానా దేవుడి అవతారం అని అయన ఆ మహిమలు చూపెట్టారు, ఈయన ఈ మహిమలు చూపెట్టారని మనలని మభ్యపెడుతూ మన జీవితాలను లక్ష్యంనుంచి విముఖులను చేస్తున్నారు. 

మన సాంప్రదాయంలో వక్తి పూజా ఆరాధనా ఎప్పుడు  చెప్పలేదు. కేవలం అంటే కేవలం పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షం సిద్ధిస్తుందని మన ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. మానిషి కొంతకాలం తపస్సు చేస్తే కొన్ని దివ్య శక్తులు సంప్రాప్తం అవుతాయి.  వాటిని అణువాది అష్టసిద్ధులు అంటారు అట్లా సిద్ధులను పొందినవారిని సిద్దులు  అంటారు. సిద్ధులను పొందటం అంత అసాధ్యం  ఏమీకాదు. కొంతకాలం తపస్సు చేస్తే చాలు వారు ఏవైతే మహిమలు అన్నారో అవి చాలామంది తాపసులు పొంది  వున్నారు. మీరు కూడా పొందగలరు.  అది ఏమి విశేషం కాదు.

వీళ్ళు చెప్పే బాబాలు, స్వామీజీలు మన మహర్షులముందు చాలా స్వల్పులు.  వసిష్ఠ మహర్షి ఒక దర్భను జీవమున్న బాలునిగా చేసాడు, విశ్వమిత్ర మహర్షి స్వర్గాన్నే సృష్టించగలిగాడు.  వీళ్ళు చెప్పే ఈ బాబాలు, స్వామీజీలు అంతకన్నా గొప్పవాళ్ళా ఆలోచించండి. 

ఇక వారు సద్గురువులని వారిని ఆరాధిస్తే మోక్షం వస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. మిత్రమా నిజానికి మోక్షాన్ని ఏ సద్గురువు కూడా యివ్వలేదు  అది సాధకుడు తనకు తానుగా కఠోర దీక్షతో సిద్దించుకోవలసరైంది. గురువు పాత్ర చాలా చిన్నది.  ఒక్కమాటలో చెప్పాలంటే నీవు ఒక రోడ్డు మీద వెళుతున్నావు అడవిలో ఆ రోడ్డు రెండుగా చీలింది.  ఇప్పుడు నీవు ఏ రోడ్డుమీద వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ నీకు ఒక మార్గదర్శిని (బోర్డు) కనిపించింది అది ఆ రెండు రోడ్లు ఎటువైపుకు వెళతాయో చూపిస్తుంది.  దానిని అనుసరించి నీవు నీ గమ్యాన్ని చేరుకోవటానికి నీ కారును నీవే నడుపుకుంటూ  వెళతావు. ఆ రోడ్డు దాటినా తరువాత అక్కడి సైను బోర్డు సంగతే మరచిపోతావు.  నీ గురువు స్తానం కూడా అటువంటిదే నీకు మార్గదర్శనం  చేస్తాడు. నీ మార్గంలో నీవే వెళ్ళాలి. ఆలా వెళ్లక గురువునే పూజిస్తూవుంటే కాలయాపన కాక వేరొకటి కాదు.  

కాబట్టి సాధక మిత్రమా నీవు ఎవరి మాటలు వినక నీకు నీవుగా నీ మార్గాన్ని (మోక్ష మార్గాన్ని) ఎంచుకో ఆ దిశగా నీవు ప్రయత్నం చేసి నీలో నీ హృదయాంతరాలలో  నిగూఢంగా వున్న పరమాత్మను దర్శించుకో నీవు ఏ దేముడిగూర్చి గుడులకు వెళుతున్నావో ఆ దేవుడు గుడులలో కాదు నీహృదయంలోనే వున్నాడని మన వేదం మంత్రాలు గోషిస్తున్నాయి. 

పైన కధలో సీతాదేవి ఇంట్లో పారేసుకున్న సూదిని వీధిలో వెతుకుదామని రామారావు చెప్పినా నిరాకరించి ఇంట్లోనే వెతకటానికి నిర్ణయించుకుందో అదే మాదిరిగా నీవుకూడా నీలోనే దేవుడిని వెతకటానికి ప్రయత్నించు వెలుతురూ తక్కువైన వెలుతురూ ఎక్కువ చేసుకొని (ఇక్కడ వెలుతురూ అంటే జ్ఞ్యానం సరిపడిన జ్ఞ్యానం లేకపోతె జ్ఞ్యానులనుండి అంటే గురువులనుండి జ్ఞ్యానాన్ని పొంది నీవే వెతుకు )

ప్రతిరోజూ అన్ని దేవాలయాలలో పఠించే మంత్రపుష్పంలోని ఈ మంత్రాలను  చుడండి 

యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః 5

మనకు కనిపించేది వినిపించేది అది యెంత సుఖమమైన కానీ అది పూర్తిగా నారాయణుడితో వ్యాపించి వున్నది. అటువంటప్పుడు భగవంతుని ఒక దేవాలయానికి పరిమితం చేయటం ఎంతవరకు  సబబు. మీరే చెప్పండి. విశ్వమంతా వ్యాపించి వున్న దేవుడు దేవాలయాలలో కూడా వున్నాడు, వుంది భక్తుల కోరికలను తీరుస్తున్నాడు. అంటే కేవలం ఐహిక వాంఛలను తీర్చుకోవటానికి మాత్రమే దేవాలయాలకు వెళ్ళాలి కానీ మోక్ష సిద్ధికి మాత్రం కాదు. ఇక బాబాలను, సాధువులను దేవుళ్లుగా కొలవటం ఔచుత్యం అనిపించుకోదు. 

అనన్తం అవ్యయం కవిం సముద్రేన్తం విశ్వశంభువమ్

పద్మ కోశ ప్రతీకాశం హృదయం అపి అధోముఖమ్ 6

అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే నాభ్యామ్ ఉపరి తిష్ఠతి

జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ 7

సన్తతం శిలాభిస్తు లమ్బత్యా కోశసన్నిభమ్

తస్యాన్తే సుషిరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ 8

తస్య మధ్యే మహానగ్నిః విశ్వార్చిః విశ్వతో ముఖః

సోఽగ్రవిభజంతిష్ఠన్ ఆహారం అజరః కవిః 9

హృదయంలో (నీ) బంగారు కాంతులు విరజిమ్ముతూ వడ్ల గింజ కొసపరిమాణంలో భగవంతుడు విసించి వున్నాడు.  ఆయనే సర్వాంతర్యామి, అది తెలుసుకొని నీకు నీవే దేవుడవు కమ్ము. 

మోక్ష మార్గం యెంత కఠినమైనదో ఉపనిషత్తు తెలుపుతున్నది. 


ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా .
క్షురస్య ధార నిశితా దురత్యయా
దుర్గాం పాఠస్తత్కవయో వదంతి .. ౧౪.. 
 
14 లేవండి! మేలుకో! గొప్పవారిని సంప్రదించి నేర్చుకోండి. రేజర్ యొక్క పదునైన అంచు వంటిది ఆ మార్గం, కాబట్టి తెలివైనవారు నడవడం కష్టం మరియు దాటడం కష్టం.  
ఒక రేజర్ బ్లేడు మీద నడవటం యెంత కష్టమో అంట కష్టం మోక్షమార్గంలో పయనించటం అని ఈ మంత్రం చెపుతున్నది.  కాబట్టి సాదాకా కఠినాతి కఠినమైన మోక్షమార్గాన్ని ఎంచుకొని నీ శాయశక్తుల పణంగా పెట్టి మోక్షసిద్ది పొందు మోక్షం అంటే నిన్ను నీవు నీకుగా తెలుసుకోవటమే, అది తెలుసుకో చాందోగ్యఉపనిషత్‌లోని ఆరవ అధ్యాయంలో తత్ త్వం అసి మహావాక్యాన్ని వ్యక్తం చేసింది దీని అర్ధం ఏమిటంటే నీవు దేనినిగూర్చి వెతుకుతున్నావో అది నీవే అని తెలుసుకో. 
శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన శ్రీమత్ భగవత్గీత, ఆది శంకరులు రచించిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలూ, మన మహర్షుల నుండి ఉద్బవించిన ఉపనిషత్తులను నిత్యం చదివి ఆకళింపు చేసుకొని, అనుసరించే సాధకునికి భగవంతుని గూర్చి, మోక్షాన్ని గూర్చి నిశీతా , నిశ్చిత అభిప్రాయం ఏర్పడుతుంది. తెలిసి తెలియక బోధించెడి అజ్ఞ్యానుల మాటలు తేలికగా కనిపించి నిత్యము సత్యము, అనంతము అయిన పరబ్రహ్మ గూర్చి పరుగులిడతాడు.
ఓం తత్సత్ 

ఇట్లు 

మీ భార్గవ శర్మ  

 

భక్తుడికి మాటలు రాలేదు

 గంటల తరబడి క్యూలో నిలుచుని ఉన్నప్పటికి ఆ దేవుడిని దర్శించుకోలేక ఓ భక్తుడు  దేవుడిని ఒక ప్రశ్న  వేసాడు 


*డబ్బులేని భక్తులకు దూరం నుండి, డబ్బులున్న భక్తుడికేమో దగ్గర నుండి దర్శనం ఎందుకయ్యా ఈ అన్యాయం???* ఇది ఏమైనా భావ్యంగా ఉందా.?


గట్టిగ నవ్వేస్తూ భగవంతుడు


*! ఇలా సమాధానం ఇచ్చాడు !*


తల్లికి మించిన  దైవం లేదు అన్నాను. మీరు ఆవిడను పూజిస్తున్నారా ???


తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను. పాటిస్తున్నారా ????


గురువును మరొక దైవం అన్నాను. వినిపించుకున్నారా????


ఇందులో ఉన్న అందులో ఉన్న అని కాదు. నువ్వెక్కడ వెతికినా అక్కడంతా నేను ఉన్నా అన్నాను మీరు నమ్మారా  ???


కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. నాకు చేసినట్టే అన్నాను మరి చేస్తున్నారా???


నేను ఎక్కడ ఉండాలో, నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలో, నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో, నా మొక్కులు ఎలా చెల్లించాలో.. అన్ని మీరే నిర్ణయించారు,


ఇప్పుడు నాకు ఒక వెల కట్టి అందరూ వచ్చి చూసి వెళ్లే వస్తువులా నిలబెట్టారు,


అన్ని మీరే చేసి మళ్ళీ నేను చేశాను అని నిందించడం న్యాయమా .. అని ఇప్పుడు ఆలోచించడం అందరి వంతు అయ్యింది...


భక్తుడికి మాటలు రాలేదు స్వామి పాదాలు పట్టుకొని క్షమించు స్వామి అని కోరాడు...


*ఓం నమో వేంకటేశాయ నమః*

విద్యారత్నం

 శ్లోకం:☝️

*ధనహీనో న హీనశ్చ*

 *ధనికః స సునిశ్చయః ।*

*విద్యారత్నేన యో హీనః*

 *స హీనః సర్వవస్తుషు ||*


భావం: డబ్బు లేకపోవడం వల్ల పేదవాడు కాదు, అసలైన పేదవాడు విద్య లేనివాడు. అందుకే అన్ని దానాలలో జ్ఞాన దానం గొప్పది. విద్యారత్నం ఎవరి వద్ద ఉందో ఆ పండితుడే ధనవంతుడు.🙏