ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
19, సెప్టెంబర్ 2024, గురువారం
ఆచార్య సద్బోధన
.✳️*ఆచార్య సద్బోధన:*✳️
➖➖➖
*ఈ జీవితంలో సగ భాగం నిద్రలో, నారీ జన సంగమంతో వ్యర్థం చేస్తున్నారు.*
*కొంత కాలం బాల్యం మ్రింగుతున్నది.*
*మరి కొంత కాలం సంసార పోషణకు ధనార్జనలో పోతున్నది.*
*ఇలా చూస్తే పరమాత్మను ఆరాధించడానికి అవకాశమే ఉండడం లేదు.*
*సంసారం, సంతానం, సిరిసంపదలు ఇవన్నీ అశాశ్వతాలు.*
*శాశ్వతమైనది నారాయణుని అనుగ్రహం.*
*అది సాధించడానికే జీవితాన్ని అంకితం చెయ్యాలి.*
*అది గుర్తుంచుకుని మెసలుకో! శ్రీమన్నారాయణుని మనసులో స్మరిస్తూ అడుగులు వెయ్!*
*✳️సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*🙏
సంస్కృత వాక్యాలు*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*వాడుకలోని సంస్కృత వాక్యాలు*
*వాటి పూర్తి శ్లోకాలు*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*"సత్యమేవ జయతే"*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*సత్యమేవ జయతే అనేది ముండక ఉపనిషత్తులోని ఒక మంత్రంలో భాగం.*
*శ్లోకం :~*
*సత్యమేవ జయతే నానృతమ్*
*సత్యేన పంథా వితతో దేవయానః।*
*యేనాక్రమాంతి ఋషయో హి ఆప్తాకామా।*
*యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్॥*
*భావం:~*
*సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.*
*వ్యాఖ్య:-*
*సత్యం ఒక్కటే జయిస్తుంది. దైవాన్ని చేరుకునేందుకు ఆ సత్యంతోనే మార్గం ఏర్పడుతుంది. నిష్కామమైన రుషులంతా ఆ సత్యమార్గం ద్వారానే పరమాత్మను చేరుకుంటారు,’ అన్నదే పై శ్లోకంలోని భావం. ఇందులోని మొదటి పాదాన్ని పండిత మదన్‌మోహన్ మాలవ్యా ప్రచారంలోకి తీసుకువచ్చారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిషర్లను ఎదిరించి ధైర్యంగా నిలిచేందుకు ఈ సూక్తి ఒక మంత్రంలా పనిచేసింది. తర్వాత ఇదే సూక్తిని జాతీయ నినాదంగా రూపొందించారు. మూడు సింహాల రాజముద్ర ఉన్న ప్రతి సందర్భంలోనూ ఈ నినాదాన్ని కూడా ప్రచురించి తీరాల్సిందే అని ప్రభుత్వం ఆదేశించింది.*
*శ్రీ గురుభ్యో నమః।*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐
హైందవం వర్ధిల్లాలి 5*
*హైందవం వర్ధిల్లాలి 5*
మన గ్రూప్ లో నాలాంటి సాధారణ సభ్యులతో పాటు ఆధ్యాత్మిక పండితులు, వారి వారి రంగాలలో శిఖరాగ్రాన ఉన్న మరియు విశ్రాంత మాన్యులు, జ్ఞానులు, విజ్ఞానులు ఉండవచ్చును. *మళ్ళీ ఈ బాలశిక్ష పాఠాలు ఎందుకని విస్మయం చెందగలరేమో*, దయచేసి మన దేశంలో *హైందవ ధర్మానికి మరియు ఆచారాలకు విఘాతం కలుగుచున్న ప్రస్తుత ప్రయత్నాలను ఒకసారి అవలోకించగలరు*.
విధర్మీయమైన/అధర్మయుక్త ఆలోచనలతో, విదేశీయమైన (పాశ్చాత్య) అలవాట్లతో కలుషితమైన మనుష్యుల మనస్సులు ఒక పట్టాన సనాతన ధర్మ ప్రబోధాలను, సాంస్కృతిక సదాచారాలను వంటబట్టిచ్చుకోలేక పోవుచున్నాయి. పైపెచ్చు మన *సమోన్నత సనాతన ధర్మ విలువలను జీర్ణించుకోలేక ఈర్ష్య అసూయలతో మన హైందవ ధర్మనాశనానికి ముప్పేట(ఇస్లాం, క్రిస్టియన్, కమ్యూనిస్టు) దాడి* జరుగుచున్నది.
అధునాతనులు పెద్దల ప్రవచనాలను అంతరంగమున ఒప్పుకున్నా, బహిరంగంగా వారి స్వప్రయోజనాలు, స్వార్ధము కొరకు దైహిక మరియు మానసిక బలహీనతలకు తల ఒగ్గి విదేశీ సంస్కృతికి లోబడుతూనేఉన్నారు. ధర్మ మరియు దేశ ప్రయోజనాలను ఉపేక్షిస్తున్నారు.
ఆధ్యాత్మిక సాధనకు, వ్యక్తిగత సంస్కారాలకు (ఉపాధి, జీవన యాత్ర ఇత్యాది) మాత్రమే మతాన్ని, ఋజు వర్తనను అన్వయించుకునే హిందువులకు *మతాన్ని రాజకీయము కొరకు మరియు సామాజిక ప్రాబల్యము కొరకు వినియోగించుకునే స్వభావము ఉండదు*. ఈ ధోరణి *అన్యులకు గూడా ఉంటే అన్ని మతాలు, వర్గాలు సామరస్యముతో ఉంటాయి*.
*కాని, ఆలా జరుగడము లేదు*. చరిత్ర చెబుతున్న సత్యమిది. దేశాన్ని ఏలాలనే ఉద్దేశ్యంతో, దేశాభిమానము కల నాయకులపై (పార్టీలకతీతంగా) ప్రత్యర్థి వర్గము వారు, హైందవ ధర్మానికి, దేశానికి హాని కల్గిస్తూనేవున్నారు. *హైందవ వ్యతిరేకతను అడుగడుగునా ప్రత్యక్షంగాకూడా ప్రకటిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు*.
ఇంతే కాదు కదా దేశ భద్రతను, రక్షణను విస్మరించి కొందరు రాజకీయ నాయకులు ముష్కర మూకలను/విధ్వంసకారులను హద్దు దాటించి మనదేశంలోకి నిస్సిగ్గుగా దొంగ దారిలో ప్రవేశం కల్పించి మితిమీరి బుజ్జగించడము, ఓటు బ్యాంకుగా వాడుకుని
వారి అకృత్యాలను నిర్లజ్జగా సమర్థిస్తున్నారు గూడా. *క్రమం తప్పకుండా నేటి దేశ సమాచారాన్ని గమనించే వారికి పైవన్నియు కరతలామకములే*.
హిందువులకు ఐకమత్యము పట్ల ధృఢ సంకల్పము, భావన లేదని, రాదని గట్టి నమ్మకము అన్యులకు కల్గుతున్నది. ఇందుకు కారణము ముమ్మాటికీ అధిక భాగము, అధిక శాతము హిందువులే. ఆశ్చర్యకరంగా కొన్ని ప్రసార మాధ్యమాలు కూడా తమ ఉనికి, మనుగడ, అభివృద్ధి నిమిత్తమై ఎవరికీ హాని కూడా తలపెట్టిని *హిందు వ్యతిరేకతను బలంగా, బాహాటంగా చాటుతున్నాయి. సెక్యులర్ అనే పదము వీటన్నిటినీ సమర్థిస్తున్నది, దీనికి సగటు పౌరుడు నిశ్చేష్టుటవుతున్నాడు*. ఈ సెక్యులర్ *అనే పదము దేశ ద్రోహులకు భేదింపబడని కవచము*.
ఈ నేపథ్యంలో దేశ మరియు ధర్మ రక్షణ కొరకు భారతీయులు ముఖ్యంగా *హిందువులు తమ ఐక్యతను, బలాన్ని స్పష్టంగా, సంఘటితంగా* కుహానా రాజకీయ నాయకులకు, అందులోనూ హిందు దేవుళ్ళను కించ పర్చే మరియు ధర్మాన్ని బలహీనపర్చే కుత్సితులకు, *స్వదేశీ, విదేశీ ఉగ్రవాదులకు తెలియజేయాలి*.
*హిందువులై ఉండి హిందు ధర్మాన్ని వ్యతిరేకించే వారిని, చేరదీసే బుజ్జగించి స్వధర్మ ఔనత్యము గురించి వివరించాలి, సరైన దారిలో పెట్టే బాధ్యత మన ప్రతి భారతీయుడికి ఉన్నది*, ఉంటుంది. ఉండాలి కూడా.... *లేకుంటే భారత దేశవాసులు ముఖ్యంగా మన భవిష్యత్తరాల హిందువులకు "తమ ఉనికికి తామే ప్రమాదము కలిగించుకున్న వారవుతున్నారు"*.
తమకే కాక దేశ భద్రతకు, సమగ్రతకు విఘాతము కల్గించిన వారు కూడా అవుతారు. *ఇది క్షమించలేని నేరము*.
*గమనిక*
స్వధర్మ రక్షణ అంటే పర ధర్మజన హింస కాదు. *కావున హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి, ఐకమత్యంమే మనముందున్న ఏకైక సాధనం, తద్వారా హిందూ మతానికి పునర్వైభవం తేవాలి*
ఇప్పుడే పూనుకోకపోతే..... *ఆలస్యం అమృతం విషం*
ధన్యవాదములు.
*(సశేషము)*
*శ్రీ కాత్యాయిని బాణేశ్వర ఆలయం*
🕉 *మన గుడి : నెం 444*
⚜ *ఉత్తర కర్నాటక : అవెర్స*
⚜ *శ్రీ కాత్యాయిని బాణేశ్వర ఆలయం*
💠 శ్రీ కాత్యాయని బణేశ్వర్ ఆలయం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో, అంకోలా సమీపంలోని అవెర్సా తీరప్రాంత పట్టణంలో ఉన్న ఒక హిందూ దేవాలయం.
🔆 *స్థలపురాణం*
💠 మహిషాసురుడు తీవ్రమైన తపస్సు తర్వాత శివుని నుండి అద్వితీయమైన శక్తులను పొందాడు. ఆ శక్తి అతనిని అహంకారంతో మత్తెక్కించింది, అతను ఋషుల పవిత్ర కర్మలలో భంగం కలిగించడం మరియు దేవతలపై దాడి చేయడం ప్రారంభించాడు.
అతను ఇంద్రుడిని ఓడించి, అతని రాజధాని అమరావతిని స్వాధీనం చేసుకున్నప్పుడు, అతని పరాక్రమానికి భయపడి, ఋషులు మరియు దేవతలు బ్రహ్మ, రుద్ర మరియు నారాయణుడిని సంప్రదించి తమ కష్టాలను వివరించారు.
💠 మహావిష్ణువు మహిషాసురుని దుశ్చర్యల వివరాలను విన్నప్పుడు అతని ప్రశాంతమైన ముఖం భీకరంగా మారింది మరియు అతని ముఖం నుండి తీవ్రమైన దివ్య జ్యోతి వెలువడింది.
బ్రహ్మ మరియు రుద్ర ముఖాల నుండి ఇలాంటి కిరణాలు వెలువడ్డాయి. ఈ కిరణాల ప్రకాశంలో శ్రీ దేవి దివ్య రూపం కనిపించింది.
💠 రుద్రుడు తన త్రిశూలాన్ని, విష్ణువు తన చక్రాన్ని, వరుణుడు తన శంఖాన్ని, వాయువు తన విల్లు బాణాన్ని ఇచ్చాడు.
అగ్ని తన షష్టాయుధాన్ని, యముడు కాలదండాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని & ఐరావతను, బ్రహ్మకు తామరపువ్వును, క్షీరసాగరుడు తెల్లని హారాన్ని, తెల్లని వస్త్రాన్ని, చూడామణిని, చెవి ఉంగరాలు, చంద్రవంక హారము మరియు పాదరక్షలు ఇచ్చాడు. సముద్ర దేవుడు తామర పువ్వుల దండను, హిమాలయాలు శ్రీ దేవికి సింహం (వాహనం)గా రూపాంతరం చెందాయి.
💠 ఈ దృగ్విషయాన్ని కాత్యాయన అనే మహర్షి చూశాడు. అతను శ్రీ దేవి ఆరాధకుడు మరియు ఆమె తన కుమార్తెగా జన్మించాలనే కోరికను తీర్చుకున్నాడు.
ఈ భక్తికి ఎంతో సంతోషించిన దేవత తనకు కాత్యాయని అని పేరు పెట్టుకుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
💠 స్కాంద పురాణాలు సరస్వత్ బ్రాహ్మణులు ఉత్తర వింద్యగిరి (కాశ్మీర్)కు అలవాటు పడ్డారని పేర్కొన్నారు. వారు సరస్వతీ నది ఒడ్డున నివసించారు.
ఈ వంశంలోని సభ్యులు అసాధారణమైన సాంస్కృతిక మరియు సామాజిక నేపథ్యాలు కలిగిన ఉన్నత విద్యావంతులు
వారి జనాభా పెరిగేకొద్దీ వారు వారి నివాస స్థలం ఆధారంగా ఐదు విభాగాలుగా వర్గీకరించబడ్డారు.
1. సరస్వతులు - సరస్వతీ నది ఒడ్డున నివసించేవారు.
2. కన్యా కుబ్జాలు - కనోజ్ నది వెంబడి నివసించేవారు.
3. గౌడ్స్ - దక్షిణ గంగానది ఒడ్డున నివసించేవారు
4. ఉత్కళలు - ఒరిస్సాలో నివసించిన ప్రజలు. 5. మైథిలీలు - బీహార్‌లోని మిథిలా నది ఒడ్డున నివసించేవారు.
💠 12 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు తీవ్రమైన కరువు మరియు కరువు సరస్వతీ నది ఒడ్డున అలుముకుంది.
సరస్వతులు ప్రస్తుత గోవాలోని గోమంతక్ వైపు వలస వెళ్ళవలసి వచ్చింది .
🔆 ఆలయ చరిత్ర
💠 ఒకప్పుడు పౌలేకర్ అనే ధనవంతుడు ఒక పెద్ద పడవలో విలువైన సరుకులను రవాణా చేస్తున్నాడు.
బెలెకేరి సమీపంలో, అతని పడవ కుంభకోణంలో చిక్కుకుంది మరియు క్రాఫ్ట్ ఒడ్డున కూరుకుపోయింది.
అతను తన దుస్థితిని చూసి నిరుత్సాహపడి ఆవెర్సాలోని ఆలయానికి వచ్చాడు.
💠 అతను ఆలయంలో సాష్టాంగం చేసి, తన కష్టాలను వివరించాడు మరియు శ్రీ దేవి అతనిని కష్టాల నుండి విముక్తి చేస్తే పడవ ఆకారంలో ఆలయాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అతను తన పడవకు తిరిగి వచ్చి బాగా నిద్రపోయాడు.
తెల్లవారుజామున ఒక ఎనిమిదేళ్ల బాలిక తన పడవను పెద్ద స్తంభంతో నెట్టడం మరియు తేలుతున్నట్లు అతనికి కల వచ్చింది.
అతను ఒక్కసారిగా మేల్కొన్నాడు మరియు అది కేవలం కల కాదు, వాస్తవం అని కనుగొన్నాడు.
💠 అతని పడవ సముద్రంలో తేలుతోంది. అతను ఆలోచిస్తున్నప్పుడు, గుడిలోని విగ్రహం ముఖానికి మరియు తన కలల చిన్న అమ్మాయి ముఖానికి మధ్య ఉన్న సారూప్యతను చూసి అతను ఆశ్చర్యపోయాడు.
శ్రీ కాత్యాయని తనని విపత్తు నుండి కాపాడిందని అతను నిశ్చయించుకున్నాడు.
💠 అతను అవర్సాలోని ఆలయానికి వెళ్ళాడు, అక్కడ అతనికి గొప్ప ఆశ్చర్యం ఎదురుచూసింది. అతను ఇసుకతో గుర్తించబడిన పాదముద్రలను చూశాడు మరియు శ్రీ కాత్యాయని తన పడవ మరియు సరుకులను కాపాడిందని సందేహం లేకుండా నమ్మాడు. అతను చాలా వినయంతో దేవుడి ముందు నిలబడి, పూజలు చేసి, వీలైనంత త్వరగా ఆలయాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశాడు.
💠 పరులేకర్ యొక్క వ్యాపార లావాదేవీల ఫలితంగా అతను దేవతకి చేసిన ప్రతిజ్ఞ మరచిపోయాడు.
కొన్నేళ్ల తర్వాత ఆయన పడవ బెలెకేరి దగ్గర్లో వెళ్తుండగా ఒక్కసారిగా ఆగిపోయింది.
దీంతో శ్రీ కులదేవికి తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చలేదని గుర్తు చేశారు.
అతను తన లోపాలను క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు అతను బోల్తా పడిన పడవను పోలిన పైకప్పు ఉన్న ప్రస్తుత ఆలయాన్ని నిర్మించాడు.
💠 గోవా నుండి 100 కిమీ, బెంగళూరు నుండి 500 కిమీ మరియు హుబ్లీ నుండి 136 కిమీ దూరంలో ఉంది.
పంచాంగం 19.09.2024 Thursday,
ఈ రోజు పంచాంగం 19.09.2024 Thursday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష ద్వితీయ తిధి బృహస్పతి వాసర: ఉత్తరాభాద్ర తదుపరి రేవతి నక్షత్రం వృద్ధి యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.
విదియ రాత్రి 12:41 వరకు.
ఉత్తరాభాద్ర పగలు 08:04 వరకు తదుపరి రేవతి రా. తె 05:14 వరకు.
సూర్యోదయం : 06:08
సూర్యాస్తమయం : 06:12
వర్జ్యం : సాయంత్రం 06:39 నుండి 08:04 వరకు .
దుర్ముహూర్తం : పగలు 10:09 నుండి 10:58 వరకు తిరిగి మధ్యాహ్నం 02:59 నుండి 03:47 వరకు.
అమృతఘడియలు : రాత్రి 03:07 నుండి రా.తే 04:32 వరకు.
రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.
యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
సత్సంగం
🔔 *సత్సంగం* 🔔
*ఒకప్పుడు భక్తుడు తులసీదాసుని అడిగాడు.*
“మీరు రాముడిని చూశారా ?" దానికి తులసీదాస్ "అవును నేను చూసాను: అన్నాడు. భక్తుడు “అప్పుడు నాకు కూడా శ్రీరామదర్శనం చేయించండి". తులసీదాసు "ఎందుకు కాదు నీకు కూడా... శ్రీరామదర్శనం సాధ్యమే! అది చాల సులభం. మీరు ఏ వ్యక్తిని చూసిన అక్కడ మీ కోసం రాముడు కనిపిస్తాడు!" భక్తుడికి అర్థం కాలేదు. " ఎలా చెప్పండి"
తులసీదాసు అన్నారు : చూడండి, దీనికి సులభమైన సూత్రం ఉంది. భక్తుడు మరింత ఉత్సుకతతో, ఆశ్చర్యంతో ఆ సూత్రం ఏమిటి? అని అడిగాడు. అప్పుడు తులసీదాస్ ఇలా అంటాడు:
*_"నామ చతుర్గుణ పంచతత్త్వమిలన తాసం ద్విగుణ ప్రమాణ తులసీఅష్టసౌభాగ్యే అంత మే శేష రామ హీ రామ ||"_* దీని ప్రకారం, ఏ పేరు అయినా సరే, అందులోని అక్షరాలను లెక్కించండి.
నాలుగు (నాలుగు రెట్లు) ద్వారా గుణించండి. దానితో ఐదు (పంచతత్త్వ మిలన్) జోడించండి. అప్పుడు మీరు పొందిన సంఖ్యను రెట్టింపు చేయండి. దాన్ని ఎనిమిదితో భాగించండి (అష్టసౌభాగ్యం). మిగిలేది అదే. ఆ రెండు
అక్షరాలు *_"రామ"!_*
భక్తుడు ఆశ్చర్యపోతాడు. అతని పేరు "నిరంజన".
4X4=16; ౧౬ ప్లస్ 5=21;
21X2=42; 42/8= ఆన్సర్ 5. శేషం 2.
అతని భార్య పేరు "నిర్మల". అక్కడ ఉన్నదానికి సూత్రం ప్రకారం . 3X4=12;
12 + 5=17; 17X2=34; 34/8 =
ఆన్సర్ 4. శేషం 2.
అతని కూతురు పేరు "నిధి". ఫార్ములా వర్తింపజేయబడింది. 2X4=8; 8 + 5=13;
13X2=26; 26/8 = ఆన్సర్ 3. శేషం = 2
అవును! పేరు ఏదైనా, అక్షరాలు ఎన్ని ఉన్నా ముగింపు రెండు అక్షరాలు"రామ" మాత్రమే ! మరియు సూత్రంలోని సంఖ్యలు... గణిత కార్యకలాపాల ప్రాముఖ్యత మీకు తెలుసా?
చతుర్గుణ = ధర్మము, అర్థము, కామము, మోక్షము నాలుగు పురుషార్థాలు.
పంచతత్త్వం = భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం
ద్విగుణ = మాయ మరియు బ్రహ్మ.
అష్టసౌభాగ్య = ఆహారం, అర్థం, ఆధిపత్యం,యవ్వనం, కీర్తి, ఇల్లు, బట్టలు, ఆభరణాలు
వీటన్నింటి కోసమే మనం జీవిస్తున్నాం. కానీ... చివరికి మిగిలేది భగవంతుని నామం మాత్రమే...
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
20. " మహాదర్శనము
20. " మహాదర్శనము --ఇరవయ్యవ భాగము-- విచిత్రానుభవములు
20. ఇరవయ్యవ భాగము---విచిత్రానుభవములు
మరుసటిరోజు తెల్లవారింది . కొడుకుకు తల్లి స్నానము చేయించినది . ఎప్పటివలె వాడూ అగ్నిమందిరములో శాంతముగా కూర్చున్నాడు . అగ్ని పరిచర్యమంతా అయిపోయింది . కొడుకు శాంతముగా నున్నది చూసి , వీడు ఈ దినము ఆవుల వెంట వెళ్ళడేమో అనుకున్న తల్లి ఎప్పటిలా గోశాలకు బయలుదేరింది .
కొడుకు , ’ అమ్మా , ఈపూట నేను వెళ్ళవలెను, హవిస్సు చేసినావా ? " అని అడిగినాడు .
బయలుదేరిన తల్లి నిలచి ,’ ఇదిగో చేస్తాను ’ అని ఇంత బియ్యము వేయించి పొయ్యిపైన ఉంచి వచ్చింది .( గంజిని వార్చకుండా , వేయించిన బియ్యముతో చేసిన అన్నమునకు హవిస్సు యని పేరు ) ఆవుపాలను పిండు వేళకు హవిస్సయింది . దానిని తిని యాజ్ఞవల్క్యుడు గోపాలుర వెంటే ఆవుల వెనక బయలుదేరినాడు .
ఆలంబినికి ఆలోచన . మూడు సంవత్సరముల వాడిని ఆవులవెంట పంపించినానే , అని . అయితే , చూచుటకు ఐదు సంవత్సరముల వయస్సు వాడికన్నా పెద్దవాడిలా కనిపించు కొడుకు బయలుదేరుటకు సిద్ధమైనపుడు ఆ ఆలోచనే అడ్డురాలేదు . " దిగులెందుకు ? జట్టులో పెద్దలు , పిల్లలు అందరూ ఉన్నారు కదా ? " అని తనకు తానే చెప్పుకొని తన పనిలో నిమగ్నమైనది .
ఆవులు మందలో అంతసేపు ఉండి , ఎండ ఎక్కువ కాగానే ముందుకు సాగినాయి . అదే సమయమునకు గోపాలుర పెద్దలు కూడా తెల్లటి కండువాలతో తలపాగాలు చుట్టుకొని , భుజాన గొంగళి వేసుకొని , చేతిలో ముల్లుగర్రలూ పట్టుకొని , నోటిలో వక్కాకులు , పొగాకు వేసుకొని , ’ ఈబూతి ’ ధరించి వచ్చినారు . వారిలో పెద్దవాడొకడు ముందు నడుస్తున్నాడు . వాడి వెనక ఆవులు , వాటి వెనుక ఇతరులు . వారితో యాజ్ఞవల్క్యుడు .
వారిలో నడి వయస్సు వాడొకడు ఆ బాలుడిని చూసి , ’ ఏందయ్యా , నువ్వు వచ్చిండావు ? ఈ దావలో రాళ్ళు , ముండ్లే ఎక్కువ , దా , నా బుజము పైన కూకో ’ అని ఎత్తుకున్నాడు .
అతడికి రెండడుగులు వేసేలోపే ఆశ్చర్యమైనది . కుమారుడు తన వయసు వారికన్నా బరువు ఎక్కువ అనునది వాడి ఆకారమే చెబుతుండినది . అదెలా ఉన్నా , వాడిని భుజముపైన కూర్చోబెట్టుకుంటే వాడినుండీ ఏదో సొన వలె తన దేహమునకు దిగుతున్నట్లు తోస్తున్నది . ఏదో కారణము చెప్పి , పిల్లవాడిని దింపి చూచినాడు , ఏమీ లేదు. మరలా ఎత్తుకున్నాడు . మరలా ఆ సొన ప్రవహిస్తున్నది . ఆ వాహిని తనకు వద్దనపించలేదు , ఏదో హితముగా ఉండినది , సుఖముగా ఉండినది , ప్రియముగా ఉండినది .
ఇంకొక పది అడుగులు వేయగానే అతడికే తెలియకుండా నిద్ర వచ్చేసింది . ఆ నిద్రలోనే సరిగా ఊపిరి వదలుతూ , అడుగులు కొంచము కూడా తప్పకుండా సరిగ్గా వేస్తూ అందరికన్నా వెనుక దారి ఏమాత్రమూ తప్పకనే వెళ్ళినాడు . ఆవుల మంద గడ్డి మేయు పచ్చికబయలు ఊరినుండీ చాలా దూరమేమీ లేదు . కుమారుని ఎత్తుకున్న వాడు మైదానమునకు చేరు వరకూ ఒక్క అడుగు కూడా తప్పుగా వేయలేదు . మంద వెళ్ళి పచ్చిక మేయుటకు ఆరంభమగు వేళకు అతడు కూడా అక్కడికి చేరినాడు . అక్కడికి వెళ్ళగానే మెలకువ అయినది , కుమారుని దింపినాడు .
అతడికి , తాను నిద్రపోయినది నిజమేనా ? అని సందేహము . కానీ నిద్ర లేచినవాడికి ఉండే తాజాతనముంది . ఒంట్లో కొంచము కూడా ఆయాసము లేదు . దారిలో ఏమైనదన్నది ఒక్కటీ తెలీదు . కళ్ళు తెరచే ఉన్నానా , లేదా అన్నదీ తెలీదు . ఇలా ఉన్నపుడు నిద్ర రాలేదు అనుట ఎలా ?
అయినా వాడు ఎవరితోనూ ఆ విషయము ప్రస్తావించలేదు . కానిమ్ము , వెళ్ళునపుడు చూద్దాము అని ఊరకున్నాడు .
కుమారుడు ఇతరులు ఆటకు పిలచినా పోలేదు . తనపాటికి తాను కూర్చున్నాడు . వాడికి , ఇంతవరకూ ఎవరో తన వెనుక వెనుకే ఉన్నట్లు అనిపించు చుండినది . ఇప్పుడు మనసుకు నమ్మకము వచ్చింది , ఎవరో అంగ రక్షకులవలె వెంట ఉన్నట్లు తెలిసింది . ఎవరు అని అడుగవలె ననిపించలేదు .
మందలోని పశువులు అపరాహ్ణము దాటే వరకూ మేత మేసి , నీరు త్రాగి , నీడలో పడుకున్నాయి . కుమారుడు వెళ్ళి , తనతో మాటాడిన హోమధేనువు వద్ద కూర్చున్నాడు .
" మొత్తానికి మాతో వచ్చినావే ? "
" మీరు చెప్పిన తర్వాత ఇంకేమి , వచ్చేసినాను "
" సరే , ఈ దినము ఏదైనా విశేషమును చూచినావా ? "
" ఏమీ చూడలేదు "
" నీతో పాటు నీ కాపలాకు ఒకరు వస్తున్నట్లు లేదూ ? "
" ఎవరో ఉన్నట్లు , చూచినట్లు అనిపించినది. , అయితే అది నిజమేనా , ఒకరు ఉన్నారా ? "
" ఆతడే అగ్ని పురుషుడు . ఈ లోకములో మంటయై మండువాడు , దీపమై వెలుగువాడూ ఆతడే . చూడు , అతడు నీ పక్కనే ఉన్నాడు . జనాలతో పూజలు చేయించుకొని , కావలసినది ఇస్తాడు . "
" పూజ చేయకుంటే ? "
" ఆతడు తన పాటికి తానుంటాడు . దేవతలను మనుషుల వైపుకు తిరుగునట్లు చేసేదే పూజ. "
ఆనాడు తల్లి అగ్ని మందిరము వైపుకు తిరిగి నమస్కరించినది గుర్తొచ్చింది . అడిగినాడు , ’ అట్లయితే నమస్కారము చేసేది కుడా పూజేనా ? ’
" సందేహమే లేదు . ధూప దీప నైవేద్యములను అర్పించు పూజ ఒకటైతే , ఊరికే నమస్కారము చేసేది కూడా ఇంకొక రకము పూజ. సరే , నీ వెనకా, పక్కనా వస్తున్న అగ్ని దేవుడిని చూచినావా ? "
" ’ నేనున్నానని తెలుసుకుంటే చాలు , చూడవద్దు , తర్వాత ఆవు చెప్పేది విను ’ అంటున్నాడు . అందుకే నమస్కారము చేసి పూజ చేసినాను "
" సరే , విను . ఈతడు భూలోకము నందున్నట్లే , ఆకాశము లోనూ , భూమ్యాకాశాల మధ్య అంతరిక్షములోనూ ఉన్నాడు . "
" అంటే ఈతడే పైనున్న ఆకాశములోనూ , మధ్యలోని అంతరిక్షము లోనూ ఉన్నాడా ? "
" ఔను . ఆకాశములో ఆదిత్యుడైయున్నాడు . అంతరిక్షములో వాయువై యున్నాడు "
" అట్లయితే కాల్చే సూర్యుడూ , వీచే వాయువూ ఈతడేనా ? "
" కాదేమో అతడినే అడుగు .నువ్వు దీనిని జ్ఞాపకము ఉంచుకో . అగ్ని , ఆదిత్యుడు , వాయువు ముగ్గురూ ఒకరే ! "
" ముగ్గురూ వేరే వేరే అనునదేమో తెలిసింది . కానీ ఒకటే అనేది ఎలాగ ? "
" పిచ్చీ , మొక్కలో వేరూ చిగురూ ఒకటే కాదా ? అయినా రెండూ ఒకటేనా ? అలాగే వీరు ముగ్గురూ ఒకటే అన్నదీ నిజము , వేరే వేరే అన్నదీ నిజము . ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది "
కుమారుడు ఆలోచించినాడు , " అమ్మ కూడా ఈ మాట ఎప్పుడో చెప్పింది . ఎప్పుడు ? ఆ ! తెలిసింది , భద్రం కర్ణేభిశ్శ్రుణుయామ దేవాః అన్నపుడు: దేవాః అన్నది , నేను అడిగినాను , అప్పుడు , ఔనయ్యా ! ప్రాణ మండలము నుండీ దేవతలు అందరూ వస్తారు . మంట మండునపుడు నిప్పు కణములు ఎగురుతాయి కదా అలాగే ! అన్నది . అట్లయితే ఈ ధేనువు చెప్పేది కూడా అదేనా ? అమ్మ ఇంకా చెప్పింది : పూర్ణమదః చెప్పునపుడు ఆ బ్రహ్మ పూర్ణుడు , ఎందుకంటే , ఈ దేవతలందరూ వారిలో ఉండేవారు . వీరు వేరే వేరే అయినపుడు జగత్తు వచ్చింది అని . అడిగితే మంచిది కదా , ’ ధేనువా , నువ్వు చెప్పేది ఇలా ఉండాలి , మొదట కలసి ఉన్నారు , తర్వాత వేరే వేరే అయినారు , అని ! "
" ఔను , దానితో పాటు ఇంకోమాట చెప్పాలంటే , మరలా ఒకటవుతారు అని "
" అట్లయితే ఎవరైనా కావాలీ అంటే మరలా ఒకటవుతారా ? "
" అవుతారు . ఎవరి కోసము వారు ఒకటవుతారో వారు , శ్రేయస్సు దారి యొక్క ఆ చివరను చూచువారు . అలా కాక , ఎవరి ఇఛ్చయూ లేక , వారే తాముగా ఒకటవుతే అది ప్రళయము . "
కుమారుడు మరలా ఆలోచించినాడు , ఇది కూడా అమ్మ చెప్పింది ,’ శ్రేయస్సు దారిలో వెళ్ళువారు మొదట దేవతలు వేరే వేరే అనుకొని చివరికి అందరినీ ఒకటిగా చూస్తారు . అప్పుడు పూర్ణ దర్శనము , అదే మహా దర్శనము .’ తల్లి పక్కనే నిలబడి చెప్పినట్లాయెను . ఆ గొంతు విని అతనికి ఏదో విచిత్రమైన సంతోషమై తిరిగి చూచినాడు , తల్లి : ఆమె ఎదలో తండ్రి : మాట తల్లిది: అర్థము తండ్రిది : ఏమో ఎందుకో ఇంకోవైపుకు తిరిగి చూచినాడు , అక్కడ మరలా తల్లిదండ్రులు. అయితే ఈ సారి వారిద్దరినీ ఆవరించిన అగ్ని . అగ్ని ప్రసన్నుడై ఉన్నాడు . వారిని ఆవరించిననూ వారిని కాల్చడు అని కొడుకుకు ఎటులో మనోగతమైనది .
ఉన్నట్టుండి ఏదో మరచినానే అనిపించెను , అమ్మ , ’ పశువు మాట్లాడింది అంటే ఏమిటీ ? ’ అన్నది గుర్తొచ్చింది . ధేనువును అడిగినాడు :
" సరే , నువ్వు చెవికి వినిపించునట్లు మాట్లాడలేదు , అయితే , నేను నీ మాటను విన్నాను . ఇది అమ్మకు ఎలా చెప్పేది ? "
ధేనువు నవ్వింది " నీకెందుకు అంత తొందర ! నువ్వు పుట్టినదే జగత్తుకు చెప్పడానికి . దీనిని తల్లికి చెప్పకనే ఉందువా ? సరే , ఇది విను . ప్రతి దేహములోనూ ప్రాణమున్నది . ఆ ప్రాణమే భూమినుండీ ఆకాశము వరకూ సర్వమునూ వ్యాపించియున్నది . ఆ ప్రాణము ప్రతి దేహములోనూ ప్రాణము , అపానము , వ్యానము , ఉదానము , సమానము అని ఐదు రూపములుగా ఉంది . వాటిలో మాట్లాడు పని అంతా ఉదానముది . నా దేహములో నున్న ఉదానము ఈ నా దేహయంత్రములో ప్రకటిత మైనపుడు మాత్రమే నీ చెవి దానిని వింటుంది . అటులకాక, అదే ఉదానము వాక్కుగా ప్రకటితము కాకుండా , వెనక్కు తిరిగి నా ప్రాణమునకు వచ్చినపుడు , మాటగా పలకవలసిన అర్థమంతా భావముగా మారి , నా ప్రాణము ఆ భావమును నీ ప్రాణమునకు ఇస్తుంది . అప్పుడు నువ్వు దానిని భావముగా మాత్రమే గ్రహిస్తావు . అయితే నీ ఉదానము దానిని పెంచినపుడు నీ మనసు దానినే మాటగా గ్రహిస్తుంది . ఇది దూర శ్రవణ విద్య . దీనిని ఎవరు కావాలన్నా చేయవచ్చు , చేయరంతే ! "
ధేనువును మరలా అడిగినాడు , " అయితే అమ్మ కూడా చేయవచ్చునా ? "
" చేయలేదేమో అడుగు ! ఎన్నో రోజులు పొయ్యి ముందర కూర్చున్నపుడు ఆమె నిన్ను చూడవలె ననుకొంటుంది . ఎక్కడో ఉన్న నీకు అది తెలిసి పిలవకున్ననూ నువ్వు మీ అమ్మ దగ్గరికి పరుగెత్తి వస్తావు ఔనా , కాదా ? అది దూర శ్రవణ విద్య కాదా ? "
" మరి , అందరూ దీనిని నమ్మరెందుకు ? "
కాల దేశముల వలన కలుగు పరిమితులను ఒప్పుకున్న మనసు దీన్నెలాగ నమ్ముతుంది ? వారిని అడుగు , ’ మీరు కలలు కనరా ? అప్పుడు మాట్లాడుతున్నారు కదా ? నాలుక ఆడలేదు , పెదవి కదపలేదు , చెవులు వినలేదు , అయినా మీరు మాట్లాడినారు , విన్నారు , అది ఎలాగ ? అని అడుగు "
ఆ వేళకు ఎండ పడమరకు దిగింది . ఇంటికి వెళ్ళు పొద్దయిందని కాపరులు మందలోని పశువులను హెచ్చరిస్తూ వచ్చినారు . కుమారుడు వారి అర్థములేని శబ్దములను విన్నాడు . పశువులు అది విని అర్థము చేసుకున్నట్లే లేచినాయి . " ఔను , ధేనువు చెప్పినది సరియే , ప్రాణ ప్రాణమూ జగత్ప్రాణుని పిల్లలు . అవి భావమును ప్రాణము నుండీ సంగ్రహించును . "
ఇంకొంచము సేపటిలోగా వచ్చినప్పటి లాగానే జాతర బయలుదేరింది . ముందర ఒకడు , వాని వెనుకే పశువులు , వాటివెనుక పిల్లలు , ఇతరులు .
వచ్చినపుడు తనను ఎత్తుకొని వచ్చినవాడు మరలా కుమారుని వద్దకు వచ్చి , " రావయ్యా , ఎత్తుకుంటాను " అన్నాడు . కుమారుని ఎత్తి భుజముపైన కూర్చోబెట్టుకున్నాడు . అతడికి పొద్దున కలిగిన అనుభవము అబద్ధము కాదు అని అర్థమైనది . అతడికి కుమారుని దేహము నుండీ ఏదో వాహిని వచ్చి తన దేహమునంతా వ్యాపించునది అనుభవమైనది . దాని వెనకే చిన్నగా సుఖ నిద్ర అల ఒకటి వచ్చింది . దానివలన మెలకువ అగు వేళకు పశువులన్నీ ఇంటి వాకిలి వద్దకు వచ్చియున్నాయి .
Janardhana Sharma
దాన విశిష్ఠత !
"నకర్మణా న ప్రజయా న ధనేన దానేనైకేనామృతత్వ మానసుః""-
దాన విశిష్ఠత !
ఉ: దాన కళా కలాప సముదంచిత సార వివేక సంపదన్
మానిత యాచమాన జనమానస వృత్సభిపూర్తి బుధ్ధి యె
వ్వానికి లేదొకింతయును వాడొకరుండు భరంబు ధాత్రికిన్,
కానలుగారు , వృక్షములుగారు నగంబులు గారు భారముల్;
శృంగార నైషథము--శ్రీనాథమహాకవి.
భావము: దానంచేయటం ఒక కళ. దాని విశిష్ఠతను తెలిసికొని ,మాన నీయులైన యాచకజన మనోరథములను తీర్చెడి
కుతూహలము యెవనికి లేదో ఈపుడమికి వాడొక్కడే భారము.
అడవులుగాని , వృక్షములుగానీ , పర్వతములు గానీ , భారములుగావు.
విశేషాంశములు: దానకళా విజ్ఙాన వంతుడే దానంచేయగలడు. దానం చేయటానికిముందు యాచకుని యోగ్యతనుగుర్తించి,తదుచితమైన దానంచేయాలి.అది కష్టసాధ్యమైనవిషయమే!. దాత ముందుగా ఆవివేకాన్ని సంపాదించాలట.
యాచకులను హీనులుగా చూడరాదు.వారుపుడమికిసందేశహారులట!ఏమిటాసందేశం?"ఎన్నడూ యెవరికీ యేమీ పెట్టనివానిబ్రతుకు మాబ్రతుకులాగేఉంటుంది.దానంచేనిన వారిజీవితం మీలాగేహాయిగాఉంటుంది"- అని; అందువలనవారిని గౌరవనీయులుగా భావించాలి. వారి మనసెరిగి దానంచేయాలి. అరకొర దానం చేయరాదు. అలాంటి ఉత్తముడే దాత అతడు పుడమికి అలంకారం. తక్కినవారు (లోభులు ) భూమికి బరువని కవియభిప్రాయం.
పర్వతాదులు గూడా భూమికి భారము కాదని భావము.🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👏🌷🌷👏🌷🌷